ఛాలెంజర్స్‌పై రాయల్ విక్టరీ | Rajasthan Royals Won By 19 Runs Against RCB | Sakshi
Sakshi News home page

ఛాలెంజర్స్‌పై రాయల్ విక్టరీ

Published Sun, Apr 15 2018 10:16 PM | Last Updated on Thu, Mar 21 2024 6:42 PM

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ)ను సొంతగడ్డపై చిత్తుచేసి ఈ సీజన్‌ ఐపీఎల్‌లో రెండో విజయం నమోదు చేసింది రాజస్థాన్‌ రాయల్స్‌. ఆదివారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సంజూ శాంసన్‌ 92(45 బంతులు, 2 ఫోర్లు, 10 సిక్సులు) దూకుడుకు తోడు బౌలర్లు సమిష్టిగా రాణించడంతో రాజస్తాన్‌ 19 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌ అజింక్యా రహానే 36(20 బంతుల్లో 6 ఫోర్లు,1 సిక్సు),  బెన్‌స్టోక్స్‌ 27(21 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సు), జోస్‌ బట్లర్‌ 23( 14 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సు) త్రిపాఠి 14(5 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్సు)లు సైతం వేగంగా ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లకు 5 వికెట్లు నష్టపోయి 217 పరుగులు చేసింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement