Government hospital
-
బాలభీముడు!
హుస్నాబాద్: పట్టణంలోని కేబీ కాలనీకి చెందిన ఎస్.కె ముంతాజ్ స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం అధిక బరువుతో ఉన్న మగ బిడ్డకు జన్మనిచ్చింది. శిశువు 4 కిలోల 300 గ్రాముల బరువుతో ఉన్నాడు. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని ఆస్పత్రి సూపరింటెండెంట్ రమేష్ రెడ్డి తెలిపారు. ముంతాజ్ కు ఇదివరకు ముగ్గురు ఆడపిల్లలు కాగా, నాల్గ వ సంతానంగా మగబిడ్డ జని్మంచడంపట్ల వారి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. -
వెయ్యి పడకలేనా!
సిద్దిపేటలో చేపట్టిన వెయ్యి పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణ పనులు పూర్తికాకపోవడంతో రోగులు పూర్తిస్థాయి వైద్య సేవలకు నోచుకోలేకపోతున్నారు. వెయ్యి పడకల ప్రభుత్వాసుపత్రి భవనంలో మౌలిక వసతులు కల్పించకపోవడం, అవసరమైన వైద్యులు, సిబ్బందిని నియమించకపోవడంతో ప్రజలకు వైద్య సేవలు అందడం లేదు. దీంతో పేద ప్రజలు చికిత్స నిమిత్తం హైదరాబాద్ వంటి దూర ప్రాంతాలకు వెళ్లలేక ఇబ్బంది పడుతున్నారు. - సిద్దిపేట కమాన్అప్పటి సీఎం కేసీఆర్‌తో ప్రారంభం సిద్దిపేట అర్బన్ మండలం ఏన్సాన్పల్లి గ్రామ శివారులో రూ.324 కోట్ల అంచనా వ్యయంతో వెయ్యి పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణానికి అప్పటి సీఎం కేసీఆర్ 2020 డిసెంబర్లో శంకుస్థాపన చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ భవన నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేశారు. ఐదు అంతస్తులతో ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు ఒకేచోట అందుబాటులోకి తెచ్చేలా భవనాన్ని నిర్మించారు. మొదట ఆసుపత్రిలోని గ్రౌండ్ ఫ్లోర్లో డెంటల్ విభాగాన్ని అందుబాటులోకి తెచ్చారు. వెయ్యి పడకల ప్రభుత్వ ఆసుపత్రిని మాజీ మంత్రి హరీశ్‌రావు 2023 అక్టోబర్‌లో ప్రారంభించారు. నిధుల్లేక ముందుకు సాగని పనులు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అనంతరం నిధులు కేటాయించకపోవడంతో ప్రభుత్వాసుపత్రి పెండింగ్ పనులు ముందుకు సాగడం లేదు. ప్రస్తుతం సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుబంధంగా.. 300 పడకలతో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి కొనసాగుతోంది. వెయ్యి పడకల ప్రభుత్వాసుపత్రి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే.. పేద ప్రజలకు అన్ని విభాగాల్లో మరింత మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. త్వరలో డెంటల్ విభాగం మూసివేత? ప్రస్తుతం వెయ్యి పడకల ప్రభుత్వ ఆసుపత్రి గ్రౌండ్ ఫ్లోర్‌లోని డెంటల్ విభాగంలో వైద్య సేవలు అందిస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఓపీడీ సాధారణ శస్త్ర చికిత్స, ఓపీడీ ఆర్థోపెడిక్, బ్లడ్ శాంపిల్స్ సేకరణ, అత్యవసర విభాగం, ఫార్మసీ విభాగాలను, మొదటి అంతస్తులో ఓపీడీ కన్ను, ఓపీడీ చెవి, ముక్కు, గొంతు, డయాలసిస్ వార్డు, క్యాథ్‌ల్యాబ్, రెండో అంతస్తులో క్షయ, ఛాతీవ్యాధి వార్డు, డీవీఎల్ వార్డు, జనరల్ వార్డులను ఏర్పాటు చేశారు. రూ.లక్షల విలువైన పరికరాలను సైతం భవనంలోని అందుబాటులోకి తీసుకొచ్చారు. కానీ మౌలిక వసతులు ఏర్పాటు చేయకపోవడం, సిబ్బందిని నియమించకపోవడం, మెషీన్లను ఏర్పాటు చేయకపోవడంతో భవనం ప్రారంభోత్సవానికే పరిమితమైంది. డెంటల్ విభాగంలో సహాయకులుగా, సెక్యూరిటీ, శానిటేషన్ సిబ్బంది మొత్తం 20 మంది విధులు నిర్వహిస్తున్నారు. వీరికి ప్రభుత్వాసుపత్రి ఫండ్ ద్వారా జిల్లా కలెక్టర్ ప్రతి నెల వేతనాలు చెల్లిస్తున్నారు. కాగా, బడ్జెట్ లేనందున వచ్చే నెల నుంచి వీరికి వేతనాలు చెల్లించలేమని ఉన్నతాధికారులు స్పష్టం చేసినట్టు సమాచారం. దీంతో సంబంధిత ఏజెన్సీ నిర్వాహకులు.. వేతనాలు చెల్లించలేమని.. విధులకు రావద్దని శానిటేషన్, సెక్యూరిటీ సిబ్బందికి సూచించినట్టు సమాచారం. ప్రస్తుతం కొనసాగుతున్న డెంటల్ విభాగాన్ని సైతం మూసివేసి ఫిబ్రవరి మొదటివారంలో భవనాన్ని మూ సివేయనున్నట్లు వి శ్వసనీయ సమాచారం. దీనికి ప్రధాన కారణం నిధులు, బడ్జెట్ కొరతని వైద్యాధికారులు స్పష్టం చేస్తున్నారు. బడ్జెట్ కేటాయించి వెయ్యి పడకల ప్రభుత్వ ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకురావాలని కోరుతూ కలెక్టర్, డీఎంఈ, రాష్ట్ర హెల్త్ సెక్రటరీలకు ఇప్పటికే వినతి పత్రాలు అందజేసినట్టు ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంవో ప్రవీణ్ తెలిపారు. ప్రభుత్వ పరిధిలోది..వెయ్యి పడకల ప్రభు త్వ ఆసుపత్రి భవనాన్ని అందుబాటులోకి తీసుకురావడం ప్రభుత్వ పరిధిలోని అంశం. రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విధులు నిర్వహిస్తున్నాం. త్వరలోనే ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకొస్తాం. - డాక్టర్ విమలాథామస్, సిద్దిపేట -
ఒకే ఆక్సిజన్ సిలిండర్ ఇద్దరు రోగులకు మార్చి మార్చి పెట్టిన సిబ్బంది
-
జగిత్యాల ప్రభుత్వాసుపత్రిలో అమానుషం
జగిత్యాల: అనారోగ్యం బారిన పడ్డ భర్తను సర్కారు దవాఖానాలో చేర్పించిన భార్య ఆయన బాగోగులు చూసుకుంటోంది. ఓ చేయికి గాయం అయినా భర్త ఆస్పత్రిలో ఉండటంతో ఆయనకు సపర్యలు చేసేందుకు వెంట వచ్చింది. వారం రోజులుగా దవాఖానాలోనే ఉన్న ఆమె హైబీపీతో తన భర్తకు ఇచ్చిన బెడ్‌పై పడిపోయింది. దీంతో ఆస్పత్రి సిబ్బంది ఆమెను బయట రోడ్డు పక్కన దింపడంతో భర్త కూడా బయటకు వచ్చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండలం రాఘవపట్నంకు చెందిన రాజనర్సు అనారోగ్యానికి గురవడంతో వారం రోజుల క్రితం జగిత్యాలలోని పెద్దాస్పత్రికి తీసుకొచ్చి చికిత్స చేయిస్తోంది అతని భార్య మల్లవ్వ. అయితే, ఆమె చేతికి గాయమైనప్పటికీ భర్త ఆరోగ్యం బాగుపడాలని పరితపించి, సపర్యలు చేస్తోంది. ఈ క్రమంలో రెండు రోజులుగా హైబీపీతో బాధ పడుతున్న మల్లవ్వ సొమ్మసిల్లి పడిపోతోంది. తన భర్తకు ఆస్పత్రిలో కేటాయించిన బెడ్‌పై ఉన్న మల్లవ్వను శుక్రవారం గమనించిన వైద్య సిబ్బంది వీల్‌చైర్‌పై బయటకు తీసుకెళ్లి, రోడ్డు పక్కన దింపి వెళ్లిపోయారు. అనారోగ్యానికి గురైన తన భార్యను దవాఖానా సిబ్బంది బయటకు తీసుకెళ్తుండటాన్ని గమనించిన రాజనర్సు తనకు వైద్యం వద్దని బయటకు వచ్చి, రోడ్డు పక్కన పడుకొని ఉన్న భార్య వద్దకు చేరుకున్నాడు. ఈ దంపతులను గమనించిన స్థానికులు జగిత్యాల టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని, బాధితులను ఆస్పత్రిలో చేర్పించారు. ఆర్ఎంవో నవీన్‌ను వివరణ కోరగా ఇలాంటి సంఘటన జరగలేదని, ఏదైనా ఉంటే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.గతంలోనూ ఇలాంటి ఘటనలు..జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో ఇలాంటి ఘటనలు సర్వసాధారణమన్న ఆరోపణలున్నాయి. గతంలో కూడా ఓ వృద్ధుడిని పాత్ బస్‌స్టేషన్‌లో దింపి పోగా.. స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో తిరి గి ఆస్పత్రికి తరలించారు. అలాగే, ఓ గర్భిణి కడుపులో వస్త్రాలు మరిచిపోయిన ఘటన వెలుగులోకి రావడం అప్పట్లో సంచలనంగా మారింది. తాజా గా భర్తకు అటెండెంట్‌గా ఉన్న మల్లవ్వ విషయంలోనూ ఆస్పత్రి సిబ్బంది కఠినంగా వ్యవహరించిన తీరు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.చర్యలు తీసుకున్నా మారని తీరు..జగిత్యాల ఆస్పత్రి యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల సూపరింటెండెంట్‌ను సరెండర్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ, జిల్లా ఆస్పత్రి యంత్రాంగం వైఖరిలో మార్పు రాకపోవడం విస్మయం కల్గిస్తోంది. వృద్ధ దంపతుల విషయంలో కఠిన వైఖరిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికై నా దవాఖానా సిబ్బందిని క్రమశిక్షణలో పెట్టాలంటున్నారు. -
సర్కారీ సంతాన సాఫల్య కేంద్రాలు
సాక్షి, హైదరాబాద్: సంతానం కోసం ప్రైవేటు సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరిగి లక్షలకు లక్షలు ఖర్చు చేసే స్థోమత లేనివారికి అండగా నిలువాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే హైదరాబాద్‌లో రెండు సర్కారీ సంతాన సాఫల్య కేంద్రాలను నెలకొల్పిన ప్రభుత్వం.. మరిన్ని జిల్లాల్లో ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. హైదరాబాద్‌లోని గాందీ, పేట్ల బురుజు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలిజేషన్) కేంద్రాలకు రాష్ట్రం నలుమూలల నుంచి పేదలు వస్తున్నారు. దీంతో మరిన్ని కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పటికే వరంగల్‌లో కేంద్రం ఏర్పాటు పనులు సాగుతున్నాయి. ఉమ్మడి జిల్లాల్లో మరో 5 ఐవీఎఫ్ సెంటర్లను ప్రారంభించాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. ప్రైవేటు రంగంలో 358 ఫెర్టిలిటీ సెంటర్లు తాజా అధ్యయనాల ప్రకారం రాష్ట్రంలో 26 శాతం మంది సంతాన లేమి సమస్య ఎదుర్కొంటున్నారు. çరాష్ట్రంలో 358 ప్రైవేట్ ఫెర్టిలిటీ సెంటర్లు ఉన్నాయి. చాలా సెంటర్లు సిట్టింగ్‌ల పేరుతో ఏళ్లకేళ్లు చికిత్సలు అందిస్తూ రూ.లక్షలకు లక్షలు వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫెర్టిలిటీ, ఐవీఎఫ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని 2017లో అప్పటి ప్రభుత్వం నిర్ణయించి.. గాం«దీ, పేట్ల బురుజు, వరంగల్ ఎంజీఎంలో ఏర్పాటుకు జీవో 520 విడుదల చేసింది. కానీ వివిధ కారణాల వల్ల అవి ఏర్పాటు కాలేదు. 2023 ఫిబ్రవరిలో మరోసారి జీవో విడుదల చేసి, అదే ఏడాది అక్టోబర్‌లో గాం«దీలో ఐవీఎఫ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కానీ, డాక్టర్లు, రీ ఏజెంట్స్, ఔషధాలు అందుబాటులో లేకపోవడంతో నామ్‌కే వాస్తేగా మిగిలింది. అక్టోబర్‌లో గాం«దీ, పేట్ల బురుజులో ప్రారంభం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలతో గాంధీ ఆసుపత్రిలోని ఐవీఎఫ్ సెంటర్లో ఎంబ్రయాలజిస్ట్, గైనకాలజిస్ట్, ఇతర డాక్టర్లను నియమించింది. ఏఆర్టీ యాక్ట్ ప్రకారం అనుమతులు తీసుకొని అక్టోబర్ 15న ఐవీఎఫ్ సేవలు అందుబాటులోకి తెచ్చారు. అవసరమైన అన్ని రీ ఏజెంట్స్, ఔషధాలు పంపిణీ చేశారు. పేట్లబురుజు ఆసుపత్రిలోనూ ఎంబ్రయాలజిస్ట్‌ను నియమించి, ఈ నెల 9న ఐవీఎఫ్ సేవలు ప్రారంభించారు.గాం«దీలోని ఐవీఎఫ్ సెంటర్లో ఔట్‌పేషెంట్ (ఓపీ) కింద ఈ నెల 20 వరకు 271 మంది సంతానం కోసం రాగా, ఫాలిక్యులర్ స్టడీ కింద 66 మంది, ఐయూఐ కింద 26 మందికి పరీక్షలు నిర్వహించారు. ఐవీఎఫ్‌కు ఆరుగురు ఎంపికయ్యారు. పేట్ల బురుజులో 82 మంది ఓపీలో, ఫాలిక్యులర్ స్టడీకి 16 మంది, ఐయూఐకి 10 మందికి పరీక్షలు నిర్వహించారు. నలుగురిని ఐవీఎఫ్‌కు ఎంపిక చేశారు. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజామాబాద్‌లలో మరిన్ని ఐవీఎఫ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని మంత్రి రాజనర్సింహ ఇటీవలే శాసనమండలిలో ప్రకటించారు. -
బాహుబలి బాలుడు..!
భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి వైద్యులు క్లిష్టమైన కాన్పును సుసాధ్యం చేశారు. ఈ కాన్పులో మహిళ 5.25 కిలోల బాలుడికి జన్మనివ్వడం విశేషం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ఇరవెండికి చెందిన మడకం సన్న భార్య నందినికి నెలలు నిండటంతో.. గురువారం ఉదయం భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆస్పత్రి వైద్యులు సాత్విక్, మల్లేశ్ సాధారణ ప్రసవం కోసంప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో రాత్రి శస్త్రచికిత్స చేయగా నందిని 5.25 కిలోల బరువైన మగశిశువుకు జన్మనిచ్చింది. ఆమెకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉండగా.. ఆ రెండూ సాధారణ ప్రసవాలే జరిగాయి. ఈసారి కేసులో క్లిష్టత దృష్ట్యా తప్పనిసరిగా సిజేరియన్ చేయాల్సి వచ్చిందని వైద్యులు తెలిపారు. కాగా, తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వెల్లడించారు. -
గత సర్కారు ముందుచూపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజారోగ్యానికి పెద్ద పీట వేస్తూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మానవ వనరుల కొరతకు చెక్ పెట్టడం కోసం 2019–24 మధ్య ఏకంగా 54 వేల వైద్యులు, నర్సులు, ఇతర సహాయ సిబ్బంది పోస్టులను భర్తీ చేసింది. ఫలితంగా జాతీయ స్థాయితో పోలిస్తే రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లోనే వైద్యుల అందుబాటు అత్యంత మెరుగ్గా ఉందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఇటీవల పార్లమెంట్లో వెల్లడించింది.ప్రివెంటివ్ కేర్‌లో అత్యంత కీలకమైన గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్సీ) దేశవ్యాప్తంగా గతేడాది మార్చి నాటికి 41,931 మంది మెడికల్ ఆఫీసర్ల(ఎంవో)కు గాను 32,901 మంది అందుబాటులో ఉన్నారని 22.30 శాతం మేర ఎంవోల కొరత ఉందని స్పష్టం చేసింది. అదే ఏపీలో 2,313 మందికి గాను 2,293 మంది అందుబాటులో ఉండగా, కేవలం 20 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు పేర్కొంది. ఈ లెక్కన రాష్ట్రంలో 0.86 శాతం కొరత మాత్ర మే ఉన్నట్టు స్పష్టమైంది. గత ప్రభుత్వంలో గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సంరక్షణే లక్ష్యంగా దేశంలో ఎక్కడా లేనట్టుగా ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అమలు చేసింది.ఇందులో భాగంగా ప్రతి మండలానికి రెండు పీహెచ్‌సీలు, ఒక్కో పీహెచ్సీలో ఇద్దరు వైద్యులు ఉండేలా చర్యలు తీసుకుని ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను అమలు చేసింది. మరోవైపు పట్టణ పీహెచ్‌సీల్లో దేశవ్యాప్తంగా 19.08 శాతం వైద్యుల కొరత ఉండగా, ఏపీలో అది 3.32 శాతమేనని పార్లమెంట్ వేదికగా వెల్లడైంది. కేరళ రాష్ట్రంలోని గ్రామీణ పీహెచ్‌సీల్లో సైతం 5.22 శాతం ఎంవోల కొరత ఉంది. కర్ణాటకలో 14.21 శాతం, తమిళనాడులో 11.58, తెలంగాణలో 36.27 శాతం మేర వైద్యుల కొరత ఉంది.ఉత్తరాదిలోని యూపీలో ఏకంగా 36.44 శాతం, బిహార్‌లో 34.62, గుజరాత్లో 17.69 శాతం వైద్య పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని పీహెచ్‌సీల్లో దేశం మొత్తం 46,692 నర్సు పోస్టులకు గాను 10,814 పోస్టులు(23.16 శాతం) ఖాళీగా ఉన్నాయి. యూపీలో 64.94 శాతం, బిహార్‌లో 35.59 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తేలింది. ఏపీలో 4.74 శాతం పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. నాడు ఎప్పటి ఖాళీలు అప్పుడే భర్తీ⇒ 2019–24 మధ్య వైద్యశాఖలో ఎప్పటి ఖాళీలను అప్పుడే భర్తీ చేసేలా జీరో వేకెన్సీ పాలసీని అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసింది. దీంతో ఉద్యోగ విరమణలు, వీఆర్ఎస్, ఇతర కారణాలతో ఖాళీ అయిన పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేసేవారు. కేవలం వైద్య శాఖ నియామకాల కోసమే ప్రత్యేక రిక్రూట్మెంట్ బోర్డును సైతం ఏర్పాటు చేశారు. ⇒ గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని సెకండరీ హెల్త్, బోధనాస్పత్రుల్లో స్పెషలిస్ట్ వైద్యులను అందుబాటులో ఉంచడం కోసం పలు దఫాలు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించి, వైద్యులు అడిగినంత వేతనాలను ఇచ్చి మరీ పోస్టులను భర్తీ చేశారు. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో గైనిక్ వైద్యులకు 50 శాతం కొరత ఉంటే ఏపీలో 1.4 శాతం, అదే స్పెషలిస్ట్ పోస్టులు 61 శాతం దేశవ్యాప్తంగా కొరత ఉండగా, రాష్ట్రంలో 6.2 శాతం మేర మాత్రమే ఉండేది. వీటన్నింటికీ తోడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరిపడా మందులను సైతం అందుబాటులో ఉంచింది. ⇒ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జీరో వేకెన్సీ విధానానికి తూట్లు పొడించింది. దీంతో వివిధ కారణాలతో ఆస్పత్రుల్లో ఏర్పడిన ఖాళీలు భర్తీ అవ్వక ప్రజలకు వైద్య సేవల కల్పనపై తీవ్ర ప్రభావం పడుతోంది. -
నంద్యాల జిల్లాలో వైద్యులు లేక రోగులకు వాచ్ మెన్ వైద్యం
-
సర్కారు దవాఖానలో మందులు లేక ప్రజల ఇక్కట్లు
-
సహానా కేసులో దళిత అధికారికి బదిలీ కానుక
సాక్షి ప్రతినిధి, గుంటూరు: కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అనుచరుడైన రౌడీషీటర్ నవీన్ చేతిలో హతమైన తెనాలి యువతి మధిర సహానా (25) కేసులో తాము చెప్పిన పనిని సకాలంలో చేయలేదన్న అక్కసుతో గుంటూరు ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ ఏకుల కిరణ్‌కుమార్‌పై కూటమి ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. దళితుడైన కిరణ్‌కుమార్ బదిలీ ఫైలుపై సీఎం చంద్రబాబు సంతకం అయ్యిందని, నేడోరేపో బదిలీ ఆదేశాలు వచ్చే అవకాశం ఉందని సమాచారం. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆయన నడుచుకోలేదని, సీఎంఓ కార్యాలయం నుంచి చెప్పినా వినలేదనే ఆరోపణలతో ఆస్పత్రి సూపరింటెండెంట్ సీటు నుంచి ఆయనను తొలగిస్తూ సీఎం కార్యాలయం ఆమోద ముద్ర వేసింది. అసలు కారణం ఇదీ..రౌడీషీటర్ నవీన్ చేతిలో తీవ్రంగా గాయపడిన తెనాలికి చెందిన సహానాను ఈ నెల 20న చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్‌కు తీసుకొచ్చారు. అప్పటికే యువతి పరిస్థితి విషమించింది. కోమాలో ఉన్న సహానాను న్యూరోసర్జరీ ఐసీయూలో ఉంచి ఆస్పత్రి అ«ధికారులు, వైద్యులు చికిత్స అందించారు. కాగా.. రౌడీషీటర్ చేతిలో దారుణంగా దెబ్బతిని సహానా కోమాలోకి వెళ్లగా.. ఆమెపై ముగ్గురు లైంగిక దాడి చేశారని కుటుంబ సభ్యులు, దళిత సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు.దీంతో ఈ నెల 23న సహానా కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ వస్తారని పార్టీ నేతలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో 22న సాయంత్రం 5 గంటలకు రౌడీషీటర్ నవీన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటివరకు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న సహానా ఆ రోజు రాత్రి 7 గంటలకు మరణించినట్టు నిర్ధారించి మార్చురీకి తరలించారు. ఆమెకు మరుసటి రోజు ఉదయం 6గంటలకల్లా శవపంచనామా, 9 గంటల్లోగా పోస్టుమార్టం పూర్తిచేసి భౌతికకాయాన్ని తెనాలి తరలించాలని కూటమి ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారులు భావించారు. ఆ మేరకు జీజీహెచ్ సూపరింటెండెంట్ ఏకుల కిరణ్‌కుమార్‌కు ఆదేశాలిచ్చారు. అయితే, సహానా తల్లిదండ్రులు పోలీసుల ఉచ్చులో పడకుండా జగన్మోహన్రెడ్డి పర్యటన పూర్తయిన తర్వాత కూడా పంచనామాపై సంతకం చేయకుండా తమ బిడ్డకు న్యాయం చేయాలని ఆందోళన చేశారు. మరోవైపు సహానా భౌతికకాయాన్ని పరిశీలించి, కుటుంబసభ్యులు, వైద్యులతో మాట్లాడిన అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. సహానా కేసు విషయంలో ప్రభుత్వ తాత్సారాన్ని, నిర్లక్ష్య వైఖరిని జగన్ ఎండగట్టారు. దీంతో ఈ ఘటనలో తమ పార్టీకి నష్టం జరిగిందన్న అభిప్రాయానికి వచ్చిన ప్రభుత్వ పెద్దలు జీజీహెచ్ సూపరింటెండెంట్‌పై సీరియస్ అయ్యారు. చివరకు ఆయనకు బదిలీ కానుక ఇచ్చారు. -
ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోరం..
-
ఆర్మూర్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోరం
సాక్షి, నిజామాబాద్ జిల్లా: ఆర్మూర్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోరం జరిగింది. గర్భస్థ శిశువు మృతి చెందిన కానీ మూడు రోజులైనా బాధితులకు విషయం చెప్పకుండా వైద్యాధికారిణి నిర్లక్ష్యంగా వ్యవహరించారు. సిరికొండ మండలం రూప తండాకు చెందిన మంజుల రెండో కాన్పు కోసం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోంది.డెలివరీ తేదీ ఖరారు కావడంతో ఆర్మూర్‌లోని ఓ ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లో తీసిన స్కానింగ్ రిపోర్టులను వైద్యాధికారిణికి బాధితురాలు అందజేసింది. శిశువు గుండె చప్పుడు తక్కువగా ఉందని బాధితురాలికి వైద్యురాలు సూచించింది. బాధితులు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స కోసం వెళ్లగా గర్భస్థ శిశువు మృతి చెందినట్లు వైద్యురాలు తెలిపింది.గర్భస్థ శిశువు మృతి చెంది మూడు రోజులైనా విషయాన్ని తెలపకపోవడం పట్ల వైద్యులపై బంధువులు తీవ్రంగా మండిపడుతున్నారు. బాధితురాలి బంధువులను సముదాయించి గర్భస్థ మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించి శస్త్ర చికిత్స నిర్వహిస్తామని ఉన్నతాధికారులు వెల్లడించారు.ఇదీ చదవండి: కాలేజీలా.. మురికి కూపాలా? -
రాష్ట్రంలో ప్రజారోగ్యం అస్తవ్యస్తం
సాక్షి, హైదరాబాద్/ గాంధీ ఆస్పత్రి: రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని.. మాతాశిశు మరణాలు, విషజ్వరాలు పెరిగిపోతు న్నాయని బీఆర్ఎస్ ‘ప్రజారోగ్య కమిటీ’ మండిప డింది. రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజాపాలన కాదని, ఎమర్జెన్సీ పాలన అని ఆరోపించింది. గాంధీ ఆస్ప త్రిలో పరిస్థితులను పరిశీలించేందుకు వెళ్తే పోలీ సులు అడ్డుకోవడం దారుణమని మండిపడింది.గాంధీ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత.. నేతల అరెస్టులు..ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరిస్థితుల అధ్యయనం కోసం బీఆర్ఎస్ పార్టీ డాక్టర్ టి.రాజయ్య నేతృత్వంలో.. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్‌లతో కమిటీని వేసింది. సోమవారం ఉదయం తెలంగాణ భవన్ నుంచి గాంధీ ఆస్పత్రికి వెళ్లి పరిస్థితులను పరిశీలించాలని.. మాతాశిశు మరణాలపై నిజనిర్ధారణ చేయాలని ఈ కమిటీ నిర్ణయించింది. అయితే కమి టీకి నేతృత్వం వహిస్తున్న టి.రాజయ్యను పోలీ సులు ఉదయమే ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో గృహ నిర్బంధం చేశారు. మిగతా ఇద్దరు సభ్యులు డాక్టర్ సంజయ్, డాక్టర్ మెతుకు ఆనంద్ పోలీసుల కళ్లు గప్పి తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు.అక్కడి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, మరికొందరు పార్టీ నేతలతో కలసి గాంధీ ఆస్పత్రికి వెళ్లారు. పోలీసులు వారిని ఆస్పత్రి ప్రధాన గేటు వద్దే అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేత లు, పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట జరగ డంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు మాగంటి గోపీనాథ్, సంజయ్, మెతుకు ఆనంద్ లను అరెస్టు చేసి నారాయణగూడ ఠాణాకు.. ఇతర నేతలు, కార్యకర్తలను ఈడ్చుకెళ్లి వ్యాన్లలోకి ఎక్కించి బొల్లారం ఠాణాకు తరలించారు. మధ్యాహ్నం తర్వాత నేతలు, కార్యకర్తలను వదిలేశారు.రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలిగాంధీ ఆస్పత్రి ఘటన తర్వాత తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ప్రజారోగ్య కమిటీ సభ్యులు రాజయ్య, సంజయ్, మెతుకు ఆనంద్ మీడియాతో మాట్లా డారు. సీఎం, మంత్రుల సమీక్ష లేకపోవడంతో.. రాష్ట్రంలో ప్రజారోగ్యం కుంటుపడిందని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీలు తగ్గిపోయాయని రాజయ్య ఆరోపించారు. నిజనిర్ధారణ కోసం గాంధీ ఆస్పత్రికి వెళ్లిన కమిటీ సభ్యులను పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు.రాష్ట్రంలో విష జ్వరాలు విజృంభిస్తున్నా ప్రభుత్వం నిద్రపోతోందని డాక్టర్ సంజ య్ విమర్శించారు. ఆస్పత్రుల్లో డొల్లతనం బయట పడుతుందనే తమకు అడ్డుకున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని డాక్టర్ మెతుకు ఆనంద్ మండిపడ్డారు. నిపుణులైన వైద్యులు లేకే, ఆస్పత్రుల్లో మరణాలు సంభవి స్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు.మాతాశిశు మరణాలపై దాపరికం ఎందుకు?ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరుగుతున్న మాతాశిశు మరణాలపై సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దాపరికంగా వ్యవహరి స్తోందని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోపించారు. గాంధీ ఆస్పత్రి బయట ఆయన మీడియాతో మాట్లాడారు. తాము నిర్మాణాత్మక అంశాలపైనే పోరాడుతు న్నామని, ప్రతిపక్షంగా ఇది తమ బాధ్యత అని చెప్పారు. సీఎం కార్యాలయం నుంచి వైద్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు సరైన సహ కారం లేదని ఆరోపించారు. -
రూ. 5 కోట్లతో ఆసుపత్రి నిర్మాణం.. పదేళ్లలో రాని ఒక్క రోగి.. కారణమిదే!
ఎక్కడైనా ఆసుపత్రులను నిర్మించడం పెద్ద సవాలుతో కూడుకొని ఉంటుంది. నిధుల సేకరణ, బిల్డింగ్‌ను కట్టడం, వైద్య పరికరాలు అమర్చడం, వైద్యులను నియమించడం, వసతులు కల్పించడం ఇలా ఎన్నో క్లిష్టమైన సమస్యలు ఉంటాయి. కానీ అదే ఆసుపత్రిని కట్టడం ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చు. అనేక జబ్బులను నయం చేయవచ్చు. ఇప్పుడిదంతా ఎందుకంటే..బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో కోట్లాది రూపాయలతో ప్రభుత్వ ఆసుపత్రిని అయితే నిర్మించారు కానీ గత పదేళ్లుగా అక్కడ ఒక్క రోగి కూడా వైద్యం అందలేదు. ఇందుకు ఇంకా ఆ ఆసుపత్రిని ప్రారంభోత్సవం చేయకపోవడమే కారణం. అవును నిజమే..చాంద్ పురా ప్రాంతంలో ఆరు ఎకరాల్లో 30 పడకల ఆసుపత్రిని 2015లో రూ.5 కోట్లతో నిర్మించారు. అత్యాధునిక వసతులు కల్పించారు. కానీ ప్రారంభోత్సవం చేయకుండానే వదిలేయడంతో పొలం మధ్యలో శిథిలావస్థకు చేరుకుని దొంగలు, మందుబాబులుగా అడ్డాగా మారింది. అక్కడ ఒక్క రోగికి కూడా వైద్యం అందకపోవడంతో వైద్య పరికరాలు పాడైపోయాయి. ఆసుపత్రిని నిర్మించి పదేళ్లు కావస్తున్నా దీనినివైద్యారోగ్య శాఖ ఆధీనంలోకి తీసుకోలేదని, ఈ సౌకర్యాల గురించి అసలు తమకు తెలియదని అధికారులు చెబుతుండటం గమనార్హం.ఈలోపు దొంగలు ఆసుపత్రి కిటికీలు, డోర్ ఫ్రేమ్‌లు, తలుపులు, గ్రిల్స్, గేట్లు, కప్బోర్డ్లు, ఎలక్ట్రికల్ వైరింగ్, ఇతర సామగ్రిని ఎత్తుకెళ్లారు. దీంతో ఆసుపత్రి ఓ అస్థిపంజరంలా మిగిలిపోయింది. ఆసుపత్రి క్యాంపస్‌లో మూడు భవనాలు ఉండగా.. ఆరోగ్య కార్యకర్తల నివాసం, పరీక్షా కేంద్రం, ప్రధాన భవనాలుగా నిర్మించారు.#Bihar Hospital Abandoned for 10yrs Becomes Haven for Thieves Government hospital in #Muzaffarpur Bihar built in 2015 at cost of ₹5 Crs, has never been inaugurated or opened for patients. The 30-bed hospital, equipped with modern facilities, has been left to deteriorate, with… pic.twitter.com/In9CAFQZW3— Nabila Jamal (@nabilajamal_) September 6, 2024ఆసుపత్రి నానాటికీ క్షీణించడంతో మెరుగైన వైద్యం కోసం నగరవాసులు నగరానికి వెళ్లాల్సి వస్తోంది. ఈ ప్రాంతంలో దాదాపు లక్ష జనాభా నివాసం ఉంటుంది. ఈ ఆసుపత్రిని నిర్మిస్తున్నప్పుడు, దాని గొప్పతనాన్ని చూసి, చుట్టుపక్కల ప్రజలు మెరుగైన వైద్యం కోసం ఇకపై నగరానికి 50 కి.మీ ప్రయాణించాల్సిన అవసరం లేదని భావించారు. కానీ ఈ ఆసుపత్రి ఇప్పటి వరకు తెరుచుకోకపోవడంతో ఇక్కడి ప్రజలు నగరానికి వెళ్లడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు.ఈ విషయంపై సబ్ డివిజనల్ ఆఫీసర్ షెరియాను ఆరా తీయగా.. ఆసుపత్రి గురించి తనకు తెలియదని, పరిస్థితి తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. విచారణకు జిల్లా మేజిస్ట్రేట్ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఆమె వెల్లడించారు. సివిల్ సర్జన్, సర్కిల్ అధికారి వారి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారని, విచారణ అనంతరం పూర్తి సమాచారం వెల్లడిస్తామని చెప్పారు. -
ప్రభుత్వాసుపత్రిలో ఘోరం
జోధ్‌పూర్: రాజస్తాన్‌లోని మహాత్మాగాంధీ ప్రభుత్వాసుపత్రిలో ఘోరం చోటుచేసుకుంది. జోధ్‌పూర్ నగరంలోని ఈ ఆస్పత్రిలో 15 ఏళ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. నిందితుల్లో ఒకరు ఈ ఆస్పత్రిలో మాజీ ఉద్యోగి కావడం గమనార్హం. జోధ్‌పూర్ సిటీ(వెస్ట్) ఏసీపీ అనిల్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం సాయంత్రం బాలికను ఇంట్లో అమ్మ బాగా కోప్పడింది. దీంతో అలిగిన బాలిక ఇంటి నుంచి బయటకు వచ్చి దగ్గర్లోని మహాత్మాగాంధీ ప్రభుత్వాసుపత్రికి చేరుకుంది. అక్కడ ఒంటరిగా తిరుగుతున్న బాలికతో అక్కడే ఉన్న ఇద్దరు యువకులు మాటలు కలిపారు. తర్వాత బాలికను ఆస్పత్రి వెనుకభాగంలో ఆస్పత్రి బయోవ్యర్థాలను నిల్వఉంచిన డంపింగ్ యాడ్ వద్దకు తీసుకెళ్లి గ్యాంగ్‌రేప్ చేశారు. అమ్మాయి ఆదివారం సాయంత్రం నుంచి కనిపించకుండాపోవడంతో కుటుంబసభ్యులు బాగా వెతికి చివరకు సోమవారం సూరసాగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎట్టకేలకు సోమవారం సాయంత్రం గాంధీ ఆస్పత్రి సమీపంలో బాలిక జాడ కనిపెట్టారు. అమ్మాయి దొరికిందని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. తల్లిదండ్రులు వచ్చాక ముందురోజు తాను ఎదుర్కొన్న భయానక ఘటనను తల్లిదండ్రులు, పోలీసులకు అమ్మాయి విడమరిచి చెప్పింది. దీంతో అమ్మాయిని ఆస్పత్రిలో చేర్పించిన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేసి నిందితుల జాడ కోసం వేట మొదలెట్టారు. ఎట్టకేలకు నిందితులను అరెస్ట్‌చేసి ప్రశ్నిస్తున్నారు. మంగళవారం ఉదయం డంపింగ్‌యార్డ్‌లోని ఘటనాస్థలికి వెళ్లి ఫోరెన్సిక్ బృందం సాక్ష్యాధారాలను సేకరించిందని ఏసీపీ చెప్పారు. ‘‘ పోలీసులు ఆస్పత్రికి వచ్చారుగానీ అసలేం జరిగిందో మాకు చెప్పలేదు. మేం అంతర్గతంగా వివరాలు రాబట్టగా నిందితుల్లో ఒకడు మా ఆస్పత్రిలో గతంలో కాంట్రాక్ట్ పద్దతిలో ఉద్యోగం చేశాడని తెల్సింది’’ అని ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఫతాసింగ్ భాటి చెప్పారు. రాత్రిళ్లు ఆస్పత్రి పరిసరాల్లో ఎక్కడా చీకటి ఉండొద్దు. లైట్లు బిగించండి. చీకటి ప్రాంతం కనిపించొద్దు’ అని సిబ్బందిని ఆయన ఆదేశించారు. విమర్శలు ఎక్కుపెట్టిన విపక్షాలుబీజేపీ హయాంలో రాష్ట్రంలో ఆటవికపాలన నడుస్తోందని విపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. ‘‘ ఆటవిక ఏలుబడికి తాజా ఘటన ఒక ఉదాహరణ మాత్రమే. శాంతిభద్రతల అంశం అటు ప్రజా ప్రతినిధులకు, ఇటు పోలీసులకు ఏమాత్రం పట్టట్లేదు. దీంతో నేరస్తులకు భయం లేకుండా పోయింది. ఒకప్పుడు నేరాలే జరగని జోధ్‌పూర్‌లో ఇప్పుడు బీజేపీ అస్తవ్యస్థపాలనతో నగరంలో అమ్మాయిలకు రక్షణ కరువైంది’’ అని కాంగ్రెస్ నేత, రాజస్తాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ అన్నారు. రాష్ట్రంలో అసలు శాంతిభద్రతలు అనేవే లేవని రాజస్తాన్ కాంగ్రెస్ చీఫ్ గోవింద్‌సింగ్ దోస్తారా అన్నారు. -
సీఎం, డిప్యూటీ సీఎం ఎక్కడ ?.. మా గోడు పట్టించుకునే నాధుడే లేడా
-
ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించిన న్యాయమూర్తి
సింగరేణి (కొత్తగూడెం): నల్లగొండ జిల్లా మున్సిఫ్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జి టి.స్వప్న ఆదివారం రాత్రి కొత్తగూడెం ప్రభ ుత్వ ఆస్పత్రిలో ప్రసవించారు. కొత్తగూడెంలోని బూడిదగడ్డ బస్తీకి చెందిన న్యాయవాది శాంత కుమార్తె అయిన స్వప్నకు మిర్యాలగూడ మండలం నిడమనూరుకు చెందిన దాసరి కార్తీక్‌తో వివాహం జరిగింది.ప్రస్తుతం నల్లగొండ జిల్లా మున్సిఫ్ కోర్టులో జూనియర్ సివిల్ జడ్జిగా విధులు నిర్వర్తిస్తున్న స్వప్న.. ప్రసవం కోసం కొత్తగూడెంలోని పుట్టింటికి వచ్చారు. ఉన్నత విద్యనభ్యసించి, న్యాయమూర్తిగా కొనసాగుతున్న ఆమె.. కార్పొరేట్ స్థాయి వైద్యం చేయించుకునే స్థోమత ఉన్నా సామాన్య ప్రజలకు నమ్మకం కలిగేలా ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో కొత్తగూడెంలోని మాతాశిశు సంరక్షణ కేంద్రంలో చేరగా ఆదివారం రాత్రి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ సందర్భంగా స్వప్న మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత వైద్య సేవలు ఉపయోగించుకోవాలని, పూర్తి నమ్మకంతో వైద్యం పొందాలని సూచించారు. తనకు వైద్యసేవలందించిన డాక్టర్ సాగరిక, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. -
ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్ లో రోగుల కష్టాలు
-
కూటమి ప్రభుత్వ పాలనలో సర్కారు ఆస్పత్రుల్లో మళ్లీ పాత రోజులు
-
ప్రభుత్వాస్పత్రిలో శిశువు అపహరణ
మచిలీపట్నం టౌన్: బందరు ప్రభుత్వాస్పత్రిలో తల్లి పొత్తిళ్లలో వెచ్చగా సేదదీరుతున్న ఐదు రోజుల శిశువును ఓ మహిళ అపహరించింది. నర్సు వేషంలో వచ్చి.. తల్లితో మాటలు కలిపి.. ఆమె నిద్రపోగానే శిశువును ఎత్తుకెళ్లిపోయింది. ఈ ఘటన మచిలీపట్నంలో కలకలం సృష్టించింది. కృష్ణా జిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళానికి చెందిన చిట్టూరి స్వరూపరాణి ఈ నెల 8వ తేదీన డెలివరీ కోసం మచిలీపట్నంలోని సర్వజనాస్పత్రిలో చేరింది. 9వ తేదీన మగ బిడ్డకు జన్మనిచ్చింది. శనివారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో నర్సు వేషంలో వచ్చిన ఓ మహిళ.. స్వరూపరాణితో మాటలు కలిపింది. కొద్దిసేపటికి స్వరూపరాణి నిద్రలోకి జారుకోగా.. ఆ మహిళ శిశువును ఎత్తుకెళ్లిపోయింది. ఆ తర్వాత 15 నిమిషాలకు స్వరూపరాణి మెలుకువ వచ్చి లేచి చూడగా.. పొత్తిళ్లలోని శిశువు కనిపించలేదు. వెంటనే ఆమె తన తల్లిదండ్రులకు, భర్తకు సమాచారం ఇచ్చింది. వారు ఆస్పత్రి సిబ్బందికి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆస్పత్రికి చేరుకొని సీసీ టీవీ కెమెరాల పుటేజీలు పరిశీలించారు. స్వరూపరాణికి సహాయం చేసినట్లు నటించిన నర్సు వేషంలో ఉన్న మహిళే శిశువును తీసుకెళ్లినట్లు గుర్తించారు. సెక్యూరిటీ సూపర్వైజర్ సమాచారంతో..కొద్ది రోజుల క్రితం ఆస్పత్రిలో సెల్ఫోన్లు చోరీకి గురవ్వడంతో ఓ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ నిందితుడికి.. శిశువును కిడ్నాప్ చేసిన మహిళే బెయిల్ ఇచ్చిందని ఆస్పత్రి సెక్యూరిటీ సూపర్వైజర్ రాజు పోలీసులకు తెలియజేశాడు. పోలీసులు ఆ దిశగా దర్యాప్తు జరిపి ఆమె వివరాలు సేకరించారు. గంటల వ్యవధిలోనే ఆమె ఇంటికి చేరుకుని నిందితురాలిని అదుపులోకి తీసుకొని.. శిశువును స్వాధీనం చేసుకున్నారు. ఉదయం ఆరు గంటలకల్లా పోలీసులు శిశువును క్షేమంగా తల్లి స్వరూపరాణి చెంతకు చేర్చారు. దీంతో స్వరూపరాణి సంతోషం వ్యక్తం చేసింది. ఆడబిడ్డ కోసమని..!నిందితురాలిని తమ్మిశెట్టి లక్ష్మిగా పోలీసులు గుర్తించారు. ఆమె స్థానిక రామానాయుడుపేట సెంటర్లో కోడిగుడ్ల వ్యాపారం నిర్వహిస్తోంది. ఆమెకు ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. ఆడబిడ్డ కోసమని తాను శిశువును అపహరించానని నిందితురాలు విచారణలో తెలిపింది. తాను ఎత్తుకొచ్చింది మగ శిశువనే విషయాన్ని గమనించలేదని వెల్లడించింది. కాగా, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్టాఫ్ నర్సు దీవెన, సెక్యూరిటీ గార్డు విజయలక్ష్మిని సస్పెండ్ చేసినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ రమేశ్ తెలిపారు. ఎస్ఎన్సీయూ విభాగంలోని ఇద్దరు స్టాఫ్ నర్సులు, ఎఫ్ఎన్ఓ, సెక్యూరిటీ గార్డులకు చార్జ్ మెమోలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. -
డెంగ్యూ డేంజర్..
-
Kiran Kamdar: కిచిడీ బామ్మ
ఆస్పత్రిలోని రోగులు ప్రతి మధ్యాహ్నం ఆమె కోసం ఎదురు చూస్తారు. ఆమె రాకుండా పోదు. మబ్బులు రానీ నిప్పులు కురవనీ వస్తుంది. ముంబై ఆస్పత్రుల్లోని పేద రోగులకు రోజుకు వంద మందికి ఆమె కిచిడీ పంచుతుంది. ఆమె దగ్గర డబ్బు లేదు. మనసు తప్ప. అందుకే ఆమెను అందరూ ‘కిచిడీ ఆజి’ అని పిలుస్తారు.62 సంవత్సరాల కిరణ్ కామ్దార్ కుదురుగా నిలబడిగాని, కూచునిగాని మాట్లాడలేదు. దానికి కారణం ఐదేళ్ల క్రితం ఆమెకు వచ్చిన పార్కిన్సన్స్ వ్యాధి. కాని ఆమె ఆలోచనలు కుదురుగా ఉన్నాయి. ఆమె సేవాగుణం కుదురుగా ఉంది. దానిని ఎవరూ కదపలేరు. ముంబై శివార్లలో కొంకణి తీరాన ఉన్నపాల్ఘర్ పట్టణం ఆమెది. సాదాసీదా జీవనమే అయినా ఒక మనిషికి సాటి మనిషి సేవ అవసరం అని ఆమె తెలుసుకుంది. అందుకు కారణం ఆమె కుమారుడు సెరిబ్రల్‌పాల్సీతో జన్మించడమే. కుమారుడి కోసం జీవితాన్ని అంకితం చేసిన కిరణ్ చుట్టుపక్కల పేద పిల్లలకుపాఠాలు చెప్పడంతోపాటు చేతనైన సాయం చేయడం కొనసాగించేది. అయితేపార్కిన్సన్స్ వ్యాధి ఆమె కార్యకలాపాలను స్తంభింపచేస్తుందని ఆమె భర్త, కుమార్తె అనుకున్నారు. కాని 2021లో జరిగిన ఒక ఘటన అందుకు విరుద్ధంగా ఆమెను ప్రేరేపించింది.కిచిడి ముద్దపాల్ఘర్లో ఒకే ఒక పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. చుట్టుపక్కల 15 పల్లెల నుంచి పేద జనం ఉదయం నుంచే వచ్చి ఓపీలో వెయిట్ చేస్తుంటారు. వారికి చెకప్ అయ్యేసరికి మధ్యాహ్నం 2 అవుతుంది. ఆ సమయంలో వారి ఆకలి బాధకు అక్కడ విరుగుడు లేదు. 2021లో కోవిడ్ సెకండ్‌వేవ్ సమయంలో ఒక బంధువును పరామర్శించడానికి కిరణ్ ఆ ఆస్పత్రికి వెళ్లింది. మధ్యాహ్నం వేళ చాలామంది పేషెంట్లు ఆకలితో బాధ పడుతున్నారని గ్రహించింది. ‘వీరికి ఆకలి తీరే మార్గమే లేదా?’ అనుకుని వెంటనే రంగంలో దిగింది. హాస్పిటల్ డీన్‌ని కలిసి ‘నేను మీ హాస్పిటల్‌లోని పేషెంట్లకు శుచిగా చేసిన వెజిటబుల్ కిచిడి పెట్టొచ్చా. వాళ్లు అన్నం లేక బాధ పడుతున్నారు’ అని అడిగింది. హాస్పిటల్ డీన్ వెంటనే అంగీకారం తెలిపారు. అలా మొదలైంది కిరణ్ ‘కిచ్డీ బ్యాంక్’ ఆలోచన.రోజూ 100 మందిఅంతటిపార్కిన్సన్స్ వ్యాధితో బాధ పడుతున్నా రోజూ స్వయంగా దాదాపు 20 నుంచి 22 కిలోల కిచిడి తయారు చేస్తుంది కిరణ్. ఆ తర్వాత దానిని స్వయంగా తీసుకుని ఆస్పత్రి చేరుతుంది. అక్కడ వార్డు వార్డుకు తిరుగుతూ పేషెంట్లకి, వారి బంధువులకి, చిన్న పిల్లలకు పంచి పెడుతుంది. ఇందుకు రెండు మూడు గంటలు పట్టినా ఆమె అలసి పోదు. పల్లెటూరి పేదవారు ఆమె తెచ్చే ఆ కిచిడి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ‘నువ్వు దేవతవు తల్లీ’ అని ఆశీర్వదిస్తూ ఉంటారు. ‘కిచిడి పేషెంట్లను త్వరగా కోలుకునేలా చేస్తుంది. సులభంగా అరుగుతుంది’ అంటుంది కిరణ్.అదే వైద్యంపార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతూ ఇంతమందికి రోజూ వండటం గురించి కిరణ్‌కు చికిత్స చేస్తున్న డాక్టర్లు ఆందోళన చెందినా, వారించినా ఇప్పుడు మూడేళ్లుగా సాగుతున్న ఆమె సేవను చూశాక, ఆమెకు పరీక్షలు చేశాక ‘ఆమె చేస్తున్న సేవే ఆమెకు వైద్యంగా పని చేస్తున్నదని’ తేల్చారు. ఆమె సంకల్పం వ్యాధిని అదుపులో పెడుతోందని తెలియచేశారు. కిరణ్ కామ్దార్ గత మూడేళ్లుగా సాగిస్తున్న ఈ సేవకు ఆమెకు ఎన్నో అవార్డులు వచ్చాయి. మెచ్చుకోళ్లు దక్కుతున్నాయి. నిజానికి ఇది అసాధ్యమైన పని కాదు. ఆమె మాత్రమే చేయదగ్గ పని కాదు. ఎవరైనా అతి సులువుగా పూనుకోదగ్గదే. ప్రతి ్రపాంతంలో ఎన్నో ప్రభుత్వ ఆస్పత్రుల దగ్గర పేదవాళ్లు, లోపలి పేషెంట్లు సరైన తిండి లేక బాధపడుతుంటారు. వారికి కిచ్డీయో సాంబార్ రైసో పెట్టడం పెద్ద కష్టం కాదు. రోజూ చేయకపోయినా వారానికి ఒకరోజైనా ఇలాంటి సేవ చేస్తే ఆ తృప్తే వేరు. ఎక్కువమంది పూనుకోరు. పూనుకున్నవారు కిరణ్ కామ్దార్లా చిరాయువు పొందుతారు. -
బీజేపీ సేవలో ప్రభుత్వ వైద్యుని భార్య
ధర్మవరం: ప్రభుత్వ వైద్యుని భార్య బీజేపీ సేవలో తరిస్తున్నారు. ధర్మవరం ప్రభుత్వాస్పత్రిలో డాక్టర్ వివేక్ కుళ్లాయప్ప దంతవైద్యునిగా పనిచేస్తున్నారు. ఈయన భార్య నీరజ కూడా డాక్టరే. అయితే ఆమె ప్రైవేట్‌గా వైద్య సేవలందిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ తరఫున భార్య త్రివేణి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం డాక్టర్ వివేక్ ఇంటివద్దకు వెళ్లి కుటుంబ సభ్యులను కలిశారు. ఈ సందర్భంగా దంతవైద్యుని సమక్షంలోనే ఆయన భార్య డాక్టర్ నీరజకు బీజేపీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రభుత్వ డాక్టర్ భార్య రాజకీయ పార్టీలో చేరడం విమర్శలకు తావిచ్చింది. ఇదిలా ఉండగా బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ నామినేషన్ సమయంలో సమర్పించిన వివరాలలో భార్య పేరు ప్రస్తావించలేదు. పిల్లలు మాత్రమే ఉన్నట్లు పొందుపరిచారు. ఎన్నికల ప్రచారంలో మాత్రం సత్యకుమార్ భార్యగా త్రివేణి ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. -
కరీంనగర్ ప్రభుత్వాస్పత్రి వద్ద ఉద్రిక్తత
-
ప్రభుత్వాస్పత్రిలో కలెక్టర్ భార్య ప్రసవం
పార్వతీపురం: ఆయన ఆ జిల్లాకే ప్రధాన అధికారి. ఆయన తలచుకుంటే కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్య సేవలు పొందగలరు. కానీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుతున్న మెరుగైన వైద్య సేవల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నారు. ధైర్యంగా తన భార్యకు ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం చేయించారు. పలువురికి ఆదర్శంగా నిలిచారు. ఆయన మరెవరో కాదు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నిషాంత్‌కుమార్. వివరాల్లోకి వెళితే...పార్వతీపురం జిల్లా ఆస్పత్రిలో కలెక్టర్ నిషాంత్‌కుమార్ భార్య కరుణ బుధవారం సాయంత్రం మగబిడ్డకు జన్మనిచ్చారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ బి.వాగ్దేవి, వైద్యులు త్రివేణి, చిన్నపిల్లల వైద్యుడు బి.గణేష్ చైతన్య వైద్యసేవలందించి సుఖప్రసవం చేశారు. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. కలెక్టర్ నిషాంత్‌కుమార్ గతంలో రంపచోడవరం ఐటీడీఏ పీవోగా పనిచేసిన సమయంలో అక్కడి సమీపంలోని ప్రభుత్వాస్పత్రిలోనే ఆయన భార్య తొలి సంతానంగా ఆడబిడ్డకు జన్మనిచ్చారు. అలాగే పార్వతీపురంలో పనిచేసిన జాయింట్ కలెక్టర్ ఒ.ఆనంద్ భార్య కూడా ఇటీవల 108 వాహనంలో వెళ్లి పార్వతీపురం జిల్లా ఆస్పత్రిలోనే మగబిడ్డకు జన్మనిచి్చన సంగతి తెలిసిందే. -
బాధితులకు అండగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్
-
ఆసిఫాబాద్ ఆస్పత్రిలో రోగుల ఇబ్బందులు..!
