మంచె మీదే బీటెక్‌ విద్యార్థి ఐసోలేషన్‌.. చెట్టుపైనే | Covid Positive Nalgonda Btech Student Stayed On Tree Isolation Goes Viral | Sakshi
Sakshi News home page

మంచె మీదే ఐసోలేషన్‌.. పదిరోజులుగా చెట్టుమీదే 

Published Sat, May 15 2021 1:21 PM | Last Updated on Sat, May 15 2021 5:45 PM

Covid Positive Nalgonda Btech Student Stayed On Tree Isolation Goes Viral - Sakshi

అడవిదేవులపల్లి: కరోనా సోకిన ఓ యువకుడికి చెట్టు మీద ఏర్పాటు చేసుకున్న మంచే ఐసోలేషన్‌ కేంద్రమైంది. నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం కొత్తనందికొండ గ్రామానికి చెందిన రమావత్‌ శివ హైదరాబాద్‌లో బీటెక్‌ చదువుతున్నాడు. లాక్‌డౌన్‌ కారణంగా గ్రామానికి వచ్చిన అతడు స్థానిక ఐకేపీ కేంద్రంలో హమాలీ పనులకు వెళ్లాడు. ఈ క్రమంలోనే కరోనాకు గురయ్యాడు.

ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులు ఉండడం, అందరికీ ఒకటే గది కావడంతో కుటుంబ సభ్యులని ఇబ్బంది పెట్టకూడదని భావించాడు. ఇంటి ఆవరణలోనే ఉన్న ఓ చెట్టుపై మంచె ఏర్పాటు చేసుకుని, దానిపైనే నిద్రిస్తూ, సెల్‌ఫోన్‌లో పాటలు వింటూ, వీడియోలు చూస్తూ గడుపుతున్నాడు. మంచె మీద సరదాగా గడిచిపోతోందని, భయం దరిచేరక పోతే కరోనాతో పోరాడవచ్చని శివ అంటున్నాడు. 

చదవండి: అమానుషం: నిండు గర్భిణీపైనా.. దయ చూపలేదు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement