CCS police
-
హైదరాబాదీలు కోల్పోయిన డబ్బు అక్షరాలా రూ.2,739 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: రోజుకు రూ.3.8 కోట్లు.. వారానికి రూ.26.6 కోట్లు.. నెలకు రూ.114.1 కోట్లు.. ఏడాదికి రూ.1,369.5 కోట్లు.. ఈ లెక్కలు ఏమిటా అని ఆలోచిస్తున్నారా? హైదరాబాద్ వాసుల నుంచి మోసగాళ్లు కాజేసిన సరాసరి మొత్తమిది. ఓ దోపిడీ ఘటనకు ఉన్న ప్రాధాన్యం, దాని దర్యాప్తుపై చూపించే శ్రద్ధ, మోసాలకు సంబంధించిన కేసులపై ఉండదు. ఇదే వైట్ కాలర్ నేరగాళ్లుగా పిలిచే మోసగాళ్లకు కలిసి వస్తోంది. 2023, 2024 సంవత్సరాల్లో నమోదైన మోసాల కేసుల్లో హైదరాబాద్ వాసులు కోల్పోయింది డబ్బు అక్షరాలా రూ.2,739 కోట్లు. ఈ ‘వైటుగాళ్లు’ఇలా రెచ్చిపోవడానికి అనేక అంశాలు కలిసి వస్తున్నాయి. ఆశ, నమ్మకాలే పెట్టుబడి ఈ మోసగాళ్లు ఎదుటి వారిలో ఉన్న ఆశ, నమ్మకాలనే పెట్టుబడిగా ముందుకు వెళ్తుంటారు. శ్రమ తక్కువ, ఫలితం ఎక్కువ.. ఇదీ వైట్‌కాలర్ అఫెండర్ల ప్రచారం. దొంగతనం, దోపిడీ వంటి నేరాలు చేయాలంటే దానికి భారీ తతంగం ఉంటుంది. టార్గెట్‌ను ఎంచుకోవడం, రెక్కీలు చేయడం, పక్కా ప్లాన్ సిద్ధం చేసుకోవడం... ఇలా ఎన్నో ముందస్తు ప్రక్రియలు పూర్తి చేయాలి. ఇంత చేసినా ఆ నేరం చేయడంలో పూర్తిస్థాయి ‘సక్సెస్’ అవుతారన్న నమ్మకం లేదు. కొన్ని సందర్భాల్లో నేరం చేయడానికి ముందో, చేస్తూనో పోలీసులకు చిక్కే ప్రమాదం కూడా ఉంటుంది. మోసాలకు సంబంధించిన ఆర్థిక నేరాలు చేసే వైట్‌కాలర్ నేరగాళ్లు ఇంత ‘శ్రమ’పడాల్సిన అవసరం ఉండదు. ఎదుటి వ్యక్తినో, వ్యక్తులనో, సంస్థనో పక్కాగా నమ్మించగలిగితే చాలు. ఒక్కోసారి వీరి లాభం రూ.కోట్లలోనూ ఉంటుంది. ఈ కారణంగానే వైట్‌కాలర్ అఫెండర్లు ఓ పక్క నేరుగా, మరోపక్క సైబర్ నేరగాళ్లుగా మారి అందినకాడికి దండుకుంటున్నారు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తరవాత సైబర్ నేరాలూ అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. చిక్కిన వారికి శిక్షలు తక్కువే ఈ మోసగాళ్లకు చట్టంలో ఉన్న లొసుగులే కలిసి వస్తున్నాయి. ప్రస్తుతం అమలులో ఉన్న చట్ట ప్రకారం రూ.లక్ష మోసం చేసినా... రూ.10 కోట్లు మోసం చేసినా చీటింగ్ ఆరోపణలపై ఒకే సెక్షన్ కింద కేసులు నమోదవుతాయి. ఆ మోసం చేయడానికి అనుసరించిన మార్గాన్ని బట్టి ఇంకొన్ని సెక్షన్లు అదనంగా వచ్చి చేరే అవకాశం ఉంటుంది. ఎదుటి వారిని మోసం చేయడానికి పత్రాలు తయారు చేసినా, ఇతర గుర్తింపులు చూపించినా ఫోర్జరీ, ఇంపార్సినేషన్ తదితరాలు జోడిస్తారు. న్యాయస్థానంలో నేరం నిరూపితమైనప్పుడు అది నమోదైన సెక్షన్ ప్రకారమే శిక్ష ఉంటుంది. దీంతో ఎంత పెద్ద మొత్తం కాజేసినా మోసగాళ్లు తక్కువ శిక్షలతో బయటపడుతున్నారు. పదేపదే నేరాలు చేసేవారిపై పోలీసులు ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్ట్ ప్రయోగిస్తున్నారు. అయితే నిర్ణీత కాలంలో, నిర్ణీత సంఖ్యలో కేసులు ఉంటేనే దీన్ని వాడే ఆస్కారం ఉంది. ఓ మోసగాడు ఒకే ఉదంతంలో రూ.100 కోట్లు కాజేసినా అతడిపై దీన్ని ప్రయోగించడానికి అవకాశం లేదు. ఈ కారణాలతోనే అందినకాడికి దండుకుపోతున్న మోసగాళ్లకు చెక్ చెప్పడం పోలీసులకు తలనొప్పిగా మారింది. వీళ్లతో కొత్త తలనొప్పులు ఈ వైట్‌కాలర్ నేరాల్లో సైబర్ క్రైమ్ కూడా ఒకటి. సైబర్ నేరాలకు పాల్పడుతున్న నేరగాళ్లు చిక్కే అవకాశాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. ఎన్నిరకాలుగా ప్రయత్నించినా పాత్రధారులు, దళారులు తప్ప సూత్రధారులు చిక్కట్లేదు. కొన్ని సందర్భాల్లో ఈ నేరాలపై ఎవరికి ఫిర్యాదు చేయాలన్నది సామాన్యులకు స్పష్టంగా తెలియక, స్థానిక పోలీసుల నుంచి సరైన స్పందన లేక కేసులే నమోదు కావట్లేదు. నమోదైనా అవసరమైన స్థాయిలో దర్యాప్తు ఉండదు. సైబర్ నేరగాళ్లు తీసుకుంటున్న జాగ్రత్తలకు తోడు ఈ నేరాల దర్యాప్తులో అన్ని విభాగాల పోలీసులకు పట్టు ఉండట్లేదు. ఫలితంగా ఇంటర్నెట్ కేంద్రంగా జరిగే సైబర్ నేరాల్లో 50 శాతం కూడా నమోదు కావట్లేదు. నమోదైన నేరాల్లో సగానికి సగం కూడా కొలిక్కి రావట్లేదు. ఇక వీరి నుంచి నగదు రికవరీ అనేది దుర్లభం. మోసాలు చేసే నేరగాళ్లు చిక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నా శిక్షలు పడటం అరుదుగా మారింది. దీనికి దర్యాప్తు అధికారులకు ఉన్న అవగాహన లోపాలు ఒక కారణమైతే.. బాధితుల రాజీ ధోరణి మరో కారణంగా మారింది. వైట్‌కాలర్ నేరాలను దర్యాప్తు చేస్తున్న పోలీసులకు అవసరమైన స్థాయిలో ఇతర విభాగాల నుంచి సహకారం లభించట్లేదు. కేసు నమోదై, దర్యాప్తు పూర్తయినప్పటికీ.. కోర్టు విచారణ ప్రక్రియ ముగియడానికి చాలా సమయం పడుతోంది. అప్పటివరకు వేచి ఉండేందుకు ఆసక్తి చూపని బాధితులు మధ్యలోనే మోసగాళ్లతో రాజీ పడుతున్నారు. చక్కదిద్దే చర్యలు ప్రారంభం ఈ పరిస్థితులను బేరీజు వేసిన పోలీసు విభాగం.. దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లు నానాటికీ పేట్రేగుతుండటం, ఆర్థిక నేరాల వల్లే ప్రజలు ఎక్కువ నష్ట పోవడాన్ని పరిగణనలోకి తీసుకుని అనేక చర్యలకు ఉపక్రమించింది. ప్రాథమికంగా అధికారులకు దర్యాప్తు తీరుతెన్నుల్లో మెళకువలు నేర్పిస్తున్నారు. సీసీఎస్ అధికారులకు అనుభవజ్ఞులతో శిక్షణ ఇప్పిస్తున్నారు. సైబర్, ఎకనమిక్ నేరాల దర్యాప్తుపై తర్ఫీదు ఇవ్వడంతో పాటు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందిస్తున్నారు. తీవ్ర నేరాల్లో ఆదాయపు పన్ను శాఖతో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌కు సమాచారం ఇస్తున్నారు. ఆయా కేసులను పరిగణనలోకి తీసుకున్న నేపథ్యంలో ఈ విభాగాలూ దర్యాప్తు చేపడుతున్నాయి. హైదరాబాద్‌లో నమోదైన నేరాల గణాంకాలు 2023లో సీసీఎస్ పోలీసులు నమోదు చేసిన 361 వైట్ కాలర్ నేరాల్లో రూ.1,355 కోట్లు.. 2,984 సైబర్ నేరాల్లో రూ.147 కోట్లు బాధితులు నష్టపోయారు. 2024లో (నవంబర్ వరకు) సీసీఎస్ పోలీసులు నమోదు చేసిన 248 వైట్‌కాలర్ నేరాల్లో రూ.1,036 కోట్లు, 2,868 సైబర్ నేరాల్లో రూ.38 కోట్లు బాధితులు కోల్పోయారు.చదవండి: ఖాజాగూడ కూల్చివేతలపై క్లారిటీ ఇచ్చిన హైడ్రా కమిషనర్కఠిన చట్టం అవసరం మోసగాళ్లను కట్టడి చేయడానికి మరిన్ని కఠిన చ ట్టాలు అవసరం. ప్రస్తుతం కేవలం డిపాజిటర్స్ ప్రొటెక్ష న్ యాక్ట్‌తో నమోదైన కేసులతో పాటు మనీ లాండరింగ్ కేసుల్లో మాత్రమే నిందితుల ఆస్తులను స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. అలా కాకుండా ప్రతి ఆర్థిక నేరంలోనూ ఈ విధానం అమలయ్యేలా మార్పులు రావాలి. దీనికితోడు చోరీలు, దోపిడీలు చేసే వారితో పాటు ఇలాంటి వైట్ కాలర్ నేరగాళ్ల పైనా నిఘా ఉంచాల్సిన అవసరం ఉంది. మోసగాళ్లు కాజేసిన మొత్తం ఆధారంగా శిక్షలు ఉండేలా చర్యలు తీసుకోవాలి. కొత్తగా అమలులోకి వచ్చిన బీఎన్ఎస్లోనూ ఇలాంటి అవకాశం లేదు. – ప్రభాకర్, మాజీ డీఎస్పీ -
TG: ఫౌండేషన్ పేరుతో భారీ మోసం.. ప్లాట్స్ ఇస్తామని 540 కోట్లు..
సాక్షి, హైదరాబాద్: ధన్వంతరి ఇంటర్నేషనల్ ఫౌండేషన్ పేరుతో తెలంగాణలో భారీ మోసం జరిగింది. ఫౌండేషన్‌లో పెట్టుబడులు పెడితే అధిక వడ్డీ ఇస్తామంటూ ఆశ చూపించి భారీ మొత్తంలో డబ్బులు దండుకున్నారు. తాజాగా ఇది మోసమని తేలడంతో బాధితులకు పోలీసులను ఆశ్రయించారు.వివరాల ప్రకారం..‘ధన్వంతరి ఫౌండేషన్‌లో భారీగా పెట్టుబడులు పెట్టాలని నిర్వాహకులు కమలాకర్ శర్మ బాధితులను కోరారు. పెట్టుబడులకు అధిక వడ్డీ ఇస్తామని వారిని మభ్యపెట్టారు. ఈ క్రమంలోనే పెట్టుబడులు పెట్టిన వారికి ప్లాట్స్ ఇస్తామని ఆశ చూపించారు. ఇలా దాదాపు నాలుగు వేల మంది దగ్గర సుమారు రూ.540 కోట్ల డిపాజిట్లు సేకరించారు. ఇక, బాధితులందరూ ఒకే కమ్యూనిటీకి చెందిన వారు కావడం గమనార్హం.ఇక, తాజాగా బాధితులందరూ సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో బాధితుల ఫిర్యాదుతో సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా సీసీఎస్ డీసీపీ శ్వేతారెడ్డి మాట్లాడుతూ.. కమలాకర్ శర్మను అరెస్ట్ చేసి ధన్వంతరి ఫౌండేషన్ పేరు మీద ఉన్న ఆస్దులను సీసీఎస్‌కు అటాచ్ చేసినట్టు తెలిపారు. అలాగే సీజ్ చేసిన ఆస్తులను అమ్మి బాధితులకు డిపాజిట్లు చేసిన డబ్బులు వచ్చే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. -
అవినీతికి అడ్డాగా సీసీఎస్!
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ పోలీసు విభాగానికి గుండెకాయ వంటి నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అవినీతికి అడ్డాగా మారిపోయింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గత నెల 21న ఏసీపీ టీఎస్ ఉమామహేశ్వరరావును ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. తాజాగా గురువారం ఈఓడబ్ల్యూ టీమ్–7 ఇన్స్పెక్టర్ సుధాకర్ రూ.3 లక్షల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే ప్రతిష్టాత్మకమైన ఈ విభాగం ప్రతిష్ట దిగజారుతోందనే ఆరోపణ వినిపిస్తోంది. సంచలనాత్మక నేరాలతో పాటు భారీ స్కాములను సీసీఎస్ అధికారులు దర్యాప్తు చేస్తారు. రూ.25 లక్షల కంటే ఎక్కువ మొత్తంతో ముడిపడి ఉన్న సొత్తు సంబంధిత నేరాలు, రూ.75 లక్షలకు మించిన మొత్తంతో కూడిన మోసాల కేసులు సీసీఎస్ పరిధిలోని వస్తాయి. ఈ విభాగమే నేరుగా కొన్ని కేసులు నమోదు చేస్తుంది. నగరంలోని ఇతర పోలీసుస్టేషన్లలో నమోదైన వాటిని సిటీ పోలీసు కమిషనర్ దర్యాప్తు నిమిత్తం ఈ విభాగానికి బదిలీ చేస్తుంటారు. సీసీఎస్ దర్యాప్తు చేసే కేసుల్లో అత్యధికం రూ.కోట్లతో ముడిపడి ఉంటాయి. ప్రతి అంశంలోనూ కాసుల పంటే... ఈ నేపథ్యంలోనే సీసీఎస్‌లో పని చేసే అధికారులకు ఆ ఆలోచన ఉండాలే కానీ ప్రతి అంశంలోనూ కాసులు దండుకునే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు సీసీఎస్ పోలీసులు తమకు వచి్చన ప్రతి ఫిర్యాదునూ కేసుగా నమోదు చేసే వాళ్లు. ఈ విధానం దురి్వనియోగం అవుతోందని భావించిన అధికారులు ఆరి్థక నేరాల్లో కేసు నమోదుకు ముందు ప్రాథమిక విచారణ (పీఈ) తప్పనిసరి చేశారు. ఇక్కడ నుంచే సీసీఎస్ అధికారుల అవినీతి దందా మొదలవుతోంది. పీఈలో భాగంగా విచారణాధికారి ఫిర్యాదుదారుడిని పిలిచి వివరాలు సేకరిస్తారు. ఫిర్యాదులోనే వివరాలకు సంబంధించిన ఆధారాలు, ఇతర అంశాలను తమకు అందజేయాల్సిందిగా కోరతారు. ఇక్కడ బాధితుల నుంచి డబ్బు డిమాండ్ చేయడంతో మొదలయ్య కథ కేసు నమోదు, దర్యాప్తు, నిందితుల అరెస్టు, సీఆరీ్పసీ 41–ఏ నోటీసుల జారీ, ఆస్తుల జప్తు, ఛార్జ్ షీట్ దాఖలు... ఇలా ప్రతి దశలోనూ కొందరు అధికారులు రేటు కట్టి మరీ వసూలు చేస్తున్నారు. ‘సివిల్–క్రిమినల్’ మధ్య చిన్న గీతే... ప్రస్తుతం అమలులో ఉన్న చట్టం ప్రకారం సివిల్ వివాదాల్లోకి పోలీసులు తలదూర్చ కూడదు. కేవలం క్రిమినల్ కేసులు మాత్రమే నమోదు చేసుకుని దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. ఈ అంశం కూడా సీసీఎస్ అధికారులకు కలిసి వస్తోంది. సీసీఎస్‌లో నమోదయ్యే, ఫిర్యాదులుగా వచ్చే ఆర్థిక నేరాల్లో చాలా వాటిని సివిల్–క్రిమినల్ అని విడదీయడానికి మధ్యలో చాలా చిన్న సాంకేతిక గీత మాత్రమే ఉంటుంది. ఇది కూడా కొందరు అవినీతి అధికారులకు కలిసి వస్తోంది. సివిల్ కేసును క్రిమినల్‌గా మార్చి అరెస్టు చేస్తానంటూ నిందితుల నుంచి, క్రిమినల్ కేసులు అయినప్పటికీ సివిల్‌గా తేలుస్తానంటూ బెదిరించి ఫిర్యాదుదారుల నుంచి అందినకాడికి దండుకుంటున్న వాళ్లు కోకొల్లలు. ‘సాహితీ’ కేసులకు దర్యాప్తు అధికారిగా వ్యవహరించిన ఏసీపీ ఉమామహేశ్వరరావు రెండు పక్షాలను బెదిరించి దండుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఇన్స్పెక్టర్ సుధాకర్ నిందితుడి నుంచి డబ్బు డిమాండ్ చేసి, తీసుకుని, తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.విఫలమైన ఉన్నతాధికారులు...నగర నేర పరిశోధన విభాగంలో వరుస వివాదాలు చోటు చేసుకుకోవడం వెనుక సీసీఎస్ ఉన్నతాధికారుల వైఫల్యం ఉందనే ఆరోపణ వినిపిస్తున్నాయి. వేల మంది జీవితాలతో ముడిపడి ఉన్న ‘సాహితి’ కేసులను దర్యాప్తు చేస్తున్న ఏసీపీ ఉమామహేశ్వరరావును ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన తర్వాత కూడా అధికారులు మేల్కొలేదు. ప్రక్షాళన చేసి, పర్యవేక్షణ పెంచడం ద్వారా అవినీతిని నిర్మూలించే చర్యలు తీసుకోలేదు. ఈ కారణంగానే ఇన్స్పెక్టర్ సుధాకర్ ధైర్యంగా సీసీఎస్ కార్యాలయం ఎదురుగానే లంచం తీసుకోవడానికి సిద్ధమై రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడు. ఇప్పటికైనా నగర ఉన్నతాధికారులు మేల్కొని సీసీఎస్‌ను అన్ని స్థాయిల్లోనూ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. అలాకాకుంటే ఈ అవినీతి తిమింగలాల కారణంగా అటు ఫిర్యాదుదారులు–ఇటు నిందితులు ఇరువురూ బాధితులుగా మారే ప్రమాదం ఉంది. -
200 కోట్ల భారీ స్కాంలో దొరికిపోయిన నిమ్మగడ్డ ఫ్యామిలీ
-
సాహితీ ఇన్ఫ్రాకు షాక్.. రూ.200 కోట్ల ఆస్తులు సీజ్
సాక్షి, హైదరాబాద్: సాహితీ ఇన్ఫ్రాకు సీసీఎస్ పోలీసులు షాక్ ఇచ్చారు. రూ. 200 కోట్ల ఆస్తులను సీజ్ చేశారు. సాహితీ పార్టనర్స్‌తో పాటు సంస్థ ఉద్యోగులను పోలీసులు విచారిస్తున్నారు. ఈ స్కాంతో సంబంధం ఉన్న, రాజకీయ నాయకులు, బడా వ్యాపారులకు ఉచ్చు బిగుస్తోంది. రెండు రాష్ట్రాల్లో కీలకంగా ఉన్న కొందరి నాయకులపై కేసులు నమోదు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. కేసు విచారణ ముమ్మరం చేయడంతో లక్ష్మీనారాయణ కుటుంబం అజ్ఞాతవాసంలోకి వెళ్లింది. పరారీలో ఉన్న లక్ష్మీనారాయణ కోసం సీసీఎస్ పోలీసులు గాలిస్తున్నారు. ప్రీలాంచ్ పేరుతో సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా (ఎస్ఐవీఐపీఎల్) ప్రజల నుంచి వందల కోట్లు వసూలు చేయడంపై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సాహితీ ఇన్ఫ్రా సుమారు 2,728 మంది బాధితుల నుంచి రూ.1,110 కోట్లు వసూలు చేసినట్లు తేలింది. టీఎస్–రెరా నిబంధనల ప్రకారం ఒక ప్రాజెక్టులో కస్టమర్ల నుంచి వసూలు చేసిన సొమ్మును ప్రత్యేకంగా ఎస్క్రో ఖాతా తెరిచి అందులో డిపాజిట్ చేయాలి. ఆ ప్రాజెక్టు నిర్మాణ పనులకు మాత్రమే వాటిని వినియోగించాలి. కానీ లక్ష్మీనారాయణ శార్వాణి ప్రాజెక్టులో ప్రీలాంచ్ విక్రయాల కింద జనాల నుంచి వసూలు చేసిన రూ.504 కోట్ల సొమ్మును ఇతర ప్రాజెక్టులకు మళ్లించాడు. ఈ ప్రాజెక్టుల నుంచి కూడా రూ.కోట్లలో డబ్బు వసూలు చేసిన నారాయణ.. ఒక్కటంటే ఒక్కప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదు. శార్వాణి ఎలైట్ ప్రాజెక్టు కంటే ముందు సాహితీ సంస్థ మూడు ప్రాజెక్టులను ప్రారంభించింది. మాదాపూర్‌లోని గుట్టల బేగంపేటలో కార్తికేయ పనోరమ, మాదాపూర్‌లో కృతి బ్లోసమ్, మోకిలాలో సుధీక్ష ప్రాజెక్ట్‌లను పూర్తి చేసేందుకు ఎలైట్ ప్రాజెక్ట్ పేరుతో డిపాజిట్లను సేకరించాడు. -
బ్యాడ్మింటన్ క్రీడలో తప్పుడు డేట్ ఆఫ్ బర్త్‌లు.. వయసు మార్చి గోల్మాల్!
-శ్రీరంగం కామేష్, సాక్షి ప్రతినిధి బ్యాడ్మింటన్‌లో ఓ వయస్సు క్రీడాకారుడు అదే ఏజ్ గ్రూప్‌లో ఉండే మరో ఆటగాడితో పోటీ పడాలి. నిబంధనలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అలా జరిగినప్పుడే సరైన పోటీ అన్పించుకుంటుంది. వయస్సులో తేడాలున్నప్పుడు ఆటలోని అనుభవాన్ని బట్టి ప్రతిభా సామర్థ్యాల్లో సైతం తేడా ఉండేందుకు అవకాశం ఉంటుంది. పతకాలు, ర్యాంకుల్ని సైతం ప్రభావితం చేస్తుంది. ఇంతటి కీలకమైన వయస్సు నిబంధనకు తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు జాతీయ స్థాయి ఉత్తమ ర్యాంకర్లు తూట్లు పొడిచారు. తమ పుట్టిన తేదీ విషయంలో భారీ స్కామ్‌కు పాల్పడ్డారు. తమ వాస్తవ వయస్సును తగ్గించేసి బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు (బీఏఐ) తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించారు. ఈ మేరకు అందిన ఆకాశరామన్న ఉత్తరం ఆధారంగా దర్యాప్తు చేపట్టిన హైదరాబాద్ సెంట్రల్ క్రైౖమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు ముగ్గురి విషయంలో ఈ అక్రమాలను నిర్ధారించారు. సమగ్ర ఆధారాలతో తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్‌కు లేఖ రాశారు. కానీ వారు ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. ఉత్తరం ఆధారంగా.. ఈ స్కామ్‌కు సంబంధించిన సమాచారాన్ని సిటీ సీసీఎస్ పోలీసులకు ఓ అజ్ఞాత వ్యక్తి లేఖ ద్వారా అందజేశారు. ఈ ఏడాది మార్చి 29న అందిన ఈ లేఖలో ఆరుగురు క్రీడాకారులపై ఆరోపణలున్నాయి. వీరు తమ అసలు వయస్సును దాచి పెట్టి నకిలీ సర్టిఫికెట్ల సృష్టించి బీఏఐకి సమర్పించారని, తద్వారా తమ కంటే చిన్న వారితో పోటీల్లో తలపడుతూ మెడల్స్, జాతీయ స్థాయి ర్యాంకులు సాధిస్తున్నారని అతను ఆరోపించారు. దీనివల్ల నిబంధనలు పాటించిన క్రీడాకారులకు అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. దీనిపై ఇప్పటికే బీఏఐకి అనేకమంది నుంచి ఫిర్యాదులు వెళ్లినా పట్టించుకోవట్లేదని ఆరోపించారు. సమగ్ర దర్యాప్తు చేసిన సీసీఎస్.. కేవలం ఈ ఆరుగురే కాకుండా దాదాపు 40 మంది బ్యాడ్మింటన్ ఆటగాళ్ల వయస్సు విషయంలో తమకు సందేహాలు ఉన్నట్లు అజ్ఞాత వ్యక్తి ఆ లేఖలో పేర్కొన్నారు. వీరిలో చాలామంది 2005–10 మధ్య పుట్టారని, అయితే జనన ధ్రువీకరణ పత్రాలకు బదులుగా కొందరు వైద్యులు ఇచ్చిన బోగస్ మెడికల్ సర్టిఫికెట్లు దాఖలు చేసి తమ వయస్సు తగ్గించుకున్నారని పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ క్రీడాకారులకు తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక మంది కోచ్‌లు, వారి తల్లిదండ్రులతో పాటు ఈ వైద్యుల సహకారం ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ లేఖను సిటీ పోలీసు ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. సీసీఎస్ ఇన్స్పెక్టర్ కె.చంద్రకుమార్ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. చదవండి: BWF Rankings: తొమ్మిదో ర్యాంక్‌కు ప్రణయ్.. పీవీ సింధు మాత్రం.. ముగ్గురి విషయంలో ఆధారాలు లభ్యం... సీసీఎస్ ప్రత్యేక బృందానికి తొలి దశలోనే ముగ్గురు క్రీడాకారులకు సంబంధించిన సమగ్ర ఆధారాలు లభించాయి. బీఏఐ జాబితాలో అండర్–17 కేటగిరీలో 1176 పాయింట్లతో మూడో ర్యాంకులో ఉన్న రోహన్‌కుమార్ ఆనంద్‌దాస్ రాజ్‌కుమార్ తాను పుట్టిన తేదీని 2007 జనవరి 29గా పేర్కొంటూ బీఏఐకి సర్టిఫికెట్లు సమర్పించి టోర్నమెంట్లలో ఆడాడు. వాస్తవానికి రోహన్ పుట్టిన తేదీ 2005 అక్టోబర్ 29గా పోలీసులు నిర్ధారించారు. ఇదే కేటగిరీలో 92 పాయింట్లతో 44వ ర్యాంక్‌లో ఉన్న దవు వెంకట శివ నాగరామ్ మౌనీష్ తన పుట్టిన తేదీని 2007 జనవరి 29గా పేర్కొన్నారు. అయితే ఇతని అసలు పుట్టిన తేదీ 2006 జూన్4 అని దర్యాప్తులో తేలింది. అండర్–15 కేటగిరీలో 188 పాయింట్లతో 32వ ర్యాంక్‌లో ఉన్న భూక్యా నిషాంత్ తన పుట్టిన రోజును 2010 అక్టోబర్ 12గా పేర్కొనగా.. ఇతడి వాస్తవ పుట్టిన తేదీ 2007 జనవరి 12గా తేలింది. అయితే వీళ్లంతా మైనర్లు కావడంతో తమంతట తాముగా ఇలాంటి చర్యలకు పాల్పడలేరని, వాళ్ల కోచ్‌లు లేదా తల్లిదండ్రుల సహకారం, ప్రోద్బలంతోనే ఇలా చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. వారినే ఈ వ్యవహారంలో బాధ్యుల్ని చేయాలని భావిస్తున్నారు. ఏమాత్రం స్పందించని అసోసియేషన్.. ముగ్గురి బాగోతం బట్టబయలు కావడంతో ఇలాంటి వాళ్లు మరికొందరు ఉండి ఉంటారని పోలీసులు అనుమానించారు. అయితే ఈ వ్యవహారాన్ని అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలన్నా, బాధ్యుల్ని గుర్తించి చర్యలు తీసుకోవాలన్నా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఫిర్యాదు తప్పనిసరి. ఈ నేపథ్యంలో అన్ని వివరాలతో తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్‌కు ఈ ఏడాది మే 25న ఓ లేఖ (నం.65/పీఈ/క్యాంప్/డీసీపీ/డీడీ/సీసీఎస్/డీడీ/2023) రాశారు. దీనిపై తగిన చర్యలు తీసుకుని తమకు తెలియజేయాల్సిందిగా డిటెక్టివ్ డిపార్ట్మెంట్ డీసీపీ కోరారు. కానీ అసోసియేషన్ ఇప్పటివరకు స్పందించక పోవడంతో వారికి తెలిసే ఈ స్కామ్ జరుగుతోందా? అనే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఈ స్కామ్ దేశ వ్యాప్తంగా జరుగుతూ ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. చదవండి: ఔటర్ చుట్టూ ఏడు ఇంటర్చేంజ్ మెట్రో స్టేషన్లు -
నల్ల డబ్బు మార్చే యత్నం!
చిత్తూరు అర్బన్: ‘మావద్ద లెక్కలో చూపించని బ్లాక్‌మనీ (నల్లడబ్బు) రూ.40 కోట్ల వరకు ఉంది. దీన్ని కొంచెం కొంచెం మీ బ్యాంకు ఖాతాలో వేస్తాం. మీ బ్యాంకు ఖాతా నుంచి ఆ మొత్తాన్ని వైట్ మనీ (లెక్కల్లో చూపించేది)గా ఇస్తే చాలు..’ అంటూ రైస్ పుల్లింగ్ నేరం తరహాలో బురిడీకొట్టించే ప్రయత్నం చేసి.. తీరా పోలీసులకు తెలిసిపోవడంతో ఓ ముఠా పారిపోయింది. ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌కు చెందిన గిరీష్ అనే పారిశ్రామికవేత్తకు చెన్నైకి చెందిన సత్య ఇటీవల పరిచయమయ్యాడు. తనకు తెలిసిన ఓ బడా పారిశ్రామికవేత్త వద్ద రూ.వందల కోట్ల నల్ల డబ్బు ఉందని, దీన్ని బ్యాంకులో వేసుకుని లెక్కల్లో చూపించి తమకు బదిలీ చేస్తే కమీషన్ రూపంలోనే రూ.కోట్లు సంపాదించవచ్చని గిరీష్‌ను నమ్మించాడు. ఢిల్లీకు చెందిన వినోద్‌గుప్త అనే వ్యక్తిని గిరీష్‌కు ఫోన్లో సత్య పరిచయం చేశాడు. గిరీష్, సత్య, వినోద్‌గుప్త ముగ్గురూ ఫోన్లో పలు దఫాలుగా మాట్లాడుతుకున్నారు. తొలుత రూ.50 లక్షలను సత్య వద్దకు చేరిస్తే.. రూ.5 కోట్లను గిరీష్ బ్యాంకు ఖాతాలో వేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. దీన్ని అమలు చేయడానికి చిత్తూరు నగరాన్ని ఎంచుకున్నారు. ఢిల్లీ నుంచి వినోద్‌గుప్తను చెన్నైకు పిలిపించి, అక్కడి నుంచి కారులో బయలుదేరిన సత్య.. గిరీష్‌ను చిత్తూరు నగరంలోని ఓ లాడ్జిలో ఉండాలని చెప్పాడు. బుధవారం రాత్రి తనిఖీలకు వెళ్లిన పోలీసులు అనుమానాస్పదంగా ఉన్న గిరీష్ బృందాన్ని ప్రశ్నించారు. తనను మోసం చేయడానికి సత్య, వినోద్‌గుప్త ప్రయత్నించారని గ్రహించిన గిరీష్.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా అప్పటికే సమాచారం పోలీసులకు తెలిసిపోయిందని గ్రహించిన సత్య, వినోద్‌కుమార్ చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించకుండానే పారిపోయారు. చిత్తూరు సీసీఎస్ ఎస్ఐ కేసు నమోదు చేశారు. -
సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్‌పై కేసు నమోదు
సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ నటి కరాటే కల్యాణితో పాటు హిందూ సంఘాలు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్‌లో హిందువుల మనోభావాలు కించపరిచేలా చిత్రీకరించారని వారు ఆరోపించారు. (చదవండి: దేవీశ్రీ ప్రసాద్‌పై కరాటే కల్యాణి ఫిర్యాదు) ఇటీవల దేవి శ్రీప్రసాద్.. ఓ పరి అనే నాన్-ఫిల్మ్ మ్యూజిక్ వీడియోను రిలీజ్ చేశాడు. ఈ ఆల్బమ్‌లో హరే రామ హరే కృష్ణ అనే మంత్రాన్ని ఐటం సాంగ్‌లో చిత్రీకరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పవిత్రమైన హరే రామ హరే కృష మంత్రంపై అశ్లీల దుస్తువులు, నృత్యాలతో పాటను చిత్రీకరించిన సంగీత దర్శకుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై డీఎస్పీ హిందూ సమాజానికి తక్షణమే క్షమాపణ చెప్పి తీరాలన్నారు. వెంటనే ఆ పాటలోని మంత్రాన్ని తొలగించాలని... లేనిపక్షంలో దేవిశ్రీ ప్రసాద్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని కరాటే కల్యాణి హెచ్చరించింది. -
20 యూట్యూబ్ ఛానెల్స్‌పై ఫిర్యాదు చేసిన కరాటే కళ్యాణి
-
20 యూట్యూబ్ ఛానళ్లపై కరాటే కల్యాణి ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: అసభ్యకర ప్రాంక్ వీడియోలు చేస్తున్న యూట్యూబర్స్‌పై కరాటే కల్యాణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సుమారు ఇరవై యూట్యూబ్ ఛానెళ్లపై సాక్ష్యాలతో సహా సీసీఎస్ పోలీసులకు కళ్యాణి ఫిర్యాదు చేయగా.. ఐటీ యాక్ట్‌లోని 67A, 509 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఆయా యూట్యూబ్ ఛానెళ్లపై నిఘా పెట్టడంతో పాటు కేసు విచారణకు ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు. త్వరలోనే సదరు యూట్యూబ్ ఛానెళ్లకు పోలీసులు నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రాంక్ పేరుతో ఆసభ్యవీడియోలు చేస్తున్నాడంటూ యూట్యూబర్ శ్రీకాంత్‌పై కరాటే కల్యాణి దాడి చేసిన సంగతి తెలిసిందే. నడిరోడ్డుపై అర్థరాత్రి వీరిద్దరు కొట్టుకోవడం తీవ్ర చర్చకు దారి తీసింది. దీంతో ఎస్ఆర్నగర్ పోలీసు స్టేషన్లో ఇద్దరిపై కేసు నమోదైంది. ఈ క్రమంలో ఆమె అక్రమంగా చిన్నారి దత్తత తీసుకుందంటూ ఆరోపణలు సైతం వచ్చాయి. చదవండి: పార్టీలో మెరిసిన రష్మిక, ఎందుకలా ఫీలవుతోందని ట్రోలింగ్ Rakul Preet Singh: సౌత్, నార్త్ రెండూ కలిస్తే అద్భుతాలే.. -
‘తెలుగు అకాడమీ’ నిందితులపై సస్పెక్ట్ షీట్స్
సాక్షి, హైదరాబాద్: చుండూరి వెంకట కోటి సాయికుమార్... రూ.64 కోట్లతో ముడిపడి ఉన్న తెలుగు అకాడమీ కుంభకోణంలో కీలక సూత్రధారి. వెంకట రమణ, సోమశేఖర్ సహా మరికొందరితో కలిసి 2015 నుంచి ఈ తరహా స్కామ్స్ చేస్తున్నాడు. ఈ గ్యాంగ్ అరెస్టు కావడం, బెయిల్‌పై బయటకు వచ్చి మళ్లీ అదే పంథాలో నేరాలు చేయడానికి సరైన నిఘా లేకపోవడమే కారణమని నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) పోలీసులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలోనే సాయి కుమార్ సహా తెలుగు అకాడమీ కేసులో కీలక నిందితులుగా ఉన్న వారిపై సస్పెక్ట్ షీట్స్ తెరవాలని నిర్ణయించారు. (చదవండి: పోలీసులకే షాక్ ఇచ్చిన దొంగ.. పోలీస్ స్టేషన్ ఎదుటే..) ► రౌడీలపై రౌడీషీట్, చోరులపై సిటీ డోషియర్ క్రిమినల్ షీట్, సమస్యాత్మక వ్యక్తులపై హిస్టరీ షీట్, మత పరమైన నేరాలు చేసిన వారిపై కమ్యూనల్ షీట్, భూకబ్జాకోరులపై లాండ్ గ్రాబర్ షీట్ తెరవడం ఏళ్లుగా కొనసాగుతోంది. ఇదే తరహాలో పదేపదే నేరాలు చేస్తున్న మోసగాళ్ల పైనా సస్పెక్ట్ షీట్స్‌ను తెరుస్తున్నారు. ► ఇప్పటి వరకు అసాంఘికశక్తులపై చట్ట పరిధిలో తెరుస్తున్న షీట్స్‌లో స్వల్ప మార్పులతో సీసీఎస్ అధికారులు ఈ సస్పెక్ట్ షీట్లు నమోదు చేస్తున్నారు. వీటిలో సదరు నేరగాడికి సంబంధించిన ఫొటో, చిరునామా, నమోదై ఉన్న కేసులు, నేరం చేసే విధానం సహా పూర్తి సమాచారం పొందుపరుస్తారు. ► ఈ వివరాలను సదరు నేరగాళ్లు ఏ ఠాణా పరిధిలో నివసిస్తుంటే ఆ పోలీసుస్టేషన్‌కు పంపుతారు. ఆయా ఠాణాల్లో వీరి ఫొటోలను అందుబాటులో ఉంచుతారు. దీనివల్ల ఆయా చోట్ల పోలీసు అధికారులు మారినప్పటికీ వీరిపై పక్కా నిఘా ఉంచడానికి అవకాశం ఉంటుందని సీసీఎస్ పోలీసులు చెప్తున్నారు. ► సస్పెక్ట్ షీట్ తెరిచిన తరవాత సాయి కుమార్ సహా ఇతర కీలక నిందితులపై స్థానిక పోలీసుల నిఘా కొనసాగుతుంది. మరోపక్క గస్తీ బృందాలు సైతం అనునిత్యం వారి ఇళ్లకు వెళ్లి కార్యకలాపాలు, కదలికల్ని పరిశీలిస్తుంటారు. సీసీఎస్ పోలీసులు సైతం కనీసం ఆరు నెలలకు ఒకసారి ఈ నిందితుల వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. ► ఇలాంటి షీట్లను తెరవడానికి సదరు కార్యాలయానికి పోలీసుస్టేషన్ హోదా ఉండటం తప్పనిసరి. సీసీఎస్‌తో పాటు సైబర్ క్రైమ్ ఠాణాకు సైతం ఈ హోదా ఉంది. చట్టంలో ఉన్న ఈ వెసులుబాటు ఆధారంగానే సాయి, వెంకట రమణ తదితరులపై సస్పెక్ట్ షీట్ తెరుస్తున్నారు. (చదవండి: తెలంగాణ జైళ్లలో యువత; ఉజ్వల భవిత.. ఊచల వెనక) ► మరోపక్క తెలుగు అకాడమీ కేసులో అరెస్టు అయిన కీలక నిందితుల్లో బయటి రాష్ట్రాల వాళ్లూ ఉన్నారు. తమ ప్రాంతాల్లో ఎలాంటి నేర చరిత్ర లేని వీరు బయటి ప్రాంతాలను టార్గెట్‌గా చేసుకుని రెచ్చిపోతున్నారు. ఇలాంటి వారిపై ఇక్కడ షీట్ తెరిచినా ఉపయోగం లేదు. ► దీన్ని పరిగణలోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులు ఇలాంటి నేరగాళ్ళపై షీట్లు తెరవడంతో పాటు ఆ వివరాలను వారు నివసిస్తున్న ప్రాంతం ఏ జిల్లా పరిధిలోని వస్తుందో ఆ జిల్లా ఎస్పీలకు లేఖ ద్వారా నివేదించనున్నారు. అందులో నేరగాడి చరిత్ర రాయడంతో పాటు నిఘా ఉంచాల్సిందిగా కోరనున్నారు. ► ఈ తరహా మోసాలకు పాల్పడిన సస్పెక్ట్ షీటర్ల వివరాలను కేవలం పోలీసుస్టేషన్లలో ఉంచడం ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండేలా చేయడం సాధ్యం కాదనే వాదన ఉంది. సామాన్యులు, మోసగాళ్ల ఎత్తులకు ఆకర్షితులవుతున్న వారు ఠాణాలకు వెళ్లి వివరాలు సరిచూసుకోవడం సాధ్యం కాదు. ► ఇలాంటి వారి వివరాలను పోలీసు అధికారిక వెబ్సైట్లోనూ ప్రత్యేక లింకు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. దీనివల్ల ప్రతి ఒక్కరూ ఇంటర్ నెట్ ద్వారా మోసాగాళ్ల వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ చర్యల ద్వారా ఎవరికైనా వీరిపై అనుమానం వస్తే సరి చూసుకోగలుగుతారు. -
తెలుగు అకాడమీ కేసులో కీలక మలుపు.. ఏసీబీకి బదిలీ
సాక్షి, హైదరాబాద్: తెలుగు అకాడమీ ఫిక్స్డ్ డిపాజిట్ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది ఇప్పటి వరకు దర్యాప్తు చేసిన సీసీఎస్ పోలీసులు ఇకపై కేసు విచారణను ఏసీబీ చేతికి అప్పగించనున్నారు. తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ కేసులో బ్యాంకు అధికారులు, సిబ్బంది పాత్ర ఉన్నట్లు సీసీఎస్ పోలీసులు గుర్తించారు. క్రిమినల్ చర్యలతో పాటు అధికార దుర్వినియోగానికి నిందితులు పాల్పడినట్లు గుర్తించారు. చదవండి: నిధుల మాయం వెనుక మాఫియా! ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి సీసీఎస్ విచారణలో న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో ఆర్థిక అవకతవకల్లో ప్రభుత్వ సిబ్బంది పాత్ర ఉంటే.. కేసు దర్యాప్తులో వారిని ఏసీబీ కోర్టులోనే ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అకాడమీకి సంబంధించి నమోదైన మూడు ఎఫ్ఐఆర్లను సీసీఎస్ అధికారులు ఏసీబీకి పంపించారు. అవినీతి నివారణ చట్టం(పీసీ) కింద ఏసీబీ విచారణ చేయనుంది. ఈ కేసులో ప్రైవేటు వ్యక్తులు కూడా నిందితులుగా ఉన్నందున కేసు పూర్తిస్థాయి దర్యాప్తు సీసీఎస్ చేస్తుందని.. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న నిందితులకు సంబంధించి మాత్రమే ఏసీబీ దర్యాప్తు చేస్తుందని సీసీఎస్ జేసీపీ మహంతి వెల్లడించారు. చదవండి: దొరక్కూడదని ధ్వంసం చేశాడు కాగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు చెందిన తెలుగు అకాడమీ నిధులు రూ.64.5 కోట్లు గోల్మాల్ అవ్వడం తెలిసిందే. ప్రధాన నిందితుడు వెంకట సాయి కుమార్ సహా 18మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. తెలుగు అకాడమీ ఏఓ రమేష్‌తో పాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రభుత్వ బ్యాంక్ అధికారుల పాత్రపై సైతం ఏసీబీ విచారణ జరపనుంది. -
‘ఎఫ్డీ స్కామ్’.. చెన్నై జైల్లో నేర్చుకున్నాడు!
సాక్షి, హైదరాబాద్: తెలుగు అకాడమీకి చెందిన రూ.64.5 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్స్ (ఎఫ్డీ) స్కామ్‌లో రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తోంది. తాజాగా సూత్రధారి చుండూరి వెంకట కోటి సాయికుమార్ విచారణలో సీసీఎస్ పోలీసులు పలు కీలకాంశాలు గుర్తించారు. ఎఫ్డీ స్కామ్‌కు సంబంధించి విషయాలను చెన్నై జైల్లో నేర్చుకున్నట్లు వెల్లడైంది. నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎన్సీఎల్) కేసులో జైలుకు వెళ్లినప్పుడు సహనిందితులే వీటిని నేర్పించారని సాయి బయటపెట్టాడు. హైదరాబాద్‌లోని అంబర్‌పేట ప్రాంతానికి చెందిన సాయికుమార్ మొదట స్వాల్ కంప్యూటర్స్ పేరుతో సాఫ్ట్వేర్ కంపెనీ ఏర్పాటు చేశాడు. దీనికి హైటెక్ సిటీతోపాటు తమిళనాడులోని చెన్నైలోనూ కార్యాలయాలు ఏర్పాటు చేశాడు. అమెరికాకు చెందిన ప్రాజెక్టులు కైవశం చేసుకోవడానికి ఎంతగా ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో సాయికి ఈ రంగంలో నష్టాలే మిగిలాయి. ఈ క్రమంలో అతనికి తమిళనాడు ముఠాతో పరిచయమైంది. అప్పటికే ఈ గ్యాంగ్ ఎన్‌సీఎల్‌కు చెందిన ఎఫ్డీలపై కన్నేసింది. చెన్నైలోని పలు బ్యాంకుల్లో ఉన్న రూ.25 కోట్లు కాజేయడానికి పథకం సిద్ధం చేసింది. ఈ క్రమంలో సాయితో ఒప్పందం చేసుకుంది. ఎన్సీఎల్ ఎఫ్డీలను లిక్విడేట్ చేయగా వచ్చిన రూ. 6 కోట్లను స్వాల్ సంస్థ పేరిట ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెన్నై శాఖలోని కరెంట్ ఖాతాలోకి మళ్లించింది. ఆ మొత్తం డ్రా చేసి ఇచ్చినందుకు రూ.కోటి కమీషన్‌గా సాయికి అందించింది. ఇప్పటికీ మూడు ఎఫ్‌డీల స్కామ్ ఎన్సీఎల్ స్కామ్ వెలుగులోకి రావడంతో చెన్నైకు చెందిన సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. సూత్రధారులు సహా మొత్తం 15 మందిని అరెస్టు చేయగా, వీరిలో సాయి కూడా ఉన్నాడు. ఈ కేసులో చెన్నై జైలు కు వెళ్లిన సాయికుమార్ అక్కడే ఎఫ్‌డీల స్కామ్ ఎలా చేయాలనే అంశాలను వీరి ద్వారా తెలు సుకున్నాడు. జైలు నుంచి బయటకు వచ్చిన సాయి రియల్టర్ అవతారం ఎత్తాడు. ఈ క్రమంలోనే పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ప్రాంతానికి చెందిన నండూరి వెంకట రమణతో పరిచయం ఏర్పడింది. తన స్వస్థలంలో ప్రింటింగ్‌ప్రెస్ నిర్వహించే వెంకటరమణకు ఓ కేంద్ర ప్రభుత్వసంస్థతో ఒప్పందం ఉంది. ఆ సంస్థకు కావాల్సిన బిల్ బుక్స్సహా అన్ని రికార్డులనూ ముద్రించి అందిస్తుంటాడు. అయితే తన పిల్లల చదువు నిమిత్తం హైదరాబాద్‌కు వలస వచ్చిన వెంకటరమణ సైనిక్‌పురి ప్రాంతంలో స్థిరపడ్డాడు. ఇతడు కూడా రియల్టర్‌గా మారాడు. ఈ క్రమంలోనే సాయితో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ మరికొందరితో కలసి 2012లో ఏపీ మైనార్టీ వెల్ఫేర్ సొసైటీ ఎఫ్డీలు, 2015లో ఏపీ హౌసింగ్ బోర్డ్ ఎఫ్డీలు, తాజాగా తెలుగు అకాడమీ ఎఫ్‌డీల సొమ్ము కాజేశారు. ఏపీలోనూ కుంభకోణాలు తెలుగు అకాడమీ ఫిక్స్డ్ డిపాజిట్ల కుంభకోణం నిందితులు 11 ఏండ్లుగా ఈ స్కామ్‌లు చేస్తున్నట్లు సీసీఎస్ పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ ముఠా ఏపీలోని ఏపీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి రూ. 10 కోట్లు, ఏపీ అయిల్ అండ్ సీడ్స్ కార్పొరేషన్‌కు చెందిన రూ. 5 కోట్లను కొట్టేసి, ఆ డబ్బును ఏపీ మర్కంటైల్ బ్యాంకులోకి మళ్లించినట్లు నిందితులు వెల్లడించారు. తెలుగు అకాడమీ కేసులో ఇప్పటి వరకు 14 మందిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. 2009 నుంచి సాయికుమార్ ఫిక్స్డ్ డిపాజిట్ల కుంభకోణం చేశారని, ఇతడిపై వివిధ ప్రాంతాల్లో 8 కేసులు ఉన్నట్లు తెలిసిందని సీసీఎస్ అధికారులు పేర్కొంటున్నారు. 9 మంది కస్టడీ మంగళవారం ముగియడంతో వారిని కోర్టులో హాజరుపరిచిన అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించారు, మరో పక్క కెనరా బ్యాంకు చందానగర్ మాజీ మేనేజర్ సాధనను కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు, ఆమెకు రూ. 1.99 కోట్లు సాయికుమార్ అందించినట్లు వెల్లడించాడు. సాయికుమార్‌తో పాటు అతని అనుచరులను మరోసారి కస్టడీలోకి తీసుకోవడానికి పిటిషన్ దాఖలు చేశారు, దీనిపై ఈ నెల 16వ తేదీన కోర్టులో విచారణ జరిగే అవకాశాలున్నాయి. -
Telugu Academy: ఏడాది క్రితం నుంచే డబ్బులు కొట్టేసేందుకు కుట్ర
సాక్షి, హైదరాబాద్: తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్‌లో కీలక అంశాలు వెలుగు చూస్తున్నాయి. నిందుతుల ఏడాది క్రితం నుంచే డబ్బులు కొట్టేసేందుకు కుట్ర పన్నారని తెలిసింది. అకాడమీ అకౌంట్స్ ఆఫీసర్ రమేష్‌తో కలిసి డబ్బులు కొట్టేసేందుకు ప్లాన్ చేశారు. అకాడమీ నుంచి 3 బ్యాంకుల్లో డిపాజిట్లకు సిఫార్సు చేశారు. బ్యాంకుల డిపాజిట్ల సందర్భంలోనే నకిలీ పత్రాలు, డైరెక్టర్, అకౌంట్ ఆఫీసర్ సంతకాలు ఫోర్జరీ వంటి అంశాలను సెట్ చేసుకున్నారు. సంవత్సర కాలానికి డిపాజిట్లు పెట్టి.. 15 రోజులకే మార్పు చేశారు. ఒరిజినల్ డిపాజిట్ల సర్టిఫికెట్లు తమ దగ్గరే ఉంచుకుని.. నకిలీ సర్టిఫికెట్లు అకాడమీకి ఇచ్చారు నిందితులు. ఒరిజినల్ ఎఫ్డీలతో 64.5 కోట్ల రూపాయలు డ్రా చేసింది ఈ ముఠా. ముందుగానే తెలుగు అకాడమీ పేరుతో నకిలీ అకౌంట్ ఓపెన్ చేశారు. అగ్రసేన్, ఏపీ మర్కంటైల్ సొసైటీల్లో నకిలీ ఖాతాలు సృష్టించారు. ఈ క్రమంలో యూనియన్, కెనరా బ్యాంకుల్లో కాజేసిన నిధులను ముందుగా అగ్రసేన్ బ్యాంక్‌కు తరలించారు. (చదవండి: తెలుగు అకాడమీ స్కాం: మరింత లోతుగా..) తర్వాత మర్కంటైల్ సొసైటీకి మళ్లించి 64.5 కోట్ల రూపాయలు డ్రా చేశారు. దీనిలో 6 కోట్ల రూపాయలను బ్యాంకు మేనేజర్లు, సొసైటీ సిబ్బందికి లంచంగా ఇచ్చారు. అకాడమీ అకౌంట్స్ ఆఫీసర్‌కు కోట్ల రూపాయల లంచం ఇచ్చిన ముఠా.. మిగతా మొత్తాన్ని రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టారు. మరి కొంతమంది నిందితులు కాజేసిన నిధులతో అప్పులు తీర్చుకున్నట్టు విచారణలో వెళ్లడయ్యింది. చదవండి: తెలుగు అకాడమీ స్కాం: మరో రూ.20 కోట్లకు స్కెచ్! -
Telugu Academy: రూ.64 కోట్లు మాయం.. వారి ఖాతాలో చిల్లిగవ్వ లేదు
సాక్షి, హైదరాబాద్: తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ దర్యాపప్తును సీసీఎస్ పోలీసులు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో నిన్నటి నుంచి మాజీ డైరెక్టర్ సోమిరెడ్డిని సీసీఎస్ పోలీసులు విచారిస్తున్నారు. అలానే అకాడమీలో పనిచేస్తున్న అకౌంట్స్ డిపార్ట్మెంట్ అధికారులను సైతం విచారిస్తున్నారు పోలీసులు. కొన్ని డిపాజిట్లకు సంబంధించి సోమిరెడ్డి రిలీజింగ్ ఆర్డర్ ఇచ్చినట్టుగా పోలీసులకు ఆధారాలు లభ్యం అయ్యాయి. ఈ క్రమంలో బ్యాంకులకు సోమిరెడ్డి ఇచ్చిన రిలీజింగ్ ఆర్డర్‌పై సీసీఎస్ పోలీసులు ఆరా తీస్తున్నారు. సోమిరెడ్డి రిలీజింగ్ ఆర్డర్ ఇచ్చినప్పటికీ అకాడమీ ఖాతాలో నిధులు డిపాజిట్ కాలేదని గుర్తించారు. ఈ వ్యవహారంలో మస్తాన్ వలీ, శ్రీనివాస్, సోమశేఖర్, రాజకుమార్ల పాత్రపై పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు పోలీసులు. వీరితో పాటు అకాడమీ మాజీ డైరెక్టర్ సత్యనారాయణను కూడా విచారిస్తామని తెలిపారు పోలీసులు. (చదవండి: ‘తెలుగు అకాడమీ’ కుంభకోణంలో కొత్త కోణాలు! ) ఏపీ మర్కంటైల్ బ్రాంచ్ నుంచి డ్రా చేసిన డబ్బులు ఎక్కడికి వెళ్లాయన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 64 కోట్ల రూపాయల డబ్బులు ఎక్కడ ఉన్నాయో తెలియడం లేదంటున్నారు పోలీసులు. అరెస్ట్ అయిన వారికి ఖాతాలో చిల్లిగవ్వ కూడా లేదని తెలిపారు. ఈ క్రమంలో నిధులు ఎవరికి చేరాయి అనేదానిపై పోలీసులు ఒక నిర్ధారణకు రాలేకపోతున్నారు. 64 కోట్ల రూపాయల నిధుల ఆచూకీ తెలుసుకునేందుకు పది ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు పోలీసులు. చదవండి: సీసీఎస్ అదుపులో స్కామ్ సూత్రధారులు? -
‘ఉద్యోగులంతా తెలుగు అకాడమీలో అందుబాటులో ఉండాలి’
హైదరాబాద్: తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ కేసులో సీసీఎస్ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ సందర్భంగా తెలుగు అకాడమీ ఉద్యోగులంతా హిమాయత్‌నగర్‌లో విచారణకు అందుబాటులో ఉండాలని సీసీఎస్ పోలీసులు ఆదేశాలు జారీచేశారు. అదే విధంగా, మాజీ డైరెక్టర్ సోమిరెడ్డి, అకౌంట్స్ అధికారి రమేష్‌లను విచారణకు హజరుకావాలని సీసీఎస్ పోలీసులు సమాచారం అందించారు. ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న బ్యాంక్ మేనేజర్ మస్తాన్‌వలీ, ఏ2 గా నిందితునిగా ఉన్న రాజ్‌కుమార్‌ల మధ్య ఉన్నసంబంధాలపై పోలీసులు ఆరా తీయనున్నట్లు సమాచారం. ఈ కేసులో వీరికి.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రఫీకి మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో విచారించనున్నట్లు తెలుస్తోంది. చదవండి: తెలుగు అకాడమి స్కాంలో సూత్రధారి కోసం గాలింపు -
‘తెలుగు అకాడమీ’ కుంభకోణంలో నలుగురి అరెస్టు
సాక్షి, హైదరాబాద్: తెలుగు అకాడమీకి చెందిన రూ.64 కోట్ల నిధుల స్వాహా కేసులో హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్స్టేషన్ (సీసీఎస్) పోలీసులు శుక్రవారం నలుగురిని అరెస్టు చేశారు. ప్రధాన సూత్రధారికి సహకరించిన ఆరోపణలపై యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) చీఫ్ మేనేజర్ మస్తాన్‌వలి, ఏపీ మర్కంటైల్ కో–ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ ఆపరేషన్స్ మేనేజర్ వేదుల పద్మావతి, రిలేషన్షిప్ మేనేజర్ సయ్యద్ మొహియుద్దీన్లను హైదరాబాద్‌లో, చైర్మన్/ఎండీ బీవీవీఎన్ సత్యనారాయణరావును విజయవాడలో అదుపులోకి తీసుకున్నారు. పక్కా పథకంతో డిపాజిట్లు మాయం తెలుగు అకాడమీ తన నిధులను వివిధ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) చేసింది. ఈ లావా దేవీలను దళారులుగా వ్యవహరించిన ముగ్గురు వ్యక్తులు నడిపారు. ప్రస్తుతం పరారీలో ఉన్న వీరి పేర్లు, వివరాలను అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. పథకం ప్రకారం ఈ త్రయం ఎఫ్డీ చేసిన సమయంలోనే ఆ పత్రాలను కలర్ జిరాక్స్ తీసుకున్నారు. సంతోశ్‌నగర్, కార్వాన్‌ల్లోని యూబీఐ, చందానగర్ కెనరా బ్యాంక్ శాఖల్లోని 12 ఎఫ్‌డీలుగా ఉన్న రూ.64 కోట్లు కాజేయడానికి కుట్రపన్నారు. సిద్ధి అంబర్‌బజార్‌లోని ఏపీ మర్కంటైల్ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్‌లో తెలుగు అకాడమీ పేరుతో ఖాతా తెరిచారు. ఆ సమయంలో నకిలీ గుర్తింపుకార్డులు, ఫోర్జరీ పత్రా లు సమర్పించారు. వాటి ఆధారంగా యూబీఐ కార్వాన్ బ్రాంచ్‌లోని రూ.43 కోట్లు, సంతోష్‌నగర్ బ్రాంచ్‌లో రూ.10 కోట్లు, చందానగర్ కెనరా బ్యాంక్ బ్రాంచ్‌లో రూ.11 కోట్లు లిక్విడేట్ చేశారు. తర్వాత తెలుగు అకాడమీ పేరుతో సొసైటీలో తెరిచిన ఖాతాల్లోకి మళ్లించి డ్రా చేసేశారు. సొసైటీకి 10 శాతం వరకు కమీషన్ ఇచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో వెలుగులోకి.. అకాడమీ ఆస్తులు, నిధులను నిర్దేశిత నిష్పత్తి ప్రకారం ఏపీ, తెలంగాణ పంచుకోవాలని గత నెల 14వ తేదీన సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో వాటి లెక్కలు చూడాలని అకాడమీ డైరెక్టర్ సోమిరెడ్డి ఆదేశాలు జారీచేశారు. అధికారులు ఈ నెల 18వ తేదీన బ్యాంకర్ల సమావేశం ఏర్పాటు చేసి గడువు తీరిన, తీరని ఎఫ్డీలు రద్దు చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే కుంభకోణం వెలుగుచూసింది. అయితే అప్పటికే ముగ్గురు సూత్రధారులూ తమ ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వీరి కోసం గాలిస్తున్నామని సంయుక్త పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి తెలిపారు. -
తెలుగు అకాడమీ నిధుల స్కాంలో ముగ్గురు అరెస్ట్
-
తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ కేసు: ముగ్గురు అరెస్ట్
హైదరాబాద్: తెలుగు అకాడమీ డిపాజిట్ల గోల్మాల్ కేసులో సీసీఎస్ పోలీసులు శుక్రవారం ముగ్గురిని అరెస్టు చేశారు. యూనియన్ బ్యాంక్ మేనేజర్ మస్తాన్ వలీ, అగ్రసేన్ బ్యాంక్ మేనేజర్ పద్మావతి, ఏపీ మర్కంటైల్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఉద్యోగి మొహినుద్దిన్‌లను సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, వీరు కోట్ల రూపాయల డిపాజిట్లను దారి మళ్లించినట్లు పోలీసులు గుర్తించారు. 330 కోట్ల రూపాయలను తెలుగు అకాడమీ 11 బ్యాంకుల్లోని 34 ఖాతాల్లో డిపాజిట్ చేసింది. ప్రధానంగా యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంకుల్లో డిపాజిట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మాయం బ్యాంకు అధికారుల పాత్రపై తెలుగు అకాడమీ ఫిర్యాదు చేసింది. కాగా, దీనిపై సరైన పత్రాలు చూశాకే డిపాజిట్లు క్లోజ్ చేశామని బ్యాంకు ప్రతినిధులు పోలీసులకు తెలిపారు. ఏపీ వర్తక సహకార సంఘం ఏర్పాటు చేసినట్లు లేఖ సృష్టించి అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. డిపాజిట్లు రద్దు చేయాలని అధికారుల పేర్లతో బ్యాంకులకు లేఖరాశారు. కాగా, డిపాజిట్ల రద్దు వెనుక ఎవరి హస్తం ఉందనే కోణంలో సీసీఎస్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. నిధుల గోల్‌మాల్‌పై ఇప్పటికే త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతుంది. శుక్రవారం రాత్రి వరకు మరి కొందరిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అకాడమీ ఉద్యోగులను సైతం సీసీఎస్ పోలీసులు విచారిస్తున్నారు. చదవండి: Telugu Academy Money Fraud: తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్.. విచారణ వేగవంతం చేసిన సీసీఎస్ -
తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్.. విచారణ వేగవంతం చేసిన సీసీఎస్
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో ఉన్న తెలుగు అకాడమీలో నిధులు గోల్మాల్ అయిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో సీసీఎస్ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. దీనిపై ఇప్పటి వరకు సీసీఎస్ పోలీసులకు మూడు ఫిర్యాదులు అందాయి. సుమారు 63 కోట్ల రూపాయలు గోల్ మాల్ అయినట్లు అకాడమీ అధికారులు సీసీఎస్‌కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు మూడు ఫిర్యాదులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: తెలుగు అకాడమీలో నిధుల గోల్మాల్) ఇప్పటికే పోలీసులు పలు బ్యాంక్ అధికారులను సీసీఎస్‌కు తరలించి విచారిస్తున్నారు. వీరిలో యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్, అగ్రాసేన్ బ్యాంకు ఉద్యోగులు ఉన్నారు. ప్రస్తుతం పోలీసులు వీరిని విచారిస్తున్నారు. చదవండి: టీడీపీ పాలనలో ‘అకాడమీ’కి అస్థిత్వమే లేదు -
చైనా లోన్ యాప్స్: వెలుగులోకి కొత్త కోణం
హైదరాబాద్: చైనా లోన్ యాప్స్ స్కాంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ సెంట్రల్ సైబర్ స్టేషన్(సీసీఎస్)పోలీసులు లోన్ యాప్స్ ప్రతినిధులపై కేసును నమోదు చేశారు. కాగా, లోన్ యాప్స్ పేరుతో కొత్త పద్ధతిలో కొన్ని గ్యాంగ్‌లు.. రూ. 5 వేల కోట్లని అక్రమమార్గంలో చైనాకు తరలించినట్లు ఎన్ఫోర్స్మెంట్ (ఈడీ) అధికారులు గుర్తించారు. ఈ ముఠా విమానాల ద్వారా పెద్ద మొత్తంలో వస్తువులు దిగుమతి చేసుకున్నట్లుగా నకిలీ బిల్లులు సృష్టించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. బిల్లులను పరిశీలించగా ఈ గ్యాంగ్ మోసాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటి వరకు రూ.450 కోట్ల విలువైన వస్తువులను దిగుమతి చేసినట్లు నకిలీ పత్రాలను సృష్టించినట్లు అధికారులు కనుగొన్నారు. ఈ మేరకు లోన్ యాప్స్ ప్రతినిధులపై కేసు నమోదు చేసుకున్న సీసీఎస్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: దుర్గగుడి ఫ్లైఓవర్‌పై రేసింగ్ విన్యాసాలు: ‘క్రిమినల్ కేసు నమోదు’ -
కార్వీ ఎండీ కేసు: మరో నిందితురాలు అరెస్టు
హైదరాబాద్: కార్వీ షేర్స్ కుంభకోణం కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. తాజాగా, ఈ కేసులో శుక్రవారం సెంట్రల్ సైబర్ స్టేషన్(సీసీఎస్) పోలీసులు కార్వీ సంస్థ సెక్రెటరీ శైలజను అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో అరెస్టు అయిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే కార్వీ ఎండీ పార్థసారథి, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రాజీవ్ రంజన్ సింగ్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కృష్ణహరిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. చదవండి: కార్వీ ఎండీ కేసు: మరో ఇద్దరు నిందితుల అరెస్టు -
కార్వీ ఎండీ కేసు: మరో ఇద్దరు నిందితుల అరెస్టు
హైదరాబాద్: కార్వీఎండీ పార్థసారథి రుణాల ఎగవేత కేసులో మరో ఇద్దరు నిందితులను గురువారం సెంట్రల్ సైబర్ స్టేషన్(సీసీఎస్) పోలీసులు అరెస్టు చేశారు. కాగా, నిందితులిద్దరిని రాజీవ్, హరికృష్ణలుగా గుర్తించారు. వీరిద్దరు కూడా నకిలీ షెల్ కంపెనీలతో మోసాలకు పాల్పడ్డారని సీసీఎస్ పోలీసులు నిర్ధారించారు. ఎండీ పార్థసారథి సూచన మేరకే నిందితులు నకిలీ షెల్ కంపెనీలను ఏర్పాటు చేశారు. కాగా, నిందితులిద్దరు 2014 నుంచి షెల్ కంపెనీలను నడుపుతున్నట్లు సీసీఎస్ పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు పార్థసారథిపై సీసీఎస్ పోలీసులు నాలుగు కేసులను నమోదు చేసిన విషయం తెలిసిందే. చదవండి: Tollywood Drugs Case: రకుల్ ప్రీత్ సింగ్‌కు ఈడీ నోటీసులు -
కార్వీ ఎండీ పార్థసారథిపై మరో కేసు..
హైదరాబాద్: కార్వీ స్టాక్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (కేఎస్‌బీఎల్)సంస్థ ఎండీ పార్థసారథి కేసుపై సెంట్రల్ సైబర్ స్టేషన్(సీసీఎస్) పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. తాజాగా, ఆయనపై మరో కేసు నమోదు చేసినట్లు సీసీఎస్ పోలీసులు తెలిపారు. డీమాట్ అకౌంట్ నుంచి రూ.35 కోట్లను.. తన వ్యక్తి గత ఖాతాకు బదిలీ చేసుకున్నట్లు గుర్తించారు. దీంతో ఇప్పటి వరకు పార్థసారథిపై సీసీఎస్ పోలీసులు నాలుగు కేసులను నమోదు చేశారు. చదవండి: ఆడిట్ రిపోర్ట్ ముందుంచి పార్థసారథిని ప్రశ్నించిన పోలీసులు -
కార్వీ ఎండీ పార్థసారథి కేసులో కీలక ఆధారాలు
సాక్షి, హైదరాబాద్: బ్యాంకు రుణాల ఎగవేత, నిధుల మళ్లింపుపై ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్వీ ఎండీ పార్ధసారథి కేసులో సీసీఎస్ పోలీసులు కీలక ఆధారాలు సంపాదించారు. కార్వీ అక్రమాలను సీసీఎస్ పోలీసులు నిగ్గు తేల్చారు. రూ.780 కోట్లు ఖాతాదారుల నెత్తిన కుచ్చుటోపి పెట్టినట్లు తేలింది. రూ. 720 కోట్ల షేర్లను తనఖా పెట్టి బ్యాంకుల నుంచి రుణం పొందినట్లు సమాచారం. అలా పార్థసారథి దాదాపు రూ. 1200 కోట్లు బ్యాంకులకు రుణం ఎగవేశారు. దీంతో పాటు కార్వీ తెలంగాణ లోని బ్యాంక్‌ల వద్దనే రూ. 3000 కోట్ల స్కాం చేసినట్లు తేలింది. ఇతర రాష్ట్రాల్లో నమోదైన కేసులు కలిపితే మరో నీరవ్, మాల్యాలా కార్వి ఫ్రాడ్ కూడా పెద్ద స్కాంగా పరిగణించవచ్చు. కాగా కార్వీ ఆస్తుల మొత్తాన్ని పార్థసారధి బ్యాంకుల్లో కుదువ పెట్టారు. దీనికి సంబంధించి బ్యాంక్ లాకర్లను సీసీఎస్ పోలీసులు ఇప్పటికే గుర్తించారు. కార్వి సంస్థ రుణం పొందిన 6 అకౌంట్లు ను ఇప్పటికే ఫ్రీజ్ చేసిన అధికారులు.. అందులో దాదాపు రూ. 13 కోట్ల లిక్విడ్ క్యాష్‌ను గుర్తించారు. కాగా రెండు రోజుల క్రితం పార్థసారథి కస్టడీ ముగియగా.. విచారణ కోసం సీసీఎస్ పోలీసులు ఆయనను మరో రెండ్రోజలు పోలీస్ కస్టడీలోకి తీసుకోనున్నారు. -
రుణాల ఎగవేత: కార్వీ ఎండీ పార్థసారథి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: బ్యాంకు రుణాలను ఎగవేశారనే ఆరోపణల నేపథ్యంలో కార్వీ ఎండీ పార్థసారధి అరెస్టయ్యారు. రూ.780 కోట్ల రుణాల ఎగవేత కేసులో సీసీఎస్ పోలీసుల గురువారం అతడిని అదుపులోకి తీసుకున్నారు. వివిధ బ్యాంకుల ఫిర్యాదుతో సీసీఎస్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. కార్వీ షేర్లను తనఖా పెట్టి వివిధ బ్యాంకుల వద్ద పార్థసారధి రుణాలు స్వీకరించారు. హెచ్‌డీఎఫ్‌సీలో రూ.340 కోట్లు, ఇండస్ ఇండ్ బ్యాంక్‌లో రూ.137 కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీలో మరో రూ.7 కోట్లు రుణం తీసుకున్నారు. ఆ రుణాలను అక్రమంగా వినియోగించుకున్నారని బ్యాంకులు ఫిర్యాదు చేశాయి. ఆయనను నాంపల్లిలోని కోర్టులో హాజరుపరిచారు. కార్విపై గతంలో సెబీ నిషేధం విధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సీసీఎస్ పోలీసులతో పాటు ఈడీ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్ట్ గేషన్ దర్యాప్తు చేయనున్నాయి. దేశవ్యాప్తంగా కార్వీ స్టాక్ బ్రోకింగ్‌కు లక్షలాది మంది వినియోగదారులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా వేల కోట్ల పెట్టుబడులు వినియోగదారులు పెట్టారు. కస్టమర్ల షేర్లను ఎండీ పార్థసారథిరెడ్డి బ్యాంకులకు తనఖా పెట్టడంతో బ్యాంకులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలోనే అతడిని అరెస్ట్ చేసిన సీసీఎస్ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. చదవండి: కొత్త మొక్క కనుగొన్న శాస్త్రవేత్తలు: పేరేంటంటే ‘జలకన్య’ చదవండి: ఒక్క డ్యాన్స్‌తో సెలబ్రిటీగా మారిన ‘బుల్లెట్టు బండి’ వధువు -
ప్లాట్ల పేరుతో రూ.5 కోట్లు స్వాహా
సాక్షి, హైదరాబాద్: ప్లాట్లు ఇప్పిస్తానంటూ పలువురిని మోసం చేసిన రషీద్ అనే నిందితుడిని సీసీఎస్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ అబ్దుల్ రషీద్ ప్లాట్లు ఇస్తానంటూ సుమారు 15 మంది నుంచి దాదాపు రూ.5 కోట్లు వసూలు చేశారు. నగదు చెల్లించినా ప్లాట్లు ఇవ్వకపోవడంతో ఆలం ఖాన్ అనే బాధితుడు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు శనివారం రషీద్‌ను అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. -
స్టాక్ మార్కెట్ పేరుతో మోసపోయిన నగరవాసి..!
సాక్షి, హైదరాబాద్: స్టాక్ మార్కెట్ పేరుతో జరిగిన ఘరానా సైబర్ మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బేగంపేటకు చెందిన నాగేశ్వర రావుకు సైబర్ నేరస్తులు రూ.43 లక్షలను కుచ్చుటోపి పెట్టారు. అతడికి గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్ రాగా, స్టాక్మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే లాభాలు వస్తాయని ఆశ చూపడంతో సదరు అమౌంట్‌ను సైబర్ నేరస్తుల ఖాతాలోకి నాగేశ్వరరావు డిపాజిట్ చేశాడు. తిరిగి ఫోన్ చేస్తే వారి నుంచి స్పందన రాకపోవడంతో మోసపోయినట్లు గ్రహించి హైదరాబాద్ సీసీఎస్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. చదవండి: E Challan: రోడ్డుపై టైటానిక్ విన్యాసాలు.. వైరల్ -
పోలీసులకు సీనియర్ నటుడు నరేశ్ ఫిర్యాదు
-
7.5 కోట్లు మోసం.. పోలీసులకు సీనియర్ నటుడు నరేశ్ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్ : బిజినెస్ విషయంలో కీస్టోస్ కంపెనీ రూ.7.5 కోట్లు మోసం చేసిందని సీనియర్ నటుడు నరేశ్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. లింగం శ్రీనివాస్ అనే వ్యక్తి కీస్టోన్ ఇన్ఫా కంపెనీల పేరుతో తమ బిల్డర్స్‌తో ఫినిక్స్‌లో అసోసియేట్ అయి సైనింగ్ అథారిటీగా ఉన్నాడని, తమ కుటుంబంతో ఉన్న పరిచయంతో ఏడున్నర కోట్లు హ్యాండ్ ఫైనాన్స్ ద్వారా తీసుకొని తిరిగి ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆరేళ్లుగా అడుగుతున్నప్పటికీ పట్టించుకోవడంలేదని, అందుకే సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని చెప్పారు. తనను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు. నరేశ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న సీసీఎస్ పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. -
నకిలీ పత్రాలతో మాయ.. రూ. 7 కోట్లు కాజేసిన ముఠా
సాక్షి, సిటీబ్యూరో: వివాదంలో ఉన్న ప్రభుత్వ స్థలంపై నకిలీ పత్రాలు సృష్టించి, నగరానికి చెందిన ఓ బిల్డర్‌కు రూ.7 కోట్లకు విక్రయించిన కేసులో నిందితుల్ని సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అధికారులు సోమవారం అరెస్టు చేశారు. బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయం ఎదురుగా ఉన్న ఈ స్థలం ప్రభుత్వ రికార్డుల ప్రకారం సర్కారుది కాగా... తమదే అంటూ కొందరు ప్రైవేట్ వ్యక్తులూ క్లెయిమ్ చేస్తున్నారు. ఓపక్క ఈ వివాదం కొనసాగుతుండగానే తాజాగా జరిగిన మోసం బయటపడింది. బంజారాహిల్స్ రోడ్డు నం.12లో ఉన్న అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ప్రధాన కార్యాలయం ఎదురుగా 9 ఎకరాల 17 గుంటల స్థలం ఉంది. ఇది తమదేనంటూ తిరుమల రాంచందర్ రావు, దర్పల్లి సంపత్, తిరుమల హరిలు నకిలీ పత్రాలు సృష్టించారు. ఈ ముగ్గురూ కలిసి ఆ స్థలంతో 2 ఎకరాలు విక్రయిస్తామని, మిగిలిన స్థలంలో అపార్ట్మెంట్లు నిర్మించడానికి ఇస్తామంటూ జుబ్లీహిల్స్‌కు చెందిన మిహిరా బిల్డ్‌కాన్ మేనేజింగ్ పార్టనర్ సి.సుఖేష్ రెడ్డిని కలిశారు. ఆ స్థలానికి సంబంధించి తయారు చేసిన నకిలీ పత్రాలు ఆయనకు అందించారు. వీటిని ప్రాథమికంగా పరిశీలించిన సుఖేష్ కొనేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. దీంతో రూ.7 కోట్లు చెల్లించి పత్రాలు రాసుకున్న సుఖేష్ 2 ఎకరాలు ఖరీదు చేసేలా, మిగిలింది అభివృద్ధి చేసేలా ఒప్పందం చేసుకున్నారు. ఈ ఆర్ధిక లావాదేవీలు కమలేశ్వర్‌రావు, ఈగ మల్లేశం, సుభాష్ చౌదరీల సమక్షంలో జరిగాయి. సదరు స్థలంలో నిర్మాణాలు చేపట్టేందుకు సిద్ధమైన సుఖేష్ అందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో స్థలం పత్రాలపై అనుమానాలు వ్యక్తమై ఆరా తీయగా అవి నకిలీవిగా తేలింది. దీంతో ఆయన జరిగిన మోసంపై సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తులో లభించిన ఆధారాలను బట్టి నిందితులు రాంచందర్, సంపత్, హరిలను అరెస్టు చేశారు. ఈ కేసును అన్ని కోణాల్లోనూ లోతుగా దర్యాప్తు చేయాలని అధికారులు నిర్ణయించారు. చదవండి: మాయగాళ్లు, ఖాళీ ప్లాట్లు కనిపిస్తే చాలు.. -
ఇది క్రైం ఫ్రం హోమ్!
సాక్షి, హైదరాబాద్: ఆ నలుగురూ ఇంజనీరింగ్ డ్రాపౌట్స్... తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం కొత్త ఎత్తులు వేశారు... కోవిడ్ ఎఫెక్ట్‌తో తెరపైకి వచ్చిన వర్క్ ఫ్రమ్ హోమ్‌ను అనువుగా మార్చుకున్నారు. నకిలీ ఐటీ కంపెనీల ముసుగులో భారీగా ల్యాప్‌టాప్‌లను అద్దెకు తీసుకున్నారు. ఆపై సెకండ్ హ్యాండ్ పేరుతో ఆన్లైన్లో అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. ఐటీ హబ్స్‌నే టార్గెట్‌గా చేసుకున్న ఈ ముఠా హైదరాబాద్‌తో పాటు బెంగళూర్‌లోనూ నేరాలు చేసింది. వీరి గుట్టురట్టు చేసిన అక్కడి బైపనహల్లి పోలీసులు ముగ్గురు నిందితుల్ని పట్టుకున్నారు. వీళ్లలో ఓ నిందితుడిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసి తీసుకువచ్చారు. బెంగళూర్‌లోని కమ్మనహల్లి ప్రాంతానికి చెందిన సైఫ్ పాషా ఈ ముఠాకు సూత్రధారి. అక్కడి వీరప్పనపాల్య, హెన్నూర్ బాండే వాసులైన మొయినుద్దీన్ ఖురేషీ, ప్రతీక్ నాగర్కర్, అశ్వఖ్‌లతో ముఠా కట్టాడు. ఈ నలుగురూ ఇంజనీరింగ్ విద్యను మధ్యలోనే మానేశారు. కొన్నాళ్ల క్రితం చిన్న చిన్న ఐటీ కంపెనీలు ఏర్పాటు చేశారు. అవి నష్టాలనే మిగల్చడంతో డబ్బు కోసం ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించారు. కరోనా ప్రభావంతో ల్యాప్‌టాప్‌లకు భారీగా డిమాండ్ పెరిగింది. ఆదాయాన్ని పెంచుకునేందుకు ల్యాప్‌టాప్‌లను అద్దెకు ఇచ్చే సంస్థలు పోటీ పడి మరీ అద్దెకివ్వడం ప్రారంభించాయి. వేర్వేరు ముఠాలను ఏర్పాటు చేసి... ఇది చూసిన సైఫ్‌కు కొత్త ఆలోచన వచ్చింది. బెంగళూర్‌తో పాటు హైదరాబాద్‌లోనూ ఇలాంటి పరిస్థితే ఉంటుందని గ్రహించి రెండుచోట్లా వేర్వేరు ముఠాలను ఏర్పాటు చేశాడు. ముందుగా వీరు రెండుమూడు నకిలీ ఐటీ కంపెనీలను ఏర్పాటు చేశారు. వాటి పేరుతో లెటర్హెడ్లు తదితరాలు రూపొందించారు. వీటి సాయంతో పలు సంస్థల నుంచి ల్యాప్‌టాప్‌లను అద్దెకు తీసుకున్నారు. అద్దెకు ఇచ్చే వారికి అడ్వాన్స్‌గా పోస్ట్ డేటెడ్ చెక్కుల్ని ఇచ్చారు. ఇలా తమకు చిక్కిన ల్యాప్‌టాప్‌లను సైఫ్ నేతృత్వంలోని ముఠా సభ్యులు ఆన్లైన్లో విక్రయించడం మొదలుపెట్టారు. కరోనా నేపథ్యంలో తమ సాఫ్ట్వేర్ కంపెనీని మూసేస్తున్నామని.. ల్యాప్‌టాప్‌లను సెకండ్ హ్యాండ్లో అమ్ముతున్నామని ప్రచారం చేసుకున్నారు. ఈ ముఠా చేతిలో మోసపోయిన ల్యాప్‌టాప్ సంస్థలు బెంగళూర్‌లోని మదివాల, సంపిగహెల్లీ, అశోక్‌నగర్, ఆర్టీ నగర్, మరథహల్లీ, జేపీ నగర్‌లతో పాటు హైదరాబాద్‌లోని సీసీఎస్లోనూ ఫిర్యాదు చేశారు. అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ముఠాకు చెందిన కొందరిని పట్టుకున్న సీసీఎస్ పోలీసులు సూత్రధారి సైఫ్ కోసం గాలింపు ముమ్మరం చేశారు. మరోపక్క ఈ ముఠా వ్యవహారంపై సమాచారం అందుకున్న బెంగళూర్‌లోని బైపనహెల్లీ పోలీసులు సోమవారం సైఫ్‌తో పాటు మొయినుద్దీన్, ప్రతీక్‌లను పట్టుకున్నారు. వీరి నుంచి రూ.45 లక్షల విలువైన 97 ల్యాప్‌టాప్‌లను స్వా«దీనం చేసుకున్నారు. దీనిపై సమాచారం అందుకున్న సీసీఎస్ పోలీసులు బెంగళూర్ చేరుకుని సైఫ్‌ను తమ కస్టడీలోకి తీసుకుని హైదరాబాద్ తీసుకొచ్చారు. పరారీలో ఉన్న అశ్వఖ్ కోసం గాలిస్తున్నారు. ఒకటిరెండు రోజుల్లో ఈ ముఠా అరెస్టును ప్రకటించే అవకాశం ఉంది. -
ఇంటి దొంగలను అరెస్టు చేసిన సీసీఎస్ పోలీసులు
సాక్షి, హైదరాబాద్: అంతరాష్ట్ర ఇంటి దొంగలను శంషాబాద్ సీసీఎస్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. లాక్డౌన్లో తరచూ దొంగతనాలకు పాల్పడిన పఠాన్ చాంద్ బాషా, సబేర్‌లను అనే ఇద్దరు దొంగలను అదుపులోకి తీసుకుని 20 లక్షల నగదను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇద్దరూ గుల్భార్గాకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. లాక్డౌన్లో మార్చి నుంచి జూలై వరకు వీరిద్దరూ 15 నేరాలకు పైగా పాల్పడ్డారని, ఇది వరకే వీరిపై తెలంగాణలో 15 పైగా కేసులు ఉన్నట్లు సీసీఎస్ పోలీసులు తెలిపారు. గ్రామాల్లో ద్విచక్ర వాహనంపై ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య నిందితులు దొంగతనాలకు పాల్పడేవారని పోలీసులు పేర్కొన్నారు. దొంగతనాలకు చాంద్ బాషా స్కేచ్ వేయగా.. దొంగలించిన సోత్తును సాబేర్ డిస్పోస్ చేసేవాడని విచారణలో నిందితులు పేర్కొన్నట్లు పోలీసులు చెప్పారు. ఈ క్రమంలో వారు తాండూరు వద్ద నివాసం కూడా ఏర్పాటు చేసుకున్నట్లు విచారణలో వెల్లడైంది. ఇక గుల్బర్గ హైదరాబాద్ సిటీకి దగ్గరగా ఉండటంతో అక్కడి నుంచి ఇక్కడుకు వచ్చి దొంగతనాలకు పాల్పడేవారని, ఈ నేపథ్యంలో మహబూబ్‌నగర్, రంగారెడ్డి, వికారాబాద్‌లో తరచూ నిందితులు నేరాలకు పాల్పడినట్లు సీసీఎస్ పోలీసులు వెల్లడించారు. -
ఏసీబీ కేసులో ఫిర్యాదీ... సీసీఎస్ కేసులో నిందితుడు!
సాక్షి, సిటీబ్యూరో: షేక్‌పేట తహసీల్దార్ కార్యాలయం ఆర్ఐ నాగార్జునరెడ్డి ఏసీబీకి చిక్కడానికి, బంజారాహిల్స్ పోలీసుస్టేషన్ ఎస్సై రవీందర్‌పై అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేయడానికి కారణమైన సయ్యద్ అబ్దుల్ ఖాలీద్ కటకటాల్లోకి చేరారు. బంజారాహిల్స్‌లోని ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేయడానికి ఇతగాడు ఫోర్జరీ పత్రాలు సృష్టించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. తన స్నేహితుడిని లీగల్ అడ్వైజర్‌గానూ రంగంలోకి దింపినట్లు తేల్చారు. ఈ మేరకు వారిచ్చిన ఫిర్యాదు మేరకు నగర నేర పరిశోధన విభాగంలో (సీసీఎస్) కేసు నమోదైంది. దీన్ని దర్యాప్తు చేసిన అధికారులు ఖాలీద్‌తో పాటు అశోక్‌రెడ్డి అనే వ్యక్తినీ అరెస్టు చేసినట్లు సంయుక్త పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి ఆదివారం వెల్లడించారు. ఫోర్జరీ వ్యవహారం బయట పడుతుందని... బంజారాహిల్స్ రోడ్ నెం.14లో 7068 చదరపు మీటర్ల ప్రభుత్వ స్థలం ఉంది. అత్యంత ఖరీదైన ఈ çస్థలంపై సయ్యద్ అబ్దుల్ ఖాలీద్ అనే వ్యక్తి కన్నేశాడు. ఈ స్థలంలోని 4865 చదరపు గజాల స్థలానికి సంబంధించి ఖాలీద్ నకిలీ పత్రాలు సృష్టించాడు. ఆ స్థలంలో ఉన్న హెచ్చరిక బోర్డు తొ లగించిన ఇతగాడు తనకు చెందినదిగా పేర్కొంటూ మరో బోర్డు ఏర్పాటు చేశాడు. ఈ స్థలంపై న్యాయస్థానం నుంచి తనకు అనుకూలంగా ఉత్తర్వులు పొందినట్లు నకిలీ పత్రాలు సృష్టించాడు. తన స్నేహితుడు అశోక్‌రెడ్డిని లీగల్ అడ్వైజర్‌గా రంగంలోకి దింపాడు. ఆ స్థలాన్ని ఖాలీద్‌కు అప్పగించాల్సిందిగా కోరుతూ షేక్‌పేట తహసీల్దార్ కార్యాలయంలో అశోక్‌రెడ్డి ద్వారా దరఖాస్తు చేశారు. విషయం గమనించిన తహసీల్దార్ ఈ ఏడాది జనవరి, ఏప్రిల్‌ల్లో బంజారాహిల్స్ ఠాణా లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా... ఆ స్థలా న్ని మీ పరం చేస్తూ సరిహద్దులు చూపిస్తానంటూ షేక్‌పేట కార్యాలయం ఆర్ఐ నాగార్జున రెడ్డి.. ఖాలీద్‌తో ఒప్పందం చేసుకున్నాడు. దీని నిమి త్తం తనకు రూ.30 లక్షలు ఇవ్వాలని ఖాలీద్ ను కోరాడు. మరోపక్క ఇతడిపై బంజారాహిల్స్ ఠాణాలో నమోదైన కేసుల్లో అరెస్టు వంటి చర్యలు లేకుండా ఉండేందుకు ఎస్సై రవీందర్ రూ.3 లక్షలు డిమాండ్ చేశాడు. వీటిలో రూ.1.5 లక్షలు ఖాలీద్ నుంచి రవీందర్ అందుకున్నాడు. తన ఫోర్జరీ వ్యవహారం బయటపడుతోందని, దీనిపై చర్యలు ఉంటాయని భావించిన ఖాలీద్ తప్పించుకోవడానికి మార్గాలు అన్వేషించాడు. ఈ వ్యవ హారం నుంచి అధికారుల దృష్టి మళ్లించడానికి ఓ పథకం వేశాడు. ఆర్ఐ నాగార్జున రెడ్డికి రూ.15 లక్షలు ఇస్తానని చెప్పాడు. ఆ నగదు తీసుకోవడానికి ఈ ఏడాది మార్చి 6న బంజారాహిల్స్‌లోని హార్లీడేవిడ్ సన్ షోరూమ్ వద్దకు రమ్మన్నాడు. ఈలోపు విషయంపై ఏసీబీ అధికారులకు ఫిర్యా దు చేశాడు. దీంతో ఆ రోజు బంజారాహిల్స్‌లో వలపన్నిన ఏసీబీ అధికారులు నాగార్జున రెడ్డిని ట్రాప్ చేశారు. అలాగే రవీందర్ పైనా ఖాలీద్ ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో అతడిపై కేసు నమోదైంది. ఈ వ్యవహారాలతో తన కబ్జా, ఫోర్జరీ పత్రాల అంశాలు మరుగున పడిపోతాయని ఖాలీద్ భావించాడు. అయితే దీనిపై ఏసీబీ ఇన్స్పెక్టర్ షేక్ గౌస్ ఆజాద్ నగర నేర పరిశోధన విభాగంలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఏసీపీ బి.రవీందర్‌రెడ్డి దర్యాప్తు చేపట్టారు. ఖాలీద్, అశోక్‌రెడ్డిల పాత్రలపై ఆధారాలు సేకరించి ఆదివారం ఇద్దరినీ అరెస్టు చేశారు. -
భూ వివాదం కేసు.. మరొకరు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: షేక్‌పేట్‌లో విలువైన ప్రభుత్వ స్థలాన్ని ఫోర్జరీ సంతకాలతో కబ్జా చేసేందుకు ప్రయత్నించిన సయ్యద్ అబ్దుల్‌ను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఏసీబీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సెంట్రల్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్- 14 షేక్‌పేట్ మండలంలోని 4865 గజాల ప్రభుత్వ స్థలాన్ని ఫోర్జరీ సంతకాలతో కబ్జా చేసేందుకు సయ్యద్ అబ్దుల్ ప్రయత్నించినట్లుగా విచారణలో తేలింది. ఫోర్జరీ సంతకాలతో ప్రభుత్వ స్థలం తనదేనంటూ రెవెన్యూ అధికారులకు తప్పుడు ఆధారాలు చూపించినట్లు గుర్తించారు. గతంలో ఈ భూ వివాదంలో బంజారాహిల్స్ ఎస్ఐ తో పాటు షేక్‌పేట్ ఎమ్మార్వో, ఆర్ఐను కూడా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ఇంట్లో సోదాలు
సాక్షి, బంజారాహిల్స్: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ఇంట్లో సీసీఎస్ పోలీసులు సోదాలు నిర్వహించారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14 బీఎన్‌రెడ్డి కాలనీలోని రవిప్రకాశ్ ఇంట్లో ముసద్దీలాల్ జ్యువెల్లరీస్ అధినేత సుకేశ్ గుప్తా తలదాచుకున్నట్లు అందిన సమాచారం మేరకు ఈ దాడులు జరిపారు. సుకేశ్ గుప్తాపై ఎస్ఆర్ఈఐ ఎక్విప్మెంట్ ఫైనాన్స్ లిమిటెడ్ అసోసియేట్ వైస్‌ప్రెసిడెంట్ వేణుగోపాల్ ఫిర్యాదు చేశారు. దీంతో పక్కా సమాచారం మేరకు భారీ బందోబస్తు ఏర్పాటుచేసి సుకేశ్ గుప్తాను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. బషీర్‌బాగ్ కేంద్రంగా పనిచేసే ఆశీ రియల్టర్‌కు చెందిన సుకేశ్‌గుప్తా, నీతూగుప్తా, నిహారిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సురేశ్‌కుమార్, రవిచంద్రన్‌లు ఎస్ఆర్ఈఐ వద్ద రూ.110 కోట్ల రుణం కోసం 2018 జూన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ఆ దేడాది అక్టోబర్ నుంచి ప్రతి 3 నెలలకు ఓ వాయిదా చొప్పున చెల్లిస్తూ మొత్తం 4 దఫాల్లో రుణం వడ్డీ సహా తీర్చాలన్నది ఒప్పందం. ఈ రుణానికి సంబంధించి షూరిటీగా హఫీజ్‌పేటలో ఉన్న 8 ఎకరాల స్థలంతో పాటు, కింగ్‌కోఠిలో 28,106 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న నజ్రీబాగ్ ప్యాలెస్‌ను చూపిస్తూ ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఆ రుణం చెల్లించడంలో విఫలం కావడంతో గతేడాది డిసెంబర్లో హఫీజ్‌పేటలోని స్థలాన్ని వేలం వేసిన ఎస్ఆర్ఈఐ సంస్థ 102.6 కోట్లు రాబట్టుకుంది. మిగిలిన మొత్తం రికవరీ కోసం నజ్రీబాగ్ ప్యాలెస్ వేలం వేయాలని ప్రయత్నించగా, నిందితులు అప్పటికే తమను మోసం చేస్తూ ఐరిస్ హాస్పిటాలిటీస్‌కు విక్రయించినట్లు గుర్తిం చింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుకేశ్ గుప్తా, నీతూ గుప్తా, రవీంద్రన్, సురేశ్‌కుమార్‌లపై కేసు నమోదు చేసి, వారి కోసం వెతుకుతున్నారు. తాజాగా రవిప్రకాశ్ ఇంట్లో ఉన్నట్లు తెలుసుకొని సుకేశ్‌గుప్తాను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. -
‘ఇళ్ల పట్టాల’ కేసులో మరో నిందితుడి అరెస్టు
సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ స్థలాల్లో ఇళ్ల పట్టాలు, రాజీవ్ స్వగృహలో ఫ్లాట్లు ఇప్పిస్తామని 120 మంది సభ్యుల నుంచి లక్షలాది రూపాయలను వసూలు చేసి మోసగించిన ఖాజా ఘయాసుద్దీన్‌ను నగర సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఇప్పటికే ఈ కేసులో ఈ నెల 12న ప్రధాన నిందితుడు మసూద్ అహ్మద్‌ను జైలుకు తరలించిన పోలీసులు మరో నిందితుడైన ఖాజా ఘయాసుద్దీన్ పట్టుకొని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. సీసీఎస్ జాయింట్ సీపీ అవినాష్ మహంతి కథనం ప్రకారం.. సరూర్‌నగర్ మండలం మామిడిపల్లి గ్రామంలో ప్రభుత్వ భూములకు పట్టాలు, లక్ష్మీగూడలోని రాజీవ్ స్వగృహలో ఇళ్లు ఇప్పిస్తామని 120 మంది నుంచి రూ.1.80 కోట్లను ఖాజా ఘయాసుద్దీన్ మరికొందరితో కలిసి వసూలు చేశాడు. దీనిని నమ్మించేందుకు ఏకంగా బాలాపూర్ తహసీల్దార్ స్టాంప్‌లు, సంతకాలతో కూడిన ధ్రువీకరణ పత్రాలు, తెలంగాణ హౌసింగ్ బోర్డు లేఖలు తయారుచేసి జిరాక్స్ కాపీలు ఇచ్చారు. దీనిపై గతేడాది అక్టోబర్ ఐదున ఫిర్యాదు చేసిన మసూద్ అహ్మద్ ఆ తర్వాత నిందితులతో వకాల్తా పుచ్చుకొని నేరగాడిగా మారాడు. ఇలా మోసం చేసిన నిందితులను విడతల వారీగా సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. -
దిశ ఘటనపై అనుచిత వ్యాఖ్యలు.. మరొకరు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : దిశ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతుండగా.. కొందరు యువకులు మాత్రం విజ్ఞత మరచి ప్రవర్తిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా బాధితురాలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటువంటి చర్యలకు పాల్పడేవారిపై సైబర్ క్రైమ్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే శ్రీరామ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా దిశ ఘటనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మరో యువకుడిని పోలీసులు పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా అమరావతి కొండయ్య కాలనీకి చెందిన సాయినాథ్ ఆలియాస్ నాని అనే వ్యక్తిని సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు బాధితురాలి పేరిట సోషల్ మీడియాలో అసభ్యకర ప్రచారం చేసినట్టు పోలీసులు గుర్తించారు. నిందితులు ఫేస్బుక్లో గ్రూప్‌గా ఏర్పడి దిశపై అసభ్య కామెంట్లు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఇప్పటికే ఇద్దరిని( శ్రీరామ్, సాయినాథ్) అరెస్ట్ చేశామని.. త్వరలోనే మరికొంతమందిని అరెస్ట్ చేస్తామని చెప్పారు. ఈ రోజు అరెస్ట్ అయిన నానిని పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. -
ఒంటరి మహిలళే వారి టార్గెట్!
సాక్షి, గుంటూరు: ఒంటరిగా రోడ్డుపై నిలిచి ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకుని, ఆటోలో ప్రయాణికుల మాదిరిగా ఎక్కించుకుని నిర్జీవ ప్రదేశాలకు తీసుకెళ్లి దోపిడీ, లైంగికదాడికి పాల్పడిన ప్రధాన నిందితుడితో పాటు, అతడికి సహకరించిన మరో ముగ్గురు ముఠా సభ్యులను కూడా గుంటూరు అర్బన్ సీసీఎస్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. సీసీఎస్ పోలీసు స్టేషన్లో ఏఎస్పీ ఎస్.రాఘవ విలేకరులకు వివరాలు వెల్లడించారు. సత్తెనపల్లికి చెందిన పల్లపు రమేష్, అతడి భార్య దుర్గ, స్నేహితులు తన్నీరు గోపి, నూర్‌బాషా ఖాశింలు ముఠాగా ఏర్పడ్డారు. సులువైన మార్గంలో డబ్బు సంపాదించేందుకు పథకం వేశారు. అందుకు ఆటోను ఎంచుకుని డ్రైవర్‌గా రమేష్, మిగిలిన ముగ్గురు ప్రయాణికుల్లా రోడ్డుపై వెళుతున్న ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని వారి ఆటోలో ఎక్కించుకునేవారు. ఈ నెల 2వ తేదీన అమరావతి మండలం 14వ మైలుకు చెందిన ఓ మహిళ నిడుముక్కల గ్రామానికి వెళ్లేందుకు వేచి చూస్తున్న సమయంలో ఆటో ఎక్కించుకుని నిర్జీవ ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడటంతో పాటు, బంగారం చోరీ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయగా, గురువారం నలుగురు నిందితులు గుంటూరులోని పూలమార్కెట్ సెంటర్లో బంగారం విక్రయించేందుకు యత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరాలకు పాల్పడినట్లు నిందితులు అంగీకరించడంతో వారి వద్ద ఉన్న బంగారు వస్తువులు స్వాధీనం చేసుకుని, ఆటోను సీజ్ చేశారు. ప్రధాన నిందితుడు పల్లపు రమేష్‌పై సత్తెనపల్లి, తెనాలి, గుంటూరు అర్బన్ పరిధిలోని నల్లపాడు పోలీసు స్టేషన్లో మొత్తం 12 కేసులు నమోదయ్యాయని ఏఎస్పీ వివరించారు. నిందితులను పట్టుకోవాడానికి కృషి చేసిన అధికారులు, సిబ్బందిని ఏఎస్పీ అభినందించారు. సమావేశంలో డీఎస్పీ శ్రీలక్ష్మి, సీఐలు శేషగిరిరావు, మల్లికార్జునరావు, వెంకట్రావు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఎస్సై శ్రావణ్‌కు అరుదైన అవకాశం
సాక్షి, సిటీబ్యూరో: నగర నేర పరిశోధన విభాగంలో (సీసీఎస్) సబ్–ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న బి.శ్రావణ్‌కుమార్‌కు అరుదైన అవకాశం దక్కింది. అమెరికా పోలీసు విభాగం నిర్వహించిన ఇంటర్నేషనల్ విజిటర్ లీడర్షిప్ ప్రోగ్రామ్‌కు ఎంపికైన ఆయన 20 రోజుల పాటు ఆ దేశంలోని వివిధ ప్రాంతాల్లో శిక్షణ పొందారు. ప్రధానంగా మానవ అక్రమరవాణా అరికట్టే విధానాలపైనే ఈ శిక్షణ జరిగింది. గత నెల 18న ప్రారంభమైన శిక్షణ ఈ నెల 8తో ముగిసింది. మానవ అక్రమరవాణాపై ఆ దేశం అవలంభిస్తున్న విధానాలు, చట్టాలు, పోలీసుల దర్యాప్తు తీరుతెన్నులతో పాటు వీసా విధివిధానాలను బోధించారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీ, బోస్టన్, డల్లాస్ సహా మొత్తం ఏడు ప్రాంతాల్లో ఈ శిక్షణ కార్యక్రమం జరిగింది. తదనంతర కార్యక్రమాలు సైతం పూర్తి చేసుకున్న శ్రావణ్ బుధవారం భారత్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. అభివృద్ధి చెందుతున్న 24 దేశాల్లోని పోలీసు విభాగాల నుంచి అధికారులను ఎంపిక చేయగా, భారతదేశం నుంచి ఈ శిక్షణకు ఎంపికైంది శ్రవణ్‌కుమార్ ఒక్కరే కావడం గమనార్హం. ప్రస్తుత ములుగు జిల్లా జంగాలపల్లికి చెందిన శ్రవణ్‌కుమార్ 2009లో సివిల్ ఎస్సైగా పోలీసు విభాగంలో అడుగుపెట్టారు. గతంలో నగర టాస్క్‌ఫోర్స్‌లోని ఉత్తర మండలంలో విధులు నిర్వర్తించిన ఆయన అనేక కీలక కేసుల్ని ఛేదించడంలో కీలకపాత్ర పోషించారు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జరిగిన బదిలీల నేపథ్యంలో సీసీఎస్‌కు వచ్చారు. -
ముందస్తు బెయిల్ రద్దు.. పోలీసుల ఎదుటకు రవిప్రకాశ్
-
పోలీసుల ఎదుట హాజరైన రవిప్రకాశ్
సాక్షి, హైదరాబాద్ : టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ సీసీఎస్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఫోర్జరీ, డేటా చౌర్యం కేసుల్లో నిందితుడిగా ఉన్న రవిప్రకాశ్ గత కొన్ని రోజులుగా అజ్ఞాతంలో ఉన్న సంగతి తెలిసిందే. తెలంగాణ పోలీసులు నమోదు చేసిన కేసుల్లో ముందస్తు బెయిల్ తెచ్చుకోవడానికి రవిప్రకాశ్ తీవ్రంగా ప్రయత్నించారు. అలంద మీడియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రవిప్రకాశ్‌పై ఫొర్జరీ కేసు నమోదు చేశారు. అయితే ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్లు అటు హైకోర్టు, ఇటు సుప్రీంకోర్టు తిరస్కరించాయి. దారులన్నీ మూసుకుపోవడంతో రవిప్రకాశ్ పునారాచనలో పడినట్టుగా తెలుస్తోంది. దీంతో ఆయన మంగళవారం సీసీఎస్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయినట్టుగా తెలుస్తోంది. అన్ని విషయాలపై ప్రశ్నిస్తాం : సైబర్ క్రైమ్ ఏసీపీ రవిప్రకాశ్ విచారణకు హాజరు కావడంపై సైబర్ క్రైమ్ ఏసీపీ శ్రీనివాసరావు స్పందించారు. దీనిపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసుకు సంబంధించిన అన్ని విషయాలపై రవిప్రకాశ్‌ను ప్రశ్నిస్తామని తెలిపారు. రవిప్రకాశ్ చెప్పేదాన్ని బట్టి ఎన్ని రోజులు విచారణ చేయాలనేదానిపై ఆలోచిస్తామన్నారు. తమ దగ్గర ఉన్న ఆధారాలతో అతన్ని ప్రశ్నిస్తామని వెల్లడించారు. రవిప్రకాశ్‌పై కేసులు.. శాంకినేని శివాజితో కలిసి నకిలీ కొనగోలు పత్రాల సృష్టి, నిధుల మళ్లింపు, కుట్ర, సంస్థ కార్యదర్శి సంతకం ఫోర్జరీ తదిత ఆరోపణలపై హైదరాబాద్ పోలీసులు వివిధ కేసులు నమోదు చేశారు. టీవీ9 లోగో, కాపీరైట్స్, ట్రేడ్‌మార్క్‌లు 2018 మేలో మీడియా నెక్స్ట్ ఇండియా కంపెనీకి బదలాయించడంపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. అయితే రవిప్రకాశ్ కోసం పోలీసులు ఆయా నగరాల్లో గాలింపు చేపట్టిన సంగతి తెలిసిందే.పోలీసులు ఎంత గాలించినా.. రవిప్రకాశ్ పదేపదే స్థావరాలు మారుస్తూ వస్తున్నాడు. ఇప్పటి దాకా దాదాపు 30 సిమ్ కార్డులు మారుస్తూ. సోషల్ మీడియాలో స్నేహితులతో మంతనాలు సాగిస్తున్నాడు. పరారీలో ఉంటూనే హైకోర్టులో రెండుసార్లు, సుప్రీంకోర్టులోనూ ముందస్తు బెయిల్ కోసం కోసం ప్రయత్నించి విఫలమయ్యాడు. చదవండి : సుప్రీంకోర్టులో రవిప్రకాశ్‌కు చుక్కెదురు -
‘హీరా’ కేసులో ఆడిటర్ సాయం!
