Bhuwaneshwar Kumar
-
ఆసియాకప్ : 162కే పాక్ ప్యాకప్
దుబాయ్ : ఆసియాకప్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు చెలరేగారు. బౌలింగ్, ఫీల్డింగ్‌తో పాక్ బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టారు. పార్ట్‌టైం బౌలర్ కేదార్ జాదవ్ (3/23), పేసర్లు భువనేశ్వర్(3/15), బుమ్రా(2/23)ల దెబ్బకు దాయాదీ బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో పాక్ 43.1 ఓవర్లలో 162 పరుగులకు కుప్పకూలింది. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్.. భువనేశ్వర్ దెబ్బకు ఆదిలోనే ఓపెనర్లు ఇమామ్ ఉల్ హక్(2), ఫఖర్ జమాన్(0)ల వికెట్లను కోల్పోయింది. ఈ తరుణంలో క్రీజులోకి వచ్చిన షోయబ్ మాలిక్, బాబర్ ఆజమ్‌లు ఆచితూచి ఆడుతూ పాక్ ఇన్నింగ్స్‌ను గట్టెక్కించారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 82 పరుగులు జోడించిన అనంతరం బాబర్ (47)ను కుల్దీప్ ఔట్ చేసి విడదీశాడు. భారత అద్భుత ఫీల్డింగ్.. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్(6)ను మనీష్ పాండే అద్భుత క్యాచ్‌తో పెవిలియన్ పంపించగా.. అంబటి రాయుడు సూపర్ త్రో తో షోయబ్ మాలిక్(43)ను రనౌట్ చేశాడు. దీంతో పాక్ 100 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ వెంటనే జాదవ్ అసిఫ్ అలీ(9), షాదాబ్‌ఖాన్ (8)లను ధోని అద్భుత కీపింగ్ సాయంతో పెవిలియన్‌కు చేర్చాడు. 121 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన పాక్‌కు అష్రఫ్, మహ్మద్ అమిర్ సాయంతో వికెట్లు పోకుండా జాగ్రత్తగా ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బుమ్రా అష్రఫ్(21)ను ఔట్ చేసి దెబ్బకొట్టాడు. చివర్లో భువనేశ్వర్ హసన్ అలీ(1), బుమ్రా ఉస్మాన్‌ఖాన్‌ను గోల్డెన్ డక్ చేయడంతో పాకిస్తాన్ ఇన్నింగ్స్ ముగిసింది. భారత బౌలర్లలో కేదార్ జాదవ్ 3, భువనేశ్వర్ 3, కుల్దీప్ 1, బుమ్రా 2 వికెట్లు పడగొట్టారు. -
దాగుడుమూతలు
టీమిండియా టెస్టు వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా గాయాలాపన వేలి నుంచి భుజానికి చేరింది. బొటన వేలికి దెబ్బ తగిలిందని ఐపీఎల్ నుంచి తప్పుకొన్న అతడు... ఎన్సీఏ పునరావాస శిబిరానికి వెళ్లాక భుజానికి శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వస్తోండటం ఆశ్చర్యపరుస్తోంది. అసలు అతడి గాయం తీవ్రత ఏమిటి? కోలుకోవడానికి ఎంత కాలం పడుతుంది? అనే విషయాలపై బీసీసీఐకి స్పష్టత ఇవ్వలేకపోయిన ఎన్సీఏ వద్దకే... ఇప్పుడు పేసర్ భువనేశ్వర్‌ను పునరావాసానికి పంపుతుండటం విస్తుగొలుపుతోంది. సాక్షి క్రీడా విభాగం: అన్నీ సరిగా ఉంటే ఈపాటికి ఇంగ్లండ్‌తో సుదీర్ఘ టెస్టు సిరీస్‌కు బయల్దేరాల్సిన వృద్ధిమాన్ సాహా... ఇప్పుడు అదే దేశానికి శస్త్ర చికిత్సకు వెళ్లనున్నాడు. రెండు నెలలుగా వేలి గాయం అని చెబుతున్నా, అది భుజం గాయంగా తేలింది. దీంతో రానున్న ఐదు టెస్టుల సిరీస్ మొత్తానికి, ఆస్ట్రేలియా పర్యటనకూ అతను దూరమయ్యాడు. