Awards
-
ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ మరో ఘనత.. ప్రతిష్టాత్మక అవార్డ్‌కు ఎంపిక
పాయల్ కపాడియా తెరకెక్కించిన చిత్రం ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్. గతంలో ఈ మూవీ పలు ప్రతిష్టాత్మక ఫిల్మ్‌ఫేర్ అవార్డ్లు గెలుచుకుంది. అంతర్జాతీయ వేదికలపై సైతం సత్తా చాటింది. తాజాగా ఈ సినిమా మరో ఘనతను సాధించింది. ప్రముఖ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్‌ను సొంతం చేసుకుంది. ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఉత్తమ చిత్రంగా నిలవగా.. ఉత్తమ డైరెక్టర్‌గా పాయల్ కపాడియా నిలిచింది. మరోవైపు బాలీవుడ్ నటుడు దిల్జిత్ దోసాంజ్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. అమర్ సింగ్ చమ్కిలా చిత్రంలో తన నటనకు గానూ అవార్డ్ గెలుచుకున్నారు.ఫిల్మ్ క్రిటిక్స్ గిల్డ్, గ్రూప్ఎమ్ మోషన్ ఎంటర్టైన్మెంట్ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ 2025 విజేతలను తాజాగా ప్రకటించారు. ఈ వేడుకలో ఇండియాకు చెందిన పలు ఫీచర్ ఫిల్మ్‌లు, షార్ట్ ఫిల్మ్‌లు, డాక్యుమెంటరీ, వెబ్ సిరీస్‌లలో అత్యుత్తమ అవార్డులు సాధించాయి. ఈప్రతిష్టాత్మకమైన అవార్డుల్లో దిల్జిత్ దోసాంజ్ అమర్ సింగ్ చమ్కిలా సైతం పెద్ద విజయాన్ని అందుకుంది.దిల్జిత్ దోసాంజ్ ఉత్తమ నటుడిగా ఎంపికవ్వగా.. ఉత్తమ నటిగా ప్యారడైజ్ మూవీ హీరోయిన్ దర్శనా రాజేంద్రన్ అవార్డును గెలుచుకుంది. అలాగే లపాతా లేడీస్‌లో రవి కిషన్ పాత్రకు గాను ఉత్తమ సహాయ నటుడి అవార్డు దక్కించుకున్నారు. అలాగే గర్ల్స్ విల్ బి గర్ల్స్‌లో తన అద్భుతమైన నటనకు కని కస్రుతి ఉత్తమ సహాయ నటిగా ఎంపికైంది. వెబ్ సిరీస్ కేటగిరీలో పోచర్ ఆధిపత్యం కనబరిచింది. ఉత్తమ వెబ్ సిరీస్ అవార్డ్‌ను సొంతం చేసుకుంది.షార్ట్ ఫిల్మ్ కేటగిరీ విజేతలుఉత్తమ షార్ట్ ఫిల్మ్: ఓబుర్ఉత్తమ దర్శకుడు: ఫరాజ్ అలీ (ఓబుర్).ఉత్తమ నటుడు: జల్ తు జలాల్ తూ చిత్రానికి హరీష్ ఖన్నాఉత్తమ నటి: తాక్ (ట్రాకర్) కోసం జ్యోతి డోగ్రాఉత్తమ రచన: ఓబుర్కి ఫరాజ్ అలీఉత్తమ సినిమాటోగ్రఫీ: ఆనంద్ బన్సాల్ (ఓబుర్)డాక్యుమెంటరీ విభాగంఉత్తమ డాక్యుమెంటరీ: నాక్టర్న్స్వెబ్ సిరీస్ విభాగం..ఉత్తమ వెబ్ సిరీస్: పోచర్ఉత్తమ దర్శకుడు: రిచీ మెహతా(పోచర్)ఉత్తమ నటుడు: బరున్ సోబ్తి (రాత్ జవాన్ హై)ఉత్తమ నటి: నిమిషా సజయన్(పోచర్)ఉత్తమ సహాయ నటుడు: దిబ్యేందు భట్టాచార్య(పోచర్)ఉత్తమ సహాయ నటి: కని కస్రుతి(పోచర్)ఉత్తమ రచన: రిచీ మెహతా, గోపన్ చిదంబరన్, సుప్రోతిం సేన్‌గుప్తా, అమృత బాగ్చి (పోచర్)ఫీచర్ ఫిల్మ్ విభాగం..ఉత్తమ చిత్రం: ఆల్ వు ఇమేజిన్ యాజ్ లైట్ఉత్తమ దర్శకురాలు: పాయల్ కపాడియా (ఆల్ వు ఇమేజిన్ అజ్ లైట్).ఉత్తమ నటుడు: దిల్జిత్ దోసాంజ్ (అమర్ సింగ్ చమ్కిలా)ఉత్తమ నటి: దర్శనా రాజేంద్రన్(ప్యారడైజ్)ఉత్తమ సహాయ నటుడు: రవి కిషన్ (లపాతా లేడీస్ )ఉత్తమ సహాయ నటి: కనీ కస్రుతి (ఫర్ గర్ల్స్ విల్ బి గర్ల్స్)ఉత్తమ రచన: ఆనంద్ ఎకర్షి (ఆట్టం)ఉత్తమ సినిమాటోగ్రఫీ: రణబీర్ దాస్ (ఆల్ వి ఇమేజిన్ అస్ లైట్)ఉత్తమ ఎడిటింగ్: శివకుమార్ వి. పనికర్ (కిల్)జెండర్ సెన్సిటివిటీ అవార్డు: గర్ల్స్ విల్ బి గర్ల్స్ -
ఎదురు లేని వెదురు
వెదురు.. గ్రీన్ గోల్డ్.. అవును! ఈ విషయంలో మీకేమైనా సందేహం ఉందా? అయితే.. శివాజీ రాజ్పుట్ అనే అద్భుత ఆదర్శ వెదురు రైతు విశేష కృషి గురించి తెలుసుకోవాల్సిందే. మహారాష్ట్రలోని ధూలే జిల్లాకు చెందిన శివాజీ 25 ఎకరాల్లో వెదురును చాలా ఏళ్ల నుంచి సాగు చేస్తూ ప్రతి ఏటా రూ. 25 లక్షలను సునాయాసంగా ఆర్జిస్తున్నారు. తనకున్న 50 ఎకరాల పొలంలో పాతిక ఎకరాల్లో 16 రకాల వెదురు తోటను పెంచుతున్నారు. మిగతా 25 ఎకరాలను ఇతర రైతులకు కౌలుకు ఇచ్చారు.వెదురు సాగులో కొద్దిపాటి యాజమాన్య చర్యలు తప్ప చీకూ చింతల్లేవు, పెద్దగా కష్టపడాల్సిందేమీ ఉండదు. ఏటేటా నిక్కచ్చిగా ఆదాయం తీసుకోవటమే అంటున్నారు శివాజీ. వెదరు సాగు ద్వారా పర్యావరణానికి బోలెడంత మేలు చేస్తున్న ఈ ఆదర్శ రైతు ఉద్యమ స్ఫూర్తితో బంజరు, ప్రభుత్వ భూముల్లో విరివిగా మొక్కలు నాటటం ద్వారా పర్యావరణానికి మరెంతో మేలు చేస్తున్నారు. ఆయన నాటిన 7 లక్షల చెట్లు ఆయన హరిత స్ఫూర్తికి నిదర్శనంగా నిలుస్తూ ఆయనకు 30కి పైగా పర్యావరణ పరిరక్షణ పురస్కారాల పంట పండించాయి! ఇందిరా ప్రియదర్శిని వృక్షమిత్ర, యుఎస్ఎ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వంటి పురస్కారాలు ఆయనకు లభించాయి. పెద్ద కమతాల్లో వెదురు సేద్యానికి సంబంధించి శివాజీ రాజ్పుట్ అనుభవాలు రైతులకు మార్గదర్శకంగా నిలుస్తాయి.శివాజీ రాజ్పుట్ వయసు 60 ఏళ్లు. వినూత్న రీతిలో వెదరును సాగు చేయటం ద్వారా, పర్యావరణ పరిరక్షణకు కృషి చేయటం ద్వారా ఆయన తన జీవితాన్ని ఆకుపచ్చగా మార్చుకోవటమే కాదు ఇతరుల జీవితాలను కూడా ఆకుపచ్చగా మార్చుతున్నారు. పర్యావరణ పరిరక్షణకు పాతికేళ్లుగా విశేష కృషి చేస్తున్న శివాజీ గత ఆరేళ్లుగా వెదురు తోటను సాగు చేస్తున్నారు. వాతావరణ ప్రతికూలతలను తట్టుకొనేలా వ్యవసాయాన్ని కొనసాగించటంలో, పర్యావరణ పరిరక్షణ కృషిలో, గ్రామీణాభివృద్ధి రంగంలో మహారాష్ట్రలో ఇప్పుడాయన ఒక మేరు పర్వతం అంటే అతిశయోక్తి కాదు. ఆయన చేస్తున్న కృషి భూతాపోన్నతిని తగ్గించడానికి ఎంతగానో దోహదపడుతోంది.వెదురు సాగుకు శ్రీకారం..రాజ్పుట్ గతంలో అందరు రైతుల మాదిరిగానే ఒకటో రెండో సీజనల్ పంటలను రసాయనిక వ్యవసాయ పద్ధతిలో పండించే వారు. అయితే, భారీ వర్షాలు, పెను గాలులు, కరువు వంటి విపరీత ప్రతికూల వాతావరణ పరిస్థితుల మూలంగా అనిశ్చితిలో కొట్టుమిట్టాడేవారు. ‘భారీ వర్షాలు, పెను గాలులు, కరువు వంటి విపత్తులు వచ్చిపడినప్పుడు సాధారణ పంటలు సాగు చేస్తున్నప్పుడు ఒక్కోసారి పంట పూర్తిగా చేజారిపోయేది. కానీ, వెదురు తోట అలాకాదు. నాటిన ఒక సంవత్సరం తర్వాత నుంచి ఆదాయం వస్తూనే ఉంటుంది. ఏటేటా నిరంతరం పెట్టుబడుల అవసరమే ఉండదు..’అంటారు శివాజీ. సాధారణ పంటల సాగును చుట్టుముట్టిన అనిశ్చితే తనను నిశ్చింతనిచ్చే వెదరు సాగువైపు ఆకర్షించిందంటారాయన. ఆయనకు 50 ఎకరాల భూమి ఉంది. 25 ఎకరాలను కౌలుకు ఇచ్చి, 25 ఎకరాల్లో వెదురు నాటారు. ఈ నిర్ణయమే తన వ్యవసాయాన్ని మేలి మలుపు తిప్పింది. ‘వెదురు సాగులో విపరీత వాతావరణ పరిస్థితుల్లోనూ ఆందోళన చెందాల్సిందేమీ ఉండదు.వెదురు మొక్కలు వేరూనుకొనే వరకు మొదటి ఏడాది కొంచె జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ తర్వాత పెద్ద పని గానీ, పెట్టుబడి గానీ అవసరం ఉండదు. మొదటి ఏడాది తర్వాత నేను పెద్దగా పెట్టిన ఖర్చేమీ లుదు. కానీ, ఏటా ఎకరానికి రూ. లక్ష ఆదాయం వస్తోంది. వెదురు తోట ద్వారా నాకు ఏటేటా రూ. 25 లక్షల ఆదాయం వస్తోంది..’ అంటారు శివాజీ గర్వంగా!వెదురు: ఆకుపచ్చని బంగారంవెదరుకు ఆకుపచ్చని బంగారం అని పేరు. ఈ తోట సాగులో అంత ఆదాయం ఉంది కాబట్టే ఆ పేరొచ్చింది. ‘ఈ భూగోళం మీద అతి త్వరగా పెరిగే చెట్టు వెదురు! పర్యావరణానికి ఇది చేసే మేలు మరేఇతర చెట్టూ చెయ్యలేదు. ఇది 24 గంటల్లో 47.6 అంగుళాల ఎత్తు పెరుగుతుంది. ఇతర చెట్ల కన్నా 35% ఎక్కువ కార్బన్ డయాక్సయిడ్ను పీల్చుకొని 30% అదనంగా ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. భూతాపోన్నతిని ఎదుర్కొనే కృషిలో ఇందుకే వెదురు అతికీలకంగా మారింది’ అని వివరించారు శివాజీ. బహుళ ప్రయోజనకారి కావటం అనే మరో కారణం వల్ల కూడా వెదురు సాగు విస్తృతంగా వ్యాపిస్తోంది. రాజ్పుట్ తన తోటలో 19 రకాల వెదురును సాగు చేస్తున్నారు. ఒక్కో రకం వెదురు ఒక్కో పనికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. అగరొత్తుల ఉత్పత్తి ఉపయోగపడేది ఒకటైతే, బొగ్గు తయారీకి మరొకటి, బయోమాస్ ఇంధనం ఉత్పత్తికి మరొకటి.. ఇలా ఒక్కో రకం ఒక్కో పనికి ఎక్కువగా పనికొస్తాయి. ‘వెదురు బొంగులు, ఆకులు పెల్లెట్లు తయారు చేస్తారు.పౌడర్లు బయోమాస్ ఇంధన ఉత్పత్తికి వాడుతారు. ఈ ఉత్పత్తులు పర్యావరణ హితమైనవి. సాధారణ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా వాడదగినవి అంటారు శివాజీ. వెదురును సాగు చేయటం దగ్గరే ఆయన ఆగిపోవటం లేదు. వెదురు బొంగులతో ఫర్నీచర్‌ను, అగరొత్తులను కూడా తానే తయారు చేయాలన్నది ఆయన సంకల్పం. సుస్థిర జీవనోపాధిని అందించగలిగిన వెదురు సాగు ప్రయోజనాల గురించి ఆయన ఇతర రైతులను చైతన్యవంతం చేస్తున్నారు. ‘136 రకాల వెదురు వంగడాలు ఉన్నాయి. వాటిల్లో 19 రకాలను నేను సాగు చేస్తున్నా. ప్రతి రకానికి ప్రత్యేక లక్షణాలు, ఉపయోగాలు ఉన్నాయి. రకాన్ని బట్టి వెదురు బొంగుల బలం, బరువు ఆధారపడి ఉంటాయి. మన అవసరాన్ని బట్టి ఏ రకాలు కావాలో ఎంపిక చేసుకొని నాటుకోవటం ఉత్తమం’ అనేది ఆయన సూచన.ఆచరణాత్మకంగా ఉండే ఆయన సూచనలు ఇతర రైతులను అనుసరించేలా చేస్తున్నాయి. మహరాష్ట్ర ప్రభుత్వం నుంచ వనశ్రీ పురస్కారంతో పాటు ఇందిరా ప్రియదర్శిన వృక్షమిత్ర అవార్డు వంటి మొత్తం 30 వరకు అవార్డులు ఆయనను వరించాయి. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీటినిపొదుపుగా వాడుకోవటం వీలుకావటంతో పాటు వెదురు మొక్కలు ఏపుగా పెరగానికి కూడా ఇది ఉపయోగపడిందంటారాయన.వనశ్రీ ఆక్సిజన్ పార్కువనశ్రీ ఆక్సిజన్ పార్క్‌ను రాజ్పుట్ మూడేళ్ల క్రితం నిర్మించారు. చనిపోయిన తమ ప్రియతముల గౌరవార్థం ఇటువంటి వనశ్రీ ఆక్సిజన్ పార్కులు ్రపారంభించాలని ఆయన పిలుపునిచ్చారు. ‘నా ప్రియతముల పుట్టిన రోజున మొక్కలు నాటుతున్నా. ఇతరులను కూడా ఇదే కోరుతున్నా’ అన్నారాయన. వెదురు సాగు భవిష్యత్తు తరాల బాగు కోసం, బంగారు భవిష్యత్తు కోసం మనం ఇప్పుడు పెట్టే తెలివైన పెట్టుబడే అంటారాయన. ఇతర రైతులకు ప్రేరణరాజ్పుట్ వెదురు తోట విజయగాథతో ప్రేరణ పొందిన రైతులు పలువురు ఆయనను అనుసరిస్తున్నారు. ధులే జిల్లాలోని షిర్పూర్ తాలూకాలో ఆయన సూచనల ప్రకారం 250 ఎకరాలకు వెదురు తోటలు విస్తరించాయి. పేపరు ఉత్పత్తికి వెదురు ఉపయోగపడుతుంది. స్థానికులకు, గ్రామీణ జనసముదాయాలకు వెదరు సాగు చక్కటి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నదంటారాయన. భూమిని పర్యావరణానికి అనుగుణంగా వినియోగించడాన్ని ్రపోత్సహించదలిస్తే వెదురును విస్తృతంగా సాగు చేయించాలని సూచిస్తున్న రాజ్పుట్ వెదురు భవిష్యత్తు చాలా మెరుగ్గా ఉంటుందన్నారు. ఆయన 7 లక్షలకు పైగా ఇతరత్రా మొక్కలు నాటించటం వల్ల ఆ ప్రాంతంలో జీవవైవిధ్యం పెరిగింది. భూగర్భ జలమట్టం పూర్వస్థితికి పెరిగింది. వర్షానికి మట్టి కొట్టుకుపోవటం తగ్గింది. వన్య్రపాణులకు ఆవాసాలు పెరిగాయి. -
రూ. 12 కోట్లు ఇస్తున్నారు
న్యూఢిల్లీ: హాకీ ఇండియా (హెచ్ఐ) వార్షిక అవార్డుల విజేతలకు ఈసారి భారీగా ప్రైజ్‌మనీ దక్కనుంది. 2024 సీజన్‌కు సంబంధించి అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో కనబరిచిన ప్రదర్శన ఆధారంగా 8 కేటగిరీల్లో 32 మంది నామినేట్ అయ్యారు. వీరందరికి కలిపి ఏకంగా రూ. 12 కోట్ల ప్రైజ్‌మనీ అందజేయనున్నట్లు హెచ్ఐ తెలిపింది. శనివారం న్యూఢిల్లీలో అవార్డుల వేడుక నిర్వహించనున్నారు. » మహిళలు, పురుషుల కేటగిరీలో ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’గా నిలిచిన వారికి బల్బీర్‌సింగ్ సీనియర్ అవార్డు... వర్ధమాన ప్లేయర్లకు పురుషుల విభాగంలో జుగ్రాజ్ సింగ్ పేరిట... మహిళల్లో అసుంత లాక్రా పేరిట ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డులను అందజేస్తారు. » ‘గోల్‌కీపర్ ఆఫ్ ద ఇయర్’గా నిలిచిన వారికి బల్జీత్ సింగ్ అవార్డును... ‘డిఫెండర్ ఆఫ్ ద ఇయర్’కు పర్గత్ సింగ్ అవార్డు, ‘మిడ్ ఫీల్డర్ ఆఫ్ ద ఇయర్’కు అజిత్‌పాల్ సింగ్ అవార్డును... ‘ఫార్వర్డ్ ఆఫ్ ద ఇయర్’కు ధన్‌రాజ్ పిళ్లై అవార్డును బహూకరిస్తారు. » భారత పురుషుల హాకీ జట్టు ప్రపంచకప్ (1975) టైటిల్ గెలిచి 50 ఏళ్లు పూర్తికావడం, అలాగే అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) గుర్తింపు పొంది 100 ఏళ్లు (1925) పూర్తికావడంతో స్వర్ణోత్సవ వేడుకలు ఈ అవార్డుల కార్యక్రమంలోనే జరుగనుంది. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన పురుషుల జట్టును, ఆసియా చాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన పురుషులు, మహిళల జట్లను ఘనంగా సన్మానించనున్నారు. సీనియర్ జట్లతో పాటు జూనియర్ ఆసియాకప్ సాధించిన పురుషులు, మహిళల జట్లను సత్కరిస్తారు. » బల్బీర్‌సింగ్ సీనియర్ అవార్డు రేసులో రిటైరైన పీఆర్ శ్రీజేశ్, కృష్ణన్ బహదూర్ పాఠక్‌లతో పాటు మహిళా ప్లేయర్లు సవిత, బిచూ దేవి ఖరిబం కూడా ఉన్నారు. » డిఫెండర్ అవార్డు కోసం సంజయ్, అమిత్ రోహిదాస్, హర్మన్‌ప్రీత్ సింగ్, ఉదిత పోటీపడుతున్నారు. » మిడ్‌ఫీల్డర్ అవార్డు కోసం జర్మన్‌ప్రీత్ సింగ్, హార్దిక్ సింగ్, నీలకంఠ శర్మ, సుమిత్ నామినేట్ అయ్యారు. » ఫార్వర్డ్ అవార్డు కోసం లాల్రెమ్సియామి, అభిషేక్, సుఖ్జీత్, నవ్‌నీత్ కౌర్ బరిలో ఉన్నారు. æ అండర్–21 మహిళలకు ఇచ్చే వర్థమాన ప్లేయర్ అవార్డు రేసులో బ్యూటీ డుంగ్‌డుంగ్, దీపిక, వైష్ణవి ఫాల్కే, సునెలితా టొప్పొ ఉన్నారు. »అండర్–21 పురుషులకు ప్రదానం చేసే వర్ధమాన ప్లేయర్ పురస్కారం కోసం అర్‡్షదీప్ సింగ్, అమిర్ అలీ, శర్దానంద్ తివారి, అరిజీత్ సింగ్ బరిలో ఉన్నారు. -
Sakshi Awards: గొప్ప సంకల్పం - సమాజ హితమే లక్ష్యం
-
అబ్బురపరిచే అద్భుత చిత్రాలు.. చూస్తే వావ్ అనాల్సిందే! (ఫొటోలు)
-
సర్ సివి రామన్ యంగ్ జీనియస్ అవార్డ్స్ 2025 (ఫొటోలు)
-
వేడుకగా భారత్ అన్మోల్ వుమెన్ అవార్డ్స్ వేడుక (ఫోటోలు)
-
తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి
మాదాపూర్: వాణిజ్యం, వ్యాపారం లేకుండా ప్రభుత్వాలు, వ్యవస్థలు నడవలేవని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో గురువారం హైబిజ్ టీవీ బిజినెస్ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ 2వ ఎడిషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కీలక రంగాలలో అమూల్యమైన సేవలు అందించిన వారికి అవార్డులను అందజేసినందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఏడాదికాలంలో ప్రభుత్వం వ్యాపారరంగ అభివృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించిందని తెలిపారు. 2023లో తెలంగాణ అభివృద్ధి 2ఎక్స్‌గా ఉందని, రాబోయే నాలుగు సంవత్సరాలలో దాన్ని 10ఎక్స్‌కు చేరుస్తామన్నారు. తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని, దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో రూ.1.7 లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రం సాధించడమే అందుకు నిదర్శనమని చెప్పారు. పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూర్చడంలో కీలకపాత్ర పోషిస్తున్నారని తెలిపారు. అలాంటి వారిని గుర్తించి ప్రోత్సహిస్తున్నందుకు హర్షం వ్యక్తంచేశారు. పారిశ్రామిక రంగానికి ప్రభుత్వ సహకారం ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా 11 మందికి లెజెండ్ పురస్కారాలను అందజేశారు. సీఎస్ఆర్ కేటగిరీలలో ఉత్తమ గ్రూప్‌గా ఐటీసీకి అవార్డు దక్కింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, టీజీఐఐసీ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, సుచిరిండియా సీఈఓ డాక్టర్ లయన్ వై.కిరణ్, భారతీ సిమెంట్ మార్కెటింగ్ డైరెక్టర్ రవీందర్‌రెడ్డి, హైబిజ్ టీవీ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
ఇకపై ఏటా... సినిమా డే, అవార్డులు
పది రీళ్ళ తొలి పూర్తి నిడివి తెలుగు టాకీ చిత్రం ‘భక్త ప్రహ్లాద’ విడుదలైన ఫిబ్రవరి 6న ఇకపై ప్రతి ఏడాది ‘తెలుగు సినిమా దినోత్సవం’ జరపాలని తెలుగు ఫిల్మ్ ఛాంబర్(Telugu Film Chamber) ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ) నిర్ణయించింది. ‘భక్త ప్రహ్లాద’ రిలీజై 93 వసంతాలు నిండిన వేళ హైదరాబాద్‌లోని ఛాంబర్ కార్యాలయంలో గురువారం ప్రత్యేకంగా ‘తెలుగు సినిమా డే’ నిర్వహించింది. రచయిత పరుచూరి గోపాలకృష్ణ అధ్యక్షతన జరిగిన వేడుకల్లో ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతల మండలి, ఫిల్మ్ ఫెడరేషన్తో సహా పరిశ్రమకు చెందిన 24 క్రాఫ్ట్‌ల ముఖ్యులూపాల్గొన్నారు. తెలుగు ప్రభుత్వాలు ఇచ్చే సినీ అవార్డులతోపాటు ఇకపై ఏటా ‘టీఎఫ్‌సీసీ’ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ సూచనల మేరకు అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది.జాతీయ అవార్డులందుకున్న వారినీ, ఇండియన్ పనోరమాకు ఎంపికైన చిత్రాల వారినీ ‘సినిమా డే’ నాడు సత్కరించాలని నిర్ణయించింది. అలాగే, ఏటా ఫిబ్రవరి 6నే అన్ని శాఖల సంఘాలూ తెలుగు సినిమా జెండా ఎరేయాలని పిలుపునిచ్చింది. జెండా రూపకల్పన బాధ్యతను పరుచూరికి అప్పగించింది. అలాగే ఎంతో పరిశోధన చేసి, ‘భక్త ప్రహ్లాద’ అసలు రిలీజ్ తేదీ ఫిబ్రవరి 6 అని నిరూపించిన సీనియర్ జర్నలిస్ట్, రచయిత రెంటాల జయదేవను సినీ పరిశ్రమ పక్షాన అభినందించి, సన్మానించారు. సౌతిండియన్ సినిమా చరిత్రపై ఆయన పరిశోధనా గ్రంథం ‘మన సినిమా... ఫస్ట్ రీల్’ను పరిశ్రమ పక్షాన ఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్ అందుకున్నారు. పరుచూరి మాట్లాడుతూ–‘‘1931 అక్టోబర్ 31న ‘కాళిదాస్’ రిలీజైంది. 3 లఘు చిత్రాలను కలిపి, ఒకే ప్రదర్శనగా వేసిన ఆ సినిమాను తమిళులు తమ సినిమాగా చెప్పుకుంటున్నా, అందులోని 4 రీళ్ళ ‘కాళిదాస్’ పూర్తి తెలుగు డైలాగ్స్ చిత్రమని జయదేవ తన పరిశోధనలో అన్ని సాక్ష్యాలతో నిరూపించారు. పుస్తకంలో ప్రచురించారు. అందుకని ఫిబ్రవరి 6తోపాటు అక్టోబర్ 31న కూడా మర్చిపోకుండా పెద్దల్ని స్మరించుకొని, వేడుక చేసుకోవాలి’’ అన్నారు. సన్మాన గ్రహీత రెంటాల జయదేవ మాట్లాడుతూ–‘‘1932 ఫిబ్రవరి 6న ‘భక్త ప్రహ్లాద’ విడుదలైందని 2011లోనే సాక్ష్యాధారాలు సేకరించి, అసలు చరిత్రను బయటపెట్టాను. అప్పట్లో దానికి ప్రభుత్వ నంది అవార్డు దక్కినా, ఇవాళ పరిశ్రమ నన్ను సత్కరించడం మర్చిపోలేను. దీంతోపాటు తెలుగు త్యాగరాయ కీర్తనలతో ‘కాళిదాస్’ తెలుగు సినిమా అని మనం హక్కుల కోసం క్లెయిమ్ చేసుకోవాలి. ఇలా మరుగునపడిన ఎన్నో అంశాల్ని వెలికి తీసి, మన సినిమా చరిత్రను నిక్షిప్తం చేసి, భావితరాలకు అందించేందుకు ఛాంబర్ ఒక ట్రస్టు కింద నిధిని ఏర్పాటు చేయాలి’’ అన్నారు.ఈ వేడుకల్లో ఛాంబర్ కార్యదర్శి – నిర్మాతల మండలి అధ్యక్షుడు కె.ఎల్. దామోదర ప్రసాద్, నిర్మాతల మండలి కార్యదర్శి టి. ప్రసన్న కుమార్, నటుడు మురళీ మోహన్, దర్శకుల సంఘం అధ్యక్షుడు వీర శంకర్, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి అనుపమ్ రెడ్డి, నిర్మాతలు ఆచంట గోపీనాథ్, టి. రామ సత్యనారాయణ, నటుడు మాదాల రవి తదితరులుపాల్గొన్నారు. -
BCCI Naman Awards 2025: విజేతలు వీరే (ఫోటోలు)
-
'వెటకార' పురస్కారాలు
ప్రతిభా పాటవాలకు గుర్తింపుగా పురస్కారాలు, బిరుదులు, ఘన సత్కారాలు దక్కుతాయి. వివిధ రంగాలలోని ప్రతిభావంతులను సత్కరించే పద్ధతి పురాతన రాచరికాల కాలం నుంచే ఉండేది. అయితే రాజుల కాలంలో పురస్కారాలు, సత్కారాలు మాత్రమే ఉండేవి. వెటకారాలు ఉండేవి కావు. ప్రపంచంలో ప్రజాస్వామ్యం విస్తరించాక, వెటకార పురస్కారాలు కూడా మొదలయ్యాయి.ఆధునిక ప్రపంచంలో ‘నోబెల్’ పురస్కారాలను అత్యున్నత పురస్కారాలుగా పరిగణిస్తాం. బుకర్ ప్రైజ్, పులిట్జర్ అవార్డు, ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ వంటి వాటికి కూడా ప్రతిష్ఠాత్మక పురస్కారాలుగా ప్రపంచంలో గౌరవాదరణలు ఉన్నాయి. వివిధ రంగాల్లో కొంత పేరు గడించినా, పరమ చెత్త ప్రదర్శనలు చేసేవారిని బహిరంగంగా వెటకారం చేయడానికి కూడా అవార్డులు ఉన్నాయి. ఇవి ఆధునిక కాలంలో పుట్టుకొచ్చిన అవార్డులు. నోబెల్ బహుమతికి బదులుగా ఇగ్ నోబెల్ బహుమతి, పులిట్జర్ బహుమతికి బదులుగా ఫూలిట్జర్ బహుమతి ఇలాంటి అవార్డులే! వివిధ రంగాలకు సంబంధించి ఇలాంటి వెటకార పురస్కారాలు మరిన్ని కూడా ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. ∙పన్యాల జగన్నాథదాసుఇగ్ నోబెల్శాస్త్ర సాంకేతిక సాహితీ రంగాలతో పాటు ప్రపంచశాంతి కోసం పాటుపడే వారికి ఏటా ఇచ్చే నోబెల్ బహుమతులు ఎంతటి ప్రతిష్ఠాత్మకమైనవో అందరికీ తెలుసు. పనికిమాలిన పరిశోధనలు సాగించేవారికి ‘ఇగ్ నోబెల్’ బహుమతుల గురించి ఎక్కువమందికి తెలీదు. ‘ఇగ్ నోబెల్’ బహుమతులు ఇవ్వడాన్ని 1991లో మొదలుపెట్టారు. వెటకార పురస్కారాల్లో ఇగ్ నోబెల్ తీరే వేరు! ‘ఆనల్స్ ఆఫ్ ఇంప్రొబాబుల్ రీసెర్చ్ (ఏఐఆర్) అనే శాస్త్రీయ హాస్య పత్రిక 1991 నుంచి ఏటా ‘ఇగ్ నోబెల్’ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తోంది. ఈ పత్రిక సంపాదకుడు మార్క్ అబ్రహాం వినూత్న ఆలోచనకు ఫలితమే ‘ఇగ్ నోబెల్’ పురస్కారాలు. అట్టహాసంగా నిర్వహించే కార్యక్రమంలో నోబెల్ బహుమతి గ్రహీతల చేతుల మీదుగా ‘ఇగ్ నోబెల్’ పురస్కారాల ప్రదానం జరుగుతుంది. ‘ఇగ్ నోబెల్’ గ్రహీతలు వేదిక మీద ప్రసంగాలు చేస్తారు. ఈ కార్యక్రమం అసలు నోబెల్ పురస్కారాల ప్రదానోత్సవాన్ని తలపిస్తుంది. ‘ఇగ్ నోబెల్’ పురస్కారానికి ఎంపికైన వారికి ‘ఘనం’గా నగదు బహుమతి కూడా ఇస్తారు. ఎంతనుకున్నారు? అక్షరాలా వంద లక్షల కోట్ల డాలర్లు. అమెరికన్ డాలర్లు కాదు లెండి, జింబాబ్వే డాలర్లు. అమెరికన్ డాలర్లలో ఈ మొత్తం విలువ 0.40 డాలర్లు (రూ.33.73) మాత్రమే! ఈ పురస్కారంలోని వెటకారం అర్థమైంది కదా!అసలు నోబెల్‌ను మించినన్ని విభాగాలు ఇగ్ నోబెల్లో ఉన్నాయి. బోటనీ, అనాటమీ, మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, పీస్, డెమోగ్రఫీ, ప్రొబాబిలిటీ, ఫిజియాలజీ విభాగాల్లో ‘ఇగ్’ నోబెల్ పురస్కారాలు ఇస్తారు. ఈసారి ‘ఇగ్’నోబెల్ విజేతలు, వారి ఘనతలు ఒకసారి చూద్దాం:⇒ బోటనీ విభాగంలో ఈసారి ఇగ్ నోబెల్ పొందినవారు అమెరికన్ శాస్త్రవేత్త జాకబ్ వైట్, జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్ బాన్‌లో పరిశోధనలు సాగిస్తున్న జపానీస్ శాస్త్రవేత్త ఫిలిపె యమషిటా. వీరిద్దరూ కనుగొన్న అద్భుతం ఏమిటంటే– కృత్రిమ మొక్కల కుండీలు ఉన్న పరిసరాల్లో నిజమైన మొక్కలను కూడా పెంచుతున్నట్లయితే, కృత్రిమ మొక్కల ఆకారాలను నిజమైన మొక్కలు అనుకరిస్తాయట! ప్రపంచానికి ఏ రకంగానూ పనికిరాని ఈ అద్భుతాన్ని కనుగొన్నందుకే వీళ్లకు ఈ పురస్కారం.⇒ అనాటమీ విభాగంలో ఈసారి ఏకంగా పదిమంది ఇగ్ నోబెల్‌ను పొందారు. వివిధ దేశాలకు చెందిన ఈ పరిశోధకులు మూకుమ్మడిగా ఒకే అంశంపై పరిశోధనలు సాగించారు. వీరి పరిశోధనాంశం నెత్తి మీద మొలిచే జుట్టు. భూమ్మీద ఉత్తరార్ధ గోళంలో ఫ్రాన్స్‌కు చెందిన 25 మంది పిల్లలను, దక్షిణార్ధ గోళంలో చిలీకి చెందిన 25 మంది పిల్లలను నమూనాగా తీసుకున్నారు. ఉత్తరార్ధ గోళంలోని పిల్లలతో పోల్చుకుంటే, దక్షిణార్ధ గోళానికి చెందిన పిల్లల్లో నెత్తి మీద జుట్టు అపసవ్య దిశలో రింగులు తిరిగిన వారు ఎక్కువగా ఉన్నట్లు తేల్చారు.⇒ ఫిజిక్స్ విభాగంలో హార్వర్డ్ వర్సిటీ శాస్త్రవేత్త జేమ్స్ సి. లియావో ఈసారి ఇగ్ నోబెల్ పొందారు. చనిపోయిన చేప కళేబరానికి బోలు గొట్టాన్ని కడితే, అది ప్రవాహానికి ఎదురీదగలదని తన పరిశోధనలో తేల్చారు. నిర్ణీత పరిస్థితుల్లో ఒక వస్తువు తన శక్తిని ఏమాత్రం ఉపయోగించుకోకుండానే ప్రవాహానికి ఎదురీదడం సాధ్యమవుతుందని కనుగొన్నారు.⇒ మెడిసిన్ విభాగంలో జర్మనీలోని హాంబర్గ్ వర్సిటీకి చెందిన ముగ్గురు శాస్త్రవేత్తలకు ఇగ్ నోబెల్ దక్కింది. తీవ్రమైన దుష్ప్రభావాలు కలిగించని నకిలీ మందుల కంటే తీవ్రమైన దుష్ప్రభావాలు కలిగించే నకిలీ మందులే ఎక్కువ ప్రభావవంతంగా పనిచేస్తాయని వీరు కనుగొన్నారు.⇒ కెమిస్ట్రీ విభాగంలో ఆమ్స్టర్డామ్ వర్సిటీకి చెందిన టెస్ హీరమన్స్, ఆంటోనీ డెబ్లాస్, డేనియల్ బాన్, శాండర్ వూటర్సన్ ఈసారి ఇగ్ నోబెల్ పొందారు. ఆల్కహాల్ ప్రభావంతో మత్తెక్కి ఉన్న క్రిములను, మత్తు లేకుండా పూర్తి చలనశీలంగా ఉన్న క్రిములను క్రోమాటోగ్రఫీ పరిజ్ఞానంతో వేరుచేయవచ్చని వీరు కనుగొన్నారు.⇒ బయాలజీ విభాగంలో మినెసోటా వర్సిటీకి చెందిన ఫోరై్డస్ ఎలీ, విలియమ్ పీటర్సన్ ఈసారి ఇగ్ నోబెల్ దక్కించుకున్నారు. ఆవులు పాలు చేపడంపై నాడీ వ్యవస్థ పరోక్షంగా ప్రభావం చూపుతుందని వీరు కనుగొన్నారు. దీని కోసం వారు ఒక విచిత్రమైన ప్రయోగం చేశారు. ఒక ఆవు వెనుక నిలుచున్న పిల్లి దగ్గర ఒక కాగితం సంచిని పేల్చారు. అధాటుగా జరిగిన ఈ పరిణామంతో ఆవు పొదుగు నుంచి పాల చుక్కలు నేలరాలాయి.⇒ ఇగ్ నోబెల్ శాంతి బహుమతి అమెరికన్ మానసిక శాస్త్రవేత్త బి.ఎఫ్.స్కిన్నర్‌కు మరణానంతరం లభించింది. తన జీవిత కాలంలో ఆయన ఒక విచిత్రమైన అంశంపై ప్రయోగాలు సాగించాడు. యుద్ధాలు జరిగేటప్పుడు సైనిక బలగాలు ప్రయోగించే క్షిపణుల్లో సజీవంగా ఉన్న పావురాలకు గూళ్లు ఏర్పాటు చేసి, వాటిని కూడా క్షిపణులతో పంపినట్లయితే, ఆ శాంతి కపోతాలు క్షిపణులకు మార్గనిర్దేశనం చేయగలవని ఆశించాడు.⇒ ప్రొబాబిలిటీ విభాగంలో ఫ్రాంటిసెక్ బార్టోస్ నేతృత్వంలోని చెక్ శాస్త్రవేత్తల బృందానికి ఈసారి ఇగ్ నోబెల్ లభించింది. ఒక నాణేన్ని బొమ్మ బొరుసు వేసేటప్పుడు దానిని ఏవైపు పైకి ఉంచి పట్టుకుంటామో, ఎక్కువ సార్లు అదేవైపు తిరిగి నేల మీదకు పడుతుందని వీరు కనుగొన్నారు. ఈ సంగతిని కనుగొనడానికి ఏకంగా 3,50,757 సార్లు నాణెంతో బొమ్మ బొరుసు వేశారు.⇒ డెమోగ్రఫీ విభాగంలో ఇగ్ నోబెల్ ఈసారి ఆక్స్ఫర్డ్ వర్సిటీ శాస్త్రవేత్త సాల్ జస్టిన్ న్యూమన్కు దక్కింది. జనన మరణాల రికార్డులను నమోదు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే ప్రాంతాల్లో నివసించే ప్రజల్లోనే ఎక్కువమంది దీర్ఘాయుష్కులు ఉంటున్నట్లు ఆయన ఒక రహస్య పరిశోధన ద్వారా కనుగొన్నాడు.⇒ ఫిజియాలజీ విభాగంలో ఇగ్ నోబెల్‌ను జపానీస్ శాస్త్రవేత్త ర్యో ఒకాబే నేతృత్వంలోని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం దక్కించుకుంది. ఈ బృందంలోని శాస్త్రవేత్తలు వివిధ రకాల స్తన్యజీవులపై పరిశోధనలు జరిపి, స్తన్యజీవులు ఆసనం ద్వారా కూడా శ్వాసక్రియ సాగించగలవని తేల్చారు.మరికొన్ని వెటకారాలుగోల్డెన్ కేలా: అంతర్జాతీయ సినిమా రంగంలో ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డులకు ఉన్న పేరు ప్రతిష్ఠలు అందరికీ తెలిసిన సంగతే! ఏటా అత్యుత్తమ సినిమాలకు, వాటిలో నటించిన నటీ నటులకు, దర్శకులు సహా ఇతర సాంకేతిక నిపుణులకు ఈ అవార్డులు ఇస్తారు. ‘గోల్డెన్ గ్లోబ్’ రీతిలోనే బాలీవుడ్లో అతి చెత్త సినిమాలకు వివిధ విభాగాల్లో కొన్నేళ్లుగా ‘గోల్డెన్ కేలా’ అవార్డులు ఇస్తున్నారు. ‘ర్యాండమ్ మ్యాగజీన్’ అనే హాస్యపత్రిక ఈ అవార్డులను బహూకరిస్తోంది. ఈసారి ‘బచ్చన్ పాండే’ చిత్రం అతిచెత్త చిత్రంగా ‘గోల్డెన్ కేలా’ పొందింది. ఈ చిత్ర దర్శకుడు ఫర్హద్ సమ్జీ, ఇందులో నటించిన అక్షయ్ కుమార్, కృతి సనోన్ ‘గోల్డెన్ కేలా’ పొందారు.గోల్డెన్ రాస్బరీ: ‘గోల్డెన్ గ్లోబ్’ రీతిలోనే అతిచెత్త హాలీవుడ్ చిత్రాలకు కొన్నాళ్లుగా ‘గోల్డెన్ రాస్బరీ’ అవార్డులు ఇస్తున్నారు. అమెరికన్ ప్రచారకర్త జాన్ జె.బి. విల్సన్ నెలకొల్పిన ‘గోల్డెన్ రాస్బరీ ఫౌండేషన్’ ద్వారా ఏటా ఈ అవార్డుల ప్రదాన కార్యక్రమం అట్టహాసంగా నిర్వహిస్తుంటారు. ఈ అవార్డులు తీసుకోవడానికి పలువురు ప్రముఖులు ముఖం చాటేసినా, కొందరు మాత్రం ధైర్యంగా ముందుకొచ్చి, వీటిని అందుకోవడం విశేషం. ఈ అవార్డును స్వయంగా అందుకున్న వారిలో టామ్ గ్రీన్, సాండ్రా బులక్ వంటి ప్రముఖులు ఉన్నారు.బిగ్ బ్రదర్ అవార్డు: పౌరుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు ఏటా ఈ అవార్డు ఇస్తారు. జార్జ్ ఆర్వెల్ నవల ‘1984’లోని ‘బిగ్ బ్రదర్’ పాత్ర స్ఫూర్తితో ఈ అవార్డును నెలకొల్పారు. గోప్యతకు భంగం కలిగించే అంశాలపై ప్రజల దృష్టిని ఆకట్టుకునేందుకు, ఈ అంశాలపై చర్చను రేకెత్తించేందుకు లండన్ కేంద్రంగా పనిచేస్తున్న ‘ప్రైవసీ ఇంటర్నేషనల్’ ఈ అవార్డులను ఇస్తోంది. ఆర్వెల్ ‘1984’ నవలకు యాభయ్యేళ్లు పూర్తయిన సందర్భంగా 1999 నుంచి ఈ అవార్డులను ఇవ్వడం ప్రారంభించారు. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, బల్గేరియా, చెక్ రిపబ్లిక్, ఫిన్లండ్, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ దేశాలు ‘బిగ్ బ్రదర్’ అవార్డులు ఇస్తున్నాయి.పిగాసస్ అవార్డు: ఇదొక విచిత్రమైన అవార్డు. అతీంద్రియ, మానవాతీత మాయలకు ఏటా ఈ అవార్డు ఇస్తారు. కెనడియన్–అమెరికన్ రచయిత, ఐంద్రజాలికుడు జేమ్స్ రాండీ 1982లో ఈ అవార్డును నెలకొల్పారు. ఇజ్రాయెలీ–బ్రిటిష్ ఐంద్రజాలికుడు యూరీ గెల్లర్ పేరుతో ఈ అవార్డును ‘యూరీ ట్రోఫీ’ అని కూడా అంటారు. ఈ అవార్డు లోగో ‘రెక్కల పంది’ కావడంతో ఇది ‘పిగాసస్’ అవార్డుగా పేరు పొందింది. మానవాతీత మానసిక శక్తులతో అత్యధిక సంఖ్యలో జనాలను మభ్యపెట్టిన వ్యక్తులకు, అతీంద్రియ కథనాలను వాస్తవ కథనాల్లా ప్రచురించే మీడియా సంస్థలకు, అతీంద్రియ అంశాలపై అధ్యయనాల కోసం నిధులు సమకూర్చే సంస్థలకు, ఒక వెర్రిబాగుల అంశాన్ని అతీంద్రియ ప్రభావంగా ప్రకటించే శాస్త్రవేత్తలకు ఈ అవార్డులు ఇస్తారు.ఘంటా అవార్డు: బాలీవుడ్‌లోని అతిచెత్త సినిమాలకు వివిధ విభాగాల్లో ఇచ్చే అవార్డు ఇది. బాలీవుడ్ దర్శక నిర్మాత, రచయిత కరణ్ అంశుమాన్, ఆయన మిత్రుడు ప్రశాంత్ రాజ్‌ఖోవా 2011లో ఈ అవార్డును నెలకొల్పారు. అట్టహాసంగా జరిగే ఈ అవార్డుల కార్యక్రమానికి స్వయంగా హాజరై, అవార్డులు తీసుకోవడానికి చాలామంది ముఖం చాటేస్తారు. అయితే, బాలీవుడ్ హీరోలలో రితేశ్ దేశ్‌ముఖ్, హీరోయిన్లలో సోనాక్షి సిన్హా ఈ అవార్డుల వేడుకకు హాజరై, స్వయంగా అవార్డులు అందుకోవడం విశేషం.పురస్కారాల చరిత్రపురస్కార సత్కారాల గురించి చెప్పుకోవాలంటే చాలా చరిత్రే ఉంది. ప్రపంచంలో తొలి పురస్కారం ఎవరు పొందారో, దానిని ఎవరు ఇచ్చారో స్పష్టమైన ఆధారాలేవీ చరిత్రలో నమోదు కాలేదు. ఏదో ఒక రంగంలో విశేషమైన కృషి చేసిన వారికి, గొప్ప ఘనత సాధించిన వారికి పురస్కారాలు అందజేసే పద్ధతి శతాబ్దాలుగా ప్రపంచమంతటా ఉంది. ప్రాచీన కాలంలో రోమన్ పాలకులు పురస్కారాలు ఇచ్చే పద్ధతిని మొదలుపెట్టి ఉంటారనడానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి. క్రీస్తుశకం ఐదో శతాబ్ది నాటికే రోమన్ పాలకులు తమ పౌరులకు పురస్కారాలను బహూకరించేవారు. సైనిక విజయాలలో కీలక పాత్ర పోషించిన సైనికులకు, సామాజిక పురోగతికి కృషి చేసినవారికి, రాజ్యం పట్ల విధేయత కలిగిన వారికి పురస్కారాలను ప్రకటించి, వారిని బహిరంగ వేదికపై ఘనంగా సత్కరించేవారు. మధ్యయుగాల నాటికి పురస్కార సత్కారాదులు ఆనాటి రాజ్యాలన్నింటికీ వ్యాపించాయి. ఆనాటి యూరోపియన్ రాజ్యాల్లో వివిధ రకాల క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి కార్ల్సిల్ బెల్స్, ఆర్నేట్ కప్పులు, కిప్ కప్పులు వంటివి బహూకరించేవారు. వీటిని బంగారం, వెండి వంటి విలువైన లోహాలతో తయారు చేసేవారు. ఇప్పటికీ చాలా క్రీడా పోటీల్లో బహూకరిస్తున్న కప్పులు ఆనాటి కిప్ కప్పుల నమూనానే అనుసరిస్తుండటం విశేషం. పదహారో శతాబ్దిలో బ్రిటిష్ రాజ్యంలో కింగ్ హెన్రీ–VIII హయాంలో వివిధ రకాల క్రీడా పోటీలకు ఆదరణ బాగా ఉండేది. కింగ్ హెన్రీ–VIII కాలంలో ఏటా రకరకాల క్రీడల పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులను అందజేసేవారు. ఆ కాలంలో విలువిద్య పోటీలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేవారు. ఈ పోటీల్లో విజేతలకు ‘స్కార్టన్ సిల్వర్ యారో’ అనే వెండి బాణాన్ని ప్రత్యేకమైన కర్రపెట్టెలో భద్రపరచి బహిరంగ వేదికపై బహూకరించేవారు. క్రీడాకారులతో పాటు కవులను, పండితులను, కళాకారులను కూడా ఆనాటి రాజులు ఘనంగా సత్కరించేవారు. బహుమానాలుగా విలువైన భూములను, భవంతులను, వెండి బంగారాలను ఇచ్చేవారు. కాళ్లకు గండపెండేరాలను, చేతులకు కంకణాలను తొడిగేవారు. వివిధ విద్యలలో అసాధారణ ప్రతిభా పాటవాలు ప్రదర్శించిన వారికి కనకాభిషేకాలు, గజారోహణలు వంటి సత్కారాలను కూడా ఘనంగా చేసేవారు.ఇలాంటివి మరిన్ని అవార్డులు ఉన్నాయి. వివిధ రంగాల్లో వెటకారంగా ఇచ్చే ఈ పురస్కారాలను స్వయంగా స్వీకరించే వారి సంఖ్య మాత్రం ఎప్పుడూ తక్కువే! పాత్రికేయ రంగంలో పులిట్జర్ అవార్డు అత్యంత ప్రతిష్ఠాత్మకమైనది. తప్పుడు కథనాలతో ఊదరగొట్టే పాత్రికేయులు, మీడియా సంస్థల కోసం కొందరు ఔత్సాహికులు ‘ఫూలిట్జర్ అవార్డు’ నెలకొల్పారు. గందరగోళంగా ఇంగ్లిష్ రాసేవారికి ‘గోల్డెన్ బుల్’ అవార్డు ఇస్తారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియా సంస్థల మీద కోపంతో కొన్నేళ్ల కిందట ‘ఫేక్ న్యూస్ అవార్డు’ నెలకొల్పారు. క్రీడా పోటీల్లో అతిచెత్త ఆటతీరు కనబరచిన క్రీడాకారులకు ‘వుడెన్ స్పూన్’ అవార్డు ఇస్తున్నారు. అతీంద్రియ పరిశోధకులకు ‘బెంట్ స్పూన్’ అవార్డు ఇస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా చెత్త ఆధునిక కళాఖండాలను సృష్టించేవారికి ‘టర్నిప్ ప్రైజ్’ ఇస్తున్నారు. వెటకారంగా ఇచ్చే ఇలాంటి పురస్కారాలు ఇంకా చాలానే ఉన్నాయి. జనాలకు ఇదో రకం వినోదం. -
అర్హులకే పద్మ అవార్డులు వచ్చాయి: బండి సంజయ్
-
ఉగాదికి గద్దర్(సినిమా)అవార్డులు: భట్టి విక్రమార్క
సాక్షి,హైదరాబాద్:ఉగాదికి గద్దర్ (సినిమా) అవార్డులను ప్రదానం చేయాలని నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.ఈ మేరకు శనివారం(జనవరి18) సచివాలయంలో జరిగిన గద్దర్ అవార్డుల కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం వెల్లడించారు. అవార్డుల ప్రదానోత్సవానికి ఏర్పాట్లు చేసుకోవాలని కమిటీ సభ్యులు,అధికారులకు సూచించారు. సినిమా నిర్మాణంలో హైదరాబాద్‌ను ప్రపంచ గమ్యస్థానంగా మారుస్తామని ఈ సందర్భంగా భట్టి తెలిపారు.అవార్డుల కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్టు చెప్పారు. అవార్డుల పంపిణీ కార్యక్రమాన్ని జాతీయ స్థాయి కార్యక్రమాల తరహాలో నిర్వహించాలని సూచించారు.గత పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ పార్టీ చిత్ర పరిశ్రమను నిర్లక్ష్యం చేసిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో అవార్డుల ప్రదానం జరగలేదన్నారు. రాష్ట్రంలో సినిమాల నిర్మాణాన్ని ప్రోత్సహించే అవార్డులను ఏటా అందజేయాలని నిర్ణయించినట్టు తెలిపారు.అవార్డుల కోసం లోగోతో సహా విధివిధానాలు, నియమ నిబంధనలపై కమిటీ చర్చించింది.గతంలో తెలుగు సినిమా రంగానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నంది అవార్డులు బహుకరించేవారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌గా విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో నంది అవార్డుల సంప్రదాయం కొనసాగినప్పటికీ తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం సినిమా రంగానికి అవార్డులివ్వలేదు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత సినిమా రంగానికి తెలంగాణ యుద్ధనౌక గద్దర్ పేరుతో అవార్డులివ్వాలని నిర్ణయించింది. -
‘చేంజ్ మేకర్’ అవార్డుల ప్రధానోత్సవంలో సీనీ తారల సందడి (ఫోటోలు)
-
డిజిటల్ దివా ఆఫ్ ది ఇయర్: ఎవరీ సిండ్రిల్లా
-
‘ఎల్లే గ్రాడ్యుయేట్స్ అవార్డ్స్–2024’ లో మెరిసిన బాలీవుడ్ తారలు, సెలబ్రిటీలు
-
జాకీర్ హుస్సేన్ అందుకున్న అవార్డ్స్, ఆసక్తికరమైన విషయాలు
ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ (73) మరణం ఆయన అభిమానులకు తీరని లోటు అని చెప్పవచ్చు. పదేళ్లుగా అమెరికాలో ఉంటున్న ఆయన గుండె సంబంధిత వ్యాధితో పాటు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ఈ వార్త తెలిసిన వెంటనే ఆయన అభిమానులు మిస్ యూ మ్యూజిక్ లెజండ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు జాకీర్ జీవితంలో ప్రత్యేకమైన విషయాల గురించి చర్చించుకుంటూ పోస్ట్‌లు పెడుతున్నారు.ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చిన జాకీర్ హుస్సేన్.. హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్, ఫ్యూజన్ సంగీత రంగంలో గణనీయమైన కృషి చేశారు. జాజ్, రాక్ వంటి సంగీతంలో నైపుణ్యం సాధించి ఆపై వాటికి భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని మిళితం చేయడంలో జాకీర్ హుస్సేన్ ఒక మార్గదర్శకుడిగా నిలిచారు. శక్తి బ్యాండ్‌లోని జాన్ మెక్లాఫ్లిన్ వంటి కళాకారులతో పాటు అమెరికన్ వాద్యకారుడు మిక్కీ హార్ట్‌తో కలిసి ప్లానెట్ డ్రమ్ ఆల్బమ్ కోసం ఆయన పనిచేశారు. ఆ ప్రదర్శనలు అన్నీ సంచలనం రేపాయి. చిత్ర పరిశ్రమలో జాకీర్ హుస్సేన్ పాత్రజాకీర్ హుస్సేన్ అనేక చిత్రాలకు సంగీతాన్ని సమకూర్చి తనదైన ముద్ర వేశారు. ఆయన సంగీతం అందించిన సాజ్, కస్టడీ, ద మిస్టిక్ మాసా వంటి చిత్రాలకు మంచి ఆదరణ వచ్చింది. ఆపై పలు సినిమాల్లో కూడా నటించారు కూడా. చివరగా మంకీ మ్యాన్ (2024) చిత్రంలో ఆయన కనిపించారు. జాకీర్ హుస్సేన్ సినిమాకి చేసిన కృషి చెరగని ముద్ర వేసింది. తబలాలో అతని నైపుణ్యాన్ని ప్రపంచ చలనచిత్రాలతో మిళితం చేసింది. భారత చిత్ర పరిశ్రమకు జాకీర్ హుస్సేన్ అందించిన గణనీయమైన సహకారం మరువలేనిదని చెప్పవచ్చు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఎన్నోసార్లు ఆయన ప్రదర్శనలిచ్చారు. ఈ క్రమంలో విమర్శకుల నుంచి కూడా ఆయన ప్రశంసలు అందుకున్నారు.జాకీర్ హుస్సేన్ గురించి ఆసక్తికరమైన విషయాలుజాకీర్ హుస్సేన్ తన తండ్రి ఉస్తాద్ అల్లా రఖా మార్గదర్శకత్వంలో మూడు సంవత్సరాల వయస్సులోనే తబలా వాయించడం ప్రారంభించారు. ఆపై ఏడేళ్ల వయస్సులోనే తన మొదటి బహిరంగ సంగీత ప్రదర్శన ఇచ్చారు.ఆయన కేవలం 12 సంవత్సరాల వయస్సులో తన మొదటి అంతర్జాతీయ సంగీత కచేరీ పర్యటనను ప్రారంభించారు. అలా ప్రపంచవ్యాప్తంగా భారతీయ శాస్త్రీయ సంగీతానికి ప్రాతినిధ్యం వహించారు.సంగీతంలో రాణించడంతో పాటు, అతను ఆర్థిక శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు.జాకీర్ హుస్సేన్ మిక్కీ హార్ట్‌తో కలిసి "ప్లానెట్ డ్రమ్" ఆల్బమ్‌లో తన సహకారానికి గ్రామీ అవార్డును గెలుచుకున్నారు. ఈ గౌరవాన్ని సాధించిన కొద్దిమంది భారతీయ సంగీతకారులలో ఒకరిగా రికార్డ్ క్రియేట్ చేశారు.భారతీయ శాస్త్రీయ సంగీతంలోనే కాకుండా.. జాకీర్ జార్జ్ హారిసన్, జాన్ మెక్లాఫ్లిన్ (శక్తి), యో-యో మా వంటి అంతర్జాతీయ కళాకారులతో కలిసి.. తూర్పు. పాశ్చాత్య సంగీత సంప్రదాయాల మధ్య అంతరాన్ని తగ్గించారు.జాకీర్ హుస్సేన్ ప్రపంచవ్యాప్తంగా చాలామందికి శిక్షణ ఇచ్చారు. ఈ క్రమంలో వర్క్‌షాప్‌ల ద్వారా తదుపరి తరం తబలా ప్లేయర్లను పెంపొందించడంలో తనవంతుగా పనిచేశారు.అతను భారతదేశంలో 'నేషనల్ ట్రెజర్' బిరుదుతో గౌరవించబడ్డారు. ఆపై భారతీయ సంగీతానికి సాంస్కృతిక రాయబారిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు.1988లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2023లో పద్మవిభూషణ్‌తో కేంద్ర ప్రభుత్వం ఆయన్ను గౌరవించింది.ఈ ఏడాది ప్రారంభంలో 66వ గ్రామీ అవార్డుల్లో మూడింటిని కైవసం చేసుకుని రికార్డ్ క్రియేట్ చేశారు. -
రిహాన్నా నుంచి అమీ జాక్సన్ దాకాముద్దుగుమ్మల సందడి మామూలుగా లేదుగా (ఫోటోలు)
-
అంతర్జాతీయ వేదికపై టాలీవుడ్ మూవీ సత్తా.. అవార్డులు కొల్లగొట్టేసింది!
నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్, కియారా ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన సూపర్ హిట్ మూవీ హాయ్ నాన్న. గతేడాది థియేటర్లలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. శౌర్యువ్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా సలార్ పోటీని తట్టుకుని ప్రపంచవ్యాప్తంగా రూ.75 కోట్లకు పైగా రాబట్టింది.తాజాగా ఈ చిత్రం అంతర్జాతీయ వేదికపై మెరిసింది. మెక్సికోలో జరిగిన ఐఎఫ్ఏసీ ఫిల్మ్ ఫెస్టివల్లో ఏకంగా ఆరు అవార్డులను సొంతం చేసుకుంది. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ స్కోర్, బెస్ట్ రైటర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ సెట్ డిజైన్, బెస్ట్ హెయిర్ అండ్ మేకప్ ఫీచర్ సౌండ్, బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ సౌండ్ విభాగాల్లో అవార్డ్స్ దక్కించుకుంది. కాగా.. తండ్రీకూతుళ్ల ఎమోషనల్ చిత్రంగా హాయ్ నాన్న తెరకెక్కించారు. గతంలో న్యూయార్క్‌లో జరిగిన ది ఒనిరోస్ ఫిల్మ్ అవార్డుల్లో సత్తా చాటింది. పలు విభాగాల్లో మొత్తం 11 అవార్డులను కైవసం చేసుకుంది. ఏథెన్స్ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ మార్చ్- 2024 ఎడిషన్‌లో బెస్ట్ ఫీచర్ ఫిలింగా అవార్డును కైవసం చేసుకుంది.కథ విషయానికి వస్తే..ముంబైకి చెందిన విరాజ్ (నాని) ఓ ఫోటోగ్రాఫర్. కూతురు మహి(బేబి కియారా ఖన్నా) అంటే అతడికి పంచప్రాణాలు. పుట్టుకతోనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న మహిని కంటికి రెప్పలా చూసుకుంటాడు. అమ్మ లేని లోటు తెలియకుండా పెంచుతాడు. ప్రతిరోజు రాత్రి మహికి కథలు చెప్తుంటాడు విరాజ్. ఓరోజు అమ్మ కథ చెప్పమని అడుగుతుంది మహి. క్లాస్ ఫస్ట్ వస్తే చెప్తానంటాడు.అమ్మ కథ వినాలని నెలంతా కష్టపడి క్లాస్‌లో తనే ఫస్ట్ ర్యాంకు తెచ్చుకుంటుంది. తర్వాత కథ చెప్పమని అడిగితే విరాజ్ చిరాకు పడటంతో మహి ఇంట్లో నుంచి బయటకు వెళ్తుంది. ఆ సమయంలో రోడ్డు ప్రమాదం నుంచి మహిని కాపాడుతుంది యష్ణ. అప్పటినుంచి వీరి మధ్య స్నేహం ఏర్పడుతుంది. అసలు యష్ణ ఎవరు? విరాజ్ సింగిల్ పేరెంట్‌గా ఎందుకు మారాడు? మహి అరుదైన వ్యాధిని జయించిందా? లేదా? అన్నది ఓటీటీలో చూడాల్సిందే! Congratulations to the entire team of #HiNanna 🫶 This film truly deserves all the love it's receiving, nd it's heartwarming to see it being celebrated🥺❤️ pic.twitter.com/oAIJDNSMRX— Vyshuuᴴᴵᵀ ³ (@vyshuuVyshnavi) November 26, 2024 -
అమూల్ డెయిరీకి అంతర్జాతీయ పురస్కారం
మూడు భారతీయ డెయిరీ సంస్థలకు అంతర్జాతీయ డెయిరీ ఫెడరేషన్ (ఐడిఎఫ్) ‘ఇన్నోవేషన్ ఇన్ సస్టయినబుల్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ 2024’ ప్రతిష్టాత్మక పురస్కారాలు దక్కాయి. పాడి పశువులకు సోకే జబ్బులకు చేసే చికిత్సల్లో అల్లోపతి యాంటీబయాటిక్ ఔషధాలకు బదులుగా హోమియోపతి ఔషధాలను వాడి చక్కని ఫలితాలు సాధించినందుకు గాను ‘యానిమల్ కేర్’ విభాగంలో అమూల్ డెయిరీకి ఈ పురస్కారం ప్రదానం చేసినట్లు ఐడిఎఫ్ ప్రకటించింది.సుమారు 68 వేల పశువులకు సోకిన 26 రకాల సాధారణ వ్యాధులకు హోమియోపతి మందులతో చికిత్స చేయటం ద్వారా అమూల్ డెయిరీ సత్ఫలితాలు సాధించింది. ఇందుకోసం 2024 మే నాటికి 3.30 లక్షల (30 ఎం.ఎల్. సీసాలు) హోమియోపతి మందులను అమూల్ సొంతంగానే ఉత్పత్తి చేసి, 1.80 లక్షల సీసాలను పాడి సహకార సంఘాల రైతులకు పంపిణీ చేసింది. యాంటీబయాటిక్ ఔషధాల వాడకాన్ని తగ్గించటం ద్వారా పశువుల ఆరోగ్యం మెరుగవుతోంది. పాల ఉత్పత్తులు వినియోగించే ప్రజల ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతోందని ఐడిఎఫ్ తెలిపింది. సంప్రదాయ ఆయుర్వేద (ఈవీఎం) చికిత్సా పద్ధతులతో పాటు హోమియో పశువైద్య పద్ధతులను కూడా అమూల్ ప్రాచుర్యంలోకి తేవటం హర్షదాయకం.పశ్చిమ బెంగాల్‌లోని సుందర్బన్ పాడి, పశు పెంపకందారుల సహకార సంఘానికి ఆర్థిక, సామాజిక విభాగంలో పురస్కారం లభించింది. 4,500 మంది మహిళా రైతులు పూర్తి సేంద్రియ పద్ధతుల్లో పాలు ఉత్పత్తి చేస్తున్నారు. అనేక పాల ఉత్పత్తులను, ఎ2 ఆవు నెయ్యిని తయారు చేస్తున్నారు. సేంద్రియ నాటు కోళ్ల పెంపకంతో పాటు సేంద్రియ పప్పుదినుసులను సైతం ఉత్పత్తి చేసి, ప్రాసెసింగ్ చేసి వినియోగదారులకు నేరుగా విక్రయిస్తూ మహిళా రైతులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధిస్తున్నారు.చదవండి: 90% కేసుల్లో యాంటీబయాటిక్స్ అవసరం లేదుఐడిఎఫ్ పురస్కారం అందుకున్న మరో సంస్థ ‘ఆశా మహిళా మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ’. సౌర విద్యుత్తుతో నడిచే ఇన్స్టంట్ మిల్క్ చిల్లర్లను వినియోగించటం ద్వారా చిన్న, సన్నకారు పాడి రైతుల అభ్యున్నతికి వినూత్న రీతిలో దోహదపడటం ఈ ఎఫ్పిఓ ప్రత్యేకత. -
ఇంతకంటే ఇంకేం కావాలి?.. యశస్వి జైస్వాల్ భావోద్వేగం(ఫొటోలు)
-
ఈ చిత్రం అద్భుతం కదూ..!
సూర్యచంద్రులను ఏకకాలంలో మోస్తూ.. తాడుపై బ్యాలెన్స్ చేస్తున్నట్లు కనిపిస్తున్న ఈ చిత్రం అద్భుతం కదూ.. అమెరికాలోని యూటా రాష్ట్రంలో సూర్యగ్రహణం సమయంలో బెల్వా హేడెన్ అనే ఫొటోగ్రాఫర్ తీసిన ఈ చిత్రం నేచర్స్ బెస్ట్ ఫొటోగ్రఫీ పురస్కారాల్లో అవుట్డోర్ అడ్వెంచర్ కేటగిరీలో మొదటి బహుమతిని గెలుచుకుంది. -
తెలంగాణ పోలీస్‌కు కేంద్ర పురస్కారాలు
సాక్షి, హైదరాబాద్: ఉత్తమ పనితీరు కనబర్చిన తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. ప్రతి ఏడాది అక్టోబర్ 31న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రకటించే ‘కేంద్ర హోంమంత్రి దక్షత పథక్’ అవార్డుకు రెండు విభాగాల్లో కలిపి మొత్తం 26 మంది తెలంగాణ పోలీసు అధికారులు, సిబ్బంది ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా పోలీసు బలగాలు, భద్రతా సంస్థ, ఇంటెలిజెన్స్ విభాగాలు, కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు, ఎన్ఎస్జీ (నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్), అసోం రైఫిల్స్‌తోపాటు నేర దర్యాప్తులో ఉత్తమ పనితీరు కనబర్చిన ఫోరెన్సిక్ సైన్స్ సిబ్బందికి ఈ అవార్డులు ఇస్తున్నారు.2024కు గాను మొత్తం 463 మంది సిబ్బంది అవార్డులకు ఎంపికైనట్టు కేంద్ర హోంశాఖ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. తెలంగాణ నుంచి స్పెషల్ ఆపరేషన్ ఫీల్డ్ విభాగంలో ఇంటెలిజెన్స్ విభాగం ఎస్పీ భాస్కరన్. ఆర్, ఇన్స్పెక్టర్లు భీసం హరిప్రసాద్, కాంపల్లి శ్రీనివాస్, చీగూరి సుదర్శన్‌రెడ్డి, గ్రూప్ కమాండర్ జాజాల రాఘవేంద్రరెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్లు చారి రాంబాబు, డొంకల రాంబాబు, సోము గౌతంరెడ్డి, పొన్న సంతోష్‌కుమార్, దుండిగల్ల రాజేశ్, ఏఆర్ఎస్సై మహ్మద్ ముజీబ్, హెడ్‌కానిస్టేబుళ్లు దేవులపల్లి మోహన్‌రెడ్డి, పండరి రవీందర్, సీనియర్ కమాండోలు తిప్పని రాకేశ్, ఉడుతనూరి మల్లేశ్, కానిస్టేబుళ్లు కడారి హరిబాబు, అంగీల జిడియో డార్లింగ్ మార్కస్, డి.రామచంద్రారెడ్డి, మదారి నాగరాజు, పట్లావత్ రాజేందర్, కేసరి శ్రీకాంత్æ గౌడ్, జూనియర్ కమాండో గంటా సాయి కుమార్ ఉన్నారు. అలాగే ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్ విభాగంలో ఐపీఎస్ అధికారి సంగ్రామ్‌సింగ్ పాటిల్, ఏసీపీ శ్రీధర్‌రెడ్డి పులిమామిడి, డీఎస్పీ సత్యనారాయణ దీపు, ఇన్స్పెక్టర్ శ్రీధర్‌రెడ్డి మామిళ్ల ఉన్నారు. -
బుల్లితెర అవార్డుల పండుగ.. ఛీఫ్ గెస్ట్ ఎవరంటే?
స్టార్ మా పరివార్ అవార్డ్స్ వేడుక బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం నుంచి స్టార్ మాలో ప్రసారం కానుంది. టాలీవుడ్ టీవీ ఇండస్ట్రీలో స్టార్ మా సీరియల్స్‌కు ఒక ప్రత్యేకమైన ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే. ప్రతి ఏటా అందించే స్టార్ మా పరివార్ అవార్డ్స్ కార్యక్రమం ఇవాళ బుల్లితెరపై ప్రేక్షకులను అలరించనుంది.ఈ గ్రాండ్ అవార్డ్స్ వేడుకలో టాలీవుడ్ కింగ్ నాగార్జున ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతేకాకుండా ఈవెంట్లో పలువురు స్టార్ హీరోలు, ప్రముఖులు పాల్గొన్నారు. అక్కినేని నాగేశ్వరావు శతజయంతి పురస్కరించుకొని టీవీ నటులు, అక్కినేనిని గుర్తు చేస్తూ చేసిన మెడ్లీ ఈ కార్యక్రమంలో హైలైట్‌గా నిలువనుంది. ఈ వేడుకలో బుల్లితెర నటీనటుల సందడి స్టార్ మా పరివార్ అవార్డ్స్‌లో చూసేయండి. -
ఉత్తమ పరిశోధనలకు ఉన్నత పురస్కారాలు
సాక్షి, అమరావతి: విద్యా రంగంలో ఉత్తమ పరిశోధనలను ప్రోత్సహించి, నాణ్యతను పెంపొందించేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఉన్నత స్థాయి అవార్డులను ప్రవేశపెడుతోంది. ఏటా దేశవ్యాప్తంగా 10 ఉత్తమ పీహెచ్డీ పరిశోధనలు అందించిన వారిని ‘పీహెచ్డీ ఎక్సలెన్స్ సైటేషన్’తో సత్కరించనుంది. నూతన జాతీయ విద్యా విధానం లక్ష్యాల్లో భాగంగా ఏటా వివిధ విభాగాల్లో అత్యుత్తమమైన పది పీహెచ్డీ థీసిస్‌లకు ఈ అవార్డు అందిస్తుంది. వ్యవసాయ శాస్త్రాల దగ్గర నుంచి వైద్య శాస్త్రాలతో సహా ఐదు విభాగాల్లో రెండు చొప్పున ఉత్తమ థీసిస్‌లకు సైటేషన్ అవార్డులు ప్రదానం చేస్తారు. దీనిపై అభిప్రాయ సేకరణ కోసం యూజీసీ సోమవారం మార్గదర్శకాలను విడుదల చేసింది.ఏటా సెప్టెంబర్ 5న ప్రదానంప్రతి సంవత్సరం జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు కాన్వకేషన్ ద్వారా పీహెచ్‌డీలు పొందిన రీసెర్చ్ స్కాలర్లు తదుపరి ఏడాదిలో ‘సైటేషన్’ అవార్డుకు అర్హులుగా పేర్కొంది. రాష్ట్ర, కేంద్ర, ప్రైవేటు, డీమ్డ్ వర్సిటీల నుంచి పీహెచ్‌డీలు పొందిన వారు వర్సిటీల ద్వారా నామినేట్ అవ్వొచ్చు. ఇందుకోసం ప్రతి విశ్వవిద్యాలయంలో స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది. ఈ కమిటీ విశ్వవిద్యాలయం నుంచి ఏటా ఐదు థీసిస్‌లను నామినేట్ చేస్తుంది. ఏటా జనవరి నుంచి మార్చి 31 వరకు ఆన్లైన్ పోర్టల్ ద్వారా వర్సిటీల నుంచి నామినేషన్లు యూజీసీ స్వీకరిస్తుంది. ఆగస్టు 1న విజేతలను ప్రకటిస్తారు. సెప్టెంబర్ 5న ఉపాధ్యాయుల దినోత్సవం రోజు ‘పీహెచ్డీ ఎక్సలెన్స్ సైటేషన్’తో విజేతలను యూజీసీ సత్కరిస్తుంది.యూజీసీ అధ్యయనం ప్రకారం దేశంలో పీహెచ్‌డీలో ప్రవేశాలు భారీగా పెరుగుతున్నాయి. 2010–11లో దేశవ్యాప్తంగా 77,798 పీహెచ్డీ ప్రవేశాలు నమోదవగా, 2017–18లో ఈ సంఖ్య 1,61,412కు పెరిగింది. ఏటా సగటున 10 శాతం వృద్ధి రేటు నమోదవుతోంది.కొత్త ఆవిష్కరణలు అవసరంకొత్త ఆవిష్కరణలు దేశ అభివృద్ధికి చాలా అవసరం. ఉన్నత విద్యా సంస్థలు కొత్త విజ్ఞానాన్ని సమాజానికి అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇది డాక్టోరల్ డిగ్రీల నాణ్యతపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. భారతీయ విశ్వవిద్యాలయాలలో మంచి నాణ్యమైన పరిశోధనలను ప్రోత్సహించే ప్రయత్నంలో యూజీసీ ఏటా ‘పీహెచ్డీ ఎక్సలెన్స్ సైటేషన్’ను ప్రదానం చేయాలని నిర్ణయించింది. ప్రజాభిప్రాయం కోసం మార్గదర్శకాలను విడుదల చేశాం. – మామిడాల జగదీశ్ కుమార్, యూజీసీ చైర్మన్ -
ప్రతిష్టాత్మక అవార్డుల రేసులో భారత హాకీ స్టార్లు
భారత దిగ్గజం, మాజీ గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేశ్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) స్టార్స్ అవార్డుల రేసులో నిలిచారు. ఎఫ్ఐహెచ్ విడుదల చేసిన తుది జాబితాలో భారత పురుషుల జట్టు నుంచి వీరిద్దరిరు మాత్రమే నామినేట్ అయ్యారు. ఇక మహిళల జట్టులో ఏ ఒక్కరు రేసులో నిలువలేకపోయారు. ఎవరు ఏ కేటగిరీలో అంటే?కాగా.. ఇటీవల ప్యారిస్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో భారత జట్టు కాంస్యం గెలవడంలో కెప్టెన్ హర్మన్‌తో పాటు గోల్‌కీపర్ శ్రీజేశ్లు కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ కేటగిరీలో హర్మన్‌ప్రీత్‌తో పాటు బ్రింక్‌మన్, జోప్ డి మోల్ (నెదర్లాండ్స్), ముల్లర్ (జర్మనీ), వాలెస్ (ఇంగ్లండ్) నామినేట్య్యాడు.ఇక.. ‘బెస్ట్ గోల్‌కీపర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు కోసం పీఆర్ శ్రీజేశ్, పిర్మన్ బ్లాక్ (నెదర్లాండ్స్), కాల్జడో (స్పెయిన్), డేన్బర్గ్ (జర్మనీ), శాంటియగో (అర్జెంటీనా) పోటీపడుతున్నారు. ఎఫ్ఐహెచ్ నియమించిన నిపుణుల ప్యానెల్ వీరిని తుది జాబితాకు ఎంపిక చేసింది. ఈ ప్యానెల్లో పలువురు ప్లేయర్లు, కోచ్‌లు, వివిధ దేశాలకు చెందిన సమాఖ్యల్లోని సీనియర్ అధికారులు సభ్యులుగా ఉన్నారు. విజేతల్ని ఎంపిక చేస్తారిలా!ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఎఫ్ఐహెచ్ హాకీ ప్రొ లీగ్, నేషన్స్ కప్ హాకీ, ఒలింపిక్ క్వాలిఫయర్స్, ఒలింపిక్స్‌లలో కనబరిచిన ప్రదర్శన ఆధారంగా నిపుణుల ప్యానెల్... ఆటగాళ్లను అవార్డుల కోసం నామినేట్ చేసింది. ఇక వచ్చే నెల 11 వరకు జరిగే ఓటింగ్‌లో పోల్ అయిన ఓట్ల శాతంతో విజేతల్ని ప్రకటిస్తారు. కాగా ప్యారిస్‌లో భారత్ కాంస్యం గెలిచిన తర్వాత శ్రీజేశ్ తన అంతర్జాతీయ కెరీర్‌కు ఘనంగా వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. హర్మన్‌ప్రీత్ తాజాగా ఆసియా చాంపియన్స్‌లో భారత్‌కు టైటిల్ అందించిన జోష్‌లో ఉన్నాడు.చదవండి: అజేయంగా ‘ఆసియా’ విజేతగా -
Filmfare Awards South 2024: ఫిలిం ఫేర్ అవార్డుల ఈవెంట్లో తళుక్కుమన్న సెలబ్రిటీలు (ఫోటోలు)
-
ఒకవైపు యాక్టింగ్.. మరోవైపు హోస్టింగ్.. గ్లోబల్ స్థాయికి రానా క్రేజ్!
రానా.. సీనీ ప్రియులకు ఈ పేరు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా.. ఆ తర్వాత తనదైన నటనతో భారతీయ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరో, విలన్ అనేకాదు పాత్ర ఏదైనా అందులో పరకాయ ప్రవేశం చేస్తాడు. కథల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తాడు. కథలో కొత్తదనం ఉంటేనే అంగీకరిస్తాడు. అందుకే నేటితరం నటుల్లో రానాకి ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ఆయన సినిమాల్లో కొన్ని బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా.. విమర్శకుల ప్రశంసలతో పాటు పలు అవార్డులను సైతం గెలుచుకున్నాయి.ఈ మధ్యకాలంలో అత్యధిక అవార్డులు అందుకున్న హీరో రానా అని చెప్పొచ్చు. ఆయన నటించి తొలి వెబ్ సిరీస్ ‘రానానాయుడు’కి ఇప్పటికే పలు అవార్డులు వచ్చాయి. తాజాగా ఇందులో నటనకు గాను ఉత్తమ నటుడిగా రానా అవార్డును పొందారు. ‘స్ట్రీమింగ్ అకాడమీ అవార్డు’లో ఆయన ఈ పురస్కారాన్ని సొంతం చేసుకున్నాడు. ‘ఇండియన్ టెలీ అవార్డు 2024’లోనూ రానాకి ఉత్తమ నటుడు(రానా నాయుడు) అవార్డు లభించింది. అలాగే 68వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లోనూ ఉత్తమ సహాయక నటుడు(భీమ్లానాయక్) అవార్డు రానాను వరించింది.హోస్ట్‌గానూ..రానా కేవలం వెండితెరకు మాత్రమే పరిమితం కాలేదు.అప్పడప్పుడు బుల్లితెరపై కూడా మెరుస్తుంటాడు. ఆయన హోస్ట్‌గాను పలు టీవీ, ఓటీటీ షోలు చేశాడు. అలాగే పలు ఈవెంట్లకు వ్యాఖ్యాతగా వ్యవహరించి..తనదైన మాటలతో రక్తి కట్టించాడు. ఇక ఇప్పుడు అతిపెద్ద సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ' ఐఫా అవార్డ్స్2024'కి రానా హోస్ట్‌గా చేయబోతున్నాడు. యూ ఏ ఈ అబుదాభి లోని యస్ ద్వీపం వేదికగా సెప్టెంబర్ 6, 7 తేదీల్లో జరిగే ‘ఐఫా అవార్డ్స్2024'ప్రధానోత్సవక కార్యక్రమానికి యంగ్ హీరో తేజ సజ్జతో కలిసి రానా హోస్ట్‌గా చేయబోతున్నాడు. అలాగే ఓ టాక్ షో కూడా ప్లాన్ చేశాడు. తన స్నేహితులు, సినీ ప్రముఖులతో కలిసి రానా టాక్ షో చేయబోతున్నాడు. ఇది ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది.నిర్మాతగానూ..ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు నిర్మాతగాను రాణిస్తున్నాడు రానా. తనకు నచ్చిన సినిమాలను నిర్మించడంతో పాటు కొన్నింటికి సమర్పకుడిగా వ్యవహరిస్తుంటాడు. కేరాఫ్ కంచరపాలెం, గార్గి, చార్లీ 777, పరేషాన్, కృష్ణ అండ్ హీస్ లీల లాంటి చిన్న సినిమాలను తన బ్యానర్ ద్వారా రిలీజ్ చేసి పెద్ద విజయం అందించాడు. ఆయన నిర్మించిన ‘35-చిన్న కథ కాదు’ సినిమా ఆగస్ట్ 15న విడుదల కానుంది. -
సైమా అవార్డ్స్ 2024.
-
రిలీజ్‌కు ముందే అవార్డుల పంట.. ఆ సినిమా అరుదైన ఘనత!
కని కస్రుతి, ప్రీతి పాణిగ్రాహి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'గర్ల్స్ విల్ బి గర్ల్స్'. ఈ చిత్రానికి సుచి తలాటి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ చిత్రానికి అరుదైన ఘనత దక్కింది. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ లాస్ ఏంజిల్స్ (IFFLA)లో గ్రాండ్ జ్యూరీ బహుమతిని గెలుచుకుంది. రిచా, చద్దా అలీల నిర్మిస్తోన్న ఈ చిత్రం ఇప్పటికే పలు ప్రశంసలు అందుకుంది.ఈ సినిమా ఇప్పటికే రొమేనియాలోని ట్రాన్సిల్వేనియా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, ఫ్రాన్స్‌లోని బియారిట్జ్ ఫిల్మ్ ఫెస్టివల్లో గ్రాండ్ జ్యూరీ ప్రైజ్‌లను గెలుచుకుంది. అంతే కాకుండా సన్డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో రెండు ప్రధాన అవార్డులను కూడా గెలుచుకుంది. తమ చిత్రం పెద్ద విజయం సాధించడం పట్ల రిచా చద్దా ఆనందం వ్యక్తం చేశారు.రిచా మాట్లాడుతూ.. " మా చిత్రం గ్రాండ్ జ్యూరీ ప్రైజ్ గెలవడం ఒక అపురూపమైన గౌరవం. మా టీమ్ మొత్తం కృషి, అంకితభావాన్ని గుర్తించడం చాలా సంతోషంగా ఉంది. 'గర్ల్స్ విల్ బి గర్ల్స్' అనేది మన హృదయాలకు దగ్గరైన కథ. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది" అని అన్నారు. -
ఘనంగా ‘కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్’ కార్యక్రమం (ఫోటోలు)
-
ఐపీఎల్ 2024 అవార్డు విన్నర్లు వీరే..!
ఐపీఎల్ 2024 సీజన్ నిన్నటితో (మే 26) ముగిసింది. ఫైనల్లో కేకేఆర్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి విజేతగా ఆవిర్భవించింది. ఐపీఎల్లో కేకేఆర్‌కు ఇది మూడో టైటిల్. శ్రేయస్ అయ్యర్ కేకేఆర్‌కు పదేళ్ల నిరీక్షణ అనంతరం మరో టైటిల్‌ను అందించాడు.కేకేఆర్ పేసర్ స్టార్క్ ఫైనల్లో అద్భుతమైన గణంకాలతో సత్తా చాటి కేకేఆర్ గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు. సీజన్ ఆధ్యాంతం అద్భుతంగా రాణించిన సునీల్ నరైన్ మూడోసారి మోస్ట్ వ్యాల్యుబుల్ ప్లేయర్ అవార్డును గెలుచుకున్నాడు. అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా విరాట్.. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా హర్షల్ ఆరెంజ్, పర్పుల్ క్యాప్‌లను అందుకున్నారు. మరికొందరు ఆటగాళ్లు వివిధ విభాగాల్లో అవార్డులు గెలుచుకున్నారు. ఐపీఎల్ 2024 ఛాంపియన్స్- కేకేఆర్రన్నరప్- సన్‌రైజర్స్ హైదరాబాద్ఆరెంజ్ క్యాప్ (అత్యధిక పరుగులు)- విరాట్ కోహ్లి (ఆర్సీబీ, 15 మ్యాచ్‌ల్లో 741 పరుగులు)పర్పుల్ క్యాప్ (అత్యధిక వికెట్లు)- హర్షల్ పటేల్ (పంజాబ్, 14 మ్యాచ్‌ల్లో 24 వికెట్లు)మోస్ట్ వ్యాల్యుబుల్ ప్లేయర్- సునీల్ నరైన్ (కేకేఆర్, 14 మ్యాచ్‌ల్లో 488 పరుగులు, 17 వికెట్లు)ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్- నితీశ్ కుమార్ రెడ్డి (సన్‌రైజర్స్ హైదరాబాద్)ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్- మిచెల్ స్టార్క్ (కేకేఆర్, 3-0-14-2)ఎలెక్ట్రిక్ స్ట్రయికర్ ఆఫ్ ద సీజన్- జేక్ ఫ్రేసర్ మెక్‌గుర్క్ (ఢిల్లీ)గేమ్ ఛేంజర్ ఆఫ్ ద సీజన్- సునీల్ నరైన్ (కేకేఆర్)పర్ఫెక్ట్ క్యాచ్ ఆఫ్ ద సీజన్- రమణ్‌దీప్ సింగ్ (కేకేఆర్)ఫెయిర్ ప్లే అవార్డు- సన్‌రైజర్స్ హైదరాబాద్విన్నర్ ప్రైజ్‌మనీ- రూ. 20 కోట్లు (కేకేఆర్)రన్నరప్ ప్రైజ్‌మనీ- రూ. 12.5 కోట్లు (సన్‌రైజర్స్) -
NASA భారత విద్యార్థులకు నాసా అవార్డులు
అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ నిర్వహించిన హ్యూమన్ ఎక్స్ ప్లోరేషన్ రోవర్ చాలెంజ్‌లో మన విద్యార్థులు సత్తా చాటారు.న్యూఢిల్లీ ముంబైకి చెందిన భారతీయ విద్యార్థుల బృందాలు నాసా అవార్డులను గెలుచుకున్నాయి.అలబామా రాష్ర్టంలోని హంట్స్ విల్లేలో ఉన్న అమెరికా అంతరిక్ష రాకెట్ కేంద్రంలో ఈ నెల 19, 20 తేదీల్లో ఈ పోటీలు జరిగాయి. ఢిల్లీకి చెందిన కేఐఈటీ గ్రూప్ విద్యాసంస్థకు చెందిన స్టూడెంట్స్ క్రాష్ అండ్ బర్న్ విభాగంలో అవార్డును గెలుచుకున్నట్లు నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (NASA) సోమవారం ప్రకటించింది. అలాగే ముంబైకి చెందిన ద కనాకియా ఇంటర్నేషనల్ స్కూల్ కు చెందిన విద్యార్థులు రూకీ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలుచుకున్నారు. కాగా ఈ పోటీలో అమెరికాలోని డాలస్‌కు చెందిన పారిష్ ఎపిస్కోపల్ స్కూల్ హైస్కూల్ విభాగంలో తొలి బహుమతి సాధించింది. అలాగే కాలేజీ, యూనివర్సిటీ విభాగంలో హంట్స్ విల్లేకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ అలబామా ప్రథమ బహుమతిని గెల్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా 600 మందికిపైగా విద్యార్థులతో కూడిన 72 టీమ్స్ ఈ వార్షిక పోటీలో పాల్గొన్నాయి. అమెరికాలోని 24 రాష్ట్రాలతోపాటు డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా, ప్యూర్టోరికో, భారత్ సహా మరో 13 దేశాల నుంచి 42 కాలేజీలు, యూనివర్సిటీలు, 30 హైస్కూళ్ల విద్యార్థులు ఈ పోటీలో తన ప్రతిభను చాటారు. -
హాయ్ నాన్నకు అవార్డుల పంట.. ఏకంగా 11 విభాగాల్లో!
నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం హాయ్ నాన్న. గతేడాది రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. తండ్రీ, కూతుళ్ల సెంటిమెంట్‌తో శౌర్యవ్ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. తాజాగా ఈ చిత్రం అంతర్జాతీయ వేదికపై మెరిసింది. న్యూయార్క్‌లో జరిగిన ది ఒనిరోస్ ఫిల్మ్ అవార్డుల్లో సత్తా చాటింది. పలు విభాగాల్లో మొత్తం 11 అవార్డులను కైవసం చేసుకుంది. ఒనిరోస్ ఫిల్మ్ ప్రకటించిన విభాగాల్లో ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ జంట, ఉత్తమ బాలనటి, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్‌ప్లే, ఉత్తమ తొలి దర్శకుడు, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ సౌండ్ ట్రాక్, ఉత్తమ ఎడిటింగ్‌ల్లో 11 అవార్డులు గెలుచుకుంది. కాగా.. ఈ చిత్రాన్ని హాయ్ డాడీ పేరుతో ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాకు అవార్డ్స్ దక్కడం పట్ల డైరెక్టర్ ఆనందం వ్యక్తం చేశారు. -
Bharat Ratna : భారతరత్న అవార్డులు ప్రదానం చేసిన రాష్ట్రపతి (ఫొటోలు)
-
గ్రాజియా యంగ్ ఫ్యాషన్ వీక్ అవార్డ్స్ 2024: సీతాకోక చిలుకల్లా మెరిసిన భామలు
గ్రాజియా ఇండియా 2024 వేడుక అట్టహాసంగా జరిగింది. గ్రాజియా యంగ్ ఫ్యాషన్ అవార్డ్స్ 2024లో బాలీవుడ్ తారలు మెరిసారు. పలువురు తారలు వివిధ కేటగిరీల్లో అవార్డులను సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా శ్రద్ధాకపూర్, కరిష్మా కపూర్, శోభితా ధూళిపాళ, సినీ శెట్టి అవార్డులను గెల్చుకోగా, మౌనీ రాయ్, మృణాల్ ఠాకూర్, బాబీ డియోల్, కరణ్ జోహార్ లాంటి స్టార్లు ఈ వేదికమీద స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. అనేకమంది ఇండస్ట్రీ ప్రముఖులు సూపర్ ఫ్యాషన్ డిజైనర్లు, మోడల్స్ ఈ ఈవెంట్లో సందడి చేశారు. గ్రాజియా యంగ్ ఫ్యాషన్ అవార్డ్స్ 2024లో 14 ఎడిషన్‌లో యువ డిజైనర్లు, ఫ్యాషన్ బ్రాండ్లు సృజనాత్మకతతో ఆసక్తికరంగా నిలిచాయి. అజియో గ్రాజియా యంగ్ ఫ్యాషన్ అవార్డ్స్ 2024 కొంతమంది విన్నర్లు ♦ కరిష్మా కపూర్ ఫరెవర్ ఇన్ ఫ్యాషన్ కేటగిరీ అవార్డు ♦ శ్రద్ధా కపూర్ ఫ్యాన్ ఫేవరెట్ కేటగిరీకి సంబంధించి అవార్డు ♦ శోభితా ధూళిపాళ ఫ్యాషన్ ట్రైల్బ్లేజర్ విభాగంలో అవార్డు ♦ బ్రేక్‌త్రూ స్టైల్ విభాగంలో సినీ శెట్టి అవార్డు ♦ పీపుల్స్ ఛాయిస్ (ఫిమేల్ ): దిశా పటాని ♦ పీపుల్స్ ఛాయిస్ (మేల్): బాబీ డియోల్ ♦ Gen Z స్టైల్ స్టార్: అనన్య పాండే ♦ స్టైల్ : కరణ్ జోహార్ ♦ ఫ్యాషన్ NXT: సిద్ధాంత్ చతుర్వేది ♦ బెస్ట్ డ్రెస్ తానియా ష్రాఫ్ -
సొంత గోల్ఫ్ క్లబ్లో అవార్డులు...