సాక్షి, హైదరాబాద్: ఏదైనా నేరానికి సంబంధించి కేసు నమోదైతే అభియోగపత్రాలను పోలీసులే దాఖలు చేస్తారు.. అయితే స్కీముల పేరుతో వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డ హీరా గ్రూప్ వ్యవహారంలో పోలీసులకు ఆడిటర్ అవసరం వచ్చింది. ఈ సంస్థ ఏం గోల్మాల్ చేసిందనేది ప్రాథమికంగా హైదరాబాద్ నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అధికారులు తేల్చినా.. పూర్తిస్థాయిలో ఓ రూపు తీసుకొచ్చేందుకు ఆడిటర్ అవసరమని భావిస్తున్నారు. అందుకు అనుమతి కోరుతూ ఉన్నతాధికారులకు లేఖ రాశారు. అనుమతి వస్తే.. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ చరిత్రలోనే హీరా కేసు అరుదైనదిగా కానుంది. ఆరేళ్లలో వేల కోట్ల టర్నోవర్ సాగించి, బ్యాంకు ఖాతాల్లో కనీసం వంద కోట్లు కూడా లేని హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవహారాన్ని సీసీఎస్ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. 2010–11లో హీరా ఇస్లామిక్ బిజినెస్ గ్రూప్ పేరుతో నౌహీరా సంస్థ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ గ్రూప్‌లో ఉన్న 15 సంస్థలకూ ఆమే నేతృత్వం వహిస్తోంది. తన సంస్థల వ్యాపార లావాదేవీలకు సంబంధించి ఏ విభాగానికీ సరైన రికార్డులు సమర్పించలేదు. ఈమెపై నమోదైన కేసు దర్యాప్తు చేపట్టిన సీసీఎస్ పోలీసులు అనేక మార్గాల్లో కీలక సమాచారం సేకరించారు. దీని ప్రకారం హీరా గ్రూప్ వార్షిక టర్నోవర్ ఆరేళ్లలో కొన్ని వందల రెట్లు పెరిగిందని గుర్తించారు. 2010–11లో రూ.27 లక్షలుగా ఉన్న గ్రూప్ టర్నోవర్.. 2016–17 నాటికి రూ.800 కోట్లు దాటింది. ఇప్పటివరకు దాదాపు రూ.6 వేల కోట్ల వ్యాపారం చేసినట్లు నివేదికలు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి రికార్డులు ఎక్కడా అందుబాటులో లేవు. నౌహీరా అరెస్టు సందర్భంలో పోలీసులు ఆమెతో పాటు గ్రూప్‌నకు సంబంధించిన 160 బ్యాంకు ఖాతాలను గుర్తించారు. వీటిలో 130 ఖాతాల వివరాలు సేకరించగా... వాటిలో రూ.25 కోట్లు మాత్రమే ఉన్నాయి. ప్రాథమికంగా 1.7 లక్షలు మంది పెట్టుబడిదారుల జాబితాను పొందగలిగారు. వీటిపై నౌహీరా షేక్ నోరు మెదపకపోవడంతో సాంకేతికంగా ముందుకు వెళ్లాలని భావించారు. ఈ పెట్టుబడులకు సంబంధించి 160 బ్యాంకు ఖాతాల ద్వారా లావాదేవీలు జరిగాయి. హీరా గ్రూప్ భారీ స్థాయిలో డిపాజిట్లు సేకరించి మోసం చేసినట్లు, ఆ నిధుల్ని సొంత అవసరాలకు వినియోగించుకున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. సర్వర్ ఆధారంగా ముందుకు.. సర్వర్‌లోని వివరాల ప్రకారం డిపాజిట్‌దారులుగా పేర్కొంటున్న 1.7 లక్షల మంది నిజంగా ఉన్నారా.. లేదా బోగస్ వ్యక్తులా.. వారి పెట్టుబడులు ఎటు వెళ్లాయి.. తదితర అంశాలను గుర్తించేందుకు ఆడిటర్ సాయం అవసరమని సీసీఎస్ అధికారులు నిర్ణయించారు. మరోపక్క నౌహీరా షేక్‌తో పాటు ఆమె బినామీల పేర్లతో ఉన్న దాదాపు రూ.వెయ్యి కోట్ల విలువైన స్థిరాస్తుల్ని దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఆడిటర్ల సాయంతో మరిన్ని అంశాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. నౌహీరాపై నేర నిరూపణలో ఇవే కీలకం కానున్న నేపథ్యంలో ఆడిటింగ్ పూర్తయ్యాకే అభియోగాలు దాఖ లు చేయాలని అధికారులు భావిస్తున్నారు. -
ఈడీ కస్టడీకి నౌహీరా
సాక్షి, హైదరాబాద్: స్కీముల పేరుతో రూ.వేల కోట్ల స్కామ్‌కు పాల్పడిన హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దృష్టిసారించింది. ఈ సంస్థపై నమోదైన కేసును దర్యాప్తు చేసిన పోలీసులు వెలుగులోకి తెచ్చిన అంశాల ఆధారంగా చర్యలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే నౌహీరాను తమ కస్టడీలోకి తీసుకుని విచారించాలని నిర్ణయించిం ది. ఆమె కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేయగా, 7 రోజుల కస్టడీకి అనుమతిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసిం ది. ఈడీ బుధవారం ఉదయం నుంచి 7 రోజు ల పాటు తమ కస్టడీలోకి తీసుకుని విచారించనుంది. నిందితురాలు నౌహీరా షేక్ ఇప్పటి వరకు ఏ దర్యాప్తు సంస్థకీ పూర్తిస్థాయిలో సహకరిచలేదు. హీరా సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన వారిలో కొందరు బినామీలు ఉన్నారని, మనీలాండరింగ్‌లో భాగంగానే ఈ పెట్టుబడులు పెట్టారని ఈడీ అనుమానిస్తోంది. కీలక వివరాలు సేకరించిన ఈడీ నౌహీరాతో పాటు ఆమె సంస్థలపై చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్న ఈడీ ఇప్పటికే సీసీఎస్ అధికారులతో భేటీ అయి కీలక వివరాలు సేకరించింది. హీరా గ్రూప్ ఆరేళ్లలో రూ.6 వేల కోట్లు టర్నోవర్ చేసినట్లు గతంలో రిటర్న్స్ దాఖలు చేసింది. 2010–11లో రూ.27 లక్షలుగా ఉన్న గ్రూప్ టర్నోవర్.. 2016–17 నాటికి రూ.800 కోట్లు దాటేసింది. అయితే దీనికి సంబంధించి పూర్తి రికార్డులు అందుబాటులో లేవు. ఆదాయపు పన్ను (ఐటీ), ఈడీ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ), రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ) వీటిలో ఒక్కో విభాగానికి ఒక్కో తరహాలో రిటర్న్స్ ఫైల్ చేసింది. కనీసం డిపాజిట్‌దారుల జాబితా సైతం ఇప్పటి వరకు తనంతట తానుగా బయటపెట్టలేదు. దీంతో అనేక ప్రయత్నాలు చేసిన సీసీఎస్ పోలీసులు హీరా గ్రూప్‌నకు చెందిన సర్వర్‌ను బంజారాహిల్స్‌లోని ఓ ఇంట్లో గుర్తించారు. వీటి ద్వారా ప్రాథమికంగా 1.7 లక్షల మంది ఇన్వెస్టర్ల జాబితాను వెలికితీశారు. విదేశీ కరెన్సీతో పెట్టుబడుల సేకరణ నిబంధనల ప్రకారం విదేశీ పెట్టుబడుల్ని అవసరమైన అనుమతులు తీసుకున్న తర్వాత కేవలం భారత కరెన్సీలోనే స్వీకరించాలి. అయితే ఇప్పటి వరకు సేకరించిన వివరాల ప్రకారం హీరా గ్రూప్ రూ.5,647 కోట్లు భారత కరెన్సీలో భారతీయుల నుంచి డిపాజిట్లు సేకరించింది. దీనికి తోడు 6 లక్షల డాలర్లు, 132 కోట్ల దిరమ్స్, 45 కోట్ల సౌదీ రియాల్స్, 10 కోట్ల కువైట్ దినార్స్ పెట్టుబడులుగా వచ్చాయి. ఇలా విదేశీ కరెన్సీలో పెట్టుబడులు సేకరించడం ఫెమా చట్టానికి వ్యతిరేకం. మరోపక్క ఇప్పటి వరకు హీరా గ్రూప్ భారత్ కరెన్సీలో రూ.2500 కోట్లు, 2 లక్షల డాలర్లు, 120 కోట్ల దిరమ్స్, 1.36 లక్షలు రియాల్స్ డిపాజిట్‌దారులకు తిరిగి చెల్లించినట్లు తేలింది. వీటితో పాటు విదేశీ బ్యాంకుల్లో ఈ సంస్థకు చెందినవిగా అనుమానిస్తున్న 8 బ్యాంకు ఖాతాలను సీసీఎస్ పోలీసులు గుర్తించారు. ఈ వివరాలన్నీ క్రోడీకరిస్తూ తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈడీ, ఐటీ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్‌లకు లేఖలు రాశారు. దీంతో స్పందించిన ఈడీ ప్రాథమిక విచారణ నేపథ్యంలో ఈ స్కామ్ వెనుక మనీలాండరింగ్ సైతం ఉన్నట్లు తేల్చింది. పోలీసులు హీరా గ్రూప్ ఖాతాలు ఫ్రీజ్ చేసే నాటికి ఈ సంస్థకు ఉన్న వివిధ బ్యాంకు ఖాతాల్లో కేవలం రూ.25 కోట్లు మాత్రమే నగదు నిల్వ ఉంది. 12 వేల మంది ఇన్వెస్టర్లకు తిరిగి చెల్లించాల్సిన మొత్తమే రూ.300 కోట్లుగా బయటపడింది. ఇప్పటివరకు మరో 10 వేల మంది తమకు రూ.350 కోట్లు రావాల్సి ఉందంటూ పోలీసులకు నివేదించారు. ఈ మిస్టరీని ఛేదించడంపై ఈడీ అధికారులు దృష్టిపెట్టారు. -
ఇక ఈడీ వంతు!
సాక్షి, హైదరాబాద్: స్కీముల పేరుతో రూ.వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిన హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఉచ్చు బిగిస్తోంది. ఈ సంస్థపై నమోదైన కేసును దర్యాప్తు చేసిన నగర నేర పరిశోధన విభాగం(సీసీఎస్) పోలీసులు వెలుగులోకి తెచ్చిన అంశాల ఆధారంగా చర్యలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం కర్ణాటక జైల్లో ఉన్న నౌహీరా షేక్‌ను అదుపులోకి తీసుకునేందుకు సన్నాహాలు చేస్తోంది. హీరా సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన వారిలో కొందరు బినామీలు ఉన్నారని, మనీల్యాండరింగ్‌లో భాగంగానే ఈ పెట్టుబడులు జరిగాయని ఈడీ అనుమానిస్తోంది. నౌహీరాతో పాటు ఆమె సంస్థలపై చర్యలు తీసుకునేందుకు ఈడీ ఇప్పటికే సీసీఎస్ అధికారులతో భేటీ అయి కీలక వివరాలు సేకరించింది. ఫెమా చట్టానికి విరుద్ధంగా హీరా గ్రూప్ రూ.5,647 కోట్లు భారత కరెన్సీలో భారతీయుల నుంచి డిపాజిట్లు సేకరించినట్లు దర్యాప్తులో తేలింది. దీనికి తోడు ఆరు లక్షల అమెరికా డాలర్లు, 132 కోట్ల యూఏఈ దిరమ్స్, 45 కోట్ల సౌదీ రియాల్స్, 10 కోట్ల కువైట్ దీనార్స్ పెట్టుబడులుగా వచ్చాయి. ఇలా విదేశీ కరెన్సీలో పెట్టుబడులు సేకరించడం ఫెమా చట్టానికి వ్యతిరేకం. మరోపక్క ఇప్పటి వరకు హీరా గ్రూప్ భారత్ కరెన్సీలో రూ.2,500 కోట్లు, 2 లక్షల అమెరికా డాలర్లు, 120 కోట్ల యూఏఈ దిరమ్స్, 1.36 లక్షల సౌదీ రియాల్స్ డిపాజిట్‌దారులకు తిరిగి చెల్లించినట్లు తేలింది. వీటితో పాటు విదేశీ బ్యాంకుల్లో ఈ సంస్థకు చెందినవిగా అనుమానిస్తున్న ఎనిమిది బ్యాంకు ఖాతాలను సీసీఎస్ పోలీసులు గుర్తించారు. ఈ వివరాలన్నీ క్రోడీకరిస్తూ తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈడీ, ఆదాయపుపన్ను శాఖ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ కార్యాలయాలకు లేఖలు రాశారు. దీంతో ఈడీ ప్రాథమిక విచారణ చేపట్టి ఈ కుంభకోణం వెనుక మనీల్యాండరింగ్ సైతం ఉన్నట్లు గుర్తించింది. సీసీఎస్ తమ దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన, సేకరించిన వివరాలను ఈడీ దృష్టికి తీసుకువెళ్లారు. కొన్ని కీలక డాక్యుమెంట్లను అప్పగించారు. ఇప్పటి వరకు లభించిన ఆధారాలను బట్టి హీరా గ్రూప్‌లో పెట్టుబడులు పెట్టిన వారి సంఖ్య దాదాపు 2 లక్షల వరకు ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. పోలీసులు ఖాతాలు ఫ్రీజ్ చేసే నాటికి ఈ సంస్థకు ఉన్న వివిధ బ్యాంకు ఖాతాల్లో కేవలం రూ.25 కోట్లు మాత్రమే నగదు నిల్వ ఉంది. కేవలం 12 వేల మంది ఇన్వెస్టర్లకు తిరిగి చెల్లించాల్సిన మొత్తమే రూ.300 కోట్లుగా బయటపడింది. దీనికి తోడు ఇప్పటి వరకు మరో 10 వేల మంది తమకు రూ.350 కోట్లు రావాల్సి ఉందంటూ పోలీసులకు నివేదించారు. ఈ మిస్టరీని ఛేదించడంపై ఈడీ అధికారులు దృష్టిపెట్టారు. ఆరేళ్లలో రూ.6 వేల కోట్లు టర్నోవర్ హీరా గ్రూప్ ఆరేళ్లల్లో రూ.6 వేల కోట్ల టర్నోవర్ చేసినట్లు గతంలో రిటర్న్స్ దాఖలు చేసింది. 2010–11లో కేవలం రూ.27 లక్షలుగా ఉన్న గ్రూప్ టర్నోవర్... 2016–17 నాటికి రూ.800 కోట్లు దాటింది. దీనికి సంబంధించి పూర్తి రికార్డులు అందుబాటులో లేవు. ఆదాయపు పన్ను(ఐటీ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీస్(ఎస్ఎఫ్ఐఓ), రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్(ఆర్వోసీ) వీటిలో ఒక్కో విభాగానికి ఒక్కో రిటర్న్స్ ఫైల్ చేసింది. కనీసం డిపాజిట్‌దారుల జాబితా సైతం బయటపెట్టకపోవడంతో అనేక ప్రయత్నాలు చేసిన సీసీఎస్ పోలీసులు హీరా గ్రూప్‌నకు చెందిన సర్వర్‌ను బంజారాహిల్స్‌లోని ఓ ఇంట్లో గతేడాది గుర్తించారు. దీంతో పా టు స్వాధీనం చేసుకున్న కొన్ని హార్డ్‌డిస్క్‌ల్ని విశ్లేషించి కీలక విషయాలు గుర్తించారు. 1.7 లక్షల మంది ఇన్వెస్టర్ల జాబితా వెలికి తీయగలిగారు. వీరిలో కొందరు విదేశీయులున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. అనుమతులు తీసుకు న్న తర్వాత విదేశీ పెట్టుబడుల్ని భారత కరెన్సీలోనే స్వీకరించాలి. -
వైఎస్ షర్మిల ఫిర్యాదు: రిమాండ్‌కు మరో నిందితుడు
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిలపై సోషల్ మీడియాలో అసభ్యకర, అభ్యంతకరమైన పోస్టుల కేసులో... హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే అరెస్టు చేసిన మంచిర్యాల జిల్లా రామ్‌నగర్‌కు చెందిన అడ్డూరి నవీన్‌ను పోలీసులు సోమవారం కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం నిందితుడికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించింది. దీంతో నిందితుడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. సామాజిక మాధ్యమాల ద్వారా వైఎస్ షర్మిలను అప్రదిష్ట పాలుచేసేందుకు కుట్ర చేసిన కారణంగా అతనిపై సెక్షన్ 509 ఐపీఎస్, 67 ఐటీ యాక్ట్‌ల కింద కేసులు నమోదు చేశారు. ఇదే కేసులో శనివారం పెద్దిశెట్టి వెంకటేశ్వరరావు అనే వ్యక్తిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. యూట్యూబ్‌తో పాటు పలు వెబ్సైట్లలో అప్లోడ్ చేసి పోస్టులపై ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం వేముల గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు తీవ్ర అసభ్యకర కామెంట్లు చేశాడు. ఆదివారం అరెస్టయిన నవీన్ నాలుగు వీడియోల కింది భాగంలో తీవ్రమైన వ్యాఖ్యలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. వృత్తిరీత్యా క్షురకుడైన ఇతను ఎందుకు అభ్యంతరకర కామెంట్లు చేశాడనే అంశాన్ని ఆరా తీస్తున్నారు. ఈ వ్యవహారంలో అసలు సూత్రధారుల్ని గుర్తించాలంటే ప్రాథమికంగా ఆయా అంశాలతో కూడిన వీడియోలను సృష్టిస్తూ యూ–ట్యూబ్‌లోకి అప్లోడ్ చేసి వివరాలు, పదేపదే కామెంట్లు పెట్టిన వారి మూలాలు తెలియాల్సి ఉంది. వారు యూ–ట్యూబ్‌ను వినియోగించే సమయంలో ఏ ఐపీ (ఇంటర్నెట్ ప్రొటోకాల్) అడ్రస్ ఆధారంగా ఇంటర్నెట్ను యాక్సిస్ చేశారో గుర్తించాలి. ఈ వివరాలు కోరుతూ యూట్యూబ్ యాజమాన్యానికి లేఖ రాశారు. ఈ కేసులో వీడియోలు పోస్ట్ చేసిన వారితోపాటు కామెంట్లు చేసిన వారూ నిందితులుగా మారతారని పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే 18 మందికి నోటీసులు జారీ చేసిన విషయం విదితమే. -
‘అవంతి’ని అప్రోచ్ అయ్యారు!
సాక్షి, హైదరాబాద్: కళాశాలల్లో హాజరు లెక్కింపునకు సంబంధించి జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూ) అమలులోకి తీసుకువచ్చిన బయోమెట్రిక్ వ్యవస్థనే ఏమారుస్తూ వేలిముద్రల్ని క్లోనింగ్ చేసిన గ్యాంగ్ వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వీరు సంప్రదించిన కాలేజీల్లో వివేకానంద గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్‌తో పాటు తెలుగుదేశం పార్టీ అనకాపల్లి నియోజకవర్గ ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్)కు చెందిన అవంతి ఇంజనీరింగ్ కాలేజీ, ఆయన సోదరుడు ముత్తంశెట్టి కృష్ణారావుకు చెందిన నోవా ఇంజనీరింగ్ కాలేజీ ఉన్నాయి. వీటితో పాటు కోదాడలోని గేట్, కిట్స్ సంస్థలతోనూ వీరు సంప్రదింపులు జరిపారని గుర్తించారు. అయితే వివేకానంద కాలేజీలా మిగిలిన వాటికి నకిలీ వేలిముద్రలు తయారు చేసి ఇచ్చారా? అనే అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. వేలిముద్రల క్లోనింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్స్టేషన్ (సీసీఎస్) పోలీసులు అవంతి కాలేజీతో పాటు మిగిలిన వాటికి నోటీసులు జారీ చేయాలని యోచిస్తున్నారు. జేఎన్టీయూ నిబంధనల కఠినతరంతో... ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురానికి చెందిన బొమ్మ రామకృష్ణ పీహెచ్డీ చేస్తూ అక్కడి స్వర్ణాంధ్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పని చేసేవాడు. కృష్ణా జిల్లా కోడూరుకు చెందిన పి.శ్రీరామ్ ప్రసాద్ 2014–17 మధ్య బాటసింగారంలోని నోవా ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా పని చేశాడు. అప్పట్లో రామకృష్ణ సైతం కొన్నాళ్ల పాటు ఇదే కాలేజీలో పని చేయడంతో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. నిబంధనల ప్రకారం ఇంజనీరింగ్ తదితర కాలేజీల్లో ప్రతి 15 మంది విద్యార్థులకో అధ్యాపకుడు ఉండాలి. అయితే అనేక కాలేజీలు దీన్ని పాటించలేకపోతున్నాయి. బోగస్ అ«ధ్యాపకులు, విద్యార్థుల ఘటనల నేపథ్యంలో జేఎన్టీయూ బయోమెట్రిక్ హాజరు విధానం అవలంభిస్తోంది. క్లోనింగ్ చేశారిలా... రామకృష్ణ సూచనతో శ్రీరామ్ ఓ ప్లాస్టిక్ కోటింగున్న కాగితంపై గ్లూ గన్‌తో ప్రొఫెసర్ల వేలిముద్ర సేకరిస్తా డు. దీని ఆధారంగా రామకృష్ణ ఒక్కో బోగస్ అధ్యాపకుడికి సంబంధించి నాలుగు సెట్ల క్లోన్డ్ వేలిముద్రల్ని తయారు చేసేవాడు. ఆయా కళాశాలల యాజమాన్యా లు ప్రతి రోజూ ఈ వేలిముద్రల అచ్చుల్ని బయోమెట్రిక్ మిషన్‌లో వేలు పెట్టాల్సిన చోట పెట్టేవి. ఇలా ఆ వ్యక్తి హాజరైనట్లు సర్వర్‌లో నమోదయ్యేలా చేసేవారు. కాలేజీలతో ఒప్పందాలు చేసుకుని... జేఎన్టీయూ అఫిలియేటెడ్ కాలేజీల్లో ఉన్న బయోమెట్రిక్ మిషన్ జేఎన్టీయూలో ఉన్న సర్వర్‌తో కనెక్ట్ అయి ఉంటుంది. దీంతో కాలేజీ యాజమాన్యాలు సిబ్బంది, విద్యార్థుల హాజరును ‘మేనేజ్’ చేయలేకపోయాయి. దీన్ని గుర్తించిన రామకృష్ణ వేలిముద్రలు క్లోనింగ్ చేసే విధానం తెలుసుకుని శ్రీరామ్ప్రసాద్తో జట్టుకట్టాడు. హైదరాబాద్‌లోని కాలేజీలతో ఒప్పందాలు చేసుకునే శ్రీరామ్ అవసరమైన ఫింగర్‌ప్రింట్స్ ఆర్డర్‌ను రామకృష్ణకు పంపించడం చేసేవాడు. ఎంటెక్ పూర్తి చేసి వేర్వేరు చోట్ల ఉద్యోగాలు చేస్తున్న వారిని యాజమాన్యాలు అసోసియేట్ ప్రొఫెసర్లుగా ఎన్రోల్ చేసేవారు. వీరు కాలేజీకి వచ్చినప్పుడు శ్రీరామ్ వారి వేలిముద్రలు బయోమెట్రిక్ మిషన్‌లో లోడ్ చేసేవాడు. రీయింబర్స్మెంట్ ‘సృష్టించారా’? ఈ గ్యాంగ్‌ను ఇటీవల హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. అప్పట్లో రామకృష్ణ, శ్రీరామ్‌తో పాటు బాటసింగారంలో ఉన్న వివేకానంద కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ పోరెడ్డి సుదర్శన్‌రెడ్డిని అరెస్టు చేశారు. సైదాబాద్ ఠాణాలో నమోదైన ఈ కేసును దర్యాప్తు నిమిత్తం సీసీఎస్‌కు బదిలీ చేశారు. సుదర్శన్ తమ సంస్థలో పని చేస్తున్నట్లు 29 మంది వేలిముద్రల్ని వీరితో తయారు చేయించాడు. ఈ గ్యాంగ్ విచారణలోనే అవంతి, నోవా, గేట్, కిట్స్ కాలేజీలను అప్రోచ్ అయినట్లు తేలింది. కేవలం సంప్రదించారా.. లేక వారికీ ఏవైనా అక్రమాలకు సహకరించారా.. అన్నదానిపై దృష్టి పెట్టారు. ఆయా కాలేజీలకు నోటీసులు ఇవ్వాలని యోచిస్తున్నారు. ఈ గ్యాంగ్ ‘నకిలీ విద్యార్థుల్నీ’తయారు చేసిందనే అనుమానాలున్నాయి. ఇతర వర్సిటీలకు అనుబంధంగా ఉన్న కళాశాలల్లో చదువు తున్న విద్యార్థులతోనూ కళాశాల యాజమాన్యాలు ఒప్పందాలు చేసుకున్నాయని, వీరి వేలిముద్రల ఆధారంగా ఫీజు రీ–యింబర్స్‌మెంట్ పొందారనే ఆరోపణలపైనా దర్యాప్తు చేయాలని నిర్ణయించారు. -
హీరా గ్రూప్ ఆస్తుల స్వాధీనానికి చర్యలు
సాక్షి, హైదరాబాద్: స్కీముల పేరుతో స్కాములకు పాల్పడిన హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కేసులో బాధితులకు ఊరట కలిగించే అంశాలపై నగర నేర పరిశోధనా విభాగం(సీసీఎస్) పోలీసులు దృష్టి సారించారు. అందులో భాగంగా ఆ సంస్థతోపాటు నిందితుల పేర్లతో ఉన్న ఆస్తుల్ని అటాచ్ చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే గుర్తించిన దాదాపు రూ.1,000 కోట్ల విలువైన స్థిరాస్తుల్ని స్వాధీనం చేసుకోవడానికిగాను అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. మరోపక్క మహారాష్ట్ర జైల్లో ఉన్న ఆ గ్రూప్ సీఈవో నౌహీరా షేక్‌ను సిటీకి తీసుకురావడానికి మరికొంత సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ సహా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటకల్లో నౌహీరాతోపాటు ఆ సంస్థ పేరిట ఉన్న ఆస్తుల్ని సీసీఎస్ పోలీసులు గుర్తించి వివరాలను ప్రభుత్వానికి నివేదించారు. వివిధ రకాలైన వ్యాపారాలు చేస్తున్నానని, ఆయా వ్యాపారాల్లో 90 శాతం లాభాలు వస్తున్నాయని, అందులో పెట్టుబడి పెట్టిన వారికి నెలకు 36 శాతం చొప్పున లాభాలు ఇస్తానని నమ్మించిన నౌహీరా షేక్ కొన్నేళ్లుగా భారీ డిపాజిట్లు సేకరించింది. దీనిపై కేసులు నమోదు కావడంతో హీరా గ్రూప్ ఆర్థిక వ్యవహారాలు, ఆదాయ వనరులపై సీసీఎస్ పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే వీరికి అసలు వ్యాపారాలే లేవని, డిపాజిట్లనే రొటేషన్ చేస్తూ, గొలుసుకట్టు విధానంలో వ్యాపారం చేస్తున్నారని పోలీసులకు కొన్ని ఆధారాలు లభించాయి. ఎంతమంది డిపాజిట్దారులున్నారు, ఎంత మేర డిపాజిట్లు సేకరించారనే వివరాలను కూడా నిర్వాహకులు ఇవ్వకపోడంతో హైదరాబాద్ పోలీసులు అతికష్టమ్మీద వాటిని సేకరించారు. హీరా గ్రూపునకు సంబంధించిన ఆర్థిక అక్రమాల్లో బాధితులు తీవ్రస్థాయిలో నష్టపోయారు. క్రయవిక్రయాలపై సబ్రిజిస్ట్రార్లకు లేఖలు హీరా గ్రూపు కేసులో సీసీఎస్ పోలీసులు డిపాజిట్‌దారుల పరిరక్షణ చట్టంలోని సెక్షన్లను జోడించారు. దీంతో ఆస్తుల స్వాధీనానికి ఆస్కా రం ఏర్పడింది. ఇప్పటికే పోలీసులు ఆ సంస్థకు చెందిన ఆస్తుల్ని గుర్తించి, సీజ్ చేస్తూ క్రమవిక్రయాలు నిషేధించాల్సిందిగా సబ్–రిజిస్ట్రార్లకు లేఖలు రాశారు. ఇలా నమోదైన కేసుల్లో నిందితు ల నుంచి పోలీసులు సీజ్ చేసిన ఆస్తుల జాబితాను ప్రభుత్వానికి నివేదిస్తారు. ఈ స్వాధీనాన్ని ధ్రువీకరించాల్సిందిగా కోరతారు. ఈ మేరకు ధ్రువీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. వీటి ఆధారంగా ఆ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను జోడిస్తూ పోలీసులు కోర్టుల్లో పిటిషన్ దాఖలు చేస్తారు. నిందితుల ఆస్తుల స్వాధీనం సమంజసమేనంటూ ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా అభ్యర్థిస్తారు. ఈ పిటిషన్ పూర్వాపరాలను పరిశీలించి కోర్టు తగిన ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఈ ప్రక్రియలో భాగంగా సీసీఎస్ పోలీసులు నౌహీరా షేక్‌తోపాటు ఆ సంస్థలకు చెందిన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, టోలిచౌక్, ఏపీలోని చిత్తూరు జిల్లా, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పుణేలోని పలు ప్లాట్లు, ఇళ్ల వివరాలను సేకరించారు. వీటిని అటాచ్ చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు. -
ఏడాదికో అకౌంటెంట్ మార్పు..!
సాక్షి, హైదరాబాద్: ప్రజలతో నేరుగా సంబంధాలు కలిగి ఉండే వ్యాపార రంగంలో ఉన్న కంపెనీలు... ప్రధానంగా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సాధారణంగా వారి లెక్కలు చూసే చార్టర్డ్ అకౌంటెంట్లను (సీఏ) మార్చవు. ఏదైనా తీవ్రమైన ఇబ్బంది వస్తే తప్ప కనీసం ఐదేళ్ల వరకు ఒకరినే కొనసాగిస్తుంటారు. అయితే హీరా గ్రూప్ వ్యవహారశైలి మాత్రం దీనికి భిన్నం. తమ గ్రూప్‌లో దాదాపు 15 కంపెనీలు ఉన్నప్పటికీ ప్రతి ఆర్థిక సంవత్సరం సీఏలను మారుస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ గ్రూప్ సీఈఓ నౌహీరా షేక్ ఆలోచనల మేరకు ఇలా చేసి ఉంటారని భావిస్తున్నారు. ఏటా రూ.800 కోట్ల టర్నోవర్ ఉందంటూ చూపించి, వివిధ స్కీముల కింద సాలీనా 36 నుంచి 46 శాతం వడ్డీ పేరుతో నౌహీరా షేక్ దేశ వ్యాప్తంగా అనేక మంది నుంచి డిపాజిట్లు సేకరించింది. నౌహీరా షేక్ 2010–11లో హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ గ్రూప్‌లో ఉన్న 15 సంస్థలకూ నౌహీరానే నేతృత్వం వహిస్తున్నారు. తన వ్యాపార లావాదేవీలకు సంబంధించి నౌహీరా షేక్ ఏ విభాగానికీ సరైన రికార్డులు సమర్పించలేదు. అయినప్పటికీ ఈమెపై నమోదైన కేసు దర్యాప్తు చేపట్టిన సీసీఎస్ పోలీసులు అనేక మార్గాల్లో కీలక సమాచారం సేకరించారు. దీని ప్రకారం హీరా గ్రూప్ వార్షిక టర్నోవర్ ఆరేళ్ళల్లో కొన్ని వందల రెట్లు పెరిగిందని గుర్తించారు. 2010–11లో కేవలం రూ.27 లక్షలుగా ఉన్న గ్రూప్ టర్నోవర్... 2016–17 నాటికి రూ.800 కోట్లు దాటేసింది. అయితే వీటికి ఆమె లెక్కలు చూపించలేదని అధికారులు చెప్తున్నారు. ఆయా కంపెనీల లావాదేవీలు, వాటికి చెందిన డాక్యుమెంట్లను హీరా కనీసం ఐటీ విభాగానికీ, ఆర్వోసీకి సమర్పించలేదని పోలీసులు గుర్తించారు. అయినప్పటికీ ఏళ్ళుగా నౌహీరా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూనే ఉన్నారు. ఈ వ్యవహారాల్లో సీఏలది కీలక పాత్రగా ఉంటుందని, వారిని ప్రశ్నిస్తే కొన్ని చిక్కుముడులు వీడతాయని భావించిన సీసీఎస్ పోలీసులు వివిధ రికార్డుల నుంచి వారి వివరాలు సేకరించారు. ఇప్పటి వరకు ముగ్గురిని ప్రశ్నించినా ఆశించిన ఫలితం కాలేదు. ఓ వ్యక్తిని సీఏగా నియమించుకోవడం, సంస్థ లావాదేవీలపై అతడికి పూర్తి అవగాహన వచ్చేలోగానే తీసేస్తున్నట్లు సీసీఎస్ పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఈ గ్రూప్‌లో పని చేసిన సీఏల వివరాలను ఆరా తీయడంపై దృష్టి పెట్టారు. గతేడాది షార్జాలో ‘టీ–10’ లీగ్ క్రీడా రంగంలో కొన్నేళ్ల క్రితం వచ్చిన ‘క్రికెట్ టీ–20’ మ్యాచ్‌లు బాగా ప్రాచుర్యం పొందాయి. వీటి నేపథ్యంలో కొన్ని ఫ్రాంచైజీలు కూడా పుట్టుకు వచ్చి భారీ ఆర్థిక లావావేలకు కేంద్రంగా మారి నిర్వహణ సంస్థలకు కాసులు కురిపించాయి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న హీరా గ్రూప్ మరో అడుగు ముందుకు వేసింది. ‘టీ–10’లీగ్ మ్యాచ్ పేరుతో కొత్త ఒరవడికి నాంది పలికింది. దీని ప్రకటన, లాంచింగ్ గతేడాది డిసెంబర్ తొలి వారంలో హైదరాబాద్‌లోనే జరిగింది. ప్రధానంగా హీరా గ్రూప్‌తోపాటు మరికొన్ని సంస్థలూ స్పాన్సర్ చేసిన ఈ మ్యాచ్‌లు దుబాయ్‌లో ఉన్న షార్జా స్టేడియంలో గతేడాది డిసెంబర్ 14 నుంచి 17 వరకు జరిగింది. పంజాబీ లెజెండ్స్, ఫక్తూన్స్, మరాఠా అరేబియన్స్, బెంగాల్ టైగర్స్, టీమ్ శ్రీలంక క్రికెట్, కేరళ కింగ్స్ అనే ఫ్రాంచైజీలు పాల్గొన్నాయి. అనేక మంది బాలీవుడ్ తారలు సైతం ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ మ్యాచ్‌ల నిర్వహణ, స్పాన్సర్ షిప్ తదితరాల్లో భారీ ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీటిపై ఆరా తీయాలని నిర్ణయించుకున్నారు. నౌహీరా షేక్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశాక ఇక్కడ బెయిల్ మంజూరైంది. బయటకొచ్చిన ఆమెను ముంబై పోలీసులు అరెస్టు చేసి అక్కడకు తరలిం చారు. కొన్ని రోజుల క్రితమే ఇక్కడ మంజూరైన బెయిల్‌ను హైకోర్టు రద్దు చేసింది. నౌహీరాను ముంబై నుంచి పీటీ వారెంట్‌పై తీసుకురావాలని సీసీఎస్ పోలీసులు భావిస్తున్నారు. దీనికి అవసరమైన న్యాయపరమైన సన్నాహాలు చేస్తున్నారు. -
నౌహీరా షేక్ బెయిల్ రద్దు చేసిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: లక్షలాది మంది నుంచి కోట్లాది రూపాయల డిపాజిట్లు సేకరించి మోసం చేశారనే అభియోగాల కేసులో హీరా గ్రూప్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ నౌహీరా షేక్‌కు కింది కోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను హైకోర్టు రద్దుచేసింది. వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ బెయిల్‌ను రద్దు చేస్తూ మంగళవారం ఉత్తర్వులిచ్చారు. సీసీఎస్ పోలీసులు ఆమెపై నమోదు చేసిన కేసులో హైదరాబాద్‌లోని మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి షరతులతో బెయిల్ ఇచ్చారు. బెయిల్‌ను రద్దు చేయా లని సీసీఎస్ పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. కేసు దర్యాప్తులో ఉండగానే బెయిల్ మంజూరైందని, ఆమె బయటకు వస్తే కోట్లాది రూపాయల అక్రమాల అభియోగాల్లో సాక్ష్యాలను మార్చే అవకాశం ఉందని తెలంగాణ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రతాప్‌రెడ్డి వాదనల్ని న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకుని బెయిల్‌ను రద్దు చేస్తూ ఆదేశాలిచ్చారు. -
‘హీరా’ గుట్టు వీడనుంది!
సాక్షి, సిటీబ్యూరో: ఒక కంపెనీ లేదు... మ్యాన్‌ఫాక్చరింగ్ యూనిట్ లేదు. కనీసం క్రయవిక్రయాల దుకాణాలు సైతం లేవు. అయినా గడిచిన ఆరేళ్లల్లో అక్షరాల రూ.5 వేల కోట్ల టర్నోవర్ చేసిన హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ గుట్టు వీడనుంది. శని, ఆదివారాల్లో ఈ సంస్థ ప్రధానం కార్యాలయంలో సోదాలు నిర్వహించిన సీసీఎస్ పోలీసులు సర్వర్‌తో పాటు హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకున్నారు. వీటిని విశ్లేషించడం ద్వారా కీలక సమాచారం వెలుగులోకి వస్తుందని భావిస్తున్నారు. మరోపక్క ఈ గ్రూప్‌నకు సాంకేతిక పరిజ్ఞానం అందించిన కేరళ వాసి బిజూ థామస్‌ను మరోసారి కస్టడీలోకి తీసుకుని విచారించాలని పోలీసులు నిర్ణయించారు. హీరా గ్రూప్ మొత్తం 15 కంపెనీలను కలిగి ఉంది. హీరా గోల్డ్, హీరా టెక్స్టైల్స్, హీరా రిటైల్స్... ఇలా సంస్థలు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌లో (ఆర్వోసీ) నమోదైనా వాస్తవంలో మాత్రం లేవు. కేవలం ప్రజలకు ఎర వేసి, అధిక వడ్డీ ఆశచూపి డిపాజిట్లు సేకరించడం మినహా మరో దందా కనిపించట్లేదు. ఈ గ్రూప్ సంస్థలు విదేశాల్లో ఉన్నప్పటికీ అక్కడి నుంచి ఇక్కడకు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరగలేదు. అయినా ఈ సంస్థ గడిచిన ఆరేళ్లు రూ.5 వేల కోట్లు టర్నోవర్ చేసినట్లు రిటరŠన్స్ దాఖలు చేసింది. ఆదాయపు పన్ను (ఐటీ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ), రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ) వీటిలో ఒక్కో విభాగానికి ఒక్కో రిటరŠన్స్ ఫైల్ చేసింది. వీటి మధ్య ఎక్కడా పొంతన లేదని సీసీఎస్ పోలీసులు గుర్తించారు. మరోపక్క ఏ సంస్థ అయినా ప్రజల నుంచి సేకరించిన డిపాజిట్లను తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వాటిని కేవలం టర్నోవర్‌గా పేర్కొంటాయి తప్ప ఆదాయంగా చూపించవు. అయితే హీరా గ్రూప్ మాత్రం వీటినీ తమ ఆదాయంగా చూపించినప్పటికీ డిపాజిటర్ల జాబితా మాత్రం బయటపెట్టట్లేదు. దీంతో సీసీఎస్ పోలీసులు శని, ఆదివారాల్లో బంజారాహిల్స్‌లోని హీరా గ్రూప్ కేంద్ర కార్యాలయంలో విస్తృత సోదాలు నిర్వహించారు. ఇందులోనే హీరా గ్రూప్ సంస్థలకు చెందిన ప్రధాన సర్వర్లు ఉన్నాయి. వీటిలో డిపాజిటర్ల వివరాలు నిక్షిప్తమై ఉంటాయని భావించిన అధికారులు వాటితో పాటు పలు కంప్యూటర్ల నుంచి హార్డ్‌డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. వీటిని సాంకేతికంగా విశ్లేషించడంతో ఈ గ్రూప్‌లో డిపాజిట్లు చేసిన డిపాజిట్‌దారులతో పాటు ఇతర కీలకాంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. వీటి ద్వారా డిపాజిట్లు ఎంత? తిరిగి చెల్లింపులు ఎంత? ఎక్కడి నుంచి నిధుల ప్రవాహం జరిగింది? అనే వివరాలు తెలిసే అవకాశాలు ఉన్నాయి. మరోపక్క సీసీఎస్ పోలీసుల ఇటీవల అరెస్టు చేసిన బిజు థామస్ సాంకేతిక పరిజ్ఞానం అందించడంతో పాటు కేరళలోని హీరా గ్రూప్ సంస్థ నిర్వాహణ చేపట్టాడు. దీంతో అతడిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే పూర్తి సమాచారం వస్తుందని పోలీసులు భావించారు. తొలుత తన సంస్థ హీరా గ్రూప్‌నకు సాంకేతిక పరిజ్ఞానం అందించినా వారి నుంచి ఓ ఉద్యోగి వచ్చి కేరళలోని తన కార్యాలయం కేంద్రంగా పని చేసే వాడని చెప్పాడు. కొన్నాళ్ల క్రితం ఇలానే వచ్చిన ఓ ఉద్యోగి ఆ సంస్థ డేటాను తన సర్వర్ నుంచి డిలీట్ చేశాడని చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయితే సీసీఎస్ పోలీసులు లోతుగా ప్రశ్నించడంతో అతడి నుంచి కొంత మేర సమాచారం రాబట్టారు. ఇతడి కస్టడీ గడువు పూర్తి కావడంతో తిరిగి జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపిన పోలీసుల మరోసారి కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. దీనికోసం పిటిషన్ దాఖలు చేయనున్నారు. -
హీరా గోల్డ్ కేంద్ర కార్యాలయంలో పోలీసుల తనిఖీలు
సాక్షి, హైదరాబాద్ : సంచలనం సృష్టించిన హీరా గోల్డ్ కుంభకోణం కేసులో దర్యాప్తును సీసీఎస్ పోలీసు అధికారులు వేగవంతం చేశారు. ఈ శనివారం హీరా గోల్డ్ కేంద్ర కార్యాలయంలో సీసీఎస్ పోలీసు అధికారులు తనిఖీలు నిర్వహించారు. తొమ్మిది మంది సభ్యుల బృందం హీరా గోల్డ్ కేంద్ర కార్యాలయంలో సోదాలు నిర్వహించింది. వందల కోట్ల రూపాయల నిధుల సేకరణపై సీసీఎస్ పోలీసులు ఆరా తీస్తున్నారు. డిపాజిట్ దారుల వివరాలను కంపెనీ గోప్యంగా ఉంచింది. హీరా గోల్డ్ గ్రూప్ దాదాపు 16 రాష్ట్రాలనుంచి డిపాజిట్ సేకరించింది. ఆనతి కాలంలో ఆరువేల కోట్ల రూపాయల టర్నోవర్ చూపించిన హీరా గోల్డ్ పెట్టుబడులు మొత్తం హవాల డబ్బులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. హీరా గోల్డ్ గ్రూపు దాదాపు 160 బ్యాంక్ ఖాతాలు కలిగి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హీరా గ్రూప్ పెద్దమొత్తంలో సేకరించిన పెట్టుబడులతో విదేశాల్లో వ్యాపారాలు నిర్వహిస్తోందని దర్యాప్తులో తేలింది. -
నౌహీరా అరెస్టు.. అనేక నాటకీయ పరిణామాలు!
సాక్షి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా రూ.వందల కోట్ల స్కామ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నౌహీరా షేక్ ఇలా బయటకు వచ్చి... అలా వెంటనే అరెస్టయ్యారు. నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) పోలీసులు అరెస్టు చేసిన కేసులో గత వారం జైలుకు వెళ్లిన నౌహీరా బెయిల్‌పై శుక్రవారం ఉదయం విడుదలయ్యారు. జైలు వద్దే కాపుకాసిన మహారాష్ట్ర థానే జిల్లా నిజాంపుర పోలీసులు వెంటనే ఆమెను అదుపులోకి తీసుకుని అక్కడికి తరలించారు. శనివారం కోర్టులో హాజరుపరచడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరోపక్క నౌహీరాకు కింది కోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ సీసీఎస్ పోలీసులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నౌహీరా అరెస్టు నుంచి ఆసక్తికరమైన నాటకీయ పరిణామాలు అనేకం చోటు చేసుకున్నాయి. జైలు వద్దే నిజాంపుర పోలీసులు.. నౌహీరా షేక్‌ను అరెస్టు చేసిన పోలీసులు తదుపరి విచారణ నిమిత్తం కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన న్యాయస్థానం అనుమతి నిరాకరిస్తూ, ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.5 లక్షలతో రెండు పూచీకత్తులు ఇవ్వాలని, ఈ నెల 29 లోపు న్యాయస్థానంలో రూ.5 కోట్లు డిపాజిట్ చేయాలని, పాస్‌పోర్ట్ అప్పగించడంతో పాటు అనుమతి లేకుండా దేశం దాటవద్దంటూ కోర్టు షరతులు విధించింది. పూచీకత్తుల దాఖలు, విడుదల ఉత్తర్వులు తీసుకోవడం గురువారం పూర్తయినప్పటికీ జైలు సమయం మించిపోవడంతో నౌహీరా విడుదల కాలేదు. అయితే హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్, నౌహీరా షేక్‌పై దేశవ్యాప్తంగా కేసులు నమోదవుతున్నాయి. ఆమెకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలుసుకున్న «నిజాంపుర పోలీసులు గురువారమే పీటీ వారెంట్లతో చంచల్‌గూడ జైలు వద్దకు వచ్చారు. ఆమె విడుదల కాకపోవడంతో శుక్రవారం తెల్లవారుజాము వరకు జైలు వద్ద మాటు వేశారు. ఉదయం 7 గంటల ప్రాంతంలో జైలు నుంచి బయటకు వస్తున్న నౌహీరాను అదుపులోకి తీసుకుని రోడ్డు మార్గంలో నిజాంపురకు తరలించారు. అక్కడి కోర్టులో శనివారం హాజరుపరచడానికి సన్నాహాలు చేస్తున్నారు. చంచల్‌గూడ జైలు వద్ద నౌహీరాను అదుపులోకి తీసుకునే సందర్భంలో ఆమె న్యాయవాదులకు, నిజాంపుర పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలిసింది. కేరళకు ప్రత్యేక బృందం... నౌహీరాకు కింది కోర్టు మంజూరు చేసిన బెయిల్ రద్దు చేయాలని, తదుపరి విచారణ నిమిత్తం తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ సీసీఎస్ పోలీసులు శుక్రవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఓ ప్రత్యేక పోలీసు బృందం కేరళకు బయలుదేరి వెళ్లింది. సాధారణంగా కార్పొరేట్, బడా వ్యాపార సంస్థలు తమ బ్యాంకు ఖాతాలను మార్చడానికి ఇష్టపడవు. అయితే హీరా గ్రూప్ వ్యవహారం మాత్రం దీనికి విరుద్ధంగా ఉంది. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన సీసీఎస్ పోలీసులు హీరా గ్రూప్‌తో పాటు నౌహీరా నుంచి వారి బ్యాంకు ఖాతాల వివరాలు తెలుసుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో అధికారులు కేంద్రం అధీనంలోని ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ) ద్వారా 160 బ్యాంకు ఖాతాల వివరాలు సేకరించారు. వీటిని పరిశీలించగా... దాదాపు సగం క్లోజ్ అయినట్లు తేలింది. ఒక్క ఐసీఐసీఐ బ్యాంక్‌లోనే 56 ఖాతాలు ఉండగా, 53 ఖాతాలను మూసేశారు. ఇలా మరికొన్ని బ్యాంకుల్లోనూ జరిగిందని, ముందు నుంచీ ఇలానే జరుగుతున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో ఈ ఖాతాల క్లోజింగ్ వెనుక ఉన్న మతలబు ఏమిటనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు. -
ఆరేళ్ల ఆర్జన రూ.5 వేల కోట్లు!
