Nobel Prize
-
Nobel Prize in Economics 2024: అర్థశాస్త్రంలో ముగ్గురికి నోబెల్
స్టాక్‌హోమ్: దేశంలోని సంస్థలు, వ్యవస్థల అసమర్థత కారణంగా ఆ దేశం ఎలా పేదరికంలోనే మగ్గిపోతుందనే అంశాలపై విస్తృత పరిశోధనలు చేసిన ముగ్గురు ఆర్థికవేత్తలకు అర్థశాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ పురస్కారం దక్కింది. ఆయా సమాజాల్లో నిబంధనలను తుంగలో తొక్కడం, సంస్థలు, వ్యవస్థల్లో లోపాలు ఆ దేశాభివృద్ధికి ఎలా పెనుశాపాలుగా మారతాయనే అంశాలను డరేన్ ఎసిమోగ్లూ, సైమన్ జాన్సన్, జేమ్స్ ఏ రాబిన్సన్లు చక్కగా విడమర్చి చెప్పారని రాయల్ స్వీడిష్ అకాడమీ సైన్స్ విభాగ నోబెల్ కమిటీ కొనియాడింది. ఈ మేరకు ముగ్గురికీ నోబెల్‌ను ప్రకటిస్తూ సోమవారం కమిటీ ఒక ప్రకటన విడుదలచేసింది. ఎసిమోగ్లూ, జాన్సన్‌లు అమెరికాలోని ప్రతిష్టాత్మక మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సేవలందిస్తుండగా షికాగో విశ్వవిద్యాలయంలో రాబిన్సన్ పనిచేస్తున్నారు. ‘‘ దేశాల మధ్య ఆర్థిక అసమానతలను తగ్గించడం అనేది శతాబ్దాలుగా ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో ఒకటి. ఆదాయ, ఆర్థికాభివృద్ధి అసమానతలను రూపుమాపడంలో అక్కడి వ్యవస్థల కీలకపాత్రను ఆర్థికవేత్తలు స్పష్టంగా పేర్కొన్నారు’’ అని ఆర్థికశాస్త్ర కమిటీ చైర్మన్ జాకబ్ సెవెన్సన్ వ్యాఖ్యానించారు. తనకు నోబెల్ రావడంపై 57 ఏళ్ల ఎసిమోగ్లూ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. దేశాలు ఎందుకు సక్సెస్ కాలేవు? అవార్డ్ విషయం తెలిశాక తుర్కియే దేశస్థుడైన ఎసిమోగ్లూ మాట్లాడారు. ‘‘ప్రజాస్వామ్యయుత వ్యవస్థల గొప్పతనాన్ని ఈ అవార్డ్ గుర్తించింది. అభివృద్ధిలో దేశాలు ఎందుకు వెనుకబడతాయని రాబిన్సన్, నేను కలిసి పరిశోధించాం. ప్రజాస్వామ్యం అనేది సర్వరోగ నివారిణి కాదు. ఒక్కోసారి ఎన్నికలు వచి్చనప్పుడే సంక్షోభాలు ముంచుకొస్తాయి’’ అని అన్నారు. ఒకే పార్టీ ఏలుబడిలో ఉన్న చైనా ఎలా అభివృద్ధి పథంలో దూసుకుపోగల్గుతోందని విలేఖరులు ప్రశ్నించగా.. ‘‘ శక్తివంతమైన అధికారయంత్రాంగం ఉన్న చైనా లాంటి దేశాల్లో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, వినూత్న ఆవిష్కరణల కోసం ఎన్నో అవరోధాలను దాటుతున్నారు’’ అని అన్నారు. 12 ఏళ్ల క్రితం ఎసిమోగ్లూ, రాబిన్సన్ రాసిన ‘ వై నేషన్స్ ఫెయిల్: ది ఆరిజన్స్ ఆఫ్ పవర్, ప్రాస్పారిటీ, పూర్’ పుస్తకం అత్యధిక కాపీలు అమ్ముడుపోయింది. వ్యక్తుల తప్పిదాలే ఆయా దేశాలను పేదదేశాలుగా మిగిలిపోవడానికి కారణమని రచయితలు ఆ పుస్తకంలో వివరించారు. సరిగ్గా అమెరికా–మెక్సికో సరిహద్దులో ఉన్న ఆరిజోనా రాష్ట్ర నోగేల్స్ సిటీ భిన్న పరిస్థితులను ఆర్థికవేత్తలు చక్కటి ఉదాహరణగా తీసుకున్నారు. అమెరికా వైపు ఉన్న నోగేల్స్ సిటీ ఉత్తరప్రాంత వాసులు ప్రశాంతంగా జీవిస్తున్నారు. ఆయుర్దాయం ఎక్కువ. ఎక్కువ మంది విద్యార్థులు హైసూ్కల్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేస్తున్నారు. అదే దక్షిణవైపు ప్రాంత ప్రజలు పేదరికంలో మగ్గిపోతున్నారు. అక్కడ వ్యవస్థీకృత నేరాలు ఎక్కువ. ఆ ప్రాంతంలో వ్యాపారాలు చేయడం కూడా రిస్క్‌తో కూడిన వ్యవహారం. అవినీతి రాజకీయనేతలను అధికారం నుంచి కిందకు దింపడం కూడా చాలా కష్టం. అమెరికాలో అయితే పౌరుల ఆస్తిహక్కుల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. ఇలాంటి విధానాలే ఒకరకంగా దేశం బాగుపడటానికి బాటలువేస్తాయి ’’ అని ఎసిమోగ్లూ వివరించారు. వ్యవస్థలకు తగ్గుతున్న ఆదరణ దురదృష్టవశాత్తు ఇటీవలి కాలంలో అమెరికా, యూరప్‌లలో ప్రజాస్వామ్యయుత వ్యవస్థలకు ఆదరణ తగ్గుతోంది. తమకు అన్యాయం జరిగిందని ప్రజలు భావించిన సందర్భాల్లో ప్రజాస్వామ్యదేశాలు ఓడిపోయినట్లే లెక్క. ఇలాంటి ఉదంతాలు ప్రజాస్వామ్యదేశాలు మేల్కొనాల్సిన తరుణం వచి్చందని గుర్తుచేస్తాయి. సుపరిపాలన అందించేందుకు దేశాలు మళ్లీ ప్రయత్నించాలి’’ అని ఎసిమోగ్లూ అన్నారు. -
దక్షిణ కొరియా రచయిత్రికి సాహిత్యంలో నోబెల్
దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్‌కు సాహిత్యంలో 2024 ఏడాదిగాను నోబెల్ పురస్కారం దక్కింది. మానవ జీవితపు దుర్బలత్వాన్ని, చారిత్రక విషాదాలను తన గద్య కవిత్వంతో కళ్లకు కట్టించిన కృషికి గాను స్వీడిష్ నోబెల్ కమిటి గురువారం నోబెల్ పురష్కారాన్ని ప్రకటించింది. ఉత్తర కొరియా నుంచి సాహిత్యంలో నోబెల్ పురస్కారం దక్కించుకున్న తొలి మహిళ హాన్ కాంగ్.BREAKING NEWSThe 2024 #NobelPrize in Literature is awarded to the South Korean author Han Kang “for her intense poetic prose that confronts historical traumas and exposes the fragility of human life.” pic.twitter.com/dAQiXnm11z— The Nobel Prize (@NobelPrize) October 10, 2024 హాన్ కాంగ్ 1970లో దక్షిణ కొరియాలోని గ్వాంగ్జులో జన్మించారు. ఆమెకు సాహిత్య నేపథ్యం ఉంది. ఆమె తండ్రి ప్రసిద్ధ నవలా రచయిత. హాన్ కాంగ్ 1993లో మున్హాక్-గ్వా-సాహో (సాహిత్యం, సమాజం) శీతాకాల సంచికలో ‘వింటర్ ఇన్ సియోల్’పేరుతో ఐదు కవితలను ప్రచురించారు. దీని ద్వారా కవయిత్రిగా సాహిత్య రంగ ప్రవేశం చేశారు. అనంతరం నవలా రచయిత్రిగా తన కెరీర్‌ను ప్రారంభించారామె. -
ప్రోటీన్లపై పరిశోధనకు నోబెల్
స్టాక్‌హోమ్: మనిషి ఆరోగ్యకరమైన జీవనానికి మూలస్తంభాలైన ప్రోటీన్ల డిజైన్లు, వాటి పనితీరుపై విశేష పరిశోధనలు చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ సంవత్సరం రసాయనశాస్త్ర విభాగంలో నోబెల్ అవార్డ్ వరించింది. ప్రోటీన్లపై శోధనకుగాను శాస్త్రవేత్తలు డేవిడ్ బెకర్, డెమిస్ హసాబిస్, జాన్ జంపర్లకు 2024 ఏడాదికి కెమిస్ట్రీ నోబెల్ ఇస్తున్నట్లు కెమిస్ట్రీ నోబెల్ కమిటీ సారథి హెనర్ లింక్ బుధవారం ప్రకటించారు. పురస్కారంతోపాటు ఇచ్చే దాదాప రూ.8.4 కోట్ల నగదు బహుమతిలో సగం మొత్తాన్ని బేకర్‌కు అందజేయనున్నారు. మిగతా సగాన్ని హసాబిస్, జాన్ జంపర్లకు సమంగా పంచనున్నారు. జీవరసాయన శాస్త్రంలో గొప్ప మలుపు ‘‘అమైనో ఆమ్లాల క్రమానుగతి, ప్రోటీన్ల నిర్మాణం మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. వీరి పరిశోధన రసాయనరంగంలో ముఖ్యంగా జీవరసాయన శాస్త్రంలో మేలి మలుపు. ఈ ముందడుగుకు కారకులైన వారికి నోబెల్ దక్కాల్సిందే’’ అని నోబెల్ కమిటీ కొనియాడింది. అమెరికాలోని సియాటెల్‌లో ఉన్న వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో డేవిడ్ బేకర్ పనిచేస్తున్నారు. హసాబిస్, జాన్ జంపర్ లండన్‌లోని గూగుల్ సంస్థకు చెందిన డీప్‌మైండ్ విభాగంలో పనిచేస్తున్నారు. ‘‘బేకర్ 2003లో ఒక కొత్త ప్రోటీన్‌ను డిజైన్‌చేశారు. అతని పరిశోధనా బృందం ఇలా ఒకదాని తర్వాత మరొకటి కొత్త ప్రోటీన్లను సృష్టిస్తూనే ఉంది. వాటిల్లో కొన్నింటిని ప్రస్తుతం ఫార్మాసూటికల్స్, టీకాలు, నానో మెటీరియల్స్, అతి సూక్ష్మ సెన్సార్లలో వినియోగిస్తున్నారు. వీళ్ల బృందం సృష్టించిన సాంకేతికతతో వెలువడిన ఎన్నో కొత్త డిజైన్ల ప్రోటీన్లు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి’’అని నోబెల్ కమిటీలో ప్రొఫెసర్ జొహాన్ క్విస్ట్ శ్లాఘించారు. BREAKING NEWSThe Royal Swedish Academy of Sciences has decided to award the 2024 #NobelPrize in Chemistry with one half to David Baker “for computational protein design” and the other half jointly to Demis Hassabis and John M. Jumper “for protein structure prediction.” pic.twitter.com/gYrdFFcD4T— The Nobel Prize (@NobelPrize) October 9, 2024 నిర్మాణాలను అంచనా వేసే ఏఐ మోడల్ డెమిస్ హసాబిస్, జంపర్లు సంయుక్తంగా ప్రోటీన్ల నిర్మాణాలను ఊహించగల కృత్రిమమేధ నమూనాను రూపొందించారు. దీని సాయంతో ఇప్పటిదాకా కనుగొన్న 20 కోట్ల ప్రోటీన్ల నిర్మాణాలను ముందే అంచనావేయొచ్చు. చదవండి: ఏఐ మార్గదర్శకులకు...ఫిజిక్స్ నోబెల్ -
భౌతిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్ బహుమతి
-
ఏఐ మార్గదర్శకులకు...ఫిజిక్స్ నోబెల్
స్టాక్ హోం: వైద్య శాస్త్రం మాదిరిగానే ఫిజిక్స్‌లో కూడా ఈ ఏడాది నోబెల్ అవార్డు ఇద్దరు సైంటిస్టులను వరించింది. మెషీన్ లెరి్నంగ్‌ను కొత్త పుంతలు తొక్కించి.. కృత్రిమ మేధ వికాసానికి మార్గదర్శకులుగా నిలిచిన సైంటిస్టులు జాన్ హాప్ఫీల్డ్, జెఫ్రీ హింటన్‌లు అత్యున్నత పురస్కారం అందుకోనున్నారు. రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ మంగళవారం ఈ మేరకు ప్రకటించింది. గతేడాది ఫిజిక్స్ నోబెల్‌ను ముగ్గురు సైంటిస్టులకు అందించడం తెలిసిందే. హింటన్.. ఫాదర్ ఆఫ్ ఏఐ హింటన్ ఫాదర్ ఆఫ్ ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)గా ప్రసిద్ధుడు. కెనడా, బ్రిటన్ పౌరసత్వమున్న ఆయన టొరంటో వర్సిటీలో పని చేస్తున్నారు. హాప్‌ఫీల్డ్‌ది అమెరికా. ప్రిన్స్టన్ వర్సిటీలో పని చేస్తున్నారు. వారు రూపొందించి, అభివృద్ధి చేసిన భౌతిక శాస్త్ర నియమాలు, పనిముట్లు నేటి శక్తిమంతమైన మెషీన్ లెర్నింగ్‌కు పునాదులని నోబెల్ కమిటీ కొనియాడింది. ‘వారు అభివృద్ధి చేసిన ఆర్టిఫీషియల్ న్యూరల్ నెట్వర్క్స్ సహాయక మెమరీలుగా ఎన్నో రంగాల్లో కీలక సేవలు అందిస్తున్నాయి.ఫేషియల్ రికగ్నిషన్ మొదలుకుని, యాంత్రిక అనువాదం దాకా అన్నింటా అవి మన జీవితంలో భాగంగా మారాయి‘ అని ప్రశంసించింది. అయితే, ఈ సాంకేతిక ప్రగతి మన భవిష్యత్తుపై ఎన్నో సందేహాలను లేవనెత్తిందని అభిప్రాయపడింది. మానవాళికి మేలు జరిగేలా దీన్ని సురక్షిత, నైతిక పద్ధతుల్లో వాడటం చాలా ముఖ్యమని పేర్కొంది. ఈ ఆందోళనలు సహేతుకమేనని హింటన్ తరచూ చెబుతుంటారు. వీటిపై మరింత స్వేచ్చగా మాట్లాడేందుకు వీలుగా ఆయన గూగుల్‌లో ఉన్నతోద్యోగాన్ని కూడా వదులుకోవడం విశేషం. ఈ నేపథ్యం దృష్ట్యా తనకు అత్యున్నత పురస్కారం రావడం నమ్మశక్యంగా లేదని చెప్పారాయన. మానవాళిని ఏఐ కనీవినీ ఎరగని రీతిలో ప్రభావితం చేయడం ఖాయమని ఆయన ఇప్పటికే జోస్యం చెప్పారు. దీన్ని ఏకంగా పారిశ్రామిక విప్లవంతో పోల్చారు. -
భౌతికశాస్త్రంలో ఇద్దరికి నోబెల్ బహుమతి
2024 సంవత్సరానికిగానూ భౌతిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్ బహుమతి లభించింది. జాన్ జోసెఫ్ హాప్ఫీల్డ్, జెఫ్రీ ఎవరెస్ట్ హింటనల్‌కు ఈ పురస్కారం దక్కింది. కృత్రిమ న్యూరల్ నెట్‌వర్క్‌లతో మెషిన్ లెర్నింగ్ ఆవిష్కరణలు చేసినందుకుగానూ వీరిద్దరికి ఈ ఏడాది నోబెల్ ప్రకటిస్తున్నట్లు స్టాక్‌హోమ్‌లోని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వెల్లడించింది.కాగా గతేడాది భైతిక శాస్తంలో ఈ పురస్కారం ముగ్గురిని వరించింది. 1901 నుంచి ఇప్పటివరకు మొత్తంగా 117సార్లు భౌతికశాస్త్రంలో నోబెల్ ప్రకటించారు. ఇక సోమవారం మెడిసిన్ విభాగంలో ఇద్దరికి నోబెల్ బహుమతి ప్రకటించిన సంగతి తెలిసిందే. అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రువ్‌కున్‌లకు నోబెల్ బహుమతి దక్కింది. మైక్రోఆర్ఎన్ఏను ఆ ఇద్దరు శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్త, ఇంజినీర్, వ్యాపారవేత్తగా పేరుగాంచిన ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించినవారికి ఈ అవార్డును ప్రదానం చేస్తారు. 1896లో ఆల్ఫ్రెడ్ నోబెల్ మరణించగా.. 1901 నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను ఏటా ప్రదానం చేస్తున్నారు. వీటిని ఆల్ఫ్రెడ్ జయంతి సందర్భంగా డిసెంబర్ 10న విజేతలకు బహుమతులు అందజేస్తారు. -
మెడిసిన్‌లో విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రువ్‌కున్‌కు నోబెల్
2024 సంవత్సరానికిగానూ మెడిసిన్ విభాగంలో ఇద్దరికి నోబెల్ బహుమతి ప్రకటించారు. అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రువ్‌కున్‌లకు నోబెల్ బహుమతి దక్కింది. మైక్రోఆర్ఎన్ఏను ఆ ఇద్దరు శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. జీన్ రెగ్యులేషన్‌లో మైక్రో ఆర్ఎన్ఏ పాత్రను విశ్లేషించినందుకు ఆ ఇద్దరికి అవార్డును ప్రకటిస్తున్నట్లు నోబెల్ కమిటీ సోమవారం వెల్లడించింది.స్వీడెన్లోని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ మెడికల్ యూనివర్సిటీ నోబెల్ అసెంబ్లీ మెడిసిన్ లో విజేతను ప్రకటించింది. అవార్డు కింద 11 మిలియన్ల స్వీడిష్ క్రానర్(మిలియన్ అమెరికా డాలర్లు) బహుమతిగా అందిస్తారు. గతేడాది ఫిజియాలజీ, మెడిసిన్ విభాగంలో.. కొవిడ్-19 వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినందుకుగాను హంగేరియన్ శాస్త్రవేత్త కాటలిన్ కరికో , అమెరికాకు చెందిన డ్రూ వెయిస్మన్తకు నోబెల్ పురస్కారం వచ్చింది. BREAKING NEWSThe 2024 #NobelPrize in Physiology or Medicine has been awarded to Victor Ambros and Gary Ruvkun for the discovery of microRNA and its role in post-transcriptional gene regulation. pic.twitter.com/rg3iuN6pgY— The Nobel Prize (@NobelPrize) October 7, 2024వైద్యశాస్త్రంలో మొత్తంగా ఇప్పటివరకు నోబెల్ బహుమతిని 114 సార్లు ప్రకటించగా.. 227 మంది అందుకున్నారు. ఇందులో కేవలం 13 మంది మహిళలు మాత్రమే ఉన్నారు. కాగా ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక నోబెల్స్ బహుమతి విజేతల్లో ప్రతి ఏడాది ముందుగా మెడిసిన విభాగంలోనే ప్రకటిస్తారు. మంగళవారం భౌతికశాస్త్రం, బుధవారం రసాయనశాస్త్రం, గురువారం సాహిత్య విభాగాల్లో విజేతలను ప్రకటిస్తారు. శుక్రవారం రోజున నోబెల్ శాంతి బహుమతి, అక్టోబర్ 14న అర్థశాస్త్రంలో నోబెల్ గ్రహీతల పేర్లను వెల్లడిస్తారు.స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్త, ఇంజినీర్, వ్యాపారవేత్తగా పేరుగాంచిన ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించినవారికి ఈ అవార్డును ప్రదానం చేస్తారు. 1896లో ఆల్ఫ్రెడ్ నోబెల్ మరణించగా.. 1901 నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను ఏటా ప్రదానం చేస్తున్నారు. వీటిని ఆల్ఫ్రెడ్ జయంతి సందర్భంగా జ డిసెంబర్ 10న విజేతలకు బహుమతులు అందజేస్తారు. -
"కృష్ణ కృష్ణ - ఇదేమి ఘోరం!"
కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో టీఎం కృష్ణగా పేరు తెచ్చుకున్న తోడూరు మాడభూషి కృష్ణ చుట్టూ వివాదాలు ఎగసిపడుతున్నాయి. సంగీతంలో 'నోబెల్ ప్రైజ్' స్థాయిలో అభివర్ణించే మద్రాస్ మ్యూజిక్ అకాడమీవారి 'సంగీత కళానిధి' పురస్కారం-2024 టీఎం కృష్ణకు ప్రదానం చేయబోతున్నామని ఈ నెల 18వ తేదీన అకాడమీ ప్రకటించింది. అప్పటి నుంచి సంప్రదాయ సంగీత వాదుల నుంచి నిరసనల గళం పెద్దఎత్తున వినపడుతోంది. ఇది ప్రస్తుతం సంగీత ప్రపంచంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. టీఎం కృష్ణను సమర్థిస్తూ కూడా కొన్ని వర్గాలు తమ వాణిని బలంగా వినిపిస్తున్నాయి. ఆయనకు మద్దతు పలికేవారిలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా వున్నారు. ముఖ్యంగా ద్రవిడ సిద్ధాంతాలను బలపరిచేవారు, సనాతన సంప్రదాయం పట్ల గౌరవంలేనివారు, నాస్తికులు అందులో వున్నారు. టీఎం కృష్ణకు సంగీత కళానిధి పురస్కార ప్రకటనను నిరసిస్తూ, గతంలో ఈ పురస్కారాన్ని తీసుకున్న కొందరు వెనక్కు ఇచ్చేస్తున్నారు. చాలామంది కళాకారులు ఇక నుంచి మద్రాస్ మ్యూజిక్ అకాడమీలో పాడబోమని, సంగీత కచేరీలు చేయబోమని తమ నిరసనను చాటుకుంటున్నారు. ఒక ప్రఖ్యాత ఇంగ్లీష్ పత్రిక అధినేతలలో ఒకరైన ఎన్.మురళి ప్రస్తుతం మద్రాస్ మ్యూజిక్ అకాడమీకి అధ్యక్షులుగా వున్నారు. టీఎం కృష్ణను ఈ పురస్కారానికి ఎంపిక చేయడంలో మురళి పాత్ర ప్రధానంగా వున్నదని సంగీత సమాజంలో గట్టిగా వినపడుతోంది. ఈ వివాదం ఇంతటితో ముగిసేట్టు లేదు. రకరకాల రూపం తీసుకుంటోంది. మద్రాస్ మ్యూజిక్ అకాడమీ చరిత్రలో ఇంతటి వివాదం గతంలో ఎన్నడూ చెలరేగలేదు. టీఎం కృష్ణకు ఒక వర్గం మీడియా మద్దతు, సహకారం కూడా బాగా వున్నాయని అనుకుంటున్నారు. ఈయన ప్రస్థానాన్ని గమనిస్తే.. మొదటి నుంచీ వివాదాస్పద వ్యక్తిగానే ప్రచారం వుంది. వేదికలపైన పాడేటప్పుడే కాక, వివిధ సందర్భాల్లోనూ ఆయన చేసే విన్యాసాలు, హావభావాలపై చాలా విమర్శలు వచ్చాయి. అట్లే, ఆయనను మెచ్చుకొనే బృందాలు కూడా వున్నాయి. సంప్రదాయవాదులు ఎవ్వరూ ఇతని తీరును ఇష్టపడరు. ఈ క్రమంలో రేపు డిసెంబర్ లో మద్రాస్ మ్యూజిక్ అకాడమీ వేదికలో జరగబోయే ప్రతిష్ఠాత్మకమైన వేడుకలకు చాలామంది దూరంగా జరుగుతారని అనిపిస్తోంది. ప్రసిద్ధ జంట కళాకారిణులు రంజని - గాయత్రి పెద్ద ప్రకటన కూడా చేశారు. హరికథా విద్వాంసులు దుష్యంతి శ్రీథర్, విశాఖ హరి వంటీఎందరో నిరసన స్వరాన్నే అందుకున్నారు. తెలుగునాట కూడా అవే ప్రతిధ్వనులు వినిపిస్తున్నాయి. 1976లో తమిళనాడులో బ్రాహ్మణ కుటుంబంలో, శాస్త్రీయ సంగీత కుటుంబంలో జన్మించిన కృష్ణ మొదటి నుంచీ కొత్త గొంతును వినిపిస్తున్నారు. బ్రాహ్మణత్వంపైన, కర్ణాటక సంగీత ప్రపంచంలో బ్రాహ్మణుల పెత్తనం పెరిగిపోతోందంటూ కృష్ణ నినదిస్తున్నారు. సమాజంలో, సంగీత సమాజంలో ఎన్నో సంస్కరణలు రావాలని, సమ సమాజ స్థాపన జరగాలని మాట్లాడుతున్నారు. తాను గురుశిష్య పరంపరలోనే సంగీతం నేర్చుకున్నప్పటికీ దాని పైన తన దృక్పథం వేరని చెబుతున్నారు. చెంబై విద్యనాథ భాగవతార్ - కె జె ఏసుదాసు, పారుపల్లి రామకృష్ణయ్య పంతులు - అన్నవరపు రామస్వామి వంటివారి గురుశిష్య బంధాలు ఆయనకు ఏ విధంగా అర్ధమవుతున్నాయో? అనే ప్రశ్నలు వస్తున్నాయి. త్యాగయ్య మొదలు మహా వాగ్గేయకారులందరిపైనా ఆయన వివిధ సమయాల్లో విమర్శనాస్త్రాలు సంధించారు. ఎం.ఎస్ సుబ్బలక్ష్మి దేవదాసి కుటుంబం నుంచి వచ్చినప్పటికీ బ్రాహ్మణత్వంతోనే ప్రవర్తించారని, అదే పద్ధతిని అనుసరించి పాడుతూ పెద్దపేరు తెచ్చుకున్నారని, ఆ కీర్తి కోసమే ఆమె ఆలా చేశారని గతంలో కృష్ణ చేసిన విమర్శలు పెద్ద దుమారం రేపాయి. బ్రాహ్మణత్వాన్ని పులుముకోకపోతే ఈ శాస్త్రీయ సంగీత రంగంలో ఇమడలేరని, రాణించలేరని, అందుకే సుబ్బలక్ష్మికి కూడా అలా ఉండక తప్పలేదని కృష్ణ బాధామయ కవి హృదయం. కులాన్ని బద్దలు కొట్టాలని, కళలు, సంగీతం అందరికీ అందాలని, అది జరగడంలేదని వాదిస్తూ, సముద్ర తీరాలలో, మత్స్యకార వాడల్లో, వివిధ సమాజాల్లో కచేరీలు, సంగీత ఉత్సవాలు చేస్తూ వార్తల్లోకి ఎక్కారు. పర్యావరణ విధ్వంసంపైన, బీజేపీ ప్రభుత్వ విధానాలపైన, వివిధ ఉద్యమ వేదికల ద్వారా తన వ్యతిరేకతను చాటుకుంటూ వస్తున్నారు. కర్ణాటక సంగీతాన్ని గ్రామీణ ప్రాంతాలకు, వెనుకబడిన వర్గాల దగ్గరకు తీసుకెళ్లాలంటూ చేసిన ప్రదర్శనలు మీడియాను కూడ బాగా ఆకర్షించాయి. ఈ నేపథ్యంతో 2016లో ప్రతిష్ఠాత్మక 'రామన్ మెగసెసే అవార్డు' కూడా అందుకున్నారు. తమిళ భాషను, యాసను ప్రచారం చేసే క్రమంలో కృష్ణ తెలుగును చిన్నచూపు చూస్తూ వస్తున్నారు. త్యాగయ్య కీర్తనలు ఈనాటికి పనికిరావని, ఆ సాహిత్యం మూఢమైనదనే భావనలను కూడా ప్రచారం చేశారు. మహా వాగ్గేయకారులు రచించిన కీర్తనలను సాహిత్యానికి, భావానికి, భాషకు సంబంధం లేకుండా నడ్డివిరచి పాడుతూ మహనీయులను హేళన చేస్తున్నాడని, తెలుగు భాషను అవమానపరుస్తున్నాడనే విమర్శలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇతను కేవలం సంగీత విద్వాంసుడుగానే కాక, ఉద్యమకారుడుగానూ ప్రచారంలోకి వచ్చాడు. ఈ.వి రామస్వామి పెరియార్ భావాలను అనుసరిస్తూ, గీతాలను సృష్టిస్తూ, గానం చేస్తూ, ప్రచారం చేస్తూ వున్నారు. ఇస్లాం, క్రిస్టియన్ పాటలు కూడా కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో స్వరపరచి ఎందుకు పాడకూడదు? అన్నది అతి వాదన. బ్రాహ్మణులు, దైవం, హిందూమతం, కాంగ్రెస్, మహాత్మాగాంధీని పెరియార్ వ్యతిరేకించారు. కృష్ణ కూడా ఇంచుమించు అవే భావనలలో వున్నారు. బీజేపీ, సంఘ్ పరివార్పైన కూడా అనేకసార్లు తీవ్రమైన విమర్శలు చేశారు. ఈయన ప్రస్తుత పురస్కారం ఎంపిక విధానాన్ని, అర్హతను గమనిస్తే, ఇతని కంటే గొప్పవాళ్ళు, జ్ఞాన, వయో వృద్ధులు ఎందరో వున్నారు. వాళ్లందరినీ కాదంటూ ఈయనకు ఈ పురస్కారం ఇవ్వాల్సినంత శక్తి సామర్ధ్యాలు, అనుభవం ఆయనకు లేవన్నది మెజారిటీ వర్గాల అభిప్రాయం. సంప్రదాయ వ్యతిరేకత ముసుగులో, సంస్కరణ మాటున సాహిత్యంతో పాటు శాస్త్రీయ సంగీతాన్ని కూడా అవమానిస్తున్నాడని సంప్రదాయవాదులంతా ముక్తకంఠంతో ఘోషిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు భాషను ముక్కలు ముక్కలుగా నరికివేస్తున్నాడని తెలుగు భాషాప్రియులెందరో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాస్త్రీయ సంగీతం పట్ల, వాగ్గేయకార మహనీయుల పట్ల, తెలుగు భాష పట్ల గౌరవం లేనప్పుడు అసలు ఈ రంగాన్ని ఎందుకు ఎంచుకున్నాడని అనేకులు మండిపడుతున్నారు. సంగీత కళానిధి పురస్కారం సంగతి అటుంచగా, ఇంతటి విపరీత ధోరణులతో ప్రవర్తిస్తున్న వ్యక్తిని చూస్తూ ఊరుకోబోమనే మాటలు సనాతన సమాజాల నుంచి వినపడుతున్నాయి. ఈ పురస్కార ప్రకటనను మ్యూజిక్ అకాడమీ విరమించుకుంటుందని చెప్పలేం. ఈ ధోరణులతో నడుస్తున్న కృష్ణ శాస్త్రీయ రాగాలను ఎంచుకోకుండా, తాను కొత్త కొత్త రాగాలను పుట్టించుకొని అందులో పాడుకొమ్మని కొందరు సలహా ఇస్తున్నారు. ఈ సనాతన భారతంలో "కృష్ణ కృష్ణ - ఇదేమి ఘోరం " అని సంప్రదాయ ప్రేమికులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇప్పటికే అనేకమంది అతనిపై న్యాయస్థానాలలో కేసులు కూడా పెడుతున్నారు. ఏమవుతుందో చూద్దాం. - రచయిత, మా శర్మ, సీనియర్ జర్నలిస్టు -
నాకు నోబెల్ ప్రైజ్ రావాలి!: సీఎం కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వినర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై విమర్శలు గుప్పించారు. కేంద్రంతో ఢిల్లీ ప్రభుత్వానికి ఉన్న విభేదాల నేపథ్యంలో తాను ఢిల్లీలో పరిపాలన కొనసాగిస్తున్నందుకు ‘నోబెల్ ప్రైజ్’ రావాలని అన్నారు. నీటి బిల్లులపై ఆప్ కార్యకర్తలు చేపట్టిన నిరసన కార్యక్రమంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడారు. ‘ఢిల్లీలో పాఠశాలలు, ఆస్పత్రులు నిర్మించకుండా బీజేపీ అడ్డుపడుతోంది. వాళ్ల(బీజేపీ)పిల్లలు స్థాయిలో పేద పిల్లలు విద్య ద్వారా మంచి స్థానంలోకి ఇష్టం లేదు. నాకు తెలుసు.. నేను ఢిల్లీలో ఆప్ ప్రభుత్వాన్ని ఎలా నడుపుతున్నానో. దానికి నాకు నోబుల్ ప్రైజ్ రావాలి’ అని సీఎం కేజ్రీవాల్ అన్నారు. పెండింగ్‌లో ఉన్న నీటి బిల్లుల విషయంలో ఆప్ ప్రభుత్వం వన్ టైం సెటిల్మెంట్ అమలను కేంద్రం ప్రభుత్వం అడ్డుకుంటోందని మండిపడ్డారు. ఢిల్లీ ప్రభుత్వ అధికారులు.. కేంద్ర ప్రభుత్వానికి భయపడి తమ ఆదేశాలను పట్టించుకోవటం లేదన్నారు. ‘ఢిల్లీ వాటర్ బోర్డు పథకానికి ఆమోదం తెలిపింది. ఇప్పుడు ఈ పథకానికి కేబినెట్ ఆమోదం పొందాలి. ఈ పథకాన్ని ఆపేయాలని బీజేపీ లెఫ్టినెంట్ గవర్నర్‌ను కోరుతోంది. అధికారులు భయపడుతున్నారు. రాష్ట్ర మంత్రులు బిల్లు ఎందుకు తీసుకురావటం లేదని అడిగితే.. ఈ పథకాన్ని కేబినెట్ ఆమోదిస్తే మమ్మల్ని సస్పెండ్ చేస్తారని అధికారులు తెలిపారు. నకిలీ కేసుల బనాయించి తమపై కేసులు పెడతామని బెదిరిస్తున్నారని అధికారులు చెబుతున్నారు’ అని సీఎం కేజ్రీవాల్ బీజేపీపై మండిపడ్డారు. #WATCH | Delhi CM Arvind Kejriwal says "...They (BJP) tried to stop the construction of schools and hospitals in Delhi. They do not want the poor to get the same level of education as their children...Only I know, how am I running the government in Delhi, I should get a Nobel… pic.twitter.com/8AduBk30tw — ANI (@ANI) February 25, 2024 చదవండి: ‘బీజేపీకి ఒమర్ అబ్దుల్లా సవాల్.. ఎన్నికలు నిర్వహించండి’ -
ఆలోచన రేపుతున్న ఎంపిక
ఏటా ఇచ్చే పురస్కారాలు సైతం విజేతల ఎంపిక, వారు చేసిన కృషి రీత్యా విశిష్టంగా నిలుస్తాయి. రాయల్ స్వీడిష్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్ ఈ ఏడాదికి గాను ఇప్పటి దాకా ప్రకటించిన పురస్కారాల్లో కొన్ని అలాంటివే! స్వెరిజెస్ రిక్స్‌బ్యాంక్ ప్రైజ్ అనే పేరు కన్నా ఆల్ఫ్రెడ్ నోబెల్ స్మారకార్థం ఇచ్చే ‘నోబెల్ పురస్కారం’గానే ప్రసిద్ధమైన ఈ గౌరవం దక్కిన ఇద్దరు మహిళల గురించి ఇప్పుడు ప్రపంచమంతా ఆసక్తి కనబరుస్తోంది. మహిళా శ్రామికశక్తిపై విస్తృత పరిశోధన జరిపిన ఆర్థిక శాస్త్రవేత్త క్లాడియా గోల్డిన్‌కు అర్థశాస్త్రంలో నోబెల్ ప్రైజ్, అలాగే ఇరాన్లో జైలులో మగ్గుతున్న మానవ హక్కుల ఉద్యమకారిణి నర్గిస్ మొహమ్మదీకి నోబెల్ శాంతి బహుమతి దక్కడం వారు దీర్ఘకాలంగా చేస్తున్న కృషికి అతి పెద్ద అంతర్జాతీయ గుర్తింపు. ఈ ఇద్దరి ఎంపిక వేతనాల్లో స్త్రీ పురుష వ్యత్యాసం మొదలు లింగ సమానత్వం దాకా అనేక అంశాలపై మరోసారి చర్చ రేపుతోంది. గోల్డిన్ కృషికి అర్థశాస్త్రంలో నోబెల్ పురస్కారం దక్కడం బాగున్నా, అందులోనూ వైచిత్రి ఉంది. ఆమె నాలుగు దశాబ్దాల కృషి అంతా శ్రామిక విపణుల్లో మహిళలు, లింగ సమానత్వం గురించి! విచిత్రం ఏమిటంటే 1969లో అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతిని స్థాపించినప్పటి నుంచి నిన్నటి వరకు ఆ పురస్కారం దక్కింది ఇద్దరంటే ఇద్దరు మహిళలకే! అదీ వేరేవాళ్ళతో కలసి! ఆ గౌరవం దక్కిన మూడో మహిళ గోల్డినే! పైగా, ఒక మహిళకు ఒంటరిగా అర్థశాస్త్రంలో నోబెల్ దక్కడమూ ఇదే ప్రప్రథమం. నోబెల్ బహుమతుల్లో లింగ అసమానత్వంపై విమర్శలు వస్తున్న వేళ లేబర్ మార్కెట్లో మహిళా విజయం లోతుపాతులు విశ్లేషించిన గోల్డిన్‌కు ఈ గౌరవం దక్కడం గమనార్హం. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసరైన గోల్డిన్ అమెరికాలోని శ్రామిక విపణినీ, అలాగే వేతనాల్లో లింగ అసమానత్వానికి కారణాలనూ నాలుగు దశాబ్దాలుగా లోతుగా అధ్యయనం చేస్తూ వచ్చారు. 200 ఏళ్ళ అమెరికా చరిత్రను లోతుగా విశ్లేషిస్తూ, చారిత్రకంగా స్త్రీ పురుషుల ఆదాయాల్లో తేడాకు ప్రధానంగా చదువు, వివిధ రకాల ఉద్యోగాలే కారణమని తేల్చారు. వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుంచి పారిశ్రామిక ఆధారిత వ్యవస్థ వైపు దేశం మారడంతో శ్రామిక విపణిలో వివాహిత స్త్రీల భాగస్వామ్యం పడిపోయిందనేది ఆమె అధ్యయన సారం. ఆ తర్వాత 20వ శతాబ్దంలో సర్వీసుల పరిశ్రమ వృద్ధి చెందడంతో, మరింత విద్యావంతులైన మహిళలు రంగంలోకి వచ్చారు. గర్భనిరోధక విధానాల లాంటివి ఆరోగ్యరంగంలో వ్యాప్తిలోకి వచ్చాయి. తత్ఫలితంగా, శ్రామికశక్తి లోకి మహిళలు మళ్ళీ ప్రవేశించారు. కానీ, అప్పటికే తలెత్తిన అంతరం మాత్రం పూడిపోలేదు. ముఖ్యంగా, తొలిచూలుతో ఈ తేడా తలెత్తుతోందని గోల్డిన్ పరిశోధన. ఇక, మరణశిక్షకు వ్యతిరేకంగా గళం విప్పినందుకూ, దేశంలో మహిళలకు సైతం సమాన హక్కులు ఉండాలని కోరినందుకూ ఇరాన్లో కటకటాలు లెక్కపెడుతున్న నర్గిస్ పోరాటం మరో పెద్ద కథ. ఇప్పటికి ఆమె 13 సార్లు అరెస్టయి, అయిదుసార్లు దోషిగా తీర్మానమై, 31 ఏళ్ళ జైలుశిక్షను ఎదుర్కొంటోంది. 2022 నాటి డబ్యూఈఎఫ్ గ్లోబల్ జెండర్ గ్యాప్ నివేదికలో అట్టడుగున అఫ్గానిస్తాన్, పాకిస్తాన్లతో పాటు నిలిచిన దేశంగా ఇరాన్ పేరుమోసింది. అలాంటి దేశాల్లో నర్గిస్ లాంటి మహిళలు కడకు తమ ఉనికిని కాపాడుకొనేందుకు సైతం పోరాడాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అటు క్లాడియా గోల్డిన్ అధ్యయనానికీ, ఇటు నర్గిస్ మొహమ్మదీ అలుపెరుగని పోరాటానికీ నోబెల్ గుర్తింపు రావడం ఆనందదాయకం. సరిగ్గా గోల్డిన్‌కు నోబెల్ ప్రకటించిననాడే మన దేశంలో వార్షిక ‘పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే‘ (పీఎల్ఎఫ్ఎస్) విడుదలైంది. గత 2022 జూలై నుంచి ఈ 2023 జూన్‌కి సంబంధించిన ఈ సర్వే శ్రమజీవుల్లో మహిళల సంఖ్య మునుపటి కన్నా కొద్దిగా పెరిగిందని పేర్కొంది. అయితే, అది సహజ మైన పెరుగుదల కాక కరోనా తర్వాత కుటుంబ ఆదాయాలు దెబ్బతినడంతో తప్పని పరిస్థితుల్లో వచ్చిన పాలపొంగు అని విశ్లేషకుల అభిప్రాయం. వెరసి, లోతుగా గమనిస్తే భారత్‌లోనూ మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యం రేటు ఇవాళ్టికీ తక్కువగానే ఉందన్నది విచారకరమైన వాస్తవం. ఇది మారాలంటే... అర్థవంతమైన ఉపాధి, అదే సమయంలో మహిళా శ్రామికశక్తి భాగస్వామ్యం పెరి గేలా విధాన నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత మన ప్రభుత్వాలది. అందుకు ప్రొఫెసర్ గోల్డిన్ అధ్యయనం నుంచి భారతదేశం సైతం పాఠాలు నేర్వాలి. ఏ దేశమైనా సరే ఆర్థిక పురోగతి సాధించినంత మాత్రాన శ్రామిక విపణిలో లింగ వ్యత్యాసం దానంతట అది తగ్గిపోదని గోల్డిన్ నిరూపించారు. అలాగే, సామాజిక, వ్యవస్థాపరమైన అవ రోధాలు ఉన్నంత కాలం కేవలం స్త్రీ విద్య సైతం శ్రామికశక్తిలో లింగ అంతరాల్ని తగ్గించలేదు. సాంప్రదాయిక సమాజాల్లో పిల్లల పెంపకమూ ఓ కీలకాంశం. విధాన నిర్ణేతలు వీటిని దృష్టిలో ఉంచుకోవాలి. లింగ కోణం నుంచి అర్థశాస్త్ర అధ్యయనం ప్రధాన స్రవంతిలో భాగం కాదన్న భావనల్ని గోల్డిన్ బద్దలుకొట్టారు. అమెరికా నుంచి ఇరాన్ దాకా ప్రపంచంలో ప్రతి చోటా ఇవాళ్టికీ ఆడవారి పరిస్థితి ఒకేలా ఉంది. ఇవాళ పురుషుల్లో నూటికి 80 మంది ఉద్యోగాల్లో ఉంటే, ప్రపంచ మహిళా జనాభాలో కేవలం సగం మందే వేతన ఉపాధి పొందుతున్నారు. అదీ మగవాళ్ళ కన్నా తక్కువ వేతనాలకే పనిచేస్తూ, వృత్తిలో ఉన్నత శిఖరాల అధిరోహణకు అవకాశాలూ తక్కువే. అందుకే, లింగ సమానత్వ సాధనలో ప్రపంచం ప్రయాణించాల్సిన దూరం ఇంకా ఎంతో ఉంది. ఆ దిశలో నోబెల్ విజేతలైన గోల్డిన్ అధ్యయనం, నర్గిస్ పోరాటం మనకు తాజా మార్గదర్శకాలు. -
ఆర్థిక శాస్త్రంలో క్లాడియా గోల్డిన్‌కు నోబెల్ పురస్కారం
స్టాక్‌హోమ్: 2023 ఏడాదికి గాను ఆర్థిక శాస్త్రంలో అమెరికాకు చెందిన క్లాడియా గోల్డిన్‌కు నోబెల్ పురస్కారం లభించింది. మహిళల లేబర్ మార్కెట్ ఫలితాలపై విశేష కృషి చేసినందుకుగాను ఆమెకు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈ బహుమతిని కేటాయించింది. క్లాడియా గోల్డిన్ అమెరికాకు చెందిన ప్రముఖ లేబర్ ఎకనమిస్ట్. హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. మహిళా శ్రామిక శక్తి, సంపాదనలో లింగ వ్యత్యాసం, ఆదాయ అసమానత, సాంకేతిక మార్పు, విద్య, వలసలతో సహా అనేక రకాల అంశాలపై ఆమె పరిశోధన చేశారు. 1990ల్లోనే హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఆర్ధిక విభాగంలో పనిచేసిన ఏకైక మహిళ క్లాడియా గోల్డిన్. మహిళా ఆర్థిక శక్తిపై ఆమె ఎనలేని పరిశోధన చేశారు. BREAKING NEWS The Royal Swedish Academy of Sciences has decided to award the 2023 Sveriges Riksbank Prize in Economic Sciences in Memory of Alfred Nobel to Claudia Goldin “for having advanced our understanding of women’s labour market outcomes.”#NobelPrize pic.twitter.com/FRAayC3Jwb — The Nobel Prize (@NobelPrize) October 9, 2023 నోబెల్ బహుమతుల విజేతలను ప్రకటించే క్రమంలో ఇప్పటికే వైద్య, భౌతిక రంగంలోని అవార్డు గ్రహీతలను ప్రకటించిన కమిటీ బుధవారం రసాయన శాస్త్రం, గురువారం సాహిత్యం, శుక్రవారం నోబెల్ శాంతి రంగాల్లో బహుమతుల విజేతలను ప్రకటించనుంది. చివరిగా ఈ నెల 9న అర్థశాస్త్రంలో విజేతను ప్రకటించింది జ్యురీ. నోబెల్ విజేతలకు డిసెంబర్ 10న బహుమతులను ప్రదానం చేస్తారు. గత ఏడాది నోబెల్ గ్రహీతలకు 10 మిలియన్ల స్వీడిష్ క్రోనర్లు అందజేశారు. ఈసారి ఆ బహుమతిని మరింత పెంచుతూ 11 మిలియన్ల క్రోనర్లు ఇవ్వనున్నారు. ఇదీ చదవండి: Nobel Prize 2023 In Chemistry: రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం -
నానో టెక్నాలజీపై కృషికి ముగ్గురు శాస్త్రవేత్తలకు దక్కిన గౌరవం
-
అలుపెరగని పోరాటానికి నోబెల్ బహుమతి
-
జాన్ ఫోసేకు సాహిత్య నోబెల్
నార్వే రచయిత జాన్ ఫోసేకు సాహిత్యంలో నోబెల్ పురస్కారం వరించింది. బయటకు చెప్పుకోలేని ఎన్నో అంశాలకు తన నవలలు, నాటకాలు, చిన్న పిల్లల పుస్తకాల ద్వారా గళంగా నిలిచినందుకు ఫోసే ఈ ఏడాది ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికయ్యారు. నోబెల్ లిటరేచర్ కమిటీ చైర్మన్ ఆండర్స్ ఓల్సన్ గురువారం అవార్డును ప్రకటించారు. ఫోసే చేసిన రచనల్లో నార్వే సంస్కృతి, స్వభావాలు ఉట్టిపడుతూ ఉంటాయని కొనియాడారు. ఈ పురస్కారం కింద ఫోసేకు 1.1 కోట్ల స్వీడిష్ క్రోనర్లు (10 లక్షల డాలర్లు) లభిస్తాయి. సాహిత్యంలో నోబెల్ పురస్కారం లభించిందంటే తనని తాను నమ్మలేకపోయానంటూ జాన్ ఫోసే తీవ్ర ఉద్విగ్నానికి లోనయ్యారు. ‘‘నోబెల్ కమిటీ ఫోన్ చేసి చెప్పగానే సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాను. మళ్లీ నన్ను నేనే నిలవరించుకున్నారు. గత పదేళ్లుగా నోబెల్ వస్తుందేమోనని ఎదురు చూస్తున్నాను. ఈ అవార్డు విపరీతమైన ఆనందాన్ని ఇస్తోంది. కాస్త కూడా భయం వేస్తోంది. ’’ అని నార్వే మీడియాకు చెప్పారు. నార్వేలో అత్యంత ప్రతిభావంతుడైన నాటక రచయితగా గుర్తింపు పొందిన ఫోసే 43 వరకు నవలలు, నాటకాలు, చిన్న కథలు, పిల్లల పుస్తకాలు, అనువాదాలు, పద్యాలు, గద్యాలు రచించారు. అయితే నాటక రచయితగానే ఆయనకు విశేషమైన గుర్తింపు లభించింది. మాటల్లో తమ బాధల్ని చెప్పుకోలేని ఎన్నో వర్గాలకు ఆయన తన రచనలతో ఒక గళంగా మారి సామాజిక పరిస్థితుల్ని అద్దంలో చూపించారంటూ ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. రోజువారీ ఘటనలే కథా వస్తువు నిత్యజీవితంలో మనకు ఎదురయ్యే ఘటనలే జాన్ ఫోసే రచనలకు ఆధారం. అలాంటి ఘటనల్ని సరళమైన భాషలో,, శక్తిమంతమైన భావ ప్రకటనతో రచనలు చేసి సామాన్యుల మనసుల్ని కూడా దోచుకున్నారు. మానవ సంబంధాల్లోని బలమైన భావోద్వేగాలను , సామాజిక పరిస్థితుల్ని చిన్నారులకి కూడా అర్థమయ్యేలా రచనలు చేసి సమాజంలో వివిధ వర్గాలపై ఎంతో ప్రభావాన్ని చూపించారు. నార్వేలో 1959లో క్రిస్టియన్ మతాచారాల్ని గట్టిగా ఆచరించే ఒక సంప్రదాయ కుటుంబంలో జన్మించారు. విద్యార్థి దశలోనే ఆయన తన కుటుంబంపైన, మతంపైనా తిరుగుబాటు ప్రకటించారు. తాను నాస్తికుడినని ప్రకటించారు. చిన్నప్పట్నుంచి తిరుగుబాటు ధోరణి కలిగిన జాన్ ఫోసే రచనల్లో, నాటకాల్లో అది వ్యక్తమయ్యేది. 1983లో ఆయన రాసిన మొదటి నవల రెడ్, బ్లాక్‌లో ఆత్మహత్యల అంశాన్ని స్పృశించారు. అప్పట్నుంచి ఆయన వెనక్కి చూసుకోలేదు. నవలైనా, నాటకమైనా, పద్యాలైనా, గద్యాలైనా ఆ రచనల్లో ఆయన ముద్ర స్పష్టంగా కనిపించేది. 40 భాషల్లో పుస్తకాల అనువాదం ఫోసే చేసిన రచనలు ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 40 భాషల్లోకి అనువాదమ య్యాయి. 2015లో ది డైలీ టెలిగ్రాఫ్ రూపొందించిన భూమ్మీద ఉన్న లివింగ్ జీనియస్లలో టాప్ 100 జాబితాలో ఫోసే 83వ స్థానంలో నిలిచారు. 2022లో ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అవార్డు కోసం ఆయన రాసిన ‘‘ఏ న్యూ నేమ్ :సెప్టాలజీ Vఐ– Vఐఐ’’ షార్ట్ లిస్ట్‌లో నిలిచింది. జాన్ ఫోసేకు మూడు పెళ్లిళ్లయ్యాయి. ఆరుగురు పిల్లలకు తండ్రి. 64 ఏళ్ల వయసున్న జాన్ ఫోసే ఆస్ట్రియాలోని తన రెండో భార్యతో కలిసి ఉంటున్నారు. యువకుడిగా ఉన్నప్పుడు దేవుడ్ని నమ్మని జాన్ ఫోసే ప్రస్తుతం కాథలిజంలోకి మారి దానినే అనుసరిస్తున్నారు. ఫోసే చేసిన రచనల్లో బోట్‌హౌస్, మెలాంకలి, సెప్టాలజీ అత్యంత ప్రజాదరణ పొందాయి. ఫోసే రచించిన నాటకాలను వేలాది ప్రొడక్షన్ హౌస్‌లు వివిధ దేశాల్లో ప్రదర్శించాయి. ఇంగ్లిష్ భాషలోకి అనువదించిన ఫోసే సెప్టాలజీ సిరీస్‌లో ది అదర్ నేమ్, ఐ ఈజ్ అనదర్, ఏ న్యూనేమ్ ఆయనకు చాలా గుర్తింపు తీసుకువచ్చాయి. భాషకు పట్టాభిషేకం జాన్ ఫోసే రచనలు నార్వేజియన్ భాషలో రాస్తారు. నార్వేలో 10% మంది మాత్రమే ఈ భాష మాట్లాడే ప్రజలు ఉన్నారు. నార్వేలో ఉన్న రెండు అధికారిక భాషల్లో ఇదొకటి. గ్రామీణ ప్రాంత ప్రజలు మాట్లాడే మాండలికంలో ఉండే ఈ భాష 19వ శతాబ్దంలో డానిస్కు ప్రత్యామ్నాయంగా పుట్టింది. స్వచ్ఛమైన సెలయేరులాంటి భాషలో ప్రజలు రోజువారీ ఎదుర్కొనే సమస్యలకి తన రచనల్లో కొత్త కోణంలో పరిష్కారం మార్గం చూపించడంతో ఆయన పుస్తకాలు అపరిమితమైన ఆదరణ పొందాయి. అందుకే ఈ పురస్కారం తనకే కాకుండా, తన భాషకి కూడా పట్టాభిషేకం జరిగినట్టుగా ఉందని ఫోసే ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నానో ప్రపంచం దగ్గరయింది
బంగారం ఏ రంగులో ఉంటుందో తెలుసు కదా? ముదురు పసుపునకు కొంత కాంతి చేరిస్తే ఉండే రంగు. కానీ, ఇదే బంగారాన్ని నానోస్థాయిలో.. అంటే మన వెంట్రుకలో పదివేల వంతు సూక్ష్మస్థాయిలో చూస్తే దాని రంగు ఎరుపు లేదా వంగపూతగా కనిపిస్తుంది! అదెలా అని ఆశ్చర్యపోనవసరం లేదు. ఇలా నానోస్థాయిలో పదార్థాల ధర్మాల ఆసరాతో అత్యాధునిక ఎల్రక్టానిక్స్ తయారీకి మార్గం చూపిన శాస్త్రవేత్తలకు ఈ ఏడాది రసాయన శాస్త్ర నోబెల్ బహుమతి దక్కిందని మాత్రం తెలుసుకోవాలి! ఆ విశేషాలేమిటో చూసేద్దాం.. క్వాంటమ్ డాట్స్ తయారీకి బాటలు నానోటెక్నాలజీ మనకేమీ కొత్త కాదు. చాలా కాలంగా వేర్వేరు రంగాల్లో వాడకంలో ఉన్నదే. స్పష్టమైన, పలుచని ఎల్ఈడీ స్క్రీన్ల తయారీ మొదలుకొని శరీరంలోని కేన్సర్ కణితులను కత్తిరించడం వరకూ రకరకాలుగా నానో టెక్నాలజీ ఉపయోగపడుతోంది. ఈ అత్యద్భుతమైన టెక్నాలజీ ఆవిష్కరణలకు బీజం వేసిన క్వాంటమ్ డాట్స్‌ను తయారు చేసేందుకు అవసరమైన సాంకేతికతను అభివృద్ధి చేశారు కాబట్టే స్వీడిష్ నోబెల్ అవార్డు కమిటీ.. మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన మౌంగి బావెండీ, కొలంబియా యూనివర్సిటీ శాస్త్రవేత్త లూయిస్ బ్రూస్, నానో క్రిస్టల్స్ టెక్నాలజీ ఇన్‌కార్పొరేషన్‌కు చెందిన అలెక్సీ ఎకిమోవ్‌లకు ఈ ఏడాది రసాయన శాస్త్ర నోబెల్ అవార్డు ప్రకటించింది. సూక్ష్మస్థాయి కణాల ఉత్పత్తి రసాయన శాస్త్రం చదువుకున్న వారు ఎవరికైనా మూలకాల ధర్మాలు వాటిలోని ఎల్రక్టాన్ల సంఖ్యపై ఆధారపడి ఉంటాయని తెలిసే ఉంటుంది. అయితే మూలకం నానోస్థాయికి చేరిందనుకోండి... సాధారణ స్థితిలో ఉండే ధర్మాల స్థానంలో క్వాంటమ్ స్థాయి తాలూకూ ప్రభావం కనిపించడం మొదలవుతుంది. మూలకం సైజును బట్టి ఈ ధర్మాలుంటాయి. ఉదాహరణకు పైన చెప్పుకున్న బంగారం రంగు! అలాగే సైజును బట్టి మూలకాల యాంత్రిక, ఉపరితల, అయస్కాంత, ఎలక్ట్రా్టనిక్, ఆప్టికల్, ఉ్రత్పేరక ధర్మాలు కూడా మారిపోతాయి. సాధారణ సైజులో విద్యుత్తు ప్రవాహాన్ని అడ్డుకోని పదార్థాలు సైజు తగ్గుతున్న కొద్దీ సెమీ కండక్టర్లుగా మారిపోవచ్చు. మరికొన్ని పదార్థాలు సాధారణ సైజులో సెమీకండక్టర్లుగా ఉన్నప్పటికీ నానోస్థాయిలో సూపర్ కండక్టర్లుగా వ్యవహరించవచ్చు. ఇంతటి సూక్ష్మస్థాయిలో ఉండే కణాలను ఉత్పత్తి చేయడంలో ఈ ఏటి రసాయన శాస్త్ర నోబెల్ అవార్డు గ్రహీతలు విజయం సాధించారు. నానో ప్రపంచంలో మూలకాల ధర్మాలు మారిపోతాయని చాలాకాలంగా తెలుసు కానీ.. వీటితో వాస్తవిక ప్రయోజనం తక్కువని అనుకునేవారు. 1980లో అలెక్సీ ఎకిమోవ్ రంగుల గాజులో క్వాంటమ్ ఎఫెక్ట్‌ను సృష్టించడంలో విజయం సాధించారు. కణం సైజు ఆధారంగా రంగు మారుతుందని ఆయన నిరూపించడంతో క్వాంటమ్ డాట్స్‌పై ఆసక్తి పెరిగింది. కొన్నేళ్ల తరువాత ఒక ద్రవంలో స్వేచ్ఛగా కదులుతున్న కణాల సైజుకు అనుగుణంగా క్వాంటమ్ ఎఫెక్ట్స్ మారుతాయని మొట్టమొదటిసారి నిరూపించగలిగారు. భవిష్యత్తులో సురక్షితమైన సమాచార వ్యవస్థ! 1993లో మౌంగి బావెండీ రసాయనికంగా క్వాంటమ్ డాట్స్‌ను ఉత్పత్తి చేయడం మొదలు పెట్టడంతో వీటిని మన ప్రయోజనాలకు వాడుకోవడం సులువు అయ్యింది. ఇప్పుడు మన కంప్యూటర్ మానిటర్లు, క్యూఎల్ఈడీ స్క్రీన్‌లో విస్తృత స్థాయి రంగులు వెదజల్లడం ఈ క్వాంటమ్ డాట్స్ పుణ్యమే. అలాగే మన ఎల్ఈడీ బల్బుల రంగులు మారడానికి కూడా ఇవే కారణం. శరీరంలోని కణజాలాన్ని స్పష్టంగా గుర్తించేందుకు బయో కెమిస్టులు, వైద్యులు ఇప్పుడు క్వాంటమ్ డాట్స్‌ను వాడుతున్నారు. భవిష్యత్తులో ఈ క్వాంటమ్ డాట్స్ ద్వారా ఎటు కావాలంటే అటు మడిచేసుకోగల ఎల్రక్టానిక్స్, అతి సూక్ష్మమైన సెన్సార్లు, పలుచటి సోలార్ సెల్స్ తయారీతోపాటు అత్యంత సురక్షితమైన సమాచార వ్యవస్థను అభివృద్ధి చేసుకునేందుకూ ఉపయోగపడుతుందని అంచనా. క్వాంటమ్ డాట్స్‌పై పరిశోధనలకు నోబెల్ రసాయన శాస్త్రంలో ముగ్గురు అమెరికా సైంటిస్టులకు ప్రతిష్టాత్మక బహుమతి స్టాక్‌హోమ్: రసాయన శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ బహుమతిని ‘ద రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్’ బుధవారం ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక బహుమతి ఈసారి ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలను వరించింది. నానో టెక్నాలజీకి సంబంధించిన క్వాంటమ్ డాట్స్ ఆవిష్కరణలో పరిశోధనలకు గాను మౌంగి బావెండీ, లూయిస్ బ్రూస్, అలెక్సీ ఎకిమోవ్‌లకు రసాయన శాస్త్ర నోబెల్ ప్రైజ్ లభించింది. క్వాంటమ్ డాట్స్ విశ్లేషణ, ఆవిష్కరణలో, నానో పారి్టకల్స్ అభివృద్ధిలో ఈ ముగ్గురు సైంటిస్టులు కీలక పాత్ర పోషించారని నోబెల్ కమిటీ తెలియజేసింది. ‘ద రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్’ అధికారికంగా విజేతల పేర్లు ప్రకటించకముందే ముగ్గురు సైంటిస్టుల పేర్లను స్వీడన్ మీడియా సంస్థలు బహిర్గతం చేయడం కలకలం రేపింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎలక్ట్రాన్ల ప్రపంచానికి కొత్త ‘కాంతి పుంజం’