వాషింగ్టన్: సొంత గోల్ప్ క్లబ్లో అవార్డులు సాధించానన్న డొనాల్డ్ ట్రంప్ ప్రకటనపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ సరదాగా స్పందించారు. ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌లో ట్రంప్‌కు సొంత ‘ట్రంప్ ఇంటర్నేషనల్ గోల్ఫ్ క్లబ్’ ఉంది. అందులో తాజాగా అవార్డుల గోల్ఫ్ ప్రదానం జరిగింది. తనకు ‘ది క్లబ్ చాంపియన్‌షిప్ ట్రోఫీ’, ‘ది సీనియర్ క్లబ్ మెంబర్షిప్ ట్రోఫీ’లు వచ్చాయంటూ సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో ట్రంప్ పోస్ట్ చేశారు. దీనిపై బెడెన్ వ్యంగ్యంగా స్పందించారు. ‘‘అబ్బో! ఎంతటి ఘనతో! అభినందనలు’’ అంటూ ‘ఎక్స్’లో ఆయన పెట్టిన పోస్ట్‌కు ఏకంగా 1.3 కోట్ల వ్యూస్ వచ్చాయి. ‘‘మీ అజమాయిïÙలో లేని ఏదైనా గోల్ప్ క్లబ్లో ట్రోఫీ గెల్చుకొస్తే చెప్పవయ్యా ట్రంపూ’’ అంటూ మాజీ స్పోర్ట్స్ కాలమిస్ట్ రిక్ రేలీ కూడా చురకలు వేశారు. ట్రంప్‌కు ఇలాంటివి కొత్త కాదు. తనకు పలు అవార్డులు వచ్చాయని, పలు సంస్థలు ప్రతిష్టాత్మక పురస్కారాలు ప్రదానం చేశాయని గతంలోనూ పలుమార్లు చెప్పుకున్నారు. -
ఐదుగురు పోలీసులకు ముఖ్యమంత్రి శౌర్య పతకాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఐదుగురు పోలీసు అధికారులకు ప్రభుత్వం ముఖ్యమంత్రి శౌర్య పతకాలను ప్రకటించింది. దాంతోపాటు ఉగాది పండుగను పురస్కరించుకుని రాష్ట్రంలోని పోలీస్, విపత్తుల స్పందన దళం విభాగాల అధికారులు, సిబ్బందికి 255 వివిధ సేవా పతకాలను ప్రకటిస్తూ ప్రభుత్వం ఈ నెల 15న ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి శౌర్య పతకాలు: కె.వాసు (సీఐ, మేడికొండూరు, గుంటూరు జిల్లా), బి.మధుసూదనరావు (ఎస్ఐ, ఎస్ఐబీ, ఇంటెలిజెన్స్ బ్యూరో), కె. వెంకట రమణ(రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఎస్ఐబీ, ఇంటెలిజెన్స్ బ్యూరో), కె.సంపత్ రావు (ఆర్ఎస్ఐ, ఎస్ఐబీ, ఇంటెలిజెన్స్ బ్యూరో), బి.త్రిమూర్తులు (కానిస్టేబుల్, ఎస్ఐబీ, ఇంటెలిజెన్స్ బ్యూరో), బి.భాస్కర రావు (కానిస్టేబుల్, ఎస్ఐబీ, ఇంటెలిజెన్స్ బ్యూరో). పోలీసు శాఖలో: ఉత్తమ సేవా పతకాలు 35మందికి, కఠిన సేవా పతకాలు 30మందికి, సేవా పతకాలు 161మందికి విపత్తుల స్పందన విభాగంలో: ఉత్తమ సేవా పతకాలు నలుగురికి, సేవా పతకాలు 25మందికి. -
వరంగల్ వాసి అనిల్‌కు అమెరికాలో ప్రతిష్టాత్మక అవార్డు
తెలంగాణకు చెందిన వరంగల్వాసికి అమెరికాలో ప్రతిష్ఠాత్మక అవార్డు లభించింది. యూఎస్‌లోని వర్జీనియాలో ఉంటున్న బోయినపల్లి అనిల్ ఇండియన్ అమెరికన్ విభాగంలో 2024 స్మాల్ బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యారు. యూఎస్ స్మాల్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎస్బీఏ) నేషనల్ స్మాల్ బిజినెస్ వీక్ (ఎన్ఎస్బీడబ్ల్యూ) అవార్డు-2024 గ్రహీతలను ఇటీవల ప్రకటించింది. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి పాటుపడిన ప్రముఖ వ్యాపారవేత్తలకు ఈ స్మాల్ బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఇస్తారు. ఇందులో భాగంగా ‘స్కై సొల్యూషన్స్’ సంస్థ సహ వ్యవస్థాపకుడు, సీఈవోగా ఉన్న అనిల్ వర్జీనియా రాష్ట్రం నుంచి ఈ అవార్డు గెలుచుకున్నారు. వర్జీనియాకు చెందిన హెర్న్‌డాన్ కంపెనీతో కలిసి 2008లో స్కై సొల్యూషన్స్ సంస్థను ఆయన ఏర్పాటుచేశారు. ఇది వ్యాపార సంబంధమైన అంశాల్లో సాంకేతిక పరిష్కారాలను అందిస్తోంది. వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ నుంచి అనిల్ కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. అనిల్ కొంతకాలం సీఎన్ఎస్ఐ సంస్థలో ఆర్కిటెక్ట్‌గా హెల్త్‌కేర్ పరిశ్రమలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ విధులు నిర్వర్తించారు. ఫెన్నీ మే, హారిస్ కార్పొరేషన్లో కూడా ఆయన పనిచేశారు. ఇదీ చదవండి: ఎన్నికల నేపథ్యంలో వస్తువులకు అసాధారణ గిరాకీ.. ప్రభుత్వం కీలక నిర్ణయం ఎన్ఎస్బీడబ్ల్యూ అవార్డుల ప్రదానోత్సవం ఏప్రిల్ 28, 29 తేదీల్లో వాషింగ్టన్ డీసీలోని వాల్డోర్స్ ఆస్టోరియా హోటల్లో జరగనుంది. ఎస్బీఏ అడ్మినిస్ట్రేటర్, అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ క్యాబినెట్లో సభ్యుడైన ఇసాబెల్ కాసిల్లాస్ గుల్మాన్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని అవార్డులను అందించనున్నారు. తనకు దక్కిన ఈ అవార్డుకు సంబంధించి అనిల్ స్పందిస్తూ భారత్‌లోని ఓ మారుమూల గ్రామం నుంచి వచ్చిన తనకు ఈ అవార్డు లభించడం ఆనందంగా ఉందన్నారు. అమెరికా వంటి దేశంలో ఇలాంటి ఘనత సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈక్యామ్స్, ఈ-ఎంఐపీపీ, ఈ-ఎఫ్ఆర్ఎం, బ్లూబటన్ వంటి సాఫ్ట్వేర్ ఉత్పత్తులకు అనిల్ ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు తెలిసింది. -
రీల్ అవార్డ్స్ 2024లో మెరిసిన బాలీపుడ్ భామలు (ఫొటోలు)
-
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రసంగంలో తప్పేముంది?
సాక్షి, అమరావతి : పల్నాడు జిల్లాలో ఇటీవల నిర్వహించిన గ్రామ, వార్డు వలంటీర్ల అవార్డుల ప్రదానం కార్యక్రమంలో ప్రతిపక్ష నేతను విమర్శిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ప్రసంగాన్ని చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టేసింది. ముఖ్యమంత్రి ప్రసంగాన్ని చట్ట విరుద్ధంగా ప్రకటించడం ఏమిటంటూ హైకోర్టు ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి తన ప్రసంగంలో గత ప్రభుత్వంలో ఏర్పాటైన జన్మభూమి కమిటీలను, ప్రస్తుతం తీసుకొచ్చిన వలంటీర్ వ్యవస్థను పోల్చారని, దీనిని తామెలా తప్పుపట్టగలమని ప్రశ్నించింది. అలా పోలిక తేవడానికి వీల్లేదంటారా అంటూ నిలదీసింది. సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడం ద్వారా ప్రజలకు వలంటీర్లు మంచి పని చేయడంలేదా? మంచి చేసిన వాళ్లను సన్మానించకూడదా అని పిటిషనర్‌ను ప్రశ్నించింది. ఈ కార్యక్రమానికి ఖర్చు చేసిన మొత్తాన్ని ముఖ్యమంత్రి నుంచి వసూలు చేయాలని ఎలా కోరతారు అంటూ ప్రశ్నించింది. వలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనాలా? వద్దా? అన్నది నిర్ణయించాల్సింది కేంద్ర ఎన్నికల సంఘమే తప్ప, తాము కాదని హైకోర్టు తేల్చి చెప్పింది. అందులో జోక్యం చేసుకోలేమంది. వలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిందని సీఈసీ తరఫు సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ హైకోర్టుకు వివరించారు. పోలింగ్ ఏజెంట్లుగా కూడా వ్యవహరించడానికి వీల్లేదని చెప్పామని, ఈ విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశామని తెలిపారు. వలంటీర్ల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన నిర్ణయం తీసుకున్నందున, ఈ వ్యాజ్యంలో విచారించేందుకు ఏమీ లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. పిల్‌ను కొట్టేసింది. ఈ మేరకు ప్ర«దాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వలంటీర్లను ఎన్నికలకు దూరంగా ఉంచాలంటూ పిల్ ఎన్నికల్లో వలంటీర్లకు ఎలాంటి విధులు అప్పగించకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ప్రకాశం జిల్లా అన్నంభొట్లవారి పాళెం గ్రామానికి చెందిన చెన్నుపాటి సింగయ్య హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ కేంద్రాల్లోకి వలంటీర్లు వెళ్లకుండా ఆదేశాలివ్వాలని ఆయన కోర్టును కోరారు. పల్నాడు జిల్లాలో జరిగిన గ్రామ, వార్డు వలంటీర్ల అవార్డుల ప్రదానం కార్యక్రమంలో ప్రతిపక్ష నేతను విమర్శిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ప్రసంగాన్ని చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కూడా సింగయ్య కోర్టును అభ్యర్థించారు. ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది అంబటి సుధాకర్‌రావు వాదనలు వినిపిస్తూ.. వలంటీర్ల సన్మాన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ ప్రభుత్వ విజయం కోసం వలంటీర్లు కృషి చేయాలని, ప్రతిపక్షంపై యుద్ధం చేయాలని పిలుపునిచ్చారన్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందేలా వలంటీర్లను ప్రభావితం చేస్తున్నారని తెలిపారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, ముఖ్యమంత్రి ప్రసంగంలో జన్మభూమి కమిటీల ప్రస్తావన వచ్చిందని, ఆ కమిటీలు ఏమిటని ప్రశ్నించింది. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలని సుధాకర్‌రావు చెప్పారు. అలా అయితే ముఖ్యమంత్రి ప్రసంగంలో తప్పేముందని ధర్మాసనం ప్రశ్నించింది. గత ప్రభుత్వం తీసుకొచి్చన జన్మభూమి కమిటీలు, ప్రస్తుతం ఉన్న వలంటీర్ల వ్యవస్థను పోల్చుతూ మాట్లాడారని, దానిని చట్ట విరుద్ధంగా ప్రకటించమంటే ఎలా అంటూ నిలదీసింది. సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడం ద్వారా ప్రజలకు వలంటీర్లు మంచి పని చేయడంలేదా అని ప్రశ్నించింది. మంచి చేస్తున్నారని, అయితే ముఖ్యమంత్రి చెప్పిన విధంగా వలంటీర్లు పని చేస్తే ఎన్నికలు నిష్పాక్షికంగా జరగవని సుధాకర్‌రావు తెలిపారు. అందుకే వలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని కోరుతున్నామన్నారు. అది కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలోనిదని ధర్మాసనం తేల్చి చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ స్పందిస్తూ.. వలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనడానికి వీల్లేదని కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిందని వివరించారు. ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చినప్పుడు పిటిషనర్‌కు ఇంకా కావాల్సింది ఏముందని ధర్మాసనం ప్రశ్నించింది. ఓటర్లు చాలాతెలివి గల వాళ్లు ఈ సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం న్యాయవాది అవినాష్ దేశాయ్ జోక్యం చేసుకుంటూ.. వలంటీర్లను ఎన్నికలకు దూరంగా ఉండాలంటూ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు మాత్రమే ఎన్నికల విధుల్లో పాల్గొంటారని, వలంటీర్లకు, ఈ ఉద్యోగులకు ఏమాత్రం సంబంధం లేదని చెప్పారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ఈ వ్యాజ్యంలో తదుపరి విచారించేందుకు ఏమీ లేదని స్పష్టం చేసింది. ఈ సమయంలో సుధాకర్‌రావు ఏదో చెప్పబోగా.. ధర్మాసనం ఆయన్ని వారించింది. ఓటర్లు చాలా తెలివి గల వారని, వారి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఓటర్లు ఎంత తెలివి గల వాళ్లో న్యాయవ్యవస్థలో ఉన్న మనందరికీ బాగా తెలుసునంటూ న్యాయవాద సంఘాల ఎన్నికల గురించి ధర్మాసనం ప్రస్తావించింది. న్యాయవాద సంఘాల ఎన్నికలప్పుడు ఓటర్లు ఓ వర్గం ఇచ్చే విందులో పాల్గొని, మరో వర్గానికి ఓటు వేస్తుంటారని నవ్వుతూ వ్యాఖ్యానించింది. ఓటర్ల గురంచి చింతించాల్సిన అవసరం లేదంది. పిల్‌ను కొట్టేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
PM Modi: తొలిసారి నేషనల్ క్రియేటర్స్ అవార్డుల అందజేత
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారి జాతీయ క్రియేటర్స్ అవార్డులను శుక్రవారం అందజేశారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈ కార్యక్రమం జరిగింది. మొత్తం 20 విభాగాల్లో అవార్డులను అందజేశారు. కాగా సృజనాత్మక వీడియోలు, కథనాలతో సమాజంలో మార్పు కోసం కృషి చేస్తున్న కంటెంట్ క్రియేటర్స్‌ను ప్రోత్సహించేందుకు అవార్డులను కేంద్రం నూతనంగా ప్రవేశపెట్టింది. వీటిలో స్టోరీ టెల్లింగ్, సెలబ్రిటీ, సామాజిక మార్పు, వ్యవసాయం, సాంస్కృతిక, ట్రావెల్, పర్యావరణ పరిరక్షణ, విద్య, ఆహారం,క్రియేటివిటీ, న్యూ ఇండియా చాంపియన్,టెక్, గేమింగ్, హెరిటేజ్ ఫ్యాషన్ వంటి వివిధ రంగాల్లో ఉత్తమ కంటెంట్ అందించిన క్రియేటర్స్‌ను గుర్తించి వారికి కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డులను అందిస్తోంది. స్టోరీ టెల్లింగ్, సామాజిక మార్పు, పర్యావరణ పరిరక్షణ, విద్య, గేమింగ్‌తో సహా వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన వారిని గుర్తించి, ప్రోత్సహించడమే ఈ అవార్డుల ముఖ్య ఉద్దేశమని ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ అవార్డుల కోసం 20 విభాగాల్లో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 1.5 లక్షల నామినేషన్స్ వచ్చాయి. వారికి మద్దతుగా పది లక్షల మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. అందులోంచి 23 మందిని విజేతలుగా ఎంపిక చేశారు. వీరిలో ముగ్గురు అంతర్జాతీయ క్రియేటర్స్ ఉన్నారు. మోస్ట్ క్రియేటివ్ క్రియేటర్ అవార్డును మహిళల విభాగంలో శ్రద్ధ, పురుషుల విభాగంలో ఆర్జే రౌనాక్ అందుకున్నారు. -
సంగీత, నాటక అకాడమీ అవార్డుల ప్రదానం
సాక్షి, న్యూఢిల్లీ/విశాఖపట్నం: సంగీత, నృత్య, నాటక రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన పలువురికి సంగీత నాటక అకాడమీ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. బుధవారం విజ్ఞాన్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో 2022, 2023 సంవత్సరాలకు గానూ విజేతలకు రాష్ట్రపతి పురస్కారాలు బహూకరించారు. ప్రముఖ కూచిపూడి నృత్యకారులు రాజా–రాధారెడ్డి 2022–23 గాను సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ అందుకున్నారు. వీరితోపాటు.. ఆంధ్రప్రదేశ్‌లోని గూడూరుకు చెందిన వినుకొండ సుబ్రహ్మణ్యం 2022 సంవత్సరానికి కర్ణాటక ఇనుస్ట్రుమెంటల్ మ్యూజిక్ (తవిల్) విభాగంలో అవార్డు అందుకున్నారు. కర్నూలుకు చెందిన మద్దాలి ఉషాగాయత్రి కూచిపూడి రంగంలో 2023 సంవత్సరానికి, అవనిగడ్డకు చెందిన ఎల్వీ గంగాధరశాస్త్రి సుగం సంగీత్‌లో 2023 సంవత్సరానికి, కర్ణాటక గాత్ర సంగీతంలో పేరుగాంచిన విశాఖకి చెందిన మండ (ఆలమూరు) సుధారాణి 2022 సంవత్సరానికి పురస్కారాలు అందుకున్నారు. తెలంగాణలోని ఎల్లారెడ్డిపేటకు చెందిన పేరిణి ప్రకాష్ పేరిణియాట్టంలో 2023 సంవత్సరానికి, హైదరాబాద్‌కు చెందిన భాగవతుల సేతురామ్ కూచిపూడి నృత్యంలో 2022 సంవత్సరానికి అవార్డు అందుకున్నారు. -
ఉత్తమ సినిమా, హీరో.. అవార్డులు ప్రకటించిన ప్రభుత్వం
రాష్ట్ర చలనచిత్ర అవార్డులను తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. 2015 చిత్రాలకు గాను ఈ అవార్డులను ఇవ్వనున్నారు. ఉత్తమ నటుడు, నటి, సాంకేతిక విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన చూపిన వారిక తమిళనాడు ప్రభుత్వం 2015 ఫిల్మ్ అవార్డులను మార్చి 6న అందించనుంది. ఇందులో 'తని ఒరువన్' చిత్రానికి గాను అత్యధికంగా అవార్డులను సొంతం చేసుకుంది. జయం రవి, అరవింద్ సామీ, నయనతార ప్రధానంగా నటించిన ఈ సినిమా అప్పట్లో భారీ హిట్‌ను అందుకుంది. ఉత్తమ చిత్రంగా 'తని ఒరువన్' ఎంపిక అయింది. దీంతో పాటుగా పసంగ 2, ప్రభ, పూతిచ్చుచుటు, 36 వయదిలిలే కూడా ఉత్తమ సినిమాలుగా ఎంపికయ్యాయి. తని ఒరువన్ చిత్రాన్ని తెలుగులో 'ధృవ'గా రామ్ చరణ్ రీమేక్ చేసిన విషయం తెలిసిందే.. సూర్య- అమలపాల్ జోడీగా నటించిన పసంగ-2 మూవీ తెలుగులో 'మేము' అనే పేరుతో విడుదలైంది. జ్యోతిక నటించిన 36 వయదిలిలే అనే సినిమా కూడా తెలుగులో '36 వయసు'లో అనే పేరుతో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఉత్తమ నటుడిగా 'ఇరుది సుట్రు' చిత్రానికి గాను నటుడు 'మాధవన్' ఎంపికయ్యారు. ఈ సినిమాను వెంకటేశ్ 'గురు' పేరుతో రీమేక్ చేశారు. 36 వయదిలిలే చిత్రానికి గాను 'జ్యోతిక' ఉత్తమ నటిగా ఎంపికైంది. 'వై రాజా వై' చిత్రానికి గాను గౌతమ్ కార్తీక్‌కు ఉత్తమ నటుడిగా ప్రత్యేక అవార్డు లభించింది. 'ఇరుది చుట్టు' చిత్రానికి గానూ రితికా సింగ్‌కు ఉత్తమ నటిగా ప్రత్యేక అవార్డు లభించింది. ఉత్తమ విలన్‌గా 'తని ఒరువన్'లో నటించిన అరవింద్ సామీకి దక్కగా.. ఉత్తమ కథా రచయితగా 'తని ఒరువన్' చిత్రానికి మోహన్ రాజా ఎంపికయ్యారు. పాపనాశం, ఉత్తమ విలన్ చిత్రాలకు గాను జిబ్రాన్ ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డు గెలుచుకున్నారు. 'తని ఒరువన్' చిత్రానికి గానూ రామ్‌జీ ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డును గెలుచుకున్నారు. తమిళనాడు ప్రభుత్వ ఎం.జి ఆర్. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులకు కూడా పలు అవార్డులను ప్రరభుత్వం అందించనుంది. అవార్డుల ప్రధానోత్సవం మార్చి 6వ తేదీ బుధవారం సాయంత్రం 6 గంటలకు జరగనుంది. ఈ కార్యక్రమం రాజా అన్నామలైపురంలో ఉన్న ముత్తమిలిప్ అసెంబ్లీలో జరుగుతుంది. తమిళనాడు అభివృద్ధి, సమాచార శాఖ మంత్రి ఎం.యు.సామినాథన్ అధ్యక్షతన ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. అవార్డు గ్రహీతలకు బంగారు పతకాలు, చెక్కు, జ్ఞాపికలు, ఉత్తమ చిత్రాల నిర్మాతలకు సర్టిఫికెట్లు అందజేస్తారు. -
బ్రాండన్ హాల్ గోల్డ్ అవార్డ్ విన్నర్స్.. టీఎమ్ఐ, ఐఓసీఎల్
సేవా షూర్ వీర్ లెర్నింగ్ & డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), TMI e2E అకాడమీ 'బ్రాండన్ హాల్ గోల్డ్' అవార్డు గెలుపొందాయి. ఈ ప్రోగ్రామ్ ప్రధాన ఉద్దేశ్యం ఇండియన్ ఆయిల్ రిటైల్ అవుట్లెట్లలో కస్టమర్ సర్వీస్ అండ్ డెలివరీలను మెరుగుపరచడమే. బ్రాండన్ హాల్ గ్రూప్ నుంచి వచ్చిన ఈ అవార్డును లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ స్పేస్‌లో ఆస్కార్ అని పిలుస్తారు. సేవా షూర్వీర్ ప్రోగ్రామ్ IOCL పెట్రోల్ సర్వీస్ స్టేషన్లలో కస్టమర్ సర్వీస్ అనుభవాన్ని మెరుగుపరచడానికి రూపొందించింది. ఇండియన్ ఆయిల్ రిటైల్ అకాడమీకి భాగస్వామిగా సేవా షూర్ వీర్ ప్రాజెక్ట్ కోసం బ్రాండన్ హాల్ ఎక్సలెన్స్ గోల్డ్ అవార్డును గెలుచుకోవడం చాలా గౌరవంగా ఉందని టీఎమ్ఐ గ్రూప్ సీఈఓ బీ. రామకృష్ణన్ వెల్లడిస్తూ.. ఈ ప్రాజెక్ట్‌లో భాగమైన ప్రతి ఒక్కరికీ అభినందనలు వెల్లడించారు. బ్రాండన్ హాల్ అవార్డు పనిలో మా అత్యున్నత స్థాయిని సూచిస్తుందని చైర్మన్ మురళీధరన్ అన్నారు. -
మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024: వీటికే అవార్డ్స్..
ఫిబ్రవరి 26 నుంచి బార్సిలోనాలో ప్రారంభమైన 'మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024' (MWC 2024)లో అనేక కొత్త ఉత్పత్తులు కనిపించాయి. ఇందులో స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్స్ వంటివి ఉన్నాయి. ఎండబ్ల్యుసీ 2024 వేదికపై కొన్ని ఉత్పత్తులు ఆండ్రాయిడ్ అథారిటీ బెస్ట్ ఆఫ్ MWC 2024 అవార్డులు గెలుచుకున్నాయి. ఆండ్రాయిడ్ అథారిటీ బెస్ట్ ఆఫ్ MWC 2024 అవార్డులు గెలుచుకున్న ఉత్పత్తులు షియోమీ 14 అల్ట్రా లెనోవా ట్రాన్స్పరెంట్ ల్యాప్‌టాప్ హానర్ మ్యాజిక్ 6 ప్రో శామ్సంగ్ గెలాక్సీ రింగ్ ZTE నుబియా ప్యాడ్ 3D 2 హానర్ మ్యాజిక్‌బుక్ ప్రో 16 టెక్నో పోలార్ఏస్ అండ్ కెమోన్ 30 ప్రీమియర్ పాయింట్ ఎంసీ02 నథింగ్ ఫోన్ 2ఏ ఒప్పో ఎయిర్ గ్లాస్ 3 వన్‌ప్లస్ వాచ్ 2 మోటోరోలా స్మార్ట్ కనెక్ట్ నుబియా ఫ్లిప్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఎక్స్80 / ఫాస్ట్ కనెక్ట్ 7900 హానర్ ఐ-ట్రాకింగ్ టెక్ -
వలంటీర్ల సేవలకు సత్కారం
-
ఏపీకి ఆరు అవార్డులు.. సీఎం జగన్ హర్షం
సాక్షి, అమరావతి: వన్ డిస్ట్రిక్ట్-వన్ ప్రోడక్ట్(ఓడీఓపీ)లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆరు ప్రతిష్టాత్మక అవార్డులను కైవసం చేసుకుంది. కేంద్రం చేపట్టిన ఓడీఓపీలో ఒక్క ఏపీకే ఆరు అవార్డులు రావటంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అవార్డులు వచ్చేలా కృషి చేసిన అధికారులను సీఎం వైఎస్ జగన్ అభినంధించారు. కాకినాడ జిల్లా ఉప్పాడ జామ్దాని చీరలు, అరకు కాఫీకి బంగారు పతకాలు వచ్చాయి. పొందూరు కాటన్, కోడుమూరు గద్వాల్ చీరలకు కాంస్య పతకాలు లభించాయి. అదేవిధంగా మదనపల్లె పట్టు, మంగళగిరి చేనేత చీరలకు ప్రత్యేక జ్యూరీ అవార్డులు వచ్చాయి. ఇక.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్(ఓడీఓపీ) కార్యక్రమం... ప్రత్యేకించి చేతివృత్తుల వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దీని ద్వారా వివిధ కళారూపాలను బలోపేతం చేస్తోంది. ఈ కార్యక్రమం కళాకారుల జీవనోపాధిని కూడా కాపాడి.. ఉపాధి అవకాశాలను కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. -
'ఇంటింటా ఇన్నోవేటర్' అవార్డుల ప్రదానం
హైదరాబాద్: 'ఇంటింటా ఇన్నోవేటర్ విలేజ్ ఇన్నోవేషన్ అవార్డ్స్ 2024' కార్యక్రమంతో తెలంగాణలోని 20 జిల్లాల్లోని 41 గ్రామాలలో ఇన్నోవేషన్ స్ఫూర్తి ప్రతిధ్వనించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ (టీఎస్ఐసీ) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంతో గ్రామ పంచాయితీల పరిధిలో 44 మంది ఆవిష్కర్తలకు గుర్తింపు దక్కింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామంలో అవార్డుల ప్రదానోత్సవం నేడు జరిగింది. 2023 ఏడాదికి 'ఇంటింటా ఇన్నోవేటర్' కార్యక్రమం కింద టీఎస్ఐసీ ద్వారా స్థానిక ఆవిష్కర్తలకు గ్రామ సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు సన్మానాలు అందించారు. ఈ కార్యక్రమం స్థానికంగా సవాళ్లను గుర్తించి పరిష్కరించడంలో గ్రామస్తులను ప్రోత్సహించడమే కాకుండా యువ తరాలకు స్ఫూర్తినిస్తుంది. 44 మంది ఆవిష్కర్తల్లో గృహిణులు, పాఠశాల పిల్లలు, కళాశాల విద్యార్థులు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారు. వారి వినూత్న సహకారానికి నేడు(జనవరి 26)న అవార్డులు లభించాయి. రాష్ట్రంలో సామాజిక-ఆర్థిక వృద్ధిని పెంపొందించడంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుంది. ఉజ్వల భవిష్యత్తు వైపు తమ సొంత మార్గాన్ని రూపొందించుకోవడానికి సమాజాన్ని చైతన్యపరుస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జనగాం, కామారెడ్డి, కరీంనగర్, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మేడ్చల్, మెదక్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, వనపర్తి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో 'విలేజ్ ఇన్నోవేషన్ అవార్డులు' అందించారు. వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, ఆహార సాంకేతికత, పర్యావరణం, ఆటోమొబైల్స్, ఆక్వాకల్చర్, సాంకేతికత, పారిశుధ్యం వంటి వివిధ రంగాలలో విస్తృతమైన ఆవిష్కరణలను ఈ కార్యక్రమం ప్రోత్సహిస్తోంది. వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించే అద్భుతమైన సాధనాల నుండి నీటి సంరక్షణ కోసం తెలివిగల పరిష్కారాల వరకు, సమస్యలను పరిష్కరించడంలో అట్టడుగు స్థాయి ఆవిష్కరణల సామర్థ్యాన్ని ఈ కార్యక్రమం గుర్తిస్తుంది. "ఇంటింటా ఇన్నోవేటర్ విలేజ్ ఇన్నోవేషన్ అవార్డ్స్ 2024" ద్వారా కేవలం ఆవిష్కర్తల గుర్తింపు మాత్రమే కాదు.. సమాజాన్ని పురోగతి వైపు నడిపించే స్ఫూర్తిని పెంపొందిస్తున్నామని టీఎస్ఐసీ డైరెక్టర్ అజిత్ రంగ్నేకర్ అన్నారు. ప్రతి గ్రామం సృజనాత్మకతతో అభివృద్ధి చెందుతున్న కేంద్రంగా మారుతుందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి సానుకూల మార్పును తీసుకువస్తుందని పేర్కొన్నారు. ఇదీ చదవండి: మూసీ సుందరీకరణే లక్ష్యం -
అవార్డులు అందజేసిన గవర్నర్ అబ్దుల్ నజీర్
-
19 మంది చిన్నారులకు రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 19 మంది చిన్నారులకు 2024 సంవత్సరానికి గాను రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డులను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఈ నెల 22న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరుగనున్న ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అవార్డు గ్రహీతలకు పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. కళ, సంస్కృతి (7), శౌర్యం (1), ఇన్నోవేషన్ (1), సైన్స్ టెక్నాలజీ (1), సామాజిక సేవ (4), క్రీడలు (5).. ఇలా ఆరు కేటగిరీల్లో అందిస్తున్న రాష్ట్రీయ బాల పురస్కారాలను అందుకుంటున్న మొత్తం 19 మంది చిన్నారుల్లో 9 మంది అబ్బాయిలు, 10 మంది అమ్మాయిలు ఉన్నారు. తెలంగాణ నుంచి పెండ్యాల లక్ష్మీప్రియ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఆర్.సూర్యప్రసాద్ బాల పురస్కారాలకు ఎంపికయ్యారు. వీరంతా ఈ నెల 23న ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయి ఆయనతో ముచ్చటించనున్నారు. అంతేగాక ఈ నెల 26న కర్తవ్యపథ్‌లో జరుగనున్న 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కూడా పాల్గొంటారని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ తెలిపింది. లక్ష్మీ ప్రియకు కళ, సంస్కృతి కేటగిరీలో తెలంగాణ వరంగల్ జిల్లాకు చెందిన కూచిపూడి నృత్యకారిణి పెండ్యాల లక్ష్మీప్రియ కళ, సంస్కృతి కేటగిరీలో 2024 సంవత్సర బాల పురస్కారానికి ఎంపికైంది. 14 ఏళ్ల లక్ష్మీప్రియ ఇప్పటికే రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ప్రశంసలు అందుకుంది. 2023లో ఆమె శాస్త్రీయ నృత్యం కేటగిరీలో కళా ఉత్సవ్ జాతీయ అవార్డును గెలుచుకుంది. 2020లో ఆర్ట్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో కూచిపూడి, మోహిని నాట్యంలో అత్యుత్తమ ప్రదర్శనకు ‘లాస్యప్రియ‘ బిరుదును అందుకుంది. క్రీడల కేటగిరీలో సూర్యప్రసాద్కు క్రీడల కేటగిరీలో రాష్ట్రీయ బాలపురస్కారానికి ఎంపికైన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆర్.సూర్యప్రసాద్ 5 సంవత్సరాల వయస్సులోనే పర్వతారోహణ శిక్షణ తీసుకొని అసాధారణమైన ప్రయాణాన్ని ప్రారంభించాడు. 2022 ఏప్రిల్ 5 న ‘మౌంట్ కిలిమంజారో’ని అధిరోహించి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. అక్కడ మౌంట్ కిలిమంజారోపై ప్రముఖ వ్యక్తుల చిత్రాలను ప్రతీకాత్మకంగా ప్రదర్శించాడు. సామాజిక సాధికారత, ప్రగతిశీల భారతదేశ దృక్పథంపై తన నిబద్ధతను చాటి చెప్పాడు. -
మరోసారి సత్తా చాటిన ఇండోర్.. వరుసగా ఏడోసారి నెంబర్ వన్..
న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత పరిశుభ్ర నగరంగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ మరోసారి నెంబర్ వన్‌గా నిలిచింది. స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 అవార్డుల్లో వరుసగా ఏడోసారి తొలి స్థానాన్ని దక్కించుకుంది . ఇండోర్‌తోపాటు గుజరాత్‌లోని సూరత్ కూడా క్లీనెస్ట్ సిటీ తొలి ర్యాంక్‌ను సంయుక్తంగా గెలుచుకుంది.ఈ జాబితాలో మహారాష్ట్రలోని నవీ ముంబై మూడో స్థానంలో నిలిచింది. పరిశుభ్రత నగరాల జాబితాలో తెలుగు రాష్ట్రాలు కూడా సత్తా చాటాయి. ఏపీలో విశాఖపట్నం నాలుగు, విజయవాడ (6), తిరుపతి (8), తెలంగాణ రాజధాని హైదరాబాద్ (9) నగరాలు తొలి 10 సిటీల్లో చోటు దక్కించుకున్నాయి. అయితే టాప్ 100 లిస్ట్‌లో తమిళనాడు నుంచి ఏ నగరం కూడా ఎంపికవ్వలేదు. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులో చెన్నై 199 స్థానంలో ఉండటం గమనార్హం. Speaking at the Swachh Survekshan awards event in New Delhi, President Droupadi Murmu said that if we deeply understand the concept of value from waste, it becomes clear that everything is valuable and nothing is waste.https://t.co/l5hs7J7Vmb pic.twitter.com/goP4l8zTyw — President of India (@rashtrapatibhvn) January 11, 2024 విజేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులను అందజేశారు. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్యంత పరిశుభ్రత రాష్ట్రంగా మహారాష్ట్ర ఫస్ట్ ర్యాంక్ గెలుచుకుంది. ఆ తర్వాత మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. నాల్గో స్థానంలో ఒడిశా, అయిదో స్థానంలో తెలంగాణ నిలిచింది. -
ఏపీకి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల పంట
సాక్షి, ఢిల్లీ: ఏపీకి కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల పంట పడింది. స్వచ్ఛ సర్వేక్షణ్-2023లో ఏపీ నాలుగు జాతీయ అవార్డులు, ఒక రాష్ట్ర స్థాయి అవార్డు గెలుచుకుంది. దక్షిణ భారత దేశంలో క్లీన్ సిటీల్లో ఏపీ నంబర్ వన్‌గా నిలిచింది. జాతీయ స్థాయిలో గుంటూరు ఆలిండియా రెండో ర్యాంకు, గ్రేటర్ విశాఖపట్నం ఆలిండియా 4వ ర్యాంక్, విజయవాడ ఆలిండియా 6వ ర్యాంక్, తిరుపతి ఆలిండియా 8వ ర్యాంకు సాధించాయి. అత్యంత పరిశుభ్రంగా నగరాలను తీర్చిదిద్దినందుకుగానూ ఏపీ ఈ అవార్డులను దక్కించుకుంది. పట్టణాల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తోన్న కృషికి ఈ అవార్డులు ఈ అవార్డులు చిహ్నమని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. క్లీన్ ఏపీ (క్లాప్) ప్రోగ్రాం విజయవంతమైందన్నారు. పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించామని, వారంతా తిరిగి విధుల్లో చేరారన్నారు. సమ్మె వల్ల కొంత ఇబ్బంది కలిగిందని, ఇప్పుడు ఆ సమస్య పరిష్కారం జరిగిందని మంత్రి ఆదిమూలపు అన్నారు. కాగా, 2022లో కూడా జాతీయ స్థాయిలో అత్యుత్తమ పారిశుధ్య కార్మిక విధానాలు పాటిస్తున్నందుకు తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్‌కు ‘సఫాయిమిత్ర సురక్షా సెహెర్’ అవార్డు దక్కింది. సీఎం జగన్ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు మంచి ఫలితాలు ఇచ్చాయనడానికి ఆంధ్రప్రదేశ్‌కు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు రావడమే నిదర్శనం. ఇదీ చదవండి: ఏపీలో రేపు మూడు కొత్త రైళ్ల ప్రారంభం -
81st Golden Globe Awards 2024: 81వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో తారల సందడి.. ఫోటోలు
-
వైశ్య లైమ్ లైట్ అవార్డ్స్‌లో ఆకట్టుకున్న మోడల్స్ ర్యాంప్ వాక్.. ఫోటోలు
-
తరగతి మారిపోయింది
ఇప్పుడు ఆ పాఠశాలల్లో డిజిటల్ తరగతులు కూడా అందుబాటులోకి వచ్చాయి. మొదటి దశ ముగిసిన వెంటనే ప్రభుత్వం గతేడాది జూలైలో నాడు–నేడు రెండో దశ పనులను రూ.8 వేల కోట్ల వ్యయంతో చేపట్టింది. 22,217 పాఠశాలలను రెండో దశలో ఎంపిక చేసి, నిర్మాణ పనులు ప్రారంభించింది. ‘జగనన్న ఆణిముత్యాలు’ పేరుతో 2023 మార్చిలో ఇంటర్, పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో వివిధ ప్రభుత్వ మేనేజ్మెంట్లలో అత్యధిక మార్కులు సాధించి, మొదటి స్థానాల్లో నిలిచిన 22,768 మంది పిల్లలకు అవార్డులు అందించింది. – సాక్షి, అమరావతి నాడు పెచ్చులూడిన స్లాబులు 4 నెర్రలు బారిన గోడలు విరిగిపోయిన బెంచీలు 4 కటిక నేలపై చదువులు వస్తారో రారో తెలియని అయ్యవార్లు మచ్చుకైనా కనిపించని వాష్ రూమ్‌లు కొన్ని చోట్ల పశువులకు నెలవు ఎక్కడో ఒక చోట మాత్రమే టీవీలు సబ్జెక్ట్ టీచర్లు కరువు విద్య అనేది ప్రభుత్వ బాధ్యత కాదనేలా ప్రభుత్వ తీరు నేడు కార్పొరేట్ విద్యా సంస్థలను తలదన్నేలా నూతన భవనాలు చిన్నారులను ఆకట్టుకునేలా పెయింటింగ్స్ సైన్స్ ల్యాబ్‌లు సరికొత్తగా డెస్‌్కలు, కుర్చీలు, ఇతర పరికరాలు రన్నింగ్ వాటర్‌తో టాయ్లెట్లు ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు అదనపు తరగతి గదులు, వంటషేడ్లు పరిశుభ్రమైన మంచి నీరు ప్రతి పాఠశాలకూ రక్షణ గోడ ప్రతి తరగతి గది డిజిటలైజేషన్ మొత్తంగా 12 రకాల సదుపాయాలు ఇంగ్లిష్ మీడియం, బైజూస్ పాఠాలు 3వ తరగతి నుంచే టోఫెల్ శిక్షణ కౌమార దశలోని బాలికలకు స్వేచ్ఛ శానిటరీ న్యాప్కిన్స్ పంపిణీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మనబడి నాడు–నేడు’ పథకం మొదటి దశలో రూ.3,700 కోట్లతో 15,715 స్కూళ్లను అభివృద్ధి చేసింది. -
జాతీయ స్థాయిలో ఏపీ సత్తా
-
విజయ గాథలతో వీడియోలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత పథకాల ద్వారా అక్క చెల్లెమ్మలను నాలుగేళ్ల పాటు చేయి పట్టుకుని నడిపిస్తూ ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఈ పథకాల లబ్ధిదారుల విజయగాథలను వీడియోల రూపంలో వలంటీర్ల ద్వారా సేకరించి పంపాలని కలెక్టర్లకు సూచించారు. ఈ పథకాలు, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు మహిళల జీవితాలు, స్థితిగతులను ఏ రకంగా మార్చాయో వీడియోల్లో పొందుపరచాలని సూచించారు. పంపిన వాటిల్లో అత్యుత్తమమైన వాటికి బహుమతులు ఇస్తామని ప్రకటించారు. ఇవి మరి కొందరిలో స్ఫూర్తిని పెంచుతాయన్నారు. సచివాలయాల స్థాయిలో రూ.10 వేలు, మండల స్థాయిలో రూ.15 వేలు, నియోజకవర్గ స్థాయిలో రూ.20 వేలు, జిల్లా స్థాయిలో రూ.25 వేలు చొప్పున ఉత్తమ విజయ గాథలకు బహుమతులు ఇస్తామని చెప్పారు. ఉత్తమ సేవలు అందించిన వలంటీర్లకు ఫిబ్రవరి 15, 16 తేదీల్లో సేవామిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులు ఇస్తామని, వాటితో పాటే లబ్ధిదారులపై ఉత్తమ వీడియోలు పంపినవారికి అవార్డులు అందచేస్తామని తెలిపారు. సీఎం జగన్ గురువారం తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో మాట్లాడారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టాం వైఎస్సార్ ఆసరా, చేయూత, సున్నా వడ్డీ, అమ్మ ఒడి పథకాలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టాం. 2019లో మన ప్రభుత్వం రాకముందు పొదుపు సంఘాలన్నీ పూర్తిగా కుదేలైపోయాయి. ఏ గ్రేడ్, బీ గ్రేడ్ సంఘాలు పూర్తిగా కనుమరుగైపోయి సీ గ్రేడ్, డీ గ్రేడ్‌గా మారిపోయిన దుస్థితి నెలకొంది. 18 శాతం పైచిలుకు ఖాతాలన్నీ అవుట్ స్టాండింగ్, ఎన్పీఏల స్థాయిలోకి వెళ్లిపోయాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది. మనం అధికారంలోకి వచి్చన తర్వాత వారికి చేయూతనిచ్చి ఆసరా, సున్నా వడ్డీ, చేయూత, అమ్మ ఒడి పథకాల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టగలిగాం. ఆర్థిక స్వావలంబన, సాధికారత క్రమం తప్పకుండా ఏటా లబ్ధిదారులకు పలు పథకాలను అందించడం ద్వారా మహిళల ఆర్థిక స్వావలంబన, సాధికారితను సాధించగలిగాం. అందువల్లే ఈ రోజు పొదుపు సంఘాల్లో ఎన్పీఏలు కేవలం 0.3 శాతానికి పరిమితమయ్యాయి. అక్క చెల్లెమ్మలకు ఇంతగా తోడుగా నిలిచి నడిపించిన ప్రభుత్వం మనది. జనవరిలో వైఎస్సార్ ఆసరా చివరి విడత ఒక్క వైఎస్సార్ ఆసరా ద్వారానే రూ.25 వేల కోట్లకుపైగా మహిళలకు లబ్ధి చేకూరుస్తున్నాం. ఈ పథకం కింద మూడు విడతలుగా ఇప్పటికే రూ.19,195 కోట్లు ఇచ్చాం. నాలుగో విడతగా, చివరి ఇన్స్టాల్మెంట్ కింద సుమారు రూ.6,400 కోట్లు్ల ఇస్తున్నాం. జనవరి 23న ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఇది జనవరి 23 నుంచి 31వ తారీఖు వరకూ కొనసాగుతుంది. దీని ద్వారా 78.94 లక్షల మంది మహిళలు లబ్ధి పొందారు. ఈ కార్యక్రమాలన్నీ ఉత్సవ వాతావరణంలో జరగాలి. ఇందులో మహిళా సంఘాల కార్యకలాపాలను వివరించే స్టాల్స్‌ను కూడా ఏర్పాటు చేయాలి. సుస్థిర జీవనోపాధి.. మహిళలకు సుస్థిర జీవనోపాధి కల్పించాలన్నదే ఆసరా, చేయూత పథకాల ఉద్దేశం. స్వయం ఉపాధి పథకాల ద్వారా వారి జీవితాల్లో వెలుగులు చూడగలుగుతాం. ఇందులో భాగంగానే పలు మల్టీ నేషనల్, ప్రముఖ కంపెనీలు, బ్యాంకులతో అనుసంధానించాం. ప్రీ లాంచ్, లాంచ్, పోస్ట్ లాంచ్ కార్యక్రమాల ద్వారా మహిళలు, మహిళా సంఘాలకు దీనిపై అవగాహన పెంపొందించాలి. ఆసరా, చేయూత కార్యక్రమాల లబ్ధిదారులకు ఇది చాలా అవసరం. మహిళా సంఘాలు తీర్మానాలు చేస్తే ఆసరా కింద ఇచ్చే డబ్బు గ్రూపు ఖాతాల నుంచి వారి వ్యక్తిగత ఖాతాల్లోకి వెళ్తుంది. ‘చేయూత’తో రూ.14,129 కోట్లు ఫిబ్రవరి 5 నుంచి 14 వరకూ వైఎస్సార్ చేయూత కార్యక్రమం వేడుకలా జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమం గతంలో ఎప్పుడూ జరగలేదు. పథకం కింద ఇప్పటివరకూ రూ.14,129 కోట్లు అందచేశాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలిచి వారికి జీవనోపాధి చూపించేలా కార్యక్రమం చేపట్టాం. 45 ఏళ్లకు పైబడ్డ మహిళలకు ఏడాదికి రూ.18,750 చొప్పున అందిస్తూ 26.50 లక్షల మందికి పైగా అక్కచెల్లెమ్మలకు మంచి చేస్తున్నాం. లబ్ధిదారులు 31,23,466 మంది ఉన్నారు. ఈ పథకం వారి జీవితాల్లో ఏ రకంగా మార్పులు తెచి్చందో తెలియజెప్పాలి. జీవనోపాధి మార్గాలపై అవగాహన కలి్పస్తూ వారికున్న అవకాశాలను వివరించాలి. ఈ కార్యక్రమంలో కూడా నా తరపున లేఖను లబ్ధిదారులకు అందించాలి. నా వీడియో సందేశాన్ని కూడా వారికి చేరవేయాలి. సామాజిక న్యాయానికి చిహ్నంగా అంబేడ్కర్ విగ్రహావిష్కరణ సామాజిక న్యాయానికి చిహ్నంగా విజయవాడలో 19 ఎకరాల్లో రూ.404 కోట్లతో రూపొందించిన 125 అడుగుల ఎత్తైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహాన్ని జనవరి 19న ఆవిష్కరిస్తున్నాం. సచివాలయం నుంచి రాష్ట్ర స్థాయివరకూ ప్రతి అడుగులోనూ సామాజిక న్యాయ నినాదం వినిపించాలి. ప్రతి సచివాలయం పరిధిలో సమావేశాలు నిర్వహించాలి. ప్రతి సచివాలయం నుంచి ఐదుగురిని 19న జరిగే అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానించాలి. ప్రతి మండల కేంద్రం నుంచి ప్రత్యేకంగా బస్సులు నడుపుతాం. సామాజిక న్యాయానికి ప్రతిరూపంగా అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణలో వారందరినీ భాగస్వాములను చేస్తాం. గ్రామ స్థాయిలో పరిపాలనను చేరువ చేసి సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చాం. తద్వారా గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేశాం. ఇదొక గొప్ప మార్పు. అంబేడ్కర్ విగ్రహావిష్కరణ ఈ మార్పులకు ప్రతిరూపంగా నిలుస్తుంది. -
కెప్టెన్ విజయ్‌కాంత్.. అవార్డుల రారాజు!