సాక్షి, హైదరాబాద్: ఒక కంపెనీ లేదు.. ఉత్పత్తి కేంద్రం లేదు.. కనీసం క్రయ విక్రయాల దుకాణాలు సైతం లేవు. అయినా హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ గడిచిన ఆరేళ్లలో సాగించిన టర్నోవర్ ఎంతో తెలుసా? అక్షరాల రూ.5 వేల కోట్లు. వివిధ ఏజెన్సీల ద్వారా హైదరాబాద్ నేర పరిశోధన విభాగం (సీసీఎస్) పోలీసులు ఈ వివరాలు సేకరించారు. తిరిగి చెల్లించాల్సిన ప్రజల డిపాజిట్లను కూడా తమ ఆదాయంగా చూపిన ఈ గ్రూప్ ఆ డిపాజిటర్ల జాబితాను బయటపెట్టట్లేదు. హీరా గ్రూప్‌లో మొత్తం 15 కంపెనీలు ఉన్నాయి. హీరా గోల్డ్, హీరా టెక్స్టైల్స్, హీరా రిటైల్స్.. ఇలా పలు సంస్థలు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌లో (ఆర్వోసీ) నమోదైనా వాస్తవంలో మాత్రం లేవు. ప్రజలకు ఎరవేసి, అధిక వడ్డీ ఆశచూపి డిపాజిట్లు సేకరించడం మినహా మరో దందా లేదు. ఈ గ్రూప్ సంస్థలు విదేశాల్లో భారత్‌తో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరగలేదు. అయినా గడిచిన ఆరేళ్లలో రూ.5 వేల కోట్లు టర్నోవర్ చేసినట్లు రిటర్న్స్ దాఖలు చేసింది. ఐటీ, ఈడీ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ), రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ) వీటిలో ఒక్కో విభాగానికి ఒక్కో రిటర్న్స్ ఫైల్ చేసింది. వీటి మధ్య ఎక్కడా పొంతన లేదని సీసీఎస్ పోలీసులు గుర్తించారు. అన్ని విభాగాలతో సీసీఎస్ సమావేశం.. ఇప్పటికే హీరా గ్రూప్‌పై అన్ని ఏజెన్సీల్లో కేసులు నమోదయ్యాయి. ఈడీ సహా మరికొన్ని ఏజెన్సీలు కొంతవరకు ఆస్తులు గుర్తించి సీజ్ చేశాయి. ఈ స్కామ్‌ను దర్యాప్తు చేస్తున్న సీసీఎస్ పోలీసులు అవసరమైన అదనపు ఆధారాల సేకరణపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా మంగళవారం ఐటీ, ఈడీ తదితర విభాగాలతో సమావేశమయ్యారు. వీటి వద్ద ఉన్న, స్వాధీనం చేసుకున్న ఆస్తుల జాబితాలు సేకరిస్తున్నారు. ఈ సమావేశంలోనూ హీరా ఫ్రాడ్‌పై ఏ ఒక్కరూ స్పష్టత ఇవ్వలేకపోయారు. రాష్ట్రంలో ఉన్న ఆస్తుల వివరాలు తెలపాలంటూ రిజిస్ట్రేషన్ శాఖకు లేఖ రాసిన పోలీసులు ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాటి వివరాల కోసం ప్రత్యేక బృందాలను పంపారు. హీరా గ్రూప్ కార్యకలాపాల వెనుక జాతీయ భద్రతకు సంబంధించిన కోణం కూడా ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. నౌహీరా షేక్‌కు ఊరట నౌహీరా షేక్‌కు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. నౌహీరాను కస్టడీలోకి తీసుకునేందుకు సీసీఎస్ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను నాంపల్లి కోర్టు కొట్టేసింది. ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రూ.5 లక్షలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. రూ.100కు రూ.90 లాభం అంటూ.. ప్రజలు తమ వద్ద పెట్టిన డిపాజిట్లను గోల్డ్, టెక్స్టైల్ రంగాల్లో పెట్టుబడులు పెడతామంటూ హీరా గ్రూప్ నమ్మబలికింది. వాటిలో రూ.100 పెట్టుబడి పెడితే రూ.90 లాభం వస్తుందని, దీని నుంచి తాము 54 శాతం తీసుకుంటూ మిగిలిన 36 శాతం పెట్టుబడి పెట్టిన వారికి పంచుతామని చెబుతూ వచ్చింది. అయితే వాస్తవంగా ఎలాంటి వ్యాపారాలు చేయట్లేదనే విషయం బహిర్గతమైంది. ఈ లావాదేవీలకు సంబంధించి రికార్డులు సైతం సమర్పించలేదు. కాగా, నౌహీరా షేక్‌పై 2012లోనూ ఓ కేసు నమోదైంది. ఈ కేసులో ఆమె పొందిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయించేందుకు గతంలో సీసీఎస్ పోలీసులు ప్రయత్నించారు. నౌహీరా షేక్.. దర్యాప్తు అధికారినే బంజారాహిల్స్‌లోని తన కార్యాలయానికి పిలిపించుకున్నారు. సంస్థ ఆదాయ మార్గాల వివరాలు అడిగితే ‘తనకు ఈ డబ్బును భగవంతుడు ఇస్తున్నాడు. దానికి మనం లెక్కలు ఎలా చెప్పగలం’అంటూ నౌహీరా చెప్పినట్లు సమాచారం. బౌన్సర్ల దౌర్జన్యం.. నౌహీరా షేక్ తరఫున ముంబైకి చెందిన వినీత్ టాండ వాదిస్తున్నారు. ఆయన వెంటవచ్చిన ముంబై బౌన్సర్లు బుధవారం నాంపల్లి కోర్టు వద్ద వీరంగం సృష్టించారు. బాధితుల సంఘం అధ్యక్షుడు షాబాజ్ అహ్మద్‌ఖాన్ నేతృత్వంలో కొందరు బాధితురాళ్లు బుధవారం కోర్టు వద్దకు వచ్చారు. తిరిగి వెళ్తున్న టాండను బాధితులు ఘెరావ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన బౌన్సర్లు మహిళలపై దాడులు చేసి అసభ్యకరంగా ప్రవర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు నాంపల్లి పోలీసులు బౌన్సర్లపై కేసులు నమోదు చేయడంతో పాటు ముగ్గురిని అరెస్టు చేశారు. మిగిలిన వారి కోసం టాస్క్‌ఫోర్స్ పోలీసులు గాలిస్తున్నారు. -
నౌహీరా కస్టడీ పిటిషన్‌పై ముగిసిన వాదనలు
సాక్షి, హైదరాబాద్: హీరా గ్రూప్ సీఈఓ నౌహీరా షేక్ కస్టడీ పిటిషన్‌పై మంగళవారం నాంపల్లి కోర్టులో వాదనలు ముగిసాయి. నౌహీరాకు బెయిల్ మంజూరు చేయాలని ఆమె తరఫు నాయవాది తధాని వాదనలు వినిపించారు. హీరా గ్రూప్‌కు సంబంధించి 2012 నుంచి ఈడీ దర్యాప్తు చేస్తోందని.. అయిన ఇప్పటివరకు ఈడీ అధికారులకు ఎటువంటి ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు. డిపాజిట్ దారుల సౌలభ్యం కోసమే 160 బ్యాంక్ ఖాతాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఏడాది ఆదాయ లావాదేవీలు సక్రమంగా జరుపుతున్నామని.. ఐటీ రిటన్స్ కూడా చెల్లిస్తున్నామని కోర్టులో వాదనలు వినిపించారు. తమపై ఉద్దేశ పూర్వకంగానే కేసులు నమోదు చేశారని తధాని కోర్టుకు తెలిపారు. పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. ఇప్పటికే నౌహీరాపై అనేక చోట్ల కేసుల నమోదయ్యాయని కోర్టుకు తెలిపారు. ఆమెను కస్టడీకి అనుమతిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. దేశవ్యాప్తంగా చాలామంది హీరా గ్రూప్ బాధితులు ఉన్నారని, విచారణ కొనసాగుతోందని, బాధితుల ఫిర్యాదు మేరకే కేసు దర్యాప్తు చేస్తున్నట్టు కోర్టులో వాదనలు వినిపించారు. ఈ పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. చదవండి: 6 సంవత్సరాలు..800 కోట్లు! ‘స్కీమ్స్’ స్కామ్‌లో డాక్టర్ నౌహీరా షేక్ అరెస్టు -
6 సంవత్సరాలు..800 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ టర్నోవర్ పెరుగుదల లెక్కలు తెలుసుకున్న సీసీఎస్ పోలీసులు ముక్కున వేలేసుకుంటున్నారు. మల్టీ నేషనల్ కంపెనీలకు సైతం లేని పెరుగుదల ఈ గ్రూప్‌లో కనిపించడంతో అవాక్కవుతున్నారు. దీనికి ఆ సంస్థ వద్ద, సీఈఓ నౌహీరా షేక్ వద్ద ఎలాంటి రికార్డులు లేకపోవడం గమనార్హం. సోమవారం ఢిల్లీలో అరెస్టు చేసి మంగళవారం నగరానికి తీసుకొచ్చి రిమాండ్‌కు తరలించిన విషయం విదితమే. తదుపరి దర్యాప్తు నిమిత్తం 14 రోజులు తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ సీసీఎస్ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అమాంతం పెరిగిన టర్నోవర్... నౌహీరాపై నమోదైన కేసు దర్యాప్తు చేపట్టిన సీసీఎస్ పోలీసులు అనేక మార్గాల్లో కీలక సమాచారం సేకరించారు. దీని ప్రకారం హీరా గ్రూప్ వార్షిక టర్నోవర్ ఆరేళ్లలో వందల రెట్లు పెరిగిం దని గుర్తించారు. 2010–11లో కేవలం రూ.27 లక్షలుగా ఉన్న గ్రూప్ టర్నోవర్... 2016–17 నాటికి రూ.800 కోట్లు దాటేసింది. ఆయా కంపెనీల లావాదేవీలు, వాటి డాక్యుమెంట్లను హీరా కనీసం ఐటీ విభాగానికీ, ఆర్వోసీకి సమర్పించలేదని పోలీసులు గుర్తించారు. అయినా నౌహీరా వ్యాపార సామ్రా జ్యాన్ని విస్తరిస్తూనే ఉన్నారు. తన మూడో భర్త తనను మోసం చేశారంటూ నౌహీరా చెప్పడం కలకలం సృష్టించింది. ఆయా విభాగాలకు సమాచారం... నౌహీరా అరెస్టుపై సీసీఎస్ పోలీసులు ఆదాయపుపన్ను శాఖ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీస్ తదితర విభాగాలకు సమాచారం ఇస్తున్నారు. విదేశాల్లోనూ శాఖలున్న హీరా గ్రూప్‌పై మనీ ల్యాండరింగ్‌కు పాల్పడిన ఆరోపణలపై ఇప్పటికే ఓ కేసు నమోదు చేసింది. దిగువ మధ్యతరగతి నేపథ్యం... ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతికి చెందిన నౌహీరా షేక్ తండ్రి సాధారణ కూరగాయల వ్యాపారి. ఈమె మాజీ భర్త సైతం ఇదే వ్యాపారం చేసే వారని తెలిసింది. కేవలం పదో తరగతి మాత్రమే చదివిన నౌహీరా ప్రస్తుతం తన పేరుకు ముందు ‘డాక్టర్’ను తగిలించుకున్నారు. ఈ డాక్టరేట్ ఈమెకు దుబాయ్‌కు చెందిన ఓ వర్శిటీ ఇచ్చిందంటూ అనుచరులు ప్రచారం చేస్తున్నా.. పోలీసులు మాత్రం విశ్వసించడం లేదు. సదరు డాక్టరేట్‌కు సంబంధించి తమకు ఎలాంటి ఆధారాలు లభించలేదని, నౌహీరా నుంచి కూడా ఎలాంటి సమాచారం లేదని చెప్తున్నారు. భర్తతో వేరుపడిన తర్వాత హైదరాబాద్‌కు వచ్చిన నౌహీరా బంజారాహిల్స్ ప్రాంతంలో నివసిస్తున్నారు. గతంలో కొన్ని చిన్న చిన్న వ్యాపారాలు చేసిన ఈమె 2010–11లో హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ గ్రూప్‌లో ఉన్న 15 సంస్థలకూ నౌహీరానే నేతృత్వం వహిస్తున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అహ్మదాబాద్‌లోని బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినప్పుడు నౌహీరా కొన్ని పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు. వీటిలో తన హోదాను హీరా గ్రూప్ సీఈఓగా మాత్రమే కాకుండా ఇండియా ఉమెన్ హెల్ప్‌లైన్ సెక్రటరీగా పేర్కొన్నారు. దీనిపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. బంగారం వ్యాపారమని చెప్తున్నా... నౌహీరాను అరెస్టు చేసిన పోలీసులు ప్రాథమిక విచారణలో భాగంగా హీరా గ్రూప్ లావాదేవీలను కోరారు. ఎంత మంది నుంచి డిపాజిట్లు సేకరించారు? వారు ఎక్కడెక్కడి వారు? ఎందరికి తిరిగి చెల్లించారు? ఇంకా ఎంత మందికి డబ్బు ఇవ్వాలి? లాంటి సమాచారంతో కూడిన రికార్డులు సమర్పించాల్సిందిగా కోరారు. అయితే ఆ వివరాలు తమ వద్ద లేవని కొన్ని ఆదాయపు పన్ను శాఖ, మరికొన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వద్ద ఉన్నాయంటూ సమాధానమిచ్చారు. కేవలం డిపాజిట్లు సేకరించడమే కాకుండా తన గ్రూప్ బంగారం వ్యాపారం సైతం చేస్తుందంటూ చెప్పిన నౌహీరా అందులోనే భారీ టర్నోవర్ పొందామని చెప్తున్నారు. సరాసరిన కేజీ బంగారం రూ.30 లక్షలకు ఖరీదు చేసి రూ.60 లక్షలకు విక్రయించిందని భావించినా... పెరిగిన టర్నోవర్ ప్రకారం చూస్తే ఏడాదికి కొన్ని టన్నుల వ్యాపారం చేయాలని, అది అసాధ్యమని పోలీసులు చెప్తున్నారు. మరోపక్క ఈ బిజినెస్‌కు సంబంధించి రికార్డులు సైతం ఈమె వద్ద లేవు. -
‘స్కీమ్స్’ స్కామ్‌లో డాక్టర్ నౌహీరా షేక్ అరెస్టు
సాక్షి, హైదరాబాద్ : ఆలిండియా మహిళా ఎంపవర్మెంట్ పార్టీ (ఎంఈపీ) వ్యవస్థాపక అధ్యక్షురాలు, హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్ పర్సన్ డాక్టర్ నౌహీరా షేక్‌ను హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు అరెస్టు చేశారు. వివిధ స్కీముల పేరుతో వేల మంది నుంచి డిపాజిట్లు సేకరించి మోసం చేశారనే ఆరోపణలు ఆమెపై ఉన్నాయి. నౌహీరాపై ఆరేళ్ల క్రితం నమోదైన కేసు దర్యాప్తులో ఉండగా.. తాజాగా రిజిస్టరైన మరో కేసులో ఆమెను కటకటాల్లోకి పంపినట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ మంగళవారం వెల్లడించారు. నౌహీరా వద్ద డిపాజిట్ చేసిన వారిలో తెలంగాణతో సహా మొత్తం ఎనిమిది రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారని, ఈమెపై మూడు రాష్ట్రాల్లో కేసులు నమోదైనట్లు ఇప్పటి వరకు గుర్తించామని ఆయన తెలిపారు.అదనపు సీపీ షికా గోయల్, డీసీపీ అవినాశ్ మహంతి, అదనపు డీసీపీ జోగయ్యలతో కలసి తన కార్యాలయంలో విలేకరులకు ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతికి చెందిన నౌహీరా షేక్ కొన్నేళ్ల కిందట హైదరాబాద్‌కు వలసవచ్చి బంజారాహిల్స్‌లో స్థిరపడ్డారు. గతేడాది నవంబర్‌లో ఆమె ఎంఈపీని స్థాపించారు. కొన్నేళ్లుగా హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నిర్వహిస్తున్న నౌహీరా అదీనంలో ప్రస్తుతం 15 కంపెనీలు ఉన్నాయి. వీటిలో అనేక కంపెనీలు ప్రస్తుతం డిపాజిట్లు సేకరించే వ్యాపారం చేస్తున్నాయి. 2010–11 ఆర్థిక సంవత్సరంలో తమ వార్షిక టర్నోవర్ కేవలం రూ.17 కోట్లుగా పేర్కొన్న ఈ కంపెనీ గతేడాది ఏకంగా రూ.800 కోట్లుగా పేర్కొంది. వివిధ పథకాల్లో పెట్టుబడులు, చైన్ సిస్టమ్‌లో బంగారం కొనుగోలు, ఏడాదికి 36 శాతం వడ్డీ అందించేలా పెట్టుబడులు... తదితర స్కీములు ప్రవేశపెట్టిన హీరా గ్రూప్ అనేక మంది నుంచి వాటిని సేకరించింది. కనీస డిపాజిట్ మొత్తాన్ని రూ.50 వేలుగా నిర్ధారించి వసూలు చేసింది. తెలంగాణతో పాటు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చి మ బెంగాల్, ఢిల్లీ, రాజస్తాన్ రాష్రా ్టలు, దుబాయ్, మధ్య ఆసియా దేశాల్లోనూ బ్రాంచ్‌లు ఏర్పాటు చేసింది. ఇలా దాదాపు రూ.300 కోట్ల వరకు డిపాజిట్లు వసూలు చేసి తిరిగి చెల్లించకుండా మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నా యి. ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు దాదాపు 40 రోజుల క్రితం బంజారాహిల్స్ ఠాణాలో కేసు నమోదైంది. దీంతో పాటు మరో పది మంది బాధితులు సైతం పోలీసుల వద్దకు వచ్చి వాం గ్మూలం ఇచ్చారు. ప్రాథమిక దర్యాప్తులోనే ఈ స్కామ్ రూ.5 కోట్లదిగా తేలడంతో పాటు మరికొన్ని స్కీమ్స్ వెలుగులోకి రావడంతో కేసును సీసీఎస్‌కు బదిలీ చేశారు. దర్యాప్తు చేసిన ఏసీపీ కె.రామ్‌కుమార్ లోతుగా ఆరా తీశారు. ఫలితంగా డిపాజిటర్ల నుంచి సేకరించిన డబ్బు ను మళ్లించిన నౌహీరా షేక్ దాంతో స్థిరాస్తులు ఖరీదు చేసినట్లు గుర్తించారు. వీటిని తనతో పాటు మరికొందరు బినామీలు, సంస్థల పేరుతో కొన్నట్లు తేల్చారు. ఈ ఆధారాలను బట్టి నౌహీరా నేరం చేసినట్లు నిర్ధారించిన పోలీసులు ఆమె కోసం ముమ్మరంగా గాలించారు. ఎట్టకేల కు సోమవారం ఢిల్లీలో ఆమె కదలికల్ని గుర్తిం చి ఓ ప్రత్యేక బృందాన్ని అక్కడకు పంపారు. ఈ టీమ్ నౌహీరాను అరెస్టు చేసి అక్కడి సాకేత్ కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ తీసుకున్నారు. మంగళవారం నౌహీరాను హైదరాబాద్‌కు తీసుకువచ్చి కోర్టులో హాజరుపరిచారు. ప్రాథమికంగా ఆమెతో పాటు కంపెనీల పేరుతో ఉన్న 160 బ్యాంకు ఖాతాలను గుర్తించిన పోలీసులు వాటిని ఫ్రీజ్ చేసి అధ్యయనానికి సన్నాహాలు చేస్తున్నారు. మరోపక్క డిపాజిటర్ల సొ మ్ముతో నౌహీరా ఖరీదు చేసిన 43 స్థిరాస్తుల్ని గుర్తించిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకోవడంపై దృష్టి పెట్టారు.నౌహీరాపై విశాఖపట్నంలో 2, బెంగళూరులో ఏడు కేసులు ఉన్నట్లు ఇప్పటి వరకు తెలిసిందని, మరిన్ని వివరాలు దర్యాప్తు చేస్తున్నామని అంజనీకుమార్ తెలిపారు. -
‘లాభం’ చూపించి లూటీ చేశారు!
సాక్షి, హైదరాబాద్: ఫారిన్ ట్రేడింగ్ పేరుతో ప్రక టనలు గుప్పించాడు. ఆకర్షితులైన వారు పెట్టిన పెట్టుబడులు, ‘లాభాలు’చూపించడానికి ఓ వెబ్సైట్ సృష్టించాడు. ఈ హంగామాతో నగరానికి చెందిన వైద్యుడు కొంత పెట్టుబడి పెట్టి వారంలోనే ‘లాభం’ పొందాడు. రెండోసారి ఏకంగా రూ.1.5 కోట్లు పెట్టుబడి పెట్టాడు. ఈ మొత్తం కాజేసి టోకరా వేసిన నిందితుడిని నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) పోలీసులు గురువా రం సూరత్‌లో పట్టుకున్నారని తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం, నగరానికి చెందిన వైద్యుడు దినేశ్‌ను వాట్సాప్‌లో వచ్చిన ఓ ప్రకటన ఆకర్షించింది. ఫారెక్స్ ట్రేడింగ్ పేరుతో ఉన్న తమ సంస్థ ద్వారా ఫారిన్ ట్రేడింగ్ చేయడానికి ఆసక్తి ఉన్న వారు సంప్రదించాలంటూ ఫోన్ నంబర్ కూడా ఉంది. వారంలోనే రూ.10 లక్షలిచ్చాడు... దీనికి ఆకర్షితుడైన దినేశ్ ఆ ప్రకటనలో ఉన్న నంబర్‌కు సంప్రదించాడు. ముంబైకి చెందిన అలీ షేక్‌గా పరిచయం చేసుకున్న వ్యక్తి మాట్లాడాడు. తమ వద్ద పెట్టుబడి పెడితే అంతర్జాతీయ షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడతామని, డాలర్, యూరోల విలువతో పాటే ఇది పెరుగుతుందం టూ నమ్మబలికాడు. దినేశ్ తొలుత రూ.50 లక్ష లు పెట్టుబడి పెట్టాడు. ఫారెక్స్ ట్రేడింగ్ పేరుతో ఓ నకిలీ వెబ్సైట్ సృష్టించిన అలీ షేక్... వైద్యుడి పేరుతో ఖాతా తెరిచాడు. రూ.50 లక్షలు ఫారెన్ ట్రేడింగ్‌లో పెట్టుబడి పెట్టినట్లు, దాని విలువ డాలర్, యూరో విలువతో పాటే మారుతున్నట్లు చూపించాడు. అలాగే యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను వైద్యుడికి ఇచ్చి చూసుకునే అవకాశం ఇచ్చాడు. పెట్టుబడి పెట్టిన వారంలోనే 10లక్షలు లాభం వచ్చినట్లు వెబ్‌సైట్‌లోని ఖాతా ద్వారా వైద్యుడికి తెలిసేలా చేశాడు. ఇది చూసిన దినేశ్ ఆ మొత్తం తనకు బదిలీ చేయాలని కోరడంతో అలీ షేక్ మొత్తం రూ.60లక్షలూ దినేశ్‌కు పంపాడు. ఈసారి రూ.కోటిన్నర పెట్టుబడి... వారంలో రూ.10లక్షలు లాభం రావడంతో వైద్యుడు అలీ మాయలో పూర్తిగా పడిపోయాడు. ఇది నిర్ధారించుకున్న అలీ అసలు కథ ప్రారంభించాడు. ఇంటర్నేషనల్ మార్కెట్ లాభాల బాటలో ఉందని, ఈసారి మరింత లాభం వచ్చే అవకాశం ఉందంటూ ఎర వేశాడు. తన వద్ద ఉన్న డబ్బుతో పాటు స్నేహితుల నుంచి తీసుకున్నది కలిపి మొత్తం రూ.1.5కోట్లు దినేశ్ పెట్టుబడిగా పెట్టా డు. డబ్బు కోసం దినేశ్ ఎంతగా ప్రయత్నించినా అలీ నుంచి సరైన స్పందన రాలేదు. దీంతో మోసపోయానని గుర్తించి సీసీఎస్ పోలీసుల్ని ఆశ్రయించడంతో కేసు నమోదైంది. దీన్ని దర్యాప్తు చేసిన అధికారులు ఈ మోసానికి పాల్పడింది అలీ షేక్‌గా చెప్పుకున్న అమీర్ ఆరిఫ్ అగాడీగా తేల్చారు. అతడు ఉండేది ముంబై కాదని, గుజరాత్‌లోని సూరత్ అని నిర్ధారించారు. దీంతో అక్కడకు వెళ్లిన ప్రత్యేక బృందం నిందితుడిని అదుపులోకి తీసుకుంది. స్థానిక కోర్టులో హాజరుపరిచిన తర్వాత ట్రాన్సిట్ వారంట్‌పై సిటీకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. -
గోదాము కిరాయి ఇవ్వడం లేదని..
హైదరాబాద్: గోదాము కిరాయి ఇవ్వడం లేదని రూ.3 కోట్ల విలువైన పుస్తకాలను అమ్మేశాడు దాని యజమాని. బాధితుని ఫిర్యాదు మేరకు ముగ్గురిని అరెస్ట్ చేసిన రాచ కొండ ఎస్వోటీ టీమ్, మల్కాజిగిరి సీసీఎస్ పోలీస్‌లు 5 లారీల పుస్తకాలను స్వాధీనం చేసుకుని.. నిందితులను రిమాండ్‌కు తరలించారు. మంగళవారం ఎల్బీనగర్ సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో రాచకొండ సీపీ మహేశ్‌భగవత్ వివరాలు వెల్లడించారు. గాంధీనగర్‌కు చెందిన నికేతన్ దేవడిగ కాప్రా వంపుగూడ వద్ద గోదామును కిరాయికి తీసుకుని పుస్తకాలు ముద్రిస్తుంటాడు. తెలంగాణతోపాటు ఏపీ, ఛత్తీస్‌గఢ్‌కు భారత చరిత్ర, పర్యావరణ శాస్త్రం, అట్లాస్ ఆఫ్ మై వరల్డ్, సైన్స్, పిల్లలు, లైబ్రరీలకు పుస్తకాలు పంపిణీ చేస్తుంటా డు. గోదాము యజమాని నర్సింహారెడ్డికి నెలకు రూ.50 వేలు కిరాయి చెల్లించాలి. నికేతన్ ఆర్థిక పరిస్థితి సరిగా లేక కొంతకాలంగా కిరాయి చెల్లించకపోవడంతో లక్షల్లో బకాయిపడ్డాడు. అయితే నికేతన్ కిరాయి చెల్లించే స్థితిలో లేడని భావించిన నర్సింహారెడ్డి, అతని కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి కలసి ఈ నెల 4న గోదాము తాళం పగలగొట్టి రూ.3.24 కోట్ల విలువైన 10 ట్రక్కుల పుస్తకాలను బేగంపేటలోని ఎంఆర్ బుక్ సెంటర్ నిర్వాహకుడు ఎండీ రజీముద్దీన్‌కు రూ.15లక్షలకు అమ్మేశారు. రజీముద్దీన్ ముంబై సీఎస్టీ దగ్గరున్న ఆదినాథ్ బుక్ సేల్స్ ధమ్‌జీకి రూ.22 లక్షలకు అమ్మాడు. బాధితుని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న రాచకొండ ఎస్వోటీ టీమ్, మల్కాజిగిరి సీసీఎస్ పోలీసులు నర్సింహారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రజీముద్దీన్‌ను అరెస్ట్ చేసి ముంబై నుంచి 5 లారీల పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. ముంబైలో పుస్తకాలు కొనుగోలు చేసిన ధమ్‌జీపై కేసు నమోదు చేశారు. -
రివార్డు మొత్తం పెంచండి
సాక్షి, హైదరాబాద్: పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్టుంది రాష్ట్ర పోలీసు శాఖలో రివార్డుల విధానం. కష్టపడి నేరగాళ్లను పట్టుకున్న పోలీసులకు అవార్డులు రివార్డులు వస్తే చెప్పుకోవడానికి గొప్పగానే ఉంటుంది. కానీ, రివార్డు పేరుతో ఇస్తున్న మొత్తం గురించి చెప్పుకోలేని బాధ పోలీసులకు. ఏదైనా కేసులో పోలీసుల పనితీరు మెచ్చి ఓ డీసీపీ వారికి రివార్డు ఇవ్వాలనుకుంటే ఆయన ఇవ్వగలిగిన మొత్తం రూ.750 మాత్రమే. ఈ విధానాలను మార్చాలని కోరుతూ నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) పోలీసులు ప్రతిపాదనలు రూపొందించారు. రాష్ట్ర వ్యాప్తంగా అమలు కోసం తయారు చేసిన ఈ ఫైల్ డీజీపీ కార్యాలయం నుంచి తుది అనుమతి కోసం ప్రభుత్వానికి చేరింది. తాజా రివార్డు మొత్తాలు నెల రోజుల్లో అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. కనీస మొత్తం ఉండేలా... ఓ కేసు ఛేదన, నేరగాడిని పట్టుకోడానికి సంబం ధించి ఒకరికైనా, బృందానికైనా డీసీపీ గరిష్టంగా రూ.750, సంయుక్త పోలీసు కమిషనర్(జేసీపీ) రూ.1,000, అదనపు సీపీ రూ.1,500, సీపీ రూ.2,000 మాత్రమే మంజూరు చేసే అవకాశముంది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులు డీసీపీకి రూ.3,000, జేసీపీకి రూ.4,000, అదనపు సీపీ రూ.6,000, సీపీ రూ.8 వేల వరకు మంజూరు చేసేలా ప్రతిపాదనలు రూపొందించి డీజీపీ కార్యాలయానికి పంపారు. డీజీపీ స్థాయి అధికారి తాను కోరుకున్న అధికారులకు గరిష్టంగా రూ.50 వేల వరకు రివార్డు ఇచ్చేలా ప్రతిపాదించారు. ఇన్స్పెక్టర్ ఆ పైస్థాయి వారిని కూడా రివార్డులకు అర్హులుగా చేయాలన్నారు. కాగా, సీసీఎస్ రూపొందించిన ప్రతిపాదనల్లో కొన్ని మార్పులు చేస్తూ డీజీపీ కార్యాలయం ప్రభుత్వానికి నివేదించింది. -
పాక్‌వాసికి సహకరించిన కరీంనగర్ వ్యక్తి
కరీంనగర్ క్రైం: పాకిస్తాన్ పౌరుడికి భారత పాస్‌పోర్టు ఇప్పించడంలో కరీంనగర్‌వాసి కీలకపాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారానికి సంబంధించి హైదరాబాద్ సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతి ఆధ్వర్యంలోని పోలీసుల బృందం ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించింది. పాకిస్తాన్‌కు చెందిన మహ్మద్ ఇక్రమ్ అలియాస్ మహ్మద్ అబ్బాస్ తాను ఢిల్లీకి చెందిన వ్యకిగా చెప్పుకుని హైదరాబాద్‌లోని పాతబస్తీకి చెందిన మహిళను దుబాయ్‌లో వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. అనంతరం ఇండియాకు వచ్చిన తర్వాత భారత పాస్‌పోర్టు కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. ఈ క్రమంలో కరీంనగర్లో ఓ ప్రైవేటు కాలేజీ లెక్చరర్‌గా పనిచేస్తున్న ఎండీ మక్సూద్ అహ్మద్‌ను సంప్రదించారు. మక్సూద్, మహ్మద్ ఇక్రమ్‌కు అతని పేరు మీద టెన్త్, ఇంటర్, డిగ్రీ నకిలీ సర్టిఫికెట్లు అందించాడు. వాటితో ఇక్రమ్ పాస్‌పోర్టు సంపాదించాడు. మక్సూద్ కొంతకాలంగా పలువురికి నకిలీ సర్టిఫికెట్లు సరఫరా చేస్తున్నాడని సీసీఎస్ పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంపై జాతీయ దర్యాప్తు సంస్థ కూడా రంగంలోకి దిగినట్లు తెలిసింది. -
దేవుడి నగలే టార్గెట్..!
సాక్షి, గుంటూరు: దేవుడికి అలంకరించిన నగలను టార్గెట్ చేస్తూ దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్న ఓ గజదొంగను గుంటూరు అర్బన్ జిల్లా సీసీఎస్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. గుంటూరు అర్బన్ ఎస్పీ సి.హెచ్.విజయరావు తెలిపిన వివరాల ప్రకారం గుంటూరు నగరంలోని అరుంధతీ నగర్లో నివసిస్తున్న ఈమని రాంబాబు వ్యసనాలకు బానిసై డబ్బు కోసం 2014 నుంచి దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. అయితే ఇతను దేవాలయాల్లో తప్ప మరెక్కడా దొంగతనాలు చేసేవాడు కాదు. గుంటూరు అర్బన్ జిల్లా పరిథిలోని దేవాలయాల్లో జరిగిన వరుస దొంగతనాలపై సీరియస్‌గా దృష్టి సారించిన అర్బన్ ఎస్పీ విజయరావు డీఎస్పీ దేవరకొండ ప్రసాద్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం ఉదయం గోరంట్ల ఇన్నర్‌రింగ్ రోడ్డులోని చిల్లీస్ దాబా వద్ద పల్సర్ మోటారు వాహనంపై బ్యాగుతో అనుమానస్పదంగా తిరుగుతున్న రాంబాబును అదుపులోకి తీసుకుని సోదా చేయగా, బ్యాగులో దేవాలయాల్లో ఉపయోగించే వెండి, పూజా వస్తువులు కనిపించాయి. దీంతో పోలీసు స్టేషన్‌కు తరలించి విచారణ జరుపగా, దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్న వైనాన్ని పోలీసులకు వివరించాడు. దీంతో రాంబాబును అరెస్టు చేసి రూ.12 లక్షల విలువ చేసే 238 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు, 6.2 కేజీల వెండి పూజా వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నేరస్తుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన సీసీఎస్ సీఐ షేక్ అబ్దుల్ కరీం, ఇతర సిబ్బందిని ఎస్పీ క్యాష్ అవార్డులు ప్రకటించారు. దొంగతనాలకు పాల్పడింది ఇలా... దేవాలయాల్లో చోరీకి పాల్పడే ముందు రాంబాబు రెక్కీ నిర్వహించేవాడు. ఉదయం 5.30 గంటల నుంచి 10 వరకు దేవాలయంలో పరమభక్తుడి మాదిరిగా వెళ్లి పూజలు చేసి పూజారితో మాటలు కలిపి దక్షిణలు ముట్టజెప్పేవాడు. రూ.100 నుంచి రూ.500 నోటును కానుకల పళ్లెంలో వేసి పూజారిని రూ.50 తీసుకుని మిగిలిన చిల్లర తీసుకు రమ్మని బయటకు పంపేవాడు. తదుపరి గుడిలో ఎవరూ లేని సమయంలో దేవుళ్లకు అలంకరించిన బంగారు, వెండి వస్తువులను దొంగిలించి పరారయ్యేవాడు. -
వందల్లో చెల్లించి.. కోట్లలో కొట్టేసి..
సాక్షి, హైదరాబాద్: రాజధాని నడిబొడ్డుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ వందల కోట్ల విలువైన స్థలాలను కొట్టేయడానికి దీపక్‌రెడ్డి, శైలేశ్ తదితరులు భారీ కుట్రలే పన్నారు. ఒకే వ్యక్తిని వివిధ పేర్లతో ‘పరిచయం’చేస్తూ సదరు స్థలంపై జీపీఏలు, సేల్డీడ్లు తయారు చేయించారు. అతడికి వందల్లో చెల్లిస్తూ కోర్టులకు బోగస్ పేర్లతో తిప్పి వందల కోట్ల స్థలాలను కబ్జా చేసే కథ నడిపారు. అత్తాపూర్‌లోని రామ్‌బాగ్ ప్రాంతానికి చెందిన శివభూషణం ఎంజే మార్కెట్లోని రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద వివిధ రకాలైన పత్రాలు విక్రయిస్తుండేవాడు. ఈ నేపథ్యంలోనే తరచుగా అక్కడకు వచ్చే మొఘల్‌పురకు చెందిన న్యాయవాది శైలేశ్ సక్సేనాతో 2000లో ఇతడికి పరిచయమైంది. తనకు అవసరమైనప్పుడల్లా రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చి తాను చెప్పిన పేరుతో సంతకాలు చేయాలని కోరడంతో శివభూషణం అంగీకరించాడు. దీనికి ప్రతిఫలంగా శివభూషణంకు ఉన్న అప్పులు తీర్చడంతో పాటు కుమార్తె, కుమారుడి వివాహాలకు అవసరమైన సాయం చేస్తానంటూ శైలేశ్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. 2004లో గుడిమల్కాపూర్‌లోని భోజగుట్టలో ఉన్న రూ.300 కోట్లకు పైగా ఖరీదైన 78 ఎకరాల రెండు గుంటల స్థలంపై శైలేశ్ కన్నేశాడు. ఈ స్థలాన్ని దాని యజమాని ఇక్బాల్ ఇస్లాం ఖాన్ తనకు విక్రయించినట్లు రికార్డులు రూపొందించి సివిల్ సూట్స్ వేశాడు. తాను నిర్వహిస్తున్న స్థల యజమాని ఇస్లాం ఖాన్ లేడని, కోర్టులో పిటిషన్లు దాఖలు చేయడానికి అతడి సంతకాలు కావాలంటూ శివభూషణంతో శైలేశ్ చెప్పాడు. దీనికి ముందే ఇక్బాల్ ఇస్లాంఖాన్ తన పేరిట రాశాడంటూ ఓ బోగస్ జీపీఏ సృష్టించిన శైలేశ్ దాన్ని శివభూషణానికి చూపాడు. ఇక్బాల్ ఇస్లాంఖాన్‌గా నటించేందుకు శివభూషణం అంగీకరించడంతో బోగస్ పత్రాల ఆధారంగా 2004లో ల్యాండ్ గ్రాబింగ్ కోర్టులో భోజగుట్ట స్థలానికి సంబంధించి పిటిషన్ దాఖలు చేసిన శైలేశ్... శివభూషణాన్ని కోర్టుకు తీసుకువెళ్ళి ఇక్బాల్ ఇస్లాంఖాన్‌గా చూపించారు. న్యాయస్థానంలో ఇక్బాల్ ఇస్లాం ఖాన్‌గా సంతకాలు సైతం చేయించారు. కోర్టు వాయిదాలు ఉన్నప్పుడల్లా శివభూషణాన్నే ఇస్లాం ఖాన్‌గా న్యాయస్థానానికి హాజరయ్యేలా శైలేశ్ ఏర్పాట్లు చేశాడు. ఈ సమయంలో అతడి వెంట సక్సేనా అనుచరుడితో పాటు దీపక్‌రెడ్డి కూడా ఉండేవారు. ఒక్కో వాయిదాకు రూ.500 నుంచి రూ.700 శివభూషణంకు చెల్లించేవాడు. 2006 మార్చిలో దీపక్, శైలేశ్లు మరోసారి శివభూషణాన్ని ఉపయోగించుకున్నారు. గుడిమల్కాపుర్‌లో ఉన్న 78 ఎకరాల 22 గుంటలు, మాదాపూర్‌లోని ఎకరం స్థలంపై వీరి కన్ను పడింది. శివభూషణంతో పాటు మరో ఐదుగురు వ్యక్తులు ఈ స్థలాలను ఎన్‌హెచ్ శైలజ, బి.ప్రకాశ్‌చంద్ సక్సేనా, జి.దీపక్‌రెడ్డిలకు విక్రయించినట్లు బోగస్ పత్రాలు సృష్టించారు. వీటిపై శివభూషణంతో పాటు శైలేశ్ సక్సేనా, దీపక్‌రెడ్డి తీసుకువచ్చిన మరో ఐదుగురు వ్యక్తులు సంతకాలు చేశారు. అతడే ఖాన్.. అతడే ఠాకూర్ వివిధ సందర్భాల్లో వినియోగించడానికి శివభూషణానికి బోగస్ గుర్తింపు కార్డు అవసరమైంది. దీంతో శైలేశ్, దీపక్‌రెడ్డి సంయుక్తంగా శివభూషణం ఫొటోతో, రాధాకృష్ణన్ ఠాకూర్ పేరుతో బోగస్ ఓటర్ ఐడీ రూపొందించారు. దీని ఆధారంగా శివభూషణాన్ని ఠాకూర్‌గా మార్చే శారు. బంజారాహిల్స్‌లోని రోడ్ నెం.12లో ఉన్న రూ.100 కోట్ల ఖరీదైన స్థలం ‘క్రయ విక్రయాల్లో’ఈ ఐడీని వాడారు. శివభూషణంను హైదరా బాద్ (సౌత్) జాయింట్ సబ్–రిజిస్ట్రార్ ఆఫీస్‌కు తీసుకువెళ్లారు. అక్కడ సదరు స్థలాన్ని విక్రయిస్తున్నట్లు ఠాకూర్ పేరుతో శివభూషణం సంతకం చేయగా, ఖరీదు చేస్తున్నట్లు దీపక్‌రెడ్డి సంతకం చేశారు. దీనికి ప్రతిఫలంగా శైలేశ్ రూ.వెయ్యి శివభూషణంకు ఇచ్చాడు. జీపీఏలో పొరపాటు దొర్లిందని చెప్పిన సక్సేనా 2008 అక్టోబర్‌లో మరోసారి శివభూషణంను రిజిస్ట్రార్ కార్యాలయానికి పిలిపించాడు. దీపక్‌రెడ్డి పేరుతో మరో డీడ్ చేయించి రూ.500 చెల్లించాడు. ఈ వ్యవహారాలకు సంబంధించి నమోదైన మొత్తం ఆరు కేసుల్ని దర్యాప్తు చేసిన సీసీఎస్ పోలీసులు గతేడాది శివభూషణంని అరెస్టు చేశారు. మావూరి శివభూషణం మృతి దీపక్‌రెడ్డి కబ్జాల కేసులో కీలక నిందితుడు భోజగుట్టసహా నగరంలో ఉన్న రూ.వందల కోట్ల భూములకు ‘పేపర్ యజమాని’, ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి, న్యాయవాది శైలేశ్ సక్సేనాలు రంగంలోకి దింపిన ‘నకిలీ దాదా’మావూరి శివభూషణం మంగళవారం మృతి చెందాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ అత్తాపూర్‌లోని ఇంట్లో చనిపోయాడు. భోజగుట్ట భూ కబ్జా కేసులో దీపక్‌రెడ్డి, శైలేశ్లతో పాటు గతేడాది సీసీఎస్ పోలీసులకు భూషణం చిక్కాడు. కాగా ఈ కేసుపై సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతి ‘సాక్షి’తో మాట్లాడారు. ‘సాధారణంగా ఎలాంటి కేసులోనూ నిందితులు న్యాయమూర్తి ముందు తమ నేరం అంగీకరిస్తూ వాంగ్మూలం (164 స్టేట్మెంట్) ఇవ్వరు. అయితే శివభూషణం మాత్రం గతంలోనే న్యాయస్థానంలో ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కేసు విచారణపై ఆయన మరణ ప్రభావం ఉండదు. కొన్ని సందర్భాల్లో ఇతడికి కుమారుడిగా నటించిన బషీర్ సైతం ఈ కేసుల్లో కీలకం’అని మహంతి చెప్పారు. -
మహిళా దొంగ అరెస్టు
సాక్షి, ఒంగోలు క్రైం: బస్సుల్లో ప్రయాణిస్తున్న వారి బ్యాగులను మాయం చేసే మహిళా దొంగను ఒంగోలు సీసీఎస్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఈ మేరకు సీసీఎస్ పోలీసులు సాయంత్రం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మహిళా దొంగకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం.. పేర్నమిట్టకు చెందిన వనర్చి శారద ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల బ్యాగులు మాయం చేయడంలో నేర్పరి. ఆమె వద్ద నుంచి నాలుగున్నర సవర్ల బంగారు ఆభరణాలు, వెండి కాళ్ల పట్టీలు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ.లక్ష వరకు ఉంటుంది. టంగుటూరు ఎస్ఐ హజరత్తయ్య ఆధ్వర్యంలో సీసీఎస్ పోలీసులు టంగుటూరు బస్టాండ్ సెంటర్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వనర్చి శారదను అదుపులోకి తీసుకొని విచారించడంతో ఆమె చేసిన దొంగతనాలు బయటపడ్డాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో దొంగతనాలు చేసినట్లు కూడా ఆమె అంగీకరించింది. మహిళా దొంగను పట్టుకున్న సీసీఎస్ ఎస్ఐ నారాయణ, ఏఎస్ఐ వెంకటేశ్వరరెడ్డి, బాలాజీనాయుడు, చంద్రశేఖర్, కోటయ్య, శేషు, రామకృష్ణలను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారని సీసీఎస్ డీఎస్పీ కేశన వెంకటేశ్వరరావు తెలిపారు. -
ఆ చానెల్‌పై క్రిమినల్ కేసులు వేస్తా: వర్మ
సాక్షి, ముంబై: వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఓ న్యూస్ చానెల్‌పై కన్నెర్ర జేశారు. టీవీ9 చానెల్‌పై క్రిమినల్ అభియోగాలతో పలు కేసులు దాఖలు చేయనున్నట్టు ఆయన తాజాగా ట్విట్టర్లో వెల్లడించారు. ప్రస్తుతం తాను ఆ ప్రక్రియలో ఉన్నానని, తన లాయర్లు అందుకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నారని ట్వీట్లో తెలిపారు. కించపరిచే దురుద్దేశంతో టీవీ9 వాస్తవాలను వక్రీకరించి.. తప్పుడు కథనాలను ప్రసారం చేస్తోందని, ప్రస్తుతం జరుగుతున్న విచారణ గురించి న్యూస్లీకులు ఇవ్వడం కూడా నేరమేనని, ఇందుకు టీవీ9ను చట్టప్రకారం ఎదుర్కొంటానని వర్మ పేర్కొన్నారు. టీవీ9 మూర్ఖపు కథనాలు ప్రసారం చేస్తోందని, ముంబైలోని తన 27 అంతస్తు టెర్రాస్‌లో ఆ కథనాలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నానని అంతకుముందు వర్మ ట్వీట్ చేశారు. టీవీ9 పేరును టీవీ9 సర్కస్ జోకర్స్‌గా మార్చాలంటూ ఘాటుగా విమర్శించారు. ఈ నేపథ్యంలో సదరు చానెల్‌పై వర్మ కేసులు దాఖలు చేయాలని భావిస్తున్నారు. ఇటీవల వివాదాస్పద ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’ వెబ్సినిమా విషయంలో వర్మ హైదరాబాద్ సీసీఎస్ పోలీసుల విచారణను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ అడల్ట్ చిత్రంపై కొన్ని టీవీ చానెళ్ల చర్చల సందర్భంగా వర్మ సామాజిక కర్త దేవి, ఐద్వా నేత మణిపై అసభ్య వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వర్మను సీసీఎస్ పోలీసులు మూడు గంటలపాటు విచారించారు. -
మీడియా వార్తలు.. నిలదీసిన వర్మ
సాక్షి, సినిమా : సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసుల విచారణలో జీఎస్టీని అసలు తాను తీయలేదని వర్మ చెప్పాడంటూ కొన్ని ప్రముఖ మీడియా ఛానెళ్లలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఆ చిత్ర తెరకెక్కించిన ఘనత తనకే దక్కినప్పుడు.. అందులో తాను భాగస్వామిని కాలేదన్న విషయాన్ని ఎలా ప్రచురిస్తారంటూ నిలదీస్తున్నాడు. ‘అసత్యపు వార్తలను ప్రసారం చేస్తున్న కొందరు గాడ్ సెక్స్ అండ్ ట్రూత్‌ను అసలు తాను తీయలేదని.. కేవలం సాంకేతిక సాయం మాత్రమే అందించానని చెబుతున్నారు. సినిమా తెరెక్కించిన ఘనత నాదే అయినప్పుడు ఆ వార్తలను నేను ఖండించకుండా ఎలా ఉంటా?’ అని వర్మ తన ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఈమేరకు ఓ జాతీయ పత్రిక కథనాన్ని ఆయన పోస్ట్ చేశారు. కాగా, వర్మ తాను అసలు జీఎస్టీ తీయలేదని.. కేవలం స్క్రిప్టు మాత్రమే అందించానని విచారణలో వెల్లడించినట్లు కొన్ని పత్రికలు కథనాలు రాయగా.. నిర్మాణంలో కూడా భాగస్వామ్యం అయ్యాడంటూ మరికొన్ని కథనాలు ప్రచురించాయి. ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’ (జీఎస్టీ) వీడియో, మహిళను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన కేసులో నోటీసులు అందుకున్న వర్మ గత శనివారం సీసీఎస్ పోలీసుల ముందు హాజరయ్యాడు. సుమారు 3గంటలకు పైగా వర్మను విచారించిన పోలీసులు ల్యాప్ ట్యాప్, సెల్ ఫోన్‌ను సీజ్ చేసి మళ్లీ ఈ శుక్రవారం(23వ తేదీ) విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించారు. For all those false news circulating that I have denied making #GodSexTruth,its only a production and technical process that I was detailing ..How can I deny when I am credited in the film? https://t.co/eJrULnCBUJ — Ram Gopal Varma (@RGVzoomin) 19 February 2018 -
జీఎస్టీ కేసులో వర్మ ల్యాప్‌టాప్ సీజ్
-
మూడున్నర గంటలు.. 30 ప్రశ్నలు
సాక్షి, హైదరాబాద్: వివాదాస్పద షార్ట్‌ఫిల్మ్ ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్(జీఎస్టీ)’ తీసిన దర్శకుడు రాం గోపాల్ వర్మను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు శనివారం విచారించారు. ఈ షార్ట్‌ఫిల్మ్‌పై ఓ టీవీ చానల్లో చర్చ సందర్భంగా తనను వర్మ దూషించారం టూ సామాజిక కార్యకర్త దేవి సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు వర్మను పిలిచి విచారించారు. శనివారం మధ్యాహ్నం 12 నుంచి 3.30 వరకు సుమారు మూడున్నర గంటల పాటు వర్మకు 25 నుంచి 30 ప్రశ్నలు సంధించి సమాధానం రాబట్టే ప్రయత్నం చేశారు. ‘జీఎస్టీని ఎందుకు తీశారు? ఐటీ చట్టం ప్రకారం మహిళలను అశ్లీలంగా చూపెట్టడం తప్పు. మీ ఫేస్బుక్, ట్వీటర్లో పోస్టు చేసిన మాల్కోవా ఫొటోలు ఎక్కడివి? దేవితో పోర్న్ సినిమా తీస్తా అనడం ఎంతవరకు కరెక్ట్? భారత చట్టాలు ఈ సినిమాకు వర్తించవని చెప్తున్నారు.. దానికి ఆధారాలేవి..? అమెరికాలో తీశా అక్కడి నుంచే అప్లోడ్ చేశా అంటున్నారు.. ఎలా తీశారు?’అని పలు ప్రశ్నలను సంధించారు. అయితే జీఎస్టీకి కాన్సెప్ట్ మాత్రమే ఇచ్చానని, సినిమా తాను విడుదల చేయలేదని, నేరుగా దర్శకత్వం వహించలేదని వర్మ సమాధానమిచ్చారు. పోలండ్, ఐరోపాలో జరిగిన షార్ట్‌ఫిల్మ్ చిత్రీకరణకు స్కైప్ ద్వారా దర్శకత్వం అందించానన్నారు. సామాజిక కార్యకర్త దేవిని ఉద్రేకంలోనే తిట్టానని వర్మ పోలీసులకు చెప్పారు. పోలండ్, ఐరోపాలో సినిమా తీసినా అందులోని అశ్లీల దృశ్యాలకు భారత చట్టాలే వర్తిస్తాయని, స్కైప్ ద్వారా దర్శకత్వం చేశానని, నేరుగా డైరెక్ట్ చేయలేదని అంటున్నారని, ఫిల్మ్ బై రాంగోపాల్‌వర్మ అని ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. షార్ట్‌ఫిల్మ్ చిత్రీకరణ జరిగిన సమయంలో వర్మ విదేశాలకు ఏమైనా వెళ్లాడా అని తెలుసుకునేందుకు పాస్‌పోర్టులను పరిశీలిస్తామని సీసీఎస్ అదనపు డీసీపీ రఘువీరా తెలిపారు. వర్మ ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకోవడంతో పాటు శుక్రవారం మళ్లీ విచారణకు హాజరుకావాలంటూ సీసీఎస్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. -
సీసీఎస్‌లో ముగిసిన రామ్‌గోపాల్ వర్మ విచారణ
-
నాకు పోలీసు అధికారిగా నటించాలనుంది!
సాక్షి, హైదరాబాద్ : ఇటీవల వివాదాలను రేపిన గాడ్ సెక్స్ ట్రూత్ (జీఎస్టీ) అనే వెబ్ సిరీస్ విషయంలో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ శనివారం సీసీఎస్ పోలీసుల విచారణను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. దాదాపు ముడుగంటలపాటు వర్మను పోలీసులు విచారించారు. 25 నుంచి 30 ప్రశ్నలు అడిగారు. ఆయన ల్యాప్‌ట్యాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. సీసీఎస్ పోలీసుల ఎదుట తన విచారణపై అనంతరం వర్మ సోషల్ మీడియాలో తనదైన స్టైల్లో స్పందించారు. ఈ విచారణ పట్ల తాను చాలా ఆనందంగా (అమేజింగ్ హ్యాపీ) ఉన్నట్టు ట్వీట్ చేశారు. సీసీఎస్ బృందం ప్రొఫెషనలిజం ఎంతగానో నచ్చిందని, థ్రిల్ అయ్యానని.. సీసీఎస్ పోలీసులు తనను విచారిస్తున్న ఫొటోను ట్వీట్ చేశారు. పోలీసు అధికారి పాత్రలో నటించినట్టు తనకు అనిపిస్తోందని, ఈ మేరకు తన కోరికను దర్శకులందరూ పరిగణనలోకి తీసుకోవాలని మరో ఫొటోతో ట్వీట్ చేశారు. ఈ కామెంట్‌కు దర్శకుడు పూరీ జగన్నాథ్ వెంటనే స్పందించారు. స్క్రిప్ట్ రెడీగా ఉంది సర్.. మీ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నా అంటూ ట్వీట్ చేశారు. ఇందుకు వర్మ థాంక్స్ కూడా చెప్పారు. జీఎస్టీ వెబ్‌సిరీస్‌లో మహిళలను కించపరిచారని, సామాజిక కార్యకర్త దేవిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే అభియోగాలపై వర్మను సీసీఎస్ పోలీసులు విచారించారు. వర్మపై దేవి చేసిన ఫిర్యాదు మేరకు సీసీఎస్ పోలీసులు కేసు నమోదుచేసిన సంగతి తెలిసిందే. -
జీఎస్టీ కేసు.. వర్మ ల్యాప్‌టాప్ సీజ్!