ఫిజిక్స్‌లో ముగ్గురికి నోబెల్ భౌతిక శాస్త్రంలో ఈ ఏడాది ముగ్గురు శాస్త్రవేత్తలకు ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి లభించింది. అమెరికాలోని ఒహాయో స్టేట్ యూనివర్సిటీకి చెందిన పియరీ అగోస్తినీ, జర్మనీలోని మాక్స్‌ప్లాంక్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్వాంటమ్ ఆప్టిక్స్, లుడ్వింగ్ మాక్సిమిలియన్ యూనివర్సిటీ ఆఫ్ మ్యూనిచ్కు చెందిన ఫెరెంక్ క్రౌజ్, స్వీడన్‌లోని లుండ్ యూనివర్సిటీకి చెందిన అన్నె ఎల్ హుయిలర్ను ఈ బహుమతి వరించింది. 24 ఫ్రేమ్స్ గురించి మీరు వినే ఉంటారు. సెకనుకు ఇరవై నాలుగు ఫ్రేమ్‌ల చొప్పున రీలు తిరిగితే తెరపై బొమ్మ, ఆట, పాట, మాట అన్నీ సవ్యంగా కనిపిస్తాయి! సినిమాకైతే ఇలా ఓకే కానీ పరమాణువుల్లోని ఎల్రక్టాన్లను చూడాలనుకోండి లేదా వాటి కదలికలను అర్థం చేసుకోవాలనుకోండి. అస్సలు సాధ్యం కాదు! ఈ అసాధ్యాన్నీ సుసాధ్యం చేయడంలో కీలకపాత్ర పోషించారు కాబట్టే పియరీ అగోస్తినీ, ఫెరెంక్ క్రౌజ్, అనే ఎల్ హుయిలర్ చేసిన ప్రయోగాలకు ఈ ఏటి భౌతికశాస్త్ర నోబెల్ బహుమతి లభించింది. ఇంతకీ ఏమిటీ ప్రయోగాలు? వాటి ప్రయోజనాలేమిటి? అట్టోసెకను ఫిజిక్స్ ఒక సెకను కాలంలో కాంతి ఎంత దూరం ప్రయాణిస్తుందో మీకు తెలుసా? మూడు లక్షల కిలోమీటర్లకు పిసరంత తక్కువ. మరి అట్టోసెకను కాలంలో? సెకను.. అర సెకను.. పావు సెకను తెలుసు కానీ ఈ అట్టోసెకను ఏమిటి? 3,711 కోట్ల సంవత్సరాల కాలంలో ఒక సెకను ఎంతో సెకనులో అట్టోసెకను అంతన్నమాట! ఇంకోలా చెప్పాలంటే.. టెన్ టు ద పవర్ ఆఫ్ మైనస్ 18. గందరగోళం లేకుండా ఉండాలని అనుకుంటే.. సూక్ష్మాతి సూక్ష్మమైన కాలావధి అని అనుకుందాం. ఇంత తక్కువ సమయంలోనూ కాంతి 0.3 మైక్రోమీటర్లు లేదా ఒక వైరస్ పొడవు అంత దూరం ప్రయాణించగలదు. ఈ సంవత్సరం భౌతికశాస్త్ర నోబెల్ ప్రైజ్ గ్రహీతలు ఇంత సూక్ష్మస్థాయిలో కాంతి పుంజాలను విడుదల చేయగల టెక్నాలజీని అభివృద్ధి చేయడంలో కీలకపాత్ర పోషించారు. ముందుగా చెప్పుకున్నట్లు ఎల్రక్టాన్ల కదలికలు, కాంతికి, పదార్థానికి మధ్య ఉన్న సంబంధాలను అర్థం చేసుకునేందుకు ఈ అట్టోసెకను ఫిజిక్స్ చాలా ఉపయోగపడుతుంది. అంతేకాదు.. వీరి ప్రయోగాల పుణ్యమా అని అణువులు, పరమాణువుల లోపలి కణాలను మరింత క్షుణ్నంగా అర్థం చేసుకునేందుకు ఆస్కారం ఏర్పడింది. కాంతి పుంజాల విశ్లేషణ 2001లో అమెరికాకు చెందిన పియరీ అగోస్తినీ ఈ అట్టోసెకను కాంతి పుంజాలను ఉత్పత్తి చేయడం మాత్రమే కాకుండా సుమారు 250 అట్టోసెకన్ల కాలం ఉండే కాంతి పుంజాలను విశ్లేషించడంలోనూ విజయం సాధించారు. ఈ కాలంలోనే జర్మనీకి చెందిన ఫెరెంక్ క్రౌజ్ కూడా ఈ అట్టోసెకను కాంతి పుంజాలపై పరిశోధనలు చేస్తూండేవారు. కాకపోతే ఈయన 650 అట్టోసెకన్ల కాలపు కాంతి పుంజాన్ని వేరు చేయడంలో విజయవంతం కావడం గమనార్హం. ఒకప్పుడు అసాధ్యం అని అనుకున్న ప్రాసెస్లను కూడా గమనించడం ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగాల వల్ల ఇప్పుడు వీలైంది. ‘‘ఎలక్ట్రాన్ల ప్రపంచానికి ఈ ప్రయోగాలు తలుపులు తెరిచాయి. అట్టోసెకన్ ఫిజిక్స్ ద్వారా ఎల్రక్టాన్లలో జరుగుతున్న కార్యకలాపాలను గమనించడం వీలైంది. ఇకపై ఈ విషయాలను వాడుకోవడం ఎలా? అన్నది మొదలవుతుంది’’ అని నోబెల్ అవార్డు భౌతిక శాస్త్ర కమిటీ అధ్యక్షులు ఎవా ఓల్సన్ వ్యాఖ్యానించడం విశేషం. వ్యాధుల నిర్ధారణలోనూ ఉపయోగకరం ఈ అట్టోసెకను ఫిజిక్స్‌ను ఎల్రక్టానిక్స్‌లో సమర్థంగా ఉపయోగించుకునేందుకు అవకాశముంది. ఎల్రక్టాన్లు ఏ రకమైన పదార్థంతో ఎలా ప్రవర్తిస్తుందో తెలుసుకోగలిగితే.. అతితక్కువ విద్యుత్తును ఉపయోగించుకుని మరింత సమర్థంగా పనిచేయగల ఎల్రక్టానిక్ పరికరాలను తయారు చేయడం వీలవుతుంది. ఎలక్ట్రాన్ల ప్రవాహాన్నే మనం విద్యుత్తు అంటామన్నది తెలిసిందే. వేర్వేరు మూలకాలను గుర్తించేందుకు అట్టోసెకను కాంతి పుంజాలు ఉపయోగపడతాయి కాబట్టి.. భవిష్యత్తులో వ్యాధుల నిర్ధారణకు కూడా వీటిని వాడుకోవడం వీలవుతుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ 1987లో శ్రీకారం అట్టోసెకను కాలపు కాంతి పుంజాలతో ఫొటోలు తీస్తే అణువులు, పరమాణువుల్లో జరిగే కార్యకలాపాలేమిటన్నది స్పష్టంగా తెలుస్తాయి. ఈ అట్టోసెకను కాంతి పుంజాల తయారీకి 1987లో స్వీడన్‌కు చెందిన ఎల్ హుయిలర్ శ్రీకారం చుట్టారని చెప్పాలి. అప్పట్లో ఈ శాస్త్రవేత్త జడ వాయువు గుండా పరారుణ కాంతిని ప్రసారం చేసినప్పుడు వేర్వేరు ఛాయలున్న రంగులు బయటకొస్తున్నట్లు గుర్తించారు. ఒక్కో ఛాయ పరారుణ కాంతి జడ వాయువులోని పరామాణువులతో జరిపిన పరస్పర చర్యల ఫలితం. కొన్ని ఎల్రక్టాన్లు ఈ లేజర్ కిరణాల ద్వారా అదనపు శక్తి పొంది దాన్ని విడుదల చేస్తూంటాయి అన్నమాట. ఈ అంశంపై ఎల్ హుయిలర్ తన ప్రయోగాలు కొనసాగించగా ఆ తరువాతి కాలంలో అనేక కీలకమైన ఫలితాలు లభించాయి. సెకను కంటే తక్కువ సమయాన్ని ఇలా సూచిస్తారు సెకనులో వెయ్యో వంతు... ఒక మిల్లీ సెకను మిల్లీ సెకనులో వెయ్యో వంతు.. ఒక మైక్రో సెకను ఒక మైక్రో సెకనులో వెయ్యో వంతు... ఒక నానో సెకను ఒక నానో సెకనులో వెయ్యో వంతు.. ఒక పికో సెకను ఒక పికో సెకనులో వెయ్యో వంతు.. ఒక ఫెమ్టో సెకను (లాసిక్ కంటి శస్త్రచికిత్సల్లో ఈ స్థాయి లేజర్ కిరణాలను వాడతారు) ఒక ఫెమ్టో సెకనులో వెయ్యో వంతు.. ఒక అట్టో సెకను -
Nobel Prize 2023: భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం
స్టాక్‌హోమ్: ఆయా రంగాల్లోని ప్రజ్ఞావంతులకు నోబెల్ పురస్కారాలను అందించడం సంప్రదాయంగా వస్తోంది. ఇదే క్రమంలో 2023 సంవత్సరానికిగాను భౌతిక శాస్త్రంలో అపార ప్రతిభ కనబరిచిన ముగ్గురు శాస్త్రవేత్తలను ఈ నోబెల్ బహుమతి వరించింది. అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు పెర్రీ అగోస్టిని, ఫెరెంక్ క్రౌజ్, ఎల్'హ్యులియర్‌లకు 'ఒక పదార్థంలోని ఎలక్ట్రాన్ డైనమిక్స్'పై చేసిన విస్తృత పరిశోధనలకుగాను వీరిని నోబెల్ బహుమతి వరించింది. BREAKING NEWS The Royal Swedish Academy of Sciences has decided to award the 2023 #NobelPrize in Physics to Pierre Agostini, Ferenc Krausz and Anne L’Huillier “for experimental methods that generate attosecond pulses of light for the study of electron dynamics in matter.” pic.twitter.com/6sPjl1FFzv — The Nobel Prize (@NobelPrize) October 3, 2023 విభిన్న రంగాల్లోని ప్రతిభావంతులకు నోబెల్ అవార్డులను ప్రకటించే ప్రక్రియ సోమవారం ప్రారంభం కాగా మొదట వైద్య రంగంలోని అవార్డు గ్రహీతలను ప్రకటించింది కమిటీ. ఈరోజు భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతికి ఎంపికైన శాస్త్రవేత్తలు పేర్లను ప్రకటించారు. కాగా ఈ ఏడాది ముగ్గురు శాస్త్రవేత్తలకు సంయుక్తంగా ఈ అవార్డును ప్రకటించడం విశేషం. వీరు ఒక పదార్ధంలోని ఎలక్ట్రాన్ డైనమిక్స్‌లను అధ్యయనం చేసేందుకు అట్టోసెకెండ్ పల్సెస్ డెవలప్మెంట్పై చేసిన ప్రయోగాలకుగాను ఈ అత్యున్నత పురస్కారానికి ఎంపికైనట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది. 2023 physics laureate Pierre Agostini succeeded in producing and investigating a series of consecutive light pulses, in which each pulse lasted just 250 attoseconds. At the same time, his 2023 co-laureate Ferenc Krausz was working with another type of experiment, one that made it… pic.twitter.com/pEFAM0ErNP — The Nobel Prize (@NobelPrize) October 3, 2023 వీరిలో ఎల్'హ్యులియర్ భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి సాధించిన ఐదవ మహిళగా ఘనత సాధించారు. 1903లో మేరీ క్యురీ, 1963లో మరియా గొప్పెర్ట్-మేయర్, 2018లో డొన్నా స్ట్రిక్లాండ్, 2020లో ఘెజ్ భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారాలను సాధించగా 2023 సంవత్సరానికి గాను హ్యులియర్ ఈ పురస్కారాన్ని సాధించి చరిత్రలో చోటు సంపాదించారు. Electrons’ movements in atoms and molecules are so rapid that they are measured in attoseconds. An attosecond is to one second as one second is to the age of the universe.#NobelPrize pic.twitter.com/5Bg9iSX5eM — The Nobel Prize (@NobelPrize) October 3, 2023 This year’s #NobelPrize laureate in physics Anne L’Huillier discovered that many different overtones of light arose when she transmitted infrared laser light through a noble gas. Each overtone is a light wave with a given number of cycles for each cycle in the laser light. They… pic.twitter.com/bJWD4kiE5Z — The Nobel Prize (@NobelPrize) October 3, 2023 నోబెల్ బహుమతుల విజేతలను ప్రకటించే క్రమంలో ఇప్పటికే వైద్య, భౌతిక రంగంలోని అవార్డు గ్రహీతలను ప్రకటించిన కమిటీ బుధవారం రసాయన శాస్త్రం, గురువారం సాహిత్యం, శుక్రవారం నోబెల్ శాంతి రంగాల్లో బహుమతుల విజేతలను ప్రకటించనుంది. చివరిగా ఈ నెల 9న అర్థశాస్త్రంలో విజేతను ప్రకటించనుంది జ్యురీ. నోబెల్ విజేతలకు డిసెంబర్ 10న బహుమతులను ప్రదానం చేస్తారు. గత ఏడాది నోబెల్ గ్రహీతలకు 10 మిలియన్ల స్వీడిష్ క్రోనర్లు అందజేశారు. ఈసారి ఆ బహుమతిని మరింత పెంచుతూ 11 మిలియన్ల క్రోనర్లు ఇవ్వనున్నారు. ఇది కూడా చదవండి: పాక్‌లో జోరుగా కిడ్నీల దోపిడీ.. 328 సర్జరీలు..? -
2023 Nobel Prize: కోవిడ్–19 టీకా పరిశోధనలకు నోబెల్
స్టాక్‌హోమ్: కోవిడ్–19 మహమ్మారి నియంత్రణ కోసం ఎంఆర్ఎన్ఏ (మెసెంజర్ రైబోన్యూక్లియిక్ యాసిడ్) వ్యాక్సిన్ల అభివృద్ధికి తమ పరిశోధనల ద్వారా తోడ్పాటునందించిన ఇద్దరు శాస్త్రవేత్తలకు ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి లభించింది. హంగేరీకి చెందిన కాటలిన్ కరికో, అమెరికన్ డ్రూ వీజ్‌మన్‌కు ఈ ఏడాది వైద్యరంగంలో నోబెల్ ప్రైజ్‌ను స్వీడన్‌లోని నోబెల్ కమిటీ సోమవారం ప్రకటించింది. న్యూక్లియోసైడ్ బేస్ మాడిఫికేషన్లలో వీరిద్దరూ చేసిన నూతన ఆవిష్కరణలు ఎంఆర్ఎన్ఏ టీకాల అభివృద్ధికి దోహదపడ్డాయి. కాటలిన్ కరికో, డ్రూ వీజ్‌మన్ పరిశోధనలతో రెండు ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లకు ఆమోదం లభించిందని, ఈ వ్యాక్సిన్లు కోట్లాది మంది ప్రాణాలను కాపాడాయని నోబెల్ కమిటీ వెల్లడించింది. మన శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ పట్ల ఎంఆర్ఎన్ఏ ఎలా ప్రతిస్పందిస్తున్న దానిపై వీరిద్దరి పరిశోధన మన అవగాహనను పూర్తిగా మార్చివేసిందని పేర్కొంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి గాను ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ల అభివృద్ధి చేయడానికి సహాయపడే న్యూక్లియోసైడ్ బేస్‌కు సంబంధించిన ఆవిష్కరణలకు వీరిని నోబెల్‌తో సత్కరించనున్నట్లు తెలియజేసింది. ఇదిలా ఉండగా, భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని మంగళవారం, బుధవారం రసాయన శాస్త్రంలో, గురువారం సాహిత్యంలో నోబెల్ బహుమతి విజేతల పేర్లను ప్రకటిస్తారు. శుక్రవారం నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించనున్నారు. ఈ నెల 9న అర్థశాస్త్రంలో ఈ బహుమతి గ్రహీత పేరును వెల్లడిస్తారు. విజేతలకు డిసెంబర్ 10న నోబెల్ బహుమతులు ప్రదానం చేస్తారు. గత ఏడాది నోబెల్ గ్రహీతలకు 10 మిలియన్ల స్వీడిష్ క్రోనర్లు అందజేశారు. ఈసారి 11 మిలియన్ల క్రోనర్లు ఇవ్వనున్నారు. సంకల్పానికి తోడైన కృషి 1997లో యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో పనిచేస్తున్న సమయంలో కాటలిన్ కరికో, డ్రూ వీజ్‌మన్ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లపై ఉమ్మడి పరిశోధనలు మొదలుపెట్టారు. వీజ్‌మన్ ఇమ్యునాలజీ, మైక్రోబయాలజీలలో బోస్టన్ యూనివర్సిటీ నుంచి 1987లో పీహెచ్డీ పట్టా పొందారు. అమెరికా ప్రభుత్వ సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్‌లో హెచ్ఐవీ వైరస్‌పై పరిశోధనలు చేశారు. ఆ తరువాతి కాలంలో పెన్సిల్వేనియా యూనివర్సిటీలో వ్యాక్సిన్లపై పరిశోధనలకు శాస్త్రవేత్తల బృందం ఒకదాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు కాటలిన్ కరికో ఎంఆర్ఎన్ఏ బయో కెమిస్ట్రీలో నిపుణులు. ఎంఆర్ఎన్ఏను వైద్యానికి ఉపయోగించాలన్న సంకల్పం ఇరువురిలోనూ మెండు. వేర్వేరు ఆర్ఎన్ఏ రకాలపై వీరు పరిశోధనలు చేపట్టగా 2005లో న్యూక్లియోటైడ్ బేసెస్లో మార్పులకు, దు్రష్పభావాలకు మధ్య సంబంధం స్పష్టమైంది. దీని ఆధారంగానే వారు ఆ బేస్‌లను మారిస్తే అప్పటివరకూ ఉన్న పరిమితులు తొలగిపోతాయని ప్రతిపాదించారు. తదుపరి పరిశోధనలతో దాన్ని రుజువు చేశారు. ఎంఆర్ఎన్ఏ బేస్‌లు మార్చారు.. టీకా సిద్ధం చేశారు! 2019లో మొదలై నెలల వ్యవధిలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కోవిడ్ మహమ్మారి గురించి ఇప్పుడు కొత్తగా చెప్పుకునేందుకు ఏమీ లేదు. తొలినాళ్లలో ఈ వ్యాధిని కట్టడి చేసేందుకు కావాల్సిన టీకా అంత తొందరగా తయారవుతుందా? తయారయ్యేలోపు ఎన్ని ప్రాణాలు పోవాలో అన్న ఆందోళన అందరిలోనూ వ్యక్తమైంది. కానీ.. మానవ సంకల్పం, ఆధునిక టెక్నాలజీల పుణ్యమా అని తక్కువ సమయంలోనే రికార్డు స్థాయిలో టీకాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రపంచం పెను విపత్తు నుంచి చివరి క్షణంలో తప్పించుకుంది. అంతేకాదు, ఈ టీకాల్లో ఒక రకం (ఎంఆర్ఎన్ఏ) మనకు అందుబాటులోకి రావడానికి ఈ సంవత్సరం వైద్యశాస్త్ర నోబెల్ బహుమతి గ్రహీతలైన కాటలిన్ కరికో, డ్రూ వీజ్‌మన్‌ల పరిశోధనలు కీలకమయ్యాయి! ఎందుకు? ఏమిటి? ఎలా? 30 ఏళ్లుగా పరిశోధనలు టీకాల తయారీకి శాస్త్రవేత్తలు వందేళ్లుగా నాలుగు రకాల పద్ధతులను ఉపయోగిస్తున్నారు. వ్యాధికారక సూక్ష్మజీవిని నిరీ్వర్యం చేసి వాడేది ఒక రకమైతే.. ఆ సూక్ష్మజీవి భాగాన్ని ఉపయోగించుకోవడం ఇంకో పద్ధతి. వీటితోపాటు మరికొన్ని పద్ధతులను కూడా ఉపయోగిస్తారు. కానీ.. సుమారు 30 ఏళ్ల క్రితం శరీర కణాల్లోని అతి సూక్ష్మ భాగమైన ఎంఆర్ఎన్(మెసెంజర్ రైబోన్యూక్లియిక్ యాసిడ్)ను కూడా వాడుకోవచ్చని కొంతమంది శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఈ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లపై పరిశోధనలైతే జరిగాయి గానీ సాధించిన ఫలితాలు అంతంతమాత్రంగానే ఉండేవి. కోవిడ్ వ్యాధి ప్రపంచంపై పంజా విసిరిన సందర్భంలో మాత్రం పరిస్థితి వేగంగా మారిపోయింది. వ్యాధి నియంత్రణకు ఎంఆర్ఎన్ఏ టీకా సిద్ధమైంది. ఎన్నో వ్యాధుల నియంత్రణకు ఉపయోగకరం? ఎంఆర్ఎన్ఏ టీకాలనేవి ప్రస్తుతం మనం కోవిడ్ నియంత్రణకు వాడుకున్నాం కానీ.. భవిష్యత్తులో ఈ టెక్నాలజీ చాలా వ్యాధుల కట్టడికి ఉపయోగపడుతుందని, కొన్నింటికి చికిత్సగానూ పనికొస్తుందని శాస్త్రవేత్తల అంచనా. కోవిడ్ తరువాత జంతువుల నుంచి మనుషులకు వైరస్ సంబంధిత వ్యాధులు సోకే అవకాశాలు పెరిగినట్లు ప్రపంచం గుర్తించింది. అయితే, ఇప్పటికీ గుర్తించని వైరస్ రకాలు చాలా ఉన్నాయి. ఒకవేళ భవిష్యత్తులో గుర్తు తెలియని వైరస్ ఏదైనా మనిషిపై దాడి చేస్తే ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీతో సులువుగా టీకా తయారు చేసేందుకు అవకాశం ఏర్పడింది. 2000లో ఏర్పాటైన క్యూర్‌వ్యాక్, 2008లో ఏర్పాటైన బయో ఎన్‌టెక్, 2010 ఏర్పాటైన మోడెర్నా కంపెనీలు ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లపై పరిశోధనలను ముమ్మరం చేశాయి. ఈ మూడు కంపెనీల శాస్త్రవేత్తలు యూనివర్సిటీలతో కలిసి పనిచేయడం ద్వారా ఈ టెక్నాలజీ సాకారమయ్యేలా చేయగలిగారు. జీకా వైరస్ విరుగుడుకు ఇప్పటికే ఎంఆర్ఎన్ఏ వైరస్ ఒకటి అందుబాటులో ఉండగా హెచ్10ఎన్8, హెచ్7ఎన్9 ఇన్ఫ్లుయెంజా వైరస్ల కట్టడికీ ప్రయోగాలు జరుగుతున్నాయి. ఏమిటీ ఎంఆర్ఎన్ఏ? మన కణాల్లోపల కణ కేంద్రకం.. అందులోపల మైటోకాండ్రియా, ఉండచుట్టుకుని క్రోమోజోములు ఉంటాయని చిన్నప్పుడు చదువుకుని ఉంటాం. ఈ క్రోమోజోముల మెలికలను విడదీస్తే అది... మెలితిరిగిన నిచ్చెన ఆకారంలోని డీఎన్ఏ అని కూడా మనకు తెలుస్తుంది. దీంట్లో రెండు పోగులుంటాయి. ఈ డీఎన్ఏలో అక్కడక్కడ కొంత భాగంలో శరీర క్రియలకు అవసరమైన ప్రొటీన్లను తయారు చేసేందుకు కావాల్సిన సమాచారం ఉంటుంది. కొన్ని రసాయన ప్రక్రియల కారణంగా ప్రొటీన్ల తయారీ సమాచారమున్న డీఎన్ఏ భాగాలు పోగు నుంచి విడిపోతుంటాయి. ఇలా విడిపోయిన భాగాన్నే ఎంఆర్ఎన్ఏ అని పిలుస్తారు. ముందుగా చెప్పుకున్నట్లు ఈ ఎంఆర్‌ఎన్‌ఏలను టీకాలుగా వాడుకునేందుకు 30 ఏళ్లుగా పరిశోధనలైతే జరుగుతున్నాయి. అయితే దు్రష్పభావాలు కనిపిస్తున్న నేపథ్యంలో వీటిని వాడటం అసాధ్యమైంది. అలాగే ఎంఆర్‌ఎన్‌ఏలు తగినంత మోతాదులో ప్రొటీన్లు ఉత్పత్తి చేయగలిగేవి కాదు. ఈ నేపథ్యంలో కాటలిన్ కరికో, డ్రూ వీజ్‌మన్‌లు చేసిన పరిశోధనలకు ప్రాముఖ్యత ఏర్పడింది. ఎంఆర్ఎన్ఏ పోగులోని న్యూక్లియోటైడ్ బేసెస్(అడినైన్, థయామీన్, సైటోసైన్, గ్వానైన్ అని నాలుగు బేస్‌లు ఉంటాయి. రెండు పోగుల డీఎన్ఏ మెలితిరిగిన నిచ్చెన మాదిరిగా ఉంటే.. నిచ్చెన మెట్లకు రెండువైపుల ఉండే ఆధారం ఈ బేస్‌లు)మారితే రోగ నిరోధక వ్యవస్థ దాన్ని గుర్తించలేదని, తద్వారా ప్రొటీన్ ఉత్పత్తి పెరగడమే కాకుండా దు్రష్పభావాలూ ఉండవని వీరు తమ పరిశోధనల ద్వారా నిరూపించారు. ఈ పరిశోధనలకు మరికొన్ని ఇతర పరిశోధనలూ తోడు కావడం వల్లనే కోవిడ్–19 విరుగుడుకు రికార్డు సమయంలో రెండు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. BREAKING NEWS The 2023 #NobelPrize in Physiology or Medicine has been awarded to Katalin Karikó and Drew Weissman for their discoveries concerning nucleoside base modifications that enabled the development of effective mRNA vaccines against COVID-19. pic.twitter.com/Y62uJDlNMj — The Nobel Prize (@NobelPrize) October 2, 2023 “For the 20 years that we worked together before anybody knew about us or cared it was literally the two of us sitting side by side at a bench and working together. Usually at 3 or 5am we would be emailing each other with new ideas.” - 2023 medicine laureate Drew Weissman on… pic.twitter.com/WF3hNLJbK3 — The Nobel Prize (@NobelPrize) October 2, 2023 ఇది కూడా చదవండి: అమెరికన్లు త్వరగా ఎందుకు మరణిస్తున్నారు? – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘నోబెల్’ నగదు పురస్కారం భారీగా పెంపు
స్టాక్‌హోమ్: నోబెల్ బహుమతి గ్రహీతలకిచ్చే నగదు మొత్తాన్ని ప్రస్తుతమున్న 1 మిలియన్ క్రోనార్ల(రూ.74.80 లక్షల) నుంచి 11 మిలియన్ క్రోనార్ల (రూ.8.15 కోట్ల)కు పెంచుతున్నట్లు నోబెల్ ఫౌండేషన్ శుక్రవారం ప్రకటించింది. ఇటీవలి కాలంలో స్వీడన్ కరెన్సీ క్రోనార్ విలువ పడిపోవడమే ఇందుకు కారణమని ఒక సంక్షిప్త ప్రకటనలో వివరించింది. అమెరికా డాలర్, యూరోలతో పోలిస్తే క్రోనార్ విలువ ఇంత దిగువకు పడిపోవడం ఇదే మొదటిసారి. స్వీడన్లో ద్రవ్యోల్బణం ఆగస్ట్‌లో 7.2 శాతంగా ఉంది. నోబెల్ బహుమతులను 1901లో మొదటిసారి ప్రదానం చేసినప్పుడు ఒక్కో కేటగిరీకి 1.50 లక్షల క్రోనార్లు అందజేసింది. అప్పటి నుంచి నోబెల్ ఫౌండేషన్ క్రమంగా ఈ మొత్తాన్ని పెంచుకుంటూ వస్తోంది. ఈ ఏడాది నోబెల్ విజేతలను అక్టోబర్‌లో ప్రకటించనుంది. -
ఏపీ విద్యాసంస్కరణలు అద్భుతం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో విద్యాసంస్కరణలు అద్భుతంగా ఉన్నాయని నోబెల్ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ మైకెల్ రాబర్ట్ క్రేమెర్ ప్రశంసించారు. ఆయన గురువారం చికాగో యూనివర్సిటీలోని డెవలప్మెంట్ ఇన్నోవేషన్ ల్యాబ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎమిలీ క్యుపిటో బృందంతో కలిసి రాష్ట్రానికి వచ్చారు. సెంట్రల్ స్క్వేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పర్సనలైజ్డ్ అండ్ అడాప్టివ్ లెర్ణింగ్ (పాల్) ప్రాజెక్టు అమలు చేస్తున్న పాఠశాలలను ఈ బృందం పరిశీలించనుంది. సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన ఈ బృందం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేశ్‌కుమార్, సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావుతో విద్యాసంబంధ అంశాలపై చర్చించింది. విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను అధికారులు ఆ బృందానికి వివరించారు. ఈ బృందం మూడురోజుల పాటు ఏలూరు జిల్లాలో వివిధ పాఠశాలలను సందర్శించనుంది. ఈ సందర్భంగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్‌కుమార్ మాట్లాడుతూ.. ఏపీ విద్యావ్యవస్థపై చికాగో యూనివర్సిటీ బృందం పరిశోధించడం అభినందనీయమన్నారు. ఇలాంటి పరిశోధనలు రాష్ట్రంలో విద్యాభివృద్ధికి మరింత దోహదపడతాయని చెప్పారు. రాష్ట్రంలో విద్యార్థుల అభ్యాస ఫలితాలను మెరుగుపరిచేందుకు పర్సనలైజ్డ్ అండ్ అడాప్టివ్ లెర్ణింగ్ (పాల్) బాగుందని సమగ్ర శిక్ష ఎస్పీడీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఏఎస్పీడీ డాక్టర్ కె.వి.శ్రీనివాసులురెడ్డి, శామో జాయింట్ డైరెక్టర్ బి.విజయ్‌భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
C R Rao: తెలుగోడికి స్టాటిస్టిక్స్ నోబెల్ అవార్డు, 102 ఏళ్ల వయసులో ఘనత
ప్రపంచ ప్రఖ్యాత గణాంకశాస్త్ర నిపుణుడు, భారతీయ అమెరికన్ కల్యంపూడి రాధాకృష్ణరావు (102) స్టాటిస్టిక్స్ రంగంలో అత్యున్నత గౌరవం దక్కింది. గణాంక శాస్త్ర రంగంలో నోబెల్ అవార్డుగా భావించే ఇంటర్నేషల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్ అవార్డు సీఆర్ రావును వరించింది. సాధించడానికి వయస్సుతో పని లేదని నిరూపించిన గొప్ప వ్యక్తి సీఆర్ రావు. వయస్సు అనేది కేవలం ఒక నెంబర్ అని మాత్రమే చెప్పే.. రాధాకృష్ణారావు.. జీవితంలో ఎన్నో సాధించి ఐకాన్‌గా నిలిచారు. 62 ఏళ్లకు కూతురి దగ్గర ఉండేందుకు అమెరికా వెళ్లిన రావు, 70 ఏళ్ల వయస్సులో పిట్స్బర్గ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా చేరారు. ఆయనకు 75 ఏళ్లున్నప్పుడు అమెరికా ప్రభుత్వం పౌరసత్వం ఇచ్చింది. 82 ఏళ్ల వయస్సులో రావు వైట్ హౌజ్ ఇచ్చే అత్యంత ప్రతిష్టాత్మకమైన నేషనల్ మెడల్ ఫర్ సైన్స్ అవార్డు అందుకున్నారు. 102 ఏళ్ల వయస్సులో స్టాటిస్టిక్స్ నోబెల్ అందుకుంటున్నారు. సీఆర్ రావు 1920 సెప్టెంబరు 10న బళ్లారి జిల్లా హడగళిలోని తెలుగు కుటుంబంలో పుట్టారు. ఏపీలోని గూడూరు, నూజివీడు, నందిగామల్లో చదువుకున్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో ఎమ్మెస్సీ మ్యాథ్స్, కోల్‌కతా యూనివర్సిటీలో ఎంఏ స్టాటిస్టిక్స్ చేశారు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలోని కింగ్స్ కాలేజీలో 1948లో పీహెచ్డీ పూర్తి చేశారు. (చదవండి: ‘మహా’ రాజకీయాల్లో మరో ట్విస్ట్.. అజిత్‌ను కలిసిన ఉద్ధవ్) ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్లో విద్యార్థిగా చేరి అదే సంస్థకు డైరెక్టర్‌గా ఎదిగారు. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్‌గా పదవీ విరమణ చేసిన అనంతరం అమెరికాలో స్థిరపడిన ఆయన ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ బఫెలోలో రీసెర్చ్ ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు. కలకత్తా మ్యాథమెటికల్ సొసైటీలో ప్రచురితమైన సీఆర్ రావు పరిశోధన పత్రానికిగాను ఈ అవార్డు దక్కింది. ప్రతి రెండేళ్లకు ఒకసారి ఈ అవార్డును అందజేస్తారు. 2019లో అమెరికాకు చెందిన ప్రొఫెసర్ బ్రాడ్లీ ఎఫ్రాన్, 2021కి అమెరికాకు చెందిన ప్రొఫెసర్ Emerita Nan Laird లకు అందజేశారు. (చదవండి: భార్యాపిల్లల గుర్తుగా చేసిన పనికి.. రూ. 90 కోట్లు అదృష్టం వరించింది!) 2023కి సీఆర్ రావుకు అవార్డు అందనుంది. భారత స్టాటిస్టిక్స్ రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా ప్రొఫెసర్ రావును భారత ప్రభుత్వం 1968లో పద్మభూషణ్, 2001లో పద్మవిభూషణ్‌తో సత్కరించింది. -
ఆమె కథ మన జీవిత కథ
ఆనీ ఎర్నౌ రచనలకు గానీ, శైలికి గానీ అంత ‘వాడి’ ఎక్కడిదంటే... ఎవరు చదువుతుంటే వాళ్లకు అది తమ కథలానే అనిపించడంతో అవి ఎప్పటికప్పుడు పదును తేలుతూ ఉంటాయి! రచయిత్రిగా ఆనీ పోరాటం, ఆమె రచనలు చదివే స్త్రీల పోరాటం వేర్వేరు కాదు. స్త్రీలు తమ శరీరాలపై అధికారాన్ని కలిగి ఉండటానికీ, పురుషులతో సమానంగా జీవించడానికీ చేసే పోరాటమే ఆమె రచనల సారం. ఒక తరం స్త్రీల ఉద్యమగానం అది. ఆమె రచనలన్నీ కూడా కల్పనలా అనిపించే స్వీయ వాస్తవానుభవాలే. సాహిత్యం, సామాజిక శాస్త్రం, చరిత్ర అనే మూడు కూడళ్ల నడుమ నిలబడి సమాజం మరుపున పడి ఉన్న వాళ్ల కోసం ఎలుగెత్తుతున్న స్వరం ఆనీ! సాహిత్యంలో ఇప్పటివరకు పదహారు మంది నోబెల్ గ్రహీతలతో అత్యధికంగా విజేతలను కలిగి ఉన్న దేశం ఫ్రాన్స్. వారిలో ఏకైక మహిళ ఆనీ ఎర్నౌ. 2022 సంవత్సరానికి గాను ఆనీ నోబెల్ విజేతగా నిలిచారు. ఆమె కంటే ముందు 2014లో ప్యాట్రిక్ మాడియానో, 2008లో జె.ఎం.జి. క్లెజియో ఈ ఘనత సాధించారు. ఫ్రాన్స్‌లోని నార్మాండీలో 1940లో జన్మించిన ఆనీ ఎర్నౌ నిరాడంబరమైన కుటుంబంలో పెరిగారు. జీవిక కోసం ఆమె తల్లిదండ్రులు నిత్యావసర వస్తువులను విక్రయించే దుకా ణాన్ని నడుపుతుండేవారు. తర్వాతి కాలంలో ఆ దుకాణం బార్గా, కెఫేగా విస్తరించింది. అక్కడికంతా శ్రామిక వర్గమే వస్తుండేది. తల్లి ప్రోత్సాహం, ప్రోద్బలంతో ఆనీ యూనివర్సిటీ స్థాయి వరకు విద్యను అభ్యసించి, అనంతరం టీచరుగా మారారు. రచయిత్రిగా మారారు. వర్గ వ్యత్యాసాలు, పితృస్వామ్య వ్యవస్థ, అసమానతలు వంటి విస్తృత సామాజిక అంశాలను తన రచనల్లో చర్చించారు. ఆనీ ఎర్నౌ తొలి నవల ‘క్లీన్డ్ ఆఫ్’ (ఫ్రెంచిలో లెజ్ ఆర్మ్వార్ విడేస్) 1974లో వచ్చింది. అయితే ఆమెకు గుర్తింపు వచ్చింది మాత్రం 1983లో వచ్చిన ‘ఎ మ్యాన్స్ ప్లేస్’తోనే. తల్లిదండ్రులు నడిపిన కెఫేలో తను ఎదుగుతున్నప్పటి జ్ఞాపకాలను అందులో రాసుకున్నారామె. తర్వాత 1987లో ‘ఎ ఉమన్ స్టోరీ’ అనే నవల రాశారు. అది ఆనీ తల్లి కథ. అక్కడి నుంచి అంతా రచనా ప్రవాహమే. 2008లో ‘ది ఇయర్స్’ పుస్తకం వచ్చే నాటికి కాలానుక్రమ వైయక్తిక స్మృతుల సమ్మేళనంగా అనేకానేక రచనల్ని చేశారు. ‘ది ఇయర్స్’ ఆనీ స్వీయ గాథ. ఆ నవల ఇంగ్లిష్‌లోకి అనువాదం కాగానే (లెజ్ అన్నీస్ అన్నది ఫ్రెంచి టైటిల్) ఆనీ పేరు సాహితీ ప్రపంచంలో మార్మోగిపోయింది. 1940లు, 90ల మధ్య కాలంలో ఒక స్త్రీ జీవితంలోని ఉత్థాన పతనాలను కథనపరచిన ఈ రచన... మూడో మనిషి చెబుతున్నట్లుగా ముందుకు సాగుతుంది. పాత ఫొటోలను, సినిమా జ్ఞాపకాలను జత పరుస్తూ బాల్యం నుంచి తల్లి అయ్యేవరకు తన జీవితాన్ని అందులో అక్షరబద్ధం చేశారు ఆనీ. 1960లలో తమ కుటుంబం ఎలా జీవించిందీ చెబుతూ, ‘‘మేమెంత సమయాన్ని పొదుపు చేశామో చూసుకుని ఆశ్చర్యపోయే వాళ్లం. సిద్ధంగా అందుబాటులో ఉండే మిరప పొడులతో మా సూప్ తయారయ్యేది. ప్రెస్టో ప్రెషర్ కుక్కర్‌తో త్వరత్వరగా వంట చేసే వాళ్లం. ‘యమోనైజ్’ అయితే రెడీమేడ్‌గా ట్యూబులలో దొరికేసేది. గుడ్డు పచ్చసొన, నూనె, నిమ్మరసం కలిపి తయారు చేసే ఈ మసాలా సాస్‌ను మేమెప్పుడూ సమయం వెచ్చించి సొంతంగా సిద్ధం చేసు కున్నది లేదు. బఠాణీలను తోటలోంచి తెంపుకొచ్చే పని లేకుండా క్యాన్లలో లభించేవాటిని ఇంట్లో తెచ్చి పెట్టుకునేవాళ్లం. చెట్టుపై పండే బేరీ పండ్లను కాకుండా బేరీ పండ్ల సిరప్‌ను వాడేవాళ్లం. జీవితం ఎంత సరళం అయిపోయింది! అదంతా కూడా శతాబ్దాల ప్రయాసలను తుడిచిపెట్టేసే అద్భుతమైన ఆవిష్కరణల ఫలితమే. ఒకరోజు వస్తుంది.. మనమిక ఏదీ చేసుకునే పని లేకుండా’’ అని రాశారు ఆనీ. 1967 గురించి, గర్భ నిరోధక మాత్రల చట్టబద్ధత గురించి చెబుతూ– ‘‘ఆ మాత్రలు జీవితాన్ని ఒక్కసారిగా మార్చేస్తాయని మేము భావించాం. భీతిగొలిపే మా దేహాల నుంచి మాకు విముక్తి లభిస్తుం దనీ, మగవాళ్లకు ఉన్నంత స్వేచ్ఛ ఆ మాత్రలతో మాకూ వచ్చేస్తుందనీ అనుకున్నాం’’ అని రాసుకున్నారు. తన దేశ పౌరురాలికి సాహిత్యంలో నోబెల్ వచ్చిందని తెలియగానే, ఫ్రాన్స్ అధ్యక్షులు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ ఇలా ట్వీట్ చేశారు. ‘‘గత యాభై ఏళ్లుగా ఆనీ ఎర్నౌ దేశ క్రమానుగతులతో పాటు దేశంలోని ప్రజా సమూహాల చారిత్రక జ్ఞాపకాలను అక్షరీకరిస్తున్నారు’’ అని ప్రశంసించారు. ఆనీ రచనా శైలి కత్తిలా పదునైనది. ‘కత్తి పదునులా రాయడం’ పేరుతో 2003లో ఆమె ఒక వ్యాసం కూడా రాశారు. ఆమె రచనలకు గానీ, శైలికి గానీ అంత పదును ఎక్కడిదంటే... ఎవరు చదువుతుంటే వాళ్లకు అది తమ కథలానే అనిపించడంతో అవి పదునెక్కుతాయి. రచయిత్రిగా ఆనీ పోరాటం, ఆమె రచనలు చదివే స్త్రీల పోరాటం వేర్వేరు కాదు. స్త్రీలు తమ శరీరాలపై అధికారాన్ని కలిగి ఉండటానికీ, పురుషులతో సమానంగా జీవించడానికీ చేసే పోరాటమే ఆనీ రచనల్లోని పోరాటం కూడా. ఒక తరం స్త్రీల ఉద్యమగానం అది. ఆమె రచనలన్నీ కూడా కల్పనలా అనిపించే స్వీయ వాస్తవానుభవాలే. ఫ్రాన్స్‌లో గర్భవిచ్ఛిత్తిపై నిషేధం ఉన్నకాలంలో 2000 సంవత్సరంలో ఆమె ‘హ్యాపెనింగ్’ నవల రాశారు. ఆ నవలను అదే పేరుతో ఆడ్రీ దివాన్ సినిమాగా తీశారు. గత ఏడాది విడుదలైన ఆ సినిమా 2021 వెనిస్ చలన చిత్రోత్సవంలో ‘గోల్డెన్ లయన్’ అవార్డు గెలుచుకుంది. సూపర్ మార్కెట్ సంస్కృతి దృక్కోణం నుంచి ఆనీ 2014 లో రాసిన నవల ‘రిగార్డ్లెస్ ల్యూమినరీస్’ సామాజిక అసమానతల్ని సునిశి తంగా పరిశీలించింది. ఈ ఏడాదే విడుదలైన ఆమె కొత్త పుస్తకం ‘జ్యాన్ ఓమె’ తన కన్నా 30 ఏళ్లు చిన్నవాడైన వ్యక్తితో ఆమెకున్న సాన్నిహిత్యం గురించి దాపరికం లేకుండా చెబుతుంది. సాహిత్యం, సామాజిక శాస్త్రం, చరిత్ర అనే మూడు కూడళ్ల నడుమ నిలబడి సమాజం మరుపున పడిపోయిన వాళ్ల కోసం, అసమానతలపై మూగ సాక్షులుగా మిగిలిపోయిన బాధితులకోసం ఎలుగెత్తుతున్న స్వరం ఆనీ ఎర్నౌ. ప్రఖ్యాత ఫ్రెంచి రచయిత మార్సెల్ ప్రూస్ట్ రచనా సంవిధానానికి ప్రూస్టియన్ స్టెయిల్ అని పేరు. కోల్పోయిన గతాన్ని పునరుద్ధరించే, అపస్మారక జ్ఞాపకశక్తిని ప్రేరేపించే గుణం కలిగి ఉండే ఆయన ధోరణే ఆనీ రచనల్లోనూ కనిపిస్తుంది. సమయం గడిచేకొద్దీ కనుమరుగైపోయే జ్ఞాపకాలను అంటి పెట్టుకుని ఉండేందుకు తన రచనను ఒక మార్గంగా ఆమె నిర్మించుకున్నారు. ‘‘ఒక్క సెకనులో అంతా తుడిచి పెట్టుకు పోతుంది. ఊయలకు, మరణశయ్యకు మధ్య పేరుకుపోయిన పదాల నిఘంటువు పక్కకు ఒరిగిపోతుంది. ఇక మిగిలింది నిశ్శబ్దం. మాటలకు పదాలు ఉండవు. ‘నేను’, ‘నాకు’ అనేవి నోటిలోంచి బయ టికి రావు. నలుగురు చేరి నవ్వుకునే వేళ తరాల విస్తారమైన అనామ కత్వంలోకి అదృశ్యం అయ్యే వరకు మనం మన పేరు తప్ప మరేమీ కాదు... మన పేరును ఎవరైనా ఒక కాగితం మీద పెట్టేవరకు’’ అని రాస్తారామె. ఫ్రెంచి సామాజిక శాస్త్రవేత్త పియర్ బోర్డ్యూ ‘‘కళంకానికి గురైనవారికి జ్ఞాపకశక్తి అధికం’’ అంటారు. అవమానం జరిగిన జ్ఞాపకాలను అస్సలు మర్చిపోలేము. 1997లో ఆనీ రాసిన ‘షేమ్’ పుస్తకంలోని కథాంశం ఇదే. భారతీయ దళిత రచయితలు రాసిన కొన్ని పుస్తకాలను కూడా ఆమె చదివారు. ఓం ప్రకాశ్ వాల్మీకి రాసిన ‘జూఠన్ : యాన్ అన్‌టచబుల్ లైఫ్’ వాటిలో ఒకటి. ఇటీవలే ఈ పుస్తకం ఫ్రెంచిలోకి తర్జమా అయింది. అదొక ప్రామాణికమైన అత్మకథ. ముల్క్ రాజ్ అనంద్ రచనలు కూడా ఆమెకు సుపరిచితమే. మరికొన్ని నెలల్లో ఢిల్లీలో వరల్డ్ బుక్ ఫెయిర్ జరగబోతోంది. ఆనీ ఎర్నౌ నోబెల్ గెలుచుకున్న సందర్భం ఒక్కటే కాదు... ఇండియా గౌరవ అతిథిగా ఫ్రాన్స్ ఆ పుస్తక ప్రదర్శనకు వస్తుండటం, 20 కంటే ఎక్కువ మంది ఫ్రెంచి రచయితల బృందం హాజరవుతుండటం కూడా బుక్ ఫెయిర్‌కు మరింత ప్రాధ్యాన్యం తెచ్చింది. ‘పి.ఎ.పి. (పబ్లికేషన్ అసిస్టెంట్ ప్రోగ్రామ్) టాగోర్’ పేరుతో ఇండియా, రొమెయిన్ రోలాండ్ అవార్డ్’ (అపీజే ఆక్స్ఫర్డ్ బుక్ స్టోర్స్ భాగస్వామ్యంతో ఉత్తమ అనువాదానికి ప్రదానం చేసే అవార్డు)తో ఫ్రాన్స్ ఈ పుస్తక ప్రదర్శనలో ఇచ్చుకోబోయే పరస్పర ప్రచురణ సహకారంతో మరిన్ని ఫ్రెంచి పుస్తకాలు భారతీయ భాషల్లోకి తర్జుమా అయ్యే అవకాశం కలుగుతుందని మనం ఆశించవచ్చు. యాదృచ్ఛికమే అయినా ఇక్కడ ఒక విశేషాన్ని గమనించాలి. టాగోర్ (1913), రొమెయిన్ రోలాండ్ (1915) ఇద్దరూ సాహిత్యంలో నోబెల్ గ్రహీతలే. ఎమ్మాన్యుయేల్ లెనెయిన్ వ్యాసకర్త ఇండియాకు ఫ్రాన్స్ రాయబారి (‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో) -
నోబెల్ బహుమతికి మోదీ అర్హులే!: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ నోబెల్ బహుమతికి అర్హులే.. మరి ఏ కేటగిరీలో దక్కొచ్చునని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. కోవిడ్ వ్యాక్సిన్‌ను కనుగొన్నందుకు మెడిసిన్ విభాగంలో ఇవ్వాలా..? నోట్ల రద్దు, స్విస్ బ్యాంకుల్లో నల్లధనం తీసుకొచ్చినందుకు ఆర్థికశాస్త్రంలో ఇవ్వాలా..? రష్యా–ఉక్రె యిన్ యుద్ధాన్ని ఆరు గంటలు ఆపినందుకు శాంతి విభాగంలో ఇవ్వాలా..? రాడార్ థియరీకి ఫిజిక్స్‌లో ఇవ్వాలా? అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. అంతకుముందు కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తన ప్రసంగంలో కోవిడ్ వ్యాక్సిన్‌ను మొట్టమొదట ప్రధాని మోదీ కను గొన్నారని చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందిస్తూ ‘సైన్స్/మెడిసిన్‌లో నోబెల్ బహుమతిని ప్రధానికి ఇవ్వాలని డిమాండ్ చేద్దామని’.. ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు. ‘కేంద్ర కేబినెట్లో అందరూ తెలివిమంతులేనని.. ముఖ్యంగా కిషన్ రెడ్డి’.. అంటూ వ్యాఖ్యానించారు. ఆస్కార్ కాకపోయినా భాస్కర్ అవార్డు ఇవ్వాల్సిందే అంటూ ప్రధాని మోదీని ఉద్దేశించి మరో వెటకారపు ట్వీట్ చేశారాయన. Modi Ji deserves Nobel prize but in which category? ❇️ Nobel for Medicine - discovering Covid Vaccine ❇️ Nobel for Economics - Demonetisation & Swiss Black Money Returns ❇️ Nobel for Peace - Stopping the Russia-Ukraine war for 6 hours ❇️ Nobel for Physics - Radar Theory — KTR (@KTRTRS) October 17, 2022 To all those BJP folks who feel that Vish Guru deserves more than a Nobel👇 I would also like to nominate Modi Ji of 2013 for his amazing histrionics & theatrical skills in criticising the then Union Govt on Rupee devaluation ఆస్కార్ కాకపోయినా భాస్కర్ అవార్డు ఇవ్వాల్సిందే 👍 pic.twitter.com/QceFay8eVS — KTR (@KTRTRS) October 17, 2022 ఇదీ చదవండి: తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారు! -
ఆర్థికశాస్త్రంలో నోబెల్: ఈ ఏడాది ముగ్గురికి పురస్కారం
స్టాక్‌హోమ్: ఆర్థిక వ్యవస్థలో బ్యాంకుల పాత్రను వివరించడంలో చేసిన కృషికి గాను ఈ ఏడాది ముగ్గురికి నోబెల్ పురస్కారం లభించింది. అమెరికాకు చెందిన బెన్ బెర్నాంకే, డగ్లస్ డైమండ్ , ఫిలిప్ డైబ్విగ్లకు సోమవారం నోబెల్ బహుమతిని ప్రదానం చేశారు. బ్యాంకులు, ఆర్థిక సంక్షోభాలపై ఈ ముగ్గురి పరిశోధనలకు గాను రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈ అవార్డును ప్రకటించింది. ఆర్థిక వ్యవస్థలో బ్యాంకుల పాత్ర, ముఖ్యంగా ఆర్థిక సంక్షోభాల సమయంలో, అలాగే ఆర్థిక మార్కెట్లను ఎలా నియంత్రించాలనే దానిపై అవగాహనను గణనీయంగా మెరుగుపరిచినందుకు ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు జ్యూరీ పేర్కొంది. ఆర్థిక సంక్షోభాల వేళ బ్యాంకుల పాత్ర ఎంత ముఖ్యమైందన్న విషయాన్ని ఈ ముగ్గురూ తమ పరిశోధనల్లో వెల్లడించారు..బ్యాంకులు దివాళా తీయకుండా ఉండేందుకు ఈ స్టడీ చాలా కీలకమైందని పేర్కొంది. BREAKING NEWS: The Royal Swedish Academy of Sciences has decided to award the 2022 Sveriges Riksbank Prize in Economic Sciences in Memory of Alfred Nobel to Ben S. Bernanke, Douglas W. Diamond and Philip H. Dybvig “for research on banks and financial crises.”#NobelPrize pic.twitter.com/cW0sLFh2sj — The Nobel Prize (@NobelPrize) October 10, 2022 -
Annie Ernaux: స్వీయ అనుభవాలే సాహిత్యం
ఆనీ ఎర్నౌకు 23 ఏళ్లు ఉండగా అవాంఛిత గర్భం వచ్చింది. దాంతో చట్టవిరుద్ధంగా అబార్షన్ చేయించుకోవాల్సి వచ్చింది. ఇది జరిగింది 1963లో. 1999లో ఈ అనుభవాన్ని ఆమె నవలగా రాసింది. 130 పేజీల ఈ నవల 2000 సంవత్సరంలో ‘హ్యాపెనింగ్’ పేరుతో వెలువడి సంచలనం రేపింది. కాల్పనిక సాహిత్యం రాసే ఫ్రెంచ్ రచయిత్రి ఆనీ ఎర్నౌ ఆ రకమైన సాహిత్యాన్ని వదిలిపెట్టి స్వీయ జీవితంలోని పరాభవాలు, ఆందోళనలు దాపరికం లేకుండా రాయడం కూడా సాహిత్యమేనని గ్రహించింది. 2022 సంవత్సరానికి ప్రతిష్టాత్మక నోబెల్ ప్రెయిజ్ గెలుచుకున్న ఆనీ ఎర్నౌ ఇంగ్లిష్‌లో రాయకున్నా ఈ బహమతి గెలుచుకున్న అతి కొద్దిమంది మహిళల్లో ఒకరు. ఆమె గురించి... ఆమె పుస్తకాల గురించి... ‘ఇది పురుషాధిక్య ప్రపంచం. దీనిని బోనెక్కించాల్సిన సమయం వచ్చినప్పుడు బోనెక్కించాల్సిందే’ అంటుంది 82 సంవత్సరాల ఫ్రెంచ్ రచయిత్రి ఆనీ ఎర్నౌ. తన జీవితంలో జరిగిన ఒక సంఘటన– చట్ట విరుద్ధంగా అబార్షన్ చేయించుకోవాల్సి రావడాన్ని– 1999లో ఫ్రెంచ్‌లో ‘ఇవెన్మో’ పేరుతో నవలగా రాస్తే మరుసటి సంవత్సరం అది ‘హ్యాపెనింగ్’ పేరుతో ఇంగ్లిష్‌లో అనువాదం అయ్యి వెలువడింది. ఆ సందర్భంగా ఆనీ ఎర్నౌ అన్న మాట అది. ‘నా జీవితంలో నాకు జరిగింది రాయడం ఎందరో స్త్రీలకు గొంతునివ్వడమే’ అని ఆమె అంది. ‘నాకు అవాంఛిత గర్భం వచ్చినప్పుడు అది నా వ్యక్తిగతమైన విషయంగా మిగల్లేదు. బయటపడితే నా కుటుంబం మొత్తం సామాజిక నీతిలో విఫలమైందన్న విమర్శను మోయాల్సి వచ్చేది’ అంటుందామె. కాకతాళీయమే అయినా ఇండియాలో అబార్షన్ గురించి సుప్రీంకోర్టు స్త్రీలకు సంపూర్ణ హక్కులు ఇచ్చిన సందర్భంలోనే అబార్షన్ గురించి, స్త్రీల దైహిక వేదనల గురించి, మనో సంఘర్షణల గురించి, వారికి మాత్రమే ఎదురయ్యే అనుభవాల గురించి అది కూడా శ్రామిక వర్గ కోణం నుంచి విస్తృతంగా రాసిన ఆనీ ఎర్నౌకు నోబెల్ సాహిత్య బహుమతి లభించింది. ఇప్పటి వరకు 119 మంది నోబెల్ సాహిత్య బహుమతి లభిస్తే వారిలో కేవలం 16 మందే స్త్రీలు. ఆనీ ఎర్నౌ 17వ రచయిత్రి. బాల్యం నుంచి గుణపాఠాలే ఫ్రాన్స్‌లోని ఇవెట్తో అనే ఊళ్లో చిన్న పచారీ కొట్టు నడిపేవారు ఆనీ తల్లిదండ్రులు. తండ్రికి పట్టకపోయినా జీవితాలు మారాలంటే చదువు ముఖ్యం అని ఆమె తల్లి గట్టిగా భావించింది. దాంతో తమ స్థాయికి చెందకపోయినా కాస్త మంచిబడిలో ఆనీని చేర్పించింది. ఆ బడికి కలిగిన పిల్లలు వచ్చేవారు. ‘అక్కడే నాకు తొలిపాఠం తెలిసింది. శ్రామిక వర్గానికి దక్కే మర్యాదలు కూడా తెలిశాయి. నిన్ను నువ్వు చిన్నబుచ్చుకుంటూ బతకాల్సి రావడం కంటే ఘోరమైన విషయం లేదు. మన స్థాయికి మించిన విషయాల్లో అడుగు పెట్టకూడదని నాకు గట్టిగా అందిన సందేశం అందింది’ అంటుందామె. ఆమె తన స్వీయానుభవాల ఆధారంగా ‘ఏ గర్ల్స్ స్టోరీ’ (2016) అనే నవల రాసింది. ‘18 ఏళ్ల అమ్మాయి స్టూడెంట్స్ క్యాంప్‌లో లైంగిక అనుభవం పొందితే అది సంతోషకరంగా ఉండాలి. కాని ఇది తెలిసిన వెంటనే మగ విద్యార్థులు ఆ అమ్మాయిని గేలి చేశారు. ఆమె అద్దం మీద అసభ్యకరంగా రాసి వెక్కిరించారు. ఎన్నాళ్లు గడిచినా నైతికంగా పతనమైన భావనను కలిగించారు’ అని రాసిందామె. చదువు ముగిశాక ఆమె టీచర్‌గా మారి ఆనీ ఎర్నౌ 2000 సంవత్సరంలో రిటైరయ్యి పూర్తికాలం రచయిత్రిగా రచనలు కొనసాగిస్తూ ఉంది. సూటిగా, సులభంగా ఆనీ ఎర్నౌ రచనా శైలి సూటిగా సులభంగా ఉంటుంది. నేరుగా పాఠకులకు అందేలా ఆమె వచనశైలి ఉంటుంది. నోబెల్ కమిటీ కూడా ఇదే మాట అంది. ‘ఆమె సాహిత్యం అత్యంత సాధారణ భాషలో అత్యంత పరిశుభ్రంగా ఉంటుంది’ అని అభిప్రాయపడింది. ఆనీ ఎర్నౌ రాసిన పుస్తకాల్లో ‘క్లీన్డ్ ఔట్’ (1974), ‘షేమ్’ (1997), ‘గెటింగ్ లాస్ట్’ (2001), ‘ది ఇయర్స్’ (2008) ముఖ్యమైనవి. 1988లో పారిస్‌లో ఉద్యోగం చేస్తున్న ఒక సోవియెట్ దౌత్యవేత్తతో ఆనీ ఎర్నౌ బంధం ఏర్పరుచుకుంది. అతడు ఆమె కంటే 12 ఏళ్లు చిన్నవాడు. కొంత కాలానికి ఆ బంధం ముగిసింది. ఆ సమయంలో తన భావోద్వేగాలను ‘గెటింగ్ లాస్ట్’ పేరుతో నవల రాసిందామె. అలాగే తన గురించి, ఫ్రాన్స్ సమాజం గురించి రెండో ప్రపంచ యుద్ధం నాటి నుంచి ఇటీవలి కాలం వరకూ జరిగిన ఘటనలను ‘ది ఇయర్స్’గా రాసింది. ఒక రకంగా ఇది స్వీయ చరిత్ర, ఫ్రాన్స్ చరిత్ర కూడా. స్త్రీ పక్షపాతి ఆనీ ఎర్నౌ తనను తాను ‘రచనలు చేసే మహిళ’గా చెప్పుకున్నా ఆమె స్త్రీ పక్షపాతి. స్త్రీవాద ఉద్యమానికి ప్రోత్సాహకురాలు. ‘రాజకీయాలు భ్రష్టుపట్టిన ఈ సమయంలో ఫెమినిస్టులే సరిహద్దులను ప్రశ్నిస్తూ కొత్త ఆలోచనలను చేస్తూ ఆశలు రేకెత్తిస్తున్నారు’ అంటుందామె. ఇటీవల జరిగిన మీటూ ఉద్యమం ఆమెకు చాలా సంతోషాన్నిచ్చింది. ‘తమతో ఎలాగైనా వ్యవహరించవచ్చనే స్థితిని స్త్రీలు ఇక మీద ఏ మాత్రం అంగీకరించరు’ అంటారామె. ‘నేను రాయగలను కాబట్టే నాకు వినూత్న అనుభవాలు ఎదురవుతున్నాయి’ అని చెప్పుకున్న ఆనీ రాయగలిగే మహిళలంతా తమ జీవన అనుభవాలను బెరుకు లేకుండా చెప్పడాన్ని ప్రోత్సహిస్తుంది. అప్పుడే స్త్రీలు, స్త్రీలతో ఉన్న సమాజం మరింత మెరుగ్గా అర్థమవుతాయి. స్వీయ అనుభవాలే రచనలు ఆనీ ఎర్నౌ ఏవో ఊహించి కథలు అల్లడం కన్నా తన జీవితంలో జరిగినవే రాయాలని నిర్ణయం తీసుకుంది. దాంతో ఆమె జ్ఞాపకాల రచయిత్రి అయ్యింది. మన జీవితంలో జరిగినదాన్ని రాయడం వల్ల మిగిలినవారు పోల్చుకోవడానికో, సహానుభూతి చెందడానికో అది ఉపయోగపడుతుంది అంటుందామె. మనుషులు వేరే చోట్ల ఉన్నా వారు భావోద్వేగాలు ఒకటే కదా. ఆనీ ఎర్నౌ రాసిన ‘హ్యాపనింగ్’ నవల ఒక కాలపు ఫ్రాన్స్‌లో స్త్రీల సంఘర్షణను సూటిగా నిలపడంతో ఆమెకు ప్రశంసలు వచ్చాయి. 1963లో ఆమె అబార్షన్ చేయించుకోవాల్సి వస్తే ఆ తర్వాత 12 ఏళ్లకు కాని ఫ్రాన్స్‌లో (అవివాహితులకు) అబార్షన్‌ను చట్టబద్ధం చేయలేదు. ‘అబార్షన్ హక్కు లేకపోవడం అంటే.. చట్టం, సంఘపరమైన నియమాలు వ్యక్తి స్వేచ్ఛను పూర్తిగా ధ్వంసం చేయడమే’ అంటుందామె. -
ప్రెంచ్ రచయిత " అనీ ఎర్నాక్స్ " కు నోబెల్ ప్రైజ్
-
ఆమెతో సహా ముగ్గురికి కెమిస్ట్రీలో నోబెల్
స్టాక్‌హోమ్: రసాయన శాస్త్రంలో 2022 ఏడాదికిగానూ నోబెల్ ప్రైజ్‌ను ప్రకటించారు. అమెరికా శాస్త్రవేత్తలు కరోలిన్ బెర్టోజి, బ్యారీ షార్ప్‌లెస్‌తో పాటు డెన్మార్క్‌కు చెందిన మోర్టన్ మెల్డల్‌లకు సంయుక్తంగా ప్రైజ్‌ను ప్రకటించింది కమిటీ. భారత కాలమానం ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో స్టాక్‌హోమ్(స్వీడన్) రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈ మేర ప్రకటన చేసింది. క్లిక్ కెమిస్ట్రీ, బయోఆర్తోగోనల్ కెమిస్ట్రీ అభివృద్ధి కోసం వీళ్లు చేసిన కృషికిగానూ నోబెల్ ప్రైజ్‌ను ఇస్తున్నట్లు కమిటీ తెలిపింది. ఇదిలా ఉంటే.. షార్ప్‌లెస్‌కు ఇది రెండో నోబెల్ ప్రైజ్. 2001లో ఆయన రసాయన శాస్త్రంలోనే నోబెల్ అందుకున్నారు. BREAKING NEWS: The Royal Swedish Academy of Sciences has decided to award the 2022 #NobelPrize in Chemistry to Carolyn R. Bertozzi, Morten Meldal and K. Barry Sharpless “for the development of click chemistry and bioorthogonal chemistry.” pic.twitter.com/5tu6aOedy4 — The Nobel Prize (@NobelPrize) October 5, 2022 -
నోబెల్ శాంతి బహుమతి రేసులో భారతీయులు!?