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. తమిళనాడు డీఎండీకే అధినేత, నటుడు విజయకాంత్ కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. కొద్ది సేపటి క్రితమే కరోనా సోకినట్లు ప్రకటించిన వైద్యులు ఆయన మృతి చెందినట్లు తెలిపారు. విజయ్‌కాంత్ మృతి పట్ల కోలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం ప్రకటిస్తున్నారు. 1952 ఆగస్టు 25న మదురైలో విజయ్‌కాంత్ జన్మించారు. సినీ ఇండస్ట్రీలో తనదైన ముద్రవేశారు. దాదాపు 150కి పైగా సినిమాల్లో ఆయన నటించారు. ప్రజలకు సేవల చేయాలనే ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2005లో డీఎండీకే పార్టీని స్థాపించారు. ఇనిక్కుం ఇలామైతో నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు విజయ్‌కాంత్. సుమారు 100కి పైగా చిత్రాల్లో ఆయన నటించి ఎన్నో ఏళ్లపాటు ప్రేక్షకుల్ని అలరించారు. దాదాపు 20కి పైగా పోలీస్‌గా నటించి మెప్పించారు. కెరీర్ ఆరంభంలో కాస్త పరాజయాలు అందుకున్న విజయ్‌కాంత్.. ఎస్.ఎ. చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన ‘దూరతు ఇడి ముజక్కం’, ‘సత్తం ఓరు ఇరుత్తరై’లతో విజయాలు అందుకున్నారు. ‘కెప్టెన్ ప్రభాకర్’ విజయం సాధించిన తర్వాత నుంచి అందరూ ఆయన్ని కెప్టెన్‌గా పిలుస్తున్నారు. విజయ్‌కాంత్ నటించిన చాలా చిత్రాలు తెలుగులోనూ డబ్ కావడంతో ఇక్కడి వారికీ ఆయన సుపరిచితులే. అవార్డులు దాదాపు 100కి పైకి సినిమాల్లో నటించిన విజయ్‌కాంత్ పలు అవార్డులు సొంతం చేసుకున్నారు. 1981లో ఆయన నటించిన తూరతు ఇడిముజక్కం చిత్రానికి ప్రపంచ చలన చిత్రోత్సవ అవార్డ్ లభించింది. 1986లో అమ్మన్ కోయిల్ కిజకలే చిత్రానికి ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నారు. 1989లో పూంతోట్ట కవల్కరన్ అనే సినిమాకు ఉత్తమ నటుడిగా ఎక్స్‌ప్రెస్ అవార్డ్ వరించింది. అదే ఏడాదిలో చిందుర పూవే అనే చిత్రానికి ఉత్తమ నటుడు అవార్డుతో పాటు ఫిల్మ్ ఫ్యాన్స్ అవార్డ్‌ను సొంతం చేసుకున్నారు. 2001లో తమిళనాడు ప్రభుత్వం నుంచి కలైమామణి అవార్డు అందుకున్నారు. వీటితో పాటు 1994లో ‘తమిళనాడు స్టేట్ ఫిల్మ్ ఆనరరీ అవార్డు’ (ఎంజీఆర్ పురస్కారం). 2001లో ‘బెస్ట్ ఇండియన్ సిటిజెన్ అవార్డు’, 2009లో ‘టాప్ 10 లెజెండ్స్ ఆఫ్ తమిళ్ సినిమా అవార్డు’, 2011లో ‘ఆనరరీ డాక్టరేట్’ (ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చర్చ్ మేనేజ్మెంట్) పొందారు. అంతే కాకుండా అనేక ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు అందుకున్నారు. విజయకాంత్ దర్శకత్వం వహించిన ఒకే ఒక చిత్రం ‘విరుధగిరి’. అందులో ఆయనే హీరో. తన బావ ఎల్.కె. సుధీశ్‌తో కలిసి ‘వల్లారసు’, ‘నరసింహ’, ‘సగప్తం’ తదితర చిత్రాలను నిర్మించారు. -
దశ దిశలా రక్షణ
మహిళలకు రక్షణ, భద్రతకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఇందులో భాగంగా ఆపదలో ఉన్నవారిని నిమిషాల వ్యవధిలోనే రక్షించడానికి దిశ యాప్‌ను ప్రవేశపెట్టింది. ఆపత్కాలంలో ఉన్నప్పుడు దిశ యాప్‌లోని ఎస్‌వోఎస్ బటన్ నొక్కితే చాలు... నిమిషాల్లోనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మహిళలను రక్షిస్తున్నారు. నిందితులను అరెస్టు చేసి కఠిన శిక్షలు పడేలా చేస్తున్నారు. ఈ క్రమంలో దిశ వ్యవస్థకు దేశవ్యాప్తంగా ఎన్నో ప్రశంసలు, అవార్డులు దక్కాయి. ఎన్నో రాష్ట్రాలు దీన్ని తమ ప్రాంతాల్లోనూ ప్రారంభించడానికి సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో దిశ యాప్‌ను ఆవిష్కరించి మూడేళ్లు పూర్తయిన నేపథ్యంలో ప్రత్యేక కథనం. – సాక్షి, అమరావతి ♦ చిత్తూరు జిల్లా కాణిపాకంలో ఓ బాలికను ఓ యువకుడు∙కిడ్నాప్ చేసి అత్యాచారానికి యత్నించాడు. అతడి ఇంట్లో నుంచి బాలిక అరుపులు వినిపించడంతో సమీపంలో ఉన్న ఓ వ్యక్తి దిశ యాప్ ద్వారా సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ఆ బాలికను రక్షించి యువకుడిని అరెస్ట్ చేశారు. ♦ పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఓ మహిళపై ఆమె భర్త మద్యం మత్తులో గొడ్డలితో దాడి చేశాడు. ఆమె వెంటనే అంటే సాయంత్రం 6.39 గంటలకు దిశ యాప్ ద్వారా పోలీసులను సంప్రదించారు. పోలీసులు 6.41 గంటలకే అంటే కేవలం రెండు నిమిషాల్లోనే అక్కడకు చేరుకుని ఆమెను ఆస్పత్రికి తరలించి కాపాడారు. ఆమె భర్తను అరెస్ట్ చేశారు. ♦ సమీప బంధువు మోసగించడంతో విజయవాడలో ఓ మహిళ అర్ధరాత్రి 12.53 గంటలకు విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తన బిడ్డను కాపాడాల్సిందిగా ఆమె తల్లి దిశ యాప్ ద్వారా పోలీసులకు విన్నవించారు. కమాండ్ కంట్రోల్ సిబ్బంది 12.55 గంటలకు విజయవాడ పోలీసులను అప్రమత్తం చేశారు. పోలీసులు 12.58 నిమిషాలకే అంటే కేవలం 5 నిమిషాల్లోనే బాధిత మహిళ నివాసానికి చేరుకుని ఆమెను ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు. మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ♦ ఎన్టీఆర్ జిల్లా నవులూరుకు చెందిన ఓ మహిళ పరీక్ష రాసేందుకు వెళ్లిన తన 15 ఏళ్ల కుమార్తె ఇంటికి తిరిగి రాలేదని దిశ యాప్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఓ యువకుడు ఆ బాలికకు మాయమాటలు చెప్పి తీసుకువెళ్లినట్టు గుర్తించిన పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. ఆ బాలిక ఆచూకీ తెలుసుకుని ఆమె తల్లి వద్దకు చేర్చారు. యువకుడిపై కేసు నమోదు చేశారు. ♦ గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో 19 ఏళ్ల యువతిని ఓ యువకుడు ప్రేమ పేరుతో నమ్మించి తనతో తీసుకువెళ్లాడు. ఆమెను లైంగికంగా వేధించడమే కాకుండా వ్యభిచారం చేయాల్సిందిగా వేధించసాగాడు. దాంతో ఆ యువతి పొరుగింటివారి సహాయంతో దిశ యాప్ ద్వారా పోలీసులను సంప్రదించింది. పోలీసులు వెంటనే ఆ నివాసానికి చేరుకుని యువతిని రక్షించి యువకుడిని అరెస్ట్ చేశారు. చార్జ్షీట్ల నమోదులో దేశంలోనే ప్రథమ స్థానం.. దిశ యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల్లో ఇప్పటివరకు 3,009 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఇక పోలీస్ స్టేషన్ పరిధితో నిమిత్తం లేకుండా ఏ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చినా సరే జీరో ఎఫ్ఐఆర్ నమోదు విధానాన్ని 2019 డిసెంబర్లో ప్రవేశపెట్టారు. అలాగే దిశ యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల్లో 60 రోజుల్లోపే ఏకంగా 96.07 శాతం కేసుల్లో చార్జ్షీట్లు దాఖలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్ర హోం శాఖ నిర్దేశించిన మేరకు 60 రోజుల్లో చార్జ్షీట్ల నమోదులో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉండటం విశేషం. 2020 నుంచి ఇప్పటివరకు 7,070 పోక్సో కేసులకు సంబంధించి 96 శాతం కేసుల్లో 60 రోజుల్లోనే దర్యాప్తు పూర్తవ్వడం గమనార్హం. ఈ విషయంలో జాతీయ సగటు కేవలం 40 శాతం మాత్రమే. అక్కచెల్లెమ్మల రక్షణకు పటిష్ట వ్యవస్థ.. ♦ దిశ యాప్‌ను ప్రవేశపెట్టడమే కాకుండా ప్రభుత్వం 18 దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. మరో 8 పోలీస్ స్టేషన్లను త్వరలో ఏర్పాటు చేయనుంది. ♦ మహిళలకు హెల్ప్ డెస్క్, వెయిటింగ్ హాల్, కౌన్సెలింగ్ రూమ్, వాష్ రూమ్స్, క్రచ్–ఫీడింగ్ రూమ్‌లతో ఈ పోలీస్ స్టేషన్లను నెలకొల్పారు. ఈ క్రమంలో దిశ పోలీస్ స్టేషన్లకు ఐఎస్వో సర్టిఫికెట్ లభించడం విశేషం. ♦ ప్రత్యేకంగా 13 పోక్సో కోర్టులు, 12 మహిళా కోర్టులను ఏర్పాటు చేశారు. ♦ పోక్సో కేసుల విచారణకు 19 మంది ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించారు. ♦ పెట్రోలింగ్ కోసం 900 ద్విచక్ర వాహనాలు, 163 బొలెరో వాహనాలను సమకూర్చారు. ♦ 18 దిశ క్రైమ్ మేనేజ్మెంట్ వాహనాలను ప్రభుత్వం సమకూర్చింది. నేరం సంభవించిన ప్రాంతానికి తక్షణం చేరుకోవడానికి వీటిని అందుబాటులోకి తెచ్చింది. ♦ లైంగిక వేధింపులకు అవకాశం ఉన్న సున్నిత ప్రాంతాలను జియో మ్యాపింగ్ చేసింది. మహిళలపై లైంగిక దాడులకు పాల్పడిన నేర చరిత్ర ఉన్న 2,17,467 మంది నేర చరితుల డేటా బేస్ రూపొందించి వారి కదలికలపై నిఘా పెట్టింది. మహిళలను ఆన్లైన్ వేధింపులకు గురి చేస్తున్న 1,531 మందిపై సైబర్ బుల్లీయింగ్ షీట్లు, లైంగిక వేధింపులకు పాల్పడిన 2,134 మందిపై షీట్లు తెరిచింది. ♦ నేర నిరూపణకు అవసరమైన సాక్ష్యాధారాలను సత్వరం సేకరించేందుకు అనంతపురం, రాజమహేంద్రవరం, తిరుపతి, విశాఖపట్నం, గుంటూరు, విజయవాడలలో ఫోరెన్సిక్ లాŠయ్బ్లను ఏర్పాటు చేసింది. తిరుపతి, విశాఖపట్నంలలో ప్రాంతీయ ఫోరెన్సిక్ సైన్స్ లే»ొరేటరీలను నిరి్మస్తోంది. గతంలో ఫోరెన్సిక్ నివేదిక వచ్చేందుకు మూడు నాలుగు నెలల సమయం పట్టేది. కానీ ప్రస్తుతం కేవలం 48 గంటల్లోనే నివేదికలు వస్తున్నాయి. నేరానికి పాల్పడితే కఠిన శిక్షే.. దర్యాప్తు పూర్తి చేయడమే కాదు దోషులకు న్యాయస్థానాల ద్వారా కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నారు. 2019 తర్వాత మహిళలపై నేరాలకు పాల్పడేవారిపై శిక్షలు విధించడం పెరిగింది. పోలీసులు ప్రాధాన్యత కేసులుగా తీసుకున్నవాటిలో ఇప్పటివరకు 85 కేసుల్లో దోషులకు కోర్టులు శిక్షలు విధించాయి. మరో 10 కేసుల్లో న్యాయస్థానాల్లో విచారణ కొనసాగుతోంది. ఇంకో 27 కేసుల్లో దర్యాప్తు జరుగుతోంది. జాతీయస్థాయిలో.. అద్భుతమైన పనితీరుతో దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న దిశ వ్యవస్థకు ఇప్పటివరకు 19 జాతీయస్థాయి అవార్డులు లభించడం విశేషం. నీతి ఆయోగ్, జాతీయ మహిళా పార్లమెంటరీ సదస్సు, జాతీయ మహిళా కమిషన్, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్, జాతీయ బాలల కమిషన్ తదితర సంస్థలు దిశ వ్యవస్థను కొనియాడాయి. రికార్డు స్థాయిలో 1.46 కోట్ల డౌన్లోడ్లు దిశ యాప్ ఫోన్లో ఉందంటే మహిళలు నిశ్చింతగా ఉన్నట్టే. అందుకే ఈ యాప్‌ను ఇప్పటివరకు 1,46,99,012 మంది డౌన్లోడ్ చేసుకున్నారు. కేవలం డౌన్‌లోడ్‌తోనే ఆగిపోకుండా 1,27,06,213 మంది రిజిస్టర్ కూడా చేసుకున్నారు. ఓ మొబైల్ యాప్ డౌన్లోడ్, రిజి్రస్టేషన్లలో దేశంలో దిశ యాప్‌దే రికార్డు కావడం విశేషం. ఆపదలో ఉన్నామని దిశ యాప్‌కు సమాచారం ఇస్తే పట్టణాలు, నగరాల్లో 5 నిమిషాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 10 నిమిషాల్లోపే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. దిశ యాప్ ద్వారా ఇప్పటివరకు 10,80,454 ఎస్‌వోఎస్ కాల్ రిక్వెస్ట్‌లు వచ్చాయి. కొత్తగా యాప్‌ను డౌన్లోడ్ చేసుకునేటప్పుడు పరీక్షించడానికి ఒకటి రెండుసార్లు ఎస్‌వోఎస్ బటన్ నొక్కి చూస్తారు. అటువంటివి కాకుండా పోలీసులు చర్యలు తీసుకోదగ్గవి 31,541 కాల్స్ ఉన్నాయి. ఈ కాల్స్ అన్నింటికీ పోలీసులు తక్షణం స్పందించి ఘటన స్థలానికి చేరుకుని తగిన చర్యలు తీసుకున్నారు. దిశ యాప్ ద్వారా సగటున రోజుకు 250 కాల్స్ రావడం ఈ వ్యవస్థ పట్ల మహిళల్లో ఏర్పడిన భరోసాకు నిదర్శనం. దోషులకు సత్వరం శిక్షలు మహిళలు, బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడేవారిపై పోక్సో కేసులు నమోదు చేయడమే కాకుండా దోషులకు సత్వరమే శిక్షలు పడేలా చేస్తున్నారు. దిశ పోలీస్ స్టేషన్లు, ఫోరెన్సిక్ ల్యాబ్‌ల ఏర్పాటు ద్వారా కేసుల దర్యాప్తు, నేర నిరూపణ ప్రక్రియ పక్కాగా సాగేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. -
Sahitya Akademi Awards 2023: 24 మందికి సాహిత్య అకాడమీ పురస్కారాలు
న్యూఢిల్లీ: ఆంగ్ల రచయిత్రి నీలం సరణ్ గౌర్, హిందీ నవలా రచయిత సంజీవ్‌సహా 25 మంది రచయితలు 2023 సంవత్సరానికి సాహిత్య అకాడమీ అవార్డులు అందుకున్నారు. మాధవ్ కౌశిక్ అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో భేటీ అయిన అకాడమీ ఎగ్జిక్యూటివ్ బోర్డు 24 భారతీయ భాషలకుగాను జ్యూరీ సభ్యులు సూచించిన పేర్లకు ఆమోదం తెలిపిందని సాహిత్య అకాడమీ ఒక ప్రకటనలో పేర్కొంది. తొమ్మిది కవితా సంపుటాలు, ఆరు నవలలు, ఐదు చిన్న కథల సంపుటాలు, మూడు వ్యాసాలు, ఒక సాహిత్య అధ్యయనానికి ఈ అవార్డులు దక్కాయి. ముఝే పెహ్చానో నవలకుగాను సంజీవ్‌కు, రెకియమ్ ఇన్ రాగా జానకి పుస్తకానికిగాను నీలం సరణ్ గౌర్‌కు అవార్డు దక్కింది. టి.పతంజలి శా్రస్తి(తెలుగు), విజయ్ వర్మ(డోగ్రీ), వినోద్ జోషి(గుజరాతీ), బన్సూర్ బనిహరి(కశీ్మరీ), అరుణ్ రంజన్ మిశ్రా(సంస్కృతం) తదితరులు అవార్డులు పొందిన వారిలో ఉన్నారు. -
దుబాయ్‌లో గామా అవార్డ్స్
‘‘దుబాయ్‌లో మార్చి 3న ‘గల్ఫ్ తెలుగు సినీ అవార్డ్స్’ (గామా అవార్డ్స్) వేడుకను ఘనంగా నిర్వహించనున్నాం’’ అని ‘గామా’ అవార్డ్స్ చైర్మన్ కేసరి త్రిమూర్తులు అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ– ‘‘2024 మార్చి 3న నిర్వహించనున్న గామా అవార్డ్స్‌లో అల్లు అర్జున్‌కి ‘గామా నేషనల్ ఐకాన్ అవార్డ్’ అందిస్తాం. 2021, 2022, 2023 సంవత్సరాల్లోని ఉత్తమ చిత్రాలు, నటులు, దర్శకులు, సంగీతం.. వంటి విభాగాల్లో ఈ అవార్డ్స్ అందజేస్తాం’’ అన్నారు. ‘‘ఈ అవార్డు వేడుకకు పలువురు దర్శకులు, నిర్మాతలు, నటీనటులు, సంగీత దర్శకులు హాజరవుతారు’’ అన్నారు ‘గామా’ అవార్డ్స్ జ్యూరీ సభ్యుడు, గౌరవ సలహాదారుడు, దర్శకుడు వీఎన్ ఆదిత్య. ‘‘గామా అవార్డ్స్ ఆస్కార్ స్థాయికి చేరుకోవాలి’’ అన్నారు జ్యూరీ చైర్మన్, సంగీత దర్శకుడు కోటి. ‘‘గామా’ అవార్డ్స్ దర్శకుడు ప్రసన్న పాలంకి, జ్యూరీ సభ్యురాలు, సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీలేఖ పాల్గొన్నారు. -
వైద్యరంగంలో ఏపీ నంబర్ వన్
-
ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసులకు అవార్డులు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా శాంతిభద్రతల విభాగంలో 2022 సంవత్సరంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 76 మంది పోలీసు కానిస్టేబుళ్లు, అధికారులకు డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి డీజీపీ డిస్క్ అవార్డులు అందజేశారు. మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డులు అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా శాంతి భద్రతల విభాగం, దిశ, కర్నిక్షన్ బేస్డ్ పోలీసింగ్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కానిస్టేబుల్ నుంచి అదనపు డీజీ వరకు వీటిని ప్రదానం చేశారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 15 మంది ఎస్పీలు గోల్డ్ మెడల్ అందుకున్నారు. కానిస్టేబుల్ నుండి ఐపీఎస్‌ల వరకు 56 మంది సిల్వర్ మెడల్స్, 5 మంది డీఎస్పీలు, ఏఎస్ఐలకు బ్రాంజ్ మెడల్స్‌ను డీజీపీ అందజేశారు. సత్ఫలితాలు ఇస్తున్న కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ : డీజీపీ రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాది జూన్ నుంచి చేపట్టిన కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ విధానం సత్పలితాలు ఇస్తోందని డీజీపీ తెలిపారు. ఈ విధానం ద్వారా ప్రతి ఒక్క యూనిట్ అధికారి (సీపీ, ఎస్పీ) వారి పరిధిలోని ముఖ్యమైన ఐదు, ఆరు కేసులు ప్రతిరోజూ పర్యవేక్షించేలా చూస్తున్నామన్నారు. షెడ్యూల్ మేరకు కోర్టులో జరుగుతున్న కేసు విచారణ పురోగతిపై సమీక్షించేలా వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. దీని ద్వారా ఈ సంవత్సరం తీవ్రమైన నేరాల నమోదు శాతం గణనీయంగా తగ్గిందని తెలిపారు. నేరాల తీవ్రత ఆధారంగా గత సంవత్సరంలో గుర్తించిన 165 కేసులు న్యాయస్థానాల్లో విచారణ ప్రక్రియ పూర్తి చేసుకొని నూటికి నూరు శాతం నిందితులకు శిక్షలు పడ్డాయని చెప్పారు. ఇతర విభాగాల్లోనూ ఉత్తమ సేవలను గుర్తిస్తాం పోలీస్ శాఖలోని ఇతర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ), సీఐడీ, గ్రేహౌండ్స్, ఆక్టోపస్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఇంటెలిజెన్స్, ఏపీఎస్పీ బెటాలియన్స్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబి)లో కూడా ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బంది వివరాలు సేకరిస్తున్నట్లు డీజీపీ తెలిపారు. ఉత్తమ సేవలు అందించిన వారికి త్వరలోనే డీజీపీ డిస్క్ అవార్డులు ప్రదానం చేస్తామన్నారు. క్షేత్రస్థాయిలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అహర్నిశలూ కృషి చేస్తున్న సిబ్బందికి ప్రోత్సాహకరంగా ఉండేందుకే ఈ అవార్డులను అందిస్తున్నట్టు తెలిపారు. -
కొంతమంది కావాలనే బురద జల్లుతున్నారు: సురేశ్ కొండేటి
గోవాలో జరిగిన సంతోషం అవార్డ్స్ టాలీవుడ్ ఇండస్ట్రీలో వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ అంశంపై టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఇండస్ట్రీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని గత 21 ఏళ్లుగా ఇస్తున్న సినీ జర్నలిస్ట్ సురేశ్ కొండేటి స్పందించారు. ఈ అవార్డులు పూర్తిగా తన వ్యక్తిగతమని.. తెలుగు ఇండస్ట్రీ కి ఎటువంటి సంబంధం లేదంటూ ట్వీట్ చేశారు. సురేశ్ కొండేటి ట్వీట్లో రాస్తూ..' అందరికీ నమస్కారం .. గత 21 సం. గా నేను సంతోషం అవార్డ్స్ ఇస్తున్నాను . ఇది పూర్తిగా నా వ్యక్తిగతం. దీనితో తెలుగు ఇండస్ట్రీ కి ఎటువంటి సంబంధం లేదు . ప్రతి సంవత్సరం చాలా కష్టపడి నేను ఒక్కడినే 21 సంవత్సరాలుగా అవార్డ్స్ ఇస్తున్నా. నాకు అన్ని ఇండస్ట్రీ వాళ్లు సమానమే . అందుకే 4 ఇండస్ట్రీ వాళ్లని కలిపి అవార్డ్స్ ఇస్తున్నా. గోవా ఈవెంట్లో కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల వచ్చిన 1200 మందికి సెలబ్రిటీస్‌కు రూమ్స్ సర్దుబాటు విషయంలో ఇబ్బంది జరిగింది. కన్నడ, తమిళ వాళ్లని ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు. ఇంత పెద్ద ఈవెంట్లో కొన్ని పొరపాట్లు జరగడం కామన్. ఇది ఉదేశ్య పూర్వకంగా చేసింది కాదు. దయచేసి అర్ధం చేసుకోగలరు. ఈవెంట్ వల్ల ఇబ్బంది పడి ఉంటే పేరు పేరునా సారీ చెప్తున్నాను. నా మీద కావాలనే కొంత మంది కావాలని బురద జల్లుతున్నారు. పెద్ద మనసుతో మీరు అర్థం చేసుకుంటారని మనస్పూర్తిగా కోరుకుంటూ ఎప్పటికీ మీ సురేష్ కొండేటి' అంటూ ట్వీట్ చేశారు. pic.twitter.com/zlLhjNx8UM — Suresh Kondeti (@santoshamsuresh) December 4, 2023 అందరికీ నమస్కారం .. గత 21 సం. గా నేను సంతోషం అవార్డ్స్ ఇస్తున్నాను .. ఇది పూర్తిగా నా వ్యక్తిగతం . దీనితో తెలుగు ఇండస్ట్రీ కి ఎటువంటి సంబంధం లేదు .. ప్రతి సం చాలా కష్టపడి, గ్రాండ్ గా నేను ఒక్కడినే 21 సంవత్సరాలుగా అవార్డ్స్ ఇస్తున్నాను .. నాకు అన్ని ఇండస్ట్రీ వాళ్లు సమానమే ..… — Suresh Kondeti (@santoshamsuresh) December 4, 2023 -
Santosham OTT Awards Photos: అంగరంగ వైభవంగా 'సంతోషం' ఓటీటీ అవార్డ్స్ (ఫొటోలు)
-
అవార్డుల కంటే ప్రేక్షకుల గుర్తింపే ముఖ్యం
‘‘అవార్డుల కోసం సినిమాలు తీయాలనే ఆలోచన నాకు ఉండదు. ప్రేక్షకులు ఇచ్చే గుర్తింపు, ప్రేమ, అభిమానం, ఆప్యాయత చాలా ముఖ్యం. అవార్డులు వస్తే అదనపు బోనస్‌గా భావిస్తాను. ప్రేక్షకుల ప్రేమ, అభిమానంతో పాటు ‘జోకర్’ చిత్రానికి జాతీయ అవార్డు తీసుకోవడం నాకు గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. ‘జపాన్’ కూడా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుంది’’ అని దర్శకుడు రాజు మురుగన్ అన్నారు. కార్తీ, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన చిత్రం ‘జపాన్’. ఎస్ఆర్ ప్రకాశ్‌బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ సినిమా నేడు రిలీజవుతోంది. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో అన్నపూర్ణ స్టూడియోస్ విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా రాజు మురుగన్ మాట్లాడుతూ– ‘‘నేను సినిమాల్లోకి రావడానికి చార్లీ చాప్లిన్‌గారే స్ఫూర్తి. మూకీ చిత్రాలతోనే ఎన్నో ఆలోచనలు, భావోద్వేగాలను రేకెత్తించారు ఆయన. ఇక కార్తీగారిని దృష్టిలో పెట్టుకునే ‘జపాన్’ కథ రాశాను. కార్తీ, నిర్మాతలు ప్రభు, ప్రకాశ్‌గార్ల సహకారంతోనే ‘జపాన్’ చిత్రం ఇంత గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది. ఒక దర్శకుడిగా చిన్నా పెద్దా అని కాకుండా అన్ని రకాల సినిమాలు చేయాలనుకుంటున్నాను’’ అన్నారు. -
ఆటో అవార్డ్స్ 2023 విన్నర్స్ జాబితా - పూర్తి వివరాలు
ప్రముఖ జాతీయ మీడియా సంస్థ న్యూఢిల్లీలో నిర్వహించిన ప్రతిష్టాత్మక 2023 ఆటో అవార్డ్స్ మూడో ఎడిషన్ విజేతల వివరాలు అధికారికంగా వెల్లడయ్యాయి. ఆటోమొబైల్ నిపుణులు, పరిశ్రమ నాయకులు, ఉన్నతాధికారులు, ఆటోమోటివ్ తయారీదారుల సమక్షంలో అవార్డుల ప్రధానం జరిగింది. ఫోర్ వీలర్, టూ వీలర్ విభాగాల్లో జరిగిన నామినేషన్స్‌లో అవార్డులు సొంతం చేసుకున్న వాహనాల జాబితా ఇక్కడ చూడవచ్చు 👉బడ్జెట్ మోటార్‌సైకిల్ ఆఫ్ ది ఇయర్ - హోండా షైన్ 100 👉ఎలక్ట్రిక్ టూ-వీలర్ ఆఫ్ ది ఇయర్ - అల్ట్రావయొలెట్ ఎఫ్ 77 👉స్కూటర్ ఆఫ్ ది ఇయర్ - హీరో జూమ్ 👉ప్రీమియం మోటార్‌సైకిల్ ఆఫ్ ది ఇయర్ - కేటీఎమ్ డ్యూక్ 390 👉మోస్ట్ ట్రస్టడ్ బ్రాండ్ ఆఫ్ ది ఇయర్ - టీవీఎస్ మోటార్ కంపెనీ ఇదీ చదవండి: 81.5 కోట్ల భారతీయుల ఆధార్ వివరాలు లీక్ - అమ్మడానికి సిద్దమైన హ్యాకర్! 👉ఫేస్‌లిఫ్ట్ ఆఫ్ ది ఇయర్ (మాస్ మార్కెట్) - టాటా నెక్సన్ 👉డిజైన్ ఆఫ్ ది ఇయర్ - హ్యుందాయ్ వెర్నా 👉ఎస్యూవీ ఆఫ్ ది ఇయర్ - మారుతి సుజుకి జిమ్నీ 👉ఎలక్ట్రిక్ కార్ ఆఫ్ ది ఇయర్ - హ్యుందాయ్ ఐయోనిక్ 5 👉హై-టెక్ కార్ ఆఫ్ ది ఇయర్ - హ్యుందాయ్ ఐయోనిక్ 5 👉మోస్ట్ ట్రస్టడ్ బ్రాండ్ ఆఫ్ ది ఇయర్ - హ్యుందాయ్ మోటార్ ఇండియా 👉మోస్ట్ ప్రామిసింగ్ కార్ ఆఫ్ ది ఇయర్ - ఎంజీ కామెట్ -
ఎలక్ట్రిక్ టూ వీలర్ ఆఫ్ ది ఇయర్.. జాబితాలో నాలుగు - అవార్డు దేనికో?
ప్రతిష్టాత్మక 2023 ఆటో అవార్డ్స్ మూడవ సీజన్ విజేతలను ఈ రోజు సెంట్రల్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ 'జితేంద్ర సింగ్' సమక్షంలో ప్రకటిస్తారు. ఇందులో అనేక విభాగాల్లో వాహనాలు ప్రదర్శనకు సిద్దమవుతాయి. ఈ రోజు ఏ విభాగంలో ఏ వాహనం విజేతగా నిలుస్తుందో అధికారికంగా తెలుస్తుంది. ఫేస్‌లిఫ్ట్ ఆఫ్ ది ఇయర్, డిజైన్ ఆఫ్ ది ఇయర్, ఎలక్ట్రిక్ కార్ ఆఫ్ ది ఇయర్, లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ ఆఫ్ ది ఇయర్.. ఇలా అనేక విభాగాల్లో వాహనాలు ప్రదర్శనకు వస్తాయి. ఇప్పటికే కొన్ని వాహనాలు నామినేషన్‌కు సిద్ధమయ్యాయి. తుది ఫలితాలు, విజేతలు త్వరలో తెలుస్తాయి. ఇదీ చదవండి: విలీనానికి మరో రెండు బ్యాంకులు - డేట్ ఫిక్స్ ఎలక్ట్రిక్ టూ వీలర్ ఆఫ్ ది ఇయర్ (Electric Two-Wheeler of the Year) అవార్డు నామినేషన్ జాబితాలో 'అల్ట్రా వయొలెట్ ఎఫ్ 77, ఏథర్ 450 ఎక్స్ జెన్3 (మూడవ తరం ఏథర్ 450 ఎక్స్), హీరో విడా వి1, టార్క్ క్రటోస్ ఆర్' ఉన్నాయి. ఇందులో టైటిల్ విన్నర్ ఎవరనేది ఈ రోజే తెలిసిపోతుంది. -
అవార్డుల జాతర.. నామినేషన్ కోసం సిద్దమైన కార్లు ఇవే!
2023 అక్టోబర్ 30న 'ఆటో అవార్డ్స్ సెషన్ 3' (Auto Awards Season 3) కార్యక్రమం జరగనుంది. ఇందులో ఫ్యూయెల్, ఎలక్ట్రిక్ కార్లు చూపరులను కనువిందు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ వెహికల్ సెక్టార్‌తో సహా వివిధ విభాగాల్లో అవార్డుల కోసం నామినేషన్లు జరుగుతాయి. సోమవారం (2023 అక్టోబర్ 30న) జరగనున్న ఈ కార్యక్రంలో ఏ అవార్డు ఏ కారు సొంత చేసుకుంటుందనే విషయాలు అధికారికంగా విడుదలవుతాయి. ఆటో అవార్డ్స్ 2023 కార్యక్రమంలో నామినేషన్ కోసం సిద్దమైన కార్ల జాబితా (విభాగాల వారీగా): ఫేస్‌లిఫ్ట్ ఆఫ్ ది ఇయర్ హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ ఎంజీ హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ డిజైన్ ఆఫ్ ది ఇయర్ (బడ్జెట్ కార్లు) టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ మారుతి ఫ్రాంక్స్ హ్యుందాయ్ వెర్నా హ్యుందాయ్ ఎక్స్టర్ డిజైన్ ఆఫ్ ది ఇయర్ (లగ్జరీ కార్లు) మెక్లారెన్ ఆర్టురా మెర్సిడెస్ ఏఎంజీ ఎస్ఎల్ 55 4మ్యాటిక్ ప్లస్ రోడ్‌స్టర్ ఆస్టన్ మార్టిన్ డీబీ12 హ్యుందాయ్ ఐయోనిక్5 ఎలక్ట్రిక్ కార్ ఆఫ్ ది ఇయర్ హ్యుందాయ్ ఐయోనిక్ 5 ఎంజీ కామెట్ సిట్రోయెన్ ఈసీ3 టాటా నెక్సాన్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ ఇదీ చదవండి: రూ.20 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే కార్లు - వివరాలు లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ ఆఫ్ ది ఇయర్ మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఈ 500 4 మ్యాటిక్ వోల్వో C40 రీఛార్జ్ బీఎండబ్ల్యూ ఐ7 ఆడి క్యూ8 ఈ-ట్రాన్ -
నటి రోహిణి చిత్రానికి అరుదైన ఘనత..!
లెన్స్, మస్కిటో ఫిలాసఫీ, తలైకూత్తల్ వంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడు జయప్రకాష్ రాధాకృష్ణన్ తెరకెక్కించిన చిత్రం కాదల్ ఎంబదు పొదువుడమై. ఈ చిత్రాన్ని ది గ్రేట్ ఇండియన్ కిచెన్ చిత్ర దర్శకుడు జియో బేబీ సమర్పణలో మెన్ కైండ్ సినిమాస్, నితీష్ ప్రొడక్షన్స్, సిమెట్రీ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రంలో సీనియర్ నటి రోహిణి కీలకపాత్రలో నటించారు. ఆమెతో పాటు లిజోమోల్, వినీత్, కలేశ్ రామనాథ్, అనుష్క, దీప ప్రధాన పాత్రలు పోషించారు. తాజాగా కాదల్ ఎంబదు పొదువుడమై మూవీ 54వ ఇండియన్ పనోరమ అంతర్జాతీయ చిత్రోత్సవాలకు ఎంపికైనట్లు మేకర్స్ తెలిపారు. తమిళ చిత్రం కాదల్ ఎంబదు పొదువుడమై ఎంపిక కావడం విశేషం. ఈ ఏడాది నవంబర్ 20 నుంచి 28వ తేదీ వరకు గోవాలో జరగనున్నాయి. ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ.. ఈ ఆధునికకాలంలో మనుషుల భావాలు, దురాలోచనలు, సామాజిక పరిస్థితి, విజ్ఞానం వంటి అంశాలతో కూడిన ఆధునిక ప్రేమను ఆవిష్కరించే కథా చిత్రంగా ఇది ఉంటుందన్నారు. కాగా 2023 ఏడాదిగానూ ఇండియన్ పనోరమ చిత్రోత్సవాలకు 408 చిత్రాలు నామినేట్ కాగా.. అందులో 25 చిత్రాలు మాత్రమే ఎంపికై నట్లు చెప్పారు. ఆ 25 చిత్రాల్లో తమ కాదల్ ఎంబదు పొదువుడమై చిత్రం చోటుచేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. కాగా.. ఈ సినిమాకు కన్నన్ నారాయణన్ సంగీతమందించగా.. శరవణన్ సినిమాటోగ్రఫీ అందించారు. -
ఉత్తర కరోలినాలో శక్తి అవార్డ్స్ 2023
-
TSRTC: ఆర్టీసీ సరికొత్త ప్రయోగం.. 286 మందికి అవార్డులు..
సాక్షి, హైదరాబాద్: టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు అవార్డులు అందజేశారు సంస్థ ఎండీ వీసీ సజ్జనార్. వినూత్న కార్యక్రమాలతో ప్రజలకు మరింతగా చేరువై దేశానికే #TSRTC మోడల్‌గా నిలిచిందన్నారు. టీఎస్ఆర్టీసీ ముందు 100 రోజుల గ్రాండ్ ఫెస్టివల్ ఛాలెంజ్ ఉందని తెలిపారు. ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా సజ్జనార్.. వినూత్న కార్యక్రమాలతో ప్రజలకు మరింతగా చేరువై దేశానికే #TSRTC మోడల్‌గా నిలిచింది. ప్రయాణికుల ఆదరణ, ఉద్యోగుల సమిష్టి కృషి, అధికారుల ప్రణాళిక వల్ల సంస్థకు సత్పలితాలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ లోని టీఎస్ఆర్టీసీ కళాభవన్ లో శనివారం శ్రావణమాసం, రాఖీ పౌర్ణమి ఛాలెంజ్ లతో పాటు జోనల్ స్థాయి ఉత్తమ ఉద్యోగులు, ఎక్స్ ట్రా మైల్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు హాజరయ్యారు. ఉన్నతాధికారులతో కలిసి ఆయన ఉత్తమ ఉద్యోగులను ఘనంగా సన్మానించారు. రాఖీ పౌర్ణమి ఛాలెంజ్, శ్రావణ మాసం ఛాలెంజ్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన రీజయన్లకు ట్రోఫీలను అందజేశారు. మొత్తం 286 మందికి అవార్డులు వరించగా.. వారిలో రాఖీ పౌర్ణమి ఛాలెంజ్ కు 36, శ్రావణ మాసం ఛాలెంజ్ కు 30, జోనల్ స్థాయి ఉద్యోగులకు 180, ఎక్స్ ట్రా మైల్ లో 25, లాజిస్టిక్స్ విభాగంలో 15 మంది ఉన్నారు. డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్స్, హెల్పర్స్, శ్రామిక్ లతో పాటు సూపర్వైజర్స్, డిపో మేనేజర్స్, డిప్యూటీ ఆర్ఎంలు, ఆర్ఎంలు.. ఇలా అన్ని విభాగాల వారు పురస్కారాలను అందుకున్నారు. ఈ అవార్డుల ప్రదానోత్సవంలో సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ గారు మాట్లాడుతూ.. గత రెండేళ్లలో సంస్థలో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు. క్లిష్ట పరిస్థితులను తట్టుకుని తన కాళ్ల మీద తాను నిలబడగలిగే స్థాయికి సంస్థ ఎదగడం చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రస్థానంలో సిబ్బంది కృషి ఎనలేనిదని వివరించారు. సంస్థ విసిరిన ప్రతి ఛాలెంజ్ ను సిబ్బంది విజయవంతం చేశారని చెప్పారు. రాఖీ పౌర్ణమికి రికార్డుస్థాయిలో ఒక్క రోజులో రూ.22.65 కోట్ల రాబడి రావడం గొప్ప విషయమన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ ఇంతమొత్తంలో ఆదాయం రాలేదన్నారు. శ్రావణ మాసంలో ఛాలెంజ్ లోనూ గత ఏడాదితో పోల్చితే అదనపు ఆదాయం వచ్చిందన్నారు. ఈ రికార్డుల్లో భాగమైన సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. నిజాయతీగా, నిబద్దతతో ఉత్తమ సేవలందించే అధికారులు, ఉద్యోగులే సంస్థకు నిజమైన బ్రాండ్ అంబాసిండర్లని పేర్కొన్నారు. వినూత్న కార్యక్రమాలతో ప్రజలకు మరింతగా చేరువై దేశానికే #TSRTC మోడల్ గా నిలిచిందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ జ్జనర్, ఐపీఎస్ (@SajjanarVC) గారు అన్నారు. ప్రయాణికుల ఆదరణ, ఉద్యోగుల సమిష్టి కృషి, అధికారుల ప్రణాళిక వల్ల సంస్థకు సత్పలితాలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్… pic.twitter.com/G5vLCs4aRV — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) October 7, 2023 100 రోజుల గ్రాండ్ ఫెస్టివల్ ఛాలెంజ్ “రాబోయే 100 రోజులు సంస్థకు ఎంతో కీలకం. దసరా, దీపావళి, క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతితో పాటు శుభముహుర్తాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు మెరుగైన నాణ్యమైన సేవలందించాలనే ఉద్దేశంతో.. 100 రోజుల గ్రాండ్ ఫెస్టివల్ ఛాలెంజ్ ను నిర్వహించాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించడం జరిగింది. ఈ నెల 15 నుంచి వచ్చే ఏడాది జనవరి 22 వరకు ఈ ఛాలెంజ్ అమల్లో ఉంటుంది. గత ఛాలెంజ్ ల మాదిరిగానే పనిచేసి..ప్రయాణికులను క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేయాలి.” అని సజ్జనర్ కోరారు. పండుగలకు సిబ్బంది చేస్తోన్న త్యాగం గొప్పదని, ఇంట్లో కుటుంబసభ్యులను, బంధుమిత్రులను విడిచి విధులు నిర్వర్తిస్తున్నారని కొనియాడారు. పండగ సమయాల్లో పోలీస్, రవాణా శాఖలు సంస్థకు ఎంతగానో సహకరిస్తున్నాయని గుర్తుచేశారు. “టీఎస్ఆర్టీసీ కష్టకాలంలో ఉన్నప్పటికీ 2017 నుంచి విడతల వారీగా పెండింగ్ లో ఉన్న 9 డీఏలను ఉద్యోగులకు సంస్థ మంజూరు చేసింది. బకాయిల విషయంలో ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇవ్వాల్సిన ఉన్న అరియర్స్, సీసీఎస్ నిధులు, బాండ్లకు సంబంధించిన ప్రతి రూపాయిను కూడా చెల్లిస్తాం. బకాయిలు చెల్లింపు విషయంలో ఒక ప్రణాళికను సంస్థ రూపొందించింది.” అని సజ్జనర్ తెలిపారు. ఒకవైపు ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పిస్తూనే.. సిబ్బంది సంక్షేమానికి కూడా సంస్థ కృషి చేస్తోందని స్పష్టం చేశారు. ఈ నవంబర్, డిసెంబర్ నుండి 1000 కొత్త డీజిల్ బస్సులను ప్రయాణికులకు అందుబాటులో తీసుకువస్తున్నామని తెలిపారు. రాబోయే కాలంలో హైదరాబాద్ లో పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని ప్లాన్ చేసినట్లు వివరించారు. ఛాలెంజ్‌లో అత్యుత్తమ ప్రదర్శనకు నగదు పురస్కారాలు - రాఖీ పౌర్ణమి ఛాలెంజ్: పస్ట్ బెస్ట్ రీజియన్ వరంగల్(రూ.లక్ష) సెకండ్ బెస్ట్ రీజియన్ నల్లగొండ(రూ.75 వేలు), థర్డ్ బెస్ట్ రీజియన్ కరీంనగర్(రూ.50 వేలు). - శ్రావణ మాసం ఛాలెంజ్: పస్ట్ బెస్ట్ రీజియన్ వరంగల్(రూ.లక్ష), సెకండ్ బెస్ట్ రీజియన్ నల్లగొండ (రూ.75 వేలు), థర్డ్ బెస్ట్ రీజియన్ ఆదిలాబాద్(రూ.50 వేలు). ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, కృష్ణకాంత్, పురుషోత్తం, వెంకటేశ్వర్లు, వినోద్ కుమార్, సీఎంఈ రఘునాథరావు, సీఎఫ్ఎం విజయ పుష్ఫ, సీసీవోఎస్ విజయ భాస్కర్, సీసీఈ రాంప్రసాద్, సీటీఎం(కమర్షియల్) సుదర్శన్, తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా ఏఐఐ వార్షికోత్సవ వేడుకలు.. ఇద్దరు భారతీయల అరుదైన ఘనత
అమెరికా న్యూయార్క్ నగరంలో ఇంటర్నేషన్ అడ్వటైజింగ్ అసోసియేషన్ (ఐఏఏ) వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భారత్‌కు చెందిన శ్రీనివాసన్ స్వామీ, రమేష్ నారాయణ్‌లకు ఐఏఏ అసోసియేషన్ ‘నార్త్ స్టార్’ అవార్డులతో ఘనంగా సత్కరించింది. 2014లో ఐఐఏ గ్లోబుల్ ప్రెసిడెంట్‌గా శ్రీనివాసన్ స్వామి ప్రశంసలందుకున్నారు. 2014 లండన్‌లో జరిగిన ఇన్స్పైర్ అవార్డ్స్‌లో స్వామి, నారాయణ్‌లు గ్లోబుల్ చాంపియన్లుగా గుర్తింపు పొందారు. కాగా, నారాయణ్ ఐఏఏ గ్లోబల్ బోర్డ్‌లో డైరెక్టర్‌గా, దాని ఏపీఏసీ రీజీయన్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. వారిద్దరూ ఐఏఏ భారత బోర్డ్ మాజీ అధ్యక్షులు సేవలందించారు. అడ్వటైజింగ్ విభాగంలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడంపై శ్రీనివాసన్ స్వామి,రమేష్ నారాయణ్‌లను పరిశ్రమ వర్గాల ప్రతినిధుల అభినందనలు తెలుపుతున్నారు. -
తెలంగాణలో ఇద్దరికి జాతీయ సేవాపథకం అవార్డులు
సాక్షి, న్యూఢిల్లీ: స్వచ్ఛంద సేవకు గుర్తింపుగా కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ ఏటా ఇచ్చే జాతీయ సేవా పథకం అవార్డు– 2021–22ను తెలంగాణకు చెందిన ఇద్దరు దక్కించుకున్నారు. హనుమకొండకు చెందిన గుండె పరశురాములు, హైదరాబాద్‌కు చెందిన దావెర మనోజ్ ఖన్నా చేపట్టిన స్వచ్ఛంద సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. శుక్రవారం ఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వారికి అవార్డులు అందజేశారు. గుండె పరశురాములు స్వచ్ఛంద సేవ హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ కళాశాలకు చెందిన ఎన్ఎస్ఎస్ వలంటీరు గుండె పరశురాములు మొక్కలు నాటడం, రక్తదాన శిబిరాలపై చొరవ చూపేవారు. 1,300 మొక్కలు నాటిన పరశురాములు 10 రక్తదాన శిబిరాల్లో పాల్గొన్నారు. స్వచ్ఛభారత్ ప్రచారంలో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలనపై కార్యక్రమాలు చేపట్టారు. కరోనా సమయంలో వాల్‌పోస్టర్లు, షార్ట్ ఫిల్మ్‌ల ద్వారా అవగాహన కల్పించారు. ఉజ్వల యోజన, పీఎం జీవన్‌బీమా యోజన, పీఎం జన్‌ధన్ యోజన తదితర పథకాల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. డిజిటల్ అక్షరాస్యత, పోక్సో చట్టాల గురించి దత్తత గ్రామాల్లో అవగాహన కల్పించారు. పథకాలపై మనోజ్ ఖన్నా ప్రచారం మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీకి చెందిన ఎన్ఎస్ఎస్ వలంటీరు మనోజ్ ఖన్నా ఉజ్వల యోజన, పీఎం జీవన్‌బీమా యోజన, పీఎం జన్‌ధన్ యోజన వంటి ప్రచార కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. డిజిటల్ అక్షరాస్యత, పోక్సో చట్టాలపై దత్తత గ్రామాల్లో 650పైగా కార్యక్రమాలు నిర్వహించారు. పదో తరగతి విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ వర్క్‌షాపులు నిర్వహించారు. ఇతర వలంటీర్లతో కలిసి శానిటరీ ప్యాడ్లు పంపిణీ చేయడం, కోవిడ్ వేళ పేద పిల్లలకు ఆహారం సేకరించి అందించడం వంటి పనులు చేశారు. మనోజ్ రక్తదాన శిబిరాల ద్వారా 150 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. -
సంగీత నాటక అకాడమీ అవార్డుల ప్రదానం
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలకు చెందిన పలు వురికి సంగీతనాటక అకాడమీ అవార్డులు ప్రదానం చేసింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో శనివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగ్ దీప్ ధన్‌ఖడ్ గ్రహీతలకు అవార్డు అందజేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని కూచిపూడికి చెందిన మహంకాళి శ్రీమన్నారాయణ మూర్తి (కూచిపూడి), ముమ్మిడి వరానికి చెందిన పండితారాధ్యుల సత్యనారాయణ (హరికథ), మచిలీపట్నానికి చెందిన మహాభాష్యం చిత్తరంజన్ (సంప్రదాయ సంగీతం–సుగమ్ సంగీత్), తెలంగాణ నుంచి కోలంక లక్ష్మణరావు (కర్ణాటక సంగీతం–మృదంగం) (స్వస్థలం పిఠాపురమైనా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు), నల్లగొండ జిల్లా కూర్మపల్లికి చెందిన ఐలయ్య ఒగ్గరి (ఒగ్గు కథ), వరంగల్‌కు చెందిన బాసని మర్రెడ్డి (థియేటర్ డైరెక్టర్)లు అవార్డులు అందుకున్నారు. అవార్డు గ్రహీతలను రూ.లక్ష బహుమతి, తామ్రపత్రం, శాలువాతో సత్కరించారు. -
ప్రతిష్టాత్మక 'ఐఏఏ' అవార్డు విజేతలు వీరే..
ఇండియా చాప్టర్ ఆఫ్ ఇంటర్నేషనల్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్ (IAA) తన ప్రతిష్టాత్మకమైన IndAA అవార్డుల ఎనిమిదవ ఎడిషన్ కార్యక్రమాన్ని 2023 సెప్టెంబర్ 1న ముంబైలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్ నిర్వహించింది. ఈ ఈవెంట్‌కు ఏబీపీ నెట్వర్క్ అండ్ సోనీ పిక్చర్స్ నెట్వర్క్ కో-పార్ట్నర్గా ఉండగా.. నెట్వర్క్18 & జియో సినిమా అసోసియేట్ పార్ట్నర్గా ఉన్నాయి. ఈ కార్యక్రమంలో 15 క్రియేటివ్ ఏజెన్సీలు 18 ప్రోడక్ట్ అండ్ సర్వీస్ కేటగిరీలు.. ఒక ప్రత్యేక కేటగిరీలో అవార్డులు పొందాయి. అవార్డులలో 102 క్యాంపెయిన్స్ షార్ట్‌లిస్ట్ చేయగా.. వీటిలో డిజైన్ ప్రకారం, ప్రతి విభాగంలో ఒకటి మాత్రమే ఇవ్వడం జరిగింది. క్లోజ్ కాంటెస్ట్ విషయంలో మాత్రం జ్యూరీ చాలా చర్చల తర్వాత ఉమ్మడి విజేతలను ప్రకటించింది. క్రియేటివ్ ఏజెన్సీలలో లియో బర్నెట్, ముల్లెన్‌లోవ్ లింటాస్ గ్రూప్, ఒగిల్వీ ఆ కేటగిరీలో ఒక్కొక్కటి మూడు IndIAA అవార్డులను గెలుచుకున్నారు. కాగా బీబీడీవో, డీడీబీ ముద్ర అండ్ టీబీడబ్ల్యుఏ రెండు అవార్డులను గెలుచుకున్నాయి. గ్రే గ్రూప్, కెహత్ కబీరా పిక్చర్స్, మెక్కాన్ వరల్డ్‌గ్రూప్, పబ్లిసిస్ వరల్డ్‌వైడ్, రీడిఫ్యూజన్, ఎస్జీ మీడియా, టాలెంటెడ్, ది స్క్రిప్ట్ రూమ్, ది వోంబ్, టిల్ట్ బ్రాండ్ సొల్యూషన్స్ వంటి ఇతర క్రియేటీవ్ ఏజెన్సీలు & క్రియేటర్లు IndAA అవార్డును గెలుచుకున్నాయి. ఇక ఫుడ్ అండ్ బెవెరగె (పానీయాలు) & పర్సనల్ కేర్ కేటగిరి HUL బ్రాండ్లు విజేతలుగా నిలిచాయి. HDFC లైఫ్ ఇన్సూరెన్స్‌లో గెలుపొందగా, HDFC మ్యూచువల్ ఫండ్ బ్యాంకింగ్ & ఫైనాన్స్‌లో గెలిచింది. ఈ సందర్భంగా జ్యూరీ ఛైర్మన్ అండ్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్, నెస్లే ఇండియా 'సురేష్ నారాయణ్' మాడ్లాడుతూ.. జ్యూరీ ఛైర్మన్‌గా నా ఐదవ సంవత్సరంలో ఇక్కడ సన్నిహితంగా పరిచయం చేసుకున్నాను. దేశంలోని గొప్ప క్రియేటివ్ మైండ్స్ కలిగిన కొందరిలో ఒకడిగా ఉన్నందుకు చాలా గౌరవంగా భావిస్తున్నానన్నారు. ఈ సందర్భంగా 'జ్యూరీ చైర్ కా శంబోధన్' అనే పేరుతో ఒక చిన్న కవితతో అందరి నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ఈ కార్యక్రమంలో IAA ప్రెసిడెంట్ అవినాష్ పాండే, IAA ఇండియా అవార్డ్స్ ఛైర్మన్ అభిషేక్ కర్నాని కూడా మాట్లాడారు. బాలీవుడ్ యాక్టర్ ఆయుష్మాన్ ఖురానాను ఏఐఐ సత్కరించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'లక్ష్మీదేవి కంటే ముందు సరస్వతీ దేవి వచ్చిందని తన తండ్రి చెప్పినట్లు వెల్లడించాడు. -
అవార్డులు నాకు చెత్తతో సమానం.. స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్!
తమిళ స్టార్ హీరో విశాల్ నటిస్తోన్న తాజా చిత్రం 'మార్క్ ఆంటోనీ'. ఈ చిత్రంలో రీతూ వర్మ జంటగా నటిస్తోంది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీని ఎస్. వినోద్ కుమార్ నిర్మించారు. ఈనెల 15న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో ఎస్జే సూర్య, సునీల్, సెల్వ రాఘవన్ ముఖ్య పాత్రలు పోషించారు. అయితే తాజాగా చిత్ర యూనిట్ చెన్నైలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు విశాల్. ఈ సందర్భంగా ఇటీవల కేంద్రం ప్రకటించిన జాతీయ చలనచిత్ర అవార్డులపై ప్రశ్నించగా.. ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. అవార్డులపై తనకు ఎలాంటి నమ్మకం లేదని, ఒకవేళ తనకు అవార్డులు వస్తే వాటిని చెత్తబుట్టలో పడేస్తానని విమర్శించారు. (ఇది చదవండి: స్టార్ హీరోయిన్ పెళ్లి వాయిదా.. ఇప్పట్లో లేనట్లే!) విశాల్ మాట్లాడుతూ.. ' నాకు అవార్డులపై నమ్మకం లేదు. ప్రజలు, అభిమానులు ఇచ్చేదే నిజమైన అవార్డు. ప్రేక్షకుల ఆశీస్సులతోనే ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నా. ఒకవేళ నా చిత్రాలకు అవార్డు వచ్చినా వాటిని చెత్తబుట్టలో పడేస్తా. రాజకీయ ఎంట్రీపై ప్రశ్నించగా.. జీవితంలో ఏదైనా జరగొచ్చు. భవిష్యత్తులో ఏదైనా జరగొచ్చు. మన చేతుల్లో లేదు.' అంటూ బదులిచ్చారు. \ (ఇది చదవండి: 1980ల్లో స్టార్ హీరోయిన్.. మద్యానికి బానిసై కెరీర్ నాశనం!) -
ఉత్తమ ఉపాధ్యాయులుగా 54 మంది ఎంపిక
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రస్థాయిలో అవార్డులకు అర్హుల ఎంపికను పాఠశాల విద్యాశాఖ పూర్తి చేసింది. ఈ అవార్డులకు అర్హతలున్న వారికి సంబంధించి జిల్లా స్థాయిలో ప్రతిపాదనలు స్వీకరించిన పాఠశాల విద్యాశాఖ యంత్రాంగం ప్రత్యేక కమిటీ ద్వారా పరిశీలన చేసింది. ఇందులో భాగంగా నాలుగు కేటగిరీల్లో 97 ప్రతిపాదనలు పరిశీలించిన పరిశీలన కమిటీ... 42 మందిని ఎంపిక చేసింది. అదేవిధంగా ప్రత్యేక కేటగిరీలో మరో 12 మందికి అవకాశం కల్పించింది. మొత్తంగా రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు 54 మందిని ఎంపిక చేసిన పాఠశాల విద్యా శాఖ కమిషనర్... శనివారం వారి పేర్ల జాబితాను ప్రకటించింది. మంత్రి సబితతో ఉత్తమ ఉపాధ్యాయుల భేటీ రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికైన ఉపాధ్యాయులతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ఈ నెల 4వ తేదీన మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ(ఎంసీఆర్హెచ్ఆర్ఐ)లో భేటీ కానున్నారు. ఉత్తమ ఉపాధ్యాయుల అనుభవాలు, విద్యాభివృద్ధికి దోహదపడే ఆలోచనలను వారు మంత్రితో పంచుకోనున్నారు. ఉత్తమ ఉపాద్యాయ అవార్డుకు ఎంపికైన టీచర్లు ఈనెల 4వ తేదీన మధ్యాహ్నం 2గంటల కల్లా పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌లో రిపోర్టు చేయాలని సూచించారు. రవీంద్రభారతిలో రాష్ట్రస్థాయి వేడుకలు... ఈనెల 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రస్థాయి వేడుకలను రవీంద్రభారతిలో నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఉదయం 10గంటల నుంచి వేడుకలు ప్రారంభమవుతాయని వివరించింది. ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో పాటు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితారెడ్డితో పాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. -
ఇలా ఉంటే .. అవార్డులెలా వస్తాయి..
పేరుకు స్మార్ట్ సిటీ.. కానీ పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తం. అందుకేనేమో.. ఇటీవల పారిశుద్ధ్య విభాగంలో ఇండియన్ స్మార్ట్ సిటీ అవార్డ్స్–2022లో వరంగల్ నగరం అడ్రస్ గల్లంతైంది. పారిశుద్ధ్య విభాగంలో చేపట్టిన సంస్కరణల్లో నగరం ఫెయిల్ కావడంతో అవార్డు దక్కకుండా పోయింది. ఇందుకు నిదర్శనమే ఇలాంటి దృశ్యాలు. వరంగల్ రైల్వేస్టేషన్, బస్టాండ్ వద్ద మురుగు నీరు రోజుల తరబడి నిలిచి తీవ్ర దుర్గంధం వెలువడుతూ దోమలు, ఈగలు, పందులకు ఆవాసంగా మారింది. కమిషనర్ గారూ దీనివైపు కూడా ఒకసారి చూడండి అంటూ నగరవాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. – సాక్షి స్టాఫ్‌ఫొటోగ్రాఫర్, వరంగల్ -
నదుల అనుసంధానానికి ట్రిబ్యునళ్ల అవార్డులే అడ్డంకి!
సాక్షి, అమరావతి: కడలిపాలవుతోన్న నదీ జలాలను.. నీటి కొరత ఉన్న నదులకు మళ్లించడం ద్వారా దేశంలో కరవు పరిస్థితులను రూపుమాపవచ్చుననే లక్ష్యంతో చేపట్టిన నదుల అనుసంధానానికి నదీ జల వివాదాల ట్రిబ్యునళ్ల అవార్డులే ప్రతిబంధకంగా మారాయని కేంద్రానికి జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ(ఎన్‌డబ్ల్యూడీఏ) నివేదించింది. ట్రిబ్యునళ్ల అవార్డులను చూపి.. నదీ పరీవాహక ప్రాంతాల(బేసిన్)లోని రాష్ట్రాలు వాటా కోసం పట్టుబడుతున్నాయని పేర్కొంది. నదుల అనుసంధానానికి వాటి బేసిన్ల పరిధిలోని రాష్ట్రాలతో పలుమార్లు సంప్రదింపులు జరిపినా ఏకాభిప్రాయాన్ని సాధించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేసింది. దాంతో కెన్–బెటా్వమినహా మిగతా అనుసంధానాలు ప్రతిపాదన దశను దాటడం లేదని వివరించింది. ఈ అంశంలో విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని కోరుతూ కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌కు ఎన్‌డబ్ల్యూడీఏ డైరెక్టర్ జనరల్ భోపాల్ సింగ్ ఇటీవల నివేదిక ఇచ్చారు. దేశంలో హిమాలయ నదుల అనుసంధానానికి 14.. ద్వీపకల్ప నదులను అనుసంధానం చేయడానికి 16 లింక్‌లను ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదించింది. నదుల అనుసంధానాన్ని వేగవంతం చేయడానికి సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి అధ్యక్షతన అన్ని రాష్ట్రాల జలవనరుల శాఖ మంత్రులు, కార్యదర్శులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. నదుల అనుసంధానంపై బేసిన్ల పరిధిలోని రాష్ట్రాలను ఒప్పించేందుకు సంప్రదింపులు జరుపుతోంది. కాగా, పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు మళ్లించే 80 టీఎంసీల గోదావరి జలాలకుగానూ.. కృష్ణా జలాల్లో మహారాష్ట్ర 14, కర్ణాటక 21 టీఎంసీలను అదనంగా వాడుకోవడానికి గోదావరి ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చింది. మిగతా 45 టీఎంసీలను నాగార్జునసాగర్‌కు ఎగువన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కృష్ణా జలాలను అదనంగా వాడుకోవడానికి అనుమతి ఇచ్చింది. కావేరి, కృష్ణా జల వివాదాల పరిష్కారానికి ఏర్పాటైన ట్రిబ్యునళ్లు కూడా ఇదే రీతిలో నిర్ణయాలను ప్రకటించాయి. ఇప్పుడు ఆ ట్రిబ్యునళ్ల అవార్డులను చూపుతున్న రాష్ట్రాలు.. నదుల అనుసంధానం ద్వారా మళ్లించే నీటిలో అదనపు వాటా కోసం పట్టుబడుతున్నాయి. గోదావరి–కావేరి అనుసంధానం తొలి దశలో 141 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా(నాగార్జునసాగర్), పెన్నా(సోమశిల) మీదుగా కావేరికి తరలించేందుకు ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదన అమలు చేస్తే.. కృష్ణా జలాల్లో అదనపు వాటా కావాలంటూ మహారాష్ట్ర, కర్ణాటకలు పట్టుబడుతున్నాయి. కావేరికి మళ్లించే గోదావరి జలాలకుగానూ కావేరి జలాల్లో అదనపు వాటా ఇవ్వాలంటూ కర్ణాటక, కేరళ డిమాండ్ చేస్తున్నాయి. దాంతో ఈ అనుసంధానంపై ఏకాభిప్రాయం సవాల్‌గా మారింది. విధానపరమైన నిర్ణయం తీసుకుంటేనే..: నీటి లభ్యత అధికంగా ఉన్న నదుల నుంచి నీటి కొరత తీవ్రంగా ఉన్న నదులకు మళ్లించే నీటి విషయంలో రాష్ట్రాలతో సంప్రదించి, కేంద్రం విధానపరమైన నిర్ణయం తీసుకుంటేనే నదుల అనుసంధానం పట్టాలెక్కే అవకాశం ఉందని ఎన్డబ్ల్యూడీఏనే స్పష్టం చేస్తోంది. ఒక నది నుంచి మళ్లించిన నీటికిగానూ.. మరొక నదిలో అదనపు వాటా వాడుకోవడానికి ట్రిబ్యునళ్లు ఇచ్చిన అనుమతిని నదుల అనుసంధానానికి మినహాయిస్తేనే నదుల అనుసంధానం సాకారమవుతుందని సాగునీటిరంగ నిపుణులు తేల్చిచెబుతున్నారు. -
సత్తాచాటిన కాకినాడ.. స్మార్ట్ సిటీ అవార్డుల్లో రెండో స్థానం
కాకినాడ: పెన్షనర్స్ ప్యారడైజ్‌గా, ప్లాన్డ్ సిటీగా, రెండో మద్రాస్‌గా ప్రాచుర్యం పొందిన కాకినాడ మరోసారి దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును కై వసం చేసుకుంది. మూడేళ్ల క్రితం దేశంలోనే అత్యంత నివాసయోగ్య నగ రాల్లో (బెస్ట్ లివింగ్ సిటీ) నాలుగో స్థానం సాధించిన కాకినాడ ఇప్పుడు మరోసారి జాతీయ స్థాయిలో సత్తా చాటింది. ఇండియన్ స్మార్ట్ సిటీ అవార్డులు–2022 పోటీలో దేశంలోనే కాకినాడ నగరం రెండో స్థానంలో నిలిచింది. తద్వారా ఈ ప్రాంతం దేశవ్యాప్తంగా ప్రత్యే క గుర్తింపు పొందింది. కేంద్ర ప్రభుత్వ గృహనిర్మాణం, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో దేశంలోని 100 స్మార్ట్‌సిటీలు ఈ పోటీలో పాల్గొన్నాయి. ఇండోర్ మొదటి స్థానం సాధించగా.. మిగిలిన నగరాలన్నింటినీ అధిగమించి కాకినాడ రెండో స్థానాన్ని కై వసం చేసుకుంది. వచ్చే నెల 27వ తేదీన ఇండోర్‌లో జరిగే కార్యక్రమంలో కాకినాడ నగరానికి ఈ అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేయనున్నారు. అవార్డు ఎందుకు దక్కిందంటే.. ► పారిశుధ్య విభాగంలో చేపట్టిన పాలనా సంస్కరణలు ఈ గుర్తింపునకు ప్రధాన కారణంగా నిలిచాయి. ► ఇంటింటికీ తిరిగి చెత్త సేకరించడం, తడి – పొడి చెత్త వేర్వేరుగా సేకరించడం, ఈ అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో చేసిన కృషికి కూడా ఈ గుర్తింపు దక్కడానికి కారణం. ► సాంకేతిక పరంగా కూడా పారిశుధ్య విభాగంలో అనేక మార్పులు తీసుకువచ్చారు. పారిశుధ్య వాహనాల కదలికలను గుర్తించేందుకు జీపీఎస్ విధానం అమలు చేశారు. ► చెత్త సేకరణకు 108 హూపర్, టిప్పర్ వాహనాలు సమకూర్చారు. ► స్మార్ట్ సిటీని 380 మైక్రో ప్యాకెట్లుగా విభజించారు. ప్రతి మైక్రో ప్యాకెట్‌కు ఇద్దరు పారిశుధ్య కార్మికులను కేటాయించి ప్రణాళికాబద్ధంగా చెత్త సేకరిస్తున్నారు. ► ఇక సేకరించిన చెత్త నుంచి సంపద సృష్టించే లక్ష్యంతో రూ.కోటితో ఇంటిగ్రేటెడ్ సాలిడ్‌వేస్ట్ మేనేజ్మెంట్ కాంప్లెక్స్ ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్ వేస్ట్ వంటి పొడి చెత్తను 16 రకాలుగా విభజించి ప్రాసెస్ చేయడం, తడి చెత్త నుంచి ఎరువుల తయారీ వంటి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ► ఈ చర్యలన్నీ జిల్లా కేంద్రమైన కాకినాడ స్మార్ట్ సిటీలో మెరుగైన పారిశుధ్య నిర్వహణకు దోహదం చేశాయి. ► పారిశుధ్య నిర్వహణలో ఇటువంటి సంస్కరణలు దేశంలోనే ఎక్కడా లేని విధంగా విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ►వీటిని సమర్థవంతంగా అమలు చేసేందుకు స్మార్ట్ సిటీ కమిషనర్, మున్సిపల్ ఆరోగ్య అధికారి (ఎంహెచ్ఓ), పారిశుధ్య కార్మికులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కృషి చేశారు. ఇవన్నీ కూడా కాకినాడ ప్రతిష్టను ఇనుమడింపజేసేందుకు దోహదపడ్డాయి. ఇది కాకినాడకు దక్కిన గౌరవం ఇండియన్ స్మార్ట్‌సిటీ అవార్డ్స్–2022లో దేశంలోనే కాకినాడ నగరం రెండో స్థానంలో నిలవడం ఆనందంగా ఉంది. గతంలో కూడా బెస్ట్ లివింగ్ సిటీల్లో కాకినాడ 4వ స్థానం సాధించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యంలో ఇక్కడి అధికారులు చేపట్టిన పాలనా సంస్కరణలు కాకినాడ నగరానికి అరుదైన గౌరవాన్ని, గుర్తింపును తెచ్చి పెట్టాయి. కమిషనర్ నాగనరసింహారావు, ఇతర అధికారులు, పారిశుధ్య కార్మికులు, స్మార్ట్ సిటీ సిబ్బందికి ప్రత్యేక అభినందనలు. – ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, ఎమ్మెల్యే, కాకినాడ సిటీ శ్రమకు తగిన గుర్తింపు పారిశుధ్య విభాగంలో చేపట్టిన పాలనా సంస్కరణలకు సముచిత గుర్తింపు లభించింది. ఇక్కడి పారిశుధ్య సిబ్బంది, అధికారులతో పాటు ప్రజలు, ప్రజాప్రతినిధుల సహకారం వల్లే మంచి ఫలితాన్ని సాధించగలిగాం. జాతీయ స్థాయిలో గుర్తింపు కూడా పొందగలిగాం. కాకినాడ స్మార్ట్ సిటీ జాతీయ స్థాయిలో రెండో స్థానంలో నిలవడానికి కారకులైన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా అభినందనలు. ఇదే స్ఫూర్తితో మరింత బాగా పని చేసి, ప్రజలకు మరిన్ని మంచి సేవలు అందించాలి. – సీహెచ్ నాగనరసింహారావు, కమిషనర్, కాకినాడ సిటీ -
పోలీసు సేవలకు సలాం
సాక్షి, అమరావతి: విధి నిర్వహణలో విశిష్ట సేవలు, ధైర్య సాహసాలు ప్రదర్శించిన ఏపీ పోలీసులకు మంగళవారం విజయవాడలో జరిగిన స్వాతంత్య్ర దినో త్సవంలో సీఎం జగన్ పతకాలు అందజేశారు. 2021, 2022, 2023కు సంబంధించి 65 మంది పో లీసులు కేంద్రం పరిధిలో ప్రకటించిన ప్రెసిడెంట్ పో లీస్ మెడల్(పీపీఎం), పోలీస్ మెడల్ మెరిటోరియస్ సర్విస్(పీఎం), పోలీస్ మెడల్ ఫర్ గ్యాలెంటరీ (పీ ఎంజీ), అసాధారణ్ ఆసూచన కుశ లత పదక్‌తో పా టు ముఖ్యమంత్రి శౌర్య పతకాలను అందుకున్నారు. పీపీఎం 2021–22: భావనాసక్సేనా (జాయింట్ సె క్రటరీ, విదేశాంగ శాఖ, న్యూఢిల్లీ), వెంకటరామిరెడ్డి, (ఐజీపీ–శిక్షణ), పి.సీతారాం(గ్రేహౌండ్స్ క మాండెంట్), ఎన్.సుధాకర్‌రెడ్డి (ఎస్డీపీఓ, పలమనేరు) పీఎం 2021–22: ఎస్వీ రాజశేఖరబాబు (డీఐజీ, లా అండ్ ఆర్డర్), ఎం.రవీంద్రనాథ్‌బాబు(ఏఐజీ, లా అండ్ ఆర్డర్), కె.రఘువీర్‌రెడ్డి(ఎస్పీ, నంద్యాల), కేఎస్వీ సుబ్బారెడ్డి(కమాండెంట్, 6 బెటాలియన్), కె.నవీన్‌కుమార్(ఏఎస్పీ, గ్రేహౌండ్స్), కె.సుబ్రహ్మ ణ్యం (ఏడీసీపీ, విశాఖ), వి.వి.నాయుడు(ఏసీపీ దిశ, విజయవాడ), సీహెచ్.రవికాంత్ (ఏసీపీ, ఎస్బీ విజ యవాడ), జి.రవికుమార్(డీఎస్పీ, సీఐడీ), కె.వి.రా జారావు, (డీఎస్పీ పీటీఓ), జె.శ్రీనివాసులురెడ్డి (ఎస్ డీపీఓ, నెల్లూరు), వి.శ్రీరాంబాబు(డీఎస్పీ, సీఐడీ), కె.విజయపాల్ (ఎస్డీపీఓ, రాజమండ్రి), సి.శ్రీనివాసరావు (డీఎస్పీ దిశ, ప్రకాశం), జి.వీరరాఘవరెడ్డి (ఎస్డీపీఓ, మార్కాపురం), వై.రవీంద్రరెడ్డి (ఏఆర్ డీఎస్పీ, తిరుపతి), పి.వి.హనుమంతు(అసిస్టెంట్ క మాండెంట్, 6వ బెటాలియన్), బి.విజయ్‌కుమార్ (అసిస్టెంట్ కమాండెంట్, గ్రేహౌండ్స్), బి.గుణరా ము (సీఐ, విజయవాడ), ఎం.కోటేశ్వరరావు (ఎస్ఐ, శ్రీకాకుళం), జి.కృష్ణారావు(ఎస్ఐ, విజయవాడ), ఆర్.రామనాథం, (ఆర్ఎస్ఐ, విజయవాడ), ఇ.శివశంకర్‌రెడ్డి (ఆర్ఎస్ఐ, 2వ బెటాలియన్), ఎం.వెంకటేశ్వర్లు(ఏఆర్ఎస్ఐ, నెల్లూరు), ఎస్.సింహాచలం (ఏఆర్ఎస్ఐ, 3వ బెటాలియన్), టి.నరేంద్రకుమార్ (ఏఎస్ఐ, గుంటూరు), పి.భాస్కర్(ఏఎస్ఐ, కడప), ఎన్.శ్రీనివాస్(ఏఎస్ఐ, కొవ్వూరు), ఎస్.వీరాంజనేయులు(ఏఎస్ఐ, విజయవాడ). పీఎంజీ 2021: ఆర్.రాజశేఖర్ (డీఏసీ), సీహెచ్.సాయిగణేశ్ (డీఏసీ), కె.పాపినాయుడు (ఎస్ఐ, అనకాపల్లి), డి.మబాషా (ఏఏసీ), టి.కేశవరావు(హెచ్‌సీ, ఎస్ఐబీ), ఎం.మునేశ్వరరావు (గ్రేహౌండ్స్ ఎస్సీ), గ్రేహౌండ్స్ జేసీల్లో ఎస్.బుచ్చిరాజు, జి.హరిబాబు, బి.చక్రధర్, ఎం.నాని, పి.అనిల్ కుమార్. అసాధారణ్ ఆసూచన కుశలత పదక్ 2022: సి.శ్రీకాంత్ (ఐజీపీ, సీఐడీ), ఎ.బాబ్జీ (ఎస్ఐబీ, ఎస్పీ), ఇ.జి.అశోక్ కుమార్(ఏఎస్పీ, ఎస్ఐబీ), ఎ.వెంకటరావు(డీఎస్పీ, తీవ్రవాద విభాగం, విశాఖ), కె.నిరీక్షణరావు(ఎస్ఐ, ఎస్ఐబీ). ముఖ్యమంత్రి శౌర్య పతకం(2023): బి.సుధాకర్ (ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్), కె.విజయశేఖర్ (ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఎస్ఐబీ), కె.హరీష్ (ఆర్ఎస్ఐ), పి. రమేశ్(ఆర్ఎస్ఐ, ఎస్ఐబీ), టి.రవికుమార్(ఎస్ఐ, గ్రేహౌండ్స్), గ్రేహౌండ్స్ ఆర్ఎస్ఐలు టి.సత్యనారా యణ, పి.సతీశ్‌కుమార్, సీహెచ్.శివ, గ్రేహౌండ్స్ ఎ స్పీలు షామలరావు, రవి, నాగరాజు, గ్రేహౌండ్స్ జే సీలు ఎస్కే కరీం బాషా, బి.వాసుదేవ రెడ్డి, సయ్యద్ హబీబుల్లా, ఎస్.సిద్దయ్య, ఎం.గౌరునాయుడు. -
29 మంది ఏపీ అధికారులకు పోలీస్ పతకాలు
సాక్షి, న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర హోంశాఖ దేశంలో మొత్తం 954 మంది అధికారులకు సోమవారం పోలీస్ పతకాలను ప్రకటించింది. వీరిలో ఒకరిని రాష్ట్రపతి పోలీస్ శౌర్య పతకం, 229 మందిని పోలీస్ శౌర్య పతకాలు, 82 మందిని రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీస్ పతకాలు, 642 మందిని ప్రతిభా పోలీస్ పతకాలకు ఎంపిక చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు 1 రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీస్ పతకం, 10 ప్రతిభా పోలీస్ పతకాలు, 18 పోలీస్ శౌర్య పతకాలు లభించాయి. విధి నిర్వహణలో విశిష్ట సేవలు అందించినందుకు గాను రాష్ట్రానికి చెందిన అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ) శంఖబ్రత బాగ్చి రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీస్ పతకానికి ఎంపికయ్యారు. రాష్ట్రం నుంచి ప్రతిభా పోలీస్ పతకాలకు ఎంపికైనవారు.. 1. దాడిరెడ్డి మురళీధర్‌రెడ్డి, సీఐ, కర్నూల్ టౌన్ 2. సింగులూరి వెంకటేశ్వరరావు, డీఎస్పీ, ఏలూరు 3. కొండపు ఆనందరెడ్డి, డీసీపీ, విశాఖపట్నం సిటీ 4. సుంకర మునిస్వామి, ఆర్ఐ, మంగళగిరి 5. బెండి కాశీపతి, అసిస్టెంట్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్, విశాఖపట్నం 6. జమ్మలమడుగు నిసార్ అహ్మద్ బాషా, ఏఎస్ఐ 7. బెహార నాగభూషణరావు, ఏఎస్ఐ 8. కన్నూజు వాసు, ఇన్స్పెక్టర్, గుంటూరు 9. మంద సత్యనారాయణ, ఏఎస్ఐ 10. తోట బ్రహ్మయ్య, డీఎస్పీ రాష్ట్రం నుంచి పోలీస్ శౌర్య పతకాలకు ఎంపికైనవారు.. 1. కనపాకల హేమసుందరరావు (ఏఏసీ) 2. మార్పు సుదర్శనరావు (ఎస్సీ) 3. జక్కు దేముడు (జేసీ) 4. పొన్నాడ లవకుమార్ (ఏఏసీ) 5. చిక్కంగౌరి వెంకట రామచంద్రరావు (ఎస్సీ) 6. ముర సత్యనారాయణరావు (జేసీ) 7. మట్టపర్తి సుబ్రహ్మణ్యం (జేసీ) 8. శంఖబతుల వీరవెంకట సత్యనారాయణ (జేసీ) 9. ప్రగడ పోశయ్య (జేసీ) 10. ఏడిగగండ్లూరు అశోక్ కుమార్ (అడిషనల్ ఎస్పీ) 11. పైల పార్వతీశం (ఎస్సీ) 12. గొర్లి రమణబాబు (జేసీ) 13. షేక్ సర్దార్ ఘనీ (ఇన్స్పెక్టర్) 14. గుల్లిపల్లి నాగేంద్ర (జేసీ) 15. కోమట్ల రామచంద్రారెడ్డి (జేసీ) 16. దాసరి సురేష్ బాబు (జేసీ) 17. ఏపూరి మధుసూదన్‌రావు (జేసీ) 18. పాళ్యం మహేశ్వరరెడ్డి (ఏఏసీ) -
ఐదుగురు రాష్ట్ర పోలీసులకు జాతీయ పురస్కారాలు
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: అత్యుత్తమ నేర పరిశోధన చేసిన 140 మంది పోలీసు అధికారులను 2023 సంవత్సరానికి కేంద్ర హోంమంత్రి పతకానికి ఎంపిక చేశారు. నేర పరిశోధనలో ఉన్నత ప్రమాణాలను ప్రోత్సహించడంలో భాగంగా కేంద్ర హోంశాఖ ఈ పతకాలను 2018 నుంచి అందిస్తోంది. ఈ ఏడాది తెలంగాణ నుంచి ఐదుగురు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఐదుగురు పోలీసు అధికారులు ఈ పతకాలకు ఎంపికయ్యారు. ఇందులో తెలంగాణ నుంచి ఎస్ఐబీ అడిషనల్ ఎస్పీ తిరుపతన్న, బోధన్ ఏసీపీ కేఎం కిరణ్‌కుమార్, ఇంటెలిజెన్స్ డీఎస్పీ రాజుల సత్యనారాయణరాజు, వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ యం.జితేందర్‌రెడ్డి, ఏసీపీ భూపతి శ్రీనివాసరావు పురస్కారాలు పొందారు. ఆంధ్రప్రదేశ్ నుంచి సీఐ అశోక్ కుమార్ గుంట్రెడ్డి, సీఐ మన్సూరుద్దీన్ షేక్, డీఎస్పీ ధనుంజయుడు మల్లెల, ఏఎస్పీ సుప్రజ కోర్లకుంట, డీఎస్పీ రవిచంద్ర ఉప్పుటూరి అవార్డులు పొందారు. ఎనిమిది మందికి జీవితఖైదు – అడిషనల్ ఎస్పీ తిరుపతన్న ప్రస్తుతం ఎస్ఐబీ అడిషనల్ ఎస్పీగా పనిచేస్తున్న మేకల తిరుపతన్న.. 2016లో సంగారెడ్డి డీఎస్పీగా పనిచేస్తున్న సమయంలో కంగ్టి పోలీస్ స్టేషన్లో ఓ గిరిజనుడి హత్యకేసు దర్యాప్తులో కీలకంగా పనిచేశారు. పక్కా సాక్ష్యాధారాలతో చార్జిషీట్ నమోదు చేయడంతో ఈ కేసులో మొత్తం 8 మంది నిందితులు దోషులుగా తేలారు. వారికి గత ఫిబ్రవరిలో జీవిత ఖైదు విధించారు. హత్యాచారం కేసులో దర్యాప్తునకు.. – ఏసీపీ మూల జితేందర్ రెడ్డి వరంగల్ పోలీస్ కమిషన రేట్లో ప్రస్తుతం ఎస్బీ ఏసీ పీగా విధులు నిర్వర్తి స్తున్న యం.జితేందర్‌రెడ్డి హనుమకొండ ఏసీపీగా పనిచేసే సమయంలో ఓ కేసు దర్యాప్తునకు అవార్డు దక్కింది. 2020 జనవరిలో హనుమకొండ రాంనగర్లో ఓ యువతిపై అత్యాచారం, అనంతరం హత్య చేసిన కేసులో దర్యాప్తు చేసి సాక్ష్యాలు కోర్టుకు సమర్పించారు. నిందితుడుకి యావజ్జీవ శిక్ష పడింది. ఆరేళ్ల పాపపై హత్యాచార కేసులో దర్యాప్తునకు... – డీఎస్పీ కె.ఎం.కిరణ్‌కుమార్, ఏసీపీ బోధన్ ప్రస్తుతం బోధన్ ఏసీపీగా పని చే స్తున్న కమ్మాయిపల్లె మల్లికార్జున కిరణ్‌కుమార్ భూపాలపల్లి డీ ఎస్పీగా పని చేస్తున్నప్పుడు 2017 నవంబర్‌లో రేగొండ మండలంలోని గోరికొత్తపల్లి గ్రామంలో ఆరేళ్ల దళిత పాపపై అత్యాచారం చేసి గొంతునులిమి హత్య చేసిన కేసు నమోదైంది. ఈ కేసులో నిందితుడు కటకం శివను 3 రోజుల్లోనే గుర్తించి 6 నెలల్లో చార్జిషీట్ దాఖలు చేశారు. కటకం శివకు యావజ్జీక శిక్ష పడింది. అనాథ బాలిక కేసులో... – డీఎస్పీ సత్యనారాయణరాజు అమీన్పూర్లో అనాథ బాలికపై నెలలపాటు లైంగిక దాడి చేయడం, ఆమె మృతికి కారణమైన కేసు దర్యాప్తును నారాయణ ఖేడ్ డీఎస్పీగా పని చేస్తున్న రాజుల సత్యనారాయణరాజుకు అప్పగించారు. ఈ కేసు దర్యాప్తులో సాంకేతిక ఆధారాలను పక్కాగా సేకరించడంతో ఈ కేసులో ముగ్గురు నిందితులకు యావజ్జీవ శిక్ష పడింది. -
జాతీయ బాలల పురస్కారాలు.. దరఖాస్తులకు ఆహ్వానం
సాక్షి, విజయవాడ: ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాలల పురస్కారాలు-2024 కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఏపీ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు తెలిపారు. ఏపీకి చెందిన వివిధ రంగాలలో ప్రత్యేక ప్రతిభ కనబర్చిన 18 సంవత్సరాల లోపు బాలబాలికలు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. క్రీడలు, సామాజిక సేవా రంగం, ధైర్య సాహసాలు, నూతన ఆవిష్కరణలు, పర్యావరణ పరిరక్షణ , సాంస్కృతిక సంప్రదాయాలు, శాస్త్రీయ మరియు సాంకేతిక విజ్ఞానం రంగాల్లో ప్రతిభ కనబర్చిన బాలలు 31, ఆగస్టు, 2023 లోపు http://awards.gov.in వెబ్ సైట్ ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అప్పారావు తెలిపారు. -
నాకు ఇన్ని అవార్డులు రావడానికి కారణం ..
-
నిఖిల గోవతి పరిశోధనను సేవబాట పట్టించింది
డిగ్రీలు చేసి, ఉద్యోగాలు చూసుకొని స్థిరపడిపోవడం గురించి ఆలోచిస్తుంటారు చాలా మంది. తమ చదువు పేదలకు ఉపయోగపడితే ఎంతో మేలు అని ఆశిస్తుంటారు కొంతమంది. అలాంటి కోవకి చెందుతుంది కర్పూరం గోవతి నిఖిల. సికింద్రాబాద్ సీతాఫల్మండిలో ఉండే నిఖిల గుర్గావ్ మేదాంత ది మెడిసిటీ హాస్పిటల్లో డిస్ఫేజియా స్పెషలిస్ట్‌గా పరిశోధనలు చేస్తోంది. గోవతి పేరుతో ఫౌండేషన్ ఏర్పాటు చేసి, ఇప్పటి వరకు 5వేల మంది పేదవారికి కంటి, గుండె, క్యాన్సర్ చికిత్సలలో సహాయసహకారాలు అందించింది. ఈ యేడాది యంగెస్ట్ రీసెర్చర్ ఇన్ డిస్ఫేజియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, భారత్ గౌరవరత్న శ్రీ సమ్మాన్ కౌన్సిల్ అవార్డులు పొందింది. ఈ సందర్భంగా మాట్లాడినప్పుడు ఎన్నో విషయాలను ఇలా పంచుకుంది. ‘‘తెలియని తపన నన్ను ఓ కొత్త మార్గంవైపు నడిపించింది. పరిశోధనల వైపుగా అడుగులు వేయించింది. ఈ మూడేళ్లలో 5 వేల మందికి సాయం చేసేలా మార్చింది. బీఎస్సీ ఆడియాలజీ పూర్తయ్యాక ఎమ్మెస్సీలో చేరాను. ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ పూర్తవగానే మేదాంత హాస్పిటల్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది తమ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో చేరమని. కాలేజీలో కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ నుంచి వచ్చిన అవకాశమని తెలిసి చాలా ఆనందించాను. పరిశోధనలో.. అనేక ఆరోగ్య సమస్యలలో ముఖ్యంగా నిమోనియా, గుండెకు సంబంధించిన చికిత్సలు జరిగినప్పుడు కొన్నాళ్ల వరకు ఆహారాన్ని మింగడంలో కలిగే ఇబ్బందుల కారణంగా మరణాల రేటు పెరుగుతోందని మా పరిశోధనలో తేలింది. న్యూరో పేషంట్స్లో 80 శాతం డిస్ఫేజియా సమస్య ఉంటుంది. ఆహారాన్ని మింగే పద్ధతిలో తేడా ఉంటే ఆ ఆహారం నేరుగా లంగ్స్‌లోకి చేరి, ప్రమాదం కలుగుతుంది. అందుకని ఈ పేషెం ట్స్‌కు, వీళ్లను చూసుకునేవారికి ఏ విధంగా ఆహారాన్ని తీసుకోవాలనే విషయాల మీద గైడెన్స్ ఇస్తుంటాను. ఈ వైపుగా మన దగ్గర ఇంకా ఆలోచన పెరగలేదు. అమెరికాలో ఈ విషయాలపట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. దీంతో ఈ విభాగంలో నాకు ఆసక్తి కలిగింది. లోతుగా పరిశోధనలు చేయడం మొదలు పెట్టాను. నాకు అడ్వైజ్ చేసే డాక్టర్లు, ప్రొఫెసర్ల సలహాలు మరెన్నో విషయాలను పరిచయం చేసింది. ఢిల్లీ సమీపంలోని హాస్పిటల్ కావడంతో వచ్చే పేషెంట్స్ సంఖ్య కూడా ఎక్కువే. ప్రతి ఒక్క పేషెంట్ నుంచి వారి ఆరోగ్యసమస్యల ద్వారా తెలుసుకునే విషయాలు ఎన్నో ఉంటాయి. అలా నా పరిశోధనకు సంబంధించి 31 ఆర్టికల్స్ మెడికల్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. జైపూర్, రాజస్థాన్, యూపీ నుంచి వచ్చే స్టూడెంట్స్‌కు సెషన్స్ కండక్ట్ చేస్తుంటాను. కరోనా నుంచి.. అవసరమైన వారికి సాధ్యమైనంత వరకు నా స్నేహబృందంతో సాయం అందిస్తూ వచ్చాను. అప్పటి నుంచి కంటి, గుండె చికిత్సలు, నిమోనియా, పార్కిన్సన్స్, నీ రీప్లేస్మెంట్, న్యూరో డిజార్డర్స్ వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి డాక్టర్లతో మాట్లాడి ఫీజు తగ్గింపులో సాయం చేస్తుండేదాన్ని. కోవిడ్ పేషెంట్స్పైన రీసెర్చ్ చేసినప్పుడు మరణాలు పెరగడానికి అందరికీ ఒకే విధమైన చికిత్స అందించడం సరికాదని తెలుసుకున్నాను. ప్రతి ఒక్కరూ భిన్నంగా చికిత్స చేయాలనే అంశాల మీద చేసిన రీసెర్చ్ పేపర్స్‌కి మంచి ప్రశంసలు అందాయి. ఈ సమయంలోనే ఫౌండేషన్‌గా సేవలను ఒక గ్రూప్కిందకు తీసుకురావాలనిపించింది. అందుకు, మా ప్రొఫెసర్లు, కుటుంబసభ్యుల సపోర్ట్ ఉంది. అభ్యర్థన మేరకు ప్రభుత్వ, కార్పోరేట్ హాస్పిటల్స్‌లోని డాక్టర్స్ నెట్వర్క్ నుంచి పరిచయాలు ఉన్నాయి. వారిని అభ్యర్థించి పేదవాళ్లలో ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలు సూచించడం, వారి చేత హెల్త్ క్యాంపులు నిర్వహించడం చేస్తుంటాను. ఏయే సమయాల్లో క్యాంపులను నిర్వహించాలో ముందే ప్లానింగ్ ఉంటుంది కాబట్టి, దానిని అనుసరించి డాక్టర్లను అభ్యర్థిస్తుంటాను. మా నాన్న హరిరాజ్ కుమార్ రేషన్ షాప్ నిర్వహిస్తుంటారు. అక్కడకు వచ్చేవాళ్లలో దాదాపు పేదవాళ్లే ఉంటారు. వాళ్లకు అవసరమయ్యేలా క్యాంపులు నిర్వహించాను. నోటి మాట ద్వారా సాయం చేస్తూ వెళ్లడమే. దీని కోసం నేనేమీ డబ్బులు ఖర్చు పెట్టడం లేదు. ఎవరి నుంచీ సాయం తీసుకోవడం లేదు. నాకున్న నెట్వర్క్ ద్వారా నోటి మాట ద్వారా సాయం చేయడం ప్రస్తుతం చేస్తున్న పని. మెడిసిన్స్ అవసరం ఉన్న పేషెంట్స్‌కు జెనెరిక్ మెడిసిన్ ద్వారా సర్వీస్ చేయడం, నర్సుల సాయం తీసుకోవడం వంటివీ జరుగుతుంటాయి. నా టీమ్‌లో అందరూ స్వచ్ఛందంగా సేవ చేసేవారే. ఇంటి వద్ద ఉన్నప్పుడే కాదు గుర్గావ్లో ఉన్నా ఫోన్ కాల్ ద్వారా అవసరమైన వారికి అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తుంటాను’’ అని వివరించింది నిఖిల. ఒప్పించి.. మెప్పించాను.. అమ్మనాన్నలు ఇంజనీరింగ్ చేసి త్వరగా స్థిరపడిపోతే చాలు అనుకునేవారు. కానీ, అనుకోకుండా మెyì కల్ వైపుగా వచ్చాను. ఎమ్మెస్సీ తర్వాత గుర్గావ్లో ఇంటర్వ్యూ ఉందనే విషయం కూడా ఇంట్లో చెప్పలేదు, వద్దంటారు అనే ఆలోచనతో. అమ్మమ్మతో కలిసి ఢిల్లీ టూర్ వెళతాను అని ఒప్పించి వెళ్లాను. అక్కడ మెదంతాలో సీట్ వచ్చాక అప్పుడు విషయాన్ని చెప్పాను. నాకున్న ఆసక్తిని చూసి అమ్మనాన్నలు సరే అన్నారు. కూతురు అంత దూరంలో ఎలా ఉంటుందో అనే బెంగ వాళ్లను ఒప్పుకోనివ్వదని ఆ పని చేశాను. ఇప్పుడు నేను చేస్తున్న రీసెర్చ్‌కి, సర్వీస్‌కు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. నాకు ఇంత మంచి గుర్తింపు రావడం గర్వంగా భావిస్తుంటారు. – డా.కర్పూరం గోవతి నిఖిల -
బలగం మూవీ అరుదైన ఘనత.. ఇంతవరకు ఏ సినిమాకు దక్కలేదు!