సాక్షి, హైదరాబాద్ : ఇటీవల వివాదాస్పద గాడ్ సెక్స్ ట్రూత్ (జీఎస్టీ) అనే వెబ్ సిరీస్ తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మను సీసీఎస్ పోలీసులు శనివారం మూడుగంటపాలు విచారించారు. పోలీసుల విచారణ ముగిసిన అనంతరం వర్మ మీడియాతో మాట్లాడకుండానే వెనుదిరిగారు. జీఎస్టీ వెబ్‌సిరీస్‌లో మహిళలను కించపరిచారని, సామాజిక కార్యకర్త దేవిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే అభియోగాలపై వర్మను సీసీఎస్ పోలీసులు విచారించారు. వర్మపై దేవి చేసిన ఫిర్యాదు మేరకు సీసీఎస్ పోలీసులు కేసు నమోదుచేసిన సంగతి తెలిసిందే. వర్మను 25 నుంచి 30 ప్రశ్నలు అడిగామని, అతని ల్యాప్‌ట్యాప్‌ను సీజ్ చేశామని సీసీఎస్ అడిషనల్ డీసీపీ రఘువీర్ మీడియాకు తెలిపారు. సామాజిక కార్యకర్త దేవిపై ఉద్దేశపూర్వకంగా ఏ వ్యాఖ్య చేయలేదని, టీవీ చర్చలో భాగంగా ఆవేశంలో, ఉద్వేగపూరితంగానే వ్యాఖ్యలు చేశానని వర్మ వివరణ ఇచ్చినట్టు తెలిపారు. వారం తర్వాత వచ్చే శుక్రవారం విచారణకు రావాలని వర్మను ఆదేశించినట్టు తెలిపారు. ‘వర్మపై నమోదైన కేసు ప్రకారమే విచారణ జరిపాం. టెక్నికల్, లీగల్ అంశాలపై వర్మని ప్రశ్నించాం. జీఎస్టీ అనే వీడియోని ఏ దేశంలో పోస్టు చేసి విడుదల చేశారో ప్రశ్నించాం. జీఎస్టీని పోలాండ్, యూకేలో తీశామని వర్మ చెప్పారు. వెబ్‌లో విడుదల చేసిన మియా మల్కోవా నగ్న ఫోటోలను ఎక్కడ తీశారో ప్రశ్నించాం. ఆ ఫోటోలు తను వేరే చిత్రం షూటింగ్లో ఉన్నప్పుడు కలిసి తీసుకున్నానని వర్మ తెలిపారు. ఆ ఫోటోలను, సినిమా వీడీయోకి సంబంధించిన ఆధారాలను ఎఫ్ఎస్ఎల్ కి పంపించాం’ అని ఆయన వివరించారు. వర్మ పాస్‌పోర్ట్ వెరీఫై చేస్తామని, అతను నిజంగానే ఇతర దేశాలకి వెళ్లి జీఎస్టీని తీశాడా లేదా ఇక్కడే ఉండి తీశాడా అన్నది విచారిస్తామని పోలీసులు తెలిపారు. ఇంకా మిగతా టెక్నికల్ ఆధారాలకి సంబంధించి మూడు రోజుల సమయం కావాలని వర్మ కోరారని, ఈ విషయంలో లీగల్ సలహా తీసుకొని తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. -
వర్మ వర్సెస్ దేవి
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మపై ఫిర్యాదుల పర్వం కొనసాగుతోంది. తాజాగా ఆర్జీవీపై సీసీఎస్ పోలీసులకు సామాజిక కార్యకర్త, మహిళ సంఘం నాయకురాలు దేవి ఫిర్యాదు చేశారు. మహిళలను కించపరిచే విధంగా రూపొందించిన గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ చిత్రం విడుదల కాకుండా చూడాలని కోరారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వర్మపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. ఆర్జీవీపై కేసు నమోదు వర్మపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేశామని దేవి తెలిపారు. చట్టాలను గౌరవించని వ్యక్తులకు ఈ దేశంలో నివసించే హక్కులేదన్నారు. మహిళలను కించపర్చే విధంగా వ్యవహరిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. మహిళలను సరుకుగా వర్ణించేవిధంగా వర్మ వ్యాఖ్యలున్నాయని చెప్పారు. దేవి ఫిర్యాదు మేరకు రాంగోపాల్ వర్మపై పోలీసులు ఐటీ యాక్ట్ 67, ఐపీసీ 508, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రాంగోపాల్ వర్మ బూతు సినిమాలు ఇస్తూ సమజాన్ని చెడగొడుతున్నారని ఇటీవల ఓ టీవీ చర్చాక్రమంలో దేవి విమర్శించారు. మహిళలను అభ్యంతరకరంగా చూపిస్తూ అంగడి సరుకుగా మార్చేశారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీనికి వర్మ స్పందిస్తూ... దేవి చెత్తగా ఆలోచిస్తారని, సమాజంలోని అన్నివర్గాలకు తానే ప్రతినిధి అన్నట్టుగా వ్యవహరిస్తారని అన్నారు. ఇంతకుముందు పలు సందర్భాల్లో టీవీ చర్చల్లో వీరిద్దరూ పరస్పర విభేదించుకున్నారు. పోర్న్‌స్టార్ మియా మల్కోవాతో తెరకెక్కించిన గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ చిత్రంపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. ఎన్ని విమర్శలు వచ్చినా వర్మ వెనక్కు తగ్గలేదు. జనవరి 26న ఈ చిత్రాన్ని ఆన్లైన్లో విడుదల చేయనున్నట్టు ఆర్జీవీ ప్రకటించారు. -
పోలీసులను పరుగులు పెట్టించారు!
సాక్షి, హైదరాబాద్ : దేశంలో విహారయాత్రకు వచ్చిన నలుగురు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) యువతులు ముంబైతో పాటు సిటీ పోలీసుల్నీ పరుగులు పెట్టించారు. వారం రోజుల క్రితం ముంబైలో అదృశ్యమైన వారి ఆచూకీ కోసం ఏకంగా యూఏఈ కాన్సులేట్ రంగంలోకి దిగింది. దీంతో ఉరుకులు పరుగులు పెట్టిన ముంబై పోలీసులు ఇమ్మిగ్రేషన్ అధికారుల సాయంలో హైదరాబాద్ లింకు సంపాదించారు. సోమవారం సిటీకి వచ్చిన ముంబై పోలీసు టీమ్ నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అధికారుల సాయంతో నలుగురి ఆచూకీ కనిపెట్టగలిగారు. దీంతో ఊపిరి పీల్చుకున్న ముంబై పోలీసులు కాన్సులేట్ ముందు హాజరుపరచడానికి నలుగురినీ తీసుకుని వెళ్ళారు. నగరంలోని పాతబస్తీలో ఉన్న మిష్రీగంజ్ ప్రాంతానికి చెందిన ఇద్దరు మహిళలు కొన్నేళ్ళ క్రితం దుబాయ్‌కు వలసవెళ్ళారు. అక్కడే దుబాయ్ షేక్ల్ని వివాహం చేసుకుని స్థిరపడ్డారు. వీరికి జన్మించిన ఇద్దరు యువతులకు యూఏఈ పౌరసత్వం వచ్చింది. ప్రస్తుతం దాదాపు 18 ఏళ్ళ వయస్సులో ఉన్న వీరిద్దరితో పాటు వీరి స్నేహితులైన మరో ఇద్దరూ విహారయాత్ర కోసం భారత్‌కు బయలుదేరారు. గత మంగళవారం ముంబైలో ఉన్న ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. ఆపై వీరు తల్లిదండ్రులతో టచ్‌లో లేకుండా పోయారు. రెండు రోజుల పాటు ఎదురు చూసిన తల్లిదండ్రులు ఆచూకీ లేకపోవడంతో తీవ్రంగా ఆందోళనకు లోనయ్యారు. విషయాన్ని యూఏఈ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళడంతో వారు ముంబైలో ఉన్న యూఏఈ కాన్సులేట్‌ను అప్రమత్తం చేశారు. దుబాయ్ నుంచి సమాచారం అందడంతో రంగంలో దిగిన కాన్సులేట్ అధికారులు నలుగురు యువతుల ఆచూకీ కనిపెట్టాల్సిందిగా కోరుతూ ముంబై పోలీసు కమిషనర్ దత్త పద్సాల్గికర్‌కు అధికారిక పత్రం అందించారు. మరోపక్క యూఏఈ కాన్సులేట్ నుంచి సమాచారం అందుకున్న విదేశీ వ్యవహారాలు మంత్రిత్వ శాఖ, హోం మంత్రిత్వ శాఖల అధికారులూ ముంబై పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిన ముంబై పోలీసు కమిషనర్ వివిధ కోణాల్లో దర్యాప్తు చేయించారు. మూడు రోజుల పాటు అక్కడి అనేక ప్రాంతాల్లో గాలించినా ఫలితం దక్కలేదు. అయితే ప్రత్యేక బృందం శనివారం ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఇమ్మిగ్రేషన్ అధికారుల్ని కలిసి ఈ యువతుల విషయం ఆరా తీశారు. ఈ నేపథ్యంలోనే వారు ఇమ్మిగ్రేషన్ చెక్‌లో భాగంగా తాము నలుగురం హైదరాబాద్‌లోని హుస్సేనిఆలంలో ఉంటున్న ఇరువురి బంధువుల వద్దకు వెళ్తున్నట్లు నమోదు చేయించినట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్న ముంబై పోలీసులు సీసీఎస్ పోలీసుల సహాయం కోరారు. సోమవారం ఉదయం సీసీఎస్ స్పెషల్ టీమ్స్ సాయంతో పాతబస్తీకి వెళ్ళిన ముంబై పోలీసులు అక్కడి హుస్సేని ఆలంలో ఉన్న యువతుల బంధువుల ఇల్లు గుర్తించారు. యూఏఈకి చెందిన నలుగురూ అక్కడే ఉండటంతో ఊపిరి పీల్చుకున్నారు. అదృశ్యంపై ముంబై పోలీసులు నలుగురు యువతుల్నీ ప్రశ్నించారు. తాము అదృశ్యం కాలేదని, యూఏఈలో తీసుకున్న తన సెల్‌ఫోన్ సిమ్‌కార్డులకు ఇంటర్నేషనల్ రోమింగ్ లేదని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ కొత్త సిమ్‌కార్డులు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నామని, దానికి కొంత సమయం పట్టడంతోనే తల్లిదండ్రుల్ని సంప్రదించలేకపోయామని వివరించారు. ఈ నలుగురినీ ముంబై తీసుకువెళ్ళిన పోలీసులు అక్కడి కాన్సులేట్ అధికారులు ముందు హాజరుపరచనున్నారు. -
‘ఇండియా వన్ రేస్’ పేరిట కుచ్చుటోపీ
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా వన్ రేసింగ్ తరహాలో ఇండియా వన్ రేస్ కార్ల పోటీలు నిర్వహిస్తామంటూ నగర వ్యాపారవేత్త రఘురామ కృష్ణమరాజు నుంచి రూ.7.5 కోట్లు వసూలు చేసి మోసం చేసిన కేసులో ఓ సంస్థతోపాటు ముగ్గురిపై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బెంగళూరుకు చెందిన మజ్దార్ కంపెనీతోపాటు ఆ సంస్థలో డైరెక్టర్లుగా ఉన్న డెక్కన్ క్రానికల్ ఎండీ వినాయక్ రవిరెడ్డి కుమార్తె అంజనారెడ్డి, వినోద్ మినాన్, దర్శన్ ఉతప్పలపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇప్పటికే అంజనారెడ్డికి హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు నోటీసులు జారీ చేసి ఆమె వాంగ్మూలాన్ని కూడా రికార్డు చేశారు. వినోద్ మినాన్, దర్శన్ ఉతప్పలను శనివారం పిలిపించి విచారించినట్టు తెలిసింది. వాంగ్మూలాల రికార్డు... ‘ఐపీఎల్లో డెక్కన్ చార్జెస్ మాకున్న సమయంలో మజ్దార్ కంపెనీ వాళ్లు సంప్రదించారు. కంపెనీలో 20 శాతం వాటా ఇస్తామన్నారు. ఆ తర్వాత వాళ్లు ఆ డబ్బులు ఇవ్వకపోవడంతో డైరెక్టర్ పదవికి రాజీనామా చేశా. ఆ కంపెనీతో నాకు ఎటువంటి సంబంధం లేదు’అంటూ అంజనారెడ్డి వివరణ ఇచ్చినట్టు తెలిసింది. ‘మచదర్ మోటార్ కారు కంపెనీకి డబ్బులు ఇచ్చిన మాట వాస్తవమే. ఆ తర్వాత నష్టాలు రావడంతో ఆ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. తెలిసిన వాళ్లు కదా అని వెళ్లి మాట్లాడాను. అంతే తప్ప నాకు ఎటువంటి సంబంధం లేదు.’అని చాముండేశ్వరినాథ్ ఇచ్చిన వాంగ్మూలాన్ని కూడా పోలీసులు రికార్డు చేశారు. సచిన్, షారుఖ్, నాగార్జున బ్రాండ్ అంబాసిడర్లంటూ... ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మాదిరిగా దేశంలోని ప్రధాన నగరాల్లో ఇండియా వన్ కార్ రేసింగ్ నిర్వహించేందుకు ఆరేళ్ల క్రితం బెంగళూరు కేంద్రంగా మచదర్ మోటార్ కారు కంపెనీని ఏర్పాటు చేశారు. ఇందులో వినోద్ మినాన్, దర్శన్ ఉతప్పలతోపాటు అంజనారెడ్డి డైరెక్టర్లుగా ఉన్నారు. ఈ మేరకు రియల్ ఎస్టేట్ వ్యాపారులను వీరు సంప్రదించారు. తమ రేస్‌కు బ్రాండ్ అంబాసిడర్లుగా సచిన్ టెండూల్కర్, షారుఖ్ ఖాన్, నాగార్జునలను నియమిస్తున్నట్టుగా నమ్మించినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే 2011లో రఘురామ కృష్ణమరాజు దగ్గరికి చాముండేశ్వరినాథ్‌తో కలసి అంజనారెడ్డి వెళ్లారు. ఫార్ములా వన్ రేసింగ్ తరహాలో ఇండియా వన్ రేస్ కార్ల పోటీలు నిర్వహిస్తున్నామని వివరించడంతో చెన్నై ఫ్రాంచైజీస్ కొనుగోలు చేసేందుకు రూ.7.5 కోట్లను రఘురామ కృష్ణమరాజు చెల్లించారు. ఆ తర్వాత కారు రేసింగ్ నిర్వహించకపోవడంతో రఘురామ కృష్ణమరాజు 2016లో నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు అంజనారెడ్డి, వినోద్ మినాన్, దర్శన్ ఉతప్పలపై కేసు నమోదు చేయాలంటూ కోర్టు ఆదేశించింది. -
అంజనారెడ్డిపై చీటింగ్ కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్ : నగరంలో ఫార్ములా వన్ రేస్ పేరిట జరిగిన భారీ మోసం ఏడేళ్ల అనంతరం మరోసారి తెరమీదకు వచ్చింది. 2011లో కార్ రేసింగ్ నిర్వహిస్తామని పలువురు దగ్గర కోట్ల రూపాయలు వసూలు చేసిన డెక్కన్ క్రానికల్ ఎండీ వినాయక్ రవిరెడ్డి కుమార్తె అంజనారెడ్డితో పాటు మరో ముగ్గురిపై కేసులో సీసీఎస్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. కాగా ఐపీఎల్ మాదిరిగా ఫార్ములా వన్ రేస్ నిర్వహిస్తామని అంజనారెడ్డి నమ్మబలికి, మచదర్ మోటర్ కార్ సంస్థ పేరుతో మోసం చేసినట్లు అప్పట్లోనే అభియోగాలు నమోదు అయ్యాయి. ఫార్ములా వన్ రేసు పేరుతో అంజనారెడ్డి రూ.8కోట్లు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బీజేపీ నేత రఘురామ కృష్ణమరాజు ఫిర్యాదు చేయడంతో అప్పట్లో కేసు కూడా నమోదు అయింది. దీనిపై కోర్టు నోటీసులు ఇవ్వడంతో దర్యాప్తు కోసం కేసును సీసీఎస్ పోలీసులు మళ్లీ వెలుగులోకి తెచ్చారు. కాగా ఈ కేసుకు సంబంధించి పలువురిని అరెస్ట్ చేయడంతో పాటు, నోటీసులు ఇచ్చినట్లు కొన్ని మీడియా సంస్థల్లో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని సీసీఎస్ పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేశామని, ఎవరినీ అరెస్ట్ చేయలేదని స్పష్టం చేశారు. కాగా ప్రముఖ వ్యాపారవేత్త చాముండేశ్వరినాథ్ మధ్యవర్తిత్వం ద్వారా అంజనారెడ్డి రూ.8 కోట్లు వసూలు చేశారు.అయితే రేసింగ్ నిర్వహణలో విఫలం అయినందున కొంత డబ్బును వెనక్కి ఇప్పించేందుకు హామీ ఇచ్చారని, అయితే ఆ డబ్బు చెల్లించడంలో అంజనారెడ్డి విఫలం కావడంతో కోర్టు ఆదేశాలతో సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
అంజనారెడ్డిని వెంటాడుతున్న రేసింగ్ కేసు
-
కథ–స్క్రీన్‌ప్లే–దర్శకత్వం.. దీపక్‌రెడ్డి!
కబ్జాలకు భారీ కథలే నడిపిన టీడీపీ ఎమ్మెల్సీ - ముస్తఫానగర్ వాసులపై హత్య, కిడ్నాప్ కేసులు - రాజీకి రావాలంటే ఒక్కో ఇంటికి రూ.లక్ష డిమాండ్ సాక్షి, హైదరాబాద్: టీడీపీ ఎమ్మెల్సీ జి.దీపక్‌రెడ్డి తాను కన్నేసిన స్థలాన్నల్లా కబ్జా చేయడానికి న్యాయవాది శైలేష్ సక్సేనాతో కలసి నడిపిన కథలు అన్నీ ఇన్నీ కావు. భోజగుట్ట స్థలాన్ని కైకర్యం చేసుకోవడానికి ముస్తఫానగర్ వాసులపై హత్య, కిడ్నాప్ కేసులు సైతం నమోదు చేయించారు. దీపక్‌రెడ్డి, శైలేష్‌లను గత మంగళవారం హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసిన విషయం విదితమే. వీరిని తదుపరి విచారణ నిమిత్తం నాలుగు రోజుల పోలీసు కస్టడీకి అప్పగిస్తూ నాంపల్లి కోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మరోపక్క ఇది భారీ భూ కుంభకోణం కావడంతో పూర్తి వివరాలతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి లేఖ రాయాలని నిర్ణయించామని నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) డీసీపీ అవినాష్ మహంతి తెలిపారు. ఆదాయపు పన్ను శాఖ అధికారులు సైతం ఈ కేసుల ఆరాకై సీసీఎస్ అధికారుల్ని సంప్రదిస్తున్నారని తెలిసింది. నకిలీ యజమానుల మధ్య వ్యాజ్యం..! గుడిమల్కాపూర్‌లోని భోజగుట్టలో 78.22 ఎకరాలపై కన్నేసిన దీపక్‌రెడ్డి అండ్ కో దీన్ని కైవసం చేసుకోవడానికి భారీ కథే నడిపింది. మావూరి శివభూషణంను ఇక్బాల్ ఇస్లాంఖాన్‌గా చూపిస్తూ అతడి నుంచి ఆ స్థలం ఖరీదు చేసినట్లు దీపక్‌రెడ్డి జీపీఏ చేయించుకున్నారు. స్థలం పూర్తిగా తన ఆధీనం కావడానికి... ఇక్బాల్‌కు ఓ నకిలీ సోదరినీ రంగంలోకి దింపారు. సదరు స్థలం దీపక్‌రెడ్డికి విక్రయించడంపై తనకు అభ్యంతరం ఉందని ఆమె ద్వారా రంగారెడ్డి జిల్లా కోర్టులో సివిల్ పిటిషన్ వేయించారు. కొన్ని రోజులు వ్యాజ్యం నడిచిన తర్వాత రాజీ పడతామని ‘అన్నా చెల్లెళ్లు’లోక్‌అదాలత్‌ను ఆశ్రయించగా... సదరు స్థలాన్ని దీపక్‌రెడ్డికి విక్రయించవచ్చంటూ తీర్పు వచ్చింది. దీని ఆధారంగా దీపక్‌రెడ్డి ఆ స్థలాన్ని తన పేరుకి మార్చుకున్నాడు. ముస్తఫానగర్ వాసులకు ముప్పుతిప్పలు భోజగుట్టలో ఉన్న 78.22 ఎకరాల్లో దాదాపు ఆరు ఎకరాలను ప్రభుత్వం ముస్తఫానగర్ వాసులకు కేటాయించింది. దానికి సంబంధిం చి ఈ బస్తీ వాసులకు, దీపక్‌రెడ్డికి మధ్య వ్యాజ్యాలు నడుస్తున్నాయి. వీరందరినీ భయభ్రాంతులతో కేసులు ఉపసంహరించుకునేలా చేయాలని దీపక్‌రెడ్డి, శైలేష్ భావించారు. ఇందుకు ఇక్బాల్ పాత్రను 2012లో చంపేశారు. సదరు ఇక్బాల్‌ను ముస్తఫానగర్ వాసులే హత్య చేశారని, దీనిపై సమగ్ర దర్యాప్తు చేయించాలం టూ శైలేష్ తండ్రి ప్రకాష్ సక్సేనా కోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఆసిఫ్‌నగర్ పోలీసుస్టేషన్లో ముస్తఫానగర్ వాసులపై హత్య కేసు సైతం నమోదైంది. తన వాచ్‌మెన్‌ను ముస్తఫానగర్ వాసులు కిడ్నాప్ చేశారంటూ రెండు నెలల క్రితం తాడిపత్రిలో మరో కేసు నమోదు చేయించారు. రాజీకి రావాలంటే ...: శివారు ప్రాంతాల్లోనూ ఖరీదైన, ఖాళీగా ఉన్న స్థలాలను గుర్తించే దీపక్‌రెడ్డి అండ్ కో వాటికి సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించి, బోగస్ వ్యక్తుల్ని వాటికి యజమానులుగా చూపుతుం ది. వారి జీపీఏల ఆధారంగా న్యాయస్థానాల్లో కేసులు వేసి స్థలాల యజమానులను ఇబ్బందులకు గురి చేస్తుంది. కేసుల భారం భరించలేక ఎవరైనా రాజీకి వస్తే భారీ మొత్తం డిమాండ్ చేస్తుంది. బంజారాహిల్స్‌లో ఉన్న స్థలానికి దాని యజమానికి రూ.10 కోట్లు డిమాండ్ చేసినట్లు సీసీఎస్ పోలీసుల విచారణలో తేలింది. భోజగుట్ట వాసులు రాజీ కోరగా... ఒక్కో ఇంటికి రూ.70వేల నుంచి రూ.లక్ష వరకు చెల్లిస్తేనే ఆలోచిస్తామంటూ దీపక్‌రెడ్డి చెప్పినట్లు తెలిసింది. మరోపక్క దీపక్‌రెడ్డి కబ్జా చేసి, తాను ఖరీదు చేసినట్లు రికార్డులు రూపొందించిన బంజారాహిల్స్ రోడ్ నెం.2 లోని 3.37 ఎకరాల స్థలం ఎవరి నుంచి, ఎంతకు ఖరీదు చేశారని ప్రశ్నించగా... తనకు ‘గుర్తులేదు’అని దీపక్‌రెడ్డి చెప్పాడని దర్యాప్తు అధికారులు తెలిపారు. బంజారాహిల్స్ కేసులో దీపక్‌రెడ్డి అరెస్టు... బంజారాహిల్స్‌లోని రోడ్ నెం.2లో అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఉన్న సర్వే నెం.129/71లోని 3.37 ఎకరాల స్థలానికి సంబంధించిన కేసులో దీపక్‌రెడ్డికి గతంలో న్యాయస్థానం ముందస్తు బెయిల్ ఇచ్చింది. సీసీఎస్ పోలీసుల అభ్యర్థన మేరకు దీన్ని న్యాయస్థానం రద్దు చేసింది. దీంతో జ్యుడీషి యల్ రిమాండ్‌లో ఉన్న దీపక్‌రెడ్డిని ఈ కేసులో పీటీ వారెంట్‌పై సోమవారం అరెస్టు చేశారు. అలాగే... దీపక్‌రెడ్డితో పాటు శైలేష్ సక్సేనా, శ్రీని వాస్‌లను తదుపరి విచారణ నిమిత్తం నాలుగు రోజుల కస్టడీకి అప్పగి స్తూ కోర్టు ఉత్తర్వులిచ్చింది. బోగస్ డాక్యుమెంట్ల సృష్టికి సంబంధిం చి చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ఫిర్యాదుతో 2011 లో దీపక్‌రెడ్డిపై అబిడ్స్ ఠాణాలో నమోదైన కేసును ఉన్నతాధికారులు తాజాగా సీసీఎస్‌కు బదిలీ చేశారు. -
పోలీసుల కస్టడీకి దీపక్‌రెడ్డి
హైదరాబాద్: c ప్రస్తుతం చంచల్‌గూడ జైళ్లో ఉన్న దీపక్ రెడ్డిని సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ పూర్తి చేసిన అనంతరం తిరిగి కోర్టుకు తీసుకెళ్తామని పోలీసులు తెలిపారు. -
అఫిడవిట్టే అడ్డంగా పట్టించింది!
- టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి బుక్కైంది దాంతోనే.. - నోటీసులిస్తే సంబంధం లేదంటూ సమాధానం - ఈసీ నుంచి అఫిడవిట్ తీసుకున్న సీసీఎస్ - అందులో ‘ఆ స్థలాలు’ తనవేనంటూ స్పష్టీకరణ - షకీల్ ఇస్లాం ఖాన్‌గా నటించిన బషీర్ అరెస్ట్ సాక్షి, హైదరాబాద్: అసలే ఎమ్మెల్సీ.. అందునా పొరుగు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ నేత.. దీంతో దీపక్‌రెడ్డి అరెస్టు విషయంలో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు వ్మూహాత్మకంగా వ్యవహరించారు. నోటీసులు ఇచ్చినప్పుడు సంబంధం లేదంటూ తప్పించుకోజూసిన దీపక్‌రెడ్డి బండారం బయట పెట్టింది ఆయన దాఖలు చేసిన అఫిడవిట్టే. దీపక్‌రెడ్డితో పాటు కబ్జా వ్యవహారాల్లో సహ నిందితుడు న్యాయవాది శైలేష్ సక్సేనా వ్యవ హారాలను పోలీసులు లోతుగా ఆరా తీస్తు న్నారు. వీరు బినామీలుగా వినియోగిం చుకున్న వారికోసం గాలిస్తున్నారు. కాగా, భోజగుట్ట భూమిని కబ్జా చేయడానికి షకీల్ ఇస్లాం ఖాన్‌గా నటించిన బషీర్ అనే వ్యక్తిని శుక్రవారం అరెస్ట్ చేసిన పోలీసులు వివిధ కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. నోటీసులిస్తే సంబంధంలేదంటూ.. దీపక్‌రెడ్డిపై ఉన్న కేసులకు సంబంధించి సీసీఎస్ పోలీసుల తొలుత ఆయనకు మూడు నోటీసులు జారీ చేశారు. తనకు ఆ కేసులతో సంబంధాలు లేవని, ఎవరో తన సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ దీపక్‌రెడ్డి ప్రచారం మొదలెట్టారు. ఓ కేసులో ఆయన న్యాయస్థానం నుంచి ముందస్తు బెయిల్ సైతం పొందారు. మిగిలిన కేసుల్లో మరిన్ని ఆధారాలు సేకరించాలని నిర్ణయించుకు న్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో దీపక్ రెడ్డి నామినేషన్‌తో పాటు దాఖలు చేసిన అఫిడవిట్‌పై కన్నేశారు. ఎన్నికల సంఘానికి లేఖ రాయడం ద్వారా అధికారికంగా దీన్ని తీసుకున్న సీసీఎస్ పోలీసులు అధ్యయనం చేశారు. ఏ స్థలాలకు సంబంధించి దీపక్‌రెడ్డి తన సంతకాలు ఫోర్జరీ చేశారని, కబ్జాలతో తనకు సంబంధం లేదని చెప్తున్నారో.. అవే వివరాలు అఫిడవిట్లలో కనిపించాయి. అవన్నీ తన స్థలాలే అని, అనివార్య కారణాల వల్ల కేసులు ఉన్నాయంటూ పిటిషన్ నంబర్లతో పాటు దీపక్‌రెడ్డి పేర్కొన్నారు. అప్పటికే బోగస్ డాక్యుమెంట్ల సృష్టికి సంబంధించి తిరుగులేని ఆధారాలు సేకరించిన సీసీఎస్ పోలీసులు ప్రధానంగా ఆ అఫిడవిట్ ఆధారం గానే దీపక్‌రెడ్డిపై చర్యలు తీసుకున్నారు. ఆయుధ లైసెన్సులపై సీసీఎస్ దృష్టి.. దీపక్‌రెడ్డి, శైలేష్ సక్సేనాలకు సంబంధించిన ఆయుధ లైసెన్సులపై సీసీఎస్ పోలీసులు దృష్టి పెట్టారు. పాతబస్తీలో నివసించే శైలేష్ సక్సేనాకు 2011లో ఆయుధ లైసెన్సు మంజూరైంది. దీనిపై రెండు ఆయుధాలు ఖరీదు చేసిన ఆయన మొఘల్‌పుర ఠాణాలో రిజిస్టర్ చేయించారు. నిబంధనల ప్రకారం నేరచరితులకు ఆయుధ లైసెన్సులు జారీ చేయకూడదు. ఉన్న లైసెన్సులు రద్దు చేయాలి. దీంతో సీసీఎస్ పోలీసులు శైలేష్ సక్సేనా ఆయుధ లైసెన్సు రద్దు చేయాల్సిందిగా మొఘల్‌పుర ఠాణాకు సిఫార్సు చేస్తూ శుక్రవారం లేఖ రాశారు. దీపక్‌రెడ్డికి సైతం ఆయుధ లైసెన్సు ఉందా? అనేది ఆరా తీస్తున్నారు. మరోవైపు దీపక్‌రెడ్డి, శైలేష్ సక్సేనాపై వచ్చిన మరో రెండు ఫిర్యాదులకు సంబంధించి కేసులు నమోదు చేయడానికి రంగం సిద్ధం చేశారు. దీపక్‌రెడ్డి, శైలేష్ సక్సేనాపై మరో ఫిర్యాదు ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి అండ్ కోపై సీసీఎస్ పోలీసులకు శుక్రవారం మరో ఫిర్యాదు అందింది. బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి దీన్ని ఇచ్చారు. ఎమ్మెల్యే కాలనీలో ఉన్న 898.3 చదరపు గజాల స్థలంపై బోగస్ డాక్యుమెంట్లు తీసుకున్న దీపక్‌రెడ్డి, శైలేష్ సక్సేనా దాన్ని తమ పేరుపై మార్చుకున్నట్లు బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ స్థలానికి బాలయ్య అనే వ్యక్తి యజమాని అంటూ శైలేష్ సక్సేనా బోగస్ డాక్యుమెంట్లు సృష్టించారు. ఆ స్థలాన్ని బాలయ్య మరో వ్యక్తి అయిన రాధాకృష్ణ ఠాకూర్‌కు 16.4.1987లో అమ్మినట్లు సేల్ డీడ్ రూపొందించారు. ఇక్కడ మావూరి శివభూషణాన్ని రాధాకృష్ణ ఠాకూర్‌గా పేర్కొన్నారు. 8.11.2006లో ఠాకూర్ ఈ స్థలాన్ని దీపక్‌రెడ్డి పేరుతో సేల్ కమ్ జీపీఏ చేశారు. కొన్ని మార్పులు అవసరం కావడంతో 2008 మార్చ్ 3న దీపక్‌రెడ్డి పేరుతోనే మరో రాటిఫికేషన్ డీడ్ చేయించారు. ఈ సందర్భంలో శైలేష్ సక్సేనా సాక్షి సంతకం చేశాడు. ఇలా సృష్టించిన పత్రాల ఆధారంగా దీపక్‌రెడ్డి సైనిక్‌పురిలోని ఓ బ్యాంకు నుంచి రూ.6 కోట్ల రుణం తీసుకున్నట్లు బాధితుడు ఆరోపించాడు. ఈ ఫిర్యాదు స్వీకరించిన సీసీఎస్ పోలీసులు ప్రాథమిక విచారణ చేస్తున్నారు. -
భూ కబ్జా కేసులో టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి అరెస్టు
♦ సూత్రధారి న్యాయవాది శైలేష్ సక్సేనా సైతం కటకటాల్లోకి ♦ నిందితుడు శివభూషణం విచారణలో వివరాలు వెలుగులోకి సాక్షి, హైదరాబాద్: ఓ న్యాయవాది... మరో రాజకీయ ‘సంబంధీకుడు’... కొందరు బోగస్ వ్యక్తులు... అంతా కలిసి కుట్రతో చేసిన కబ్జా లు అన్నీ ఇన్నీ కావు. హైదరాబాద్ నడిబొడ్డుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ వందల కోట్ల విలువైన స్థలాలను వీరు కైకర్యం చేయడానికి భారీ కుట్రలే పన్నారు. ఒకే వ్యక్తిని వివిధ పేర్లతో ‘పరిచయం’చేస్తూ సదరు స్థలంపై జీపీఏలు, సేల్డీడ్లు తయారు చేయించారు. ఈ వ్యవహారాలపై నమోదైన మొత్తం ఆరు కేసుల్ని దర్యాప్తు చేస్తున్న హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అధికారులు మంగళవారం టీడీపీ ఎమ్మెల్సీ జి.దీపక్‌రెడ్డి, న్యాయవాది శైలేష్ సక్సేనాతో పాటు మరో నిందితుడిని అరెస్టు చేశారు. గత నెలలో సీసీఎస్ పోలీసులకు చిక్కిన వీరి అనుచరుడు మావూరి శివభూషణం విచారణ లో న్యాయవాది శైలేష్ సక్సేనతో పాటు తెలు గుదేశం పార్టీ నేత, అనంతపురం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ జి.దీపక్‌రెడ్డి లీలలు వెలుగు లోకి వచ్చాయి. అనంతపురం జిల్లా రాయ దుర్గంకు చెందిన ఈయన ఆ జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డికి స్వయానా అల్లుడ నే విషయం విదితమే. అత్తాపూర్‌లోని రామ్‌బాగ్ ప్రాంతానికి చెందిన శివభూషణం ఎంజే మార్కెట్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద వివిధ రకాలైన పత్రాలు విక్రయిస్తుండేవాడు. ఈ నేపథ్యంలోనే తరచుగా అక్కడకు వచ్చే మొఘల్‌పురా న్యాయవాది శైలేష్ సక్సేనాతో ఇతడికి పరిచయమైంది. తనకు అవసరమైన ప్పుడల్లా రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చి తా ను చెప్పిన పేరుతో సంతకాలు చేయాలని కోరడంతో శివభూషణం అంగీకరించాడు. ప్రతిఫలంగా శివభూషణంకు ఉన్న అప్పులు తీర్చడంతో పాటు అతడి పిల్లల వివాహాలకు అవసరమైన సహాయం చేస్తానంటూ శైలేష్ ఒప్పందం కుదుర్చుకు న్నాడు. 2004లో గుడిమల్కాపూర్‌లోని భోజగుట్టలో ఉన్న రూ.300 కోట్ల ఖరీదైన 78 ఎకరాల 2 గుంటల స్థలంపై శైలేష్ కన్నేశాడు. స్థల యజమాని ఇక్బాల్ ఇస్లాంఖాన్ తనకు విక్రయించినట్లు రికార్డులు రూపొందించి సివిల్ సూట్స్ వేశా డు. ఇక్బాల్‌గా నటించేందుకు శివభూషణంను ఒప్పించి, బోగస్ పత్రా ల ఆధారంగా 2004లో ల్యాండ్ గ్రాబింగ్ కోర్టులో భోజగుట్ట స్థలంపై శైలేష్ పిటిషన్ వేశాడు. శివభూషణాన్ని కోర్టులో ఇక్బాల్‌గా చూపాడు. వాయిదాలకు వెళ్లినప్పుడల్లా అతడి వెంట సక్సేనా అనుచరుడితో పాటు జి.దీపక్ రెడ్డి ఉండేవారు. దీపక్‌రెడ్డిపై గతంలోనూ కేసులు... వీరి వ్యవహారాలపై మొత్తం ఆరు కేసులు నమోదయ్యాయి. ఒక్కో కేసులో దీపక్‌రెడ్డి, శైలే ష్ సక్సేనా ముందస్తు బెయిల్స్ పొందారు. మిగిలిన కేసుల్లో ఒకదాంట్లో ఆధారాలు సేక రించిన సీసీఎస్ పోలీసులు మంగళవారం ముగ్గురినీ అరెస్టు చేశారు. ఎమ్మెల్సీ దీపక్రె డ్డిపై మాదాపూర్ ఠాణాలో బెదిరింపుల కేసు, సైఫాబాద్ పోలీసుస్టేషన్లో ‘సాక్షి’ఫొటో జర్నలిస్ట్‌పై దాడికి యత్నించిన కేసు సైతం ఉన్నాయి. నకిలీ ఓటర్ ఐడీతో మరో దందా... ఒక్కో వాయిదాకు హాజరైనందుకు శైలేష్ రూ.500 నుంచి రూ.700 శివభూషణంకు చెల్లించేవాడు. గుడిమల్కాపూర్తోపాటు మాదాపూర్‌లోని ఎకరం స్థలంపై వీరి కన్ను పడింది. శివభూషణంతో పాటు మరో ఐదుగురు ఈ స్థలాలను ఎన్‌హెచ్ శైలజ, బి.ప్రకాష్‌చంద్ సక్సేనా, జి.దీపక్‌రెడ్డిలకు విక్రయించినట్లు బోగస్ పత్రాలు సృష్టించారు. శైలేష్, జి.దీపక్‌రెడ్డిలు శివభూషణం ఫొటోతో, రాధాకృష్ణన్ ఠాకూర్ పేరుతో బోగస్ ఓటర్ ఐడీ రూపొందించి, బంజారాహిల్స్ రోడ్ నం.12లో ఉన్న రూ.100 కోట్ల ఖరీదైన స్థలం ‘క్రయ విక్రయాల్లో’దాన్ని వాడారు. హైదరాబాద్ (సౌత్) జాయింట్ సబ్–రిజిస్ట్రార్ ఆఫీస్‌లో సదరు స్థలాన్ని విక్రయిస్తున్నట్లు ఠాకూర్ పేరుతో శివభూషణం సంతకం చేయగా... ఖరీదు చేస్తున్నట్లు జి.దీపక్‌రెడ్డి సంతకం చేశారు. దీనికి ప్రతిఫలంగా శైలేష్ సక్సేనా రూ.1,000 శివభూషణంకు ఇచ్చాడు. జీపీఏలో పొరపాటు దొర్లిందని చెప్పిన సక్సేనా 2008లో మరోసారి శివభూషణంను రిజిస్ట్రార్ కార్యాలయానికి పిలిపించిన శైలేష్... దీపక్‌రెడ్డి పేరుతో మరో డీడ్ చేయించాడు. -
టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి అరెస్ట్
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ శాసనమండలి సభ్యుడు దీపక్‌రెడ్డిని తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. భూకబ్జా కేసుల్లో నిందితుడిగా ఉన్న ఆయన కొంతకాలంగా తప్పించుకు తిరుగుతున్నారు. దీంతో డీసీపీ అవినాశ్ మహంతి నేతృత్వంలోని పోలీసుల బృందం.. చాకచక్యంగా మంగళవారం రాత్రి దీపక్‌రెడ్డిని హైదరాబాద్‌లో పట్టుకున్నారు. న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చిన అనంతరం నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, ఆసిఫ్‌నగర్ సహా ఆరేడు ప్రాంతాల్లోని భూములకు తప్పుడు పత్రాలు సృష్టించిన దీపక్‌రెడ్డి కబ్జాచేశారనే ఆరోపణలున్నాయి. ఆయా భూముల అసలు యజమానులు పోలీసులులను ఆశ్రయించడంతో దీపక్ అక్రమాల గుట్టురట్టైంది. ఈ కేసులకు సంబంధించి సీసీఎస్ పోలీసులు పలు మార్లు నోటీసులు పంపినప్పటికీ దీపక్‌రెడ్డి స్పందించలేదు. ఎట్టకేలకు వ్యూహంపన్నిన పోలీసులు అయనను అదుపులోకి తీసుకున్నారు. బడా ఫ్యామిలీ వారసుడు: అనంతపురం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అయిన దిలీప్‌రెడ్డి ఆ జిల్లా టీడీపీ కీలక నేత, ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి అల్లుడవుతారు. ఒక రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధిని మరో రాష్ట్ర పోలీసులు అరెస్టు చేయడంపై రాజకీయవర్గాల్లో చర్చ మొదలైంది. -
అంతర్ జిల్లాల నేరస్తులు అరెస్ట్
విజయవాడ : విభిన్న తరహా దొంగతనాలకు పాల్పడే ఇద్దరు అంతర్ జిల్లాల నేరస్తులను సీసీఎస్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 10 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఉదయం రామవరప్పాడు రింగ్ రోడ్డు వద్ద మోటారు బైక్‌పై అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో నిందితులిద్దరు నగరంలో పలు నేరాలకు పాల్పడినట్లు తేలింది. నిందితులు విజయవాడ వించిపేటకు చెందిన షేక్ ఇమ్రాన్ అలియాస్ ఇమ్రాన్, షేక్ నిజాముద్దీన్లుగా గుర్తించారు. వీరు జైలు నుంచి బయటకు వచ్చాక విజయవాడ నగరంలోని గవర్నర్‌పేట, పటమట, భవానీపురం, కృష్ణలంక, లబ్బీపేట ఏరియాలలో పలు నేరాల కు పాల్పడ్డారు. వారిని అరెస్టు చేసి రూ. 10 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, టీవీ, రెండు బైక్‌లు, ఓ కెమేరాను స్వాధీనం చేసుకున్నట్లు సీసీఎస్ పోలీసులు తెలిపారు. నిందితులు గతంలో విశాఖ, రాజమండ్రి, కాకినాడ, తాడేపల్లిగూడెం, ఏలూరు, గుంటూరులో పలు నేరాలకు పాల్పడ్డారు. నిందితులపై చోరీలు, లైంగికదాడి కేసు కూడా ఉంది. -
డ్రైనేజీలో కోట్లు మింగారు
- ‘మురుగు కాంట్రాక్టర్ల’తో ఇంజనీర్ల కుమ్మక్కు - బోగస్ వేబిల్లులతో భారీ దోపిడీకి యత్నం సాక్షి, హైదరాబాద్: ‘గ్రేటర్’లో నాలాల పూడికతీతకు సంబంధించిన భారీ స్కామ్ అసిస్టెంట్ ఇంజనీర్ల మెడకు చుట్టుకుంది. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన నగర నేర పరిశోధన విభాగం(సీసీఎస్) అధికారులు గత వారం 18 మంది కాంట్రాక్టర్లను అరెస్టు చేసి జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కాంట్రాక్టర్లు రూపొందించిన బోగస్ వే బిల్లులు కళ్లు మూసుకుని పాస్ చేసిన 13 మంది అసిస్టెంట్ ఇంజనీర్ల పాత్రను పోలీసులు నిర్థారించారు. ఏటా వర్షాకాలానికి ఆరు నెలల ముందు నుంచే జీహెచ్ఎంసీ నాలాల్లో పూడికతీత పనులు ప్రారంభిస్తుంది. ఈ ప్రక్రియలో అవినీతికి ఆస్కారం లేకుండా కొన్ని కీలక నిబంధనలను జీహెచ్ంఎసీ మార్చింది. ఎంత మేరకు పూడిక తీశారో పక్కాగా తూకం వేసి ఆ మొత్తాన్నే కాంట్రాక్టులకు చెల్లించేలా చర్యలు తీసుకుంది. నంబర్లు మార్చేసి దీన్నీ తమకు అనువుగా మార్చుకున్న కాంట్రా క్టర్లు భారీ దోపిడీకి యత్నించారు. నాలాల నుంచి తీసిన పూడికను లారీల ద్వారా జవహ ర్‌నగర్‌లోని డంపింగ్ యార్డ్‌కు తరలించాలి. అలా తీసుకువెళ్లే సమయంలో వేబ్రిడ్జ్‌ల వద్ద తూకం వేయించి బిల్లు తీసుకోవాలి. ఏ లారీ ద్వారా పూడికను తరలిస్తున్నారో దాని నంబర్ నమోదు చేయాలి. అయితే వేబ్రిడ్జ్ బిల్లుల్లో ‘వాహనాలను మార్చేశారు’. లారీ నంబర్లు ఉండాల్సిన చోట బైక్స్, ఆటోలు, కార్ల నంబర్లను పొందుపరిచారు. గత నెల్లో నకిలీ బిల్లుల్ని ఏఈలకు సమర్పించగా.. 13 మంది వీటిని కళ్లు మూసుకుని పాస్ చేసేశారు. దీంతో కాంట్రాక్టర్లు రూ.1.18 కోట్ల నిధులు మంజూరు చేయించుకున్నారు. చెక్కులు జారీ కావడానికి కొన్ని రోజుల ముందు అనుమానం వచ్చిన ఆడిట్ అధికారులు వాహనాల నంబర్లు వెరిఫై చేయగా.. అవి లారీలవి కాదని తేలింది. విషయాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా చెల్లింపులు ఆగిపోయి అంతర్గత విచారణ జరిగింది. మొత్తం ఆరు ‘తరలింపు వ్యవహారాలకు’ సంబంధించి వేర్వేరు కేసులు నమోదు చేసిన సీసీఎస్ పోలీసులు గత వారం 18 మంది కాంట్రాక్టర్లను అరెస్టు చేశారు. కాంట్రాక్టర్ నిరసన.. ఈ కేసులో అరెస్టు అయి, బెయిల్‌పై విడుదలైన ఓ కాంట్రాక్టర్‌కు ఈ హైడ్రామా గురించి తెలియడంతో సీసీఎస్ వద్ద నిరసనకు దిగారు. తమను అరెస్టు చేసిన పోలీసులు ఏఈల విషయంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారని ప్రశ్నించారు. తప్పు చేసిన ఏఈలను జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు రక్షిస్తున్నారని ఆరోపించారు. అరెస్టు అయిన ఏఈలు వీరే... తిరుపతి, జమీల్‌ఖాన్, సంతోష్, వాయిదర్, లాల్‌సింగ్, మోహన్‌రావు, శంకర్, ప్రేమణ, పాపమ్మ సహా మరో నలుగురు. సీసీఎస్‌లో హైడ్రామా.. 13 మంది ఏఈలను పోలీసులు శుక్రవారం తమ కార్యాలయానికి పిలిపించారు. ప్రతి ఒక్కరి పాత్రను నిర్థారించిన తర్వాత.. అరెస్ట్ చేశారు. సాయంత్రం 4 గంటలకు 13 మంది నిందితుల్ని కోర్టులో హాజరుపరచడానికి తీసుకువెళ్లారు. ఏ స్థాయి నుంచి ఒత్తిళ్లు వచ్చాయో తెలియదు కానీ.. దాదాపు న్యాయస్థానం వరకు వెళ్లిన పోలీసులకు.. వెనక్కి రావాల్సిందిగా వర్తమానం వెళ్లింది. దీంతో 15 నిమిషాల్లోనే నిందితుల్ని మళ్లీ సీసీఎస్‌కు తీసుకు వచ్చారు. మూడున్నర గంటల మల్ల గుల్లాల తర్వాత సీసీఎస్ పోలీసులు 13 మందికీ స్టేషన్ బెయిల్ ఇచ్చి.. మీడియా కంట పడకుండా వివిధ మార్గాల్లో బయటకు పంపించారు. -
బ్రాండెడ్ దుస్తులు..మసాజ్‌లు
l ‘నమస్తే’ గ్యాంగ్ విలాసవంతమైన జీవనం l 15 రోజుల పాటు జల్సాలు l కార్పొరేట్ స్కూళ్లల్లో పిల్లల చదువు సిటీబ్యూరో: వాకింగ్‌లో ఉన్న వారిని టార్గెట్‌గా చేసుకుని... సమీపంలోకి వెళ్ళి నమస్తే చెప్తూ బెదిరించి దోపిపీలకు పాల్పడుతున్న ‘నమస్తే గ్యాంగ్’ వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ గ్యాంగ్‌లో మరికొంత మంది సభ్యులు ఉన్నట్లు సీసీఎస్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ముఠా టార్గెట్ చేసుకున్న నగరాలకు విమానాల్లో వెళ్లిరావడమే కాకుండా, వీరి జీవనశైలి కూడా అత్యంత విలాసవంతంగా ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రతి నెలా కనీసం 15 రోజుల పాటు ‘పని’ మానేసి ఎంజాయ్ చేస్తుంటారు. నేరం చేయడానికి తిరిగేది స్కూటర్ పైనే అయినా వీరు ఎల్లప్పుడూ ఖరీదైన బ్రాండెడ్ దుస్తులే ధరిస్తారు. రెండు పూటలా పేరున్న రెస్టారెంట్లలో బిర్యానీ, రోజు విడిచి రోజు మసాజ్ వీరికి తప్పనిసరి. పోలీసులకు పట్టుబడిన బబ్బూ, ఇమ్రాన్ స్కూల్ డ్రాపౌట్స్ అయినా.. వీరి పిల్లలు మాత్రం ఘజియాబాద్‌లోని కార్పొరేట్ స్కూల్లో చదువుకుంటున్నారు. ప్రాథమిక ఆధారాలు సేకరించిన అధికారులు లోతుగా దర్యాప్తు చేయడంతో పాటు మంగళవారం అరెస్టు చేసిన బబ్బూ, ఇమ్రాన్‌లను కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. దేశ వ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో న‘మస్కా’ర్ నేరాలకు పాల్పడిన చేసిన ఈ ద్వయం జనవరి 10న ఢిల్లీ సమీపంలోని గుర్గావ్లో పంజా విసిరింది. ఒకే రోజు ముగ్గురిని దోచుకుంది. రిడ్జ్ఉడ్ ఎస్టేట్ ప్రాంతంలో ఆర్మీ మాజీ అధికారి భగ్వాన్ దాస్‌ను బెదిరించి బంగారం ఉంగరం లాక్కెళ్లారు. డీఎల్ఎఫ్ సెక్టార్–4, 56ల్లో వైద్యుడు మనోహర్‌లాల్ శర్మ నుంచి నగదు, అహు అభిషేక్ నుంచి ఖరీదైన సెల్‌ఫోన్ దోపిడీ చేసింది. రిడ్జ్ఉడ్ ఎస్టేట్ ప్రాంతంలోని సీసీ కెమెరాలో నిందితులను గుర్తించిన గుర్గావ్ పోలీసులు సాంకేతిక ఆధారాలను బట్టి ముందుకు వెళ్ళారు. ఫిబ్రవరి 14, 15 తేదీల్లో మహారాష్ట్రలోని పుణేలో నేరాలు చేసిన వీరు ఆ మరుసటి రోజే విమానంలో ఢిల్లీకి బయలుదేరారు. ఈ విషయం గుర్తించిన గుర్గావ్ అధికారులు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మాటు వేసి, బబ్బూ, ఇమ్రాన్‌లను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. వీరిని విచారించిన గుర్గావ్ పోలీసులు వాహనాలు సమకూర్చిన లల్లూ సైతం నిందితుడిగా తేల్చారు. ప్రస్తుతం పరారీలో ఉన్న అతడి కోసం గాలిస్తున్నారు. ఈ ‘నమస్తే గ్యాంగ్’ దేశంలోని ఆరు రాష్ట్రాల్లో నేరాలు చేసింది. అయితే ఏ నగర పోలీసులు పట్టుకుంటే... కేవలం అక్కడ చేసిన నేరాలను మాత్రమే బయటపెడుతుంది. మిగిలిన ప్రాంతాల్లో చేసినవి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదు. దీంతో వీరిపై పీటీ వారెంట్ జారీ చేసి తీసుకురావడం సాధ్యం కాదు. ఫిబ్రవరిలో నగరానికి వచ్చిన వీరు అదే నెల 12 ఉదయం రామ్‌గోపాల్‌పేట పరిధిలో పి.వెంకటరమణకు ‘నమస్తే చెప్పారు’. ఈ కేసుపై దృష్టి పెట్టిన సీసీఎస్ స్పెషల్‌టీమ్ ఇన్స్పెక్టర్ వి.శ్యాంబాబు నేతృత్వంలోని బృందం ఆ ప్రాంతంతో పాటు చుట్టు పక్కల ఉన్న 200 సీసీ కెమెరాల్లోని ఫీడ్ ఆధారంగా అనుమానితుల్ని గుర్తించి సాంకేతికంగా దర్యాప్తు చేసింది. ఫలితంగా పసోండా చిరునామా తెలుసుకుని అక్కడకు వెళ్లగా, అప్పటికే వీరిని గుర్గావ్ పోలీసులు తీసుకెళ్లారని తెలుసుకున్నారు. హుటాహుటిన అక్కడకు వెళ్ళిన ఇన్స్పెక్టర్ లోతుగా విచారించి నగర నేరాన్నీ అంగీకరించేలా చేయడంతోనే ఇక్కడకు తేవడం సాధ్యమైంది.ఈ ముఠాలో మరో ఐదుగురి వరకు సభ్యులు ఉండచ్చని అనుమానిస్తున్న సీసీఎస్ పోలీసులు ఆ కోణంలో ఆరా తీస్తున్నారు. తీహార్‌తో పాటు గుర్గావ్లోని భోండ్సీ, బెంగళూరు జైళ్లు వీరికి ‘సుపరిచితమే’. -