న్యూయార్క్: నోబెల్ బహుమతుల ప్రకటనల నడుమ.. ఆసక్తికరమైన అంశం తెర మీదకు వచ్చింది. ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో శాంతి బహుమతి ఎవరికి వెళ్లబోతోందా? అనే చర్చ గత కొంతకాలంగా నడుస్తోంది. ఈ క్రమంలో.. నోబెల్ శాంతి బహుమతి పరిశీలనలో ఇద్దరు భారతీయులు ఉన్నట్లు ప్రముఖ మ్యాగజైన్ టైమ్ ఒక కథనం ప్రచురించింది. భారత్‌కు చెందిన ఫ్యాక్ట్ చెకర్స్ మొహమ్మద్ జుబేర్, ప్రతీక్ సిన్హాలు నోబెల్ శాంతి బహుమతి కమిటీ పరిశీలనలో ఫేవరెట్‌గా ఉన్నట్లు టైమ్ మ్యాగజీన్ కథనం ప్రచురించడం గమనార్హం. ఆల్ట్ న్యూస్ సైట్ తరపున ఫ్యాక్ట్ చెకర్స్గా ఈ ఇద్దరూ పని చేస్తున్నారు. ప్రజాభిప్రాయం ప్రకారం.. నార్వేజియన్ చట్టసభ సభ్యులు, బుక్మేకర్ల నుండి వచ్చిన అంచనాలు, పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఓస్లో (PRIO) ద్వారా ఆధారంగా రేసులో సిన్హా, జుబేర్ ప్రముఖంగా నిలిచినట్లు తెలుస్తోంది. అంతేకాదు శాంతి బహుమతి కమిటీ ఫేవరెట్‌గానూ ఈ ఇద్దరూ ఉన్నట్లు టైమ్ కథనంలో పేర్కొంది. ఇదిలా ఉంటే.. జూన్ నెలలో 2018కి సంబంధించిన ట్వీట్ విషయంలో అరెస్టైన జుబేర్.. నోబెల్ శాంతి బహుమతి పరిశీలనలో ఉండడం గమనార్హం. నెల తర్వాత అతను జైలు నుంచి సుప్రీం కోర్టు బెయిల్ ద్వారా విడుదల అయ్యాడు. ఇక.. జుబేర్ అరెస్ట్ ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది కూడా. ‘‘భారతదేశంలో పత్రికా స్వేచ్ఛ అధ్వాన్నంగా ఉంది, జర్నలిస్ట్‌లకు ఇక్కడి ప్రభుత్వం ప్రతికూల, అసురక్షిత వాతావరణాన్ని సృష్టించింది’’ అంటూ అమెరికాలోని జర్నలిస్ట్ హక్కుల పరిరక్షణ కమిటీ ప్రకటించడం గమనార్హం. నోబెల్ శాంతి బహుమతి 2022 కోసం.. 341 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 251 మంది, 92 సంస్థలు ఉన్నాయి. సాధారణంగా నోబెల్ కమిటీ నామినీల పేర్లను మీడియాకుగానీ, అభ్యర్థులకుగానీ అసలు తెలియజేయదు. అయితే.. కొన్ని మీడియా హౌజ్‌లు మాత్రం సర్వేల ద్వారా అభ్యర్థులను, అర్హత ఉన్నవాళ్లను పేర్లు.. వివరాలతో సహా అంచనా వేస్తుంటాయి. ఇక ఈ ఇద్దరు ఫ్యాక్ట్ చెకర్స్‌తో పాటు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ, ఐరాస శరణార్థ సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థ, పుతిన్ విమర్శకుడు అలెక్సీ నవెల్నీ, బెలారస్ ప్రతిపక్ష నేత స్వియాత్లానా, ప్రముఖ బ్రాడ్‌కాస్టర్ డేవిడ్ అటన్‌బోరఫ్ తదితరులు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. నోబెల్ శాంతి బహుమతి విజేతను అక్టోబర్ 7వ తేదీన ప్రకటిస్తారు. ఇదీ చదవండి: ఈసారి టార్గెట్ జపాన్? -
నోబెల్ 2022: ఫిజిక్స్‌లో ముగ్గురికి ప్రైజ్
స్టాక్‌హోమ్: భౌతిక శాస్త్రంలో 2022 ఏడాదికిగానూ నోబెల్ బహుమతిని ప్రకటించారు. మంగళవారం మధ్యాహ్నం స్టాక్‌హోమ్‌లోని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ కమిటీ ఈ ప్రకటన చేసింది. భౌతిక శాస్త్ర మేధావులు అలెయిన్ ఆస్పెక్ట్, జాన్ ఎఫ్. క్లౌజర్, ఆంటోన్ జెయిలింగర్‌లకు సంయుక్తంగా ఈసారి ప్రైజ్ దక్కింది. చిక్కుబడ్డ ఫోటాన్లు, బెల్ అసమానతలను ఉల్లంఘించడం, క్వాంటం ఇన్ఫర్మేషన్ సైన్స్‌కు మార్గదర్శకత్వం వహించడం లాంటి పరిశోధలకుగానూ ఈ ముగ్గురికి ఈసారి నోబెల్ పురస్కారం దక్కింది. వీళ్ల ప్రయోగాత్మక సాధనాల అభివృద్ధి ‘క్వాంటం టెక్నాలజీ’ కొత్త శకానికి పునాది వేసిందని రాయల్ స్వీడిష్ అకాడమీ ప్రకటన సమయంలో పేర్కొంది. ఫ్రాన్స్‌కు చెందిన భౌతిక శాస్త్రవేత్త అలెయిన్ ఆస్పెక్ట్ కాగా.. జాన్ ఎఫ్. క్లౌజర్ అమెరికాకు చెందిన భౌతిక శాస్త్రవేత్త. ఇక ఆంటోన్ జెయిలింగర్ ఆస్ట్రియాకు చెందిన క్వాంటం భౌతిక శాస్త్రవేత్త. BREAKING NEWS: The Royal Swedish Academy of Sciences has decided to award the 2022 #NobelPrize in Physics to Alain Aspect, John F. Clauser and Anton Zeilinger. pic.twitter.com/RI4CJv6JhZ — The Nobel Prize (@NobelPrize) October 4, 2022 చిక్కుకుపోయిన క్వాంటం స్థితులను ఉపయోగించి సంచలనాత్మక ప్రయోగాలను నిర్వహించారు ఈ ముగ్గురు. ఇక్కడ రెండు కణాలు విడిపోయినప్పుడు కూడా ఒకే యూనిట్‌గా ప్రవర్తిస్తాయి. ఈ ముగ్గురి సాధన ఫలితాలు.. క్వాంటం సమాచారం ఆధారంగా కొత్త సాంకేతికతకు మార్గం క్లియర్ చేశాయి అని నోబెల్ కమిటీ ప్రకటించింది. ► కిందటి ఏడాది కూడా ఫిజిక్స్‌లో ముగ్గురికే సంయుక్తంగా అవార్డు దక్కిన విషయం తెలిసిందే. ► 1901 నుంచి ఇప్పటిదాకా భౌతిక శాస్త్రంలో 115 బహుమతులను ఇచ్చారు. ఇందులో నలుగురు గ్రహీతలు మాత్రమే మహిళలు. మేడమ్ క్యూరీ(1903), మారియా జియోప్పెర్ట్ మయర్(1963), డొన్నా స్ట్రిక్‌ల్యాండ్(2018), ఆండ్రియా గెజ్(2020) ఈ లిస్ట్‌లో ఉన్నారు. ► ఇక ఫిజిక్స్‌లో చిన్నవయసులో నోబెల్ ఘనత అందుకుంది లారెన్స్ బ్రాగ్. కేవలం పాతికేళ్ల వయసుకే ఇతను 1915లో ఫిజిక్స్ నోబెల్ అందుకున్నాడు. -
40 ఏళ్ల కిందట తండ్రి.. ఇప్పుడేమో కొడుకు!
ప్రముఖ జన్యుశాస్త్రవేత్త, ఫ్రొఫెసర్ స్వాంటే పాబో Svante Paabo.. 2022 ఏడాదికిగానూ వైద్య రంగంలో నోబెల్ బహుమతి విజేతగా నిలిచారు. 67 ఏళ్ల స్వాంటే పాబో.. పరిణామ జన్యుశాస్త్రంపై పరిశోధనలు చేస్తూ పేరుప్రఖ్యాతలు, ఎన్నో గౌరవాలు అందుకున్నారు. పాలియోజెనెటిక్స్ సహ వ్యవస్థాపకుల్లో ఒకరు పాబో. పురాతన జీవుల అవశేషాల నుంచి సంరక్షించబడిన జన్యు పదార్థాన్ని పరిశీలించడం ద్వారా గతాన్ని(ఒకప్పటి మనిషి జాతులు- ప్రాచీన ఆదిమతెగల గురించి) అధ్యయనం చేయడం పాలియోజెనెటిక్స్ ముఖ్యోద్దేశం. జర్మనీ లెయిప్జిగ్ నగరంలోని మ్యాక్స్ ఫ్లాంక్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఎవల్యూషనరీ ఆంథ్రోపాలజీలో జన్యుశాస్త్ర విభాగానికి డైరెక్టర్ట్‌గా పాబో గతంలో విధులు నిర్వహించారు. జపాన్ ఒకినావా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ & టెక్నాలజీలో ప్రొఫెసర్‌గా పని చేశారు. స్వాంటే పాబో(Svante Paabo) పుట్టింది స్టాక్‌హోమ్‌లో. ఈయన తల్లి ఎస్టోనియాకు చెందిన కెమిస్ట్ కరిన్ పాబో. తండ్రి స్వీడన్‌కు చెందిన ప్రముఖ బయోకెమిస్ట్ కార్ల్ సనె బెర్గ్స్ట్రోమ్. బెర్గ్స్ట్రోమ్ 1982లో వైద్య రంగంలోనే నోబెల్ బహుమతి అందుకోవడం గమనార్హం. స్వీడన్‌కే చెందిన బయోకెమిస్ట్ బెంగ్ట్ శ్యాముల్‌స్సన్, బ్రిటిష్ పార్మకాలజిస్ట్ జాన్ ఆర్ వేన్లతో కలిసి కార్ల్ సనె బెర్గ్స్ట్రోమ్ నోబెల్ బహుమతిని పంచుకున్నారు. ఇప్పుడు బెర్గ్స్ట్రోమ్ తనయుడు పాబో కూడా వైద్యరంగంలోనే నోబెల్ విజేతగా నిలిచారు. పాబో తండ్రి, నోబెల్ గ్రహీత ప్రొఫెసర్ కార్ల్ సనె బెర్గ్స్ట్రోమ్ 1997లో, పాబో తన సహచరులు కలిసి నియాండర్తల్ మైటోకాన్డ్రియల్ DNA (mtDNA) సీక్వెన్సింగ్‌ను విజయవంతంగా నివేదించారు. నియాండర్ లోయలోని ఫెల్‌హోఫర్ గ్రోటోలో కనుగొనబడిన ఒక నమూనా నుంచి ఉద్భవించింది. ఆగష్టు 2002లో.. పాబో డిపార్ట్మెంట్ ‘‘భాషా జన్యువు’’.. FOXP2 గురించి పరిశోధనలను ప్రచురించింది. భాషా వైకల్యం ఉన్న కొందరిలో ఈ జన్యువు లేకపోవడం లేదంటే దెబ్బతినడం గుర్తించారు. పాబో టీం 2006లో.. నియాండర్తల్‌ల మొత్తం జన్యువును పునర్నిర్మించే ప్రణాళికను ప్రకటించారు పాబో. ఈ పరిశోధనకుగానూ.. 2007లో టైమ్ మ్యాగజైన్ అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తులలో ఒకరిగా పాబో ఎంపికయ్యారు. నియాండర్తల్స్.. అంతరించిన మానవజాతి. యూరేషియాలో వేల సంవత్సరాల కిందట బతికిన అర్చాయిక్ ఉపజాతిగా కూడా భావిస్తుంటారు. దాదాపు 70 వేల సంవత్సరాలకు పూర్వం ఆఫ్రికా నుంచి వలస వచ్చిన తర్వాత ప్రస్తుతం అంతరించిపోయిన ఈ హోమినిన్ల నుంచి హోమో సేపియన్లకు జన్యు బదిలీ జరిగిందని పాబో గుర్తించారు. ఫలితంగా.. ఈ తరం మానవుల్లోనూ ఈ పురాతన జన్యువుల ప్రవాహం కొనసాగుతోందని, ఇది రోగ నిరోధక వ్యవస్థను ప్రభావితం చేస్తుందని, అంటువ్యాధులకు ప్రతిస్పందిస్తుందని ఆయన తన బృందంతో సాగించిన పరిశోధనల ఆధారంగా వెల్లడించారు. 2014లో నియాండర్తల్ మ్యాన్: ఇన్ సెర్చ్ ఆఫ్ లాస్ట్ జీనోమ్స్ అనే పుస్తకం పాబో కోణంలో మానవ పరిణామ క్రమాన్ని వివరించే యత్నం చేసింది. కరోనా టైంలోనూ ఆయన చేసిన పరిశోధనలు.. ఎంతో పేరు దక్కించుకున్నాయి. స్వీడన్‌తో పాటు జర్మనీ నుంచి కూడా ఎన్నో ఉన్నత గౌరవాలు, బిరుదులు అందుకున్నారాయన. బయోకెమిస్ట్రీ, మాలిక్యులర్ బయాలజీలో పరిశోధనలకుగానూ.. ఇంటర్నేషనల్ సైంటిఫిక్ సొసైటీ ‘ఎఫ్ఈబీఎస్’ థియోడోర్ బుచర్ మెడల్‌తో ఆయన్ని సత్కరించింది. డాన్ డేవిడ్ ప్రైజ్, మెస్రీ ప్రైజ్‌లు సైతం అందుకున్నారీయన. వీటితో పాటు ఐర్లాండ్, ఆస్ట్రియా, జపాన్, తదితర దేశాల నుంచి కూడా విశేష గౌరవాలను సొంతం చేసుకున్నారు. పాబోSvante Paabo తనను తాను బైసెక్సువల్ అని బహిరంగంగా ప్రకటించుకున్నారు. 2014 వరకు ‘గే’గా ఉన్న ఈయన.. ఆపై సైంటిస్ట్ లిండా విజిలెంట్‌ను వివాహం చేసుకుని.. ఇద్దరు పిల్లల్ని కన్నారు. మానవ పరిణామ క్రమం, అంతరించి పోయిన హొమినిన్ జన్యువులకు సంబంధించిన ఆవిష్కరణలకు గాను పాబోకీ నోబెల్ బహుమతి లభించింది. -
వైద్య రంగంలో నోబెల్ బహుమతి ప్రకటన
స్టాక్‌హోం: ప్రతిష్టాత్మకమైన నోబెల్ విజేతల ప్రకటన మొదలైంది. వైద్య రంగంలో.. జన్యు శాస్త్రవేత్త స్వాంటె పాబో(67)కు అవార్డును ప్రకటించింది నోబెల్ కమిటీ. నోబెల్ కమిటీ ఫర్ ఫిజియాలజీ(మెడిసిన్) సెక్రటరీ థామన్ పెర్ల్‌మాన్ సోమవారం స్వీడన్ రాజధాని స్టాక్‌హోంలోని కారోలిన్స్కా ఇనిస్టిట్యూట్‌లో జరిగిన సమావేశంలో విజేతను ప్రకటించారు. స్వీడన్‌కు చెందిన స్వాంటె పాబోకు మెడిసిన్‌లో నోబెల్ బహుమతి దక్కినట్లు తెలిపారు. అంతరించిపోయిన హోమినిన్ల జన్యువులు, మానవ పరిణామానికి సంబంధించిన ఆయన ఆవిష్కరణలకుగానూ నోబెల్ ఇస్తున్నట్లు కమిటీ పేర్కొంది. నోబెల్ విజేతను ప్రకటిస్తున్న థామన్ పెర్ల్‌మాన్ పాబో తన మార్గదర్శక పరిశోధన ద్వారా ‘‘అసాధ్యంగా అనిపించేదాన్ని’’ సాధించారు. ఇప్పటి మనుషులకు.. అంతరించిపోయిన బంధువైన నియాండర్తల్ జన్యువును క్రమం చేయడం, డెనిసోవా అనే ఇంతకుముందు తెలియని హోమినిన్‌కు సంబంధించి సంచలనాత్మక ఆవిష్కరణను చేసిన పాబో.. 70వేల సంవత్సరాల క్రితం ఆఫ్రికా నుండి వలస వచ్చిన తరువాత ఇప్పుడు అంతరించిపోయిన ఈ హోమినిన్ల నుంచి హోమో సేపియన్లకు జన్యు బదిలీ జరిగిందని కూడా కనుగొన్నారని నోబెల్ కమిటీ తెలిపింది. ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్ యుద్ధ పరిణామాల నేపథ్యంలో.. ఈసారి నోబెల్ విజేతల ప్రకటన ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది. BREAKING NEWS: The 2022 #NobelPrize in Physiology or Medicine has been awarded to Svante Pääbo “for his discoveries concerning the genomes of extinct hominins and human evolution.” pic.twitter.com/fGFYYnCO6J — The Nobel Prize (@NobelPrize) October 3, 2022 -
లాభాలంటే ఇష్టం.. నష్టాలంటే కష్టం
ఆర్థిక శాస్త్రానికి సంబంధించి రెండు విరుద్ధమైన సూత్రాలున్నాయి. ఒకటి సహేతుక నడవడిక. అంటే తమకు నష్టాన్ని కలిగించే లేదా తటస్థ నిర్ణయాలు కాకుండా.. ప్రయోజనం కలిగించే నిర్ణయాలను తీసుకోవడం. మరింత వివరంగా చూస్తే.. ఈ తరహా వ్యక్తులు తమపై, తమ మనసుపై నియంత్రణ కలిగి ఉంటారు. భావోద్వేగాలతో ఊగిపోరు. బిహేవియరల్ ఫైనాన్స్ మాత్రం.. ప్రజలు భావోద్వేగాలతో ఉంటారని.. సులభంగా దారితప్పడమే కాకుండా.. హేతుబద్ధంగా వ్యవహరించలేరని చెబుతోంది. సహేతుకంగా వ్యవహరించడానికి బదులు.. తరచుగా ఆర్థిక నిర్ణయాల విషయంలో తమ భావోద్వేగాలు, ఆలోచనలకు తగ్గట్టు పక్షపాతంగా వ్యవహరిస్తారని అంటోంది. చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లను పరిశీలిస్తే ఈ రెండింటిలో బిహేవియరల్ ఆర్థిక శాస్త్రం చెప్పిందే నిజమని అనిపిస్తుంటుంది. పెట్టుబడుల విషయంలో ఇన్వెస్టర్లపై ప్రభావం చూపించే అంశాలపై అవగాహన కలి్పంచే కథనమే ఇది... 1970, 1980ల్లో విడుదలైన పలు ఆర్థిక అధ్యయన పత్రాలు అన్నీ కూడా.. ఎక్కువ మంది ఇన్వెస్టర్లు పెట్టుబడుల విషయాల్లో సహేతుకంగానే వ్యవహరిస్తారని చెప్పగా.. దీనికి విరుద్ధంగా అదే కాలంలో ప్రముఖ సైకాలజిస్టులు డానియల్ కహెన్‌మాన్, అమోస్ ట్వెర్స్కీ మాత్రం.. ఆర్థికవేత్తలు చెప్పినట్టు సహేతుక నిర్ణయాలను కొద్ది మందే తీసుకుంటున్నట్టు గుర్తించారు. ప్రజలు నిజంగా ఎలా నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై వీరు అధ్యయనం చేశారు. 80వ దశకం చివరి నాటికి ఆర్థికవేత్తల ఆలోచనా ధోరణిని సైకాలజిస్టులు ప్రభావితం చేయడం మొదలైంది. ఇది బిహేవియరల్ ఆర్థిక శాస్త్రానికి దారితీసిందని చెబుతారు. 2002లో డానియల్ కహెన్‌మాన్ ఆర్థిక శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని గెలుచుకున్నారు. ఇన్వెస్టర్లు ఆర్థిక వేత్తలు చెప్పినట్టు కాకుండా.. సైకాలజిస్టులు అంచనా వేసినట్టుగానే ప్రవర్తిస్తుంటారని కహెన్‌మాన్ శిష్యుడైన ఓడియన్ సైతం అంటారు. ‘‘అతి విశ్వాసం, పరిమిత శ్రద్ధ, కొత్తదనం కోసం పాకులాడడం, నష్టపోకూడదన్న తత్వం, అత్యుత్సాహం అన్నవి ఇన్వెస్టర్ల ప్రవర్తనను, ముఖ్యంగా రిటైల్ ఇన్వెస్టర్లను ప్రభావితం చేస్తున్నాయని నేను గుర్తించాను’’ అని ఓడియన్ పేర్కొన్నారు. ‘‘పెట్టుబడులు అంటేనే క్లిష్టమైన అంశం. మనుషులు ఈ విషయంలో అసంపూర్ణంగా వ్యవహరిస్తుంటారు. నిర్ణయాల్లో తప్పులకు అవకాశం ఉంటుంది’’అని బిహేవియరల్ ఫైనాన్స్‌లో విస్తృత అధ్యయనం చేసిన కెనడియన్ ఆర్థికవేత్త అగ్రీడ్ హెర్‡్ష షెఫ్రిన్ (శాంతా క్లారా యూనివర్సిటీ) అంటారు. అటు ఆర్థికవేత్తలు, ఇటు మనస్వత్త శాస్త్రవేత్తలు ఎన్నో అధ్యయనాల ఆధారంగా అంగీకారానికి వచ్చిన విషయం.. పెట్టుబడుల విషయంలో మనుషుల మనస్తత్వం, ఆలోచనలు కీలక పాత్ర పోషిస్తాయని. సెబీ నమోదిత పెట్టుబడుల సలహాదారు చెంతిల్ అయ్యర్ (హోరస్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్స్) కూడా ఇదే విషయాన్ని అంగీకరిస్తారు. ‘‘క్లిష్టమైన అంశాల విషయంలో సత్వర పరిష్కారాలను ఇన్వెస్టర్లు కోరుకుంటారు. ఫలితంగా నిర్ణయాల్లో ఎన్నో తప్పులు దొర్లుతుంటాయి’’ అని ఆయన పేర్కొన్నారు. ఇన్వెస్టర్ల చర్యలపై మానసిక ప్రభావాన్ని.. అలాగే, తార్కిక, భావోద్వేగ, సామాజిక అంశాల ప్రభావాన్ని వివరించేదే బిహేవియరల్ ఫైనాన్స్. పెడచెవిన వాస్తవాలు ఇన్వెస్ట్మెంట్లు, లాభాల స్వీక రణపై అస్పష్ట మానసిక స్థితి తో పాటు, జరుగు తున్న వాస్తవా లను, హెచ్చరికలను పెడచెవిన బెట్టడం మెజారిటీ ఇన్వెస్టర్లకు మామూలే. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం గురించి ఇన్వెస్టర్లను అడిగినప్పుడు.. ఆ సంక్షోభం తాలూకూ సంకేతాలను ముందే గుర్తించామని చెబుతారు. కానీ, ఆయా సంక్షోభాలపై నిపుణుల హెచ్చరికలను మెజారిటీ ఇన్వెస్టర్లు పట్టించుకోకపోవడాన్ని గమనించొచ్చు. అం తెందుకు.. 2020 జనవరి నుంచే చైనాలో ఒక భయంకరమైన (కోవిడ్–19) వైరస్ వెలుగు చూసిందని.. అది ప్రపంచమంతా వ్యాప్తి చెందొచ్చన్న వార్తలను ఎవ్వరూ పట్టించుకోలేదన్నది కూడా వాస్తవం. అధిగమించడం ఎలా..? పెట్టుబడుల విషయంలో పలు ప్రతికూల, అస్పష్ట మానసిక స్థితి, వైఖరులను అధిగమించడం నిజానికి కష్టమైన పనే. ఎందుకంటే మానవులు సాధారణంగానే సంపూర్ణ కచ్చితత్వంతో ఉండరన్నది మనస్తత్వ శాస్త్రవేత్తల అభిప్రాయం. కాకపోతే ఈ తరహా అంశాల విషయంలో కాస్త మెరుగ్గా వ్యవహరించేందుకు ప్రయత్నించొచ్చని చెబుతారు. వీటిని అధిగమించేందుకు మంచి అలవాట్లను ఆచరణలో పెట్టుకోవాల్సి ఉంటుంది. విస్తృతమైన సమాచార పరిజ్ఞానాన్ని సమకూర్చుకుంటే.. ఈ తరహా ధోరణుల్లో పడిపోకుండా కాపాడే మంచి ఆయుధం అవుతుంది. ఇన్వెస్టర్ ముందుగా తన గురించి తాను పూర్తిగా తెలుసుకోవాలి. తన గురించి స్నేహితులను అడిగి తెలుసుకోవాలి. ఇతర ఇన్వెస్టర్ల ధోరణులను విశ్లేషించాలి. అప్పుడు తన ఆలోచనా తీరుపై అంచనాకు రావాలి. ఇన్వెస్టర్లు తమ గురించి మరింత అర్థం చేసుకునేందుకు ఇది సహకరిస్తుందన్నది ఆర్థికవేత్తల అభిప్రాయం. సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవాల్సిన సందర్భాల్లో.. భావోద్వేగాలు, ముందుగా అనుకున్న మానసికమైన సిద్ధాంతాలు అడ్డుపడకుండా ఇది సాయపడుతుందని చెబుతారు. చాలా మంది ఇన్వెస్టర్లకు నిపుణుల సూచన ఏమిటంటే.. వైవిధ్యమైన పెట్టుబడులను ఏర్పాటు చేసుకుని దీర్ఘకాలం పాటు కొనసాగించుకోవాలే కానీ.. స్పెక్యులేటివ్ ట్రేడింగ్ చేయకూడదు. తక్కువ వ్యయాలు (ఎక్స్పెన్స్ రేషియో) ఉండే æ ఫండ్స్ లేదా ఈటీఎఫ్‌లు వైవిధ్యమైన పోర్ట్‌ఫోలియో ఏర్పాటుకు చక్కని మార్గం. తాజా అంశాలపై దృష్టి ‘‘మెజారిటీ ఇన్వెస్టర్లు తాజా రాబడులకు ప్రాధాన్యం ఇస్తారే కానీ, చారిత్రక రాబడులకు కాదు’’ అని యూనివర్సిటీ ఆఫ్ క్యాలిఫోరి్నయా ప్రొఫెసర్ టెర్నాన్స్ ఓడియన్ అంటారు. అంటే ఇటీవలి కాలంలో మంచి పనితీరు చూపించిన స్టాక్స్ లేదా ఇతర ఆస్తులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. కానీ, ఆయా స్టాక్స్, ఆస్తుల పనితీరు అంతకుముందు కాలంలో ఎలా ఉన్నా పట్టించుకోనట్టు వ్యవహరిస్తారు. ఎక్కువ సంఖ్యలో ఇన్వెస్టర్లు రాబడుల వెంట పడినప్పుడు ఆయా స్టాక్స్ ధరలు స్వల్ప కాలంలోనే గణనీయంగా పెరిగిపోవడానికి దారితీస్తుంది. దీని కారణంగా దీర్ఘకాలంలో రాబడులు తక్కువగా ఉండచ్చు. నష్టాలకు కారణం పరిమిత దృష్టి ఉండడం వల్ల ఇన్వెస్టర్లు వారి దృష్టిలో పడిన స్టాక్స్‌ను కొనుగోలు చేస్తారు. కొనుగోళ్లకే కానీ.. విక్రయించడంపై ఈ ప్రభావం తక్కువగా ఉంటుంది. దీని ఫలితం ఎక్కువ మంది ఇన్వెస్టర్లు కొనుగోళ్ల వైపే ఉంటారు. ‘‘తమను ఆకర్షించిన స్టాక్స్‌ను కొనుగోలు చేస్తుంటారు. దీంతో ఆయా స్టాక్స్ ధరలపై ఇది తాత్కాలిక ఒత్తిళ్లకు దారితీస్తుంది. ఇలా ధరలు పెరిగిపోయిన స్టాక్స్‌ను కొనుగోలు చేయడం వల్ల.. అనంతరం వాటి ధరలు అమ్మకాల ఒత్తిడికి పడిపోవడంతో నష్టాల పాలవుతుంటారు’’అని యూనివర్సిటీ ఆఫ్ క్యాలిఫోరి్నయా ప్రొఫెసర్ టెర్నాన్స్ ఓడియన్ వివరించారు. ఏకపక్ష ధోరణి మనలో చాలా మంది సమాచార నిర్ధారణలో ఏకపక్షంగా వ్యవహరిస్తుంటామనేది కాదనలేని నిజం. ఈ ధోరణి కారణంగా మనకు ఫలానా కంపెనీకి సంబంధించి అప్పటికే తెలిసిన సమాచారంపైనే ఆధారపడతామే తప్పించి.. మన నమ్మకాలకు విరుద్ధంగా వచ్చే తాజా సమాచారాన్ని స్వీకరించలేని పరిస్థితుల్లో ఉంటాం. ఉదాహరణకు ఎక్స్ అనే కంపెనీకి సంబంధించిన వ్యాపారం, ఆర్థిక అంశాలు నచ్చి ఇన్వెస్ట్ చేశారనుకోండి. అదే కంపెనీ వ్యాపారానికి సంబంధించి వెలుగులోకి వచ్చే కొత్త అంశాలను పట్టించుకోకుండా వ్యవహరిస్తుంటాం. ఆలోచించకుండా పెట్టుబడులు పెట్టేస్తాం. ఇది నష్టాలకు దారితీస్తుంది. నష్టపోకూడదనే తత్వం ‘రాబడి కోసం పెట్టుబడి పెడతాం.. కనుక నష్టపోయే సందర్భమే వద్దు’ అన్నది చాలా మంది ఇన్వెస్టర్లలో ఉండే ధోరణి. దీంతో రాబడులు ఎలా సంపాదించుకోవాలన్న అంశానికంటే నష్టపోకుండా ఎలా ఉండాలన్న దానిపై దృష్టి ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు ఒక ఇన్వెస్టర్ ఒక తప్పుడు పెట్టుబడి నిర్ణయం తీసుకున్నాడని అనుకుంటే.. నష్టం బుక్ చేసుకోవద్దన్న ధోరణితో అందులోనే కొనసాగుతుంటారు. ఒకవేళ పెట్టుబడిని వెనక్కి తీసుకుంటే నష్టపోయినట్టు అవుతుందని వారి ఆందోళన. నిజానికి అలాగే కొనసాగితే మిగిలినది కూడా నష్టపోవాల్సి వస్తుందేమో? అన్న ఆలోచనను వారు అంగీకరించరు. -
2021 Nobel Peace Prize: ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి వీరికే..
ఓస్లో: ఏటా ప్రపంచంలో శాంతి నెలకొల్పేందుకు వ్యక్తులు, సంస్ధలు చేసిన కృషికి ప్రతిఫలంగా ప్రకటించే నోబెల్ శాంతి పురస్కారానికి ఈ ఏడాది(2021) మరియా రెస్సా, దిమిత్రి మరటోవ్ కు ఎంపికయ్యారు. నార్వేజియన్ నోబెల్ కమిటీ నేడు శాంతి పురస్కారం విజేతను ప్రకటించింది. ప్రజాస్వామ్యానికి మూలమైన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పరిరక్షణ కోసం చేసిన కృషికి గానూ వీరిని ఈ విశిష్ట పురస్కారానికి ఎంపిక చేసినట్లు నోబెల్ కమిటీ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం, మీడియా స్వేచ్ఛ పరంగా తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న ఈ సమయంలో భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం వీరు ధైర్యంగా పోరాడుతున్నారని నోబెల్ కమిటీ కమిటీ ఈ సందర్భంగా ప్రశంసించింది. (చదవండి: రసాయన శాస్త్ర విభాగంలో నోబెల్ బహుమతి విజేతలు వీరే..!) దిమిత్రి మరటోవ్ ఒక రష్యన్ జర్నలిస్ట్, నోవాయా గజెటా వార్తాపత్రిక ఎడిటర్-ఇన్-చీఫ్. 24 ఏళ్ల పాటు ఆ పత్రిక ఎడిటర్‌గా చేశారు. ఈ పత్రికను ప్రారంభించిప్పటి నుంచి రష్యా దేశంలో పేరుకుపోయిన అవినీతి, విధానపరమైన హింస, చట్ట వ్యతిరేక అరెస్టులు, ఎన్నికల్లో మోసాలు వంటి ఎన్నో సంచలనాత్మక కథనాలు ప్రచురించారు. దీంతో అతని మీద అనేక దాడులు చేయడమే బెదిరింపులు కూడా వచ్చాయి. పత్రికా స్వేచ్ఛను రక్షించడంలో చూపించిన ధైర్యసాహసాలకు మురాటోవ్ కు 2007లో సీపీజె అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ అవార్డును గెలుచుకున్నాడు. BREAKING NEWS: The Norwegian Nobel Committee has decided to award the 2021 Nobel Peace Prize to Maria Ressa and Dmitry Muratov for their efforts to safeguard freedom of expression, which is a precondition for democracy and lasting peace.#NobelPrize #NobelPeacePrize pic.twitter.com/KHeGG9YOTT — The Nobel Prize (@NobelPrize) October 8, 2021 మరియా రెస్సా ఫిలిప్పినో-అమెరికన్ జర్నలిస్ట్. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం కోసం 2012లో ఆమె ‘రాప్లర్’ పేరుతో ఓ డిజిటల్ మీడియా కంపెనీని స్థాపించారు. ఓ జర్నలిస్టుగా, రాప్లర్ సీఈవోగా రెసా.. ఎన్నో సంచలనాత్మక కథనాలను ధైర్యంగా ప్రచురించారు. అధికార పరంగా ఒత్తిళ్లు ఎదుర్కొంటూనే.. భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం పోరాడుతూ వస్తున్నారు. ఆగ్నేయ ఆసియాలో సీఎన్ఎన్ పరిశోధనాత్మక రిపోర్టర్ గా దాదాపు రెండు దశాబ్దాలు పనిచేశారు. -
సాహిత్యంలో నోబెల్ బహుమతి అందుకున్న అబ్దుల్ రజాక్ గుర్నా
స్టాక్‌హోమ్: సాహిత్యంలో ఈ ఏడాదికి గాను టాంజేనియా నవలా రచయిత అబ్దుల్ రజాక్ గుర్నాను నోబెల్ బహుమతి వరించింది. వలసవాదంపై ఆయన రాజీలేని పోరాటంతో పాటు, శరణార్థుల వ్యథను కళ్లకు కట్టినందుకుగానూ రజాక్‌కు ఈ పురస్కారాన్ని అందిస్తున్నట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ వెల్లడించింది. ఈ మేరకు ట్వీట్ చేసింది. (చదవండి: 2021 నోబెల్ బహుమతి: వైద్యరంగంలో ఇద్దరికి పురస్కారం) BREAKING NEWS: The 2021 #NobelPrize in Literature is awarded to the novelist Abdulrazak Gurnah “for his uncompromising and compassionate penetration of the effects of colonialism and the fate of the refugee in the gulf between cultures and continents.” pic.twitter.com/zw2LBQSJ4j — The Nobel Prize (@NobelPrize) October 7, 2021 అబ్దుల్ రజాక్ గుర్నా.. 1948లో హిందూ మహాసముద్రంలోని జాంజిబర్ ద్వీపంలో జన్మించారు. కానీ 1960 చివర్లో శరణార్థిగా ఇంగ్లాండ్ వలసవెళ్లారు. ప్రస్తుతం ఆయన కేంట్రబెరీలోని కెంట్ యూనివర్శిటీలో సాహిత్య ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఇక 21వ ఏట నుంచే రచనలు ప్రారంభించారు రజాక్. ఇప్పటివరకు 10 నవలలు, ఎన్నో చిన్న కథలు రచించారు. 2005లో రజాక్ రాసిన ‘డిసర్షన్’ నవల అప్పట్లో సంచలనం సృష్టించింది. చదవండి: వాతావరణంపై పరిశోధనలకు పట్టం -
వాతావరణంపై పరిశోధనలకు పట్టం
స్టాక్‌హోమ్: వాతావరణం వంటి అత్యంత సంక్లిష్టమైన విషయాన్ని అర్థం చేసుకునేందుకు దోహదపడే పరిశోధనలు చేసినందుకు ఈ ఏడాది భౌతికశాస్త్ర నోబెల్ అవార్డును స్యూకోరో మనాబే (90), క్లాస్ హాసెల్మాన్ (89), జియోర్గియో పరిసీ (73) అనే ముగ్గురు శాస్త్రవేత్తలకు ప్రకటించారు. రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈ విషయాన్ని మంగళవారం ప్రకటించింది. మానవ చర్యలు భూ వాతావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయో అర్థం చేసుకునేందకు పునాదులేసినందుకు స్యూకోరో మనాబే, క్లాస్ హాసెల్‌మాన్‌లకు అవార్డులో సగభాగం నగదు బహుమతి లభించగా.. సంక్లిష్ట వ్యవస్థల్లోనూ ఒక పద్దతిని కనుక్కునేందుకు సహకరించిన జియోర్గియో పరిసికు మిగిలిన సగం నగదు దక్కనుంది. భూ వాతావరణం సంక్లిష్టమైందనడంలో ఎలాంటి సందేహమూ అవసరం లేదు. ఎక్కడో దక్షిణ అమెరికా తీరప్రాంతంలోని సముద్ర ఉపరితల జలాలు కొంచెం వేడెక్కితే దాని ప్రభావం ఎల్‌నినో రూపంలో భారత్‌లో వ్యక్తమవుతుంది. రుతుపవనాలు బలహీనపడి వర్షాభావ పరిస్థితులు ఏర్పడతుంటాయి. సముద్రాల్లోని జల ప్రవాహాలు మొదలుకొని వాణిజ్య వాయువులు, కొండలు, గుట్టలు, ఉష్ణోగ్రతల్లో తేడాలు, జీవజాతులు, అటవీ విస్తీర్ణంలో మార్పులు ఇలా.. వందలాది అంశాల ఆధారంగా పనిచేసే వాతావరణాన్ని అర్థం చేసుకునేందుకు ప్రిన్స్టన్ యూనివర్శిటీకి చెందిన స్యూకోరో మనాబే 1960లలోనే ప్రయోగాలు చేశారు. వాతావరణంలో కార్బన్ డైయాక్సైడ్ ఎక్కువైతే భూ ఉపరితల ఉష్ణోగ్రతలు ఎలా పెరుగుతాయో మనాబే పరిశోధనల ద్వారా తెలిసింది. మనాబే సొంతంగా భూ వాతావరణానికి సంబంధించిన భౌతిక నమూనాలను సిద్ధం చేసి.. అందులో రేడియో ధార్మికత సమతౌల్యం, గాలి నిట్టనిలువుగా పైకి ఎలా వెళుతుంది? వంటి అంశాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. వీటి ఫలితంగా ప్రస్తుతం వాతవరణాన్ని అంచనా వేసేందుకు అవసరమైన క్లైమెట్ మోడల్స్ సిద్ధమయ్యాయి. మనాబే పరిశోధనలు ఒకవైపున ఉంటే...పదేళ్ల తరువాత జర్మనీలోని మ్యాక్స్‌ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ మీటిరియాలజీకి చెందిన క్లాస్ హాసెల్మాన్ స్థానిక వాతావరణం, ప్రపంచం మొత్తమ్మీది వాతావరణాలకు మధ్య ఉన్న సంబంధాలను అర్థం చేసుకునేందుకు ఓ మోడల్‌ను తయారు చేశారు. తద్వారా స్థానిక వాతావరణంలో ఎంత గందరగోళంగా ఉన్నా ప్రపంచ వాతావరణాన్ని అర్థం చేసుకోవడంలో క్లైమెట్ మోడల్స్ ఎలా నమ్మదగ్గవో క్లాస్ హాసెల్మాన్ మోడల్ ద్వారా స్పష్టమైంది. ఈ పద్ధతుల వల్ల వాతావరణంలోకి కార్బన్‌డైయాక్సైడ్ ఎక్కువగా చేరడం వంటి మానవ చర్యల వల్ల భూమి ఉపరితల ఉష్ణోగ్రత పెరుగుతోందని (భూతాపోన్నతి) రుజువు చేయడం వీలైంది. గణితం, జీవశాస్త్రం, నాడీ శాస్త్రం, మెషీన్ లెర్నింగ్ వంటి అనేక సంక్లిష్ట వ్యవస్థలను అర్థం చేసుకునేందుకు పరిసీ పరిశోధనలు ఉపయోగపడుతున్నాయి. వీటిల్లో చాలా అంశాలు ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఒక పద్ధతిని అనుసరించకుండా వ్యవహరిస్తున్నట్లు కనిపించినా.. అంతర్గతంలో వాటిల్లోనూ ఒక క్రమపద్ధతి ఉంటుందని గుర్తించారు జియోర్గియో పరిసీ. వాతావరణ మార్పులపై తక్షణ చర్యలు అవసరం: పరిసీ భూ వాతావరణంలో కార్బన్‌డైయాక్సైడ్ వంటి విషవాయువుల మోతాదు పెరిగిపోవడం వల్ల వస్తున్న వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు మానవాళి వేగంగా.. గట్టి సంకల్పంతో తక్షణం చర్యలు చేపట్టాలని ఈ ఏడాది భౌతిక శాస్త్ర నోబెల్ అవార్డులు అందుకున్న వారిలో ఒకరైన జియోర్గియో పరిసీ వ్యాఖ్యానించారు. భవిష్యత్తు తరాల కోసం ఇప్పుడు చర్యలు చేపట్టాల్సిందేనని ఆయన అవార్డు ప్రకటించిన తరువాత మాట్లాడుతూ స్పష్టం చేశారు. అంతకుముందు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లో నోబెల్ అవార్డు కమిటీ ప్రతినిధి గోరాన్ హాన్సన్... క్లాస్ హాసెల్మాన్, స్యూకోరో మనాబేలతోపాటు జియోర్గియో పరిసీలు ముగ్గురికి ఈ ఏడాది భౌతిక శాస్త్ర నోబెల్ అవార్డు అందిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా హాన్సన్ మాట్లాడుతూ ‘‘ఈ ఏడాది గుర్తించిన ఆవిష్కరణలు వాతావరణానికి సంబంధించిన మన విజ్ఞానం గట్టి శాస్త్రీయ పునాదులపై ఏర్పడిందన్న విషయం స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది అవార్డు గ్రహీతలందరూ సంక్లిష్టమైన భౌతిక వ్యవస్థలను మరింత క్షుణ్ణంగా అర్థం చేసుకునేందుకు సాయపడ్డవారే’ అని వ్యాఖ్యానించారు. -
భౌతిక శాస్త్ర విభాగంలో నోబెల్ బహుమతి విజేతలు వీరే..!
వాషింగ్టన్: మెడిసిన్ విభాగంలో 2021 గాను డాక్టర్ డేవిడ్ జూలియస్, డా. అరర్డెం పటాపౌషియన్‌లకు ఉమ్మడిగా నోబెల్ బహుమతిని రాయల్ స్వీడిష్ అకాడమీ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఏడాది గాను భౌతిక శాస్త్ర విభాగంలో చేసిన కృషికిగాను సైకురో మనాబే, క్లాస్ హస్సెల్మాన్, జార్జియో పారిసిలకు సంయుక్తంగా నోబెల్ బహుమతి వరించింది. చదవండి: నోబెల్ : నూట ఇరవై ఏళ్లలో నలుగురు అమెరికాలోని ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయంలో సైకూరే మనాబే సీనియర్ వాతావరణ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. వాతావరణంలో పెరిగిన కార్బన్ డయాక్సైడ్ స్థాయిలు భూఉపరితలంపై ఉష్ణోగ్రతల పెరుగుదలకు ఎలా దారితీస్తాయనే విషయంపై చేసిన పరిశోధనకుగాను నోబెల్ బహుమతి వరించింది. జర్మనీలోని మాక్స్ ప్లాంక్ ఇనిస్టిట్యూట్ ఫర్ మెటరాలజీ యూనివర్సీటిలో ప్రొఫెసర్ క్లాస్ హస్సెల్మాన్ పనిచేస్తున్నారు. వెదర్ అండ్ క్లైమెట్‌కు సంబంధించిన మోడల్‌ను రూపొందించినందుకుగాను నోబెల్ బహుమతి లభించింది. రోమ్‌లోని సపియెంజా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ జియోర్జియో పారిసికి, అస్తవ్యస్తమైన సంక్లిష్ట పదార్థాలలో దాచిన నమూనాలను కనుగొన్నందుకు నోబెల్ బహుమతి వరించింది. సంక్లిష్ట వ్యవస్థల సిద్ధాంతానికి అతని ఆవిష్కరణలు చాలా ముఖ్యమైనవి. BREAKING NEWS: The Royal Swedish Academy of Sciences has decided to award the 2021 #NobelPrize in Physics to Syukuro Manabe, Klaus Hasselmann and Giorgio Parisi “for groundbreaking contributions to our understanding of complex physical systems.” pic.twitter.com/At6ZeLmwa5 — The Nobel Prize (@NobelPrize) October 5, 2021 చదవండి: వైద్యరంగంలో ఇద్దరికి పురస్కారం -
వేడి, ఒత్తిళ్లను గుర్తించే సెన్సర్లు.. ఆవిష్కరణకు వైద్యశాస్త్ర నోబెల్
గదిలో మాంచి నిద్రలో ఉన్నారు... అకస్మాత్తుగా వర్షం పడటం మొదలైంది... వాతావరణం చల్లబడింది... కళ్లు కూడా తెరవకుండా.. చేతులు దుప్పటిని వెతుకుతున్నాయి.. ముసుగేసుకోగానే... చుట్టేసిన వెచ్చదనంతో తెల్లవారి పోయింది! కాళ్లకు చెప్పుల్లేకుండా ఆరు బయట పచ్చిక బయల్లో నడుస్తున్నారు... కాళ్ల కింద నలిగిపోతున్న చిన్న గడ్డిపోచ కూడా మీకు స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది... చర్మాన్ని తాక్కుంటూ వెళ్లిపోతున్న పిల్లగాలిని ఆస్వాదిస్తూంటారు... రాత్రి అయితే చల్లదనాన్ని.. పగలైతే ఎండ వేడి.. తెలిసిపోతూంటాయి! మామూలుగానైతే వీటి గురించి మనం అసలు ఆలోచించం. కానీ... వేడి, ఒత్తిడి వంటి స్పర్శానుభూతులను మనం ఎలా పొందుతామన్న విషయంపై యుగాలుగా శాస్త్రవేత్తలు ఆలోచనలు చేస్తున్నారు. కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటున్నారు కూడా. ఇదే క్రమంలో మన నాడి కొసళ్లలో ఉండే అతిసూక్ష్మమైన సెన్సర్లు వేడిని... శరీరంలోని ప్రత్యేకమైన సెన్సర్లు ఒత్తిడిని గుర్తిస్తాయని ప్రపంచానికి తెలిపిన శాస్త్రవేత్తలు డేవిడ్ జూలియస్, ఆర్డెమ్ పటాపౌటేయిన్‌లు ఈ ఏడాది ప్రతిష్టాత్మక వైద్యశాస్త్ర నోబెల్ అవార్డు దక్కించుకున్నారు. స్వీడన్‌లోని కారోలిన్స్కా ఇన్స్టిట్యూట్లో సోమవారం నోబెల్ అవార్డు కమిటీ ఈ విషయాన్ని ప్రకటించింది. త్వరలో ఒక ప్రత్యేక ఉత్సవంలో వీరికి ఈ అవార్డును అందజేయనున్నారు. వేడి, ఒత్తిడిలను శరీరం ఎలా పసిగడుతోందో తెలుసుకోవడం వల్ల వైద్యశాస్త్రంలో ఎన్నో ప్రయోజనాలు ఏర్పడ్డాయన్నది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేని అంశం. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఇంద్రియాల ద్వారా ఎలా అర్థం చేసుకోగలగుతున్నామన్న ప్రశ్న ఈ నాటిది కాదు. యుగాలనాటిదన్నా ఆశ్చర్యం లేదు. మిరపకాయలోని కాప్‌సేసన్‌ను ఉపయోగించడం ద్వారా ఈ ఏడాది వైద్యశాస్త్ర నోబెల్ అవార్డు గ్రహీతల్లో ఒకరైన డేవిడ్ జూలియస్ మన నాడుల చివర్లలో కొన్ని సెన్సర్ల వంటివి ఉంటాయని, ఇవి వేడి, మంట వంటి అనుభూతులను మెదడుకు చేరవేస్తాయని తెలుసుకోగలిగారు. ఆర్డెమ్ పటాపౌటేయిన్ ఒత్తిడిని గుర్తించే ప్రత్యేక కణాలను వాడి చర్మం, శరీరం లోపలి భాగాల్లోని ప్రత్యేక సెన్సర్లు యాంత్రిక ప్రేరణను ఎలా గుర్తిస్తాయో తెలుసుకున్నారు. 17వ శతాబ్దపు తత్వవేత్త రెన్ డెకాట్ శరీరంలోని వివిధ భాగాలకు, మెదడుకు మధ్య పోగుల్లాంటివి ఉంటాయని.. వీటిద్వారానే వేడి వంటి అనుభూతులు మెదడుకు చేరతాయని ప్రతిపాదించారు.అయితే తరువాతి కాలంలో జరిగిన పరిశోధనలు మన చుట్టూ ఉన్న వాతావరణంలో వచ్చే మార్పులను పసిగట్టేందుకు ప్రత్యేకమైన ఇంద్రియ సంబంధిత న్యూరాన్ల ఉనికిని వెల్లడి చేశాయి. ఇలాంటి వేర్వేరు న్యూరాన్లను గుర్తించినందుకు జోసెఫ్ ఎర్లాంగర్, హెర్బెర్ట్ గాసెర్లకు 1944లో వైద్యశాస్త్ర నోబెల్ అవార్డు కూడా దక్కింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ వేర్వేరు ప్రేరణలను గుర్తించగల నాడీ కణాల గుర్తింపు.. వాటి ద్వారా మన పరిసరాలను అర్థం చేసుకునే విధానాలపై అనేక పరిశోధనలు కూడా జరిగాయి. మనం ముట్టుకునే వస్తువు నున్నగా లేదా గరుకుగా ఉందా తెలుసుకోగలగడం, నొప్పి పుట్టించే వేడి లేదా వెచ్చటి అనుభూతినిచ్చే ఉష్ణోగ్రతల మధ్య అంతరం ఈ ప్రత్యేక నాడీ కణాల ద్వారానే తెలుస్తాయన్నది అంచనా. అయితే వేడి, ఒత్తిడిలాంటి యాంత్రిక ప్రేరణ నాడీ వ్యవస్థలో ఏ విధంగా విద్యుత్ ప్రచోదనాలుగా మారతాయన్న ప్రశ్నకు మాత్రం ఇటీవలి కాలం వరకూ సమాధానం లభించలేదు. డేవిడ్ జూలియస్, ఆర్డెమ్ పటాపౌటేయిన్‌లు ఈ లోటును భర్తీ చేశారు. సెన్సర్ల గుట్టు తెలిసిందిలా.... 1990ల చివరి ఏళ్లలో కాలిఫోర్నియా యూనివర్శిటీ శాస్త్రవేత్తగా డేవిడ్ జూలియస్ కాప్‌సేసన్ అనే రసాయనంపై పరిశోధనలు చేపట్టారు. ఇది నాడీ కణాలను చైతన్యవంతం చేస్తున్నట్లు అప్పటికే తెలుసు. కానీ ఎలా అన్నది మాత్రం అస్పష్టం. డేవిడ్ తన సహచరులతో కలిసి కాప్‌సేసన్ తాలూకూ డీఎన్ఏ పోగులను లక్షల సంఖ్యలో సిద్ధం చేశారు. ఇవన్నీ నొప్పి, వేడి, స్పర్శ వంటి వాటికి మన సెన్సరీ న్యూరాన్లలోని జన్యువులను ఉత్తేజపరిచేవే. తాము సిద్ధం చేసిన డీఎన్ఏ పోగుల్లో కొన్ని కాప్‌సేసన్‌కు స్పందించగల ప్రొటీన్‌ను ఉత్పత్తి చేస్తూండవచ్చునని డేవిడ్ అంచనా వేశారు. మానవ కణాలపై ప్రయోగాలు చేసి కాప్‌సేసన్‌కు స్పందించని జన్యువును గుర్తించగలిగారు. మరిన్ని పరిశోధనలు చేపట్టిప్పుడు ఈ జన్యువు ఒక వినూత్నమైన ఐయాన్ ఛానల్ ప్రొటీన్ తయారీకి కారణమవుతున్నట్లు తెలిసింది. దీనికి టీఆర్పీవీ1 అని పేరు పెట్టారు. ఈ ప్రొటీన్ వేడికి బాగా స్పందిస్తూ చైతన్యవంతం అవుతున్నట్లు తెలియడంతో వేడి తదితరాలను గుర్తించేందుకు శరీరంలో ప్రత్యేకమైన సెన్సర్ల వంటివి ఉన్నట్లు స్పష్టమైంది. ఈ ఆవిష్కరణ కాస్తా శరీరంలో ఇలాంటి సెన్సర్లు మరిన్ని ఉన్నాయన్న విషయాన్ని తెలుసుకునేందుకు ఉపయోగపడింది. మెంథాల్ ద్వారా టీఆర్‌పీఎం8ను గుర్తించారు. ఈ రెండింటికి సంబంధించిన అదనపు అయాన్ ఛానళ్లు ఉష్ణోగ్రతల్లో తేడాలకు అనుగుణంగా చైతన్యవంతం అవుతున్నట్లు తెలిసింది. – నేషనల్ డెస్క్, సాక్షి -
2021 నోబెల్ బహుమతి: వైద్యరంగంలో ఇద్దరికి పురస్కారం
వాషింగ్టన్: వైద్యశాస్త్రంలో 2021 సంవత్సరానికి గాను అమెరికన్ పరిశోధకులకు నోబెల్ బహుమతి లభించింది. డాక్టర్ డేవిడ్ జూలియస్, డా. అరర్డెం పటాపౌషియన్‌లకు ఉమ్మడిగా నోబెల్ బహుమతి ప్రకటించారు. శరీరం ఎందుకు వేడెక్కెతుంది.. స్పర్శలో తేడాలపై పరిశోధనకు గాను వీరద్దరికి నోబెల్ బహుమతి ప్రకటించారు. ‘‘మనిషి మనుగడలో వేడి, చలి,స్పర్శను గ్రహించే మన సామర్థ్యం చాలా అవసరం. పైగా ఈ చర్యలు మన చుట్టూ ఉన్న ప్రపంచంతో మన పరస్పర చర్యను బలపరుస్తుంది. దైనందిన జీవితంలో మనం ఈ అనుభూతులను తేలికగా తీసుకుంటాము. అయితే ఉష్ణోగ్రత, పీడనాన్ని గ్రహించడానికి నరాల ప్రేరణలు ఎలా మొదలవుతాయి అనే ప్రశ్నను పరిష్కరించిందినందుకు గాను ఈ సంవత్సరం డాక్టర్ డేవిడ్ జూలియస్, డా. అరర్డెం పటాపౌషియన్‌లకు ఉమ్మడిగా నోబెల్ బహుమతి ప్రకటించాం’’ అని నోబెల్ అసెంబ్లీ పేర్కొంది. BREAKING NEWS: The 2021 #NobelPrize in Physiology or Medicine has been awarded jointly to David Julius and Ardem Patapoutian “for their discoveries of receptors for temperature and touch.” pic.twitter.com/gB2eL37IV7 — The Nobel Prize (@NobelPrize) October 4, 2021 కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన డేవిడ్ జూలియస్ వేడిని ప్రతిస్పందించే చర్మం నరాల చివరలలో సెన్సార్‌ను గుర్తించడానికిగాను మితిమీరిన ఘాటు ఉండే మిరపకాయల నుంచి కాప్సైసిన్ అనే పదార్ధాన్ని ఉపయోగించారు. స్క్రిప్స్ రీసెర్చ్‌లోని హోవార్డ్ హ్యూస్ మెడికల్ ఇనిస్టిట్యూట్‌లో పని చేసస్తున్న ఆర్డెమ్ పటాపౌటియన్, చర్మం మరియు అంతర్గత అవయవాలలో యాంత్రిక ఉద్దీపనలకు ప్రతిస్పందించే నోవల్ క్లాస్ సెన్సార్లను కనుగొనడానికి ఒత్తిడి-సున్నితమైన కణాలను ఉపయోగించారు. (చదవండి: నోబెల్ : నూట ఇరవై ఏళ్లలో నలుగురు) ఈ పరిశోధనల వల్ల మన నాడీ వ్యవస్థ వేడి, జలుబు, యాంత్రిక ఉద్దీపనలను ఎలా గ్రహిస్తుందనే దానిపై మన అవగాహన మరింత బాగా పెరుగుతుంది. ఈ పరిశోధకులు మన భావాలు, పర్యావరణం మధ్య సంక్లిష్ట పరస్పర చర్యపై మన అవగాహనలో తప్పిపోయిన క్లిష్టమైన లింక్‌లను గుర్తించారు. (చదవండి: నోబెల్ అవార్డు నామినేషన్లలో ట్రంప్ పేరు!) డేవిడ్ జూలియస్ కాలిఫోర్నియా యూనివర్సిటీలో పప్రొఫెసర్గా పని చేస్తున్నానరు. ఇక డా. అర్డెం పటాపౌషియన్ అర్మెనియా నుంచి వచ్చి అమెరికాలో సస్థిరపడ్డారు. లెబనాన్‌లోని బీరూట్‌లో జన్మించిన అరర్డె.. అమెరికాకు వలస వచ్చారు. ప్రస్తుతం లా జొల్లాలో నన్యూరో సైంటిస్ట్‌గా పరశోధనలు చేస్తున్నానరు అర్డెం. చదవండి: పొద్దునే ఫోన్.. బ్యాడ్‌న్యూస్ అనుకున్నా కానీ -
ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లోకి ఆపిల్ కార్లు
ప్రముఖ నోబెల్ బహుమతి గ్రహీత అకిరా యోషినో మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అకిరా యోషినో అంచనా ప్రకారం 2021 ఏడాది చివరి నాటికి ఆపిల్ ఆటోమోటివ్ ప్రపంచంలోకి ప్రవేశించవచ్చు అని అన్నారు. ఇప్పుడు మనం వినియోగిస్తున్న స్మార్ట్ ఫోన్లు, నోట్ బుక్ లలో వాడుతున్న సురక్షితమైన లిథియం-అయాన్ బ్యాటరీలను అభివృద్ధి చేసినందుకు అకిరా యోషినోకి 2019లో ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ భవిష్యత్తు గురుంచి రాయిటర్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎక్కువ వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం టెక్ దిగ్గజ సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాలపై పెడుతున్నట్లు పేర్కొన్నారు. అన్ని సంస్థల కంటే ఆపిల్ ముందు ఉన్నట్లు పేర్కొన్నారు. టైటాన్ అనే ప్రాజెక్ట్ పేరుతో ఆపిల్ ఎలక్ట్రిక్ కారుపై పనిచేస్తున్నట్లు నివేదికలు వస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా టెక్ దిగ్గజం హ్యుందాయ్ వంటి అనేక దక్షిణ కొరియా కార్ల తయారీదారులతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. అయితే, ఆపిల్ గ్లోబల్ ఆటోమేకర్లతో సంబంధం ఉన్న చాలా నివేదికలను ఖండించింది. ప్రస్తుతం జాన్ జియాన్ ఆండ్రియా టైటాన్ అనే ప్రాజెక్టుకు నాయకత్వం వహిస్తున్నారు. ఇంతకు ముందు, జియాన్ ఆండ్రియా 2018 వరకు గూగుల్ సెర్చ్ కు నాయకత్వం వహించారు. గూగుల్ కూడా త్వరలో సెల్ఫ్ డ్రైవింగ్ ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లోకి తీసుకొని రావొచ్చు అని యోషినో అన్నారు.(చదవండి: రిలయన్స్ వ్యాక్సిన్: ట్రయల్స్‌కు గ్రీన్‌సిగ్నల్!) -
వుహాన్ ల్యాబ్‌కు నోబెల్ ప్రైజ్ ఇవ్వాల్సిందే: చైనా
బీజింగ్: కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైన నాటి నుంచి చైనా వుహాన్ ల్యాబ్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. డ్రాగన్ దేశం వుహాన్ ల్యాబ్‌లోనే కరోనా వైరస్‌ను సృష్టించి.. ప్రపంచం మీదకు వదిలిందిని పలు దేశాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చైనా ఓ వింత ప్రతిపాదనను తెర మీదకు తీసుకు వచ్చింది. కరోనా వైరస్‌కు సంబంధించి వుహాన్ ల్యాబ్ ఎన్నో పరిశోధనలు చేస్తుందని.. దీన్ని పరిగణలోకి తీసుకుని.. వుహాన్ ల్యాబ్‌కు ఈ ఏడాది నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఇటీవల నిర్వహించిన ఓ మీడియా సమావేశంలో చైనా విదేశాంగ శాఖ అధికారి ప్రతినిధి జౌ లిజియాన్ మాట్లాడుతూ.. ‘‘కరోనా వైరస్ అధ్యయనంలో వుహాన్ ల్యాబ్ కృషిని గుర్తిస్తూ మెడిసిన్ విభాగంలో నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి’’ అని డిమాండ్ చేశారు. ఇప్పటికే చైనా ప్రభుత్వం వుహాన్ ల్యాబ్‌కి ఆ దేశ అత్యుత్తమ సైన్స్ అవార్డును ప్రధానం చేసింది. కరోనా వైరస్ జీనోమ్‌ని గుర్తించడంలో వుహాన్ ల్యాబ్ చేసిన కృషికి గాను చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ దానికి అవుట్‌స్టాండింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అచీవ్మెంట్ ప్రైజ్ 2021ని ప్రకటించింది. ‘‘కోవిడ్ జీనోమ్ సిక్వేన్స్ని తొలుత వుహాన్ ల్యాబ్ గుర్తించింది. అంటే దానర్థం ఈ వైరస్ ఇక్కడ నుంచే వ్యాప్తి చెందిందని.. లేదంటే మా దేశ శాస్త్రవేత్తలే దానిని తయారు చేసినట్లు కాదు’’ అన్నారు లిజియాన్. డ్రాగన్ డిమాండ్‌పై చైనా వైరాలిజిస్ట్, డాక్టర్ లి మెంగ్ యాన్ స్పందించారు. వుహాన్‌కు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని డిమాండ్ చేయడం చాలా హాస్యాస్పదంగా ఉంది అన్నారు. కరోనా వుహాన్ ల్యాబ్ నుంచి లీకైందని తెలిపిన వారిలో యాన్ కూడా ఒకరు. ఇక చైనా డిమాండ్‌పై సోషల్ మీడియాలో సెటైర్లు ఓ రేంజ్లో పేలుతున్నాయి. ‘‘ఒకవేళ వుహాన్ ల్యాబ్‌కి మెడిసిన్ విభాగంలో నోబెల్ ప్రైజ్ ఇస్తే.. ఐసీస్‌కి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాల్సి ఉంటుంది’’.. ‘‘అవును మన జీవితాలను నాశనం చేయడానికి వుహాన్ ల్యాబ్ ఎంతో కష్టపడి కరోనాను అబివృద్ధి చేసింది. ఆ కృషిని గుర్తించి దానికి నోబెల్ ప్రైజ్ ఇవ్వాల్సిందే.. ప్రతి దేశం దీనికి మద్దతివ్వాల్సిందే’’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. We must admit, the work of the Wuhan Institute of Virology really has touched all of our lives, hasn’t it? https://t.co/eicvXkz94v — Jim Geraghty (@jimgeraghty) June 21, 2021 If Wuhan Lab in China deserves Nobel Prize for Medicine according to China; then ISIS deserves the Nobel peace prize too. — Shining Star 🇮🇳 (@ShineHamesha) June 24, 2021 చదవండి: కరోనా గుట్టు.. చైనా మెడకు బిగుస్తున్న ఉచ్చు! -
బాబ్రే.. నీ పెయింటింగ్స్ అద్భుతం!
