వెస్టిండీస్‌కు 388 పరుగుల భారీ లక్ష్యం | Team India Set Target Of 388 Runs Against West Indies | Sakshi
Sakshi News home page

వెస్టిండీస్‌కు 388 పరుగుల భారీ లక్ష్యం

Published Wed, Dec 18 2019 7:07 PM | Last Updated on Wed, Mar 20 2024 5:40 PM

 వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా తన బ్యాటింగ్‌లో ఇరగదీసింది. ఆరంభం మొదలుకొని చివర వరకూ పవర్‌ హిట్టింగ్‌తో చెలరేగిపోయింది.ఫలితంగా వెస్టిండీస్‌కు 388 పరుగుల భారీ టార్గెట్‌ను నిర్దేశించింది. తొలి వన్డేలో 287 పరుగులు చేసిన టీమిండియా.. ఈ మ్యాచ్‌లో మరో వంద పరుగులు జోడించి 387 పరుగులు చేయడం విశేషం. రోహిత్‌ శర్మ(159; 138 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్సర్లు), కేఎల్‌ రాహుల్‌(102; 104 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు)ల సెంచరీలకు జతగా, శ్రేయస్‌ అయ‍్యర్‌(53;32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు), రిషభ్‌ పంత్‌(39; 16 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు)లు ధాటిగా బ్యాటింగ్‌ చేయడంతో  భారత్‌ భారీ స్కోరు చేసింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement