టీమిండియా పేస్ బౌలర్, డెత్ ఓవర్స్ స్పెషలిస్టు భువనేశ్వర్ కుమార్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో ఐదు వికెట్లతో ప్రొటీస్ పతనాన్ని శాసించిన విషయం తెలిసిందే. ఈ ప్రదర్శన(5/24)తో టీ20ల్లోఐదు వికెట్లు పడగొట్టిన తొలి భారత్ పేస్ బౌలర్‌గా రికార్డు నమోదు చేశాడు. అంతేకాకుండా అన్ని ఫార్మాట్లలో ఐదు వికెట్లు తీసిన తొలి భారత పేస్ బౌలర్‌గా నిలిచాడు. ఇక భారత బౌలర్లలో యుజువేంద్ర చహల్ ఒక్కడే ఐదు వికెట్లు సాధించగా భువీ రెండో బౌలర్‌గా రికార్డుకెక్కాడు.