-
Maharashtra Incident: నిధులున్నాయి.. అయినా మందులు కొనలేదు
ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రిలో మరణాలపై ఆ రాష్ట్ర వైద్యవిద్యా శాఖ మంత్రి హాసన్ షరీఫ్ ఆసుపత్రి వర్గాలపై సీరియస్ అయ్యారు. ఆసుపత్రిలో మందులు కొనుగోలు చేయడానికి రూ .5 కోట్ల నిధులు ఉన్నప్పటికీ వారు ఎందుకు కొనుగోలు చేయలేదని ప్రశ్నించారు. మహారాష్ట్ర శంకర్రావ్ చోహాన్ ఆసుపత్రిలో 48 గంటల వ్యవధిలో 31 మంది మృతిచెందిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మృతుల్లో చిన్నారులు కూడా ఉండటంతో ప్రభుత్వ వర్గాలు ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నాయి. ప్రతిపక్షాలు కూడా ఆసుపత్రి ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. మంగళవారం ఎంపీ హేమంత్ పాటిల్ ఆసుపత్రిని సందర్శించి పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతో ఏకంగా డీన్‌తోనే టాయిలెట్లు శుభ్రం చేయించారు. ఇదిలా ఉండగా ఈరోజు ఈ అంశంపై వైద్యవిద్య శాఖ మంత్రి హాసన్ షరీఫ్ తీవ్ర ఆగ్రహం వ్యక్త చేశారు. ఆసుపత్రిలో 31 మంది కేవలం మందులు లేక మరణించారని తెలిసి ఆసుపత్రి వర్గాలను నిలదీశారు. దాదాపు రూ.4 నుంచి 5 కోట్లు నిధులు ఉన్నా కూడా వారు మందులు ఎండలు కొనుగోలు చేయలేదని ప్రశ్నించారు. దీంతోపాటు ఆసుపత్రి నిర్వహణ, పరిసరాల శుభ్రత వంటి వ్యవహారాల్లో లోపాలపై కూడా మంత్రి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మంత్రి మాట్లాడుతూ ఆసుపత్రిలో మరణాలపై విచారం చేసేందుకు కొంతమంది డాక్టర్లతో కూడిన కమిటీని నియమించామని వారు అతి త్వరలోనే నివేదిక ఇవ్వనున్నారని ఈ సంఘటనకు కారణమైన వారిని ఎవ్వరినీ విడిచిపెట్టేదిలేదని అన్నారు. వీలయితే మెడికల్ కాలేజీ సిబ్బందిని ఇక్కడికి రప్పిస్తామని తెలిపారు. మాకు ప్రతి చిన్నారి ప్రాణం ముఖ్యమే. అయితే మందులు కొనడానికి 40% నిధులు ఉన్నప్పటికీ డీన్ నిధులు లేవని చెప్పడం చాలా విడ్డూరంగా ఉందని దానిపైన కూడా విచారణ చేయనున్నామని తెలిపారు. ఇది కూడా చదవండి: పన్నులు పెరిగాయి.. అప్పు కూడా పెరిగింది: పంజాబ్ సీఎం -
ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోరం.. 24 గంటల్లో 24 మంది మృతి
మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో గడిచిన 24 గంటల్లో 24 మంది మృత్యువాతపడటం తీవ్ర కలకలం రేపుతోంది. మరణించిన వారిలో 12 మంది నవజాత శిశువులు ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. నాందేడ్ జిల్లాలో శంకర్రావు చావన్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ఘోరం వెలుగుచూసింది. అయితే ఆసుపత్రిలో మందులు, సిబ్బంది కొరత వల్లే ఈ విషాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పెరుగుతున్న మృతుల సంఖ్య నాందేడ్ ప్రభుత్వ వైద్యశాలలో గత 24 గంటల్లో 24 మంది రోగులు మరణించారు. వీరిలో 12 మంది అప్పుడే పుట్టిన చిన్నారులు కూడా ఉండటం హృదయాలను కలచివేస్తోంది. మరోవైపు నాందేడ్ ఆసుపత్రిలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దురదృష్టవశాత్తు మరో ఏడుగురు రోగులు మరణించారు. వీరిలో చనిపోయిన వారిలో 4గురు పిల్లలు కూడా ఉన్నారు. దీంతో మంగళవారం ఉదయం నాటికి మరణించిన వారి సంఖ్య 31కు చేరింది. తాజా మరణాలకు సంబంధించి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ ఎక్స్‌లో పోస్ట్ ద్వారా తెలియజేశారు. नांदेडमध्ये मृत्यूचे थैमान सुरूच. शासकीय वैद्यकीय महाविद्यालयाच्या रुग्णालयात कालपासून आणखी ७ रुग्णांचा दुर्दैवी मृत्यू. मृतकांमध्ये ४ बालकांचाही समावेश. राज्य सरकारने जबाबदारी निश्चित करावी. — Ashok Chavan (@AshokChavanINC) October 3, 2023 మందుల కొరత వల్లే మరణాలు రోగులకు అవసరమైన మందులు అందుబాటులో లేకపోవడం వల్లే ఈ మరణాలు సంభవించాయని ఆసుపత్రి అధికారులు చెబుతున్నారు. మరణించిన 12 మంది చిన్నారుల్లో ఆరుగురు బాలికలు, ఆరుగురు బాలురు ఉన్నారని ఆసుపత్రి డీన్ తెలిపారు. చనిపోయిన మిగతా పన్నెండు మంది పెద్దవారిలో పాము కాటుతో సహా వివిధ వ్యాధుల కారణంగా మరణించారని ఆయన పేర్కొన్నారు. 70-80 కి.మీలో ఏకైక ఆసుపత్రి ఆసుపత్రి తృతీయ స్థాయి కేర్ సెంటర్ మాత్రమేనని, కానీ చుట్టుపక్కల 70,80 కిలీమీటర్ల పరిధిలో ఉన్న ఏకైక హెల్త్ కేర్ సెంటర్ ఇదే కావడంతో వివిధ ప్రాంతాల నుంచి రోగులు వస్తున్నారని డీన్ తెలిపారు. ఆసుపత్రిలో చేరే రోగుల సంఖ్య అధికంగా ఉందని అన్నారు. కొన్నిసార్లు పేషెంట్ల సంఖ్య ఆసుపత్రి బడ్జెట్‌ను మించిపోవడంతో మందుల కొరత ఏర్పడిందని తెలిపారు. చదవండి: ప్రాణం పోయేలా ఉందన్నా.. పడేసి పోయారు! సిబ్బంది బదిలీతోనూ ఇబ్బందులు హాఫ్కిన్ అనే సంస్థ నుంచి మందులను ఆసుపత్రి కొనుగోలు చేయాల్సి ఉందని, అయితే అది జరగడం లేదని అన్నారు డీన్. దీంతో రోగులు స్థానిక మెడికల్ షాపుల నుంచి మందులు కొనుగోలు చేసి తీసుకొచ్చిన తర్వాతే రోగులకు మందులు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. దీనికితోడు అనేకమంది ఆసుపత్రి సిబ్బందిని బదిలీ చేయడం వల్ల రోగులకు సేవలు అందించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. తల్లిదండ్రుల ఆవేదన.. మరోవైపు మృతుల్లో నవజాత శిశువులు కూడా ఉండటంతో వారి తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపిస్తున్నారు. తమ పిల్లల మరణాలకు ఆసుపత్రి నిర్లక్ష్యమే కారణమని, వైద్యులు సరిగా చికిత్స చేయడం లేదని ఆరోపిస్తున్నారు. తమ బిడ్డను చూడటానికి సిబ్బంది అనుమతించడం లేదని మరికొంతమంది చెబుతున్నారు. మా బిడ్డ క్షేమంగా ఉన్నాడో లేదో.. మాకు ఏమీ తెలియడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షాల మండిపాటు ఇక ఈ ఘటన విషయంలో మహారాష్ట్రలోని శివసేన(షిండే వర్గం), బీజేపీ, ఎన్సీపీ(అజిత్ వర్గం) ట్రిపుల్ ఇంజిన్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. నాందేడ్ ఆసుపత్రిలో 24 గంటల్లో 12 నవజాత శిశువులతో సహా 24 మరణాలు మందుల కొరత వల్ల మాత్రమే సంభవించలేదని ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే జరిగాయని విరుచుకుపడ్డాయి. పండుగలు, పబ్లిసిటీ కోసం కోట్లు ఖర్చు చేసే ప్రభుత్వానికి, చిన్నారుల మందుల కోసం డబ్బులు కేటాయించకపోవడం సిగ్గు చేటని దుమ్మెత్తిపోస్తున్నాయి. బీజేపీ దృష్టిలో పేదల ప్రాణాలకు విలువ లేదని మండిపడుతున్నాయి. नांदेड़, महाराष्ट्र के सरकारी अस्पताल में दवाइयों की कमी से 12 नवजात शिशुओं समेत 24 लोगों की मृत्यु का समाचार अत्यंत दुखद है। सभी शोकाकुल परिवारों को अपनी गहरी संवेदनाएं व्यक्त करता हूं। भाजपा सरकार हज़ारों करोड़ रुपए अपने प्रचार पर खर्च कर देती है, मगर बच्चों की दवाइयों के लिए… — Rahul Gandhi (@RahulGandhi) October 2, 2023 విచారణకు ఆదేశం ఎన్సీపీ(శరద్ వర్గం) వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే ఈ ఘటనపై విచారణకు ఆదేశించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేను డిమాండ్ చేశారు. సంబంధిత మంత్రులను వారి పదవుల నుంచి తొలగించాలని అన్నారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని ఆమె కోరారు. ఇక ఈ ఘటనపై ముగ్గురు సభ్యులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేశామని, మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట కల్లా కమిటీ తన రిపోర్టు ఇవ్వనుందని మహారాష్ట్ర మెడికల్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ డైరెక్టర్ దిలీప్ మైసేకర్ తెలిపారు. -
ఆధునిక వసతులతో కొత్తగా క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణం
-
మన ప్రభుత్వాస్పత్రులకు అరుదైన గౌరవం
సాక్షి, అమరావతి: విశాఖపట్నంలోని ఛాతీ, సాంక్రమిక వ్యాధుల ఆస్పత్రి, మానసిక ఆరోగ్య ఆస్పత్రులకు అరుదైన గౌరవం లభించింది. రోగులకు అందిస్తున్న అత్యుత్తమ వైద్య సేవలకు గానూ నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్, హెల్త్‌కేర్ ప్రొవైడర్స్(ఎన్ఏబీహెచ్) గుర్తింపు దక్కింది. తద్వారా దేశంలోనే ఎన్ఏబీహెచ్ గుర్తింపు పొందిన తొలి ప్రభుత్వ మానసిక ఆరోగ్య ఆస్పత్రిగా విశాఖ మానసిక ఆస్పత్రి రికార్డును కైవసం చేసుకుంది. ఈ గుర్తింపు 2027 ఆగస్టు తొమ్మిదో తేదీ వరకు అధికారికంగా ఉంటుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో రోగులకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్న ఈ రెండు ఆస్పత్రులకు ఎన్ఏబీహెచ్ గుర్తింపు కోసం వైద్య, ఆరోగ్య శాఖ దరఖాస్తు చేసింది. దీంతో ఆస్పత్రుల్లో తనిఖీల అనంతరం ఎన్ఏబీహెచ్ నిర్దేశించిన మేరకు సేవలు అందించడంతోపాటు నిబంధనలు, మార్గదర్శకాలను అమలు చేస్తుండటంతో గుర్తింపు ఇచ్చారు. ఈ మేరకు ఆస్పత్రుల సూపరింటెండెంట్లకు శుక్రవారం సమాచారం అందించారు. నాలుగేళ్లుగా సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట దేశంలో నాణ్యమైన వైద్యసేవల కల్పన, ఆస్పత్రుల్లో నాణ్యత ప్రమాణాల పర్యవేక్షణ కోసం క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎన్ఏబీహెచ్ను నెలకొల్పింది. ఎన్ఏబీహెచ్ గుర్తింపు ఇచ్చేందుకు ఒక రోగి ఆస్పత్రిలోకి అడుగు పెట్టినప్పటి నుంచి వైద్యం చేయించుకుని తిరిగి వెళ్లే వరకు అందిస్తున్న సేవలు, భద్రత, ఆస్పత్రి నిర్వహణ, వైద్యులు, సిబ్బంది పనితీరు అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. రోగుల సేవల్లో భాగంగా ఆస్పత్రిలో ఫ్రెండ్లీ, ఆహ్లాదకర వాతావరణం, సెక్యూరిటీ, శానిటేషన్ పక్కాగా నిర్వహణ, ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా చేపట్టిన చర్యలు, ఆస్పత్రుల నుంచి వెలువడే వ్యర్థాలను సక్రమంగా నిర్వహిస్తున్నారా? లేదా? అనే అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగంలోనే ప్రజలకు నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన సదుపాయాల కల్పనపై సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. గత నాలుగేళ్లలో వసతుల కల్పన నుంచి వైద్యుల నియామకం వరకు అన్ని విధాలుగా ఆస్పత్రులను బలోపేతం చేసింది. దీంతో రాష్ట్రంలోని 443కు పైగా ప్రభుత్వాస్పత్రులకు నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్(ఎన్‌క్వా‹Ù) గుర్తింపు లభించింది. ఎన్‌క్వాష్ గుర్తింపులో దేశంలోనే ప్రస్తుతం ఏపీ మొదటి స్థానంలో ఉంది. తాజాగా విశాఖలోని ఛాతీ, మానసిక ఆస్పత్రికి అరుదైన ఎన్ఏబీహెచ్ గుర్తింపు లభించింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో చేసిన కృషికి దక్కిన గౌరవమని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ప్రతిష్టాత్మక గుర్తింపు దక్కింది ఆస్పత్రికి 150 ఏళ్ల చరిత్ర ఉంది. 300 పడకలు ఉన్న ఈ ఆస్పత్రిలో మానసిక వ్యాధులతో బాధపడే వారికి చికిత్స అందిస్తున్నాం. ఈ ఆస్పత్రిలో పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ సేవలందించేలా సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ తరుణంలో అత్యంత ప్రతిష్టాత్మక ఎన్ఏబీహెచ్ గుర్తింపు దక్కడం విశేషం. ఎన్ఏబీహెచ్ పొందిన దేశంలోనే తొలి ప్రభుత్వ రంగ మానసిక ఆస్పత్రి మన రాష్ట్రానికి చెందినది కావడం ఎంతో గర్వంగా ఉంది. – డాక్టర్ రామిరెడ్డి, సూపరింటెండెంట్, విశాఖ మానసిక ఆస్పత్రి అన్ని ఆస్పత్రులకు నేషనల్ సర్టిఫికేషన్ ప్రభుత్వాస్పత్రుల్లో ప్రమాణాలను పెంచి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నది సీఎం వైఎస్ జగన్ లక్ష్యం. అందుకు తగ్గట్టుగా సంస్కరణలు చేపట్టాం. పీహెచ్సీ నుంచి బోధనాస్పత్రుల వరకూ అన్ని స్థాయిల్లోని ఆస్పత్రులను, వాటిల్లోని విభాగాలను ఎన్క్వాన్, లక్ష్య, ముష్కాన్, ఎన్ఏబీహెచ్ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్ది సర్టిఫికేషన్ చేయిస్తున్నాం. ఈ క్రమంలోనే విశాఖలోని ఛాతీ, మానసిక ఆస్పత్రులకు ఎన్ఏబీహెచ్ గుర్తింపు వచ్చింది. – ఎంటీ కృష్ణబాబు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ -
ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం
-
ప్రభుత్వాస్పత్రుల్లో కార్పొరేట్‌కు మించి సౌకర్యాలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): కార్పొరేట్ ఆస్పత్రుల్లో కూడా లేని అత్యాధునిక వైద్య సదుపాయాలను ప్రభుత్వాస్పత్రుల్లో అందుబాటులోకి తెస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని వెల్లడించారు. విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రిలోని మాతా శిశు విభాగంలో రూ.5.53 కోట్లతో ఏర్పాటు చేసిన నవజాత శిశు వైద్య విభాగాలు ఎస్ఎన్సీయూ(స్పెషల్ న్యూ బోర్న్ కేర్ యూనిట్), ఎన్ఐసీయూ (నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్)లను గురువారం మంత్రి ప్రారంభించారు. ప్రసూతి విభాగంలో ఇప్పటికే 250 పడకలు అందుబాటులో ఉండగా.. అదనంగా 40 పడకలను నవజాత శిశు వైద్యం కోసం అందుబాటులోకి తెచ్చినట్టు మంత్రి తెలిపారు. తక్కువ బరువు, కామెర్లు వంటి అనారోగ్య కారణాలతో అప్పుడే పుట్టిన శిశువులకు అత్యవసర విభాగ అవసరాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం రూ.5.53 కోట్లతో ఏర్పాటు చేసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 61 ఎస్ఎన్సీయూలు, ఎన్ఐసీయూలు అందుబాటులో ఉన్నాయని, వాటికి అదనంగా రూ.31.51 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా మరో 12 అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఇక్కడి ఎంసీహెచ్ బ్లాక్ నిర్మాణ పనులను సైతం త్వరలో ప్రారంభిస్తామని రజిని తెలిపారు. కాగా, రాజీవ్‌నగర్‌లోని ఆస్పత్రిని 50 పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేయాలని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు, వైఎస్సార్ సీపీ తూర్పు ఇన్చార్జి దేవినేని అవినాశ్, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జె.నివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఆస్పత్రి వేళలో వస్తేనే వైద్యం చేస్తాం
కోస్గి: మున్సిపల్ పరిధిలోని తిమ్మాయపల్లికి చెందిన ఓ వ్యక్తి వైద్యం కోసం ప్రభుత్వాస్పత్రికి రావడంతో ఆస్పత్రి సమయం అయిపోయిందని, సాయంకాలం వస్తేనే వైద్యం చేస్తామని చెప్పి వైద్యానికి నిరాకరించిన సంఘటన పట్టణంలో చోటుచేసుకుంది. తిమ్మాయపల్లికి చెందిన ఎల్లప్ప రెండు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో కాలికి గాయాలయ్యాయి. కొంతకాలు భాగం తీసివేశారు. ఒకరోజు విడిచి ఒకరోజు గాయాన్ని శుభ్రం చేసి కట్టు కట్టాల్సి ఉంటుంది. ఈ క్రమంలో నడవలేని స్థితిలో ఓ ఆటోలో కట్టు కోసం స్థానిక ప్రభుత్వాస్పత్రికి వచ్చాడు. మధ్యాహ్నం 2గంటలకు ఆస్పత్రికి వచ్చాడు. దీంతో ఆస్పత్రి సమయం అయిపోయిందని, సాయంత్రం 4 గంటలకు రావాలని సిబ్బంది చెప్పారు. వైద్యం చేయడానికి నిరాకరించారు. నడవలేని స్థితిలో ఉన్నాడని, కట్టుకడితే వెళ్తామని బాధితులు ప్రాధేయపడినా వినిపించుకోలేదు. ఆస్పత్రి వేళల్లో వస్తేనే వైద్యం చేస్తాం.. మీ ఇష్టం వచ్చినట్లు వస్తే చేయం. ఎవరికై నా చెప్పుకోండి అంటూ రోగిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో చేసేది లేక బాధితుడు ఎల్లప్ప ఇంటికి వెళ్లిపోయాడు. ఈవిషయమై ఆస్పత్రి వైద్యుడు అనుదీప్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేడు. -
AP: దిగులు లేదిక.. ఉద్దానం చెంతకు ఆధునిక వైద్యం
సాక్షి, అమరావతి: శ్రీకాకుళం జిల్లా మందస మండలం లింబుగం గ్రామస్తుడైన తెవ్వయ్య ఐదేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. డయాలసిస్ చేయించుకుంటున్నాడు. టీడీపీ ప్రభుత్వ హయాంలో శ్రీకాకుళం జిల్లాలోని ఏ ప్రభుత్వ ఆస్పత్రిలోనూ కిడ్నీ వ్యాధులకు సరైన చికిత్స అందుబాటులో ఉండేది కాదు. దీంతో చికిత్స కోసం విశాఖకు వెళ్లేవాడు. సహాయకునితో కలిసి ఒక్కసారి విశాఖకు వెళ్లి రావాలంటే రవాణా, ఇతర ఖర్చుల రూపంలో రూ.వేలల్లో ఖర్చు అయ్యేది. చాలీచాలని పింఛన్, భార్య కూలిపనులకు వెళితే వచ్చే డబ్బుతో మందుల కొనుగోలు.. వెరసి వైద్యం చేయించుకోవడం తలకు మించిన భారంగా మారింది. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక లింబుగంకు మూడు కి.మీ దూరంలోని హరిపురం సీహెచ్‌సీలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేశారు. డయాలసిస్‌కు వెళ్లాల్సిన రోజు 108కు ఫోన్ చేస్తే అంబులెన్స్ ఇంటి వద్దకే వచ్చి తెవ్వయ్యను ఆస్పత్రికి తీసుకెళ్లేది. నెఫ్రాలజిస్ట్ సమీపంలోని హరిపురం ఆస్పత్రికి షెడ్యూల్ ప్రకారం వస్తున్నారు. ఈ క్రమంలో ఏదైనా సమస్య ఉంటే వెంటనే వైద్యం అందుతోంది. మరోవైపు సీఎం జగన్ ఇతని పింఛన్‌ను రూ.10 వేలకు పెంచారు. వీటన్నింటికీ తోడు ఇప్పుడు త్వరలో పలాసలో కిడ్నీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి అందుబాటులోకి రానుంది. ఈ క్రమంలో తెవ్వయ్య మాట్లాడుతూ ‘నా లాగా మహమ్మారి జబ్బుతో బాధపడుతున్న వారికి సీఎం జగన్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. పింఛన్ రూ.10 వేలకు పెంపుతో ఆర్థికంగా అండగా నిలివడమే కాకుండా, మా ఊళ్లకు శుద్ధి చేసిన నీటిని అందించడానికి చర్యలు తీసుకున్నారు. మెరుగైన వైద్యాన్ని మాకు చేరువ చేశారు. ఇంతకంటే మాకేం కావాలి?’ అని ఆనందపడ్డాడు. ప్రభుత్వ చర్యల కారణంగా ఉద్దానం ప్రాంతంలో ఇలా ఎంతో మంది కిడ్నీ బాధితులకు ఊరట లభిస్తోంది. అత్యాధునిక ఆస్పత్రితో భరోసా కిడ్నీ వ్యాధులకు మూల కారణంగా భావిస్తున్న నీటి సమస్యకు చెక్ పెట్టడంతో పాటు వైద్య పరంగా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. పలాసలో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేపట్టారు. దీన్ని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. రూ.60 కోట్లతో నిర్మిస్తున్న రీసెర్చ్ సెంటర్, ఆస్పత్రి నిర్మాణ పనులు 85 శాతం మేర పూర్తయ్యాయి. తుది దశ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ర్యాంప్ బ్లాక్‌తో కలిపి మూడు బ్లాక్‌లుగా నాలుగు అంతస్తుల్లో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటవుతోంది. మొదటి అంతస్తులో క్యాజువాలిటీ, రేడియో డయాగ్నోసిస్, హాస్పిటల్ సోర్ట్స్, సెంట్రల్ ల్యాబ్స్ ఉంటాయి. రెండో అంతస్తులో నెఫ్రాలజీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్, సర్జరీ, మూడో అంతస్తులో డయాలసిస్, నెఫ్రాలజీ వార్డులు, నాలుగో అంతస్తులో ఓటీ కాంప్లెక్స్, పోస్ట్ ఆపరేటివ్/ఐసీయూ, యూరాలజీ వార్డ్స్, రీసెర్చ్ ల్యాబ్స్ ఉంటాయి. వీటన్నింటి కారణంగా కిడ్నీ రోగులకు భరోసా లభించనుంది. అధునాత పరికరాల సమకూర్పు కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌కు అత్యంత అధునాతన పరికరాలను ప్రభుత్వం సమకూరుస్తోంది. కిడ్నీ వ్యాధులకు సంబంధించిన అన్ని రకాల చికిత్సలతో పాటు, పరిశోధనలు చేయడానికి వీలుగా పరికరాల సమకూర్పు ఉంటోంది. ఎంఆర్ఐ, సిటీ స్కాన్, 2డీ ఎకో, హైఎండ్ కలర్ డాప్లర్, మొబైల్ ఎక్సరే ► డిజిటల్, ఏబీజీ అనలైజర్ పరికరాలతో పాటు, ఫుల్లీ రిమోట్ కంట్రోల్ ఐసీయూ కిడ్నీ రీసెర్చ్ సెంటర్లో ఉండనున్నాయి. మొత్తంగా 117 రకాల వైద్య పరికరాలను ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. ఇప్పటికే పలు పరికరాల సరఫరా కూడా మొదలైంది. రీసెర్చ్ సెంటర్లో శాశ్వత ప్రాతిపదికన 41 మంది స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్యుల నియామకానికి ఇటీవల కేబినెట్ ఆమోదం తెలిపింది. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, యూరాలజీ, నెఫ్రాలజీ, ఇతర వైద్యులను ఇక్కడ నియమించనున్నారు. ఇప్పటికే ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఇలా.. ► గత ప్రభుత్వంలో తీవ్రమైన కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రూ.2,500 ఇచ్చే పెన్షన్‌ను సీఎం జగన్ ప్రభుత్వం ఏకంగా రూ.10 వేలకు పెంచింది. ప్రతి నెల 1వ తేదీనే లబ్ధిదారుల గుమ్మం వద్దకు రూ.10 వేల చొప్పున వలంటీర్లు పెన్షన్ అందజేస్తున్నారు. ► టెక్కలి, పలాస, సోంపేట, కవిటి, హరిపురం ఆస్పత్రుల్లో 69 మెషిన్లతో డయాలసిస్ సేవలు అందిస్తున్నారు. 2020లో హరిపురంలో డయాలసిస్ సెంటర్‌ను ప్రారంభించారు. మరో 25 మిషన్లతో కొత్తగా గోవిందపురం, అక్కుపల్లి, కంచిలి, బెలగాంలో డయాలసిస్ సెంటర్లు మంజూరయ్యాయి. ఇలా వరుసగా 2019–20లో 37,454 సెషన్లు, 2020–21లో 46,162 సెషన్లు, 2021–22లో 54,520 సెషన్లు, 2022–23లో 55,708 సెషన్లు కిడ్నీ బాధితులకు డయాలసిస్ చేశారు. ► ఇచ్చాపురం, కంచిలి సీహెచ్‌సీ, పీహెచ్‌సీల్లో 25 మిషన్లతో డయాలసిస్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ► కిడ్నీ వ్యాధులపై వైద్య పరీక్షల కోసం ఉద్దానం ప్రాంతంలోని 18 పీహెచ్‌సీలు, ఐదు యూపీహెచ్‌సీలు, ఆరు సీహెచ్‌సీల్లో సెమీ ఆటో ఎనలైజర్లు, ఎలక్ట్రోలైట్ ఎనలైజర్లు, యూరిన్ ఎనలైజర్లు అందుబాటులో ఉంచారు. ► టీడీపీ హయాంలో డయాలసిస్ రోగులకు 20 రకాల మందులే అందిస్తుండగా, అవి కూడా అరకొరగానే అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం ప్రతి ఆస్పత్రిలో 37 రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. ► కొత్త కేసుల గుర్తింపునకు వైద్య శాఖ నిరంతరాయంగా స్క్రీనింగ్ కొనసాగిస్తోంది. వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లలో పనిచేసే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్(సీహెచ్‌వో)లకు ప్రత్యేకంగా ఒక యాప్‌ను రూపొందించారు. వీరు ఈ ప్రాంతంలోని ప్రజలను స్క్రీనింగ్ చేసి, అనుమానిత లక్షణాలున్న వారి నుంచి రక్త నమూనాలు సేకరించి దగ్గరలోని పీహెచ్‌సీలకు సీరమ్ క్రియాటిన్ పరీక్షలకు తరలిస్తున్నారు. ఇబ్బందులు తొలగిపోతాయి సంవత్సరం నుంచి నేను డయాలసిస్ చేయించుకుంటున్నాను. మా గ్రామానికి దగ్గరలోని హరిపురం ప్రభుత్వాస్పత్రిలో డయాలసిస్ సెంటర్ ఉండటంతో రవాణా, వ్యయ ప్రయాసలు లేవు. డయాలసిస్ చేయించుకోవడానికి వెళ్లాల్సిన రోజు 108కు ఫోన్ చేస్తే అంబులెన్స్ ఇంటి వద్దకు వచ్చి ఆస్పత్రికి తీసుకుని వెళుతోంది. ప్రభుత్వం రూ.10 వేల పెన్షన్ కూడా ఇస్తోంది. షెడ్యూల్ ప్రకారం నెఫ్రాలజిస్ట్ హరిపురంకు వస్తున్నారు. మిగిలిన రోజుల్లో ఏదైనా అనారోగ్య సమస్య వస్తే శ్రీకాకుళం వెళ్లాల్సి వస్తుంది. ఇప్పుడు పలాసలో కిడ్నీ సెంటర్ ప్రారంభిస్తే ఆ ఇబ్బంది కూడా తొలగిపోతుంది. - శ్రీరాములు, కిడ్నీ వ్యాధిగ్రస్తుడు, బేతాలపురం, శ్రీకాకుళం జిల్లా నీళ్ల దిగులుండదిక.. కిడ్నీ వ్యాధి ప్రభావిత గ్రామాల్లో మా ఊరు కూడా ఒకటి. ప్రభుత్వం మా కోసం రక్షిత నీటి పథకం అందుబాటులోకి తెస్తోంది. పనులు దాదాపు పూర్తికావచ్చాయని చెబుతున్నారు. త్వరలో మా గ్రామానికి నీళ్లు వస్తాయి. బోర్ నీళ్లు తాగడం వల్లే కిడ్నీ జబ్బులు వస్తున్నాయని చాలా మంది చెప్పారు. దీంతో మేం పక్క ఊరి నుంచి సరఫరా చేస్తున్న ఫిల్టర్ నీళ్లు కొనుక్కుని తాగుతున్నాం. ప్రభుత్వమే ఉచితంగా కొళాయి ద్వారా మంచినీటిని సరఫరా చేయబోతుండటం మాకెంతో ఊరట కలిగిస్తోంది. ఇప్పటికే వృద్ధాప్య పింఛన్లు, అమ్మ ఒడి, పక్కా ఇళ్లు, ఇతరత్రా పథకాలతో మా ప్రాంత ప్రజలకు సీఎం జగన్ అండగా నిలిచారు. ఆ మహమ్మారి జబ్బుకు శాశ్వత పరిష్కారం చూపితే ఆయన మేలు ఎప్పటికీ మరువం. - ఎం.సరోజిని, రంగోయి, శ్రీకాకుళం జిల్లా వ్యాధిగ్రస్తులకు పెద్ద ఊరట కిడ్నీ రీసెర్చ్ సెంటర్ భవన నిర్మాణం తుది దశలో ఉంది. మరోవైపు వైద్య పరికరాలు సమకూరుస్తున్నాం. త్వరలోనే రీసెర్చ్ సెంటర్ అందుబాటులోకి వస్తుంది. భవన నిర్మాణం, పరికరాల సమకూర్పునకు కలిపి రూ.60 కోట్ల మేర ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఇది అందుబాటులోకి వస్తే కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పెద్ద ఊరట లభిస్తుంది. - మురళీధర్ రెడ్డి, ఎండీ, ఏపీఎంస్ఐడీసీ -
16 నెలల క్రితం మహిళ కడుపులో క్లాత్ వదిలేసిన వైద్యులు.. చివరికి ఏం జరిగిందంటే?
సాక్షి, జగిత్యాల జిల్లా: మేం చాలా గొప్పగా పనిచేస్తున్నామని చెప్పుకునే కొందరు తెలంగాణ మంత్రుల మాటలకు భిన్నంగా.. అడుగడుగునా నిర్లక్ష్యపు ఛాయలు బట్టబయలవుతూనే ఉన్నాయి. తాజాగా జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిలువెత్తు నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. కొడిమ్యాల మండలం నమిలికొండకు చెందిన నవ్యశ్రీ అనే మహిళకు పదహారు నెలల క్రితం.. జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు అయింది. అయితే ఆపరేషన్ చేసే సమయంలో వైద్యులు కడుపులోనే క్లాత్ వదిలేయడం కలకలం రేపుతోంది. ఏడాది తర్వాత నవ్యశ్రీకి తీవ్ర కడుపు నొప్పి రావడంతో వేములవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చెకప్ చేయించుకుంది. స్కానింగ్‌లో కడుపులో బట్ట ఉన్నట్టు గుర్తించగా.. వెంటనే ఆసుపత్రిలో సర్జరీ చేసి బట్ట తొలగించారు. ఈ మొత్తం విషయాన్ని లేఖలో పేర్కొంటూ నవ్యశ్రీ కుటుంబీకులు జగిత్యాల డీఎంహెచ్‌వోకు ఫిర్యాదు చేశారు. చదవండి: తెలంగాణ హెల్త్ డైరెక్టర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు -
లోపలికి తీసుకెళ్లేందుకు ఎలాంటి సాయం చేయని సిబ్బంది
-
సాక్షి ఎఫెక్ట్: రోగి కాళ్లు పట్టి లాక్కెళ్లారు.. ఆ తర్వాత ఏం జరిగింది?
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ ఆసుపత్రిలో స్ట్రెచర్లు లేక రోగి కాళ్లు పట్టుకొని లాక్కెళ్లిన ఘటనపై సాక్షి టీవీ ప్రసారం చేసిన కథనానికి ఆసుపత్రి వర్గాలు స్పందించాయి. ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వార్డు వద్ద ఓకే చోట 10 నుంచి 16 స్ట్రెచర్లు 5 వీల్ చైర్లు ఏర్పాటు చేశారు. ఒక్కసారిగా దర్శనం ఇస్తున్న స్ట్రెచర్లు, వీల్ చైర్లు చూసి రోగుల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి వరకూ ఇన్ని స్ట్రెచర్లు కంటికి కనిపించలేదని అవాక్కవుతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, కలెక్టర్ హనుమంతు ఆసుపత్రికి వచ్చి పరిశీలించాలని రోగుల బంధువుల డిమాండ్ చేస్తున్నారు. కాగా శుక్రవారం నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి అనారోగ్య సమస్యతో నడవలేని స్థితిలో ఓ రోగి ఆస్పత్రికి వచ్చాడు. స్ట్రెచర్ అందుబాటులో లేక.. ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోక.. బంధువులే అతని కాళ్లు పట్టుకుని వైద్యుని దగ్గరకు లాక్కెళ్లిన సంగతి తెలిసిందే. చదవండి: సమ్మర్ టూర్.. వెరీ ‘హాట్’ గురూ! -
బండి సంజయ్ కు వైద్య పరీక్షలు..!
-
అమానుషం.. ఆస్పత్రి బాత్రూమ్లో ప్రసవించిన మహిళ
సాక్షి,నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి ప్రసవం కోసం వచ్చిన ఓ మహిళ.. ఆస్పత్రి బాత్రూమ్లోనే ప్రసవించింది. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం ధర్మాపురం గ్రామానికి చెందిన పార్వతమ్మ తన భర్త లింగయ్యతో కలిసి నాలుగు రోజుల కిందట రెండో కాన్పు కోసం జిల్లా జనరల్ ఆస్పత్రికి వచి్చంది. అన్ని పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ప్రసవానికి మరో వారం రోజులు పడుతుందని చెప్పారు. అయితే, పార్వతమ్మకు బుధవారం ఒక్కసారిగా పురిటినొప్పులు వచ్చాయి. ఆ సమయంలో ఆమె బాత్రూమ్లోకి వెళ్లింది. నొప్పులు ఎక్కువ కావడంతో పార్వతమ్మ అక్కడే ప్రసవించింది. ఆస్పత్రి సిబ్బంది శిశువును ఐసీయూకు తరలించి తల్లీబిడ్డలకు చికిత్స అందిస్తున్నారు. నొప్పులు వచ్చిన సమయంలో సరైన విధంగా వైద్యులు స్పందించి చికిత్స చేసి ఉంటే బాత్రూమ్లో ప్రసవించేదికాదని, వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ సంఘటన చోటు చేసుకుందని పార్వతమ్మ కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, నార్మల్ డెలివరీ కోసం ప్రయతి్నస్తుండగా అకస్మాత్తుగా నొప్పులు రావడంతో ప్రసవించిందని వైద్యులు చెబుతున్నారు. -
తుంగతుర్తిలో ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం
-
గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో అరుదైన ఆపరేషన్
-
కార్పొరేట్ హాస్పిటల్స్‌కు ధీటుగా.. నంద్యాల సర్వజన ప్రభుత్వాసుపత్రి (ఫొటోలు)
-
వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి?