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) పునరావాస శిబిరంలో ఉండగానే సాహాకు ఈ పరిస్థితి ఎదురవడం గమనార్హం. ‘అతడి గాయం తీవ్రమైనదని ఎన్సీఏ ఫిజియో ప్రకటించారు. వచ్చే నెలలో బ్రిటన్‌లో శస్త్ర చికిత్స జరుగనుంది. అది మాత్రమే తనను మళ్లీ ఆటలోకి తీసుకురాగలదు. అనంతరం కనీసం రెండు నెలలైనా బ్యాట్ పట్టుకోలేడు. తర్వాతే పునరావాస సన్నాహం మొదలవుతుంది’ అని బీసీసీఐ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. అయితే, సాహా ఫిట్నెస్ సమస్యలపై ఇప్ప టివరకు బోర్డు నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడం ఓ సంగతైతే, వేలి గాయం నుంచి కోలుకోనందున అతడిని ఇంగ్లండ్ పర్యటనలోని మొత్తం ఐదు టెస్టులకు ఎంపిక చేయలేదని చీఫ్ సెలక్టర్ ఎమ్మేస్కే ప్రసాద్ చెప్పడం మరింత ఆశ్చర్యపరుస్తోంది. అంతా అస్పష్టతే! సాహాకు భుజం సమస్య ఎన్సీఏలోనే తలెత్తినట్లు తెలుస్తోంది. దక్షిణాఫ్రికా పర్యటనలో క్యాచ్ పడుతూ భుజం నొప్పికి గురైనా చిన్నదేనని సరిపెట్టుకున్నాడు. తొడ కండరాల కారణం చూపుతూ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. ఐపీఎల్లో ఆడుతూ వేలి గాయానికి గురయ్యాడు. ఎన్సీఏలో ఉపశమనం పొంది ఇంగ్లండ్ వెళ్లొచ్చని భావిస్తే అది ఇంతవరకు తెచ్చింది. ఈ మొత్తం వ్యవహారంలో అక్కడి ఫిజియో పనితీరు ప్రశ్నార్థకం అవుతోంది. గతంలో భారత జట్టుతోనూ పని చేసిన ఎన్సీఏ ఫిజియో తాజా పరిస్థితిపై బోర్డుకు నివేదిక ఇవ్వడం కాని, కనీసం సెలక్షన్ కమిటీ కన్వీనర్, బోర్డు కార్యదర్శి అయిన అమితాబ్ చౌదరికి సమాచారం చేరవేయడం కానీ చేసినట్లు లేడు. ఒకవేళ చెప్పి ఉంటే, బుధవారం ఇంగ్లండ్‌తో సిరీస్‌కు జట్టును ప్రకటించినప్పుడు సాహా రెండు నెలలు అందుబాటులో ఉండడని ప్రకటన చేసేవారు కాదు. ఇది జట్టు ఎంపికకు ముందు కన్వీనర్‌కు పూర్తి సమాచారం అందలేదనే సంగతిని చాటుతోంది. వేలి గాయం నుంచి సాహా కోలుకున్నట్లు తొలుత ప్రకటించిన బీసీసీఐ వర్గాలే... ఇప్పుడు అదేమీ చిన్న గాయం కాదని, మేజర్ శస్త్రచికిత్స అవసరమని, అతడి పునరాగమనంపై కచ్చితమైన తేదీ చెప్పలేమని అంటున్నా యి. సాహా సంగతి అటుంచితే, ఇంగ్లండ్‌తో మూడు టెస్టులకు కీలకమైన పేసర్ భువనేశ్వర్ సేవలు కూడా అందుబాటులో లేకుండా పోయాయి. దీంతో ఎన్సీ ఏలో ఏం జరుగుతోందనే ప్రశ్న తలెత్తుతోంది. అక్కడి పునరావాసం తీరుపై ఆటగాళ్లు కూడా చాన్నాళ్లుగా అసంతృప్తితో ఉన్నారు. దాదాపు నెల నుంచి సాహా అక్కడే ఉన్నా... పరిస్థితిని అంచనా వేసి శస్త్రచికిత్సకు సూచించకపోవడం, పూర్తిస్థాయి మీడియా విభాగం ఉన్న బీసీసీఐకి కాంట్రాక్టు ఆటగాళ్ల ఫిట్నెస్ గురించి నివేదిక ఇవ్వకపోవడం ఎన్సీఏ లోపంగానే