దేశంలో 10కి పైగా రాష్ట్రాల్లో ఉన్న ప్రత్యేక హోదాను ఏపీకి ఇవ్వకుండా టీడీపీ అడ్డుకుందని ఏపీ శాసనమండలి విపక్షనేత, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. హోదా కనుక ‘ఇస్తే కేవలం నిరుద్యోగులకే కాదు అన్ని వర్గాల వారికి ప్రయోజనం ఆనాడు కలుగుతుందని పార్లమెంట్‌లో చెప్పారు. వెంకయ్య నాయుడు సైతం 5 ఏళ్లు కాదు 15 ఏళ్లు హోదా కావాలని డిమాండ్ చేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ప్రధాని కావాలని భావించిన నరేంద్ర మోదీగానీ మేం అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదాను ఇస్తామని హామీ ఇచ్చారు. ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే.. కేంద్రం, రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ, చంద్రబాబులు హోదాపై మాట మార్చారని’ ఉమ్మారెడ్డి గుర్తుచేశారు.