ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సాయంత్రం తిరుమలకు బయలుదేరి వెళ్లారు. గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఆయన.. సాయంత్రం 6.25 గంటల ప్రాంతంలో రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్న వైఎస్సార్‌సీపీ నాయకులు, శ్రేణులు, వైఎస్ జగన్ అభిమానులు.. జననేతకు ఘనస్వాగతం పలికారు. కాన్వాయ్‌లోని తన వాహనం నుంచి దిగి మరి.. వైఎస్ జగన్ తన అభిమానులకు అభివాదం చేశారు.