స్టిండీస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఆరంభంలోనే వరుస విరామాల్లో రెండు వికెట్లు కోల్పోయింది. తొలి వికెట్‌గా కేఎల్ రాహుల్(6) ఔట్ కాగా, రెండో వికెట్‌గా విరాట్ కోహ్లి(4) పెవిలియన్ చేరాడు. ఈ రెండు వికెట్లను విండీస్ పేసర్ కాట్రెల్ సాధించి టీమిండియాకు షాకిచ్చాడు. ఇన్నింగ్స్ ఏడో ఓవర్ రెండో బంతికి రాహుల్‌ను ఔట్ చేసిన కాట్రెల్.. ఆ ఓవర్ చివరి బంతికి కోహ్లిని పెవిలియన్‌కు పంపాడు