ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదనే మనస్తాపంతో ఓ వ్యక్తి గుండెపోటుతో మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలివీ... గూడూరు మండల కేంద్రానికి చెందిన గనుమాని లోకేశ్వరరావు(32) ఎమ్మిగనూరులోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో కాంట్రాక్టు లెక్చరర్ గా పని చేస్తున్నాడు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలనే డిమాండ్‌తో గురువారం కర్నూలులో మాల మహానాడు ఆధ్వర్యంలో జరిగిన బీజేపీ కార్యాలయ ముట్టడిలో లోకేశ్వరరావు పాల్గొన్నాడు.