అర్ధ శతాబ్దం పాటు.. అమెరికా మేధావుల్ని అదిలించి, కదిలించిన జానపదబాణి.. వాణి బాబ్ డిలాన్. సంగీత ప్రపంచాన్ని ఏలిన ఈ అమెరికా దిగ్గజం, నోబెల్ బహుమతి పొందిన తొలి పాటల రచయితగా రికార్డు సృష్టించిన బాబ్ డిలాన్ అద్భుతమైన చిత్రకారుడు కూడా. ఆశ్చర్యపోవడం అందరి వంతు. 2007లో ఒకసారి జర్మనీలో ‘ద డ్రాన్ బ్లాంక్ సిరీస్’ పేరిట బాబ్ డిలాన్ పెయింటింగ్స్‌ను ప్రదర్శిచడంతో ఆయనలోని మరో కళాత్మక కోణం అబ్బురపరిచింది. ఆ పెయింటింగ్స్‌ను చూసిన వారంతా..‘‘బాబ్ డిలాన్ పాటలు ఎంత మధురమో.. ఆయన చిత్రాలూ అంతే రమణీయం’ అని అభినందించారు. ఆతరువాత లండన్‌లోని నేషనల్ పోర్టరేట్, డెన్మార్క్‌లోని ద నేషనల్ గ్యాలరీ ఆఫ్ డెన్మార్క్, మిలాన్, షాంఘైలలో డిలాన్ పెయింటింగ్‌లను ప్రదర్శించారు. ఇప్పటిదాకా ఎవ్వరూ చూడని బాబ్ పెయింటింగ్స్‌ను తొలిసారి అమెరికాలో ప్రదర్శించనున్నారు. తన అరవైఏళ్లు్లలో డిలాన్ వేసిన చిత్రాలు అధికారికంగా ప్రదర్శనకు రానున్నాయి. ఫ్లోరిడాలోని మియామి నగరంలో ‘ప్యాట్రీషియా అండ్ ఫిలిప్ ఫ్రాస్ట్ ఆర్ట్ మ్యూజియం’ ఇందుకు వేదిక కానుంది. ఈ ఏడాది నవంబర్ 30న ‘రెట్రోస్పెక్ట్రమ్’ పేరిట ఈ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో బాబ్ డిలాన్ వేసిన 120కి పైగా పెయింటింగ్స్, డ్రాయింగ్స్, శిల్పాలను ఉంచుతారు. అయితే ‘రెట్రోస్పెక్ట్రమ్’ ఎగ్జిబిషన్‌ను 2019లో చైనాలోని షాంఘైలోనూ ఏర్పాటు చేశారు. దాన్నే ఇప్పుడు అమెరికాలో పెట్టబోతున్నారు. ‘ఇప్పటిదాక ఎవ్వరూ చూడని కొత్త వస్తువులను ప్రదర్శించడం అనే సరికొత్త వెర్షన్‌తో ఈసారి రెట్రోస్పెక్ట్రమ్ను ఏర్పాటు చేయనున్నాం. దీనిలో వివిధ రకాల కొత్త బ్రాండ్లు, వాటి సిరీస్‌లను ‘అమెరికన్ పాస్టోరల్స్’ పేరుతో ప్రదర్శిస్తారు. ఇది 2021 నవంబర్ 30న మొదలై 2022 ఏప్రిల్ 17 వరకు కొనసాగుతుంది. బాబ్ డిలాన్.. అమెరికాలోని వివిధ ప్రాంతాలను సందర్శించినప్పుడు ఆయన చూసిన ప్రాంతాలు, ఎదురైన సన్నివేశాలు, సంఘటనలు పెయింటింగ్స్‌గా ప్రతిబింబిస్తాయ’ని ఎగ్జిబిషన్ నిర్వాహకులు చెప్పారు. ఈ ఏడాది మే 24న బాబ్ డిలాన్ 80వ జయంతి. ఆ సందర్భంగా ఆయన పెయింటింగ్స్ ప్రదర్శనకు రావడం విశేషం. డిలాన్ 80వ పుట్టినరోజును పురస్కరించుకుని బీబీసీ రేడియో–4, ఇంకా అమెరికాలో వివిధ రేడియోల్లో ఆయనపై ప్రత్యేక కార్యక్రామలను ప్రసారం చేయనున్నాయి. – పి. విజయా దిలీప్ చదవండి: ద బాబ్రే... నిత్య యవ్వనం నీ స్వరం! -
నోబెల్ అవార్డు నామినేషన్లలో ట్రంప్ పేరు!
స్టాక్‌హోమ్: అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి అవార్డు నామినేషన్ల ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. ఈ ఏడాది అక్టోబర్‌లో బహుకరించే ఈ శాంతి పురస్కారం రేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో నోబెల్ అవార్డు నామినేషన్లో ట్రంప్ పేరు వినిపించడం ఆసక్తిని రేపుతోంది. ఆయనతో పాటు ఈ అవార్డు నామినేషన్లో స్వీడన్‌కు చెందిన 18 ఏళ్ల బాలిక, పర్యావరణ వేత్త గ్రెటా థన్‌బర్గ్, రష్యా అసమ్మతి నేత అలెక్సీ నావల్సీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)లు కూడా ఉన్నాయి. కాగా బాల పర్యావరణ వేత్తగా గ్రెటా పలు కార్యక్రమాలు చేపుడుతున్న సంగతి తెలిసిందే. చిన్న వయసులోనే పర్యావరణానికి సంబంధించిన కార్యక్రమాలు చేపడుతూ... అంతర్జాతీయ సదస్సుల్లో పర్యావరణ సంరక్షణపై ప్రసంగించడమే గాక పర్యావరణ అంశాలపై ధైర్యంగా ఆమె గళం విప్పుతోంది. చిన్న వయసులోనే పర్యావరణంపై ఆమెకు ఉన్న అవగాహన, ఇతరులను కూడా పర్యావరణపై అవగాహన కల్పించేందుకు అంతర్జాతీయ సదస్సుల్లో ఆమె ప్రసంగం ప్రపంచ దేశాలను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో ఇప్పటికే ఆమె ఎన్నో అంతర్జాతీయ అవార్డులకు అందుకుంది. (చదవండి: అప్పుల ఊబిలో డొనాల్డ్ ట్రంప్..?) అలాగే రష్యా విపక్ష నేత అలెక్సీ నావల్నీ కూడా రష్యాలో శాంతియుత ప్రజాస్వాయ్యం కోసం ఎన్నో ఏళ్లుగా కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చర్యలను వ్యతిరేకించే నావల్నీపై ఇటీవల విషయ ప్రయోగం కూడా జరిగింది. దీంతో అయిదు నెలల పాటు ఆయన జర్మనీలో చికిత్స తీసుకుని ప్రాణాలతో బయటపడ్డారు. ఈ నేపథ్యంలో ఇటీవల తిరిగి రష్యా వచ్చిన నావల్నీని అరెస్టు చేయడంతో రష్యాలో నిరసనలు వెల్లువెత్తాయి. అయితే వీరితో పాటు ఈసారి నామినేషన్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు కూడా ఉండటం విశేషం. అంతేగాక ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)తో పాటు ప్రపంచం మొత్తానికి కరోనా వ్యాక్సిన్ అందించాలనే ఉద్దేశ్యంతో ఈ సంస్థ ప్రారంభించిన కోవ్యాక్స్ ప్రోగ్రామ్ కూడా ఈ అవార్టు నామినీల జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే నోబెల్ కమిటీ మాత్రం నామినీల పేర్లను అధికారికంగా ప్రకటించలేదు. (చదవండి: గ్రెటా థంబర్గ్ : లక్ష డాలర్ల భారీ విరాళం) -
బాబ్రే... నిత్య యవ్వనం నీ స్వరం!
బాబ్ డిలాన్ ఆరువందలకు పైగా పాటల హక్కులను యూనివర్సల్ మ్యూజిక్ పబ్లిషింగ్ గ్రూప్ సొంతం చేసుకుంది. ఈ బ్లాక్‌బస్టర్ అగ్రిమెంట్ ద్వారా మూడువందల మిలియన్ డాలర్లకు పైగా ఆదాయం వస్తుందట. వాళ్లెవరో సొంతం చేసుకోవడం ఏమిటి? ఆ పాటలను ప్రపంచంలో ఆబాలగోపాలం ఎప్పుడో సొంతం చేసుకుంది అనుకుంటే అది కూడా అక్షరాల నిజమే! బాబ్ పాట మీద హక్కు సాంకేతిక విషయం మాత్రమే. అది అందరి పాట. ఎందుకంటే.. మాస్టర్స్ ఆఫ్ వార్ (1963) ఇప్పుడు యుద్దాలు ఆత్మరక్షణ కోసం జరగడం లేదు, ప్రజల దృష్టిని మళ్లించి పాలనను సుస్థిరం చేసుకోవడానికి జరుగుతున్నాయి. ఇప్పుడు యుద్దం అంటే హింస మాత్రమే కాదు అనేక కుట్రసిద్దాంతాల సమహారం. అందుకే ఒక కళాకారుడిగా బాబ్ డిలాన్ గళం విప్పాడు. యుద్దోన్మాదాన్ని నడివీధిలో నగ్నంగా నిలబెట్టాడు. ప్రపంచాన్ని ఆటబొమ్మగా చేసుకుని ఆడుకునే మాస్టర్స్ ఆఫ్ వార్ని ఇలా నిలదీశాడు... ‘యూ ప్లే విత్ మై వరల్డ్ లైక్ ఇట్స్ యువర్ లిటిల్ టాయ్ యూ పుట్ ఏ గన్ ఇన్ మై హ్యాండ్ అండ్ యూ హైడ్ ఫ్రమ్ మై ఐస్’ న్యూ మార్నింగ్ (1970) స్వప్నించే హృదయం ఉండాలేగానీ ప్రతి ఉదయం ఒక కొత్త ఉదయాన్ని పరిచయం చేస్తుంది. ‘ఆ..ఏముంది లే. అన్ని రోజుల్లాగే ఈరోజు కూడా’ అనుకునే నిత్య నిరాసక్తవాదులకు ఈ పాట సరికొత్త మేలుకొలుపు. సింప్లీ ప్లెజర్స్ ఆఫ్ లైఫ్ విలువ ఏమిటో చెబుతుంది. ‘సో హ్యాపీ జస్ట్ టు బీ అలైవ్’ ‘సో హ్యాపీ జస్ట్ టు సీ యువర్ స్మైల్’ సేవ్డ్ (1980) భగవంతుడు మన కోసం ఎన్నో చేశాడు. అతడి కోసం ఏం చేయగలం? రుణాన్ని ఎలా తీర్చుకోగలం? కనిపించని భగవంతుడు నిత్యం మనకు కనిపించే మనుషుల్లో దానం, ధర్మం, త్యాగం...రకరకాల రూపాల్లో ఎక్కడో ఒకచోట కనిపిస్తూనే ఉంటాడు. ‘యూ హ్యావ్ గివెన్ ఎవ్రీథింగ్ టు మీ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ యూ హ్యావ్ గివెన్ మీ ఐస్ టు సీ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ’ అండర్ ది రెడ్ స్కై (1990) గబ్బీ గూగూ (ముద్దుపేరు) అనే అమ్మాయికి అంకితం ఇచ్చిన ఈ పాట సింపుల్ ఎక్స్‌ప్రెషన్స్‌తో సాగుతుంది. పిల్లలకు నచ్చే జానపదకథలాంటి పాట ఇది. కాల్పనిక ప్రపంచంలో మనల్ని ఊరేగించే పిల్లల పెద్దల పాట. అంతేనా! కానే కాదు అంటారు విశ్లేషకులు. పర్యావరణానికి మన చేటును గురించి హెచ్చరించి పాట అంటారు. ‘లెట్ ది బర్డ్ సింగ్...లెట్ ది బర్డ్ ఫ్లై’ షాడోస్ ఇన్ ది నైట్ (2015) నిన్ను చూడడం తప్పేమో తెలియదు. చూస్తూనే ఉంటాను. నిన్ను పలకరించడం తప్పేమో తెలియదు. పలకరిస్తూనే ఉంటాను. నిన్ను ధ్యానించడం తప్పేమో తెలియదు. ధ్యానిస్తూనే ఉంటాను. నిన్ను ప్రేమించడం తప్పేమో తెలియదు. ప్రేమిస్తూనే ఉంటాను.... ‘ఐ లవ్ యూ ఐ నీడ్ యూ...ఐ నో ఇట్స్ రాంగ్...ఇట్ మస్ట్ బీ రాంగ్ బట్ రైట్ ఆర్ రాంగ్ ఐ కాంట్ గెట్ ఎలాంగ్ విత్ఔట్ యూ’ -
బాబ్ డిలాన్ పాటలన్ని కొనేసిన యూజీ
న్యూయార్క్: ప్రఖ్యాత రచయిత బాబ్ డిలాన్ పాటలు ప్రపంచాన్ని ఉర్రూతలూగించాయి. ఆయన రాసిన మొత్తం 600 పాటలను యూనివర్సల్ మ్యూజిక్ పబ్లిషింగ్ గ్రూప్ తన సొంతం చేసుకున్నట్లు సోమవారం ప్రకటించింది. అంటే ఇకపై ఆయన పాటలపై పూర్తి హక్కులన్ని తమకే ఉంటుందని సదరు మ్యూజిక్ సంస్థ స్పష్టం చేసింది. అయితే ఇటీవల ఇందుకు సంబంధించి ఒప్పందం కూడా ముగిసినట్లు యూఎంపీజీ తెలిపింది. ఇందుకోసం యూఎంపీజీ ఆయనకు ఎంత మొత్తం చెల్లించిందనేది మాత్రం పేర్కొనలేదు. అయితే ఆయన పాటలకు ఎంత ప్రాముఖ్యత ఉంతో తెలిసిన విషయయే. ఇందుకోసం యూఎంపీజీ ఆయనతో భారీగానే ఒప్పందం కుదర్చుకున్నట్లు సమాచారం. ఆయన పాడిన పాటల క్యాట్‌లాగ్‌ను విలువను బట్టి కనీసం రూ. 100 మిలియన్ డాలర్లు ఉండోచ్చని స్థానికి మీడియా అంచనాలు. (చదవండి: బాబ్ డిలాన్ 'నోబెల్'ను అంగీకరించినట్లేనా?) అయితే యూఎంపీజీ తన ప్రకటనలో బాబ్ డిలాస్ 1962 నుంచి ఇప్పటి వరకు పాడిన మొత్తం క్యాట్‌లాగ్ పాటల జాబితాను తమ సంస్థ కనుగోలు చేసినట్లు వెల్లడించింది. కాగా ఈ సంస్థ ప్రస్తుతం అమెరికాలోని డిలాస్ మ్యూజిక్ కంపెనీతో పాటు సోనీ, ఏటీవి మ్యూజిక్ పబ్లిసింగ్ నిర్వహణ బాధ్యతను చేపట్టింది. ఈ ఒప్పందం ముగిసే వరకు అమెరికా వెలుపల జరిగే పలు మ్యూజిక్ షోలను యూఎంపీజీనే నిర్వహిస్తుందని సోనీ, ఏటీవీ అధికారులు స్పష్టం చేశారు. కాగా బాబ్ డిలాన్ 2016లో సాహిత్యంలో నోబెల్ పురస్కారం పొందారు. నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న తొలి పాటల రచయితగా ఆయన రికార్డు సృష్టించారు. -
బలహీనతను బలంగా వినిపించే కవిత్వం
కవికీ కవిత్వానికీ ఏవో ఉన్నత లక్ష్యాలు ఉండాలన్నదానికి భిన్నంగా తన అస్తిత్వపు వేదననే కవిత్వంలోకి తెస్తున్నారు 77 ఏళ్ల అమెరికన్ కవయిత్రి లూవీస్ గ్లోక్. వ్యక్తి అస్తిత్వాన్ని సార్వజనీనం చేస్తున్నందుకుగానూ ఈ సంవత్సరపు నోబెల్ పురస్కారం ఆమెను వరించింది. -లూవీస్ గ్లోక్ కవి అనే వాడు దేనినైనా ఎదుర్కొనే ధైర్యవంతుడు కావాలా? దేనికైనా రొమ్ము ఎదురొడ్డి నిలిచే సాహసి కావాలా? ఏం, కవి భయస్తుడు కాకూడదా? కవి బలహీనుడు కాకూడదా? ఆకాశం కిందిది ఏదైనా కవిత్వానికి అర్హమైనదే అయినప్పుడు, భయ బలహీనతలు మాత్రం కవితా వస్తువులు కావా? ఈ సంవత్సరపు నోబెల్ పురస్కారం వరించిన అమెరికన్ కవయిత్రి లూవీస్ గ్లో్లక్ కవిత్వమంతా ఇలాంటి వ్యక్తిగత కలవరింతలే, పశ్చాత్తాపపు తలపోతలే. అయితే వ్యక్తి అస్తిత్వాన్ని సార్వజనీనం చేస్తున్నందుకుగానూ ఆమెకు ఈ సర్వోన్నత గౌరవం దక్కింది. సంప్రదాయంగా డిసెంబర్ 10న ఈ పురస్కారాన్ని స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్‌లో స్వీకరించాల్సి ఉండగా కరోనా మహమ్మారి కారణంగా అదే రోజు తన ఇంటిలోనే దీన్ని అందుకుంటారు. ఆత్మకథాత్మక కవయిత్రి ఆమె తల్లిదండ్రులు హంగెరీ నుంచి అమెరికాకు బతుకుదెరువు కోసం వచ్చిన యూదులు. 1943లో ఆమె పుట్టకముందే ఒక అక్క చనిపోయింది. తన కంటే ముందు పుట్టిన ఒక ప్రాణి మరణించిన వాస్తవం రక్తంలో ఇంకించుకుని పెరిగింది. దీనికితోడు కౌమారంలో ఎక్కువ బరువు పెరుగుతున్నానేమో అనే అసాధారణ భయం వెంటాడింది (అనరెక్సియా నెర్వోసా). సహజంగానే ఇది చదువుకు ఆటంకం కలిగించింది. ఏడేళ్ళ పాటు వైద్యం తీసుకున్నాక గానీ సాధారణం కాలేకపోయింది. ‘‘జీవితంలో ఒక దశలో నేను చచ్చిపోతున్నాను అని అర్థమైంది. కానీ అంతకంటే స్పష్టంగా, అంతకంటే బలంగా నేను చావాలని అనుకోవడం లేదు అని కూడా అనిపించింది’’ అంటారామె. ఈ జబ్బు కారణంగానే ఎలా ఆలోచించాలో నేర్చుకున్నానంటారు. రచన కూడా ఒక జబ్బు లాంటిదే. కాకపోతే మన వేదనని ఇతరులకు పంపిణీ చేయడం ద్వారా స్వస్థత పొందుతాం. ప్రపంచం మాత్రం ఇలా చేయదా? మరి కవికి మాత్రం ఎందుకు మినహాయింపు? అందుకే గ్లో్లక్ ఎనిమిదో ఏట నుంచే కవిత్వాన్ని తన శోకానికి విరుగుడుగా భావించింది. ఆత్మకథాత్మకంగా రాస్తూ, తీవ్రమైన ఉద్వేగాలను పలి కిస్తూ ఆధునిక జీవితాన్ని చిత్రించింది. పాతికేళ్ల వయసులో 1968లో తన తొలి కవితా సంపుటి ఫస్ట్‌బర్న్ వెలువరిం చింది. దీనికి సానుకూల స్పందన వచ్చినప్పటికీ , అనంతరం సుదీర్ఘమైన రైటర్స్ బ్లాక్ వెంటాడింది. కవిత్వం రాయడం ద్వారా తన వేదన నుంచి బయటపడ్డట్టుగానే, కళాశాలలో చేరి కవిత్వాన్ని బోధించడం ద్వారా రైటర్స్ బ్లాక్ నుంచి బయటపడింది. (చదవండి: అమెరికా కవయిత్రికి నోబెల్) తిరిగి తిరిగి నిలబెట్టుకోవడం 1975లో వచ్చిన తన రెండో కవితా సంపుటి ద హౌజ్ ఆన్ మార్‡్షలాండ్స్ ద్వారా తనదైన ప్రత్యేకమైన గొంతును సాధించింది. ఇక 1980లో వచ్చిన డిసెండెంట్ ఫిగర్ ఆమెను విస్మరించలేని కవయిత్రిగా నిలబెట్టింది. ఇల్లు తగలబడి తన సర్వస్వం కోల్పోయినప్పుడు రాసిన కవిత్వం ద ట్రయంప్ ఆఫ్ ఎకిలీస్ (1985). ఈ సంపుటంలోని మాక్ ఆరెంజ్ కవిత స్త్రీవాద గీతమై నిలిచింది. అయినా తనను స్త్రీవాదిగా, యూదు కవిగా, ప్రకృతిగా కవిగా లేబుల్స్ వేసుకోవడానికి ఆమె ఇష్టపడలేదు. వాటన్నింటికి అతీతమైనదేదో మనిషి అస్తిత్వం అని ఆమె నమ్మకం. తన మరణపు వాస్తవాన్ని గుర్తించడం వల్లే ఎకిలీస్ మరింత మనిషి అయినట్టుగా, ఆమె కూడా జీవితపు క్షణభంగురతను ఈ కాలంలో గుర్తిం చింది. తండ్రి మరణించిన దుఃఖంలోంచి పుట్టిన కవిత్వం అరారత్(1990). 1992లో వచ్చిన వైల్డ్ ఐరిస్, తరువాయి సంపుటం మీడోలాండ్స్(1996), వీటా నోవా(1999), ద సెవెన్ ఏజెస్(2001) అన్నీ తన జీవిత వైఫల్య సాఫల్య క్షణాల పట్టుపురుగులే. వైవాహిక జీవితం విచ్ఛిన్నం కావడం, ఉద్యోగాలు కోల్పోవడం, తిరస్కారాలు పొందడం, ఓటములు ఎదుర్కోవడం, నిలుపుకోలేని బంధాల్లో చిక్కుకోవడం, తనను తాను తిరిగి తిరిగి నిలబెట్టుకోవడమే ఈ కవిత్వం నిండా. (చదవండి: నోబెల్ ఉమెన్) నిశ్శబ్దపు ఉనికి మార్పు కోసం తపన పడుతూ, మళ్లీ అదే మార్పు ఎదురైనప్పుడు విలవిల్లాడుతూ అచ్చం సగటు మనిషిలాగే ఆమె కవిత్వం ఉంటుంది. గ్రీకు పురాణాలన్నా, మొత్తంగా ధార్మిక గాథలన్నా ప్రత్యేకమైన ఇష్టం. కాగితం మీద కలం కదపడంలోనే ఏదో తెలియని ఆనందం ఉందనే 77 ఏళ్ల గ్లోక్ అవిరామంగా రాస్తూనే ఉన్నారు. అవెర్నో(2006), ఎ విలేజ్ లైఫ్(2009), ఫెయిత్ఫుల్ అండ్ విర్చువస్ నైట్(2014)– కవితా సంపుటాలను వరుసగా తెస్తూనేవున్నా దీర్ఘ కాలావధులు తాను ఏమిరాయకుండా ఉండిపోతానని చెబుతారు. విస్తృతంగా రాస్తున్నప్పుడు పునరుక్తి దోషం అంటుకోవచ్చు, తాజాదనం కోల్పోవచ్చు. రోజూ పొద్దున లేచేసరికి అదే మనిషిగా ఉండటంలోని సానుకూలతను గుర్తిస్తూనే, నాది నేనులాగే కవిత్వంలో వినిపించడం ఒక శాపంగానే భావిస్తానంటారు. అందుకే ప్రతీ సంపుటికి గొంతు మార్చి ఆశ్చర్యపరుస్తుంటారు. కవిత్వంలో ఆమె తోటలోని పువ్వులకు కూడా ప్రత్యేక వ్యక్తిత్వం ఉంటుంది. ఆవి వివేకంతో భాషిస్తాయి, సందర్భోచితంగా కవయిత్రి శోకంతో గొంతు కూడా కలుపుతాయి. ప్రపంచపు సంగీ తాన్ని, దైవిక నిశ్శబ్దాన్ని కూడా ఆమె కవితలు వినిపిస్తాయి. పెద్ద పాఠకవర్గానికి చేరడంలో ఆమెకు ఉత్సాహం లేదు. కవిత్వం నోటి నుంచి చెవికి జరిగే సున్నితమైన మార్పిడి అని నమ్ముతారు. కానీ, కవిత్వం స్టేజీ మీద చదవడానికి కూడా ఇష్టపడదు. నోరు, చెవి అనేవి నిజార్థంలో కాకుండా ఒక మనసులో పుట్టిన భావాన్ని స్వీకరించేం దుకు సిద్ధంగా ఉన్న ఇంకో మనసుగా చూస్తారు. వినబడినప్పుడే ఉనికిలో ఉన్నట్టు కాకుండా, నిశ్శబ్దంలో కూడా అస్తిత్వంలో ఉండాలంటారు. – పి.శివకుమార్ -
అమెరికా కవయిత్రికి నోబెల్
స్టాక్‌హోమ్: ఈ ఏడాది సాహిత్యంలో నోబెల్ బహుమతి అమెరికా కవయిత్రి లూయిసీ గ్లుక్(77)కు దక్కింది. ‘ఎటువంటి దాపరికాలు, రాజీలేని గ్లుక్ తన కవితల్లో.. కుటుంబ జీవితంలోని కష్టానష్టాలను సైతం హాస్యం, చమత్కారం కలగలిపి చెప్పారు’అందుకే 2020 సంవత్సరానికి గాను సాహిత్యంలో నోబెల్ పురస్కారానికి ఎంపిక చేస్తున్నట్లు స్టాక్‌హోమ్‌లోని నోబెల్ అవార్డు కమిటీ గురువారం ప్రకటించింది. ‘హృద్యమైన, స్పష్టమైన ఆమె కవితా స్వరం వ్యక్తి ఉనికిని విశ్వవ్యాప్తం చేస్తుంది’అని స్వీడిష్ అకాడమీ శాశ్వత కార్యదర్శి మాట్స్ మామ్ పేర్కొన్నారు. 2006లో గ్లుక్ రచించిన ‘అవెర్నో’కవితా సంకలనం అత్యుత్తమమైందని నోబెల్ సాహిత్య కమిటీ చైర్మన్ ఆండెర్స్ ఒల్సన్ పేర్కొన్నారు. 1901 నుంచి సాహిత్యంలో ఇస్తున్న నోబెల్ బహుమతి ఎక్కువ మంది నవలా రచయితలనే వరించింది.. కాగా, గ్లుక్‌తో కలిపి ఇప్పటి వరకు 16 మంది మహిళలకు మాత్రమే ఈ గౌరవం దక్కింది. స్వీడిష్ అకాడమీ ఈ బహుమానం కింద గ్లుక్‌కు రూ.8.25 కోట్ల (10 మిలియన్ క్రోనార్లు)తోపాటు ప్రశంసా పత్రం అందజేయనుంది. చివరిసారిగా సాహిత్యంలో నోబెల్ గెలుచుకున్న అమెరికన్ బాబ్ డైలాన్(2016). హంగేరియన్–యూదు మూలాలున్న లూయిసీ గ్లుక్ 1943లో న్యూయార్క్‌లో జన్మించారు. కనెక్టికట్‌లోని యేల్ యూనివర్సిటీ ఫ్యాకల్టీగా గ్లుక్ పనిచేస్తున్నారు. ఆమె 1968లో ‘ఫస్ట్‌బోర్న్’ పేరుతో మొట్టమొదటి కవిత రాశారు. అతి తక్కువ కాలంలోనే సమకాలీన అమెరికా సాహిత్యంలో ప్రముఖ కవయిత్రిగా పేరు సంపాదించుకున్నారు. ఆరు దశాబ్దాల్లో డిసెండింగ్ ఫిగర్స్, ది ట్రయంఫ్ ఆఫ్ అచిల్స్, అరారట్ వంటి 12 కవితా సంకలనాలను, రెండు వ్యాస సంకలనాలను ఆమె రచించారు. వివాదాల్లో నోబెల్ ‘సాహిత్యం’ సాహిత్యంలో నోబెల్ బహుమతిని ఈసారి యూరప్, ఉత్తర అమెరికా వెలుపల ఆఫ్రికా, ఆసియా లేదా కరేబియన్ రచయితకు స్వీడిష్ అకాడమీ ప్రకటిస్తుందని చాలా మంది భావించినా అమెరికన్‌కే ప్రకటించింది. సాహిత్యంలో నోబెల్ బహుమతులపై ఇటీవల వివాదాలు, కుంభకోణాలు అలుముకోవడంతో పాటు పాశ్చాత్య దేశాలకే ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలు సైతం వెల్లువెత్తాయి. నోబెల్ ఎంపిక కమిటీపై 2018లో లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తాయి. కొందరు సభ్యులు కమిటీ నుంచి వైదొలిగారు. దీంతో ఆ ఏడాది నోబెల్ సాహిత్యం పురస్కారాన్ని ప్రకటించలేదు. గత ఏడాది సాహిత్య నోబెల్ అవార్డుల ప్రకటన జరిగింది. 2018వ సంవత్సరానికి గాను పోలండ్‌కు చెందిన ఓల్గా టోకార్జక్‌కు, 2019కి ఆస్ట్రియా రచయిత్రి పీటర్ హాండ్కేకు అవార్డులు అందజేస్తున్నట్లు కమిటీ ప్రకటించింది. కానీ, హాండ్కే ఎంపికపై వివాదం తలెత్తింది. 1990లలో జరిగిన బాల్కన్ యుద్ధాల్లో హాండ్కే సెర్బుల మద్దతుదారుగా ఉన్నారని, సెర్బియా యుద్ధ నేరాలను హాడ్కే సమర్థించారని ఆరోపణలు ఉండటం ఇందుకు కారణం. అల్బేనియా, బోస్నియా, టర్కీ తదితర దేశాలు హాండ్కేకు బహుమతి ఇవ్వడాన్ని నిరసిస్తూ అవార్డుల కార్యక్రమాన్ని బహిష్కరించగా కమిటీ సభ్యుడు ఒకరు తన పదవికి రాజీనామా చేశారు. ఈ వివాదాల నేపథ్యంలో 2020 సాహిత్య నోబెల్ అవార్డు ప్రకటన కొంత ప్రాధాన్యం సంతరించుకుంది. లూయిసీకి దక్కిన పురస్కారాలు ► నేషనల్ హ్యుమానిటీ మెడల్(2015) ► అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ గోల్డ్ మెడల్ ► ‘ది వైల్డ్ ఐరిస్’కవితకు పులిట్జర్ ప్రైజ్(1993) ► ‘ఫెయిత్ఫుల్ అండ్ విర్చువస్ నైట్’ కవితకు నేషనల్ బుక్ అవార్డు(2014) ► 2003, 2004 సంవత్సరాల్లో ‘యూఎస్ పోయెట్ లారియేట్’ -
అమెరికన్ కవయిత్రికి సాహిత్యంలో నోబెల్
స్టాక్‌హోం : సాహిత్యంలో ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి ఈ ఏడాది అమెరికా కవయిత్రి లూయిస్ గ్లక్‌కు లభించింది. గ్లక్ తన అద్భుత సాహితీ గళంతో తన ఉనికిని విశ్వవ్యాప్తం చేశారని స్వీడిష్ అకాడమీ ఆమెను ప్రశంసించింది. గ్లక్ తన 1992 కలెక్షన్ ది వైల్డ్ ఐరిస్‌కు గాను ప్రతిష్టాత్మక పులిట్జర్ ప్రైజ్ సొంతం చేసుకోగా 2014లో నేషనల్ బుక్ అవార్డును దక్కించుకన్నారు. లూయిస్ గ్లక్ 1943లో న్యూయార్క్‌లో జన్మించారు. కనెక్టికట్ లోని యేల్ యూనివర్సిటీలో ఆంగ్ల ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. చిరుప్రాయంలోనే కవితలు రాసిన గ్లక్ ఆపై అమెరికాలో ప్రముఖ కవయిత్రిగా ఎదిగారు. కాగా, సాహిత్యంలో నోబెల్ బహుమతిని ఈసారి యూరప్, ఉత్తర అమెరికా వెలుపల ఆఫ్రికా, ఆసియా లేదా కరేబియన్ రచయితకు స్వీడిష్ అకాడమీ అందచేస్తుందని పలువురు భావించినా అమెరికన్ రచయిత్రికే ఈ ప్రతిష్టాత్మక పురస్కారం అందించింది. సాహిత్యంలో నోబెల్ బహుమతులపై ఇటీవల వివాదాలు, కుంభకోణాలు అలుముకోవడంతో పాటు పాశ్చాత్య దేశాలకే ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఇక 2018లో స్వీడిష్ అకాడమీని లైంగిక వేధింపుల ఆరోపణలు, ఆర్థిక అవకతవకల కుంభకోణాలు చుట్టుముట్టడంతో సాహిత్యంలో నోబెల్ బహుమతిని ప్రదానం చేయలేదు. ఆ మరుసటి ఏడాది పోలండ్ రచయిత ఓల్గా టకార్జక్కు సాహిత్య బహుమతిని అందించారు. చదవండి : నోబెల్ : నూట ఇరవై ఏళ్లలో నలుగురు -
నోబెల్ : నూట ఇరవై ఏళ్లలో నలుగురు
ఎలా కనిపెడతారు వీళ్లు?! ఇంటిపని చేస్తూనే రేడియో ధార్మికతల్ని పిల్లల్ని ఆడిస్తూనే పరమాణు స్వభావాల్ని వండి పెడుతూనే కాంతి ఉష్ణ కిరణాల్ని నిద్ర చాలకనే మార్మిక కృష్ణ బిలాల్ని! ఎక్కడిది వీళ్లకింత శక్తి? సూక్ష్మదృష్టి? భౌతిక శాస్త్రమే ఆవహిస్తోందా? పాలపుంతల నుంచి ప్రవహిస్తోందా? శాస్త్రం జీవితాన్ని సులభతరం చేస్తుంది. ఎలా చేస్తుందో అర్థం చేసుకోవడం మాత్రం కష్టమైన విషయం! సెల్‌ఫోన్‌ను చెవి దగ్గర పెట్టుకుని ‘హలో’ అని వేల మైళ్ల దూరంలో ఉన్నవారితో మాట్లాడినంత సులభం కాదు, ఎలా మాట అంతదూరం వెళ్లి, మళ్లీ వస్తుందో అర్థం చేసుకోవడం. అందుకే నిరంతరం శాస్త్రాన్ని అర్థం చేసుకుని, అర్థం చేయించే పనిలో ఉండే శాస్త్రవేత్తలకు.. ముఖ్యంగా ఏ ప్రయోగ అనుకూలతలూ ఉండని మహిళా శాస్త్రవేత్తలకు చేతులు జోడించి నమస్కరించాలి. ఇటు గృహ బంధనాలు, అటు శాస్త్ర శోధనలు! గ్రేట్. అణు ధార్మికత (రేడియో యాక్టివిటీ) పై చేసిన పరిశోధనలకు పొలెండ్ శాస్త్రవేత్త మేరీ క్యూరీకి నోబెల్ బహుమతి రావడం వెనుక కూడా జీవితకాల పరిశోధనలు, ప్రయోగాలు ఉన్నాయి. మరియా గోపర్ట్ మేయర్ (1906–1972) భౌతికశాస్త్రంలో తొలి నోబెల్ గెలుచుకున్న మహిళ ‘మేడమ్’ క్యూరీ. ఆ ‘రేడియో ధార్మికత’ అనే పేరు ఆమె పెట్టిందే! అంతకుముందు కూడా రేడియో ధార్మికత ఉండేది. ఫలానా అని దానికొక గుర్తింపును క్యూరీ ఇచ్చారు. అణుధార్మికత ప్రయోగాల ల్యాబ్‌కు ఆమె తన జీవితాన్నే పణంగా పెట్టారు. ఆ దుష్ప్రభాలతోనే చివరికి ఆమె చనిపోయారని అంటారు! మానవ దేహంలో కణుతులకు జరిగే రేడియం చికిత్స పరిణామాలను వైద్యులు అంచనా వేయగలగడాన్ని సాధ్యం చేయించింది క్యూరీ పరిశోధనా ఫలితాలే. ∙∙ మేరీ క్యూరీ తర్వాత భౌతిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ పొందిన మహిళ మరియా గోపర్ట్ మేయర్. జర్మనీ శాస్త్రవేత్త. ఆటమిక్ న్యూక్లియస్‌లోని ‘న్యూక్లియర్ షెల్ మోడల్’ను ప్రతిపాదించినందుకు ఆమెకు నోబెల్ లభించింది. ఆటమిక్ న్యూక్లియస్ అంటే పరమాణు కేంద్రకం. అందులోనే ప్రొటాన్లు, న్యూట్రాన్లు ఉంటాయి. ఆ కేంద్రకం శక్తి స్థాయుల నిర్మాణం ఫలానా విధంగా ఉంటుందని మరియా కనిపెట్టారు. సరే, ఎవరికి ప్రయోజనం? అది పూర్తిగా శాస్త్రపరమైన అంశం. అణు స్వభావాలను తెలుసుకోడానికి పనికొచ్చే మేథమెటిక్స్. వైద్యరంగాన్నే తీసుకుంటే.. వ్యాధుల నిర్థారణ, వ్యాధి దశల గుర్తింపు, చికిత్స.. వీటికి అవసరమైన అధ్యయనానికి కూడా పరిశోధకులకు ‘న్యూక్లియర్ షెల్ మోడల్’ ఒక దారి దీపం. ∙∙ భౌతికశాస్త్రంలో నోబెల్ పొందిన మూడో మహిళా శాస్త్రవేత్త డోనా స్ట్రిక్లాండ్. ఆప్టికల్ ఫిజిసిస్ట్. ఎలక్ట్రో మ్యాగ్నటిక్ రేడియేషన్‌పై పరిశోధనలు చేస్తుంటారు. కెనడా ఆమెది. ‘పల్స్డ్ లేజర్స్’ గురించి కొత్త విషయాలు కనిపెట్టినందుకు రెండేళ్ల క్రితం డోనాను నోబెల్ వరించింది. సి.పి.ఎ. (చర్ప్‌డ్ పల్స్ ఆంప్లిఫికేషన్) ను ఆచరణాత్మకంగా ప్రయోగించి అత్యధిక తీవ్రతను కలిగిన, అతి చిన్న కాంతి ఉష్ణ కిరణాలను ఆమె సృష్టించారు. కంటికి చేసే లేజర్ చికిత్సలలో ఇది చక్కగా ఉపకరిస్తోంది. ∙∙ ఆండ్రియా గెజ్ ఈ ఏడాది నోబెల్ పొందిన మహిళా ఖగోళ శాస్త్రవేత్త. ఫిజిక్స్‌లో నాల్గవ మహిళా నోబెల్ విజేత. పాలపుంత మధ్యలో ధూళితో నిండి ఉన్న ‘ధనుర్భాగాన్ని’ (సాజిటేరియస్ –ఎ ) గెజ్ ఆధ్వర్యంలోని బృందం నిశితంగా పరిశీలించి, అక్కడి కాంతిమంతమైన నక్షత్రాల గమ్యాన్ని గుర్తించింది. గెజ్ అంచనా ప్రకారం ఆ ప్రదేశంలో బ్రహ్మరాక్షసి వంటి మార్మిక బిలం ఒకటి ఆ చుట్టుపక్కల నక్షత్రాల కక్ష్యలకు దారి చూపుతోంది! కొన్ని నక్షత్రాలను ఆధాటున మింగేస్తోంది. ఈ విశ్వవైపరీత్యాన్ని గెజ్ శక్తిమంతమైన టెలిస్కోప్‌తో కనిపెట్టారు. గెజ్ పరిశోధన మున్ముందు మనిషి ఈ విశ్వాన్ని మరింత సూక్ష్మంగా శోధించేందుకు, విశ్వ రహస్యాలను ఛేదించేందుకు తోడ్పడుతుంది. పంచుకోవడంలో సంతోషం ఉంటుంది. అయితే అవార్డుల విషయంలో అదేమంత సంతోషాన్నివ్వదు. చిన్న అవార్డు అయినా విడిగా ఒక్కరికే వస్తే ఉండే ప్రత్యేక గుర్తింపు కలివిడిగా వస్తే ఉండదు. భౌతికశాస్త్రంలో నోబెల్ పొందిన ఈ నలుగురు మహిళా శాస్త్రవేత్తలూ మరో ఇద్దరితో అవార్డును పంచుకోవలసి వచ్చినవారే. ఇది కొంచెం నిరుత్సాహం కలిగించే విషయమే అయినా, మానవ జీవితాలకు కలిగే ప్రయోజనాల ఆవిష్కరణల్లో భాగస్వామ్యం కలిగి ఉండటం కూడా శాస్త్రవేత్తగా జన్మ ధన్యం అవడమే. నోబెల్ గెలుపును మించిన సార్థక్యమది. నూట ఇరవై ఏళ్లలో నలుగురు నోబెల్ ప్రైజ్‌లు 1901లో ప్రారంభం అయ్యాక ఇప్పటì వరకు భౌతికశాస్త్రంలో 114 సార్లు నోబెల్‌ని ప్రకటించారు. 215 మంది విజేతలు అయ్యారు. వీరిలో నలుగురంటే నలుగురే మహిళలు. ఒక నోబెల్ ప్రైజ్‌ను ముగ్గురికి మించి పంచరు. ఆ ముగ్గురి మధ్య కూడా కనీసం రెండు వేర్వేరు ఆవిష్కణలకు ప్రైజ్‌ను పంచడం ఉంటుంది. ఈ ఏడాది భౌతిక శాస్త్రంలో ఇద్దరు పురుషులతో కలిసి బ్లాక్‌హోల్స్‌పై చేసిన పరిశోధనలకు ఆండ్రియా గెజ్ నోబెల్‌ను గెలుపొందారు. 1901లో విల్హెల్మ్ రాంట్జెన్ ఎక్స్–రే కనిపెట్టినందుకు భౌతికశాస్త్రంలో తొలి నోబెల్ గెలుచుకున్న రెండేళ్లకే 1903లో మేరీ క్యూరీ రేడియో ధార్మికతకు నోబెల్ సాధించారు. తర్వాత అరవైఏళ్లకు గానీ ఒక మహిళ భౌతిక శాస్త్రంలో నోబెల్‌ను దక్కించుకోలేకపోయారు. 1963లో మరియా గోపర్ట్ మేయర్ న్యూక్లియర్ స్ట్రక్చర్‌కు నోబెల్ పొందారు. 2018లో డోనా స్ట్రిక్లాండ్ లేజర్ పల్సెస్‌కు నోబెల్ సాధించారు. అయితే ఈ నలుగురు మహిళల్లో విడిగా ఏ ఒక్కరికీ నోబెల్ రాలేదు. నలుగురూ మరో ఇద్దరు పురుషులతో నోబెల్‌ను పంచుకున్నవారే. మొత్తం మీద భౌతికశాస్త్రంలో ఏక విజేతగా 47 మంది నోబెల్‌ను గెలుపొందగా.. ఒకరితో కలిసి 32 మంది, ఇద్దరితో కలిసి 34 మంది నోబెల్‌ను పంచుకున్నారు. యుద్ధపరిస్థితుల కారణంగా 1916, 1931, 1934, 1940, 1941, 1942లలో ఆరుసార్లు నోబెల్‌ను ఇవ్వలేదు. -
కృష్ణబిల పరిశోధనలకు పట్టం
స్టాక్‌హోమ్: కాంతిని కూడా తనలో లయం చేసుకోగల అపారశక్తి కేంద్రం కృష్ణబిలంపై మన అవగాహనను మరింత పెంచిన ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ ఏడాది భౌతిక శాస్త్ర నోబెల్ అవార్డు దక్కింది. అవార్డు కింద అందే నగదు బహుమతిలో సగం బ్రిటిష్ శాస్త్రవేత్త రోజర్ పెన్రోజ్కు దక్కనుండగా మిగిలిన సగం మొత్తాన్ని జర్మనీకి చెందిన రైన్‌హార్డ్ గెంజెల్, అమెరికన్ శాస్త్రవేత్త ఆండ్రియా గేజ్‌లు చెరిసగం పంచుకుంటారని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ మంగళవారం ప్రకటించింది. కృష్ణబిలం ఏర్పడటం ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్ధాంతానికి ప్రబల ఉదాహరణ అని గుర్తించినందుకు పెన్రోజ్కు అవార్డు లభించగా మన పాలపుంత మధ్యలో అతి భారయుతమైన, తక్కువ ప్రాంతాన్ని ఆక్రమించిన ఖగోళ వస్తువును గుర్తించి నందుకుగాను రైన్‌హార్డ్ గెంజెల్, ఆండ్రియా గేజ్‌లకు అవార్డు అందిస్తున్న ట్లు అకాడమీ సెక్రటరీ జనరల్ గోరన్ కే హాన్సన్ వివరించారు. ఒకప్పుడు కేవలం కాల్పినిక కథలకు మాత్రమే పరిమితమైన కృష్ణ బిలాలు వాస్తవిక ప్రపంచంలోనూ భాగమని ఈ పరిశోధనలు స్పష్టంగా తెలియజేశాయని, కాలం కూడా నిలిచిపో యే విస్మయకర కృష్ణబిలాల ఉనికిని ఈ అవార్డు గుర్తిస్తోందని అకాడమీ ఒక ప్రకటనలో తెలిపింది. బ్రిటన్ శాస్త్రవేత్త రోజర్ పెన్రోజ్ గణిత శాస్త్రం ఆధారంగా కృష్ణ బిలాలు ఏర్పడే అవకాశాలను రూఢి చేశారు. గెంజెల్, గేజ్‌లు ఇరువురు మన పాలపుంత మధ్యభాగంలో దుమ్ముతో కూడిన ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ పలు నక్షత్రాలు తిరుగుతు న్నప్పటికీ వర్ణించేందుకు వీలుకాని సంఘటనలు ఏవో చోటు చేసుకుంటున్నట్లు తెలుసుకున్నారు. తదుపరి పరిశోధనల ద్వారా ఆ ప్రాంతం ఓ భారీ కృష్ణబిలమని మన సూర్యుడికి 40 లక్షలరెట్లు ఎక్కువ∙బరువు ఉందని గెంజెల్, గేజ్‌ల పరిశోధనలలో తెలిసింది. ఒకే రంగంలో పరిశోధనలు చేసిన వారు నోబెల్ అవార్డును పంచుకోవడం కొత్తేమీ కాదు. గత ఏడాది కెనడా దేశస్తుడైన ఖగోళ శాస్త్రవేత్త జేమ్స్ పీబల్స్ మహా విస్ఫోటం తర్వాతి సూక్ష్మకాలపు పరిణామాలను వివరించినందుకు నోబెల్‌దక్కగా సౌర కుటుంబానికి ఆవల ఉన్న గ్రహాలను గుర్తించినందుకు స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తలు మైకేల్ మేయర్, క్యూలోజ్‌లకు అవార్డు అందించారు. కృష్ణబిలం అంటే.. విశాల విశ్వంలో అక్కడక్కడ ఉండే అదృశ్య ప్రాంతాలు. కంటికి కనిపించవు సరికదా.. చుట్టూఉన్న ఖగోళ వస్తువులన్నింటినీ తమలోకి ఆకర్షించుకుంటూ ఉంటాయి. ఇవి ఎంతటి శక్తిమంతమైనవి అంటే... విశ్వం లోనే అత్యంత వేగంగా ప్రయాణించగల కాంతిని కూడా తమలో కలిపేసుకోగలవు. సూర్యుడి లాంటి భారీ నక్షత్రాలు తమలోని ఇంధనం మొత్తాన్ని ఖర్చు పెట్టేసిన తరువాత తమలో తాము కుప్పకూలిపోతూ కృష్ణబిలాలుగా మారతాయని అంచనా. పాలపుంతలతోపాటే కృష్ణబిలాలు కూడా ఏర్పడతాయని శాస్త్రవేత్తల అంచనా. కృష్ణబిలాల్లోకి ప్రవేశించిన పదార్థం ఏమవు తుందో ఎవరికీ తెలియదు. ఐన్‌స్టీన్ తరువాత అంతటి వాడుగా ప్రఖ్యాతి పొందిన శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ అంచనా ప్రకారం... కృష్ణబిలాల్లోకి ప్రవేశించిన పదార్థం అన్ని వైపుల నుంచి లాగబడుతుంది. దీన్నే హాకింగ్ స్పాగెటిఫికేషన్ అని పిలిచారు. కృష్ణ బిలానికి ఆవల ఏముందో కూడా ఎవరికీ తెలియదు. 1960లో జాన్ ఆర్చీబాల్డ్ వీలర్ కృష్ణ బిలాలకు ఆ పేరు పెట్టారు. ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించిన తొట్టతొలి కృష్ణబిలం పేరు సైగ్నస్ ఎక్స్–1. సూర్యుడు.. ఇంధనమంతా ఖర్చయిపోయి కుప్పకూలిపోయినా కృష్ణబిలంగా మారేంత పెద్దది కాదు. భూమికి అతిదగ్గరగా ఉన్న కృష్ణబిలం పేరు వీ616 మోనోసెరోటిస్. దాదాపు మూడు వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది ఇది. విశ్వంలో అతి పెద్ద కృష్ణబిలం ఎన్జీసీ 4889. నిద్రాణంగా ఉన్న ఈ కృష్ణబిలం ఎప్పుడు చైతన్యవంతమై చుట్టూ ఉన్న దుమ్ము ధూళి, కాంతులను లయం చేసుకుంటుందో ఎవరికీ తెలియదు. సౌర కుటుంబం ఉన్న పాలపుంత మధ్యలో ఉన్న అతి భారీ కృష్ణబిలం పేరు ‘సాగిటరియస్ –ఏ’. 40 లక్షల సూర్యుళ్లు ఒక్కదగ్గర చేరితే ఉండేంత బరువు ఉంటుంది ఇది. భూమికి 27 వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. -
వైద్యరంగంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం
స్టాక్‌హోమ్ : వైద్య రంగంలో 2020 సంవత్సరానికి గాను ప్రఖ్యాత నోబెల్ పురస్కారం ఇద్దరు అమెరికన్ సైంటిస్టులు, ఒక బ్రిటీష్ శాస్త్రవేత్తను వరించింది. అమెరికాకు చెందిన జె.హార్వే, చార్లెస్ ఎం.రైజ్, బ్రిటీష్‌కు చెందిన హైకేల్ హోటాన్‌లను ఈ పురస్కారానికి నోబెల్ కమిటీ సోమవారం ఎంపిక చేసింది. హెపటైటిస్ సి వైరస్‌కు వ్యాక్సిన్ కనిపెట్టినందుకు గాను ఈ అవార్డును ప్రకటించారు. హైపటైటిస్ అనేది కాలేయానికి సంబంధించిన వ్యాధి. ఇది వైరస్, బాక్టీరియా, ప్రోటోజోవా, కొన్ని రకాల మందులు వాడడం ద్వారా సంభవిస్తుంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందిని వేధిస్తున్న ప్రధాన అరోగ్య సమస్యల్లో ఇది ఒకటి. దీని వలన ఎంతో మంది కాలేయ క్యాన్సర్ బారిన పడుతున్నారు. జె.హార్వే, మైకేల్ హోటాన్, చార్లెస్ ఎం.రైజ్ పరిశోధన వలన సులభంగా హైపటైటిస్‌కు మందుకు కనుగొనడమే కాకుండా ఎంతో మంది ప్రాణాలకు వైద్యులు కాపాడగల్గుతున్నారు. వైద్యరంగంలో చేసిన సేవలకు గుర్తింపుకుగాను ఈ ఏడాది నోబెల్ పురస్కారాన్ని వీరికి ప్రకటించారు. -
పొద్దునే ఫోన్.. బ్యాడ్‌న్యూస్ అనుకున్నా కానీ
న్యూఢిల్లీ: ఉదయం తెల్లవారుజామున 5 గంటలకు ఫోన్ మోగుతుంది.. ఇంత పొద్దునే ఎవరా అనే అనుమానంతో పాటు.. ఏదైనా బ్యాడ్ న్యూస్ వినాల్సి వస్తుందేమో అనే భయంతోనే ఫోన్ లిఫ్ట్ చేస్తాం. అవతలి మనిషి కంఠం గుర్తుపట్టి.. విషయం విన్నాక కానీ స్థిమితపడం. ఇదే పరిస్థితి తనకు ఎదురయ్యింది అంటున్నారు నోబెల్ అవార్డు గ్రహీత, ప్రముఖ భారత ఆర్థిక నిపుణులు అమర్త్య సేన్. కానీ ఆ ఫోన్ కాల్ తన జీవితంలోని అత్యంత ఆనందమైన.. వెలకట్టలేని శుభవార్తను తెలిపింది అన్నారు. తాను నోబెల్ ప్రైజ్ గెలుచుకున్నానని తెలిపే కాల్ అది అన్నారు. ఆ నాటి మధుర జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా గుర్తు చేసుకున్నారు అమర్త్య సేన్. (చదవండి: నా నోబెల్ బహుమతి తిరిగి ఇప్పించండి) ‘అక్టోబర్ 14, 1998 ఉదయం ఐదు గంటలకు ఫోన్ మోగుతుంది. అప్పుడు నా మొదటి ఆలోచన ఏంటంటే.. ఏదైనా బ్యాడ్ న్యూస్ వినాల్సి వస్తుందా.. ఎవరైనా అనారోగ్యానికి గురయ్యారా అనే అనుమానాలు మనసులో మెదిలాయి. రిసివర్ తీసుకుని చెవి దగ్గర పెట్టుకున్నాను. అకాడమీ నుంచి వచ్చిన ఫోన్ అని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నాను. కాల్ మాట్లాడిన తర్వాత శుభవార్త అని అర్థం అయ్యింది. నాకు నోబెల్ బహుమతి వచ్చిందని చెప్పడానికి అకాడమీ వారు కాల్ చేశారు. ఆ తర్వాత ప్రశాంతంగా కాఫీ తాగాను’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో అన జ్ఞాపకాలను పంచుకున్నారు అమర్త్య సేన్. సోషల్ చాయిస్, వెల్ఫేర్ మెజర్మెంట్ అండ్ పావర్టి రిసర్చ్ అంశంలో పరిశోధనలకు గాను 1998లో అమర్త్య సేన్‌కు నోబెల్ బహుమతి లభించిన సంగతి తెలిసిందే. ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లోని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అందిస్తుంది. View this post on Instagram What would you think has happened if you receive a phone call early in the morning? "My first thought was that something terribly tragic must have happened; somebody has turned ill or you know something worst than that. So I was concerned, so I was first relieved that it wasn't any of that and then when I examined that news, the examined news seemed good cause this is the academy calling." Around 5 a.m. on 14 October 1998 Amartya Sen's telephone rang. He was worried and fairly sure that something tragic had happened. But after the news sank in, Sen felt that "it was a good piece of news" and started the day with a cup of coffee. Stay tuned to find out who will be receiving the phone call this year. Photo: Stephanie Mitchell/@harvard university. . . . #NobelPrize #Nobel #announcements #science #discovery #research #economicsciences #economic #amartyasen #scientist #researcher A post shared by Nobel Prize (@nobelprize_org) on Sep 21, 2020 at 7:20am PDT -
నా నోబెల్ బహుమతి తిరిగి ఇప్పించండి
కోల్‌కతా : నోబెల్ బహుమతి కావాలి అంటూ ఓ మహిళ హౌరా బ్రిడ్జి ఎక్కి హల్చల్ చేసింది. ప్రముఖ ఆర్థికవేత్త అమర్థ్యసేన్ నా నోబెల్ బహుమతిని దొంగిలించాడని ఆరోపణలు చేసింది. ఈ విషయంపై కేంద్రం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందంటూ వాపోయింది. నోబెల్ ప్రైజ్ తిరిగి ఇచ్చేవరకు కదలనని భీష్మించుకొని కూర్చుంది. దీంతో ఆమెను కిందకి దించడానికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చాలా అవస్థలు పడ్డారు. మతిస్థిమితం లేని మధ్య వయస్కురాలిగా పోలీసులు గుర్తించారు. ఆమె పేరు డొల్లి ఘోష్ అని అశోక్‌నగర్‌లో నివాసం ఉంటున్నట్లు గుర్తించారు. ఆదివారం 6 గంటల ప్రాంతంలో ఆమె హౌరా బ్రిడ్జిపై ఎక్కిందని పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెను కిందకి దింపేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. చివరికి నోబెల్ ప్రైజ్ వెతికి తెచ్చిస్తామని మాట ఇవ్వడంతో సదరు మహిళ కిందకు దిగేందుకు ఇప్పుకోవడంతో విషయం సద్దుమణిగింది. (కరోనా: అవసరం లేకపోయినా చికిత్స.. ) -
నోబెల్ వేడుక: ధోతి ధరించి.. భారతీయత ఉట్టిపడేలా!
స్టాక్‌హోమ్: ఇండో-అమెరికన్ ఆర్థికవేత్త అభిజిత్ వినాయక్ బెనర్జీ, ఆయన భార్య ఎస్తేర్ డఫ్లోతోపాటు సహోద్యోగి మైఖేల్ క్రెమెర్ 2019 ఏడాదికిగాను ఆర్థిక శాస్త్ర నోబెల్ బహుమతిని అందుకున్నారు. అట్టహాసంగా జరిగిన నోబెల్ పురస్కార ప్రదానోత్సవానికి అభిజిత్ దంపతులు భారతీయత ఉట్టిపడేలా సంప్రదాయ వస్త్రధారణలో హాజరయ్యారు. ప్రపంచ పేదరిక నిర్మూలనకు ప్రయోగాత్మక విధానంలో విస్తృతమైన పరిశోధన చేసినందుకుగాను వారికి నోబెల్ అవార్డు వరించింది. వారి పరిశోధన ఆర్థిక శాస్త్ర రంగాన్ని పునర్నిర్వచించేలా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. Watch Abhijit Banerjee, Esther Duflo and Michael Kremer receive their medals and diplomas at the #NobelPrize award ceremony today. Congratulations! They were awarded the 2019 Prize in Economic Sciences “for their experimental approach to alleviating global poverty.” pic.twitter.com/c3ltP7EXcF — The Nobel Prize (@NobelPrize) December 10, 2019 పేదరిక నిర్మూలనకు ఈ త్రయం చేసిన కృషికిగాను మంగళవారం స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్‌లో ఆ దేశ రాజు కార్ల్- 16 గుస్తాఫ్ నుంచి అవార్డు అందుకొన్నారు. ఈ వేడుకలో భారత సంతతికి చెందిన అభిజిత్ బెనర్జీ ధోతితోపాటు బ్లాక్ కలర్ బంద్‌గాల కోటు ధరించి భారతీయ సంప్రదాయ వేషాధారణలో అందరినీ ఆకర్షించారు. ఆయన భార్య ఎస్తేర్ డఫ్లో సైతం నీలి రంగు చీర ధరించి నోబెల్‌ను అందుకున్నారు. ఆర్థిక శాస్త్ర విభాగంలో నోబెల్ అందుకున్న ఈ ముగ్గురు ఆర్థికవేత్తలకు పతకాలతో పాటు రూ. 6.7 కోట్లను (9 మిలియన్ల స్వీడిష్ క్రోనాలు) బహుమతిగా పొందారు. ముంబైలో జన్మించిన బెనర్జీ.. అమర్త్యసేన్ తరువాత ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్న భారతీయ సంతతికి చెందిన రెండవ ఆర్థికవేత్తగా చరిత్రలోకి ఎక్కారు. నోబెల్ బహుమతి అందుకున్న అమర్త్య సేన్, అభిజిత్ బెనర్జీ .. కోల్‌కతా ప్రెసిడెన్సీ కళాశాలలో విద్యను అభ్యసించడం గమనార్హం. అభిజిత్ బెనర్జీ, భార్య ఎస్తేర్ డఫ్లోలు మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో (ఎంఐటీ) ఎకనామిక్స్ ప్రొఫెసర్లుగా విధులు నిర్వర్తిస్తుండగా.. క్రెమెర్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్ ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు. భారతదేశంలో గ్రామీణ సమస్యలను పరిష్కరించడానికి కనీస హామీ పథకంతో పాటు పలు సలహాలు సూచించారు. చదవండి: అభిజిత్ ‘నోబెల్’ వెలుగు నీడలు -
మోదీతో నోబెల్ విజేత అభిజిత్ భేటీ
న్యూఢిల్లీ: ప్రవాస భారతీయుడు, ఈ ఏడాది ఆర్థిక నోబెల్ పురస్కార విజేత అభిజిత్ బెనర్జీ మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. వివిధ రంగాలకు సంబంధించి ఇరువురి మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో చర్చలు జరిగాయి. ఈ విషయాన్ని మోదీ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. అభిజిత్ తనతో భేటీ అయిన ఫొటోని కూడా మోదీ ట్విట్టర్లో ఉంచారు. ‘నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీతో సమావేశం అద్భుతంగా సాగింది. మానవ సాధికారతపై ఆయనకున్న తపన స్పష్టంగా కనిపిస్తుంది. వివిధ అంశాలపై ఆలోచనల్ని పంచుకున్నాం. ఆయన సాధించిన విజయాలను చూసి భారత్ గర్విస్తోంది’ అని మోదీ ట్వీట్ చేశారు. కోల్‌కతాకు చెందిన అభిజిత్ బెనర్జీ ప్రస్తుతం అమెరికాలో మసాచూసెట్స్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా ఉన్నారు. మోదీ ఆలోచనలు వినూత్నం: అభిజిత్ ప్రధానమంత్రిని కలిసి వచ్చిన తర్వాత అభిజిత్ బెనర్జీ మీడియాతో మాట్లాడారు. భారత్‌లో పాలనను గాడిలో పెట్టడానికి మోదీ చేస్తున్న కృషిని ప్రశంసించారు. ‘ఎన్డీయే పరిపాలనపై క్షేత్రస్థాయిలో కొందరిలో నెలకొన్ని ఉన్న అపోహలను తొలగించాలంటే పరిపాలనకు సంబంధించి ప్రజల సలహాలు కూడా స్వీకరించాలని, అధికార వ్యవస్థని ప్రక్షాళన చేసి ప్రజలకు జవాబుదారీ తనాన్ని పెంచాలని మోదీ చెప్పారు. భారత్ అభివృద్ధి కోసం మోదీ ఆలోచనలు వినూత్నంగా ఉన్నాయి’’అంటూ అభిజిత్ ఆకాశానికెత్తేశారు. మీడియాపై మోదీ జోకులు ప్రధానమంత్రిని తాను కలుసుకోగానే ఆయన బోల్డన్ని జోకులు వేశారని, ముఖ్యంగా మీడియా గురించి ఛలోక్తులు విసిరారని అభిజిత్ చెప్పారు. మోదీకి వ్యతిరేకంగా మీరేమైనా చెబుతారేమోనని బయట మీడియా కాచుకొని కూర్చుంది. మీ నుంచి అలాంటి వ్యాఖ్యలు రాబట్టాలని ప్రయతి్నస్తుంది అంటూ మోదీ తనతో నవ్వుతూ చెప్పారని వెల్లడించారు. ‘‘మోదీ టీవీ చూస్తూ ఉంటారు, మీడియా ప్రతినిధులు ఏం చేస్తారో గమనిస్తూ ఉంటారు. మీడియా ఏం చేస్తుందో ఆయనకు బాగా తెలుసు’అని అభిజత్ చెప్పారు. -
నిర్మలా సీతారామన్‌పై అభిజిత్ ఆసక్తికర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : ఆర్థిక రంగంలో విప్లవాత్మక పరిశోధనలు చేసి నోబెల్ బహుమతి గెలుచుకున్న ప్రవాస భారతీయుడు అభిజిత్ బెనర్జీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ జేఎన్‌యూలో నిర్మలా సీతారామన్ తనూ సమకాలీనులమని అన్నారు. ఆయన 1983లో జేఎన్‌యూలో ఆర్థికశాస్త్రంలో పీజీ పూర్తి చేశారు. నిర్మలాతో పలు అంశాలపై చర్చించేవాళ్లమని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పేదరికాన్ని నిర్మూలించడానికి వినూత్న కోణంలో పరిశోధనలు చేసి ఆర్థిక రంగంలో విప్లవాత్మక మార్పుల్ని తెచ్చినందుకు అభిజిత్, ఆయన భార్య ఎస్తర్ డఫ్లో, మరో అమెరికన్ ఆర్థికవేత్త మైకేల్ క్రెమెర్‌లు సంయుక్తంగా నోబెల్ బహుమతి అందుకోనున్న సంగతి తెలిసిందే. (చదవండి : రాజద్రోహం, హత్యాప్రయత్నం నేరాల కింద అరెస్ట్ చేశారు) ఇక భారత ఆర్థిక వ్యవస్థ అంధకారంలో ఉందన్న బెజెర్జీ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ‘నోబెల్ ప్రైజ్ పొందాలంటే.. విదేశి వనితలను రెండో వివాహం చేసుకోవాలనుకుంటా. ఇన్నాళ్లు ఈ విషయం నాకు తెలియదు’ అంటూ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు రాహుల్ సిన్హా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారంటూ అభిజిత్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఇప్పుడు రాజకీయాల్లో ఉన్న కొంతమంది నాకు తెలుసు. వారిలో నిర్మలా సీతారామన్ ఒకరు. ఆమె, నేనూ ఒకే సమయంలో జేఎన్‌యూలో చదువుకున్నాం. మేము క్లోజ్ ఫ్రెండ్స్ కాదు. కానీ, పలు అంశాలపై చర్చించుకునే వాళ్లం. అయినా, మా మధ్య ఎలాంటి విభేదాలు ఉండేవి కావు. (చదవండి : పేదరికంపై పోరుకు నోబెల్) విశ్వవిద్యాలయంలో రకరకాల మనుషులు ఉంటారు. ఎవరి అభిప్రాయాలు వారివి. మనదేశంలోని పరిస్థితులను ఆకలింపు చేసుకునేందుకు ఇక్కడే ఉన్నత విద్యను అభ్యసించడం కలిసొచ్చింది. సంక్లిష్టమైన భారత ఆర్థిక వ్యవస్థ, వైవిధ్యమైన జీవన విధాలను అర్థం చేసుకోవం కష్టమైనదే’ అని అభిజిత్ అభిప్రాయపడ్డారు. ఇక అభిజిత్ వామపక్షవాది అని, ఆయన చేసే విమర్శలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. -
‘నోబెల్ రావాలంటే.. భార్య ఫారినర్ కావాలేమో’
కోల్‌కతా: దేశానికి వన్నె తెచ్చే అంశమైనా సరే.. దాని గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం మన నాయకులకు సర్వసాధరణం. తాజాగా ఇలాంటి పని చేసి వివాదంలో చిక్కుకున్నారు బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు రాహుల్ సిన్హా. ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో ప్రవాస భారతీయుడు అయిన అభిజిత్ బెనర్జీకి నోబెల్ బహుమతి వచ్చిన సంగతి తెలిసిందే. భార్య ఎస్తర్ డఫ్లోతో కలిసి ఈ అవార్డును అందుకుంటున్నారు అభిజిత్. అయితే డఫ్లో విదేశి వనితే కాక అభిజిత్‌కు రెండో భార్య. ఈ క్రమంలో పశ్చిమబెంగాల్ బీజేపీ అధ్యక్షుడు రాహుల్ సిన్హా అభిజిత్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. ‘నోబెల్ ప్రైజ్ పొందాలంటే.. విదేశి వనితలను రెండో వివాహం చేసుకోవాలనుకుంటా. ఇన్నాళ్లు ఈ విషయం నాకు తెలియదు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాక అభిజిత్ వామపక్షివాది అంటూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలను రాహుల్ సిన్హా సమర్థించారు. వామపక్షవాదులం అనే ముసుగులో జనాలు.. ఆర్థిక వ్యవస్థను భ్రష్టుపట్టించారు. వామపక్ష విధానంలో ఆర్థిక వ్యవస్థ నడవాలని వారు కోరుకున్నారు. కానీ నేడు దేశంలో వామపక్ష విధానాలను ఎవరు పట్టించుకోవడం లేదన్నారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన న్యాయ్ పథకం రూపకల్పనలో అభిజిత్ ఒకరు కావడంతో బీజేపీ ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తోంది. -
10 రోజులు తిహార్ జైలులో ఉన్నా: అభిజిత్ బెనర్జీ
న్యూఢిల్లీ: ప్రవాస భారతీయుడు అభిజిత్ బెనర్జీకి ఆర్థిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం దక్కిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా పేదరికాన్ని నిర్మూలించడానికి వినూత్న కోణంలో పరిశోధనలు చేసి.. విప్లవాత్మక మార్పులు తెచ్చినందుకు గాను ఈ పురస్కారం వరించింది. పశ్చిమబెంగాల్‌కు చెందిన ఆర్థికవేత్తలు ప్రొఫెసర్ నిర్మల, దీపక్ బెనర్జీలకు 1961లో కోల్‌కతాలో అభిజిత్ బెనర్జీ జన్మించారు. ఆయన విద్యాభ్యాసం అంతా భారత్‌లోనే సాగింది. ప్రపంచంలోనే అత్యుత్తమ నోబెల్ పురస్కారం అందుకున్న ఈ ఆర్థికవేత్త ఒకప్పుడు కరుడుగట్టిన నేరస్తులను ఉంచే తిహార్ జైలులో గడిపారంటే ఆశ్చర్యపోక తప్పదు. ఏదో పెద్ద నేరం చేసి తిహార్ జైలుకు వెళ్లి ఉంటారని భావిస్తే.. పొరపాటే. విద్యార్థి సంఘం నాయకుడికి మద్దతుగా ఓ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నందుకు గాను ఇతర విద్యార్థులతో పాటు అభిజిత్ కూడా తిహార్ జైలులో గడపాల్సి వచ్చింది. ఈ సంఘటన 1983లో చోటు చేసుకుంది. మూడేళ్ల క్రితం ఓ ఆంగ్ల పత్రికకిచ్చిన ఇంటర్వ్యూలో అభిజిత్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘జేఎన్‌యూలో ఓ విద్యార్థి సంఘం నాయకుడిని బహిష్కరించారు. ఇందుకు నిరసనగా విద్యార్థులందరూ వైస్ చాన్సిలర్‌ను ఘెరావ్ చేశాం. దాంతో నాతోపాటు మరికొందరు విద్యార్థులపై కేసు నమోదు చేసి 10 రోజుల పాటు తిహార్ జైలులో ఉంచారు. మమ్మల్ని కొట్టారు. అంతేకాక మా మీద రాజద్రోహం నేరమే కాక హత్యానేరాన్ని కూడా మోపారు. అయితే దేవుడి దయ వల్ల ఆ తర్వాత వాటిని ఉపసంహరించుకున్నారు. అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మా నిరసన కార్యక్రమం వల్ల మేలే జరిగింది. అడ్మినిస్ట్రేషన్ సిస్టంలో మార్పులు జరిగాయి. కానీ పది రోజుల పాటు తిహార్ జైలులో ఉండటం మాత్రం జీవితంలో మర్చిపోలేని భయానక అనుభవం’ అంటూ చెప్పుకొచ్చారు అభిజిత్. ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి కలిపి నోబెల్ పురస్కారం ప్రకటించారు. అమెరికన్ ఆర్థికవేత్త మైకేల్ క్రెమెర్‌తో పాటు అభిజిత్ ఆయన భార్య ఎస్తర్ డఫ్లో సంయుక్తంగా ఈ అవార్డును అందుకోనున్నారు. ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన రెండో మహిళగా డఫ్లో నిలిచారు. -
నోబెల్ విజేత గుంటూరు వచ్చారు!
సాక్షి ప్రతినిధి, అమరావతి బ్యూరో: ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి విజేత అభిజిత్ బెనర్జీ పరిశోధనల కోసం గతంలో గుంటూరులో పర్యటించిన విషయం వెలుగులోకి వచ్చింది. 2006 అక్టోబరులో ‘ది ఎకనమిక్ లైవ్స్ ఆఫ్ ది పూర్’ పేరిట ప్రచురించిన పరిశోధనా పత్రంలో గుంటూరులో పేద మహిళల జీవన స్థితిగతులను పరిశీలించినట్లు పేర్కొన్నారు. రోజుకు ఒక డాలర్ కంటే తక్కువ సంపాదనతో బతుకీడుస్తున్న వారి జీవన స్థితిగతులను అధ్యయనం చేసి, పేదరికాన్ని జయించగలిగే మార్గాలను అన్వేషించడానికి వీలుగా 13 దేశాల్లో డేటాను ఆయన తన సహచర పరిశోధకురాలు ఎస్తేర్ డఫ్లోతో కలిసి సేకరించారు. అందులో ఏమని రాశారంటే.. ‘ఉదయం 9 గంటలకు పేదరికం తాండవిస్తున్న వీధికి వెళ్లాం. తమ ఇళ్ల ముందు మహిళలు దోసెలు వేసి విక్రయిస్తున్న దృశ్యం కనిపించింది. ప్రతి ఆరో ఇంటివద్ద ఇది కనిపించింది. ఒక్కో దోసె రూ. 1కి విక్రయిస్తున్నారు. ఒక గంట తర్వాత మళ్లీ ఆ వీధిలో వెనక్కి వచ్చాం. దోసెలు వేస్తున్న వారంతా కట్టేసి వెళ్లిపోయారు. ఇంట్లో ఉన్న ఒక మహిళతో మాట్లాడితే... దోసెలు అమ్మిన తర్వాత రోజంతా ఖాళీగా ఉండకుండా మరో పని చేస్తాం. నేను చీరలు విక్రయిస్తాను అని తెలిపారు. ఒకే పని చేసి, దాంట్లోనే నైపుణ్యం, అనుభవం సంపాదిస్తే మెరుగైన సంపాదన ఉంటుంది కదా? అని అడిగిన ప్రశ్నలకు మహిళల నుంచి వచ్చిన సమాధానాలు వివిధ రకాలుగా ఉన్నాయి. దోసెల పని అయిన తర్వాత రోజంతా ఖాళీగా ఉండటం ఎందుకని మరో పనిచేస్తున్నామని కొందరు చెప్పారు. ఒకే పని(వ్యాపారం) చేస్తే నష్టభయం ఉంటుందని, రెండు–మూడు రకాల పనులు చేయడం వల్ల నష్టభయం తక్కువగా ఉంటుందని మరి కొందరు చెప్పారు. ‘దోసెలు వేయడం వల్ల పెద్దగా లాభం రావడం లేదని గమనించాం. దోసెలు తయారీకి ఉపయోగించే పొయ్యి, ఇతర వస్తువులన్నీ ఇంట్లోవే. అందువల్ల పెట్టుబడి అవసరం లేదు. నష్టమూ తక్కువే. అందుకే ఎక్కువ మంది ఈ పనిచేస్తున్నారు’ అని పరిశోధనాపత్రంలో పేర్కొన్నారు. తాము హైదరాబాద్‌ను కూడా సందర్శించినట్లు పరిశోధనా పత్రంలో పేర్కొన్నారు. (చదవండి: పేదరికంపై పోరుకు నోబెల్) -
అభిజిత్‌కు నోబెల్
-
పేదరికంపై పోరుకు నోబెల్
స్టాక్‌హోమ్: ప్రపంచవ్యాప్తంగా పేదరికాన్ని నిర్మూలించడానికి వినూత్న కోణంలో పరిశోధనలు చేసి ఆర్థిక రంగంలో విప్లవాత్మక మార్పుల్ని తెచ్చినందుకు ప్రవాస భారతీయుడు అభిజిత్ బెనర్జీకి అర్థశాస్త్రంలో నోబెల్ పురస్కారం వరించింది. ఈ ఏడాది ఆర్థిక నోబెల్ పురస్కారాన్ని ముగ్గురికి ప్రకటించారు. అభిజిత్, ఆయన భార్య ఎస్తర్ డఫ్లో, మరో అమెరికన్ ఆర్థికవేత్త మైకేల్ క్రెమెర్‌లు సంయుక్తంగా ఈ అవార్డును అందుకోనున్నారు. భార్యతో కలిసి ఒక ప్రవాస భారతీయుడు అర్థశాస్త్రంలో నోబెల్‌ను దక్కించుకోవడం ఒక విశేషమైతే, ఆర్థిక శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని పొందిన రెండో మహిళ డఫ్లో. ఈ పురస్కారం కింద తొమ్మిది లక్షల 18 వేల అమెరికా డాలర్ల నగదు, ఒక బంగారు పతకం, డిప్లొమా అందిస్తారు. అమెరికన్ ఆర్థికవేత్త మైకేల్ క్రెమెర్ పురస్కారం కింద వచ్చే నగదు బహుమానాన్ని ముగ్గురు ఆర్థికవేత్తలు సమానంగా పంచుకుంటారు. ‘‘వీరు చేసిన పరిశోధనలు, ప్రతిపాదనలతో ప్రపంచవ్యాప్తంగా పేదరికాన్ని సమర్థమంతంగా ఎదుర్కొంటున్నాం. కేవలం రెండు దశాబ్దాల్లోనే ఆర్థిక రంగంలో స్పష్టమైన మార్పుల్ని , అభివృద్ధిని చూడగలుగుతున్నాం. అధ్యయనాలు చేయడానికి ఇప్పుడు ఈ రంగమే అత్యంత కీలకంగా ఉంది. ఎందరో అధ్యయనకారు లు ఈ ముగ్గురు అడుగుజాడల్లోనే నడుస్తూ పేదరికాన్ని పారద్రోలడానికి శక్తిమంతమైన ప్రతిపాదనలు చేస్తున్నారు’’ అని నోబె ల్ పురస్కారాన్ని ప్రకటించిన రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది. వినూత్న ధోరణితో వీరు చేసిన అధ్యయనాలు పేదరికం నిర్మూలనకు పరిష్కార మార్గాలను చూపించిందని కొనియాడింది. ప్రధాని అభినందనలు: ఆర్థిక నోబెల్‌కు ఎంపికైన ప్రవాస భారతీయుడు అభిజిత్ బెనర్జీకి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. పేదరిక నిర్మూలనలో బెనర్జీ గణనీయ కృషి చేశారన్నారు. ఏపీ సీఎం జగన్ అభినందనలు సాక్షి, అమరావతి: ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని ఎస్తర్ డఫ్లో, మైఖేల్ క్రెమెర్‌తో కలిసి సంయుక్తంగా గెలుచుకున్నందుకు అభిజిత్ బెనర్జీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్లో అభినందనలు తెలిపారు. ప్రపంచంలోని పేదరికాన్ని నిర్మూలించడంలో వారు చేసిన కృషిని ఆయన కొనియాడారు. భారత్ పుంజుకునే పరిస్థితి లేదు: అభిజిత్ కోల్‌కతా/న్యూయార్క్: భారత ఆర్థిక వ్యవస్థ పరిస్థితి అంత ఆశాజనకంగా ఏమీ లేదని అభిజిత్ బెనర్జీ వ్యాఖ్యానించారు. భారత ఆర్థిక వ్యవస్థ అస్థిరంగా ఉందన్న బెనర్జీ.. మళ్లీ పుంజుకునే అవకాశాలు కూడా కనుచూపు మేరలో కనిపించడం లేదని అమెరికాలోని ఒక న్యూస్ చానల్‌తో అన్నారు. మళ్లీ నిద్రపోయా..: ‘నోబెల్ పురస్కారం ప్రకటించారన్న సమాచారం తెల్లవారు జామున ఒక ఫోన్‌కాల్ ద్వారా తెలిసింది. నేను ఉదయమే నిద్రలేచే వ్యక్తిని కాదు. అందుకే ఆ వార్త విన్న తరువాత మళ్లీ పడుకున్నాను. కానీ, వరస ఫోన్‌కాల్స్‌తో ఎక్కువసేపు నిద్ర పోలేకపోయాను’ అని బెనర్జీ వివరించారు. భార్యకు తనకు కలిపి నోబెల్ రావడంపై స్పందిస్తూ. ‘అది మరింత స్పెషల్’ అన్నారు. దంపతులిద్దరికీ నోబెల్ రావడం గతంలో ఐదు పర్యాయాలు జరిగింది. నోబెల్ భారతీయం ► రవీంద్రనాథ్ ఠాగూర్ (సాహిత్యం, 1913) ► సీవీ రామన్ (భౌతికశాస్త్రం, 1930) ► హర గోవింద్ ఖురానా (ఇండియన్ అమెరికన్), వైద్యం, 1968 ► మదర్ థెరిసా (శాంతి పురస్కారం, 1979) ► సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ (ఇండియన్ అమెరికన్), భౌతికశాస్త్రం, 1983 ► అమర్త్యసేన్ (ఆర్థికశాస్త్రం, 1998) ► వెంకటరామన్ రామకృష్ణన్, (రసాయనశాస్త్రం, 2009) ► కైలాస్ సత్యార్థి (శాంతి పురస్కారం, 2014) ► అభిజిత్ బెనర్జీ (ఇండియన్ అమెరికన్), ఆర్థికశాస్త్రం, 2019 కోల్‌కతా వాసి పశ్చిమబెంగాల్‌కు చెందిన ఆర్థికవేత్తలు ప్రొఫెసర్ నిర్మల, దీపక్ బెనర్జీలకు కోల్‌కతాలో 1961లో అభిజిత్ బెనర్జీ జన్మించారు. ఆయన విద్యాభ్యాసం అంతా భారత్‌లోనే సాగింది. కోల్‌కతా ప్రెసిడెన్సీ కాలేజీలో డిగ్రీ చేశారు. ఉన్నతాభ్యాసం కోసం అమెరికా వెళ్లి 1988లో హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఆర్థికశాస్త్రంలో పీహెచ్డీ చేశారు. 2003లో ఎస్తర్ డఫ్లోతో కలిసి అబ్దుల్ లతీఫ్ జమీల్ పోవర్టీ యాక్షన్ ల్యాబ్ (జే–పాల్)ను స్థాపించారు. ప్రస్తుతం ప్రతిష్టాత్మక మాసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లో ఆర్థికశాస్త్రంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. 2015 తర్వాత అభివృద్ధి ఎజెండా అనే అంశంలో ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన హైలెవల్ ప్యానెల్ ఆఫ్ ఎమినెంట్ పర్సన్స్‌లో కూడా అభిజిత్ పనిచేశారు. ఫ్రాన్స్‌కు చెందిన ఎస్తర్ డఫ్లో ఎంఐటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో పీహెచ్డీ చేశారు. విద్య, ఆరోగ్యం, ఆర్థికం, పర్యావరణం, పరిపాలన వంటి పలు రంగాల్లో పనిచేశారు. ప్రస్తుతం ఎంఐటీలో ప్రొఫెసర్‌గా ఉన్న ఆమె తనకు వచ్చిన ఈ అవార్డు ద్వారా మహిళా లోకం స్ఫూర్తి పొంది ఆర్థిక రంగంలో అద్భుతాలు చేయాలని పిలుపునిచ్చారు. 47 ఏళ్ల వయసుకే అవార్డు దక్కించుకొని అతి చిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించారు. పురస్కారం పొందిన మరో ఆర్థికవేత్త 54 ఏళ్ల వయసున్న క్రెమర్ హార్వర్డ్ వర్సిటీలో ప్రొఫెసర్‌గా ఉన్నారు. సూటి ప్రశ్నలు సంధిస్తూ.. అభిజిత్ బెనర్జీది మొదట్నుంచి సూటిగా ప్రశ్నలు వేసే తత్వం. వాటికి తగిన సమాధానాలు దొరికేవరకు ఆయన విస్తృతంగా అధ్యయనం చేసేవారు. ఇలాంటి వినూత్న ధోరణిని అవలంబించడం వల్లే ఆయనకు నోబెల్ పురస్కారం అంది వచ్చింది. ఒక ఆర్థికవేత్తగా అభిజిత్ ఎన్నో ఆర్టికల్స్ రాశారు. కొన్ని డాక్యుమెంటరీలు తీశారు. పలు పుస్తకాలు కూడా రచించారు. వాటిలో భార్య డఫ్లోతో కలిసి రచించిన పూర్ ఎకనామిక్స్ అనే పుస్తకం విశేషంగా గుర్తింపు పొందింది. 17 భాషల్లోకి అనువాదమైంది. 2011లో ఫైనాన్షియల్ టైమ్స్, గోల్డ్‌మ్యాన్ సాచ్స్ బిజినెస్ బుక్ ఆఫ్ ది ఇయర్ అవార్డుల్ని గెలుచుకుంది. ► మొరాకోలో ఒక వ్యక్తికి కడుపు నిండా తిండి లేకపోయినా టీవీ కొనుక్కోవాల్సిన అవసరం ఏమిటి ? ► దారిద్య్ర ప్రాంతాల్లో చిన్నారులు పాఠశాలలకు వెళ్లినా వారికి చదువు నేర్చుకోవడం ఎందుకు కష్టంగా మారుతోంది ? ► గంపెడు మంది పిల్లలు ఉంటే నిరుపేదలుగా మారుతారా ? వంటి ప్రశ్నలకు సమాధానాలు దొరకడం దుర్లభం. చిత్తశుద్ధితో వీటికి సమాధానాలు దొరికే మార్గాలను వెతకాలి అని బెనర్జీ ఆ పుస్తకంలో పేర్కొన్నారు. -
అర్థికశాస్త్రంలో భారత సంతతి అభిజిత్ బెనర్జీకి నోబెల్ పురస్కారం
-
ప్రవాస భారతీయుడికి ప్రతిష్టాత్మక నోబెల్
స్టాక్‌హోమ్ : ఆర్థిక శాస్త్రంలో విశేష సేవలందించిన ముగ్గురికి ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి వరించింది. 2019 ఏడాదికిగానూ అభిజిత్ బెనర్జీ, ఎస్తేర్ డుఫ్లో, మైఖేల్ క్రెమేర్‌లను సంయుక్తంగా నోబెల్ బహుమతికి ఎంపిక చేసినట్టు రాయల్ స్వీడిష్ అకాడెమీ సోమవారం ప్రకటించింది. విశ్వవ్యాప్తంగా పేదరికాన్ని పారదోలడానికి అవసరమైన ఆర్థిక విధానాలపై చేసిన పరిశోధనలకు గాను ఈ అవార్డు ప్రకటించినట్టు వెల్లడించింది. రెండు దశాబ్దాల వీరి కృషి ఫలితంగా పేదరిక నిర్మూలనలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయని అకాడెమీ తెలిపింది. వీరి ప్రయోగాత్మక విధానం ప్రపంచ పేదరికంతో పోరాడే మన సామర్థ్యాన్ని గణనీయంగా మెరుగు పరిచిందని కమిటీ పేర్కొంది. కోల్‌కతాలో జన్మించిన అభిజిత్ బెనెర్జీ అమర్థ్యాసేన్ తర్వాత భారత్ తరపున నోబెల్ పొందిన వాడిగా చరిత్ర సృష్టించారు. అమెరికాలో స్థిరపడిన అభిజిత్ ఫ్రెంచ్-అమెరికన్ ఎస్తేర్ డుఫ్లో దంపతులు కావడం విశేషం. (చదవండి : ఇథియోపియా ప్రధానికి శాంతి నోబెల్) ఎస్తేర్ డుఫ్లో, అభిజిత్ బెనర్జీ దంపతులు ప్రైజ్‌మనీ 9 మిలియన్ డాలర్లు.. అభిజిత్ బెనెర్జీ (58) హార్వార్డ్ యూనివర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో పీహెచ్డీ పట్టా పొందారు. ప్రసిద్ధ మసాచూసెట్స్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఇక పారిస్‌లో జన్మించిన ఎస్తేర్ డుఫ్లో (47) మసాచుసెట్స్ యూనివర్సిటీ ఎకనమిక్స్‌లో పీహెచ్డీ పట్టా పొందారు. అక్కడే ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. దంపతులైన ఈ ఇద్దరూ అమెరికాకు చెందిన మరో శాస్త్రవేత్త మైఖేల్ క్రెమెర్ (55)తో కలిసి పేదరికాన్ని ఎదుర్కోవడానికి ప్రయోగాత్మక విధానాలను రూపొందించారు. ఈ ముగ్గురికీ కలిపి ప్రైజ్‌మనీగా 9 మిలియన్ల డాలర్లను నోబెల్ కమిటీ ఇవ్వనుంది. తన కొడుకు, కోడలుకు నోబెల్ బహుమతి వరించడంతో అభిజిత్ బెనెర్జీ తల్లి నిర్మలా బెనెర్జీ ఆనందం వ్యక్తం చేశారు. ‘బెంగాల్‌కు చెందిన రెండో వ్యక్తి నోబెల్ పొందడం చాలా సంతోషాన్ని కలిగించింది. ఈ ప్రతిష్టాత్మక బహుమతితో దేశం గర్వించేలా చేసిన అభిజిత్‌కు అభినందనలు’అని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనెర్జీ ట్విటర్లో పేర్కొన్నారు. అభిజిత్ బెనెర్జీకి నోబెల్ రావడం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. పేదరికాన్ని పారదోలడానికి అభిజిత్ తన పరిశోధనలతో ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. నోబెల్ విజేతలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. అభిజిత్ బెనెర్జీతో కలిసి ఎస్తేర్ డుఫ్లో, మైఖేల్ క్రెమేర్ పేదరిక నిర్మూలనకై ప్రయోగాత్మక పరిశోధనలు చేశారని ట్విటర్లో పేర్కొన్నారు. -
ఓల్గా, హండ్కేలకు సాహితీ నోబెల్
స్టాక్‌హోమ్: సాహితీ రంగంలో విశేషంగా కృషిచేసిన ఇద్దరు ప్రముఖ సాహితీవేత్తలకు ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి లభించింది. ఆస్ట్రియాకి చెందిన ప్రముఖ నవల, నాటక రచయిత పీటర్ హండ్కేకి 2019 సంవత్సరానికి గాను నోబెల్ పురస్కారం వరించింది. 2018 సంవత్సరానికి పోలండ్‌కి చెందిన ప్రముఖ పర్యావరణ వేత్త, స్త్రీవాది, మేధావి, నవలా రచయిత్రి ఓల్గా టోర్కార్క్విజ్‌కి ‘ద బుక్స్ ఆఫ్ జాకోబ్‘ అనే నవలకు గానూ ఈ బహుమతి లభించింది. జ్ఞానపిపాసతో ఆమె చేసిన సృజనాత్మక రచనకు ఈ అత్యున్నత పురస్కారం లభించింది. అద్భుతమైన భాషా పరిజ్ఞానంతో మానవ అనుభవాల విశిష్టతను ప్రభావవంతంగా చాటి చెప్పినందుకు ఆమెకు ఈ ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి లభించింది. 15 మంది స్త్రీలకే నోబెల్ పురస్కారం ఇప్పటి వరకు సాసాహితీరంగంలో కేవలం 14 మంది మహిళలనే నోబెల్ పురస్కారం వరించింది. ఈ రంగంలో నోబెల్ బహుమతి వచ్చిన మహిళల్లో ఓల్గా టోర్కార్క్విజ్ 15వ వారు. ఈమె రచనల్లో భిన్నత్వం ఉంటుంది. రెండు విభిన్న అంశాల మధ్యనున్న అంతరాన్ని ఉద్వేగపూరితంగా వర్ణిస్తారు. ఆమె నవలల్లో స్త్రీపురుషుల మధ్య, ప్రకృతికీ సంస్కృతికీ మధ్య, వివేచనకీ, అవివేకానికీ మధ్య వారి అంతరాంతరాల్లో రగులుతోన్న అంతర్మథనాన్ని అద్భుతంగా వర్ణిస్తారని నోబెల్ పురస్కారాన్ని ప్రకటించిన స్వీడిష్ అకాడమీ ప్రకటించింది. నిజానికి ఓల్గా టోర్కార్క్విజ్ని కొంత ఆలస్యంగా ఈ ప్రతిష్టాత్మక బహుమతికి ఎంపిక చేసినట్టు వారు వెల్లడించారు. చంపేస్తామన్నారు.. జీవితంలో ఎన్నో చీకటి కోణాలను చూసిన 57 ఏళ్ళ పర్యావరణ వేత్త, శాఖాహారి అయిన ఓల్గా టోర్కార్క్విజ్ పోలండ్ మతతత్వ ప్రభుత్వ విధానాలనూ, చట్టాలనూ తూర్పారబట్టేందుకు వెనకాడని రాజకీయవేత్త. సాహసోపేతమైన, నిర్భీతితో కూడిన ఆమె రచనలు పోలండ్ సమాజాన్ని కుదిపేసాయి. ‘సహనశీల పోలండ్ మిథ్య’ అంటూ ఆమె చేసిన రచనల కారణంగా 2015లో ఆమెను చంపేస్తామన్న బెదిరింపులు సైతం వచ్చాయి. దీంతో ప్రచురణకర్తలు ఆమెకు బాడీగార్డులను సైతం ఏర్పాటుచేశారు. సృజనాత్మకత ఉట్టిపడేలా చిత్రీకరించిన ఆమె రచనల్లోని పాత్రల కవితాత్మకత వర్ణన పాఠకులను కట్టిపడేస్తుంది. 1962, జనవరి 29న పోలండ్‌లోని వెస్ట్రన్ టౌన్లో ఓల్గా జన్మించారు. యూనివర్సిటీ ఆఫ్ వార్సాలో ఆమె చదువుకున్నారు. ఆమె తండ్రి లైబ్రేరియన్ కావడంతో పుస్తకపఠనమే ప్రపంచంగా పెరిగారు. ఆమె తొలి నవల ‘ద జర్నీ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ద బుక్’ 1993లో ప్రచురించారు. ఓల్గా రచించిన ‘ఫ్లైట్స్’ నవలకు 2017లో బుకర్ ప్రైజ్ లభించింది. ఆమె రచించిన 900 పేజీల ‘‘ద బుక్స్ ఆఫ్ జాకోబ్’’ ఏడు దేశాలకూ, మూడు ప్రాంతాలకూ, ఐదు భాషల చరిత్రకు సంబంధించినది. 18వ శతాబ్దానికి చెందిన జూయిష్ అనే చిన్న తెగకు చెందిన బహుకొద్ది చరిత్ర మాత్రమే తెలిసిన ఫ్రాంకిసమ్ అనే వ్యక్తి చరిత్రను అన్వేషిస్తుంది. హండ్కే – వివాదాస్పద రచయిత.. పీటర్ హండ్కే రచనలెంత ప్రాముఖ్యతను సాధించాయో, అంతే స్థాయిలో ఆయన వివాదాస్పదుడు కూడా. 1990లో యుగోస్లేవియా యుద్ధ సమయంలో సెర్బ్ల పక్షాన్ని వహించినందుకు ఆయనపై అనేక విమర్శలొచ్చాయి. మానవ హననం సాగించాడని, యుద్ధనేరానికి పాల్పడ్డాడని ఆరోపణలున్న మాజీ సెర్బ్ నేత స్లోబోదన్ మిల్సేవిక్ అంతిమయాత్రలో ఆయనకు మద్దతుగా ప్రసంగించడం కూడా పీటర్ హండ్కే వివాదాస్పదుడవడానికి మరో కారణం. 2014లో సాహిత్యరంగంలో నోబెల్ బహుమతిని నిషేధించాలని కూడా పీటర్ డిమాండ్ చేశారు. ఆయన రాసిన ‘ద అవర్ వియ్ న్యూ నథింగ్ ఆఫ్ ఈచ్ అదర్’ అనే సంభాషణలు లేని నాటకం చాలా ప్రసిద్ధి గాంచింది. పీటర్ హండ్కే పూర్తి స్వచ్ఛమైన జర్మన్ భాషా రచయితల్లో బతికి ఉన్న అతి కొద్దిమందిలో ఒకరు. సాహితీరంగంలో నోబెల్ పురస్కారాన్ని వ్యతిరేకిస్తూ ఆయన ‘ఇది ఒక్క క్షణం ఆసక్తికీ, ఆరుపేజీల పత్రికా వార్తకీ’ సంబంధించినదంటూ 2014లో అన్నారు. హండ్కే ఆస్ట్రియాలో రెండవ ప్రపంచ యుద్ధకాలంలో (1942, డిసెంబర్ 6) జర్మనీ సైనికుడికీ, స్లొవేనియాకు చెందిన మైనారిటీ తల్లికి జన్మించారు. బాల్యం యుద్ధ వాతావరణంలోగడిచింది. ఆ తరువాత ఆయన ఆస్ట్రియాలో ఆయన పెరిగి పెద్దయ్యారు. 1966లో ‘ద హార్నెట్స్’ అనే నవలతో సాహితీరంగంలో సంచలనం సృష్టించారు. దీంతో న్యాయవాద చదువుని మధ్యలోనే వదిలేసి సాహితీరంగం వైపు వచ్చారు. -
రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్
-
రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్
రసాయన శాస్త్రంలో విశేష సేవలందించిన ముగ్గురికి నోబెల్ బహుమతి వరించింది. 2019 ఏడాదికిగానూ గత రెండురోజుల్లో వైద్య, భౌతికశాస్త్రాల్లో నోబెల్ విజేతలను ప్రకటించిన పురస్కార కమిటీ.. తాజాగా రసాయన శాస్త్రంలో గ్రహీతల పేర్లను వెల్లడించింది. జాన్ బి.గూడెనఫ్, స్టాన్లీ విట్టింగమ్, అకిరా యోషినోకు ఈ అవార్డ్‌ను సంయుక్తంగా అందజేయనున్నట్లు ప్రకటించింది. లిథియం ఆయాన్ బ్యాటరీ అభివృద్ధికి చేసిన విశేష పరిశోధనలకు వారికి ఈ పురస్కారం లభించింది. వీరు అభివృద్ధి చేసిన లిథియం ఆయాన్ బ్యాటరీలు పోర్టబుల్ టెక్నాలజీ విప్లవానికి కారణమయ్యాయి. -
భౌతికశాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్
స్టాక్‌హోమ్ : భౌతికశాస్త్రంలో విశేష పరిశోధనలు చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలను 2019 సంవత్సరానికి గానూ ప్రఖ్యాత నోబెల్ పురస్కారం వరించింది. జేమ్స్ పీబుల్స్, మైఖేల్ మేయర్, డిడియర్ క్యులోజ్‌లకు భౌతిక శాస్త్రంలో ఈ పురస్కారాన్ని ఉమ్మడిగా అందజేయనున్నట్టు నోబెల్ అసెంబ్లీ మంగళవారం ప్రకటించింది. వారిలో పీబుల్స్ కెనడియన్ అమెరికన్ కాగా, మైఖేల్, క్యులోజ్‌లు స్విట్జర్లాండ్‌కు చెందినవారు. విశ్వసృష్టిలో సైద్ధాంతిక అవిష్కరణలకు గానూ వారు నోబెల్ పురస్కారాన్ని అందుకోనున్నారు. మొత్తం ప్రైజ్‌మనీ అయిన 9.18 లక్షల అమెరికన్ డాలర్లలో సగం పీబుల్స్‌కు వెళ్లగా, మిగతా సగాన్ని మైఖేల్, క్యులోజ్ పంచుకోనున్నారు. డిసెంబర్ 10వ తేదీన స్టాక్‌హోమ్‌లో జరిగే కార్యక్రమంలో వారు నోబెల్ పురస్కారం అందుకోనున్నారు. కాగా, సోమవారం వైద్య రంగానికి సంబంధించి నోబెల్ విజేతలను ప్రకటించిన సంగతి తెలిసిందే. -
గ్రేట్ రైటర్; మో యాన్
మాట్లాడొద్దు, అని అర్థం చైనీస్‌లో మో యాన్ అంటే. దాన్నే కలంపేరుగా స్వీకరించాడు ‘మోయాన్’. అసలు పేరు గ్వాన్ మోయే. 1955లో రైతుకుటుంబంలో జన్మించాడు. చైనాలో ఉన్న విప్లవ రాజకీయాల నేపథ్యంలో మనసులో ఉన్నది బయటపెట్దొద్దు, అని తల్లిదండ్రులు వారించేవారట. అయినా మాట్లాడకూడని అంశాలే మాట్లాడుతూ రచయితగా అవతరించాడు. సాంస్కృతిక విప్లవ కాలంలో కార్మికుడిగా పనిచేశాడు. సైన్యంలో పనిచేశాడు. ఆయన రచనల్లో సామాజిక వాస్తవికతతోపాటు మాంత్రిక వాస్తవికత కూడా కనబడుతుంది. చరిత్ర, వర్తమానం, జానపద గాథలు ఒక కలలాంటి స్థితిలో కలగలిసిపోతాయి. ఆదర్శవాదంలో కూడా మనిషి దురాశ, అవినీతిని వ్యంగ్యంగా చిత్రించాడు. రెడ్ సొర్గమ్ క్లాన్, ద గార్లిక్ బాలాడ్స్, ద రిపబ్లిక్ ఆఫ్ వైన్, లైఫ్ అండ్ డెత్ ఆర్ వేరింగ్ మి ఔట్ ఆయన నవలలు. నవలికలు, కథలు కూడా విస్తృతంగా రాశాడు. పద సంపదను పరిమితం చేస్తుందన్న కారణంగా టైప్ చేయడం కన్నా చేత్తో రాయడానికే ఇష్టపడతాడు. దేశాల మధ్య ఉన్న హద్దులను దాటేందుకు సాహిత్యమే మార్గం అంటాడు. 2012లో ఆయన్ని నోబెల్ బహుమతి వరించింది. ఈ పురస్కారం దక్కిన తొలి చైనా నివాస రచయిత. కమ్యూనిస్టు పార్టీతో సత్సంబంధాలు ఉన్నాయన్న కారణంగా ఆయన్ని విమర్శించేవాళ్లూ ఉన్నారు. -
నోబెల్లో ఆమె
నోబెల్.. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారం. కొన్ని రోజులుగా వివిధ విభాగాల వారీగా విజేతలను ప్రకటిస్తున్నారు. 1901లో ఇది ప్రారంభమైంది. అతివ ఆకాశంలో సగం.. మరి ఈ అవార్డుల్లో? నోబెల్ పురస్కారాల్లో ‘ఆమె’పాత్ర ఎంత? ఓ లుక్కేస్తే.. -
ఎకనమిక్స్‌లో ఇద్దరికి నోబెల్ పురస్కారం
-
కోట్లు కుమ్మరించినా ఆ పని మానలేను
మదర్ థెరీసా యుగోస్లేవియాలో పుట్టింది. భారతదేశం వచ్చింది. తోటివారిలాగే పాఠాలు చెప్పేది. ఓ రోజు రాత్రి కలకత్తాలో వీథిలో వెడుతుండగా ఓ అనాథ స్త్రీ విపరీతమైన అనారోగ్యంతో వచ్చి ఆమె చేతుల్లో పడింది. ‘ప్రాణం పోతోంది, చాలా బాధగా ఉంది. నన్ను డాక్టర్‌కు చూపించు’ అంది. ఎవరని అడిగితే ఎవరూ లేరు, అనాథనంది. ఆ క్షణంలో ఆమెకు గివింగ్ ఈజ్ లివింగ్(ఇచ్చుకోవడమే జీవిత పరమార్థం) అనిపించింది. ఆమెను కనీసం 10 వైద్యశాలలకు తీసుకెళ్ళింది. ‘తగ్గించడానికి చాలా ఖర్చవుతుంది, చికిత్స కుదరదు’ అన్నారు అంతటా. ఈ తిప్పటలో ఆ అనాథ ప్రాణాలు విడిచేసింది.‘ఇలా చచ్చిపోవడానికి వీల్లేదు’ అని థెరీసాకు అనిపించింది. ‘పక్కవాడు చచ్చిపోయినా ఫరవాలేదు–అని బతకడానికి కాదు మనుష్యజన్మ’ అని...‘‘ఇక నా జీవితం పదిమంది సంతోషం కోసమే’ అని సంకల్పించి నేరుగా తన గదికి బయల్దేరింది. ఒక పాత బకెట్, రెండు తెల్లచీరలు, రు.5లు పట్టుకుని ఆమె బయటికి నడుస్తుంటే... ఎక్కడికని స్నేహితులడిగారు. ‘ఇకపైన కష్టాలున్న వాళ్లెవరున్నారో వాళ్ళందరికీ తల్లినవుతాను’’ అని చెప్పి బయల్దేరబోతుంటే... ‘వీటితో...అది సాధ్యమా’ అని అడిగారు. ‘‘నేను తల్లి పాత్ర పోషించబోయేది, గుండెలు నిండిన ప్రేమతో, ఆదుకోవాలన్న తాపత్రయంతో’’ అని చెప్పి గడప దాటింది. అదీ సంకల్పబలం అంటే. తరువాత కాలంలో ఆమె ఎంతగా కష్టపడ్డారంటే...దాని ఫలితాలు మిషనరీస్ ఆఫ్ ఛారిటీస్, నిర్మల్ హృదయ్, శిశుభవన్... వంటి సంస్థలుగా దర్శనమిచ్చాయి. లక్షలమందిచేత మదర్ అని– అంటే అమ్మా అని పిలిపించుకున్నది. తర్వాతి కాలంలో ఆమెకు నోబెల్ బహుమతి వచ్చినప్పడు విలేకరులు ‘‘కీర్తి ప్రతిష్ఠలు వచ్చాయి. ప్రైజ్ మనీ(రు.18లక్షలు) కూడా వచ్చింది. సంతోషిస్తున్నారా..?’ అని అడిగితే... నేను సంతోషించిన సంఘటన ఇదికాదు, మరొకటి ఉందని చెప్పింది.‘‘ఒకనాడు ఒక యాచకుడొచ్చాడు. నన్ను చూడాలని ఉందంటే తీసుకొచ్చారు. తన కష్టాలు ఏకరువు పెడతాడనుకుంటే... జేబులోంచి ఒక కాసు తీసి ‘అమ్మా, ఇంతమందిని ఆదుకుంటున్నావు, నా వంతు ఈ డబ్బు ఉంచమ్మా’ అని ఓ పావలా కాసు ఇచ్చి వెళ్ళాడు. అది పావలాయే అయి ఉండవచ్చు. నా మీద పెంచుకున్న నమ్మకం అది.ప్రేమతో ఇచ్చిన ఆ నాణెంతో నోబెల్ బహుమతి సమానం కాదు’’ అని థెరీసా చెప్పారు. ఒకరికి ఇవ్వడంలోఎంతో ఆనందం ఉంటుంది. అది ఎంతన్నది కాదు ప్రధానం. ఇక ఆ తరువాత నుంచి అందరినీ ‘నాకేమయినా ఇస్తారా’ అని అడుగుతున్నా. చివరికి ఐదు, పది పైసలయినా సరే, చినిగిన బనీనయినా, కాల్చిపారేసే అగ్గి పుల్లయినా ఏదయినా ప్రేమతో ఇచ్చినప్పుడు తీసుకుంటా. ఇవ్వడంలో వారు అనుభవించే ఆనందం నాకు ముఖ్యం’’అని ఆమె చెప్పేవారు. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టిన నాడు, బాధలో ఉన్నవాడిని ఆదుకున్ననాడు, వాడు సంతోషించడానికి కారణమయిన జన్మే మనుష్య జన్మ. కుష్ఠురోగులకు చీము, నెత్తురు తుడిచి సేవ చేస్తుంటే చూసిన ఒక విలేకరి ‘‘ఎన్ని కోట్లు ఇచ్చినా ఈ పని చేయను నేను. మీరెలా చేస్తున్నారు?’’ అని అడిగితే...‘‘కొన్ని కోట్లు ఇచ్చినా ఈ పనిని నేను మానలేను. ఎందుకంటే నాకు వారిలో భగవంతుడు కనబడుతున్నాడు’’ అని జవాబిచ్చింది ఒక అతి సామాన్య సేవకురాలు, లక్షలు, కోట్లాదిమంది చేత అమ్మా అని నోరారా పిలిపించుకున్న మదర్ థెరీసా. -
పరిణామ సిద్ధాంత అన్వయానికి నోబెల్
స్టాక్‌హోం: జీవ పరిణామ సిద్ధాంతం ఆధారంగా పరిశోధనలు సాగించిన ముగ్గురికి ఈ ఏడాది రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి దక్కింది. ఫ్రాన్సిస్ ఆర్నాల్డ్(అమెరికా), జార్జ్ స్మిత్(అమెరికా), గ్రెగరీ వింటర్(బ్రిటన్)లు ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. జీవ ఇంధనాల నుంచి ఔషధాల వరకు మానవాళికి ఉపయోగపడే పదార్థాల తయారీకి దోహదపడే ఎంజైమ్‌లను వీరు జీవ పరిణామ సిద్ధాంతం ప్రాతిపదికగా సృష్టించారు. రసాయన శాస్త్రంలో నోబెల్ పొందిన 5వ మహిళగా ఫ్రాన్సిస్ ఆర్నాల్డ్ గుర్తింపు పొందారు. సుమారు రూ.7.40 కోట్ల ప్రైజ్‌మనీని ఆర్నాల్డ్ సగం..స్మిత్, వింటర్‌లు మిగతా సగాన్ని పంచుకోనున్నారు. ‘నోబెల్ గ్రహీతలు డార్విన్ సిద్ధాంతాన్ని మానవాళికి గొప్ప మేలుచేసే కార్యసాధనకు ఉపయోగించారు’ అని స్వీడిష్ రాయల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ కొనియాడింది. ‘వారు డార్విన్ సూత్రాలను ప్రయోగశాలలో అమలుపరిచారు. వేయి రెట్ల వేగంతో జీవ పరిణామ క్రమాన్ని ప్రదర్శించి కొత్త ప్రొటీన్లను సృష్టించారు’ అని నోబెల్ కెమిస్ట్రీ కమిటీ చీఫ్ క్లాయిస్ గుస్తాఫసన్ వ్యాఖ్యానించారు. పరిణామవాదం.. శక్తిమంత ఇంజనీరింగ్ జీవ పరిణామ క్రమాన్ని అనుకరిస్తూ ఆర్నాల్డ్ డీఎన్ఏ విన్యాసంలో మార్పులు చేశారు. దీని వల్ల విషపూరిత శిలాజ ఇంధనాలకు మెరుగైన, పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలు కనుగొనేందుకు వీలు కలిగింది. ఫలితంగా, చెరకు నుంచి జీవ ఇంధనాలను ఉత్పత్తిచేస్తు న్నారు. శీతల వాతావరణంలోనూ మెరుగ్గా పనిచేసే డిటర్జెంట్ల తయారీకి కూడా ఆమె పరిశోధన దోహదపడింది. ‘ఈ భూమ్మీద అత్యంత క్లిష్టమైన, అద్భుతమైన వస్తువులను పరిణామ సిద్ధాంతం సృష్టించింది. ఎలా తయారుచేయాలో ఎవరికీ తెలియని విషయా లను కూడా దీని ద్వారా నిజం చేయొచ్చు. ఈ ప్రపంచంలో పరిణామ క్రమం అనేది అత్యంత శక్తిమంతమైన ఇంజినీరింగ్ పద్ధతి. గ్యాసోలిన్ ఉత్పత్తికి భూమి నుంచి ఇంధనాన్ని తోడాల్సిన పనిలేదు. మొక్కల్లో నిల్వ ఉండే సూర్యరశ్మి చాలు’ అని ఆర్నాల్డ్ ఓ సందర్భంలో చెప్పారు. కాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కెమికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆర్నాల్డ్ (67) కేన్సర్ వ్యాధితో పోరాడి బయటపడ్డారు. బ్యాక్టీరియాపై దాడిచేసే వైరస్‌తో కొత్త ప్రొటీన్లు తయారుచేయొచ్చని స్మిత్, వింటర్ రుజువుచేశారు. వీరి ప్రయోగాల ఫలితంగా కీళ్ల నొప్పులు, సోరియాసిస్, పేగు వాతం తదితర వ్యాధులకు ఔషధాలు కనుగొన్నారు. స్మిత్ ఎంఆర్సీ మాలిక్యులర్ బయోలజీ లేబొరేటరీలో పరిశోధకులుగా పనిచేస్తున్నారు. -
‘ఆప్టికల్ లేజర్’కు నోబెల్
స్టాక్‌హోం: ఆప్టికల్ లేజర్లపై కీలక పరిశోధనలు చేసి కంటి శస్త్రచికిత్సల్లో అధునాతన పరికరాలను ఉపయోగించేందుకు దోహదపడిన ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ ఏడాది నోబెల్ భౌతికశాస్త్ర బహుమతి దక్కింది. అమెరికా శాస్త్రజ్ఞుడు ఆర్థర్ ఆష్కిన్ (96), ఫ్రాన్స్‌కు చెందిన జెరార్డ్ మోరో (74), కెనడా శాస్త్రజ్ఞురాలు డొనా స్ట్రిక్లాండ్ (59)లను ఈ ఏడాది నోబెల్ భౌతిక శాస్త్ర బహుమతికి ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ మంగళవారం ప్రకటించింది. భౌతిక శాస్త్ర నోబెల్‌ను తొలిసారిగా 1901లో ప్రవేశపెట్టగా అప్పటి నుంచి ఈ బహుమతి అందుకున్న మూడో మహిళ, 55 ఏళ్లలో తొలి మహిళ డొనా స్ట్రిక్లాండ్ కావడం విశేషం. అలాగే నోబెల్ బహుమతి పొందిన అత్యంత పెద్ద వయస్కుడిగా ఆర్థర్ ఆష్కిన్ నిలవడం మరో విశేషం. 2007లో అమెరికా ఆర్థికవేత్త లియోనిడ్ హర్విచ్ తనకు 90 ఏళ్ల వయ సులో నోబెల్ పొందగా, ఆర్థర్ ఆష్కిన్ 96 ఏళ్ల వయసులో నోబెల్ గెలుచుకుని రికార్డు నమో దు చేశారు. నోబెల్ బహుమతి మొత్తం విలువ 1.01 మిలియన్ డాలర్లు కాగా, ఇందులో సగాన్ని ఆర్థర్ ఆష్కిన్‌కు, మిగిలిన సగాన్ని మళ్లీ రెండు సమ భాగాలుగా చేసి జెరార్డ్ మోరో, డొనా స్ట్రిక్లాండ్లకు ఇవ్వనున్నారు. ఆప్టికల్ ట్వీజర్ల తయారీకి తగిన గుర్తింపు సూక్ష్మ క్రిములు, అణువులు, పరమాణువులు, ఇతర జీవించి ఉన్న కణాలను లేజర్ బీమ్‌లను ఉపయోగించి పట్టుకునే ఆప్టికల్ ట్వీజర్ల (పట్టుకారు వంటివి)ను తయారుచేసినందుకు ఆర్థర్ ఆష్కిన్‌కు ఈ గౌరవం దక్కింది. ఈ ట్వీజర్ల సాయంతో కాంతి ధార్మిక పీడనాన్ని ఉపయోగించి భౌతిక పదార్థాలను ఆయన కదల్చగలిగారని అకాడమీ తెలిపింది. ఆష్కిన్ 1952 నుంచి 1991 మధ్య కాలంలో అమెరికాలోని ఏటీ అండ్ టీ బెల్ ల్యాబొరేటరీస్‌లో పనిచేస్తున్న కాలంలోనే 1987లో సూక్ష్మజీవులకు హాని చేయకుండానే వాటిని పట్టుకునే ట్వీజర్లను కనుగొన్నారు. ఈ ఆవిష్కరణకుగాను ఆయనకు నోబెల్ ఇస్తున్నట్లు అకాడమీ తెలిపింది. 1991లో పదవీ విరమణ పొందిన ఆష్కిన్, అప్పటి నుంచి తన ఇంట్లోని ప్రయోగశాలలోనే జీవితం గడుపుతున్నారు. మరోవైపు అత్యంత చిన్న ఆప్టికల్ పల్స్‌లను ఉత్పత్తి చేసే విధానాన్ని అభివృద్ధి చేసినందుకు జెరార్డ్ మోరో, డొనా స్ట్రిక్లాండ్లకు నోబెల్ లభించింది. మోరోకు ఫ్రాన్స్‌లోని ఎకోల్ పాలిటెక్నిక్‌తోపాటు అమెరికాలోని మిషిగన్ విశ్వవిద్యాలయంతో అనుబంధం ఉండ గా, డొనా స్ట్రిక్‌ల్యాండ్ ఆయన విద్యార్థినే. ప్రస్తు తం ఆమె కెనడాలోని వాటర్లూ విశ్వవిద్యాలయంలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. వీరు ఉత్పత్తి చేసిన ఆప్టికల్ పల్స్ అత్యంత చిన్నవి, సమర్థవంతమైనవని జ్యూరీ పేర్కొంది. మహిళలు చాలా అరుదు: డొనా స్ట్రిక్లాండ్ నోబెల్ బహుమతిని ప్రకటించిన అనంతరం డొనా అకాడమీతో ఫోన్లో మాట్లాడారు. స్త్రీలకు పెద్దగా దక్కని అవార్డును తాను అందుకోవటం తనను పులకరింపజేస్తోందని ఆమె అన్నారు. ‘మహిళా భౌతిక శాస్త్రవేత్తలు చాలా తక్కువగా ఉన్నారు. కాబట్టి వారు చాలా ప్రత్యేకం. అలాంటి వారిలో నేనొకరిని అయినందుకు గర్వంగా ఉంది’ అంటూ స్ట్రిక్లాండ్ ఆనందం వ్యక్తం చేశారు. స్ట్రిక్లాండ్ కన్నా ముందు 1903లో మేడం క్యూరీకి, 1963లో మరియా గోప్పెర్ట్ మాయెర్కు మాత్రమే భౌతిక శాస్త్ర నోబెల్ బహుమతి దక్కింది. అంటే భౌతిక శాస్త్రంలో నోబెల్ అందుకున్న మూడో మహిళ. మహిళా శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతులు తక్కువగా వస్తుండటంపై అకాడమీ గతంలోనే విచారం వ్యక్తం చేసింది. తామేమీ పురుషుల పట్ల పక్షపాతంతో వ్యవహరించడం లేదనీ, క్షేత్రస్థాయిలో ప్రయోగశాలల తలుపులు మహిళలకు చాలా చోట్ల మూసుకుపోయాయని గతంలో వ్యాఖ్యానించింది. -
నోబెల్ : 55 ఏళ్లలో ఫిజిక్స్‌లో తొలిసారి మహిళకి...
