అఫ్గానిస్తాన్ యువ సంచలన రషీద్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల కాలంలో తనదైన శైలిలో చెలరేగిపోతూ ‘టాప్’ బ్యాట్స్‌మెన్‌కి కొరకరాని కొయ్యగా మారిన రషీద్ ఖాన్.. దిగ్గజాల ప్రశంసలు అందుకుంటున్నాడు. మరొకవైపు టీ 20 ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ ర్యాంకులో కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంచితే, తన పెద్ద అన్నయ్య అమీర్ ఖాన్ కూడా స్పిన్నరనే విషయాన్ని రషీద్ ఖాన్ అభిమానులకు తెలియజేశాడు.