చిన్న సినిమా ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించిన చిత్రం బలగం. తెలంగాణ సంప్రదాయాన్ని కళ్లకు కట్టినట్లు తెరపై ఆవిష్కరించారు. వేణు యెల్దండి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన బలగం కలెక్షన్ల వర్షం కురిపించింది. దిల్ రాజు సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలంగాణ గ్రామీణ సంప్రదాయాన్ని తెరపై ఆవిష్కరించిన వేణుపై సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమా ప్రభావం ఎంతలా ఉందటే.. ఏకంగా పల్లెల్లో ప్రత్యేక షోలు ప్రదర్శించే స్థాయికి చేరుకుంది. అంతలా ఆడియన్స్‌కు కనెక్ట్ అయింది. వెండితెరపై సత్తాచాటిన ఈ చిత్రాన్ని అవార్డులు అంతేస్థాయిలో వరించాయి. ఏకంగా అంతర్జాతీయ వేదికలపై బలగం పేరు మార్మోగింది. (ఇది చదవండి: కానిస్టేబుల్ పరీక్షలో 'బలగం' సినిమాపై ప్రశ్న.. అదేంటంటే?) ఇప్పటివరకు అంతర్జాతీయ వేదికలపై వందకుపైగా అవార్డులు సొంతం చేసుకుని అరుదైన రికార్డ్ సాధించింది. పలు దేశాల్లో జరిగిన ఈవెంట్స్‌లో వివిధ విభాగాల్లో బలగం సినిమాకు అవార్డులు దక్కాయి. ఇంతవరకు ఏ సినిమా సాధించలేని అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. కాగా.. ఈ చిత్రంలో ప్రియదర్శి, కావ్య కల్యాణ్ రామ్ జంటగా నటించారు. మురళీధర్ గౌడ్, కేతిరి సుధాకర్ రెడ్డి, జయరామ్, రూప, రచ్చ రవి ప్రధాన పాత్రల్లో కనిపించారు. గతంలో ‘స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023’లో ‘బలగం’ చిత్రానికి గాను ఉత్తమ నటుడుగా ప్రియదర్శి, ఉత్తమ సహాయ నటుడుగా కేతిరి సుధాకర్ రెడ్డి (కొమురయ్య పాత్రధారి) అవార్డులను గెలుచుకున్నారు. కానిస్టేబుల్, గ్రూప్-4 పరీక్షల్లో ప్రశ్నలు అంతే కాకుండా గతంలో తెలంగాణలో జరిగిన కానిస్టేబుల్ రాతపరీక్షలో ఓ ప్రశ్న వచ్చిందంటే బలగం సినిమాకు ఉన్న ఆదరణ ఏంటో అర్థమవుతోంది. ఇటీవలే జరిగిన గ్రూప్-4 పరీక్షలో సైతం బలగం సినిమా ప్రశ్నను అడిగారు. తెలంగాణలో పల్లెపల్లెలో బలగం సినిమాకు పెద్దఎత్తున అభిమానులు ఉన్నారు. అలాగే మార్చి 2023లో ఓనికో ఫిల్మ్స్ అవార్డుల్లో ఉత్తమ నాటకం విభాగంలో అవార్డ్ దక్కింది. (ఇది చదవండి: సమంత కీలక నిర్ణయం.. షాక్‌లో అభిమానులు!) A journey of Excellence and Recognition! ❤️ Earlier, we had Films running for 100 days.. Films running in 100 centers.. Films collecting 100 crores .. Now, we have achieved a film with 100+ international awards ❤️#Balagam is a special film for many reasons 🤗🤗#balagam pic.twitter.com/26yfgS8sse — Venu Yeldandi #Balagam (@VenuYeldandi9) July 4, 2023 -
జేఆర్సీ కన్వెన్షన్‌లో వైశ్యలైమ్లైట్స్ అవార్డ్స్‌లో ర్యాంప్‌పై హొయలు పోయిన ముద్దుగుమ్మలు (ఫోటోలు)
-
హనుమంతునిపాడు PS కు ఉత్తమ పోలీస్ స్టేషన్ అవార్డు
-
ఏపీకి నాలుగు జాతీయ జల అవార్డులు
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ నాలుగు జాతీయ జల అవార్డులను దక్కించుకుంది. దేశంలో జలసంరక్షణ, యాజమాన్య పద్ధతుల ద్వారా తక్కువ నీటితో అధిక ఆయకట్టుకు నీళ్లందించడం తదితర విధానాలను ప్రోత్సహించడానికి 2019 నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డులను ప్రదానం చేస్తోంది. తాజాగా 11 విభాగాల్లో 41 అవార్డులను ప్రకటించగా.. ఆంధ్రప్రదేశ్ నాలుగు అవార్డులను దక్కించుకుంది. నీటి వనరుల సంరక్షణ, నిర్వహణకు గాను ఉత్తమ రాష్ట్రాల విభాగంలో ఏపీ తృతీయ స్థానంలో నిలవగా.. ఉత్తమ స్కూల్ విభాగంలో నంద్యాల జిల్లాలోని చాగలమర్రి కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాల(కేజీబీవీ) ద్వితీయ స్థానం, పరిశ్రమల విభాగంలో తిరుపతిలోని కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్ తృతీయ స్థానం దక్కించుకున్నాయి. స్వచ్ఛంద సంస్థల విభాగంలో అనంతపురం జిల్లాకు చెందిన యాక్షన్ ఫ్రెటెర్నాకు ప్రత్యేక ప్రోత్సాహక అవార్డు లభించింది. శనివారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ నుంచి రాష్ట్ర జలవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్‌కుమార్ జాతీయ జల అవార్డును అందుకున్నారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ నుంచి చాగలమర్రి కేజీబీవీ ప్రిన్సిపాల్, సీసీఎల్ ప్రతినిధులు, యాక్షన్ ఫ్రెటెర్నా డైరెక్టర్ మల్లారెడ్డి అవార్డులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ మాట్లాడుతూ.. నీటిని సంరక్షించుకోవడం ద్వారానే భవిష్యత్ తరాలను కాపాడుకోగలమన్నారు. జల సంరక్షణను రోజువారీ జీవితంలో అంతర్భాగం చేసుకోవాలని సూచించారు. ప్రజాప్రతినిధులు కూడా ఇందులో భాగస్వాములు కావాలన్నారు. ఇదీ చదవండి:గ్రీన్ మొబిలిటీలో ఆంధ్రప్రదేశ్ మున్ముందుకే -
లాడ్లీ మీడియా అవార్డులకు ఆహ్వానం.. షరతులివే
లాడ్లీ మీడియా అండ్ అడ్వర్టైజింగ్ అవార్డుల 13వ ఎడిషన్ కోసం ఎంట్రీలను ఆహ్వానిస్తోంది. UNFPA (United Nations Population Fund) మద్దతుతో లింగ సున్నితత్వం కోసం లాడ్లీ మీడియా అవార్డులను ప్రకటిస్తుంది. మహిళా సాధికారికత, సమస్యలు, గృహ హింస, పని ప్రదేశాల్లో వేధింపులు తదితర సమస్యలను ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్, సోషల్ మీడియాతో పాటు కథనాల ద్వారా వెలుగులోకి తెచ్చి లింగ సమానత్వం కోసం కృషి చేసిన మీడియా ప్రతినిధులకు ఈ అవార్డులను అందజేస్తారు. అవార్డుల ఎంపిక కోసం కావాల్సిన ప్రమాణాలు • లింగ వివక్ష విధానాల గురించి అవగాహన కల్పించడం • లింగ కోణం నుంచి ప్రస్తుత సంఘటనల విశ్లేషణ • పరిశోధన, ఇతర నివేదికలు, ఇతర కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడం • లింగ సమీకరణాలను పునర్నిర్వచించే వ్యక్తుల ప్రొఫైల్స్ • లింగ ఆధారిత హింస నుంచి బయటపడిన వారి అనుభవాలు, ఆందోళనలను తెలియపరచడం (కేస్ స్టడీస్) ఎప్పటినుంచి ఎంట్రీలంటే.. 1 జనవరి, 2022 నుంచి 31 డిసెంబర్, 2022 వరకు ప్రచురించబడి / ప్రదర్శింపబడి లేదా ప్రసారం చేయబడి ఉండాలి ఎంట్రీలు 1. ప్రింట్ మీడియా 2. ఎలక్ట్రానిక్ మీడియా 3. రేడియో 4. వెబ్ నుంచి ఆహ్వానం దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి, అన్ని భాషలనుంచి ఎంట్రీలు పంపవచ్చు నిబంధనలు, షరతులు • అన్ని ఎంట్రీలు కచ్చితంగా అర్హత ప్రమాణాలను అనుసరించాలి • మూడు లేదా అంతకంటే ఎక్కువ సార్లు అవార్డును పొందిన మీడియా వ్యక్తులు అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు. • అసంపూర్తిగా లేదా తప్పుగా నింపిన ఎంట్రీ ఫారమ్‌లు పరిగణించబడవు. • గ్రూప్ నుంచి దరఖాస్తు చేస్తే ఒక ట్రోఫీకి మాత్రమే అర్హత ఉంటుంది మరిన్ని వివరాలకు Laadli వెబ్ సైట్ సందర్శించండి Exciting news! The Call for Entries 13th edition of the Laadli Media and Advertising Awards for Gender Sensitivity, 2023 has officially launched! Submit your entries now and showcase your passion for gender-sensitive media and advertising. Please Apply: https://t.co/w7bDhSMkNW pic.twitter.com/ntSCnK7ZRz — Laadli (@Laadli_PF) April 29, 2023 -
జగనన్న ఆణిముత్యాలు.. టెన్త్‌లో 1,250 మంది.. ఇంటర్లో 1,585 మంది
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో 2023 సంవత్సరంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన 1,250 మంది విద్యార్థులకు, ఇంటర్మీడియట్లో నాలుగు గ్రూపుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థుల్లో గ్రూపునకు ఒకరు చొప్పున 1,585 మందిని ‘జగనన్న ఆణిముత్యాలు’ కార్యక్రమం కింద ప్రతిభ అవార్డులతో సత్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గం స్థాయిల్లో విడివిడిగా జరిగే ఈ కార్యక్రమాల్లో ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు బహుమతితో పాటు మెరిట్ సర్టిఫికెట్లు, మెడల్స్ అందజేస్తారు. విద్యార్థులు తల్లిదండ్రులను శాలువాలతో, ఆ పాఠశాలల హెడ్మాస్టర్లను శాలువ, మొమెంటోతో సత్కరిస్తారు. రాష్ట్ర స్థాయిలో ఈ నెల 20న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా పదో తరగతిలో రాష్ట్ర స్థాయిలో మొదటి మూడు స్థానాలు సాధించిన విద్యార్ధులను, ఇంటర్మీడియట్లో నాలుగు గ్రూపుల్లో అత్యధిక మార్కులు సాధించిన నలుగురిని సత్కరించనున్నారు. అంతకు ముందు ఈ నెల 17న జిల్లా స్థాయిలో జిల్లా ఇన్చార్జి మంత్రులు, జిల్లా మంత్రులు ఆధ్వర్యంలో తొమ్మిది ప్రభుత్వ పాఠశాలల్లో టెన్త్‌లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్ధులను, ఏడు ప్రభుత్వ కాలేజీల్లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలో నాలుగు గ్రూపుల్లో ఒక్కో గ్రూపులో అత్యధిక మార్కులు సాధించిన ఒక్కరు చొప్పున నలుగురిని సత్కరించనున్నారు. ఈ నెల 15న అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిల్లో ఎమ్మెల్యేల అధ్యక్షతన పదో తరగతిలో మొదటి మూడు స్థానాలు సాధించిన విద్యార్థులను, ఇంటర్మీడియట్లో నాలుగు గ్రూపుల్లో ప్రతి గ్రూపులో అత్యధిక మార్కులు సాధించిన ఒక్కరు చొప్పున నలుగురిని సత్కరించనున్నారు. రాష్ట్ర స్థాయిలో జగనన్న ఆణిముత్యాలకు బహుమతులు ► పదో తరగతిలో 42 మందికి, ఇంటర్మీడియట్లో 35 మందికి ప్రతిభా అవార్డులు ►పదో తరగతిలో మొదటి స్థానం సాధించిన విద్యార్థులకు రూ.1,00,000, రెండో స్ధానం సాధించిన విద్యార్థులకు రూ.75,000, మూడో స్థానం సాధించిన విద్యార్థులకు రూ.50,000 చొప్పున నగదు బహుమతి ► ఇంటర్మీడియట్లో నాలుగు గ్రూపుల్లో అత్యధిక మార్కులు సాధించిన నలుగురేసి విద్యార్ధులకు ఒక్కొక్కరికి రూ.1,00,000 జిల్లా స్థాయిలో.. ► పదో తరగతిలో 606 మందికి, ఇంటర్లో 800 మందికి ప్రతిభా అవార్డులు ► పదిలో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థులకు రూ.50,000, రెండో స్థానం సాధించిన వారికి రూ. 30,000, మూడో స్థానం సాధించిన విద్యార్థులకు రూ.10,000 ► ఇంటర్మీడియట్లో నాలుగు గ్రూపుల్లో అత్యధిక మార్కులు సాధించిన నలుగురికి ఒక్కొక్కరికి రూ.50,000 నియోజకవర్గ స్థాయిలో.. ► పదో తరగతిలో 602 మందికి, ఇంటర్మీడియట్లో 750 మందికి ప్రతిభా అవార్డులు ► టెన్త్‌లో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థులకు రూ.15,000, రెండో స్థానం సాధించిన విద్యార్థులకు రూ.10,000, మూడో స్థానం సాధించిన విద్యార్థులకు రూ.5000లు నగదు బహుమతి ► ఇంటర్మీడియట్లో నాలుగు గ్రూపుల్లో అత్యధిక మార్కులు సాధించిన నలుగురు విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.15,000 అందరి సమన్వయంతో కార్యక్రమాలు: సీఎస్ జగనన్న ఆణిముత్యాలు సత్కార కార్యక్రమాలను మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల సమన్వయంతో నిర్వహించాలని కలెక్టర్లు, ఇతర అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డా. కేఎస్ జవహర్‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర స్థాయి సత్కార కార్యక్రమం కోసం రాష్ట్ర స్థాయి కంట్రోల్ రూమ్, ఇతర ఏర్పాట్లు చేయాలని ఇంటర్మీడియట్ కమిషనర్‌కు, ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌కు సూచించారు. పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ఇతర శాఖలను, అధికారులను సమన్వయం చేసుకుని ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలని చెప్పారు. నియోజకవర్గస్థాయిలో మండల కేంద్రంలోని ప్రభుత్వ స్కూలు లేదా కాలేజీలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలని, దీనికి మండల విద్యాధికారి కన్వీనర్‌గా వ్యవహరిస్తారని తెలిపారు. జిల్లా స్థాయిలో జిల్లా మంత్రులను సంప్రదించి సత్కార కార్యక్రమ వేదికను కలెక్టర్ ఎంపిక చేయాలని చెప్పారు. చదవండి: ఐఐటీ విద్యార్థులకు విదేశాల రెడ్ కార్పెట్ -
అవార్డులను బాత్రూమ్ డోర్లకు హ్యాండిల్స్‌గా..
-
ఎన్టీఆర్ మెమోరియల్ అవార్డ్స్ వేడుక.. ప్రముఖులకు సన్మానం (ఫొటోలు)
-
కోడిగుడ్ల ఆహారోత్పత్తులకు పురస్కారాలు!
హైదరాబాద్: ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్ (ఐఈసీ) తాజాగా విజన్ 365 ఎగ్ ఇన్నోవేషన్ అవార్డులను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. కోడిగుడ్లతో చేసిన వినూత్న ఆహారోత్పత్తులకు గాను ఈ అవార్డును అందించనున్నట్లు విజన్ 365 చైర్మన్ సురేష్ చిట్టూరి తెలిపారు. ఈ కొత్త అంతర్జాతీయ పురస్కారానికి ఎంట్రీలను ఆహ్వానిస్తున్నట్లు వివరించారు. నూతన ఉత్పత్తులకు ప్రచారం కల్పించుకునేందుకు, వ్యాపారాన్ని పెంపొందించుకునేందుకు సంస్థలకు ఇది మంచి అవకాశం కాగలదని ఆయన పేర్కొన్నారు. దీనికి ఆగస్టు 11లోగా కంపెనీలు తమ ఉత్పత్తుల వివరాలను షేర్ చేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 24–28 మధ్య జరిగే ఐఈసీ గ్లోబల్ లీడర్షిప్ సదస్సులో అవార్డును ప్రదానం చేస్తారు. -
విడుదలకు ముందే రికార్డ్.. ఏకంగా 37 అవార్డులు!
'గతం' అనే క్రేజీ థ్రిల్లర్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు కిరణ్ రెడ్డి కొండమడుగుల. ఈ చిత్రాన్ని 2020లో తెరకెక్కించారు. తాజాగా మరోసారి ఐడీ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. రిలీజ్ సిద్ధంగా ఈ చిత్రం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ వేడుకలో సత్తా చాటింది. రిలీజ్‌కి ముందే ఈ చిత్రం ఏకంగా 37 అవార్డులు గెలుచుకోవడం విశేషం. ఈ చిత్రానికి సాయిచరణ్ పాకాల సంగీతమందించారు. ఈ మూవీని సుభాష్ రావడ, భార్గవ పోలుదాసు నిర్మించారు. భార్గవ పోలుదాసు అద్భుతమైన పాత్రలో నటించారు. (ఇది చదవండి: వారసత్వం కోసం బిడ్డను కనడం లేదు.. ఉపాసన ఆసక్తికర పోస్ట్) ఇదిలా ఉండాగా త్వరలో కెనడాలో ఒకేవిల్లే ఫిలిం ఫెస్టివల్ వేడుకలో ఐడీ చిత్ర ప్రీమియర్స్ ప్రదర్శించనున్నారు. అక్కడ ఈ చిత్రం అవార్డు గెలుచుకుంటే అది తమకి ఆస్కార్‌తో సమానమని చిత్ర యూనిట్ తెలిపింది. ఇప్పటికే 600 ఫిలిం ఫెస్టివల్స్‌లో ఇండియాతో పాటు దేశాల్లోనూ ప్రశంసలు దక్కించుకుందని తెలిపారు. (ఇది చదవండి: ఇంతవరకు చేయలేదా?.. ఆశ్చర్యంగా ఉందే.. ఉపాసన పోస్ట్ వైరల్!) -
అవార్డులు కొల్లగొట్టిన ఆలియా భట్ మూవీ..!
దుబాయ్‌లో జరుగుతున్న ఐఫా-2023 అవార్డుల కార్యక్రమంలో ఆలియా భట్ మూవీ సత్తా చాటింది. ఆలియా ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'గంగూబాయి కతియావాడి' అవార్డులు కొల్లగొట్టింది. ముంబయిలోని కామాటిపుర నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. తాజాగా ఐఫా అవార్డుల్లో మూడు విభాగాల్లో ఎంపికైంది. ఈ సినిమా తర్వాత కార్తీక్ ఆర్యన్ నటించిన భూల్ భూలయ్యా-2 రెండు అవార్డులు దక్కించుకుంది. (ఇది చదవండి: 15 ఏళ్లకే పెళ్లి.. నా కడుపులో బిడ్డకు తండ్రెవరని అడిగాడు: నటి) దుబాయ్‌లో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రముఖ బాలీవుడ్ తారలు పాల్గొన్నారు. దక్షిణాది నుంచి కమల్ హాసన్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. సల్మాన్‌ఖాన్, విక్కీ కౌశల్, వరుణ్ ధావన్, రకుల్ ప్రీత్ సింగ్, నోరా ఫతేహి పాల్గొన్న ఈ వేడుకలో టెక్నికల్ అవార్డులను అందజేశారు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, స్క్రీన్‌ప్లే, కొరియోగ్రఫీ.. ఇలా తొమ్మిది విభాగాల్లో ఈ అవార్డులను ఇచ్చారు. స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సినిమాటోగ్రఫీ అవార్డులను సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘గంగూబాయి కతియావాడి దక్కించుకుంది. (ఇది చదవండి: అమ్మా, నాన్న చనిపోతే.. వారే అంతా పంచుకున్నారు: తేజ) -
ఉత్తమ నటుడిగా విజయ్, ఉత్తమ విలన్ అవార్డు ఎవరంటే?
ఒసాకా తమిళ్ అంతర్జాతీయ 2021 సినీ అవార్డుల వేడుక ఇటీవల జపాన్‌లో జరిగింది. ఈ వేదికపై 2021 ఏడాదికి గానూ తమిళ చిత్రాలకు అవార్డులను ప్రకటించారు. అందులో మాస్టర్ చిత్రంలోని నటనకు గానూ కథానాయకుడు విజయ్‌కు ఉత్తమ నటుడు అవార్డును ప్రకటించారు. మాళవికా మోహన్ హీరోయిన్గా నటించిన ఇందులో నటుడు విజయ్‌సేతుపతి ప్రతినాయకుడిగా నటించారు. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని 7 స్క్రీన్ స్టూడియోస్, ఎక్స్‌బీ.ఫిలిం క్రియేటర్స్ సంస్థలు నిర్మించాయి. ఇందులో నటించిన విజయ్‌సేతుపతికి ఉత్తమ ప్రతినాయకుడు అవార్డును ప్రకటించారు. ఈ చిత్రంలోని వాత్తి కమింగ్ పాట ఉత్తమ పాట అవార్డును గెలుచుకుంది. ఆ విధంగా మాస్టర్ చిత్రం మూడు అవార్డులను కై వసం చేసుకుంది. ఇకపోతే తలైవి చిత్రంలో నటనకు గానూ నటి కంగనారనౌత్‌కు ఉత్తమ నటి అవార్డు వరించింది. అదే విధంగా సార్పట్ట పరంపరై చిత్రానికి గానూ పా.రంజిత్ ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు. బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డును మానాడు చిత్రానికి గానూ దర్శకుడు వెంకట్‌ప్రభు గెలుచుకున్నారు. ఉత్తమ నిర్మాణ సంస్థ అవార్డును మండేలా చిత్రానికి గానూ వైనాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్టెయిన్మెంట్, ఓపెన్ విండో ప్రొడక్షన్స్, విష్బెర్రి ఫిలింస్ సంస్థలు గెలుచుకున్నాయని అవార్డుల జ్యూరీ అధికారికంగా ప్రకటించింది. Thalapathy Vijay's #Master bags 3 awards at the Osaka Film International Festival. The Osaka Tamil Film International Film Festival was recently held in Japan. Vijay was awarded the "Best Actor" award for his performance in Master. #LEO #LeoFilm #BloodySweet @actorvijay pic.twitter.com/DcHHFXx4Of — Actor Vijay Team (@ActorVijayTeam) May 23, 2023 చదవండి: విషాదం.. కారు ప్రమాదంలో నటి మృతి -
ఉత్తమ వాలంటీర్లను సత్కరించిన సీఎం వైఎస్ జగన్
-
సంక్షేమ వారధులు వాలంటీర్లు (ఫొటోలు)
-
వాలంటీర్లకు వందనం.. సేవలకు గుర్తింపు (ఫోటోలు)
-
వాలంటీర్ల వ్యవస్థ అంటే చంద్రబాబుకు కడుపుమంట: సీఎం జగన్
సాక్షి, విజయవాడ: ప్రజలకు, ప్రజా ప్రభుత్వానికి మధ్య వారధులు, సంక్షేమ సారథులు వాలంటీర్లు అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. తూర్పున సూర్యుడు ఉదయించకముందే చిక్కటి చిరునవ్వులతో గుడ్ మార్నింగ్ చెప్పి ప్రతి అవ్వాతాతకు మంచి మనవడిగా, మనవరాలిగా, ప్రతి వితంతువుకు, వికలాంగుడికి చెల్లెమ్మ-అక్కలా, తమ్ముడు- అన్నలా ప్రతినెలా ఒకటో తారీఖున అక్షరాల 64 లక్షల మందికి ప్రభుత్వ పెన్షన్ అందిస్తున్నారని సీఎం అన్నారు. ప్రజలకు వలంటీర్లు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా వారికి వందనం చెబుతూ వరుసగా మూడో ఏడాది గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులను ఇచ్చే కార్యక్రమానికి సీఎం జగన్ శుక్రవారం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వీళ్లు మంచి సేవకులు, సైనికులు. పేదలకు సేవలు చేసేందుకు 2.66లక్షల మంది సైన్యమే వాలంటీర్ వ్యవస్థ. దాదాపు 25 సంక్షేమ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు’’ అని సీఎం ప్రశంసించారు. ‘‘కులం, మతం, వర్గం, రాజకీయపార్టీలు చూడకుండా అర్హత మాత్రమే ప్రమాణంగా తీసుకుని పథకాలు అమల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. జగనన్న పెట్టుకున్న నమ్మకం వాలంటీర్లు. దేశంలో ఎక్కడకు వెళ్లి చూసినా.. మునుపెన్నడూ చూడని విధంగా ప్రజలకు వాలంటీర్ల ద్వారా మేలు జరుగుతోంది. ఇలాంటి సారథులు, వారధులు దేశంలో ఎక్కడా లేరు. మంచి మనసుతో అనేక మార్పులు తీసుకు వస్తున్నాం. అనేక మార్పులకు సాక్ష్యాలు కూడా వాలంటీర్లే. రాష్ట్రంలో 90శాతం గడపలకు వెళ్లి.. జగనన్న పాలనలో మాదిరిగా ఇలా మీ ఇంటికి వచ్చి ఒకటో తారీఖునే పెన్షన్ ఇస్తున్నా ఇలాంటి వ్యవస్థ గత ప్రభుత్వంలో ఏనాడైనా చూశారా. అమ్మ ఒడి, ఆసరా, చేయూత, ఇళ్లపట్టాలు, రైతు భరోసా.. ఇలా అందించడాన్ని గత ప్రభుత్వంలో ఏనాడైనా చూశారా? అని అడిగే నైతికత మీకు మాత్రమే సొంతం’’ అని సీఎం అన్నారు. ‘‘గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల అరాచకాలు చూశారు. వివక్ష, లంచాలు చూశాం. మన అందరి ప్రభుత్వం తీసుకు వచ్చిన తులసిమొక్కల్లాంటి వ్యవస్థే వాలంటీర్ల వ్యవస్థ. 25 పథకాలకు సంబంధిచిన బ్రాండ్ అంబాసిడర్లు వాలంటీర్లు. చేస్తున్న మంచిని చూసి, నవరత్నాల పాలనను చూసి, 2.10 లక్షల కోట్లు డీబీటీని చూసి గతంలో ఎప్పుడూ మంచిచేయని చరిత్ర ఉన్నవారు దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఎల్లోమీడియా, సోషల్ మీడియాల ద్వారా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. పేదల ప్రభుత్వంమీద గిట్టని వారు తప్పుడు ప్రచారాలు, అబద్ధాలు చెప్తున్నారు. నిందలు వేస్తున్నారు’’ అని సీఎం మండిపడ్డారు. ‘‘5 కోట్ల ప్రజల ప్రతి గడపవద్దకూ వెళ్లి నిజాలు చెప్పగలిగే సత్యసారధులు మీరు. ప్రతి గడపకూ నేరుగా వాలంటీర్లే మనకున్న బలం. ప్రతి గడప వద్దకూ వెళ్లి.. ప్రతి అక్కను కూడా నీకు ఈ మంచి జరిగిందా? లేదా? అని నీతిగా, నిజాయితీగా అడగగలిగే నైతికత ఈ ప్రభుత్వానికి ఉంది. అది వాలంటీర్ల వల్లే సాధ్యపడింది. ఎక్కడా మంచే తప్ప, చెడు చేయలేదు. ఈ ప్రభుత్వం ఫిలాసఫీకి ప్రతిరూపం వాలంటీర్లు. ఈ ప్రభుత్వంలో వాలంటీర్లు చేస్తున్నది సేవ. ప్రభుత్వం ఉద్యోగం పరిధిలోకి వచ్చేది కాదు. ఇది వాలంటీర్ సేవ. ఇక్కడ పనిచేస్తున్న ఏ ఒక్కరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులు కారు. ఇక్కడ పనిచేస్తున్న ప్రతి వాలంటీర్ కూడా స్వచ్ఛందంగా మంచి చేయాలి అనే మనస్సు పెట్టి తపన, తాపత్రయంతో అడుగులు వేస్తున్న మంచి మనుషులు. కాబట్టి.. ఎవరైనా మీరు చేయాల్సిన పనికాదు.. అని ఎవరైనా అంటే.. గట్టిగా సమాధానం చెప్పాల్సిన పని ఉంది’’ అని సీఎం అన్నారు. వాలంటీర్ కార్యక్రమం మీ రాజకీయ హక్కులకు, అభ్యుదయ ఆదర్శ భావాలకు ఎలాంటి ఆటంకాలు, అవరోధాలు ఉండవని చెప్తున్నాను. వాలంటీర్లను ఉద్దేశించి నేను చేసిన మొదటి ప్రసంగాన్ని మీరు గుర్తుకు తెచ్చుకోంది?. మిమ్మల్ని లీడర్లుగా చేస్తానని చెప్పాను. ఆ మాటను గుర్తు పెట్టుకోండి. ప్రజలందరికీ కూడా మోటువేటర్లు, ప్రభుత్వానికి అండగా నిలబడాలని పిలుపునిస్తున్నాను. ప్రభుత్వం సంతృప్త స్థాయిలో ప్రతి ఒక్కరికీ మంచిచేస్తోంది. ఏ పేదవాడు కూడా మిస్ కాకూడదన్న ఉద్దేశంతో పనిచేస్తోంది. నవరత్నాల ఫిలాసఫీ వల్లే ఇదంతా జరుగుతోంది. వాలంటీర్ల సేవలకు ఇస్తున్న గుర్తింపుగా ఈ కార్యక్రమం. ప్రతి సంవత్సరం కూడా వాలంటీర్ల సేవలకు గుర్తింపు ఇచ్చేలా కార్యక్రమం ఉంటుంది. చంద్రబాబుకు, ఎల్లోమీడియాకు వాలంటీర్ వ్యవస్థ అంటే కడుపులో మంట. డజన్ జెల్యుసిల్ మాత్రలు వేసినా కూడా తగ్గని మంట. వాలంటీర్ల మీద నిరంతరం దుష్ప్రచారం, విమర్శలు చేస్తూనే ఉన్నారు. అసలు వీళ్లు మనుషులేనా’’ అంటూ సీఎం జగన్ దుయ్యబట్టారు. చదవండి: సీఎం జగన్ ‘సూత్రం’.. వారికి గుణపాఠం అవుతుందా? ‘‘ఇళ్లకు వెళ్లి పెన్షన్ డబ్బులు చేతిలోపెట్టి.. ఆప్యాయతలు చూపించే వాలంటీర్ల మీద చంద్రబాబు, ఆయనకు సంబంధించిన ఎల్లోమీడియా వెటకారం చేస్తూ… ఏం అన్నారో బాగా గుర్తుకుపెట్టుకోండి. దురుద్దేశాలు ఆపాదించే చంద్రబాబు గురించి బాగా గుర్తు పెట్టుకోండి. వాలంటీర్లను చులకనగా చూపించేందుకు మద్యం తాగుతారని, మూటలు మోస్తారని, అల్లరి మూకలని కూడా చంద్రబాబు అన్నాడు. వాలంటీర్ల వ్యవస్థను రద్దుచేసి.. తిరిగి జన్మభూమి కమిటీలను తెస్తానన్నాడు. కోర్టులకు వెళ్లి… అడ్డుకునే ప్రయత్నం చేశాడు. వాలంటీర్ల సేవలను ప్రజలు గుర్తించగానే, ఇదే చంద్రబాబు.. ఈ వాలంటీర్లు అంతా జగన్ సైన్యం.. వీరు వద్దు అన్నాడు. జన్మభూమి కమిటీలతో దోపిడీ సైన్యాన్ని తీసుకు వస్తానంటూ చంద్రబాబు అన్నాడు. మంచి చేస్తున్న ప్రభుత్వానికి, మంచి చేస్తున్న ముఖ్యమంత్రికి బ్రాండ్ అంబాసిడర్లే వాలంటీర్లు. జగనన్న సైన్యం వాలంటీర్లు. ప్రతి ఇంటికీ ఎక్కువసార్లు వెళ్లాలి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడాను వారికి చూపించాలి. చేసిన మంచిపై ప్రజలు ఆలోచించేలా చేయాల్సిన బాధ్యత మీదే’’ అని సీఎం జగన్ అన్నారు. చదవండి: ప్రతిభ చూపిన విద్యార్థులు.. ‘జగనన్న ఆణిముత్యాలు’ -
‘వాలంటీర్లకు వందనం’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్
Updates: ‘వాలంటీర్లకు వందనం’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్ ప్రజలకు వలంటీర్లు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా వారికి వందనం చెబుతూ వరుసగా మూడో ఏడాది గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులను ఇచ్చే కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం శ్రీకారం చుట్టారు. విజయవాడ ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్లో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఉత్తమ వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర పురస్కారాలు ప్రదానం చేసి సత్కరించారు. వాలంటీర్లు.. ప్రభుత్వానికి,ప్రజలకు మధ్య వారధులు: సీఎం జగన్ ►సంక్షేమ సారథులు వాలంటీర్లు ►సూర్యుడు ఉదయించక ముందే ఇంటి తలుపు తట్టి పెన్షన్ అందిస్తున్నారు ►ప్రతి నెలా 1న 64 లక్షల మందికి పెన్షన్ అందిస్తున్న సైనికులే వాలంటీర్లు ►2..66 లక్షల మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా పేదలకు సేవ చేస్తున్నారు ►కులం, మతం ప్రాంతం చూడకుండా అర్హత మాత్రమే ప్రామాణికంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయి ►90 శాతం గడపలకు వెళ్లి పెన్షన్ ఇస్తున్న వ్యవస్థ ఎక్కడా లేదు ►అమ్మఒడి, ఆసరా, చేయూత, ఇళ్ల పట్టాలు, రైతు భరోసా వంటి పథకాలను అందిస్తున్నారు. ►గతంలో జన్మభూమి కమిటీల అరాచకాల వల్ల జనం నష్టపోయారు ►పెన్షన్‌తో పాటు రేషన్ డోర్ డెలివరీ, బియ్యం కార్డు, ఆరోగ్యశ్రీ కార్డులు అదేలా వాలంటీర్ల సేవలు ►వివక్షకు చోటు లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు ►25 రకాల పథకాలకు వాలంటీర్లే బ్రాండ్ అంబాసిడర్లు ►డీబీటీ ద్వారా రూ.2.10 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారులకు అందించాం ►నాన్ డీబీటీ కలిపితే మొత్తం రూ.3లక్షల కోట్లు అందించాం ►ప్రభుత్వంపై నిందలు వేస్తే నిజాలు చెప్పగలిగిన సత్యసారథులు వాలంటీర్లే ►ప్రజలకు మంచి చేస్తున్న ప్రభుత్వంపై విమర్శలు ►మంచి చేశాం కాబట్టే గడపగడపకు వెళ్లగలుగుతున్నాం. ►వాలంటీర్ల వ్యవస్థ అంటే చంద్రబాబుకు కడుపుమంట జగనన్న సైనికులుగా ఉన్నందుకు గర్విస్తున్నాం: వాలంటీర్లు మా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని వాలంటీర్లు అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామన్నారు.ప్రజల చిరునవ్వులు, ఆశీర్వాదాలే మాకు కొండంత బలం. జగనన్న సైనికులుగా ఉన్నందుకు గర్విస్తున్నాం’’ అని వాలంటీర్లు అన్నారు. వాలంటీర్ల సేవలు అభినందనీయం: మంత్రి సురేష్ ►ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలకే సీఎం జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. చిట్ట చివరి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందడమే సీఎం లక్ష్యం అన్నారు. వాలంటీర్ల వ్యవస్థకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయని, వరదల సమయంలో వాలంటీర్ల సేవలు అభినందనీయమని మంత్రి ఆదిమూలపు పేర్కొన్నారు. గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం జగన్‌తోనే సాధ్యం: మంత్రి ముత్యాల నాయుడు ►గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం జగన్‌తోనే సాధ్యమైందని డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు అన్నారు. ప్రతి గడపకు వెళ్లి వాలంటీర్లు సమస్యలు తెలుసుకుంటున్నారన్నారు. అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందేలా వాలంటీర్ల కృషి చేసున్నామని మంత్రి అన్నారు. ►‘వాలంటీర్ల వందనం’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. విజయవాడ బయల్దేరిన సీఎం జగన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయవాడ బయల్దేరారు. కాసేపట్లో ‘వాలంటీర్లకు వందనం’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. వరుసగా మూడో ఏడాది ఉత్తమ వాలంటీర్లకు అవార్డులు ప్రదానంతో పాటు సత్కరించనున్నారు. వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర పురస్కారాలు అందజేయనున్నారు. ►ప్రజలకు వలంటీర్లు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా వారికి వందనం చెబుతూ వరుసగా మూడో ఏడాది గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులను ఇచ్చే కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం శ్రీకారం చుడుతున్నారు. విజయవాడ ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్లో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ►తూర్పున సూర్యుడు ఉదయించకముందే.. ఆదివారం అయినా, పండగైనా, సెలవు రోజైనా.. వర్షం పడుతున్నా.. అవాంతరాలను లెక్కచేయక ప్రతి నెలా మొదటి తారీఖునే వలంటీర్లు చిరునవ్వుతో సామాజిక పింఛన్లు అందజేస్తున్నారు. ►ఠంఛన్‌గా అవ్వాతాతల గడప వద్దకు వచ్చి, తలుపు తట్టి, ఆప్యాయంగా పలకరించి వైఎస్ జగన్ ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్లను అందించడంతో పాటు వివిధ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తున్నారు. పారదర్శకంగా లబ్ధిదారులను గుర్తించడం, అర్హులందరికీ లబ్ధి చేకూరేలా చేయి పట్టుకొని నడిపిస్తూ, ప్రతి 50 ఇళ్లకు ఒక బిడ్డగా ఉంటూ వైఎస్ జగన్ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తున్నారు. ►లంచాలు, వివక్షకు తావులేకుండా సేవా భావంతో సేవలందిస్తున్న వలంటీర్ చెల్లెమ్మలకు, వలంటీర్ తమ్ముళ్లకు సెల్యూట్ చేస్తూ వారి సేవలను గుర్తించి, ప్రభుత్వం వారికి ప్రోత్సాహకంగా మూడేళ్లుగా ఈ సత్కారం చేస్తున్న విషయం తెలిసిందే. పనితీరే ప్రామాణికం ► అవినీతికి తావు లేకపోవడం, సచ్ఛీలత, ఇంటింటి సర్వే, పెన్షన్ల పంపిణీ, హాజరు, యాప్‌ల వినియోగం, నవరత్నాల అమల్లో భాగస్వామ్యం, రేషన్ డోర్ డెలివరీ, పెన్షన్ కార్డు, రైస్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు చేయించడం తదితర అంశాల్లో వలంటీర్ల పని తీరే ప్రామాణికంగా అవార్డులకు ఎంపిక చేశారు. ► రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,33,719 మందికి రూ.243.34 కోట్ల నగదు పురస్కారాలు అందజేస్తారు. నేడు అందిస్తున్న ఈ సొమ్ముతో కలిపి ఇప్పటి వరకు వలంటీర్లకు వైఎస్ జగన్ ప్రభుత్వం మొత్తం రూ.705.68 కోట్లు పురస్కారాల కోసం వెచ్చించింది. ► గ్రామ/వార్డు వలంటీర్లు తమ పరిధిలోని 50–100 కుటుంబాలకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నందుకు.. గ్రామ, వార్డు సచివాలయాలకు, ప్రజలకు మధ్య మంచి సంధానుకర్తలుగా వ్యవహరించినందుకు, అనినీతి, వివక్షకు తావు లేకుండా పారదర్శకంగా వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులైన లబ్ధిదారులను గుర్తించడంలో సహాయకారిగా వ్యవహరించినందుకు ఈ పురస్కారాలను అందజేస్తోంది. ► వరదలు, విపత్తులు, ప్రమాదాల సమయంలో సహాయ కార్యక్రమాలలో పాల్గొని ప్రజలను ఆదుకోవడంతో పాటు ‘దిశ’ వంటి వాటిపై ప్రజలకు అవగాహన కల్పించినందుకు, జగనన్న సంక్షేమ క్యాలెండర్‌ను అనుసరించి ఎప్పుడు ఏ పథకం అమలవుతుందో ప్రజలకు వివరించి, అర్హులైన వారితో దగ్గరుండి దరఖాస్తు చేయించే సేవా సైనికులైనందుకు ఈ సత్కారం చేస్తోంది. సేవా సైన్యానికి సలాం మే 19వ తేదీ నుండి అన్ని నియోజకవర్గాల్లో పండగ వాతావరణంలో వలంటీర్లకు అవార్డుల ప్రదానం మొదలవ్వనుంది. కనీసం సంవత్సర కాలంగా నిరంతరాయంగా సేవలందిస్తున్న వలంటీర్లకు, వారు అందించిన సేవల ఆధారంగా 3 కేటగిరీల్లో పురస్కారాలు ప్రదానం చేయనున్నారు. సేవా వజ్ర సర్టిఫికెట్, శాలువ, బ్యాడ్జ్, మెడల్‌తో పాటు రూ.30,000 నగదు బహుమతి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యుత్తమ ర్యాంకు సాధించిన మొదటి ఐదుగురు వలంటీర్లకు.. మొత్తంగా 175 నియోజకవర్గాల్లో 875 మందికి సేవా వజ్ర పురస్కారాలు ప్రదానం చేస్తారు. సేవా రత్న సర్టిఫికెట్, శాలువ, బ్యాడ్జ్, మెడల్‌తో పాటు రూ.20,000 నగదు బహుమతి. ప్రతి మండలం, మున్సిపాలిటీ పరిధిలో ఐదుగురు చొప్పున, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 10 మంది చొప్పున టాప్–1 ర్యాంకు సాధించిన వలంటీర్లకు.. మొత్తంగా 4,220 మందికి సేవా రత్న పురస్కారాల అందజేస్తారు. సేవా మిత్ర సర్టిఫికెట్, శాలువ, బ్యాడ్జ్, మెడల్‌తో పాటు రూ.10,000 నగదు బహుమతి. రాష్ట్ర వ్యాప్తంగా ఏడాది పాటు ఎటువంటి ఫిర్యాదులు, వివాదాలు లేకుండా పని చేసిన వలంటీర్లు 2,28,624 మందికి సేవా మిత్ర పురస్కారాలు ప్రదానం చేస్తారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
FAAS Awards 2023 : సినీ ప్రముఖులకు అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)
-
‘ఫాస్’ సినీ అవార్డుల ప్రదానం.. ఎప్పుడంటే?
