ఆస్ట్రేలియా ఆటగాళ్ల బాల్ ట్యాంపరింగ్‌పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ప్రతి సారీ తమ ఆటగాళ్ల తప్పును కప్పిపుస్తూ వెనకెసుకొచ్చె ఆసీస్ మీడియా ఈసారి మాత్రం అందుకు విరుద్దంగానే ప్రవర్తించింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్‌పై విమర్శల బాణాలను ఎక్కిపెడుతూ ప్రత్యేక కథనాలు ప్రచురించింది. దేశ జాతీయ క్రీడకు తీరని ద్రోహం, కుళ్లిన సంస్కృతి, ‘స్మిత్స్ షేమ్’ అని స్థానిక మీడియా చానెళ్లు సైతం ఆగ్రహం వెల్గగక్కాయి