
సాక్షి, చిట్యాల: కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న రెండు గంటల తర్వాత ఓ వ్యక్తి చనిపోయాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా చిట్యాలలో శనివారం చోటుచేసుకుంది. మండలంలోని వట్టిమర్తి గ్రామానికి చెందిన రాచమల్ల సత్యనారాయణ (55) రైస్‌మిల్లులో మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ఉదయం 10 గంటలకు చిట్యాల ప్రభుత్వాస్పత్రిలో కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నాడు. అనంతరం ఇంటికి వెళ్లాడు.
మధ్యాహ్నం 12 గంటల సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు.. పరిస్థితి విషమంగా ఉండటంతో నల్లగొండకు తరలించేందుకు అంబులెన్స్‌ను సిద్ధం చేస్తుండగా చనిపోయాడు. సత్యనారాయణకు బీపీ పెరిగి గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యాధికారి కిరణ్‌కుమార్ తెలిపారు.
చదవండి: ఏ వ్యాక్సిన్ మంచిది? గర్భిణులు టీకా తీసుకోవచ్చా?
Comments
Please login to add a commentAdd a comment