తేలుతోంది. వారి నిర్వాకం కారణంగా దేశంలోనే నంబర్‌వన్ టెస్టు కీపర్ అయిన సాహా ఎంతో కీలకమైన రెండు సిరీస్‌లకూ దూరమయ్యాడు. సుదీర్ఘ కాలం విరామంతో ఓ విధంగా తన కెరీర్ కూడా ప్రశ్నార్థకంగా మారింది. భువనేశ్వర్‌ను ఏం చేస్తారో! ఇంగ్లండ్‌తో మూడో వన్డేలో భువనేశ్వర్‌ను చూస్తే అతడు పూర్తి ఫిట్నెస్తో లేడని అర్ధమవుతోంది. బ్యాటింగ్‌లో గంట పాటు క్రీజ్‌లో ఉండటంతో తన బౌలింగ్ పస లేకుండా సాగింది. ఒక సునాయాస క్యాచ్ కూడా వదిలేశాడు. దీనికి ఫిట్నెస్ లోపమే కారణం. తనను బరిలో దింపడాన్ని కెప్టెన్ కోహ్లి సమర్థించుకున్నా అది అనవసర కూర్పే. అయితే, సాహా–భువీ విషయంలో ఓ సామీప్యత కనిపిస్తోంది. ఇద్దరూ ఐపీఎల్లో ఇబ్బంది పడి విరామం తీసుకున్నారు. భువనేశ్వర్ మాత్రం చాలా అవసరమైన సమయంలో జట్టుకు దూరమయ్యాడు. ఇంగ్లండ్ నుంచి తిరిగొస్తున్న అతడిని కూడా నాలుగు వారాల పాటు పునరావాసం కోసం ఎన్సీఏకే పంపుతున్నారు. నాణ్యమైన పేసర్ అయిన తన విషయంలోనైనా ఎన్సీఏ కచ్చితమైన ప్రమాణాలతో గాయాన్ని విశ్లేషించి, వంద శాతం ఫిట్నెస్తో మైదానంలో దిగేలా చేస్తుందో లేదో చూడాలి. లేదంటే చివరి రెండు టెస్టులకు కూడా భువీ అందుబాటులో ఉండటం దాదాపు అసాధ్యమే. -
భువనేశ్వర్ కుమార్ అరుదైన ఘనత
-
మున్రో డేంజరెస్ బ్యాట్స్‌మన్ కానీ..
సాక్షి, తిరువనంతపురం: రెండో టీ20లో సెంచరీతో కదం తొక్కిన న్యూజిలాండ్ ఓపెనర్ కొలిన్ మున్రో డేంజరెస్ బ్యాట్స్‌మనే కానీ మిగతా కివీస్ బ్యాట్స్‌మెన్ కూడా అద్భుతంగా రాణిస్తున్నారని టీమిండియా పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ అభిప్రాయపడ్డాడు. కివీస్ ప్లేయర్లంతా రాణించడంతోనే నిర్ణయాత్మక మ్యాచ్‌లు ఆడే పరిస్థితి ఏర్పడిందన్నాడు. టీ20 ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు తిరవనంతపురం వచ్చిన భువీ మీడియాతో మాట్లాడాడు. టీ20ల్లో నలుగురు ప్రధాన బౌలర్లతోనే కోహ్లి సేన బరిలోకి దిగుతుందన్న వాదనను భువనేశ్వర్ కొట్టిపారేశారు. ఐదో బౌలర్‌ను టీమిండియా ఉపయోగిస్తుందని, ఆ స్థానాన్ని పాండ్యా భర్తీ చేస్తున్నాడని, కొన్ని సార్లు పార్ట్ టైమ్ బౌలర్లు ఆ బాధ్యతను తీసుకుంటున్నారని చెప్పుకొచ్చాడు. ఇక బుమ్రా బౌలింగ్ శైలిపై స్పందిస్తూ తన బౌలింగ్ యాక్షనే బలంగా మారిందన్నాడు. అతని యాక్షన్ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెడతదని తెలిపాడు. బుమ్రా రోజు రోజుకు మెరుగవుతున్నాడని, ముఖ్యంగా యార్కర్లతో డెత్ ఓవర్లలో రాణిస్తున్నాడని కితాబిచ్చాడు. మ్యాచ్‌కు ముందు ఇద్దరం ప్రణాళికలపై చర్చించుకుంటామని భువీ తెలిపాడు. మ్యాచ్ ఓడితే బౌలర్లు నిందించడం సరికాదని, పర్యాటక జట్టు బాగా ఆడిందనే విషయాన్ని గుర్తించాలని సూచించాడు. గత కొద్ది రోజులుగా మంచి క్రికెట్ ఆడుతున్నామని, ఆసీస్, విండీస్ పర్యటనల నుంచి వరుస విజయాలు నమోదు చేశామనే విషయాన్ని గుర్తుంచుకోవాలని పేర్కొన్నాడు. మూడు మ్యాచ్‌లతో చాల చిన్న సిరీస్ అని ఒకటి ఓడితే మరోటి గెలిచి సిరీస్ సమం చేసి నిర్ణయాత్మక మ్యాచ్ ఆడవచ్చన్నాడు. ఇప్పటికే కివీస్‌పై భారత్ వన్డే సిరీస్(2-1)తో గెలుచుకోగా.. టీ20 సిరీస్ 1-1తో సమమైంది. నిర్ణయాత్మక మ్యాచ్ మంగళవారం జరగనుంది. -
