సీఎం చంద్రబాబు అవినీతిని బట్టబయలు చేసేందుకు, పోలవరం ప్రాజెక్టు వాస్తవ స్థితిని పరిశీలించేందుకు వైఎస్సార్ సీపీ బృందం పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనుంది. వైఎస్సార్ సీపీ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, సీనియర్ నేతల బృందం గురువారం ఉదయం బస్సు యాత్రకు బయలుదేరింది. విజయవాడలో బయలుదేరి నేరుగా పోలవరం ప్రాజెక్టుకు చేరుకుని, అనంతరం నేతలు ప్రాజెక్టును పరిశీలించనున్నారు.