తెలుగు సినీ రంగంలోని ప్రతిభావంతులను ఎప్పటికప్పుడు గుర్తించి, అవార్డులిచ్చి అభినందించే ‘ఫిలిమ్ ఎనలిటికల్ అండ్ అప్రీసియేషన్ సొసైటీ’ (ఫాస్) తాజాగా మరోసారి అవార్డు ప్రదాన కార్యక్రమంతో ముందుకొచ్చింది. బంజారాహిల్స్‌లోని ఎల్వీ ప్రసాద్ ల్యాబ్‌లో మే 7న సాయంత్రం 6 గంటలకు ఈ అవార్డుల వేడుక జరగనుంది. ఫాస్ రజతోత్సవాల సందర్భంగా సినీ రంగానికి చెందిన వివిధ విభాగాలలోని విశిష్ట వ్యక్తులను ప్రత్యేక అవార్డుల కోసం ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో అక్కినేని – ఫాస్ సిల్వర్ జూబ్లీ, మహిళా సిల్వర్ పీకాక్ సినీ అవార్డులు, దాసరి – ఫాస్ సిల్వర్ జూబ్లీ సిల్వర్ నంది సినీ అవార్డులు, ఫాస్ – ఎన్టీఆర్ సెంటినరీ సిల్వర్ క్రౌన్ అవార్డు, జీవన సాఫల్య పురస్కారాలను అందజేయనున్నారు. ప్రముఖ సినీ నటుడు, నిర్మాత మురళీమోహన్ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. ముప్ఫై ఏళ్ళుగా తెలుగు చలనచిత్ర రంగానికి సేవలందిస్తున్న వారికి అవార్డులతో పాటు రజత కిరీటాలను ఇచ్చి గౌరవించనున్నారు. సాఫల్య పురస్కార గ్రహీతల్లో నటి రోజారమణి, రచయితలు పరుచూరి బ్రదర్స్, నిర్మాత సి. కల్యాణ్, దర్శకుడు రేలంగి నరసింహారావు తదితరులు ఉన్నారు. మూడున్నర దశాబ్దాలుగా పత్రికారంగంలో కృషి చేస్తున్న డాక్టర్ రెంటాల జయదేవను ఉత్తమ సినీ జర్నలిస్టుగా ఎంపిక చేశారు. పలువురు సినీ, మీడియా సంస్థలు, ప్రముఖులకు ఇంకా అనేక అవార్డులను వేదికపై అందించనున్నారు. లాభాపేక్ష రహితంగా, ఉన్నత విలువలతో సినీరంగానికి మూడు దశాబ్దాలుగా సేవ చేస్తున్న ఫాస్ సంస్థ చేస్తున్న ఈ కార్యక్రమంలో అవార్డు విజేతలతో పాటు పలువురు సినీ, సాంస్కృతిక, సామాజిక ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ వేడుకకు అందరూ ఆహ్వానితులేనని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, సెన్సార్ బోర్డ్ మాజీ సభ్యుడు ‘సాంస్కృతిక రత్న’ కె. ధర్మారావు తెలిపారు. చదవండి: ఇంటి గడప దాటడానికి కూడా పోరాటం చేయాల్సి వస్తోంది -
సాక్షి జర్నలిస్టులకు హైబిజ్ టీవీ అవార్డ్స్
-
27 ఉత్తమ పంచాయతీలకు రాష్ట్రస్థాయి అవార్డులు
సాక్షి, అమరావతి: జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని 27 గ్రామ పంచాయతీలను రాష్ట్రస్థాయి పురస్కారాలకు ప్రభుత్వం ఎంపిక చేసింది. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించే వేడుకల్లో ఆయా పంచాయతీలకు పురస్కారాలను అందజేస్తారు. పరిపాలనలో కొన్ని అంశాల్లో గ్రామ పంచాయతీలకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ పార్లమెంట్ చేసిన 73వ రాజ్యంగ సవరణ అమల్లోకి వచ్చిన సందర్భంగా ఏటా ఏప్రిల్ 24వ తేదీన దేశవ్యాప్తంగా జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆ రోజున ప్రతి పంచాయతీలో ప్రత్యేక గ్రామసభ నిర్వహించి సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ది కార్యక్రమాలపై చర్చిస్తారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలో 26 జిల్లాల్లోను ఆ జిల్లా పరిధిలో కూడా తొమ్మిది ప్రధాన అంశాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మూడేసి పంచాయతీల చొప్పున 27 పంచాయతీలకు జిల్లాస్థాయి పురస్కారాలు పంపిణీ చేయాలని పంచాయతీరాజ్ శాఖ ఇప్పటికే అన్ని జిల్లాల జెడ్పీ సీఈవోలు, డీపీవోలకు సూచించింది. 30 ఏళ్లు పూర్తి.. మధ్యప్రదేశ్‌లో ప్రధాని కార్యక్రమం 73వ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చి 30 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఈ ఏడాది జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని మరింత ఘనంగా నిర్వహించనుంది. మధ్యప్రదేశ్‌లోని రేవ గ్రామ పంచాయతీలో జరిగే జాతీయ పంచాయతీరాజ్ వేడుకల్లో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొని దేశవ్యాప్తంగా గ్రామీణ స్థానికసంస్థల ప్రజాప్రతినిధులు, ఇతర బాధ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తారని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ వెల్లడించింది. ప్రధాని కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో ప్రత్యక్ష ప్రసారానికి అవకాశం కల్పించాలని ఆయా రాష్ట్రాల పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శులకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఎకనమిక్ అడ్వయిజర్ బిజయకుమార్ బెహరా లేఖ రాశారు. రాష్ట్రస్థాయి ఉత్తమ పంచాయతీ అవార్డులకు ఎంపికైన గ్రామాలు.. విభాగాల వారీగా (బ్రాకెట్లో ఆ పంచాయతీ ఉన్న మండలం, జిల్లా పేరు) పేదరిక నిర్మూలన–ఉపాధి అవకాశాలు కల్పన 1. గంగిరెడ్డిపల్లి (వీఎన్‌పల్లి, వైఎస్సార్), 2. రాచర్ల (రాచర్ల, ప్రకాశం), 3. మల్లూరు (ముత్తుకూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు) హెల్దీ పంచాయతీ 1. తరువ (దేవరపల్లి, అనకాపల్లి) 2. భీమవరం (హుకుంపేట, అల్లూరి సీతారామరాజు), 3. నడింపాలెం (పత్తిపాడు, గుంటూరు) చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయతీ 1. కసిపాడు (పెదకూరపాడు, పల్నాడు), 2. నేలమూరు (పెనుమట్ర, పశ్చిమగోదావరి), 3. కుంతముక్కల (జి.కొండూరు, ఎన్టీఆర్) వాటర్ సఫిషియెంట్ పంచాయతీ 1. ఇల్లూరు కొత్తపేట (బనగానపల్లి, నంద్యాల), 2. వి.వి.కండ్రిక (కోడూరు, అన్నమయ్య), 3. ధూపాడు (త్రిపురాంతకం, ప్రకాశం) క్లీన్ అండ్ గ్రీన్ పంచాయతీ 1. కడలూరు (తడ, తిరుపతి), 2. బిల్లనందూరు (కోటనందూరు, కాకినాడ), 3. జోగింపేట (సీతానగరం, పార్వతీపురం మన్యం) సెల్ప్ సఫిషియెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పంచాయతీ 1. నందిగాం (నందిగాం, శ్రీకాకుళం), 2. కట్టకిందపల్లి (అనంతపురం రూరల్, అనంతపురం), 3. సూరప్పగూడెం (భీమడోలు, ఏలూరు) సోషియల్లీ సెక్యూర్డ్ పంచాయతీ 1. వెస్ట్ పెద్దివారిపాలెం (యద్దనపూడి, బాపట్ల), 2. మందగేరి (ఆదోని, కర్నూలు), 3. రామభద్రాపురం (రామభద్రాపురం– విజయనగరం) పంచాయతీ విత్ గుడ్‌గవర్నెన్స్ 1. సఖినేటిపల్లిలంక (సఖినేటిపల్లి, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ), 2. నగరపాలెం (భీమునిపట్నం, విశాఖపట్నం), 3. చోరగుడి (పమిడిముక్కల, కృష్ణా) ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ 1. మేడాపురం (సీకేపల్లి, శ్రీసత్యసాయి), 2. జేగురపాడు (కడియం, తూర్పు గోదావరి), 3. మార్టూరు (అనకాపల్లి, అనకాపల్లి) -
Telangana: తెలంగాణ పల్లెలకు 13 జాతీయ అవార్డులు
సాక్షి, హైదరాబాద్: జాతీయస్థాయి పురస్కారాల్లో తెలంగాణ పల్లెలకు అవార్డుల పంట పండింది. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్‌కు సంబంధించి 8 పురస్కారాలతోపాటు నానాజీ దేశ్‌ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్‌కు సంబంధించి 5 పురస్కారాలు సాధించి రాష్ట్రం సత్తా చాటింది. దీన్‌దయాళ్ పురస్కారాల్లో 9 కేటగిరీల్లోని 27 అవార్డులకుగాను 8 అవార్డులు సాధించి రాష్ట్రాలవారీగా అగ్రస్థానంలో నిలిచింది. ఇందులో నాలుగు పంచాయతీలు తొలి ర్యాంకు సాధించగా మరో రెండు పంచాయతీలు రెండో ర్యాంకు, ఇంకో రెండు పంచాయతీలు మూడో స్థానంలో నిలిచాయి. అలాగే నానాజీ పురస్కారాల్లో 7 కేటగిరీలకుగాను ఐదు (వాటిలో ఒకటి ప్రథమ స్థానం) అవార్డులు లభించాయి. తెలంగాణ వివిధ కేటగిరీల్లో పురస్కారాలకు ఎంపికైన విషయాన్ని కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ ఆర్థిక సలహాదారు డాక్టర్ బిజయకుమార్ బెహరా ఓ లేఖ ద్వారా రాష్ట్ర పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శికి తెలియజేశారు. ఈ నెల 17న ఢిల్లీ విజ్ఞాన్‌భవన్‌లో జరిగే ‘నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఇన్సెంటివైజేషన్ ఆఫ్ పంచాయత్స్ కమ్ అవార్డ్ సెర్మనీ’లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డులను ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. మార్కుల ఆధారంగా ర్యాంకులు.. ఏటా జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఉత్తమ పనితీరు కనబరిచిన పంచాయతీలకు ప్రోత్సాహకంగా అవార్డులు అందిస్తోంది. జాతీయ పంచాయతీ అవార్డుల్లో భాగంగా, ఆన్లైన్లో పంచాయతీల ద్వారా నామినేషన్లను తీసుకొని 9 అంశాల్లో (థీమ్‌లలో) ఉత్తమ గ్రామ పంచాయతీలకు మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ఉత్తమ అవార్డులు ప్రకటిస్తోంది. అయితే ఈ ఏడాది నుంచి అవార్డులను 9 అంశాల్లో ఏ పంచాయతీలు ప్రగతిని సాధించాయో వాటికి మొదటి, రెండవ, మూడవ బహుమతులుగా అవార్డులు ఇస్తోంది. ఇందులో ప్రతి అంశానికి వంద మార్కులకు సూచికలను ప్రకటించింది. ఈ తొమ్మిది అంశాల్లో ప్రతి పంచాయతీ సాధించిన మార్కుల ఆధారంగా దేశంలో ఉత్తమ పంచాయతీలను ప్రకటిస్తోంది. మంత్రి ఎర్రబెల్లి, ఆయన బృందానికి అభినందనలు సీఎం కేసీఆర్ మానసపుత్రిక అయిన పల్లెప్రగతి కార్యక్రమాల అమలు వల్లే రాష్ట్రానికి ఈ ఘనత లభించిందని, తెలంగాణను అవార్డులు వరించాయని మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు పేర్కొన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతోపాటు ఆయన బృందాన్ని ట్విట్టర్ వేదికగా అభినందించారు. ఇందుకు మంత్రి ఎర్రబెల్లి కృతజ్ఞతలు తెలియజేశారు. అవార్డులు రావడానికి కృషి చేసిన అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, సహకరించిన ప్రజలకు అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. నానాజీ దేశ్‌ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్–2023 ► ఉత్తమ బ్లాక్ (మండల) పంచాయతీ: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ ఎల్.ఎం.డి (సెకండ్ ర్యాంకు) ► ఉత్తమ జిల్లా పంచాయతీలు: ములుగు జిల్లా (సెకండ్ ర్యాంకు) ► గ్రామ ఊర్జా స్వరాజ్ విశేష్ పంచాయత్ పురస్కార్ (స్పెషల్ కేటగిరీ): ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా కె. (థర్డ్ ర్యాంకు). ► కార్బన్ న్యూట్రల్ విశేష్ పంచాయతీ పురస్కార్: రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా (సెకండ్ ర్యాంకు) ► గ్రామ ఊర్జా స్వరాజ్ విశేష్ పంచాయత్ పురస్కార్ (స్పెషల్ కేటగిరీ–నాన్ ఫైనాన్షియల్ ఇన్సెంటివ్–సర్టిఫికెట్): సిద్దిపేట జిల్లా మార్కూక్ ఎర్రవెల్లి (ఫస్ట్ ర్యాంకు) దీన్‌దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్–2023 ► ఆరోగ్యవంతమైన పంచాయతీ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెంచుపల్లి మండలం గౌతంపూర్ (ఫస్ట్ ర్యాంకు) ► తాగునీరు సమృద్ధిగా ఉన్న పంచాయతీ: జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం నెల్లుట్ల (ఫస్ట్ ర్యాంకు) ► సామాజిక భద్రతగల పంచాయతీ: మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం కొంగట్పల్లి (ఫస్ట్ ర్యాంకు) ► స్నేహపూర్వక మహిళా పంచాయతీ: సూర్యాపేట జిల్లా ఆత్మకూరు (ఎస్) మండలం ఏపూరు (ఫస్ట్ ర్యాంకు) ► పేదరికరహిత, జీవనోపాధి పెంచిన పంచాయతీ: గద్వాల జిల్లా రాజోలి మండలం మందొండి గ్రామం (సెకండ్ ర్యాంకు) ► సుపరిపాలనగల పంచాయతీ: వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట మండలం చీమల్దారి (సెకండ్ ర్యాంకు) ► క్లీన్ అండ్ గ్రీన్ పంచాయతీ: పెద్దపల్లి జిల్లా ఎలిగాడ్ మండలం సుల్తాన్పూర్ (థర్డ్ ర్యాంకు) ► స్వయం సమృద్ధ మౌలిక సదుపాయాలుగల పంచాయతీ: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీర్రావుపేట మండలం గంభీర్రావుపేట (థర్డ్ ర్యాంకు) చదవండి: హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. తెలంగాణలో వేడెక్కిన రాజకీయం -
పద్మ అవార్డులు అందుకున్న ప్రముఖులు (ఫొటోలు)
-
JFW Movie Awards: జేఎఫ్డబ్ల్యూ అవార్డ్స్ ఈవెంట్లో సినీతారల సందడి (ఫొటోలు)
-
స్టైల్ ఐకాన్ అవార్డ్స్ లో మెరిసిన తారలు
-
సుజలాం సుఫలాం
ఇంట్లో నీటి సమస్యను తీర్చడానికి దేశంలో చాలా చోట్ల మహిళలు పడే అవస్థల గురించి మనకు తెలిసిందే. అలాంటి ఊరందరి నీటి సమస్యను తీర్చాలంటే ఇంకెంత అవస్థ పడాలి. తమ గ్రామాలకు వచ్చిన నీటి కష్టం తీరాలంటే పూడుకుపోయిన చెరువును పునరుద్ధరించాలని, నదిని పునరుజ్జీవింపచేయాలని, కుళాయిలను ఏర్పాటు చేయాలనే ఆలోచనలు చేసి, దానిని అమలు చేస్తున్నారు గంగా రాజ్‌పుత్, గాయత్రీదేవి, శారదాదేవి, అనితా చౌదరి, కె.ఆశా. వీరిని కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ గుర్తించి ఈ యేడాది స్వచ్ఛ్ సుజల శక్తి సమ్మాన్ పురస్కారంతో సన్మానించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం ఢిల్లీలో వీరికి అవార్డులు అందజేశారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ఈ మహిళలు పురుషాధిపత్యం పైనే కాదు, మూఢనమ్మకాలపైనా పోరాడుతూ తమ గ్రామాల్లో నీటి ఎద్దడి సమస్యను తీర్చడానికి నడుం కట్టారు. గంగా ప్రవాహం... మధ్యప్రదేశ్‌లోని ఛతర్పూర్కు చెందిన 35 ఏళ్ల గంగా రాజ్‌పుత్ తన గ్రామంలో తీవ్ర నీటి కొరతను తీర్చడానికి ఒక చెరువును పునరుద్ధరించాలని ఆలోచన చేసింది. ఈ క్రమంలో అయితే, ఆమె ఆలోచనను అమలులో పెట్టడానికి పితృస్వామ్యంపైనే కాదు మూఢనమ్మకాలపై కూడా పోరాడాల్సి వచ్చింది. దశాబ్దాల క్రితం జరిగిన ఓ దుర్ఘటన కారణంగా గ్రామస్తులు చెరువును వదిలేశారు. దానిని పునరుద్ధరిస్తే ఎవరికైనా చెడు జరుగుతుందని స్థానికుల గట్టి నమ్మకం. దాంతో ఆ గ్రామంలో నీటి సంక్షోభం రోజు రోజుకూ తీవ్రతరం అవుతోంది. ఆ నీటి ఎద్దడిని తీర్చే ఏకైక ఆధారం ఆ చెరువే. ‘మూఢనమ్మకాలతో కన్నా నీటి కోసం చనిపోవడం మేలు’ అని అభ్యంతరం చెప్పిన ప్రతీసారి గ్రామస్తులకు పదే పదే చెబుతూ వచ్చింది గంగ. మెల్లగా ఓ పాతిక మంది మహిళలతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసింది. స్థానిక ఎన్జీవోల మద్దతుతో చెరువును శుభ్రం చేసి, పునరుద్ధరణ పనులు చేపట్టింది. ఊరికి నీటి ఎద్దడి తీరింది. నదికి జీవకళ గంగా రాజ్‌పుత్ మాదిరిగానే రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఉంటున్న గాయత్రీదేవి సంభార్ సరస్సు చుట్టూ ఉన్న 15 గ్రామాలకు చెందిన మహిళలకు వర్షపు నీటి సంరక్షణలో సహాయం చేయడానికి కృషి చేస్తోంది. అలాగే, ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్‌కు చెందిన శారదాదేవి కూడా తన గ్రామంలోని నీటి ఎద్దడిని పరిష్కరించడానికి స్థానిక బారువా నదిని పునరుజ్జీవింపజేయడానికి తోటివారిని కార్యోన్ముఖులను చేసి విజయం సాధించింది. మధ్యప్రదేశ్‌లోని చింద్వార్ జిల్లాకు చెందిన అనితా చౌదరి తన గ్రామంలోని ఇతర మహిళలు నీటి కోసం పడే కష్టాలను చూసింది. ఈ సమస్యను పరిష్కరించే అవకాశం వచ్చినప్పుడు ఆమె వెనకడుగువేయలేదు. రెండేళ్లుగా తన గ్రామమైన గర్మౌలో ప్రభుత్వ హర్ ఘర్ జల్ పథకాన్ని అమలు చేయడానికి కృషి చేసింది. మరో అవార్డు గ్రహీత తమిళనాడులోని తిరువళ్లూరుకు చెందిన కె.ఆశా, తన గ్రామంలో ఏ ఇంటì వద్ద కుళాయి నీటి సరఫరాలో చిన్న సమస్య వచ్చినా వెంటనే పరిష్కరిస్తుంది. -
ఉత్తమ మహిళా చెస్ జట్టుగా భారత్
అబుదాబి: ఆసియా చెస్ సమాఖ్య (ఏసీఎఫ్) 2022 వార్షిక అవార్డులను ప్రకటించారు. ఉత్తమ మహిళా చెస్ జట్టుగా భారత్‌కు పురస్కారం లభించింది. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణ వల్లి హారిక, వైశాలి, తానియా సచ్దేవ్, భక్తి కులకర్ణిలతో కూడిన భారత జట్టు గత ఏడాది సొంతగడ్డపై తొలిసారి జరిగిన చెస్ ఒలింపియాడ్‌లో మహిళల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించింది. ఈ ప్రదర్శనకుగాను ఏసీఎఫ్ ఉత్తమ జట్టు అవార్డు హంపి బృందానికి దక్కింది. భారత్‌కే చెందిన యువ గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ పురస్కారం గెల్చుకున్నాడు. గత చెస్ ఒలింపియాడ్‌లో తమిళనాడుకు చెందిన గుకేశ్ అత్యధికంగా తొమ్మిది పాయింట్లు స్కోరు చేసి స్వర్ణ పతకాన్ని సాధించాడు. గత ఏడాది మార్చిలో గుకేశ్ 2700 ఎలో రేటింగ్‌ను దాటి ఈ ఘనత సాధించిన ఆరో భారతీయ చెస్ ప్లేయర్‌గా నిలిచాడు. -
సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు
-
స్వచ్ఛ భారత్‌లో మరోసారి తెలంగాణ సత్తా
సాక్షి ప్రతినిధి, వరంగల్/సాక్షి హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకోసారి ప్రకటిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ అవార్డుల్లో తెలంగాణ మరోసారి సత్తా చాటింది. రెండు వేర్వేరు విభాగాల్లో మొదటి మూడు స్థానాలకుగాను రెండు స్థానాలు సాధించి దేశంలోనే నంబర్‌వన్‌గా మళ్లీ నిలిచింది. 2022 అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికానికి, స్వచ్ఛ భారత్ మిషన్ ఎంపిక చేసిన రెండు విభాగాల్లోనూ తెలంగాణ అగ్రగామిగా నిలిచింది. స్టార్ త్రీ విభాగంలో తెలంగాణలోని సిద్దిపేట జిల్లా, జగిత్యాల జిల్లాలు దేశంలో మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. మూడో స్థానంలో కేరళలోని కొట్టాయం జిల్లా నిలిచింది. స్టార్ ఫోర్ విభాగంలో తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా, 2వ స్థానంలో మధ్యప్రదేశ్‌లోని భోపాల్ జిల్లా నిలవగా, 3వ స్థానాన్ని తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా దక్కించుకుంది. గతంలోనూ స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ప్రకటించిన ప్రతి అవార్డు విభాగంలోనూ తెలంగాణ మొదటి మూడు స్థానాల్లో నిలిచింది. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో అనేక అవార్డులు సాధించింది. మంగళవారం హనుమకొండలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మీడియాతో మాట్లాడుతూ ఈ వివరాలు వెల్లడించారు. నిధులు ఇవ్వకున్నా, అవార్డులు ఇస్తున్నందుకు కేంద్రానికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. పల్లెప్రగతి వంటి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్ దార్శనికత వల్లే ఈ అవార్డులు దక్కుతున్నాయన్నారు. ఈ అవార్డులు రావడంలో ఉన్నతాధికారుల నుంచి గ్రామ సిబ్బంది వరకు అందరి కృషి ఉందని కొనియాడారు. కాగా, అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా కె గ్రామ సర్పంచ్ మీనాక్షికి మార్చి 4న ఢిల్లీలో రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా అవార్డు అందజేస్తారని ఎర్రబెల్లి తెలిపారు. -
2023 ఆటోకార్ అవార్డ్స్: సత్తా చాటిన కార్లు, బైకులు.. ఇవే!
ఇటీవల ఆటోకార్ అవార్డ్స్ 2023లో కార్ ఆఫ్ ది ఇయర్ టైటిల్ మారుతి సుజుకి గ్రాండ్ విటారా సొంతం చేసుకోగా, బైక్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని 'జాజ్ పల్సర్ ఎన్160' దక్కించుకుంది. మొత్తం 22 అవార్డులలో ఏ వాహనం ఏ అవార్డ్ దక్కించుకుందో ఇక్కడ చూడవచ్చు. మారుతి గ్రాండ్ విటారా అగ్ర గౌరవం అందుకోవడం మాత్రమే కాకుండా.. మిడ్‌సైజ్ ఎస్యువి ఆఫ్ ది ఇయర్ టైటిల్ కూడా సొంతం చేసుకుంది. మహీంద్రా స్కార్పియో ఎన్ 'ఆఫ్-రోడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు'ను మారుతి సుజుకి బాలెనొ హ్యాచ్‌బ్యాక్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని కైవసం చేసుకున్నాయి. లగ్జరీ సెడాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని మెర్సిడెస్ బెంజ్ మేబ్యాచ్ ఎస్-క్లాస్, ఎగ్జ్క్యూటివ్ ఇయర్ ఆఫ్ ది అవార్డు విజేతగా హ్యుందాయ్ టక్సన్, ఎంపివి ఆఫ్ ది ఇయర్‌గా ఇన్నోవా హైక్రాస్, లగ్జరీ ఎస్యువి ఆఫ్ ది ఇయర్ టైటిల్ విన్నర్‌గా ఆడి క్యూ3, గ్రీన్ కార్ ఆఫ్ ది ఇయర్ టాటా టియాగో ఈవి, ప్రీమియం బైక్ ఆఫ్ ది ఇయర్ విన్నర్ సుజుకి కటన, మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని టాటా మోటార్స్ సొంతం చేసుకున్నాయి. ఆటోకార్ అవార్డ్స్ 2023లో కొత్త మహీంద్రా స్కార్పియో ఎన్ వ్యూయర్స్ ఛాయిస్ అవార్డు కూడా తన ఖాతాలో వేసుకుంది. ఈ సందర్భగా మహీంద్రా కంపెనీ చైర్మన్ 'ఆనంద్ మహీంద్రా' కూడా ట్వీట్ చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పరిశ్రమకు సంబంధించి, 2022 పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని మహీంద్రా & మహీంద్రా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేష్ జెజురికర్ సొంతం చేసుకున్నారు -
రామ్‌చరణ్ ప్రెజెంట్స్....
మంగళవారం రామ్‌చరణ్ అమెరికా వెళ్లారు. ఎందుకంటే... హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవంలో రామ్‌చరణ్ ఓ ప్రెజెంటర్‌గా ఉన్నారు. కాలిఫోర్నియాలో ని బెవర్లీ హిల్స్ వేదికగా ఈ నెల 24న సిక్త్ హెచ్‌సీఏ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. నిర్వాహకుల ఆహ్వానం మేరకు రామ్‌చరణ్ అక్కడకు ఓ ప్రెజెంటర్‌గా వెళ్లారు. ఇక ఈ అవార్డుల జాబితాలో ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం..రణం..రుధిరం)కు నాలుగు (బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్షన్ ఫిల్మ్, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్) నామినేషన్స్ దక్కాయి. మరి.. అవార్డ్స్ వస్తాయా? అనేది చూడాలి. -
సినీ వారసులకు అవార్డుల ప్రదానం
సినీ ప్రముఖుల వారసులను ప్రోత్సహించే విధంగా వడపళనిలోని చక్రం హాల్లో ఆదివారం అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మహా ఫైనాన్స్ అధినేత అనురాధ జయరామన్, యునైటెడ్ ఆర్టిస్ట్ ఆఫ్ ఇండియా అధినేత కలైమామణి నెల్లైసుందరరాజన్ సంయుక్తంగా ఈ వేడుకలను నిర్వహించారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఎస్కే కృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీనియర్ దర్శకుడు కె.భారతీ రాజా వారసుడు నటుడు మనోజ్ భారతీ రాజా, ఆదేశ్ బాలా శరవణన్, గజేష్ నాగేష్, నటి సింధుజ విజీ, సుధా విజయ్, సీనియర్ పాత్రికేయుడు అయ్యప్ప ప్రసాద్, యువ వ్యాఖ్యాత నెల్లై ఎస్.విజయ్‌లకు అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎస్కే కృష్ణన్ మాట్లాడుతూ.. అనురాధ జయరామన్, కలైమామణి నెల్లై సుందర్ రాజన్ ఈ అవార్డుల వేడుక ద్వారా వినూత్న సంప్రదాయానికి శ్రీకారం చుట్టారన్నారు. సినీ ప్రముఖుల వారసులను ప్రోత్సహించే విధంగా ఈ అవార్డులను ప్రదానం చేయడం ప్రశంసనీయం అన్నారు. ఇది వారిలో నూతన ఉత్సాహాన్ని నింపుతుందన్నారు. -
నెల్లూరు, సంఘం బ్యారేజీలకు కేంద్రం అవార్డులు..
-
డ్యూటీ మీట్లో సత్తా చాటిన తెలంగాణ పోలీస్
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయిలో నిర్వహించిన ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్లో తెలంగాణ పోలీసులు సత్తా చాటారు. ఈ నెల 13 నుంచి 17 వరకు మధ్య ప్రదేశ్‌లోని భోపాల్‌లో నిర్వహించిన 66వ ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్లో నాలుగు విభాగాల్లో తెలంగాణ పోలీసులకు అవార్డులు దక్కాయి. రిటన్ టెస్ట్ విభాగంలో రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఎల్బీనగర్ సీసీఎస్‌లో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న ఎ.మన్మోహన్ కు బంగారు పతకం లభించింది. పోలీస్ వీడియోగ్రఫీ విభాగంలో సైబరాబాద్ కమిషనరేట్‌కు చెందిన పోలీస్ కానిస్టేబుల్ ఎ.అనిల్‌కుమార్‌కు రజతపతకం, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ విభాగంలో ఎస్ఐబీ (ఇంటెలిజెన్స్ విభాగంలో) ఎస్సైగా ఉన్న బి.వెంకటేశ్‌కు, ఇంటెలిజెన్స్ సీఐ సెల్లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న బి. విజయ్‌లకు వెండి పతకాలు లభించాయి. యాంటీ సబోటేజ్ చెకింగ్ (బాంబులను గుర్తించేది) విభాగంలో తెలంగాణ పోలీస్ శాఖకు మూడో స్థానం లభించింది. పోలీస్ డ్యూటీ మీట్లో రాష్ట్ర పోలీసులకు పతకాలు రావడంపై డీజీపీ అంజనీకుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. పతకాలు గెలిచిన అధికారులను ఆయన అభినందించారు. -
కెమెరా ముందు కుడితే లక్షలు వస్తున్నాయి
‘నీ విద్య నువు సరిగా నేర్చుకో... డబ్బు, గుర్తింపు అవే వస్తాయి’ అంటోంది ఈ టైలరమ్మ. బట్టలు కొత్తగా కుట్టడం కూడా లక్షలు తెచ్చి పెడతాయా? .. పెడతాయి. పల్లెటూళ్లో వ్యవసాయం చేసుకుంటూ రాత్రిళ్లు కుట్టు పని చేసిన ధోలీ యూ ట్యూబ్‌లో అందరూ టాలెంట్ ప్రదర్శించడం చూసి తను కూడా టైలరింగ్‌ను యూ ట్యూబ్‌లో చూపెట్టింది. రకరకాల స్త్రీల దుస్తులను కట్ చేసి కెమెరా ముందు కుడుతుండేసరికి లక్షల మంది ఫాలోయెర్లు ఏర్పడ్డారు. కుట్టడానికి ఆర్డర్లు వచ్చిపడుతున్నాయి. యూ ట్యూబ్ నెల తిరిగే సరికి చెక్ పంపుతోంది. అవార్డులు కూడా మొదలయ్యాయి. కత్తెర, టేప్‌తో ఒక మహిళ సాధించిన విజయం ఇది. నవ్యమైన ఐడియానే ఆమె విజయానికి కారణం. ‘కొందరు విధిని నమ్ముకుని కూచుంటారు. కొందరు మాత్రం తమ విధిరాతను తామే రాసుకుంటారు’ అంటుంది ధోలి. ఈమె ఇప్పుడు రాజ్ మసంద్లో ఉంటుంది. ఇది రాజస్థాన్‌లోని ఒక మోస్తరు సిటీ. కాని అక్కడి నుంచే దేశం మొత్తానికి తెలిసింది. ఇంకా చెప్పాలంటే ఎక్కడెక్కడైతే భారతీయులు ఉన్నారో అక్కడి వారికి కూడా తెలిసింది. దానికి కారణం బట్టలు కుట్టడంలో ధోలికి ఉండే విశేష ప్రతిభ, సృజనాత్మకత. వేగం. కొత్తదనం. స్త్రీలు ధరించే అన్ని రకాల వస్త్రాలను మరింత కొత్తగా ఎలా చేయవచ్చో, ఎలా ఆకర్షణీయంగా మలచవచ్చో ధోలి చేసే వీడియోల్లో చూడొచ్చు. కొందరు విద్యను దాచుకుంటారు. కాని ధోలి తనలాంటి స్త్రీలు టైలరింగ్ నేర్చుకుని తమ కాళ్ల మీద తాము నిలబడాలని తెలిసిందంతా చెప్పేస్తుంది. అందుకే ఆమెకు అంత ప్రచారం. మన్నన. బాల్య వివాహం చేసుకుని ధోలిది రాజస్థాన్‌లోని భరత్పూర్. తండ్రి వ్యవసాయం చేసేవాడు. వెనుకబడిన ్రపాంతం కావడంతో 10 సంవత్సరాలకే పెళ్లి చేసి ఈడేరాక అత్తారింటికి పంపాడు. 18 ఏళ్లు వచ్చేసరికి ధోలి ముగ్గురు పిల్లల తల్లి. అత్తారింటిలో పెద్ద కోడలు కావడం వల్ల బండెడు చాకిరీ ఉండేది. పగలు పొ లంలో కూలి పని చేసేది. పాలు పితికి అమ్మేది. చిన్నప్పటి నుంచి టైలరింగ్ అంటే ఆసక్తి ఉండటం వల్ల నేర్చుకోవడంతో రాత్రిళ్లు కరెంటు లేని ఇంట్లో కిరోసిన్ దీపం కింద కుట్టేది. కాని బతుకు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అన్నట్టుగానే ఉండేది. సిటీకి మారాక కొన్ని కారణాల వల్ల పట్నమైన రాజ్ మసంద్‌కు ధోలి కాపురం మార్చింది. అక్కడ టైలరింగ్ మొదలెట్టింది. 2016లో యూట్యూబ్ ఆమె దృష్టికి వచ్చింది. అందులో రకరకాల వ్యక్తులు తమకు తెలిసిన విద్యలు వీడియోలు చేసి పెట్టడం గమనించింది. ‘నేనెందుకు నా టైలర్ విద్యను ప్రదర్శించకూడదు’ అని వీడియోలు చేసి పెట్టింది. రోడ్డు మీద ఉండే తన ఇంటిలో రోడ్డు రణగొణ ధ్వనుల మధ్య ఆ వీడియోలు చేసి అప్లోడ్ చేసింది. కాని అంతగా గుర్తింపు రాలేదు. ధోలి ఆగలేదు. వీడియోలు బాగా గమనించి ఎలా చేయాలో తెలుసుకుని 2017లో ‘ఘోరి ఫ్యాషన్ డిజైనర్’ పేరుతో యూట్యూబ్ చానల్ తెరిచింది. 27 కోట్ల వ్యూస్ టైలరింగ్ పని నేర్చుకోవాలని చాలా మంది స్త్రీలకు ఉంటుంది. కొత్త కొత్త ఫ్యాషన్స్ ఫాలో కావాలని మరికొంత మంది స్త్రీలకు ఉంటుంది. వీరంతా వెంటనే ధోలి చేస్తున్న వీడియోలను ఇష్టపడి చానల్‌కు సబ్స్క్రయిబ్ చేశారు. ఏ బట్టను ఏ మోడల్‌తో ఎలా కుట్టాలో ధోలి చకచకా చెప్తూ కుట్టి చూపుతుంది కాబట్టి వాటిని ఫాలో కాసాగారు. కుర్తీలు, అనార్కలి డ్రస్సులు, బ్లౌజ్‌లు... ఒకటని ఏముంది చాలా కొత్తరకంగా ధోలి డిజైన్లు ఉంటాయి. యూ ట్యూబ్ నుంచి తొలి పారితోషికంగా 11 వేల రూపాయలు వచ్చాయి. ఇప్పుడు ఆమెకు 16 లక్షల మంది సబ్స్క్రయిబర్లు ఉన్నారు. ఇప్పటికి 700 వీడియోలు చేసి అప్లోడ్ చేసింది. వీటికి 27 కోట్ల వ్యూస్ వచ్చాయి. యూ ట్యూబ్ నుంచి నెలకు లక్షకు పైగా పారితోషికం అందుతోంది. అంటే ధోలి ఎంత సక్సెస్ఫుల్ టైలరమ్మో అర్థం చేసుకోవచ్చు. తన ప్రచారం కోసం ఫేస్‌బుక్‌లోనూ ఇన్‌స్టాలోనూ అకౌంట్లు తెరిచింది. రోజుకు 20 రూపాయల నుంచి ఒకప్పుడు పల్లెటూళ్లో రాత్రిళ్లు బట్టలు కుడితే అతి కష్టమ్మీద రోజుకు 20 రూపాయలు వచ్చేవి. ఇవాళ ధోలి కేవలం తన ప్రతిభ, సృజనాత్మకతతో పాటు సోషల్ మీడియా సహాయంగా పెద్ద సంపాదన చూస్తోంది. రాజ్ మసంద్లో మంచి ఇల్లు ఏర్పాటు చేసుకుంది. ఆమెను పిలిచి అవార్డులు ఇచ్చి గౌరవిస్తున్నారు. ‘ఎదుటి వారిని ఓడించడం కంటే మనం గెలవడం ముఖ్యం అనుకోవాలి. మనలోని ప్రతికూల భావాలను తీసేస్తే తప్పకుండా విజయం సాధిస్తాం’ అంటుంది ధోలి. -
ఇద్దరు చిన్నారులకు బాలశక్తి పురస్కారాలు
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు చిన్నారులు 2023 సంవత్సరానికిగానూ ప్రధానమంత్రి రాష్ట్రీయ బాలశక్తి పురస్కారాలను అందుకున్నారు. కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ఆరు విభాగాల్లో 11 మంది చిన్నారులకు బాలశక్తి పురస్కారాలు అందజేశారు. కళ, సంస్కృతి విభాగంలో నలుగురు, శౌర్యం విభాగంలో ఒకరు, నూతన ఆవిష్కరణలలో ఇద్దరు, సామాజికసేవలో ఒకరు, క్రీడా విభాగంలో ముగ్గురు మొత్తంగా 11 మంది చిన్నారులకు పురస్కారాలను అందించారు. కళ సంస్కృతి విభాగంలో అతి పిన్న వయస్కురాలిగా యునెస్కోలోని ఇంటర్నేషనల్ డ్యాన్స్ కౌన్సిల్లో నామినేట్ అయిన తెలంగాణకు చెందిన నాట్యకళాకారిణి ఎం.గౌరవి రెడ్డి, క్రీడా విభాగంలో విశాఖపట్నానికి చెందిన 11 ఏళ్ల అంతర్జాతీయ చెస్ క్రీడాకారిణి, గతేడాది మే–అక్టోబర్ మధ్య అండర్–11 బాలికల కేటగిరీలో ప్రపంచ నెంబర్–1 గా నిలిచిన కోలగట్ల అలాన మీనాక్షి ఈ బాలశక్తి పురస్కారాలు స్వీకరించారు. అవార్డు గ్రహీతలకు పతకం, రూ.లక్ష నగదు బహుమతి, ధ్రువపత్రం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అందించారు. కాగా మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు పురస్కారాల గ్రహీతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంభాషించనున్నారు. -
టీఎస్ ఎన్పీడీసీఎల్కు స్కోచ్ అవార్డులు
హనుమకొండ: తెలంగాణ స్టేట్ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(టీఎస్ ఎన్పీడీసీఎల్)కు రెండు ‘స్కోచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్’అవార్డులు దక్కాయి. శుక్రవారం ఢిల్లీ నుంచి ఆన్లైన్ ద్వారా 88వ స్కోచ్ సదస్సు జరిగింది. ఈ మేరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్కోచ్ వైస్ చైర్మన్ గురుశరణ్ డంజల్ స్కాచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డులను ప్రకటించారు. ఐఆర్డీఏ జీపీఆర్ఎస్ ఎనేబుల్డ్ ఇంటిగ్రేటెడ్ స్పాట్ బిల్లింగ్, డిస్ట్రిబ్యూటెడ్ సోలార్ ఎనర్జీ ఇన్ టీఎస్ ఎన్పీడీసీఎల్ అవార్డులు వచ్చాయి. ఆ సంస్థ సీఎండీ ఎ.గోపాల్‌రావు ఆన్లైన్లో అవార్డులు స్వీకరించారు. -
అట్లుంటది మన యాక్టింగ్.. పోలా అదిరిపోలా!
ఈ కోతికి కొంచెం యాక్టింగ్ పిచ్చి.. ఎప్పటికైనా సినిమాల్లో స్టార్ అయిపోవాలని కలలుగంటోంది..పైగా.. చావు సీన్లలో యాక్ట్ చేయడంలో స్పెషలైజేషన్ కూడా ఉంది. ఎంతలా అంటే యాక్టింగా.. లేక నిజంగానే చచ్చిందా అన్నది సాటి కోతులు కూడా కనిపెట్టలేవు. ఫొటోగ్రాఫర్ ఫెడ్రికా(ఇటలీ) కూడా చనిపోయిందనే అనుకున్నారు. ఇంతలో ఎవరు కట్ అన్నారో తెలియదుగానీ.. చటుక్కున లేచి కూర్చుందట. కామెడీ వైల్డ్ లైఫ్ అవార్డ్స్ జ్యూరీ మెచ్చిన చిత్రమిది. ఇట్స్ ఏ గోల్.. ఈ గద్ద.. మెస్సీ ఫ్యాన్ అట. ఈ మధ్యే ఫిఫా వరల్డ్ కప్ చూసొచ్చింది. అప్పటి నుంచీ ఇదే వరుస. గోల్ మీద గోల్ కొట్టేస్తోంది. ఏమో.. ఎప్పుడైనా తమ గద్దల్లోనూ ఫుట్ బాల్ పోటీపెడితే.. పనికివస్తుందని ఇప్పటి నుంచే తెగ ప్రాక్టీస్ చేస్తోంది. జియా చెన్ తీసిన ఈ చిత్రం కామెడీ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ పోటీల్లో అమేజింగ్ ఇంటర్నెట్ పోర్ట్‌ఫోలియో పురస్కారాన్ని గెలుచుకుంది. సాక్షి సెంట్రల్‌డెస్క్ -
ఘనంగా సంతోషం అవార్డ్స్ కార్యక్రమం (ఫొటోలు)
-
50 ఏళ్ల క్రితమే వరల్డ్‌కప్ కొట్టింది.. ఇప్పటికీ అవార్డులు
ఎనిడ్ బెక్వెల్.. ఇంగ్లీష్ మహిళా క్రికెట్లో తనకంటూ ప్రత్యేక పేజీని రూపొందించుకుంది. ఇంగ్లండ్ మహిళా ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్న ఎనిడ్ బెక్వెల్ ఖాతాలో ఒక వన్డే ప్రపంచకప్ ఉండడం విశేషం. ఇక 1968 నుంచి 1979 వరకు ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించిన ఎనిడ్ బెక్వెల్ 12 టెస్టులతో పాటు 23 వన్డే మ్యాచ్‌లు ఆడింది. మంచి ఆల్‌రౌండర్‌గా పేరు పొందిన ఎనిడ్ బెక్వెల్ 12 టెస్టుల్లో 1078 పరుగులతో పాటు 50 వికెట్లు, 23 వన్డేల్లో 500 పరుగులతో పాటు 25 వికెట్లు పడగొట్టింది. ఇక 1973లో ఆస్ట్రేలియాతో జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆమె ప్రదర్శన ఎవరు అంత తేలిగ్గా మరిచిపోలేరు. ఎందుకంటే ఆరోజు జరిగిన ఫైనల్లో మొదట బ్యాటింగ్‌లో రాణించిన బెక్వెల్ సెంచరీతో(118 పరుగులు) మెరిసింది. అనంతరం బౌలింగ్‌లో 12 ఓవర్లు వేసి 28 పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టి మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించింది. ఒక నిఖార్సైన ఆల్‌రౌండర్ అనే పదానికి నిర్వచనం చెప్పింది. 1973 వరల్డ్‌కప్ ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన ఎనిడ్ బెక్వెల్.. వరల్డ్‌కప్ సాధించి 50 ఏళ్లు కావొస్తున్నా ఇంకా అవార్డులు అందుకుంటూనే ఉందట. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. ఎందుకంటే ఎంత వరల్డ్‌కప్ గెలిచినా మహా అయితే పొగుడడం తప్పిస్తే ప్రతీ ఏడాది అవార్డులు ఇవ్వడం కుదరదు. కానీ ఎనిడ్ బెక్వెల్ అందుకు మినహాయింపు. 1973 నుంచి చూసుకుంటే గత 50 ఏళ్లుగా ఆమెకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు వస్తూనే ఉన్నాయి. ఆటకు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికి 82 ఏళ్ల వయసులోనే మొకాళ్లు సహకరించకపోయినప్పటికి రెగ్యులర్‌గా మైదానంలో క్రికెట్ ఆడుతూనే కనిపిస్తుంది. తాజాగా ఎనిడ్ బెక్వెల్ క్రికెట్ ఆడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అభిమానానికి ఒక హద్దు ఉంటుంది.. కానీ ఎనిడ్ బెక్వెల్ విషయంలో మాత్రం అది తప్పని నిరూపితమైంది. చదవండి: Rishabh Pant: కోలుకోవడానికే ఆరు నెలలు.. ఈ ఏడాది కష్టమే -
‘విద్యుత్’లో కేసీఆర్ పీహెచ్డీ
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ రంగంపై సీఎం కేసీఆర్‌కు ఉన్నంత అవగాహన, పట్టు దేశంలో మరెవరికీ లేదని, విద్యుత్‌లో ఆయన పీహెచ్డీ చేశారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఇంధన పొదుపు పురస్కారం తొలుత సీఎం కేసీఆర్‌కే ఇవ్వాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన అభివృద్ధి సంస్థ(టీఎస్రెడ్కో) ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘ఇంధన పొదుపు పురస్కారాల–2022’ ప్రదానోత్సవంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో విద్యుత్ వృథా అధికంగా ఉందని, అవసరం లేకున్నా లైట్లు వేసుకుంటున్నారని అన్నారు. దీనిపై గ్రామస్తుల్లో చైతన్యం తేవాలని కోరారు. ఇంధన పొదుపును పాఠ్యాంశంగా బోధించాలని మంత్రి సూచించారు. సమావేశంలో ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు, ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘు మారెడ్డి, రెడ్కో చైర్మన్ సతీష్‌రెడ్డి పాల్గొన్నారు. అవార్డు విజేతలు ఇలా.. ఇండస్ట్రీస్ విభాగంలో.. ఐటీసీ లిమిటెడ్‌కు స్పెషల్ అవార్డు, మై హోం ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు గోల్డ్ అవార్డు, గ్రాన్యులెస్ ఇండియా లిమిటెడ్‌కు సిల్వర్ అవార్డు ఎడ్యుకేషనల్ బిల్డింగ్ విభాగంలో.. వర్థమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌కు గోల్డ్ అవార్డు, విక్టోరియా మెమోరియల్ రెసిడెన్షియల్ స్కూల్‌కు సిల్వర్ ప్రభుత్వ బిల్డింగ్ విభాగాల్లో.. సంచాల భవన్‌కు గోల్డ్, లేఖా భవన్‌కు సిల్వర్ కమర్షియల్ బిల్డింగ్ విభాగంలో.. జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు స్పెషల్ అవార్డు, విప్రో లిమిటెడ్‌కు గోల్డ్, రైల్వేస్టేషన్ బిల్డింగ్ విభాగంలో... కాచిగూడకు గోల్డ్, సికింద్రాబాద్‌కు సిల్వర్ ట్రాన్స్‌పోర్ట్‌లో.. జనగాం డిపోకు గోల్డ్, ఫలక్నామా డిపోకు సిల్వర్.. నల్లగొండ మున్సిపాలిటీకి గోల్డ్, జీహెచ్ఎంసీకి సిల్వర్ అవార్డు. -
TS: ప్రతి మండలంలో మహిళా వేదిక
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రతి మండలంలో మహిళా వేదికను నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు. రైతుల కోసం రైతు వేదికలను నిర్మించినట్టే మండలానికి, వీలైతే కొన్ని గ్రామాలకు కలిపి మహిళా భవనాలను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారని తెలిపారు. ఏపీమాస్, ఎనేబుల్, నాబార్డ్‌ల సంయుక్త ఆధ్వర్యంలో మూడు దశాబ్దాలుగా స్వయం సహాయక బృందాల (ఎస్‌హెచ్‌జీ)తో బ్యాంక్ లింకేజీ ప్రక్రియ విజయవంతంగా సాగుతున్న నేపథ్యాన్ని పురస్కరించుకొని ఎంసీఆర్హెచ్ఆర్డీఐలో శుక్ర, శనివారాల్లో జాతీయస్థాయి సెమినార్ జరిగింది. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన పలు రాష్ట్రాలకు చెందిన 17 మహిళా సంఘాలకు మంత్రి అవార్డులను అందజేశారు. అనంతరంమాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం 17,978 మహిళా స్వయం సహాయక సంఘాలు కొనసాగుతున్నాయని, ఇందులోని సభ్యులందరికీ ఉపయోగపడేలా మహిళా భవనాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. స్వయం సహాయక బృందాల్లో స్త్రీనిధి ద్వారా ఎలాంటి ష్యూరిటీ లేకుండా రూ.3 లక్షల రుణాలు తీసుకుంటున్నారని చెప్పారు. రుణాలు తీసుకున్న మహిళలు దురదృష్టవశాత్తు చనిపోతే వారి రుణాలను మాఫీ చేయాలని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో తెలంగాణకు చెందిన కామారెడ్డి మండల మ్యూచువల్ ఎయిడెడ్ సహకార సమాఖ్యకు మొదటి బహుమతి, దక్షిణ భారతదేశ కేటగిరీలో హనుమకొండ జిల్లా బ్రహ్మదేవరపల్లి మండల మ్యూచువల్ ఎయిడెడ్ సహకార సమాఖ్యకు రెండో బహుమతి రావడంతో మంత్రి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల కార్యదర్శి సందీప్ సుల్తానియా పాల్గొన్నారు. -
తెలంగాణకు మరో రెండు జాతీయ అవార్డులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మాతా శిశు సంరక్షణలో తీసుకుంటున్న చర్యలకు జాతీయ స్థాయిలో మరోసారి గుర్తింపు లభించింది. గర్భిణుల సంరక్షణకు రాష్ట్రం అనుసరిస్తున్న విధానాలను కేంద్రప్రభుత్వం ప్రశంసించింది. కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ ఢిల్లీలో నిర్వహిస్తున్న ‘నేషనల్ మెటర్నల్ హెల్త్ వర్క్ షాప్‘లో భాగంగా తెలంగాణకు రెండు అవార్డులను ప్రకటించింది. మాతృ మరణాలను పూర్తిగా నివారించాలన్న కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తీసుకుంటున్న చర్యలను కేంద్రం అభినందించింది. బుధవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర వైద్యారోగ్యశాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్పవార్ చేతుల మీదుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున జాయింట్ డైరెక్టర్ (మెటర్నల్ హెల్త్) డాక్టర్ ఎస్ పద్మజ అవార్డులు అందుకున్నారు. మిడ్ వైఫరీ వ్యవస్థపై కేంద్రం ప్రశంసలు దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిడ్ వైఫరీ వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు కురిపించింది. రాష్ట్రంలో ప్రసవసేవలను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం దేశంలోనే తొలి సారి మిడ్ వైఫరీ వ్యవస్థను తీసుకువచ్చింది. దీని కోసం ఎంపిక చేసిన నర్సులకు అత్యుత్తమ శిక్షణ అందించింది. ఇప్పటి వరకు ఇలా శిక్షణ పొందిన 212 మంది మిడ్ వైఫరీలను ప్రభుత్వం 49 ఆస్పత్రుల్లో నియమించింది. ఇక హైరిస్క్ ఉన్న గర్భిణులను గుర్తించడం, చికిత్స అందించడంలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. హైరిస్క్ గర్భిణులను ముందస్తుగా గుర్తించడం, వారిని నిరంతరం పరిశీలించడం ( ట్రాకింగ్), ఉత్తమ చికిత్స అందేలా రిఫర్ చేయడంకోసం వైద్య అధికారులు, స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎంలతో ప్రత్యేక విధానాన్ని అభివృద్ధి చేసింది. దీంతో హై రిస్క్ కేసులను ముందుగా గుర్తించి, వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షించి, ఆసుపత్రులకు తరలించి, సరైన చికిత్స అందించే అవకాశం కలిగింది. దీంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న కేసీఆర్ కిట్, అమ్మఒడి వాహన సేవలు గర్భిణులకు వరంగా మారాయి. ఫలితంగా రాష్ట్రంలో మాతృ మరణాలు గణనీయంగా తగ్గాయి. చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి: హరీశ్ ‘‘సీఎం కేసీఆర్ ఆలోచనతో రాష్ట్రంలో అమలు చేస్తున్న మాతా శిశు సంరక్షణ చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. మరో రెండు కేంద్ర ప్రభుత్వ అవార్డులు రావడం మా వైద్య సిబ్బంది పనితీరుకు నిదర్శనం. 2014లో 92గా ఉన్న ఎంఎంఆర్ ఇప్పుడు 43కు తగ్గటం గొప్ప విషయం. ఈ ఘనతలు సాధించడంలో క్షేత్రస్థాయిలో ఉండి వైద్య సేవలు అందించే ఆశాలు, ఏఎన్ఎంల నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి వైద్యాధికారుల నిరంతర కృషి ఉందని’ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అభినందించారు. ఇదీ చదవండి: Hyderabad: పాతబస్తీకి మెట్రో కలేనా..? -
వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను అభినందించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: వైద్యఆరోగ్యశాఖ అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. ఇటీవల వారణాసిలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సదస్సులో ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖ టెలికన్సల్టేషన్ విభాగం, విలేజ్ హెల్త్ క్లినిక్‌ల విభాగంలో రెండు అవార్డులను గెలుచుకుంది. ఈ అవార్డులను కేంద్రం నుంచి మంత్రి రజని, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి కృష్ణబాబు అందుకున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం సచివాలయంలో సీఎం జగన్‌ను కలిసి రాష్ట్రానికి వచ్చిన అవార్డులను చూపించారు. చదవండి: (Viral Video: నిజమే.. పార్టీ లేదు.. బొక్కా లేదు.. చంద్రబాబే స్వయంగా!) (ఆ కారణంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాని చెప్పారు: ఎంపీ మిథున్‌రెడ్డి) -
కెనరా బ్యాంక్‌కు ప్రతిష్టాత్మక ఐబీఏ అవార్డులు
ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్‌కు ప్రతిష్టాత్మక ఐబీఏ అవార్డులు లభించాయి. ‘‘బెస్ట్ టెక్నాలజీ టాలెంట్ ’’ కేటగిరీ అవార్డుతోపాటు బెస్ట్ టెక్నాలజీ బ్యాంక్, బెస్ట్ డిజిటల్ ఎంగేజ్మెంట్, బెస్ట్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ కేటగిరీల్లోనూ బ్యాంక్‌కు అవార్డులు లభించాయి. ముంబైలో జరిగిన ఐబీఏ 18వ బ్యాంకింగ్ టెక్నాలజీ సదస్సు, ఎక్స్పో అండ్ అవార్డులు– 2022 అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అశోక్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘డిజిటల్ లెండింగ్ ద్వారా రుణ వృద్ధి’ అనే అంశంపై జరిగిన ఒక చర్చా గోష్టిలో అశోక్ చంద్ర పాల్గొని, ఈ విభాగంలో లభ్యమవుతున్న అవకాశాల గురించి మాట్లాడారు. -
హస్తకళాకారులకు జాతీయ అవార్డులు
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ హస్త కళలు, టైక్స్టైల్స్ రంగాల్లో విశేష ప్రతిభ చూపిన వారికి కేంద్రం అవార్డులు అందజేసింది. సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డులు అందజేసినట్లు టెక్స్టైల్స్ మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. 2017, 2018, 2019లో జాతీయ అవార్డులకు మొత్తం 78 మంది హస్త కళాకారులను ఎంపిక చేసినట్లు పేర్కొంది. 2018కి తెలంగాణ నుంచి కరీంనగర్‌కు చెందిన గద్దె అశోక్‌కుమార్ (సిల్వర్ ఫిలిగ్రీ)కి అందజేసినట్లు తెలిపింది. ఏపీ నుంచి అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన దాలవాయి కుళాయప్ప (లెదర్ పప్పెట్రీ, 2017), డి.శివమ్మ (లెదర్ పప్పెట్రీ, 2019)లకు అవార్డు అందజేసినట్లు పేర్కొంది. అవార్డు గ్రహీతలకు రూ.లక్ష నగదు, తామ్రపత్రం, శాలువా, ధ్రువపత్రం అందజేసినట్లు తెలిపింది. అలాగే, 2017, 2018, 2019 సంవత్సరాలకు మొత్తం 30 మంది శిల్పగురులను ఎంపిక చేయగా ఏపీ నుంచి బ్లాక్ మేకింగ్‌లో కొండ్ర గంగాధర్ (2018), కలంకారిలో వేలాయుధం శ్రీనివాసులు రెడ్డి (2019)ను ఎంపిక చేసినట్లు తెలిపింది. వీరికి బంగారు నాణెం, రూ.2 లక్షల నగదు, తామ్రపత్రం, శాలువా, ప్రశంసాపత్రం అందజేసినట్లు తెలిపింది. పీయూష్ గోయల్ నుంచి అవార్డు అందుకుంటున్న గద్దె అశోక్‌కుమార్ -
రాష్ట్రానికి మరో 7 ‘స్వచ్ఛ’ అవార్డులు.. కేటీఆర్ హర్షం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ తాజాగా ప్రకటించిన స్వచ్ఛ అవార్డుల జాబితాలో తెలంగాణలోని ఏడు పట్టణాలకు చోటు దక్కింది. ఇప్పటికే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా రాష్ట్రానికి స్వచ్ఛ సర్వేక్షణ్ విభాగంలో 16 అవార్డులు రాగా, ఇండియన్ స్వచ్ఛత లీగ్ (ఐఎస్ఎల్) విభాగంలో మరో మూడు అవార్డులను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ప్రదానం చేసింది. తాజాగా కాగజ్‌నగర్, జనగామ, ఆమన్‌గల్, గుండ్లపోచంపల్లి, కొత్తకోట, వర్ధన్నపేట, గ్రేటర్ వరంగల్ పురపాలికలకు ఫాస్టెస్ట్ మూవింగ్ సిటీస్ (వేగంగా ఎదుగుతున్న నగరాలు) కేటగిరీలో కేంద్ర ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది. దీంతో తెలంగాణ మొత్తం 26 అవార్డులను సాధించినట్లయింది. 4,355 పట్టణ స్థానిక సంస్థల్లో సర్వే స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల కోసం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ జాతీయ స్థాయి శానిటేషన్ సర్వేను జూలై 2021 నుంచి జనవరి 2022 వరకు నిర్వహించింది. పారిశుధ్యం, మున్సిపల్ ఘన..ద్రవ వ్యర్థాల నిర్వహణ, అవగాహనపై దేశ వ్యాప్తంగా ఉన్న 4,355 పట్టణ స్థానిక సంస్థల్లో నిర్వహించారు. అవార్డులకు ఎంపిక చేయడానికి 90 అంశాలను ప్రాతిపదికగా తీసుకున్నారు. ఘన వ్యర్ధాల నిర్వహణ, ఉమ్మి రహిత వాణిజ్య ప్రాంతాలు, కమ్యూనిటీ లెవల్ కంపోస్టింగ్, ప్రజా మరుగుదొడ్లు.. కమ్యూనిటీ టాయిలెట్ల నిర్వహణ, ద్రవ..వ్యర్ధాల నిర్వహణ, ప్రజల అవగాహన, సిటిజెన్స్ ఎంగేజ్మెంట్, ఇన్నోవేషన్స్ తదితర అంశాలు పరిశీలించారు. అనంతరం అవార్డులు ప్రకటించారు. తక్కువ మున్సిపాలిటీలు.. ఎక్కువ అవార్డులు: కేటీఆర్ రాష్ట్రానికి మరిన్ని స్వచ్ఛ అవార్డులు దక్కడంపై పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆలోచనల్లో నుంచి పురుడు పోసుకున్న పట్టణ ప్రగతి, పల్లె ప్రగతితో తెలంగాణ పల్లెలు, పట్టణాల రూపురేఖలు మారి అద్భుతమైన అభివృద్ధిని సాధిస్తున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ మార్గనిర్దేశనంలో అటు పల్లెలు, ఇటు పట్టణాలను సమానంగా అభివృద్ధి చేసేందుకు అమలు చేస్తున్న పరిపాలనా సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాల ఫలితంగానే జాతీయ స్థాయిలో తెలంగాణకు అవార్డులు దక్కుతున్నాయని చెప్పారు. తక్కువ మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు ఉన్నప్పటికీ అత్యధిక అవార్డులు దక్కించుకున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని చెప్పారు. తెలంగాణ అద్భుత, వినూత్న కార్యక్రమాలను యావత్ దేశం ఆదర్శంగా తీసుకుంటోందని అన్నారు. ఈ అవార్డులు రావడంలో పురపాలక శాఖ సిబ్బంది, ప్రజాప్రతినిధులు కీలక పాత్ర వహించారంటూ వారిని అభినందించారు. అవార్డులు సాధించిన పురపాలికల అధికారులు, ప్రజాప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి పేరు తీసుకొచి్చన పట్టణాలకు రూ.2 కోట్ల చొప్పున ప్రత్యేక ప్రోత్సాహక నిధులను ప్రకటించారు. ఇదీ చదవండి: Hyderabad: జనవరిలో నూతన భవనంలోకి యూఎస్ కాన్సులేట్ -
సైన్సు అవార్డుల్లో కోతలా?