స్టాక్‌హోమ్ : 55 ఏళ్లలో తొలిసారి.. భౌతిక శాస్త్రం(ఫిజిక్స్)లో నోబెల్ పురస్కారాన్ని ఓ మహిళా కూడా అందుకున్నారు. నేడు భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని ప్రకటించారు. ఈ పురస్కారాన్ని లేజర్ ఫిజిక్స్‌లో సంచలనాత్మకమైన ఆవిష్కరణలు చేసినందుకు గాను, ఆర్థూర్ ఆష్కిన్‌కు, మరో ఇద్దరు శాస్త్రవేత్తలు జెరార్డ్ మౌరో, డోన్నా స్క్రిక్లాండ్లకు సమిష్టిగా అందజేస్తున్నట్టు ‘ది రాయల్ స్వీడిస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్’ నేడు ప్రకటించింది. 55 ఏళ్లలో తొలిసారి ఈ పురస్కారాన్ని అందుకున్న మహిళ స్క్రిక్లాండ్. మహిళా భౌతిక శాస్త్రవేత్తలందరూ ఎంతో సంబరం చేసుకోవాల్సినవసరం వచ్చిందని, వారిలో నేను ఒకదాన్ని అని స్టాక్‌హోమ్‌లో నోబెల్ పురస్కారం ప్రకటన తర్వాత న్యూస్ కాన్ఫరెన్స్‌లో స్క్రిక్లాండ్ ఆనందం వ్యక్తం చేశారు. ఫిజిక్స్‌లో నోబెల్ అవార్డు అందుకున్న మహిళల్లో స్క్రిక్లాండ్ మూడో మహిళ. అంతకముందు 1903లో మేరి క్యూరికి, 1963లో మారియ గోపెర్ట్ మేయర్‌కు ఈ పురస్కారం దక్కింది. స్క్రిక్లాండ్ షేర్ చేసుకున్న శాస్త్రవేత్తలో ఆష్కిన్ది అమెరికా కాగా, మౌరు ఫ్రెంచ్కు చెందిన వారు. ఇక స్క్రిక్లాండ్ కెనడియన్ మహిళ. వీరు మొత్తం తొమ్మిది మిలియన్ల స్వీడిష్ క్రోనర్ అంటే రూ.7,34,33,374ను పొందనున్నారు. -
విద్యార్థులపై ఒత్తిడి తగదు
భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతిని మించినది ‘ఫండమెంటల్ ఫిజిక్స్ అవార్డు’. శాస్త్ర పరిశోధన రంగంలో విశిష్ట గుర్తింపు కలిగిన ఈ అవార్డును రష్యన్ నోబెల్‌గా పరిగణిస్తారు. దీని కింద ఇచ్చే నగదు బహుమతి నోబెల్ బహుమతికి రెట్టింపు ఉంటుంది. ఈ అవార్డు సాధించిన భారతీయుడు, ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ అశోక్‌సేన్. ఆయన ప్రతిపాదించిన తీగ సిద్ధాంతానికి(స్ట్రింగ్ థియరీకి) ఫండమెంటల్ ఫిజిక్స్ అవార్డు దక్కింది. సేన్‌ను ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ స్వయంగా ‘రాయల్ సొసైటీ ఫెలోషిప్’కు నామినేట్ చేశారు. సేన్‌కు పలు జాతీయ, అంతర్జాతీయ ప్రతిష్టాత్మక అవార్డులు లభించాయి. భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. దేశ విదేశాల్లో పరిశోధనలు చేసిన ఆయన కాన్పూర్ ఐఐటీలో ఎంఎస్సీ (ఫిజిక్స్) చేశారు. అమెరికాలోని ‘స్టోనీ బ్రూక్’ యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పట్టా పొందారు. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ)తో పాటు పలు దేశాల్లో పనిచేసిన తర్వాత స్వదేశానికి వచ్చి టాటా ఇన్స్టిట్యూ ట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌లో పనిచేశారు. ప్రస్తుతం అలహాబాద్‌లోని హరీష్–చంద్ర రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో పరిశోధనలు సాగిస్తున్నారు. మల్లు విశ్వనాథరెడ్డి – సాక్షి, అమరావతి బ్యూరో : ఓ విద్యార్థి విజ్ఞానానికి, చదివే మాధ్యమానికి (మీడియం) సంబంధం లేదని ప్రముఖ భౌతిక శాస్త్ర వేత్త, ఫండమెంటల్ ఫిజిక్స్ అవార్డు గ్రహీత ప్రొఫె సర్ అశోక్‌సేన్ పేర్కొన్నారు. కాలేజీలో చేరే వరకూ తాను బెంగాలీ మాధ్యమంలో చదువుకున్నానని చెప్పారు. ప్రాథమిక విద్యకు చాలా ప్రాధాన్యం ఉందని, అందుకు తగినట్లుగా బడ్జెట్ కేటాయింపులు పెరగాలన్నారు. ప్రతిష్టాత్మక విద్యాసంస్థలో సీటు సాధించాలనే లక్ష్యంతో పిల్లలపై తీవ్ర ఒత్తిడి పెంచడం తగదని తల్లిదండ్రులకు సూచించారు. ఎక్కువ జీతం లభించే ఉద్యోగం వైపు కాకుండా ఆసక్తి ఉన్న వైపు ప్రయాణిస్తేనే విజయం వరిస్తుందని తెలిపారు. ‘చుక్కపల్లి పిచ్చయ్య 6వ స్మారక ఉపన్యాసం’కోసం విజయవాడ వచ్చిన ఆయన ‘సాక్షి’కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు ఇవీ.. సాక్షి: ప్రతిష్టాత్మక ఫండమెంటల్ ఫిజిక్స్ అవార్డు అందుకున్నందుకు అభినందనలు. అవార్డులో భాగంగా వచ్చిన నగదు తీసుకోవడానికి ప్రభుత్వం పన్ను రాయితీ ఇచ్చిందా? సేన్: లేదు. అవార్డు కింద 3 మిలియన్ డాలర్ల నగదు బహుమతి వచ్చింది. ట్రస్టు ఏర్పాటు చేశా. విద్యారంగంలో ఈ ట్రస్టు పనిచేస్తోంది. సాక్షి: మీ బాల్యం గురించి చెప్పండి. మీరు భౌతికశాస్త్రం వైపు రావడానికి స్ఫూర్తి ఎవరు? సేన్: మా నాన్న ఫిజిక్స్ టీచర్. అందువల్ల ఫిజిక్స్ మీద ఆసక్తి కలిగింది. నేను +2 పూర్తి చేసిన సమయంలో బెంగాల్లో ఫిజిక్స్ మోస్ట్ పాపులర్ సబ్జెక్ట్. బోర్డు పరీక్షల్లో నేను టాప్ 10లో లేను. టాప్ టెన్‌లో ఐదుగురు ఫిజిక్స్ తీసుకున్నారు. అప్పట్లో ఫిజిక్స్‌కు బాగా క్రేజ్ ఉండేది. సాక్షి: పరిశోధన రంగం పట్ల ఆకర్షితులు కావడానికి కారకులెవరు? సేన్: ఒకరని చెప్పలేను. నేను డిగ్రీ చదివిన కోల్‌కతా ప్రెసిడెన్సీ కాలేజీలో అమల్ రాయ్‌చౌధురి, కాన్పూర్ ఐఐటీలో చాలా మంది ప్రొఫెసర్లు, టీచర్లు చాలా మంది నా జీవితంలో ఉన్నారు. సాక్షి: తెలుగు రాష్ట్రాల్లో ఐఐటీ పట్ల విపరీతమైన ఆకర్షణ ఉంది. తల్లిదండ్రుల్లో ఎక్కువ మంది తమ పిల్లలు ఐఐటీల్లో చదవాలని ఉబలాటపడుతున్నారు. ఈ బలహీనతను ఆసరాగా చేసుకొని కొన్ని కార్పొరేట్ కాలేజీలు పెద్ద వ్యాపారం చేస్తూ రూ. కోట్లు సం పాదించుకుంటున్నాయి. పాఠశాల స్థాయిలోనే ఐఐ టీ ఫౌండేషన్ కోర్సులు నిర్వహిస్తున్నామని ప్రకటనలు గుప్పిస్తున్నారు. దీనిపై మీ సలహా ఏమిటి? సేన్: పిల్లలు ఎలా ఎదగాలి? ఏం కావాలి? అనే విషయాలను వారికే విడిచిపెట్టాలి. పాఠశాలల్లో ఉన్న పిల్లలకు తమ ఆసక్తి ఏమిటనే విషయం పూర్తిగా తెలియకపోవచ్చు. పిల్లల మీద విపరీతమైన ఒత్తిడి తగదు. ఐఐటీలో సీటు రాకపోతే జీవితం లేదనే భావన మంచిది కాదు. పాఠశాల స్థాయి నుంచే ఐఐటీ ఫౌండేషన్ కోర్సులంటే పిచ్చి అనుకోవాలి. సాక్షి: టెన్త్ తర్వాత ఎక్కువ మంది ఎంపీసీ, బైపీసీ గ్రూపుల వైపు వెళ్తున్నారు. ఏటా లక్షలాదిగా ఇంజనీర్లు తయారవుతున్నారు. కోర్ సైన్స్ వైపు రావట్లే దు. పరిశోధన రంగం మీద దీని ప్రభావం ఉండదా? సేన్: అందరూ ఇంజనీర్లు కావాలనే ఆలోచన మంచిది కాదు. కోర్ సైన్స్‌లోనూ మంచి భవిష్యత్ ఉంది. సైన్స్ పట్ల ఆసక్తి ఉంటే తప్పనిసరిగా అటు వైపు రావాలని నేను విద్యార్థులకు సూచిస్తా. ఆసక్తి ఉన్న వైపు ప్రయాణిస్తేనే విజయం వరిస్తుంది. సాక్షి: మీరు పలు దేశాల్లో పరిశోధన రంగంలో పని చేశారు. విదేశాలకు, ఇక్కడకు ఉన్న తేదా ఏమిటి? సేన్: థియరిటికల్ రీసెర్చ్‌లో పెద్దగా ఉండదు. నేను అందులోనే పరిశోధనలు చేస్తున్నా. సైద్ధాంతిక పరిశోధనకు ల్యాబ్ కూడా అక్కర్లేదు. విదేశీ వర్సిటీల్లో పరిశోధన కార్యకలాపాలు బాగా ఎక్కువ. ప్రయోగాత్మక పరిశోధనకు మంచి అవకాశాలున్నాయి. మనకు బ్యూరోక్రసీ పెద్ద అడ్డంకి. ప్రభుత్వాలు నిధులు ఇస్తున్నాయి కానీ వ్యయం చేయడంలోనే సమస్యలున్నా యి. శాస్త్ర పరిశోధన రంగంలో ఉన్న వారికే వ్యయం చేసే అధికారం ఇవ్వాలి. లోయస్ట్ బిడ్డర్ విధానం పనికిరాదు. బ్యూరోక్రసీ దాన్నే అనుసరిస్తోంది. సాక్షి: విద్యలో నాణ్యత పెరగడానికి మీరిచ్చే సలహా? సేన్: ప్రాథమిక విద్య చాలా ముఖ్యం. కాలేజీల్లో, వర్సిటీల్లో మాత్రం టీచర్ల మీద మరీ ఎక్కువగా ఆధారపడాల్సిన అవసరం లేదు. కొంత గైడెన్స్ ఉంటే సరి పోతుంది. ప్రాథమిక స్థాయిలో అలా కాదు. టీచర్ గైడెన్స్ మీద పిల్లల భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. వర్సిటీ ప్రొఫెసర్లకు ఇస్తున్న స్థాయిలో ప్రైమరీ టీచ ర్లకు జీతాలు ఇవ్వాలి. తద్వారా మంచి ప్రతిభ ఉన్న వారిని ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది. -
భారతీయుడికి ఆర్కిటెక్చర్ ‘నొబెల్ ’..!
నిర్మాణ, వాస్తు శాస్త్ర రంగం (ఆర్కిటెక్చర్) లో నోబెల్ బహుమతి అంత స్థాయిగా పరిగణించే ప్రిజ్కర్ అవార్డును ఇటీవల టోరొంటోలో 91 ఏళ్ల ప్రొ. బాల్కృష్ణ విఠల్దాస్ దోషి అందుకున్నారు. ఆర్కిటెక్టులు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఈ గౌరవాన్ని సాధించిన తొలి భారతీయుడిగా ఆయన అరుదైన ఘనత సాధించారు. దాదాపు ఏడు దశాబ్దాల పాటు ఆర్కిటెక్చర్ రంగంలో కృషి చేస్తున్న ఆయన తనదైన సొంత శైలితో పొందిన గుర్తింపుతో దక్షిణాసియాలోనే ప్రముఖ ఆర్కిటెక్ట్‌గా పేరుగడించారు. 1989లో ఇండోర్‌లోని ‘అరణ్య లోకాస్ట్ హౌసింగ్ డెవలప్మెంట్’ ప్రాజెక్టు’ కోసం జోషి రూపొందించిన డిజైన్‌కు ఆగాఖాన్ అవార్డ్ ఫర్ ఆర్కిటెక్చర్ అవార్డు లభించింది. వివిధ సౌకర్యాలు, వసతులు అందుబాటులోకి వచ్చేలా అల్పాదాయ వర్గాలు మొదలు ఇతర వర్గాల వారి కోసం నిర్మించిన ఈ ప్రాజెక్టు ద్వారా 80 వేల మంది లబ్దిపొందారు. రాయల్ ఇనిసిట్యూట్ ఆఫ్ బ్రిటీష్ ఆర్కిటెక్ట్స్ ఫెలోగా ఉన్నారు. బెంగళూరులోని ఇండియన్ ఇనిసిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) డిజైన్లు ఇప్పటికీ పలువురిని ఆకట్టుకుంటున్నాయి. అహ్మదాబాద్‌లోని సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్, టెక్నాలజీ, టాగోర్ మెమోరియల్ హాల్, ద ఇనిసిట్యూట్ ఆఫ్ ఇండోలజీ డిజైన్లకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. తాను ‘వాస్తు శిల్ప’ పేరిట అహ్మదాబాద్‌లో ప్రారంభించిన కన్సల్టెన్సీ సంస్థలో దోషి నేటికి చురుకుగా పనిచేస్తున్నారు. జీవనసాఫల్య పురస్కారం... ‘ఈ అవార్డును అందుకోవడం అత్యంత సంతృప్తి కలిగించింది. జీవితంలో ఇలాంటి పురస్కారం వస్తుందని ఊహించలేము. ఇంత కంటే ఇంకా ఏమి కోరుకోవాలి ?ఈ వయసులో ఇలాంటి అవార్డును స్వీకరించడం ఎంతో సాధించామన్న అనుభూతిని కలిగిస్తోంది’ అంటూ ఈ అవార్డును అందుకున్నారు. ‘ప్రస్తుతం మనమున్న పరిస్థితుల్లో పట్టణీకరణ, ప్రణాళికలు, గ్రామీణాభివృద్ధి, ఆర్థికరంగం, ఉపాధి వంటి కీలక అంశాల గురించి చర్చిస్తున్నాం. వీటి గురించి ఇతర దేశాలు ఎప్పుడో ఆలోచించి, మార్గదర్శకత్వంతో ముందుకెళ్లాయి. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు దేశీయ ఆర్కిటెక్టులను (అన్నింటికి విదే«శీ ఆర్కిటెక్టులపైన ఆధారపడకుండా) కూడా విశ్వాసంలోకి తీసుకుని, వారిని ప్రజల అవసరాల కోసం పనిచేసేలా చేయాలి’ అని దోషి సూచించారు. ఆ డిజైన్లు జ్ఞాపకాల దొంతరలు... 1927 ఆగస్టు 26న పుణెలో జన్మించారు. ఫర్నీచర్ తయారీ, అమ్మకం వ్యాపార కుటుంబానికి చెందిన ఆయన అనుకోకుండా ఆర్కిటెక్చర్ రంగంలోకి అడుగుపెట్టారు. దేశం స్వాతంత్య్రం సాధించిన కాలంలో జోషి ఆర్కిటెక్చర్ చదువుతున్నారు. ఫ్రాన్స్‌కు చెందిన సృజనాత్మక ఆర్కిటెక్ట్ చార్లస్ ఎడ్వర్డ్ జీనెరెట్ ( లే కోర్బుసియర్గా ప్రసిద్ధులు) ఆయన గురువుగా పరిగణిస్తారు. తన వినూత్న డిజైన్లతో ఆధునిక నగరాలుగా ఛండీగఢ్, అహ్మదాబాద్‌లను తీర్చిదిద్దిన కోర్బుసియర్కు మంచి గుర్తింపు ఉంది. ప్రముఖ దర్శకుడు మణిరత్నం తీసిన ‘ ఒకే కన్మని’ తమిళ సినిమా, ‘ఒకే జాను’ పేరిట తీసిన హిందీ రీమేక్‌లోనూ ఆయన నటించారు. దోషి ముఖ్యమైన భవనాల్లో కొన్ని... –1969–71లో హైదరాబాద్‌లో ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) టౌన్షిప్ –1979–80 అహ్మదాబాద్‌లో బీవీ దోషి కార్యాలయం ‘సంగత్’ –1972లో అహ్మదాబాద్‌లోని సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ ప్లానింగ్ టెక్నాలజీ –1962–74 మధ్యలో బెంగళూరులోని ఇండియన్ ఇనిసిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ –1989 ఢిల్లీలోని నేషనల్ ఇనిసిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ –1990 అహ్మదాబాద్‌లో అమ్దావద్ ని గుఫా (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
నోబెల్‌ను టాగూర్ తిరస్కరించారట!
అగర్తలా: ఇటీవల తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న త్రిపుర సీఎం విప్లవ్ దేవ్ మరోసారి నోరుజారి విమర్శలను ఎదుర్కొంటున్నారు. జాతీయ గీత రచయిత, ప్రముఖ కవి రవీంద్ర నాథ్ టాగూర్ అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన సాహిత్య నోబెల్ బహుమతిని వెనక్కు ఇచ్చారని విప్లవ్ దేవ్ అన్నారు. గీతాంజలి నవలకు 1913లో టాగూర్‌కు నోబెల్ ఇచ్చారు. వాస్తవానికి బ్రిటిష్ ప్రభుత్వం తనకు ఇచ్చిన ‘బ్రిటిష్ నైట్‌హుడ్’ బిరుదును జలియంవాలా బాగ్ ఊచకోతకు నిరసనగా 1919లో టాగూర్ వదిలేశారు. నోబెల్‌ను తిరస్కరించలేదు. కానీ విప్లవ్ దేవ్ మాత్రం బ్రిటిష్ పాలనకు నిరసనగా టాగూర్ నోబెల్‌నే వెనక్కు ఇచ్చారని చెప్పడం విమర్శలకు దారితీసింది. విప్లవ్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో సరదా వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయి. -
సాహితీ నోబెల్ వాయిదా
స్టాక్‌హోమ్: 2018 సంవత్సరానికి గాను సాహితీ రంగంలో నోబెల్ బహుమతి పురస్కారం వాయిదాపడింది. 1949 తర్వాత సాహిత్యంలో నోబెల్ వాయిదాపడటం ఇదే ప్రథమం. పురస్కార గ్రహీతలను ఎంపిక చేసే స్వీడిష్ కమిటీ సభ్యురాలి భర్తపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావటం ఈ పరిణామానికి దారి తీసింది. ‘ఈ పరిస్థితుల్లో ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందేందుకు సమయం అవసరమని భావిస్తున్నాం. ఈ ఏడాది పురస్కారాన్ని 2019 సాహితీ పురస్కారంతో కలిపి ఇవ్వాలని నిర్ణయించాం’అని అకాడెమీ తాత్కాలిక కార్యదర్శి ఆండెర్స్ చెప్పారు. స్వీడన్ సాహితీ రంగంలో పలుకుబడి ఉన్న జీన్ క్లౌడ్ ఆర్నాల్ట్ తమపై లైంగిక వేధింపులు, అత్యాచారం, లైంగిక దాడులకు పాల్పడ్డారంటూ 18 మంది మహిళలు గత ఏడాది నవంబర్‌లో ప్రపంచ వ్యాప్తంగా ప్రారంభమైన ‘మీ టూ ప్రచారోద్యమం’లో ఆరోపణలు చేశారు. కవయిత్రి, నోబెల్ సాహితీ పురస్కారాల ఎంపిక కమిటీ సభ్యురాలు అయిన క్యాథరినా ఫ్రోస్టెన్సన్ భర్తే ఆర్నాల్ట్. విజేతల పేర్లను ముందే చెప్పేస్తున్నారని కొందరు కమిటీ సభ్యులపై ఆరోపణలొచ్చాయి. అలజడి రేపిన ఈ పరిణామాలు ఎంపిక కమిటీలో విభేదాలకు ఆజ్యం పోసింది. దీంతో కమిటీ శాశ్వత కార్యదర్శి డేరియస్‌తోపాటు ఆరుగురు సభ్యులు రాజీనామా చేశారు. ‘నోబెల్ బహుమతి విశిష్టతను, గొప్పతనాన్ని కాపాడతామనీ, త్వరలోనే పూర్తిస్థాయి కమిటీని నియమించి, ఎంపికలు కొనసాగిస్తామని స్వీడన్ రాజు కార్ల్ గుస్తావ్ ప్రకటించారు. జీన్ క్లౌడ్ ఆర్నాల్ట్ -
పాక్‌లో అడుగు.. మలాలా కంటతడి!
ఇస్లామాబాద్: చాలాకాలం తర్వాత స్వదేశానికి రావడం చాలా ఆనందంగా ఉందని నోబెల్ శాంతి పురస్కార గ్రహిత మలాలా యూసఫ్‌జాయ్ అన్నారు. గురువారం పాకిస్తాన్ పర్యటనకు వచ్చిన ఆమె.. రాజధాని ఇస్లామాబాద్‌లో ప్రధాని షాహిద్ అబ్బాసీతో సమావేశమయ్యారు. ఆమెకు ఘనస్వాగతం పలికిన ప్రధాని అబ్బాసీ మాట్లాడుతూ.. 12 ఏళ్ల వయస్సులో దేశాన్ని వీడి, ఇప్పుడు ప్రముఖ వ్యక్తిగా మలాలా స్వదేశానికి రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ప్రధానిని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన మలాలా.. ‘ఈ రోజు నా జీవితంలో మర్చిపోలేనిది. ఇప్పటికి నేను దీన్ని నమ్మలేకపోతున్నాను’ అని కంటతడి పెట్టారు. సాధారణంగా తాను ఏడవనని, వయస్సులో చిన్నదాన్నే అయినా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నట్టు చెప్పారు. ప్రస్తుత సమాజంలో బాలికల విద్య ఆవశ్యకత, మలాలా పౌండేషన్ ద్వారా చేస్తున్న కార్యక్రమాల గురించి ఆమె ప్రస్తావించారు. 2012లో తాలిబన్ల దాడిలో తీవ్రంగా గాయపడిన మలాలాను పాక్ ప్రభుత్వం ఆధునిక వైద్యం కోసం బ్రిటన్‌కు పంపింది. దాడి తర్వాత స్వదేశానికి రావడం ఇదే తొలిసారి. -
చంపేసే ప్లాన్ చేశారా.. ప్రమాదమా..?
చికాగో : నోబెల్ బహుమతి గ్రహీతకు ఊహించని కష్టం ఎదురైంది. వృద్ధాప్యంలో ఉన్న ఆయన జీవితంలో అనుకోకుండా చోటుచేసుకున్న ప్రమాదం తీరని విషాదాన్ని మిగిల్చింది. ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరిన జపాన్ నోబెల్ బహుమతి గ్రహీత ఐఈచీ నెగిషి (82) ఆయన భార్య సుమైర్ నెగిషి (80) ఎయిర్‌పోర్ట్‌కు ఇల్లినాయిస్ ప్రాంతంలోని ఓ గ్రామం మీదుగా వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆయన భార్య చనిపోగా.. ఆయన మాత్రం గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కెమిస్ట్రీ విభాగంలో నోబెల్ పొందిన ఆయన ప్రస్తుతం అదే విభాగంలో పర్డ్యూ యూనివర్సిటీలో పాఠాలు బోధిస్తున్నారు. అయితే, తొలుత సోమవారం నుంచి ఆయన ఆచూకీ కనిపించలేదు. దీంతో పోలీసులు విచారణ ప్రారంభించి గాలించడం మొదలుపెట్టారు. ఆయన కుటుంబం కోసం తీవ్రంగా శోధించిన పోలీసులకు ఓ అడ్వాన్సడ్ డిస్పోజల్ కంపెనీకి చెందిన ఆర్కార్డ్ హిల్స్ ల్యాండ్ వద్ద రోడ్డుపై గాయాలతో సాయం కోసం అటు ఇటు తిరుగుతున్న ఐఈచీ కనిపించారు. హుటాహుటిన ఆయనను సమీపించిన పోలీసులు వారి కారు రోడ్డుపై ఉన్న పెద్ద కందకంలోకి వెళ్లి ప్రమాదనికి గురైనట్లు గుర్తించారు. ఆయన కారు వెనుక భాగంలో సుమైర్ నెగిషి చనిపోయి ఉన్నారు. దీంతో ఐఈచీని ఆస్పత్రికి తరలించారు. అయితే, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు మాత్రం పూర్తి వివరాలు తెలియజేయలేదు. దీని వెనుక ఏదైనా కుట్ర ఉందేమో, ఎవరైనా వారిని హత్య చేయాలని ఇలా చేశారేమోనని కూడా అనుమానిస్తున్నారు. ఎందుకంటే వారు వెళ్లాల్సిన రాక్‌ఫోర్డ్ ఎయిర్పోర్ట్ ఇక 13 కిలోమీటర్ల దూరంలో ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. 2010లో ఆయన మరో ఇద్దరితో కలిసి నోబెల్ అవార్డు అందుకున్నారు. జపాన్ వాసి అయిన ఐఈచీ 1960లో ఓ స్కాలర్‌షిప్‌పై అమెరికా వచ్చి చదువుకొని అక్కడే అధ్యాపకుడిగా స్థిరపడ్డారు. -
హాకింగ్‌కు ఎందుకు నోబెల్ రాలేదు?
సాక్షి, న్యూఢిల్లీ : భూమిపై మానవ మనుగడకు ప్రమాదం పొంచి ఉందని తొలిసారిగా హెచ్చరించి వారు ఇతర గ్రహాల్లో వీలయినంత త్వరగా నివాసాలు ఏర్పాటుచేసుకోవాలని హెచ్చరించిన తొలి భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్. కాలం గుట్టును శోధించేందుకు యత్నించడమే కాకుండా, కృష్ణబిలాల రహస్యాలపై అహర్నిషలు కృషిచేసిన ఆయన బుధవారం కన్నుమూశారు. మానవాళికి అద్భుతమైన సేవలు అందించి, గొప్ప పరిజ్ఞానాన్ని, ఎవరూ ఊహించని రహస్యాల గుట్టును చెప్పిన ఆయనకు ఎందుకు నోబెల్ బహుమతి రాలేదని ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. బ్లాక్ హోల్ లు చనిపోతాయి అంటూ ఆయన వెల్లడించిన కొత్త సిద్ధాంతానికైనా నోబెల్ వచ్చి ఉండాలి కదా అని ప్రశ్నించుకుంటున్నారు. కృష్ణబిలాల గురించి సంక్షిప్తంగా.. బ్లాక్ హోల్స్‌ను తెలుగులో కృష్ణ బిలాలు అని అంటారు. ఆకాశంలో మనం చుక్కలుగా పిలుచుకునే నక్షత్రాలు వాటి స్వరూపం, వయసు, పదార్థ ద్రవ్య రాశుల ఆధారంగా రకరకాల మార్పులకు లోనవుతాయి. చివర దశకు చేరుకుంటాయి. కొన్ని నక్షత్రాలు వాటిలో ఉండే హైడ్రోజన్ పూర్తిగా అయిపోయాక శక్తిని విడుదల చేయలేనివిగా మారతాయి. దాంతో నక్షత్రాలలో ఉండే హీలియం తదితర పదార్థాల కేంద్రకాలను విడిగా ఉంచే ఉష్ణ శక్తి నశిస్తుంది. దాంతో ఆ పదార్థాలన్నీ అంతరంగికంగా గురుత్వాకర్షణ బలానికి గురై ఆవగింజంత పరిమాణం (చిన్న సైజు)లోకి కుంచించుకుపోతాయి. అయితే అన్ని నక్షత్రాలూ బ్లాక్ హోల్స్‌గా మారాలని ఏమీ లేదు. సూర్యుడికంటే సుమారు ఒకటిన్నర రెట్లు ఎక్కువ పరిమాణం కలిగినట్టివే కృష్ణబిలాలుగా మారతాయని ప్రముఖ నోబెల్ బహుమతి గ్రహీత, భారతీయ శాస్త్రవేత్త చంద్రశేఖర్ ఇదివరకే సిద్ధాంతీకరించారు. నోబెల్ ఎందుకు రాలేదు? 'హాకింగ్ చెప్పిన కృష్ణబిలాలు సిద్ధాంతాన్ని కొంత అనుమానాలతో కూడిన, ఊహించదగిన భౌతిక సిద్ధాంత కేటగిరిలోకి మాత్రమే చేర్చారు. దానిని ప్రామాణికంగా ఆమోదించదగ్గ మార్గం లేదు' అని ది సైన్స్ ఆఫ్ లిబర్టీ అనే నేషనల్ జాగ్రఫిక్ మేగజిన్ రచయిత తిమోతి ఫెర్రిస్ తెలిపారు. బ్లాక్ హోల్స్ అనేవి అంతమైపోవడానికి చాలా ఏళ్లు పడుతుంది. ఒక అంచనాగా చెప్పాలంటే కొన్ని బిలియన్ సంవత్సరాలకుగానీ వాటికి ఏమీ జరగదు. ఇప్పటి వరకు ఏం జరగలేదు కూడా.. అన్నింటికంటే ముందే పుట్టిన ఒక నక్షత్రం సైజు పరిమాణంలోని కృష్ణబిలానికి కూడా ఇప్పటి వరకు ఏమీ కాలేదు' అని ఆయన చెప్పారు. సైద్ధాంతిక పరంగా నిరూపించేందుకు హాకింగ్ థియరీకీ అవకాశం లేకపోయినందునే ఆయనకు బహుశా నోబెల్ రాకపోయి ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. -
రిచర్డ్ థేలర్‌కు ఆర్థిక నోబెల్
స్టాక్‌హోమ్: ఆర్థిక, మనస్తత్వ శాస్త్రాల సమన్వయంపై విశేష కృషి చేసిన ప్రముఖ ఎకనమిస్ట్ రిచర్డ్ థేలర్(72)ను ఆర్థికశాస్త్రంలో నోబెల్ అవార్డు వరించింది. ఆర్థికపరమైన నిర్ణయాలు ఎప్పుడూ పూర్తిగా హేతుబద్ధతపైననే ఆధారపడవని, మానవ సంబంధాల లోతైన ప్రభావం వాటిపై ఎక్కువగానే ఉంటుందని నిర్ధారించేలా ఆయన పరిశోధనలు సాగాయి. అమెరికాకు చెందిన థేలర్ యూనివర్సిటీ ఆఫ్ చికాగో లో ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. తనకిష్టమైన ‘బిహేవియరల్ ఎకనమిక్స్’లో ఆయన విస్తృత పరిశోధనలు చేశారు. ఆ దృగ్విషయాన్ని ప్రతిపాదించిన తొలివ్యక్తిగా నిలిచారు. ఆర్థిక వ్యవస్థలో వ్యక్తులు లేదా బృందాలు తీసుకునే ఆర్థికపరమైన నిర్ణయాల్లో వారి మనస్తత్వం, వారికి సంబంధించిన సామాజిక, వ్యక్తిగత అంశాలు ఎలాంటి ప్రభావం చూపుతాయనే అంశంపై ఆయన ప్రధానంగా దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా ఎకనమిక్స్, సైకాలజీల మధ్య దూరాన్ని చెరిపేసి, వాటి మధ్య నెలకొన్న సంబంధాన్ని చూపే ప్రయత్నం చేశారు. అందుకే నోబెల్ జ్యూరీ.. ‘వ్యక్తిగత ఆర్థిక నిర్ణయాలు, మనస్తత్వ శాస్త్రాల మధ్య సమన్వయాన్ని సాధించిన తొలి శాస్త్రవేత్త’గా థేలర్‌ను గుర్తించింది. ఆర్థిక శాస్త్రానికి మరింత మానవీయతను సమకూర్చిన వ్యక్తిగా ఆయనను ప్రశంసించింది. సమాజం ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారానికి బిహేవియరల్ ఎకనమిక్స్‌ను సాధనంగా చూపిన ఆయన సిద్ధాంతం ‘నడ్జ్ థీయరీ’గా పాపులర్ అయింది. ‘నడ్జ్’ అనే అత్యధిక కాపీలు అమ్ముడుపోయిన పుస్తకాన్ని కూడా ఆయన మరొకరితో కలసి రాశారు. థేలర్ ప్రతిపాదించిన మరో సిద్ధాంతం ‘మెంటల్ అకౌంటింగ్’. వినియోగదారులు తమ ఆదాయ, ఖర్చులను మనస్సులోనే లెక్కలేసుకుని, నిర్ణయాలను సులభతరం చేసుకుంటారని వివరించేదే ఆ సిద్ధాంతం. పరిమిత హేతుబద్ధత, స్వీయ నియంత్రణ లేకపోవడం, సామాజిక ప్రాధాన్యతలు.. వ్యక్తుల ఆర్థిక నిర్ణయాలను ఎలా ప్రభావితం చేస్తాయనే విషయాలను ఆయన సమగ్రంగా విశ్లేషించారని నోబెల్ జ్యూరీ పేర్కొంది. నటనలోనూ ప్రవేశం ఆర్థికశాస్త్రంలో పరిశోధనలతోపాటుగా.. సినిమాల్లో అతిథిపాత్రల ద్వారా కూడా థేలర్ సుప్రసిద్ధుడు. 2015లో విడుదలైన ‘ద బిగ్ షాట్’ హాలీవుడ్ చిత్రంలో ఈయన క్రిస్టియన్ బేల్, స్టీవ్ కేరెల్, ర్యాన్ గాస్లింగ్లతో కలసి నటించారు. 2008లో వచ్చిన అంతర్జాతీయ ఆర్థికసంక్షోభం ఆధారంగా నిర్మించిన ఈ చిత్రంలో క్రెడిట్, హౌజింగ్ రంగాలు ఎలా ధ్వంసమయ్యాయో చూపించారు. ఆర్థిక నోబెల్ అవార్డును తనకు ప్రకటించటంపై జ్యూరీకి థేలర్ కృతజ్ఞతలు తెలిపారు. ‘అవార్డుకు ఎంపికచేయటం ఆనందంగా ఉంది’ అన్నారు. ఆర్థిక విధానాల్లో మానవీయ కోణాన్ని అర్థం చేసుకోవడం అత్యంత ముఖ్యమని వ్యాఖ్యానించారు. ఈ అవార్డుతోపాటు 1.1 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 7.2 కోట్లు) ప్రైజ్‌మనీని ఆయన అందుకోనున్నారు. ఈ మొత్తాన్ని ఎలా ఖర్చు చేస్తారన్న ప్రశ్నకు.. ఆయన నవ్వుతూ ‘ఎంత వీలైతే అంత నిర్హేతుకంగా’ అని జవాబిచ్చారు. నోట్లరద్దుకు థేలర్ మద్దతు నోట్లరద్దు నిర్ణయంపై గతంలోనే థేలర్ స్పందించారు. గత నవంబర్ 8న థేలర్ ట్వీట్ చేస్తూ.. ‘దీనికి నేను దీర్ఘకాలంగా మద్దతు తెలుపుతున్నాను. నగదురహిత ఆర్థిక వ్యవస్థకు, అవినీతిని తగ్గించే ప్రయత్నానికి మంచి ముందడుగు’ అని పేర్కొన్నారు. అయితే పెద్దనోట్లను రద్దుచేస్తూ తిరిగి 2వేల నోటును ప్రవేశపెట్టడాన్ని తప్పుబట్టారు. ‘రెండువేల నోటు తీసుకురావటం నిజమేనా? తప్పుడు నిర్ణయం’ అని అన్నారు. ఇదే వర్సిటీలో ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ నోట్లరద్దు నిర్ణయాన్ని తప్పుబట్టిన సంగతి తెలిసిందే. థేలర్ పరిశోధనలు అద్భుతం: జ్యూరీ ‘థేలర్ ఓ మార్గదర్శకుడు. ఈయన ఆర్థికశాస్త్రాన్ని మరింత మానవీకరించారు. ఆర్థిక, మనస్త్తత్వ శాస్త్రాలను సమగ్రపరిచేలా సాగిన థేలర్ పరిశోధనలు అద్భుతం. పరిమిత హేతుబద్ధత, సామాజిక ప్రాధాన్యతలు, స్వీయ నియంత్రణ లేకపోవటం వంటి వాటి ప్రభావంపై ఈయన గొప్ప ప్రయోగాలు చేశారు. ఈ లక్షణాలు క్రమంగా వ్యక్తిగత నిర్ణయాలను, మార్కెట్ ఫలితాలను ఎలా ప్రభావితం చేయగలవో నిరూపించారు’ అని నోబెల్ జ్యూరీ పేర్కొంది. ‘ప్రవర్తనా ఆర్థికశాస్త్రంలో గణనీయమైన మార్పులు తేవడంలో థేలర్ చేసిన పరిశోధనలు, సైద్ధాంతిక ఆలోచనలు కొత్త ప్రపంచానికి బాటలు వేశాయి. ఆర్థిక పరిశోధనలు, విధివిధానాల నిర్ణయానికి సంబంధించిన అంశాల్లో ఇవి లోతైన ప్రభావాన్ని చూపిస్తాయి’ అని జ్యూరీ వెల్లడించింది. -
రాజన్ కు నోబెల్ బహుమతి?
న్యూఢిల్లీ : ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి-2017 ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ ను వరించే అవకాశం ఉందని క్లారివేట్ ఎనలైటిక్స్ పేర్కొంది. ఆర్థిక శాస్త్రంలో నోబెల్ ప్రధానం కోసం నోబెల్ కమిటీ ఎంపిక చేసిన జాబితాలో రాజన్ పేరు ఉన్నట్లు తెలిపింది. కాగా, ఆర్థిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ విన్నర్ పేరు సోమవారం అధికారికంగా వెలువడనుంది. నోబెల్ ప్రైజ్ ఎవరు గెలుస్తారన్నదానిపై క్లారివేట్ ఎనలైటిక్స్ పేర్కొన్న పేర్లు ఆసక్తిని కల్గిస్తున్నాయి. నోబెల్ పురస్కారానికి తగిన పరిశోధనలు చేసిన ఆరుగురు ప్రముఖుల పేర్లను క్లారివేట్ పేర్కొంది. రాజన్ ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ చికాగోలోని బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో సర్వీస్ ప్రొఫెసర్ ఆఫ్ ఫైనాన్స్ గా పని చేస్తున్నారు. 2013లో ఆర్బీఐ గవర్నర్ గా పని చేస్తున్న సమయంలో బ్రిటిష్ మేగజిన్ సెంట్రల్ బ్యాంకింగ్స్ సెంట్రల్ బ్యాంకర్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికయ్యారు. రాజన్ ఐఐటీ, ఢిల్లీ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు. -
అణ్వస్త్ర వ్యతిరేక ప్రచారానికి నోబెల్
స్టాక్‌హోమ్ : అణ్వాయుధ వ్యతిరేక ప్రచారానికి 2017 నోబెల్ శాంతి పురస్కారం దక్కింది. మానవ మనుగడకు పెను సవాలుగా తయారైన అణ్వాయుధ వ్యాప్తిని అరికట్టాలని, దేశాలు తమ దగ్గరున్న అణునిల్వలను నిర్మూలించాలని ప్రపంచ వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తోన్న ‘అంతర్జాతీయ అణ్వాయుధ వ్యతిరేక ఉద్యమం(International Campaign to Abolish Nuclear Weapons-ICAN)కు ఈ ఏడాది నోబెల్ శాంతి దక్కినట్లు నోబెల్ కమిటీ శుక్రవారం ప్రకటించింది. 2007లో ప్రారంభమైన అణ్వస్త్ర వ్యతిరేక ప్రచార ఉద్యమం (ICAN).. గడిచిన దశాబ్ధ కాలంగా 101 దేశాల్లో అణ్వస్త్రవ్యతిరేక ఉద్యమాలను నిర్వహిస్తోంది. ఐకెన్‌కు అనుబంధంగా ప్రపంవ్యాప్తంగా 468 సంస్థలు పనిచేస్తున్నాయి. వ్యక్తులకు కాకుండా ఒక ఉద్యమ సంస్థకు నోబెల్ శాంతి పురస్కారం దక్కడం ఈ దశాబ్ధిలో ఇది నాలుగోసారి కావడం గమనార్హం. -
సాహితీ దిగ్గజానికి నోబెల్ గౌరవం
సాహితీ దిగ్గజం కజౌ ఇషిగురో(62)ను సాహిత్య నోబెల్- 2017 వరించింది. అమెరికా విసిరిన అణుబాంబును తన గుండెలపై భరించిన జపాన్‌లోని నాగసాకిలో ఇషిగురో 1954 నవంబర్ 8న జన్మించారు. ఆయనకు ఐదేళ్ల వయసున్న సమయంలో కుటుంబం యూకేకు వచ్చేయడంతో అక్కడే స్థిరపడ్డారు. ఇషిగురో ఇప్పటివరకూ ఎనిమిది పుస్తకాలు రచించారు. చిత్రాలకు, టీవీ కార్యక్రమాలకు స్క్రిప్టులను కూడా అందించారు. ఇషిగురో రచనల్లో 'ద రిమెయిన్స్ ఆఫ్ ది డే' ప్రసిద్ధి చెందింది. దీన్ని 1989లో ఆయన రచించారు. 1993లో 'ద రిమెయిన్స్ ఆఫ్ ది డే' చిత్రంగా కూడా విడుదలై ఘన విజయం సాధించింది. ది రిమెయిన్స్ ఆఫ్ ది డే నవలే 2017 సాహిత్యంలో నోబెల్ పురస్కారానికి ఎంపికైంది. Watch the very moment the 2017 #NobelPrize in Literature is announced! pic.twitter.com/7IcRm5Bb2f — The Nobel Prize (@NobelPrize) October 5, 2017 -
వైద్యరంగంలో నోబెల్ పురస్కారం ప్రకటన
-
మన 'శరీరం' దాని చేతిలోనే
తెల్లవారుతుండగానే ఒళ్లంతా చైతన్యం నింపుకొంటుంది. మళ్లీ రాత్రవుతుందంటే కళ్లు బరువెక్కుతాయి. నిద్ర తన్నుకు వస్తుంది. మనుషుల్లోనే కాదు అన్ని జీవుల్లోనూ సమయాభేదంతో ఈ లక్షణం కనిపిస్తుంటుంది. మన శరీరంలోని జీవ గడియారమే (సిర్కాడియమ్ రిథమ్) దీనికి కారణం. అన్ని రకాల జీవజాలంలో ఉండే ఈ జీవ గడియారం.. వాటికి అవసరమైన సమయాలను బట్టి ప్రతిస్పందిస్తుంటుంది. అయితే ఇది ఎలా పనిచేస్తుంది, ఏ జన్యువు, ప్రొటీన్ల పాత్ర ఏమిటనేది కొన్నేళ్ల కిందటి వరకు తెలియదు. శాస్త్రవేత్తలు జెఫ్రీ సి.హాల్, మైకేల్ రోస్బాష్, మైకేల్ డబ్ల్యూ.యంగ్లు తమ ప్రయోగాల ద్వారా ఆ జీవ గడియారం గుట్టు విప్పారు. ఈ ఏడాది వైద్యశాస్త్ర నోబెల్ దక్కించుకున్న వారి పరిశోధన ప్రాముఖ్యత, వివరాలేమిటో తెలుసుకుందాం. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ జీవ గడియారం గుట్టు తేల్చేందుకు జెఫ్రీ సి.హాల్, మైకేల్ రోస్ బాష్, మైకేల్ డబ్ల్యూ.యంగ్లు సాధారణ ఈగలపై ప్రయోగాలు నిర్వ హించారు. అవి నిద్రించే సమయం, చురుగ్గా మారే సమయాల్లో వాటి శరీరంలో జరుగుతున్న మార్పులకు కారణాలను అన్వేషించారు. ఒక జన్యువు ఈ గడియారం మొత్తాన్ని నియంత్రిస్తున్నట్లు గుర్తించారు. ఆ జన్యువు ఉత్పత్తి చేసే ఒక ప్రొటీన్ రాత్రిపూట మనం నిద్రపోయేప్పుడు కణాల్లో నిల్వ అవుతూ ఉంటుందని.. అదే పగటిపూట మాత్రం క్రమేపీ నశించిపోతూ ఉంటుందని గమనించారు. ఆ జన్యువుతో పాటు కొన్ని ఇతర ప్రొటీన్ భాగాలు కణం లోపల జీవగడియారం పనిచేసేందుకు ఉపయోగపడుతున్నట్లు తేల్చారు. ఇది ఎంతో కచ్చితం.. శరీర కణాల్లోని గడియారం మన భౌతిక అవసరాలకు తగ్గట్టుగా తనను తాను సరిచేసు కుంటూ పనిచేస్తూ ఉంటుంది. ఏ సమయంలో నిద్ర నుంచి మేల్కోవాలి, హార్మోన్ల మోతాదు ఎంత ఉండాలి, జీవక్రియలు జరిగే వేగం, శరీర ఉష్ణోగ్రత తీరు వంటి అంశాలన్నింటినీ జీవ గడియారం నియంత్రిస్తుంటుంది. ఉక్క పోయడం వల్ల రాత్రి నిద్ర పట్టకపోయినా, అర్ధరాత్రి, అపరాత్రి ఇష్టమొచ్చినట్లు ఆహారం తీసుకున్నా అందుకు తగ్గట్టుగా ఈ గడియారం పనితీరుపై ప్రభావం పడుతుంది. ఉదయం లేవగానే చికాకుగా ఉండటం జీవ గడియారం పనితీరు మారిందనే దానికి ఉదాహరణ. మొత్తంగా బయటి పరిస్థితులకు, జీవ గడియారం పనితీరుకు మధ్య తేడాలు వస్తే.. శరీరం అనారోగ్యానికి లోనయ్యే అవకాశాలు పెరుగుతాయి. మొక్కల్లో 18వ శతాబ్దంలోనే.. పరిసరాల్లోని మార్పులను ఊహించి అందుకు తగ్గట్టుగా జీవక్రియల్లో మార్పులు చేసే కణ గడియారాన్ని తొలుత మొక్కల్లో గుర్తించారు. 18వ శతాబ్దంలోనే జీన్ జాక్వెస్ డోర్టస్ అనే ఖగోళ శాస్త్రవేత్త ‘మిమోస’ అనే మొక్కల ఆకులు పగటిపూట విచ్చుకుని, రాత్రిపూట వాలిపోయి ఉండటాన్ని గమనించి.. పరిశోధన చేశారు. అసలు వెలుతురే లేకపోతే ఈ మొక్కలు ఎలా ప్రతిస్పందిస్తాయో చూద్దామని.. కొన్ని మొక్కలను చీకట్లో ఉంచి పరిశీలించారు. చిత్రంగా మొక్కల్లోని కణ గడియారం సమయానికి తగినట్లుగా జీవ క్రియలను ఉత్తేజితం చేసింది. కానీ ఆ తర్వాత చీకటి పరిస్థితికి అనుగుణంగా పనితీరు మారిపోయింది. అనంతరకాలంలో జంతువుల్లోనూ జీవ గడియారం ఉన్నట్లు శాస్త్రవేత్తలు స్పష్టతకు వచ్చారు. కానీ ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుందన్నది మాత్రం ఇటీవలి వరకూ మిస్టరీగానే మిగిలిపోయింది. ప్రొటీన్లే కారణం.. 1970 సమయంలో సెమ్యూర్ బెంజర్ అనే శాస్త్రవేత్త తన విద్యార్థి రొనాల్డ్ కోనోప్కతో కలసి చేసిన కొన్ని ప్రయోగాలు జీవ గడియారాన్ని గుర్తించేందుకు బీజం వేశాయి. ఈగలపై వారు చేసిన ప్రయోగాల్లో ఒక జన్యువులో మార్పులు చేయడంతో కణ గడియారం దెబ్బతిన్నట్లు గుర్తించి.. ఆ జన్యువుకు ‘పీరియడ్’ అని పేరు పెట్టారు. కానీ ఆ జన్యువు జీవ గడియారాన్ని ఎలా నియంత్రిస్తుందన్న అంశాన్ని 1984లో జెఫ్రీ హాల్, మైకేల్ రోస్బాష్ అనే శాస్త్రవేత్తలు తేల్చారు. పీరియడ్ జన్యువు ఉత్పత్తి చేసే ప్రొటీన్‌ను వారు గుర్తించారు. ఇక జీవ గడియారం నియంత్రణకు మరికొన్ని ప్రొటీన్లు కూడా అవసరమని 1994లో మైకేల్ యంగ్ అనే శాస్త్రవేత్త తేల్చారు. దాంతో మొత్తంగా జీవ గడియారం వ్యవస్థకు సంబంధించిన అంశాలపై స్పష్టత వచ్చింది. నోబెల్ వరించింది.. మానవుడు, జంతువులతో పాటు ఇతర జీవుల్లో నిద్రపోయే, మేల్కొనే సమయాలను నియంత్రించే జీవ గడియారం (సిర్కాడియమ్ రిథమ్) రహస్యాన్ని శోధించినందుకు గాను అమెరికాకు చెందిన ముగ్గురు జన్యు శాస్త్రవేత్తలు జెఫ్రీ సి.హాల్, మైకేల్ రోస్బాష్, మైకేల్ డబ్ల్యూ.యంగ్లు వైద్య రంగంలో నోబెల్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ మేరకు నోబెల్ అవార్డులు–2017లో భాగంగా తొలుత వైద్య రంగానికి సంబంధించిన నోబెల్ అవార్డును నోబెల్ కమిటీ సోమవారం ప్రకటించింది. అలాగే ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు 1.1 మిలియన్ డాలర్ల (సుమారు రూ.7 కోట్లు)ను సంయుక్తంగా పంచుకోనున్నారు. ‘భూమిపై నివసించే ప్రతి జీవి భూ పరిభ్రమణానికి అనుగుణంగా జీవిస్తుందని గతంలోనే శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే జీవుల్లో రోజువారీ క్రియలైన నిద్ర, ఆహార అలవాట్లు, హార్మోన్స్ విడుదల, శరీర ఉష్ణోగ్రతలను నియంత్రించే సిర్కాడియమ్ క్లాక్ పనితీరును శరీరంలోని కణాలు ఏవిధంగా తమ అధీనంలో ఉంచుకుంటా యో ప్రస్తుతం ఈ ముగ్గురు తమ పరిశోధనల ద్వారా నిరూపించారు’అని నోబెల్ కమిటీ తెలిపింది. అలాగే మానవులు, జంతువులు, మొక్కలు జీవన గమనం (బయోలాజికల్ రిథమ్)కు ఇమిడిపోయే విధానాన్ని పరిశోధకులు వివరించారు. సిర్కాడియమ్ క్లాక్ సరిగ్గా పనిచేయని సందర్భాల్లో ఒత్తిడి, బైపోలార్ డిజార్డర్‌లతోపాటు కొన్ని రకాల నాడీ సంబంధిత వ్యాధులు వస్తాయని తెలిపారు. షిఫ్ట్‌ల వారీగా ఉద్యోగం చేసేవారిలో రోజువారీ జీవక్రియలు, సిర్కాడియమ్ క్లాక్ మధ్య వ్యత్యాసం ఏర్పడి ప్రాణాంతక వ్యాధులైన కేన్సర్, జీవక్రియ రుగ్మతలు తలెత్తే ప్రమాదం ఉన్నట్లు తేలింది. మొత్తంగా బయటి వాతావరణానికి, జీవ గడియారం మధ్య ఏర్పడే వ్యత్యాసం వల్ల అనారోగ్యం బారిన పడే ప్రమాదమున్నట్లు తెలిపారు. మనిషి ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకుగాను మాలిక్యులార్ మెకానిజమ్ ద్వారా సిర్కాడియమ్ రిథమ్‌ను కంట్రోల్ చేసే విధానాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. పీరియడ్ అనే జన్యువు విడుదల చేసే ప్రొటీన్‌తో పాటు మరికొన్ని ప్రొటీన్లు జీవ గడియారాన్ని నియంత్రిస్తాయని వారు కనుగొన్నారు. ప్రతీ ఏడాది తొలుత వైద్య రంగంలో నోబెల్‌ను ప్రకటిస్తారు. ఇక మంగళవారం భౌతికశాస్త్రం, బుధవారం రసాయన శాస్త్రం, గురువారం సాహిత్యం, శుక్రవారం శాంతి విభాగాల్లో నోబెల్ అవార్డులను నిర్వాహకులు ప్రకటించనున్నారు. -
గెలిస్తే నోబెల్ ప్రైజ్ ఇస్తా
-
చంద్రబాబు.. సోషల్ మీడియాలో వైరల్
అమరావతి : అర్థం పర్థం లేని ప్రకటనలు చేయడం, సాధ్యాసాధ్యాలను గమనించకుండా నోటికొచ్చినట్లు మాట్లాడడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కొత్తేమీ కాదు. ఒలింపిక్ క్రీడల్లో విజయం సాధిస్తే ప్రపంచ ప్రఖ్యాత నోబెల్ బహుమతి ఇస్తానంటూ చంద్రబాబు బుధవారం చేసిన ప్రకటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. గతంలో చంద్రబాబు చేసిన ప్రకటనలపై కూడా విపరీతమైన చర్చ జరిగింది. నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు విసిరారు. గతంలో వైరల్ అయినవి ఇవీ.. ►2018లో అమరావతిలో ఒలింపిక్ క్రీడలు నిర్వహిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో ప్రకటించిన విషయం విదితమే. నాలుగేళ్లకోసారి జరిగే ఒలింపిక్స్‌ను ఎక్కడ నిర్వహించాలనే విషయాన్ని ఎనిమిదేళ్ల ముందే నిర్ణయిస్తారు. ఒలింపిక్స్ నిర్వహించాలంటే కేంద్ర ప్రభుత్వం బిడ్ దాఖలు చేయాలి తప్ప రాష్ట్ర ప్రభుత్వాలకు ఏమాత్రం సంబంధం ఉండదు. ఒలింపిక్స్ నిర్వహించడం అంటే ఆషామాషీ కాదు. చంద్రబాబు నోటి వెంట ఒలింపిక్స్ నిర్వహణ మాట వచ్చినప్పుడు ప్రజలు ఆవాక్కయ్యారు. తర్వాత సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘చంద్రబాబు ఒలింపిక్స్’ మీద బోలెడు జోకులు, పోస్టింగ్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ►నోబెల్ బహుమతి తీసుకొస్తే రూ.100 కోట్లు ఇస్తానని తిరుపతి సైన్స్ కాంగ్రెస్‌లో సీఎం చంద్రబాబు ప్రకటించడం కూడా వైరల్ అయింది. విశ్వవిద్యాలయాల్లో కనీస వసతులు కల్పించడానికి పైసా విదిల్చకుండా.. పరిశోధనలకు కనీస నిధులు ఇవ్వకుండా నోబెల్ తెస్తే రూ.100 కోట్లు ఇస్తాననడం పట్ల సోషల్ మీడియాలో సెటైర్లు వెల్లువెత్తాయి. ► తాజాగా ఒలింపిక్ విజేతలకు నోబెల్ ప్రైజ్ ఇస్తానంటూ చంద్రబాబు ప్రకటించడంపై నెటిజన్లు వేగంగా స్పందించారు. బుధవారం సాయంత్రం కిదాంబి శ్రీకాంత్ సన్మాన సభలో ముఖ్యమంత్రి ‘నోబెల్ ప్రైజ్’ ప్రకటన చేసిన కాసేపటికే.. సోషల్ మీడియాలో ఈ అంశం చక్కర్లు కొట్టడం ప్రారంభించింది. నోబెల్ ప్రైజ్‌ను ప్రకటించడానికి అవకాశం ఉందా? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తుంటే.. ‘‘క్రీడాకారులకు ప్రకటించడానికి అవకాశం ఉంటుంది.. ఉంటుంది.. ఎందుకు ఉండదు?’’ అంటూ సోషల్ మీడియాలో సమాధానాలతో కూడిన కామెంట్లు షికారు చేశాయి. -
మలాలాపై సంచలన ఆరోపణలు
ఇస్లామాబాద్: నోబెల్ అవార్డు గ్రహీత, పాకిస్థాన్ అక్షర సాహసి యూసఫ్‌జాయ్ మలాలాపై దాడి అంతా ఓ భూటకం అని, అదంతా ముందుగా సిద్ధం చేసుకున్న స్క్రిప్టు ఆధారంగా చోటు చేసుకుందని పాకిస్థాన్ పార్లమెంటు నేత ముస్సారత్ అహ్మద్జేబ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీబీసీ చానెల్ కోసం సిద్ధం చేసిన కథ ఆధారంగా 2012లో మలాలాపై దాడి సంఘటన చోటు చేసుకుందని, అదంతా ముందుగా సిద్ధం చేసుకున్న ప్రణాళిక తప్ప మరొకటి కాదంటూ ఎవ్వరూ ఊహించని విధంగా అన్నారు. ఆదివారం ఉమ్మత్ అనే ఓ ఉర్దూ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. మలాలా తలకు బుల్లెట్ తగిలింది.. కానీ ఏ బుల్లెట్ ఆమె తలలో ఉన్నట్లు సిటీ స్కాన్‌లో కనిపించలేదని స్వాట్‌లో స్కాన్ చేసినప్పుడు తెలిసింది. కానీ, పెషావర్‌లోని కంబైన్డ్ మిలటరీ ఆస్పత్రిలో మాత్రం బుల్లెట్ ఆమె తలలో ఉంది’ అని అన్నారు. అంతేకాదు, ఆమెకు చికిత్స చేసిన వైద్యులను కూడా తీవ్రంగా నిందించారు. ఆ వైద్యులకు ప్రభుత్వం ఇళ్లు నిర్మించుకునేందుకు స్థలాలు కూడా ఇచ్చిందని చెప్పారు. బీబీసీలో చూపించినట్లుగా మలాలాకు అసలు చదవడం, రాయడం రాదని, ఒక అమెరికన్ మలాలా ఇంట్లో మూడు నెలలు ఉండి ఆమె నిర్వహించాల్సిన పాత్రపై శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. అసలు ఇప్పటికిప్పుడు ఉన్నపలంగా ఆమె మలాలా విషయంలో ఎందుకు ఇలా ఆరోపణలు చేశారో పూర్తి వివరాలు తెలియరాలేదు. ప్రస్తుతం ముస్సారత్ ఇమ్రాన్ ఖాన్ పార్టీ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్‌లో ఉన్నారు. ఈ పార్టీ నవాజ్ షరీఫ్ చేతుల్లో ఓడిపోయిన విషయం తెలిసిందే. -
సత్యార్థి ‘నోబెల్’ దొరికింది
న్యూఢిల్లీ: నోబెల్ బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి ఇంట్లో దొంగతనానికి పాల్పడిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి నోబెల్ బహుమతి నమూనా సహా పలు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 7న సత్యార్థి ఇంట్లో చోరీ జరిగిన విషయం తెలిసిందే. అదే వీధిలో మరో రెండు ఇళ్లలోనూ నిందితులు దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. బాలల హక్కు లపై పోరాడినందుకు గానూ సత్యార్థికి 2014లో నోబెల్ బహుమతి లభించింది. -
కైలాష్ సత్యార్థి ఇంట్లో చోరి నోబెల్ సర్టిఫికెట్ మాయం
-
కైలాష్ సత్యార్థి ఇంట్లో చోరి.. నోబెల్ సర్టిఫికెట్ మాయం
న్యూఢిల్లీ: ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు నోబెల్ అవార్డు గ్రహీత కైలాష్ సత్యార్థి ఇంట్లో దొంగలు పడ్డారు. సామాజిక సేవకు గుర్తింపుగా ఆయనకు లభించిన విశిష్ట అవార్డు నోబెల్ బహుమతికి సంబంధించిన సర్టిఫికెట్‌ను ఎత్తుకెళ్లారు. ఆయన ఇంటిని దుండగులు చిన్నాభిన్నం చేసినట్లు కూడా తెలిసింది. అయితే, నోబెల్ బహుమతి ఆయన జాతికి అంకితం చేసిన నేపథ్యంలో అది ప్రస్తుతం రాష్ట్రపతి భవన్లో ఉన్నట్లు ఆయన కార్యాలయ వర్గాలు తెలిపాయి. సామాజిక ఉద్యమకారుడే అయినప్పటికీ కైలాస్ సత్యార్థి భారతీయ బాలలహక్కుల కోసం అమితంగా పోరాడే ప్రముఖ ఉద్యమకారుడు. ఆయన 1980లో బచ్పన్ బచావో ఆందోళన్ (బాల్యాన్ని కాపాడే ఉద్యమం) స్థాపించి, 80వేల మంది పిల్లల హక్కులు కాపాడేందుకు ఉద్యమాలు నడిపారు. ఆయన 2014 నోబెల్ బహుమతిని, పాకిస్థాన్ అక్షర సాహసి మలాలా యూసఫ్జాయ్తో సంయుక్తంగా "యువత, బాలల అణచివేతకు వ్యతిరేకంగా చేసిన పోరాటానికి, బాలలందరికీ విద్యాహక్కు’ అనే అంశానికి నోబెల్ పురస్కారం పొందారు. తాజాగా ఆయన ఇంట్లో పడిన దొంగలు ఈ నోబెల్ అవార్డుతోపాటు పలు విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం కైలాష్ అమెరికా పర్యటనలో ఉన్నారు. -
నోబుల్ ప్రైజ్ అంటే చంద్రబాబుకు తెలుసా?