సీసీఎస్‌లో హాజరైన టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి
-
సీసీఎస్‌లో హాజరైన టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి
కోర్టు ద్వారా మంజూరైన ముందస్తు బెయిల్ వివరాలు దర్యాప్తు అధికారికి అందజేత సాక్షి, హైదరాబాద్: ఫోర్జరీ పత్రాలతో హైదరాబాద్‌లో భూకబ్జాకు యత్నించిన కేసులో నిందితుడిగా ఉన్న టీడీపీ నేత, అనంతపురం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ జి.దీపక్‌రెడ్డి శుక్రవారం హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్)లో హాజరయ్యారు. నాంపల్లి కోర్టు తనకు మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ను కేసు దర్యాప్తు అధికారికి అందజేశారు. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డికి స్వయానా అల్లుడైన దీపక్‌రెడ్డి మరికొందరితో కలసి బంజారాహిల్స్‌లోని రోడ్ నెం.2లో అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఉన్న సర్వే నం.129/71లోని 3.37 ఎకరాల స్థలాన్ని ఫోర్జరీ పత్రాలతో కబ్జా చేసేందుకు ప్రయత్నించినట్టుగా సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేయడం విదితమే. ఈ నేపథ్యంలో ప్రాథమిక ఆధారాలు సేకరించిన అధికారులు వివరణ కోరుతూ దీపక్‌రెడ్డికి నోటీసుల జారీకి ప్రయత్నించారు. అయితే వారికి దొరక్కుండా తప్పించుకు తిరిగిన దీపక్‌రెడ్డి అనారోగ్యకారణాలు చూపిస్తూ కోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందారు. దీన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి శుక్రవారం సీసీఎస్‌కు వచ్చారు. ఈ సందర్భంగా రెండు గంటలపాటు దీపక్‌రెడ్డిని కేసు దర్యాప్తు అధికారి ఫోర్జరీపై ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ కేసుకు సంబంధించి పరారీలో ఉన్న మిగిలిన నిందితులు బి.శైలేష్ సక్సేనా, బి.సంజయ్ సక్సేనా, బి.ప్రకాష్ చంద్ర సక్సేనాల కోసమూ సీసీఎస్ అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ‘సాక్షి’ ఫొటో జర్నలిస్ట్‌పై దౌర్జన్యం.. సీసీఎస్ నుంచి తిరిగెళుతున్న సమయంలో దీపక్‌రెడ్డిని ఫొటోలు తీసిన ‘సాక్షి’ ఫొటో జర్నలిస్ట్ పి.మోహనాచారిపై ఆయనతోపాటు ఆయన అనుచరులు దౌర్జన్యానికి దిగారు. తీవ్రంగా దుర్భాషలా డారు. దౌర్జన్యానికి దిగి మోహనాచారి చేతిలో ఉన్న కెమెరాను బలవంతంగా లాక్కోవ డంతోపాటు అందులోని చిప్‌ను తీసేసుకు న్నారు. ఈ అన్యాయం ఏమిటని ‘సాక్షి’ ఫొటో జర్నలిస్ట్ ప్రశ్నించగా... ‘‘నాకేం అవుతుంది. ఇప్పటికే ఓ కేసు ఉంది. మరో కేసు రిజిస్టర్ అవుతుంది’’ అంటూ దీపక్ రెడ్డి విరుచుకుపడ్డారు. దీనిపై మోహనాచారి శుక్రవారం రాత్రి సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డిపై ఫోర్జరీ కేసు
-
టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డిపై ఫోర్జరీ కేసు
⇒ బంజారాహిల్స్‌లో విలువైన భూమిని కబ్జా చేసే యత్నం ⇒ బోగస్ డాక్యుమెంట్లను సృష్టించిన వైనం ⇒ నకిలీ స్థల యజమానిని తెరపైకి తెచ్చిన నిందితులు ⇒ దీపక్‌రెడ్డితోపాటు మరో నలుగురిపై కేసు నమోదు చేసిన సీసీఎస్ పోలీసులు ⇒ నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్న అధికారులు ⇒ హైదరాబాద్, అనంతపురంలో అందుబాటులో లేని దీపక్‌రెడ్డి ⇒ మరో రెండు భూకబ్జా కేసుల్లోనూ దీపక్‌రెడ్డి హస్తం! సాక్షి, సిటీబ్యూరో: తెలుగుదేశం పార్టీ నేత, అనంతపురం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ జి.దీపక్‌రెడ్డిపై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్) పోలీసులు ఫోర్జరీ కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ ప్రాంతంలో విలువైన భూమిని తప్పుడు పత్రాలతో కబ్జా చేయడానికి ప్రయత్నించారనే ఆరోపణలపై ఈ కేసును రిజిస్టర్ చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గంకు చెందిన దీపక్‌రెడ్డి ఆ జిల్లాలోని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డికి స్వయాన అల్లుడు. భూకబ్జా కేసులో ఐదో నిందితుడిగా ఉన్న దీపక్‌రెడ్డికి నోటీసులు జారీ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్, అనంతపురంలో ఆయన జాడ లభించకపోవడంతో సాధ్యం కాలేదు. ఈ కేసులో సహ నిందితులుగా ఉన్న వారిపై మరో రెండు ఇదే తరహా కేసులు ఉండడంతో వాటిలోనూ దీపక్‌రెడ్డి పాత్రను పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు దశలో ఉందని సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతి చెప్పారు. ఖరీదైన 3.37 ఎకరాలపై కన్ను బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్ 2లో సర్వే నం.129/71లోని 3.37 ఎకరాల స్థలానికి సంబంధించి ఈ వివాదం రేగింది. ఈ స్థలాన్ని కొన్ని దశాబ్దాల క్రితం నగరంలో నివాసం ఉన్న శరణార్థి అయూబ్ కమల్‌కు అప్పటి ప్రభుత్వం కేటాయించింది. దీన్ని ఆయన నుంచి 1960లో ఎంవీఎస్ చౌదరితోపాటు ఆయన సోదరులు ఉమ్మడిగా ఖరీదు చేశారు. అప్పటి నుంచి ఈ భూమి వారి ఆధీనంలోనే ఉంది. అయితే అయూబ్ కమల్ ఈ స్థలాన్ని అన్సారీ బ్రదర్స్‌కు విక్రయించినట్లు, వారి నుంచి దీన్ని తాము కొనుగోలు చేసినట్లు జై హనుమాన్ ఎస్టేట్స్ సంస్థకు చెందిన బి.శైలేష్ సక్సేనా, బి.సంజయ్ సక్సేనా, బి.ప్రకాశ్‌చంద్ర సక్సేనాలతోపాటు జి.దీపక్‌రెడ్డి బోగస్ డాక్యుమెంట్లు సృష్టించారు. వీటి ఆధారంగా సివిల్ సూట్ దాఖలు చేయడం ద్వారా తదుపరి చర్యలకు ఉపక్రమించారు. దీంతో ఎంవీఎస్ చౌదరి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రాథమిక విచారణ చేపట్టిన షేక్‌పేట మండల రెవెన్యూ అధికారులు ఆ ఖరీదైన స్థలానికి ఎంవీఎస్ చౌదరి యజమాని అని తేల్చారు. స్థలాన్ని కాజేసేందుకు ప్రయత్నించినవారిపై చౌదరి తరపు ప్రతినిధి, మాదాపూర్‌కు చెందిన ఎం.రాధాకృష్ణ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఆచూకీ దొరకని అన్సారీ బ్రదర్స్ కేసు దర్యాప్తులో భాగంగా సీసీఎస్ పోలీసులు షేక్‌పేట మండల రెవెన్యూ అధికారుల నుంచి వివరాలు సేకరించారు. ఈ నేపథ్యంలో సదరు స్థలానికి యజమానులు ఎంవీఎస్ చౌదరి బ్రదర్స్ అని తేటతెల్లమైంది. దీపక్‌రెడ్డి తదితరులు సృష్టించిన నకిలీ డాక్యుమెంట్లలోని చిరునామాల ఆధారంగా అన్సారీ బ్రదర్స్‌ను పట్టుకోవడానికి సీసీఎస్ పోలీసులు రంగంలోకి దిగారు. అయితే, ఆ చిరునామాల్లో అన్సారీ బ్రదర్స్ ఆచూకీ లభించలేదు. గతంలోనూ అక్కడ అలాంటి వ్యక్తులెవరూ లేరని తేలింది. దీంతో నిందితులు ఆ భూమికి సంబంధించి నకిలీ యజమానిని తెరపైకి తెచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. దీపక్‌రెడ్డి తదితరులు వినియోగించిన స్టాంప్ పేపర్లు, స్టాంపులు తదితరాలు పాత తేదీలతో ఉండడం గమనార్హం. నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నాలు ఈ కేసులో మిగిలిన వారితోపాటు ఐదో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ జి.దీపక్‌రెడ్డికి నోటీసులు ఇవ్వడానికి సీసీఎస్ పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. బంజారాహిల్స్ లోని సదరు స్థలానికి సంబంధించిన పూర్తి రికార్డులు తీసుకురావాల్సిందిగా ఈ నోటీసుల్లో సీసీఎస్ పోలీసులు కోరనున్నారు. సక్సేనాలపై మరో రెండు కేసులు... సీసీఎస్‌లో నమోదైన కేసులో దీపక్‌రెడ్డితోపాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న సక్సేనా బ్రదర్స్‌పై ఇదే తరహాకు చెందిన మరో రెండు కేసులు ఉన్నాయి. హైదరాబాద్‌లో తాము కన్నేసిన ప్రభుత్వ, ప్రైవేట్ భూములకు వీరు నకిలీ పత్రాలు సృష్టిస్తుంటారు. వీటి ఆధారంగా సివిల్ కేసులు దాఖలు చేసి, భూమిని వివాదంలోకి లాగుతారు. ఇలా వివాదంలో చిక్కుకున్న స్థలం యజమాని ప్రైవేట్ వ్యక్తి అయితే కబ్జాదారులతో రాజీకే మొగ్గు చూపుతుంటారు. ప్రభుత్వ స్థలమైతే విషయం పోలీసు స్టేషన్లు, కోర్టుల వరకు వెళ్తోంది. ఈ రకంగా ఆసిఫ్‌నగర్, జూబ్లీహిల్స్‌లో రూ.వందల కోట్ల విలువైన భూముల కబ్జాపై నమోదైన కేసులను సీసీఎస్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారాల్లోనూ దీపక్‌రెడ్డి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తదుపరి దర్యాప్తు, అనుమానితుల విచారణ తర్వాతే పూర్తి వివరాలు వెలుగులోకి వస్తాయని చెబుతున్నారు. కాగితాల్లోనే స్థలాల యజమానులు ఈ మూడు కేసులపై దర్యాప్తు ప్రారంభించిన సీసీఎస్ పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఈ ముఠా సృష్టించిన పత్రాల్లోని వివరాలను సరిచూడడం ప్రారంభించారు. అందులో స్థలా లు అమ్మినట్లు, కొన్నట్లు రికార్డయిన వ్యక్తుల పేర్లు, చిరునామాలను క్షేత్రస్థాయిలో పరిశీలించా రు. అవన్నీ బోగస్ పేర్లు, చిరునామాలేనని స్పష్టమైంది. ప్రస్తుతం ఆయా చిరునామల్లో ఉంటున్న వారిని ఆరా తీయగా... సదరు పత్రా ల్లో ఉన్న వ్యక్తులు అక్కడ ఉండరని, వారు ఎవ రో కూడా తమకు తెలియదని చెప్పుకొచ్చారు. దీంతో పోలీసులు నకిలీ డాక్యుమెంట్లను తయారు చేసిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. ఓ కేసుకు సంబంధించి ఈ పత్రాల సృష్టికర్తలను గుర్తించి, విచారించగా.. ముఠా సూత్రధారి, పాత్రధారులకు సంబంధించి కీలక సమాచారం బయటపడినట్లు తెలిసింది. -
స్కాలర్షిప్లు కాజేయబోయి కటకటాలపాలు
ఇద్దరు ట్రెజరీ ఉద్యోగులను అరెస్టు చేసిన సీసీఎస్ పోలీసులు సాక్షి, హైదరాబాద్: విద్యార్థుల ఉపకారవేతనాలను పక్కదారి పట్టించి కాజేయబోయిన ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు కటకటాలపాలయ్యారు. ఈ మేరకు వారిని హైదరాబాద్ నగర సీసీఎస్ పోలీసులు శనివారం అరెస్టు చేసినట్లు సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతి వెల్లడించారు. హైదరాబాద్‌లోని డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీ అండ్ అకౌంట్స్ విభాగం సీనియర్ అసిస్టెంట్ అజయ్ కుమార్‌రెడ్డి, సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ సబ్ ట్రెజరీ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ బాలూ నాయక్ మరికొందరితో కలసి ఉపకారవేతనాలను నొక్కేయాలని పథక రచన చేశారు. వివిధ కళాశాలల్లో ఉపకారవేతనాలు అందని విద్యార్థుల వివరాలను సేకరించారు. ఆ విద్యార్థులు తిరిగి దరఖాస్తు చేసినట్టు, వాటిని అధికారులు ఆమోదించినట్టు నివేదికలు తయారు చేశారు. దీనికి నల్లగొండ జిల్లా ట్రెజరీ కార్యాలయంలోని కొందరు సిబ్బంది సహకరించారు. ఈ నివేదికలను హైదరాబాద్‌లోని డీటీఏ సర్వర్‌లో అప్లోడ్ చేశారు. దీంతో ఆయా దరఖాస్తుదారులకు మంజూరైన రూ.71 లక్షలను కోదాడలోని సాయి వికాస్ డిగ్రీ కాలేజీ ఖాతాలోకి బదిలీ చేశారు. ఈ వ్యవహారంపై అనుమానించిన ఉన్నతాధికారులు రూ.71 లక్షలను తిరిగి ప్రభుత్వ ఖజానాలో జమ అయ్యే విధంగా చర్యలు తీసుకున్నారు. ఈ ఉదంతంపై సీసీఎస్ పోలీసులు దర్యాప్తు చేపట్టి అజయ్‌కుమార్ రెడ్డి, బాలూ నాయక్‌లను అరెస్టు చేశారు. మరికొంత మంది సిబ్బంది పాత్రపై విచారణ సాగుతోందని పోలీసులు చెబుతున్నారు. -
కమీషన్ కోసం 37 కోట్ల మార్పిడి
⇒ ‘ముసద్దిలాల్’తో కలసి పవన్ అగర్వాల్ దందా ⇒ డబ్బు డిపాజిట్ చేసి,తన ఖాతాల్లోకి మళ్లింపు ⇒ అరెస్టు చేసిన హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు సాక్షి, హైదరాబాద్: నోట్ల రద్దు ప్రకటన వెలువడిన 2016 నవంబర్ 8న రూ.110 కోట్ల ‘వ్యాపారం’చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముసద్దిలాల్ జ్యువెలర్స్ కేసు దర్యాప్తులో అనేక ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ముసద్దిలాల్ యాజమాన్యాన్ని హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్) అధికారులు కటకటాల్లోకి పంపిన విషయం విదితమే. ‘అజ్ఞాత కస్టమర్ల’నుంచి నగదు వసూలు చేయడం, దాన్ని ‘ముసద్దిలాల్’ఖాతాల్లో డిపాజిట్ చేయడంతో పాటు ఆదే నగదును తన ఖాతాల్లోకి మళ్లించుకున్న మరో నిందితుడు సీసీఎస్ పోలీసులకు చిక్కాడు. గన్‌ఫౌండ్రీ సమీపంలోని మయూరి కుషాల్ కాంప్లెక్స్‌లో శ్రీబాలాజీ గోల్డ్ పేరుతో సంస్థ నిర్వహిస్తున్న పవన్అగర్వాల్ను అధికారులు శుక్రవారం అరెస్టు చేసినట్లు డీసీపీ అవినాష్ మహంతి పేర్కొన్నారు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన సీసీఎస్ పోలీసులు ముసద్దిలాల్ సంస్థలు, యాజమాన్యాలకు చెందిన బ్యాంకు ఖాతాల్లో ఆయా రోజుల్లో అయిన డిపాజిట్లు, మళ్లింపులపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలోనే పవన్అగర్వాల్ దందా వెలుగులోకి వచ్చింది. ఇతడు ముసద్దిలాల్ యాజమాన్యంతో కలసి కుట్రపన్ని 30 శాతం కమీషన్‌కు రూ.37 కోట్ల పెద్దనోట్లు మార్పిడి చేసినట్లు గుర్తించారు. నోట్ల రద్దు తర్వాత కొందరు ‘నల్లబాబు’లకు చెందిన రూ.37 కోట్లను బంగారం రూపంలో మార్చడానికి పవన్ అంగీకరించాడని, 30 శాతం కమీషన్‌కు ఒప్పందం కుదుర్చుకుని, తన దందాకు సహకరిస్తే 10 శాతం చెల్లించేలా ముసద్దిలాల్ యాజమాన్యంతో ఒప్పందం చేసుకున్నాడని ఆరోపిస్తున్నారు. దీంతో ‘మూడు గంటల్లో వేల మంది కస్టమర్లకు బంగారం విక్రయించే’ప్రణాళికను సిద్ధం చేసుకున్న ముసద్దిలాల్ యాజమాన్యం పవన్ అగర్వాల్ ప్రతిపాదనలకు అంగీకరించింది. ఆ మరుసటి రోజు ముసద్దిలాల్ జెమ్స్ అండ్ జ్యువెలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఖాతాలోకి రూ.37 కోట్లు జమ చేసిన పవన్ అగర్వాల్ ఆ మేరకు బంగారం ఖరీదు చేసినట్లు రికార్డులు రూపొందించాడు. స్వల్ప వ్యవధిలోనే ఆ మొత్తాన్ని ముసద్దిలాల్ యాజమాన్యం పవన్‌కు చెందిన సంస్థ పేరుతో ఉన్న రెండు ఖాతా ల్లోకి మళ్లించింది. ఇదే మొత్తాన్ని వినియో గించి పవన్ అగర్వాల్ బులియన్ డీలర్ల నుంచి బంగారం ఖరీదు చేశాడని తేలింది. ఈ విష యం గుర్తించిన సీసీఎస్ పోలీసులు ముసద్ది లాల్ సంస్థలకు శ్రీబాలాజీ గోల్డ్ సంస్థకు మధ్య బంగారం క్రయవిక్రయాలకు సంబంధించి డెలివరీ, రిసీవింగ్ రసీదుల కోసం ఆరా తీశారు. అలాంటివి లేవని తేలడంతో ఈ మొత్తం మార్పిడికి సంబంధించిందని నిర్ధారించి పవన్ అగర్వాల్‌ను అరెస్టు చేశారు. ముసద్దిలా ల్ యాజమాన్యం నవంబర్ 8 రాత్రి 9 నుంచి 12 గంటల మధ్య 5,200 మంది కస్ట మర్లు దాదాపు రూ.110 కోట్ల విలువైన 340 కేజీల బంగారం ఖరీదు చేసినట్లు రికార్డులు రూపొందించి ‘మార్పిడి’కి పాల్పడిన విషయం విదితమే. ఈ మొత్తం గరిష్టంగా 30 మంది ‘నల్లబాబులకు’ చెంది నదై ఉంటుందని పోలీసులు అను మానిస్తు న్నారు. వీరి ద్వారా పెద్దనోట్లు మార్చుకున్నది ఎవరనే కోణంలో ఆరా తీస్తున్నారు. -
గ్యాస్ లైటర్లనీ వదలట్లేదు!
- ‘కేటు’ గ్యాంగ్ లీడర్ రజనీ భాయ్ అరెస్ట్ - గుజరాత్లో నకిలీ సరుకుల తయారీ.. దేశ వ్యాప్తంగా సరఫరా - అరెస్టు చేసి తీసుకువచ్చిన హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు హైదరాబాద్: డూబ్లి‘కేటుగాళ్ళు’ ఏ వస్తువునీ వదిపెట్టట్లేదు. వివిధ కంపెనీల పేర్లతో నకిలీ గ్యాస్ లైటర్లు తయారు చేసి దేశ వ్యాప్తంగా సరఫరా చేస్తున్నారు. హైదరాబాద్‌లో విక్రయిస్తున్న ఉత్పత్తులకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన సీసీఎస్ అధికారులు శుక్రవారం సూత్రధారిని రజనీ భాయ్‌ని అరెస్టు చేశారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన ఇతగాడు దేశ వ్యాప్తంగా దందా చేస్తున్నట్లు గుర్తించామని డీసీపీ అవినాష్ మహంతి తెలిపారు. రాజ్‌కోట్‌కు చెందిన రజనీ భాయ్ అక్కడి ఆర్ఆర్ నగర్ చౌక్ ప్రాంతంలో జైమా ఖొడియార్ ఎంటర్ప్రైజెస్ పేరుతో ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నాడు. మిల్టన్, పీజియన్, ఈగెల్ కంపెనీల పేర్లతో డైలు రూపొందించాడు. వీటిసాయంతో ఆయా కంపెనీల పేర్లు ముద్రితమయ్యేలా నకిలీ గ్యాస్ లైటర్లు తయారు చేస్తున్నాడు. వీటిని దేశంలోని అనేక ప్రాంతాలతో పాటు హైదరాబాద్‌కూ సరఫరా చేస్తున్నాడు. సిటీలోని రిద్దీ సిద్దీ మార్కెటింగ్, రిషబ్ మార్కెటింగ్, రామ్‌దేవ్ స్పేర్ పార్ట్స్, రాజేశ్వర్ స్పేర్‌పార్ట్స్ సంస్థలకు కంపెనీ వాటి కంటే తక్కువ ధరకు విక్రయిస్తున్నాడు. ఈ నాలుగు సంస్థల్లో బ్రాండెడ్ కంపెనీ పేరుతో నకిలీ గ్యాస్ లైటర్లు విక్రయిస్తున్న విషయం గుర్తించిన శ్రీ ముఖేష్ మార్కెటింగ్ అధికార ప్రతినిధి సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రిద్దీ సిద్దీ మార్కెటింగ్, రిషబ్ మార్కెటింగ్, రామ్‌దేవ్ స్పేర్ పార్ట్స్, రాజేశ్వర్ స్పేర్‌పార్ట్స్ దుకాణాలపై దాడులు చేశారు. వీటి నిర్వాహకులైన సతీష్ జైన్, రతిలాల్, జగదీష్‌కుమార్, మోతీరామ్లను అదుపులోకి తీసుకుని వందల సంఖ్యలో నకిలీ గ్యాస్ లైటర్లు స్వాధీనం చేసుకున్నారు. జగదీష్ కుమార్ విచారణలో ఈ నకిలీ లైటర్లను రాజ్‌కోట్‌కు చెందిన రజనీ భాయ్ సరఫరా చేస్తున్నట్లు బయటపడింది. అప్పటి నుంచి పరారీలో ఉన్న సూత్రధారి కోసం గాలిస్తూ అక్కడకు వెళ్ళిన ప్రత్యేక బృందం రజనీ భాయ్‌ను అరెస్టు చేసి తీసుకువచ్చింది. ఇతడి నుంచి గ్యాస్ లైటర్లపై ఆయా కంపెనీల పేర్లు ముద్రించడానికి ఉపకరించే ఇనుప డైలను స్వాధీనం చేసుకున్నారు. -
ట్రేడింగ్ పేరుతో రూ.27 కోట్ల టోకరా
ఇన్వెస్టర్ల సొమ్ము సొంతానికి వాడుకున్న వైనం మొత్తం 12 మంది ప్రమేయం ఉన్నట్లు గుర్తింపు ఒకరిని అరెస్టు చేసిన సీసీఎస్ పోలీసులు సాక్షి, హైదరాబాద్: షేర్ మార్కెట్ పేరిట భారీగా వసూళ్లు చేసి... పలువురిని మోసం చేసిన కేసులో ప్రధాన నిందితుడు ఆకుల శ్రీధర్‌ను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ఎస్వీఎస్సీ వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో పెద్ద మొత్తంలో దండుకున్న ఈ వ్యవహారంలో మొత్తం 12 మందికి ప్రమేయం ఉన్నట్లు గుర్తించామని డీసీపీ అవినాష్ మహంతి గురువారం తెలిపారు. వీరు రూ.27 కోట్ల మేర మోసాలకు పాల్పడ్డారన్నారు. నిందితుల్లో అత్యధికులు బంధువులే ఉన్నారన్నారు. ఫ్రాంచైజీలు... పెట్టుబడులు... సికింద్రాబాద్ ఈస్ట్‌మారేడ్‌పల్లికి చెందిన ఆకుల శ్రీధర్ తన భార్య చందనతో కలసి నాగోల్‌లో ఎస్వీఎస్సీ సంస్థను ఏర్పాటు చేశారు. దీనికి డైరెక్టర్లుగా ఉన్న వీరిద్దరికీ షేర్ మార్కెట్‌తో పాటు ట్రేడింగ్‌పైనా అవగాహన ఉంది. గతంలో మాస్టర్ ట్రస్ట్ సంస్థ నుంచి ఫ్రాంచైజీ తీసుకుని పలువురి నుంచి పెట్టుబడులు సేకరించారు. కొన్నాళ్లకు దీన్ని మూసేసిన భార్యా భర్తలు... ఫ్రాంచైజీని తమ బంధువైన జె.శ్రీనివాస్ పేరు మీదకు మార్చారు. తమ బంధువైన కోమటిరెడ్డి భిక్షంరెడ్డి పేరుతో 2014లో పీర్లెస్ సెక్యూరిటీస్ లిమిటెడ్ ఫ్రాంచైజీ తీసుకున్నారు. దీనికోసం 80 మంది నుంచి రూ.3.5 కోట్ల పెట్టుబడి రాబట్టారు. ఎస్వీఎస్సీ ద్వారా పీర్లెస్ సెక్యూరిటీస్‌లో ట్రేడింగ్ మొదలెట్టిన శ్రీధర్, చందన... 2015లో 20 మంది నుంచి రూ.కోటి పెట్టుబడి పెట్టించారు. ఆపై కె.సవితారెడ్డి పేరుతో ఎంకే గ్లోబల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ నుంచి ఫ్రాంచైజీ తీసుకున్న భార్యాభర్తలు.. 15 మంది నుంచి రూ.70 లక్షల మేర పెట్టుబడులు సేకరించారు. ప్రతి ఒక్కరికీ భారీ లాభాలు పంచుతామంటూ 318 మందితో పెట్టుబడులు పెట్టించారు. దీని ద్వారా నిందితులు ప్రతి నెలా దాదాపు రూ.5 లక్షల మేర కంపెనీల నుంచి బ్రోకరేజ్ తీసుకున్నారు. అవగాహన లేనివారితో డీమ్యాట్ ఖాతాలు... స్టాక్ మార్కెట్‌పై సరైన అవగాహన లేని వారి పేరుతోనూ లాభాల ఆశ చూపిన వీరు డీమ్యాట్ ఖాతాలు తెరిపించారు. వారి మాటలు నమ్మిన మూసాపేట వాసి కె.చంద్రకళ తన బంధువులు, స్నేహితులు, పరిచయస్తులతో కలిసి రూ.9 కోట్ల పెట్టుబడి పెట్టారు. కొన్ని రోజులకు నిందితులు తమ షేర్లకు సంబంధించిన మొత్తాన్ని స్రవంతి, మహ్మద్ ఫసియుద్దీన్లకు చెందిన ఖాతాలకు మళ్లించి రూ.68 లక్షలు డ్రా చేసుకున్నారని వీరికి తెలిసింది. చివరకు మలక్‌పేట ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఎస్వీఎస్సీ సంస్థను మూసేసిన నిందితులు పరారయ్యారు. దీంతో చంద్రకళ ఫిర్యాదు చేయడంతో సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. మిగిలినవారి కోసం గాలింపు... ఏసీపీ జి.జోగయ్య నేతృత్వం లో ఎస్సై ఎన్.సురేశ్‌కుమార్ ఈ కేసు దర్యాప్తు చేశారు. శ్రీధర్, చందనతో పాటు ఆమె తల్లిదండ్రులు కె.భిక్షంరెడ్డి, కె.సవితారెడ్డి, సోదరుడు చాణక్యరెడ్డి, అతడి భార్య స్రవంతి, బంధువులు సుభాషి ణి, ఎన్.పాపిరెడ్డి, ఎన్.మహేశ్‌రెడ్డి, ఏజెంట్లు డాక్టర్ ఇంతియాజ్‌అలీ, మహ్మద్ ఫసియుద్దీన్, వై.ప్రతాప్ రెడ్డిలను నిందితులుగా తేల్చారు. శ్రీధర్ అరెస్టు తర్వాత మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. -
ఏటీఎంలలో పెట్టాల్సిన డబ్బును దారి మళ్లించి..
హైదరాబాద్: ఓ వైపు తీవ్ర కరెన్సీ కష్టాలతో బ్యాంకులు, ఏటీఎంల వద్ద జనం పడిగాపులు కాస్తుంటే.. మరో వైపు ఏటీఎం మెషిన్లలో డబ్బు నింపే ఏజెన్సీలో పనిచేసే వారు చేతివాటం ప్రదర్శించిన ఘటన హైదరాబాద్‌లో వెలుగుచూసింది. ఈ మేరకు సీసీఎస్ పోలీసులు ఐదుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు. ఏటీఎం మెషిన్లలో పెట్టాల్సిన డబ్బును దారి మళ్లించి వీరు స్వప్రయోజనాలకోసం వాడుకున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరి వద్ద నుంచి రూ. 85 లక్షల నగదు, రూ. 3 లక్షల విలువైన బంగారం, 2 బైక్‌లు, 2 ల్యాప్‌ట్యాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. డబ్బు పక్కదారి పట్టిందని గుర్తించి, ఏజెన్సీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ కొనసాగుతోంది. -
బోగస్ ’ఐడీఎస్’ లక్ష్మణరావు మోసపోయాడట!
సాక్షి, హైదరాబాద్: స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకంలో (ఐడీఎస్) రూ.10 వేల కోట్లు నల్లధనం తన వద్ద ఉన్నట్లు డిక్లేర్ చేసి, పన్ను చెల్లింపు దగ్గరకు వచ్చేసరికి ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అధికారుల్ని ముప్పతిప్పలు పెట్టిన బాణాపురం లక్ష్మణరావు వెనుక ఉన్న బడాబాబులు’ వెలుగులోకి రానట్లేనా..? ఔననే అనుమానాలు కలుగుతున్నాయి. సాక్షాత్తు ఐటీ అధికారులే ఇతడు మోసపోయినట్లు’ నిర్థారించడమే దీనికి కారణం. ఈ మేరకు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌కు (సీసీఎస్) గురువారం లేఖ రాసిన ఐటీ విభాగం.. లక్ష్మణరావును మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరింది. ఈ లేఖను అనధికారంగా తిరస్కరించిన సీసీఎస్ పోలీసులు బాధితులు వచ్చి ఫిర్యాదు చేస్తేనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని స్పష్టం చేశారు. ఐటీ అధికారుల నుంచి తమకు లేఖ అందిందని సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతి సాక్షి’కి తెలిపారు. (ఆ 10 వేల కోట్లు బోగస్!) ఐడీఎస్ పథకం కింద సెప్టెంబర్ ఆఖరు వరకు దేశ వ్యాప్తంగా ప్రకటించిన భారీ మొత్తాల్లో నగరం నుంచి డిక్లేర్ చేసిన రూ.10 వేల కోట్లు కూడా ఉంది. దీనిపై అప్పట్లో కొన్ని రాజకీయ పార్టీలు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశాయి. అయినప్పటికీ రెండు నెలల వరకు రూ.10 వేల కోట్లు డిక్లేర్ చేసింది ఎవరనేది ఐటీ అధికారులు బయటకు చెప్పలేదు. సెప్టెంబర్ 30 వరకు డిక్లేర్ చేసిన మొత్తానికి సంబంధించి నల్లబాబులు’ పన్ను/సర్‌చార్జ్‌ల్ని మూడు విడతల్లో 2017 మార్చి నాటికి చెల్లించాల్సి ఉంది. మొదటి వాయిదా అయిన రూ.1125 కోట్లు చెల్లించలేక చేతులెత్తేయడంతోనే లక్ష్మణరావు పేరు వెలుగులోకి వచ్చింది. ఫిల్మ్‌నగర్‌లోని అతడి ఇంటితో పాటు మరో ఇద్దరి ఇళ్ళపై దాడులు చేసి ఐటీ అధికారులు కొండను తవ్వి ఎలుకను పట్టారు’. మోసపోయినట్లు అనధికారిక నిర్థారణ... సోదాల నేపథ్యంలో ఎలాంటి ఆధారాలు సేకరించలేకపోయిన ఐటీ అధికారులు లక్ష్మణరావును విచారించారు. (బాణాపురం లక్ష్మణ్‌రావు ఇంట్లో చిల్లి గవ్వ కూడా దొరకలేదు) ఈ నేపథ్యంలోనే ఇతడు తాను ఓ బాబాతో పాటు మరికొందరి మాటలు నమ్మానంటూ ఐటీ అధికారులకు సినిమా చూపించాడు. రైల్ పుల్లింగ్ కాయిన్స్/బౌల్స్‌ను సేకరించి ఇస్తానని చెప్పిన ఓ బాబా మాటలు నమ్మానంటూ చెప్పుకొచ్చాడు. వాటిని అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించడం ద్వారా రూ.10 వేల కోట్లు సంపాదించవచ్చంటూ వారు చెప్పిన నేపథ్యంలోనే ఆ మేరకు డిక్లేర్ చేశానంటూ ఐటీ అధికారులకు తెలిపాడు. దీన్ని గుడ్డిగా నమ్మిన ఐటీ అధికారులు సదరు బాబా ఎవరు? వీరికి దళారులుగా వ్యవహరించింది ఎవరు? తదితర అంశాలను గుర్తించేందుకు పూర్తిస్థాయిలో ప్రయత్నాలు చేయలేదు. ఆర్థిక చట్ట ప్రకారం ఇలాంటి బోగస్ డిక్లరేషన్ చేసిన వారిపై కేసు నమోదు చేసి, ప్రాసిక్యూట్ చేసే అవకాశం ఉన్నా... ఇప్పటి వరకు అలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కేవలం లక్ష్మణరావు చెప్పిన మాటల్నే పరిగణలోకి తీసుకున్న ఐటీ అధికారులు అతడు మోసపోయినట్లు అనధికారంగా నిర్థారించేశారు. సీసీఎస్‌లు లేఖ రాసిన ఐటీ... లక్ష్మణరావు వ్యవహారాన్ని లోతుగా దర్యాప్తు చేయడం, అతడిపై ఆర్థిక చట్టం కింద కేసులు నమోదు చేసి ప్రాసిక్యూట్ చేయడాన్ని పక్కన పెట్టిన ఐటీ అధికారులు అతడి పైనే సానుభూతి చూపడం ప్రారంభించారు. రైస్ పుల్లింగ్ సహా ఇతర పేర్లతో లక్ష్మణరావును మోసం చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏకంగా సీసీఎస్ పోలీసులకు లేఖ రాశారు. ఈ లేఖను చూసి అవాక్కైన అధికారులు బాధితుడు కాకుండా మూడో వ్యక్తి/సంస్థ రాసిన లేఖను ఫిర్యాదుగా స్వీకరించలేమని ఐటీ అధికారులకు స్పష్టం చేశారు. లక్ష్మణరావు మోసం చేశాడని భావిస్తే అతడిపై ఫిర్యాదు చేయాలని, మోసపోయాడనే అభిప్రాయం ఉంటే నేరుగా వచ్చి ఫిర్యాదు చేసేలా సూచించాలని స్పష్టం చేశారు. బాధితుడే వచ్చి ఫిర్యాదు చేయడంతో పాటు ప్రాథమిక ఆధారాలు సమర్పిస్తేనే తదుపరి చర్యలు తీసుకోగలమని ఐటీ అధికారులకు చెప్పారు. దీంతో చేసేది లేక ఐటీ అధికారులు తిరిగి వెళ్ళినట్లు సమాచారం. ‘బడాబాబులకు’ బినామీ..! ఐడీఎస్ లక్ష్మణరావు పేరు వెలుగులోకి వచ్చిన తొలి రోజునే అనేక కథనాలు బయటకు వచ్చాయి. కొందరు ‘బడాబాబులకు’ ఇతడు బినామీ అని, వారి నల్లధనాన్నే మార్చేందుకు తనకు చెందినదిగా డిక్లేర్ చేశారని వినిపించింది. అయితే సెప్టెంబర్ 30తో ఐడీఎస్ స్కీమ్ ముగియగా... నవంబర్ 8న డీమానిటైజేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో సదరు బడాబాబుల’ అంచనాలు తారుమారైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే పన్ను కట్టలేక లక్ష్మణరావును చేతులెత్తేయమని చెప్పారని తెలిసింది. అతడికి ఎలాంటి ఇబ్బందులూ లేకుండా సహకరిస్తామంటూ హామీ సైతం ఇచ్చినట్లు సమాచారం. లక్ష్మణరావుకు సంబంధించి వినిపిస్తున్న కథనాలు, అతడి గత చరిత్రను పరిగణలోకి తీసుకోని ఐటీ అధికారులు కొత్త పల్లవి అందుకున్నారు. ఓ బాబాతో పాటు కొందరి చేతిలో లక్ష్మణరావు మోసపోయాడని, వారి మాటలు నమ్మి రూ.లక్షల్లో పోగొట్టుకున్నాడటం సానుభూతి చూపించడం ప్రారంభించారు. లక్ష్మణరావు కథలో ఐటీ విభాగం నుంచి ఈ ట్విస్ట్ రావడానికి బడాబాబులు’ తీసుకువచ్చిన ఒత్తిడే కారణమని తెలుస్తోంది. నిందితుడిగా చేర్చాల్సిన వ్యక్తిని బాధితుడిగా మార్చడం వెనుక ఆంతర్యం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. -
ఘరానా దొంగ అరెస్టు
విజయనగరం లీగల్ : విశాఖ జిల్లా పెదపల్లి గ్రామానికి చెందిన బొద్దపు బాబూరావు అనే ఘరానా దొంగను సీసీఎస్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. దొంగ వద్ద నుంచి రూ. 3 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు సీసీఎస్ డీఎస్పీ చక్రవర్తి తెలిపారు. ఆయన పేర్కొన్న వివరాల ప్రకారం సోమవారం రాత్రి స్థానిక మామిడి యార్డు సమీపంలో దొంగను అరెస్ట్ చేసి, ఆయన వద్ద నుంచి 90 గ్రాముల బంగారు, కేజీ వెండి ఆభరణాలు, వీడియో కెమెరాను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ఇటీవల కాలంలో ఈ దొంగ తూర్పు, పశ్చిమ జిల్లాల్లో అనేక చోరీలకు పాల్పడినట్లు డీఎస్పీ తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం, ఐ.పోలవరం, ముమ్మిడివరం పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇతనిపై కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. దొంగను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన సీఐలు పి.శోభన్‌బాబు, ఈ.నర్సింహమూర్తి, ఎస్సైలు జిఏవి.రమణ, ఐ. సన్యాసిరావు, ఎస్‌ఎస్‌నాయుడు, సిబ్బంది జి.నాగేంద్రప్రసాద్, ఎస్.కిరణ్‌కుమార్, పి.జగన్మోహన్లను డీఎస్పీ అభినందించారు. -
‘రాత్రి’ దొంగల అరెస్టు
రూ. 9లక్షల విలువైన చోరీ సొత్తు స్వాధీనం విజయవాడ: రాత్రిపూట దొంగతనాలకు పాల్పడే 8మందిని సీసీఎస్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 9లక్షల విలువైన257 గ్రాముల బంగారం, 3.3. కేజీల వెండి ఆభరణాల చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. కమిషనరేట్‌లో జాయింట్ పోలీసు కమిషనర్ హరికుమార్ విలేకరులతో మాట్లాడుతూ విజయవాడ, గుంటూరు పరిసరాల్లో పలు దొంగతనాల్లో 8మంది నేరస్తులను అరెస్టు చేశామని చెప్పారు. నిందితుల్లో విజయవాడ టుటౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో నివసించే చాట్ల శివారెడ్డి, కాగితాల శివశంకర్, గాడిల్లి శివ, పోలవరపు శ్రీను, తోటరామకృష పలు దొంగతనాలకు పాల్పడ్డారు. గత నెల 24వ తేదీన వన్‌టౌన్ శివాలయం ఏరియాలో రామ్‌గోపాల్ వీధిలో ఫస్ట్‌ప్లోర్‌లో తాళం వేసి ఉన్న ఓ ఇంల్లో ఈ ఐదుగరు దొంగతనానికి పాల్పడి, బీరువాలో నగలను దోచుకున్నారు. నిందితులు తాము దోచుకున్న 167గ్రాముల బం గారం, 3 కేజీల వెండి వస్తువులను, ఒక ఎల్.ఇ.డి. టీవీని విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. అదే విధంగా ఈనెల 7వ తేదీన వన్‌టౌన్ శివాలయం వీధిలో అనుమానంగా తిరుగుతున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. పట్టుబడిన ముగ్గురు నిందితులు గుంటూరు జిల్లా దేవరకొండకు చెందిన పాతనేరస్తులైన కర్రికిరణ్కుమార్, టి. వెంకటేశ్వరరావు, అలియాస్ బుడ్డా, దేవరకొండ శివరామకృష్ణగా గుర్తించారు. వీరంతా గతంలో పలు కేసుల్లో గుంటూరు జిల్లా జైలులో శిక్షను అనుభవించిన క్రమంలో వీరు స్నేహితులయ్యారు. జైలు నుంచి విడుదలయ్యాక ఒక ముఠాగా ఏర్పడి రాత్రిపూట ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడ్డారు. ఈ ముగ్గురు రెండు నెలల కాలంలో నాలుగు దొంగతనాలకు పాల్పడ్డారు. నగరంలో ఇబ్రహీంపట్నం, అజిత్‌సింగ్‌నగర్, మాచవరం, గుంటూరు జిల్లా మంగళగిరి, తాడేపల్లిలో దొంగతనాలకు పాల్పడ్డారు. వారి నుంచి 88 గ్రాముల బంగారం, 300గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. -
బైక్ దొంగలకు బ్రేక్
ముగ్గురి నుంచి 22 వాహనాల స్వాధీనం వీటి విలువ రూ. 6 లక్షలు చోరుల్లో ఇద్దరు బాలలు విజయవాడ: నగరంలో మోటారు బైక్‌లు దొంగిలిస్తున్న ముగ్గురిని సీసీఎస్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వారిలో ఇద్దరు బాలలు ఉండడం గమనార్హం. వారి వద్ద నుంచి రూ.6 లక్షల విలువైన 22 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా ఈ ముగ్గురు నిందితులు సీసీఎస్ పోలీసులకు చిక్కారు, వారిని విచారించగా దొంగతనాలు బైట పడ్డాయి. మారుతాళాలతో బైక్ మాయం నిందితులలో ఒకరు విజయవాడ వాంబేకాలనీకి చెందిన మల్లెల ఎనోష్ గవాస్కర్ అలియాస్ గవ్వా చిన్నప్పటి నుంచి దొంగతనాలు చేస్తుంటాడని పోలీసులు తెలిపారు. గత 9 నెలల కాలంలో మారుతాళాలను ఉపయోగించి పటమట పోలీసు స్టేషన్ పరిధిలో 11, పెనమలూరులో 1, కృష్ణలంక పోలీసు స్టేషన్ పరిధిలో 4 కలిపి మొత్తం మొత్తం 16 బైక్‌లను దొంగిలించారు. జల్సాల కోసం వాటిలో ఒక దానిని అమ్ముకుందామని పటమట ఎన్టీఆర్ సర్కిల్ సెంటర్ సమీపంలోకి రాగా అక్కడ వాహనాలు తనిఖీని గమనించి పారిపోవడానికి యత్నిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. జువెనైల్స్ నుంచి 6 బైక్‌లు సీసీఎస్ పోలీసులు లెనిన్ సెంటర్లో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు జువెనైల్స్ దొరికారు, వారి నుంచి 6బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురిని అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు. -
ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్
రూ.2.23 లక్షల బంగారం స్వాధీనం వరంగల్ : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దొంగతనాలకు పాల్పడిన ఇద్ద రు నిందితులను సిటీ సీసీఎస్ పోలీసులు గురువారం అరెస్టు చేసినట్లు సీపీ సుధీర్‌కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారి నుంచి రూ.2.23 లక్షల విలువ చేసే 82.250 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నింది తుల వివరాలను సీసీఎస్ సీఐ శ్రీధర్ వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన షేక్ ఇమ్రాన్, మహారాష్ట్ర హింగన్‌ఘాట్ గోమాజీగూడకు చెందిన సయ్యద్ అక్బర్ దగ్గరి బంధువులు కావడంతో వంట పను లు చేసుకుంటూ విజయవాడలో జీవనం సాగిస్తున్నారు. మద్యానికి బానిసైన ఇద్దరు 2013లో మొదటిసారి దొంగతనానికి పాల్పడ్డారు. మళ్లీ 2015లో ఖమ్మం టూటౌన్ పరిధిలో దొంగతనానికి పాల్పడడంతో పోలీసులకు చిక్కడంతో షేక్‌ఇమ్రాన్ జైలు పాలయ్యాడు. ఈ ఏడాది జైలు నుంచి విడుదలైన ఇమ్రాన్ మళ్లీ అక్బర్‌తో కలసి వరంగల్ కమిషనరేట్ పరిధిలో రెండు దొంగతనాలకు పాల్పడ్డాడు. జనవరిలో హైదరాబాద్‌కు వెళుతు న్న మహిళ నుంచి 55 గ్రాముల బంగారు నగలు, జులైలో వర్ధన్నపేట మండలం కక్కిరాలపల్లిలో తాళం వేసిన ఇంటి నుం చి 27.250 గ్రాముల బంగారం దొం గిలించారు. చోరీ చేసిన ఆభరణాలను ఆమ్మేందుకు విజయవాడ నుంచి ఇద్దరు వరంగల్ రైల్వే స్టేషన్‌కు వచ్చి అనుమానాస్పదంగా తిరుగుతుండగా పక్కా సమాచారంతో క్రైం ఏసీపీ ఈశ్వర్రావు ఇచ్చిన ఆదేశాల మేరకు అరెస్టు చేసినట్లు సీఐ శ్రీధర్ వెల్లడించారు. వారిని అరెస్ట్ చేసిన సీఐతోపాటు ఎస్సై సుమన్, ఏఎస్సై సంజీవరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరాజు, కానిస్టేబుళ్లు మున్నా, రవికుమార్, జంపయ్యను సీపీ సుధీర్‌బాబు అభినందించారు. -
మేమే డొనేషన్ ఇస్తాం.. సమన్లు తీసుకోండి
♦ లంచం ఇవ్వబోయిననిందితురాలితో సీసీఎస్ పోలీసులు ♦ విషయం తెలిసి సిబ్బందిని ప్రశంసించిన కమిషనర్ సాక్షి, హైదరాబాద్: ‘న్యాయస్థానం జారీ చేసిన సమన్లు ఇవ్వొద్దు. నేను అందుబాటులో లేనంటూ నమోదు చేసుకోండి. అందుకు ప్రతిగా రూ.500 ఇస్తా’ - సీసీఎస్ పోలీసులతో ఓ నిందితురాలి వ్యాఖ్య ‘అలా కుదరదు మేడం. ఎట్టి పరిస్థితుల్లోనూ సమన్లు అందుకోవాల్సిందే. అందుకు ప్రతిగా అవసరమైతే మేమే రూ.1000 డొనేషన్ ఇస్తాం’ - స్పష్టం చేసిన సీసీఎస్ సిబ్బంది కొన్ని రోజుల క్రితం జరిగిన ఈ అంశం మంగళవారం నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి దృష్టికి వచ్చింది. జరిగిన విషయం ఆరా తీసిన ఆయన లంచం తిరస్కరించిన కానిస్టేబుళ్లను ప్రశంసించారు. ఇదీ కేసు నేపథ్యం... నగరానికి చెందిన ఓ ప్రముఖ వ్యాక్సిన్ల తయారీ సంస్థ డెరైక్టర్ల మధ్య తలెత్తిన విభేదాలకు సంబంధించి నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) పోలీసులు 2013లో కేసు రిజిస్టర్ చేశారు. ఈ వ్యవహారంలో కుమార్తెల ఫిర్యాదు మేరకు తల్లిపై ఆరోపణలు నమోదయ్యాయి. ఆ సంస్థకు సీఎండీ వ్యవహరించిన యజమాని మరణానంతరం ఆయన కుమార్తెల్లో ఒకరు ఆ బాధ్యతలు స్వీకరించారు. మరో ఇద్దరు కుమార్తెలు బోర్డులో డెరైక్టర్లుగా ఉన్నారు. వీరిలో ఒకరు ఈ కుటుంబానికే చెందిన మరో సంస్థకూ డెరైక్టర్. యజమాని భార్య సైతం అప్పటికే ఆ బోర్డులో డెరైక్టర్‌గా కొనసాగుతున్నారు. 2013లో ‘మరో సంస్థ’కు చెందిన కీలక డాక్యుమెంట్లు దాని కార్యాలయం నుంచి పోయాయని, అందులో తమ తల్లి ప్రమే యం ఉందని ఆరోపిస్తూ కుమార్తెలు సీసీఎస్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇటీవల ఏం జరిగిందంటే... సీసీఎస్ పోలీసులు నమోదుచేసిన కేసులో నిందితురాలి గా ఉన్న మహిళకు న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. వీటిని అందించడానికి సీసీఎస్ సిబ్బంది వెళ్లారు. సమన్లు తీసుకోవడానికి నిరాకరించిన నిందితురాలు... పోలీసులకు రూ.500 లంచం ఇవ్వడానికి ప్రయత్నించారు. సదరు చిరునామాలో తాను అందుబాటులో లేనంటూ సమన్లు జారీ చేయవద్దని కోరారు. దీంతో సీసీఎస్ సిబ్బంది అసహనం వ్యక్తం చేస్తూ... సమన్లు స్వీకరించాలని, వాటితో పాటు తామే రూ.1000 డొనేషన్‌గా ఇస్తామంటూ ఆమెకు స్పష్టం చేశారు. అప్పటికీ తీసుకోవడానికి నిరాకరించడంతో ఆ సమన్లను ఆమె ఇంటి గేటు వద్ద అతికించి, ఆ ఫొటోలు తీసుకుని వచ్చా రు. ఈ కేసులో ఫిర్యాదుదారులు రెండు రోజుల క్రితం నగర కొత్వాల్‌ను కలిసి ‘రూ.500’ విషయంపై ఆయన కు ఫిర్యాదు చేశారు. దీంతో కమిషనర్ ఆరా తీయగా... జరిగిన విషయం ఆయన దృష్టికి వచ్చింది. లంచం తిరస్కరించడంతో పాటు సమన్ల జారీ విషయంలో నిబంధనల ప్రకారం వ్యవహరించిన సీసీఎస్ సిబ్బందిని ప్రశంసించారు. -
ముగ్గురు దొంగల అరెస్ట్... ఆభరణాలు స్వాధీనం
సంగారెడ్డి: మెదక్ జిల్లా సంగారెడ్డి సీసీఎస్ పోలీసులు ముగ్గురు దొంగలను సోమవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి 20 తులాల బంగారం, 20 తులాల వెండి ఆభరణాలు, మూడు ల్యాప్‌టాప్‌లు, ఎనిమిది సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు తెలిపారు. -
ఏడాదికి వడ్డీ మూడు శాతమే...