శాస్త్ర ప్రపంచం ప్రతిష్ఠాత్మకంగా భావించే శాంతి స్వరూప్ భట్నాగర్ ప్రైజ్ విజేతల పేర్లను సాంప్రదాయికంగా ‘సీఎస్‌ఐఅర్’ ఫౌండేషన్ డే అయిన సెప్టెంబర్ 26న ప్రకటిస్తుంటారు. ఈసారి వారి పేర్లను అప్పుడు ప్రకటించలేదు. పైగా ప్రధాని చేతుల మీదుగా బహూకరించకుండా వారున్న చోటికే అవార్డు పంపించారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో 100కి పైగా అవార్డులను దశలవారీగా ఎత్తివేయాలన్న సిఫార్సులూ సాగాయి. ఇటీవలి వారాల్లో ప్రభుత్వ సంస్థలు, రాష్ట్ర విశ్వవిద్యాలయాలు ఉత్తమ పీహెచ్డీ థీసిస్ అవార్డులను, ఉత్తమ పరిశోధనా పత్రం అవార్డులను ఇవ్వవద్దని వారి ఫ్యాకల్టీలను ఆదేశించాయి. ఇలాగైతే 2047 నాటికి భారత్ శాస్త్ర ప్రగతిలో స్వావలంబన దేశంగా మారేనా? సృజనాత్మక కృషికి ప్రోత్సాహం ఇలాగేనా? శాంతి స్వరూప్ భట్నాగర్ (ఎస్ఎస్బీ) ప్రైజ్‌ను 1957లో నెలకొల్పారు. భారత శాస్త్ర, పారిశ్రామిక పరిశోధనా సంస్థ (సీఎస్ఐఆర్) ప్రథమ డైరెక్టర్ పేరిట దీన్ని ఏర్పర్చారు. అనువర్తిత లేదా ప్రాథమిక పరిశోధనలో అసాధా రణ ప్రతిభ ప్రదర్శించిన వారికి భారత ప్రభుత్వం ఏటా ఈ అవార్డును బహూకరిస్తుంటుంది. అవార్డులు గెలుచుకున్న వారి పేర్లను సాంప్రదాయికంగా సీఎస్ఐఆర్ ఫౌండేషన్ రోజైన సెప్టెంబర్ 26న ప్రకటిస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం మాత్రం కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖా మంత్రి జితేంద్ర సింగ్ విజేతల పేర్లను చివరిక్షణంలో ప్రకటించకుండా నిలిపివేశారు. దేశంలోని శాస్త్ర సాంకేతిక రంగానికి సంబంధించిన విభాగాల సెక్రటరీలు, మంత్రులు హాజరైన అత్యున్నత స్థాయి సమావేశానికి ఆ మినిట్స్‌ని పంపించారు. ప్రధాని నరేంద్రమోదీ దార్శనికతకు అనుగుణంగా ఈ అవార్డు ఎకో సిస్టమ్ మార్పు గురించి ఈ సమావేశం జరిగింది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో 100కి పైగా అవార్డులను దశలవారీగా ఎత్తివేయాలని ఈ సమావేశం సిఫార్సు చేసింది. ఒక్కొక్క ఎస్ఎస్బీ ప్రైజ్ విజేతకు ఇస్తున్న రూ. 15 వేల అదనపు నగదు ఉపకార వేతనం స్థానంలో భారీ మొత్తాన్ని ఒకేసారి అందించడం, లేదా నెలవారీ పారితోషికంపై గరిష్ఠంగా 15 సంవత్సరాల పరిమితి విధించడానికి ఉద్దేశించిన ప్రభుత్వ ప్రతిపాదనను కూడా ఈ సమావేశ మినిట్స్ బహిర్గత పరిచాయి. శాంతిస్వరూప్ భట్నాగర్ ప్రైజ్‌కి గరిష్ఠ అర్హతా వయస్సు ప్రస్తుతం 45 సంవత్సరాల వరకు ఉంటోంది. 15 సంవత్సరాల పరిమితి విధించడం వల్ల అది 60 సంవత్సరాల వరకు పెరిగే అవకాశం ఉంది. శాంతిస్వరూప్ భట్నాగర్ ప్రైజ్‌ను కొనసాగించడానికి ప్రభుత్వం అనుమతించిందని ఈ సంవత్సరం సీఎస్ఐఆర్ సంస్థాపక దినం రోజున ప్రకటించడానికి ప్రయత్నించారు. కానీ సీఎస్ఐఆర్ సొసైటీ సమావేశాన్ని అక్టోబర్ 15న ప్రధాని అధ్యక్షతన నిర్వహించినప్పుడు, తదుపరి ఎస్ఎస్బీ అవార్డు ప్రదాన ఉత్సవాలు జరిపే తేదీని ఇంకా నిర్ణయించాల్సి ఉందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి ప్రకటించారు. మూడు వారాల తర్వాత 2019–21 సంవత్సరానికి గాను ఈ అవార్డులను 37 మందికి వారు ఉన్న చోటకే అవమానకరంగా పంపించారు. కాగా 2012–2015, 2016–2018 సంవత్సరాలకుగానూ 2016, 2019లలో ప్రధాని ఈ అవార్డును జాతీయ సైన్సు దినోత్సవం (ఫిబ్రవరి 28/29న) సందర్భంగా విజ్ఞాన్ భవన్లో బహూకరించారు. 2020లో ప్రచురితమైన సీఎస్ఐఆర్ డాక్యుమెంట్ ప్రకారం, ఇంతవరకు ఎస్ఎస్బీ ప్రైజ్‌ని గెలుచుకున్న 560 మందిలో అప్పటికి 244 మంది మూడు జాతీయ సైన్సు అకాడమీలకు ఫెలోలుగా ఎంపికయ్యారు. 143 మంది ఇటలీలోని థర్డ్ వరల్డ్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్(టీడబ్ల్యూఏఎస్)కు ఫెలోలుగా ఎంపికయ్యారు. 64 మందికి టీడబ్ల్యూఏఎస్ ప్రైజ్ వచ్చింది. 25 మంది రాయల్ సొసైటీ ఫెలోషిప్‌కి ఎంపికయ్యారు. మరో 15 మంది అమెరికాకు చెందిన నేషనల్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్ విదేశీ అసోసియేట్స్‌గా ఎంపిక య్యారు. మరో 30 మంది ఇన్ఫోసిస్ సైన్స్ ప్రైజ్ అందుకున్నారు. కనీసం 100 మంది పద్మ పురస్కారాన్ని స్వీకరించారు. శాంతి స్వరూప్ భట్నాగర్ ప్రైజ్ గెలుచుకున్న వారి ప్రతిభను ఈ డేటా తేటతెల్లం చేస్తోంది. భట్నాగర్ లారెట్స్ (1958–2018) అనే శీర్షికతో ప్రచురితమైన పుస్తకం ఎస్ఎస్బీ ప్రైజ్ చరిత్రను వివరిస్తుంది. ఈ ప్రైజ్‌ని 1958లో బహుకరించారు. తొలి గ్రహీతకు ఒక ఫలకం, రూ. 10,000 నగదును బహుమతిగా ఇచ్చారు. తొలి బహుమతి పుచ్చుకున్నది భట్నాగర్ సమకాలికుడు అయిన సర్ కేఎస్ కృష్ణన్ (1940). 60 ఏళ్ల వయసులో ఈయనకు తొలి ప్రైజ్ దక్కింది. రెండో సంవత్సరం అంటే 1959లో ఇద్దరు గణిత శాస్త్రజ్ఞులు కె చంద్రశేఖరన్, సీఆర్ రావులకు ఈ ప్రైజ్ దక్కింది. ఆనాటికి వీరి వయస్సు 39 సంవత్సరాలు మాత్రమే. ప్రస్తుతం, ఏడు రంగాలకు కలిపి ఈ అవార్డును ఇస్తున్నారు. ప్రైజ్ మొత్తం 2008లో రూ. 5 లక్షలకు పెరిగింది. ఒక సబ్జెక్టులో ఎంత మందికి అవార్డు ఇచ్చారనే దాంతో సంబంధం లేకుండా ఎంపికైన ప్రతి ఒక్కరికీ తలా రూ. 5 లక్షలను ఇస్తూ వచ్చారు. దీనికి తోడుగా, దశాబ్దం క్రితం బహుమతి గ్రహీతలందరికీ రూ. 15,000 ఉపకార వేతనం ఇవ్వడం మొదలెట్టారు. గత విజేతలకూ దీన్ని వర్తింపజేశారు. ఎస్ఎస్బీ అవార్డు గ్రహీతలకు నెలవారీ చెల్లింపులు జరపాలనేది మెరుగైన ప్రతిభ కనబర్చినవారికి నగదు ప్రోత్సాహకం ఇవ్వాలన్న భావనలోంచి వచ్చింది. నాలుగు నేషనల్ సైన్స్, ఇంజినీరింగ్ అకా డమీలలో కనీసం రెండింటిలో రీసెర్చ్ ఫెలోస్‌గా ఎంపికైన యూని వర్సిటీ టీచర్లకు నెలకు రూ. 15 వేల నగదు ప్రోత్సాహకం ఇవ్వడానికి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ, యూజీసీ, శాస్త్ర సాంకేతిక శాఖ (డీఎస్టీ) ఆసక్తి చూపాయి. ప్రతిభావంతులైన శాస్త్రవేత్తలకు జేసీ బోస్ ఫెలోషిప్ కింద మరొక రూ. 25,000లను అందించే మరొక పథకంతో డీఎస్టీ ముందుకొచ్చింది. అత్యంత ప్రతిభావంతుడైన భారత శాస్త్రవేత్తకు సీఎస్ఐఆర్ లేదా యూజీసీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ పథకం కింద, దాంతోపాటు డీఎస్టీ – జేసీ బోస్ ఫెలోషిప్ కింద అందే ద్రవ్యపరమైన ప్రయోజనాలు ఇవే మరి. ఈలోగా, మెరుగైన ఐఐటీలు కొన్ని తమ సొంత చెయిర్ ప్రొఫెస ర్షిప్లను నెలకొల్పాయి. ఇవి కూడా ద్రవ్యపరమైన ప్రయోజనాలను అర్హులైన శాస్త్రవేత్తలకు ఇస్తూ వచ్చాయి. ఇలాంటి ప్రోత్సాహకాలను స్ఫూర్తిగా తీసుకుని పలు ఇతర సైన్స్ విభాగాలు, మంత్రిత్వ శాఖలు తమతమ సొంత ప్రతిభ ఆధారిత ప్రోత్సాహక పథకాలతో ముందు కొచ్చాయి. సెప్టెంబర్ 16న జరిగిన సమావేశం, ఇలాంటి అన్ని స్కీములను మదింపు చేస్తూనే, వీటిని కుదించాలని సిఫార్సు చేసింది. ప్రభుత్వ సంస్థల్లోని ప్రైవేట్ విరాళాల మద్దతు కలిగిన అవార్డులకు కూడా ఈ సమీక్షను వర్తింపజేశారు. ప్రభుత్వ ముఖ్య శాస్త్ర సలహాదారుతో సంప్రదించి, నోబెల్ అవార్డు ప్రమాణాల్లో ఒక అవార్డును ఏర్పర్చాలని చైర్మన్ చేసిన సూచనను కూడా మినిట్స్ పేర్కొంది. అయితే 2003లో రూ. 25 లక్షల నగదుతో ఏర్పర్చిన ఇండియన్ సైన్స్ అవార్డును 2010లో తీసేశారనే విషయాన్ని ఆ సమావేశంలో పాల్గొన్న ఏ ఒక్కరూ పేర్కొనలేదు. ఈలోగా ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ సంస్థ 2008లో రూ. 25 లక్షల మొత్తంతో తొలి సైన్స్ ప్రైజ్‌ని ఐఐటీ కాన్పూర్‌కి చెందిన గణిత శాస్త్ర జ్ఞుడు మణీంద్ర అగర్వాల్‌కు బహూకరించింది. 2009లో ఇన్ఫోసిస్ ప్రైజ్ పరిధిని విస్తృత పరిచి నగదు మొత్తాన్ని రెట్టింపు చేశారు. ఆరు విభాగాల్లో వీటిని అందిస్తున్నారు. ఒక్కో ప్రైజు లక్షరూపాయల విలు వను కలిగి ఉంటుంది. దీనికి పన్ను కూడా మినహాయించారు. ఇటీవలి వారాల్లో, ప్రభుత్వ సంస్థలు, రాష్ట్ర విశ్వవిద్యాలయాలు మరొక అడుగు ముందుకేశాయి. అత్యుత్తమ పరిశోధనా పత్రానికి, అత్యుత్తమ పీహెచ్డీ థీసెస్‌కి ఇస్తున్న అవార్డును సైతం నిలిపి వేయాలని వాటి ఫ్యాకల్టీలకు ఆదేశాలు జారీ చేశాయి. ఈ రెండు అవార్డులూ పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసినవే. అన్నిటికంటే మించి డీఎస్టీ అందిస్తున్న కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన స్కాలర్ షిప్పులను కూడా ఉన్నట్లుండి రద్దుచేయడం దారుణమనే చెప్పాలి. 2047 నాటికి భారత్‌ని స్వావలంబన సాధించిన దేశంగా మార్చడానికి సృజనాత్మక కృషి జరపాలంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపు నిచ్చారు. కానీ శాస్త్రీయ ప్రతిభకు గుర్తింపునిచ్చే ప్రభుత్వ అవార్డులను చాలావరకు రద్దు చేయాలని ప్రధాని స్వయంగా ఆయా మంత్రిత్వ శాఖలను కోరారంటే నమ్మశక్యం కావడం లేదు. ప్రభుత్వ ఆలోచనల్లో ఉన్నదాన్ని కార్పొరేట్ రంగం ఇప్పటికే అమలు చేసేసిందని ప్రభుత్వం లెక్కించి ఉండవచ్చు. కాబట్టే ప్రభుత్వ రంగంలో ఉన్న అవార్డులను కూడా కుదించాలని అది నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. అరుణ్ కుమార్ గ్రోవర్ మాజీ వైస్ చాన్స్‌లర్, పంజాబ్ యూనివర్సిటీ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
పది, అంతకంటే ఎక్కువ మంది పిల్లలుంటే.. మదర్ హీరోయిన్ అవార్డు!
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సోవియట్ శకం నాటి మదర్ హీరోయిన్ టైటిల్ అవార్డును పునరుద్ధరించారు. పదిమంది కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న తల్లిని పుతిన్ ఈ అవార్డుతో సత్కరిస్తారు. కుటుంబ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఈ అవార్డులు ఇస్తున్నట్లు రష్యా తెలిపింది. రష్యా అధికారిక డిక్రీ ప్రకారం...ఈ అవార్డును రష్యా ఫెడరేషన్ పౌరులై ఉండి, పదిమంది లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలకు జన్మనిచ్చి, పెంచిన తల్లులకు మాత్రమే ఈ అవార్డును ప్రధానం చేస్తోంది మాస్కో. ఈ అవార్డు గ్రహితల్లో పుతిన్ స్నేహితుడు రమ్జాన్ కదిరోవ్ భార్య మెద్నీ కూడా ఉన్నారు. అంతేగాదు చెచెన్ రిపబ్లిక్ అధిపతిగా పనిచేస్తున్న పుతిన్ స్నేహితుడు కదిరోవ్ ఉక్రెయిన్ యుద్ధం కోసం యుక్త వయసులో ఉన్న తన కొడుకులను పంపుతానని పుతిన్‌కి వాగ్దానం చేశాడు. అలాగే ఆర్కిటిక్‌యమలో నెనెట్స్ ప్రాంతానికి చెందిన మరో మహిళ ఈ అవార్డును దక్కించుకున్నట్లు రష్యా తెలిపింది. వాస్తవానికి ఈ టైటిల్‌ని రష్యాలో 1990 నుంచి 1994 మధ్యకాలంలో అందించారు. ఆ తర్వాత పుతిన్ కొన్నినెలలు క్రితమే దీన్ని మళ్లీ పునరుద్ధరించారు. ఐతే ఈ అవార్డులను పునరుద్ధరించిన తదనంతరం ప్రదానం చేయడం ఇదే తొలిసారి. ఈ అవార్డును అందుకున్న ప్రతి తల్లికి దాదాపు రూ. 13 లక్షలు వరకు చెల్లిస్తోంది మాస్కో. ఈ టైటిల్ పునరుద్ధరణను గమనిస్తే ఉక్రెయిన్‌పై దాడి తదనంతరం రష్యాలో సాంప్రదాయవాద ధోరణి తీవ్రతరం అవుతున్నట్లు తెలుస్తోంది. (చదవండి: ప్రజాస్వామ్యం వర్సెస్ నిరంకుశత్వం...బైడెన్‌కి చైనా కౌంటర్) -
ఆలోచన అక్కర్లేదా?!
ఇది ప్రపంచ ప్రఖ్యాత నోబెల్ అవార్డుల సీజన్. కొద్దిరోజులుగా వివిధ రంగాల్లో నోబెల్ విజేతల పేర్లు ప్రకటిస్తుంటే, అంతకు పక్షం రోజుల క్రితం మన దేశంలో గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోయిన ఓ దుర్మార్గం ఆలస్యంగా బయట కొచ్చింది. శాస్త్రీయ పరిశోధనలో ప్రతిభను గుర్తించి ఏటా ఇచ్చే 300 అంతర్గత అవార్డులు, ఉపకార వేతనాలు, ఫెలోషిప్లను ఎత్తివేయాలని కేంద్రం నిర్ణయించింది. వివిధ రంగాల్లో అవార్డుల ఎంపికను క్రమబద్ధీకరించడానికంటూ కేంద్ర హోమ్ సెక్రటరీ సారథ్య సమావేశంలో గత నెల 16న చడీచప్పుడు లేకుండా పాలకులు తీసుకున్న ఈ నిర్ణయం దిగ్భ్రాంతికరం. శాస్త్రీయ దృక్పథాన్నీ, పరిశోధననూ పెంచాల్సిన రోజుల్లో ఆ స్ఫూర్తికి అశనిపాతం. దేశంలో అవార్డుల ఎంపిక వ్యవస్థను పారదర్శకంగా, నిష్పాక్షికంగా తీర్చిదిద్దాలనే ప్రధాని ఆలోచన మంచిదే కావచ్చు. దాని అంతరార్థం, శాస్త్రవేత్తల సమూహానికి కలిగించే నష్టమే చర్చనీయాంశం. అవార్డులైనా... రివార్డులైనా ప్రతిభను ప్రోత్సహించడానికి! ఆయా రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్నవారిని గుర్తించి, గౌరవించడానికి!! సంక్లిష్టమైన శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అవి మరింత కీలకం. 1940లు, 50లలో భారతీయ శాస్త్రవేత్తల్లో సుప్రసిద్ధుడూ, సీఎస్ఐఆర్ సంస్థాపకుడూ అయిన ప్రొఫెసర్ శాంతిస్వరూప్ భట్నాగర్ జన్మదినమైన సెప్టెంబర్ 26ను మన శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా జరుపుకొంటారు. ప్రతి ఏటా సరిగ్గా ఆ రోజునే భారత ప్రభుత్వం సైతం మన దేశంలో కృషి చేస్తున్న అత్యుత్తమ ప్రతిభావంతులైన 45 ఏళ్ళ వయస్సు లోపు శాస్త్రవేత్తలను గౌరవిస్తూ, భట్నాగర్ ప్రైజ్ ప్రకటిస్తుంది. కానీ, ఈసారి ప్రభుత్వ అవార్డు ప్రకటనలు లేకపోగా, ప్రభుత్వానికి పైసా ఖర్చు లేని ప్రైవేట్ ధర్మనిధి పురస్కారాల్ని సైతం ఎత్తివేస్తున్నట్టు చావుకబురు చల్లగా చెప్పింది. ఉన్నత స్థాయి సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాల సమాచారాన్ని బయటపెట్టి, గమ్మున ఊరకుంది. ఇప్పుడిక శాస్త్ర, సాంకేతిక విభాగంలో అవార్డుల సంఖ్య 207 నుంచి 4 జాతీయ అవార్డులకే పరిమితం. అంతరిక్షం, భూవిజ్ఞానం, అణు ఇంధన శాఖల్ని సైతం అవార్డులన్నీ ఎత్తేయమని కేంద్రం పేర్కొంది. ఏలికలు అకస్మాత్తుగా ఇలా అవార్డులు ఎత్తేయడానికి హేతుబద్ధత ఏమిటో అంతుపట్టదు. పొదుపుచర్యల్లో భాగంగా ఇలా చేశారనుకోవడానికీ వీల్లేదు. ఎందుకంటే, ఈ అవార్డులన్నిటికీ కలిపి ఏటా అయ్యే ఖర్చు అతి స్వల్పం. పోనీ, అర్హత లేని వారికి అవార్డులిస్తారనే మిషతో ఈ ఎత్తివేత జరిగిందా అంటే అదీ లేదు. సాధారణంగా ఏ అవార్డుల ఎంపికలోనైనా పక్షపాతం, దురభిప్రాయాల్ని కొట్టిపారేయలేం. ఇప్పటిదాకా శాస్త్రవేత్తల అవార్డుల్లో తప్పుడు ఎంపికలు అతి తక్కువ. ప్రస్తుతమున్న ఎంపిక ప్రక్రియలో అధిక శాతం అత్యుత్తమ ప్రతిభావంతులకే పట్టం కట్టారు. మరి ఏలినవారి ఈ హఠాన్నిర్ణయానికి కారణం? శాస్త్ర సాంకేతిక రంగాల్లోని బహుకొద్ది శాస్త్రవేత్తలే నేటి పాలకుల ప్రశ్నార్హమైన శాస్త్రీయ అజెండాతో అంటకాగుతున్నారు. అవార్డులన్నిటినీ కేంద్రీకృతం చేయడం వల్ల ఎంపిక కమిటీలపై ప్రభుత్వం పట్టు బిగుస్తుంది. దరిమిలా అయినవాళ్ళకు అవార్డులు వడ్డించి, వారిని వివిధ పరిశోధక సంస్థలు, విశ్వవిద్యాలయాల్లో కీలక స్థానాల్లో కూర్చోబెట్టే వీలొస్తుంది. ఇదే తాజా ప్రభుత్వ నిర్ణయంలో పరమార్థమని వాదన. అలాగే, పలువురు ప్రముఖ శాస్త్రవేత్తలు వివిధ సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వ సైన్స్ విధానాలను మీడియాలో విమర్శించారు. మింగుడుపడని పాలకులు వారి రెక్కలు కత్తిరించడానికే ఈ చర్య చేపట్టారని ఒక కథనం. యువ శాస్త్రవేత్తలకిచ్చే ఫెలోషిప్‌లు గతంలో ఎప్పుడో అరుదుగా ఆలస్యమయ్యేవి. కానీ, మూడేళ్ళుగా సమయానికి ఫెలోషిప్‌లు, గ్రాంట్లు రాక పరిశోధనకు అవసరమైన సరుకులు, సామగ్రి వారు కొనుక్కోలేకపోతున్నారు. కుటుంబాల్ని పోషించుకోలేని పీహెచ్డీ విద్యార్థులు సగంలోనే పరిశోధనకు మంగళం పాడుతున్నారు. ఇప్పుడు అవార్డులను ఎత్తివేయడమంటే ప్రోత్సాహాన్ని ఆపేయడమే కాదు.... శాస్త్రీయ పరిశోధన పట్ల ఆసక్తిని మరింత నీరుగార్చి, నిరుత్సాహపరచడం! అసలు మన దేశంలో సరికొత్త పరిశోధనలకు ప్రేరణనిస్తూ, శాస్త్రవేత్తల వెన్నుతట్టేందుకు ఉన్న అవార్డులే తక్కువ. ఖజానాకు ఖర్చు లేని ప్రైవేట్ ధర్మనిధి పురస్కారాల్నీ ఎత్తేయడం ఏ రకంగా సమంజసం? ఇప్పటికే దేశం. ప్రాథమిక శాస్త్రీయ పరిశోధనలకు వచ్చే యువతీ యువకులు తగ్గారు. ఇతర రంగాల్లోని భారీ వేతనాలిచ్చే ఉద్యోగాల వైపు మళ్ళుతున్నారు. తాజా చర్యతో సర్కార్ ఎలాంటి సంకేతాలిస్తోంది? పాత అవార్డుల స్థానంలో నోబెల్ తరహాలో ‘విజ్ఞాన్ రత్న’ పేరిట ఉన్నత శ్రేణి జాతీయ అవార్డులు కొన్ని తెస్తామని సర్కారు వారి మాట. ఈ కొత్తవి పరిశోధనలో అన్ని విభాగాలకూ, పరిశోధకులకూ వర్తిస్తాయో లేదో తెలీదు. అవార్డులు తీసేస్తే, వాటి కోసం ఇచ్చిన ధర్మనిధులు ఏమవుతాయి? వాటిని దేనికి వినియోగిస్తారు? జవాబు లేని ప్రశ్నలెన్నో! శాస్త్రీయ పరికరాల కొనుగోలుపై జీఎస్టీని కేంద్రం ఇటీవలే 5 శాతం నుంచి 18 శాతానికి పెంచింది. ఇది పలు సంస్థల పరిశోధన బడ్జెట్‌కు మోయలేని భారమవుతోంది. అలాగే, విదేశీ పరిశోధకుల్ని ఆహ్వానించాలన్నా, విదేశీ విశ్వవిద్యాలయంతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకోవాలన్నా లెక్కలేనన్ని అనుమతులు అడ్డం పెట్టి, వ్యవహారం సంక్లిష్టం చేసింది. పరిశోధనలో అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని దాదాపు అసాధ్యం చేసింది. నమ్మకాలు, విశ్వాసాలకే తప్ప హేతుబద్ధత, తార్కిక విశ్లేషణకు చోటు లేకుండా పోతున్న రోజుల్లో, పాలనలో శాస్త్రీయ దృష్టికి ప్రోత్సాహం ఇలానే ఉంటుందేమో! ఏమైనా ఉత్తమాటలు చెప్పి ఉన్నవాటన్నిటినీ ఎత్తేయడం... మబ్బులు చూపిస్తూ ముంతలో ఉన్న నీళ్ళు ఒలకబోయడమే!! -
సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలతో ఏపీకి అవార్డులు
-
స్వచ్ఛ సర్వేక్షణ్ 2022: వరుసగా ఆరోసారి తొలిస్థానంలో ‘ఇండోర్’
న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన నగరంగా వరుసగా ఆరో ఏడాది తొలిస్థానాన్ని కైవసం చేసుకుంది మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరం. స్వచ్ఛ సర్వేక్షన్ 2022 అవార్డుల జాబితాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. గుజరాత్‌లోని సూరత్ నగరం తన రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది. మహారాష్ట్రలోని నావి ముంబై మూడో స్థానంలో నిలవగా, ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నాలుగో స్థానంలో ఉంది. ‘స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్- 2022’లో మంచి పనితీరు కనబరిచిన రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలు నిలిచాయి. పెద్ద నగరాల జాబితాలో ఇండోర్, సూరత్ తొలి రెండు స్థానాల్లో ఉండగా.. నావి ముంబై, విజయవాడలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు.. 100లోపు అర్బన్ లోకల్ బాడీస్ ఉన్న రాష్ట్రాల జాబితాలో త్రిపురకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లోని మరిన్ని అంశాలు ఇలా ఉన్నాయి.. ► ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ విజేతలకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ► లక్షలోపు జనాభా కలిగిన నగరాల జాబితాలో మహారాష్ట్రలోని పంచ్‌గాని నగరం తొలి స్థానం సాధించింది. ఆ తర్వాత పటాన్(ఛత్తీస్‌గఢ్), కర్హాద్(మహారాష్ట్ర)లు ఉన్నాయి. ► లక్షకుపైగా జనాభా కలిగిన గంగా పరివాహక నగరాల్లో హరిద్వార్ తొలిస్థానంలో నిలవగా.. ఆ తర్వాతి స్థానాల్లో వారణాసి, రిషికేశ్‌లు ఉన్నాయి. లక్షలోపు జనాభా కలిగిన నగరాల్లో బిజ్నోర్కు ఫస్ట్ ర్యాంక్, ఆ తర్వాత కన్నౌజ్, గర్‌ముఖ్తేశ్వర్ నగరాలు నిలిచాయి. ► మహారాష్ట్రలోని డియోలాలి దేశంలోనే స్వచ్ఛమైన కంటోన్మెంట్ బోర్డుగా నిలిచింది. స్వచ్ఛ సర్వేక్షన్లో భాగంగా 2016లో 73 నగరాలను పరిగణనలోకి తీసుకోగా.. ఈ ఏడాది ఏకంగా 4,354 నగరాలను పరిశీలించి అవార్డులు ప్రకటించారు. ఇదీ చదవండి: ‘పోక్సో’ కేసులో సంచలన తీర్పు.. ఆ మానవ మృగానికి 142 ఏళ్ల జైలు శిక్ష -
ఏపీకి స్వచ్ఛ సర్వేక్షన్ జాతీయ అవార్డులు
-
ఉత్తమ పంచాయతీలకు అవార్డులు.. దరఖాస్తుల ఆహ్వానం
సత్తెనపల్లి: ‘పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు’ ఇదీ.. జాతిపిత మహాత్మాగాంధీ మాట. దీనిని స్ఫూర్తిగా తీసుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర గ్రామీణాభివృద్ధికి కృషి చేస్తున్నాయి. గ్రామం పంచాయతీలను ఆ దిశగా ప్రోత్సహిస్తున్నాయి. దీనిలో భాగంగానే గ్రామ పాలనలో ఉత్తమంగా నిలిచిన పంచాయతీలకు కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఏటా జాతీయ స్థాయిలో పురస్కారాలు అందజేస్తోంది. ఈసారి అవార్డుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 9 అంశాల్లో అక్టోబరు 31 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనుంది. 9 అంశాలివే.. పేదరిక నిర్మూలనకు మెరుగైన జీవనోపాధి ఆరోగ్యవంతమైన గ్రామం పిల్లల స్నేహపూర్వక పంచాయతీ తాగునీటి లభ్యత హరిత, స్వచ్ఛ గ్రామం స్వయం సమృద్ధి, మౌలిక సదుపాయాలు సామాజిక భద్రత, సుపరిపాలన మహిళా స్నేహపూర్వక పంచాయతీ ప్రత్యేక పోర్టల్ ఈ అంశాల్లో చేపట్టిన అభివృద్ధి వివరాలతో ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించాలి. దీనికోసం పంచాయతీవార్డ్.జీవోవీ.ఇన్ పోర్టల్ అందుబాటులో ఉంచారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిల వారీగా పనులను పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి. ఒక్కో అంశానికి సంబంధించి ప్రతిబింబించే ఫొటోలు, వీడియోలు, కేస్ స్టడీస్‌తో దరఖాస్తు చేయాలి. జాతీయ స్థాయిలో అవార్డుకు ఎంపికైతే వచ్చే ఏడాది ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం రోజున అవార్డును ప్రదానం చేస్తారు. అభివృద్ధిని క్షేత్ర స్థాయిలో చూపించే ఆదర్శ పంచాయతీలకు ఇది సదవకాశం. పరిశుభ్రత, పచ్చదనం, తాగునీరు, ఉపాధి అవకాశాల కల్పన, మౌలిక సదుపాయాలు తదితర అంశాల్లో జిల్లాలోని చాలా గ్రామాలు ప్రగతిని చూపుతున్నాయి. పల్నాడు జిల్లాలో 28 మండలాల్లో 366 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మంచి అవకాశం జాతీయ స్థాయిలో పురస్కారం అందుకునేందుకు ఇది మంచి అవకాశం. చేపట్టిన అభివృద్ధి తదితర వాటిని ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. ఎంపికైతే పురస్కారం ద్వారా లభించే నజరానాతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. – జీవీ సత్యనారాయణ, ఎంపీడీవో, సత్తెనపల్లి -
స్వచ్ఛ తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: స్వచ్ఛ భారత్ మిషన్‌లో తెలంగాణ దూసుకుపోతోంది. సర్వ సర్వేక్షణ్ గ్రామీణ్ (ఎస్ఎస్జీ)లో జాతీయ స్థాయిలో (పెద్ద రాష్ట్రాల విభాగం) నంబర్ వన్‌గా నిలిచింది. ఎస్ఎస్జీకి సంబంధించిన పలు కేటగిరీల్లో టాప్–3 ర్యాంకుల్లో నిలిచింది. మొత్తం 13 స్వచ్ఛ అవార్డులు సాధించి సత్తా చాటింది. అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్ దివస్ సందర్భంగా ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ అవార్డులు అందజేస్తారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి, స్వచ్ఛ భారత్ మిషన్ డైరెక్టర్ వికాస్ శీల్ రాష్ట్రానికి లేఖ రాశారు. స్వచ్ఛ భారత్ మిషన్‌లో తెలంగాణ సాధించిన ప్రగతి దేశానికి ఆదర్శప్రాయంగా నిలుస్తోందని ప్రశంసించారు. కాగా సీఎం కేసీఆర్, పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ల సహకారంతోనే ఈ ప్రగతి సాధ్యమైందంటూ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధన్యవాదాలు తెలిపారు. అవార్డులు, రికార్డులతో పాటు రాష్ట్రానికి కేంద్రం నిధులు కూడా కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. గతంలోనూ స్వచ్ఛ, పారిశుధ్య, ఇ– పంచాయతీ, ఉత్తమ గ్రామ పంచాయతీలు, ఉత్తమ ఆడిటింగ్ వంటి అంశాలతో పాటు 100 శాతం నల్లాల ద్వారా మంచినీటిని అందిస్తున్న రాష్ట్రంగా గుర్తింపు వచ్చిందని తెలిపారు. ఏటా నగరాలు, పట్టణాల్లో స్వచ్ఛత, పరిశుభ్రతపై సర్వే (ఎస్ఎస్జీ) నిర్వహించి ఆ మేరకు కేంద్రం అవార్డులు అందజేస్తోంది. -
ఉపాధ్యాయులకు పురస్కారాలు అందచేసిన సీఎం వైఎస్ జగన్
-
11 మంది బీసీ గురుకుల టీచర్లకు పురస్కారాలు
సాక్షి, హైదరాబాద్: మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ పరిధిలోని 11 మంది ఉపాధ్యాయులకు రాష్ట్ర పురస్కారాలు దక్కాయి. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 5న జరిగే రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయ ఉత్సవాల్లో వారంతా అవార్డులు అందుకోనున్నారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికైన వారిలో ప్రిన్సిపల్స్ యం.అంజలీకుమారి, కె.శోభారాణి, యం.రాములు, డిగ్రీ కాలేజీ లెక్చరర్ కె.సుచిత్ర, జూనియర్ కాలేజీ లెక్చరర్ కె.రాధిక, ఉపాధ్యాయులు కె.పుష్ప, జి.అన్నపూర్ణ, హెచ్.సంతోష్, బి.గురువయ్య, పి.గీత, కె.వెంకటరెడ్డి ఉన్నారు. అవార్డులకు ఎంపికైన వారందరినీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, సొసైటీ కార్యదర్శి మల్లయ్యభట్టు ప్రత్యేకంగా అభినందించారు. -
తెలంగాణ పోలీస్‌కు ఫిక్కీ స్మార్ట్ పోలీసింగ్ అవార్డు
సాక్షి, హైదరాబాద్: స్మార్ట్ పోలీసింగ్‌లో ఉత్తమ విధానాలను అమలు చేస్తున్నందుకుగాను ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) తెలంగాణ పోలీస్ శాఖకు 2021–స్మార్ట్ పోలీసింగ్ అవార్డును ప్రకటించింది. తెలంగాణ పోలీస్ శాఖ మహిళా భద్రతా విభాగంలో షీ–భరోసా, సైబర్ ల్యాబ్‌లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి బాలల రక్షణలో సాధించిన ఉత్తమ ఫలితాలకుగాను న్యూఢిల్లీలోని ఫిక్కీ ఈ అవార్డును ప్రకటించింది. ఈ ఫిక్కీ స్మార్ట్ పోలీసింగ్ అవార్డు–2021ను ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో తెలంగాణ పోలీస్ మహిళా భద్రతా విభాగం అదనపు డీజీపీ స్వాతి లక్రా స్వీకరించారు. -
40 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు.. ఉత్తర్వులు విడుదల
సాక్షి, హైదరాబాద్: గురుపూజ దినోత్సవాన్ని (సెప్టెంబర్ 5) పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్తమ, అంకితభావం గల వారిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసింది. వీరిలో ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు 10 మంది, స్కూల్ అసిస్టెంట్స్, పీజీటీలు 19 మంది, ఎస్జీటీ, టీజీటీలు 10 మంది, ఒక సీనియర్ లెక్చరర్... మొత్తం 40 మంది ఉన్నారు. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ గురువారం ఉత్తర్వులు విడుదల చేశారు. గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్ల విభాగాల్లో చకినాల శ్రీనివాస్(సిరిసిల్ల), బూసా జమునాదేవి (జయశంకర్ భూపాలపల్లి), ఓ చంద్రశేఖర్ (జయశంకర్ భూపాల పల్లి), టి.మురళీకృష్ణమూర్తి (మేడ్చల్) ఎస్.సురేశ్ (నిజామాబాద్), వి.రాజేందర్(ఖమ్మం), వనుపల్లి నిరంజన్ (రంగారెడ్డి), సుర సతీశ్(భువనగిరి), గోపాలసింగ్ తిలావత్ (ఆదిలాబాద్), బి.చలపతిరావు(ఖమ్మం) ఎంపిక. స్కూల్ అసిస్టెంట్లు డి.సత్యప్రకాశ్ (స్టేషన్ ఘన్పూర్), జె.శ్రీనివాస్ (నిర్మల్), పి.ప్రవీణ్‌కుమార్ (కామారెడ్డి), తేజావత్ మోహన్‌బాబు (భద్రాద్రి కొత్తగూడెం), ఎ.వెంకన్న (సూర్యాపేట), కన్నం అరుణ(కరీంనగర్), సయ్యద్ షఫీ(ఖమ్మం), డాక్టర్ హజారే శ్రీనివాస్(నిజామాబాద్), కె.రామారావు (సూర్యాపేట), సీహెచ్ కృష్ణ (వరంగల్), కె.మధుకర్ (ఆసిఫాబాద్), ఎ.రాజశేఖర్ శర్మ (సిద్దిపేట), గొల్ల వెంకటేశ్ (జోగుళాంబ గద్వాల్), కె.ధనలక్ష్మి (వరంగల్), కంచర్ల రాజవర్ధన్ రెడ్డి (నల్లగొండ), జి.గిరిజమ్మ (నారాయణపేట), జె.ఎల్లస్వామి (గద్వాల్), సీహెచ్ భరణీకుమార్(యాదాద్రి భువనగిరి), అంబటి శంకర్(రాజన్న సిరిసిల్ల) ఎస్జీటీలు జి.చంద్రశేఖర్(నిర్మల్), ఎం.వెంకట్‌రెడ్డి( హైదరాబాద్), పశుల ప్రతాప్ (ఆదిలాబాద్), యు.లచ్చిరాం(నల్లగొండ), కె.ప్రవీణ్ (పెద్దపల్లి), అర్చ సుదర్శనం (హన్మకొండ), టి.ఓంకార్ రాధాకృష్ణ (సిద్దిపేట), కదరి అనిత (నల్లగొండ), బి.నర్సయ్య (నిజామాబాద్), సీహెచ్ రాజిరెడ్డి(జగిత్యాల). సీనియర్ లెక్చరర్... డాక్టర్ ఎం.రమాదేవి (ప్రభుత్వ లెక్చరర్, మాసబ్‌ట్యాంక్, హైదరాబాద్) ప్రత్యేక విభాగం... బి.శంకర్‌బాబు (సంగారెడ్డి), జె.శ్రీనివాసరెడ్డి(సిద్దిపేట), ఎం.రాంప్రసాద్ (సిద్దిపేట), టి.మధుసూదన్‌రావు (హైదరాబాద్), వరకల పరమేశ్వర్(రంగారెడ్డి), వై.లిల్లీమేరి (జనగాం), టి.సత్యనారాయణ(సూర్యాపేట), ఎం.వెంకటయ్య (సూర్యాపేట), సత్తులాల్(భద్రాద్రి కొత్తగూడెం), సముద్రాల శ్రీదేవి(సంగారెడ్డి). -
ఫొటోగ్రఫీ పోటీల్లో ‘సాక్షి’కి ఆరు బహుమతులు (ఫొటోలు)
-
ఫొటోగ్రఫీ పోటీల్లో ‘సాక్షి’కి ఆరు బహుమతులు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ నిర్వహించిన ఫొటోగ్రఫీ పోటీల ఫలితాలను గురువారం ప్రకటించారు. ఇందులో బంగారు తెలంగాణ విభాగంలో సాక్షి దినపత్రిక సూర్యాపేట ఫొటో జర్నలిస్టు అనమల యాకయ్యకు ద్వితీయ బహుమతి, పల్లె, పట్టణ ప్రగతి విభాగంలో సాక్షి హైదరాబాద్ సీనియర్ ఫొటో జర్నలిస్టు ఎన్.రాజేశ్‌రెడ్డి, ఇదే విభాగంలో సిద్దిపేట సాక్షి ఫొటో జర్నలిస్టు సతీశ్‌లకు కన్సోలేషన్ బహుమతి, అలాగే ఉత్తమ వార్తా చిత్రం విభాగంలో సాక్షి సంగారెడ్డి జిల్లా ఫొటో జర్నలిస్టు బి.శివప్రసాద్‌కు తృతీయ బహుమతి, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి విభాగంలో సాక్షి దినపత్రిక మహబూబ్‌నగర్ జిల్లా సీనియర్ ఫొటో జర్నలిస్టు వి.భాస్కర్ ఆచారికి తృతీయ బహుమతి, ఇదే విభాగంలో సాక్షి యాదాద్రి ఫొటో జర్నలిస్టు కె.శివకుమార్‌కు కన్సోలేషన్ బహుమతి లభించింది. సమాచార, పౌరసంబంధాల శాఖ వివిధ విభాగాల్లో పోటీలకు జూలై 9న ఎంట్రీలను ఆహ్వానించింది. దీనికి స్పందనగా 96 మంది మొత్తం 1,200 ఫొటోలను ఈ పోటీలకు పంపారు. జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ కళాశాల రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్ ఎం.నాగరాజు, సీనియర్ జర్నలిస్టు డాక్టర్ గోవిందరాజు చక్రధర్, హిందూ దినపత్రిక మాజీ చీఫ్ ఫొటోగ్రాఫర్ హెచ్. సతీష్ సభ్యులుగా ఉన్న కమిటీ విజేతలను ఎంపిక చేసింది. మొదటి బహుమతి కింద రూ. 20,000, ద్వితీయ బహుమతికి రూ.15,000, తృతీయ బహుమతికి 10,000, కన్సోలేషన్ బహుమతికి రూ.5,000 నగదు అలాగే జ్ఞాపిక, సర్టిఫికెట్ అందచేస్తారు. ఈనెల 25న విజేతలకు బహుమతులను అందచేస్తామని సమాచార, పౌర సంబంధాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సాక్షి ఫొటోగ్రాఫర్లకు జాతీయ స్థాయి అవార్డులు (ఫొటోలు)