తెలుగుదేశం నేతలు చర్చకు బదులు రచ్చ చేశారని వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి మండిపడ్డారు. చర్చ జరగాలన్న ఉద్దేశం సతీష్ రెడ్డికి లేదని అందుకే చర్చ పేరుతో రచ్చ చేశారని అన్నారు. టీడీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పపడినా తాను, తమ పార్టీ కార్యకర్తలు చట్టాన్ని గౌరవించి సంయమనం పాటించామని తెలిపారు. అంతేకాకుండా పోలీసుల వైఖరిని అవినాష్ రెడ్డి తప్పుపట్టారు.