హైదరాబాద్ : ప్రయివేట్ విద్యాసంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి సారించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. నారాయణ-చైతన్య విద్యాసంస్థల్లో ఎక్కువమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. ఆయన సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. విద్యార్థి సంఘాలు కూడా ఈ విషయంపై ఆలోచించాలని శ్రీకాంత్ రెడ్డి సూచించారు. చంద్రబాబుకు మంత్రి నారాయణ బినామీ అని.... ఆయన బినామీ నారాయణ విద్యాసంస్థలని ఆయన విమర్శించారు. అందుకే ఈ అంశంపై ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. అలాగే నోబుల్ ప్రైజ్ సాధిస్తే రూ.100 కోట్లు ఇస్తామన్న చంద్రబాబు ప్రకటనను ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తప్పుబట్టారు. అసలు నోబుల్ ఫ్రైజ్ అంటే చంద్రబాబుకు తెలుసా అని సూటిగా ప్రశ్నించారు. ఓ వైపు ప్రభుత్వ పాఠశాలను నిర్వీర్యం చేస్తూ, ఉపాధ్యాయులను తీసివేయాలని సర్కార్ కుట్ర పన్నుతోందన్నారు. నిన్న మొన్నటి వరకూ సింగపూర్, కజికిస్తాన్ అన్న చంద్రబాబు తాజాగా శ్రీలంక పాట పాడుతున్నరని శ్రీకాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. -
‘నోబెల్’ సాధిస్తే రూ.100 కోట్లు
♦ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన ♦ విజేతలకు ప్రభుత్వం తరపున నగదు పారితోషికం అందజేస్తాం సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘‘ఒకప్పుడు చిన్నారుల వైజ్ఞానిక సమ్మేళనానికి(చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్) నాంది పలికిన శ్రీపద్మావతీ మహిళా విశ్వవిద్యాలయ వేదికపై అందరి సమక్షంలో ఓ ప్రకటన చేస్తున్నా... ప్రతిష్టాత్మకమైన నోబెల్ పురస్కారాన్ని సాధించే తెలుగు శాస్త్రవేత్తలకు ప్రభుత్వం తరుపున రూ.100 కోట్ల నగదు పారితోషికాన్ని అందజేస్తాం. ఇప్పటివరకూ తెలుగువారు నోబెల్ బహుమతిని సాధించకపోవడం బాధగా ఉంది. అందుకే ఈరోజు అందరి సమక్షంలో చెబుతున్నా’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. అన్ని రంగాల్లో ప్రతిభ చూపే తెలుగు బిడ్డలు నోబెల్ ప్రైజ్ సాధించి ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా తిరుపతిలోని శ్రీపద్మావతీ మహిళా విశ్వవిద్యాలయంలో బుధవారం చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఉపకులపతి దుర్గాభవాని అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవంలో చంద్రబాబు ప్రసంగించారు. త్వరలో విద్యార్థులకు క్లాస్ తీసుకుంటా.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 50 వేల పాఠశాలల్లో చదివే విద్యార్థులకు త్వరలో తాను ఓ గంటపాటు క్లాస్ తీసుకునేలా టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న 1.50 కోట్ల కుటుంబాలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్‌కు హాజరైన పాఠశాల విద్యార్థులతో ఆయన ముచ్చటించారు. కేంద్ర సహాయ మంత్రి సుజనా చౌదరి మాట్లాడుతూ... దురదృష్టవశాత్తూ దేశంలో సైన్స్‌పై ఫోకస్ తగ్గిందని అన్నారు. చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ సావనీర్‌ను చంద్రబాబు ఆవిష్కరించారు. యూనివర్సిటీలో నెలకొల్పేందుకు తయారు చేయించిన మహాత్మాగాంధీ విగ్రహాన్ని నోబెల్ బహుమతి గ్రహీత టకాకి కజిటా వేదికపైనే ప్రారంభించారు. ‘నోబెల్’ సాధించడమెలాగో చెబుతారా? ‘‘ప్రపంచ ప్రఖ్యాత నోబెల్ బహుమతిని దక్కించుకోవాలంటే ఏం చేయాలి? ఏ విధంగా సాధించాలి? ఏమైనా మెలకువలు ఉంటే కాస్త మా పిల్లలకు చెప్పండి’’ ముఖ్యమంత్రి చంద్రబాబు జపాన్ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత టకాకి కజిటాను కోరారు. బుధవారం తిరుపతిలో చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్‌ను ప్రారంభించిన సీఎం వివిధ స్కూళ్ల నుంచి వచ్చిన విద్యార్థులతో మాట్లాడారు. మీలో ఎంత మంది నోబెల్ బహుమతి సాధిస్తారో చెప్పాలని సీఎం కోరగానే... వందలాది మంది చేతులెత్తారు. దీంతో సంబరపడ్డ చంద్రబాబు పక్కనే ఉన్న కజిటాను మైక్ దగ్గరకు రమ్మని కోరారు. ఆయన రాగానే చేతిలో మైక్ పెట్టి, నోబెల్ ప్రైజ్ కొట్టాలంటే ఏం చేయాలని సరదాగా ప్రశ్నించారు. దీంతో కజిటా నవ్వుతూ... వర్క్ హార్డ్.. వర్క్ హార్డ్ అన్నారు. అవునా అంటూ తిరిగి మైక్ అందుకున్న సీఎం కష్టపడితే నోబెల్ ప్రైజ్ సాధించడం సాధ్యమేనని చెప్పారు. కాబట్టి మనం అందరం కష్టపడదామంటూ విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. -
నోబెల్ స్వీకరిస్తా: డిలన్
స్టాక్‌హోం: నోబెల్ సాహిత్య బహుమతి ప్రకటించినా మౌనంగా ఉన్న అమెరికా గేయరచయిత, గాయకుడు బాబ్ డిలన్ ఎట్టకేలకు పెదవి విప్పారు. స్టాక్‌హోంలో డిసెంబరు 10న ఈ అవార్డు అందుకోవాలని అనుకుంటున్నట్లు శుక్రవారం చెప్పారు. మరోవైపు డిలన్ నోబెల్ పురస్కారాల ప్రదానోత్సవానికి రాకపోయినా ఇబ్బందేమీ లేదనీ, ఆయన తరఫున ఏదైనా ఉపన్యాసం, ప్రదర్శన, పాటను ఉత్సవం సమయంలో అందించినా చాలని స్వీడిష్ అకాడమీ పేర్కొంది. అక్టోబరు 13న సాహిత్య నోబెల్ బహుమతి ప్రకటించాక, పలుమార్లు ఫోన్లో బాబ్డిలన్ను సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆయన స్పందించలేదని స్వీడిష్ అకాడమీ సభ్యుడు గతంలో ఫిర్యాదు చేశారు. బాబ్‌డిలన్ బహుమతిని అందుకునే ఉద్దేశంతో ఉన్నారో లేదో కూడా తెలియజేయలేదనీ, ఇది ఆయన అహంకారానికి ప్రతీక అని ఆ సభ్యుడు ఆరోపించారు. -
బాబ్ డిలాన్ 'నోబెల్'ను అంగీకరించినట్లేనా?
కాలిఫోర్నియా: ప్రముఖ గాయకుడు, కవి బాబ్ డిలాన్‌కు ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారం ప్రకటించి వారం గడుస్తున్నా దానిపై ఆయన పెదవి విప్పలేదు. దీంతో స్విడిష్ అకాడమీ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగుతున్నాయి. 'కనీసం గ్రహీతకు కూడా అవార్డు ఇచ్చిన సంగతి చెప్పరా?' అని పలువురు ప్రశ్నిస్తున్నారు. మరికొందరు మాత్రం బాబ్ డిలాన్ నోబెల్‌ను తిరస్కరిస్తారని అంటున్నారు. ఈ నేపథ్యంలో బాబ్ డిలాన్ అధికారిక వెబ్సైట్లో చోటుచేసుకున్న మార్పులు స్విడిష్ అకాడమీకి ఊరటనిచ్చాయి. కెరీర్ ప్రారంభం నుంచి 2012 వరకు బాబ్ డిలాన్ రచించి, పాడిన పాటల సమాహరం 'ది లిరిక్స్ 1961-2012' పుస్తకానికి గానూ ఆయనకు నోబెల్ సాహిత్య పురస్కారం లభించిన సంగతి తెలిసిందే. కాగా, సోమవారం నుంచి ఆ పుస్తకానికి సంబంధించిన ప్రచార వాక్యాల్లో 'నోబెల్ లిటరేచర్ అవార్డు పొందిన పుస్తకం'అని బాబ్ అధికారిక వెబ్సైట్లో పేర్కొన్నారు. పురస్కారంపై ఇప్పటి వరకు పెదవి విప్పని బాబ్.. ఈ చర్యతో నోబెల్ ను అంగీకరించినట్లు ప్రకటించారని స్విడిష్ అకాడమీ వర్గాలు సంబరపడుతున్నాయి. (తప్పక చదవండి: ‘నోబెల్’కు నగుబాటు!) అవార్డు ప్రకటించిన విషయాన్ని బాబ్ డిలాన్‌కు నేరుగా చేరవేసే ప్రక్రియకు మంగళవారంతో మంగళంపాడినట్లు స్విడిష్ అకాడమీ శాశ్వత ప్రతినిధులు సారా డేనియస్ ప్రకటించారు. అయితే డిసెంబర్ 10న స్టాక్ హోంలో జరగబోయే నోబెల్ పురస్కార ప్రదాన కార్యక్రమానికి బాబ్ డిలాన్ వస్తారా? రారా? అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదని ఆమె చెప్పారు. గతంలోనూ కొందరు నోబెల్ సాహితీ గ్రహీతలు.. పురస్కార ప్రదాన కార్యక్రమానికి గౌర్హాజరయ్యారని, ఇద్దరు కవులు మాత్రం ఏకంగా అవార్డునే తిరస్కరించారని గుర్తుచేశారు. -
నోబెల్ ప్రైజ్‌కు పోటీగా RSS పురస్కారాలు
-
జన స్వరం
-
కష్టజీవికి అటూ ఇటూ ఉన్నవాడు
రెండో మాట ‘అప్పటిదాకా శూన్యంలో విహరిస్తున్న నా కళ్ల పొరలు తొలగాయి. రచయిత నడవవలసింది శూన్యంలో కాదు, సరైన రాస్తా వెంట నడవాలి. జీవితంలోకి తొంగిచూడాలి. జీవితం వైపుగా సాగిపోవాలి. రాజకీయాలకు దూరదూరంగా ఉండే రచయిత ఒక పెద్ద మోసగాడు మాత్రమే. అలాంటి మోసాన్ని సృష్టించి, వ్యాప్తి చేస్తున్నది పెట్టబడిదారీ విధానం. మహాకవి డాంటే కాలంలో అలాంటి రచయితలు లేరు. కళ కళకోసమేనన్న సిద్ధాంతం బడా వ్యాపారుల ప్రబోధగీతం’ - పాబ్లో నెరూడా (చిలీ దేశపు మహాకవి) యూదు జాతీయులలో ఒక దళితకవి.. అమెరికాలోని వర్తక వ్యాపారాల ద్వారా నిరంతరం లాభాపేక్షతో జీవిస్తున్న సంపన్న యూదుల మధ్య సొంత గొంతుతో స్వతంత్ర శక్తితో ప్రతిభా సంపన్నుడైన ఒక దళితకవి పుట్టి పెరగడమే నమ్మలేని నిజం. ఆయన తొలి జానపద కళాకారునిగా, ఆట పాటల మేల్కలయికగా, నర్తకునిగా ఈ యేటి నోబెల్ పురస్కారానికి ఎంపిక కావడం ఇంకా విశేషం. యూదులలో అణగారిన వర్గానికి చెందిన బాబ్ డిలాన్ కిశోరప్రాయం నుంచి జానపద కళాకారునిగా దూసుకురావడానికి ప్రధాన కారణం- అదిగో, నెరూడా మహాకవి ఆశించిన తోటి కష్టజీవుల కన్నీటిగాథలకూ, జానపదుల జీవన సమరానికీ రాగం, తానం, పల్లవి కట్టి ముందుకు సాగడమే. అంతకు ముందు నోబెల్ సాహిత్య పురస్కారాలు అందుకున్న యూదులు లేకపోలేదు. మిన్నిసోటా (అమెరికా)లో ఉదయిం చిన యూదు దళిత బిడ్డ మిన్ను తాకగల శక్తిని పొందడానికి సుమారు అరవై సంవత్సరాల వ్యవధి ఎందుకు పట్టింది? బడుగుల బాధలకు గొంతు ఇచ్చి... ఈ ఏడాది నోబెల్ సాహిత్య పురస్కారానికి ఎంపికైన బాబ్ డిలాన్ అమె రికాలోని అట్టడుగు ప్రజల బాధలతో గొంతు కలిపినవాడు. అమెరికన్ ప్రజాస్వామిక, నీగ్రో అభ్యుదయకర శక్తులతో చేతులు కలిపి ఇన్నేళ్లుగా ముందుకు నడుస్తూ ఒక యువ కెరటంలా దూసుకువచ్చిన డెబ్బయ్ ఏళ్ల వృద్ధుడు. వీధి గాయకునిగా అమెరికా సామాన్య ప్రజలను అలరించిన బాబ్, ఒకనాటి పాల్ రాబ్సన్ వంటి కొద్దిమంది కవి, కళాకారులకు వారసుడు. సీగర్ వంటి సుప్రసిద్ధ వాద్యకారుడు గిటార్‌ను తన ఆయుధంగా ప్రకటించు కున్నాడు. బాబ్ కూడా తన చేతి గిటార్‌ను ప్రగతిశీల అభ్యుదయ ఉద్యమా లకు మద్దతుగా నిలిచే శక్తిగా ప్రకటించుకున్నాడు. బాబ్‌కు స్థానిక మహా కవులలో సుప్రసిద్ధుడు డిలాన్ థామస్ ప్రోత్సాహక శక్తి. అందుకే తన అసలు పేరు రాబర్ట్ అలెన్ జిమ్మర్మాన్ను బాబ్ డిలాన్గా మార్చుకున్నాడు. ఆఫ్రికన్ నల్లజాతి కవి వోలే సోయెంకా నోబెల్ అందుకున్నప్పుడు పెదవులు విరిచిన బాపతు (వీఎస్ నైపాల్ వంటివారు) కొందరు లేకపోలేదు. ఇప్పుడు బాబ్ విషయంలో కూడా కళ్లు కుట్టిన బాపతు లేకపోలేదు. కానీ అదే సమ యంలో వాగ్గేయకారుడైన డిలాన్ వాడవాడలా గిటార్ వాద్యం మాధ్య మంగా జానపద సాహిత్యంతో ప్రేక్షకులను మత్తిల్ల చేస్తూ ఉద్యమ సందే శాలతో, సంగీత బాణీలతో అలరించిన ఘడియలని శ్రోతలు మరవలేరు. అయితే అనంతర కాలాలలో బాబ్ జానపదాలను పక్కన పెట్టి బీట్, రాక్ మ్యూజిక్ వైపు ఆకర్షితుడు కావడాన్ని శ్రోతలు జీర్ణించుకోలేకపోయారు. కానీ, బీట్ తరానికి ముందున్న జానపద కళారూపాలను, పాటలను కవి తాత్మకంగా ప్రదర్శించిన డిలాన్ గురించి సురేశ్ మీనన్ వంటి విశ్లేషకులు చేసిన వ్యాఖ్య గమనించదగినది. ‘బాబ్ డిలాన్ ఆదర్శంగా మా తరమంతా ఎదుగుతూ వచ్చింది. షేక్స్పియర్ నుంచి లేదా బైబిల్ హీరోల నుంచి వాక్యాలను ఉదహరించడం కన్నా బహు సునాయాసంగా డిలాన్ పాటలనే ఉటంకించగలం!’ అన్నారాయన. ఆయనలోని మనిషి నాటి థామస్ డిలాన్ అభ్యుదయ కవితలలో కొన్ని (వీటిలో కొన్ని శ్రీశ్రీ అనువదించారు) వింటే, నేటి బాబ్ డిలాన్ మార్గం మనకు అవగతమవు తుంది. ‘గ్రంథాల మీద పడి వాళ్లేడ్చే / కాలం ఒకటుండేది/ కాలం అయితే వాళ్ల మీదకి / కాష్టాన్నే ఉసికొల్పింది.... ఆకాశపు సౌజ్ఞల కింద/ హస్తాలు లేని వాళ్లవే/ అతి శుభ్రమైన చేతులు/ గుండెల్లేని శవానికి/ గాయాల బాధ లేనట్టు/ గుడ్డివాడు మాత్రమే జాస్తీగా చూస్తాడు’. దాదాపు ఇలాంటి చమత్కార పదాలతోనే తన గుండెలో ఉన్న సామాన్యుల ఆవేదనకు అక్షర రూపం ఇచ్చినవాడు బాబ్. 1960 నుంచి 2001 దాకా వాగ్గేయకారునిగా బాబ్ అల్లిన కవితలను సిమన్ షూస్టర్ ప్రచురణ సంస్థ సంకలనపరిచింది. 27 అధ్యాయాలలో ఒక్కో అధ్యాయానికి 15 పాటల చొప్పున లయబద్ధంగా, అంత్యప్రాసలతో 405 కవితలను 600 పేజీలలో సంపుటీకరించారు. అసమ సమాజ పరిస్థితులపై కవి హృదయంలో మరుగుతున్న రుధిరజ్వలనం గీతంగా, జానపద సంగీతంగా ఈ కవితలలో జాలువారిందని వ్యాఖ్యాతలు భావిస్తారు. ఫ్రెంచి కవి పాల్ ఎలార్డ్ ‘ద్వేషగీతం’ ప్రభావం కూడా బాబ్‌పై లేకపోలేదు. పాటలూ, గీతాలూ వేరు. శుద్ధ కవితలు వేరు. ‘ప్రధానంగా నీవు పాటగాడివా లేక కేవల కవి కుమారుడివా’ అన్న కొందరు సమకాలికుల ప్రశ్నకు బాబ్ ‘నేను ప్రధానంగా ప్రజా వాగ్గేయకారుడ్ని, నాట్యకారుణ్ణి’ అని చెప్పాడు. ఇక్కడ ‘నాది ప్రజా ఉద్యమం. ఎవరినో సంతోష పెట్టడం కోసం దాన్ని వదలుకోలేనన్న’ గురజాడ తెగింపు గుర్తుకు వస్తుంది. బహుశా ఈ దృష్ట్యానే బాబ్ డిలాన్ను జానపద వాగ్గేయకారునిగా గుర్తించిన స్వీడిష్ నోబెల్ అకాడమీ ‘అమెరికన్ జానపద గేయ సాహిత్య సంప్రదాయంలో వినూత్నమైన కవితాత్మకమైన భావనా సృష్టికర్త’ అని కీర్తించింది. ‘సేవింగ్ గ్రేస్’ అన్న గీతంలో బాబ్ ‘కుచ్చితపు మనిషికి జీవితంలో శాంతి ఉండదు/ఆ కుచ్చి తనపు మనస్సును వంచించడం కష్టం’ అంటాడు. అంతేగాదు, ‘శత్రువువల్ల ఏదైనా విధ్వంసకాండ మీదకొచ్చినప్పుడు/ఎదుటనున్నవారికి వీడ్కోలు చెప్పిరాలేను/నా సహోదరుల రక్షణ కోసం నేను నా ప్రాణాలు కోల్పోవడా నికైనా సిద్ధమవుతాను - అందుకు నేను సదా సిద్ధం, మీరూ అందుకు సిద్ధమేనా’ అని ప్రశ్నిస్తాడు బాబ్. ‘ఒక్క స్త్రీమూర్తి మాత్రమే నాలోని మానవుడ్ని, మానవతను అంచనా వేయగలదని’ చాటి చెప్పాడు. ఇంతకూ ‘నీ హృదయం రాతిగుండా లేక ప్రాణం లేని గండశిలా’ అని మరో కవితలో ప్రశ్నిస్తాడు. ‘నాలోని మనిషి’ (‘ది మాన్ ఇన్ మి’) అన్న కవితలో ‘నాలోని మనిషి ఏ కర్తవ్యాన్నయినా నెరవేర్చగలడు/కాని అందుకు పరిహారం కోరడు’ అని మానవీయ దృక్పథం ఎలా ఉండాలో చెప్పాడు. అందుకే శ్రీశ్రీ అంటాడు : ‘మాట చేతగా మారి/మనిషి మనిషితో చేరి/స్వప్నం సత్యం ఐతేనే స్వర్గం’ అని. ‘ఒక శబ్దం శక్తివల్ల/నా బతుక్కి పునర్జన్మ’ అని బాబ్‌కు మరో ఇష్టుడైన కవి పాల్ ఎలార్ ప్రకటిస్తే; డిలాన్ తన జన్మ సార్థకత కోసం తన ‘గిటార్’ వాద్య పరికరం ద్వారా జనతకు చైతన్యపు మేలుకొలుపులు పాడాడు. ఆశ యాలు సంఘర్షిస్తున్నవేళ తన గిటార్ కూడా తటస్థంగా ఉండలేక ఆయు ధంగా మారింది. శుభ సూచకం ఈ ప్రజా చైతన్యయాత్రలో భాగస్వామి కాదలచిన బాబ్‌తో పాటు తెలుగు నాట కూడా సుప్రసిద్ధ జానపద వాగ్గేయకారులను ఆటపాటల, నృత్య సంకేత కళల్లో ఆయనకు సమఉజ్జీలు లేకపోలేదు. భారతదేశ స్థాయిలో డిలాన్ను ప్రేమించే రహ్మాన్ లాంటివారుండగా, మన ఉమ్మడి తెలుగుసీమలోని అన్ని ప్రాంతాలలోనూ లెక్కకు మిక్కుటంగానే ఉన్నారని చెబితే అతిశయోక్తి కాబోదు : సుద్దాల హనుమంతు, నాజర్, గద్దర్, వంగపండు ప్రసాద్, పాణి గ్రాహి, సత్యమూర్తి, గోరటి వెంకన్న, అంద్శై అశోక్ తేజలు.. పదిమంది బాబ్డిలాన్లకు సరిజోడులు. ‘ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ’ లాంటి మోసపూరిత సుద్దులతో నెత్తురోడుతున్న పల్లెల, పట్టణ, నగర జీవి తపు ఒత్తిళ్ల మధ్య నలిగిపోతున్న సగటు సామాన్యుల వ్యథాభరిత గాథలను జానపద బాణీల ద్వారా, ‘సంచార’ కవితల ద్వారా తన గుండె గొంతుకలో వినిపిస్తున్న గోరటి వెంకన్న లాంటి చేతనా స్వరాలకు ఖరీదు కట్టే షరాబులు లేరు. మన జానపద సాహిత్యంలోని తెలుగుదనాన్ని తరతరాలుగా నాలుకల మీద నర్తింపచేస్తున్నవి ఎన్నో! కోతపాటలు, కాపు పాటలు, నాటు పాటలు, మోట పాటలు, కాపరి పాటలు, ఇసుర్రాయి పాటలు, పెళ్లి పాటలు, దిష్టి పాటలు, పండుగ పబ్బాల పాటలు, రోడ్డు కూలీల పాటలు, వృత్తి పాటలు కోటి బాణీలతో జన సామాన్యంలో నేటికీ ప్రచరితమవుతూనే ఉన్నాయని మరచిపోరాదు. సామ్రాజ్య పెట్టుబడిదారీ సంస్కృతిలో పుట్టి పెరిగిన నోబెల్ అకాడమీ పెద్దలు నోబెల్ పురస్కార ప్రదానాలలో చూపే వివక్ష రాజ కక్షలకు, కార్పణ్యాలకూ అతీతం కాదని సోషలిస్టు దేశాలలో పుట్టి పెరిగి, ‘తల్లి రొమ్మునే గుద్ది’ దేశద్రోహులుగా మారిన పాస్టర్నాక్ లాంటి రచయితలకు నోబెల్ పురస్కారాలు లభించిన ఉదంతాలు కూడా మరవలేం. కొన్నేళ్లుగా విమర్శలు వెల్లువెత్తుతున్న పూర్వ రంగంలో స్వీడిష్ అకాడమీలో చలనం కలుగడం, బాబ్ లాంటి వారిని ఎంపిక చేయవలసి రావటం శుభ సూచకమే. డిలాన్ మాదిరిగానే సామాన్య ప్రజాబాహుళ్యం బాధలకు ఆర్ద్రతతో బాణీలు కట్టిన ‘అలచంద్రవంక’ గోరటి వెంకన్న మాటల్లో - ‘రాములయ్య’ ‘ఇల్లు చూస్తే మూరెడంత/బాడిగేమో బాండంత/కార్పొరేటు ఊడలాయె/ గాడి కింద నీడవాయె’ లాంటి పరిస్థితులు తాండవిస్తున్నకొద్దీ... ‘అప్పులోళ్ల తిట్లకదిరి/అయ్యప్పమాలలేసు’కునే స్థితి దాపురించినంత కాలం.. విదేశీ సామ్రాజ్యవాద గుత్త పెట్టుబడులకి అంగలార్చి దేబరిస్తూ కాలక్షేపం చేసినంత కాలం.. ఆ ‘సంస్కృతి’కి పాలకులు బానిసలయినంత కాలం - రచయితలను లొంగదీసుకునే ‘పురస్కారాల’ కోసం కవి, గాయక నట, జాన పద కళాకారులు, చైతన్యంగల సంస్కృతీపరులు పురస్కారాల కోసం ఎదురు చూడకూడదు. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
‘కాంట్రాక్ట్ థియరీ’కి ఆర్థిక నోబెల్
ఓలివర్, హోమ్‌స్ట్రామ్ కృషికి పురస్కారం స్టాక్‌హోమ్: ప్రముఖ ఆర్థికవేత్తలు ఓలివర్ హార్ట్(బ్రిటన్-అమెరికా), బెంట్ హోమ్‌స్ట్రామ్(ఫిన్లాండ్)లను ఈ ఏడాది ఆర్థిక శాస్త్ర నోబెల్ పురస్కారం వరించింది. ‘కాంట్రాక్ట్ థియరీ’లో చేసిన విశేష కృషికి గానూ వీరిని సంయుక్తంగా ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు జ్యూరీ సోమవారం ప్రకటించింది. బీమా పాలసీల రూపకల్పన, అధికారుల వేతనంతో పాటు జైళ్ల నిర్వహణ వంటి వాటికి ఈ సిద్ధాంతం ఎంతో ఉపయోగపడుతుందని నోబెల్ జ్యూరీ చెప్పింది. అత్యున్నత స్థాయి అధికారులకు పనితీరు ఆధారిత వేతనం, ఇన్సెంటివ్‌లు, బీమాలో మినహాయింపులు, పాలసీదారుల క్లెయిమ్‌లు, ప్రభుత్వ సంస్థల కార్యకలాపాల ప్రైవేటీకరణ, ఒప్పందాల రూపకల్పనలో లోటుపాట్ల వంటి విభిన్న అంశాలెన్నింటినో సమగ్రంగా విశ్లేషించడం ద్వారా కాంట్రాక్ట్ థియరీని ఓలివర్, హోమ్ స్ట్రామ్లు అభివృద్ధి చేసినట్టు తెలిపింది. అద్భుత సాధనం... వాస్తవిక ఒప్పందాలు, సంస్థల గురించిన అవగాహన, సమస్యల పరిష్కార మార్గాలతో పాటు టీచర్లు, హెల్త్‌కేర్ వర్కర్లు, జైలు గార్డులు నిర్దేశిత లేదా పని ఆధారిత వేతనం పొందేందుకు ఈ సరికొత్త సైద్ధాంతిక ఉపకరణాలు సహాయపడతాయని నోబెల్ కమిటీ సభ్యుడు పర్ స్ట్రాంబర్గ్ చెప్పారు. దివాలా చట్టం నుంచి రాజకీయ రాజ్యాంగం వరకు సంస్థలు, విధానాల రూపకల్పనకు ఇది మేథో పునాది వేసినట్టు పేర్కొన్నారు. సమస్యేమిటో తెలుసుకోవడానికే కాకుండా, వాస్తవ పరిస్థితులను విశ్లేషించే అవకాశం కాంట్రాక్ట్ థియరీ వల్ల కలుగుతుందని, తద్వారా షేర్హోల్డర్లు, కార్పొరేట్ బోర్డులు మరింత మెరుగైన ఒప్పందాలు రూపొందిం చుకోవడానికి అద్భుత సాధనంగా సహాయపడుతుందని తెలిపారు. హార్ట్... హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్ర ఆచార్యుడిగా సేవలందిస్తున్నారు. ఈయన 1948లో జన్మించారు. హోమ్‌స్ట్రామ్ (67) మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అర్థశాస్త్రం, మేనేజ్మెంట్ ప్రొఫెసర్. విడివిడిగానూ, కలిసి పనిచేసిన వీరు నోబెల్ అవార్డు కింద ఇచ్చే సుమారు రూ.6.14 కోట్ల (924 వేల డాలర్లు) నగదు బహుమతిని పంచుకోనున్నారు. గత ఏడాది అర్థశాస్త్ర నోబెల్ అమెరికా-బ్రిటన్ పరిశోధకుడు అంగస్ డేటన్కు దక్కింది. ఏటా ఇచ్చే ఆరు నోబెల్ పురస్కారాల్లో ఐదింటిని ఇప్పటికే జ్యూరీ ప్రకటించింది. చివరిదైన సాహిత్య పురస్కార గ్రహీతెవరన్నది గురువారం తెలుస్తుంది. డిసెంబర్ 10న స్టాక్‌హోమ్‌లో జరిగే వేడుకలో ఈ అవార్డులు ప్రదానం చేస్తారు. హార్ట్, హోమ్స్ట్రామ్లు ఈ గౌరవానికి అర్హులంటూ 2008 ఆర్థిక నోబెల్ పురస్కార గ్రహీత పాల్ క్రుగ్మన్ అభినందించారు. ఆనందం కుటుంబంతో... ‘నోబెల్ బహుమతి వచ్చిందని తెలియగానే మొట్టమొదట నా భార్యను ఆలింగనం చేసుకున్నా. చిన్నబ్బాయిని నిద్రలేపి ఆనందం పంచుకున్నా. సహచరుడికి ఫోన్ చేసి మాట్లాడా..’ అంటూ హార్ట్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ‘ఎంతో ఆశ్చర్యానికి లోనయ్యా. ప్రతిష్టాత్మక అవార్డు దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది’ అని హోమ్‌స్ట్రామ్ చెప్పారు. -
ముగ్గురు బ్రిటిషర్లకు ఫిజిక్స్ నోబెల్
-
ముగ్గురు బ్రిటిషర్లకు ఫిజిక్స్ నోబెల్
స్టాక్‌హోమ్: పదార్థానికి ఉండే అసాధారణ స్థితిగతులపై పరిశోధన చేసిన ముగ్గురు బ్రిటిష్ శాస్త్రవేత్తలు డేవిడ్ థౌలెస్, డంకన్ హాల్డేన్, మైఖేల్ కోస్టార్లిట్జ్‌లకు సంయుక్తంగా ఈ ఏడాది భౌతిక శాస్త్రం(ఫిజిక్స్)లో నోబెల్ దక్కింది. గణిత శాస్త్ర ప్రత్యేక విభాగమైన టోపాలజీలో పరిశోధన చేసి, మన చుట్టూ ఉండే పదార్థం మనకు తెలియని అసాధారణ స్థితిగతులను కలిగి ఉంటుందన్న రహస్యాన్ని వీరు ఛేదించారని నోబెల్ జ్యూరీ రాయల్ స్వీడిష్ అకాడమీ పేర్కొంది. ‘భవి ష్యత్తులో అతి చిన్న, వేగవంతమైన క్వాం టమ్ కంప్యూటర్ల తయారీకి, అత్యుత్తమ ఎలక్ట్రానిక్ ఆవిష్కరణలకు, సూపర్ కండక్టర్ల అభివృద్ధికి వీరి పరిశోధన మార్గం సుగమం చేసింది. ఎక్కువ వేడిని ఉత్పత్తి చేసే (ఓవర్ హీటింగ్) సమస్య లేకుండా విద్యుత్‌ను, సమాచారాన్ని ప్రసారం చేసేందుకు వీలవుతుంది’ అని తెలిపింది. ఈ ముగ్గురు ప్రస్తు తం అమెరికాలో పనిచేస్తున్నారు. థౌలెస్ వర్సిటీ ఆఫ్ వాషింగ్టన్లో, హాల్డెన్, కోస్టార్లిట్జ్ బ్రౌన్ వర్సిటీలో ప్రొఫెసర్లు. అవార్డు కింద రూ.6.18 కోట్లు (8 మిలియన్ల స్వీడన్ క్రోనార్లు) బహుమతిగా అందజేయనుండగా... డేవిడ్ థౌలెస్కు 50 శాతం, హాల్డేన్, కోస్టర్లిట్జ్లు 25 శాతం చొప్పున అందుకోనున్నారు. పదార్థ అసాధారణ స్థితిపై పరిశోధనకు బహుమతి ఏమిటీ టోపాలజీ.. గణిత శాస్త్రంలో టోపాలజీ ఓ ప్రత్యేకవిభాగం. అంతరిక్షం, పదార్థాల భౌతిక ధర్మాలు, బహిర్గత ఒత్తిడికి గురై ఆకారంలో మార్పులు జరిగినా పూర్వ స్థితికి చేరుకునే లక్షణం వంటి అంశాలపై అధ్యయనమే టోపాలజీ. అయితే ఈ ఒత్తిడికి గురి చేసే శక్తి వినియోగం వంచడం, మెలితిప్పడం వంటి రెండు అంశాలకే పరిమితం. ఈ తరహా ఒత్తిడికి గురి చేసిప్పుడు, (లేదా శక్తిని ప్రయోగించినప్పు డు) ఆ పదార్థం స్థితిగతుల్లో వచ్చే అసాధారణ మార్పులను వారు సిద్ధాంతపరంగా నిరూపించారు. ఉదాహరణకు రబ్బరు గ్లాసును వంచడం, మెలితిప్పడం, డోనట్ ఆకృతిలోకి(గుండ్రంగా ఉండి మధ్యలో రంధ్రం ఉండేలా) మార్చడం వంటివి. టోపాలజీ దృష్టిలో తొలుత ఉన్న రబ్బరు గ్లాసు ఆకృతికి, మార్చిన ఆకృతికి మధ్య భేదం ఉండదు. అందులోని పదార్థ అసాధారణ స్థితిగతులు, మార్పుల దశలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటుంది. సూపర్ కండక్టర్ల అభివృద్ధికి తోడు ఇలా మనం సాధారణంగా వినియోగించే పదార్థ టోపాలాజికల్ స్థితులలో మార్పులు చేయడం ద్వారా.. అవి అతిగా వేడెక్కే (ఓవర్ హీటింగ్) సమస్య లేకుండా తక్కువ దూరాలలో శక్తి (విద్యుత్)ని, సమాచారాన్ని రవాణా చేయడానికి వీలు కలుగుతుంది. అంటే అత్యంత సమర్థవంతమైన సూపర్ కండక్టర్లను, సూపర్ ఫ్లూయిడ్లను రూపొందించొచ్చు. అయితే ఇలా టోపాలాజికల్ మార్పులు రంధ్రాలు చేయడం, చింపడం, అతికించడం వంటి వాటికి వర్తించదు. ఈ ముగ్గురు శాస్త్రవేత్తల పరిశోధనలు మెటీరియల్స్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ముఖ్యంగా సూపర్ స్మాల్ క్వాంటమ్ స్కేల్ రూపకల్పనకు తోడ్పడనున్నాయి. ఈ అంశంపై థౌలెస్, హాల్డేన్, కోస్టార్లిట్జ్లు 1970, 80 దశకాల్లోనే పరిశోధన చేశారు. -
జపాన్ శాస్త్రవేత్తకు వైద్య నోబెల్
* కణాల ఆత్మహత్యపై పరిశోధనకుగాను ఒషుమీకి బహుమతి * ‘ఆటోఫేజీ’ ప్రక్రియ గుట్టువిప్పిన శాస్త్రవేత్త స్టాక్‌హోమ్: కణాలు తమలోని దెబ్బతిన్న భాగాలను స్వీయ విధ్వంసం చేసుకుని, పునరుద్ధరించుకునే ప్రక్రియ(ఆటోఫేజీ) గుట్టు తేల్చిన జపాన్ శాస్త్రవేత్త యొషినోరీ ఒషుమీకి ఈ ఏడాది వైద్య శాస్త్ర నోబెల్ దక్కింది. కణాల ఆత్మహత్య లేదా కణాల స్వీయ విధ్వంసంగా పేర్కొనే ఈ ప్రక్రియలో లోపం వల్లే మనలో వృద్ధాప్యం వస్తుందని, కణాలు దెబ్బతిని పార్కిన్సన్స్, మధుమేహం, కేన్సర్ వంటి వ్యాధులు వస్తాయని శాస్త్రవేత్తలు తేల్చారు. టోక్యో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఒషుమి వయసు 71 ఏళ్లు. డిసెంబర్ 10న జరిగే కార్యక్రమంలో నోబెల్ అవార్డుతో పాటు 8 మిలియన్ల స్వీడిష్ క్రోనార్లు (రూ.6.23 కోట్లు) బహుమతిగా అందుకోనున్నారు. గతేడాది వైద్య నోబెల్‌ను సూక్ష్మజీవుల ద్వారా వచ్చే వ్యాధులను ఎదుర్కొనే చికిత్సలను అభివృద్ధి చేసిన విలియం కాంప్‌బెల్(అమెరికా), సతోషి ఒముర(జపాన్), టు యూయూ(చైనా)లు సంయుక్తంగా అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా నోబెల్ గెలుచుకున్న ఒషుమీతో జపాన్ మొత్తంగా 23వ నోబెల్ గెలుచుకుంది. వైద్య రంగంలో ఆ దేశానికి ఇది 6వ నోబెల్ బహుమతి కావడం గమనార్హం. ఈ సందర్భంగా ఒషుమీ మాట్లాడుతూ.. ‘‘ఇతరులు చేయాలనుకోని పనులు చేయాలనేది నా ఆలోచన. ఆటోఫేజీ చాలా ఆసక్తికరమైన అంశం. అంతా మొదలయ్యేది దానివద్దే. కానీ గతంలో ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అందరి దృష్టీ దానిపై ఉంది. నోబెల్ రావడం ఓ పరిశోధకుడికి అత్యుత్తమ గౌరవం’ అని పేర్కొన్నారు. ఏమిటీ ఆటోఫేజీ.? చేతికున్న వాచీ పాడైతే మరమ్మతు చేయిస్తాం. లేకపోతే కొత్తది కొనుక్కుంటాం. మరి మన శరీర కణాలు తమ లోపలి భాగాలు పాడైతే ఏం చేస్తాయో తెలుసా? వాటిని ఎంచక్కా ప్యాక్ చేసి.. కణంలోనే ఉండే రీసైక్లింగ్ విభాగానికి పంపేస్తాయి. లైసోసోమ్ అని పిలిచే ఈ భాగంలోకి వెళ్లే కణ భాగాలు తర్వాత క్రమేపీ నాశనమవుతాయి. దీనినే ‘ఆటోఫేజీ’ అంటారు. దీని అనంతరం ఆ కణాంగాల పునరుద్ధరణ జరుగుతుంది. ఆటోఫేజీ గురించి 1950ల్లోనే శాస్త్రవేత్తలకు తెలుసు. కానీ దీని వెనుక ఉన్న జన్యువులేమిటి, ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందన్నది మాత్రం 1990లలో జపాన్ శాస్త్రవేత్త యొషినోరీ ఒషుమీ ప్రయోగాల వల్ల అర్థమైంది. ఫలితంగానే ఉపవాసం శరీరానికి చేసే మేలేమిటో తెలిసింది. ఇన్ఫెక్షన్ సోకితే శరీరం ఎలా స్పందిస్తుందో అర్థమైంది. ఈ ఆటోఫేజీ కారక జన్యువుల్లో వచ్చే మార్పులు కేన్సర్ వంటి వ్యాధులకు ఎలా దారితీస్తాయో కూడా వెల్లడైంది. కణాల ఆత్మహత్య.. ఆటోఫేజీ అంటే గ్రీకు భాషలో తనను తాను తినేయడమని అర్థం (ఆటో అంటే స్వయంగా, ఫేజియన్ అంటే తినేయడం). కణాల్లో వేర్వేరు క్రియల కోసం ప్రత్యేకమైన గదుల్లాంటి నిర్మాణాలు ఉంటాయి. వాటిని ఆర్గనెల్లే అని పిలుస్తారు. అయితే కణభాగాలు కొన్ని లైసోసోమ్లో ఉండడాన్ని గమనించిన శాస్త్రవేత్తలు దీనికి కారణమేమిటని పరిశోధన చేశారు. కణంలోని పాడైన భాగాలు ప్రొటీన్లు, కొన్ని రకాల ఆర్గనెల్లేలు, త్వచాల తొడుగులతో వచ్చి లైసోసోమ్లో చేరుతున్నట్లు గుర్తించారు. లైసోసోమ్ తనలోని ప్రొటీన్లు, ఎంజైమ్‌లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వుల సహాయంతో ఆ భాగాలు నశించిపోయేలా చేస్తున్నట్లు తేల్చారు. 1974లో నోబెల్ పొందిన క్రిస్టియన్ డూవ్ ఈ ప్రక్రియకు ఆటోఫేజీ అని పేరుపెట్టారు. దీంతో కణభాగాలను మోసుకొచ్చే సంచులను ఆటోఫేజసోమ్స్ అని పిలుస్తున్నారు. తొలుత ఈస్ట్‌పై ప్రయోగాలు..: ఆటోఫేజీ ప్రక్రియ గుట్టు ఛేదించేందుకు చాలామంది శాస్త్రవేత్తలు ప్రయత్నించినా విజయం సాధించలేకపోయారు. చివరికి ఒషుమీ 1998లో ఈస్ట్ కణాల్లో లైసోసోమ్ మాదిరిగానే పనిచేసే ఓ ఆర్గనెల్లేపై ప్రయోగాలు చేశారు. కొన్ని ప్రయోగాల ద్వారా ఈస్ట్ కణాల్లో ఆటోఫేజీ ప్రక్రియ జరుగుతోందని నిర్ధారించుకున్న ఒషుమీ... తర్వాత జన్యుమార్పులను గుర్తించే ప్రయోగాలతో ఆటోఫేజీకి కారణమైన కీలక జన్యువులను గుర్తించారు. మరింత పరిశోధన ద్వారా ఈ జన్యువులు ఉత్పత్తి చేసే ప్రొటీన్లు ఆటోఫేజసోమ్స్పై ఎలాంటి ప్రభావం చూపుతాయో గుర్తించారు. ఇలాంటి ప్రక్రియే మానవుల్లోనూ ఉన్నట్లు తర్వాత వెల్లడైంది. విస్తృతంగా పరిశోధనలు..: ఆటోఫేజీ ప్రక్రియ గర్భంలో పిండం అభివృద్ధి చెందేందుకు, మూలకణాలు వేర్వేరు కణాలుగా అభివృద్ధి చెందేందుకూ ఉపయోగపడుతుందని గుర్తించారు. పాడైపోయిన ప్రొటీన్లు, ఆర్గనెల్లేలను వదిలించుకునేందుకు, ఇన్ఫెక్షన్లకు ఎలా స్పందించాలన్నది కూడా ఆటోఫేజీ ద్వారా తెలుస్తోందని నిర్ధారించారు. ఈ ప్రక్రియ సక్రమంగా జరగకపోవడం వల్లే వయోధికుల్లో టైప్-2 మధుమేహం, పార్కిన్సన్స్ వంటి వ్యాధులు ఏర్పడతాయని తేల్చారు. కేన్సర్, జన్యు వ్యాధులకూ ఆటోఫేజీతో సంబంధమున్నట్లు భావించి.. ఆ దిశగా పరిశోధనలు చేస్తున్నారు. ఆటోఫేజీని ప్రభావితం చేయడం ద్వారా వ్యాధులకు సమర్థమైన చికిత్సలను అందించేందుకు పలు సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. -
తెలంగాణ నేపథ్యంపైనే అధిక ప్రశ్నలు!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్సప్లై అండ్ సేవరేజ్ బోర్డులో మేనేజర్(ఇంజనీరింగ్) పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) రాత పరీక్షను ఆదివారం నిర్వహించింది. గతంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల రాత పరీక్షలను ఆన్లైన్లోనే టీఎస్పీఎస్సీ విజయవంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సారి దరఖాస్తులు ఎక్కువ సంఖ్యలో రావడంతో తొలిసారి ఆఫ్‌లైన్‌లో పరీక్షను నిర్వహించింది. అభ్యర్థుల్లోని సాధారణ నైపుణ్యాలు, సామర్థ్యాలు పరీక్షించేలా ప్రశ్న పత్రాన్ని రూపొందించింది. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ఎకానమీ, పాలిటీ, జాగ్రఫీ అన్ని అంశాల నుంచి ప్రామాణిక ప్రశ్నలను అడిగారు. చరిత్ర నుంచి సుమారు 35 ప్రశ్నలు! ప్రశ్న పత్రంలో తెలంగాణ నేపథ్యం ఉన్న భూగోళ శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. తెలంగాణ, భారతదేశ చరిత్రకు సంబంధించి సుమారు 35 వరకు ప్రశ్నలు అడిగారు. తెలంగాణ సంస్కృతికి సంబంధించి పలుకుబడిలో ఉన్న ప్రశ్నలనే ఇచ్చారు. ఉదాహరణకు ‘దసరా పండగ రోజు ఒకరికొకకు ఇచ్చుకునే జమ్మి ఆకును తెలంగాణలో ఏమని పిలుస్తారు?’, ‘బతుకమ్మ పండగ తొలిరోజును ఏమంటారు?’తోపాటు కాకతీయులు తవ్వించిన చెరువులు, కుతుబ్‌షాహీలు, అసఫ్‌జాహీలపై ప్రశ్నలు ఇచ్చారు. సాలార్ జంగ్ సంస్కరణలపై రెండు మూడు ప్రశ్నలు ఇచ్చారు. తెలంగాణ సంస్కృతిలో ప్రధానంగా పండగలు, జాతరల గురించి అడిగారు. ‘ఆదిలాబాద్ జిల్లాలో గోండులు జరుపుకునే ప్రముఖ జాతర?’, ‘కొండగట్టు దేనికి ప్రసిద్ధి?’, ‘మెదక్ జిల్లాలోని ప్రఖ్యాత యాత్రా స్థలం ఏది?’ మొదలైన ప్రశ్నలతోపాటు 1969 ఉద్యమంపై, భౌగోళిక సూచికగా నమోదైన హైదరాబాద్ హలీమ్‌పై, కుతుబ్‌షాహీ సాహిత్యంపై ప్రశ్నలు ఇచ్చారు. భారత దేశ చరిత్రలో సంస్కరణ ఉద్యమాలు, ఆర్యసమాజంపై ప్రశ్నలు ఇచ్చారు. జాగ్రఫీలో తెలంగాణ నేలలు, వర్షపాతం, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, ఖనిజాలు, విద్యుచ్ఛక్తి, పరిశ్రమలు, చెరువులు, ప్రాజెక్టులు తదితర అంశాలతోపాటు ఇండియన్ జాగ్రఫీపై ప్రశ్నలు అడిగారు. తెలంగాణ ఆర్థిక అంశాలు, ప్రభుత్వ పథకాలు, విధానాలపై ప్రశ్నలు ఇచ్చారు. జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలు! జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అంశంలో జాతీయ అంతర్జాతీయ అంశాలకు ప్రాధాన్యతనిచ్చారు. నోబెల్ బహుమతిపై, బ్రహ్మోస్ క్షిప ణి, జలాంతర్గా మి నుంచి ప్రయోగించే బాలెస్టిక్ క్షిపణిపై, అంతర్జాతీయ దినోత్సవాల గురించి ప్రశ్నలు ఇచ్చారు. జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఎక్కువ ప్రశ్నలు అడిగారు. సుమారు 15 ప్రశ్నలు ఈ అంశాలకు సంబంధించినవే. పాలిటీ విభాగంలో అన్ని అంశాల్లోంచి ప్రశ్నలు ఇచ్చారు. గతంలో టీఎస్పీఎస్సీ పరీక్షల కంటే కొద్దిగా క్లిష్టంగానే ప్రశ్నలు రూపొందించారు. ఇంగ్లిష్ విభాగంలో సులువైన ప్రశ్నలు ఇచ్చారు. లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఎంటర్ప్రిటేషన్లో ప్రశ్నలు అభ్యర్థులు తార్కిక నైపుణ్యాలు పరీక్షించే విధంగా ఉన్నాయి. క్లిష్టం, సందిగ్ధం! క్రీడలకు సంబంధించి లోతుగా ప్రశ్నలు ఇచ్చారు. ‘కల్టివేటెడ్ స్టైలిస్ట్‌గా పేరు తెచ్చుకున్న హైదరాబాద్ క్రికెటర్ ఎవరు?’, ‘వరంగల్‌కు చెందిన ఏ ఆటగాడు బాల్‌బ్యాడ్మింటన్ ఆటను విప్లవీకరించాడు?’ అనే ప్రశ్నలు ఈ తరం విద్యార్థులకు పెద్దగా తెలిసే అవకాశం లేదని సబ్జెక్టు నిపుణులు అభిప్రాయపడ్డారు. అలాగే ‘ప్రతిపాదిత పోలవరం ప్రాజెక్టు వల్ల ఎక్కువగా నష్టపోయే గిరిజన తెగ?’ అనే ప్రశ్నకు ఇచ్చిన ఆప్షన్లు, మరో ప్రశ్నలో తెలంగాణ ప్రభుత్వ పథకం పేరును ఇంగ్లిష్‌లో వాటర్ గ్రిడ్‌కు బదులు జలహారంగా ఇవ్వడం ఇంగ్లిష్ మీడియం అభ్యర్థులను సందిగ్ధానికి గురిచేసిందని నిపుణులు పేర్కొన్నారు. -
అర్థశాస్త్రంలో ఆంగస్ డేటన్కు నోబెల్
ప్రఖ్యాత అర్ధశాస్త్ర నిపుణులు ఆంగస్ డేటన్ను నోబెల్ బహుమతి వరించింది. సూక్ష్మ అర్థశాస్త్రంలో డేటన్ ఎంతగానో కృషి చేశారు. అర్థశాస్త్రంలో వినియోగం, పేదరికం మరియు సంక్షేమాలపై డేటన్ చేసిన విశేష కృషికి గాను ఆయనకు ఈ గౌరవం అందిస్తున్నుట్లు నోబెల్ బహుమతులను ప్రధానం చేసే స్వీడిష్ అకాడమీ' ప్రకటించింది. డేటన్ అర్థశాస్త్రంలో 2013లో 'ద గ్రేట్ ఎస్కేప్', 1980లో 'ఎకనామిక్స్ అండ్ కన్జ్యూమర్ బిహేవియర్' అనే పుస్తకాలను రాశారు. -
డీఎన్ఏపై పరిశోధనలకు నోబెల్ పురస్కారం
స్టాక్ హోం: కణాలు తమ డీఎన్ఏలో తలెత్తే అంతర్గత సమస్యలను ఏవిధంగా పరిష్కరించుకుంటాయి.. ఆ ప్రక్రియలో ఎలాంటి రసాయనిక చర్యలు చోటుచేసుకుంటాయి.. తదితర అంశాలపై 'మెకానిస్టిక్ స్టడీస్ ఆఫ్ డీఎన్ఏ' పేరుతో జరిపిన పరిశోధనలకుగానూ రసాయన శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ పురస్కారం లభించింది. స్విడన్, అమెరికా, టర్కీలకు చెందిన ముగ్గురు శాస్త్రవేత్తలు కెమిస్ట్రీ నోబెల్- 2015 పురస్కారానికి ఎంపికయినట్లు బుధవారం నోబెల్ కమిటీ ప్రకటించింది. వీరి ప్రయోగాలతో ఒక తరం నుంచి ఇంకో తరానికి మానవాళి ఏవిధంగా అభివృద్ధి చెందుతూ వస్తున్నదో తెలుసుకునే వీలుంటుందని రాయల్ స్విడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ పేర్కొంది. సజీవ కణం ఎలా పనిచేస్తుంది, అది క్యాన్సర్ ట్రీట్ మెంట్ కు ఏవిధంగా ఉపకరిస్తుందనే విశయాలనూ వీరు నిరూపించారు. స్విడన్ కు చెందిన థామస్ లిండాల్ లండన్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్, ప్రిన్స్ టన్, రాక్ ఫెల్లర్ యూనివర్సిటీల్లో అనేక పరిశోధనలు చేశారు. యూఎస్ కు చెందిన పాల్ మాడ్రిచ్..డ్యూక్ యూనివర్సిటీ బయోకెమెస్ట్రీ విభాగంలో పనిచేస్తున్నారు. ఇస్లాంబుల్ యూనివర్సిటీ నుంచి కెమిస్ట్రీ పట్టా పుచ్చుకున్న టర్కీ శాస్త్రవేత్త అజీజ్ సన్కార్ డీఎన్ఏ రిపేర్, సెల్ సైకిల్ చెక్ పాయింట్ మొదలగు ప్రయాగాల్లో విశేష ఖ్యాతి గడించారు. -
కోట్లాది మందిని రక్షించిన డ్రగ్స్ సృష్టికర్తలు
-
కోట్లాది మందిని రక్షించిన డ్రగ్స్ సృష్టికర్తలు
స్టాక్‌హోమ్: దోమలు, ఈగలు వల్ల మానవ రక్తంలో ప్రవేశించే బ్యాక్టీరియా, ఏలికపాము లాంటి పరాన్న జీవుల కారణంగా సంక్రమించే బోదకాలు, అంధత్వం, మలేరియా జబ్బులను నయంచేసే ఔషధాలను ఆవిష్కరించి వైద్య చరిత్రలో కొత్త చరిత్రను లిఖించిన ఐర్లాండ్‌కు చెందిన విలియం కాంబెల్, జపాన్‌కు చెందిన సతోషి ఒమురా, చైనాకు చెందిన య్యూయు తులకు నోబెల్ అవార్డు వరించడం ఎంతైనా ముదావహం. వాస్తవానికి వారికి ఎప్పుడో నోబెల్ అవార్డును ఇవ్వాల్సింది. ఏలికపాము (రౌండ్‌వామ్ పారసైట్స్) పరాన్న జీవుల కారణంగా అంధత్వం, బోదకాలు లాంటి జబ్బులు వస్తాయి. పరాన్న జీవుల జీవనక్రమాన్ని దెబ్బతీసి వాటి ద్వారా సంక్రమించే వ్యాధులను అరికట్టే 'అవర్‌మెక్టిన్' అనే డ్రగ్‌ను కనుగొన్నందుకుగాను విలియం కాంబెల్, సతోషి ఒమురాలకు సంయుక్తంగా సగం నోబెల్ ప్రైజ్ లభించింది. మలేరియాను అరికట్టే మెడిసిన్ 'ఆర్టేమిసినిన్'ను కనుగొన్న చైనాకు చెందిన మహిశా శాస్త్రవేత్త య్యూయు తునకు మిగతా సగం నోబెల్ ప్రైజ్ మనీ ఇవ్వాలని అవార్డు కమిటీ నిర్ణయించింది. వైద్యరంగ చరిత్రలోనే ఈ రెండు ఆవిష్కరణలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బోదకాలు, మలేరియా కారణంగా కోట్లాది మంది ప్రజలు మృత్యువాత పడేవారు. ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు కనుగొన్న డ్రగ్స్ ఈ వ్యాధులను అరికట్టడంలో విశేష పాత్ర వహించాయి. చైనా అకాడమీ ఆఫ్ ట్రెడిషనల్ మెడిసిన్’ విభాగంలో పనిచేస్తూ చైనా సంప్రదాయ ఔషధ మొక్కల నుంచి ‘ఆర్టెమెసినిన్’ అనే డ్రగ్‌ను 84 ఏళ్ల య్యూయు తు కనుగొన్నారు. 1930లో జన్మించిన ఆమె 1967లో మావో జెడాంగ్ ఏర్పాటు చేసిన మలేరియా డ్రగ్ ప్రాజెక్టులో చేరారు. అప్పట్లో ఈ ప్రాజెక్టును 523 అని పిలిచేవారు. రహస్యంగా జరిగిన ఈ పరిశోధనల్లో ఆమె స్వయంగా శరీరంలోకి మలేరియా పరాన్న జీవిని ఎక్కించుకున్నారు. తన ఏకైక కూతురును నర్సరీ హోంలో వదిలేసి ప్రాజెక్టులో పాల్గొన్నారు. ఓ దశలో మలేరియా కారణంగా చిక్కి శల్యమైన తనను చూసి తన కూతురు కూడా తనను గుర్తుపట్టలేక పోయిందని ఆమె స్వయంగా చెప్పుకున్నారు. 'మానవాళి ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత శాస్త్రవేత్తలది. ఆ విషయంలో నా కర్తవ్యాన్ని నేను నెరవేర్చాను. నన్ను చదివించిన నా దేశానికి ఈ రీతిగా రుణం తీర్చుకున్నాను' అని ఆమె మలేరియా డ్రగ్‌ను కనుగొన్నప్పుడు చేసిన వ్యాఖ్యలను వైద్యరంగ నిపుణులు ఇప్పటికీ గుర్తు చేస్తారు. -
రాజన్‌కు మార్కెట్ ‘గురు’ల కితాబు!
- అత్యుత్తమ సెంట్రల్ బ్యాంకర్: జిమ్ రోజర్స్ ప్రశంస - నోబెల్ ప్రైజ్‌కు అర్హుడన్న మార్క్ ఫేబర్ న్యూఢిల్లీ: ఎవరేమంటే నాకేంటి.. నా రూటే సెప‘రేటు’ అంటూ తనదైన శైలిలో ముందుకెళ్తున్న ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్‌పై దిగ్గజ ఫండ్ మేనేజర్లంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. స్టాక్ మార్కెట్ ‘గురు’గా ప్రసిద్ధి చెందిన రోజర్స్ హోల్డింగ్స్ చీఫ్ జిమ్ రోజర్స్ తాజాగా రాజన్ పనితీరుకు కితాబిచ్చారు. ప్రపంచంలోని అత్యుత్తమ సెంట్రల్ బ్యాంకర్లలో రఘురామ్ రాజన్ ఒకరని కొనియాడారు. అంతర్జాతీయంగా డాలరుతో వివిధ దేశాల కరెన్సీ విలువలు కుప్పకూలుతున్నప్పటికీ.. వర్ధమాన మార్కెట్లలో అన్నింటికంటే భారత్ మార్కెట్ పనితీరు మెరుగ్గా ఉండటానికి ఆర్బీఐ తీసుకుంటున్న నిర్ణయాలు, చర్యలే కారణమనేది విశ్లేషకుల అభిప్రాయం. ఒకపక్క, వృద్ధికి ప్రోత్సాహం ఇవ్వడం కోసం ఇతర సెంట్రల్ బ్యాంకులు తమ వడ్డీరేట్లను అత్యల్పస్థాయికి తగ్గించినప్పటికీ.. భారత్ మాత్రం ఇలాంటి పొరపాట్లకు తావులేకుండా సమర్థంగా వ్యవహరించిందని కూడా వారు చెబుతున్నారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు భారత్‌లో పెట్టుబడులకు మొగ్గుచూపుతున్నాని పేర్కొన్నారు. ‘చురుకైన, సమర్థవంతమైన వ్యక్తులకు కొదవలేకపోవడం భారత్‌కు చాలా మేలు చేకూరుస్తోంది. మరీ ముఖ్యంగా ఆర్బీఐ గవర్నర్ రాజన్‌ను గురించి చాలా చెప్పుకోవాలి. బహుశా అత్యుత్తమ సెంట్రల్ బ్యాంకర్లలో ఒకరిగా ఆయనను పేర్కొనవచ్చు’ అని రోజర్స్ తాజాగా ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. 2008 నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని ముందుగానే ఊహించిన అతికొద్దిమంది ఆర్థిక వేత్తల్లో రాజన్ కూడా ఒకరు. దీంతో ఆయన పేరు ప్రఖ్యాతులు అంతర్జాతీయంగా మార్మోగాయి. రాజన్ చెప్పే విషయాలు నిక్కచ్చిగా ఉంటాయని, అందుకే ఆయనంటే తనకు అంత గౌరవమని రోజర్స్ పేర్కొన్నారు. అయితే, దురదృష్టవశాత్తూ ఆయన భారత్ ప్రభుత్వానికి నాయకత్వం వహించడం లేదని, అందుకే దేశాన్ని కాపాడడం ఆయన చేతుల్లో లేదంటూ చలోక్తులు విసిరారు. పనితీరులో ఆయన ప్రస్తుత పంథానే అనుసరిస్తారన్న నమ్మకం మాత్రం తనకుందని రోజర్స్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, చైనా తన కరెన్సీ యువాన్ విలువను డీవేల్యూ చేయడం, అక్కడ ఆర్థిక మందగమనం కారణంగా తాజాగా ప్రపంచ మార్కెట్లు కుప్పకూలిన సందర్భంలో కూడా రాజన్ భారత్ ఆర్థిక వ్యవస్థపై పూర్తి నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇన్వెస్టర్లు ఆందోళన చెందాల్సిందేమీ లేదంటూ భరోసా ఇచ్చారు. అయితే, ప్రపంచ వృద్ధి చోదకంగా చైనా స్థానాన్ని భారత్ అందిపుచ్చుకోవాలంటే ఇంకా చాలా ఏళ్లే పడుతుందని కుండబద్దలు కొట్టడం కూడా ఆయనకే చెల్లింది. 2013లో ఆర్బీఐ పగ్గాలు అందుకున్న రాజన్... రూపాయి క్షీణతకు చికిత్స చేయడమే కాకుండా, పాలసీ నిర్ణయాల్లో ధరల కట్టడికే తొలి ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. నోబెల్ ప్రైజ్ ఇవ్వాల్సిందే: ఫేబర్ మరో స్టాక్ మార్కెట్ దిగ్గజం మార్క్ ఫేబర్ కూడా రాజన్‌ను గతంలో ప్రశంసల్లో ముంచెత్తారు. ‘సెంట్రల్ బ్యాంక్ చీఫ్‌లను సాధారణంగా నేను నమ్మను. అయితే, ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ అంటే మాత్రం అపారమైన విశ్వాసం ఉంది. ఇతర సెంట్రల్ బ్యాంకులు కరెన్సీ ప్రింటింగ్ కేంద్రాలుగా మారిపోతుంటే.. రాజన్ మాత్రం మానిటరీ పాలసీలపై తనకున్న పట్టును నిరూపించారు. పరపతి విధానాల సత్తా ఏంటో ప్రపంచానికి తెలియజేశారు. ఆయన అసాధారణ వ్యక్తి. ఆర్థిక శాస్త్రంలో కచ్చితంగా రాజన్‌కు నోబెల్ ప్రైజ్ ఇవ్వాల్సిందే’ అంటూ ఫేబర్ వ్యాఖ్యానించడం విశేషం. -
ఫ్యామిలీ ఫ్యామిలీ నోబెల్ అందుకుంది!