* ప్రాసెసింగ్ ఫీజు చెల్లిస్తే డబ్బు మీ అకౌంట్లోకి.. * రూ.10 లక్షల రుణమంటూ రూ.2.5 లక్షలు స్వాహా * ఢిల్లీ కేంద్రంగా కథ నడిపిన సైబర్ గ్యాంగ్ * ఇద్దరిని అరెస్టు చేసిన సీసీఎస్ పోలీసులు సాక్షి, సిటీబ్యూరో: నగరవాసికి మారు పేర్లతో ఫోన్లు చేశారు... రూ.10 లక్షల రుణం ఇస్తామంటూ ఎర వేశారు... వివిధ చార్జీల పేరుతో రూ.2.55 లక్షలు స్వాహా చేశారు... ఈ పంథాలో దేశ వ్యాప్తంగా అనేక మందికి టోకరా వేసిన ఢిల్లీ గ్యాంగ్ గుట్టును సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులు రట్టు చేశారు. ముఠాకు చెందిన రేణు పాండే, అమర్‌చంద్ కేసరిలను అరెస్టు చేసినట్లు సంయుక్త పోలీసు కమిషనర్ డాక్టర్ టి.ప్రభాకరరావు మంగళవారం వెల్లడించారు. ఢిల్లీకి చెందిన మధువేందర్ సింగ్, రేణు పాండే, అమర్‌చంద్ కేసరి ఓ ముఠాగా ఏర్పడ్డారు. న్యూఢిల్లీలో సోను వరల్డ్ విజన్ లిమిటెడ్, సిగ్నేచర్ హెల్త్ మేనేజ్మెంట్ పేర్లతో సంస్థలు ఏర్పాటు చేశారు. అందినకాడికి దండుకోవాలని కుట్ర పన్నిన ఈ త్రయం ఇవే పేర్లతో బ్యాంకు ఖాతాలు సైతం తెరిచారు. తమ కార్యాలయంలో టెలీకాలర్లను నియమించుకుని దేశవ్యాప్తంగా అనేక మంది వినియోగదారుల ఫోన్ నెంబర్లకు కాల్స్ చేయిస్తున్నారు. వివిధ బ్యాంకు నుంచి సాలీనా మూడు శాతం వడ్డీకి రుణాలు ఇప్పిస్తామంటూ టెలీకాలర్స్ ఎర వేస్తారు. గత ఏడాది సెప్టెంబర్‌లో గాజులరామారం ప్రాంతానికి చెందిన జె.కుమారస్వామికి ఓ ఫోన్ వచ్చింది. ఐఎన్జీ వైశ్యా బ్యాంకు ప్రధాన కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నట్లు రాజీవ్‌కుమార్ అనే వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. తక్కువ వడ్డీకి రుణం అని చెప్పడంతో రూ.10 లక్షలు తీసుకునేందుకు కుమారస్వామి అంగీకరించాడు. దీంతో ప్రాసెసింగ్ చార్జీల పేరు చెప్పిన రాజీవ్ తన సంస్థ పేరిట ఉన్న ఖాతాలోకి రూ.1.2 లక్షలు ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. ఆపై వాసుదేవ్ పండిట్ పేరుతో కాల్ చేసిన వ్యక్తి తాను ఆదాయపు పన్ను శాఖ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. రూ.10 లక్షల రుణానికి సంబంధించి ఆదాయపు పన్నుగా రూ.1.35 లక్షలు చెల్లించాలంటూ నమ్మబలికి బ్యాంకు ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. కొన్ని రోజులు రుణం కోసం వేచి చూసిన కుమారస్వామి రాజీవ్, వాసుదేవ్లుగా చెప్పుకున్న వ్యక్తులు కాల్ చేసిన నెంబర్లకు సంప్రదించే ప్రయత్నించారు. అవన్నీ స్విచ్ఛాఫ్‌లో ఉన్నట్లు తేలడంతో మోసపోయినట్లు గుర్తించి సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు ఏసీపీ కేసీఎస్ రఘువీర్ నేతృత్వంలో దర్యాప్తు చేశారు. సాంకేతిక ఆధారాలను బట్టి నిందితులు ఢిల్లీలో ఉన్నట్లు గుర్తించారు. ఇన్స్పెక్టర్ కేవీఎం ప్రసాద్, కానిస్టేబుళ్లు సతీష్, రమేష్, హరిప్రసాద్, సత్యవేణిలతో కూడిన బృందం ఢిల్లీ వెళ్లి రేణు పాండే, అమర్‌చంద్ కేసరిలను అరెస్టు చేసింది. ఈ ముఠా దేశ వ్యాప్తంగా అనేక మందికి రుణాల పేరుతో ఫోన్లు చేసి, ప్రాసెసింగ్ ఫీజులు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు, ఆర్బీఐ చార్జీలు, ఇన్‌కమ్‌ట్యాక్స్ చార్జీల పేరుతో రూ.25 వేల నుంచి రూ.1.5 లక్షల వరకు దండుకున్నట్లు గుర్తించారు. మొత్తమ్మీద రూ.3 కోట్ల మేర మోసాలు చేసిన ఈ ముఠాకు చెందిన మిగిలిన వారి కోసం సైబర్ క్రైమ్ పోలీసులు గాలిస్తున్నారు. -
చిట్‌ఫండ్ కార్యాలయంలో కరాటే కళ్యాణి హల్చల్
హైదరాబాద్ : సినీనటి కరాటే కళ్యాణి మరోసారి వార్తల్లో నిలిచింది. గతంలో పేకాట ఆడుతూ పట్టుబడిన ఆమె ఈసారి నగరంలోని ఓ ప్రముఖ చిట్‌ఫండ్స్ కార్యాలయంలో హల్చల్ చేసింది. తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వడం లేదంటూ కరాటే కళ్యాణి శనివారం అబిడ్స్‌లోని చిట్‌ఫండ్స్ ఆఫీస్‌లో నిరసన చేపట్టింది. తనకు రావాల్సిన 1.20వేల రూపాయలు చెల్లించాలని ఆమె కార్యాలయంలో ఆందోళనకు దిగింది. అయితే చిట్‌ఫండ్ కంపెనీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో కరాటే కళ్యాణి సీసీఎస్ పోలీసుల్ని ఆశ్రయించింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పట్టుకోండి చూద్దాం..!
పోలీసులకు సవాల్‌గా మారిన వృద్ధురాలి హత్య, దోపిడీ కేసు రంగంలోకి నాలుగు ప్రత్యేక బృందాలు, సీసీఎస్ పోలీసులు అయినా చిన్న క్లూ కూడా సాధించని వైనంఅనుమానితులను విచారణ చేయడానికే పరిమితం సంచలనం సృష్టించిన ఇద్దరు చిన్నారుల దారుణ హత్యోదంతం కేసును చాలెంజ్‌గా తీసుకుని అత్యంత చాకచక్యంగా హంతకులను గుర్తించి పట్టుకున్న మడకశిర పోలీసులు అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. ఆ తరువాత జరిగిన భారతమ్మ అనే వృద్ధురాలి హత్య, భారీ దోపిడీ కేసు దర్యాప్తులో వైఫల్యం చెందడంతో పోలీసుల పని తీరును అందరూ తప్పుబడుతున్నారు. కేసులో ఎటువంటి ప్రగతి లేకపోవడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. - మడకశిర మడకశిరలో భారతమ్మ(60) హత్య, దోపిడీ కేసు కుంటుపడిందా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఘటన జరిగి 80 రోజులు పైబడి కావస్తున్నా ఇంత వరకు చిన్న క్లూ కూడా పోలీసులు సాధించకపోవడం అనేక విమర్శలకు తావిస్తోంది. ఈ కేసులో కేవలం అనుమానం పేరుతో కొందరిని పిలిచి విచారణ చేయడం, ఆ తరువాత వారి పాత్ర లేదని తెలుసుకుని వదిలేయడం పరిపాటిగా మారింది. ఎప్పుడు జరిగిందంటే... డిసెంబర్ 3న సాయంత్రం 6 గంటలు కావస్తుండగా ఇంట్లో ఒంటరిగా ఉన్న భారతమ్మను గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చి, మృతదేహాన్ని ఇంట్లోని మరుగుదొడ్డిలో పడేశారు. ఆ తరువాత భారీగా బంగారు నగలు అపహరించారు. అప్పట్లో ఈ సంఘటన జిల్లాతో పాటు పొరుగున ఉన్న కర్ణాటకలోనూ సంచలనం సృష్టించింది. ప్రత్యేక బృందాలు ఏం చేస్తున్నట్లో..? హత్య, దోపిడీ అనంతరం నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఇంకా సీసీఎస్ పోలీసులు కూడా విచారణ చేపటారు. అయితే ఇంత వరకు ఎటువంటి పురోగతి సాధించలేకపోయారు. కనీసం చిన్న క్లూ కూడా సేకరించలేకపోయారంటే పోలీసులు ఎంత నిబద్ధతతో పని చేస్తున్నారో ఇట్టే అర్థమవుతోంది. ఈ ఉదంతంలో హంతకులను గుర్తించి అరెస్టు చేయడంలో మడకశిర పోలీసులు పూర్తిగా వైఫల్యం చెందారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కర్ణాటకలోనూ విచారణ మడకశిర కర్ణాటకకు అత్యంత చేరువలో ఉంది. హంతకులు కర్ణాటకకు పారిపోయి ఉండొచ్చని భావించిన పోలీసులు అక్కడి పోలీసులను అలర్ట్ చేసి, అక్కడా విచారణ చే శారు. అయినా ఫలితం లేదు. మడకశిర సీఐ హరినాథ్ ఏమంటున్నారంటే... భారతమ్మ కేసులో ఇంత వరకు ఎలాంటి క్లూ దొరకని మాట వాస్తవమే. అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నాం. ఈ కేసును మేం సవాల్‌గా తీసుకున్నాం. ప్రత్యేక బృందాలు శ్రమిస్తూనే ఉన్నాయి. హంతకులు ఎవరైందీ గుర్తించి పట్టుకుంటాం. -
పోలీస్ అభ్యర్థులపై నకిలీ ‘వల’!
-
పోలీస్ అభ్యర్థులపై నకిలీ ‘వల’!
♦ రిక్రూట్మెంట్ వెబ్‌సైట్‌ను పోలిన సైట్‌కు కేటుగాళ్ల రూపకల్పన ♦ చర్యలు తీసుకోవాలని సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు సాక్షి, హైదరాబాద్: నేరాలు నియంత్రించే పోలీసుల కొలువులో చేరుదామనుకుంటున్న అభ్యర్థులకు ఆ మోసాలు ఎలా ఉంటాయో ప్రత్యక్షంగా అనుభవమయ్యేలా నేరగాళ్లు చూపిస్తున్నారు. ఆధునిక సాంకేతితకను అనుకూలంగా మార్చుకొని ఖాకీల కొలువులకు భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశముంటాయన్న పక్కా ప్లాన్‌తో ఏకంగా నకిలీ వెబ్‌సైట్‌కు రూపకల్పన చేశారు. ఇది అసలు వెబ్సైట్ పేరుకు దగ్గరగా ఉండటంతో చాలా మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకొని మోసగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు. రిక్రూట్మెంట్ బోర్డు వాస్తవ వెబ్సైట్ www.tslprb.in కాగా.... అందుకు దగ్గరగా ఉండేలా నకిలీ వెబ్సైట్ www.telprb.com రూపొందించారు. నకిలీ వెబ్ స్క్రీన్‌పై ‘తెలంగాణ స్టేట్ పోలీస్ ఆన్లైన్ అప్లికేషన్’ అని ఉంది. దీంతో వెంటనే విషయం గ్రహించిన పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నష్ట నివారణ చర్యలను ప్రారంభించింది. నకిలీ వెబ్సైట్ ఉదంతాన్ని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసుల దృష్టికి తీసుకెళ్లిన రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ పూర్ణచందర్రావు...నిందితులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు నేరగాళ్లు ఆన్లైన్లో ఫీజులు వసూలు చేస్తున్నట్లు గుర్తించిన పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు...నకిలీ వెబ్సైట్ ద్వారా అభ్యర్థులెవరైనా ఫీజులు చెల్లించినట్లయితే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించింది. తొలి రోజే దాదాపు 10 వేల దరఖాస్తులు పోలీస్ కానిస్టేబుల్ దరఖాస్తులు తొలిరోజైన సోమవారం 10 వేలకు పైగా చేరినట్లు అధికారులు తెలిపారు. దరఖాస్తు విధానంలో అభ్యర్థులు తప్పిదాలకు పాల్పడకుండా ఉండేందుకు అధికారులు వెబ్సైట్లో డమ్మీ అప్లికేషన్‌ను ఏర్పాటు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 2012లో నిర్వహించిన రిక్రూట్మెంట్కు తెలంగాణ పది జిల్లాల నుంచి 2 లక్షల దరఖాస్తులు రాగా ఈసారి రిక్రూట్మెంట్కు భారీగా వయసు సడలింపు ఉండటం, చాలా కాలంగా నియామకాలు లేకపోవడంతో దాదాపు 3 లక్షల వరకు దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వెబ్సైట్లో అంతరాయం కలగకుండా ఉండటంతోపాటు 3 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చినా స్వీకరించేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. -
అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
బస్సుల్లో తిరుగుతూ ప్రయాణికుల సూట్ కేసులు, బ్యాగుల్లో ఉన్న విలువైన వస్తువులు అపహరిస్తున్న అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను సోమవారం కోదాడ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. దోపిడీలకు పాల్పడుతున్న వీరంతా ఉత్తర ప్రదేశ్ కు చెందిన వారని పోలీసులు తెలిపారు. వీరి నుంచి కేజీ బంగారం, రూ1.30 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో వీరిపై పలు కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వంచించి..వేధించాడు
సాక్షి, సిటీబ్యూరో: క్లాస్మేట్ అయిన స్నేహితురాలిని వంచించడంతో పాటు బ్లాక్మెయిల్ చేస్తూ వేధిస్తున్న యువకున్ని సీసీఎస్ నేతత్వంలోని 'షీ-టీమ్స్' బుధవారం అరెస్టు చేశాయి. నిందితుడిపై ఐటీ యాక్ట్‌తో పాటు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు అదనపు సీపీ స్వాతి లక్రా వెల్లడించారు. ఖమ్మం జిల్లా కొత్తగూడానికి చెందిన బి.తిలక్ అలియాస్ తిలక్ చౌదరి చెన్నైలోని ఓ సంస్థలో బయో ఇన్ఫర్మాటిక్స్ విభాగంలో బీటెక్ పూర్తి చేశాడు. ఉద్యోగం కోసం సిటీకి వచ్చి బేగంపేటలో నివసిస్తున్నాడు. కొంతకాలం పాటు జూబ్లీహిల్స్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేశాడు. తిలక్ క్లాస్మేట్, స్నేహితురాలు అయిన ఓ యువతి ఉద్యోగం కోసం గత ఏడాది జూలైలో సిటీకి వచ్చి మాదాపూర్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నారు. దాదాపు రెండేళ్లుగా ఆమెతో సన్నిహితంగా మెలిగిన తిలక్ ఆమె నమ్మకం సంపాదించాడు. గత ఏడాది సెప్టెంబర్‌లో ఓ ముఖ్యవిషయం మాట్లాడాలంటూ గదికి పిలిచాడు. కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి యువతికి ఇచ్చిన తిలక్ ఆమెపై అత్యాచారం చేయడంతో పాటు నగ్న చిత్రాలను తీసుకున్నాడు. అప్పటి నుంచి తరచు యువతిని వేధిస్తున్న తిలక్ తన మాట వినకుంటే ఆమె పేరుతోనే ఫేస్బుక్ ఖాతా తెరిచి, అందులో అప్లోడ్ చేస్తానంటూ బెదిరిస్తున్నాడు. ఓ సందర్భంలో తన వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్‌గా ఆ ఫొటోనే పెట్టడంతో పాటు స్నేహితులకూ ఫార్వర్డ్ చేశాడు. ఆమె ఉంటున్న హాస్టల్‌కు వెళ్ళి దురుసుగా ప్రవర్తించడంతో పాటు వాట్సాప్‌కు అసభ్య సందేశాలు పంపేవాడు. ఈ వేధింపులు మితిమీరడంతో బాధితురాలు 'షీ-టీమ్స్'కు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన అధికారులు బుధవారం నిందితుడిని అరెస్టు చేయడంతో పాటు ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్, ఫొటోలు స్వాధీనం చేసుకున్నారు. తిలక్‌ను కోర్టులో హాజరుపరిచిన సైబర్ క్రైమ్ పోలీసులు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. -
పోలీసు కస్టడీకి మాయగాడు మధు
హైదరాబాద్ : అమాయక యువతుల్ని లోబరుచుకున్న మహా మాయగాడు మధును సీసీఎస్ పోలీసులు బుధవారం కస్టడీలోకి తీసుకున్నారు. మధును తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ నగర సీసీఎస్ పోలీసులు సోమవారం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అందుకు నాంపల్లి కోర్టు అయిదు రోజుల పోలీసుల కస్టడీకి అనుమతించింది. ఎఫ్ సీఐ లో ఉద్యోగం చేస్తూ సస్పెండ్ అయ్యాడు. వందలాది మంది అమ్మాయిలను ట్రాప్ చేసి వారిని మోసం చేశాడు. మధును షీ-టీమ్స్ బృందం గత గురువారం పట్టుకుంది. నయవంచకుడి చేతిలో మోసపోయిన బాధితుల వివరాలతో పాటు ఇంకా ఏవైనా పంథాలు అనుసరించి ఎవరినైనా మోసం చేశాడా... అనే కోణంలో విచారించాలని పోలీసులు నిర్ణయించారు. దీనికోసం ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోర్టును కోరారు. ఇతడి నుంచి స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్స్ విశ్లేషించి, నివేదిక ఇవ్వడం కోసం రాష్ట్ర ఫోరెన్సిక్ లాబోరేటరీకి పంపాలని నిర్ణయించారు. వీటి ఆధారంగా బాధితుల వివరాలతో పాటు మరింత సమాచారం సేకరించే అవకాశం ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. -
పోలీసు కస్టడీకి మాయగాడు మధు
-
జల్సా దొంగలు
కడప అర్బన్ : తల్లిదండ్రుల చాటున పెరిగిన పిల్లలు.. దురలవాట్లకు బానిసలై.. డబ్బు సులభంగా సంపాదించాలనే అత్యాశతో దొంగతనాలకు పాల్పడుతూ చివరకు సీసీఎస్ పోలీసుల అదుపులోకి చేరారు. కడప నగరంతోపాటు జిల్లాలోని పలు చోట్ల తాళాలు వేసిన ఇళ్లను, ఆభరణాలు ధరించి ఒంటరిగా వెళుతున్న మహిళలను టార్గెట్ చేసి చైన్ స్నాచింగ్‌లకు పాల్పడం వీరి వృత్తిగా చేసుకున్నారు. కడప నబీకోట పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ఓ ముఠా దొంగతనాలకు పాల్పడుతూ వచ్చిన సొమ్ముతో ఏరోజుకారోజు బెంగళూరు నగరానికి చేరుకుని పబ్బుల్లో విలాసవంతంగా గడపడం అలవాటుగా చేసుకుంది. ఆ డబ్బు అయిపోగానే తిరిగి చోరీలకు, చైన్‌స్నాచింగ్‌లకు తెగబడుతున్నారు. నబీకోటలోని శివాలయం సమీపంలో ప్రతి రోజు కొంత మంది యువకులతో జతకట్టి పక్కా ప్రణాళికను తయారు చేసుకుంటారు. మొదట తాళాలు వేసిన ఇళ్లను గమనించి రావాలని దొంగల ముఠా నాయకుడు పంపిస్తాడు. తర్వాత తాము అనుకున్న ఇంటిని టార్గెట్‌గా చేసుకుని దోపిడీకి పాల్పడుతారు. వరుస చోరీలు: ఇటీవల కాలంలో కడప తాలూకా పరిధిలోని శివాలయం ఎదురు సందులో నివసిస్తున్న ఓ కుటుంబం తమ చిన్నారికి ఆరోగ్యం బాగా లేదని ఆస్పత్రికి వెళ్లారు. మరుసటి రోజు వచ్చి చూడగా, తమ ఇంటి ప్రధాన ద్వారంగా ఉన్న ఫ్లైవుడ్‌తో తయారు చేసిన తలుపును పగులగొట్టి బంగారు నగలు, నగదును దోచుకెళ్లారు. అలాగే రవీంద్రనగర్‌లో మరో నాలుగు రోజుల తర్వాత ఓ ఇంటిలో చోరీకి పాల్పడ్డారు. ఆ సంఘటన జరిగిన మరో నాలుగు రోజులకు నబీకోట-మరాఠి వీధి మధ్యలో ఉన్న ఓ వ్యక్తి తన కుటుంబ సభ్యులతో రాయవేలూరుకు వెళ్లి ఆ రోజు రాత్రి ఇంటిలో లేడు. ఆ విషయాన్ని గమనించిన దొంగలు మరుసటిరోజు సాయంత్రం ఆ వ్యక్తి వచ్చే సమయానికి దొంగతనానికి పాల్పడి భారీగా దోచుకెళ్లారు. స్థానికులు పట్టుకోవడానికి ప్రయత్నించినా.. చైన్‌స్నాచింగ్‌ల విషయానికి వస్తే చిన్నచౌకు, వన్‌టౌన్, తాలూకా పోలీసుస్టేషన్ల పరిధిలో మహిళలు ఎక్కడ ఒంటరిగా వెళుతున్నా వారి వెనుకవైపు నుంచి వెళ్లి మెడపై దడేలున కొట్టి వారు తేరుకునే లోపు బంగారు ఆభరణాలను దోచుకెళుతున్నారు. నబీకోటలో వారం రోజుల క్రితం పట్టపగలు 10.30 గంటల సమయంలో ఒంటరిగా వెళుతున్న ఓ వృద్ధురాలు మెడపై కొట్టి చైన్‌ను లాక్కొని వెళుతుండగా వారిని స్థానిక యువకులు ద్విచక్ర వాహనంలో వెంబడించారు. గువ్వలచెరువు ఘాట్ వరకు వెంట పడ్డారు. అంతలోపు స్థానిక యువకుల ద్విచక్ర వాహనం పంచరు కావడంతో ఇబ్బంది పడ్డారు. సదరు చైన్ స్నాచర్లు అలాగే రాయచోటి వైపు పరారయ్యారు. ప్రకాశ్‌నగర్‌లో ఓ న్యాయవాది సతీమణి ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా ఆమె మెడపై కొట్టి తేరుకునేలోపు బంగారు ఆభరణాన్ని దోచుకెళ్లారు. ఎట్టకేలకు కటకటాల పాలు: ఇలా చోరీలకు పాల్పడుతూ బంగారు ఆభరణాలను తీసుకొచ్చిన వాటిని సదరు ముఠా నాయకుడికి అప్పగిస్తారు. ఆయన తనకు తెలిసిన బంగారు నగల దుకాణాలలోనూ లేక ప్రైవేటు బ్యాంకులలోనూ తాకట్టు పెట్టి వచ్చిన డబ్బులో తానూ కొంత భాగాన్ని దోచుకొచ్చిన యువకులకు మరికొంత భాగాన్ని ఇచ్చి పంపిస్తాడు. ఈ ముఠాను పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఈ జట్టులో లీడర్‌తోపాటు ఆరుగురు సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది. భారీగా రికవరీ కూడా చూపించనున్నట్లు తెలుస్తోంది. -
పెళ్లి పేరుతో ఎర
గిఫ్ట్ పార్శిల్ పంపిస్తామని రూ. లక్షలు స్వాహా నైజీరియన్ ముఠా గుట్టు రట్టు నాంపల్లి : మ్యాట్రీమోని పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఓ నైజీరియన్ ముఠా ఆటకట్టించారు నగర సీసీఎస్ పోలీసులు. శుక్రవారం సీసీఎస్ జాయింట్ సీపీ ప్రభాకర్ రావు, ఏసీపీ బి.అనురాధ, ఇన్స్పెక్టర్ కేవీఎం ప్రసాద్‌తో కలిసి తెలిపిన వివరాల ప్రకారం.. తార్నాకలో ఉండే మహిళ (54) రెండో వివాహం కోసం భారత్ మ్యాట్రీమోనీ. కామ్‌లో భాగస్వామి కోసం రిజిస్ట్రేషన్ చేసుకుంది. అందులో కనిపించిన చంద్రన్ డేవిడ్ పటేల్ అనే వ్యక్తి ఫొటోకు లైక్ కొట్టింది. ఇద్దరూ ఆన్లైన్లో చాటింగ్ చేసుకున్నారు. ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఆ మహిళ అతడి ప్రొఫైల్‌లో డౌన్లోడ్ చేసుకుంది. వయస్సు 51 ఏళ్లు. మియామి ప్లోరిడాలో ఆపరేషన్ మేనేజర్‌గా పని చేస్తున్నట్టు ఉంది. ప్రొఫైల్ చూసి సంబరపడింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెళ్లికి ముందు ఒక గిఫ్ట్(బహుమతి) పార్శిల్ పంపుతున్నానని, అందులో విలువైన ఆభరణాలై బంగారం గొలుసు, ఉంగరం, రూ.40 వేల డాలర్లు ఉన్నాయని డేవిడ్ ఆమెకు చెప్పాడు. మరుసటి రోజు తార్నాకలోని గ్లోబల్ సెక్యూరిటీస్ సంస్థ నుంచి మాట్లాడుతున్నానని ఓ వ్యక్తి ఆమెకు ఫోన్ చేశాడు. గిఫ్ట్ పార్శిల్ ఢిల్లీ ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్టుకు చేరుకుందని, ఇది మీకు చేరాలంటే కస్టమ్స్ సుంకం, ఆదాయపు పన్ను కట్టాలన్నాడు. దీంతో ఆమె పలు దఫాలుగా రూ.15 లక్షల 60 వేలు వారు చెప్పిన బ్యాంక్ అకౌంట్లలో జమ చేసింది. మరో రూ. 2.5 లక్షలు చెల్లిస్తేగాని గిఫ్ట్ పార్శిల్ మీకు చేరదని చెప్పడంతో ఆమెకు అనుమానం వచ్చి ఆరా తీయగా తనతో చాటింగ్ చేసిన వ్యక్తి మోసగాడని తెలిసింది. బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల దర్యాప్తులో ఈ మోసాలకు పాల్పడున్నది నైజీరియాకు చెందిన ఇక్‌బుటే కింగ్స్లే ఉచికా అలియాస్ టోనీ, అతడని సోదరుడు ఇక్‌బుటే జుడే నవాబులర్ అని తేలింది. బిజినెస్, స్టూడెంట్ వీసాలపై ఢిల్లీకి చేరుకున్న వీరిద్దరూ భారత్ మ్యాట్రిమనీ.కామ్‌లో ఇతరుల ఫొటోలు, ఫేక్ బయోడేటాలు అప్లోడ్ చూస్తూ అమాయకులను వివాహం పేరుతో మోసం చేస్తున్నారు. వివిధ బ్యాంకుల్లో వేరే వారి పేరుతో 8 అకౌంట్లు తెరిపిస్తున్నారు. తాము వల వేసిన వారు గిఫ్ట్ ట్యాక్స్ కోసం ఆ అకౌంట్లలో డబ్బు వేసేలా చేస్తున్నారు. తర్వాత ఆ డబ్బు డ్రా చేసి ఇచ్చిన వారికి కొంత కమీషన్ ఇస్తున్నారు. రాహుల్ పాండే పేరుతో తెరిచిన అకౌంట్లో 12 రోజుల్లోనే రూ.44 లక్షలు, నిఖిల్ శర్మ పేరుతో తెరి చిన అకౌంట్లో నెల రోజుల్లో రూ.50 లక్షల లావాదేవీలు జరిగాయి. బ్యాంకుల ద్వారా సేకరించిన ఆధారాలతో నలుగురు నిందితులను అరెస్టు చేశారు. మరో 9 మంది పరారీలో ఉన్నారు. పట్టుబడిన వారిలో ఇక్‌బుటే కింగ్స్లే ఉచికా, ఇక్‌బుటే జుడేతో పాటుగా బ్రోకర్లు సంతోష్ కుమార్, దీరేందర్ కుమా ర్ అలియాస్ ధనుష్ అలియాస్ రాహుల్ పాండే ఉన్నారు. వీరిని సీసీఎస్ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుంచి 3 ల్యాప్‌టాప్‌లు, రూ.1,38, 000 వేల నగదు, 350 యూఎస్ డాలర్లు, 10 సెల్ఫోన్లు తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. -
చోరీ ముఠాల అరెస్టు
♦ 43 మోటారు సైకిళ్లు ♦ 136గ్రాముల బంగారు నగలు ♦ రూ.20వేల నగదు స్వాధీనం విజయవాడ సిటీ : పోలీసు కమిషనరేట్‌లో చోరీలకు పాల్పడుతున్న పలు ముఠాలను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి పెద్ద మొత్తంలో మోటారు సైకిళ్లు, నగలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల వివరాలను శుక్రవారం కమిషనరేట్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ ఎల్.కాళిదాస్ అదనపు డీసీపీ(క్రైమ్స్) జి.రామకోటేశ్వరరావుతో కలిసి వివరించారు. రెండు ముఠాల అరెస్టు వేర్వేరుగా మోటారు సైకిళ్ల చోరీకి పాల్పడుతున్న రెండు ముఠాలను అరెస్టు చేసి రూ.8.55 లక్షల విలువైన 43 మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన సంగోజు విజయ్ భాస్కర్, పమిడిముక్కల మండలం కపిలేశ్వరపురం గ్రామానికి చెందిన లంకా విజయ కుమార్ కలిసి ఇళ్లముందు పెట్టిన మోటారు సైకిళ్లను చోరీ చేశారు. నిందితులను అరెస్టు చేసి పలు ప్రాంతాల్లో చోరీ చేసిన 22 మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.3.68లక్షలు ఉంటుందని డిసీపీ చెప్పారు. గుణదలకు చెందిన కంచర్ల గోపినాథ్, చల్లమల్ల హేమంత్, చాతులూరి వసంత్, తాడిపత్రి రాజ్‌కుమార్, మామిడి శివ, పక్కి వినయ్ మరో బాలుడితో కలిసి మోటారు సైకిళ్లు చోరీ చేశారు. వీటిని ఉంగుటూరు మండలం వెల్దిపాడుకు చెందిన మెకానిక్ లామ్ నవీన్ ద్వారా విక్రయిస్తున్నట్టు గుర్తించి నిందితులతో పాటు మెకానిక్‌ను కూడా అరెస్టు చేశారు. అరెస్టు చేసిన నిందితుల నుంచి రూ.4.87లక్షల విలువైన 21మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. మహిళల అరెస్టు వేర్వేరు చోరీ కేసుల్లో ఇద్దరు మహిళలను అరెస్టు చేయగా ఒకరు పరారీలో ఉన్నారు. ఖమ్మం జిల్లా మధిర మండలం రాయపట్నం గ్రామానికి చెందిన నల్లబోతుల నాగమణి ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు తల్లి పుల్లమ్మతో కలిసి చోరీలు ప్రారంభించింది. గత నెల 18న బెంజిసర్కిల్ సమీపంలోని ఖజానా జ్యుయలరీ, లబ్బీపేటలోని మలబార్ జ్యుయలరీ దుకాణాల్లో నగలు చూపించే సేల్స్‌మేన్ ఆదమరిచి ఉన్న సమయంలో గిల్టు నగలు పెట్టి బంగారు నగలు చోరీ చేశారు. వీరిలో పుల్లమ్మ పరారీలో ఉండగా నాగమణిని అరెస్టు చేసి 40 గ్రాముల నగలు స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో చిట్టినగర్ గూడేల రాము వీధికి చెందిన కర్రి గాయత్రిని అరెస్టు చేసి 96 గ్రాముల బంగారు నానుతాడు స్వాధీనం చేసుకున్నారు. బత్తుల నాగేశ్వరరావు ఇంట్లో పని చేసే గాయత్రి గత నెల 28న యజమానురాలు అనారోగ్యంతో ఉండటాన్ని గమనించి నానుతాడు చోరీ చేసింది. జేబు దొంగల అరెస్టు రద్దీ ప్రాంతాల్లో జేబు చోరీలకు పాల్పడుతున్న కేసులో పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కోండ్రుపోలుకు చెందిన ఎరసాని సుబ్బారావు, ఎరసాని అంతర్వేది, కుంభా శ్రీను, చినమర్తి శ్రీనును అరెస్టు చేశారు. గత నెల 4, 22 తేదీల్లో నిందితులు ఉయ్యూరులో రద్దీగా ఉన్న ప్రాంతాల్లో జేబు దొంగతనాలు చేసినట్టు చెప్పారు. వీరి నుంచి రూ.20వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. గట్టి నిఘా పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు సీసీఎస్ పోలీసులు అన్ని రకాల చోరీలపై గట్టి నిఘా పెట్టినట్టు డీసీపీ కాళిదాస్ తెలిపారు. పలు కేసుల్లో నిఘా పెట్టి నిందితుల అరెస్టుతో పాటు భారీగా సొత్తు స్వాధీనం చేసుకున్న సీసీఎస్ పోలీసులను సీపీ అభినందించారని, రివార్డులు కూడా అందజేయనున్నట్లు డీసీపీ చెప్పారు. -
పోలీసు దొంగ..!
- విగ్రహాల కేసులో ఓ ఇంటెలిజెన్స్ పోలీస్‌ను అదుపులోకి తీసుకున్న పొలీసులు - ఇంట్లోనే విగ్రహాలు అమ్ముతూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన వైనం - పోలీసుల అదుపులో మరో నలుగురు విగ్రహాల దొంగలు కదిరి: ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుంటే అదుపు చేయాల్సిన పోలీసే పలు విగ్రహాల చోరీ కేసుల్లో నిందితుడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆలయాల్లో చోరీ చేసిన విగ్రహాలను ఆ పోలీస్ తన ఇంట్లో అమ్ముతూ రెండురోజుల క్రితం సీసీఎస్ పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. విశ్వసనీయ సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. జిల్లాలో ఎక్కడైనా మతపరమైన శాంతి భద్రతలకు విఘాతం కల్గుతుందనే సమాచారం ఎప్పటికప్పుడు జిల్లా ఎస్పీ దృష్టికి చేరవేయడానికి కౌంటర్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది. ఇందులో పనిచేసే పోలీసులు సివిల్ డ్రెస్‌లోనే ఉంటారు. నిత్యం ప్రజలతో మమేకమై తిరుగుతుంటారు. ఈ విభాగంలో పని చేసే ఓ పోలీస్ జిల్లా కేంద్రంలోని కొవ్వూరు నగర్లో కాపురముంటున్నారు. ఇటీవల కాలంలో పలు ఆలయాల్లో విలువైన విగ్రహాల చోరీ అయ్యాయి. దీన్ని జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబు సీరియస్‌గా తీసుకున్నా రు. దీని వెనుక ఎంతటి వ్యక్తులున్నా సరే వదిలిపెట్టకండని అన్ని పోలీస్ సబ్ డివిజన్లలో పనిచేసే డీఎస్పీలను ఆదేశించారు. రంగంలోకి దిగిన సీసీఎస్ పోలీసులు జిల్లా వ్యాప్తంగా సంచరించి ఇద్దరు విగ్రహాల దొంగలను అదుపులోకి తీసుకుని విచారిస్తే కౌంటర్ ఇంటెలిజె న్సీలో పని చేసే ఆ పోలీస్ పేరు వారు చెప్పారు. దీంతో పోలీసులు అవాక్కయ్యారు. ఈ విషయం వెంటనే ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. ఆ పోలీస్‌పై నిఘా ఉంచారు. రెండు రోజుల క్రితం ఆ పోలీస్ తన ఇంట్లో ఎంతో విలువైన సీతారామలక్ష్మణులతో పాటు ఆంజనేయుడి విగ్రహాలను అమ్ముతుంటే సీసీఎస్ పోలీ సులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం అతడిని విచారిస్తే తనకెలాంటి సంబంధం లేదని, తన బంధువులు ఒకరిద్దరు విగ్రహాల చోరీలలో సిద్ధహస్తులని, వారు తీసుకొచ్చిన విగ్రహాలు తన ఇంట్లో దాచి విక్రయించేవారని చెప్పినట్లు సమాచారం. అయితే ఆయన దగ్గర విగ్రహాల చోరీలకు సంబంధించిన కీలక విషయాలు రాబట్టినట్లు తెలిసింది. రాయచోటి రోడ్డులో ఓ బావిలో కూడా కొన్ని విగ్రహాలు దాచారని, వాటికోసం నేడో, రేపో సీసీఎస్ పోలీసులు కదిరికి రానున్నారని విశ్వసనీయ సమాచారం. సీసీఎస్ పోలీ సులు అదుపులోకి తీసుకున్న ఆ కౌంటర్ ఇంటిలిజెన్స్ పోలీస్ ఇటీవల పలు మార్లు కదిరిలో సంచరించారు. అదే సమయంలోనే మరకత మహాలక్ష్మి ఆలయంలో చోరీ జరిగింది. ఆ కేసులో కూడా ఇతని హస్తం ఉండవచ్చని అనుమానిస్తున్నారు. -
ఇద్దరు దొంగలు అరెస్టు
ఒకరు విశాఖపట్నంకు చెందిన అంతర్రాష్ట్ర దొంగ మరొకరు శ్రీకాకుళం జిల్లాకు చెందిన పాత నిందితుడు నిందితుల నుంచి రూ.10.60 లక్షల సొత్తు స్వాధీనం వివరాలు వెల్లడించిన ఏఎస్పీ రామానాయక్ ఒంగోలు క్రైం : ఒంగోలు సీసీఎస్ పోలీసులు ఇద్దరు దొంగలను అరెస్టు చేశారు. వారిలో ఒకరు అంతర్ రాష్ట్ర దొంగ కాగా, మరొకరు అంతర్ జిల్లా దొంగ. స్థానిక సీసీఎస్ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం సాయంత్రం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సీసీఎస్ డీఎస్పీ కేశన వెంకటేశ్వర్లుతో కలిసి జిల్లా అదనపు ఎస్పీ బి.రామానాయక్ ఆ వివరాలు వెల్లడించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం... ఒంగోలుతో పాటు జిల్లాలో దొంగతనాలపై ప్రత్యేక నిఘా కోసం రెండు బృందాలు ఏర్పాటు చేశారు. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న అంతర్ రాష్ట్ర దొంగ వాండ్రాసి ఆనందకుమార్ (29)ను ఆయా బృందాలు అదుపులోకి తీసుకున్నాయి. అతని నుంచి 48 సవర్ల బంగారు ఆభరణాలు, 1.5 కేజీల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.10 లక్షల వరకూ ఉంది. ఆనంద్‌కుమార్ విశాఖపట్నం మధురవాడ జంక్షన్ వాసి. గతంలో విశాఖపట్నంలోని జనరల్ స్టోర్‌లో పనిచేస్తూ డ్యాన్స్ ఈవెంట్లు కూడా చేసేవాడు. అయితే, దొంగతనాలకు అలవాటు పడి విశాఖపట్నంతో పాటు అనంతపురం, ఏలూరు, ప్రాంతాల్లో పలు దొంగతనాలకు పాల్పడ్డాడు. అతనిపై విశాఖపట్నంతో పాటు గాజువాక, హైదరాబాద్, కూకట్పల్లి, పంజాగుట్ట, మయ్యాపూర్, అనంతపురం, భీమవరం ప్రాంతాల్లో దొంగతనం కేసులు ఉన్నాయి. 2015 జూలైలో ఒంగోలు తాలూకా పోలీస్‌స్టేషన్ పరిధిలోని సుజాతనగర్ 10వ లైన్లో క్రోసూరి మురళీధర్ ఇంట్లో 5 సవర్ల బంగారు ఆభరణాలు దొంగిలించాడు. అదేరోజు సాయంత్రం తాలూకా పరిధిలోని రాజీవ్‌నగర్‌లో పచ్చవ వరలక్ష్మి ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళాలు పగులగొట్టి 1.5 కేజీల వెండి వస్తువులు, ఒక సవర బంగారు వస్తువు అపహరించుకుపోయాడు. ఇతర జిల్లాల్లోనూ అనేక చోరీలకు పాల్పడ్డాడు. రెండో దొంగ పాత నిందితుడే... పట్టుబడిన రెండోదొంగ శ్రీకాకుళం జిల్లా బుడితికి చెందిన గురివిల్ల అప్పలనాయుడు కాగా, ఇతను ప్రస్తుతం సింగరాయకొండలోని సోమరాజుపల్లి పంచాయతీ టి.పి.నగర్లో నివాసం ఉంటున్నాడు. గతంలో జిల్లాలో పలు దొంగతనాలు చేసి ఆయా కేసుల్లో పట్టుబడి రిమాండ్‌కు వెళ్లాడు. ఈ నెల 2వ తేదీ జైలు నుంచి బయటకు వచ్చాడు. మళ్లీ ఒంగోలు తాలూకా పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎన్జీవో కాలనీలో నివాసముంటున్న ఇంజినీరింగ్ విద్యార్థులు గదిలో చొరబడి రూ.60 వేల విలువైన రెండు ల్యాప్‌ట్యాప్‌లు అపహరించాడు. రెండోసారి పోలీసులకు పట్టుబడ్డాడు. ఇద్దరు దొంగలను పట్టుకున్న సీసీఎస్ డీఎస్పీ వెంకటేశ్వరరావుతో పాటు సీఐ ఎ.ఎన్.ఆర్.కె.రెడ్డి, తాలూకా సీఐ ఎస్.ఆంటోనిరాజ్, సీసీఎస్ ఎస్సైలు ఎస్.కె.నాయబ్స్రూల్, పి.రామిరెడ్డి, హెడ్ కానిస్టేబుళ్లు బాల, కోటి, సిబ్బంది అంజిబాబు, సాయి, ప్రసాదు, శాంత, ఖాదర్, సందాని, శేషులను ఏఎస్పీ రామానాయక్, ఎస్పీ శ్రీకాంత్‌లు అభినందించారు. -
మారేడుపల్లి దాడి ఘటనపై.. సీసీఎస్ పోలీసుల విచారణ
మారేడుపల్లి : పోలీస్‌స్టేషన్‌పై దాడి ఘటనలో సీసీఎస్ పోలీసులు దర్యాప్తు వేగం పెంచారు. ఆ సమయంలో మారేడుపల్లి స్టేషన్లో ఉన్న ఎస్ఐలు రవి, మధులను ఆరుగురు ఇన్స్పెక్టర్ల బృందం శనివారం పోలీస్‌స్టేషన్‌లో విచారించింది. గొడవకు ముందు, అనంతరం పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. దాడి ఘటనలో తన పొరపాటు లేదని, బన్నప్పపై తాము చేయిచేసుకోలేదని ఎస్సైలు వివరించారు. ఇదిలాఉండగా దాడికి ముందు పోలీసులతో వివాదాలు ఉన్న వారి ఫొటోలతో పాటు, రాజీ కుదిర్చేందుకు వచ్చిన వారి ఫొటోలను, సీపీ కెమెరాల ఫుటేజ్‌తో అనుసంధానించి చూస్తున్నారు. దాడి సమయంలో అక్కడికి వచ్చిన స్థానిక ఎమ్మార్పీఎస్ డివిజన్ నేత సాయితో పాటు పలువురిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకోని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. రాత్రి సమయంలో మరో పది మందిని పోలీసులు తీసుకువెళ్లినట్లు ప్రచారం జరుగుతుండగా, పోలీసులు మాత్రం ధ్రువీకరించలేదు. బలప్రయోగంతోనే మృతి.. మానవ హక్కుల వేదిక సాక్షి,సిటీబ్యూరో : పోలీసుల బలప్రయోగంతోనే బన్నప్ప మృతిచెందినట్లు తమ నిజనిర్ధారణలో వెల్లడైందని మావన హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.జీవన్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసుల ఆధీనంలో ఒక రాత్రి ఉండి అనుమానాస్పద స్థితిలో బన్నప్ప మృతి ఘటనపై జిల్లా జడ్డితో న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మృతుడి భార్యకు ప్రభుత్వ ఉద్యోగంతో పాటు, గృహవసతి కల్పించాలని కోరారు. పోలీస్‌స్టేషన్‌పై దాడి చేశారనే నెపంతో యువకులను, స్థానికులను అరెస్టు చేసి వేధింపులకు గురి చేయవద్దని వివరించారు. బోనాల సందర్భంగా మద్యం సేవించిన బన్నప్ప ఒక కానిస్టేబుల్‌తో గొడవకు దిగాడనే చిన్న కారణంతో అదుపులోకి తీసుకొని పోలీసులు అతనిపై బలప్రయోగం చేయడం దారుణమని ఆరోపించారు. ఈ నిజనిర్ధారణ కమిటీలో హెచ్ఆర్ఎఫ్ సభ్యులు ఎ.కిషన్, రాజశేఖర్,గౌతం, సూర్యం ఉన్నారు. -
సీసీఎస్ ముందుకు అవుట్ లుక్ జర్నలిస్ట్
హైదరాబాద్: ఐఎఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ పై అవమానపరుస్తూ కథనాన్ని రాసిన అవుట్ లుక్ జర్నలిస్టు మాధవి టాటాను సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు విచారిస్తున్నారు. ఆమె మంగళవారం పోలీసులు ఎదుట హాజరయ్యారు. 41 ఏ కింద కేసు నమోదు చేసిన పోలీసులు ...విచారణ హాజరు కావాలని నోటీసులు జారీ చేయడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఈ వివాదాస్పద కథనం మహిళా జర్నలిస్టు మాధవి టాటా పేరుతో ప్రచురితమైంది. ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌ను అవమానించే విధంగా ఔట్లుక్ ఆంగ్ల పత్రిక ఒక కథనంతో పాటు కార్టూన్ వేయడంపై ఆమె భర్త అకున్ సబర్వాల్ సీసీఎస్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హైదరాబాద్ పోలీసులు 509 ఐసీసీ, ఐటీ యాక్ట్ 67 సెక్షన్‌తో పాటు 3 ఆర్/డబ్ల్యూ సెక్షన్ల కింద ఔట్లుక్ యాజమాన్యంతో పాటు, ఉద్యోగులపై కేసు నమోదు చేశారు. తెలంగాణా ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్న స్మితా సబర్వాల్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఇంగ్లీష్ మ్యాగ్జైన్ ఔట్లుక్ ఒక వివాదాస్పద కథనాన్ని ప్రచురించింది. ముఖ్యంగా గాసిప్ కాలంలో పత్రిక ప్రచురించిన అసభ్యకర కార్టూన్ పై విమర్శలు చెలరేగిన సంగతి తెలిసిందే. -
చీటింగ్ ముఠా అరెస్ట్..