భద్రాచలం అర్బన్: ప్రభుత్వ ఆస్పత్రిలో సిజేరియన్ చేయించుకున్న ఓ మహిళ తీవ్ర రక్తస్రావంతో మృతి చెందడం వివాదాస్పదమవుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణానికి చెందిన రేష్మ(21)ను ఆదివారం మొదటి కాన్పు కోసం కుటుంబ సభ్యులు మణుగూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. సాధారణ ప్రసవం చేసేందుకు వీలుకాక పోవడంతో అక్కడి వైద్యులు సిజేరియన్ చేసి డెలివరీ నిర్వహించారు. రేష్మ సుమారు రెండు కేజీలు బరువు ఉన్న మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆపరేషన్ సమయంలో, ఆ తర్వాత అధికంగా రక్తస్రావం కావడంతో రేష్మను మెరుగైన వైద్యం కోసం భద్రాచలం ప్రభుత్వాస్పత్రికి రిఫర్ చేశారు. దీంతో కుటుంబీకులు వెంటనే అక్కడికి తరలించినప్పటికీ రక్తస్రావం అదుపులోకి రాకపోవడంతో ఆమె మృతి చెందింది. భద్రాచలం ఆస్పత్రి వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే రేష్మ మృతి చెందిందన్న వాదనలు తొలుత వెల్లువెత్తాయి. అయితే భద్రాచలం డాక్టర్లు మాత్రం ఆస్పత్రికి వచ్చేలోగానే రేష్మ మృతి చెందిందని, తమ నిర్లక్ష్యం లేదని చెబుతున్నారు. మణుగూరులో రేష్మకు ఆపరేషన్ చేస్తున్న సమయంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారా? రక్తస్రావం కావడంతో పాటు రక్తం తక్కువగా ఉన్న విషయం ముందే తెలిసినప్పటికీ ఆపరేషన్ చేసేశారా? అనే విషయాలపై స్పష్టత రావాల్సిఉంది. జిల్లావైద్యాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మృతురాలి కుటుంబసభ్యులు కోరుతున్నారు. భద్రాచలం వచ్చేలోపే మృతి చెందింది మణుగూరు ఆస్పత్రి నుంచి భద్రాచలంఆస్పత్రికి వచ్చేలోపే బాలింత ఆరోగ్య పరిస్థితి విషమించింది. స్పృహ కోల్పోయి, అప్పటికే మృతి చెందింది. మా దగ్గర వైద్యులు సకాలంలోనే స్పందించారు. కుటుంబ సభ్యుల కోరిక మేరకు పంచనామా నిర్వహించాం. –డాక్టర్ రామకృష్ణ, భద్రాచలం ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ మా నిర్లక్ష్యం లేదు.. రేష్మకు సిజేరియన్ చేసి కాన్పు జరిపారు. చికిత్స అందించడంతో మా దగ్గర వైద్యుల నిర్లక్ష్యమేమీ లేదు. ఆపరేషన్ తర్వాత బ్లీడింగ్ ఎక్కువ కావడంతో భద్రాచలం ఆస్పత్రికి రిఫర్ చేశాం. –డాక్టర్ విజయ్ కుమార్, మణుగూరు ఆస్పత్రి సూపరింటెండెంట్ -
AP: గుండె మార్పిడితో బాలుడికి పునర్జన్మ
తిరుపతి తుడా: తిరుపతిలోని శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయం వైద్యులు నిరుపేద కుటుంబానికి చెందిన 15 ఏళ్ల బాలుడికి గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేసి పునర్జన్మ ప్రసాదించారు. రాష్ట్రంలో ఓ చిన్నారికి గుండె మార్పిడి చికిత్సను తొలిసారిగా చేపట్టిన రికార్డును ఇక్కడి వైద్యులు సొంతం చేసుకున్నారు. 48 ఏళ్ల మహిళ గుండెను 15 సంవత్సరాల బాలుడికి అమర్చి శభాష్ అనిపించారు. టీటీడీ పరిధిలోని వైద్యుల కృషిని యావత్ ప్రజానీకం శభాష్ అంటూ కొనియాడుతోంది. గతంలో విశాఖపట్నం ప్రభుత్వ ఆస్పత్రి వేదికగా 40 ఏళ్లు పైబడిన ముగ్గురికి గుండె మార్పిడి చేశారు. ఆ తర్వాత తిరుపతిలో చేపట్టిన గుండె మార్పిడి శస్త్ర చికిత్స చరిత్ర సృష్టించింది. బ్రెయిన్ డెడ్ మహిళ నుంచి.. అన్నమయ్య జిల్లాకు చెందిన 15 ఏళ్ల బాలుడు ఎం.విశ్వేశ్వరకు జనవరి 20న గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేపట్టారు. విశాఖపట్నంకు చెందిన 48 ఏళ్ల మహిళ బ్రెయిన్ డెడ్ కావడంతో ఆమె కుటుంబ సభ్యులు అవయవ దానానికి ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆమె గుండెను గ్రీన్ చానల్ ద్వారా తిరుపతి తీసుకువచ్చి శ్రీపద్మావతి చిన్న పిల్లల హృదయాలయంలో బాలుడికి అమర్చారు. ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డితో కూడిన వైద్యుల బృందం విజయవంతంగా గుండె మార్పిడి శస్త్ర చికిత్సను చేపట్టింది. 21 రోజులపాటు ఆస్పత్రిలోని ప్రత్యేక వార్డులో ఆ బాలుడికి చికిత్సను అందించారు. బాలుడు పూర్తిగా కోలుకోవడంతో నాలుగైదు రోజుల్లో డిశ్చార్జి చేయనున్నారు. ఆదుకున్న ఆరోగ్యశ్రీ అన్నమయ్య జిల్లాకు చెందిన నరసయ్య, రాధ దంపతులు సాధారణ రైతు కూలీ కుటుంబానికి చెందిన వారు. వీరికి ముగ్గురు పిల్లలు. మొదటి సంతానమైన విశ్వేశ్వర గుండె పూర్తిగా క్షీణించి అనారోగ్యానికి గురి కావడంతో శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయానికి తీసుకువచ్చారు. గుండెకు తీవ్ర ఇన్ఫెక్షన్ సోకినట్టు గుర్తించిన వైద్యులు గుండెమార్పిడి అనివార్యమని తేల్చారు. విశాఖకు చెందిన సన్యాసమ్మ గుండెను బాలుడికి అమర్చి పునర్జన్మను ఇచ్చారు. రూ.40 లక్షల వరకు ఖర్చయ్యే వైద్యాన్ని వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అందించారు. వైద్యుల విజ్ఞప్తి మేరకు యుద్ధప్రాతిపదికన ప్రభుత్వం రూ.10 లక్షలను విడుదల చేసింది. గుండె మార్పిడి అనంతరం బాలుడిని పలకరించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నం ఫలించింది. ఆ బాలుడు గోవింద నామస్మరణ చేస్తూ పులకించిపోయాడు. బాలుడి తల్లిదండ్రులు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. -
రోగులను నిర్లక్ష్యం చేస్తే డిస్మిస్.. మంత్రి హరీశ్ హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: రోగులపట్ల వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే డిస్మిస్ చేయడానికి కూడా వెనుకాడబోమని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు. మలక్‌పేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు బాలింతల మృతి ఘటనను తీవ్రంగా పరిగణించామని.. అటువంటి ఘటనలు పునరావృతమైతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో ఉన్నతాధికారులతో కలసి ఆయన వైద్య, ఆరోగ్యశాఖ వార్షిక నివేదిక–2022ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఒకట్రెండు ఘటనలు మినహా గతేడాది వైద్య, ఆరోగ్యశాఖ పనితీరు దేశానికి ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. ‘హెల్త్ ఫర్ ఎవ్రీ ఏజ్.. హెల్త్ ఎట్ ఎవ్రీ స్టేజ్.. టువార్డ్స్ ఆరోగ్య తెలంగాణ’ అనే నినాదాన్ని తాము ఎంచుకున్నామని వివరించారు. అన్ని వయసుల వారికీ వైద్యం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో వైద్య, ఆరోగ్యశాఖకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 11,440 కోట్ల బడ్జెట్ కేటాయించిందని... ఈ కేటాయింపులతో తలసరి హెల్త్ బడ్జెట్లో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచామన్నారు. నీతి ఆయోగ్ ర్యాంకుల్లో దేశంలోనే తెలంగాణ మూడో స్థానంలో నిలిచిందని గుర్తుచేశారు. ప్రధాని మోదీ పేర్కొనే డబుల్ ఇంజన్ సర్కారున్న ఉత్తరప్రదేశ్ ఈ ర్యాంకుల్లో చివరి స్థానంలో నిలిచిందని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. అలాగే వైద్య రంగంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందంటూ కాంగ్రెస్ పార్టీ చార్జిïÙట్ విడుదల చేయడాన్ని ఆయన హాస్యాస్పదంగా అభివరి్ణంచారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో చేస్తుంటే కాంగ్రెస్ నాయకులు చార్జిషీట్ పేరుతో హడావిడి చేశారని మండిపడ్డారు. వైద్య రంగంపై నీతి ఆయోగ్ విడుదల చేసిన సూచీలో కాంగ్రెస్‌పాలిత రాష్ట్రాలైన రాజస్తాన్ 16వ స్థానంలో, ఛత్తీస్‌గఢ్ 10వ స్థానంలో, హిమాచల్‌ప్రదేశ్ 7వ స్థానంలో నిలిచాయనే విషయాన్ని ఆ పార్టీ నేతలు మరిచిపోయినట్లున్నారని విమర్శించారు. రాష్ట్రంలో 50 శాతం గర్భిణులు రక్తహీనతతో బాధపడుతున్నారని... దీనివల్ల అక్కడక్కడా వారు అనారోగ్యం బారినపడుతున్నారని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. రాష్ట్రానికి ఎన్నో అవార్డులు... దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో అమలు చేస్తున్న మిడ్ వైఫరీ వ్యవస్థకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ నుంచి టాప్ పర్ఫార్మింగ్ స్టేట్ అవార్డు లభించిందని.. యునిసెఫ్ కూడా ఈ సేవలను ప్రశింసించిందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. హైరిస్క్ గర్భిణులను గుర్తించి సంరక్షించడంలో రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందని ఆయన వివరించారు. అలాగే తెలంగాణ డయాగ్నోస్టిక్ హైదరాబాద్ సెంట్రల్ హబ్‌కు ఎన్ఏబీఎల్ గుర్తింపు లభించిందన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 31 లక్షల మందికి టెలి కన్సల్టెన్సీ ద్వారా వైద్య సేవలు అందించినందుకు కేంద్రం రాష్ట్రానికి అవార్డు ఇచ్చిందని హరీశ్‌రావు చెప్పారు. పీహెచ్సీ, జిల్లా ఆసుపత్రి, యూపీహెచ్‌సీలకు నేషనల్ క్వాలిటీ ఆష్యురెన్స్ ప్రోగ్రాం కింద రాష్ట్రానికి మూడు కేంద్ర అవార్డులు లభించాయన్నారు. టీబీ నియంత్రణలో ప్రతిభ కనబర్చిన నిజామాబాద్, భద్రాచలం, ఖమ్మం జిల్లాలకు వరల్డ్ టీబీ డే సందర్భంగా కేంద్రం అవార్డులు ప్రకటించిందని గుర్తుచేశారు. గతేడాది 2.59 లక్షల మందికి ఆరోగ్యశ్రీ సేవలు.. ఈ ఏడాది మరిన్ని పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకున్నామని మంత్రి హరీశ్‌రావు వివరించారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని భావిస్తున్నామన్నారు. ఈఎన్టీ, సరోజినీదేవి ఆసుపత్రులను మరింత పట్టిష్టం చేస్తామని, ఆహార కల్తీ నియంత్రణపై మరింతగా దృష్టి పెడతామన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద గతేడాది 2.59 లక్షల మంది రోగులు లబ్ధి పొందారని, ఉద్యోగులు, జర్నలిస్టుల పథకంలో 43,702 మంది లబ్ధి పొందారని మంత్రి వివరించారు. గతంలో పరిమితి రూ. 2 లక్షలు ఉంటే దాన్ని రూ. 5 లక్షలకు పెంచామన్నారు. అలాగే అవయవ మారి్పడి వంటి శస్త్రచికిత్సల కోసం రూ. 10 లక్షల వరకు కూడా ఆరోగ్యశ్రీలో కవరేజీ కలి్పస్తున్నామన్నారు. -
టిఫా స్కాన్ల నుంచి తప్పించండి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వాసుపత్రుల్లో ఇటీవల ఏర్పాటు చేసిన టిఫా (టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ అనామలీస్) స్కాన్లను తాము చేయలేమని గైనకాలజిస్టులు చేతులెత్తేస్తున్నారు. ఈ మిషన్లు సమకూర్చిన చోట వెంటనే రేడియాలజిస్టులను నియమించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఒక్కో ఆసుపత్రికి ఇద్దరు రేడియాలజిస్టులను, వారికి సహకరించే సిబ్బందిని నియమించాలని విన్నవిస్తున్నారు. రోగుల రద్దీతో ఇప్పటికే తమకు పని భారం పెరిగిందని, ఈ పరిస్థితుల్లో టిఫా స్కాన్లు అదనపు ఒత్తిడికి దారితీస్తున్నాయని సోమవారం పలువురు గైనకాలజిస్టులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చారు. గర్భస్త శిశువు ఎదుగుదలలో లోపాలను గుర్తించేందుకు అందుబాటులోకి తెచ్చిన టిఫా స్కానింగ్ గర్భిణులకు ఎంతో మేలు చేస్తుంది. ఇటీవల 44 ప్రభుత్వ ఆసుపత్రుల్లో 56 టిఫా స్కానింగ్ మిషన్లను ప్రభుత్వం సమకూర్చింది. కానీ రేడియాలజిస్టులను మాత్రం నియమించలేదు. మరోవైపు ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రులలో పనిచేసే గైనకాలజిస్టులంతా సీనియ ర్లు కావడంతో కొత్త టెక్నాలజీపై వారికి పెద్దగా అవగాహన లేదని అంటున్నారు. దీంతో చాలామంది డాక్టర్లు టిఫా చేసేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కారణంగానే రేడియాలజిస్టులను నియమించాలని కోరుతున్నారు. ఇప్పటికే నిమిషం తీరిక లేకుండా..!: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వాసుపత్రుల్లో గైనకాలజిస్టుల సంఖ్య ప్రస్తుతం తక్కువగా ఉంది. ఒక్కో గైనకాలజిస్టు ప్రతిరోజు సరాసరి వంద మందిని పరీక్షిస్తున్నారు. దీంతో గర్భిణుల వైద్య సేవల్లో జాప్యం జరుగుతోంది. మరోవైపు గతంతో పోల్చితే ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే గర్భిణుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఓపీతో పాటు జనరల్, ఏఎన్సీ చెకప్‌లు, సాధారణ స్కానింగ్‌చికిత్సలన్నీ గైనకాలజిస్టు లే చూడాల్సి వస్తోంది. ఇలా నిమిషం ఖాళీ లేని పరిస్థితుల్లో తాము ఉంటున్నామని గైనకాలజిస్టులు వాపోతున్నారు. తాజా టిఫా బాధ్యతలు కూడా అప్పగించడంతో సమర్థవంతంగా వైద్య సేవలు అందించలేక పోతున్నామని చెబుతున్నారు. ఒక్కో స్కాన్‌కు 40 నిమిషాలు: ఒక్కో గర్భినికి టిఫా స్కానింగ్ చేయాలంటే సుమారు 40 నిమిషాలు పడుతుంది. టిఫా స్కా న్ ద్వారా శిశువు గర్భంలో ఏ విధంగా ఉంది? ఉమ్మనీరు స్థితి ఎలా ఉంది? రక్త ప్రసరణ, మెదడు, గుండె నిర్మాణం వంటివి సరిగ్గానే ఉన్నాయా? అనేది సులువుగా కనిపెట్టవచ్చు. మేనరిక వివాహాలు, జన్యు సంబంధలో పాలు, ఆలస్యంగా గర్భం దాల్చడం, కొందరికి గర్భం దాల్చిన ప్పటి నుంచే శారీరక, మానసిక సమస్యలు ఉత్పన్నం కావడం, పోషకాహార లోపం.. ఇలాంటివి శిశువులపై చూపించే ప్రభావాన్ని కూడా గుర్తించవచ్చు. గ్రహణం మొర్రి, గుండెలో రంధ్రం, కాళ్లు, చేతులు వంకరగా ఉండటం, వెన్నుపూస వంటి అవయవాల్లో ఏవైనా లోపాలు ఉన్నా తెలుస్తాయి. కొన్ని సందర్భాల్లో పిల్లలు పుట్టగానే సర్జరీ చేయాల్సి ఉంటుంది. టిఫాలో దీన్ని ముందే గుర్తించగలిగితే ప్రసవ సమయంలో ప్రాణాలు రక్షించగలుగుతారు. 3డీ, 4డీ ఇమేజింగ్ స్కాన్‌లో ఇవన్నీ గుర్తించేందుకు వీలుంటుంది. -
దారుణం: విద్యుత్ నిలిచిపోవడంతో నలుగురు నవజాత శిశువులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని ఒక ప్రభుత్వ ఆస్పత్రిలో విషాదంచోటుచేసుకుంది. సర్గుజా జిల్లాలోని అంబికాపూర్‌లోని ప్రభుత్వ మెడికల్ కళాశాల అసుపత్రిలో నలుగురు నవజాత శిశువులు మృత్యువాత పడ్డారు. ఆస్పత్రిలో నాలుగు గంటలపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వల్ల వెంటిలేటర్ పనిచేయకపోవడంతో ఆక్సిజన్ అందక నలుగురు పసికందులు మృతి చెందినట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రిలో అర్థరాత్రి మూడు గంటలపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యమే శిశువుల మృతికి కారణమని మండిపడ్డారు. అయితే విద్యుత్ అంతరాయం కారణంగా పిల్లలు చనిపోయారనే విషయాన్ని ఆస్పత్రి సిబ్బంది బయటపెట్టలేదు. ఆసుపత్రిలో శిశువులు మృతి చెందిన ఘటనపై రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి టీఎస్ సింగ్ స్పందించారు. దీనిపై ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, సమగ్ర దర్యాప్తు జరపాలని ఆరోగ్య కార్యదర్శిని ఆదేశించారు. త్వరితగతిన విచారణ జరిపి దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే ఈ దుర్ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన ఛత్తీస్‌గఢ్ గవర్నర్ అనుసూయ యుకే శిశువుల మరణాలపై దర్యాప్తు జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చనిపోయిన శిశువు ఒకరోజు నుంచి నలుగురు రోజుల వయసున్న వారని కలెక్టర్ కుందన్ కుమార్ పేర్కొన్నారు. ఆ నలుగురు శిశువుల ఆరోగ్య పరిస్థితి విషయమంగా ఉండడంతో స్పెషల్ న్యూ బార్న్ కేర్ యూనిట్లో ఉంచారని, వారిలో ఇద్దరినీ వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారని పేర్కొన్నారు. ఉదయం 5:30 నుంచి 8:30 గంటల మధ్య నలుగురు చిన్నారులు చనిపోయారని ఆయన వెల్లండిచారు. అయితే కరెంట్ లోపంతోనే ఈ ఘటన జరిగిందని చెప్పలేమని అన్నారు. వెంటిలేటర్లు కూడా ఆగిపోలేదని, పూర్తి వివరాలపై విచారణ జరుపుతున్నామని తెలిపారు. వెంటిలేటర్ ఆగిపోయిందా లేదా అనే విషయం విచారణలో తెలుస్తుందని పేర్కొన్నారు. చదవండి: బెంగళూరులో దారుణం...ఇటుక రాయితో తల పగలగొట్టి చంపేశారు -
ఈ డాక్టర్లకు ఆల్ ది బెస్ట్
హైదరాబాద్‌లో ఇద్దరు డాక్టర్లు ప్రభుత్వ ఆసుపత్రిలో నియామకం పొందారు. అదేం పెద్ద విశేషం? విశేషమే. ఎందుకంటే వీరిద్దరూ ట్రాన్స్జెండర్లు. గత కొంతకాలంగా దేశంలో తమ ఆత్మగౌరవం కోసం, ఉపాధి కోసం, హక్కుల కోసం పోరాడుతున్న ‘ఎల్జిబిటి’ సమూహాలకు ఈ నియామకం ఒక గొప్ప గెలుపు. అందుకే వీరికి ఆల్ ది బెస్ట్ చెప్పాలి. గత వారం ప్రాచీ రాథోడ్ (30), రూత్ జాన్ పాల్ (28) ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో హెచ్.ఐ.వి రోగులకు చికిత్స అందించే ఏ.ఆర్.టి విభాగంలో వైద్యాధికారులుగా నియమితులయ్యారు. వీరు రాష్ట్రంలో డాక్టర్లుగా బాధ్యతలు చేపట్టిన తొలి ట్రాన్స్జెండర్లు కావడం విశేషం. కొత్త చరిత్రకు నాంది పలికిన వీరు ‘సాక్షి’ తో తమ అనుభవాలు పంచుకున్నారు. మా కమ్యూనిటీకి విజయమిది... ఈ ఇద్దరిలో డాక్టర్ రూత్‌ది ఖమ్మం. డాక్టర్ ప్రాచీ రాథోడ్‌ది ఆదిలాబాద్ జిల్లా. చిన్న వయసులోనే డాక్టర్లు కావాలని కలలు కన్నప్పటికీ, కుటుంబ సభ్యుల మద్దతు కరువై, స్కూల్లో తోటి విద్యార్థుల వేధింపులు, సమాజంలో చిన్నచూపు వంటివి ఎదుర్కొంటూనే లక్ష్యాన్ని సాధించగలిగారు. తమలాంటి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. ప్రభుత్వ రంగంలో భాగస్వామ్యం కోసం పోరాడుతున్న ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీకి ఇదొక చారిత్రాత్మక విజయం అని వీరు అంటున్నారు. అర్హత ఉన్నా... తిరస్కరించారు... ‘మల్లారెడ్డి వైద్య విజ్ఞాన సంస్థలో 2018లో వైద్యవిద్య పూర్తి చేసినప్పటి నుంచి ఉద్యోగం కోసం విఫలయత్నాలు ఎన్నో చేశా. సిటీలో కనీసం 15–20 ఆసుపత్రులు ఉద్యోగ దరఖాస్తులను తిరస్కరించాయి. దీనికి కారణం మా జెండర్ అని ముఖం మీద చెప్పలేదు. కానీ అది మాకు అర్ధమైంది’ అన్నారు డా.రూత్.. తొలుత ఓ ఆసుపత్రిలో ఇన్ టర్న్షిప్ చేస్తున్నప్పుడు తనకు ఏ సమస్యా రాలేదనీ ∙లింగ మార్పిడి విషయం బయటపెట్టిన తర్వాతే తనకు ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పారామె. తన అర్హతలను కాకుండా జెండర్‌నే చూశారన్నారు. తెలిశాక... వద్దన్నారు... డాక్టర్ ప్రాచీ రాథోడ్ రిమ్స్ నుంచి డిగ్రీ పూర్తి చేసి ప్రైవేట్‌రంగంలో పనిచేస్తూ కెరీర్ ప్రారంభించారు. సిటీలో ఓ ఆస్పత్రిలో పని చేస్తూనే ఎమర్జెన్సీ మెడిసిన్ లో డిప్లొమా చేశారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో మూడేళ్లపాటు పని చేశారు. తన మార్పిడి గురించి తెలిశాక.. రోగులరాకకు ఇబ్బంది అవుతుందని ఆసుపత్రి భావించడంతో ఉద్యోగం పోగొట్టుకున్నారు. ఏపీలో పెన్షన్ భేష్ ‘ఉస్మానియాలో సహ వైద్యులు, రోగులు బాగా సహకరిస్తున్నారు. ఎటువంటి ఇబ్బందులూ లేకపోవడం సంతోషంగా ఉంది’ అని వీరు చెప్పారు. పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ట్రాన్స్జెండర్లకు పింఛనుగా ఏటా రూ.10 వేలు ఇస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ అలాంటి ప్రత్యేక సహాయ సహకారాలు అన్ని చోట్లా మొదలు కావాలని ఆశిస్తున్నామన్నారు. ‘మేమిద్దరం ట్రాన్స్ఉమెన్ గా నీట్ పీజీ పరీక్షలను రాశాము, అయితే థర్డ్ జెండర్‌ను గుర్తించి అడ్మిషన్ ను మంజూరు చేసేందుకు వీలు కల్పించిన 2014 నాటి సుప్రీం కోర్ట్‡ తీర్పుకు అనుగుణంగా రిజర్వ్డ్ సీట్లు పొందలేదు’ అని చెప్పారు. తమ కమ్యూనిటీకి జరుగుతున్న అన్యాయాలపై గళమెత్తుతామని, సమాజంలో సమాన హక్కులకై పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేస్తున్నారు. దేశంలోనూ అక్కడక్కడ వైద్య రంగంలో కెరీర్ ఎంచుకుంటున్న ట్రాన్స్‌జెండర్స్ దేశంలో మరికొన్ని ప్రాంతాల్లోనూ కనిపిస్తున్నారు. కర్ణాటకలో త్రినేత్ర హల్దార్ గుమ్మరాజు ట్రాన్స్ డాక్టర్‌గా, యాక్టివిస్ట్‌గా జాతీయస్థాయిలో పేరొందారు. అలాగే కేరళకు చెందిన వి.ఎస్.ప్రియ కూడా లింగమార్పిడి చేయించుకున్న తొలి వైద్యురాలిగా రాణిస్తున్నారు. ఇప్పటికే రెండు ట్రాన్స్‌జెండర్ క్లినిక్స్ ప్రారంభించిన తొలి నగరంగా సిటీ నిలిచింది. ఇద్దరు ట్రాన్స్ డాక్లర్లకు చిరునామాగా నిలిచిన ఘనతను కూడా తన సొంతం చేసుకుంది. ఒకే తరహా కష్టం కలిపింది స్నేహం అనేకానేక బాధాకరమైన అనుభవాల తర్వాత బతుకుదెరువు వేటలో భాగంగా వీరు ఇద్దరూ వేర్వేరుగా గత ఏడాది నారాయణగూడలో ఎన్.జి.ఓ ఆధ్వర్యంలో ప్రారంభమైన ట్రాన్స్‌జెండర్ క్లినిక్ ‘మిత్ర్’లో చేరారు. మంచి స్నేహితులయ్యారు. ఒకే తరహా సమస్యల మధ్య ఏర్పడిన తమ స్నేహం వేగంగా దృఢమైన బంధంగా బలపడిందనీ ఒకరి కొకరు తోడుగా, తోడబుట్టిన అక్కచెల్లెళ్లను మించి సాగుతోందని వీరు చెప్పారు. ప్రతీ సందర్భంలోనూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ముందుకు సాగుతున్నామంటున్నారు. – ఎస్.సత్యబాబు సాక్షి, సిటీబ్యూరో -
ఒక్క క్లిక్‌తో ఓపీ రిజిస్ట్రేషన్
సాక్షి, అమరావతి: ప్రస్తుత డిజిటల్ యుగంలో అగ్గిపెట్టె నుంచి ఆడి కారు కొనుగోలు వరకూ ఆర్థిక లావాదేవీలు మొబైల్ ఫోన్ ద్వారా ఆన్లైన్లోనే జరిగిపోతున్నాయి. బ్యాంకు ఖాతా నెంబర్, మొబైల్ ఫోన్ నెంబర్‌తో పనిలేకుండా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అవతలి వ్యక్తి ఖాతాలోకి డబ్బులు పంపుతున్నారు. ఇదే తరహాలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా అవుట్ పేషెంట్ (ఓపీ) రిజిస్ట్రేషన్ పూర్తి చేసి డాక్టర్ అపాయింట్మెంట్కు టోకెన్ పొందే వెసులుబాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులోకి వస్తోంది. దక్షిణాదిలో తొలిసారిగా ఈ సేవలు విజయవాడ జీజీహెచ్‌లో ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈమేరకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ విధానంపై ఆస్పత్రిలో రిసెప్షన్ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటుతో పాటు క్యూఆర్ కోడ్ హోర్డింగ్స్, ఓపీ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో అవగాహన కల్పించేలా ఫ్లెక్సీలను అమర్చారు. ఏమిటి లాభం? సాధారణంగా ఎవరైనా వైద్యం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి వెళితే తొలుత ఓపీ కౌంటర్లో వివరాలను నమోదు చేసుకోవాలి. రోగి పేరు, చిరునామా, ఫోన్ నెంబర్, ఇతర వ్యక్తిగత వివరాలను వెల్లడించాలి. అనంతరం సంబంధిత విభాగానికి రోగిని రిఫర్ చేస్తూ టోకెన్ ఇస్తారు. ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యేందుకు కనీసం 5–10 నిమిషాలు పడుతుంది. పెద్దాస్పత్రుల్లో రోగుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. రోగులు గంటల తరబడి క్యూలో నిల్చొని పడిగాపులు పడాల్సి వస్తుంది. అదే క్యూఆర్ కోడ్ ద్వారా ఓపీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే నేరుగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్‌కు వెళ్లి టోకెన్ తీసుకుని డాక్టర్‌ను సంప్రదించవచ్చు. క్యూలైన్లో నిరీక్షించే అగచాట్లు తప్పుతాయి. దేశానికి ఆదర్శంగా ఏపీ ప్రజలకు కాగిత రహిత వైద్య సేవలు అందించడంలో ఏపీ ఇప్పటికే దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఏపీ విధానాలను మార్గదర్శకంగా తీసుకోవాలని ఇతర రాష్ట్రాలకు సూచిస్తున్నట్లు నేషనల్ హెల్త్ అథారిటీ(ఎన్హెచ్ఏ) డైరెక్టర్ కిరణ్ గోపాల్ తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ఇప్పటి వరకూ 3.50 కోట్ల మందికి ఆభా ఐడీలు సృష్టించారు. వీటిని ఆయా వ్యక్తుల ఆరోగ్య రికార్డులతో అనుసంధానించడంలో ఏపీ దేశంలో అగ్రస్థానంలో ఉంది. డిజిటల్ హెల్త్ సేవల్లో దేశంలోనే టాప్‌లో ఉన్న మన రాష్ట్రాన్ని పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు సైతం వరించాయి. మిగిలిన ఆస్పత్రులకూ విస్తరిస్తాం విజయవాడ జీజీహెచ్‌లో ఈ వారం క్యూఆర్ కోడ్ ద్వారా ఓపీ రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తాం. అనంతరం మిగిలిన ఆస్పత్రులకు సేవలను విస్తరిస్తాం. డిజిటల్ వైద్య సేవలను ప్రజలకు చేరువ చేయడంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ముందుకు వెళుతోంది. ప్రతి వ్యక్తి ఆభా ఐడీని వారి ఆరోగ్య రికార్డులతో అనుసంధానిస్తున్నాం. తద్వారా ఆ వ్యక్తి దేశంలో ఎక్కడికి వెళ్లిన ఆరోగ్య చరిత్ర వివరాలన్నీ ఒక్క క్లిక్‌తో అందుబాటులోకి వస్తాయి. – జి.ఎస్.నవీన్‌కుమార్, ప్రత్యేక కార్యదర్శి, రాష్ట్ర డిజిటల్ హెల్త్ ఇదీ నమోదు విధానం.. ► స్మార్ట్ ఫోన్ ద్వారా ఆస్పత్రిలో ప్రదర్శించే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి. ► వెంటనే యూఆర్ఎల్ కోడ్ కనిపిస్తుంది. దానిమీద క్లిక్ చేస్తే నేషనల్ హెల్త్ అథారిటీకి చెందిన ఆభా, ఇతర భాగస్వామ్య యాప్‌లు పేటీఎం, డ్రిఫ్కేస్, ఆరోగ్యసేతు, ఎక కేర్ లాంటి యాప్‌లు కనిపిస్తాయి. ► ఒకవేళ ఇప్పటి వరకూ ఆ యాప్‌లు ఫోన్లో లేకుంటే ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవాలి. ► ఆయుష్మాన్ డిజిటల్ హెల్త్ అకౌంట్(ఆభా) 14 అంకెల గుర్తింపు/ఆభాలో రిజిస్టర్ చేసిన ఫోన్ నెంబర్/మెయిల్ ఐడీ ద్వారా యాప్‌లో రిజిస్టర్ అవ్వాలి. ► యాప్‌లోకి లాగిన్ అయిన వెంటనే ఆభా వివరాలు ప్రత్యక్షం అవుతాయి. వీటిని ఆస్పత్రితో షేర్ చేసే ఆప్షన్ కనిపిస్తుంది. షేర్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే టోకెన్ నెంబర్ వస్తుంది. ఈ టోకెన్ 30 నిమిషాల పాటు వ్యాలిడిటీలో ఉంటుంది. ► టోకెన్ నెంబర్ వచ్చాక ఆస్పత్రిలో కౌంటర్‌కు వెళ్లి ఆభా గుర్తింపు నెంబర్, ఫోన్ నెంబర్ తెలియచేసి ఏ స్పెషాలిటీలో ఓపీ అవసరమో చెబితే రిసెప్షన్ సిబ్బంది స్లిప్ ఇస్తారు. దీన్ని తీసుకుని నేరుగా డాక్టర్‌ను సంప్రదించవచ్చు. -
ప్రసవాలన్నీ ప్రభుత్వాస్పత్రుల్లోనే జరగాలి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే 100 శాతం ప్రసవాలు నిర్వహించాలని.. ఈ లక్ష్య సాధన కోసం పక్కా కార్యాచరణతో పనిచేయాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆదేశించారు. అనవసర సిజేరియన్లను తగ్గించడంతోపాటు ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాల శాతాన్ని మరింతగా పెంచే బాధ్యత వైద్యాధికారులదేనని స్పష్టం చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓపీ విభాగం సమర్థంగా పనిచేయాలని సూచించారు. శనివారం పీహెచ్సీ వైద్యులు, ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలతో ఆయన రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్పత్రులవారీగా పురోగతిని సమీక్షించారు. పీహెచ్‌సీల పరిధిలో గర్భిణుల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రతి గర్భిణికి తొలి మూడు నెలల్లోనే నాలుగుసార్లు తప్పకుండా ఏఎన్సీ (యాంటె నేటల్ కేర్) పరీక్షలు నిర్వహించి ఆన్లైన్లో వివరాలు నమోదు చేయాలని హరీశ్‌రావు ఆదేశించారు. రక్తహీనతతో బాధపడే గర్భిణుల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వాస్పత్రుల్లో సాధారణ ప్రసవాలను మరింతగా ప్రోత్సహించేందుకు నర్సు నుంచి డాక్టర్ వరకు ప్రోత్సాహకాలను అందిస్తున్నామన్నారు. గర్భిణులను ఆసుపత్రికి తీసుకొచ్చే ఆశ వర్కర్, ఏఎన్ఎంల కోసం సీహెచ్‌సీ, ఏరియా, జిల్లా, మెడికల్ కాలేజీ ఆస్పత్రుల్లో ప్రత్యేక వసతులు ఏర్పాటు చేసినట్లు హరీశ్‌రావు చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు నాటికి 33 శాతం ప్రసవాలు మాత్రమే ప్రభుత్వాస్పత్రుల్లో జరిగేవని, ఇప్పుడు అవి 66 శాతానికి పెరిగాయన్నారు. రూ. 67 కోట్లతో కొత్త భవనాలు.. రాష్ట్రవ్యాప్తంగా 43 పీహెచ్‌సీలకు కొత్త భవనాలను మంజూరు చేశామని, రూ.67 కోట్లతో నిర్మా ణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. 372 పీహెచ్‌సీల మరమ్మతులను రూ.43.18కోట్లు చేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,745 సబ్ సెంటర్లు ఉండగా, 1,239 సబ్ సెంటర్లకు కొత్త భవనాలు మంజూరు చేశామని, ఒక్కో దానికి రూ.20 లక్షలు ఇచ్చామన్నారు. మొత్తంగా రూ.247.80 కోట్లు ఖర్చు చేశామన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 720 పీహెచ్‌సీల్లో ఇంటర్నెట్ సదుపాయంతోపాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్‌ఫాంలో ఎప్పటికప్పుడు వివరాలను నమోదు చేయాలని, ఈ ప్రక్రియ పూర్తి చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోందని హరీశ్‌రావు మండిపడ్డారు. -
చాటుగా వీడియోలు తీస్తూ దొరికారు.. అంతే!
వైరల్: ప్రభుత్వాసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. ఆస్పత్రి గదిలో ఒకరోజంతా బంధించి మరీ ఇద్దరు యువకులను కర్రలతో చితకబాదింది స్టాఫ్ నర్స్. వద్దని వేడుకుంటున్న ఆమె వాళ్లను వదల్లేదు. ఈ వీడియో వైరల్ కావడంతో దుమారం చెలరేగింది. బీహార్ సరన్ జిల్లాలోని ఛప్రా జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. మెడికల్ సర్టిఫికెట్ కావాలంటూ ఇద్దరు కుర్రాళ్లు ఆస్పత్రికి వచ్చారు. అయితే ప్రభుత్వాసుపత్రిలో నిర్వాహణ సరిగా లేకపోవడం, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరును యువకులిద్దరూ చాటుగా వీడియో తీసే యత్నం చేశారని తెలుస్తోంది. ఇది గమనించిన సిబ్బంది వారిద్దరినీ అడ్డుకున్నారు. ఆపై వాళ్లను ఓ గదిలో బంధించి హింసించడం మొదలుపెట్టారు. ఓ నర్సు వాళ్లిద్దరినీ కర్రలతో చితకబాదగా.. మరో నర్స్ ఆమె వెంట ఉంది. ‘‘ఫొటోలు, వీడియోలు తీస్తార్రా? ఇంటికి వెళ్లి మీ అక్కనో.. అమ్మనో.. వీడియో తీయండ్రా. ముందు ఆ ఫోన్లోని వీడియో తీసేయండ్రా’’ అంటూ ఆమె వాళ్ల మీద అరుస్తూ ఉంది. ఒకరోజంతా వాళ్లకు అలా బడిత పూజ జరుగుతూనే ఉంది. చివరకు ఆస్పత్రి సూపరిండెంట్ జోక్యం చేసుకోవడంతో ఆ కుర్రాళ్లను సిబ్బంది విడిచిపెట్టారు. అయితే స్టాఫ్ నర్స్ దాడి చేసిన దృశ్యాలు ఎలాగోలా బయటకు వచ్చాయి. దీంతో ఆరోగ్య శాఖను చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో కుర్రాళ్లు నర్సులతో అసభ్యంగా ప్రవర్తించి ఉంటారని, అందుకే నర్సులు అలా చేసి ఉంటారని అభిప్రాయపడుతున్నారు. అసలేం జరిగింది అనేది.. ఈ ఘటనపై బీహార్ ఆరోగ్య శాఖ స్పందిస్తేనే తెలుస్తుంది. हंटर वाली नर्स,सुई नही डंडे लगाती है। वीडियो छपरा का बताया जा रहा है दोनों लड़का अस्पताल में फैला कुव्यवस्था का वीडियो बना रहा था तभी इन दो नर्सो के हत्थे चढ़ गया।#Bihar #BiharNews #chhapra pic.twitter.com/ikrhZIviwC — Chandra Times (@chandratimes1) October 17, 2022 ఇదీ చదవండి: అబ్బా.. ఏం చావురా ఇది! -
రూ. 500 కోట్లతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి: మంత్రి రజని
సాక్షి, గుంటూరు: వైద్య రంగానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దపీట వేశారని మంత్రి విడుదల రజని తెలిపారు. రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో నాడు-నేడు కింద రూ. 16 కవేల కోట్లతో ఆసుపత్రులను అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. రూ. 500 కోట్లతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. 600 పడకలతో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని నిర్మిస్తున్నట్లు మంత్రి విడుదల రజని పేర్కొన్నారు. హాస్పిటల్ నిర్మాణానికి జింఖానా వారు 80 కోట్లు ఇవ్వటం గర్వకారణమన్నారు. జింఖానా సభ్యులు అమెరికాలో ఉన్నప్పటికీ.. ఇక్కడి పేదలకు మెరుగైన వైద్యం అందించాలన్నదే వాళ్ల ఉద్దేశ్యమని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్న బిడ్డను ఎలుకలు కొరిగేసిన ఘటనలు.. కరెంటు పోతే డాక్టర్లు సెల్ ఫోన్ లైట్లతో ఆపరేషన్ చేసిన సంఘటన కూడా అందరికీ గుర్తున్నాయన్నారు. -
ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించిన అదనపు కలెక్టర్.. హరీశ్‌రావు ప్రశంసలు
భూపాలపల్లి అర్బన్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా భార్య, ములుగు జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ప్రసవించారు. సోమవారం మధ్యాహ్నం పురిటి నొప్పులు రావడంతో ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చి అడ్మిట్ చేశారు. సాధారణ డెలివరీ కోసం ప్రయత్నించినప్పటికీ శిశువు బరువు ఎక్కువగా ఉండటంతో సాధ్యం కాలేదు. గైనకాలజిస్టులు శ్రీదేవి, లావణ్య, సంధ్యారాణి, విద్య ఆపరేషన్ చేశారు. ఇలా త్రిపాఠి మగ శిశువుకు జన్మనిచ్చారు. శిశువు 3కిలోల 400 గ్రాముల బరువుతో పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంజీవయ్య తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రిలో డెలివరీ చేయించి ఆదర్శంగా నిలిచిన కలెక్టర్‌ను అందరూ ప్రశంసిస్తున్నారు. హరిశ్‌రావు ట్వీట్ తెలంగాణ ఆరోగ్యమంత్రి హరీశ్‌రావు కూడా ఈ విషయంపై స్పందించారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించిన అదనపు కలెక్టర్‌కు శుభాకాంక్షలు చెప్పారు. సీఎం కేసీఆర్ పాలనలో ప్రభుత్వ ఆస్పత్రులు చాలా మెరగుపడ్డాయని, అందరికీ మొదటి ఎంపిక అయ్యాయని పేర్కొన్నారు. ఇది ఎంతో గర్వించాల్సిన సమయం అని ట్వీట్ చేశారు. Congratulations to @Collector_JSK & Addl Collector Mulugu on delivering baby boy at district Area hospital. It is a matter of immense pride that health infrastructure in the state under able leadership of #CMKCR Garu, became first choice of people. pic.twitter.com/XNJRepCCoZ — Harish Rao Thanneeru (@trsharish) October 4, 2022 చదవండి: రాహుల్ యాత్ర విచ్ఛిన్నం కోసమే ఈడీ, ఐటీ దాడులు -
‘గుప్పెడంత’ శిశువుకు ప్రాణం పోశారు!
సిద్దిపేట కమాన్: నెలలు నిండకుండా 700 గ్రాముల బరువుతో జన్మించిన శిశువుకు రెండు నెలలపాటు చికిత్స అందించి 1,470 (1.47కేజీ) గ్రాముల బరువు వచ్చేలా చేశారు. సంపూర్ణ ఆరోగ్యం చేకూరాక గురువారం డిశ్చార్జి చేశారు. ఇదేదో కార్పొరేట్ ఆస్పత్రిలో జరిగిన చికిత్స కాదు. సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల ఘనత. సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల అనుబంధ జనరల్ ఆస్పత్రిలో కార్పొరేట్ తరహాలో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. రూ.20 లక్షల వైద్యం ఉచితంగా.. సిద్దిపేట జిల్లా చేర్యాలకు చెందిన రెహనా ఏడు నెలల గర్భిణి. జూలై 20న సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. పరీక్షించిన వైద్యులు ఆమె హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్నట్లు గుర్తించి డెలివరీ చేశారు. నెలలు నిండకపోవడంతో 700 గ్రాముల బరువుతో పుట్టిన శిశువుకు ఎస్ఎన్సీ యూలో ఉంచి పీడియాట్రిక్ విభాగ హెచ్ఓడీ, ప్రొఫెసర్ డాక్టర్ సురేశ్‌బాబు ఆధ్వర్యంలో చికి త్స అందించారు. ఆరోగ్యం మెరుగవడంతో గురువారం శిశువును డిశ్చార్జి చేసినట్లు వైద్యు లు తెలిపారు. మెడికల్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ విమలా థామస్, సూపరింటెండెంట్ డాక్టర్ కిషోర్‌కుమార్ మాట్లాడుతూ.. నెలలు నిండకుండా జన్మించిన పాపకు ఎస్ఎన్సీయూ, కంగారు మదర్ కేర్ యూనిట్లలో సపోర్టివ్ కేర్ ద్వారా 62 రోజులపాటు వైద్యం అందించినట్లు తెలిపారు. చికిత్సకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ. 15 లక్షల నుంచి 20 లక్షల ఖర్చు అవుతుందన్నారు. లక్షల విలువైన వైద్య సేవలను మంత్రి హరీశ్‌రావు కృషి, సహకారంతో ప్రభుత్వ ఆస్పత్రిలో ఉచితంగా అందుతున్నాయని చెప్పారు. వైద్య సేవలు అందించిన వారిలో చిన్న పిల్లల వైద్యులు కోట వేణు, శ్రీలత, సందీప్, సప్తరుషీ, రవి, గ్రీష్మ ఉన్నారు. శిశువు ఆరోగ్యంగా డిశ్చార్జి కావడంతో తల్లిదండ్రులు రెహనా, సాజిద్‌బాబా హర్షం వ్యక్తం చేశారు. -
నల్గొండలో దారుణం.. కన్నీళ్లు తెప్పించే ఘటన..
నల్లగొండ టౌన్: సాధారణ ప్రసవం పేరిట వైద్యులు చేసిన కాలయాపనకు ఓ నిండు ప్రాణం బలైంది. తీవ్ర రక్త స్రావంతో బాలింత చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. ఆమె మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ బంధువులు శనివారం ఆస్పత్రి ఎదుట ఆందో ళనకు దిగారు. కట్టంగూరు మండలం చెర్వు అన్నారం గ్రామానికి చెందిన శిరసు అఖిల మొదటి కాన్పు నిమిత్తం ఈ నెల 9న నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో చేరింది. చదవండి: పోలీస్ స్టేషన్లోకి చొచ్చుకెళ్లిన హిజ్రాలు.. ఎందుకంటే? మూడు రోజులుగా ఆమె నొప్పులతో ఇబ్బందిపడుతున్నా సాధారణ ప్రసవం పేరిట వైద్యులు కాలయాపన చేశారు. ఆపరేషన్ చేయకుండా ఈ నెల 11న నార్మల్ డెలివరీకి ప్రయత్నించారు. ఈ క్రమంలో అఖిల కడుపును వైద్యులు బలంగా ఒత్తడంతో మగశిశువును ప్రసవించింది. అదే సమయంలో ఆమెకు తీవ్ర రక్తస్రావమైంది. దీంతో కుటుంబసభ్యులు బాధితు రాలిని ఏదైనా ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్తామని వేడుకున్నా వైద్యులు అంగీకరించకుండా మూడు రోజులపాటు ఆమెకు రక్తం ఎక్కిస్తూ గడిపారు. అనంతరం పరిస్థితి విషమించి అఖిల కోమాలోకి వెళ్లడంతో వైద్యులు ఈ నెల 14న సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్ప త్రికి తరలించారు. అక్కడ అఖిల పరిస్థితి మరింత విషమించి శుక్రవారం రాత్రి మృతి చెందింది. మృతదేహంతో ఆందోళన: అఖిల మృతికి నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ మాతాశిశు ఆరోగ్య కేంద్రం ఎదుట మృతదేహంతో కుటుంబసభ్యులు, బంధువు లు శనివారం ఆందోళనకు దిగారు. ఆస్పత్రి డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యంగా నార్మల్ డెలివరీ చేయడంతో గర్భసంచి పగిలిపోయి రక్తస్రావమైందని ఆరోపించారు. అఖిల మృతికి కారణమైన వైద్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆమె కుటుంబానికి, శిశువు సంరక్షణకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, టూటౌన్ పోలీసులు, ఆస్పత్రి సూపరింటెండెంట్ వచ్చి కుటుంబసభ్యులతో మాట్లాడారు. డాక్టర్లపై ఫిర్యాదు చేస్తే విచారించి చర్యలు తీసుకుంటామని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
తెలంగాణలో ఇలాంటి ఘటన ఇదే తొలిసారి.. విచారణకు ఆదేశించాం: డీహెచ్
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించిన ఘటనలో నలుగురు మహిళలు మృతి చెందారు. సోమవారం రోజున ఇద్దరు మృతి చెందగా, ఇవాళ ఇబ్రహీంపట్నం మున్సిపల్ సీతారాంపేటకు చెందిన లావణ్య, కొలుకుల పల్లికి చెందిన మౌనిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. దీంతో మృతుల సంఖ్య నాలుగుకి చేరింది. ఈనెల 25 మృతుల బంధువులు ఆందోళనకు దిగే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో ముందస్తు చర్యగా పోలీసులు ఇబ్రహీంపట్నం- సాగర్ హైవేపై భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ.. కుని ఆపరేషన్లు తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా జరిగే ప్రక్రియ. గతేడాది రాష్ట్రంలో 38వేల మందికి పైగా కు.ని. ఆపరేషన్లు నిర్వహించాం. ఇబ్రహీంపట్నంలో ఆపరేషన్లు చేసిన వైద్యుడు చాలా అనుభవజ్ఞుడు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఇలాంటి ఘటనలు మొదటసారి. కాజ్ ఆఫ్ డెత్ కోసం నలుగురికి పోస్టుమార్టం నిర్వహించాం. మిగతా 30 మంది ఇళ్లకు వెళ్లి ఆరోగ్య పరిస్థితి మానిటరింగ్ చేస్తున్నాం. 30 మందిలో ఏడుగురిని హైదరాబాద్ ఆస్పత్రికి తరలించాం. మరో ఇద్దరు మహిళలను నిమ్స్‌కు తరలించాం. చనిపోయిన వారికి రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా, డబుల్ బెడ్రూం, వారి పిల్లల చదువులకు ప్రభుత్వం సహకారం అందిస్తుంది. ఈ ఘటనలో ఇద్దరు వైద్యాధికారులపై సస్పెన్షన్ వేటు వేశాము. ఘటనపై విచారణ జరిపి వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించామని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. చదవండి: (వికటించిన కుటుంబనియంత్రణ ఆపరేషన్) -
సీఎం కేసీఆర్ పథకానికి పైసల్లేవా? ఏంటీ పరిస్థితి!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: బాలింతలకు అండగా నిలిచే కేసీఆర్ కిట్ల పథకాన్ని నిధుల కొరత వేధిస్తోంది. దీంతో ప్రోత్సాహకపు సొమ్ము, కిట్ల పంపిణీకి ఆటంకాలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో బిడ్డలకు జన్మనిచ్చిన కొందరు తల్లులు.. నగదు ప్రోత్సాహకం కోసం ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం దక్కక పోవడంతో నిరాశకు గురవుతున్నారు. బాలింతగా ఉన్నప్పుడు అందాల్సిన సాయం.. కొందరికి ఏడాదికి పైగా గడిచినా అందడం లేదనే విమర్శలున్నాయి. దాదాపు రూ.400 కోట్లకు పైగా ప్రోత్సాహకపు సొమ్ము బకాయి ఉన్నట్లు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. ఐదేళ్లలో 13.58 లక్షల ప్రసవాలు.. ముఖ్యమంత్రి పేరిట కేసీఆర్ కిట్ పథకాన్ని 2017లో ప్రారంభించారు. అప్పట్నుంచీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరుగుతోంది. 2017 జూన్ 2 నుంచి ఈ ఏడాది ఆగస్టు ఐదో తేదీ వరకు ప్రభుత్వ, ప్రైవేట్‌లో కలిపి మొత్తంగా దాదాపు 28.53 లక్షల ప్రసవాలు జరగ్గా..అందులో 13.58 లక్షల ప్రసవాలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరిగాయి. మగ బిడ్డ పుడితే తల్లికి రూ.12 వేలు, ఆడబిడ్డ పుడితే రూ.13 వేలు రెండు దఫాలుగా ఇస్తున్నారు. అలాగే తల్లికి, బిడ్డకు రెండు జతల దుస్తులు, పిల్లలకు వెచ్చగా ఉండడానికి పరుపు, నూనె, సబ్బు, పౌడర్ వంటి 15 రకాల వస్తువులతో కూడిన కిట్‌ను కూడా బాలింతకు ఇస్తున్నారు. అన్ని విధాలా ప్రయోజనకారిగా ఈ కిట్లకు మంచి డిమాండ్ ఉంది. అయితే ఈ కిట్లు ఆశించిన మేరకు అందడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దాంతోపాటు ప్రోత్సాహకంగా అందాల్సిన నగదు కూడా కొన్నాళ్లుగా నిధుల కొరత వల్ల అందడం లేదని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. ఆసుపత్రుల్లోని డాక్టర్లను అడిగితే కిట్లు రాలేదని అంటున్నారని చెబుతున్నారు. లక్షన్నరకు పైగా కిట్లు పెండింగ్‌లో.. ఇప్పటివరకు మొత్తం 13.58 లక్షల మంది లబ్ధిదారులకు గాను 12.02 లక్షల కిట్లు అందజేశారు. అంటే మరో లక్షన్నరకు పైగా కిట్లు పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే ఆయా లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.12 వేల చొప్పున వేసుకున్నా, రూ.1,629 కోట్లు ఇవ్వాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు రూ.1,217 కోట్లు మాత్రమే అందజేశారు. అంటే రూ.412 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయన్నమాట. ఆడపిల్ల పుడితే రూ.13 వేలు ఇస్తారు. అలా చూస్తే ఇంకా పెద్ద మొత్తమే పెండింగ్‌లో ఉండి ఉంటుందని అర్థ్ధమవుతోంది. వివరాలు నమోదు చేసుకున్నారు కానీ.. ఈ నెల 15 వ తేదీన భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో నాకు రెండో కాన్పుగా ఆడపిల్ల జన్మించింది. కేసీఆర్ కిట్ మాత్రం అందజేశారు. ప్రభుత్వం అందించే డబ్బులు ఇచ్చేందుకు వివరాలు మాత్రం తీసుకున్నారు. మొదటి కాన్పు సమయంలో డబ్బులు, కేసీఆర్ కిట్టు రెండూ అందాయి. – చలకోటి స్వరూప, అశ్వారావుపేట, భద్రాద్రి కొత్తగూడెం కిట్ మాత్రం ఇచ్చారు భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో ఈ నెల 15న నాకు మగబిడ్డ పుట్టాడు. కేసీఆర్ కిట్ మాత్రం ఇచ్చారు. డబ్బుల కోసం అడిగితే ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేయలేదని చెప్పారు. మొదటి కాన్పులో ఆడపిల్ల పుట్టింది. అప్పుడు తొలుత రూ. 5 వేలు, తర్వాత కొంత ఆలస్యంగా రూ.8 వేలు అందాయి. – దుర్గా భవాని, భద్రాచలం రెండేళ్లయినా డబ్బులు రాలేదు 2020 ఆగస్టు 21వ తేదీన మానుకోట ఏరియా ఆసుపత్రిలో మొదటి కాన్పు ద్వారా ఆడ శిశువుకు జన్మనిచ్చా. కేసీఆర్ కిట్టు ఇచ్చారు కానీ, డబ్బులు ఇంకా రాలేదు. – మంజుల, కంబాలపల్లి గ్రామం, మహబూబాబాద్ ఏడాదిగా ఎదురుచూపులు గత ఏడాది ఆగస్టు 5వ తేదీన ములుగు ఏరియా ఆసుపత్రిలో నాకు డెలివరీ అయ్యింది. ఏడాదిగా ఎదురుచూస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి డబ్బులు రాలేదు. – ప్రియాంక, ఏటూరునాగారం, ములుగు జిల్లా -
బాబుకు వెయ్యి.. పాపకు రూ.800.. కాన్పుకు రూ.4వేలు! అన్నిటికీ రేటు ఫిక్స్
నల్లగొండ పట్టణ సమీపంలోని ఓ గ్రామానికి చెందిన రాములమ్మ (పేరుమార్చాం) తన కోడలిని కాన్పు కోసం వారం క్రితం ఎంసీహెచ్‌కు తీసుకొచ్చింది. వచ్చీరాగానే ఆపరేషన్ థియేటర్‌కు వీల్‌చైర్‌లో తీసుకెళ్లేటప్పుడు రూ.200 అడగడంతో సరేలే అని ఇచ్చింది. ఆపరేషన్ పూర్తయ్యాక ఆడపిల్ల పుట్టిందని తీసుకొచ్చి చూపించినందుకు రూ.800 వసూలు చేశారు. చీరె మార్చినందుకు రూ.200, వార్డుకు తీసుకొచ్చినందుకు రూ.300 అడగడంతో వెంటనే ఇచ్చేసింది. వారం రోజులు ఆస్పత్రిలోని వార్డులో ఉండడంతో వార్డు ఊడ్చిన వాళ్లకు రోజూ వంద చొప్పున రూ.800, మందులకు రూ.700, డిశ్చార్జ్ సమయంలో వార్డులో అందరికీ కలిపి రూ.700 సమర్పించుకుంది. ఇంటికొచ్చే సరికి మొత్తం రూ.3,700 ఇవ్వాల్సి వచ్చిందని వాపోయింది. ఇదీ ఎంసీహెచ్‌లో వసూళ్ల పర్వానికి ఉదాహరణ. నల్లగొండ టౌన్ : ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో కాన్పుల వార్డులో పనిచేస్తున్న సిబ్బంది కాసులకు కక్కుర్తి పడుతున్నారు. కాన్పులకు వచ్చినవారి నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రతి పనికి ఓ రేటు నిర్ణయించి దండుకుంటున్నారు. వసూలు చేసిన డబ్బులు ఆ వార్డులోని సిబ్బంది సమానంగా పంచుకుంటున్నారు. కాసుల పంట పండిస్తున్న కాన్పుల వార్డులో డ్యూటీ కోసం సిబ్బంది పోటీ పడుతున్నారు. స్టాఫ్ నర్సు దగ్గరి నుంచి వార్డుబాయ్, ఆయా, ఇతర సహాయ సిబ్బంది అక్కడ డ్యూటీ వేసుకోవడానికి పైరవీలు చేస్తున్నారంటే ఏ స్థాయిలో వసూళ్ల పర్వం కొనసాగుతుందో స్పష్టమవుతుంది. ఈ వసూళ్లకు భయపడి పేదలు ఆస్పత్రిలోని కాన్పుల వార్డులో చేరడానికి జంకుతున్నారు. ఈ విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ఎన్నిసార్లు హెచ్చరించినా సిబ్బందిలో మార్పు రావడం లేదు. ఇంటికి వేళ్లే వరకు రూ.4 వేలు ఖర్చు మాతా శిశు మరణాల శాతాన్ని తగ్గించడానికి ప్రతి గర్భణి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవం చేసుకునేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం వైద ఆరోగ్య శాఖకు ఆదేశాలు జారీ చేస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పుల కోసం వచ్చే గర్భిణులకు ఉచితంగా వైద్య సేవలను అందించడంతో పాటు పౌష్టికాహారాన్ని, ఉచిత మందులను అందించి వెళ్లేటప్పుడు బాట ఖర్చులను అందిస్తామని ప్రభుత్వం చెబుతోంది. దీంతో జిల్లా వ్యాప్తంగా అనేక మంది కాన్పులు కోసం జీజీహెచ్‌కు వస్తున్నారు. కానీ ఇక్కడి సిబ్బంది ప్రభుత్వ లక్ష్యాన్ని తూట్లు పొడిచే విధంగా వ్యవహరిస్తున్నారు. వార్డులో గర్భిణి అడ్మిట్ అయిన దగ్గరి నుంచి వసూళ్ల పర్వం మొదలవుతోంది. సిబ్బంది అడిగినంత ఇవ్వకపోతే వారినుంచి ఈసడింపులు, వేధింపులను భరించాల్సి వస్తోందని వాపోతున్నారు. పేరుకే ప్రభుత్వ ఆస్పత్రి కానీ కాన్పు జరిగి ఇంటికి వెళ్లే వరకు సుమారు. రూ.4 వేల వరకు ఖర్చవుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వసూళ్ల పర్వాన్ని అరికట్టాలని కోరుతున్నారు. ఈ విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లచ్చూని వివరణ కోరడానికి ఫోన్లో ప్రయత్నించగా లిఫ్ట్ చేయలేదు. మందులూ బయటి నుంచే.. మాతాశిశు ఆరోగ్య కేంద్రంలోని కాన్పుల కోసం వచ్చే వారికి బయటి నుంచే కొన్ని మందులు కొనాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. రక్త పరీక్షల దగ్గరినుంచి కాన్పు జరిగే వరకు సిరంజీలు, సెలెన్ బాటిళ్లు, ఇతర మందులు బయట కొనుగోలు చేయిస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే మందులు అందుబాటులో లేవని సమాధానం చెపుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర పరిస్థితిలో మందులు అందుబాటులో లేనప్పుడే.. బయటికి రాస్తున్నామని వైద్యులు పేర్కొంటున్నారు. 550 పడకల స్థాయి మెడికల్ కళాశాల అనుబంధంగా పనిచేస్తున్న జనరల్ ఆస్పత్రిలో మందుల కొరతను లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. మందులు బయట కొనమని రాసిచ్చారు మందులు అందుబాటులో లేవని చెప్పి బయట కొనుక్కొని తీసుకురమ్మని చెప్పారు. చేసేది లేక బయట డబ్బులు పెట్టి మందులు కొన్నాను. పేరుకే ప్రభుత్వ ఆస్పత్రి కానీ మందులు కూడా ఇవ్వడం లేదు. బయటికి రాస్తున్నారు. – మంగమ్మ , బోడంగిపర్తి -
మంచిర్యాల: దవాఖానాలో పాముల హల్చల్.. వీడియో వైరల్
సాక్షి, మంచిర్యాల: భారీ వర్షాలు, వరదలతో తల్లడిల్లుతున్న ముంపు ప్రాంత ప్రజలను చీడపీడలు దడపుట్టిస్తున్నాయి. పరిసర ప్రాంతాలు జలమయం కావడం, చుట్టూరా చలి వాతావరణం నెలకొనడంతో పాములు, తేళ్లు ఇళ్లల్లోకి, ఆఫీసుల్లోకి చొరబడుతున్నాయి. తాజాగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాత శిశు ఆసుపత్రిలో పారిశుద్య కార్మికురాలు సునీత పాముకాటుకు గురయ్యారు. ఆసుపత్రికి వరద తాకిడికి గురికావడంతో ఆసుపత్రి ఆవరణలో పారిశుద్ధ్య పనులు చేస్తున్నారు. పనుల్లో సునీత కూడా పాల్గొన్నారు. అదే సమయంలో పాము కాటు వేయడంతో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. సునీత అరోగ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కిటీకీ, ఫ్లోర్‌పై పాములు కదులుతున్న వీడియోలు వైరల్‌గా మారాయి. ఆపరేషన్ థియేటర్, దాని చుట్టుపక్కల పదుల సంఖ్యలో పాములు కనిపించాయని పారిశుద్ధ్య కార్మికులు చెప్పారు. వాటిని బయటకు తరిమేశామని వెల్లడించారు. -
సర్కారు దవాఖానలో సౌలత్లు బాగున్నయ్
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శివారులోని చింతల్‌ఠాణా పునరావాస కాలనీకి చెందిన సామంతుల వసంత, స్వామి కూతురు శిరీష (హారిక) పురిటి నొప్పులతో బాధపడుతుంటే సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీకి తీసుకెళ్లారు. వైద్యులకు చూపించారు. వారు ‘ఎలాంటి ఇబ్బంది లేదు.. కొంచెం ఓపిక పట్టు సాధారణ కాన్పు చేద్దాం’అనడంతో.. సాధారణ కాన్పుకు సిద్ధమయ్యారు. పండంటి మగబిడ్డ పుట్టాడు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు. సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రిలో వసతులు, సేవలపై వసంత సంతృప్తి చెందింది. దీంతో చదువు రాని ఆమె వెంటనే తన కూతురు శిరీషతో రాయించిన ఉత్తరం మంత్రి హరీశ్‌రావుకు మంగళవారం చేరింది. ఉత్తరం ఇలా.. ‘సారు.. మాది రాజన్న సిరిసిల్ల జిల్లా. కేసీఆర్ సర్ వలన మంచిగ వసతులున్నాయని నా బిడ్డను సిరిసిల్ల సర్కారు దవాఖానకు తీసుకపోయిన. మా కేటీఆర్ సారు కూడా ఆసుపత్రిని బాగా చేశాడు. బాగా నొప్పులతో ఆసుపత్రికెళ్లినం. అక్కడ డాక్టర్లు మంచిగా చూసి ‘సాధారణ కాన్పు చేపించుకో’అన్నారు. పైసా ఖర్చులేదు, కేసీఆర్ కిట్ ఇచ్చిర్రు, అమ్మఒడి వాహనంలో మా ఇంట్లో దింపిండ్రు.. కడుపుకోతలు నివారించేందుకు మీరు పడుతున్న కష్టం చూసి నా బిడ్డకు, మనవడికి కలిగిన మేలు అందరికీ తెలవాలన్న ఉద్దేశంతో మీకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ లేఖ రాయించి పంపుతున్నా. సర్కారు దవాఖానలో సకల సౌలత్లు ఉన్నాయ్.. కాన్పులకి ప్రభుత్వ ఆసుపత్రికే రావాలి.. నాకు జరిగిన మేలు అందరికి జరగాలే.. ఇట్లు.. శామంతుల వసంత’అని లేఖలో పేర్కొన్నారు. చాలా సంతోషంగా ఉంది సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు చేయించుకొని.. సాధారణ కాన్పులు చేపించుకోవాలని, తన బిడ్డకు జరిగిన మేలు అందరికీ జరగాలని ఒక మంచి సందేశం ఇచ్చిన వసంత ఉత్తరం నాకు అందింది. చాలా సంతోషంగా ఉంది. వసంత నూరు వసంతాలు పిల్లపాపలతో వర్ధిల్లాలి. ఈ ఉత్తరం ప్రజల్లో మంచి చైతన్యాన్ని కలిగిస్తుంది. – మంత్రి హరీశ్‌రావు సారుకు చేరుతుందని అనుకోలే.. మా బిడ్డ చిన్న వయసుది. కోనరావుపేట మల్కపేటకు చెందిన శ్రీకాంత్‌తో పెళ్లి చేసినం. తొలిచూరు కాన్పు తల్లిగారే చేయాలి కాబట్టి సిరిసిల్ల దవాఖానాకు తీసుకపోయిన. నార్మల్ డెలివరీ అయింది. మాకు జరిగిన మేలు పది మందికి తెలువాలే అని సారుకు మా బిడ్డ శిరీషతో ఉత్తరం రాయించిన. అది సారుకు చేరుతుందని అనుకోలే. ప్రైవేటు దావాఖానాకు పోతే ఎంత లేదన్నా రూ.40వేలు అయ్యేది. మా ఉత్తరానికి మంత్రి స్పందించడం సంతోషంగా ఉంది. – వసంత, చింతలఠాణా ఆర్అండ్ఆర్ కాలనీ -
ఆక్సిజన్ ప్లాంట్లలో సిలిండర్లు నింపుకొనే వెసులుబాటు
సాక్షి, హైదరాబాద్: జిల్లా ఆసుపత్రుల్లోని పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్ల వద్ద సిలిండర్లను నింపి ఏరియా, సామాజిక, ఇతర ప్రభుత్వ ఆసుపత్రులకు సరఫరా చేయాలని వైద్యవిధాన పరిషత్ నిర్ణయించింది. కరోనా తగ్గుముఖం పట్టడంతో పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్ల వద్ద ఆక్సిజన్ భారీగా అందుబాటులో ఉందని, దాన్ని చిన్న ఆసుపత్రులకు సరఫరా చేస్తే రోగులకు ఉపయోగం ఉంటుందని పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్‌కుమార్ అన్నారు. సిలిండర్లను నింపుకునే వెసులుబాటు కల్పించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాస్తామని ఆయన పేర్కొన్నారు. జిల్లా ఆసుపత్రుల సూపరింటెం డెంట్లు, ఫార్మసిస్టులు, ఇతర అధికారులతో డాక్టర్ అజయ్‌కుమార్ శుక్రవారం సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలని, సిజేరియన్లను ప్రోత్సహించవద్దని సూచించారు. ఆరోగ్యశ్రీ ద్వారా సేవలను విస్త్రృత పరచాలని, అవసరం లేకపోయినా పైస్థాయి ఆసుపత్రులకు రోగులను రిఫర్ చేయకూడదని పేర్కొన్నారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని, రోగులు బయట కొనుగోలు చేసే పరిస్థితి రావొద్దని, డయాలసిస్ యూనిట్లను సక్రమంగా నిర్వహించాలన్నారు. సమావేశంలో డిప్యూటీ కమిషనర్ డాక్టర్ జయరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. హరీశ్‌రావు పుట్టినరోజు వేడుకలు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పుట్టిన రోజును పురస్కరించుకొని వైద్య విద్యాసంచాల కుడు డాక్టర్ రమేశ్‌రెడ్డి, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి కేక్ కట్ చేశారు. తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. -
Photo Feature: ఓఆర్ఎస్ కుండ.. ఎండలో అండ
ఖమ్మం వైద్యవిభాగం: ఎండాకాలం వచ్చిందంటే సహజంగా ఎక్కడైనా దాహార్తి తీర్చడానికి కుండలు.. లేదా మంచి నీటిని అందుబాటులో ఉంచుతారు. కానీ ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది వినూత్నంగా ఆలోచించారు. చల్లని నీటితో దాహార్తి తీరుతుందే తప్ప శక్తి రాదన్న ఉద్దేశంతో...ఆస్పత్రికి వచ్చే వారి కోసం ఓఆర్ఎస్ నీరు అందుబాటులో ఉంచారు. ఓఆర్ఎస్ పౌడర్ కలిసిన నీటిని మట్టికుండలో పోసి పెట్టారు. ఆస్పత్రి మాతా శిశు సంరక్షణ కేంద్రంలో సిబ్బంది ఈ కుండను ఏర్పాటు చేయగా.. ఎండ తీవ్రతతో ఇబ్బంది పడుతున్న గర్భిణులు, చిన్నారులకు ఉపశమనం లభిస్తోంది. -
డాక్టర్ వైఎస్సార్ ప్రాంతీయ వైద్యశాల సేవలకు ఏడాది పూర్తి
సాక్షి ప్రతినిధి, కడప : కడప కేంద్రంగా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆర్టీసీ ప్రాంతీయ వైద్యశాల ఏర్పాటై నేటితో ఏడాది పూర్తయింది. ఏడాదిగా రాయలసీమ జిల్లాల ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు, రిటైర్డ్ ఉద్యోగులు, వారి కుటుంబాలకు ఇక్కడే ఆధునిక వైద్య సేవలు అందుతున్నాయి. గతంలో వీరు ఆయా జిల్లాల పరిధిలోని డిస్పెన్సరీలలో వైద్య సేవలు పొందాల్సి వచ్చేది. మెరుగైన వైద్య సేవల కోసం విజయవాడ, హైదరాబాదు వంటి ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కడపలో కోట్లాది రూపాయల వ్యయంతో ప్రాంతీయ ఆస్పత్రిని నిర్మించారు. ఏడాదిలో 49,812 మందికి వైద్య సేవలు గడిచిన ఏడాదిలో వైఎస్సార్ జిల్లాతోపాటు ఇతర జిల్లాలకు చెందిన 49,812 మందికి ఈ ఆస్పత్రిలో వైద్య సేవలు అందించారు. 120 మందిని ఇన్‌పేషంట్లుగా చేర్చుకుని వైద్యం చేయగా, 100 మందికి వివిధ రకాల ఆపరేషన్లు చేశారు. 63 శాతం మంది ఉద్యోగులు, కార్మికులకు, 16.3 శాతం మంది కుటుంబ సభ్యులకు, 20.7 శాతం మంది రిటైర్డ్ ఉద్యోగులకు ఆస్పత్రిలో వైద్యం అందించారు. 2500 మందికి ఎక్స్‌రేలు తీశారు. వేలాది మందికి ల్యాబ్‌లలో వివిధ రకాల పరీక్షలు నిర్వహించారు. 170 రకాల ట్యాబెట్లు, 30 రకాల ఇంజెక్షన్లు ఈ ప్రాంతీయ వైద్య శాలలో బీపీ, షుగర్, గుండె జబ్బులకు యాంటీ బయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, చర్మ వ్యాధులు, సీజనల్ వ్యాధులతోపాటు పలురకాల జబ్బులకు సంబంధించి ఇక్కడ ఉన్న ఫార్మసీ ద్వారా 170 రకాల ట్యాబెట్లు ఉచితంగా అందిస్తున్నారు. వీటితోపాటు వ్యాధులను బట్టి 20–30 రకాల ఇంజెక్షన్లను సైతం ఇస్తున్నారు. ఈ ఆస్పత్రికి 60 శాతం మందులు సెంట్రల్ స్టోర్స్ ద్వారా వస్తుండగా, మరో 40 శాతం మందులు అపోలో వారి నుంచి సరఫరా అవుతున్నాయి. మూడు షిఫ్ట్‌ల ద్వారా వైద్య సేవలు ఆస్పత్రిలో మూడు షిఫ్ట్‌ల ద్వారా వైద్య సేవలు అందిస్తున్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 గంటల వరకు, రాత్రి 8 నుంచి ఉదయం 8 గంటల వరకు షిఫ్ట్‌ల పద్దతిలో వైద్య సేవలు అందిస్తున్నారు. ఏడుగురు వైద్యులు, ఇద్దరు కన్సల్టెన్సీ డాక్టర్లు, రెగ్యులర్ ఔట్సోర్సింగ్ కలిపి 13 మంది సాఫ్ట్ నర్సులు, ఐదుగురు వార్డు బాయ్స్ ఈ ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. ఇక్కడున్న ల్యాబ్‌లో 90 రకాల టెస్టులను చేస్తున్నారు. -
యాదన్నా.. ఓసారి నడువన్నా
సాక్షి, సిద్దిపేట: ‘యదన్నా.. బాగున్నవా, మంచిగ నడుస్తున్నవా.. ఓసారి నడువన్నా’అంటూ మోకాలు చిప్పలమార్పిడి ఆపరేషన్ చేయించుకున్న పుల్లూర్వాసి దేశెట్టి యాదగిరిని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖల మంత్రి టి.హరీశ్‌రావు పలకరించారు. ఆయనను నడిపించి ఆత్మవిశ్వాసం నింపారు. ‘ఎలాంటి నొప్పి లేకుండా నడుస్తున్నా’అంటూ యాదగిరి ఆనందం వ్యక్తం చేశారు. గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల తర్వాత రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో మోకాలు చిప్ప ఆపరేషన్లు నిర్వహించారు. రెండు నెలల క్రితం సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్‌లో జరిగిన క్యాంప్‌లో 72 మందికి ఈ తరహా ఆపరేషన్ చేయాలని వైద్యులు నిర్ణయించారు. వీరిలో ముగ్గురికి ఇటీవల ఆపరేషన్లు చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి హరీశ్‌రావు మంగళవారం యాదయ్యతోపాటు సిద్దిపేట పట్టణానికి చెందిన బాపన్న, మందపల్లికి చెందిన మరోవ్యక్తిని పరామర్శించారు. వారితో కాసేపు ఆత్మీయంగా ముచ్చటించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ... ఈ మోకాలి చిప్పల మార్పిడి ఆపరేషన్లు త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రారంభిస్తామన్నారు. డబ్బులు ఉన్నవాళ్లు మాత్రమే చేసుకునే ఈ సర్జరీని ఇప్పుడు పేదవాళ్లకు కూడా అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. గతంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో 30 శాతం ప్రసవాలు జరిగితే, ఇప్పుడవి 56 శాతానికి పెరిగాయని వివరించారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం వల్లే సర్జరీలు సాధ్యం అవుతున్నాయని తెలిపారు. -
రసాయన పరిశ్రమలో ప్రమాదం
ముసునూరు: ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ ఇండియా కెమికల్ ఫ్యాక్టరీలో బుధవారం రాత్రి బాయిలర్ పేలి ఇద్దరు మృతి చెందారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మరో 10 మందికి గాయాలయ్యాయి. వీరిని విజయవాడ ఆస్పత్రికి తరలించారు. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు.. రాత్రి 11.30 గంటల తర్వాత ప్లాంట్–4లో అకస్మాత్తుగా బాయిలర్ పేలిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆ సమయంలో పని చేస్తున్న 30 మంది కార్మికులు మంటల్లో చిక్కుకున్నారు. మంటల నుంచి తప్పించుకునే క్రమంలో గాయపడిన వారందరినీ ఏడు 108 అంబులెన్స్‌లలో నూజివీడు ప్రభుత్వ ఆస్పత్రికి హుటాహుటిన తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం వారిని విజయవాడ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఫ్యాక్టరీలో అగ్నికీలలు ఎగసి పడుతుండటం, దట్టంగా పొగ ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. ఘటన స్థలంలో ఇద్దరు మృతి చెందినట్టు పోలీసులు నిర్ధారించారు. ఇంకా మంటల్లో ఎవరైనా చిక్కుకున్నారా.. అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సుధీర్ (38), బారువల (30), షేక్ సుబానీ (30), కె. జోసఫ్(25), ఎం నాగరాజు(35), ఎస్ నాగేశ్వరరావు (45), విహారీ (25), టి రవికుమార్ (20), పి.సుధీర్‌కుమార్ (35), కిరణ్ (35), సీహెచ్ రాజు (38), ఎం చాష్మమ్ (32), రోషన్ మోచి (24) తదితరులు గాయపడిన వారిలో ఉన్నారు. మృతి చెందిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు నేతృత్వంలో అగ్నిమాపక శాఖ, రెవెన్యూ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. మంటలు పూర్తిగా అదుపులోకి వస్తేగాని మృతుల సంఖ్య నిర్ధారించలేమని అధికారులు చెబుతున్నారు. కాగా, గాయపడ్డ కార్మికుల్లో ఆరుగురికి పైగా బీహార్ రాష్ట్రానికి చెందిన వారుగా గుర్తించారు. -
చిత్తూరులో మాయం.. గుంటూరులో ప్రత్యక్షం
చిత్తూరు అర్బన్/ చిత్తూరు రూరల్/ గుంటూరు రూరల్ : శనివారం తెల్లవారుజామున చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో కిడ్నాపైన పసికందును అదే రోజు రాత్రి గుంటూరు ఆర్టీసీ బస్టాండులో పోలీసులు క్షేమంగా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని అదుపులోకి తీసుకున్నారు. బాధితులు, పోలీసుల కథనం మేరకు.. చిత్తూరులోని మంగసముద్రంకాలనీలో నివాసముంటున్న రషీద్ భార్య బి.షబానా ఈ నెల 14న ప్రభుత్వ ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. శనివారం వరకు ఆస్పత్రిలోనే ఉండాలని వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారుజామున 4 గంటలకు బిడ్డకు పాలిస్తూ నిద్రలోకి జారుకుంది. కొద్దిసేపటి తర్వాత లేచి చూస్తే పక్కన బిడ్డ కనిపించక పోవడంతో ఆందోళన చెందుతూ సమీపంలో పడుకున్న తల్లి, తోడికోడలిని నిద్ర లేపింది. వారు వెంటనే ఆస్పత్రి సిబ్బందికి, పోలీసులకు విషయం చెప్పారు. కాసేపట్లోనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆస్పత్రిలో సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. ముగ్గురు అనుమానిత మహిళలు 5.17 గంటల సమయంలో బిడ్డను ఎత్తుకు వెళుతున్నట్లు కెమెరాల్లో రికార్డయ్యింది. ఈ విషయాన్ని పోలీసులు ఎస్పీ సెంథిల్‌కుమార్‌కు చేరవేశారు. ఆయన చిత్తూరు టూటౌన్ సీఐ యుగంధర్ ఆధ్వర్యంలో ఓ బృందాన్ని రంగంలోకి దింపారు. సీసీ కెమెరాల్లో కనిపించిన మహిళల్లో ఒకరు చిత్తూరులోని సంతపేటకు చెందిన పవిత్రగా గుర్తించారు. ఈమెను అదుపులోకి తీసుకుని విచారించారు. వైజాగ్‌లోని భీమిలికి చెందిన పద్మ అనే మహిళ ఇటీవల తనకు పరిచయమైందని, తనకు మగబిడ్డ కావాలని కోరుతూ రూ.50 వేలు ఇచ్చిందని చెప్పింది. దీంతో ఆస్పత్రిలో బిడ్డను దొంగిలించి, ఆమెకు విక్రయించానని తెలిపింది. సెల్‌ఫోన్ ఆధారంగా కూపీ.. బిడ్డను వైజాగ్ తీసుకెళుతున్నట్లు పక్కా సమాచారం రావడంతో పద్మ సెల్‌ఫోన్ ఆధారంగా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి గుంటూరు పోలీసులను చిత్తూరు పోలీసులు అప్రమత్తం చేశారు. గుంటూరు బస్టాండులోని ఓ బస్సులో పసికందుకు కొత్త బట్టలు వేసి ఉండటం గమనించిన పోలీసులు.. ఆ బిడ్డను ఎత్తుకున్న మహిళను ప్రశ్నించారు. తొలుత వారు తమ బిడ్డ అని వాదించారు. ఆమె పేరు పద్మ అని తెలియడంతో ఆమెను, ఆమె భర్త వెంకటేశ్వర్లును చేబ్రోలు సీఐ పి.సుబ్బారావు, నల్లపాడు ఎస్ఐ కిషోర్‌లు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం ఒప్పుకున్నారు. కిడ్నాపైన పసిబిడ్డను క్షేమంగా స్వాధీనం చేసుకుని, గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చిత్తూరులో పవిత్రతో పాటు మరో మధ్యవర్తిని అదుపులోకి తీసుకున్నారు. గంటల వ్యవధిలోనే బిడ్డను పోలీసులు క్షేమంగా రక్షించడంపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, ఇటీవల విశాఖ ప్రభుత్వాస్పత్రిలో ఇదే రీతిలో కిడ్నాప్‌కు గురైన మరో చిన్నారిని సైతం పోలీసులు రక్షించడం తెలిసిందే. -
ప్రభుత్వాసుపత్రిలో బిడ్డకు జన్మనిచ్చిన ఐఏఎస్ అధికారిణి
సాక్షి, బళ్లారి(కర్ణాటక): సాధారణ, మధ్య తరగతి మహిళలే ప్రసవాల కోసం ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న ఈ కాలంలో ఒక ఐఏఎస్ అధికారిణి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం చేయించుకున్నారు. తద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా మెరుగైన వైద్యం అందుతుందనే విషయాన్ని చాటిచెప్పారు. కర్ణాటకలో బళ్లారి జిల్లా పరిషత్ సీఈవోగా విధులు నిర్వహిస్తున్న ఎ.నందిని గర్భం దాల్చినప్పటి నుంచి ప్రభుత్వ ఆస్పత్రిలోనే నెలవారీ చికిత్సలు పొందారు. చదవండి: ఏపీ మీదగా ప్రత్యేక రైళ్లు.. వివరాలివే ప్రసవ నొప్పులు రావడంతో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. బుధవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో సహజ ప్రసవం ద్వారా పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చారు. ఐఏఎస్ అధికారులతో పాటు సామాన్యులకు కూడా ఇదే రకమైన వైద్యం అందిస్తున్నామని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఇన్చార్జి డా.బసిరెడ్డి తెలిపారు. గతంలో బళ్లారి కలెక్టర్ నకుల్ సతీమణికి, అలాగే జెడ్పీ సీఈవో రాజేంద్ర సతీమణికి కూడా ఇక్కడే ప్రసవాలు చేశామని చెప్పారు -
వైద్యులూ.. వెల్డన్
కోల్‌సిటీ(రామగుండం)/ఆసిఫాబాద్ అర్బన్: కరోనా సోకిన ముగ్గురు గర్భిణులకు కాన్పులు చేసి విధి నిర్వహణపట్ల తమ అంకితభావాన్ని చాటుకున్నారు ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది. అందరికీ ఆదర్శంగా నిలిచిన గోదావరిఖని, ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులు, సిబ్బందిని పలువురు అభినందించారు. మంథని మండలం వెంకటాపూర్, అంతర్గాం మండలం మర్రిపల్లికి చెందిన ఇద్దరు గర్భిణులకు పురిటినొప్పులు రావడంతో కుటుంబసభ్యులు శుక్రవారం గోదావరిఖని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. కరోనా టెస్టులు చేయగా వారికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఒకరి తర్వాత మరొకరికి వైద్యులు కాన్పులు చేశారు. రిస్క్ కేస్ అయినప్పటికీ గైనకాలజిస్టు డాక్టర్ కల్యాణి, అనస్తీషియా డాక్టర్ మోహన్‌రావు, స్టాఫ్‌నర్స్ రుద్రమ పీపీఈ కిట్లు ధరించి ఆ గర్భిణులకు ప్రత్యేక ఆపరేషన్ థియేటర్లో సిజేరియన్ చేశారు. ఇద్దరికీ ఆడశిశువులే జన్మించారు. తల్లులు, శిశువులు ఆరోగ్యంగా ఉన్నారని, వారిని కోవిడ్ ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. కాగా, ఆసిఫాబాద్ మండలం అంకుసాపూర్ గ్రామానికి చెందిన జాడి సింధూజకు నాలుగు రోజుల క్రితం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. గురువారం సాయంత్రం 5 గంటలకు కుటుంబ సభ్యులు ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి సమాచారం అందించగా సిబ్బంది అంబులెన్‌లో తీసుకెళ్లి రాత్రి 7 గంటలకు అడ్మిట్ చేసుకున్నారు. రాత్రి పురిటినొప్పులు రావడంతో సూపరింటెండెంట్ స్వామి సూచనల మేరకు డాక్టర్ నవీద్, స్టాఫ్ నర్సులు ప్రీత, సుదీవన పీపీ కిట్లు ధరించి, కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ కాన్పు చేశారు. సుఖ ప్రసవం చేసిన వైద్య సిబ్బందికి గర్భిణి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
ఊహించని అద్భుతం: తల్లి దక్కదు, బిడ్డనైనా సేవ్ చేద్దామనుకున్నారు..
కూనవరం (తూర్పుగోదావరి): తల్లి దక్కదు, బిడ్డనైనా సేవ్ చేద్దామంటూ ముందుకు వచ్చిన వైద్య బృందానికి ఊహించని అద్భుతం తారసపడంతో వారి ఆనందానికి అవధులు లేవు. తెలంగాణ రాష్ట్రం భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో మంగళవారం జరిగిన అరుదైన ఈ ఘటన ఆస్పత్రి చరిత్రలోనే లిఖించదగినదిగా పలువురు ప్రసంశిస్తున్నారు. వివరాల్లోకి వెళ్లితే కూనవరం మండలం టేకులబోరు గ్రామానికి చెందిన జోడె నాగమణి నిండు గర్భిణి. వచ్చే నెల 4వ తేదీన ఆమెకు కాన్పు కావలసి ఉంది. ప్రస్తుతం బీపీకి మందులు వాడుతోంది. దానికితోడు ఆయాసం ఎక్కువైంది. నొప్పులు రావడంతో కూనవరం మండలం కోతులగుట్ట సీహెచ్‌సీకి వెళ్లింది. చదవండి: (అనారోగ్యంతో సినీ నటుడు శ్రీను మృతి) అక్కడ పరీక్షలు నిర్వహించిన వైద్యులు పరిస్థితి చాలా సీరియస్‌గా ఉందని గ్రహించి భద్రాచలం ఏరియా ఆస్పత్రికి రిఫర్ చేస్తూ ఆ విషయాన్ని కోతులగుట్ట సీహెచ్‌సీ సూపరింటెండెంట్ డాక్టర్ కోటిరెడ్డికి సమాచారం ఇచ్చారు. డాక్టర్ కోటిరెడ్డి ఈ విషయాన్ని చింతూరు ఐటీడీఏ పీఓ ఆకుల వెంకటరమణకు, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ పుల్లయ్యకు చేరవేశారు. అప్పటికే నాగమణి కోమాలోకి వెళ్లింది. భద్రాచలం ఏరియా ఆస్పత్రి వైద్యులు ఎంత ప్రయత్నించినా ఆమెలో చలనం కనిపించలేదు. మృత్యువు ఒడిలోకి జారుకున్న ఆ మహిళను చూసి మదనపడుతున్న వైద్యుల వద్దకు డాక్టర్ కోటిరెడ్డి, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ పుల్లయ్య వెళ్లి కనీసం కడుపులో ఉన్న బిడ్డనైనా సేవ్ చేయాలని భద్రాచలం ఏరియా ఆస్పత్రి సూపరిం టెండెంట్ రామకృష్ణను కోరారు. చదవండి: (ఒకే కూర.. ఒకే స్వీటు.. మత పెద్దల సంచలన నిర్ణయం) గర్భిణి సోదరుడు జోడె నాగేశ్వరరావు, భర్త సత్యనారాయణకు పరిస్థితి వివరించి అంగీకరింపజేశారు. డాక్టర్ రామకృష్ణ ఆధ్వర్యంలో గైనకాలజిస్ట్ నరసయ్య, ఎనస్తీషియన్ కిషన్, ఐసీయూ సిబ్బంది, ఆస్పత్రి సిబ్బంది బృందంగా ఏర్పడి ఆపరేషన్ చేసి మగబిడ్డను బయటకు తీశారు. అనంతరం కొద్దిసేపటికి తల్లిలో కూడా కదలికలు గమనించిన వైద్యులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ అద్భుతం చూసిన వైద్యులు ఆమెకు వెంటనే వైద్య సేవలు ప్రారంభించారు. ప్రస్తుతం తల్లీబిడ్డా క్షేమం. ప్రస్తుతం భద్రాచలం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. భద్రాచలం ఏరియా ఆస్పత్రిలోనే ఇది అరుదైన సంఘటన అని అక్కడి సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణ అన్నారు. వైద్యబృందం కృషిని ఐటీడీఏ పీఓ ఆకుల వెంకటరమణ మెచ్చుకున్నారు. -
ప్రభుత్వాస్పత్రిలో కలెక్టర్ సతీమణి ప్రసవం
భద్రాచలం అర్బన్: ప్రభుత్వాస్పత్రిలో వైద్యమంటే సాధారణ ప్రజలే ఒకటికి, రెండుసార్లు ఆలోచిస్తుంటారు. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్.. తన భార్య మాధవికి ప్రభుత్వాస్పత్రిలోనే ప్రసవం చేయించారు. మంగళవారం రాత్రి పురిటినొప్పులు రాగా, మాధవిని భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో చేర్చిన విషయం తెలిసిందే. వైద్యులు ఆమెకు పరీక్షలు చేసి శస్త్రచికిత్స ద్వారా బుధవారం తెల్లవారుజామున 1:19 నిమిషాలకు ప్రసవం చేశారు. మాధవి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. పిల్లల వైద్యనిపుణుడు డాక్టర్ రాజశేఖర్‌రెడ్డి శిశువుకు వ్యాక్సిన్ వేశారు. కాగా, మాధవి గర్భం దాల్చినప్పటి నుంచే ఏరియా ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకుంటున్నారని వైద్యులు తెలిపారు. కలెక్టర్ అనుదీప్ ఆస్పత్రిలో కుమారుడిని ఎత్తుకుని మురిసిపోయారు. వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. హరీశ్‌రావు అభినందనలు: కలెక్టర్ అనుదీప్ నిర్ణయాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ట్విట్టర్లో ప్రçశంసించారు. ‘తల్లీశిశువు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. సమర్థుడైన కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వాస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయి. దీంతో ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రులే మొదటి ఛాయిస్‌గా మారాయి’ అని ఆయన పేర్కొన్నారు. మంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్, సత్యవతి రాథోడ్ కూడా ట్విట్టర్ ద్వారా కలెక్టర్ దంపతులను అభినందించారు. (చదవండి: ప్రసవం కోసం ప్రభుత్వాస్పత్రిలో చేరిన కలెక్టర్ భార్య) చదవండి: అరుదైన బాలుడు.. ప్రతి వెయ్యి మందిలో ఒకరు మాత్రమే ఇలా.. Warmest Congratulations to @Collector_BDD & his wife. I hope both the mother & the child are doing well. It gives us immense pride to see how under the able leadership of CM KCR Garu, state medical infrastructure has proven to be the first choice of people. https://t.co/H7jN2ldMZi— Harish Rao Thanneeru (@trsharish) November 10, 2021 -
అమీర్‌పేట్‌లో ఉద్రిక్తత.. ప్రోటోకాల్ రగడ
సాక్షి, హైదరాబాద్: అమీర్‌పేట్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అమీర్‌పేట ప్రభుత్వాసుపత్రి ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ రగడ రాజుకుంది. ప్రోటోకాల్ విషయంలో బీజేపీ -టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. బీజేపీ కార్పొరేటర్- మాజీ కార్పొరేటర్ అనుచరులు బాహాబాహీకి దిగారు. పోలీసులు సర్దిచెప్పినా గొడవ సద్దుమణగలేదు. ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన శిలా ఫలకంమీద పోట్రోకాల్ ప్రకారం కిషన్‌రెడ్డి పేరు ముందు వరుసలో లేదని బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో టీఆర్ఎస్,బీజేపీ కార్యకర్తల పరస్పర నినాదాలతో ఉద్రికత్త వాతావరణం నెలకొంది. చదవండి: న్యూడ్ వీడియోలతో యువకున్ని వేధిస్తున్న యువతి -
కుసంస్కారం: టీడీపీ పిచ్చి పరాకాష్టకు..
సాక్షి, అమరావతి బ్యూరో: ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ప్రచార పిచ్చి పరాకాష్టకు చేరింది. ఆ పార్టీ నేతలు మరోమారు తమ కుసంస్కారాన్ని బయట పెట్టారు. ఏ అంశాన్ని రాజకీయం చేయాలో, ఏది చేయకూడదో అన్న విషయాన్ని కూడా పూర్తిగా మర్చిపోయారు. రెండురోజుల క్రితం భార్యాభర్తలు మేడికొండూరు మండలం పాలడుగు గ్రామంలో జరిగిన శుభకార్యానికి హాజరై తిరిగి సత్తెనపల్లి వెళ్తుండగా కొందరు దుండగులు వారిని అడ్డగించి పొలాల్లోకి లాక్కుని వెళ్లి భర్తను చెట్టుకు కట్టేసి భార్యపై లైంగిక దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. (చదవండి: వాయుగుండంగా మారనున్న అల్పపీడనం?) ఈ ఘటన జరిగిన వెంటనే సత్తెనపల్లితోపాటు మేడికొండూరు పోలీసులు స్పందించారు. ఆరు బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇప్పటికే ఎనిమిది మందికిపైగా అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాధితురాలు షాక్‌లో ఉండటంతో ఇప్పటి వరకూ ఆమెను విచారణ చేయలేదు. ఆమె భర్త చెబుతున్న వివరాల ఆధారంగానే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే దీన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవాలని తెలుగుదేశం నాయకులు శనివారం ప్రభుత్వాస్పత్రి ముందు హడావుడి చేశారు ►ఇటీవల బీటెక్ విద్యార్థిని రమ్య హత్య జరిగినప్పుడు కూడా తెలుగుదేశం జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బృందం చేసిన రచ్చ అందరికీ తెలిసిందే. లోకేష్ రావడం ఆలస్యం కావడంతో అప్పటి వరకూ మృతదేహాన్ని తీసుకు వెళ్లనీయకుండా అడ్డం పడటం, ఆ తర్వాత రమ్య ఇంటి వద్ద లోకేష్ బృందం చేసిన హడావుడి, గందరగోళం వారి కుసంస్కారాన్ని బయటపెట్టింది. ►ఏడు నెలల క్రితం హత్యకు గురైన అనూష కుటుంబాన్ని పరామర్శించే పేరుతో రెండురోజుల క్రితం మరో నాటకానికి లోకేష్ తెరతీశారు. గురువారం నరసరావుపేట వచ్చి అనూష కుటుంబాన్ని పరామర్శించి ధర్నా చేయాలని నిర్ణయించారు. దీన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో ట్రయల్ ప్రారంభమయ్యే సమయంలో లోకేష్ రాజకీయం చేయడంపై ప్రజల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. సాటి మహిళ బాధను అర్థం చేసుకోకుండా.. తాజాగా మేడికొండూరు ఘటనపైనా తెలుగుదేశం మహిళా నేతలు అత్సుత్సాహం ప్రదర్శించారు. సాటి మహిళ బాధను అర్థం చేసుకోకుండా సంస్కారహీనంగా ప్రవర్తించారు. శనివారం తెలుగుదేశం మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వేగుంట రాణి, ప్రధాన కార్యదర్శి షేక్ ఆషా, ఇతర నాయకులు పద్మ, వినీల, గుడిపల్లి వాణి కొంతమంది అనుచరులతో జీజీహెచ్‌లో బాధితురాలు ఉన్న వార్డు వద్దకు మీడియాను వెంటేసుకుని వచ్చారు. అసలే జరిగిన ఘోరంతో తీవ్ర వేదనలో ఉన్న బాధితురాలిని కలవాల్సిందేనంటూ పట్టుబట్టారు. బాధితురాలు తనను ఎవరైనా పరామర్శించాడానికి వస్తే ఆత్మహత్య చేసుకుంటానని తెగేసి చెప్పడంతో ఆస్పత్రి సిబ్బంది టీడీపీ నేతలను అనుమతించలేదు. సూపరింటెండెంట్ ఎంత నచ్చజెప్పినా వారు వినలేదు. అక్కడే కూర్చొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లైంగికదాడి కేసుల్లో బాధితుల పేర్లు కూడా ప్రస్తావించకూడ దు. కానీ టీడీపీ నేతలు మీడియాతో వచ్చి ప్రభుత్వాస్పత్రి వద్ద ధర్నాకు దిగడంపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గోప్యత అవసరం ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు బాధితురాలి వివరాలు గోప్యంగా ఉంచడం పరిపాటి. ఈ కేసులోనూ పోలీసులు అదే పాటించారు. సమాజంలో మహిళలకు ఉన్న గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ‘దిశ’ మహిళలకు రక్షాబంధన్ లాంటిది. టీడీపీ నేతలు కావాలని ప్రభుత్వంపై బురదజల్లే యత్నాలు చేస్తున్నారు. ఏపీ పోలీసులు సమర్థంగా పనిచేస్తున్నారు. ఏదో ఒక ఘటనను అడ్డుపెట్టుకుని రాజకీయంగా లబ్ధి పొందాలని టీడీపీ యత్నించడం సరి కాదు. ఆ పార్టీ నేతలు విజ్ఞతతో ఆలోచించాలి. – చెన్నంశెట్టి చక్రపాణి, రిటైర్డ్ ఎస్పీ చదవండి: రమ్య కుటుంబానికి ఐదు సెంట్ల ఇంటి స్థలం -
వైద్య రంగానికి సీఎం జగన్ పెద్దపీట: కొడాలి నాని
సాక్షి, కృష్ణా జిల్లా: వైద్య రంగానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రూ.50 లక్షల నిధులతో నిర్మించిన ఆక్సిజన్ ప్లాంట్‌ను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రూ.1600 కోట్లతో శిథిలావస్థలోఉన్న ఆసుపత్రులను పునర్ నిర్మిస్తున్నామన్నారు. గ్రామస్థాయి నుంచే వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదమా లాంటి సంస్థలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహిస్తే ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని మంత్రి కొడాలి నాని అన్నారు. ఇవీ చదవండి: వైఎస్సార్ ఆచరణలో నుంచి ఓ మహావృక్షం పెరిగింది: సజ్జల బిగ్‌బాస్-13 విన్నర్, చిన్నారి పెళ్లి కూతురు ఫేం సిద్ధార్థ్ శుక్లా హఠాన్మరణం -
వైద్యం వద్దు.. దేవుడే రక్షిస్తాడు.. చికిత్సకు నిరాకరించిన గర్భిణి
సాక్షి, నార్నూర్(ఆదిలాబాద్): ‘ఆస్పత్రికి రాను.. దేవుడికి మొక్కుకున్న.. అతడే రక్షిస్తాడు’ అంటూ వైద్యం చేయించుకునేందుకు గర్భిణీ నిరాకరించిన సంఘటన శనివారం మండలంలోని మహగావ్ శేకుగూడ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. శేకుగూడ గ్రామానికి చెందిన మేస్రం రేణుకబాయి 8 నెలల గర్భవతి. ఇది ఆమెకు మూడో కాన్పు. మొదటి రెండు కాన్పుల్లో హైబీపీ (అధిక రక్తపోటు) కారణంగా అబార్షన్ జరిగింది. ఈనెల 26న ఉట్నూర్ సామాజిక ఆస్పత్రిలో నెలవారి వైద్య పరీక్షలో భాగంగా ఆశ కార్యకర్త సదరు గర్భిణీని తీసుకెళ్లారు. పరీక్షలు నిర్వహించిన గైనకాలజిస్ట్ మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్ రిమ్స్‌కు రెఫర్ చేశారు. అయితే ఆస్పత్రికి వెళ్లేందుకు రేణుకబాయి నిరాకరించింది. సూపర్వైజర్లు రాజమ్మ, చరణ్‌దాస్‌లు కౌన్సెలింగ్ చేసినా వైద్యానికి ఒప్పుకోలేదు. దీంతో శనివారం తహసీల్దార్ దుర్వా లక్ష్మణ్‌కు సమాచారం అందించారు. ఆయన గ్రామానికి చేరుకుని గోండ్ భాషలో నచ్చజెప్పారు. అయిన వినకుండా దేవుడికి మొక్కుకున్నానని, దేవుడే కాపాడుతాడని మొండికేసింది. హైబీపీ ప్రభావం తల్లితో పాటు పుట్టబోయే బిడ్డపై పడుతుందని, సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూనే వైద్యం చేయించుకోవాలని ఆయన కోరారు. ఆస్పత్రికి వెళ్లేదే లేదంటూ అందరూ ఉండగానే రేణుకబాయి గ్రామంలోని వేరే వాళ్ల ఇంటికి వెళ్లిపోయింది. ఆస్పత్రికి వెళ్లకుంటే వచ్చే అనార్థల గురించి అధికారులు, వైద్య సిబ్బంది రేణుకబాయి కుటుంబ సభ్యులకు వివరించారు. అయినా పూర్తిస్థాయి వైద్యానికి గర్భిణీ నిరాకరించింది. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య పరీక్షలకు మాత్రమే ఆమె అంగీకరించింది. డిప్యూటీ తహసీల్దార్ అమృత్లాల్, ఆర్ఐ శకుంతల, సీడాం మల్కు పటేల్, మేస్రం జంగు, తొడసం బండు తదితరులు ఉన్నారు. చదవండి: Karimnagar: కీచకుడిగా మారిన ప్రభుత్వాసుపత్రి కాంట్రాక్టు ఉద్యోగి -
నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి యువరాజ్ సాయం
-
యువీ దాతృత్వం.. నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి 120 ఐసీయూ బెడ్స్
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రభావం పతాక స్థాయిలో ఉన్నప్పుడు ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్క సామన్య ప్రజలు ఎదుర్కొన్న అవస్థలను దగ్గరగా చూసిన టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్‌సింగ్.. బెడ్ల కొరత తీర్చేందుకు తన వంతు సాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. తాజాగా, తన ఫౌండేషన్ (YouWeCan Foundation) ద్వారా తెలంగాణలోని నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రిలో 120 ఐసీయూ బెడ్స్‌కు సాయం అందించాడు. ఈ ఐసీయూ బెడ్లను యువీ నేడు వర్చువల్‌గా ప్రారంభించాడు. కాగా, ఈ సిక్సర్ల వీరుడు.. గతంలో కూడా ఇలాంటి సహాయాలు చాలా చేశాడు. ఈ ఏడాది మే నెలలో తన ఫౌండేషన్ పేరిట మధ్యప్రదేశలోని ఇండోర్‌లో మూడున్న కోట్ల వ్యయంతో 100 పడకల ఆసుపత్రిని నిర్మించి ఇచ్చాడు. -
మూడు వాగులు.. మూడు గుట్టలు దాటినా..
వాజేడు: ఆ ఊరు మూడు వాగులు.. మూడు గుట్టల వెనుక ఉంది. దారి లేదు.. వాహన సౌకర్యం అసలే లేదు. అలాంటి ఊరి నుంచి జ్వరంతో బాధపడుతున్న కొడుకును ఆస్పత్రిలో చూపిద్దామని భుజాలపై మోసుకుంటూ వచ్చారు తల్లిదండ్రులు. తీరా ప్రభుత్వ ఆస్పత్రిలో చూపిద్దామనుకునేలోపే ఆ బాలుడు ప్రాణాలు విడిచాడు. సోమవారం ములుగు జిల్లా వాజేడు మండలంలో ఈ విషాదకర సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పెనుగోలుకు చెందిన ఉయిక శేషయ్య, కాంతమ్మలకు ముగ్గురు పిల్లలు. వారు జ్వరంతో బాధపడుతున్నారు. ఈ గ్రామం కొంగాల గ్రామపంచాయతీ పరిధిలో గుట్టల మీద ఉంటుంది. ఆదివారం రాకేశ్(4)కు జ్వరం ఎక్కువ కావడంతో తల్లిదండ్రులు భుజాల మీద మోసుకుంటూ మూడు వాగులు దాటుకుని.. మూడు గుట్టలు దిగి వచ్చి పగళ్లపల్లిలో ఉన్న చుట్టాల ఇంటికి చేరుకున్నారు. అదే గ్రామంలోని ఆర్ఎంపీ డాక్టర్ వద్ద వైద్యం చేయించారు. అయినా తగ్గలేదు. సోమవారం మళ్లీ వైద్యానికి వెళ్లగా పరిస్థితి బాగా లేదని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలని సూచించాడు. దీంతో శేషయ్య దంపతులు రాకేశ్‌తోపాటు జ్వరంతో ఆస్పత్రికి వచ్చారు. వైద్యులకోసం వేచి ఉండగా.. అప్పటికే ఆలస్యం కావడంతో రాకేశ్ మృతి చెందాడు. బంధువుల ఇంటిలో.. రాకేశ్ మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లాలంటే 15 కిలోమీటర్లు వాగులు, గుట్టలు దాటుకుని నడకదారిన వెళ్లాలి. అప్పటికే సాయంత్రం అయ్యింది. దాంతో ఊరు వెళ్లే అవకాశం లేక పోవడంతో శేషయ్య దంపతులు కొడుకు మృత దేహంతో ప్రగళ్లపల్లిలోని బంధువుల ఇంట్లోనే తలదాచుకున్నారు. సకాలంలో వైద్యం అందితే కొడుకు బతికే వాడని తల్లి కాంతమ్మ వాపోయింది. ఈ విషయంపై వైద్యాధికారి యమునను ‘సాక్షి’వివరణ కోరగా వారు ఆర్ఎంపీ వద్ద ఆదివారం వైద్యం చేయించుకున్నారని, సోమవారం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువస్తుండగా మార్గమధ్యలోనే బాలుడు మృతిచెందినట్లు తెలిసిందని చెప్పారు. వారు తమ ఆస్పత్రికి రాలేదని తెలిపారు. -
వైద్యుల నిర్వాకం: బతికున్నా చంపేశారు..!