శ్రీలంకపై భారత్ గెలుపు
♦ అర్ధ సెంచరీతో కదం తొక్కిన భువనేశ్వర్ కుమార్ పల్లెకెలె: భారత్-శ్రీలంక మధ్య ఉత్కంఠభరితంగా సాగిన రెండో వన్డేలో ధోని-భువనేశ్వర్‌ల క్లాసిక్ ఇన్నింగ్స్‌తో భారత్ గట్టెక్కింది. ఒకానొక దశలో ఓటమి అంచుకు చేరిన భారత్ చివరికి 3 వికెట్ల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. అంతకు ముందు 236 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ(54), శిఖర్‌ధావన్(49)లు మంచి శుభారంబాన్ని అందించారు. లంక స్పిన్నర్ అఖిల ధనంజయ ఓపెనర్ రోహిత్‌ను అవుట్ చేయడంతో తొలి వికెట్‌కు 109 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అప్పటి వరకు పటిష్టంగా కనిపించిన భారత్ ధనంజయ స్పిన్ మాయాజాలానికి ఒక్కసారిగా కుప్పకూలింది.ఆ వెంటనే శిఖర్ ధావన్ సిరివర్ధన బౌలింగ్‌లో క్యాచ్ అవుటై అర్ధ సెంచరీ చేజార్చుకున్నాడు. ధనుంజయ వరుస ఓవర్లో జాదవ్(1), కెప్టెన్ విరాట్ కోహ్లి(4), కేఎల్ రాహుల్(4), హార్ధిక్ పాండ్యా(0), అక్షర్ పటేల్(6) లను అవుట్ చేసి మొత్తం 6 వికెట్లతో భారత బ్యాటింగ్ ఆర్డర్ ను దెబ్బతీశాడు. భారత్ కేవలం 22 పరుగుల వ్యవధిలోనే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ తరుణంలో క్రీజులో ఉన్న మహేంద్రసింగ్ ధోని, భువనేశ్వర్‌తో కలిసి ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ సింగిల్స్ తీస్తూ వీలు చిక్కినప్పుడుల్లా బంతిని బౌండరీకి తరలించారు. ధోని(45) క్లాస్‌గా ఆడినా భువీ వేగంగా ఆడుతూ (51; 4 ఫోర్లు, ఒక సిక్స్) కెరీర్లో తొలి అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు. దీంతో భారత్ విజయం సునాయసమైంది. 6 వికెట్లతో భారత్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చిన శ్రీలంక యువ స్పిన్నర్ ధనంజయకు మ్యాన్ ఆఫ్ దిమ్యాచ్ వరించింది. ధోని అవుట్.. జస్ట్‌మిస్.. ఈ మ్యాచ్‌లో శ్రీలంకకు ‘అదృష్టం తలుపు తడితే దురదృష్టం వెనుక తలుపు తట్టినట్లు’ అయింది. దాదాపు విజయం కాయం అనుకున్న సందర్భంలో ధోని-భువీ 8వ వికెట్ అత్యుత్తమ భాగస్వామ్యంతో శ్రీలంక నుంచి విజయాన్ని లాగేసుకున్నారు. లంక బౌలర్ ఫెర్నాండో వేసిన 34 ఓవర్ మూడో బంతి నేరుగా వికెట్లకు తగిలింది. అయితే స్టంప్స్ కింద పడకపోవడంతో ధోనిని అదృష్టం వరించింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న ధోని భువీతో కలిసి మ్యాచ్‌ను భారత్‌వైపు తిప్పాడు. -
టీమిండియాకు సరికొత్త తేజం.. భువీ