ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బిహార్ ఎన్నికల ప్రచారంలో చాలా దారుణంగా మాట్లాడారని.. ఇండియా-పాకిస్తాన్‌లా ఆంధ్రా, తెలంగాణ ప్రజలు ఒకరి మొఖం ఒకరు చూసుకోవడం లేదని మోదీ వ్యాఖ్యానించడం దారుణమని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ అన్నారు. ఒక దేశ ప్రధాని ఆ దేశంలో ఉన్న రాష్ట్రాలను అలా విమర్శించడం సరికాదన్నారు. ఏపీ, తెలంగాణ ప్రజల మధ్య ఎలాంటి విబేధాలు లేవని, ఐదేళ్ల తర్వాత రాజకీయ బెనిఫిట్స్ కోసమే మోదీ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని అభిప్రాయపడ్డారు.