క్రికెట్ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 11 సీజన్ మరో మూడో రోజుల్లో మొదలవనుంది. అందుకోసం అన్ని జట్లు ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టేశాయి. కేవలం ఆటతోనే సరిపెట్టకుండా స్టెప్పులేసి అభిమానులను ఆకట్టుకోవడానికి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు సిద్ధమయ్యారు. ఆర్సీబీ జట్టు కెప్టెన్ విరాట్ కొహ్లీతో పాటు ఆటగాళ్లు యజువేంద్ర చాహల్ , బ్రెండన్ మెకల్లమ్ చిందులేశారు. అభిమానుల కోసం చాహల్.. ‘ఐపీఎల్ కోసం లెజెండ్స్‌తో వార్మప్ మొదలెట్టేశా’ అంటూ కొహ్లీ, మెకల్లమ్‌ను ట్యాగ్ చేస్తూ.. 12 సెకన్ల నిడివి ఉన్న డాన్స్ వీడియో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో కొహ్లీ తనదైన శైలిలో రెచ్చిపోగా మెకల్లమ్, చాహల్‌లు అతన్ని అనుకరించే ప్రయత్నం చేశారు.