కర్నూలు : అసలు నోట్లకు మూడింతలు నకిలీ నోట్లు ఇస్తామంటూ సినీ ఫక్కీలో మోసానికి పాల్పడి తప్పించుకు తిరుగుతున్న చీటింగ్ గ్యాంగ్‌ను కర్నూలు సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.4 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను ఎస్పీ ఆకే రవికృష్ణ ఎదుట హాజరుపరిచారు. అదనపు ఎస్పీ శివకోటిబాబురావు, కర్నూలు డీఎస్పీ రమణమూర్తి, సీసీఎస్ డీఎస్పీ హుసేన్ పీరాతో కలిసి గురువారం మధ్యాహ్నం స్థానిక వ్యాస్ ఆడిటోరియంలో ఎస్పీ ఇందుకు సంబంధించి వివరాలను విలేకరులకు వెల్లడించారు. కర్నూలు ధర్మపేటకు చెందిన ఆరెకంటి కుమార్, పాతబస్తీకి చెందిన షేక్ సలీం, ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం బెస్తవారిపేట అంబేద్కర్ కాలనీ ఏబీఎం కాంపౌండ్‌కు చెంది న గంటెపోగు కృపాకర్ ముఠాగా ఏర్పడి మోసాలకు పాల్పడుతున్నారు. కర్నూలు ఎ.క్యాంప్‌కు చెందిన రఘుబాబు నాయుడికి రెండున్నర నెలల క్రితం షేక్ సలీంతో పరిచయం ఏర్పడింది. రఘుబాబు ఆర్థిక కష్టాల గురించి ఆరా తీసిన సలీం అవి తీరాలంటే లక్షకు మూడింతలు దొంగ నోట్లు ఇస్తారంటూ కుమార్‌ను పరిచయం చేయించాడు. ముందుగా నకిలీవంటూ అసలు నోట్లు రెండు ఇవ్వగా రఘుబాబు వాటిని మార్చుకుని అసలు మాదిరిగా ఉన్నాయంటూ ఆశ పడ్డాడు. మూడింతల నకిలీ నోట్ల కోసం రూ.5 లక్షలు అసలు నోట్టిచ్చేందుకు అంగీకరించాడు. గత నెల 26న డబ్బు సర్ధుకుని మిత్రుడు శివకుమార్‌తో కలిసి రాజ్‌విహార్ దగ్గర ఉన్న జ్యోతి డార్మెటరీ వద్ద సలీంను కలిశాడు. అప్పటికే తెల్ల పేపర్ కట్టలపై కొన్ని అసలు నోట్లు పేర్చి బ్యాగుతో సిద్ధంగా ఉన్న సలీం, కుమార్ వాటిని రఘుబాబుకు ఇచ్చారు. ఇదేసమయంలో పోలీసు వేషంలో ఉన్న ముఠాలోని మరో ఇద్దరు సభ్యులు పథకం ప్రకారం అక్కడికి చేరుకుని కేసులు పెడతామంటూ హడావుడి చేయగా రఘుబాబు, అతని మిత్రుడు డబ్బు వదిలేసి పారిపోయారు. అనంతరం ముఠా సభ్యులు డబ్బులను పంచుకున్నారు. సలీమ్, కుమార్ ముఠా సభ్యులు ఇలాంటి మోసాలకు పాల్పడుతుంటారని ఆలస్యంగా గ్రహించిన రఘుబాబు తన బావ రమేష్ నాయుడు సూచన మేరకు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. పోలీసులవేషంలో వచ్చిన రాజగోపాల్, మోసే రాజు పరారీలో ఉ న్నారని, త్వరలో పట్టుకుంటామని ఎస్పీ వెల్లడించారు. చీటింగ్ గ్యాంగ్‌ని పట్టుకున్న సీసీఎస్ ఏఎస్ఐ రవూఫ్, హెడ్ కానిస్టేబుల్ మస్తాన్, రెండవ పట్టణ హెడ్ కానిస్టేబుల్ కరీం, కానిస్టేబుళ్లు సుదర్శన్, సమీర్, నాగరాజు, కిషోర్ తదితరులను ఎస్పీ అభినందించారు. బాధితులుంటే పోలీసులను కలవండి.. ఇలాంటి తరహా మోసాలకు గురైనవారుంటే ముందుకు రావాలని ఎస్పీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. సగం ధరకే బంగారం, పెద్ద మొత్తంలో లాటరీ తగిలింది.. సర్వీస్ చార్జిలు అకౌంట్లో జమ చేయండి, ఉద్యోగం పేరుతో నిరుద్యోగులను సెల్ఫోన్లోనే ఇంటర్వ్యూలు చేసి ప్రాసెసింగ్ చార్జీల పేరుతో వేలాది రూపాయలు వసూలు చేయడం తదితర మూడు రకాల ముఠాలు జిల్లాలో సంచరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ ప్రజలకు సూచించారు. ఇందుకు సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే తనకు ఫోన్(94407 95500) చేయాలని విజ్ఞప్తి చేశారు. రెండవ పట్టణ సీఐ ములకన్న, సీసీఎస్ సీఐ పవన్‌కిషోర్, ఎస్ఐలు శ్రీహరి, నయాబ్ రసూల్, రాకేష్ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు
ఒంగోలు క్రైం : అంతర్రాష్ట్ర దొంగ గురివిల్ల అప్పలనాయుడును ఒంగోలు సీసీఎస్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఈ మేరకు స్థానిక సీసీఎస్ పోలీసుస్టేషన్లో అదనపు ఎస్పీ బి.రామానాయక్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నిందితుని వివరాలు వెల్లడించారు. ఏఎస్పీ కథనం ప్రకారం.. అప్పలనాయుడు పట్టపగలు దొంగతనాలు చేయటంలో దిట్ట. ఈ ఏడాది మే 19న ఒంగోలు పట్టణం అద్దంకి బస్టాండ్ సెంటర్లోని టైర్ల షాపులో పట్టపగలే రూ.8.59 లక్షల నగదు చోరీ చేశాడు. అదే విధంగా 2014 నవంబర్‌లో కందుకూరు పట్టణంలో పామూరు రోడ్డులోని సిమెంట్ దుకాణంలో రూ.2.65 లక్షలు దోచుకెళ్లాడు. తాళాలు వేసి ఉన్న క్యాష్ కౌంటర్లలోని నగదు అపహరించటంలో అప్పలనాయుడు నేర్పరి. నిందితుని స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా బుడితి గ్రామం. కొంత కాలంగా సింగరాయకొండ మండలం సోమరాజుపల్లి తిరుమల పట్టాభినగర్లో నివాసం ఉంటున్నాడు. 22 ఏళ్ల నిందితుడు చిన్న తనం నుంచే చెడు వ్యసనాలకు లోనై దొంగతనాలు చేయడమే వృత్తిగా పెట్టుకున్నాడు. దొంగతనాలకు సంబంధించిన కేసులపై విచారిస్తున్న సమయంలో ఫింగర్ ప్రింట్స్ సీఐ ఇచ్చిన ఆధారాల ప్రకారం ఒంగోలు, కందుకూరు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడింది అప్పలనాయుడిగా పోలీసులు గుర్తించారు. అతని కదలికలపై నిఘా ఉంచారు. నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో ఓ యువకుడు అనుమానాస్పదంగా తిరుగుతుండగా ఒంగోలు ఒన్‌టౌన్ పోలీసులు, సీసీఎస్ పోలీసులు పట్టుకొని విచారించగా అతడు అప్పలనాయుడుగా తేలింది. నిందితునిపై ఒంగోలు ఒన్‌టౌన్, తాలూకా, హైదరాబాద్ వనస్థలిపురం పోలీస్స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నాయని ఏఎస్పీ వెల్లడించారు. ఈ సందర్భంగా సీసీఎస్ డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐలు సీహెచ్ వెంకటేశ్వరరావు, భూషణం, ఏఎస్ఆర్కే రెడ్డి, ఒన్‌టౌన్ సీఐ కేవీ సుభాషిణి, సీసీఎ్స్ ఎస్సైలు నాయబ్ రసూల్, హెచ్‌సీ టి.బాలాంజనేయులు, కోటి, వై.చంద్రశేఖర్, అంజిబాబు, శేషు, శాంతకుమార్, ఖాదర్ బాష, లోకేష్‌లను ఏఎస్పీ అభినందించారు. -
అంతర జిల్లా దొంగ అరెస్టు
గుంటూరు క్రైం : ఇంట్లో ఎవరూలేని సమయంలో తాళాలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడిన అంతర్ జిల్లా దొంగను గుంటూరు అర్బన్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ.10 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ బి.శ్రీనివాసులు తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కృష్ణాజిల్లా విజయవాడ పంజా సెంటర్‌కు చెందిన షేక్ మస్తాన్ 2005 నుంచి దొంగతనాలకు పాల్పడుతున్నాడు. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం, ఆంధ్ర రాష్ట్రంలోని విజయవాడ నగరంలోని వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడి పలుమార్లు జైలు శిక్ష అనుభవించాడు. గత ఏడాది జైలు నుంచి విడుదలైనప్పటి నుంచి గుంటూరు అర్బన్ జిల్లా పరిధిలోని కొత్తపేట, అరండల్‌పేట, పట్టాభిపురం పోలీసు స్టేషన్ల పరిధిలోని తొమ్మిది ప్రాంతాల్లో తాళాలు వేసి ఉన్న ఇళ్లల్లో తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడ్డాడు. కొత్తపేట పోలీసు స్టేషన్ పరిధిలో బుచ్చయ్యతోట 6వలైనుకు చెందిన భవానీకుమారి ఇంట్లో, నెహ్రూనగర్ 9వలైనుకు చెందిన జి.సత్యదేవ్ ఇంట్లో, బుచ్చయ్యతోట 5వలైనుకు చెందిన షేక్ అక్బర్ ఇంట్లో, నెహ్రూనగర్ 3వలైనులోకు చెందిన కాకి రాఘవరావు ఇంట్లో చోరీలకు పాల్పడ్డాడు. అరండల్‌పేట పోలీసు స్టేషన్ పరిధిలో కాకుమాను 6వలైనుకు చెందిన బి.రాఘవరావు ఇంట్లో, కాకుమాను వారితోట 4వలైనుకు చెందిన గోపిశెట్టి వెంకట హనుమంతరావు ఇంట్లో, పట్టాభిపురం పోలీసు స్టేషన్ పరిధిలో కృష్ణనగర్ 2వలైనుకు చెందిన నడింపల్లి సాంబశివరావు, విద్యానగర్ 1వలైనుకు చెందిన కొల్లిపర వెంకట రమణారావు, శ్యామలానగర్ 11వలైనుకు చెందిన పి.శ్రీనివాసరావు ఇళ్లలో కూడా చోరీలు చేశాడు. నిందితుడు మస్తాన్ మంగళవారం లాలాపేటలోని పూల మార్కెట్ సెంటర్లో ఉన్నట్టు గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితుడి నుంచి రూ.10 లక్షల విలువ చేసే 45 సవర్ల బంగారు ఆభరణాలు, కెమెరా, రెండు జతల వెండి పట్టీలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించినట్లు అదనపు ఎస్పీ వెల్లడించారు. సమావేశంలో కొత్తపేట సీఐ డి.వెంకన్నచౌదరి, సీసీఎస్ సీఐ ఎ.శివశంకర్, ఎస్ఐ శ్రీనివాసరావు, ఏఎస్ఐ కోటేశ్వరరావు, హెడ్‌కానిస్టేబుళ్లు సాంబశివరావు, ఆం జనేయులు, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. -
'సాక్షి' కథనానికి స్పందన
-
సీసీఎస్‌కు చిక్కిన గజదొంగల ముఠా
హైదరాబాద్‌సిటీ : మూడేళ్లుగా జంట పోలీసు కమిషనరేట్ పరిధిలో వరుస దోపిడీలు, దొంగతనాలకు బరితెగ్గించి.. తప్పించుకు తిరుగుతున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన గంజదొంగల ముఠా నగర సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులకు చిక్కారు. సీసీఎస్ ప్రత్యేక పోలీసు బృందం ఉత్తరప్రదేశ్‌లోని వారి స్థావరంపై దాడి చేసి ముఠాకు చెందిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి భారీ స్థాయిలో రికవరీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన యూసుఫ్, రషీద్, నౌషాద్, రహీంలు ఒక ముఠాగా ఏర్పడ్డారు. గతంలో కూడా వీరు ఇళ్లలో దొంగతనాలు, దారీ దోపిడీలు, హత్యలకు పాల్పడి జైలుకెళ్లి వచ్చారు. జైలు నుంచి వచ్చాక ఈ ముఠా సైబరాబాద్, నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో పలు నేరాలకు పాల్పడింది. మూడేళ్ల నుంచి వీరి కోసం జంట పోలీసు కమిషనరేట్లకు చెందిన సీసీఎస్ పోలీసులు గాలిస్తున్నారు. వీరి కోసం ప్రత్యేక బృందాలు గతంలో ఉత్తరప్రదేశ్‌కు వెళ్లి వాకబ్ చేసినా ఫలితం లేకుండా పోయింది. నగర సీసీఎస్ పోలీసులు వారిపై గట్టి నిఘాను పెంచారు. వారి కదలికలపై ఎప్పటికప్పుడు ఆరా తీయడం మొదలు పెట్టారు. రెండు నెలల నుంచి తీవ్రకసరత్తు చేయడంతో వారి ఫలితం ఫలించింది. ఇటీవలే ఓ దోపిడీకి పాల్పడిన ఈ ముఠా ఉత్తరప్రదేశ్‌కు వెళ్ళి విశ్రాంతి తీసుకుంది. ఇదే అదనుగా భావించిన సీసీఎస్ పోలీసులు చాకచక్యగంగా వారుటున్న నివాసాలపై మెరుపుదాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఇదే ముఠాకు చెందిన మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. ఈ నలుగురు నేరస్తులను సీసీఎస్ పోలీసులు విచారిస్తున్నారు. ఈ ముఠా ఇప్పటి వరకు వందకు పైగా నేరాలు చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. చోరీ సొత్తు భారీగానే రికవరీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. -
ట్రాన్స్పోర్ట్ పేరుతో అక్రమ వ్యాపారం
కాటేదాన్(హైదరాబాద్): ట్రాన్స్‌పోర్టు ముసుగులో అక్రమంగా గుట్కా వ్యాపారం నిర్వహిస్తున్న గుట్టును వనస్థలిపురం సీసీఎస్ పోలీసులు బుధవారం గుట్టురట్టుచేశారు. మిస్త్రీగంజ్ ప్రాంతానికి చెందిన జహీరొద్దీన్.. శివరాంపల్లి డివిజన్ హసన్‌నగర్ దానమ్మజోపిడీ ప్రాంతంలో సనాక్యూరీ పేరుతో ట్రాన్స్‌పోర్టును నడుపుతున్నాడు. అయితే, ఇతడు ముంబాయి నుంచి అక్రమంగా తన ట్రాన్స్‌పోర్టు ద్వారా లక్షల విలువచేసే గుట్కాను తెప్పించుకొని నగరంతోపాటు కర్ణాటక , మహారాష్ట్ర ప్రాంతాలకు తరలించి వ్యాపారం చేస్త్తున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు సీసీఎస్ పోలీసులు ఈ స్థావరంపై దాడి చేసి వివిధ రకాలైన రూ.60 లక్షల విలువ చేసే గుట్కా ప్యాకెట్లతోపాటు అక్కడున్న రెండు డీసీఎంలు , ఒక లారీని స్వాధీనం చేసుకున్నారు. మరో నలుగురు సిబ్బందిని అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నారు. నిర్వాహకుడు పరారీలో ఉన్నాడు. -
దొంగనోట్ల ముఠా కోసం వేట !
భద్రాచలం: భద్రాచలం కేంద్రంగా దొంగనోట్లను తయారు చేస్తున్న ముఠా వివరాలను నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. భద్రాచలం పట్టణంలో ముద్రించిన రూ.43.17 లక్షల నకిలీ నోట్లను వారం క్రితం వరంగల్ సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో షేడ్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు పెద్దినేని రవిప్రసాద్, పట్టణానికి చెందిన ఆయన స్నేహితుడు పవన్ కుమార్ రెడ్డి పట్టుబడ్డారు. అయితే ఇంత పెద్ద మొత్తంలో నకిలీ నోట్లు బయట పడగా, వీటిని ముద్రించటం వారి ఇద్దరి వల్లనే సాధ్యమైందా ? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఏపీలో విలీనమైన మండలాల్లో ఇటీవల దొంగనోట్లు వెలుగులోకి వచ్చాయి. భద్రాచలం, పాల్వంచ డివిజన్లలో ఇప్పటికే పెద్ద మొత్తంలోనే దొంగనోట్ల మార్పిడి జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ మొత్తం పరిణామాలతో దీని వెనుక మరికొంతమంది పాత్ర ఉండొచ్చనే అనుమానాలు బలపడుతున్నాయి. ఇదిలా ఉండగా, భద్రాచలం కేంద్రంగా దొంగనోట్ల ముద్రణ మళ్లీ ఊపందుకోవటంపై జిల్లా పోలీసుశాఖ ఉన్నతాధికారులు సీరియస్‌గానే తీసుకున్నట్లుగా తెలుస్తోంది. గతంలో ఓ యువ ఎస్సై దొంగనోట్ల కేసు వ్యవహారంలో తలదూర్చి ఏకంగా ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. జిల్లాతో పాటు పక్క జిల్లాల్లో కూడా దొంగనోట్లు దొరికితే, అది భద్రాచలంలో ఉన్న వ్యక్తులతో సంబంధాలు ఉన్నట్లుగా బయట పడుతుండటం జిల్లా పోలీసు శాఖ ఉన్నతాధికారులను ఆలోచనలో పడేసింది. భద్రాచలం కేంద్రంగా దొంగనోట్ల ముద్రణ, నల్లబెల్లం విక్రయాలు, నిషేధిత గుట్కా ప్యాకెట్ల అమ్మకాలు వంటివి అడపా దడపా బయట పడుతుండటంతో దీని వెనుక ఎవరున్నారనే దానిపై నిఘా వర్గాలు దృష్టి సారించారుు. ఎందుకిలా జరుగుతోంది భద్రాచలం పట్టణంలో జరిగే అసాంఘిక కార్యకలపాలకు అడ్డుక ట్ట వేసేందుకు పోలీసులు నడుం బిగించారు. ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన భాస్కరన్ ప్రెండ్లీ పోలీసు వ్యవస్థను తీర్చిదిద్దేందుకు తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజా దివస్‌ను కూడా నిర్వహిస్తూ, ప్రజలకు చేరువయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా భద్రాచలం పట్టణంలో దొంగనోట్ల ముద్రణ వ్యవహారమే పోలీసుల ప్రతిష్టను దెబ్బతీస్తోంది. చిన్నపాటి పట్టణంలో శాంతి భద్రతలను పరిరక్షించేందుకు సరిపడా పోలీసు బలగాలు కూడా ఉన్నాయి. పట్టణ పోలీసు స్టేషన్‌తో పాటు ట్రాఫిక్ పోలీసు స్టేషన్ కూడా అందుబాటులో ఉంది. వీరితో పాటు నిఘా వర్గాలు సైతం పనిచేస్తున్నాయి. అరుునప్పటికీ అసాంఘిక చర్యలు వెలుగులోకి రావడం వారిని కలవరపాటుకు గురిచేస్తున్నారుు. నిఘా పటిష్టం చేయాల్సిందే భద్రాచలం పట్టణంలోని శివారు కాలనీల్లో కొన్ని రోజులుగా అపరిచిత వ్యక్తులు తిరుగుతున్నారు. నాలుగు రాష్ట్రాల కూడలిగా ఉన్న భద్రాచలంలో వివిధ వ్యాపారాల నిర్వహణ కోసమని ఇక్కడికి అనేకమంది వస్తుంటారు. పట్టణానికి అనుకొని ఉన్న ప్రాంతం అంతా ప్రస్తుతం ఏపీలో విలీనం అయింది. నెల్లిపాక మండల కేంద్రంగా ఏపీ పోలీసులు పాలన సాగిస్తున్నప్పటికీ, ఈ ప్రాంతంపై అవగాహన పూర్తి స్థాయిలో లేకపోవటం కొంత ఇబ్బంది కలిగించే అంశమని పట్టణవాసులు అంటున్నారు. భద్రాచలం పోలీసులు వారితో సమన్వయం చేసుకొని శివారు కాలనీలపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని పట్టణవాసులు కోరుతున్నారు. -
‘మేల్ ఎస్కార్ట్స్’ పేరిట దగా
సాక్షి: ‘మేల్ ఎస్కార్ట్స్ (మగ వ్యభిచారులు) కావాలని అందమైన ప్రకనటలు ఇచ్చి నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టిన ఓ ముఠా గుట్టును నగర సీసీఎస్ పోలీసులు రట్టు చేశారు. ముగ్గురు సభ్యులను అరెస్టు చేసి వారి నుంచి రూ.25 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం డీసీపీ పాలరాజు విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం... ఆసిఫ్‌నగర్‌కు చెందిన జి.తుకారాం (29), మొగల్పురాకు చెందిన ఎం.శరణప్ప (27), కార్వాన్కు చెందిన హెచ్.రాజు (28) ఒక ముఠాను ఏర్పాటు చేసుకున్నారు. మేల్ ఎస్కార్ట్స్ కావాలని, నెలకు రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు జీతం ఉంటుందని..ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెంబర్‌కు ఫోన్ చేయాలని వెబ్సైట్లో ప్రకటనలు ఇచ్చారు. వీటిన చూసి తమను సంప్రదించిన నిరుద్యోగులందరినీ ఒక చోటకు రప్పించి కౌన్సెలింగ్ చేస్తున్నారు. ఉద్యోగంలో చేరాలనుకుంటున్న వారు రూ. వెయ్యి నుంచి 5 వేల వరకు డిపాజిట్ చేయాలని చెప్పి ఆరు బ్యాంక్ అకౌంట్ నెంబర్లు ఇస్తున్నారు. అభ్యర్థులు వారు సూచించిన అకౌంట్స్‌లో డబ్బు వేయగానే నిందితులు ఆ డబ్బును ఏటీఎం నుంచి డ్రా చేసి జాల్సా చేస్తున్నారు. ఇలా వేలాది మంది నుంచి లక్షలాది రూపాయలు వీరు దండుకున్నారు. ఈ తరహా మోసాలను ఇటీవల సీసీఎస్ పోలీసులు ఏర్పాటు చేసిన ‘మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ వింగ్’ అధికారులు పసిగట్టారు. దర్యాప్తులో వీరు చేసిన మోసాలు వెలుగు చూశాయి. దీంతో పై ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.25 లక్షల విలువైన రూ.2.45 లక్షల నగదు, కారు, రెండు బైక్‌లు, లాప్టాప్, రెండు సెల్ఫోన్లు, తుకారాం, శరణప్పలకు చెందిన రెండు ఇళ్లను సీజ్ చేశారు. మోసాలకుపాల్పడి వచ్చిన డబ్బుతోనే వీరు ఈ ఇళ్లను ఖరీదు చేసినట్లు పోలీసుల విచారణలోతేలింది. ఈ ముఠా రెండేళ్ల నుంచి తన కార్యకలాపాలను సాగించింది. విలేకరుల సమావేశంలో సైబర్ క్రైమ్ ఏసీపీ డాక్టర్ బి.అనురాధ, ఇన్స్పెక్టర్ మాజీద్ అలీ ఖాన్లు పాల్గొన్నారు. -
బ్రహ్మచారులతో తస్మాత్ జాగ్రత్త!
ఇళ్లు అద్దెకు తీసుకుని వరుసగా దొంగతనాలకు పాల్పడుతున్న ఆరుగురు నిందితులను విజయనగరం జిల్లా సాలూరులో సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి భారీ మొత్తంలో నగదు, 6 తులాల బంగారం, సెల్ఫోన్లు, 3 లక్షల రూపాయల విలువైన రంగురాళ్లు స్వాధీనం చేసుకున్నారు. విజయనగరం జిల్లాలో విద్యార్థులమని, ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగాలు చేస్తున్నామంటూ అద్దెకు వచ్చే బ్రహ్మచారులతో జాగ్రత్తగా ఉండాలని సీసీఎస్ డీఎస్పీ ఏఎస్ చక్రవర్తి తెలిపారు. గుర్తింపు కార్డులు తీసుకోకుండా ఎవరికీ ఇళ్లను అద్దెకు ఇవ్వొద్దని ఆయన ఇళ్ల యజమానులకు సూచించారు. -
ఉన్నతాధికారినంటూ ఘరానా మోసం
‘మీ ఉన్నతాధికారిని మాట్లాడుతున్నాను. మా బంధువు పరీక్ష రాసేందుకు వస్తే బ్యాగ్ కొట్టేశారు. హాల్ టికెట్, నగదు పోయింది. కాలేజీ నిర్వాహకులతో మాట్లాడి పరీక్ష రాయించే ఏర్పాట్లు చేయండి’ అంటూ..తానే కాలేజీ ప్రిన్సిపాల్ అవతారం ఎత్తి సెక్యూరిటీ డిపాజిట్ పేరిట నగదు గుంజుతున్న ఓ ఘరానా మోసగాడు సీసీఎస్ పోలీసులకు చిక్కాడు. * నిందితుడి అరెస్టు * రూ.50 వేల నగదు, సిమ్ కార్డులు స్వాధీనం * సమాచారం ఇవ్వండి: ఏడీసీపీ విజయవాడ సిటీ : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు శాఖల ఉన్నతాధికారి పేరిట పలువురిని మోసగించి నగదు గుంజే తూర్పు గోదావరి జిల్లా అమలాపురానికి చెందిన మాచిరాజు బాలత్రిపుర సుందరరావు అలియాస్ సుధీర్(30)ను సీసీఎస్(సెంట్రల్ క్రైం స్టేషన్) పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి రూ.50వేల నగదు, నేరం చేసేందుకు ఉపయోగించిన రెండు సిమ్‌కార్డులు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అదనపు డీసీపీ(క్రైమ్స్) జి.రామకోటేశ్వరరావు శనివారం వన్‌టౌన్ పోలీసు స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ(క్రైమ్స్) గుణ్ణం రామకృష్ణతో కలిసి ఇందుకు సంబంధించిన వెల్లడించారు. అదనపు డీసీపీ కథనం ప్రకారం.. సుధీర్ సమాచార హక్కు చట్టం వెబ్సైట్ ద్వారా ఉన్నతాధికారులు, ఆయా శాఖలకు సంబంధించిన జోనల్, రీజినల్ అధికారుల వివరాలు, ఫోన్ నంబర్లు సేకరించి మోసాలకు పాల్పడుతున్నాడు. గత ఏడాది కాలంగా విజయవాడ, విజయనగరం, చిత్తూరు, కృష్ణాజిల్లా నందిగామ సహా ఎనిమిది చోట్ల అధికారులను మోసగించి సొమ్ము చేసుకున్నాడు. ముందస్తు సమాచారంతో నిందితుడు పండిట్ నెహ్రూ బస్టాండ్ సమీపంలో ఉండగా సీసీఎస్ పోలీసులు చాకచక్యంగా పట్టుకొని అరెస్టు చేశారు. మోసగించేది ఇలా ముందుగా తానుండే ప్రాంతంలో ఆటో డ్రైవర్, లాడ్జి నిర్వాహకులను పరిచయం చేసుకొని తన వాళ్లు డబ్బులు పంపుతారని చెప్పి బ్యాంక్ అకౌంట్ నంబరు తీసుకుంటాడు. అనంతరం ముందుగా సేకరించుకున్న నంబర్లలో ఏదైనా ప్రభుత్వ శాఖ ఉన్నతాధికారి పీఏ(సహాయకుడు) లాగా దిగువస్థాయి అధికారులతో మాట్లాడతాడు. తన బాస్ మాట్లాడతాడని చెప్పి..తానే ఫోన్ వెనక్కి తిప్పి మాట్లాడుతూ తమ బంధువును కాలేజీ ప్రిన్సిపాల్ పరీక్ష రాయనీయడం లేదని చెప్పి మాట్లాడమంటూ తనకే చెందిన మరో ఫోన్ నంబర్ ఇస్తాడు. అటునుంచి ఫోన్ రాగానే తనను తాను ప్రిన్సిపల్‌గా చెప్పుకొని హాల్ టికెట్టు లేకుండా పరీక్ష రాయడం కుదరదని, కావాలంటే రూ.20వేలు సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లిస్తే అవకాశం కలిపిస్తామని చెపుతాడు. బాస్ తాలూకు బంధువును పరీక్ష రాయించాలనే నిర్ణయంతో కాలేజీ ప్రిన్సిపాల్ పేరిట ఇచ్చే అకౌంట్లో డబ్బు జమ చేస్తాడు. ఆ డబ్బు జమ అయిన వెంటనే ముందుగానే చెప్పినట్టు వారిని కలిసి డబ్బులు డ్రా చేయించుకొని ఉడాయిస్తుంటాడు. నగరంలోని కాలుష్య నియంత్రణ మండలి(పొల్యూషన్ కంట్రోల్ బోర్డు) అధికారిని ఇలానే బురిడీ కొట్టించి డబ్బు గుంజినట్టు పోలీసుల విచారణలో నిందితుడు అంగీకరించాడు. ఇప్పటి వరకు 11 వరకు ఈ తరహా మోసాలు చేశాడని డీసీపీ తెలిపారు. సమాచారం ఇవ్వండి ఈ తరహా మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అదనపు డీసీపీ(క్రైమ్స్) జి.రామకోటేశ్వరరావు తెలిపారు. ఇలాంటి నేరాల గురించి తెలిసినా, అనుమానం వచ్చినా తన మొబైల్ నంబరు 94406 27057, ఏసీపీ(క్రైమ్స్) నెం. 94409 06871 లేదా 100, 1090కి తెలియపరచాలన్నారు. విలేకరుల సమావేశంలో ఎస్సైలు కె.శ్రీధర్, వి.అప్పారావు, సిబ్బంది పాల్గొన్నారు. -
పూరి జగన్నాథ్ దంపతులపై ఫిర్యాదు
హైదరాబాద్: ప్రముఖ సినిమా దర్శకుడు పూరి జగన్నాథ్ చిక్కుల్లో పడ్డారు. పూరీ జగన్నాథ్, ఆయన సతీమణి లావణ్యపై సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు అందింది. 5 కోట్ల రూపాయల భూవివాదంలో వారిపై బాధితులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. హిట్ సినిమాలతో టాప్ డైరెక్టర్ గా ఎదిగిన పూరి జగన్నాథ్ అగ్ర హీరోలందరితో సినిమాలు చేశాయి. సొంతంగా వైష్టో అకాడమి స్థాపించి సినిమాలు కూడా నిర్మించారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. -
సూడో పోలీస్ హల్చల్
సీసీఎస్ పోలీస్‌నంటూ కన్సల్టెన్సీ మహిళలను బెదిరింపు సెల్ఫోన్లు, రూ.20 వేల నగదుతో ఉడాయింపు సికింద్రాబాద్‌లో ఘటన ఆలస్యంగా వెలుగులోకి.. చిలకలగూడ: సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీస్‌నంటూ ఓ వ్యక్తి హల్చల్ సృష్టించాడు. ఓ కన్సల్టెన్సీలో విధులు నిర్వహిస్తున్న మహిళా సిబ్బందిని టార్గెట్ చేసుకుని బెదిరింపులకు పాల్పడ్డాడు. వారి సెల్ఫోన్లతోపాటు రూ.20 వేల నగదును తస్కరించిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కన్సల్టెన్సీ కార్యాలయంలోని సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా యాజమాన్యం చేసిన ఫిర్యాదు మేరకు గోపాలపురం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వివరాలు ఇలా..సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ కన్సల్టెన్సీ కార్యాలయానికి ఈనెల 3న మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఓ ఆగంతకుడు వచ్చాడు. తాను సీసీఎస్ పోలీస్‌నని, కన్సల్టెన్సీ నిర్వహణకు అనుమతి లేదన్నాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందంటూ హడావిడి చేశాడు. పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేస్తున్నానని అక్కడి సిబ్బందికి చెప్పి ఏదో నెంబర్‌కు డయల్ చేసి ఇక్కడ అంతా మహిళలే ఉన్నారు, లేడీ కానిస్టేబుళ్లను పంపమని ఆదేశాలు జారీ చేశాడు. ‘మీ అందరినీ అరెస్ట్ చేస్తున్నా’నంటూ వారిని భయభ్రాంతులకు గురిచేశాడు. అందరి వివరాలు కాగితంపై రాసివ్వాలంటూ హుకూం జారీ చేశాడు. మహిళల సెల్ఫోన్లను తీసుకుని తన వద్ద ఉంచుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత పక్క గదిలోకి వెళ్తున్నానని చెప్పి అక్కడినుంచి జారుకున్నాడు. కొంతసేపటి తర్వాత అనుమానం వచ్చిన సిబ్బంది యాజమాన్యానికి, డయల్-100కి ఫోన్ చేసి సమాచారం అందించారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఏమవుతుందోననే భయంతో మహిళా సిబ్బంది కార్యాలయానికి తాళాలు వేసి వెళ్లిపోయారు. ఇతర ప్రాంతంలోని కన్సల్టెన్సీ యాజమాన్యం వచ్చి సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించగా ఆగంతకుడు కార్యాలయానికి చెందిన రూ.20 వేలు తస్కరించినట్టు తేలింది. సదరు యజమాని రెండు రోజులు క్రితం ఫుటేజీ ఆధారంగా ఫిర్యాదు చేయగా గోపాలపురం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
తెలుగు చానల్ ప్రసారాల పైరసీ
జాదు టీవీ బాక్స్‌ల ద్వారా విదేశాల్లో ప్రసారాలు ముఠా కార్యాలయంపై సీసీఎస్ పోలీసుల దాడి హైదరాబాద్: తెలుగు చానల్స్ ప్రసారాలను పైరసీ చేసి విదేశాలలో ప్రసారాలు చేస్తూ కోట్ల రూపాయలు వసూలు చేస్తున్న ఓ ముఠా గుట్టును నగర సీసీఎస్ పోలీసులు రట్టు చేశారు. ముఠా నాయకుడితో పాటు మరో నలుగురిని అరెస్టు చేసి వారి నుంచి కంప్యూటర్లు, యూపీఎస్‌లు, డిష్‌లను స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయాన్ని సీజ్ చేశారు. బోయిన్‌పల్లిలోని మానససరోవర్ అపార్ట్మెంట్లోని ఓ ఫ్లాట్‌లో ఈ వ్యవహారం నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతానికే చెందిన మాజిద్ ‘జాదు టీవీ’ పేరుతో ఓ కార్యాలయాన్ని తెరిచాడు. టీవీలో ప్రసారమయ్యే అన్ని తెలుగు టీవీ చానల్స్‌ను డౌన్‌లింక్ చేసుకుని అదే ప్రసారాలను అప్‌లింక్ చేస్తున్నాడు. ఇతను పంపిస్తున్న ఔట్పుట్ కేవలం ఇతను సరఫరా చేసిన జాదు టీవీ బాక్స్‌ల ద్వారానే ప్రసారం అవుతాయి. ఈ బాక్స్‌లను విదేశాలలోనే విక్రయించాడు. సుమారు 120 దేశాల్లో 300 డాలర్ల చొప్పున రెండు మిలియన్ల బాక్స్‌లను అమ్మినట్లు సమాచారం. అయితే తమ ప్రసారాలు లేని దేశాల్లోనూ కార్యక్రమాలు వస్తుండడంతో అనుమానం వచ్చిన పలు చానల్స్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చే శాయి. ఇన్స్పెక్టర్లు మాజిద్ అహ్మద్, కరుణాకర్‌రెడ్డిలు ఆరా తీయగా విషయం బయటపడింది. దీని సూత్రధారి జావెద్‌తో పాటు మరో నలుగురిని సీసీఎస్ పోలీసుల అరెస్టు చేయగా సుమిత్ హౌజా పరారీలో ఉన్నారు. -
నలుగురు కాదు వంద
రాష్ట్రంలోని కిడ్నీ ఏజెంట్ల సంఖ్య ఇది దేశవ్యాప్తంగా వెయ్యికిపైగానే ప్రధాన సూత్రధారి ప్రశాంత్‌సేఠ్, ఆలం కోసం వేట సాక్షి, హైదరాబాద్ : దినేష్ మృతితో కిడ్నీ రాకెట్ గుట్టు విప్పిన సీసీఎస్ పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు. పోలీసుల అదుపులో ఉన్న విజయవాడ, పశ్చిమగోదావరి, నల్లగొండ, హైదరాబాద్‌కు చెందిన కిడ్నీ ఏజెంట్లు శ్రీనివాస్, కిరణ్, వెంకటేశ్వర్లు, సురేష్లను విచారించగా పోలీసులకు దిమ్మ తిరిగిపోయే నిజాలు వెలుగు చూశాయి. మన రాష్ట్రంలోనే వందకుపైగా కిడ్నీ క్రయవిక్రయాలు జరిపే ఏజెంట్లు ఉన్నారని వెంకటేశ్వర్లు వద్ద లభించిన ల్యాప్‌టాప్‌లో తేలింది. వీరంతా శ్రీలంక రాజధాని కొలంబో వెళ్లి కిడ్నీ ఇచ్చి వచ్చిన వారే కావడం గమనార్హం. మరింత ఆదాయం గడించేందుకు ఏజెంట్లుగా మారిన వీరు తెలిసిన వారికి గాలం వేసి ప్రధాన సూత్రధారి ద్వారా శ్రీలంకకు పంపిస్తున్నారు. ఇతర రాష్ట్రాలతో కలిపితే వెయ్యికిపైగా ఏజెంట్లు ఉంటారని తెలిసింది. ప్రధాన సూత్రధారులు మాత్రం ఒడిశా, చెన్నైకి చెందినవారని పోలీసుల విచారణలో తేలింది. దినేష్ మృతిపై విచారణ కోసం తమ దేశం వస్తే పూర్తి సహకారం అందిస్తామని సీసీఎస్ పోలీసులకు శ్రీలంక పోలీసులు తెలిపారు. కిడ్నీ అమ్మేవారిని బ్రోకర్లు వారి పాస్‌పోర్టుపై విజిటింగ్ వీసా కింద స్టాంపింగ్ వేయించి శ్రీలంక తీసుకెళ్తున్నారు. విజిటింగ్ వీసాపై వెళ్లిన వ్యక్తి అనారోగ్యానికి గురైతే అక్కడి డాక్టర్లు ఆకస్మిక వైద్యం అందించవచ్చు. అంతేగాని ఆరోగ్యంగా ఉన్న అతని నుంచి కిడ్నీ తీయడం నేరం. ఈ కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. మన రాష్ట్రం నుంచి ఇలా వెళ్లి కిడ్నీ అమ్ముకున్న వారందరి పాస్‌పోర్టులపై విజిటింగ్ వీసా అని స్టాంపింగ్ వేసి ఉంది. ప్రశాంత్‌సేఠ్ ఆఫర్ లెటర్.... ‘హలో.. నేను ప్రశాంత్ సేఠ్‌ని.. కిడ్నీ అమ్మాలనుకున్నారా.. నేను అన్ని విధాల సహాయపడతా. ఆపరేషన్ మాత్రం ఇరాన్, సింగపూర్, శ్రీలంక దేశాలలో మాత్రమే చేయిస్తా. పాస్‌పోర్టు, ట్రావెల్స్ ఖర్చులు, భోజనం, వసతితో పాటు సకల సౌకర్యాలు నేనే కల్పిస్తా. అడిగినంత డబ్బు కూడా ఇస్తా. నా గురించి నచ్చిన వారు నా మెయిల్ లేదా సెల్ నంబర్‌ను సంప్రదించండి’ అని దినేష్ మెయిల్‌కు ప్రశాంత్‌సేఠ్ మార్చి 9న ఆఫర్ లెటర్ పంపాడు. ప్రశాంత్ కోసం వేట... రాష్ట్రంలో ఉన్న కిడ్నీ ఏజెంట్లకు ప్రశాంత్సేఠ్తో పాటు చెన్నైకి చెందిన ఆలం ప్రధాన సూత్రధారులని తేలింది. దీంతో వారి కోసం సీసీఎస్ పోలీసులు వేట ప్రారంభించారు. ఆలం కాశ్మీర్‌కు పారిపోయాడని నిర్ధారించుకున్న పోలీసులు ప్రశాంత్‌సేఠ్ కోసం ప్రత్యేక పోలీసు బృందంతో గాలిస్తున్నారు. -
తినడానికి లేకపోతే పోలీసులే అన్నం పెట్టారు:విజయరాణి
హైదరాబాద్:తినడానికి తిండిలేని పరిస్థితుల్లో ఉన్న తనకు పోలీసులే అన్నం పెట్టారని టీవీ ఆర్టిస్టు బత్తుల విజయరాణి మీడియా ముందు వాపోయింది. ప్రస్తుతం తన వద్ద చిల్లి గవ్వ కూడా లేదని తెలిపింది. బెంగళూరులో పట్టుబడిన ఆమెను సీసీఎస్ పోలీసులు శుక్రవారం విచారించారు. పోలీస్ విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ గగ్గోలు పెట్టుకుంది. తాను రూ. 10 కోట్లకు పైగా చిట్టీలతో మోసం చేయలేదని, కేవలం తాను జూనియర్ ఆర్టిస్టులకు మాత్రమే రూ.4 కోట్లు చెల్లించాల్సి ఉందని తెలిపింది. అసలు కంటే వడ్డీలే ఎక్కువ కట్టానని, అప్పులపాలు కావడంతో పారిపోయానని, తన వద్ద చిల్లిగవ్వలేదని విజయరాణి విచారణలో తెలిపింది. కోట్లాది రూపాయలు దోచుకుందని ఒకవైపు బాధితులు చెప్తుంటే... మరోవైపు ఆమె తన వద్ద ఒక్కపైసాకూడా లేదని చెప్పడంతో ఈ కేసును పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు. విజయరాణిని విచారించిన సీసీఎస్ పోలీసులు .. ఆమె టీవీ ఆర్టిస్టుల వద్ద చిట్టీల పేరుతో రెండు కోట్లను వసూలు చేసిందని తెలిపారు. ఇప్పటికే ఆమె పేరిట ఉన్న ఆస్తులను జప్తు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఆస్తులతో వచ్చిన డబ్బులను బాధితులకు అందజేస్తామన్నారు. -
చేతులేత్తేసిన ‘చిట్టీలరాణి’
అసలు కంటే వడ్డీలే ఎక్కువ కట్టానని వెల్లడి తన వద్ద చిల్లిగవ్వలేదని పోలీసుల విచార ణలో ఏకరవు సాక్షి, సిటీబ్యూరో: బెంగళూరులో పట్టుబడిన టీవీ ఆర్టిస్టు బత్తుల విజయరాణి (46)ని సీసీఎస్ పోలీసులు గురువారం నగరానికి తీసుకొచ్చారు. ఓ రహాస్య ప్రదేశంలో సీసీఎస్ ఏసీపీ విజయ్‌కుమార్ ఆమెను విచారిస్తున్నారు. విజయరాణి రూ.10 కోట్లకుపైగా చిట్టీలు, అధిక వడ్డీల పేరుపై డబ్బులు వసూలు చేసుకొని పారిపోయిందని బాధితుల కథనం ప్రకా రం నిన్నటి వరకూ అనుకున్నారు. అయితే విచారణలో మాత్రం అందుకు భిన్నంగా కథనాలు వినిపిస్తున్నాయి. అసలు తాను ఎవరికీ ఒక్కపైసా కూడా ఇవ్వాల్సి లేదని, అసలు కంటే వడ్డీలే ఎక్కువ కట్టానని, అప్పులపాలు కావడంతో పారిపోయానని, తన వద్ద చిల్లిగవ్వలేదని విజయరాణి విచారణలో ఏకరువు పెట్టినట్టు సమాచారం. కోట్లాది రూపాయలు దోచుకుందని ఒకవైపు బాధితులు చెప్తుంటే... మరోవైపు ఆమె తన వద్ద ఒక్కపైసాకూడా లేదని చెప్పడం విడ్డూరంగా ఉందని పోలీసులంటున్నారు. అసలు ఈ ఉదంతంలో వడ్డీల పేరుతో ఆమెకు ఎంత మంది ఎంత డబ్బు ఇచ్చారు..? ఆమె వద్ద చిట్టీలు ఎవరు ఎత్తుకున్నారు..? ఇంకా చిట్టీలు ఎత్తుకోని వారు ఎందరు?.. చిట్టీలు ఎత్తుకుని డబ్బులు కట్టని వారు ఎంత మంది?... ఇలా బాధితుల నుంచి వేర్వేరుగా వివరాలను సీసీఎస్ పోలీసులు సేకరిస్తున్నారు. ఆ తర్వాతే డబ్బు ఎవరి వద్ద ఉంది అనే అంశం తేలుతుందని పోలీసులు భావిస్తున్నారు. వియజరాణి వద్ద నిజంగా డబ్బు లేదా? ఉండే నాటకం ఆడుతుందా.. అనే కోణాల్లో పోలీసులు ఆరా తీస్తున్నారు. విజయరాణి ఎదుటే బాధితులను కూర్చోబెట్టి ప్రశ్నించాలని పోలీసులనుకుంటున్నారు. నగరంలోని ఆమె రెండు ఇళ్లతో పాటు గుడివాడలోని ఇల్లును కూడా విక్రయించిందని తేలింది. విక్రయించగా వచ్చిన డబ్బు ఎక్కడ ఉంది? ఎవరికిచ్చింది అనే విషయంపై కూడా పోలీసులు దృష్టి పెట్టారు. వడ్డీల రూపంలో ఆమె నుంచి ఎవరెవరు ఎంత పెద్దమొత్తం తీసుకున్నారు అనే వివరాలపై ఇప్పటికే సీసీఎస్ పోలీసులు ఆరా తీశారు. అధిక వడ్డీలు ఇవ్వడం వల్లనే ఆమె నష్టపోయిందా అనేది సందేహం కలిగిస్తోంది. గతనెలలో నమోదైన కుట్ర, మోసం కేసులో విజయరాణితో పాటు ఆమెకు సహకరించిన మరో 11 మందిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. ఇక ఆమె ఇళ్లను ఖరీదు చేసిన వారిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. నిజానికి వీరు ఆమెకు నగదు ఇచ్చి ఇళ్లు ఖరీదు చేశారా? లేక వారికి డబ్బులు బాకీ ఉంటే ఇళ్లను కబ్జా చేశారా అనే విషయాలు తేలాల్సి ఉంది. ఆమె విక్రయించిన మూడిళ్లను ఇప్పటికే పోలీసులు సీజ్ చేశారు. బెంగళూరుకు పారిపోయిన విజయరాణి బృందం అక్కడ కూడా నాలుగు ఇల్లు మార్చి పోలీసులను ముప్పుతిప్పలు పెట్టింది. ప్రతి రోజు సెల్నెంబర్లను మారుస్తూ పోలీసుల దృష్టి మరల్చింది. -
'రూ.3కోట్లు వసూలు చేసిన మాట నిజమే'
హైదరాబాద్ : తోటి నటీనటులకు చిట్టీల పేరుతో శఠగోపం పెట్టి పారిపోయిన టీవీ ఆర్టిస్టు బత్తుల విజయరాణి తాను రూ. 3 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు స్వయంగా అంగీకరించింది. బెంగళూరులో నిన్న విజయలక్ష్మిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులు ఇంకా విచారిస్తున్నారు. అధిక వడ్డీకి కూడా ఆమె రుణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో మరికొంతమందిని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు వున్నాయి. చిట్టీల పేరుతో పలువురు ఆర్టిస్టులకు డబ్బు ఎగగొట్టిన విజయరాణి నెల రోజుల క్రితం పరారైన విషయం తెలిసిందే. బాధితుల ఫిర్యాదు మేరకు విజయరాణితో పాటు చెల్లెలు బి.సుధారాణి, నాని, శరణ్, శ్రీనివాస్‌రావు, హరిబాబు, దుర్గ, రమేష్‌లపై చీటింగ్, కుట్ర కేసులను సీసీఎస్ పోలీసులు నమోదు చేశారు. విజయరాణికి చెందిన రెండు ఇళ్లతో పాటు కారును కూడా పోలీసులు సీజ్ చేశారు. వారి కోసం ఆరు పోలీస్ ప్రత్యేక బృందాలు వెతికాయి. కూకట్‌పల్లిలోని ఓ లారీ ట్రాన్స్పోర్ట్ కార్యాలయ సిబ్బంది ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రత్యేక బృందం బెంగుళూరు వెళ్లి వారిని పట్టుకుంది. బత్తుల విజయరాణి, పాలరాజు, చిట్టీలు, టీవీ ఆర్టీస్టులు, tv artist, Battula Vijayarani, Palaraju, ccs police -
'రూ.3కోట్లు వసూలు చేసిన మాట వాస్తవమే'
-
టీవీ ఆర్టిస్ట్ విజయరాణిపై కేసు నమోదు
హైదరాబాద్ : చిట్టీల పేరుతో జూనియర్ ఆర్టిస్టులను రూ.10 కోట్ల మేర నిండా ముంచిన నటి బత్తుల విజయరాణిపై సీసీఎస్‌లో కేసు నమోదు అయ్యింది. ఈ సందర్భంగా సీసీఎస్ డీసీపీ పాలరాజు మాట్లాడుతూ విజయరాణి సుమారు రూ.5 కోట్లు వసూలు చేసినట్లు 120మంది బాధితుల నుంచి ఫిర్యాదులు అందాయని తెలిపారు. రెండు దర్యాప్తు బృందాలతో విచారణ కొసాగుతోందని ఆయన పేర్కొన్నారు. కాగా కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన బత్తుల విజయరాణి (46) టీవీ సీరియల్స్‌లో నటిస్తూ అమీర్‌పేట న్యూ శాస్త్రినగర్‌లో నివాసముంటోంది. 12 ఏళ్లుగా చిట్టీల వ్యాపారం కూడా నడుపుతోంది. రూ. 5లక్షల నుంచి రూ. 50 లక్షల విలువైన చిట్టీల్లో సుమారు 400 మంది నటులు సభ్యులుగా చేరారు. గత నాలుగైదు నెలలుగా చిట్టీలు పాడిన వారికి ఆమె ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయి. దీంతో వారు ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చారు. రేపు మాపు అంటూ విజయరాణి వాయిదా వేస్తూ వస్తోంది. ఇది తెలిసి ఆమెకు లక్షల రూపాయల్లో బదులు ఇచ్చిన మరికొందరు కూడా తమ డబ్బులు తిరిగిచ్చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో విజయరాణి ఉన్నట్లుండి బుధవారం నుంచీ కనిపించకుండా పోయింది. దీనిపై బాధితులు జూనియర్ ఆర్టిస్టుల సంఘాన్ని ఆశ్రయించగా.. వారు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. దీంతో వారు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ డీసీపీ జి.పాలరాజును ఆశ్రయించారు. ఆ తర్వాత నగర పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. -
10కోట్లకు శఠగోపం పెట్టిన బుల్లితెర నటి
-
10కోట్లకు శఠగోపం పెట్టిన బుల్లితెర నటి
హైదరాబాద్ : చిట్టీల పేరుతో ఓ బుల్లితెర నటి ఘరానా మోసానికి పాల్పడింది. టీవీ ఆర్టిస్ట్ విజయరాణి...జూనియర్ ఆర్టిస్టుల వద్ద సుమారు 10కోట్ల రూపాయాల వరకూ వసూలు చేసి ఉడాయించింది. గత కొంతకాలంగా విజయరాణి ఎంతో నమ్మకంగా స్థానికంగా చిట్టీలు నిర్వహించేది. సమయానికి చిట్టీ డబ్బులు ఇచ్చివేసేది. నమ్మకం కుదరటంతో పలువురు జూనియర్ ఆర్టిస్ట్‌లు ఆమె వద్ద చిట్టీలు వేశారు. పెద్ద మొత్తంలో చిట్టీలు వేసిన ఆమె...అదును చూసుకుని పరారైంది. దాంతో ఆలస్యంగా విషయం తెలుసుకున్న బాధితులు సీసీఎస్ పోలీసుల్ని ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న విజయరాణి కోసం గాలిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కౌన్ బనేగా కరోడ్ పతి లాటరీ పేరుతో మోసాలు
హైదరాబాద్: తమ సరికొత్త ఎత్తులతో అమాయక ప్రజలను బోల్తా కొట్టిస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నముఠాను హైదరాబాద్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. రియాల్టి షోలలో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న కౌన్ బనేగా కరోడ్ పతి గురించి అందరికీ తెలిసిన విషయమే. దీన్నే సైబర్ గ్యాంగ్ ఆసరాగా చేసుకుని తాజా మోసాలకు తెరలేపింది. పాకిస్తాన్ ను కేంద్రంగా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతోంది. దీనిపై సమాచారం అందుకున్న సీసీఎస్ పోలీసులు చాకచక్యంగా వలపన్ని ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి డబ్బై క్రెడిట్ కార్డులు, పలు నకిలీ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. -
మహిళలే టార్గెట్
మీరు ఒంటరిగా వెళుతున్నారా.. మీ ఒంటిపై బంగారు నగలు ఉన్నాయా.. నిర్మానుష్యప్రదేశంలో నడుస్తున్నారా.. అయితే.. జాగ్రత్త.. ఓ క్షణం మీ పరిసరాల్ని నిశితంగా పరిశీలించండి.. మిమ్మల్ని అనుసరిస్తూ వచ్చే వ్యక్తులు లేదా బైకుల విషయంలో అప్రమత్తంగా ఉండండి. లేదంటే మీ నగలను క్షణాల్లో లాక్కెళ్తారు. జిల్లాలో పెరుగుతున్న గొలుసు దొంగతనాల నివారణపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. కడప అర్బన్, న్యూస్‌లైన్: జిల్లాలో ప్రతిచోటా నిత్యం ఏదో ఒక ప్రాంతంలో గొలుసు దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. ఒంటరిగా వెళ్లే మహిళలే లక్ష్యంగా అధిక శాతం దొంగతనాలు జరుగుతున్నాయి. మోటార్‌బైక్‌పై వేగంగా రావడం.. ఏదో ధ్యాసలో నడుచుకుంటూ వెళ్తున్న మహిళల మెడలో నుంచి ఒక్కసారిగా గొలుసు లాక్కెళ్లడం మామూలై పోయింది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనమైతే దాదాపు ఉండటం లేదు. వ్యసనాలకు బానిసలై.. జిల్లాలో ఒక్కోసారి ఒక్కో ప్రాంతంలో గొలుసు దొంగలు మహిళలను హడలెత్తిస్తున్నారు. పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. దొంగతనాలకు పాల్పడిన వారిని విచారిస్తే వారిలో ఎక్కువగా వ్యసనాలకు బానిసలైన వారే ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు ఉన్నత చదువులు చదువుతున్న యువత విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి దొంగల అవతారమెత్తుతున్నట్లు స్పష్టమవుతోంది. మరికొందరు అవసరాలకు డబ్బులు లేక దొంగతనాలకు తెగబడుతున్న సంఘటనలు కూడా పోలీసుల దృష్టికి వచ్చాయి. వీరిలో కొందరు సమాజంలో గౌరవప్రదమైన స్థానంలో ఉంటున్న వారి పిల్లలు కూడా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. చోరీలు ఇలా..: దొంగలు తొలుత నిర్మానుష్య ప్రదేశాలను ఎంచుకుంటారు. ఆ ప్రదేశాలలో బంగారు ఆభరణాలు ధరించి వెళుతున్న ఒంటరి మహిళలను గుర్తించి రెక్కీ నిర్వహిస్తారు. తర్వాత తమ ముఖాలు కనిపించకుండా కర్చీఫ్‌లు కట్టుకుని మోటార్‌బైక్‌పై వస్తారు. వాహనం నడుపుతున్న యువకుడు అతివేగంగా మహిళ పక్కనుంచి దూసుకెళ్తాడు. వెనుక కూర్చున్న మరొక వ్యక్తి మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు లాగేస్తాడు. ఈ క్రమంలో తమ మోటారు సైకిల్‌కు ఎలాంటి నెంబరు లేకుండా కూడా కొన్ని సంఘటనల్లో జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. అంతా అంతర్జిల్లా దొంగలే: జిల్లాలో గొలుసు దొంగతనాలకు పాల్పడిన దొంగలను పోలీసులు విచారిస్తే అంతా ఇతర జిల్లాలకు చెందినవారే అని తేలింది. దీంతో అందరి వివరాలను సేకరించి, ఫొటోలు, చిరునామాలతో సహా రికార్డు చేశారు. రికవరీ ఇలా.. గత ఏడాది నవంబర్‌లో చిన్నచౌకుపరిధిలో ఇద్దరిని అరెస్టు చేసి 7 బంగారు గొలుసులను స్వాధీనం చేసుకున్నారు. సీసీఎస్ పోలీసులు ముగ్గురు దొంగలను అదుపులోకి తీసుకుని 12 గొలుసులు రికవరీ చేశారు. ఈ నెలలో ముగ్గురిని అదుపులోకి తీసుకుని 7లక్షల రూపాయల విలువైన బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. బ్లూకోట్ వ్యవస్థ మెరుగు పడాలి జిల్లాలో బ్లూకోట్ వ్యవస్థను మెరుగుపర్చాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం సిబ్బంది ప్రతి స్టేషన్ పరిధిలో అవసరమైన మేరకు ఉండటం వల్ల ఈ వ్యవస్థను మరింత మెరుగు పరిచేందుకు అవకాశాలు కూడా ఉన్నాయి. విశాలమైన, నిర్మానుష్యమైన, వెడల్పాటి రోడ్ల మీదుగా వెళ్లే ఒంటరి మహిళలనే టార్గెట్‌గా చేసుకోవడాన్ని పరిగణలోకి తీసుకుని కడప, ప్రొద్దుటూరు పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాలలో కూడా పోలీసులు అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు దొంగలపై నిఘా పెంచాలి. -
రిమాండ్‌కు సీఏ సాయిబాబు
సాక్షి, నరసరావుపేట/హైదరాబాద్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావులకు సన్నిహితుడు, వారి సంస్థలకు ఆర్థిక సలహాదారుడిగా చెప్పుకునే చార్టర్డ్ అకౌంటెంట్ వైఎస్ఎస్ సాయిబాబును హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అధికారులు బుధవారం అరెస్టు చేశారు. లక్ష్మణ్ పేపర్ మిల్స్ సంస్థ చేసిన రూ.12 కోట్ల మోసం కేసులో ఆ సంస్థ డెరైక్టరయిన సాయి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం విదితమే. బుధవారం అరెస్టు అనంతరం నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టగా వచ్చేనెల 11 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. ఇలావుండగా, సాయిబాబుకు టీడీపీతో ఎటువంటి సంబంధాలు లేవంటున్న ఆ పార్టీ నేతల మాటలు అవాస్తవాలేనని తేలింది. గుంటూరుజిల్లా నరసరావుపేట పట్టణంలోని బరంపేటకు చెందిన సాయిబాబు కుటుంబం టీడీపీలో క్రీయాశీలకంగా వ్యవహరిస్తూ వస్తోంది. ఆయన తండ్రి రామారావు హెడ్మాస్టర్గా పనిచేసి రిటైరయ్యారు. అనంతరం టీడీపీ నేత డాక్టర్ కోడెల శివప్రసాదరావుకు చెందిన సంస్థలకు పర్యవేక్షకుడిగా వ్యవహరిస్తూ, వ్యాపార లావాదేవీల్లో సైతం భాగస్వామిగా చేరారు. పట్టణంలోని ఒకప్పటి సత్యనారాయణ టాకీస్, పువ్వాడ హాస్పిటల్ స్థలాన్ని కోడెల కుటుంబీకులు, సాయిబాబు భార్య పావని భాగస్వాములుగా కొనుగోలు చేసి 2004లో విక్రయించారు. టీడీపీ పెద్దలతో సైతం సాయిబాబు మంచి పరిచయాలు ఏర్పరుచుకున్నారని స్థానికులు చెబుతున్నారు.