కాపు రిజర్వేషన్లపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి లేదని వైఎస్సార్ సీపీ సీనియర్ నేత బొత్సా సత్యనారాయణ అన్నారు. గురువారం విశాఖలో జరిగిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాపు రిజర్వేషన్లపై యూటర్న్ తీసుకున్నది, కాపు ఉద్యమకారులపై అక్రమ కేసులు పెట్టింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. మంజునాథ కమీషన్ రిపోర్ట్ లేకుండా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపేశారని అన్నారు. కాపు రిజర్వేషన్లపై జగన్‌మోహన్ రెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించారని పేర్కొన్నారు.