వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన పోరాటాల వల్లే ప్రత్యేక హోదా సజీవంగా ఉందని వైఎస్సార్‌సీపీ అగ్రనేత భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. తిరుపతిలో గురువారం భూమన విలేకరులతో మాట్లాడారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం ఊసరవెల్లిలా రోజుకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు తన సభలలో తాను ఏం చేశాడో చెప్పుకోలేక పోతున్నాడని ఎద్దేవా చేశారు. కేవలం వైఎస్ జగన్ మీద ఆరోపణలకే సమయం కేటాయిస్తున్నారని విమర్శించారు. అనంతపురం జిల్లా సభలో వైఎస్ జగన్ మీద దుర్మార్గంగా మాట్లాడుతూ.. వ్యక్తిగత ఆరోపణలు చేశారని మండిపడ్డారు