ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-11లో ఫైనల్‌కు చేరిన తొలి జట్టు చెన్నై సూపర్ కింగ్స్. ఇటీవల సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో చెన్నై 2 వికెట్ల తేడాతో విజయం సాధించి తుది పోరుకు అర్హత సాధించినా విన్నింగ్ టీమ్ కెప్టెన్ ఎంఎస్ ధోనిపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై ధోని చాలా తెలివిగానే కాదు చాకచక్యంగా వివరణ ఇచ్చి విమర్శల నోళ్లు మూయించాడనంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌కు ధోని బంతినివ్వలేదు. సీనియర్ బౌలర్‌కు బంతినివ్వకపోవడం సరైన నిర్ణయం కాదని, ఎందుకు భజ్జీకి బంతిని ఇవ్వలేదని ధోనిపై విమర్శలు వచ్చాయి.