భర్తను అరెస్ట్‌ చేశారని..ఆత్మహత్యాయత్నం | Woman Tried To Commit Suicide In Front Of Police Station | Sakshi
Sakshi News home page

భర్తను అరెస్ట్‌ చేశారని..ఆత్మహత్యాయత్నం

Published Sat, Oct 12 2019 11:08 AM | Last Updated on Thu, Mar 21 2024 11:35 AM

పట్టణ పోలీస్‌స్టేషన్‌ ఎదు ట శుక్రవారం సాయంత్రం ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. మేడపై నుంచి దూకుతానంటూ కాసేపు హల్‌చల్‌ చేసింది. ఎమ్మిగనూరుకు చెందిన మహబుబ్‌బాషాను 2011లో నమోదైన చోరీ కేసులో అదుపులోకి తీసుకున్న స్పెషల్‌ పార్టీ పోలీసులు శుక్రవారం పట్టణ పోలీసులకు అప్పగించారు. విషయం తెలుసుకున్న ఆయన భార్య లక్ష్మి తన భర్తను అన్యాయంగా అరెస్ట్‌ చేశారంటూ స్టేషన్‌ వద్దకు వచ్చి వాదనకు దిగింది. పోలీసులు సర్ధిచెబుతున్నా వినకుండా స్టేషన్‌ ఎదురుగా ఉండే మేడపైకి ఎక్కి కిందకు దూకుతానంటూ, ఒంటికి నిప్పంటించుకుంటానంటూ హెచ్చరించింది. పోలీసులు చాకచక్యంగా వెళ్లి ఆమెను కిందకు తీసుకొచ్చారు. అనంతరం స్టేషన్‌కు తీసుకెళ్లి కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement