
సాక్షి, నల్గొండ: కరోనా విపత్కర పరిస్థితుల్లో మరో వ్యక్తి ఆక్సిజన్ అందక ప్రాణాలు విడిచాడు. కళ్ల ముందే కొడుకు ప్రాణాలు విడువడంతో అతని తల్లి గుండె పగిలేలా రోదించిన తీరు కలచివేస్తోంది. వివరాలు.. మాడుగులపల్లి మండలం సల్కునూర్‌కు చెందిన ఓ వ్యక్తి కరోనా లక్షణాలతో బాధపడుతున్నాడు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి కోవిడ్ వార్డులో శనివారం చేరాడు. అయితే, అప్పటికే పరిస్థితి విషమించడంతో వైద్యం చేయడానికి డాక్టర్లు ముందు రాలేదని తెలుస్తోంది. దాంతోపాటు ఆస్పత్రిలో వెంటిలేటర్ సౌకర్యం కూడా లేకపోవడంతో దారుణం జరిగింది. బాధితుడు ఊపిరి తీసుకోలేక తల్లి కళ్లముందే తనువు చాలించాడు. డాక్టర్ల నిర్లక్ష్యమే తన బిడ్డ చావుకు కారణమైంది మృతుడి తల్లి ఆరోపించారు. ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి ఒక్క డాక్టర్ కూడా తన కొడుకును చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
(కామారెడ్డి బస్టాండ్‌లో దారుణం.. పట్టించుకోని స్థానికులు)