ముందస్తు ఎన్నికలకు సీపీఎం సిద్ధంగా ఉందని, ఇప్పటికే 25 మంది అభ్యర్థుల పేర్లను పరిశీలించి అందులో 10 మంది పేర్లు ఖరారు చేశామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. కామారెడ్డిలో ఆదివారం ప్రారం భమైన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు సోమవారం ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, కేంద్ర కమిటీ ఆమోదం తరువాత అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. సీపీఎం ఆధ్వర్యంలో బీఎల్‌ఎఫ్ రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందన్నారు. సీపీఎం 20 నుంచి 25 స్థానాల్లో పోటీ చేస్తుందని, మిగతా స్థానాల్లో బీఎల్‌ఎఫ్ భాగస్వామ్య పక్షాల అభ్యర్థులు పోటీ చేస్తారన్నారు. 60 మంది బీసీలను బరిలో నిలుపుతామని తెలిపారు. రాష్ట్రంలో కలసి పనిచేయడానికి జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో చర్చించామన్నారు. బీసీల తరఫున పోరాడుతున్న ఆర్.కృష్ణయ్యతోనూ చర్చిస్తామన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీతోనూ చర్చలు జరుగుతున్నాయని చెప్పారు.
ఎర్రజెండాకు ఒక్క అవకాశం ఇవ్వండి
Published Tue, Sep 18 2018 7:05 AM | Last Updated on Fri, Mar 22 2024 11:28 AM
Advertisement