సాక్షి, చెన్నై: పుట్టిన శిశువు ఊపిరి ఆడక మరణించినట్లు తేని ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారు. అయితే అంత్యక్రియల సమయంలో శిశువులో కదలికలు రావడంతో అదే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తేని జిల్లా పెరియకుళం సమీపంలోని తామరైకుళానికి చెందిన రాజ, ఆరోగ్య మేరి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మూడో సారి ఆరోగ్య మేరి గర్భం దాలి్చంది. ఆరో నెల పూర్తి కావస్తున్న తరుణంలో శనివారం ఆమెకు పురుటి నొప్పులు వచ్చాయి. తేని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అర్ధరాత్రి 12.30 గంటలకు ఆమెకు ఆడ బిడ్డ పుట్టింది. అయితే బిడ్డ బరువు 200 గ్రాములే ఉండడంతో వెంటిలేటర్ చికిత్సలో ఉంచారు. ఆదివారం వేకువ జామున 3.30 గంటలకు శ్వాస అందకుండా ఆ శిశువు మరణించినట్లు వైద్యులు తేల్చారు. మృతదేహాన్ని ప్యాకింగ్ చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. శిశువును కాసేపు ఇంటి వద్ద ఉంచి, ఆ తర్వాత సమీపంలోని క్రైస్తవ శ్మశాన వాటికలో ఖననం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ కమ్రంలో శిశువులో కదలికలు రావడంతో హుటాహుటిన అదే ఆస్పత్రికి తరలించారు. శిశువు ప్రాణాలతోనే ఉన్నట్లు గుర్తించిన వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై ఆస్పత్రి డీన్ బాలాజీ నాథన్ మాట్లాడుతూ.. బిడ్డను సరిగ్గా పరీక్షించకుండా మరణించినట్లు నిర్ధారించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. -
ఏపీలో మొట్టమొదటి ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రం ప్రారంభం
సాక్షి, అనంతపురం: ఏపీలో మొట్టమొదటి ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రం ప్రారంభమైంది. డీఆర్డీవో, ఎన్హెచ్ఏఐ సహకారంతో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ అందుబాటులోకి వచ్చింది. హిందూపురం ప్రభుత్వాస్పత్రిలో వారం రోజుల్లో ఆక్సిజన్ ప్లాంట్ నిర్మించారు. ప్లాంట్‌ను మంత్రి శంకర్ నారాయణ, ఎంపీ మాధవ్, ఎమ్మెల్సీ ఇక్బాల్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శంకర్ నారాయణ మాట్లాడుతూ, కరోనా కట్టడికి సీఎం వైఎస్ జగన్ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా కరోనాకు ఉచితంగా వైద్యం అందిస్తున్నామని పేర్కొన్నారు. హిందూపురం ప్రభుత్వాస్పత్రిలో మౌలిక సదుపాయాలు పెంచుతామని మంత్రి తెలిపారు. కరోనా బాధితులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు సీఎం జగన్ అన్నిచర్యలు తీసుకుంటున్నారని ఎంపీ మాధవ్, ఎమ్మెల్సీ ఇక్బాల్ అన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ ఎక్కడా లేదని హిందూపురంలో ఏర్పాటైన ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ దేశంలోనే మొదటిదని కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. చదవండి: పంటనష్టంపై చంద్రబాబు దుష్ప్రచారం: కన్నబాబు ఆనందయ్య మందు: నివేదిక సమర్పించిన టీటీడీ -
50 పడకలు దాటితే.. ఆస్పత్రుల్లోనే ఆక్సిజన్ ప్లాంట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 50 పడకలు దాటిన ఆస్పత్రుల్లో కచ్చితంగా ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో నెలకొల్పే పీఎస్ఏ ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లకు 30 శాతం ఇన్సెంటివ్ ఇవ్వాలని అధికారులకు సూచించారు. ముందస్తుగానే ఇన్సెంటివ్‌లు ఇవ్వడం ద్వారా చురుగ్గా ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేసేలా ప్రోత్సహించవచ్చన్నారు. 4 నెలల వ్యవధిలో అన్ని ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ బెడ్స్ కెపాసిటీకి అనుగుణంగా ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పిల్లల చికిత్స కోసం ప్రత్యేకంగా ఐసీయూ బెడ్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇప్పటికే కోవిడ్ నేపథ్యంలో ఆక్సిజన్ ఉత్పత్తి పెంచేందుకు 2021 పాలసీని కూడా ప్రకటించామని సీఎం గుర్తు చేశారు. కోవిడ్ నియంత్రణ, చికిత్స, ఆక్సిజన్ సరఫరా, వ్యాక్సినేషన్‌పై ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సీఎం సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ.. భవిష్యత్ అవసరాల దృష్ట్యా... రాష్ట్రంలో 300 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఆక్సిజన్ ఉత్పత్తిపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. భవిష్యత్తులో ఎలాంటి మహమ్మారినైనా ఎదుర్కొనేందుకు ఈ ఏర్పాట్లు ఉపయోగపడతాయన్నారు. రాష్ట్రంలో కంపెనీలు బయట ఏర్పాటు చేసే పెద్ద ప్లాంట్లకు 20 శాతం ఇన్సెంటివ్ ఇవ్వాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న డిమాండ్‌కు తగినట్టుగా ఆక్సిజన్ ఉత్పత్తి జరగాలని, ఆ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆక్సిజన్ తయారీలో వినియోగించే జియోలైట్ కొరతను అధిగించేలా కడపలో త్వరలో ఆ పరిశ్రమ ఏర్పాటు కానుందని అధికారులు తెలిపారు. వేగంగా వ్యాక్సిన్ టెండర్ల ప్రక్రియ కోవిడ్ వ్యాక్సిన్లు సేకరించేందుకు వీలైనంత వేగంగా గ్లోబల్ టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో రెండు కోట్ల మంది ప్రజలకు సరిపడేలా 4 కోట్ల డోస్‌లు ప్రస్తుతం సేకరించనుండగా వీలుంటే ఇంకా ఎక్కువ అందేలా ప్రయత్నించాలని సూచించారు. తొలుత 45 ఏళ్లు దాటిన వారందరికీ రెండు డోస్‌లూ ఇవ్వాలని, ఆ తర్వాత 18 – 45 ఏళ్ల వారికి కూడా తప్పనిసరిగా రెండు డోస్‌ల వ్యాక్సిన్లు ఇవ్వాలన్నారు. ఈ నేపథ్యంలో వీలైనన్ని ఎక్కువ వ్యాక్సిన్ డోస్‌లు సేకరించాల్సిందిగా ముఖ్యమంత్రి సూచించారు. ఆహారం, పారిశుద్ద్యం కోవిడ్ ఆస్పత్రుల్లో రోగులకు మంచి ఆహారం అందించడంతో పాటు పారిశుద్ధ్య నిర్వహణ మెరుగ్గా ఉండేలా అన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆస్పత్రులు, ప్రజారోగ్యంపై పెద్ద ఎత్తున వ్యయం చేస్తున్నామని, చిన్న చిన్న విషయాల్లో సమస్యలు తలెత్తకూడదని అధికారులకు స్పష్టం చేశారు. ఆస్పత్రుల్లో పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. ప్రతి ఆస్పత్రి నుంచి నివేదికలు తెప్పించుకుని చర్యలు తీసుకోవాలని, రోగులకు సౌకర్యంగా ఉండాలని, ఎక్కడా అపరిశుభ్ర వాతావరణం ఉండకూడదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అధికంగా వసూలు చేస్తే చర్యలు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకన్నా అధికంగా ఫీజులు వసూలు చేస్తున్న ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రెమ్‌డెసివర్ ఇంజక్షన్ల విషయంలో అక్రమాలకు పాల్పడ్డ ఆస్పత్రులపైనా కచ్చితంగా చర్యలు తీసుకోవాలని, ఇంటెలిజెన్స్ అధికారులు నమోదు చేసిన కేసుల్లో తగిన చర్యలుండాలని స్పష్టం చేశారు. ఆ ఔషధంపై శాస్త్రీయ నిర్ధారణ చేయాలి కోవిడ్ చికిత్సకు సంబంధించి నెల్లూరు ఆయుర్వేద వైద్యంపై శాస్త్రీయ నిర్ధారణ జరపాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. నెల్లూరు ఆయుర్వేద ఔషధంపై కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంబంధిత విభాగాల అధికారులతో పరీక్షలు చేయించాలని సూచించారు. బ్లాక్ ఫంగస్‌పై జాగ్రత్త.. కరోనా బాధితులు బ్లాక్ ఫంగస్ బారిన పడుతున్న నేపథ్యంలో దీనిపై పూర్తి అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆక్సిజన్ సేకరించేటప్పుడు వినియోగించే నీటి విషయంలో జాగ్తత్తలు తీసుకోవాలని కొత్తగా సమాచారం వస్తోందని, ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని పటిష్టమైన ప్రొటోకాల్ రూపొందించాలని సూచించారు. ఆక్సిజన్ సరఫరా పైపులు, మాస్క్‌లు.. అన్నీ నిర్ణీత ప్రమాణాలున్న వాటినే వినియోగించాలని స్పష్టం చేశారు. వారంలో మరో ఆక్సిజన్ రైలు... రాష్ట్రంలో ఆక్సిజన్ సరఫరా, నిల్వలతో పాటు కోవిడ్ ప్రస్తుత పరిస్థితిని సమావేశంలో అధికారులు వివరించారు. ఆక్సిజన్ రవాణా కోసం రెండు ఆక్సిజన్ రైళ్లు నడుస్తున్నాయని, ఈ వారంలో మరో ఆక్సిజన్ ట్రైన్ ప్రారంభం అవుతుందని వెల్లడించారు. దీంతోపాటు భువనేశ్వర్‌కు ప్రతిరోజూ 4 ట్యాంకర్లను ఎయిర్ లిఫ్ట్ చేస్తున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడ ఆక్సిజన్ కేటాయించినా సేకరించగలుగుతున్నామని వివరించారు. ఐఎస్ఓ ట్యాంకర్లను వినియోగించుకుని సమర్థవంతంగా ఆక్సిజన్ సేకరిస్తున్నామన్నారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ వినియోగంపై ఆడిట్ చేస్తున్నట్లు తెలిపారు. అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఎక్కడా వృథా కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆక్సిజన్ సేకరణ, సరఫరా, పంపిణీ, ఆస్పత్రుల్లో వినియోగం అన్నింటినీ పూర్తిగా కంప్యూటరైజ్ చేశామని తెలిపారు. 9 పీఎస్‌ఏల పునరుద్ధరణతో 52.75 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రాష్ట్రంలో తొమ్మిది పీఎస్ఏ యూనిట్లను పునరుద్ధరించడం ద్వారా 52.75 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి కానుందని అధికారులు వెల్లడించారు. మరో 5 పీఎస్ఏ యూనిట్ల పునరుద్ధరణ పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. 12 నైట్రోజన్ యూనిట్లను కూడా మార్పిడి చేయడం ద్వారా మరో 11.41 మెట్రిక్ టన్నులు అదనంగా ఉత్పత్తి కానుందని, కొత్తగా నాలుగు కంపెనీలు ఆక్సిజన్ ఉత్పత్తికి ముందుకొస్తున్నాయని అధికారులు వివరించారు. కోవిడ్ ఆస్పత్రులు–బెడ్లు.. రాష్ట్రంలో ప్రస్తుతం 621 కోవిడ్ ఆస్పత్రులలో 45,611 బెడ్లు ఉండగా 38,763 బెడ్లు ఆక్యుపై కాగా 28,189 మంది ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. అన్ని కోవిడ్ ఆస్పత్రులలో 6,217 ఐసీయూ బెడ్లు, 22,756 నాన్ ఐసీయూ ఆక్సిజన్ బెడ్లు, 16,638 నాన్ ఐసీయూ నాన్ ఆక్సిజన్‌బెడ్లతో పాటు 3,407 వెంటిలేటర్లు ఉన్నాయని తెలిపారు. గత సెప్టెంబరులో.. గత ఏడాది సెప్టెంబరులో 261 ఆస్పత్రులో 37,441 బెడ్లు, 2,279 వెంటిలేటర్లు మాత్రమే ఉండగా ఇప్పుడు వాటితో పాటు ఐసీయూ బెడ్లు, నాన్ ఐసీయూ ఆక్సిజన్‌బెడ్లు, నాన్ ఐసీయూ నాన్ ఆక్సిజన్ బెడ్లు గణనీయంగా పెరిగాయని అధికారులు చెప్పారు. గ్లోబల్ టెండర్లకు మంచి స్పందన.. రాష్ట్రంలో రెండు కోట్ల మందికి వ్యాక్సిన్లు (4 కోట్ల డోస్‌లు) ఇచ్చే విధంగా ఈనెల 13న గ్లోబల్ టెండర్లు పిలిచినట్లు అధికారులు తెలిపారు. ప్రిబిడ్ సమావేశం ఈనెల 20న జరగగా, బిడ్ల దాఖలుకు జూన్ 3 చివరి తేదీగా నిర్ణయించామని, టెండర్లకు మంచి స్పందన వస్తోందని అధికారులు వివరించారు. – సమీక్షలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని), సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవన్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, కోవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ ఛైర్మన్ ఎంటీ కృష్ణబాబు, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్ మేనేజ్మెంట్, వ్యాక్సినేషన్) ఎం.రవిచంద్ర, కుటుంబ సంక్షేమ కమిషనర్ కాటమనేని భాస్కర్, 104 కాల్ సెంటర్ ఇంఛార్జ్ ఎ.బాబు, ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్ ఎ.మల్లికార్జున్, ఏపీఎంఎస్ఐడీసీ వీసీ అండ్ ఎండీ వి.విజయరామరాజు, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్.గుల్జార్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ జువ్వాది సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. -
వ్యాక్సిన్లు విక్రయిస్తున్న వైద్యాధికారి అరెస్ట్
సత్యనారాయణపురం(విజయవాడ సెంట్రల్): కోవిడ్ వ్యాక్సిన్లను విక్రయిస్తున్న ఓ ప్రభుత్వ వైద్యాధికారిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. జీ కొండూరు మండలం లోని ప్రభుత్వ ఆస్పత్రి వైద్యాధికారి డాక్టర్ ఎన్ఎస్ రాజు నగరంలోని సబ్‌కలెక్టర్ కార్యాలయంలోని కోవిడ్ హెల్ప్‌లైన్ 104లో డిప్యూ టేషన్‌పై విధులు నిర్వర్తిస్తున్నారు. కొద్దిరోజులుగా కోవిడ్ వ్యాక్సిన్ పేరుతో సత్యనారాయణపురం, మత్యాలంపాడు ప్రాంతాల్లో కారులోనే వ్యాక్సిన్లు వేస్తూ రూ.600 నుంచి రూ.1000 వరకూ వసూలు చేస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి సత్యనారాయణపురంలోని ఓ భవనంలో వ్యాక్సిన్ వేస్తున్నట్టు సమాచారం అందడంతో స్థానిక కార్పొరేటర్ శర్వాణిమూర్తి, 31వ డివిజన్ కార్పొరేటర్ పెనుమత్స శీరీష పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీఐ బాలమురళీకృష్ణ, సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని వైద్యాధికారితో పాటు అతడి సహాయకుడిని అరెస్ట్ చేశారు. భవనంలోని స్టోర్ రూంలో భద్రపర్చిన సిరెంజిలు, 5 కోవాగి్జన్, 6 కోవిషీల్డ్ వ్యాక్సిన్లను సీజ్ చేశారు. -
ఏలూరులో ‘రెమ్‌డెసివిర్’ ముఠా గుట్టురట్టు
ఏలూరు టౌన్: ప్రభుత్వాస్పత్రి నుంచి రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు దొంగిలించి.. బయట అధిక ధరలకు విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఏలూరులోని జిల్లా ప్రభుత్వాస్పత్రిలో స్టాఫ్ నర్సులుగా పనిచేస్తున్న లావణ్య, రాయల వెంకటలక్ష్మితో పాటు మరో 8 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి 13 రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు, రూ.40 వేల నగదు, మూడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఏలూరును కేంద్రంగా చేసుకున్న మూడు ముఠాలు.. కరోనా బాధితులకు అవసరమైన రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను భారీ ధరలకు విక్రయిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో డీఎస్పీ దిలీప్‌కిరణ్ నేతృత్వంలో టూటౌన్ సీఐ ఆదిప్రసాద్ బృందం రంగంలోకి దిగింది. పక్కా ఆధారాలతో ఏలూరు జీజీహెచ్‌లో పనిచేసే స్టాఫ్ నర్సులు లావణ్య, రాయల వెంకటలక్ష్మి, ఎంఎన్‌వో బొమ్మకంటి రవి బ్రహ్మయ్య, గోగులమూడి అశోక్‌తో పాటు ఏలూరు కొత్తపేటకు చెందిన విష్ణుసాయికుమార్, కృష్ణా జిల్లా కపిలేశ్వరపురానికి చెందిన రేడియాలజిస్ట్ ఏకాంబరేశ్వర అలియాస్ బాబి, విజయవాడ సన్‌రైజ్ ఆస్పత్రిలోని కార్డియాలజీ టెక్నీషియన్ గుమ్మల సాయిబాబు, ఏలూరు సత్రంపాడుకు చెందిన గండేపల్లి సుబ్బారావు, గ్లోబల్ మెడికల్స్‌లో పనిచేసే నారాయణ సాయి మోహన్, సూర్య మెడికల్స్‌లో పనిచేసే ముక్కాల సుధీర్‌కుమార్‌లను పోలీసులు అరెస్టు చేశారు. మరో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. -
హిందూపురం కోవిడ్ ఆస్పత్రిలో కలకలం
హిందూపురం: అనంతపురం జిల్లా హిందూపురంలో సోమవారం కలకలం చోటు చేసుకుంది. ప్రభుత్వ కోవిడ్ ఆస్పత్రిలో 8 మంది కోవిడ్ బాధితులు మృతి చెందారు. అయితే వీరి మృతికి ఆక్సిజన్ అందకపోవడం కారణం కాదని.. ఆక్సిజన్ నిల్వలు ఆస్పత్రిలో సమృద్ధిగా ఉన్నాయని.. చివరి క్షణంలో ఆస్పత్రికి రావడం వల్లే ఆరోగ్యం విషమించి వారు మృతి చెందారని అధికారులు తెలిపారు. ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. హిందూపురం కోవిడ్ ఆస్పత్రిలో 150 బెడ్లతోపాటు 50 ఐసీయూ బెడ్స్ అందుబాటులో ఉండగా 232 మంది చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు ఆరోగ్యం విషమించి మంజునాథ్ (39), హిందూపురం ముబారక్ (63), మడకశిర రమేష్ (42), గోళాపురం నంజేగౌడ, నరసింహప్ప (58), సదాశివప్ప (50), లక్ష్మమ్మ (60), గంగరత్న(58) మృతి చెందారు. ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నా వైద్యుల నిర్లక్ష్యమే మరణాలకు కారణమని మృతుల కుటుంబీకులు ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న సీఐ బాలమద్దిలేటి ఆస్పత్రికి చేరుకుని వారికి సర్దిచెప్పడంతో శాంతించారు. 24 గంటలూ పర్యవేక్షిస్తున్నాం ఆక్సిజన్ అందక కోవిడ్ రోగులు మృతి చెందారనేది అవాస్తవమని జిల్లా అటవీ శాఖాధికారి, ఆక్సిజన్ మానిటరింగ్ అధికారి జగన్నాథ్‌సింగ్, పెనుకొండ సబ్ కలెక్టర్ నిషాంతి తెలిపారు. సోమవారం హిందూపురం ప్రభుత్వాస్పత్రిలో వారు సూపరింటెండెంట్, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ.. ఆస్పత్రిలో 204 బెడ్లు ఉండగా ఇందులో 22 వెంటిలేటర్ బెడ్లు ఉన్నాయన్నారు. 6 కేఎల్ ఆక్సిజన్ ట్యాంకర్‌తోపాటు అదనంగా సిలిండర్లు కూడా అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతోనే కోవిడ్ రోగులు మృతి చెందారని తెలిపారు. ఆక్సిజన్ మానిటరింగ్ కమిటీ ద్వారా 24 గంటలు నిరంతర పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. విషమ పరిస్థితిలో ఆస్పత్రికి వచ్చినవారే.. మృతిచెందినవారంతా విషమ పరిస్థితిలో ఆస్పత్రికి వచ్చినవారే. వారికి ఆక్సిజన్ లెవల్ 80లోపు ఉంది. తెల్లవారుజామున ఆక్సిజన్ సిలిండర్లు రీస్టోర్ చేసే సమయంలో భయపడటం వల్లే శ్వాస సమస్య తలెత్తి వారు మరణించినట్లు భావిస్తున్నాం. ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత, ఇతర సాంకేతిక సమస్యలు లేవు. – డాక్టర్ దివాకర్, సూపరింటెండెంట్, హిందూపురం ప్రభుత్వాస్పత్రి -
ఆక్సిజన్ లీకేజీతో మరణాలు అవాస్తవం
అనంతపురం హాస్పిటల్: అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో ఆక్సిజన్ లీకేజీ వల్ల ఎటువంటి మరణాలు చోటు చేసుకోలేదని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు స్పష్టం చేశారు. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మరణించిన వారిలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వయసు మళ్లినవారే అధికంగా ఉన్నారని తెలిపారు. దీనిపై కొందరు కావాలనే ఒక వీడియోను రూపొందించి భయాందోళనలు సృష్టించారని.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శనివారం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో ఆక్సిజన్ కొరతతో అధిక సంఖ్యలో మరణాలు చోటు చేసుకున్నాయని కొన్ని టీవీ చానెళ్లలో వార్తలు రావడంతో కలెక్టర్ గంధం చంద్రుడు, జాయింట్ కలెక్టర్ సిరి నిషాంత్‌కుమార్, డీఎఫ్‌వో జగన్నాథ్ సింగ్ ఆస్పత్రిని సందర్శించారు. ఆక్సిజన్ సరఫరాలో లోపం లేదు.. అనంతరం కలెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ.. ఆస్పత్రిలో ఎక్కడా ఆక్సిజన్ సరఫరాలో లోపం లేదన్నారు. కోవిడ్ సెకండ్ వేవ్‌కు 20 రోజుల ముందే అధికారుల ద్వారా ప్రతి ఆక్సిజన్ పాయింట్లో లోపాలు ఏమైనా ఉన్నాయో, లేదో తనిఖీ చేశామన్నారు. అన్ని ఆస్పత్రుల్లో ఫైర్ సేఫ్టీ, విద్యుత్ విభాగాల్లో ఎటువంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. సంవత్సర కాలంలోనే జిల్లాలోని ఆరు ప్రభుత్వ ఆస్పత్రుల్లో 40 వేల లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేశామన్నారు. మూతపడ్డ వాటిని కూడా తెరిపించామన్నారు. జిల్లాలో యాక్టివ్ కేసులు 9,600 ఉన్నాయని, 0.79 మరణాల రేటు ప్రకారం ఎన్ని మరణాలు జరుగుతాయో చెప్పాలన్నారు. గత 24 గంటల్లో మొత్తం 11 మంది మృతి చెందారని.. అందులో 50 ఏళ్ల లోపు వారు ముగ్గురు మాత్రమే ఉన్నారని తెలిపారు. మిగతా వారంతా 50 ఏళ్లు దాటి దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్నావారేనన్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దీర్ఘకాలిక వ్యాధులతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ చివరి నిమిషంలో ఇక్కడికి రావడంతో కొందరు మృతి చెందుతున్నారని చెప్పారు. ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ కోవిడ్ రోగులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడడమే ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. ఎమ్మెల్యే వెంట మేయర్ వసీం సలీం తదితరులున్నారు. -
నిజామాబాద జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోరం
-
తెల్లారిన కూలీల బతుకులు
వినుకొండ (నూజెండ్ల): పొట్టకూటి కోసం వలస వచ్చిన నిరుపేదల పాలిట మినీ లారీ మృత్యుపాశమయ్యింది. డ్రైవర్ నిద్రమత్తు కారణంగా ముగ్గురి బతుకులు తెల్లారిపోగా.. మరో 20 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. మంగళవారం తెల్లవారుజామున గుంటూరు జిల్లా వినుకొండ రూరల్ మండలం అందుగుల కొత్తపాలెం వద్ద చోటు చేసుకున్న ఘటన వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం పరిధిలోని పార్లపలి, మాసుమాను దొడ్డి, కొసిగి, పల్లెపాడు గ్రామాల నుంచి సోమవారం రాత్రి గుంటూరు జిల్లాకు సుమారు 100 మందికి పైగా వలస కూలీలు నాలుగు మినీ లారీల్లో బయలు దేరారు. యడ్లపాడు, పెదనందిపాడు ప్రాంతాల్లో మిర్చి, వేరుశనగ పొలాల్లో కూలి పనుల కోసం వీరంతా వస్తున్నారు. వీరిలో మాసుమానుదొడ్డి గ్రామానికి చెందిన కూలీలతో బయలుదేరిన మినీ లారీ అందుగుల కొత్తపాలెం గ్రామ శివారులోని లక్ష్మక్క వాగు బ్రిడ్జి వద్దకు వచ్చేసరికి డ్రైవర్ నిద్రమత్తు కారణంగా అదుపుతప్పి బోల్తా కొట్టి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఘటనలో భీముడు (50), యర్నాల శ్రీనివాసరావు (6), వాహనం యజమాని, డ్రైవర్ బొంతల ఉమేష్‌కుమార్ నాయుడు అక్కడికక్కడే మృతి చెందారు. వినుకొండ, బొల్లాపల్లి, ఈపూరు, నూజెండ్ల 108 వాహన సిబ్బంది సకాలంలో స్పందించి గాయపడ్డ వారిని పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వాహనంలో ఇరుక్కుపోయిన మృత దేహాలతో పాటు గాయపడిన వారిని బయటకు తీసి జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, తమ సహచరుల వాహనం ప్రమాదానికి గురైన విషయం తెలుసుకున్న మిగతా వలస కూలీలు భారీగా వినుకొండ ప్రభుత్వ వైద్యశాల వద్దకు చేరుకున్నారు. వారి రోదనలతో ఆస్పత్రి ప్రాంగణం మార్మోగింది. వారందరినీ స్వస్థలాలకు పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. -
ఆస్పత్రి బెడ్‌పై కుక్క.. వీడియో వైరల్
ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ ‘పండిత్ దీన్‌దయాల్ గవర్నమెంట్’ హాస్పిటల్లోకి ఒక వీధికుక్క ప్రవేశించింది. ‘నీకు ఇక్కడ ఏం పని?’ అని అక్కడ ఏ మానవుడు కుక్కగారిని ప్రశ్నించలేదు. అడ్డుకోలేదు. సదరు కుక్క రెండో ఫ్లోర్‌లోని ఫిమేల్ సర్జికల్ వార్డ్‌లోకి వచ్చి అక్కడ కనిపించిన ఒక బెడ్‌పైకి ఎక్కి హాయిగా సేద తీరింది.‘ఇదెక్కడి ఘోరమండి బాబూ’ అనే ఆశ్చర్యం వేడిగా హాస్పిటల్ సిబ్బందిని తాకింది.వారు మాత్రం అత్యంత కూల్‌గా ‘ఏదోలేండీ... వార్డ్‌లో ఎవరూ అడ్మిట్ కాలేదు కదా!’ అని తేలిగ్గా తీసుకున్నారు. ఎవరో అజ్ఞాత వ్యక్తి కుక్కగారి రాజసాన్ని వీడియో తీశాడు. అది సోషల్ మిడియాలో వైరల్ అయింది. దీంతో హాస్పిటల్ మెడికల్ ఆఫీసర్ అయిదు ఫ్లోర్లు దిగివచ్చి ‘జరిగిన సంఘటనపై దర్యాప్తుకు ఆదేశించాం. బాధ్యులైన వారిపై గట్టి చర్యలు తీసుకుంటాం’ అని గంభీరంగా ప్రెస్‌తో చెప్పాడు.స్థానికులు మాత్రం చీఫ్ డాక్టర్గారి స్టేట్మెంట్ను లైట్ గా తీసుకున్నారు. ‘ఇదేదో తొలిసారిగా జరిగినట్లు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఆస్పత్రి ఉన్నదనేది ఎంత వాస్తవమో కుక్కల రాకపోకలు కూడా అంతే వాస్తవం’ అంటున్నారు. A scene from the female surgical ward of the district hospital in UP's Moradabad. Recently a dog was found licking blood from the corpse of an accident victim at the district hospital in neighbouring Sambhal district. Video credit: @SiddquiShariq @Benarasiyaa pic.twitter.com/IRJy1rKT54 — Kanwardeep singh (@KanwardeepsTOI) January 12, 2021 -
ప్రభుత్వాసుపత్రిలో ఘోరం
సాక్షి, ముంబై: మహారాష్ట్రలోని భందారా ప్రభుత్వాసుపత్రిలో తీరని విషాదం చోటుచేసుకుంది. ఆస్పత్రిలోని ప్రత్యేక న్యూబార్న్ కేర్ యూనిట్(ఎస్ఎన్సీయూ)లో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన అగ్ని ప్రమాదంలో 10 మంది పసికందులు ప్రాణాలు కోల్పోయారు. ఆ యూనిట్లో మొత్తం 17 మంది నవజాత శిశువులు ఉండగా, వారిలో ఏడుగురిని రక్షించినట్టు వైద్యులు తెలిపారు. మరణించిన వారంతా ఒకటి నుంచి మూడు నెలలోపు పసిబిడ్డలే కావడం విషాదం. మృతి చెందిన పది మందిలో ముగ్గురు కాలిన గాయాలతోనూ, మిగిలిన ఏడుగురు పొగ కారణంగా ఊపిరాడక మృత్యువాత పడ్డట్టు రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ టోప్ తెలిపారు. ఆరోగ్య శాఖ డైరెక్టర్ నాయకత్వంలో ఘటనపై విచారణకు ఆరుగురు సభ్యుల కమిటీని నియమించినట్టు, మూడు రోజుల్లో నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించినట్టు మంత్రి తెలిపారు. సెక్యూరిటీ ఉద్యోగి గౌరవ్ రహపాడే మీడియాతో మాట్లాడారు. ‘పై వార్డుకు ఉన్న కిటికీ వద్దకి చేరుకుని అద్దాలు పగుల కొట్టి లోపలికి చేరాం. అనంతరం వెనుక ద్వారం నుంచి పిల్లలను బయటికి తీసుకవచ్చాం. ఏడుగురికి రక్షించగలిగాం. ఒక విభాగంలోని ఏడుగురిని రక్షించినప్పటికీ 10 మంది ఉన్న మరో విభాగం నుంచి ఎవరినీ రక్షించలేకపోయాం’ అని రహపాడే తెలిపారు. సీఎం ఉద్ధవ్ ఠాక్రే ప్రమాద ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధ్యులెవరినీ వదిలిపెట్టేది లేదనీ, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి అన్నారు. మృతిచెందిన పసివారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ ఘటన పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. ఏం జరిగిందంటే..? ఆసుపత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యూబార్న్ కేర్ యూనిట్లో తక్కువ బరువున్న చిన్నారులకు చికిత్సనందిస్తున్నారు.రాత్రి 1.30 గంటలపుడు యూనిట్లో మంటలు చెలరేగాయని జిల్లా సివిల్ సర్జన్ ప్రమోద్ ఖాన్దేట్ చెప్పారు. విషయాన్ని ముందుగా ఒక నర్సు గుర్తించి, వైద్యులను, ఇతర సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఐదు నిమిషాల్లోనే అక్కడికి చేరుకుని వార్డులోని కిటికీ తలుపుల గుండా ఏడుగురు పసికందులను పక్క వార్డులోకి మార్చారు. యూనిట్లో అగ్ని మాపక పరికరాలున్నా పొగ తీవ్రత కారణంగా మిగతా వారిని రక్షించడం సాధ్యం కాలేదన్నారు. ఆ యూనిట్లో 24 గంటల ఆక్సిజన్ సరఫరా ఏర్పాట్లున్నాయి. భవనంలో మంటలు వ్యాపించడానికి షార్ట్ సర్క్యూటే కారణమై ఉంటుందని భావిస్తున్నారు. మహారాష్ట్రలో ఘోరం మహారాష్ట్రలోని భందారా ప్రభుత్వాసుపత్రిలో తీరని విషాదం చోటుచేసుకుంది. ఆస్పత్రిలోని ప్రత్యేక న్యూబార్న్ కేర్ యూనిట్(ఎస్ఎన్సీయూ)లో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన అగ్ని ప్రమాదంలో 10 మంది పసికందులు ప్రాణాలు కోల్పోయారు. ఆ యూనిట్లో మొత్తం 17 మంది నవజాత శిశువులు ఉండగా, వారిలో ఏడుగురిని రక్షించినట్టు వైద్యులు తెలిపారు. -
తప్పుగా మాట్లాడా.. క్షమించండి: డాక్టర్ సుధాకర్
సాక్షి, నర్సీపట్నం: విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంకు చెందిన ఎనస్తీషియా వైద్యుడు డాక్టర్ సుధాకర్ ఘటనకు సంబంధించి వైద్య విధాన పరిషత్ రాష్ట్ర కమిషనర్ యు.రామకృష్ణరాజు ఆదేశాల మేరకు వైద్య విధాన పరిషత్ జిల్లా కోఆర్డినేటర్ వి.లక్ష్మణ్‌రావు మంగళవారం శాఖాపరమైన విచారణ నిర్వహించారు. విచారణకు డాక్టర్ సుధాకర్ హాజరయ్యారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ నీలవేణిదేవి, ప్రసూతి వైద్యనిపుణులు గౌతమి, అప్పట్లో సూపరింటెండెంట్‌గా పనిచేసిన హెచ్‌వి.దొర, జనరల్ సర్జన్ సింహాద్రి, వైద్యులు, వైద్య సిబ్బందిని కోఆర్డినేటర్ విచారించారు. అనంతరం లక్ష్మణ్‌రావు విలేకరులతో మాట్లాడుతూ.. రూల్ నంబర్ 20 ప్రకారం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారని డాక్టర్ సుధాకర్‌పై వచ్చిన అభియోగంతోపాటు ఆయన ప్రవర్తనపై విచారించామన్నారు. విచారణ నివేదికను కమిషనర్‌కు నివేదిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ సుధాకర్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘తప్పు మాట్లాడి ఉంటే క్షమించండి.. అవగాహన లేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశా’ అని చెప్పారు. ‘నాకు తెలియకనే అలా మాట్లాడానని విచారణ అధికారికి విన్నవించాను.. ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలని మాట్లాడలేదు.. ఆరోగ్యం బాగులేని కారణంగా ఆ రోజు అలా మాట్లాడాను తప్ప కావాలని కాదు’ అని లిఖితపూర్వకంగా రాసిచ్చినట్టు తెలిపారు. డాక్టర్ సుధాకర్ విశాఖపట్నంలో మద్యం సేవించి నడిరోడ్డుపై న్యూసెన్స్ సృష్టించిన విషయం తెలిసిందే. -
మేల్కోకపోతే ముప్పే!
అనంతపురం హాస్పిటల్: అనంతపురం సర్వజనాస్పత్రిలో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నా ఏపీఎంఎస్ఐడీసీ అధికారుల పనితీరులో ఏమ్రాతమూ మార్పు రాలేదు. ఇటీవల ఆస్పత్రిలోని ఇన్ఫెక్షన్ డీసీస్ వార్డు (ఐడీ)లో షార్ట్ సర్క్యూట్ జరిగింది. దీంతో పాటు రెండు వారాల క్రితం సూపరింటెండెంట్ చాంబర్ ముందు ఆక్సిజన్ లీకేజీ జరిగినా అధికారులు తేలిగ్గా తీసుకోవడంతో ఎఫ్ఎం వార్డులో మరో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రభుత్వం కోవిడ్ రోగుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంటే అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టమూ వాటిల్లలేదు. ఇప్పటికైనా ఏపీఎంఎస్ఐడీసీ అధికారులు మేలుకోకపోతే తీవ్ర ఇబ్బందులు తలెత్తవని ఆస్పత్రి వర్గాలంటున్నాయి. పూర్తి కాని పనులు కోవిడ్ వైరస్ విజృంభణ నేపథ్యంలో సర్వజనాస్పత్రిలో కోటి రూపాయలతో పైప్‌లైన్ ఏర్పాటు చేయాలని జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఈ ఏడాది ఏప్రిల్ నాలుగో తేదీన ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో రూ.36 లక్షలతో 150 పడకలకు వన్ లైన్ ఎయిర్, 30 పడలకు టూ లైన్ ఎయిర్, జూన్ 12న రూ.64 లక్షలతో 60పడకలకు మెడికల్ గ్యాస్‌లైన్ త్రీ లైన్, 400 పడకలకు వన్ లైన్ ఆక్సిజన్ పైప్‌లైన్ ఏర్పాటుకు సంబంధించి హైదరాబాద్‌కు చెందిన సన్డాట్కామ్ అగ్రిమెంట్ చేసుకుంది. ఆస్పత్రిలోని వివిధ వార్డులకు సంబంధించి 700 పాయింట్లలో ఆక్సిజన్ పైప్‌లైన్ ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ ఇంకా 150 నుంచి 200 పాయింట్లలో పైప్‌లైన్ పనులు పూర్తి కాలేదు. పనుల్లో నాణ్యతేదీ? ఆక్సిజన్ పైప్‌లైన్ పనుల్లో నాణ్యత లోపించిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పైప్‌లైన్ పనులు జరిగే సమయంలో సంబంధిత ఏపీఎంఎస్ఐడీసీ అధికారులు కానీ, కాంట్రాక్టర్ అందుబాటులో లేకుండా సిబ్బందితోనే వాల్స్‌కు తూతూమంత్రంగా వెల్డింగ్ పనులు చేసినట్లు ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. దీని కారణంగానే రెండు చోట్ల పైప్‌లైన్ లీకేజీలు జరిగినట్లు తెలుస్తోంది. గండం గడిచింది సర్వజనాస్పత్రిలో ఈ నెల ఆరో తేదీన జరిగిన ఆక్సిజన్ పైప్‌లైన్ లీకేజీ పట్ల ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ సూర్య, సూపరింటెండెంట్ డాక్టర్ రామస్వామి నాయక్ సకాలంలో స్పందించడంతో గండం గడిచింది. ఏమాత్రం జాప్యం చేసినా వెంటిలేటర్, ఆక్సిజన్ పడకల మీదున్న రోగుల ప్రాణాలకే ఇబ్బంది కలిగేదని ఆస్పత్రి వర్గాలంటున్నాయి. విచారణకు ఆదేశం ఆస్పత్రిలో వరుసగా జరుగుతున్న ఘటనలపై కలెక్టర్ గంధం చంద్రుడు విచారణకు ఆదేశించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామస్వామి నాయక్, ఆర్ఎంఓ, అనస్తీíÙయా హెచ్ఓడీ డాక్టర్ నవీన్‌కుమార్‌తో పాటు అన్ని విభాగాల హెచ్ఓడీలు అందుబాటులో ఉండి ఆస్పత్రిలో ఎక్కడైనా ప్రమాదకర ప్రాంతాలుంటే వాటిని గుర్తించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మరో మూడు రోజుల్లో అధికారులు నివేదిక సమర్పించనున్నారు. ఏపీఎంఎస్ఐడీసీ ఈఈ లక్ష్మీపతిరెడ్డి ఏమన్నారంటే..‘ఆస్పత్రిలో ఆక్సిజన్ పైప్‌లైన్ పనులు జరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో లీకేజీలు జరిగిన మాట వాస్తవమే. మరోసారి ఇటువంటి పరిస్థితులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటాం. మరో రెండ్రోజుల్లో విధులకు హాజరై తదుపరి వాటిపై స్పష్టత ఇస్తా. పైప్‌లైన్ పనులు అసంపూర్ణం ఆస్పత్రిలో పైప్‌లైన్ పనులు అసంపూర్ణంగా ఉన్నాయి. పైప్‌లైన్ వాల్స్ ఊడిపోవడం కారణంగానే లీకేజీ జరిగింది. రెండు వారాల క్రితం తన కార్యాలయం సమీపంలోనే లీకేజీ అయ్యింది. భవిష్యత్తులో లీకేజీలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీఎంఎస్ఐడీసీ అధికారులను కోరుతాం. ఆస్పత్రిలో ప్రమాదకర పరిస్థితులను గుర్తించి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం. – డాక్టర్ రామస్వామినాయక్, సూపరింటెండెంట్, సర్వజనాస్పత్రి -
అన్నింటికి ఆ నలుగురే
వీధిలో ఎవరికైనా కరోనా వచ్చిందంటే అటువైపు వెళ్లడానికే భయపడే రోజులివి. ఇంట్లో సైతం ఎవరికైనా పాజిటివ్‌గా తేలితే ఆమడదూరం నుంచే సేవలందిస్తున్న కాలమిది. ఇలాంటి పరిస్థితుల్లోనూ కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను మార్చురీ నుంచి తీసి.. వాటిని అంత్యక్రియలకు వాహనంలో పంపిస్తున్నారు పెద్దాసుపత్రిలోని ‘ఆ నలుగురు’. మృతులకు సగౌరవంగా ‘వీడ్కోలు’ చెబుతున్న వీరిని అధికారులు సైతం అభినందిస్తున్నారు. సాక్షి, కర్నూలు : కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల (పెద్దాసుపత్రి)ను స్టేట్ కోవిడ్ హాస్పిటల్‌గా మార్చిన తర్వాత ఇతర కోవిడ్ ఆసుపత్రుల్లో తీవ్ర అస్వస్థతకు గురైన కరోనా రోగులను సైతం ఇక్కడికే రెఫర్ చేస్తున్నారు. ఈ కారణంగా పెద్దాసుపత్రిలో మృతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. జిల్లాలో ఈ ఐదు నెలల కాలంలో కరోనాతో 337 మంది చనిపోయారు. ఇందులో అధిక శాతం మరణాలు పెద్దాసుపత్రిలోనే నమోదయ్యాయి. సాధారణంగా ఎవరి సంప్రదాయం ప్రకారం వారు మృతులకు అంత్యక్రియలు చేస్తారు. కానీ కరోనా కారణంగా మృతదేహాల వద్దకు వెళ్లేందుకు కుటుంబ సభ్యులు సైతం భయపడే రోజులు దాపురించాయి. ఇదే సమయంలో వైరస్ ఇతరులకు వ్యాపించకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వమే అంత్యక్రియలు నిర్వహిస్తూ వస్తోంది. మృతదేహాలను అంత్యక్రియలకు పంపేందుకు గాను పెద్దాసుపత్రిలో నలుగురు ఎంఎన్‌వోలను నియమించారు. వీరు కరోనా బాధితుల మృతదేహాలపై వార్డులోనే కెమికల్స్ చల్లి, ప్లాస్టిక్ కవర్లో భద్రంగా ప్యాక్ చేస్తారు. ఆ తర్వాత మార్చురీలో భద్రపరుస్తారు. అనంతరం బయటకు తీసి, వాటిని ‘మహాప్రస్థానం’ వాహనంలో అంత్యక్రియలకు పంపిస్తున్నారు. ఈ సమయంలో పీపీఈ కిట్లు, మాస్క్‌లు ధరించి జాగ్రత్తలు వహిస్తున్నారు. ధైర్యవంతుడని ప్రోత్సహిస్తున్నారు ఆ భగవంతునికి సేవ చేస్తున్నానని భావించి మృతదేహాలను ఎత్తి పంపిస్తున్నాను. ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందీ లేదు. భార్య, కుమారుడు ఉన్నారు. గతంలో కూలి పనిచేసేవాన్ని. ఇప్పుడు ఈ పని తృప్తిగా అనిపిస్తోంది. ఇరుగూ పొరుగు వారు కూడా ఇబ్బంది పెట్టడం లేదు. పైగా వారు ప్రోత్సహిస్తున్నారు. చాలా మంచిది.. ధైర్యవంతుడని చెబుతున్నారు. – బరిగెల పవన్‌కుమార్, శ్రీరామనగర్, కర్నూలు -
నటి జ్యోతిక రూ. 25 లక్షల విరాళం
తంజావూర్ ప్రభుత్వాస్పత్రికి నటి జ్యోతిక రూ. 25 లక్షలు విరాళం అందించారు. ఆ మధ్య తాను నటిస్తున్న చిత్ర షూటింగ్ కోసం రాజా మీరసుధార్ ఆస్పత్రికి వెళ్లి అక్కడి సమస్యలను చూశారు. ఈ క్రమంలో శనివారం ఉదయం అగరం ఫౌండేషన్ ద్వారా ఆస్పత్రి అభివృద్ధికి విరాళాన్ని జ్యోతిక తరఫున దర్శకుడు ఆర్.శరవణన్ అందించారు. పిల్లల వార్డు ఆధునికీకరణ కోసం ఈ మొత్తాన్ని అందజేసినట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా జ్యోతికకు ఆరోగ్య శాఖ మంత్రి విజయ భాస్కర్ ధన్యవాదాలు తెలిపారు. (బర్త్‌డే సందర్భంగా ఫ్యాన్స్‌కు మహేష్ పిలుపు) -
వైద్యుడు కాదు.. కీచకుడు
సాక్షి, విజయవాడ: ప్రాణాలు కాపాడాల్సిన వైద్యుడే కీచకుడి అవతారం ఎత్తాడు. ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. విజయవాడ ప్రభుత్వాసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ నాంచారయ్యపై లైంగిక వేధింపుల కేసు నమోదయ్యింది. ఆసుపత్రిలో కాంట్రాక్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగి.. డాక్టర్ వేధింపులపై పోలీసులను ఆశ్రయించింది. రాత్రివేళలో ఫోన్లు చేయడంతో పాటు, తన పర్సనల్ గదికి రావాలంటూ నాంచారయ్య ఒత్తిడికి గురి చేస్తున్నారంటూ బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఫోన్‌కాల్,వీడియో రికార్డింగ్స్‌ను పోలీసులకు అందజేసింది. అలాగే ఆసుపత్రిలో పర్సనల్ రూమ్‌కు రావాలంటూ నాంచారయ్య ఇచ్చిన తాళాలను కూడా బాధితురాలు పోలీసులకు అందజేసింది. నాంచారయ్య పై 354 ఏ అండ్ డీ, 506, 509 ఐపీసీ, సెక్షన్ 67 ఏ ఐ టీ యాక్ట్ కింద దిశ పోలీసులు కేసులు నమోదు చేశారు. కోరిక తీర్చలేదని.. బాధితురాలు ‘సాక్షి’తో మాట్లాడుతూ రెండు నెలలుగా సూపరిండెంట్ నాంచారయ్య వేధిస్తున్నారని, తన సెల్‌కు అసభ్యకర వీడియోలు పంపేవారని ఆవేదన వ్యక్తం చేసింది. ‘‘తన కోరిక తీరిస్తే ఉద్యోగాన్ని పర్మినెంట్ చేస్తానన్నాడు. రకరకాలుగా డ్యూటీ లు మార్చి బెదిరించారు. వాట్సాప్ కాల్స్, వీడియో కాల్స్ తో విసిగించే వారు. తనకు లొంగలేదన్న కోపంతో కాంట్రాక్టర్ కి చెప్పి ఉద్యోగం లో నుంచి తొలగించారు. న్యాయం కోసం దిశా పోలీసులను ఆశ్రయించాను. నాంచారయ్యపై చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయాలి. ఏ అదరువు లేని తనకు తిరిగి ఉద్యోగం ఇప్పించాలని’ బాధితురాలు కోరింది. -
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో విషాదం
సాక్షి, విజయవాడ: తీవ్ర మనస్తాపంతో ప్రభుత్వాసుపత్రి భవనంపై నుంచి దూకి మహిళ ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన నగరంలో చోటు చేసుకుంది. కరోనా వైరస్ బారినపడి కోలుకున్న మహిళను వైద్యులు డిశ్చార్జ్ చేయగా, ఆమె కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్లడానికి నిరాకరించారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన మహిళ ఆసుపత్రి భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. చల్లపల్లి మండలం నారాయణపురానికి చెందిన ఆదిలక్ష్మిగా ఆసుపత్రి సిబ్బంది గుర్తించారు. మరోవైపు కుమారుడికి కరోనా సోకడంతో ఓ వృద్ధుడు విజయవాడ ప్రకాశం బ్యారేజ్‌పై ఆత్మహత్యాయత్నం చేశాడు. అయితే సమీపంలో ఉన్న ఎన్డీఆర్ఎఫ్ వన్‌టౌన్ పోలీసులు సకాలంలో స్పందించి అతడిని కాపాడారు. అనంతరం జీజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. బాధితుడు మచిలీపట్నంకు చెందిన నాగేశ్వరరావుగా గుర్తించారు. -
ఎన్ని చీవాట్లు పెట్టినా మార్పు రాదా?!
సాక్షి, నల్గొండ: జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. కోవిడ్ వార్డులో డాక్టర్లు, సిబ్బంది కొరత వేధిస్తోంది. దీనికి తోడు ఉన్న కొద్దిమంది సిబ్బందికి కనీసం పీపీఈ కిట్లు కూడా లేకపోవడంతో వారు చేతులెత్తేశారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో కరోనా రోగులకు, వారి సహాయకులే సేవలు చేస్తున్నారు. అవగాహన రాహిత్యంతో మాస్కులు కూడా ధరించకుండానే రోగులతో దగ్గరగా ఉంటున్నారు. తమవారిని కాపాడుకోవాలని ఆరాటపడుతున్నారు. కాగా, వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో ఇటీవల ఇదే ఆస్పత్రిలో బొప్పని యాదయ్య అనే రోగి మృతి చెందడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఆ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ వైద్య శాఖకు చీవాట్లు పెట్టినా ఎలాంటి మార్పు కానరావడం లేదు. (అయ్యో... బిడ్డ) (సిబ్బందిలేక.. ఇబ్బంది !) -
ఆక్సిజన్ అందక కరోనా రోగి మృతి
సాక్షి, కరీంనగర్: జిల్లాలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో కరోనా రోగి మృతి కలకలం రేపుతోంది. ఆక్సిజన్ అందక బెడ్ పైనుంచి కింద పడి కరోనా బాధితుడు సోమవారం మృతి చెందడంతో అక్కడ ఆందోళన నెలకొంది. రోగి మృతికి వైద్యులు, ఆసుపత్రి సిబ్బందితో పాటు ప్రభుత్వమే కారణమంటూ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన బాటపట్టారు. టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం మేడిపల్లి సత్యం మీడియాతో మాట్లాడుతూ... గంగాధర మండలం వెంకటాయపల్లికి చెందిన వృద్దుడు కరోనాతో ఆసుపత్రిలో చేరితే సరైన వైద్యం అందించక, పట్టించుకునేవారు కానరాక కింద పడి ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. (చదవండి: ఎల్లో మీడియా క్షణక్షణం ప్రజల్ని భయపెడుతోంది) ఆస్పత్రి నిర్వాకం, వైద్యుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాకు చెందిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ బాధ్యత వహించి రాజీనామా చేయాలని, ఆయన రాజీనామా చేయకుంటే గవర్నర్ బర్తరఫ్ చేయాలని కోరారు. ఆస్పత్రి నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయిన బాధితుడి కుటుంబానికి 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కరోనా బాధితులకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం అందేలా కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని కోరారు. దీనిపై ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. (చదవండి: వైద్యుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే అనంత ఫైర్..) -
కరోనా విషాదం: తల్లి చూస్తుండగానే..
సాక్షి, నల్గొండ: కరోనా విపత్కర పరిస్థితుల్లో మరో వ్యక్తి ఆక్సిజన్ అందక ప్రాణాలు విడిచాడు. కళ్ల ముందే కొడుకు ప్రాణాలు విడువడంతో అతని తల్లి గుండె పగిలేలా రోదించిన తీరు కలచివేస్తోంది. వివరాలు.. మాడుగులపల్లి మండలం సల్కునూర్‌కు చెందిన ఓ వ్యక్తి కరోనా లక్షణాలతో బాధపడుతున్నాడు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి కోవిడ్ వార్డులో శనివారం చేరాడు. అయితే, అప్పటికే పరిస్థితి విషమించడంతో వైద్యం చేయడానికి డాక్టర్లు ముందు రాలేదని తెలుస్తోంది. దాంతోపాటు ఆస్పత్రిలో వెంటిలేటర్ సౌకర్యం కూడా లేకపోవడంతో దారుణం జరిగింది. బాధితుడు ఊపిరి తీసుకోలేక తల్లి కళ్లముందే తనువు చాలించాడు. డాక్టర్ల నిర్లక్ష్యమే తన బిడ్డ చావుకు కారణమైంది మృతుడి తల్లి ఆరోపించారు. ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి ఒక్క డాక్టర్ కూడా తన కొడుకును చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. (కామారెడ్డి బస్టాండ్‌లో దారుణం.. పట్టించుకోని స్థానికులు) -
అస్పత్రి అభివృద్ధికి భారతి సిమెంట్ సహకారం
ఎర్రగుంట్ల :ఎర్రగుంట్ల మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రిని అత్యాధునిక వసతులతో, పరికరాలతో అభివృద్ధి చేయడానికి భారతి సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం ముందుకు రావడం సంతోకరమని జమ్మలమడుగు ఎమ్మెల్యే డాక్టరు మూలె సుధీర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఎర్రగుంట్ల మున్సిపల్ పరిధిలో ప్రభుత్వ ఆసుపత్రిని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి మూలె హర్షవర్థన్‌రెడ్డితో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఎర్రగుంట్ల మున్సిపాలీటీలో గడిచిన 15 ఏళ్లుగా ప్రభుత్వ ఆసుపత్రిని ఏవరూ పట్టించుకోలేదన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక నాడు–నేడు పనులతో పాఠశాలలు అభివృద్ది చేస్తున్నామన్నారు. ఇక్కడి ఆసుపత్రిలో ఆధునిక వసతులు చాలా ముఖ్యమన్నారు. ఈ నేపథ్యంలో తాను ఎర్రగుంట్ల ఆసుపత్రిని కూడా కమలాపురం ఆసుపత్రి మాదిరిగా అబివృద్ది చేయాలని భారతి సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని కోరినట్లు తెలిపారు. వెంటనే యాజమాన్యం స్పందించిందన్నారు. అడిగిన వెంటనే రూ.20 లక్షలు సీఎస్ఆర్ నిధులను మంజూరు చేయడం ఆనందం కలిగించిందన్నారు. ఈ నిధులతో 15 పడకలు ఏర్పాటు చేయనున్నామన్నారు. వివిధ పరికరాలను కూడా అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు తెలిపారు. సిమెంట్ ఫ్యాక్టరీకి చెంతిన భార్గవర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇంజనీర్లు సందర్శించి ఆధునికంగా తీర్చిద్దిదడానికి ప్రణాలిక సిద్ధం చేస్తారన్నారు.ఈ సందర్భంగా ఆయన యజమాన్యాన్ని అభినందిస్తున్నామన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి మూలె హర్షవర్థన్‌రెడ్డి, భారతి సిమెంట్ ఫ్యాక్టరీ భార్గవరెడ్డి, కమిషనర్ వై రంగస్వామిలతో పాటు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. -
నిర్లక్ష్యంపై బిగుసుకుంటున్న ఉచ్చు!
సాక్షి, నిజామాబాద్: జిల్లా ఆస్పత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై ఉచ్చు బిగుసుకుంటోంది. కరోనాతో చనిపోయిన ఓ వ్యక్తి మృతదేహాన్ని ఆటోలో తరలించిన ఘటనపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సీరియస్ అయింది. నిజామబాద్ ప్రభుత్వాసుపత్రిలో కోవిడ్ నిబంధనల ఉల్లంఘనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే నలుగురు వైద్యులతో కమిటీ ఏర్పాటు చేసిన వైద్య ఆరోగ్యశాఖ తాజాగా మార్చురీ సిబ్బందికి మెమోలు జారీ చేసింది. కాగా, కోవిడ్‌తో మృతి చెందిన వ్యక్తి మృతదేహాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఆటోలో తరలించిన దారుణ ఘటన నిజామాబాద్‌లో శనివారం చోటు చేసుకుంది. నిబంధనలు ప్రకారం కరోనా వైరస్ ద్వారా మృతిచెందిన వ్యక్తి మృతదేహాన్ని అంబులెన్స్ లేదా ఎస్కార్ట్ వాహనంలో సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి జాగ్రత్తగా తరలించాల్సి ఉంటుంది. ఇక ఆటో డ్రైవర్‌తో పాటు అందులులో ఉన్న మరో వ్యక్తి కూడా ఎలాంటి కనీస జాగ్రత్తలు తీసుకోలేదు. ఒకేసారి ముగ్గురు కరోనా రోగులు మరణించడంతో ఒక్కటే అంబులెన్స్ అందుబాటులో ఉందని, అందువల్ల ఆటోలో తరలించామని ప్రభుత్వాసుపత్రి వర్గాలు తమ చర్యను సమర్థించుకున్నాయి. (కరోనా రోగి పట్ల అమానుష ప్రవర్తన) -
దారుణం: ఆటోలో కరోనా రోగి మృతదేహం
సాక్షి, నిజామాబాద్: కోవిడ్‌తో మృతి చెందిన వ్యక్తి మృతదేహాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఆటోలో తరలించిన దారుణ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. నిబంధనలు ప్రకారం కరోనా వైరస్ ద్వారా మృతిచెందిన వ్యక్తి మృతదేహాన్ని అంబులెన్స్ లేదా ఎస్కార్ట్ వాహనంలో సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి జాగ్రత్తగా తరలించాల్సి ఉంటుంది. కానీ నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలో మాత్రం వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆటోలో కరోనా రోగి మృతదేహాన్ని స్మశాన వాటిక కు తరలించారు. డ్రైవర్‌తో పాటు ఆటోలో ఉన్న మరో వ్యక్తి కూడా పీపీఈ కిట్లు ధరించలేదు. ఎలాంటి కనీస జాగ్రత్తలు తీసుకోలేదు. ఒకేసారి ముగ్గురు కరోనా రోగులు మరణించడంతో ఒక్కటే అంబులెన్స్ అందుబాటులో ఉందని, అందువల్ల ఆటోలో తరలించామని ప్రభుత్వాసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. -
నిజామాబాద్ ఆస్పత్రిలో కలకలం
నిజామాబాద్ అర్బన్: నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రిలో గురువారం రాత్రి నలుగురు రోగులు మృతి చెందడం కలకలం రేగింది. వీరిలో కరోనా కాటుకు ముగ్గురు, అనారోగ్యంతో అప్పుడే చికిత్స కోసం వచ్చిన మరొకరు మృత్యువాత పడ్డారు. ఆక్సిజన్ అందకపోవడంతోనే ముగ్గురు మృతి చెందారని, వారి బంధువులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. వివరాలు.. జిల్లాలోని ముగ్గురు వ్యక్తులు కరోనా వైరస్ సోకడంతో ఇటీవల జనరల్ ఆస్పత్రిలో చేరారు. వీరిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. గురువారం అర్ధరాత్రి 12.30 గంటల సమయం లో ఎడపల్లికి చెందిన మహిళ (65), జక్రాన్‌పల్లికి చెందిన మహిళ (75), భీమ్‌గల్‌కు చెందిన వ్యక్తి (55) పరిస్థితి విషమించి చనిపోయారు. ఇదే సమయంలో నందిపేట నుంచి మరో రోగి పక్షవాతం సమస్యతో ఆస్పత్రికి వచ్చాడు. దగ్గు, దమ్ము ఉండటంతో కోవిడ్ లక్షణాలు ఉన్నాయని భావించిన వైద్యులు.. చికిత్స చేసేందుకు ఉపక్రమించేలోపే అతనూ ప్రాణాలొదిలాడు. గంటల వ్యవధిలోనే నలుగురు మృతి చెందడంతో ఆస్పత్రిలో కలకలం రేగింది. కాగా, ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడంతోనే ముగ్గురు మృతి చెందారని వారు బంధువులు ఆందోళనకు దిగారు. రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఐసీయూలో సాంకేతిక సమస్య ఏర్పడి ఆక్సిజన్ సరఫరా శాతం తగ్గిపోయిందని, వైద్యసిబ్బంది ఆక్సిజన్ సరఫరాను పునరుద్ధరించడానికి మూడు గంటల పాటు ఆలస్యం కావడంతో ముగ్గురు మృతి చెందారని వారు ఆరోపించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆస్పత్రి ఎదుట పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆక్సిజన్ లోపం కాదు: కలెక్టర్ జనరల్ ఆస్పత్రిలో ముగ్గురు కరోనా బాధితులు మృతి చెందిన ఘటనలో ఆక్సిజన్ సరఫరా లోపం ఏమీ లేదని కలెక్టర్ నారాయణ రెడ్డి స్పష్ట చేశారు. మృతుల బంధువులు చేస్తున్న ఆరోపణ ల్లో వాస్తవం లేదన్నారు. ఆస్పత్రిలో రోగులకు మె రుగైన వైద్య సేవలు అందుతున్నాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కాగా, కరోనాతో చికిత్స పొందుతూ మృతి చెంది న ముగ్గురికి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయని, పరిస్థితి విషమించి చనిపోయారని ఆస్పత్రి సూప రింటెండెంట్ నాగేశ్వర్రావు వివరణ ఇచ్చారు. -
కరోనా: నిజామాబాద్ ఆసుపత్రిలో కలకలం
సాక్షి, నిజామాబాద్ : కరోనాతో ఒకేసారి నలుగురు వ్యక్తులు మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కలకలం సృష్టిస్తోంది. ఒకరు ఆక్సిజన్ అందక మృతిచెందినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే అతడు చనిపోయారని మృతుడి కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటివరకు కరోనా కారణంగా 9 మంది మృతి చెందారు. అయితే ఒకేసారి నలుగురు చనిపోవడంతో ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై పలు అనుమానులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా ఆసుపత్రిని కలెక్టర్ నారాయణ రెడ్డి సందర్శించారు. నలుగురు కరోనా బాధితులు ఒకేసారి ఎలా చనిపోయారన్న దానిపై వివరాలు ఆరా తీశారు. బాధిత కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. నిందితులను శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా పోలీసులతో ఆసుపత్రి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
పేదల పెద్దాస్పత్రి
ప్రైవేట్ ఆస్పత్రులపై ఆధారపడే పరిస్థితి నుంచి తప్పించి.. ప్రతీఒక్కరికీ మెరుగైన వైద్యం అందిస్తూ.. ఎందరో మన్ననలు పొందుతూ.. ఉమ్మడి జిల్లాలోని పేదలకు పెద్దదిక్కుగా మారింది జిల్లా జనరల్ ఆస్పత్రి. మూడు విభాగాల్లో వైద్యం అందించే స్థాయి నుంచి.. కాలానుగుణంగా అత్యాధునిక సీటీస్కానింగ్, డిజిటల్ ఎక్స్‌రే, అన్ని రకాల ల్యాబ్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఆస్పత్రి ఏర్పడి నేటికీ మూడేళ్లు పూర్తయింది. పాలమూరు: మహబూబ్‌నగర్ జిల్లా జనరల్ ఆస్పత్రి ఏర్పాటు చేసి మూడేళ్లు పూర్తి చేసుకొని నాలుగో సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. దవాఖానాకు అనుబంధంగా ఉన్న వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ కోర్సులో ప్రతీ సంవత్సరం 150 సీట్ల చొప్పున ఎంసీఐ నుంచి గత నాలుగు సంవత్సరాలుగా అనుమతి లభిస్తోంది. ప్రస్తుతం ఎంబీబీఎస్ కోర్సులో 178 సీట్లకు అనుమతి వచ్చింది. ఆస్పత్రిలో మొదట్లో 350 పడకలతో ప్రారంభమై, ప్రస్తుతం 650 పడకలతో రోగులకు సేవలు అందజేయడం జరుగుతుంది. త్వరలో రెండు నుంచి మూడు నెలల్లో తొమ్మిది వందల పడకలు ఏర్పాటు చేయనున్నారు. ఈ మధ్యే ప్రత్యేకంగా ఎంసీహెచ్ బిల్డింగ్, ట్రామా కేర్ బిల్డింగ్, ఆధునిక తెలంగాణ డయోగ్నస్టిక్స్ ల్యాబ్ బిల్డింగ్, ఆధునిక లేబర్ రూమ్, 20 పడకల ఐసీయూతో పాటు పాలియేటివ్ డే కేర్ సెంటర్, తలసేమియా డే కేర్ సెంటర్, హీమోఫీలియా డే కేర్ సెంటర్, డయాలసిస్ సెంటర్, క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ మొదలైన సౌకర్యాలతో పాటు వైద్య కళాశాల ఏర్పడటం మూలంగా ఈఎన్టీ, డెర్మటాలజీ, సైకియాట్రీ, ఫోరెన్సిక్, జనరల్ సర్జరీ, పాథాలజీ, బయో కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ, రేడియాలజీ విభాగాలు పని చేస్తున్నాయి. అన్ని రకాల సేవలు మెరుగు గతంలో వైద్యవిధాన పరిషత్‌లో ఈ ఆస్పత్రిలో క్యాజువాలిటీ, స్త్రీ సంబంధ వ్యాధులు, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, ఆప్తమాలజీ, బ్లడ్ బ్యాంక్, డెంటల్ సైన్సెస్ లాంటి విభాగాలు మాత్రమే పని చేసేవి. జనరల్ ఆస్పత్రి ఏర్పాటు తర్వాత 16విభాగాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం సగటున ప్రతి రోజూ 1,600 నుంచి 1,800 మంది ఓపి చికిత్స పొందుతున్నారు. ఈ ఏడాది 1,32,518 మంది దవాఖానాలో అడ్మిషన్ పొంది చికిత్స తీసుకున్నారు. అదేవిధంగా 12,63,480 మంది ఓపీ సేవలు పొందారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 27,770 మందికి ప్రసవాలు చేయగా, 67,524 మందికి వివిధ రకాల ఆపరేషన్లు చేశారు. 15,52,259 మంది వివిధ రకాల లాబొరేటరి పరీక్షలు చేయించుకున్నారు. వీరిలో 5,70,674 రోగులు బయోకెమిస్ట్రీ, 6,12,996 రోగులు పాథాలజీ, 21,6245 రోగులు మైక్రోబయాలజీ పరీక్షలు చేయించుకున్నారు. రేడియాలజీ విభాగంలో 92,730 మంది ఎక్స్ రే సేవలు, 92,623 మంది అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్షలు, 49,586 మంది ఈసీజీ సేవలు, 19,690 మంది సిటీ స్కాన్ సేవలు పొందారు. గతంలో మూడు విభాగాలే జిల్లా ఆస్పత్రి ఉన్న సమయంలో కేవలం మూడు విభాగాలు జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనిక్ మాత్రమే అందుబాటులో ఉండేవి. జనరల్ ఆస్పత్రి ఏర్పాటు తర్వాత 16విభాగాలు అందుబాటులోకి వ చ్చాయి. దీంట్లో కీలక విభాగాలు పని చేస్తున్నాయి. ము ఖ్యంగా మూడు ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేసుకు న్నాం. ప్రస్తుతం 650పడకలతో సేవాలు అందుతున్నాయి మరో రెండు నెలల్లో 900పడకలకు పెంచుతున్నాం.100పడకలకు అవసరమైన ఆక్సిజన్ ఆస్పత్రిలో అందుబాటులో ఉంది. క్యాజువాలిటీలో 25పడకలకు పెంచాం. గతంలో నిత్యం ఓపీ 400వరకు ఉంటే ప్రస్తుతం 1800పైగా ఉంటుంది. అదేవిధంగా 500నుంచి 600మంది రోగులు ఆడ్మిట్లో ఉంటున్నారు.– డాక్టర్ రామకిషన్,జనరల్ ఆస్పత్రి సూపరిటెండెంట్ అత్యాధునిక పరికరాలు డెంగీ రోగగ్రస్తులు త్వరగా కోలుకోవటానికి ప్లేట్ లెట్స్‌లను ఓకే దాత నుంచి గ్రహించటానికి రూ.30 లక్షల విలువైన ఎస్డీపీ (సింగిల్ డోనార్ ప్లేట్ లెట్స్ )మెషిన్ అందుబాటులో ఉంది. ప్లేట్ లెట్స్ అందించే ఈ ప్రక్రియలో రోగులకు రూ.30 వేల విలువ చేసే కిట్ ఉపయోగిస్తారు. దవాఖానాలో గల డయాలసిస్ కేంద్రంలో 10,271 సార్లు వివిధ మూత్రపిండాల వైఫల్య రోగులు డయాలసిస్ సేవలు పొందారు. పాలియేటివ్ డే కేర్ సెంటర్ లో క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు అయినా 7,498 మందికి గత మూడు సంవత్సరాలుగా సేవలు పొందుతున్నారు. తలసేమియా వ్యాధికి 180 మంది రోగులు రక్త మార్పిడి చేయించుకుని సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. అదేవిధంగా హిమోఫీలియా వ్యాధికి 266 మందికి ఖరీదైన వైద్యం పేదలకు అందుబాటులోనికి వచ్చింది. పాముకాటుకు 1,141 మంది వైద్య సేవలు పొంది మెరుగయ్యారు. వీరిలో కేవలం ముగ్గురు మాత్రమే చనిపోయినారు. కుక్కకాటుకు 10, 829 మంది రెబిస్ రాకుండా వ్యాక్సిన్ తీసుకున్నారు. -
పేదవాళ్లైతే పరిస్థితేంటి ?
పలమనేరు: ‘నేను ప్రభుత్వ ఉద్యోగి గనుక ఎలాగో ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకుంటా.. ఇదే పరిస్థితుల్లో పేదవాళ్లెవరైనా ప్రభుత్వాస్పత్రి మీద నమ్మకంతో వస్తే వారి పరిస్థితేంటి ?’ అని పలమనేరు మండలంలోని కొలమాసనపల్లి హాస్టల్ వార్డెన్ మధుసూధన్‌రెడ్డి స్థానిక ఏరియా ఆస్పత్రి వైద్యుల తీరుపై స్పందించిన తీరు. శనివారం ఉదయం పలమనేరులో ఉంటున్న మధుసూదన్‌రెడ్డి భార్య నేత్రకు ప్రసవనొప్పులు రావడంతో స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆమెను పరిశీలించిన వైద్యులు తొలికాన్పు సిజేరియన్ కావడంతో రెండోకాన్పు ఆపరేషన్ చేయాల్సిందేనని చెప్పారు. అందుకు అతను సరే అన్నాడు. అయితే ఆపరేషన్ చేసేందుకు తమవద్ద రక్తం లేదని చెప్పారు. అప్పటికే నొప్పులు ఎక్కువ కావడంతో చేసేదిలేక అతను తన భార్యను హుటాహుటిన హొసకోటలోని ఓ ప్రైవేటు నర్సింగ్‌హోంకు తీసుకెళ్లగా అక్కడి వైద్యులు సిజేరియన్ చేశారు. అందుకుగానూ రూ.లక్ష దాకా ఖర్చు అయినట్లు బాధితుడు మధుసూదన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి మరో పేదవాడికి రాకుండా చూడాలని ఆయన మీడియాకు తెలిపారు. ఈ విషయంపై ఆస్పత్రి సూపరింటెండెంట్ వీణాకుమారిని సాక్షి వివరణ కోరగా వాళ్లు ఆస్పత్రికి రాగానే కరోనా టెస్ట్ చేయాలన్నారని, దీంతో కాదన్నామని తెలిపారు. తమ ఆస్పత్రిలో రక్తం లేదని అందుకే డ్యూటీ డాక్టర్ చిత్తూరుకు రెఫర్ చేశారన్నారు. ప్రసవ నొప్పులతో ఈ ఆస్పత్రికి వచ్చేవారికి రెఫర్లు మాత్రం తప్పడం లేదు. డీసీహెచ్ఎస్, జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే వెంకటేగౌడ సైతం ఈ విషయమై ఇక్కడి వైద్యులను పలుమార్లు హెచ్చరించినా ప్రయోజనం లేకుండా పోతోంది. -
వైద్యుల నిర్లక్ష్యం: బాలుడి మృతి
లక్నో: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రాణాలు కాపాడే వైద్యులే నిర్లక్ష్యం వహించడంతో ఓ చిన్నారి మృతి చెందాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కానౌజ్ నగరంలో చోటు చేసుకుంది. తీవ్రమైన జ్వరం, మెడ భాగంలో వాపు ఉన్న బాలుడుని కానౌజ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి ఆదివారం సాయంత్రం ఆ బాలుడి తల్లిదండ్రులు తరలించారు. కానీ అక్కడి వైద్యులు కనీసం బాలుడికి ఏం అయిందని తెలుసుకోకుండా ఇక్కడ చికిత్స అందించలేము కాన్పూర్‌లోకి ఆస్పత్రికి తీసుకువెళ్లమని చెప్పారు. దీంతో దిక్కుతోచని బాలుడి తల్లిదండ్రులు ఆశాదేవి, ప్రేమ్ చంద్ తమ పిల్లవాడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని చికిత్స అందించాలని పలుమార్లు వైద్యులను కోరారు. ఆస్పత్రిలోని ఉన్నకొంతమంది ఈ ఘటనను మోబైల్ ఫోన్లో చిత్రీకరించారు. దీంతో తమ పిల్లవాడికి ఏం అయిందని వైద్యులు చూశారని అంతకు ముందు కనీసం తాకడానికి కూడా ఇష్టపడలేదని బాలుడి తల్లిదండ్రులు తెలిపారు. ఆస్పత్రికి తీసుకువచ్చిన 30 నిమిషాల తర్వాత వైద్యులు సరిగా పట్టించుకోకపోవటంతో బాలుడు మృతి చెందాడని తల్లిదండ్రులు అవేదన వ్యక్తం చేశారు. (ఇసుక వివాదం: తండ్రీ, కొడుకుల హత్య..) ‘నేను పేదవాడిని మా బాలుడిని కనీసం తాకకుండా కాన్పూర్‌లోని ఆస్పత్రికి తీసుకువెళ్లండని వైద్యులు అన్నారు. నా దగ్గర డబ్బులేదు. నేను ఏం చేయాగలను. కేవలం ఆస్పత్రి వైద్యులు నిర్లక్ష్యం కారణంగా మా చిన్నారి మృతి చెందాడు’ అని తండ్రి ప్రేమ్‌చంద్ తెలిపారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదే విధంగా దీనిపై కనౌజ్ ప్రభుత్వ అధికారి రాజేష్ కుమార్ మీశ్రా స్పందిస్తూ.. చిన్నారిని వైద్యులు అత్యవసర వార్డుకు చేర్చారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉందని చైల్డ్ స్పెషలిస్ట్‌ను కూడా పిలిచారు. కానీ, తీసుకువచ్చిన 30 నిమిషాలల్లో బాలుడు మృతి చెందాడు. వైద్యులు తమ వంతు ప్రయత్నం చేశారు. కానీ, బాలున్ని రక్షించలేకపోయారు. వైద్యులు ఎటువంటి నిర్లక్ష్యం వహించలేదు’ అని తెలిపారు. (వీళ్లు మనుషులు కాదు రాక్షసులు) -
చనిపోయారని చెప్పి చేతికిచ్చారు..
చింతూరు: పురిటి నొప్పులు ఆగకుండానే ఆ గర్భిణికి గుండె ఆగే మాట చెప్పారు.. పుట్టబోయే ఇద్దరు శిశువుల్లో ఒకరు చనిపోయారని అనడంతో ఆమె దుఃఖానికి అవధులు లేవు.. చివరికి శస్త్రచికిత్స చేసిన వైద్యులు ఇద్దరూ చనిపోయారంటూ కవర్లో ఆ శిశువులను పెట్టి ఇవ్వడం మరింత కలచివేసింది.. కొన్ని గంటల తర్వాత ఆ కవర్లో ఓ శిశువు కదుతుందని బంధువులు చెప్పడంతో బతికి ఉన్నట్లు నిర్ధారించుకుని వైద్యానికి ఏర్పాట్లు చేశారు.. ఈ ఘటన తెలంగాణలోని భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. దీనికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆ గర్భిణి బంధువులు ఆరోపిస్తున్నారు. వారు తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. చింతూరు మండలం నరిసింహాపురం గ్రామానికి చెందిన ముచ్చిక సునీత, రవీందర్ దంపతులు. సునీత ఆరు నెలల గర్భిణి. శుక్రవారం ఆమెకు నొప్పులు రావడంతో చింతూరులోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరీక్షించి భద్రాచలం ఏరియా ఆసుపత్రికి రిఫర్ చేయడంతో శుక్రవారం రాత్రి అక్కడికి తరలించారు. ఆ ఆసుపత్రిలో ఆమెను పరీక్షించిన సిబ్బంది స్కానింగ్ తీయించాలని చెప్పడంతో స్కానింగ్ చేయించి వైద్యుడికి చూపించారు. దానిని పరిశీలించిన ఆయన కవల పిల్లల్లో ఓ బిడ్డ చనిపోయిందని శస్త్రచికిత్స చేసి చనిపోయిన బిడ్డను తీయకపోతే ఇన్ఫెక్షన్ సోకుతుందని చెప్పడంతో గర్భిణి బంధువులు ఒప్పుకున్నారు. శనివారం ఉదయం 8 గంటలకు వైద్యుడు శస్త్రచికిత్స చేసిన చనిపోయిన ఆడబిడ్డతో పాటు, మరో మగబిడ్డను కూడా బయటకు తీసి ఇరువురు చనిపోయారంటూ కవర్లో పెట్టి ఇచ్చారని సునీత మామయ్య సింగయ్య తెలిపారు. సునీతకు డెలివరీ అనంతరం బాలింతలను ఉంచే వార్డులో ఉంచడంతో పాటు చనిపోయినట్లు చెప్పిన బిడ్డలను కూడా అక్కడే కవర్లో ఉంచారు. మధ్యాహ్నం 12 గంటలకు సునీత బాబాయ్ సీతారామయ్య భోజనం తీసుకొచ్చి ఏం జరిగిందని అడగడంతో ఇద్దరు శిశువులు చనిపోయారని వైద్యులు చెప్పి కవరులో పెట్టి ఇచ్చారని చూపించింది. దీంతో ఆయన దగ్గరికి వెళ్లి కవర్లను చూడగా అందులో ఒక బిడ్డ కదలడంతో వెంటనే వైద్యులకు విషయం తెలిపారు. స్పందించిన వారు వెంటనే ఆ బిడ్డను హుటాహుటిన ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయమై ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చావా యుగంధర్ వివరణ ఇస్తూ శుక్రవారం రాత్రి వారు భద్రాచలం ఏరియా ఆసుపత్రికి వచ్చారని, స్కానింగ్‌లో చనిపోయిన బిడ్డ ఉందని గుర్తించామన్నారు. బయట కూడా స్కానింగ్ చేయించాలని చెప్పామన్నారు. ఆ స్కానింగ్‌లో కూడా అలాగే ఉందని, దానివల్ల తల్లికి, మరో బిడ్డకు ఇన్ఫెక్షన్ సోకుతుందని చెప్పి శనివారం ఉదయం డెలివరీ చేసి బయటకు తీశామన్నారు. మరో బిడ్డ పరిస్థితి కూడా బాగోక పోవడంతో ఆ బిడ్డను కూడా తీసి తల్లిదండ్రులకు అప్పగించామన్నారు. పుట్టినప్పుడు రెండో బిడ్డకు శ్వాస లేదని, అంతేకాక శిశువు బరువు 500 గ్రాములు ఉండటంతో కష్టమని చెప్పి తమ సిబ్బంది వారికి సూచించారన్నారు. రెండో బిడ్డను వారు బయటకు తీసుకెళ్లారని, తిరిగి తీసుకొచ్చి ఇక్కడే ఉంచి ట్రీట్మెంట్ చేయమనడంతో చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఇద్దరూ చనిపోయారని అన్నారు ఉదయం 8 గంటలకు కాన్పు చేసి కవలలను తీశారు. ఇరువురూ చనిపోయారని చెప్పి కవర్లో పెట్టి ఆసుపత్రి సిబ్బంది అప్పగించారు. 12 గంటల సమయంలో నేను సునీతకు భోజనం తీసుకొని వచ్చి ఏం జరిగిందని ప్రశ్నించడంతో కవర్లో ఉన్న శిశులను చూపించింది. దగ్గరకు వెళ్లి చూడగా అందులో మగ శిశువు కదులుతుండటం గమనించి సిబ్బందికి తెలపడంతో వారు ఇంక్యూబేటర్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇది ముమ్మాటికి వైద్యుల నిర్లక్ష్యమే. –కాకా సీతారామయ్య, సునీత బాబాయ్ -
కరోనా: రోగుల పేర్లు ఒకేలా ఉండటంతో...
గువాహటి: పేర్లు ఒకేలా ఉండటం.. మాస్కులు ధరించడంతో కరోనా నుంచి కోలుకున్న పేషంట్‌కు బదులు యాక్టివ్ పేషంట్ ఒకరు డిశ్చార్జ్ అయిన ఘటన అస్సాంలోని దరంగ్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని మంగళదోయి ప్రభుత్వాస్పత్రిలో గురువారం జరిగిన ఈ పొరపాటుతో ఆస్పత్రి యాజమాన్యంతో పాటు, ప్రజలు హడలిపోయారు. పేర్లలో గందరగోళం కారణంగానే కరోనా నుంచి కోలుకున్న వ్యక్తి బదులు.. వైరస్ యాక్టివ్ పేషంట్‌ను డిశ్చార్జ్ అయ్యారని ఆస్పత్రి యాజమాన్యం శనివారం వెల్లడించింది. కరోనా నుంచి కోలుకున్న 14 మంది పేర్లను ఆస్పత్రి సిబ్బంది పిలిచారు. దాంతో తన పేరు కూడా పిలిచారనుకుని ఓ కోవిడ్ యాక్టివ్ పేషంట్ స్పందించాడు. దానికితోడు రోగి మాస్కుతో ఉండటంతో.. వైద్య సిబ్బంది అతన్ని పొరపాటుగా డిశ్చార్జ్ చేశారు. అయితే, తమ తప్పు తెలుసుకున్న ఆస్పత్రి యాజమాన్యం సదరు పేషంట్‌ను అదే రాత్రి అంబులెన్స్‌లో తిరిగి ఆస్పత్రికి రప్పించింది. కాగా, శుక్రవారం నిర్వహించిన కోవిడ్ పరీక్షల్లో సదరు పేషంట్‌కు నెగటివ్‌గా రిపోర్టు వచ్చిందని ఆస్పత్రి యాజమాన్యం తెలిపింది. మరలా అతన్ని డిశ్చార్జ్ చేశామని పేర్కొంది. (చదవండి: ఆఫ్రిది కోలుకోవాలి.. అంతకంటే ముందుగా: గౌతీ) ఇక ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని దరంగ్ డిప్యూటీ కమిషనర్ దిలీప్‌కుమార్ బోరా తెలిపారు. తప్పుగా డిశ్చార్జ్ అయిన వ్యక్తి ఇంటిని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. అతని కుటుంబ సభ్యుల స్వాబ్ నమూనాలను కోవిడ్ పరీక్షల కోసం పంపామని చెప్పారు. ఇదిలాఉండగా.. అస్సాం వ్యాప్తంగా 3,600 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వాటిలో 2 వేల కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 8 మంది మృతి చెందారు. (చదవండి: ఇకపై కరోనా లక్షణాల్లో ఇవి కూడా..) -
బెజవాడ గ్యాంగ్‌వార్ కేసు.. పోలీసుల హైఅలర్ట్
సాక్షి, విజయవాడ: పటమటలో జరిగిన గ్యాంగ్ వార్‌లో మృతిచెందిన రౌడీషీటర్ సందీప్ మృతదేహానికి వైద్యులు సోమవారం పోస్టుమార్టం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాసుపత్రి వద్ద పోలీసులు అలర్ట్ ప్రకటించారు. అలర్లు జరగకుండా ముందుస్తుగా ఆసుపత్రి ఆవరణలో భారీ గేట్లు ఏర్పాటు చేశారు. మార్చురీ వద్దకు ఎవరిని కూడా పోలీసులు అనుమతించడం లేదు. ఆసుపత్రి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. (సందీప్‌కు టీడీపీ నేతల అండదండలు..) రూ.2 కోట్ల విలువైన స్థలం విషయంలో ఆదివారం ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘర్షణలో తీవ్రంగా గాయపడిన సందీప్ చికిత్స పొందుతూ మృతిచెందారు. మరణాయుధాలతో ఇరువర్గాలు దాడులు చేసుకోగా, ఆసుపత్రిలో మరో ఐదుగురు చికిత్స పొందుతున్నారు. ఘర్షణకు పాల్పడిన వ్యక్తుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆరు ప్రత్యేక బృందాలను విజయవాడ సీపీ ఏర్పాటు చేశారు. పండు గ్యాంగ్‌లో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
స్థానికులే చేతులు కట్టేశారు
సాక్షి, విశాఖపట్నం/పెదవాల్తేరు (విశాఖ తూర్పు): నర్సీపట్నంలోని ప్రభుత్వాస్పత్రిలో మత్తు వైద్యుడిగా పనిచేస్తూ సస్పెండైన డాక్టర్ సుధాకర్ శనివారం సాయంత్రం మద్యం సేవించి స్థానికులు, పోలీసులపై దురుసుగా ప్రవర్తించడంతో స్థానికులే చేతులు కట్టేశారని అడిషనల్ డీజీపీ, విశాఖ నగర పోలీస్ కమిషనర్ రాజీవ్‌కుమార్ మీనా ఆదివారం మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. డాక్టర్ సుధాకర్‌పై 353, 427 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు డాక్టర్‌ను లాఠీతో కొట్టారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశామని చెప్పారు. వైద్యుల పరిశీలనలో సుధాకర్ డాక్టర్ సుధాకర్ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారని ప్రభుత్వ మానసిక ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాధారాణి తెలిపారు. ఆదివారం ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ఆయన ‘ఎక్యూట్ హ్యాండ్ యాడ్ కామెంట్ సైకోసిస్’ సమస్యతో బాధపడుతున్నారని చెప్పారు. ఇదిలావుండగా, డాక్టర్ సుధాకర్ తల్లి కావేరిభాయి ఆస్పత్రి వద్ద మీడియాతో మాట్లాడుతూ.. తన కుమారుడిపై అన్యాయంగా పిచ్చివాడిగా ముద్ర వేశారని ఆరోపించారు. -
అనస్థీషియా వైద్యుడి వీరంగం
సాక్షి, అమరావతి/విశాఖపట్నం/సీతమ్మధార (ఉత్తర): నర్సీపట్నం అనస్థీషియా (మత్తు) వైద్యుడు సుధాకర్ మరోసారి వీరంగమాడారు. జాతీయ రహదారిపై కారు ఆపి నానా హంగామా సృష్టించారు. పోలీసులు చెప్పిన వివరాల మేరకు.. నర్సీపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో మత్తు డాక్టర్‌గా విధులు నిర్వర్తిస్తూ ఇటీవల సస్పెన్షన్‌కు గురైన డాక్టర్ సుధాకర్ శనివారం సాయంత్రం మర్రిపాలెం నుంచి బాలయ్యశాస్త్రి లేఅవుట్లోని తన ఇంటికి వెళుతున్నారు. మార్గంమధ్యలో పోర్టు ఆస్పత్రి వద్ద జాతీయ రహదారిపై తన కారాపి స్థానికులను, ఆటో డ్రైవర్లను దుర్భాషలాడటం ప్రారంభించారు. దీంతో వారు 100కు ఫోన్ చేయడంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా వినకుండా వారిపై తిరగబడ్డాడు. చొక్కా విప్పి నడిరోడ్డుపై పడుకుని పోలీసుల్ని, స్థానికుల్ని, ప్రజాప్రతినిధుల్ని నోటికొచ్చినట్టు తిట్టడం ప్రారంభించారు. డాక్టర్ ప్రవర్తనను వీడియో తీస్తున్న హెడ్ కానిస్టేబుల్ రమణ చేతిలోంచి సెల్‌ను లాక్కుని రోడ్డుకేసి కొట్టారు. వైద్యుడిని అదుపు చేసేందుకు పోలీసులు అతని చేతులను తాళ్లతో కట్టారు. మద్యం మత్తులో ఉన్నట్టు అనుమానించి ఎమ్ఎల్సీ చేయించడం కోసం కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ రక్త నమూనాలు సేకరించి వైద్యులు రిఫర్ చేయడంతో ప్రభుత్వ మానసిక వైద్యశాలకు తరలించినట్టు ఈస్ట్ ఏసీపీ కులశేఖర్ చెప్పారు. వైద్యుడిపై 353 సెక్షన్ కింద కేసు నమోదు చేశామని, డాక్టర్‌ను లాఠీతో కొట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసినట్టు సీపీ ఆర్కే మీనా చెప్పారు. నిందితులను అరెస్ట్ చేయాలి: చంద్రబాబు విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్‌పై జరిగిన దాడి.. దళితులపై దాడి, వైద్య వృత్తిపై దాడి అని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఒక ప్రకటనలో తెలిపారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని కోరారు. -
శభాష్ అనిపించుకున్న ఐఏఎస్ అధికారిణి
రాంచీ : ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎంతో మంది తాపత్రయపడతారు.. కానీ ప్రభుత్వ విద్యా సంస్థల్లో తమ పిల్లలను చదివించరు. అందరికి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కావాలి.. కానీ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లడానికి మాత్రం నామోషీగా భావిస్తారు. ఈ తంతు సమాజంలో ఎప్పటి నుంచో పాతుకు పోయి ఉన్నదే. అయితే ఓ ప్రభుత్వ ఉద్యోగిణి మాత్రం ఇందుకు భిన్నంగా నిలిచింది. ఐఏఎస్ అధికారిగా ఉన్న ఓ మహిళ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించింది. ప్రభుత్వాస్పత్రిలో నవ శిశువుకు జన్మనిచ్చి అందరితో శభాష్ అనిపించుకుంటున్నారు. ఈ సంఘటన జార్ఖండ్ జిల్లాలో చోటు చేసుకుంది. రాష్ట్రంలోని గొడ్డ జిల్లాలో కిరణ్ కుమార్ పాసి అనే మహిళ జిల్లా కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల గర్భవతి అయిన ఆమె ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవించాలని నిర్ణయం తీసుకున్నారు. తాజాగా పురిటి నొప్పులు రావడంతో ముందుగా నిర్ణయించుకున్నట్లే ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లకుండా సర్కారు దవాఖానకు వెళ్లి అక్కడ తన బిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం కిరణ్ కుమార్, తన బిడ్డతో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్లు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక నుంచి అయినా ప్రభుత్వ ఆసుపత్రిలపై ప్రజలకు నమ్మకం పెరిగి వారిలో మార్పు తీసుకొస్తుందని ఆశిస్తున్నట్లు కామెంట్ చేస్తున్నారు. కాగా ఈ విషయంపై డాక్టర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని, ఐఏఎస్ అధికారి డెలవరీ కోసం ప్రభుత్వ ఆసుపత్రికి రావడం గర్వంగా ఉందన్నారు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ వ్యవస్థలో మార్పులు తీసుకు రావడానికి దోహదపడుతుందని డాక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు మరో మహిళ ఐఏఎస్ అధికారి నాన్సీ సహేతో సహా అనేక మంది అధికారులు ఆసుపత్రికి చేరుకుని కిరణ్ కుమార్‌ను అభినందిస్తున్నారు. -
ఆపరేషన్ చేస్తుండగా టిక్‌టాక్!
-
వికటించిన మాత్రలు
ధర్మపురి/జగిత్యాల: జగిత్యాల జిల్లా ధర్మపురిలో సోమవారం నులిపురుగుల మాత్రలు (ఆల్బెండజోల్) వికటించి ఓ చిన్నారి మృతి చెందింది. మరో 11 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని న్యూ హరిజనవాడకు చెందిన మారుతి, రజిత దంపతుల కూతురు సహస్ర (8) స్థానిక కేరళ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. మధ్యాహ్నం ఇంటికొచ్చిన చిన్నారికి తల్లి భోజనం తినిపించి పక్కనే ఉన్న అంగన్వాడీ కేంద్రంలో నులి పురుగుల మాత్ర వేయించేందుకు తీసుకెళ్లింది. ఆశ వర్కర్ ఇచ్చిన మాత్రను అక్కడే వేయకుండా చిన్నారి చదివే పాఠశాలకు తీసుకెళ్లింది. మాత్ర వేశాక తరగతి గదికి పంపించింది. మధ్యాహ్నం 1.12 గంటలకు సహస్రకు ఫిట్స్ రావడంతో వెంటనే ఉపాధ్యాయులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పాప అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా, మాత్ర వికటించే తన కూతురు మృతి చెందిందని తల్లి రజిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ధర్మపురి ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. రోదిస్తున్న బాలిక తల్లి రజిత మరో 11 మందికి అస్వస్థత: ధర్మపురిలోని వివిధ పాఠశాలల్లో వేసిన నులి పురుగుల మాత్రలు వికటించి 11 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వారిని ధర్మపురి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వై ద్యం అందిస్తున్నారు. అస్వస్థతకు గురైన వారిలో శ్రీచైతన్య భారతి వి ద్యానికేతన్కు చెందిన ఏడుగురు, విద్యాభారతి పాఠశాలకు చెందిన నలుగురు ఉన్నారు. జైనా గ్రామంలోని ఓ పాఠశాలకు చెందిన 8 మంది విద్యార్థులు భయంతో ఆస్పత్రికి చేరి పరీక్షలు చేయించుకున్నారు. నివేదిక వస్తేనే తెలుస్తుంది ఆల్బెండజోల్ మాత్ర ప్రమాదకరమైంది కాదు. విద్యార్థిని సహస్ర అంతకు పూర్వం భోజనం చేసింది. ఈ మాత్రం సైతం పూర్తిగా వేసుకోలేదు. వేసిన వెంటనే బయటకు ఉమ్మేసింది. నివేదిక వస్తేనే వివరాలు తెలుస్తాయి. – శ్రీధర్, డీఎంహెచ్‌వో, జగిత్యాల -
10 రోజుల్లోనే 1000 పడకల ఆస్పత్రి నిర్మాణం
బీజింగ్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు అందించే చికిత్స ఏమాత్రం వేగంగా ఉంటుందో అక్కడికి వెళ్లివచ్చిన వారిని ఎవరిని అడిగినా వెంటనే చెప్పేస్తారు. ప్రభుత్వ ఆస్పత్రుల తీరుపై ఎప్పుడూ ఏదో ఒక విషయం మనం నిత్యం వింటూనే ఉంటాం. అలానే ప్రభుత్వ ఆసుపత్రుల నిర్మాణం కూడా ఏళ్లు గడిచినా పూర్తి కాకుండా నిర్లక్ష్యంగా సాగుతూ ఉంటాయి. అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటుంది. కానీ.. చైనాలో మాత్రం 1000 పడకల గదిని ఏకంగా 10 రోజుల్లోనే నిర్మించాలని నిర్ణయించారు. ఇంత పెద్ద ఆస్పత్రిని కేవలం ఇంత తక్కువ సమయంలో పూర్తి చేయడం అంటే సాహసమనే చెప్పాలి. దీని కోసం ఆ దేశం అందుబాటులో ఉన్న టెక్నాలజీని వాడుకోవడం విశేషం. (చైనాలో కరోనా కల్లోలం) దేశాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు ఓ వైపున ప్రయత్నిస్తూనే, పెరుగుతున్న రోగులను ఒకే చోట ఉంచి చికిత్సను అందించే దిశగా చైనా కీలక నిర్ణయం తీసుకుంది. శ్రామిక శక్తి అపారంగా ఉన్న చైనా, కేవలం పది రోజుల్లో 1000 పడకల సామర్థ్యమున్న భారీ ఆసుపత్రిని నిర్మించాలని నిర్ణయించింది. ఇప్పటికే వందలాది జేసీబీలు పునాదుల పని ప్రారంభించాయి. ప్రీ ఫ్యాబ్రికేటెడ్ విధానంలో ఈ భవంతి నిర్మాణం సాగనుండగా, పనులు రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ విషయాన్ని అధ్యక్షుడు జీ జిన్ పింగ్ స్వయంగా వెల్లడించారు. ఇదిలావుండగా.. చైనాలో ప్రజలు కరోనా వైరస్ పేరు వింటేనే తీవ్ర ఆందోళనకు గురవుతున్న పరిస్థితి. అనేక ఆసుపత్రుల్లో బయట టెంట్లు వేసి వ్యాధిగ్రస్తులకు చికిత్సను అందిస్తున్నారు. కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య రోజు రోజుకు అనూహ్యంగా పెరుగుతోంది. ఇప్పటివరకూ కరోనా మృతుల సంఖ్య 80కి చేరింది. మరోవైపు సుమారు 3000మంది ఈ వైరస్ బారిన పడినట్లు అధికారులు వెల్లడించారు. వారిలో 300మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు చైనా సర్కార్ పేర్కొంది. -
గర్భిణీని 6 కి.మీ. మోసిన జవాన్లు
రాయ్‌పూర్: నిండు గర్భిణీని సీఆర్పీఎఫ్ జవాన్లు సుమారు 6 కిలోమీటర్లు మోసుకుంటూ తీసుకెళ్లి ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని మూరుమూల పల్లె పడెడలో మంగళవారం జరిగింది. 85వ బెటాలియన్‌కు చెందిన జవాన్లు ఆమెను మంచంపై మోసుకుంటూ వెళ్లినట్లు అధికారులు తెలిపారు. పెట్రోలింగ్‌లో భాగంగా ఆ గ్రామనికి వెళ్లిన జవాన్లకు.. గ్రామస్తులు ఆమె గురించి చెప్పారు. వెంటనే వైద్య సహాయం అవసరం అని చెప్పడంతో ఆమెను మంచంపై మోసుకుంటూ బిజాపూర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె వైద్య పర్యవేక్షణలో ఉందని అధికారులు తెలిపారు. -
చనిపోయిందని వదిలేసి వెళ్లారు!
కర్నూలు (హాస్పిటల్): అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలకు ఏదైనా అనారోగ్యం కలిగితే విలవిల్లాడిపోతాం. అలాంటిది ఓ పదేళ్ల బాలిక అనారోగ్యంతో చనిపోతే.. మృతదేహాన్ని ఆసుపత్రిలోనే వదిలేసి వెళ్లారు కుటుంబసభ్యులు. వివరాల మేరకు.. కర్నూలు జిల్లా నందికొట్కూరుకు చెందిన లావణ్య (10)కు ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆమె తండ్రి భాస్కర్, తాత కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చేర్పించారు. పాప కోలుకోకపోవడంతో గురువారం రాత్రి మృతి చెందింది. అప్పటికే తండ్రి అక్కడి నుంచి వెళ్లిపోగా.. చనిపోయే వరకు ఉన్న తాత కూడా మృతదేహాన్ని ఆసుపత్రిలోనే వదిలేసి మెల్లిగా జారుకున్నాడు. ఆసుపత్రి సిబ్బంది ఈ విషయాన్ని అవుట్‌పోస్టు పోలీసులకు తెలిపారు. పేషెంట్ రిజిస్టర్లో నమోదైన వివరాలను బట్టి పోలీసులు బాలిక కుటుంబసభ్యుల కోసం ఆరా తీస్తున్నారు. మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచారు. -
ఇది గుజరాత్ ‘కోటా’
తల్లిదండ్రుల అవగాహనారాహిత్యమో, పౌష్టికాహారం అందించని ప్రభుత్వ వైఫల్యమో, సరిగా చికిత్స అందించని ఆస్పత్రుల నిర్లక్ష్యమో, డిసెంబర్లో పెరిగిన చలి వలనో.. కారణమేదైనా వీటికి మూల్యం శిశువులు చెల్లిస్తుండగా, కన్నవారికి కడుపుకోత మిగిలిస్తున్నాయి. రాజస్తాన్‌లోని ఆస్పత్రిలో ఒకే నెలలో 100 మందికిపైగా శిశువులు మరణించారంటూ వచ్చిన గణాంకాలు మరువక ముందే గుజరాత్‌లోని రెండు ఆస్పత్రులలో కలిపి అంతకు రెట్టింపు మరణాలు నమోదైనట్లు వచ్చిన గణాంకాలు వేదనను కలిగిస్తున్నాయి. అహ్మదాబాద్: గుజరాత్‌లోని రాజ్‌కోట్ జిల్లాలో డిసెంబర్ నెలలో 111 మంది శిశువులు మృత్యువాత పడినట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీనితో పాటు అహ్మదాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో 88 మంది శిశువులు మరణించినట్లు ఆరోగ్యశాఖ మంత్రి నితిన్ పటేల్ వెల్లడించారు. ప్రజల్లో అవగాహన లేమి, పౌష్ఠికాహారలోపం, చలితీవ్రత ఈ మరణాలకు కారణాలని ఆయన అన్నారు. రెండు దశాబ్దాలతో పోలిస్తే మరణాల సంఖ్య పెరిగిందన్నారు. డాక్టర్ల కొరత ఉందని, ఇది దేశవ్యాప్త సమస్య అని పేర్కొన్నారు. 2017 లెక్కల ప్రకారం గుజరాత్‌తో పోలిస్తే బెంగాల్, కర్ణాటక, జార్ఖండ్ రాష్ట్రాల్లో శిశు మరణాల రేటు ఎక్కువగా ఉందని తెలిపారు. ఈ వ్యవహారంపై మాట్లాడాల్సిందిగా ముఖ్యమంత్రి విజయ్ రూపానీని మీడియా కోరగా సమాధానం ఇవ్వలేదు. శిశుమరణాల గణాంకాలు.. రాజ్‌కోట్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో గత డిసెంబర్లో 388 మంది శిశువులు చేరగా, వారిలో 111 మంది మరణించారు. అహ్మదాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో డిసెంబర్లో 415 మంది శిశువులు చేరగా, వారిలో 88 మంది మరణించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్ శిశుమరణాలు ప్రభుత్వాన్ని కలచివేయడం లేదా అని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అమిత్ చావ్దా ప్రశ్నించారు. రెండు ఆస్పత్రుల్లోనే 200 మంది మరణించారని, రాష్ట్రంలోని మొత్తం ఆస్పత్రులను కలిపితే ఇంకా ఎక్కువే ఉంటాయన్నారు. -
సర్కారుకు జరిమానా..!
భువనేశ్వర్: రక్త మార్పిడి తప్పిదం పట్ల రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. బాధిత వర్గానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.3 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ పరిహారం చెల్లించేందుకు కమిషన్ 2 నెలల గడువు మంజూరు చేసింది. శనివారం రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శికి ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. కెంజొహార్ జిల్లా ప్రధాన ఆస్పత్రిలో ఈ ఘోర తప్పిదం 2016 వ సంవత్సరం డిసెంబరులో జరిగింది. ఈ తప్పిదంతో నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయినట్లు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ విచారం వ్యక్తం చేసింది. రక్త మార్పిడిని పురస్కరించుకుని కెంజొహార్ జిల్లా ప్రధాన ఆస్పత్రి వర్గాల తప్పిదంతో సుఖాంతి నాయక్ (45) అనే మహిళ అకాల మరణానికి గురైంది. కెంజొహార్ పాత బస్తీ హడొబొంధొ సాహిలో ఉంటున్న సుఖాంతి నాయక్ ఉన్నత చికిత్స కోసం ఈ ఆస్పత్రి మెడిసిన్ వార్డులో 2016వ సంవత్సరం డిసెంబరు 13వ తేదీన భర్తీ అయింది. ఆమెకు ఒక యూనిట్ రక్త మార్పిడి చేపట్టాలని వైద్యులు సలహా ఇచ్చారు. ఈ సలహా మేరకు ఆమె భర్త వీరేంద్ర నాయక్ ఆస్పత్రి ఆవరణలో ఉన్న రక్త నిధి నుంచి లేబొరేటరీ వర్గాలు ఇచ్చిన 1 యూనిట్ రక్తం తీసుకుని సంబంధిత నర్సుకు అందజేశాడు. ఈ రక్తం మార్చిన కాసేపటికే ఆయన భార్య సుఖాంతి నాయక్ ఆకస్మికంగా కన్నుమూసింది. ఈ సంఘటనపై ఆరా తీయగా తప్పుడు గ్రూపు రక్తం మార్చడంతో ఈ ముప్పు సంభవించినట్లు తేలింది. కావలసిన గ్రూపు రక్తం బదులుగా వేరే గ్రూపు రక్తం ఎక్కించడంతో ప్రాణాలు కోల్పోయినట్లు ఖరారైంది. విధుల నుంచి ఇద్దరు సిబ్బంది తొలగింపు ఈ విషాద సంఘటనపై జిల్లా ప్రధాన వైద్య అధికారి నిర్వహించిన విచారణలో ఇద్దరు సిబ్బంది బాధ్యులుగా తేలింది. ఈ సిబ్బందిని విధుల నుంచి బహిష్కరించారు. రక్త నిధి లేబొరేటరీ టెక్నిషియన్ భారతి మహంత తప్పిదం, విధి నిర్వహణలో స్టాఫ్ నర్సు హేమాంగిని మహంత నిర్లక్ష్యంతో చికిత్స కోసం విచ్చేసిన మహిళ మృతి చెందినట్లు నివేదిక వెల్లడించింది. కెంజొహార్ జిల్లా ప్రధాన ఆస్పత్రిలో ఒకే పేరుతో (సుఖాంతి నాయక్) ఇద్దరు వేర్వేరు మహిళా రోగులకు ఒకేసారి రక్త మార్పిడి చేయాల్సి వచ్చింది. ఆస్పత్రి మెడిసిన్, గైనకాలజీ వార్డుల నుంచి రక్త నిధికి రెండు యూనిట్ల రక్తం ఏర్పాటుకు అభ్యర్థనలు జారీ చేశారు. గైనకాలజీ వార్డు రోగికి అ గ్రూపు రక్తం, మెడిసిన్ వార్డు రోగికి వేరే గ్రూపు రక్తం అవసరాల కోసం అభ్యర్థించగా పంపిణీ దశలో ఈ రెండు గ్రూపుల రక్తం తారుమారైంది. ఈ తప్పిదాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా స్టాఫ్ నర్సు హుటాహుటిన మెడిసిన్ వార్డులో ఉన్న రోగికి మార్చడంతో అకస్మాత్తుగా మరణించినట్లు జిల్లా ప్రధాన వైద్యాధికారి స్పష్టం చేశారు. ఈ తప్పిదం పట్ల రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్వచ్ఛందంగా స్పందించి చొరవ తీసుకుంది. -
పొట్టలో గుడ్డముక్క.. ప్రాణాలు విడిచిన మహిళ
సాక్షి, చెన్నై : డాక్టర్ల నిర్లక్ష్యం ఓ బాలింత ప్రాణాలను బలిగొంది. గర్భిణికి సిజేరియన్ చేసిన వైద్యులు గుడ్డముక్కను ఆమె పొట్టలోనే ఉంచి కుట్లు వేశారు. దీంతో తీవ్ర అనారోగ్యం పాలైన మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందారు. మృతురాలి భర్త తెలిపిన వివరాల ప్రకారం.. ‘కడలూర్ జిల్లా విరుదాచలం ప్రభుత్వాస్పత్రిలో ప్రియా(24)కు సిజేరియన్ చేసిన వైద్యులు ఆడ శిశువుకు పురుడు పోశారు. అయితే, మూడు రోజుల అనంతరం ప్రియా అనారోగ్యం పాలైంది. కడుపులో తీవ్రమైన నొప్పిగా ఉందని చెప్పింది. నా భార్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులకు చెప్పినా స్పందించలేదు’అని రాజ్‌కుమార్ ఆరోపించారు. ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో తన భార్యను పుదుచ్చేరిలోని జవహర్లాల్ ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (జిప్మెర్)కు తరలించామని రాజ్‌కుమార్ వెల్లడించాడు. అక్కడ చికిత్స పొందుతూ ప్రియా ప్రాణాలు విడిచిందని అతను కన్నీరుమున్నీరయ్యాడు. ప్రియా పొట్టలో గుడ్డముక్క ఉండటం వల్లే చనిపోయిందని జిప్మెర్ డాక్టర్లు చెప్పారని ఆయన తెలిపాడు. కాగా, విరుదాచలం ప్రభుత్వాస్పత్రి వైద్యుల నిర్వాకంపై రాజ్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. తమిళనాడు ఆరోగ్యశాఖ ఈ ఘటనపై స్పందించింది. నివేదిక సమర్పించాలని విరుదాచలం ప్రభుత్వ ఆస్పత్రికి ఆదేశాలు జారీ చేసింది. -
క్యూలో నిల్చుని.. నేలపై కూర్చుని..
నిజామాబాద్ అర్బన్: శుక్రవారం ఉదయం 8 గంటలు.. ఓ వ్యక్తి సైకిల్‌పై సాదాసీదాగా సర్కారు దవాఖానాకు వచ్చాడు. ‘జలధార’వద్దకు వెళ్లి లీటర్ నీటికి ధర ఎంత? అని ఆరా తీశాడు. ఓపీ విభాగం వద్ద రోగులతో పాటే లైన్లో నిల్చుని మాట కలిపాడు. మెట్ల దగ్గర కింద కూర్చొని.. ఏం పెద్దయ్యా.. ఆరోగ్యం బాగా ఉందా అని అడిగాడు. వైద్యులు బాగానే చూస్తున్నారా..? అని అడిగి తెలుసుకున్నాడు. అక్కడి నుంచి గైనిక్, జనరల్ తదితర విభాగాల్లోనూ కలియ తిరిగాడు. అయితే, గంట తర్వాత ఆస్పత్రిలో ఒక్కసారిగా హడావుడి మొదలైంది. వచ్చిన వ్యక్తి కలెక్టర్ అని తెలియడంతో వైద్యులు, సిబ్బంది ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ఉరుకులు పరుగులు పెట్టారు. అప్పటి దాకా తమతో మాట్లాడిన వ్యక్తి కలెక్టర్ అని తెలిసి రోగులు, వారి బంధువులు అవాక్కయ్యారు. నిజామాబాద్ కలెక్టర్ సి.నారాయణ రెడ్డి శుక్రవారం ఉదయం జిల్లా కేంద్ర ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ జిల్లాకు బదిలీపై వచ్చి మూడు రోజులవుతోంది. తాను బస చేసిన ఆర్అండ్బీ అతిథి గృహం నుంచి సైకిల్‌పై బయలుదేరి ఉదయం ఎనిమిది గంటలకల్లా ఆస్పత్రికి చేరుకున్నారు. పార్కింగ్‌లో సైకిల్ స్టాండ్ వేసి మొదట ఆస్పత్రి ఆవరణలో జలధార కేంద్రానికి వెళ్లారు. లీటరు మంచినీరు రెండు రూపాయలకు విక్రయించడాన్ని గుర్తించారు. రూపాయికే విక్రయించాలి కదా అని అడగ్గా.. నిర్వాహకుడు రెండు రూపాయలే అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. అక్కడి నుంచి ఆస్పత్రిలోని ఓపీ విభాగం వద్ద రోగులతో పాటే లైన్లో నిల్చుని మాట కలిపారు. వారి ఆరోగ్య సమస్యలేంటో తెలుసుకున్న ఆయన.. వైద్యులు బాగానే చూస్తున్నారా.. సౌకర్యాలు సరిగా ఉన్నాయా..? అని అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి గైనిక్, జనరల్ తదితర విభాగాల్లో కలియ తిరిగాడు. బాలింతలతో మాట్లాడారు. నాలుగైదు చోట్ల మెట్ల వద్ద, వార్డుల వద్ద కింద కూర్చొని రోగులతో మాట్లాడారు. ఓ రోగి బంధువును తనతో పాటు తీసుకుని వెళ్లి వార్డులను తనిఖీ చేశారు. జనరిక్ మందుల షాపులను పరిశీలించారు. వార్డు బాయ్‌లు, నర్సులు, సెక్యూరిటీ గార్డులతో మాట్లాడారు. ఆరోగ్యశ్రీ శిబిరం వద్ద వివరాలు తెలుసుకున్నారు. అయితే.. గంట తర్వాత ఆస్పత్రిలో ఒక్కసారిగా హడావుడి మొదలైంది. కలెక్టర్ వచ్చాడని తెలియడంతో వైద్యులు, సిబ్బంది అలర్ట్ అయ్యారు. అప్పటి దాకా తమతో మాట్లాడిన వ్యక్తి కలెక్టర్ అని తెలిసి రోగులు, వారి బంధువులు సంభ్రామాశ్చర్యానికి లోనయ్యారు. 111 సిబ్బందికి మెమోలు కలెక్టర్ మూడు గంటల పాటు తనిఖీలు నిర్వహించి వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. విధుల్లో గైర్హాజరైన 111 మంది సిబ్బందికి మెమోలు జారీ చేశారు. జలధార కేంద్రాన్ని సీజ్ చేశారు. -
అచ్చంపేట ఆస్పత్రిలో దారుణం
అచ్చంపేట రూరల్: వైద్య నిర్లక్ష్యానికి తల్లి కడుపులోని బిడ్డ కడుపులోనే కన్నుమూసింది. మరికొద్ది నిమిషాల్లో భూమ్మీదకు రావాల్సిన గర్భస్థ శిశువు రెండు ముక్కలై ప్రాణాలు విడిచింది. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రభుత్వ సివిల్ ఆస్పత్రిలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఓ గర్భిణికి వైద్యులు సాధారణ ప్రసవం చేస్తుండగా శిశువు తల భాగం మొండెం నుంచి వేరుపడిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం అచ్చంపేట మండలం నడింపల్లికి చెందిన సాయిబాబు భార్య స్వాతి ఈ నెల 18న ఉదయం ప్రసవం కోసం అచ్చంపేట ప్రభుత్వ సివిల్ ఆస్పత్రిలో చేరింది. గర్భిణి రిపోర్టులను పరిశీలించిన అనంతరం అదే రోజు ఉదయం 11 గంటలకు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ తారాసింగ్, వైద్యులు సుధారాణి, సిరాజుద్దీన్ ఆమెకు సాధారణ ప్రసవం చేసేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే తీవ్ర రక్తస్రావం అవుతుండటం, శిశువు తలభాగం బయటకు కనిపించడంతో బయటకు లాగేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. ఆ సమయంలో మొండెం నుంచి తల వేరుపడగా మొండెం మాత్రం గర్భిణి కడుపులోనే ఉండిపోయింది. అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచిన వైద్యులు శిశువు పొట్ట నీరుతో నిండి ఉండటంతో బయటకు రావట్లేదని, మెరుగైన వైద్యం కోసం వెంటనే హైదరాబాద్ ఆసుపత్రికి వెళ్లాలని రెఫర్ చేశారు. అప్పటికే గర్భిణి పరిస్థితి విషమించింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన హైదరాబాద్‌లోని జజ్జిఖాన ఆస్పత్రికి తరలించారు. గురువారం ఆ ఆస్పత్రి వైద్యులు ఆపరేషన్ చేసి మృత శిశువును బయటకు తీశారు. శిశువు తలభాగం లేకపోవడం చూసి వారు ఆశ్చర్యపోయారు. విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పారు. కోపోద్రిక్తులైన కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం అచ్చంపేట ప్రభుత్వ సివిల్ ఆస్పత్రి వైద్యులతో వాగ్వాదానికి దిగారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందని ఆరోపిస్తూ ఆస్పత్రిలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. తమకు విషయం చెప్పకుండా పరిస్థితి విషమంగా ఉందని హైదరాబాద్ ఆసుపత్రికి రెఫర్ చేశారని మండిపడ్డారు. హైదరాబాద్ తీసుకెళ్లాకే తెలిసింది.. బాధితురాలి భర్త సాయిబాబు మాట్లాడుతూ ప్రైవేట్ ఆస్పత్రిల్లో తన భార్యకు పరీక్షలు చేయించినప్పుడు అందరూ బాగానే ఉందన్నారని చెప్పారు. అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు మాత్రం తన భార్యకు సీరియస్‌గా ఉందని చెప్పడంతోనే హైదరాబాద్‌కు తీసుకెళ్లామన్నారు. కానీ అక్కడ ఆపరేషన్ చేసిన తర్వాత డాక్టర్లు చెబితేనే శిశువుకు తల లేని విషయం తెలిసిందన్నారు. తల్లి ప్రాణం కాపాడటానికే రెఫర్ చేశాం.. తల్లి గర్భంలో శిశువు పొట్ట లావుగా ఉందని రిపోర్టులలో చూశాక తెలిసిందని, ఆ విషయం కుటుంబ సభ్యులకు ముందుగానే చెప్పామని వైద్యులు సుధారాణి, తారాసింగ్ చెప్పారు. స్కానింగ్ రిపోర్టులో కూడా శిశువు బరువుగా ఉందని కుటుంబ సభ్యులకు చెప్పామన్నారు. మహిళకు మొదటిసారి అబార్షన్ జరగ్గా ప్రస్తుతం రెండో కాన్పుకు ఆస్పత్రికి వచ్చిందన్నారు. గర్భంలోని శిశువు తలభాగం మెత్తగా ఉండటంతోనే లాగే సమయంలో బయటకు వచ్చిందని చెబుతున్నారు. కాగా, శిశువు తల భాగం అచ్చంపేట ప్రభుత్వ సివిల్ ఆస్పత్రి పరిసరాల్లోనే ఉందని స్థానికులు అంటున్నారు. కలెక్టర్ విచారణ.. ఇద్దరిపై వేటు ఈ సంఘటనపై నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఇన్చార్జి డీఎంహెచ్ఓ సుధాకర్లాల్ విచారణ చేపట్టారు. శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఆస్పత్రిలోనే ఉన్న కలెక్టర్... ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది, బాధిత కుటుంబ సభ్యులతో వేర్వేరుగా మాట్లాడి వివరాలు సేకరించారు. అనంతరం కలెక్టర్ ఆదేశాల మేరకు ఘటనలో నిర్లక్ష్యం వహించిన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ తారాసింగ్, డాక్టర్ సుధారాణిని సస్పెండ్ చేస్తూ డీఎంహెచ్ఓ ఉత్తర్వులు జారీ చేశారు. -
బిడ్డ కంట చెమ్మ.. గాయమైనా వచ్చింది అమ్మ..
షాద్‌నగర్‌టౌన్: రోడ్డు ప్రమాదంలో తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలియని 8 నెలల చిన్నారి ఆకలితో రోదిస్తోంది. విషయాన్ని గుర్తించిన ఆ తల్లి గాయాలను సైతం లెక్క చేయకుండా.. బిడ్డకు పాలిచ్చింది. ఈ దృశ్యం మంగళవారం షాద్‌నగర్ బైపాస్ జాతీయ రహదారిపై ఉన్న చటాన్‌పల్లి బ్రిడ్జి సమీపంలో కనిపించింది. దిశ హంతకుల ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశాన్ని చూసేందుకు డ్రైవర్ లారీని అపుతుండగా.. అదే సమయంలో హైదరాబాద్ నుంచి కొత్తకోట వైపు వెళ్తున్న టాటా ఏస్ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. కొత్తకోటకు చెందిన శాంతి టాటా ఏస్ వాహనంలో తన 8 నెలల కూతురితో ప్రయాణం చేస్తోంది. ఈ ప్రమాదంలో శాంతికి తీవ్ర గాయాలయ్యాయి. యాక్సిడెంట్ అయిన సమయంలో చిన్నారి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి ఆకలితో రోదించింది. దీంతో శాంతి రోడ్డు పక్కనే పడుకొని బిడ్డకు పాలిచ్చి ఆకలి తీర్చింది. ఘటనా స్థలంలో ఉన్న మీడియా ప్రతినిధులు రోడ్డు ప్రమాదం జరిగిన విషయాన్ని గుర్తించి క్షతగాత్రులను బయటికి తీశారు. గాయపడిన వారిని పోలీసులు షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ఆసరా ప్రారంభించిన సీఎం జగన్
సాక్షి, గుంటూరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా శస్త్ర చికిత్స చేయించుకున్న రోగులకు వైద్యం అనంతరం విశ్రాంతి కాలానికి డబ్బు చెల్లించే వైఎస్సార్ ఆరోగ్య ఆసరా పథకాన్ని ఆయన సోమవారం గుంటూరు జనరల్ ఆస్పత్రిలో ప్రారంభించారు. శస్త్రచికిత్స అనంతరం వైద్యులు సూచించిన విశ్రాంతి సమయానికి రోజుకు 225 రుపాయలు లేదా నెలకు గరిష్టంగా 5వేల రూపాయలను ఈ పథకం ద్వారా అందజేస్తారు. రోగులకు ఈ తరహా చేయూత అందించడం దేశంలో ఇదే ప్రథమం. కుటుంబ పెద్ద జబ్బపడితే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీనివల్ల ఏటా నాలుగున్నర లక్షల మంది లబ్ధిపొందుతారని ఓ అంచనా. కాగా నిన్నటినుంచే ఈ పథకం అమల్లోకి వచ్చినా ముఖ్యమంత్రి లాంఛనంగా ఇవాళ ప్రారంభించారు. అలాగే ఆరోగ్యశ్రీలో వైద్యం పొందిన రోగులు ముఖ్యమంత్రి చేతులు మీదుగా చెక్కులు అందుకున్నారు. గుంటూరు మెడికల్ కాలేజీ జింఖానా ఆడిటోరియంలో సీఎం జగన్ ప్రసంగించనున్నారు. -
ప్రభుత్వాసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్స
సాక్షి, విజయవాడ: ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు క్లిష్టతరమైన శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ప్రమాదవశాత్తు మహిళ కుడివైపు తొడలో దిగి ఎడమవైపు తుంటెలోంచి బయటకు వచ్చిన ఇనుప కమ్మెను తొలగించడంతో పాటు, దెబ్బతిన్న అవయవాలను సరిచేశారు. దీనికి 5 గంటల సమయం పట్టింది. ఇనుప కమ్మె మూడు అంగుళాల వెడల్పు, అంగుళం మందం ఉంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ.10 లక్షలు వ్యయం అయ్యే శస్త్ర చికిత్సను ప్రభుత్వ వైద్యులు ఉచితంగా నిర్వహించారు. గుంటూరుకు చెందిన మేడా ఏసమ్మ(50) అవనిగడ్డ సమీపంలోని పులిగడ్డలో ఉంటున్న తన సోదరి ఇంటికి వెళ్లింది. మంగళవారం మధ్యాహ్నం తిరుగు ప్రయాణంలో మచిలీపట్నం వెళ్లే ఆటో ఎక్కింది. ఆటో కొద్దిదూరం వెళ్లాక వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఆటోను పక్కనుంచి ఢీకొంది. బస్సు బాడీకి ఉండే ఇనుప కమ్మె ఏసమ్మ కుడివైపు తొడలో దిగి ఎడమవైపు తుంటెలో బయటకు వచ్చింది. స్థానికులు ఇనుప కమ్మెను కోసి, చికిత్స కోసం మచిలీపట్నం ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యులు విజయవాడకు తరలించారు. ఏడుగురు వైద్యులు రాత్రి 10 గంటలకు సర్జరీని ప్రారంభించి వేకువ జామున 3 గంటలకు విజయవంతంగా పూర్తి చేశారు. శస్త్ర చికిత్స విభాగాధిపతి డాక్టర్ కె.శివశంకరరావు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ మాధవి, డాక్టర్ విజయలక్ష్మి, ఆర్థోపెడిక్ వైద్యులు అయ్యప్ప, అనస్థీషియన్ డాక్టర్ నీరజ, ప్రయివేటు వైద్యులు యూరాలజిస్ట్ డాక్టర్ ధీరజ్, వస్క్యులర్ సర్జన్ డాక్టర్ శ్రీహర్ష శస్త్ర చికిత్సలో పాల్గొన్నారు. అబ్జర్వేషన్ అవసరం ఆమె యూరిన్ బ్లాడర్ పగిలిపోవడంతో పాటు, కుడివైపు తొడలో రక్తనాళాలు తెగిపోయాయి. పెల్విస్ ఎముక విరిగింది. తొలుత యూరిన్ బ్లాడర్‌ను సరిచేశాం. కుడివైపు యూరేటర్‌ను తీసి, స్టెంట్ అమర్చి బ్లాడర్‌ను సరిచేశాం. తెగిన రక్తనాళాలను అతికించడంతో పాటు, విరిగిన తుంటె ఎముకను సరిచేశారు. నాలుగు రోజులు ఇన్ఫెక్షన్ ఉండే అవకాశం ఉంది. కోలుకునేందుకు ఎక్కువ సమయం పట్టవచ్చు. – డాక్టర్ కె.శివశంకరరావు, శస్త్ర చికిత్స విభాగాధిపతి -
ఉపాధ్యాయుడి వేధింపులకు విద్యార్థిని బలి
పుల్లంపేట: ఉపాధ్యాయుడి వేధింపులు తాళలేక ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఈ దారుణ ఘటన మంగళవారం వైఎస్సార్ జిల్లా పుల్లంపేటలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. వైఎస్సార్ జిల్లా రాజంపేట పట్టణంలో నివసించే కొండపల్లి కృష్ణమూర్తి, గౌరి దంపతులు తమ కుమార్తె లక్ష్మీప్రసన్నను పుల్లంపేటలోని ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో పదో తరగతిలో చేర్పించారు. అక్కడ సైన్సు ఉపాధ్యాయుడు శివ తనను చదువు విషయమై తరచూ వేధిస్తున్నాడని లక్ష్మీప్రసన్న పలుమార్లు తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లి, కన్నీరు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో కుమార్తెను ఓదార్చేందుకు విద్యార్థిని తల్లి గౌరి మంగళవారం సాయంత్రం పాఠశాల వద్దకు వచ్చింది. సిబ్బంది అనుమతించకపోవడంతో వెలుపల వేచి ఉంది. పాఠశాల విడిచిపెట్టాక లక్ష్మీప్రసన్నను హస్టల్‌కు తీసుకెళ్లింది. దుస్తులు మార్చుకుంటానని గది లోపలికి వెళ్లిన లక్ష్మీప్రసన్న చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ప్రాణాలు విడిచింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. విద్యార్థిని ఆత్మహత్యపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
విషాదం..సంతోషం..అంతలోనే ఆవిరి
సాక్షి, హొళగుంద: మృతి చెందిన వాడు మళ్లీ జీవం పోసుకొని కదిలితే..లోకాన్ని విడిచి వెళ్లిన బాలుడి నాడి కొట్టుకుంటూ ఉంటే..రోదిస్తున్న కుటుంబ సభ్యుల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. ఆశలను బతికించుకునేందుకు వారు పడే ఆరాటం అంతా ఇంతా కాదు. కర్నూలు జిల్లా హొళగుంద మండలం సుళువాయి గ్రామంలో ఇలాంటి ఘటనే మంగళవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పింజరి పీరుసాబ్, శేఖన్‌బీకి కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడైన రహిబ్‌అలి (5) స్థానిక ప్రైవేటు పాఠశాలలో యూకేజీ చదువుతున్నాడు. ఈ నెల 27న రహిబ్ అలి అనారోగ్యంతో తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో తల్లిదండ్రులు, బంధువులు బళ్లారిలో ఓ ఆస్పత్రిలో చేర్పించారు. మంగళవారం ఉదయం బాలుడు కోలుకోలేక మృతి చెందినట్లు అక్కడి వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు సుళువాయి గ్రామానికి మృతదేహాన్ని తీసుకొచ్చారు. సాయంత్రం ముస్లిం ఆచారం ప్రకారంగా అంత్యక్రియలకు ఏర్పాట్లు చేపట్టారు. ఈ సమయంలో బాలుడి కాళ్లు కదిలాయని, శ్వాస కొద్దిగా ఆడుతుందని కొందరు గమనించి చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు ఆశతో బాలుడిని ఆలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. గ్రామస్తులు కూడా వారితోపాటు ఆస్పత్రికి వెళ్లారు. అయితే అక్కడి వైద్యలు పరీక్షించి బాలుడు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. దీంతో చేసేదేమి లేక మృతదేహాన్ని తిరిగి స్వగ్రామానికి తీసుకొచ్చారు. బతుకుతాడనుకున్న కుమారుడు మృతి చెందినట్లు తేలడంతో కుటుంబ సభ్యులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. -
బనగానపల్లె ఆసుపత్రి సామర్థ్యం పెంపు : ఎమ్మెల్యే కాటసాని
సాక్షి, కర్నూలు : బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రిని ప్రస్తుతం ఉన్న 50 పడకల నుంచి 100 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేసి ఏరియా ఆసుపత్రిగా మారుస్తున్నట్టు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తెలిపారు. ఇందుకు అవసరమయ్యే నిధులు రూ. 15 కోట్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంజూరు చేశారని పేర్కొన్నారు. గురువారం ఎమ్మెల్యే ఆసుపత్రిని సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. లక్షన్నర లీటర్ల నీటి సామర్థ్యంతో ఓవర్ హెడ్ ట్యాంక్ ఏర్పాటుతో పాటు ఇతర మౌలిక సదుపాయాల కోసం రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ప్రజల ఆసుపత్రిగా తీర్చిదిద్దే క్రమంలో సకాలంలో వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజల తరపున కాటసాని ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. -
డెంగీ భయం వద్దు: ఈటల
సాక్షి, పెద్దపల్లి : ‘వాతావరణ మార్పుల కారణంగా జ్వరాలు విజృంభిస్తున్నాయి. 99 శాతం ప్రజలు వైరల్ ఫీవర్‌తోనే బాధపడుతున్నారు. 12 జిల్లాలు తిరిగి వచ్చా.. గతంలో మాదిరిగా ఈ సారి డెంగీ ప్రభావం పెద్దగా లేదు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లాలో పర్యటించిన మంత్రి ముందుగా గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో ఎన్టీపీసీ సీఎస్ఆర్ సంస్థ రూ.7.89 కోట్ల నిధులతో చేపట్టబోయే 50 అదనపు పడకల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం పెద్దపల్లి జిల్లా కేంద్రానికి వచ్చిన మంత్రి ఈటల రాజేందర్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, వివిధ శాఖలఅధికారులతో సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో పారిశుధ్య పనులు సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా విషజ్వరాలను నివారించవచ్చని రాష్ట్ర వైద్యారోగ్యశాఖమంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ శ్రీదేవసేన, వివిధశాఖల అధికారులతో సీజనల్వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. వాతావరణ పరిస్థితులు మారినప్పుడు వైరల్ జ్వరాలు వస్తాయన్నారు. నివారణకు వైద్య,పంచాయతీరాజ్,మున్సిపల్‌శాఖల సమన్వయంతో చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా డెంగీ జ్వరాలు తగ్గుముఖం పట్టాయన్నారు. ప్రస్తుతం 99శాతం వైరల్‌జ్వరాలు మాత్రమే వస్తున్నాయని స్పష్టం చేశారు. రోగాల బారినపడ్డ వారికి నాణ్యమైన వైద్యసేవలు అందిస్తున్నట్లు పేర్కొన్న మంత్రి వైద్యసిబ్బందికి నెలరోజుల పాటు సెలవులు రద్దు చేసినట్లు వివరించారు. వందశాతం ఓడీఎఫ్ జిల్లాగా పెద్దపల్లి జిల్లాను ఓడీఎఫ్‌గా ప్రకటించుకుని, గ్రామీణ ప్రాంతాల్లోని మురికి కాల్వలను మూసివేయడం ఆ దిశగా ఇప్పటికే జిల్లా పయనించడం ఆనందంగా ఉందన్నారు. పారిశుధ్యాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు తాత్కాలిక సిబ్బందిని నియమించుకునేందుకు అవకాశం కల్పించినట్లు మంత్రి తెలిపారు.ఆశావర్కర్లు, అంగన్వాడీ, ఏఎన్ఎంల ద్వారా గ్రామాల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. దోమల నివారణకు అవసరమైన ఫాగింగ్ చర్యలను చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పేదప్రజలను ఎట్టిపరిస్థితుల్లో ప్రైవేట్ ఆసుపత్రులకు రెఫర్ చేయవద్దని స్పష్టం చేశారు. యోగా సెంటర్‌ను ప్రారంభిస్తున్న ఈటల ప్రభుత్వ సలహాలను అనుసరిస్తాం: కలెక్టర్ శ్రీదేవసేన కలెక్టర్ శ్రీదేవసేన మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలు, ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం అందిస్తున్న సలహాలను అనుసరిస్తామని పేర్కొన్నారు. ప్రజల్లో పరిసరాల పరిశుభ్రతపై అవగాహన పెంచేందుకు నాలుగు నెలలుగా ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతున్నట్లు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం జిల్లాలో కేవలం వైరల్ జ్వరాలు మాత్రమే ఉన్నాయని, ఇప్పటి వరకు జిల్లాలో 17 డెంగీ, 4 చికెన్‌గున్యా కేసులు మాత్రమే నమోదయ్యాయన్నారు. ఈ సమావేశంలో ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌నేత, జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ పుట్టమధు, ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి, పెద్దపల్లి, రామంగుండం ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, కోరుకుంటి చందర్, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రఘువీర్‌సింగ్, డీఎంహెచ్ఓ ప్రమోద్‌కుమార్ తదతరులు పాల్గొన్నారు. రూ.7.89 కోట్లతో అదనపు 50 పడకల నిర్మాణానికి శంకుస్థాపన అంతకుముందు గోదావరిఖనిలో మంత్రి ఈటల రాజేందర్ పర్యటించారు. గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో 50 అదనపు పడకల నిర్మాణం కోసం, ఎన్టీపీసీ సీఎస్ఆర్ సంస్థ రూ.7.89 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో చేపట్టబోయే పనులకు శుక్రవారం పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్‌నేత, జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ పుట్టమధు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, కలెక్టర్ శ్రీదేవసేనతో కలిసి మంత్రి ఈటల రాజేందర్ శంకుస్థాపన చేశారు.మంత్రి మాట్లాడుతూ... అవసరమైతే మరిన్ని నిధులు కేటాయించి ఆస్పత్రిని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుందామన్నారు.నిధులు కేటాయించిన ఎన్టీపీసీ అధికారులను మంత్రి అభినందించారు. అనంతరం ఆస్పత్రిలోని డయాలసిస్ కేంద్రాన్ని పరిశీలించారు. రోగులు, వారి బంధువులతో మాట్లాడారు.డయాలసిస్ పేషెంట్లకు పెన్షన్ సౌకర్యం ఇప్పించాలని వారు మంత్రికి విజ్ఞప్తి చేశారు. స్పందించిన మంత్రి వెంటనే ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతానని హామీ ఇచ్చారు. ‘ఖని’లో వైద్య కళాశాల ఏర్పాటు, మాతా శిశు కేంద్రం ఏర్పాటు, ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని, డయాలసిస్ సెంటర్‌ను విస్తరించాని, ఆస్పత్రిలో నెలకొన్ని వైద్యులు, సిబ్బంది కొరత తీర్చాలని ఎమ్మెల్యే చందర్ మంత్రికి విన్నవించారు. గర్భిణుల యోగా కేంద్రం ప్రారంభం ప్రభుత్వాస్పత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన గర్భిణీల యోగా కేంద్రం(ఆంటినెంటల్ ఎక్సెర్సైజ్ రూం)ను మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. గర్భిణులకు ఆపరేషన్లు చేయడం కన్నా, సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలని వైద్యులకు మంత్రి సూచించారు.జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్‌సింగ్, జెడ్పీటీసీలు కందుల సంధ్యారాణి, నారాయణ, మాజీ మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, ఎన్టీపీసీ డీజీఎం రమేష్, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యురాలు గోలివాడ చంద్రకళ, రాష్ట్ర వైద్య విధాన పరిషత్ జాయింట్ కమిషనర్ అశోక్‌కుమార్, డీఎంహెచ్ఓ ప్రమోద్‌కుమార్, డీసీహెచ్ఎస్ రమాకాంత్, ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. -
భర్తకు తెలియకుండా గర్భం.. దీంతో భయపడి..
సాక్షి, హిందూపురం: ప్రభుత్వాసుపత్రి బాత్రూంలో మృత శిశువు లభ్యం కావడం కలకలం రేపింది. కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిన మహిళ చుట్టూ అల్లుకున్న ఈ కథ రోజంతా గందరగోళానికి తావిచ్చింది. ఒక్కసారిగా ఏం జరిగిందో తెలియని పరిస్థితి. పోలీసుల రాకతో చిక్కుముడి వీడింది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న మహిళ.. తీరా గర్భం దాల్చే సరికి భర్తకు భయపడి ఇలా వదిలించుకున్న తీరు చర్చనీయాంశంగా మారింది. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కేశవులు, సీఐ సుబ్రమణ్యం తెలిపిన వివరాలివీ.. పట్టణానికి సమీపంలోని సేవా మందిరానికి చెందిన ఆటో చంద్ర భార్య కమలమ్మ(32) శనివారం తెల్లవారుజామున కడుపునొప్పితో స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చేరింది. డాక్టర్ రాక మునుపే బత్‌రూంకు వెళ్లిన ఆమె.. అరగంట తర్వాత రక్తపు మరకలున్న దుస్తులతో బయటకు వచ్చింది. అక్కడున్న సిబ్బంది ప్రశ్నిస్తే.. సమాధానం దాటవేసి అక్కడి నుంచి జారుకుంది. ఆ తర్వాత బాత్రూంలోకి వెళ్లిన సిబ్బంది ఓ కవర్లో చుట్టిపెట్టిన మృత శిశువును చూసి ఆందోళనకు లోనయ్యారు. వెంటనే విషయాన్ని సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కమలమ్మ ఇంటికి వెళ్లి విచారణ చేపట్టారు. మొదట బుకాయించినా.. ఆ తర్వాత అసలు విషయాన్ని వివరించింది. భర్తకు భయపడి.. చంద్ర, కమలమ్మ దంపతులకు ఐదేళ్ల కుమారుడు సంతానం. అయితే ఏడాది క్రితం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నట్లు భర్తకు చెప్పింది. ఆ తర్వాత గర్భం దాల్చడంతో ఎక్కడ భర్త కోప్పడతాడోనని దాచిపెట్టింది. ఎట్టకేలకు విషయం తెలియడంతో తొలగించుకోవాలని భర్త తేల్చిచెప్పాడు. ఆ మేరకు పలు ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. నాటు వైద్యం కూడా తీసుకుంది. ఈ కోవలోనే స్కానింగ్ చేయించుకోగా బిడ్డకు అంగవైకల్యం ఉన్నట్లు వెల్లడైంది. ఇదే సమయంలో నెలలు నిండి కడుపునొప్పి రావడంతో శనివారం తెల్లవారుజామున ఆసుపత్రిలో చేరింది. అప్పటికే అబార్షన్‌కు ఇష్టారీతిన మందులు తీసుకోవడంతో బాత్రూంకు వెళ్లిన సమయంలో మృత శిశువుకు జన్మనిచ్చింది. జరిగిన పరిణామానికి భయపడిపోయిన కమలమ్మ బిడ్డను అక్కడే వదిలించుకుని వెళ్లిపోయింది. విచారణ అనంతరం పోలీసులు మృత శిశువును కమలమ్మ దంపతులకు అప్పగించారు. -
‘ఈటెల శ్వేతపత్రం విడుదల చేస్తావా?’
సాక్షి, మంచిర్యాల: కాంగ్రెస్ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క అధ్వర్యంలో మాజీ మంత్రి శ్రీధర్ బాబు, కొక్కిరాల సురేఖ మంగళవారం మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు. అనంతరం భట్టి విక్రమార్క విలేకరులతో మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖను భ్రష్టు పట్టించిందని ఆరోపించారు. గత ప్రభుత్వాలు నిర్మించిన ప్రభుత్వ ఆస్పత్రులను, ఆరోగ్యశ్రీని ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండి పడ్డారు. 60 మంది వైద్యులు ఉండాల్సిన మంచిర్యాల ఆస్పత్రిలో కేవలం 20 మంది వైద్యులు మాత్రమే ఉన్నారన్నారు. అసలే అరకొర సేవలంటే దీనికి తోడు ఆసిఫాబాద్ జిల్లా నుంచి కూడా రోగులు ఇక్కడకే వస్తున్నారన్నారు. సరైన వసతులు లేకపోవడమే కాక రోగుల తాకిడి ఎక్కువగా ఉండటంతో మంచిర్యాల ఆస్పత్రి సిబ్బంది వారందరిని కరీంనగర్ ఆస్పత్రికి పంపుతున్నారన్నారు. ఫలితంగా మంచిర్యాల ఆస్పత్రి కేవలం రిఫరల్ ఆస్పత్రిగా మాత్రమే కొనసాగుతుందని తెలిపారు. ఆస్పత్రుల్లో శానిటేషన్ సిబ్బందికి 20 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని భట్టి విక్రమార్క ఆరోపించారు. రాష్ట్రంలో ఆస్పత్రులకు డీఎంఎఫ్టీ కింద వందల కోట్ల నిధులు ఉన్నా ప్రభుత్వం వాటిని ఖర్చు చేయకుండా కాలయాపన చేస్తోందన్నారు మాజీ మంత్రి శ్రీధర్ బాబు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సేవలు అందిస్తున్నామని గొప్పలు చెబుతోన్న ఈటెల దీనిపై శ్వేతం పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆరోగ్య శాఖను పటిష్టం చేసి మెరుగైన వైద్య సేవలు అందించకుంటే కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని శ్రీధర్‌బారు హెచ్చరించారు. -
ప్రభుత్వ ఆసుపత్రి మెట్లపై నిస్సహాయ స్థితిలో..
సాక్షి, ఖమ్మం: చావు బతుకుల మధ్య ప్రభుత్వ ఆసుపత్రి మెట్లెక్కినా వైద్యం అందక గంట సేపు రక్తం మడుగులో నిస్సహాయ స్థితిలో ఉండాల్సిన హృదయ విదారక సంఘటన ఆదివారం రాత్రి మణుగూరులోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మున్సిపాలిటీ పరిధిలోని శేషగిరినగర్‌కు చెందిన ఆనంద్ హోండా షోరూం ఎదురుగా ద్విచక్ర వాహనంపై వెళుతూ ప్రమాదానికి గురయ్యాడు. స్థానికులు క్షతగాత్రుడిని దగ్గర్లోని 100 పడకల ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి ముందు మెట్ల మీద కూర్చోబెట్టి వైద్యం కోసం వారు ప్రయత్నించారు. ఆసుపత్రిలో ఎవరూ లేకపోవడం, సమయానికి 108 అందుబాలులో లేకపోవడంతో క్షతగాత్రుడు మెట్లపైనే గంట సేపు రక్తం మడుగులోనే నరకయాతన అనుభవించాడు. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు 108లో భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన ఆసుపత్రి ప్రజలకు అందుబాటులో లేకుండా నిరుపయోగంగా ఉండటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదృష్టం కొద్ది బాధితుడు ప్రాణాపాయ స్థితి నుంచి బయట పడ్డాడు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి 100 పడకల ఆసుపత్రిలో వైద సేవలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకు రావాలని కోరుతున్నారు. -
దీనులంటే లెక్కలేదు!
సాక్షి, చీరాల: దుగ్గిరాల గోపాల కృష్ణయ్య స్మారక 100 పడకల చీరాల ప్రభుత్వాసుత్రిలో చికిత్సలు పొందే రోగులకు అక్కడ పనిచేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది వైద్య సేవలు సక్రమంగా అందించడంలేదనే ఆరోపణలు రోజురోజుకు ఎక్కువై పోతున్నాయి. వారిపై ఉన్న ఆరోపణలు అటుంచితే వివిధ ప్రమాదాల బారినపడి ఆస్పత్రిలో చికిత్సలు పొందుదామని వచ్చే క్షతగాత్రులకు, నడవలేని స్థితిలో ఉన్న బాధితులకు అక్కడ పనిచేస్తున్న సిబ్బంది కనీసం స్టెచ్చర్లు కూడా అందించలేని స్థితిలో ఉన్నారు. జిల్లా ప్రభుత్వాసుపత్రుల సమన్వయాధికారి డాక్టర్ సూరినేని ఉష గత మంగళవారం వైద్యలను, వైద్య సిబ్బందిని వైద్య సేవలు అందిస్తున్న తీరుపై ఆస్పత్రిలో విచారణ చేస్తున్న సమయంలో కూడా ఆస్పత్రికి వచ్చిన బాధితులను సిబ్బంది పట్టించుకోకపోవడం గమనార్హం. ఇటువంటి సంఘటనలు నిత్యం ఆస్పత్రిలో చోటుచేసుకుంటున్నా స్పందించే అధికారులు లేకపోవడం శోచనీయం. చీరాలకు చెందిన శంకర్ అనే వ్యక్తికి రోడ్డు ప్రమాదంలో కాలుకు దెబ్బ తగిలింది. తన బంధువుల సాయంతో ప్రభుత్వాసుపత్రిలో చికిత్సలు పొందుదామని గత మంగళవారం ఉదయం ఆస్పత్రికి వచ్చాడు. అతడు పూర్తిగా నడవలేని స్థితిలో ఉన్నాడు. ఆస్పత్రిలోకి వెళ్లే సమయంలో నేలపై దోకుతూ లోపలికి వెళ్లాడు. అతని పరిస్థితిని చూసిన ఆస్పత్రి సిబ్బంది కనీసం అతనికి స్టెచ్చర్ కానీ వీల్ చైర్ కానీ అందించలేదు. అతడు ఆస్పత్రిలోకి వెళ్లి కాలికి కట్టు కట్టించుకున్న అనంతరం లోపలికి ఏవిధంగా అయితే వెళ్లాడో బయటకు కూడా నేలపై దేకుతూ అదే విధంగా వచ్చాడు. ఈ తతంగమంతా జరుగుతున్న సమయంలో జిల్లా ప్రభుత్వాసుపత్రుల సమన్వయాధికారిణి డాక్టర్ ఉష అదే ఆస్పత్రిలో వార్డులను తనిఖీలు చేసి వైద్య సేవలపై వైద్యులను విచారిస్తున్నా ఉపయోగం లేకుండా పోయింది. మరోవ్యక్తిని కూడా... స్థానిక హైమా ఆస్పత్రి వద్ద ఆర్టీసీ బస్సు డోరు తగిలి పాత చీరాల గేటు సమీపంలో నివాసముండే సుద్దపల్లి సాయి అనేవ్యక్తికి తీవ్ర రక్త గాయాలయ్యాయి. అయితే బాధితుణ్ణి అతని స్నేహితులు చికిత్స నిమిత్తం ఆటోలో ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. ఆస్పత్రిలో పనిచేస్తున్న సిబ్బంది పట్టించుకోకపోవడంతో బాధితుణ్ణి ఆటోలో తీసుకొచ్చిన అతని స్నేహితులే అచేతనంగా.. రక్త గాయాలతో ఉన్న బాధితుణ్ణి ఆ ఇద్దరు స్నేహితులు బాధితుడి కాళ్లు, చేతులు పట్టుకొని అతి కష్టం మీదు ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డుకు తరలించి బెడ్‌పై పడుకోపెట్టారు. ఆ తర్వాతే సిబ్బంది బాధితుడి వద్దకు చేరి హడావుడిగా చికిత్సలు అందించారు. మెరుగైన వైద్యం కోసం గుంటూరు తీసుకెళ్లాలని సూచించడంతో అంబులెన్స్ కోసం బాధితుని తల్లి రత్న కుమారి పడరాని పాట్లు పడింది. చాలా సేపటి వరకు అంబులెన్స్ దొరకకపోవడంతో ఏమి చేయాలో పాలుపోని ఆమె వైద్య సిబ్బందిని విచారణ చేస్తున్న జిల్లా ప్రభుత్వాసుపత్రుల సమన్వయ కర్త డాక్టర్ ఉష వద్దకు వెళ్లి తన గోడు వెళ్లబోసుకుంది. ఆస్పత్రిలో అంబులెన్స్ సౌకర్యం లేదని ఉన్న అంబులెన్స్ కూడా పూర్తిగా పాడై పోయిందని, డ్రైవర్ కూడా లేడని డాక్టర్ ఉష బాధితుని తల్లి రత్న కుమారికి చెప్పడం విశేషం. నిరుపేదలు ఎక్కువగా చికిత్స పొందే ఇంత పెద్ద ఆస్పత్రిలో అంబులెన్స్ సౌకర్యం లేకపోవడం దారుణమని బాధితుని తల్లి దిక్కులు పిక్కటిల్లేలా రోదించింది. అయితే ఆస్పత్రి ఆవరణలో నిత్యం ఉండే 108 అంబులెన్స్ కాన్పు కోసం వచ్చిన ఓ గర్భిణిని ఒంగోలు ఆస్పత్రిలో చేర్చేందు వెళ్లిందని సిబ్బంది చెప్పడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన డాక్టర్ ఉష ఆస్పత్రి పర్యవేక్షకుని పిలిచి వివరణ తీసుకున్నారు. ప్రతినెలా ఎన్ని కేసులు ఒంగోలు పంపుతున్నారని ప్రశ్నించారు. అయితే ఎంపీ ల్యాడ్స్ ద్వారా చీరాల ప్రభుత్వాసుపత్రికి అంబులెన్స్ సౌకర్యం కల్పిస్తామని ఆమె విలేకరుల సమావేశంలో చెప్పారు. -
టీడీపీ కాసుల వేట
సాక్షి, ఒంగోలు సెంట్రల్: జిల్లాలోని ఏకైక ప్రభుత్వ స్పెషాలిటీ వైద్యశాల ఒంగోలు ప్రభుత్వ జనరల్ వైద్యశాలలో పెస్ట్ కంట్రోల్ పేరుతో గత టీడీపీ ప్రభుత్వం ప్రజల సొమ్మును కాంట్రాక్టర్లకు దోచిపెట్టింది. దీనికి ఉదాహరణగా పెస్ట్ కంట్రోల్ పేరు పెట్టి ఒక బల్లిని పట్టుకుంటే రూ.3 వేలు, ఎలుకను పట్టుకుంటే రూ.10 వేలు, పామును పట్టుకుంటే రూ.15 వేలు చొప్పున పాయింట్లు వేస్తూ కాంట్రాక్టర్‌కు కనక వర్షం కురిపించారు. ఇలా గడిచిన మూడు సంవత్సరాలుగా దాదాపు కోటిన్నరకు పైగా ప్రజా ధనాన్ని దోచిపెట్టి తమ మమకారాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం కూడా వీరే పెస్ట్ కంట్రోల్ పేరుతో నెలకు లక్షలు స్వాహా చేస్తున్నారు. గుంటూరు ప్రభుత్వ జనరల్ వైద్యశాలలో 2016లో ఓ చిన్నారిని ఎలుకలు కొరకడం, అనంతరం శిశువు మృతి చెందడంతో ఎలుకలను పట్టుకునేందుకు కాంట్రాక్టర్లను ఏర్పాటు చేసి ప్రజల సొమ్మును కాంట్రాక్టర్లకు అప్పగించేందుకు అప్పటి సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఇదే అదనుగా ఒంగోలు ప్రభుత్వ జనరల్ వైద్యశాలలో కూడా చంద్రబాబు ప్రభుత్వం పెస్ట్ కంట్రోల్ పేరుతో ఎలుకలు పట్టేందుకు చిత్తూరు జిల్లాకు చెందిన పద్మావతి అనే సంస్థకు పెస్ట్ కాంట్రాక్టును అప్పగించారు. నెల కు రూ.4 లక్షలు ఎలుకలను పట్టే దానిని బట్టి లేదా అంతకంటే కంటే ఎక్కువే ఇవ్వాలని కాంట్రాక్టులో పేర్కొన్నారు. చిత్తూరు కాంట్రాక్టర్‌కు అప్పగింత: అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరుకు చెందిన టీడీపీ నాయకుడి సంస్థ పద్మావతి పెస్ట్ కంట్రోల్ అనే పేరుతో ఒంగోలు ప్రభుత్వ జనరల్ వైద్యశాలలో పెస్ట్ కంట్రోల్ పనులను దక్కించుకుంది. ఈ కాంట్రాక్టు కింద ఆరుగురు ఉద్యోగులు రెండు షిఫ్టులలో పనిచేయాల్సి ఉండగా ప్రస్తుతం నలుగురు సిబ్బంది ఒకే షిఫ్టులో ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పని చేస్తున్నారు. వైద్యశాలలో లేని ఎలుకలు, బల్లులు, పాములు పట్టుకున్నట్లు లెక్కల్లో చూపిస్తూ లక్షలకు లక్షలు దోచుకుంటున్నారు. ఇలా ఉండగా ప్రజల సొమ్మును అప్పనంగా కాజేయడానికి అలవాటు పడిన కాంట్రాక్టర్ ప్రస్తుతం జూలైకు కాంట్రాక్టు ముగియడంతో ముందుగానే మే 22వ తేదీనే కాంట్రాక్టును మరో రెండు సంవత్సరాలు పాటూ పొడిగిస్తూ ఉత్తర్వులను తెచ్చుకున్నట్లు సమాచారం. పెస్ట్ కంట్రోల్ పేరుతో 2016 జూన్‌లో కుదుర్చుకున్న ఒప్పందం మొన్నటి జూన్‌తో ముగిసినప్పటికీ.. ఎలుకలు, బల్లులు, దోమలు, పాములు ప్రస్తుతం కూడా పడుతున్నట్లు నటిస్తూ కాంట్రాక్టరు నగదును పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దొంగ లెక్కలతో బిల్లులు స్వాహా.. వాస్తవానికి ఒంగోలు ప్రభుత్వ జనరల్ వైద్యశాలలో మొదట్లో కొన్ని పాములు ఉండేవి, అనంతరం వాటిని పట్టుకోవడంతో పాటూ జనసంచారం కూడా పెరగడంతో అవి పూర్తిగా కనుమరుగయ్యాయి. ప్రస్తుతం వైద్యశాలలో దోమలు తప్ప మరేవి కనబడటంలేదు. అయినా కాంట్రాక్టులో భాగంగా పట్టని దోమలను, ఎలుకలను, బల్లులను, పాములను లెక్కల్లో చూపించి ప్రతి నెలా బిల్లులను డ్రా చేస్తున్నారు. పెస్ట్ కాంట్రాక్టరు గత సీఎం చంద్రబాబు నాయుడు జిల్లాకు చెందిన వ్యక్తి కావడంతో అధికారులు కూడా చూసి చూడనట్లుగా వ్యవహరించారు. ఎన్ని పాయింట్లు కావాలంటే అన్ని పాయింట్లు వేసి మరీ బిల్లులు చెల్లించారు. పట్టింది వేళ్లమీద లెక్కపెట్టవచ్చు అయితే లెక్కల్లో మాత్రం వందల సంఖ్యలో బల్లులు, ఎలుకలు పట్టుకుంటున్నట్లు పేర్కొంటున్నారు. దీంతో ప్రజల సొమ్ము కాంట్రాక్టర్ల పాలైంది. సిబ్బందికి పీఎఫ్, ఈఎస్ఐ వంటివి ఏమీ సదరు సంస్థ చెల్లించడం లేదు. కేవలం నామమాత్రపు జీతం రూ.7 వేలే ఇస్తూ వస్తోంది. ఓట్ సోర్సింగ్ ఉద్యోగులకు కనీసం నెలకు రూ.12 వేల వరకూ జీతాలు చెల్లించాలని జీవోలు ఉన్నా కాంట్రాక్టర్ పట్టించుకోవడంలేదు. నలుగురు సిబ్బందే వైద్యశాల, వైద్య కళాశాల, మెడికల్ విద్యార్థుల వసతి గృహాలు, ఎస్‌ఆర్‌ల వసతి గృహాల్లో కూడా పెస్ట్ కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. కాంట్రాక్టర్ మాత్రం నెలకు రూ.4.75 లక్షలకు పైగా నగదు తీసుకుంటాడు. మార్చి 10 నుంచి మే 23 వరకూ ఎన్నికల నియమావళి అమలులో ఉన్నా అధికారులు పట్టించుకున్నట్లు కనబడటం లేదు. మే 20వ తేదీతో పెస్ట్ కంట్రోల్ కాంట్రాక్టును మరో రెండు సంవత్సరాల పాటూ పొడిగిస్తూ డీఎం ఈ ఉత్తర్వులు జారీ చేశారు. అదే ఉత్తర్వులను అడ్డుపెట్టుకుని ప్రస్తుత కాంట్రాక్టర్ పని జరిపిస్తూ లబ్ధి పొందుతున్నాడు. -
అసలేం జరుగుతోంది..?
సాక్షి చీపురుపల్లి(విజయనగరం) : చీపురుపల్లి సీహెచ్‌సీలో వింత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. జిల్లా అధికారులకు, ఇక్కడి వైద్యులకు సమన్వయం లేకపోవడం ఒకెత్తయితే, అసలు ఆస్పత్రిలో పనిచేస్తున్న సిబ్బంది ఎవరు ఏపని చేయాలో కూడా తెలియని స్థితి నెలకొంది. ఈ విషయం డీసీహెచ్ఎస్ ఉష శ్రీ ఎదుటే తేటతెల్లం కావడంతో ఆమె సైతం వైద్యులు తీరుపై అవాక్కయ్యారు. ఈ నెల 30న రాత్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళా రోగిపై అక్కడ పని చేస్తున్న శానిటరీ సూపర్వైజర్ అసభ్యకరంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. ఆయనపై కేసు కూడా నమోదైంది. దీనిపై డీసీహెచ్ఎస్ ఉషశ్రీ దర్యాప్తుకు గురువారం సీహెచ్‌సీకి వచ్చారు. ఆమెకు వైద్యులు అసభ్యకరత ప్రవర్తన విషయం అంతటిని చెప్పకుండా దాచిపెట్టారు. అంతేకాదు ఇంత పెద్ద సంఘటన జరిగితే పోలీసులకు కూడా వైద్యులు ఫిర్యాదు చేయలేదు. మీడియాలో వచ్చిన వార్తలు చూసి రాష్ట్ర అధికారులు డీసీహెచ్ఎస్కు సమాచారం ఇచ్చారు. అంతా మాయ.. మరో వింత ఏంటంటే అసభ్య ప్రవర్తనకు పాల్పడిన వ్యక్తిని 4 రోజుల ముందే తొలగించినట్లు కాంట్రాక్టర్ తనకు చెప్పాడని డీసీహెచ్ఎస్కు చెబుతుంటే, లేదు ఆ శానిటరీ సూపర్వైజర్ ఇంకా విధుల్లోనే ఉన్నాడని డాక్టర్లు చెబుతున్నారు. లేదు నాలుగు రోజుల క్రితమే సదరు సూపర్వైజర్ ఎస్‌కోట నుంచి ఇక్కడికి బదిలీపై వచ్చాడని అశోక్ అనే మరో ఉద్యోగి డీసీహెచ్ఎస్కు చెప్పాడు. ఇదంతా చూస్తుంటే ఆస్పత్రిలో నిర్లక్ష్యం ఎలా రాజ్యమేలుతుందో అర్థం చేసుకోవచ్చని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇలాంటి సంఘటన జరిగినా ఉన్నతాధికారులకు ఇక్కడి నుంచి సమాచారం వెళ్లలేదంటే ఇంకా ఎంత పెద్ద విషయం చోటు చేసుకున్నా చెప్పరేమో అంటూ ప్రజలు నిట్టూరుస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి ఆస్పత్రిని గాడిలో పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని ప్రజలు బహిరంగంగానే అనుకుంటున్నారు. గాలికొదిలేస్తారా..? దర్యాప్తు చేసేందుకు గురువారం సీహెచ్‌సీకి వచ్చిన డీసీహెచ్ఎస్ ఉషశ్రీ అక్కడి పరిస్థితులు చూసి డాక్టర్లు, సిబ్బందిపై విరుచుకుపడ్డారు. చికిత్సకు వచ్చిన రోగికి అన్యాయం జరిగితే పోలీసులకు ఫిర్యాదు చేయరా..? ఉన్నతాధికారులకు విషయం చెప్పరా..? ఇది ప్రభుత్వ ఆస్పత్రి అనుకుంటున్నారా..? లేక ప్రైవేటు ఆస్పత్రి అనుకుంటున్నారా...? సెల్ఫోన్లు చూసుకునేందుకా ఇక్కడికి మీరు డ్యూటీకి వస్తుంది అంటూ సిబ్బందిపై ప్రశ్నల వర్షం కురిపించారు. లీగల్ విషయాలు పట్టించుకోకుండా ఆస్పత్రిని గాలికి వదిలేద్దామనుకుంటున్నారా..? అందరికి మెమోలు ఇస్తాను సమాధానం చెప్పండి అంటూ మండిపడ్డారు. అనంతరం సంబంధిత రోగి, ఆమె తల్లితో మాట్లాడి విషయాలు తెలుసుకున్నారు. ఆస్పత్రిలో ఇంత పెద్ద సంఘటన జరిగి రెండు రోజులు కావస్తున్నా సమాచారం ఇవ్వకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. ఒక్కొక్కరు ఒక్కోలా.. దర్యాప్తు చేస్తున్న సమయంలో తాను ఇటీవలే బదిలీపై వచ్చానని, ఆ రోజు పాత ఆస్పత్రికి విధులను వేరొకరికి అప్పగించేందుకు వెళ్లానని ప్రధాన వైద్యాధికారి నారాయణరావు, తాను హాఫ్‌లో ఉన్నానని ఇంకో సీనియర్ డాక్టర్ మహేంద్రగిరి తెలిపారు. ఉన్నా లేకున్నా..? విషయం తెలుసుకుని అయినా ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత మీపై ఉందని డీసీహెచ్ఎస్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం పోలీసులకు అయినా చెప్పాలి కదా అని అడిగారు. ఈ విషయం ద్వారా మీకు ఎవరికీ బాధ్యత లేదని అర్థమైందని ఆమె వ్యాఖ్యానించారు. ఇకపై భద్రత ప్రమాణాలు పాటిస్తాం.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఇకపై భద్రత ప్రమాణాలు పాటిస్తాం. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, సెక్యూరిటీ గార్డులను నియమిస్తాం. చీపురుపల్లి సీహెచ్‌సీని 100 పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు పంపాం. అలా జరిగితే పోలీస్ అవుట్ పోస్టు కూడా ఏర్పడుతుంది. ఇంత పెద్ద సంఘటన ఆస్పత్రిలో జరిగితే సమాచారం ఇవ్వకపోడం, మీడియాలో వచ్చిన వార్తలను చూసి ఉన్నతాధికారులు తనను అడగడం విచారకరమైన విషయమన్నారు. ఆ శానిటరీ ఇన్స్పెక్టర్ విధుల్లో లేడని కాంట్రాక్టర్, ఉన్నాడని వైద్యులు చెబుతున్నారు. అంటే ఆస్పత్రిలో నిర్లక్ష్యం రాజ్యం ఏలుతోంది. అందరిపైనా చర్యలు ఉంటాయి. – ఉషశ్రీ, జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయ అధికారి, విజయనగరం. -
ప్రజలపై భారంలేని పాలన అందిస్తున్నాం: మంత్రి ఈటెల
సాక్షి, బిచ్కుంద(నిజామాబాద్) : ఐదేళ్ల వయసున్న రాష్ట్రం అయినప్పటికీ ఉద్యమనేత సీఎం కేసీఆర్ సంక్షేమం, అభివృద్ధిలో ముందడుగు వేస్తూ ప్రజలపై పన్ను ఇతర భారం వేయకుండా సురక్ష, సుభిక్ష పాలన అందిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మంగళవారం బిచ్కుందలో రూ. 5 కోట్లతో నిర్మించిన 30 పడకల ఆస్పత్రిని మంత్రులు ఈటల రాజేందర్, రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే హన్మంత్‌సింధే, ఎమ్మెల్సీ రాజేశ్వర్ ప్రారంభించారు. మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ తాగునీటితో ఎక్కువగా వ్యాధులు వస్తున్నాయి. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించినప్పుడే ఆరోగ్యంగా ఉంటారని భావించి సీఎం కేసీఆర్ ఆదిలాబాద్ అడవి బిడ్డల నుంచి బంజారాహీల్స్‌లో నివసిస్తున్న ప్రతి ఇంటికి మిషన్ భగీరథ స్వచ్ఛమైన నీటిని అందించారని అన్నారు. జిల్లా, డివిజన్ కేంద్రాలలో డయాలసిస్ కేంద్రాలు నెలకొల్పడంతో పేద వర్గాలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. చిన్న రాష్ట్రం ఉన్నప్పటికి మూడు సంవత్సరాల్లో కాళేశ్వరం పూర్తి చేసి ఇతరులకు సీఎం ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. 170 కిలోమీటర్లు గోదావరి నీటితో కళకళలాడుతుందన్నారు. పక్కనే ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పటికి 24 గంటలు కరెంటు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యే హన్మంత్ సింధే మంత్రిని కోరారు. మంత్రి స్పందించి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే అన్ని మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. సభలో మాట్లాడుతున్న మంత్రి ఈటల రాజేందర్ జిల్లాలో రూ.610 కోట్లతో రోడ్లు: మంత్రి ప్రశాంత్‌రెడ్డి కామారెడ్డి జిల్లాకు రూ.610 కోట్ల నిధులు వెచ్చించి గ్రామీణ ప్రాంతాలకు రోడ్ల వసతి కల్పించామని రోడ్ల భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఆస్పత్రి ప్రారంభోత్సవం అనంతరం మాట్లాడారు. ఎమ్మెల్యే హన్మంత్ సింధే పట్టుబట్టి ఒక్క జుక్కల్ నియోజక వర్గానికే రోడ్ల కోసం రూ.220 కోట్లు నిధులు మంజూరు చేయించుకున్నారని అన్నారు. జుక్కల్ నియోజక వర్గంలో కొన్ని రోడ్లు పూర్తి కాలేదని, బిచ్కుంద, జుక్కల్‌లో సెంట్రల్ లైటింగ్ కోసం ఎమ్మెల్యే కోరారని మంజూరుకు హామీ ఇస్తున్నామన్నారు. మూడు రాష్ట్రాల ప్రజలకు వైద్యం: ఎమ్మెల్యే సింధే జుక్కల్ నియోజక వర్గంలో కొత్తగా ఆస్పత్రులు నిర్మించడంతో మూడు రాష్ట్రాల ప్రజలకు వైద్యం అందుతుందని ఎమ్మెల్యే హన్మంత్ సింధే అన్నారు. మంగళవారం బిచ్కుందలో 30పడకల ఆస్పత్రిని మంత్రులు ఈటల రాజేందర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ రాజేశ్వర్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బిచ్కుందలో ప్రారంభించిన ఆస్పత్రికి, జుక్కల్‌లో 30 పడకల ఆస్పత్రి నిర్మాణంలో ఉంది వైద్యులు, స్టాఫ్ మంజూరు చేయాలన్నారు. చిల్లర్గీ, పెద్ద ఎక్లార, కొమలంచ, మహ్మదాబాద్‌లో కొత్తగా పీహెచ్‌సీలు మంజూరు చేయాలని మంత్రిని కోరారు. మద్నూర్, జుక్కల్, పిట్లం, నిజాంసాగర్‌లో రెగ్యూలర్ వైద్యులు, స్టాప్ నర్సులు, టెక్నీషియన్ లేక వైద్యం కోసం ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారని సమస్యలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. బిచ్కుందలో వంద పడకల ఆస్పత్రిని మంజూరు చేయాలని, అలాగే సోస్టుమార్డం గది, ప్రహరి, మద్నూర్‌లో 50 పడకలు, నిజాంసాగర్, పెద్దకొడప్గల్ 30 పడకలు ఆస్పత్రి కావాలని కోరారు. బిచ్కుంద, జుక్కల్‌లో సెంట్రల్ లైటింగ్, ఆయా గ్రామాల్లో రోడ్లు, నియోజక వర్గంలో 162 జీపీలు ఉన్నాయి ఒక్కో గ్రామ పంచాయతికి సీసీ రోడ్ల కోసం రూ.10లక్షల నిధులు మంజూరు చేయాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని ఎమ్మెల్యే హన్మంత్ సింధే, ఎమ్మెల్సీ రాజేశ్వర్ కోరారు. ఇద్దరు మంత్రులు స్పందించి మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి, నిజామాబాద్ జెడ్పీ చైర్మన్లు దఫెదార్ శోభా రాజు, విఠల్‌రావు, జేసీ యాదిరెడ్డి, డీఎంహెచ్‌వో చంద్రశేఖర్, ఆర్డివో రాజేశ్వర్, ఆరు మండల ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు అశోక్ పటేల్, నాల్చర్ భారతి, సర్పంచ్ శ్రీరేఖరాజు, నాయకులు వెంకట్రావు, నాల్చర్ రాజు, సాయిరాం, రాంరెడ్డి, ఎంపీటీసీలు పాల్గొన్నారు. -
ఆస్పత్రి గేట్లు బంద్.. రోడ్డుపైనే ప్రసవం..!
సాక్షి, హైదరాబాద్ : బోరబండలో దారుణం చోటుచేసుకుంది. రోగులకు నిరంతరం సేవలందించాల్సిన హాస్పిటల్‌కు గడియపెట్టి వెళ్లిన సిబ్బంది పత్తా లేకుండా పోయారు. వారి నిర్వాకంతో ఓ గర్భిణి రోడ్డుపైనే బిడ్డకు జన్మనిచ్చింది. నొప్పులు రావడంతో మరియమ్మ అనే గర్భిణి పర్వతనగర్‌లోని ప్రభుత్వాస్పత్రికి కాన్పుకోసం వచ్చింది. దవఖానాకు గేట్లు మూసి ఉండటంతో గంటసేపు బయటే పడిగాపులు కాశారు. నొప్పులు మరింత ఎక్కువ కావడంతో ఆరుబయటే ప్రసవం అయింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆస్పత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని బాధితురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. నైట్ షిప్టులో పనిచేసే సిబ్బంది సమయానికి రాకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తినట్టు తెలిసింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్టు సమాచారం. -
ప్రభుత్వ ఆస్పత్రిలో మహిళ మృతి
సాక్షి, వర్ధన్నపేట (వరంగల్) : ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం అయిన మహిళకు వైద్యం వికటించి మృతి చెందిందని ఆరోపిస్తూ గురువారం సాయంత్రం మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. అనంతరం వరంగల్– ఖమ్మం ప్రధాన రహదారిపై రాస్తారోకోకు దిగా రు. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం సిద్ధ సముద్రంకు చెందిన దారావత్ దివ్య బుధవారం ప్రసవం కోసం కుటుంబీకులు ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఆమెకు నొప్పులు రావడంతో దివ్యకు బుధవారం రాత్రి ఆపరేషన్ చేయగా ఆడ శిశువుకు జన్మనిచ్చింది. మరికొద్ది గంటల్లోనే రక్తస్రావం కావడంతో వెంటనే ఆమెను వైద్యులు వరంగల్ ఎంజీఎంకు తరలించారు. దివ్య ఎంజీఎంలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందిం ది. దీంతో దివ్య మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ మృతురాలి బంధువులు ఆస్పత్రి ఎదుట, వరంగల్–ఖమ్మం జాతీయ రహదారి పై ఆందోళనకు దిగారు. దీంతో ఇరువైపుల కిలో మీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. వెంటనే స్థానిక ఎస్సై బండారి సంపత్ సిబ్బందితో అక్కడకు చేరుకుని ఆందోళన కారులతో మాట్లాడారు. దీంతో వారు ఎస్సైతో వాగ్వివాదానికి దిగారు. వారికి నచ్చజెప్పి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
చెప్పుతో సమాధానమిచ్చినా మారలేదు
కూతురు వయస్సున్న ఓ మహిళా వైద్యురాలిని ఫోన్లో వేధింపులకు గురిచేసినందుకు చెప్పుతో సమాధానం చెప్పారు ఆమె. అయినా సరే ఆ శాఖలో కొందరు సిబ్బంది తీరులో మాత్రం మార్పు రాలేదు. ఎప్పటిలాగే వెకిలి చేష్టలు చేస్తూ సిబ్బందిని ఇబ్బందులకు గురిచేస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. దీనిపై దృష్టి సారించాల్సిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మిన్నకుండడం విమర్శలకు తావిస్తోంది. సాక్షి, చిత్తూరు అర్బన్: చిత్తూరు ప్రభుత్వాస్పత్రి ప్రాంగణంలోని జిల్లా క్షయ నివారణ శాఖ విభాగంలో ఓ మహిళా వైద్యురాలిని లైంగికంగా వేధించడం.. ప్రశ్నించడానికి వచ్చిన ఆమె తల్లిపై దాడికి ప్రయత్నించగా జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ రమేష్‌బాబును శనివారం జూనియర్ డాక్టర్ చెప్పుతో కొట్టిన విషయం తెలిసిందే. ఇదే విషయం ‘సాక్షి’ దినపత్రిలో ప్రచురితమయ్యింది. ఇంత జరిగినా ఇక్కడున్న కొందరు సిబ్బంది తీరు మారలేదు. మహిళా డాక్టర్‌కు జరిగిన అన్యాయంపై ప్రశ్నించి, ఆమెకు అండగా నిలవాల్సిన వారే ఒత్తిడి తీసుకొచ్చారు. సోమవారం యధావిధిగా మహిళా డాక్టర్ చిత్తూరులోని క్షయ నివారణ విభాగంలో విధులకు హాజరయ్యారు. ఉదయం 9 గంటలకు ఆస్పత్రికి చేరుకుని బయోమెట్రిక్ హాజరు వేయడానికి వెళ్లగా పరికరం ఉన్న గదికి తాళాలు వేసేశారు. హాజరుపట్టికలో సంతకం చేయడానికి వెళ్లగా ఆ గదిని కూడా మూసేశారు. తాళాలు తీయమని సిబ్బందిని కోరితే.. ‘మేడం ఎందుకు ఆయనతో గొడవ. జరిగిందేదో జరిగిపోయింది. మీరు ఓ పది రోజులు లీవు పెట్టి వెళ్లిపోండి. ఎవరైనా ఎన్‌క్వైరీకి వస్తే నేనేదో ఫ్రెస్టేషన్లో అలా చేశానని చెప్పండి. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి’ అంటూ మహిళా డాక్టర్‌పై ఒత్తిడి తీసుకొచ్చారు. ఘటనపై ఎవరైనా విచారణకు వస్తే అసలు ఇక్కడ ఏమీ జరగలేదని చెప్పమని కూడా బలవంతం చేశారు. తీరా మహిళా డాక్టర్ ఇందుకు అంగీకరించకపోవడంతో సిబ్బంది తాళాలు తీసి బయోమెట్రిక్, హాజరుపట్టికను బయట ఉంచారు. పనిచేసే చోట మహిళా వైద్యురాలిపై వేధింపులకు పాల్పడ్డ వైద్యుడిలో కనీస పశ్చాత్తాపం లేకపోగా కిందిస్థాయి సిబ్బందికి చెప్పి తనను మళ్లీ ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ ఆమె తన స్నేహితుల వద్ద వాపోయినట్లు తెలిసింది. మరోవైపు ఈ ఘటన జరిగిన మూడు రోజులవుతున్నా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి దీనిపై ఎలాంటి విచారణకూ ఆదేశించకుండా మిన్నకుండటం విమర్శలకు దారితీస్తోంది. జిల్లా ప్రభుత్వ వైద్యశాలల సేవల సమన్వయాధికారిణి డాక్టర్ సరళమ్మ మాత్రం ఏం జరిగిందనే విషయాన్ని మహిళా డాక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. వైద్య వృత్తికే కళంకం తెచ్చే ఇలాంటి ఘటనలు జరగడం దారుణమని జిల్లా ప్రభుత్వ వైద్యుల సంక్షేమ సంఘ అధ్యక్షుడు డాక్టర్ పాల్‌రవికుమార్ ఖండించారు. డాక్టర్ రమేష్‌బాబును సస్పెండ్ చేసి క్రిమినల్ కేసు పెట్టాలని ప్రగతిశీల మహిళా సంఘం చిత్తూరు నగర కార్యదర్శి కె.రమాదేవి డిమాండ్ చేశారు. బాధిత మహిళా డాక్టర్ మాత్రం దీనిపై వెనక్కు తగ్గేది లేదని, తనకు జరిగిన అన్యాయం ఎవరికీ జరగకుండా ఉండాలంటే వక్రబుద్ధి ఉన్న వైద్యుడిపై చర్యలు తీసుకోవాల్సిందేనని తోటి సిబ్బంది వద్ద ఖరాఖండీగా చెబుతున్నట్లు తెలిసింది. ఇదే విషయాన్ని కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడానికి వెళ్లగా ఆయన అందుబాటులో లేకపోవడంతో వెనుదిరిగి వచ్చేశారు. తాను గతంలో రాజీనామా చేసిన పత్రాన్ని ఆ వైద్యుడు మార్చి రాసుకోవడం, ఫోన్లో తనతో మాట్లాడిన అసభ్య పదాలు, దాడి జరిగిన సమయంలో తీసిన పలు వీడియో క్లిప్పింగులను నేరుగా కలెక్టర్‌కు చూపించడానికి సిద్ధమవుతున్నారు. -
‘ఓపీ’క పట్టాల్సిందే
సాక్షి, నిడదవోలు (పశ్చిమగోదావరి) : నిడదవోలు పట్టణంలో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి ఎండమావిగానే మిగిలిపోయింది. సరైన వసతులు లేక వైద్యం కోసం రోగులు క్యూలైన్లలో అవస్థలు పడాల్సివస్తోంది. భవనం పైఅంతస్తులో నాలుగు వార్డుల్లో ఇన్‌పేషెంట్లకు 30 పడకలు ఏర్పాటు చేశారు. కింద భాగంలోని 15 గదులను వివిధ విభాగాల సేవలకు కేటాయించారు. కింద భాగంలో వైద్యులు ఓపీ చూసేందుకు అవసరమైన గదులు నిర్మించకపోవడంతో రోగులు గంటల తరబడి వేచిచూడాల్సి వస్తోంది. ఆసుపత్రి స్థాయి పెంచినా పూర్తి స్థాయిలో వైద్య సదుపాయాలు లేకపోవడంతో పేదలు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. 1987లో ఈ ప్రభుత్వ ఆసుపత్రిని స్థాపించారు. అప్పటి వైద్యశాఖ మంత్రి 8 పడకల ఆసుపత్రిగా దీనిని ప్రారంభించారు. 30 పడకల ఆసుపత్రి మంజూరుకావడంతో 2016లో రూ.2.97 కోట్లతో రెండంతస్తుల పక్కా భవనాన్ని నిర్మించారు. అడ్డదిడ్డంగా భవనాన్ని నిర్మించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిడదవోలు పట్టణంతో పాటు చుట్టుపక్కల ఉన్న 46 గ్రామాల నుంచి రోజూ 150 నుంచి 200 మంది రోగులు వస్తుంటారు. ప్రతీ మంగళవారం గర్బిణీ స్త్రీలకు ప్రత్యేక సేవలు అందిస్తున్నారు. నిడదవోలు చట్టు పక్కల గ్రామాల నుంచి∙అధిక సంఖ్యలో పేద వర్గాలు వైద్య పరీక్షలకు ఇక్కడికే వస్తుంటారు. ప్రతీ నెల సుమారు 10 పాము కాటు కేసులు వస్తున్నాయి. అత్యవసర కేసులు, పురుగుమందు తాగిన కేసులు అధికంగానే నమోదవుతున్నాయి. ఇప్పటికీ మరుగుదొడ్లు లేవు 30 పడకల ఆసుపత్రి భవనాన్ని తప్ప ఓపీ కోసం వచ్చిన వారితో పాటు ఆసుపత్రి సిబ్బందికి మరుదొడ్లు నిర్మించడం మరిచిపోయారు. ఆసుపత్రి ఫ్లాన్లో మరుగుదొడ్లు లేకపోవడంతో వైద్యులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. సంబందిత కాంట్రాక్టర్, ఆసుపత్రి కమిటీ వారు పట్టించుకోకపోవడంతో వైద్యం కోసం వచ్చిన రోగులు, వారి సహాయకులు కనీసం మూత్రవిసర్జనకు ఇబ్బందులు పడుతున్నారు. తప్పనిసరి పరిస్థితిలో ఆసుపత్రి బయట రాయలవారి చెరువు వద్దకు వెళ్ళి అవసరాలు తీర్చుకుంటున్నారు. ఇంత పెద్ద భవనం కట్టి మరుగుదొడ్డి నిర్మించకపోవడంతో ఇదేక్కడి చోద్యమని ప్రజలు నిట్టూరుస్తున్నారు. వెంటాడుతున్న వైద్యులు, సిబ్బంది కొరత టీడీపీ ప్రభుత్వంలో 30 పడకల ఆసుపత్రి నిర్మించారే తప్ప, పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పూర్తిగా విఫలమయ్యారు. ఆస్పత్రిని ప్రస్తుతం వైద్యులు, సిబ్బంది కొరత వెంటాడుతుంది. దీంతో పేదలకు పూర్తి స్థాయిలో వైద్యం అందడం లేదు. నిబంధనల ప్రకారం 30 పడకల ఆసుపత్రిలో డిప్యూటీ సివిల్ సర్జన్, నాలుగు సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, డెంటల్ వైద్యుడు, చిన్నపిల్లల వైద్యుడు, హెడ్ నర్సు, ఆరుగురు స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్ట్, రేడియో గ్రాఫర్, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్, ల్యాబ్ రూం టెక్నీషియన్, డార్క్‌రూం అసిస్టెంట్, పోస్టుమార్టమ్ గది అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, నలుగురు నర్సులు ఉండాలి. వాటిలో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డిప్యూటీ సివిల్ సర్జన్ పోస్టు, రెండు సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తణుకు, రాజమండ్రి ఆస్పత్రులకు.. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులకు సరైన వైద్య సేవలు అందడం లేదు. అత్యవసర వైద్య సేవలు అందక కొన్ని సందర్భాల్లో మార్గ మధ్యంలో ప్రాణాలు గాలిలో కలసిపోతున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. కొన్నింటిని తణుకు, రాజమండ్రి ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారు. ఆసుపత్రిలో డిజిటల్ ఎక్స్‌రే మిషన్ లేకపోవడంతో ప్రమాదాలకు గురైన క్షతగాత్రులకు ఎటాంటి వైద్యం అందించాలో తెలియక వైద్యులు అయోమయానికి గురువుతున్నారు. ఎక్స్‌రే మిషన్ లేకపోవడంతో ప్రతి చిన్నదానికి బయటకువెళ్లి ఎక్స్‌రే తీయించుకుంటున్నారు. దీంతో సీరియస్ కేసులను తణుకు, రాజమండ్రి తరలిస్తున్నారు. ఆపరేషన్ థియేటర్లో సరైన సామగ్రి లేకపోవడంతో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు మాత్రమే చేస్తున్నారు. గైనకాలజిస్ట్, మత్తు వైద్యురాలు ఉండడంతో పురిటి కేసులను చూస్తున్నారు. పురుడు పోసే సమయంలో అత్యవసర వైద్య సేవలు చేసేందుకు పూర్తిస్థాయిలో ఎక్విప్మెంట్, హెడ్ నర్సు లేకపోవడంతో తణుకుకు రిఫర్ చేస్తున్నారు. జనరేటర్ పనిచేయకపోవడంతో కరెంట్ లేని సమయంలో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. నిడదవోలు ఆసుపత్రిలో ప్రధానంగా 108 సేవలు అందుబాటులో లేకపోవడంతో కానూరు, తణుకు వాహనాలు వస్తున్నాయి. ప్రతీ మూడు నెలలకు 280 పాము, కుక్కకాటు కేసులు నమోదవుతున్నాయి. రేబీస్ వ్యాక్సిన్ కొరతగా ఉంది. పాముకాటు కేసులకు సరైన చికిత్స అందడం లేదు. గదుల కొరత ఆసుపత్రుని గదులు కొరత వెంటాడుతోంది, ప్రస్తుతం ఇద్దరు రెగ్యులర్ వైద్యులు, ఇద్దరు అవుట్సోర్సింగ్ వైద్యులు ఉన్నారు. ఇంకా రెండు పోస్టులు భర్తీ చేస్తే వారికి గదులు లేక ఇబ్బందిపడాలి. పురుగు మందు కక్కించడానికి గది లేకపోవడంతో ఆసుపత్రి బయటనే ఆ పని చేయిస్తున్నారు. క్షత్రగాత్రలకు సిమెంట్ కట్టు వేయడానికి, డ్రస్సింగ్ చేయడానికి, కుట్లు వేయడానికి గదులు లేక ఇబ్బందులు పడుతున్నారు. మందులు భద్రపర్చడానికి కూడా సరైన సదుపాయాలు లేవు. పార్కింగ్ సమస్య కూడా తీవ్రంగా ఉంది. వీటిన్నింటికి తక్షణం పరిష్కారం చూపాలని రోగులు, వారి బంధువులు కోరుతున్నారు. -
ఫ్లాష్ లైట్ వెలుగులో రోగులకు వైద్యం
లక్నో : యూపీలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ఆసుపత్రిలో కరెంట్ లేకపోవటంతో సెల్‌ఫోన్ ఫ్లాష్ లైట్ వెలుగులో రోగులకు చికిత్స చేయటం విమర్శలకు దారితీసింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని శంబాల్ జిల్లాలో శుక్రవారం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం శంబాల్ జిల్లాలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో.. లో ఓల్టేజ్ కారణంగా కరెంట్ పోయింది. తరుచూ కరెంట్ వస్తూ పోతూ ఉంది. దీంతో సెల్‌ఫోన్ ఫ్లాష్ లైట్ వెలుగులోనే రోగులకు చికిత్స చేశారు వైద్యులు. చీకటి గదిలో ఆసుపత్రి సిబ్బంది, రోగుల బంధువులు సెల్ఫోన్లో ఫ్లాష్ లైట్ ఆన్ చేసి పట్టుకోగా వాటి వెలుగులో రోగులకు చికిత్స చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ కావటంతో ఆసుపత్రి వర్గాలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ సంఘటనపై చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డా. ఏకే గుప్తా మాట్లాడుతూ.. ‘‘ ఆ రోజు విపరీతంగా కురుస్తున్న వర్షాల కారణంగా కరెంట్ పోయింది. ఫ్లాష్ లైట్ వెలుగులో వాళ్లు ఎందుకు చికిత్స చేశారో తెలియటంలేదు. మేము ఆసుపత్రిలో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామ’’ని చెప్పారు. దీనిపై స్పందించిన సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్ దీపేంద్ర కుమార్.. ఆసుపత్రి అధికారులు తప్పు చేసినట్లు రుజువైతే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని తెలిపారు. -
సిబ్బంది నిర్లక్ష్యం.. ఒకే స్ట్రెచర్‌పై ఇద్దరు రోగులను..
భోపాల్ : ఇండోర్‌లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. రోగులన్న కనికరంలేకుండా ఎక్స్‌రే పరీక్షల నిమిత్తం ఇద్దరు(ఆడ,మగ) రోగులను ఒకే స్ట్రెచర్‌పై తరలించారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని కంద్వా జిల్లాకు చెందిన సంగీత అనే మహిళ కుడికాలుకు తీవ్ర గాయమైన కారణంగా కొద్దిరోజుల క్రితం ఇండోర్‌లోని మహారాజా యశ్వంతరావ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. ఈ నేపథ్యంలో ఆమె కాలుకు పరీక్షలు చేసిన వైద్యులు ఎక్స్‌రే తీయాలని సూచించారు. ఆమె నడవలేని పరిస్థితిలో ఉన్నకారణంగా స్ట్రెచర్‌పై ఎక్స్‌రే రూముకు తీసుకెళ్లాలని ఆమె భర్త ధర్మేంద్ర ఆసుపత్రి సిబ్బందిని కోరాడు. అయితే ధర్మేంద్ర వద్దని ఎంత వారించినా వినకుండా ఒకే స్ట్రెచర్‌పై సంగీతను, మరో మగ రోగిని ఆసుపత్రి సిబ్బంది ఎక్స్‌రే రూముకు తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావటంతో స్పందించిన సంబంధిత అధికారి ఎస్ఎస్ ఠాకూర్.. సంఘటన జరిగినపుడు విధుల్లో ఉన్న సిబ్బందికి, డాక్టర్లకు, నర్సులకు, వార్డ్ బాయ్‌లకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఆసుపత్రిలో స్ట్రెచర్లతో పాటు ఇతర సదుపాయాల కొరత ఉందని ఆయన పేర్కొన్నారు. -
ఇందూరంటే లోకువా!
సాక్షి, నిజామాబాద్ అర్బన్: ఇందూరు జిల్లా అంటే లోకువనో ఏమో కానీ.. కీలకమైన సమస్యలను పరిష్కరించడంలో ఇటు సర్కారు, అటు ఉన్నతాధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. జిల్లా ఆస్పత్రితో పాటు ప్రభుత్వ వైద్య కళాశాల దుస్థితిపై స్పందించడం లేదు. స్థానిక ప్రజాప్రతినిధులు సైతం పట్టించుకోవడం లేదు. ఫలితంగా వైద్య కళాశాలలో ఏడేళ్లుగా పోస్టులు భర్తీ కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. నిజామాబాద్ మెడికల్ కళాశాల కంటే ఏడాది క్రితం ప్రారంభమైన నల్లగొండ, సూర్యపేట వైద్య కళాశాలలకు ప్రభుత్వం ఇటీవల పోస్టులు మంజూరు చేసింది. అంతేకాదు తక్షణమే ఆయా పోస్టులు భర్తీ చేయాలని ఆదేశించింది. ప్రత్యేక మెడికల్ పోస్టుల ద్వారా ఆయా పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, నిజామాబాద్ వైద్య కళాశాలకు ఏడేళ్ల క్రితం మంజూరైన పోస్టుల భర్తీని మాత్రం మరిచి పోయింది. సిబ్బంది కొరత.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నిజామాబాద్‌కు ప్రభుత్వ మెడికల్ కళాశాలను మంజూరు చేశారు. 2008లో జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన వైద్య కళాశాల ఏర్పాటు చేస్తామని ప్రకటించి, తక్షణమే అమలయ్యేలా చూశారు. జీవో 150 ద్వారా కళాశాలకు 2012లో కొత్త పోస్టులను మంజూరు చేశారు. ఇందులో బోధన, బోధనేతర, పరిపాలన అధికారులు, సిబ్బంది పోస్టులున్నాయి. 150 జీవో ప్రకారం ప్రభుత్వ పరిపాలన విభాగంలో 189, ప్రిన్సిపల్ విభాగంలో 50 పోస్టులు మంజూరయ్యాయి. ఈ రెండు విభాగాలకు సంబంధించి ప్రస్తుతం 11 మంది మాత్రమే పని చేస్తున్నారు. ఇక, సూపరింటెండెంట్ విభాగంలో 15 పోస్టులకు గాను 9 మంది పని చేస్తుండగా, ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. క్లినికల్ విభాగంలో 87 పోస్టులు మొత్తం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వైద్య విద్య బోధనకు సంబంధించి అన్ని రకాల ప్రొఫెసర్లు కలిపి 311 మంది ఉండాల్సి ఉండగా, 162 మంది మాత్రమే పని చేస్తున్నారు. 149 ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తంగా 805 పోస్టులకు గాను 171 మంది పని చేస్తున్నరు.ఇక, ఆస్పత్రిలో వివిధ విభాగాలకు సంబంధించి 410 పోస్టులకు గాను 211 మంది పని చేస్తున్నారు. ఇందులోనూ కొందరిని డిప్యూటేషన్ పద్ధతిలో ఇక్కడ నియమించారు. ఎంసీఐ అనుమతి కోసం తంటాలు.. ప్రతి ఏటా ఎంసీఐ అనుమతి కోసం అధికారులు అనేక తంటాలు పడుతున్నారు. ఎంసీఐ పరిశీలనకు వస్తుందంటే అధికారులు ఆందోళన చెందుతున్నారు. కళాశాల నిర్వహణకు సంబంధించి పూర్తి స్థాయి ఉద్యోగులను చూపించాల్సి ఉంటుంది. దీంతో డిప్యూటేషన్‌పై సిబ్బందిని ఇక్కడ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఎంసీఐ అనుమతి పొందడంలో రెండుసార్లు విఫలమయ్యారు. అయినప్పటికీ పోస్టుల భర్తీకి సంబంధించి మాత్రం చర్యలు చేపట్ట లేదు. కాంట్రాక్ట్, తాత్కాలిక పద్ధతిలోనూ భర్తీ చేసేందుకు ఉన్నతాధికారులు అనుమతించడం లేదు. జిల్లా ఆస్పత్రికి అనుబంధంగా వైద్య కళాశాల ఏర్పడినప్పటి నుంచి ఓపీ రోగుల సంఖ్య రెండింతలు పెరిగింది. నిత్యం 1500 మందికి పైగా రోగులకు ఇక్కడ వైద్యం అందిస్తున్నారు. రద్దీకి అనుగుణంగా వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
రోగాలకు నిలయం
సాక్షి, నాగర్‌కర్నూల్ : జిల్లా కేంద్రంలోని పభుత్వ ఆస్పత్రి అపరిశుభ్రతకు నిలయంగా మారింది. నిత్యం పందుల సంచారంతో రోగులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. రోగుల బంధువులు వంట చేసుకునే క్రమంలో పందుల సంచారంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆస్పత్రి ప్రాంగణం వెనక భాగంంలో మురుగు పూర్తిగా పేరుకుపోవడంతో ముక్కు పుటలు అదిరేలా వాసన వస్తోంది. మున్సిపల్ అధికారులు చెత్తను తొలగించి డ్రెయినేజీని శుభ్రం చేయాలని ఎన్ని వినతులు ఇచ్చినా పట్టించుకోవడం లేదని ఆస్పత్రి వైద్యాధికారులే చెబుతున్నారు. దీంతో రోగం నయం చేసుకునేందుకు వస్తే కొత్తరోగాలను కొని తెచ్చుకునే పరిస్థితి తయారైందని రోగులు మండిపడుతున్నారు. లక్షల నిధులున్నా అధికారులు, ప్రజాప్రతినిదులు మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఆస్పత్రిలో వైద్యుల కొరత జనరల్ ఆస్పత్రిలో దాదాపు 28 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా, కేవలం 8 మంది మాత్రమే కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్నారు. ప్రసవాలు చేయడానికి సరిపడ వైద్యులను నియమించకపోవడంతో గర్భిణులను ఇతర దవాఖానలకు రెఫర్ చేస్తున్నారు. జాడలేని అభివృద్ధి కమిటీ జిల్లా కేంద్రంగా మారి జిల్లా ఆస్పత్రిలా పేరు మారిందే తప్పా పనితీరులో మార్పు రాలేదని పట్టణ వాసులు అంటున్నారు. ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధికి కమిటీని ఏర్పాటు చేయాలి కాని నేటికీ ఆ దిశగా అడుగులు పడలేదు. వచ్చిన నిధులన్నీ ఎక్కడ ఖర్చు చేస్తున్నారే అడిగే నాథుడే లేడు. దీంతో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది. ఏళ్ల తరబడి నిర్మించిన తాగునీటి పైపులైన్ ప్రస్తుతం పూర్తిగా మూసుకుపోవడంతో వార్డుల్లో నీరు అందడం లేదు. దీంతోపాటు ఆస్పత్రిలోని మరుగుదొడ్లు శుభ్రపరచడంలో శానిటరి సిబ్బందిసైతం అలసత్వం కారణంగా దుర్వాసన వస్తు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రోగులు మండిపడుతున్నారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో సీజనల్ వ్యాధులు రోగులపై విజృంభించి ప్రతిరోజూ ఇన్‌పేషెంట్లు 80కి పైగా ఉండగా ఔట్ పేషెంట్లు 2,100 పైచిలుకు వస్తున్నారని ఆస్పత్రి వర్గాలు పేర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో అపరిశుభ్రంగా ఆస్పత్రి ఆవరణం ఉంటే కొత్త రోగాలు వచ్చే పరిస్థితి లేదా అని ప్రశ్నిస్తున్నారు. మున్సిపల్ అధికారులకు విన్నవించాం ఆస్పత్రి ఆవరణలో చెత్త తొలగింపు, మురుగు శుభ్రతం చేయాలని పలు మార్లు మున్సిపాలిటీ అధికారులకు విన్నవించాం. వారు స్పందించడం లేదు. ఆస్పత్రి వెనక భాగంలో మురుగు చాలా పేరుకుపోయింది. దీనిపై ఉన్నతాధికారులకు సమాచారం అందించాం. – ప్రభు, సూపరింటెండెంట్, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి -
ఒకే కాన్పులో.. ఇద్దరు బాబులు, ఒక పాప
సాక్షి, జగిత్యాల : జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో అరుదైన ప్రసవం జరిగింది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం చింతపల్లి గ్రామానికి చెందిన గర్భిణి శిరీష ముగ్గురు శిశువులకు జన్మనిచ్చారు. వీరిలో ఇద్దరు బాబులు, ఒక పాప ఉన్నారు. ప్రస్తుతం తల్లి, ముగ్గురు పిల్లల ఆరోగ్యంగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు. తొలి కాన్పులోనే శిరీష ముగ్గరు పిల్లలకు జన్మనివ్వడం పట్ల ఆమె భర్త మహేశ్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
సెక్యూరిటీ గార్డే బలి పశువు
సాక్షి, ఖమ్మం: జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో విధి నిర్వహణలో ఉన్న డాక్టర్లు, నర్సుల నిర్లక్ష్యానికి ఒక సామాన్య సెక్యూరిటీ గార్డు బలయ్యాడు. ఎలాంటి విచారణ చేపట్టకుండానే అర్ధంతరంగా అతడిని విధుల నుంచి తొలగించడంతో ఖమ్మంలోని పెద్దాస్పత్రి మరోసారి వివాదానికి కేంద్ర బిందువైంది. ఆదివారం మాతా శిశు సంరక్షణ కేంద్రంలో సమయానికి డాక్టర్లు, నర్సులు ఎవ్వరూ లేకపోవడంతో అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డు బాలింతకు సెలైన్ బాటిల్ ఎక్కించిన ఘటన సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నిర్లక్ష్యంపై ‘సాక్షి’ ప్రధాన, జిల్లా సంచికల్లో కథనాలు ప్రచురితమైన విషయం విదితమే. ఇంకా పలు పత్రికల్లో వార్తలు రావడం, చానళ్లలో ప్రసారం కావడంతో పెద్దాస్పత్రిలో ఘటనలపై తెలంగాణ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అయితే బాధ్యులపై చర్యలు తీసుకోకుండా, సెలైన్ ఎక్కించిన సెక్యూరిటీ గార్డును విధుల నుంచి తొలగించడంపై సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లు, పేషెంట్ కేర్ సిబ్బంది సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులు సక్రమంగా నిర్వహించకుండా అలసత్వం ప్రదర్శించిన డాక్టర్లు, నర్సులపై చర్య తీసుకోకుండా సెక్యూరిటీ గార్డును బలిపశువును చేయడమేంటని? ఖండించారు. ఆస్పత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. సీఐటీయూ నాయకులు సంఘీభావం తెలిపారు. సెక్యూరిటీ గార్డును విధుల్లోకి తీసుకొని బాధ్యులైన వైద్యసిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధ్యులు పదిలం.. మాతాశిశు సంరక్షణ కేంద్రంలో కాన్పుకు వచ్చే గర్భిణులకు ప్రసవం తర్వాత వారిని ప్రత్యేక గదుల్లో ఉంచి..డిశ్చార్జ్ అయ్యే వరకు..డాక్టర్లు, నర్సులు పర్యవేక్షిస్తూ..వైద్యసేవలు అందించాలి. 24 గంటలూ షిఫ్టుల వారీగా వారికి డ్యూటీలు వేస్తారు. కానీ విధుల పట్ల అలసత్వం ప్రదర్శించడం, వారి స్వంత క్లీనిక్‌లు చూసుకోవడంపై దృష్టి పెడుతుండటంతో బాలింతలు, చిన్నారులకు సరైన వైద్యం అందట్లేదనేది ఆరోపణ. సమయానికి ఎవ్వరూ అందుబాటులో ఉండక..కొన్నిసార్లు అత్యవసర పరిస్థితుల్లో అక్కడి స్వీపర్లు, సెక్యూరిటీ గార్డులు బాలింతలకు సహాయం చేస్తుంటారు. ఇలాంటి ఘటనే..తాజాగా సెక్యూరిటీ గార్డు ఉద్యోగానికి ఎసరు పెట్టింది. సదరు గార్డు సెలైన్ పెట్టిన సమయంలో డ్యూటీలో ఉన్న డాక్టర్లు, నర్సులను వదిలేసి తాత్కాలిక ఉద్యోగిపై చర్యలు తీసుకోవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. ఆ సమయంలో డ్యూటీలో ఉన్న వారిని రక్షించేందుకే సెక్యూరిటీ గార్డును విధుల నుంచి తొలగించారని, ఎలాంటి విచారణ చేపట్టకుండా..తీసేయడం అనుమానాలకు బలం చేకూర్చినట్లైంది. డబ్బులు వసూలు చేస్తున్నారా? డెలివరీ వీడియో తీశారా? – ప్రత్యేకాధికారి విచారణ పెద్దాస్పత్రిలో చోటు చేసుకున్న వరుస ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. దీనిపై విచారణ చేపట్టాల్సిందిగా వైద్య విధాన పరిషత్ ఉన్నతాధికారును ఆదేశించింది. అందులో భాగంగా వైద్య విధాన పరిషత్ రాష్ట్ర స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ ఏ. రాజశేఖర్ బాబు సోమవారం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని మాతాశిశు సంరక్షణ కేంద్రంలో విచారణ చేపట్టారు. డాక్టర్లు, నర్సులను వేర్వేరుగా పిలిచి వివరాలు తెలుసుకున్నారు. సెక్యూరిటీ గార్డు సెలైన్ పెట్టిన సమయంలో ఎవరెవరు డ్యూటీలో ఉన్నారు? అందుబాటులో లేనిదెవరు? తదితర విషయాలపై విచారించారు. గతంలో జరిగిన ఘటనలపై ఆరా తీశారు. ప్రసవించిన సమయంలో మగ, ఆడ పిల్లలు పుడితే ఒక్కోరేటు పెట్టి పేషంట్ల వద్ద నుంచి డబ్బులు గుంజుతున్న విషయంపై కూడా అడిగారు. డాక్టర్లకు స్వంతంగా ఎవరెవరికి క్లీనిక్‌లు ఉన్నాయో తెలుసుకున్నారు. గత నెల ప్రసవ సమయంలో వీడియోలు తీసిన ఘటనపై కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఆస్పత్రి ఆర్ఎంఓ కృపా ఉషశ్రీ, డాక్టర్ మంగళ పాల్గొన్నారు. బాధ్యులెవరైనా చర్యలు తీసుకుంటాం.. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ బాలింతకు సెక్యూరిటీ గార్డు సెలైన్ ఎక్కించిన ఘటనకు సంబంధించి..పూర్వాపరాలు విశ్లేషించి, ఇంకా చోటు చేసుకున్న వరుస ఘటనలకు కారణమైన బాధ్యులపై తప్పక చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం వేల కోట్లు వెచ్చిస్తోంది. విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు. డాక్టర్లు, సిబ్బంది ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు హాస్పిటల్ వదిలి వెళ్లకూడదు. ప్రసవమప్పుడు బంధువుల వద్ద డబ్బులు డిమాండ్ చేస్తే ఇంటికి పంపిస్తాం. రోగుల పట్ల మర్యాదగా వ్యవహరించాలి. అందుకోసం స్వతహాగా ప్రతి ఒక్కరిలోనూ మార్పు రావాలి. ఖాళీ పోస్టులను భర్తీ చేస్తాం. సీటీ స్కాన్, డిజిటల్ ఎక్స్‌రేను అతి త్వరలో అందుబాటులోకి తెస్తాం. – రాజశేఖర్ బాబు, వైద్యవిధాన పరిషత్ రాష్ట్ర ప్రత్యేకాధికారి -
వికటించిన సిజేరియన్!
మచిలీపట్నం టౌన్ : జిల్లా ప్రభుత్వాస్పత్రిలో గర్భిణికి చేసిన సిజేరియన్ మరోసారి వికటించింది. ప్రభుత్వాస్పత్రిలో మెరుగైన వైద్యం అందుతుందనే ఆశతో ప్రసవం కోసం వచ్చిన పేద గర్భిణులకు తరచూ సిజేరియన్ సమయంలో ఇబ్బందులు తప్పటం లేదు. ఆస్పత్రిలోని ఓ వైద్యురాలు నిర్లక్ష్యంగా సిజేరియన్ చేయటంతో ఆ గర్భిణికి రక్తస్రావం ఆగని పరిస్థితి నెలకొంది. దీంతో సిజేరియన్ చేసిన గంటలోనే మరోసారి కుట్లు వేశారు. కొద్ది రోజుల తర్వాత కుట్లు చీము పట్టి మానకపోవటంతో మరోసారి మూడు కుట్లు వేశారని బాధితులు చెబుతున్నారు. ఇలా మూడుసార్లు కుట్లు వేసినా బాధితురాలికి న యం కాలేదు. దీంతో ఆదివారం బాధితురాలి బంధువులు ఆస్పత్రిలో ఆందోళన వ్యక్తం చేశారు. వైద్యం అందించిన డాక్టర్ సెలవులో ఉం డటంతో ఆమె ఇంటి అడ్రస్, సెల్‌ఫోన్ నెంబరు ఇవ్వమని ప్రాధేయపడినా ఎవ్వ రూ ఇవ్వలేదు. వివరాలిలా ఉన్నాయి. ఘంట సాల మండలం పాపవినాశనం గ్రామానికి చెందిన నాగతిరుపతమ్మ అనే గర్భిణిని వారి కుటుంబ సభ్యులు కాన్పు కోసం 17 రోజుల క్రితం ఆస్పత్రికి తీసకువచ్చారు. రెండో రోజు వైద్యురాలు సిజేరియన్ చేశారు. సిజేరియన్ చేసి వార్డులోని మంచం మీద పడుకోబెట్టిన కొద్ది సేపటికే గాయం నుంచి రక్తస్రావం ఆగకపోవటంతో మంచంపై ఉన్న దుప్పటి మొత్తం రక్తంతో తడిచిపోయింది. దీంతో కంగారు పడిన నాగతిరుపతమ్మ బంధువులు వైద్య సిబ్బందికి విషయాన్ని చెప్పారు. దీంతో సిజేరియన్ చేసిన గంటకు బాధితురాలిని మరోసారి ఆపరేషన్ థియేటర్‌కు తీసుకువెళ్లి కుట్లు వేశారు. రక్తస్రావం ఆగినా కుట్లు మానలేదు. చీము పట్టి ఇబ్బం దిగా ఉండటంతో మళ్లీ తీసుకువెళ్లి మూడు కుట్లు వేసినట్లు బాధితులు చెబుతున్నారు. ఈ కుట్లు కూడా ప్రస్తుతం మానకపోవటంతో సిజేరియన్ నిర్లక్ష్యంగా చేయబట్టే నాగతిరుపతమ్మకు సమస్య ఏర్పడుతోందని ఆమె కుటుంబ సభ్యులు ఆదివారం ఆందో ళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ఆర్ఎంవో అల్లాడ శ్రీనివాసరావును వివరణ కోరగా కొంత మంది శరీరతత్వం ప్రకారం పై కుట్లు మానటంలో ఇబ్బందులు ఏర్పడతాయన్నారు. ఇలాం టి కేసులు అప్పుడప్పుడు చోటు చేసుకుంటా యని చెప్పారు. లోపలి కుట్లు బాగానే ఉన్నాయని, పై కుట్లు కూడా త్వరలోనే మానతాయన్నారు. ఆం దోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. -
సెక్యూరిటీ గార్డులే డాక్టర్లు!
ఖమ్మం వైద్యవిభాగం: ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు, నర్సులు అందించాల్సిన వైద్య సేవలను సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లు అందిస్తున్నారు. సమయానికి డాక్టర్లు అందుబాటులో ఉండకపోవడంతో రోగులు, వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఆసుపత్రిలో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రభుత్వం రూ. 20 కోట్ల వ్యయంతో నిర్మించింది. రెండేళ్ల క్రితం ఇక్కడ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ కిట్లు ప్రవేశపెట్టడంతో ఇక్కడ రోజూ 30కి పైగా ప్రసవాలు జరుగుతున్నాయి. అయితే, సిబ్బంది నిర్లక్ష్యంతో పెద్దాసుపత్రి తరచూ వార్తల్లోకి ఎక్కుతోంది. ఆసుపత్రిలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లే రోగులకు సెలైన్లు అమర్చుతూ, ఇంజెక్షన్లు వేస్తున్న దృశ్యాలు ఆదివారం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇక ఇక్కడ కాన్పు అయిన తర్వాత ఆడపిల్ల పుడితే ఒక రేటు, మగ పిల్లాడు పుడితే మరో రేటు చొప్పున ఆసుపత్రి సిబ్బంది వసూళ్లు కూడా చేస్తుండడం గమనార్హం. ఈ విషయం తెలిసినా వైద్య అధికారులు ఏమీ చేయడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. -
అయ్యో! పాపం
మదనపల్లె టౌన్: అప్పుడే పుట్టిన పసికందు. ఇంకా కళ్లు కూడా తెరవలేదు. తల్లి పొత్తిళ్లలో నులి వెచ్చని స్పర్శను అనుభవిస్తూ ఉండాల్సిన ఆ పసికందు ను కొందరు యువకులు హంద్రీ–నీవా కాలువ వద్ద పడేసిన సంఘటన గురువారం కురబలకోట మండలంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధిం చి మదనపల్లె సీడీపీఓ లక్ష్మీదేవి కథనం..కురబలకోట మండలం పూసావారిపల్లెకు చెందిన సోమశేఖర్ మేకలు మేపుకుని జీవనం సాగిస్తున్నాడు. గురువారం మేకలు మేపడానికి అంగళ్లు సమీపంలోని మల్లయ్యకొండకు వెళ్లా డు. అక్కడి హంద్రీ–నీవా కాలువ వద్ద మేకలు మేపుతుండగా ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంలో వచ్చి బొడ్డుకూడా ఊడని, అప్పుడే పుట్టిన ఓ పసికందును హంద్రీ–నీవా కాలువ వద్ద వదలి వెళ్లిపోయారు. ఆ పసికందు ఏడుపు విన్న మేకల కాపరి స్థానికుల సాయంతో ఆటోలో తీసుకొచ్చి మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో చేర్పించాడు. డాక్టర్లు చికిత్స చేశారు. సమాచారం అందుకున్న సీడీపీఓ, ఆస్పత్రికి చేరుకున్నారు. పసికందును అంగన్వాడీ ఆయాల సంరక్షణలో ఉంచారు. పసికందుకు జన్మనిచ్చిన మహిళ ఎవరో తెలుసుకోవాలని కురబలకోట, అంగ ళ్లు సూపర్వైజర్లను ఆదేశించారు. జన్మనిచ్చిన తల్లికి ఏం సమస్య వచ్చిందోగానీ పసికందును హతమార్చడం ఇష్టం లేక వదలి వెళ్లిపోయారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ప్రాణంతో చెలగాటం!
సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో ప్రాణవాయువు అందక రోగులు విలవిల్లాడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటిలేటర్ కావాలంటే ఒకరిది తీసి..మరొకరికి అమర్చాల్సి వస్తోంది. వివిధ ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి రక్తమోడుతూ ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, నిమ్స్ ఆస్పత్రుల్లోని అత్యవసర విభాగానికి చేరుకున్న క్షతగాత్రులకు కృత్రిమశ్వాస అందించే వెంటిలేటర్లు దొరకడం లేదు. వెంటిలేటర్లు ఖాళీ లేకపోవడంతో అత్యవసర విభాగంలోని వైద్యులు ఏమీ చేయలేక చేతులెత్తేస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రులకు తరలించాల్సి వస్తోంది. ప్రతిష్టాత్మక ఈ ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న హృద్రోగులు, శ్వాస సంబంధిత జబ్బులతో బాధపడుతున్న రోగులకు ఎండోట్రెకియల్ ఇంటుబేషన్ పద్ధతిలో అంబూ బ్యాగు ద్వారా ప్రాణవాయువును అందిస్తున్నారు. బెలూన్ను చేత్తో ఒత్తడం వల్ల ఒకసారి తక్కువ, మరొకసారి ఎక్కువ గాలి పంపింగ్ అయ్యే అవకాశం ఉంది. ఈ హెచ్చుతగ్గుల వల్ల రోగులు మత్యువాతపడే ప్రమాదం లేకపోలేదని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మూలకు చేరిన సగానికిపైగా వెంటిలేటర్లు ⇔ 1,012 పడకల సామర్థ్యం గల గాంధీ ఆస్పత్రిలో అనధికారికంగా రెండు వేల పడకలు ఉన్నాయి. ఇక్కడ నిత్యం రెండు వేల మంది రోగులు చికిత్స పొందుతుంటారు. వీరికోసం ఆస్పత్రిలో ఖరీదైన ఎంఆర్ఐ, సీటీ సహా మొత్తం 2400 వైద్య పరికరాలను ఏర్పాటు చేశారు. వీటిలో 525కు పైగా వైద్య పరికరాలు పనిచేయకపోవడం గమనార్హం. 86 వెంటిలేటర్లు ఉండగా, వీటిలో 20పైగా మూలకు చేరాయి. అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి వచ్చిన క్షతగాత్రులకు వెంటిలేటర్ అవసరమైతే..అప్పటికే వెంటిలేటర్‌పై ఉన్న వారిది తొలగించి, కొత్తగా వచ్చిన వారికి అమర్చాల్సిన దుస్థితి. ⇔ ఇక ఉస్మానియా ఆస్పత్రిలో అధికారికంగా 1,168 పడకలు ఉండగా, అనధికారికంగా 1385 పడకలు ఉన్నాయి. నిత్యం 1400 మంది రోగులు చికిత్స పొందుతుంటారు. అత్యవసర విభాగానికి రోజుకు 250 మంది వస్తుండగా, వీరిలో అత్యధికులు ప్రమాదాల్లో గాయపడిన వారు, పాయిజన్, పాము కాటు బాధితులు, సెప్టిసీమియా, న్యూరో సంబంధిత బాధితులే. వీరిలో చాలా మందికి వెంటిలేటర్ అవసరం ఉంటుంది. ఆస్పత్రిలో అన్ని విభాగాల్లో 80 పైగా వెంటిలేటర్లు ఉండగా, వీటిలో ప్రస్తుతం 40కిపైగా పని చేయడం లేదు. ⇔ ప్రతిష్టాత్మక నిమ్స్‌లో పరిస్థితి మరోలా ఉంది. ఆస్పత్రి అత్యవసర విభాగాన్ని 96 పడకలకు విస్తరించారు. ఒక్కో పడకకు ఒక వెంటిలేటర్ సమకూర్చారు. ఆస్పత్రిలో రోగులకు సరిపడు వెంటిలేటర్లు ఉన్నప్పటికీ...స్వయంగా ఈఎండీ అధికారే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. నిత్యం ఏడెనిమిది వెంటిలేటర్లను బ్లాక్‌లో పెడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన రోగులకు వెంటిలేటర్లు ఖాళీ లేవని చెప్పి...తమకు కమిషన్లు ఇచ్చే పంజగుట్ట, కూకటపల్లిలోని ఆస్పత్రులకు రోగులను తరలిస్తున్నారు. బంధువులు, తెలిసినవారి కోసం ఇతరులకు అమర్చిన వెంటిలేటర్లను తొలగించి తమవారికి అమర్చుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశంపై ఇటీవల పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో ఈ అంశంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఆ సంస్థ పట్టించుకోదు.. నిర్వహణ లోపానికి తోడు ఆస్పత్రిలో పని చేస్తున్నకొంత మంది ఉద్దేశపూర్వకంగా వైద్యపరికరాలను ధ్వంసం చేయడం వల్ల కొనుగోలు చేసిన కొద్ది రోజులకే సాంకేతిక లోపాలతో అనేక వైద్యపరికరాలు మూలకు చేరుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో బయో మెడికల్ ఇంజినీర్లు లేకపోవడంతో తెలంగాణ వైద్య మౌలిక సదుపాయాల సంస్థ చెన్నైకి చెందిన ’ఫైబర్ సింధూరి’ సంస్థకు ఆయా వైద్యపరికరాల వార్షిక మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ కట్టబెట్టింది. వైద్య పరికరం వాస్తవ ధరపై 7 శాతం వార్షిక మెయింటెనెన్స్ చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, ఆస్పత్రులకు సరఫరా చేస్తున్న వైద్య పరికరాల్లో ఒక్కో పరికరం ఒక్కో కంపెనీ నుంచి కొనుగోలు చేయడం, ఆయా కంపెనీల ఉత్పత్తులు, సాంకేతిక పరిజ్ఞానంపై ఫైబర్ సింధూరి ఇంజనీరింగ్ టెక్నాలజీ సంస్థకు అవగాహన లేక పోవడంతో రోగులు ఇబ్బంది పడాల్సి వస్తుంది.