ఆదర్శం నోబెల్ బహుమతి అందుకోవడం అపురూపమైన ఘనత. మరి ఆ బహుమతితోనే రికార్డులు సృష్టించడం అంటే... అది ఇంకా పెద్ద ఘనత. మేరి క్యూరీకి, ఆమె కుటుంబానికి మాత్రమే సాధ్యమైన ఘనత. రేడియోధార్మికతపై పరిశోధనలు చేసి ఫిజిక్స్ పురోభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన మేరీక్యూరీ నోబెల్ పురస్కారాన్ని అందుకొన్న తొలి మహిళ. అలాగే ఆమె రెండుసార్లు నోబెల్ బహుమతిని అందుకొన్న మహిళ కూడా(ఒకటి ఫిజిక్స్‌లో, రెండోది కెమిస్ట్రీలో). కుటుంబపరంగా చూసుకొంటే క్యూరీల ఫ్యామిలీ ఐదు నోబెల్ అవార్డులు అందుకుంది. మేరీ క్యూరీ రెండు, భర్త పియరీ క్యూరీ ఒకటి (మేరీతో పాటు భౌతికశాస్త్ర విభాగంలో). ఆ తర్వాత మేరీ పెద్ద కూతురు ఇరేన్ జూలియట్ క్యూరీ, ఇరేన్ భర్త 1935లో కెమిస్ట్రీ విభాగంలోనూ, మేరీ చిన్న కూతురు ఈవ్ క్యూరీ యూనిసెఫ్ డెరైక్టర్‌గా 1965లోనూ నోబెల్ అందుకున్నారు. -
గ్లోబల్... నోబెల్
యువత 2014 శాంతిస్థాపన యత్నానికి అత్యున్నత పురస్కారం.. అపారమైన ప్రతిభకు అవధుల్లేని అవకాశాలు.. ఎవరెస్ట్ స్థాయి సాహసాలు.. ఆటల్లోనూ అబ్బురపరిచే విన్యాసాలు.. మొత్తంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో యువతకు కలిసొచ్చిన సంవత్సరం 2014. ఈ ఏడాదిలో అనేక యువకిరణాలు ఉదయించాయి. వ్యాపార, క్రీడ, సామాజిక, ఆర్థిక రంగాల్లో అనేక మంది యువతీయుకులు తమ ప్రతిభాపాటవాలను చాటారు. నోబెల్ బహుమతి... ఈ బహుమతి స్థాయిని బట్టి, తలపండిన వారికే దక్కుతుందనుకోవడం చాలా సహజమైన అభిప్రాయం. అయితే అలాంటి అంచనాలకు భిన్నంగా ఒక 17 యేళ్ల యువతికి నోబెల్ బహుమతి దక్కింది. అది కూడా శాంతి పరిరక్షణకు గానూ.. దక్కిన నోబెల్ శాంతి బహుమానం. ఈ ఏడాది యువతకు సంబంధించి ప్రముఖంగా ప్రస్తావించుకోవాల్సిన విషయం ఇది. యువ శక్తి ఉద్యోగం సంపాదించుకొనేంత స్థాయికో, కొత్త ఆవిష్కరణ చేపట్టడానికో పరిమితం కాదు... టీనేజ్లోనే నోబెల్‌ను సాధించుకొనే స్థాయి వరకూ ఎదిగిందనే సందేశాన్ని ఇచ్చింది పాకిస్తాన్ యువతి మలాలాకు దక్కిన ఈ ఖ్యాతి. మలాలానే ఈ ఏడాదికి ‘యూత్ ఆఫ్ ది ఇయర్’ అని చెప్పవచ్చు. ఎవరెస్ట్నూ అధిరోహించేశారు! ఈ ఏడాది భారతీయ యువతకు దక్కిన ఖ్యాతి ఇది. తెలుగువాళ్లు అయిన మలావత్ పూర్ణ, సద్దనపల్లి ఆనంద్‌లు ఎవరెస్ట్‌ను అధిరోహించి ఆ శిఖర స్థాయి పేరు ప్రఖ్యాతులను సంపాదించుకొన్నారు. టీనేజర్ పూర్ణ ఎవరెస్ట్‌ను అధిరోహించిన అత్యంత పిన్నవయస్కురాలు కూడా. వీరి విజయానికి తెలుగుగడ్డ నీరాజనాలు పల్కింది జీతాలు కోట్లకు చేరాయి! ఐదంకెల జీతం ఇన్ని రోజులకూ గొప్ప. అయితే ఇప్పుడు ఐదుకు మరో రెండంకెలను జోడించి ఆ మొత్తాన్ని భారతీయ విద్యార్థులకు ప్యాకేజీలుగా ఇవ్వడానికి ముందుకొచ్చాయి అనేక కంపెనీలు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో విద్యాభ్యాసం చేస్తున్న అనేక మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్‌కు చదువు పూర్తి కాకుండానే ఇలాంటి ఆఫర్లు వచ్చాయి. గూగుల్ వంటి దిగ్గజాలు భారతీయ విశ్వవిద్యాలయాల్లో నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలలో సంచలనాలే నమోదయ్యాయి. వార్షిక వేతనం కోటి, కోటిన్నర రూపాయల స్థాయిలో ఉండే ఉద్యోగాలు మనవాళ్లను పలకరించాయి. కోటి రూపాయల వేతనం! 2014 మెమరబుల్ ఇయర్.. ఇదే ఏడాది స్టూడెంట్స్ ఎక్సేంజ్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఒక సెమిస్టర్ సింగపూర్‌లో చదివాను. సామ్‌సంగ్‌లో ఇంటర్న్‌షిప్ చేయడం మంచి అనుభవాన్ని మిగిల్చింది. అందులోనే ఉద్యోగం రావడం, అదీ కోటి రూపాయల భారీ వేతనంతో ఉద్యోగం రావడం సంతోషంగా ఉంది. ఈ ఏడాదితో నా విద్యార్థి జీవితం ముగుస్తుంది. 2015 నుంచి బాధ్యత గలిగిన ఉద్యోగిగా మారాలి. అయితే నా జీవితంలో ఇది ఒక మైలురాయి అని చెప్పడం కష్టం. ప్రతిదీ ఒక లెర్నింగ్ ఎక్స్‌పీరియెన్స్ అనే చెప్పాలి. ఐఐటిలో సీటు కోసం కోచింగ్ దగ్గర నుంచి ఐఐటి క్యాంపస్‌లో చదువు అన్నీ ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్పించాయి. - ఇమ్మడి పృథ్వితేజ్, ముంబయి ఐఐటి విద్యార్థి -
పాక్ ధీర బాలికకు శాంతి బహుమతి
-
నోబెల్ విశేషాలు వివాదాలు
డిసెంబరు 10 న నోబెల్ వర్ధంతి. 9న అస్లో సిటీలోని ‘నార్వీజియన్ నోబెల్ ఇన్స్టిట్యూట్’లో నోబెల్ పురస్కార కార్యక్రమం జరుగుతుంది. 10న వారందరితో ఒక ఫోటోసెషన్ వుంటుంది. అమెరికా, జపాను, జర్మనీ, ఫ్రాన్సు, నార్వే, ఇండియా, పాకిస్తాన్ దేశాల నుంచి ఈ ఏడాది 13 మంది ఈ పురస్కారాన్ని అందుకోబోతున్నారు! ప్రపంచంలో చాలా దేశాలలో అవార్డుల ప్రదాన సంప్రదాయం వుంది. అయినప్పటికీ నోబెల్ అవార్డుకు వున్న ప్రఖ్యాతి వేరు. దాని ద్వారా వచ్చే కీర్తీ ఎక్కువే. రివార్డూ ఎక్కువే. నోబెల్ ప్రారంభ సంవత్సరాలతో పోల్చుకుంటే ఇప్పుడు వచ్చే పారితోషికం కూడా చాలానే పెరిగింది. 2013లో అన్ని రంగాలకు కలిపి 343 కోట్ల 70 లక్షల రూపాయలు ఇచ్చారు. డబ్బు అని కాదు. ప్రచారం కూడా అంతే. అదొక అంతర్జాతీయ ఖ్యాతి. అందుకే ఈ అవార్డులో నామినేషన్ల నుంచి ఎంపిక దాకా ప్రలోభాలు వుంటాయి. ప్రభావాలూ వుంటాయి. విశేషాలు, వివాదాలు ఉంటాయి. ఆ వివరాలే ఈవారం మన ‘వివరం’. ఆల్ఫ్రెడ్ నోబెల్ పుట్టింది స్వీడన్లో. పెరిగింది నార్వేలో. చనిపోయింది ఇటలీలో. నోబెల్ పుట్టే సమయానికి అంటే 1833 నాటికి నార్వే స్వీడన్ ఆక్రమణలో వుంది. అంతకు మునుపు అంటే 1380 నుంచి 1814 దాకా డెన్మార్కు ఆక్రమణలో వుంది. నార్వే కూడా తక్కువేమీ కాదు 13వ శతాబ్దం వరకూ తనదీ ఆక్రమణల చరిత్రే. ఐస్లాండ్, గ్రీన్లాండ్, షట్లాండ్లను తానూ ఆక్రమించుకుని పెత్తనం చేసింది. ప్రపంచ యుద్ధకాలంలో జర్మనీ చేతిలోకి వెళ్లిపోయింది. నార్వేకి ఉన్నది చాలా చిన్న చరిత్ర. ఉన్న ఆ చరిత్ర కూడా ఆక్రమణల చరిత్రే. చేపలకోసం, జంతువులకోసం వేటాడుతూ ఇక్కడకొచ్చి స్థిరపడి ఇనుము, ఇత్తడి యుగాల్లో వ్యవసాయం చేసుకుంటూ గేదెలమీదా, పాలమీదా ఆధారపడి బ్రతికిన పదివేల ఏళ్లనాటి చరిత్రను పక్కన పెడితే క్రీ.శ.1030లో ‘క్రిష్టియానిటి రాజ్యం’ కింద బ్రతకడం మొదలు పెట్టిన దగ్గర్నుంచీ, నార్వేదంతా ఆక్రమణల చరిత్రే. అయితే 1350లో ప్లేగు వ్యాధి వ్యాపించి దేశంలో సగం మంది చనిపోయారు. ఇక అక్కడి (ఇతరులను ఆక్రమించే స్థితి నించి) ఇతరుల ఆక్రమణలోకి నార్వే వెళ్లిపోయింది. నోబెల్ విల్ 1905లో నార్వే స్వతంత్రతను ప్రకటించుకోవడానికి సరిగ్గా అయిదేళ్లకు ముందు అంటే 1900ల్లో ‘నోబెల్ ఫౌండేషన్’ ఏర్పడింది. దీనికి అయిదేళ్లకు ముందు 1895 నవంబరు 25న నోబెల్ తన వీలునామా రాశాడు. దాని పేరు ‘ఆఖరి వీలునామా’. దీన్ని పారిస్‌లోని ‘స్వీడిష్ నార్వీజియన్ క్లబ్’లో భద్రపరచి, తన తదనంతరం అమలు పరచమన్నాడు. మానవాళికి ప్రయోజనం కలిగించే పరిశోధనలకు తన పేరుతోవున్న అవార్డులను ఇవ్వమని, ఆ అవార్డులకయ్యే ఖర్చునంతటినీ తన సంపద ద్వారా వచ్చే వార్షిక ఆదాయం నించి వాడమని చెప్పాడు. సహజంగానే ఆస్తివున్న చోట వారసత్వం వుంటుంది. ఆ వారసత్వం దీనికి ఒప్పుకోలేదు. ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకున్నా వీలునామా తన పని తాను చేసుకుపోతుంది. వారసులకు కోపమొచ్చింది. అపారమైన సంపద పరులపరం కావడం సహించలేక నోబెల్ మీద కోపంతో ఆ అవార్డుకు నోబెల్ పేరును తొలగించాలని చూశారు. సాధ్యపడలేదు. వీలునామా దానికి సహకరించలేదు. నోబెల్ గురించి కొంచెం నోబెల్ బాలమేధావి. పరిశోధనా పిపాసి. పదిహేడేళ్లకే రష్యా, ఫ్రెంచి, జర్మనీ, ఇంగ్లిషు భాషలు నేర్చుకున్నాడు. కెమికల్ ఇంజనీరు. అనేక రంగాల మీద అనేక పరిశోధనలు చేశాడు. అనేక పుస్తకాలు రాశాడు. తన పరిశోధనల మీద పేటెంట్ రైట్స్ కూడా తీసుకున్నాడు. అదీ ఇదీ అని లేకుండా అన్ని వ్యాపారాలూ చేశాడు. దీంట్లో తండ్రి ఇమ్మానియేలు అతనికి ఆదర్శం. ఆయన తిరగని దేశం లేదు. చేయని వ్యాపారమూ లేదు. సంతానం అంతా ఇదే పని. వీరికి ఇరవై దేశాలలో తొంభై వ్యాపారాలు వున్నాయి. నోబెల్ పేదల కోసం చేసింది ఏమీ లేదు. పేదరికం మీద ఆలోచించింది అంతకన్నా లేదు. అతనికి సైన్సు పట్ల, సాహిత్యం పట్ల, పరిశోధనల పట్ల ఆసక్తి వుంది. ఆ ఆసక్తి నుంచి వచ్చిన ఆశయమే ‘నోబెల్ అవార్డు’. 1895 నాటికి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెడిసిన్ (ఫిజియాలజీ కూడా), సాహిత్యం, శాంతి, ఇవి మాత్రమే నోబెల్ అవార్డు పరిధిలో వుండేవి. 1968లో ఎకనామిక్స్‌ను చేర్చారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్‌లను ఎంపిక చేసే పనిని ‘రాయల్ ఎకాడమి ఆఫ్ సైన్సు’ చూస్తుంది. మెడిసిన్ ఫిజియాలజిని ‘నోబెల్ అసెంబ్లీ ఎట్ కరోలిన్స్కా’ చూస్తుంటుంది. అలాగే సాహిత్యాన్ని ‘స్వీడిష్ అకాడమీ’, శాంతి అవార్డును ‘నార్వీజియన్ నోబెల్ ఇన్స్టిట్యూట్’ సహకారంతో ‘నార్వే పార్లమెంటు’ చూస్తుంది. దీంట్లో నార్వే ప్రధాని, విదేశాంగ మంత్రి, ఇద్దరు పార్లమెంటు సభ్యులతో పాటుగా న్యాయశాస్త్ర ఆచార్యుడొకరు వుంటారు. మలాలాకు ఎలా ఇస్తారు? నోబెల్ పేరుతో ఇచ్చే అవార్డుల్లో మిగతావన్నీ ఒక ఎత్తు కాగా, ‘శాంతి’ పేరుతో ఇచ్చే ఈ అవార్డు ఒక్కటీ ఒక ఎత్తు. నోబెల్ ఏ స్ఫూర్తితో ఈ అవార్డును నెలకొల్పాడో దానికి పూర్తి విరుద్ధంగా అనేకమార్లు ఈ అవార్డు దుర్వినియోగం అయ్యింది. అవుతూనే వుంది. మలాలా, సత్యార్థుల విషయంలో అది మరొకసారి రుజువయ్యింది. ఈ ఇద్దరూ బాల బాలికల కోసం కృషి చేసి వుండవచ్చు. వారి కోసం తమ జీవితాల్ని అంకితం చేసి వుండవచ్చు. కాని అలాంటి కృషికి తన ‘శాంతి అవార్డు’ను ఇవ్వమని నోబెల్ ఎక్కడా చెప్పలేదు. ఇస్లామిక్ తీవ్రవాదుల్ని రెచ్చగొట్టటానికీ, అమెరికాను సంతృప్తి పరచడానికీ ఐక్యరాజ్య సమితి సలహా మేరకు ‘మలాలా’లకు ఈ అవార్డును ఇచ్చారు. మలాలాకు ఇవ్వాలి కాబట్టి సత్యార్థికీ ఇచ్చారు. ఒబామా శాంతి దూతా? ఇలాంటి దుర్వినియోగమే అమెరికా కోసం 2009లో ఒకసారి జరిగింది. ఒబామా అమెరికాకు ప్రెసిడెంటు అయిన 9 నెలలకే ‘ప్రపంచ ప్రజల మధ్య అంతర్జాతీయ సంబంధాలను మెరుగుపరచడానికి చేసిన కృషికి గాను ఆయనను ఆ ఏడాది శాంతి పురస్కారంతో సత్కరించారు. తాలిబన్ల చేతిలో కూలిపోయిన ‘వరల్డ్ ట్రేడ్ సెంటర్’ శకలాలను తొలగించడానికే అమెరికాకు ఆరు నెలలు పట్టింది. అలాంటిది తొమ్మిది నెలల్లో అంతర్జాతీయ సంబంధాలను ఒబామా మెరుగుపరచగలడా? ఇదే ప్రశ్నను అప్పట్లో ‘నోబెల్ కమిటీ’ని మీడియా అడిగింది. ‘‘ఇస్లామిక్ దేశాలలో ఉద్రిక్తతల్ని తగ్గించడానికీ, ఆయా దేశాలలో మోహరించిన సైన్యాన్ని కుదించడానికీ, అణ్వాయుధాల తయారీని తగ్గించడానికీ ఒబామా కృషి చేశారు. పదవిలోకి వచ్చిన మూడు మాసాలకే ఈ విషయం మీద రష్యాతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ‘అందుకే ఆయన్ని ఈ ఏడాది శాంతి దూతగా గుర్తించామని’’ కమిటీ వైస్ ఛైర్మన్ తర్బోజన్ జంగ్లాండ్ జవాబిచ్చారు. నిజానికి ఈ జవాబుకి అమెరికా ప్రెస్సే నవ్వింది. ఛలోక్తులు విసిరింది. ఒబామా వచ్చిన తర్వాత అరబ్బు నేలపై ఉద్రిక్తతలు పెరిగాయి. సైన్యాన్ని పెంచారు. విస్తరించారు. ‘న్యూక్లియర్ వెపన్’ విషయంలో అమెరికాది ఎప్పుడూ గురివింద గింజ సామెతే. సరే. ఒబామా విషయంలో కమిటి చెప్పిందే నిజమనుకుందాం. కొద్దిసేపు ఆయన్ను శాంతి కపోతమనే అనుకుందాం. అయితే అధికారానికి వచ్చిన 12వ రోజుకే ఆ కపోతం శాంతికై పైకి ఎగిరిందా? ఈ అసలు రహస్యాన్ని ఎవ్వరూ పట్టుకోలేదు గానీ ఒబామా ప్రెసిడెంటు పదవిలోకి వచ్చిన 12వ రోజునే నామినేషను పత్రాలు ‘నార్వీజియన్ నోబెల్ ఇన్స్టిట్యూట్’కి చేరాయి. అప్పుడే ఆ ఎంపిక జరిగిపోయింది. ఈ ప్రశ్న తర్బోజన్ని మీడియా అడిగి ఉంటే అప్పుడాయన ఏం చెప్పి వుండేవారో? చైనా దుష్టత్వం - అమెరికా కపటత్వం! 2010లో ఇలాంటిదే కాకపోయినా ఇంచుమించు ఇలాంటి దుర్వినియోగమే ఇంకోటి జరిగింది. దాంట్లో కూడా అమెరికా హస్తముందని చెప్పుకున్నారు. ‘లియోబియోబో’ అని చైనా హక్కుల కార్యకర్త. ‘అహింసా మార్గంలో మానవ హక్కుల కోసం పోరాడిన వ్యక్తి’గా ఆ సంవత్సరానికి అతనికిచ్చారు. చైనా ప్రభుత్వం అతణ్ణి చాలా కాలంపాటు జైల్లోనే వుంచింది. ఈ అవార్డును అందుకోవడానికి వెళ్లనివ్వలేదు. చివరికి అతని తరపున అతని బంధువులని కూడా వెళ్లనివ్వకుండా చైనా ఆంక్షలు పెట్టింది. ఆ రకంగా చైనా తన ‘సోషలిస్టు దుష్టత్వాన్ని’ ప్రదర్శించుకుంది. ఈ విషయాన్ని పక్కన పెడితే, ‘నేషనల్ ఎండోమెంట్ ఫర్ డెమొక్రసీ’ అని వాషింగ్టన్లో ఒక స్వచ్చంద సంస్థ వుంది. దానికి అమెరికా ప్రభుత్వంలోని హోమ్ శాఖ నుంచి నిధులు వస్తుంటాయి. అమెరికా తనకు ప్రత్యర్థిగా ఎదుగుతున్న దేశాల్లోని అంతర్గత విషయాల్లోకి ఈ సంస్థను ప్రయోగిస్తుంటుంది. ఈ సంస్థ నుంచి ‘లియోబియాబో’కి ఫండ్సు వస్తుంటాయని, ఆ డబ్బుతోనే అతను చైనాలో పని చేస్తుంటాడనే విషయం బైటికొచ్చింది. అతనికి వచ్చిన ‘నోబెల్ అవార్డు’ వెనక అమెరికా వుందనే విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ప్రపంచ వ్యాపితంగా మానవ హక్కులను మంటగలుపుతున్న అమెరికా ‘చైనా మానవ హక్కుల కోసం’ ఆరాటపడడం, అందుకోసం అతనికి అవార్డు ఇప్పించడం, నార్వే ఇవ్వడం రెండూ విడ్డూరంగా జరిగిపోయాయి. శాంతికి ఛాంపియనా? 2012లో శాంతి పురస్కారం ‘యూరోపియన్ యూనియన్’కి దక్కింది. ఈ యూనియన్‌లో మొత్తం 28 దేశాలుంటాయి. నోబెల్ అవార్డును వ్యక్తులకూ ఇవ్వవచ్చు. సంస్థలకూ ఇవ్వవచ్చు. అలా అని నోబెలే తన వీలునామాలో చెప్పాడు. ‘యూరప్‌లో మానవ హక్కుల కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, శాంతిని నెలకొల్పడం కోసం ఆరు దశాబ్దాలుగా చేస్తున్న కృషికి గాను ఈసారి శాంతి అవార్డును యూనియన్‌కి ఇచ్చామని కమిటీ చెప్పుకుంది. అరబ్బు నేలపై యుద్ధాన్ని చేసే ప్రతి సందర్భంలోనూ అమెరికా ఒక ‘సంకీర్ణ కూటమి’ని తయారు చేస్తుంది. ఆస్ట్రియా, ఫ్రాన్సు, జర్మనీ, ఇటలీ, బ్రిటను ఈ కూటమిలో వుంటాయి. ‘యూరప్ యూనియన్’లో ఈ దేశాలదే ప్రముఖ పాత్ర. ఆ కృతజ్ఞతతోనే అమెరికా ఆ అవార్డును ఇప్పించిందనే విమర్శలు వెల్లువెత్తాయి. ‘శాంతికి యూరోపియన్ యూనియన్ ఏమైనా ఛాంపియనా?’ అనే హెడ్డింగులతో పత్రికలు విమర్శలు కూడా రాశాయి. శాంతే కాదు; సైన్సూ అంతే! శాంతి పురస్కారాలలోనే కాదు. శాస్త్ర, సాహిత్య పురస్కారాలలో కూడా ‘నోబెల్’ వివాదాల్లో కూరుకుపోయిన సందర్భాలు ఎన్నో వున్నాయి. ‘గ్రీన్ ఫ్లోరోసెంట్ ప్రొటీన్’ అనే సబ్జక్టు మీద రోజర్ వైసైన్, వసామూ షిమోమురా, మార్టిన్ చెలిఫ్ అనే ముగ్గురికి ‘కెమిస్ట్రీ అవార్డు’ను 2008లో ఇచ్చారు. నిజానికి ఈ ఫార్ములా వీరిది కాదు. డగ్లస్ ప్రెషర్ అనే అత నిది. అవార్డు వచ్చిన ముగ్గురిలో ఒకరైనా రోజర్ వైసైన్ ‘ప్రెషర్’కి స్నేహితుడూ, శిష్యుడు కూడా. ఇతను ప్రెషర్‌తో వుంటూనే, ‘నోబెల్ అవార్డు మీకు తప్పకుండా వస్తుంది. అందుకు నా వంతు కృషి నేను చేస్తానని మాయమాటలు చెప్పి నమ్మించి, ఈ ఫార్ములా రూట్‌ని తెలుసుకుని, మిగతా ఇద్దరికీ చేరవేశాడు. వారు ముగ్గురూ దాన్ని తమదిగా బిల్డప్ చేసి ‘నోబెల్ కమిటి నామినేషన్’కు పంపారు. అవార్డు వారికి వచ్చింది. అప్పుడు తేరుకున్న ప్రెషర్ ‘ఈ ఫార్ములా నాది’ అని కమిటీకి తెలియజేసి కొన్ని ఋజువుల్ని పంపాడు. ఈ తప్పు సరిదిద్దవలసిన ‘రాయల్ స్వీడిష్ అకాడమి ఆఫ్ సెన్సైస్’ వారు ‘‘నువ్విప్పుడు శాస్త్ర వృత్తిలో లేవు. డ్రైవింగ్ వృత్తిలో వున్నావు. కాబట్టి నీకీ అవార్డు రాదని’’ సమాధానం ఇచ్చారు. ఆ అవార్డు వచ్చే సమయానికి అతను బస్సు డ్రైవరుగా పనిచేస్తున్న మాట నిజమే. అతని ఆర్థిక పరిస్థితి అలాంటిది. అంత మాత్రాన అతను ఆ అవార్డుకు అర్హుడు కాకుండా పోతాడా? నిజానికి ప్రెషర్‌కి రోజర్ చేసిన ‘గురుద్రోహం’కన్నా, నోబెల్ కమిటి చేసిన ‘సాంకేతిక ద్రోహమే’ ఘోరమైనది. కెమిస్ట్రీ అవార్డు మీదే ఇంకో వివాదం వుంది. ‘కేటలిస్టిక్ ఎఫెక్ట్ ఆన్ మెటల్ సర్ఫేసెస్’ (లోహ ఉపరితలంపై ఉత్ప్రేరకాల ప్రభావం) అనే ప్రతిపాదనకు గాను గెర్హార్ట్ ఇర్టిల్ అనే అతనికి 2007లో అవార్డు ఇచ్చారు. నిజానికి ‘మోడరన్ సర్ఫేస్ సైన్స్ అండ్ కెటాలిసిస్’ (ఆధునిక ఉపరితల శాస్త్రమూ, ఉత్ప్రేరకాలూ) అని ఇర్టిల్ కన్నా ముందే గేబర్ సముర్జాయ్ అనే అతను ఒక ప్రతిపాదనను చేసి వున్నాడు. అతను చేసిన ప్రతిపాదనలో ఇర్టిల్ది ఒక పార్టు మాత్రమే. ఒక రకంగా దీనికి పితామహుడు గేబర్ సముర్జాయే. కాని నోబెల్ కమిటీ మాత్రం (2007లో) గెర్హార్ట్ ఇర్టిల్కి మాత్రమే అవార్డు ఇచ్చింది. దీనిపై అనేకమంది శాస్త్రవేత్తలు విమర్శలు గుప్పించారు. పొలిటికల్ నోబెల్! నోబెల్‌ని ‘వివాదాల నోబెల్’గా అర్థం చేసుకున్నట్లుగానే ‘పొలిటికల్ నోబెల్’గా అర్థం చేసుకుంటే సముచితంగా వుంటుంది. చెప్పాలంటే ‘అమెరికా నోబెల్’గా అర్థం చేసుకోవడం ఇంకా అర్థవంతంగా వుంటుంది. ఇందులో అతిశయోక్తి ఏమీ వుండకపోవచ్చు. 1901 నించి 2012 వరకు 856 మందికి నోబెల్ అవార్డులు ఇస్తే ఒక్క అమెరికాకు చెందిన వారికే 353 మందికిచ్చారు. అంటే దానర్థం మేధస్సూ, పరిశోధనా, సాహిత్య తపనా, శాంతి అమెరికా సొత్తు అనా? కాదు. అయిల్ పైన, ఆయుధాలపైనా అమెరికాకు ఎంత గుత్తాధిపత్యం వుందో ‘నోబెల్’ పైనా అంతే గుత్తాధిపత్యం వుందని దానర్థం. ఇదీ నోబెల్ కథ. నోబెల్ వివాదాల కథ. - నన్నూరి వేణుగోపాల్ హిట్లర్‌కి కోపమొచ్చింది! 1936లో కార్ట్ వన్ ఓసిటిజ్కి అనే అతనికి నోబెల్ అవార్డును వచ్చింది. ఇతను ప్రఖ్యాతిగాంచిన జర్మన్ రచయిత. నాజీ సిద్ధాంతాన్నీ, హిట్లర్నీ వ్యతిరేకిస్తూ సాహసోపేతమైన రచనల్ని రాశాడు. ఇతనికి అవార్డు రావడంతో హిట్లర్ సహించలేక పోయాడు. ‘జర్మన్ ప్రజలు ఎవ్వరూ కూడా ఇకపై నోబెల్ ప్రైజ్‌ని తీసుకోవద్దని ఒక హుకుం జారీ చేశాడు. దాంతో 1938లో కెమిస్ట్రీకీ, 1939లో మెడిసిన్, కెమిస్ట్రీలకూ నోబెల్ అవార్డులు వచ్చినప్పటికీ హిట్లర్‌కి భయపడి ఆ అవార్డులను వారు తీసుకోలేకపోయారు. పురస్కార తిరస్కారం! 1964లో సాహిత్యానికిగాను జీన్‌పాల్ సర్ట్రి అనే అతనికి అవార్డు ఇస్తే అతను తిరస్కరించాడు. 1973లో ‘లిడ్యురాతో’ అనే అతనికి ‘ప్యారిస్‌లో శాంతిని నెలకొల్పాడు’ అంటూ అవార్డును ఇస్తే అతను ‘వియత్నాం ఒక ప్రక్కన అశాంతితో అల్లాడుతుండగా ఈ అవార్డును నేను తీసుకోను’ అని అవార్డును తిరస్కరించి తన నిరసనను ప్రకటించాడు. మొత్తం నోబెల్ అవార్డు ‘వందేళ్ల చరిత్ర’లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ‘శాంతి పురస్కారాన్ని’ సిద్ధాంతం కోసం తిరస్కరించిన ఏకైక వ్యక్తి ఇతనే కావచ్చు. నోబెల్ ఆత్మహత్యలు! ఇప్పటిదాకా మనం నోబెల్ అవార్డు దుర్వినియోగాన్ని చూశాం. వివాదాల్ని చూశాం. తిరస్కరణల్నీ చూశాం. దీంట్లో ఇంకో కోణం వుంది. అది ఆత్మహత్యల కోణం. అయితే ఈ అవార్డుకి ఈ మరణాలకి సంబంధం లేదుగానీ ఆ స్థాయి వాళ్లు ఆత్మహత్యలు చేసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 1968లో సాహిత్యానికిగాను ‘ఎసూనారి కవాబాట’కి అవార్డు ఇచ్చారు. అతను ‘జపాన్, ది బ్యూటిఫుల్ అండ్ మైసెల్ఫ్’ అని జపాను సంస్కృతి మీద ఒక థీసీస్ రాశాడు. ఈ అవార్డు అందుకున్న నాలుగేళ్లకు అంటే 1972లో బాత్రూమ్లో గ్యాస్ పైపు లీక్ అయ్యి చనిపోయాడు. దానంతట అది యాక్సిడెంటల్‌గా లీకు అయ్యికాదు; తానే లీక్ చేసుకుని చనిపోయాడు. కవాబాటకు ‘యుకియో మిషియా’ అనే ఒకామెతో వివాహేతర సంబంధం వుందని, ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని, ఆ షాక్ వలనే ఇతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడనే నిజం ఒకటి ఆ తర్వాత బైటకొచ్చింది. 1972లోనే ‘స్టాన్ఫోర్డ్మూరి’ అనే అతనికి కెమిస్ట్రీ క్రింద నోబెల్ అవార్డునిచ్చారు. అతను ‘ఎమియోట్రాపిక్ లేటరల్ సిరియోసిస్’ అనే కండరాల నరాల జబ్బు వలన ఆత్మహత్య చేసుకున్నాడు. కేన్సర్ మీద రీసెర్చి చేసినందుకు ‘క్రిష్టియన్ డి దువే’ అనే అతనికి 1974లో మెడిసిన్ విభాగంలో అవార్డునిచ్చారు. అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్న అతను ఆ వ్యాధిని భరించలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అయితే యూరప్‌లో అప్పటికే రైట్ టు డై అనే చట్టం వుంది. ఆ చట్టాన్ని ఉపయోగించుకుని ప్రభుత్వానికి అప్పీలు చేసుకుని ప్రభుత్వ అనుమతితో ఆత్మహత్య చేసుకుని మరణించాడు.ఈ మరణం మీద ఎటువంటి వివాదమూ లేదుగాని ‘అతని అప్పీలును ప్రభుత్వం శాస్త్ర బద్ధంగా పరిశీలించకుండానే అతనికి ఆ అవకాశం ఇచ్చిందనే విమర్శ మాత్రం వుంది. గాంధీకి ఎందుకివ్వలేదు? మొత్తం మీద ‘వివాదాల నోబెల్’ అనదగ్గ అవార్డు ఇది. బహుశా ప్రపంచంలో మరే ఇతర అవార్డుకీ లేనంత వివాదం ఈ అవార్డుకు వుంది. అన్నిటిలోకి పెద్ద వివాదాస్పదమైన విషయం ఏమిటంటే గాంధీకి ఈ అవార్డు ఇవ్వకపోవడం. ‘రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్ని తగ్గించి వాటి మధ్యన శాంతిని నెలకొల్పే విషయంలో విశేషంగా కృషి చేసిన వారికి మాత్రమే ఇవ్వాల్సిన శాంతి పురస్కారాన్ని ఏనాడో దారి తప్పించారు. అహింసా మార్గంలో కృషి చేసేవారికీ, అంతర్జాతీయంగా ప్రజల మధ్య సంబంధాలు పెంచేవారికీ కూడా ఇవ్వడం మొదలు పెట్టారు. ఆ అర్థంలో గాంధీకి ఇవ్వాలి కదా? కాని ఇవ్వలేదు. ప్రపంచ వ్యాపితంగా ‘అహింసా వాది’గా పేరు పొందిన గాంధీకి ఈ అవార్డును ఇవ్వకపోవడం ఇప్పటికీ చాలా మందికి ఆశ్చర్యం కలిగించే విషయం. అంతకన్నా ఆశ్చర్యం ఏమిటంటే, ఒక మనిషి ఒక పరిశోధన చేసి ‘నా పరిశోధనను గుర్తించండి’ అంటూ అవార్డుకోసం అర్రులు చాచడంలో అర్థం వుంటుంది. శాంతి కోసమో, అహింస కోసమో నిలబడిన వారు ‘తమను గుర్తించండి’ అంటూ అప్లికేషన్లు పెట్టుకోవడమేమిటి? గాంధీ కోసం భారతదేశం నుంచి ఒకసారి కాదు; 1937 నించి 1948 వరకూ అయిదుసార్లు నామినేషన్ పత్రాలు నార్వేకి వెళ్ళాయి. వెళ్లిన ప్రతిసారీ వాటిని వారు తిప్పికొట్టారు. అయినా వీరు పంపిస్తూనే వున్నారు. చివరకు ‘ఆ పేరుతో వచ్చే నామినేషన్లు తీసుకోవద్దు’ అని తీర్మానం కూడా వారు చేశారు! నోబెల్ అవార్డు రాజకీయాలకు తలొగ్గి వుంటుందనేదానికి గాంధీది ఒక చక్కటి వుదాహరణ. గాంధీకి అవార్డుకోసం ప్రయత్నించిన ఆ కాలమంతా నార్వే జర్మనీ ఆక్రమణలో వుంది. రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్‌కీ, జర్మనీకీ శతృత్వం వుంది. ఆ కాలమంతా మనది ఇండియా కాదు, బ్రిటీష్ ఇండియా. గాంధీ బ్రిటీష్ ఇండియాలో భాగం. బ్రిటీష్ వారిని వెళ్లగొట్టడానికి ‘సుభాష్ చంద్రబోసు’ జర్మనీతో చేతులు కలపడాన్ని గాంధీ తీవ్రంగా వ్యతిరేకించాడు. అలాంటి కారణాలు ఇంకా వున్నాయి. గాంధీ సినిమాకి అమెరికా ‘ఆస్కార్’ ఇచ్చినంత ఈజీగా గాంధీకి నోబెల్ ఇవ్వడానికి జర్మనీ ఆనాడు సిద్ధంగా లేదు. జర్మనీని కాదని అడుగువేయడానికి నార్వేకి స్వేచ్ఛ లేదు. ఆ రకంగా ఆ అవార్డును అందుకోకుండానే గాంధీ చనిపోయారు. గాంధీకి అవార్డును ఇవ్వకపోవడం నోబెల్ చరిత్రలో మచ్చగా మిగిలిపోయింది. ఆ మచ్చనుండి బైట పడడానికి 1948లో ‘శాంతి అవార్డును అందుకోవడానికి ఈ ఏడాది ఎవ్వరూ లేర’ని కమిటీ ప్రకటించింది. ఎందుకంటే ఆ ఏడాదే గాంధీ మరణించాడు కాబట్టి. మరణించిన వారికి కూడా ‘భారత రత్న’ ఇచ్చే సంప్రదాయం మనకి వున్నట్లుగా మరణించిన వారికి ‘నోబెల్’ని ఇచ్చే సంప్రదాయం వారికి లేదు. -
డాటర్ ఆఫ్ కైలాష్ సత్యార్థి
కైలాష్ సత్యార్థిని నోబెల్ శాంతి బహుమతి వరించడం... యావత్ భారతదేశానికి సంతోషకరమైన విషయం. ఆయనతో ఎలాంటి వ్యక్తిగత పరిచయం లేని వారికి కూడా, ఆయన సేవాకార్యక్రమాలను గురించి, ఆయన సామాజిక నిబద్ధత గురించి వివరంగా తెలుసు. అలాంటి వారందరికీ నోబెల్ వార్త ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. మరి కైలాష్ సత్యార్థి కూతురు అస్మిత పరిస్థితి ఏమిటి? నాన్నకు నోబెల్ బహుమతి ప్రకటించారు... అనే శుభవార్త తెలియగానే ఆమె ఎలా స్పందించారు? ‘‘ఆ వార్త తెలియగానే ఎక్కడ లేని సంతోషం కలిగింది. ఆయన చేపట్టిన కార్యక్రమాలను చూస్తూ పెరిగాను. వాటిలో భాగం పంచుకున్నాను’’ అన్నారు అస్మిత. నాన్నతో సంతోషం పంచుకోవడానికి ఆయన కార్యాలయానికి వెళ్లారు అస్మిత. తాను ఊహించినట్లుగా... ఏమీ కనిపించలేదు ఆయన. ఎప్పటిలాగే ఉన్నారు. ‘‘నాకంటే ముందు గాంధీజీకి రావాల్సింది’’ అన్నారు ఆయన, నోబెల్ బహుమతిని ప్రస్తావిస్తూ. గాంధేయవాది అయిన కైలాష్ మాటల్లో ఎక్కడా గర్వపు నీడ కనిపించలేదు. ఆ కళ్లు ఎప్పటిలాగే ‘‘చేయాల్సింది చాలా ఉంది’’ అని చెబుతున్నట్లుగానే ఉన్నాయి. హైదరాబాద్‌లోని ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్’ (ఐఎస్బి) స్టూడెంట్ అయిన అస్మిత సత్యార్థి సామాజిక మార్పులో వ్యాపారం ఎంత కీలకమో చెబుతారు. నాన్న తన రోల్‌మోడల్. ఆయన ఆదర్శ భావాలతో లోతుగా ప్రభావితమయ్యారు అస్మిత. ‘‘ఎన్నో కార్యక్రమాలలో నాన్న చురుగ్గా పాల్గొన్నారు. ఆ ప్రభావం సహజంగానే నా మీద ఉంది’’ అంటారు అస్మిత. ఒక గ్లోబల్ కన్సల్టెన్సీ కంపెనీలో పని చేసినా అస్మిత మంచి కథక్ నృత్యకారిణి కూడా. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ వేదికలపై నృత్యప్రదర్శన ఇచ్చారు. విశేషమేమిటంటే, పది సంవత్సరాల వయసులోనే ‘యుఎస్ కాంగ్రెస్’లో ప్రసంగించి అందరినీ ఆకట్టుకుంది అస్మిత. మళ్లీ నోబెల్ దగ్గరికి వద్దాం... నోబెల్ శాంతి బహుమతితో కైలాష్ సత్యార్థి బాధ్యత రెట్టింపు అయింది అనేదానితో అస్మిత ఏకీభవిస్తున్నారు. ‘‘నాన్న చేస్తున్న పనులను చూసి గర్వించడమే కాదు... ఆయన అడుగు జాడల్లో నడవడం కూడా ఇప్పుడు నా భుజస్కంధాలపై ఉన్న బాధ్యత’’ అంటున్నారు అస్మిత. లైక్ ఫాదర్ లైక్ డాటర్! -
మన నోబెల్ విజేతలు
నోబెల్ బహుమతి అందుకున్న ఏడో భారతీయుడిగా కైలాస్ సత్యార్థి నిలిచారు. పాకిస్థాన్ బాలిక మలాలా యూసఫ్జాయ్తో పాటు సత్యార్థికి శాంతి నోబెల్ బహుమతిని ప్రకటించారు. సత్యార్థికి ముందు ఆరుగురు భారతీయులు ఈ అత్యున్నత పురస్కారాన్ని స్వీకరించారు. వారి వివరాలు.. నోబెల్ పొందిన భారతీయులు: రవీంద్ర నాథ్ ఠాగూర్ -సాహిత్యం 1913 సీవీ రామన్-భౌతిక శాస్త్రం 1930 హర్గోవింద్ ఖురానా-వైద్యం 1968 మదర్ థెరిసా-శాంతి బహుమతి 1979 సుబ్రమణ్యం చంద్రశేఖర్- భౌతికశాస్త్రం 1983 అమర్థ్యసేన్-ఆర్థికశాస్త్రం 1998 కైలాస్ సత్యార్థి- శాంతి 2014 భారత సంతతికి చెందిన వారు, భారత్‌లో జన్మించి విదేశాలకు వెళ్లిన మరికొందరు ప్రముఖులు కూడా నోబెల్ బహుమతి అందుకున్నారు. -
చరిత్ర సృష్టించిన మలాలా
లండన్: అత్యంత పిన్న వయసులో నోబెల్ బహుమతి గెలుచుకున్న వ్యక్తిగా పాకిస్థాన్ సాహస బాలిక మలాలా యూసఫ్‌జాయ్ చరిత్ర సృష్టించారు. భారతీయుడు కైలాశ్ సత్యార్థితో పాటు 17 ఏళ్ల మలాలాకు సంయుక్తంగా నోబెల్ శాంతి బహుమతి ప్రకటించారు. గతంలో విలియమ్ లారెన్స్ అనే భౌతిక శాస్త్రవేత్త 25 ఏళ్ల వయసులో నోబెల్ బహుమతి అందుకుని, అత్యంత చిన్న వయసులో ఈ ఘనత సాధించిన వ్యక్తిగా పేరుగాంచారు. తాజాగా మలాలా ఈ రికార్డను బద్దలు కొట్టారు. కైలాశ్ సత్యార్థి, మలాలా బాలలు, యువత హక్కుల కోసం పోరాడినందుకు వీరికి నోబెల్ పురస్కార కమిటీ ఈ అవార్డు ప్రకటించింది. చిన్నారుల చదువు కోసం వీరు రాజీలేని పోరాటం చేశారని కమిటీ ప్రశసించింది. పాకిస్థాన్ బాలికల విద్యాహక్కు కోసం మలాలా తీవ్రవాదులకు తూటాలకు ఎదురునిలిచింది. -
ఫ్రెంచ్ సాహితీవేత్తకు నోబెల్!
స్టాక్‌హోం: ఈ సంవత్సరం సాహిత్యంలో నోబెల్ పురస్కారం ఫ్రెంచ్ సాహితీవేత్త పాట్రిక్ మొడియానో(69)ను వరించింది. ఫ్రాన్స్‌పై నాజీల ఆక్రమణ, అది తన దేశంపై చూపిన ప్రభావం.. వీటిని తన జీవితకాలం అధ్యయనం చేసిన పాట్రిక్ ఈ పురస్కారం కింద 80 లక్షల స్వీడిష్ క్రొనార్లను(రూ. 6.71 కోట్లు) అందుకోనున్నారు. అంత తేలికగా అర్థం కాని మానవ జీవితాలను, ఆక్రమణలో ఉన్న జీవితాల్లోని చీకట్లను, కోల్పోయిన సొంత అస్తిత్వ గుర్తులను.. తన జ్ఞాపకాలతో నిండిన రచనల ద్వారా వెలుగులోకి తెచ్చిన పాట్రిక్‌ను ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారానికి ఎంపిక చేసినట్లు స్వీడిష్ ఎకాడమీ గురువారం ప్రకటించింది. ‘కాలం, అస్తిత్వం, జ్ఞాపకాలు పాట్రిక్ రచనల్లో తారసపడే అం శాలివి. ఆయన రచనలు పరస్పరం సంభాషించుకుం టాయి ఒకదాన్నొకటి ప్రతిఫలిస్తుంటాయి. ఇదే ఆయ న రచనలకు ఒక ప్రత్యేకతను ఆపాదిస్తాయి’ అని ఎకాడమీ శాశ్వత కార్యదర్శి పీటర్ఎంగ్లండ్ ప్రశంసించారు. మిస్సింగ్ పర్సన్: యూరోప్‌లో రెండో ప్రపంచయుద్ధం ముగిసిన రెండు నెలల తరువాత 1945, జూలైలో పశ్చిమ పారిస్‌లో పాట్రిక్ మొడియానో జన్మించారు. ఆయన తండ్రి అల్బర్బో మొడీయానో జ్యూయిష్ ఇటాలియన్ కాగా, తల్లి లూయిసా కాల్పిన్ బెల్జియన్ నటీమణి. పారిస్ ఆక్రమణ సందర్భంగా వారిరువురికీ పరిచయమై, ఒక్కటయ్యారు. 20 ఏళ్ల వయసు నుంచే సాహిత్య సృజన ప్రారంభించిన పాట్రిక్ ఫ్రెంచ్‌లో 40కి పైగా రచనలు చేశారు. వాటిలో అనేకం ఆంగ్లంలోకి అనువాదం అయ్యాయి. వాటిలో ‘మిస్సింగ్ పర్సన్’ నవల 1978లో ప్రతిష్టాత్మక ప్రిక్స్గాన్కోర్ట్ అవార్డ్‌ను గెలుచుకుంది. 1968లో ఆయన రాసిన ‘లా ప్లేస్ డి లెటాయిల్’ నవల యూదులపై నాజీల నరమేథం అనంతరం వచ్చిన అత్యుత్తమ రచనగా ప్రశంసలందుకుంది. విల్లా ట్రిస్ట్, అ ట్రేస్ ఆఫ్ మాలైస్, హనీమూన్, డొరా బ్రుడర్.. తదితర నవలలు పాట్రిక్‌కు గొప్ప పేరు తెచ్చాయి. బాలసాహిత్యంలోనూ, సినిమా స్క్రిప్ట్‌ల రూపకల్పనలోనూ ఆయన తన సృజనాత్మకతను నిరూపించుకున్నారు. 1974లో లాకోంబ్ అనే సినిమాను కూడా తీశారు. 2000 సంవత్సరం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జ్యూరీలో సభ్యుడిగా ఉన్నారు. 2012లో యూరోపియన్ సాహిత్యంలో చేసిన కృషికి గానూ ఆస్ట్రేలియా జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. పారిస్‌లో నివసించే పాట్రిక్ అరుదుగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తుంటారు. నోబెల్ సాహిత్య పురస్కారం విజేతల్లో 107వ వ్యక్తి పాట్రిక్ మొడియానో. అలాగే ఆ అవార్డ్ అందుకుంటున్న 11వ ఫ్రెంచ్ రచయిత. -
కెమిస్ట్రీలో ముగ్గురికి నోబెల్
స్టాక్‌హోమ్: ఈ ఏడాది రసాయన శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి లభించింది. అమెరికాకు చెందిన ఎరిక్ బెట్జిగ్, స్టెఫాన్ డబ్ల్యూ హెల్, విలియమ్ ఈ మోర్నర్లను సంయుక్తంగా ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక చేశారు. రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ బుధవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. -
ఎల్ఈడీ బల్బుకు నోబెల్
స్టాక్‌హోం(స్వీడన్): తక్కువ విద్యుత్‌తోనే ఎక్కువ వెలుగులు పంచుతూ.. పర్యావరణానికి మేలు చేకూర్చే నీలి ఎల్ఈడీ సాంకేతికతను ఆవిష్కరించిన ముగ్గురు జపనీస్ శాస్త్రవేత్తలకు ఈ ఏడాది భౌతిక శాస్త్ర నోబెల్ దక్కింది. ఇంధన అవసరాన్ని తగ్గించడం ద్వారా పరోక్షంగా భూతాపోన్నతి(గ్లోబల్‌వార్మింగ్)నీ తగ్గించే నీలి ఎల్ఈడీని ఆవిష్కరించిన ఇసామూ అకసాకి (85), హిరోషీ అమానో(54), షుజీ నకమురా(60)లను భౌతిక శాస్త్ర విభాగంలో విజేతలుగా మంగళవారం నోబెల్ జ్యూరీ ప్రకటించింది. అకసాకి, అమానోలు గతంలో జపాన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ నగోయాలో పనిచేశారు. నకమురా తొకుషిమాలోని నిచియా కెమికల్స్ అనే చిన్న కంపెనీలో పనిచేశారు. వీరు రూపొందించిన నీలి ఎల్ఈడీ ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ సౌకర్యం అందుబాటులో లేని 150 కోట్ల మంది పేద ప్రజల జీవితాల్లో స్వల్ప సౌర విద్యుత్‌తోనే వెలుగులు నింపుతుందని జ్యూరీ ప్రశంసించింది. ‘సంప్రదాయ ఇన్‌క్యాండిసెంట్(ఫిలమెంట్ ఉండే) లైట్ బల్బులు 20వ శతాబ్దంలో వెలుగులు పంచాయి. ఇక 21వ శతాబ్దం ఎల్ఈడీ(లైట్-ఎమిటింగ్ డయోడ్) కాంతులతో ప్రకాశిస్తుంది’ అని జ్యూరీ వీరిని అభినందించింది. విజేతలు ముగ్గురికీ కలిపి 80 లక్షల స్వీడిష్ క్రోనార్ల(రూ.6.81 కోట్లు) మొత్తం అందనుంది. కాగా, దైవకణం(హిగ్స్ బోసాన్)ను కనుగొన్నందుకు బ్రిటన్ శాస్త్రవేత్త పీటర్ హిగ్స్, బెల్జియం శాస్త్రవేత్త ఫ్రాంకోయిస్ ఎంగ్లెర్ట్‌లకు గతేడాది భౌతిక శాస్త్ర నోబెల్ దక్కింది. నీలి ఎల్ఈడీకి ఎందుకింత ప్రాధాన్యం..? నీలి ఎల్ఈడీని ఆవిష్కరణకు ఏకంగా నోబెల్ బహుమతా? అంటే.. నీలి ఎల్ఈడీకి ఉన్న ప్రాధాన్యం అంత తక్కువేం కాదు. ఎందుకంటే.. ప్రస్తుతం మనం చూస్తున్న ఎల్ఈడీ బల్బులన్నింటి తయారీకీ.. నీలి ఎల్ఈడీ టెక్నాలజీయే మార్గం చూపింది. దీనిని కొంచెం వివరంగా పరిశీలిస్తే.. తెలుపు రంగు కాంతిలో ఏడు రంగులు ఉంటాయని, అవి వేర్వేరు తరంగదైర్ఘ్యాల్లో ఉంటాయనీ మనకు తెలిసిందే. కానీ.. ఎరుపు, ఆకుపచ్చ, నీలి రంగు కాంతులు మూడింటిని కలిపినా.. తెలుపు కాంతి ఏర్పడుతుంది. అయితే.. నీలి రంగు కాంతి తరంగదైర్ఘ్యం(వేవ్లెంత్) చాలా తక్కువగా ఉండటం, కొన్ని పదార్థాలతో మాత్రమే ఉత్పత్తి చేయగలగడం వల్ల దానిని ఉపయోగించడం పెద్ద ప్రతిబంధకంగా మారింది. దీనివల్ల ఎరుపు, ఆకుపచ్చ ఎల్ఈడీ లను ఐదు దశాబ్దాల క్రితమే కనుగొన్నప్పటికీ.. తెలుపు కాంతులు వెదజల్లే ఎల్ఈడీల తయారీ సాధ్యం కాలేదు. నీలి రంగు ఎల్ఈడీల ఆవిష్కరణకు మూడు దశాబ్దాలుగా ఎంతో మంది కృషిచేసినా.. ఎవరూ సఫలం కాలేకపోయారు. ఈ నేపథ్యంలో 1990లలో ప్రయోగాలు చేపట్టిన ఈ ముగ్గురూ ఎట్టకేలకు సెమీకండక్టర్ల ద్వారా ప్రకాశవంతమైన నీలి కాంతి పుంజాలు విడుదలయ్యేలా చేశారు. దీంతో తెలుపు ఎల్ఈడీలకు మార్గం సుగమం అయింది. ఆ తర్వాతే ప్రపంచమంతా ఎల్ఈడీ కాంతులు పరుచుకున్నాయి. ఎల్ఈడీలు అంటే..? విద్యుత్ వాహక(సెమీ కండక్టర్) పదార్థాల పొరలు ఎక్కువగా కలిగి ఉండి, కాంతిని వెదజల్లే పరికరాలనే ఎల్ఈడీలుగా చెప్పుకోవచ్చు. వీటిలో విద్యుత్ నేరుగా కాంతి కణాలు(ఫొటాన్లు)గా మారుతుంది. దీనివల్ల చాలా తక్కువ విద్యుత్ ఖర్చవుతుంది. అదే ఇన్‌క్యాండిసెంట్ బల్బులు ఫిలమెంట్ తీగను వేడిచేయడం ద్వారా కాంతిని వెదజల్లుతాయి. అయితే.. చాలా విద్యుత్ ఫిలమెంట్ తీగను వేడిచేసేందుకే ఖర్చవుతుంది. ఇక ఫ్లోరోసెంట్(ట్యూబ్‌లైట్లు) బల్బులూ తక్కువ విద్యుత్‌తో పనిచేస్తాయని భావించినా.. వాటి ద్వారా కూడా వేడి, ఇతర సమస్యలున్నాయి. అదే ఎల్ఈడీలు అయితే.. అన్ని బల్బుల కన్నా ఎక్కువకాలం పనిచేస్తాయి. వేడెక్కవు. తక్కువ విద్యుత్‌తోనే ఎక్కువ వెలుగులు పంచుతాయి. బల్బులుగా మాత్రమే కాకుండా మొబైల్ఫోన్లు, కెమెరాల వంటి ఎన్నో ఎలక్ట్రానిక్ పరికరాలకూ ఇవి ఉపయోగపడతాయి. నీలి ఎల్ఈడీ.. దీనిలో గాలియం నైట్రైడ్, ఇండియం, అల్యూమినియం మిశ్రమంతో కూడిన అనేక పొరలు ఉంటాయి. వీటిని విద్యుత్ వాహకాలుగా ఉపయోగించడం ద్వారానే జపనీస్ శాస్త్రవేత్తలు నీలి ఎల్ఈడీ కాంతి పుంజాలను సాధ్యం చేయగలిగారు. ఎల్ఈడీ.. ఎలక్ట్రిక్ వోల్టేజీ నెగెటివ్ లేయర్ నుంచి ఎలక్ట్రాన్లను ప్రవహింపచేస్తుంది. పాజిటివ్ లేయర్లో ఉండే రంధ్రాలు, నెగెటివ్ లేయర్‌తో కలిసేచోట కాంతి పుంజం ఏర్పడుతుంది. ఇక్కడ విద్యుత్ వాహకంగా ఉపయోగించిన పదార్థాన్ని బట్టి కాంతి తరంగదైర్ఘ్యం ఉంటుంది. ఇందులో కాంతి పుంజాలను ఉత్పత్తి చేసే ఎల్ఈడీలు ఒక్కోటి ఇసుక రేణువు అంత మాత్రమే ఉంటాయి. -
భౌతికశాస్త్రంలో ముగ్గురికి నోబెల్
భౌతికశాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి లభించింది. ఈ ముగ్గురు జపాన్‌కు చెందినవారు. అకసకి, అమనో, నకుమురాలకు సంయుక్తంగా నోబెల్ పురస్కారం ప్రకటించారు. ఎల్ఈడీ ల్యాంప్‌ను కనుగొన్నందుకుగాను వీరిని అత్యున్నత అవార్డుకు ఎంపిక చేశారు. -
వైద్యరంగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి
మెదడులో స్వతహాగా ఉండే 'జీపీఎస్' వ్యవస్థను కనుగొన్న ముగ్గురికి 2014 సంవత్సరానికి గాను వైద్యరంగంలో నోబెల్ బహుమతిని ప్రకటించారు. జాన్ ఓ కీఫె, మే బ్రిట్ మోజర్, ఎడ్వర్డ్ మోజర్ ఈ బహుమతిని పొందారు. వీళ్లలో చివరి ఇద్దరు భార్యాభర్తలు. నోబెల్ బహుమతి ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత దాన్ని గెలుచుకున్న 11వ మహిళగా మే బ్రిట్ మోజర్ నిలిచారు. బహుమతి మొత్తంలో సగం జాన్ ఓ కీఫెకు వెళ్తుంది. మిగిలిన మొత్తాన్ని భార్యాభర్తలు పంచుకోవాల్సి ఉంటుంది. యూనివర్సిటీ కాలేజి లండన్‌లోని సైన్స్బరీ వెల్కమ్ సెంటర్లో న్యూరల్ సర్క్యూట్స్ అండ్ బిహేవియర్ సంస్థకు జాన్ ఓ కీఫె డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. 1939లో పుట్టిన ఆయనకు అమెరికా, బ్రిటన్ రెండు దేశాల పౌరసత్వం ఉంది. మే బ్రిట్ మోజర్ నార్వే పౌరురాలు. ఆమె యూసీఎల్‌లో గతంలో పనిచేసినా, ప్రస్తుతం ట్రాన్డీమ్లోని సెంటర్ ఫర్ న్యూరల్ కంప్యూటేషన్ సంస్థకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఎడ్వర్డ్ మోజర్ కూడా నార్వే దేశస్థుడే. ఆయన తొలుత తన భార్యతో కలిసి యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బర్గ్లో పోస్ట్డాక్గా చేశారు. తర్వాత లండన్‌లోని జాన్ ఓ కీఫె ల్యాబ్‌లో విజిటింగ్ శాస్త్రవేత్తగా ఉన్నారు. 1996లో వారిద్దరూ నార్వే యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి మారిపోయారు. అక్కడే 1998 నుంచి ఎడ్వర్డ్ మోజర్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. ప్రస్తుతం ఆయన ట్రాన్డీమ్లోని కావ్లి ఇన్స్టిట్యూట్ ఫర్ సిస్టమ్స్ న్యూరోసైన్స్‌లో డైరెక్టర్‌గా ఉన్నారు. #nobelprize2014 #Medicine May‐Britt and Edvard Moser is the 5th married couple to be awarded a Nobel Prize. — The Nobel Prize (@NobelPrize) October 6, 2014 -
నోబెల్ బహుమతి రేసులో భారతీయ శాస్త్రవేత్త!
ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కార బహుమతి రేసులో భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ రామమూర్తి రమేశ్ ఉన్నారు. ఈ సంవత్సరం ప్రకటించే నోబెల్ బహుమతికి ఎంపిక చేసిన 27 మంది ఆర్ధికవేత్తలు, శాస్త్రవేత్తల జాబితాలో రామమూర్తి రమేశ్ ఒకరు. ఫిజిక్స్ రంగంలో ఈ సంవత్సరపు నోబెల్ బహుమతి అక్టోబర్ 7 తేదిన ప్రకటించనున్నారు. రామమూర్తి బర్కలీ లోని యూనివర్సిటి ఆఫ్ కాలిఫోర్నియా లో ఫిజిక్స్ ప్రొఫెసర్ గా సేవలందిస్తున్నారు. ఫెర్రో ఎలెక్రికల్ డివైసెస్ అండ్ మల్టీ ఫెర్రోయిక్ మెటిరియల్ అంశంపై డాక్టర్ రామమూర్తి రమేశ్ సేవలందిస్తున్నారు. -
కృత్రిమ రేడియో ధార్మికత
సహజ రేడియో ధార్మికత సహజ రేడియో ధార్మికత అనే ధర్మాన్ని క్రీ.శ. 1896లో హెన్రీ బెకరల్ కనుగొన్నాడు. అతడికి 1903లో నోబెల్ బహుమతి లభించింది. పరమాణు కేంద్రకంలో ప్రోటాన్లు, న్యూట్రాన్లను బంధించే బలాలను ‘కేంద్రక బలాలు’ అంటారు. విశ్వంలోని ఇతర బలాలతో పోల్చినప్పుడు కేంద్రక బలాలు అత్యంత బలమైనవి. వీటి గురించి కూలుంబ్ అనే శాస్త్రవేత్త పరిశోధన చేసి రెండు రకాలుగా వర్గీకరించాడు. అవి: 1) కూలుంబ్ ఆకర్షణ బలాలు 2) కూలుంబ్ వికర్షణ బలాలు ఈ బలాల పరిమాణం ఆధారంగా పరమాణు కేంద్రకం స్థిరత్వాన్ని, సహజ రేడియో ధార్మికతలను వివరించవచ్చు. 1. పరమాణు సంఖ్య 1 నుంచి 31 వరకు ఉండే మూలకాల పరమాణు కేంద్రకాల్లో కూలుంబ్ ఆకర్షణ బలాలు గరిష్ఠంగా, వికర్షణ బలాలు కనిష్ఠంగా ఉంటాయి. వీటికి స్థిరత్వం ఎక్కువగా ఉండటం వల్ల సహజ రేడియో ధార్మికతను ప్రదర్శించవు. 2. పరమాణు సంఖ్య 31 నుంచి 82 వరకు (సీసం) ఉండే మూలకాల పరమాణు కేంద్రకంలో కూలుంబ్ ఆకర్షణ బలాలు క్రమంగా తగ్గిపోయి, వికర్షణ బలాలు పెరుగుతాయి. వీటి పరమాణు కేంద్రకాల్లో అస్థిరత్వం క్రమంగా పెరుగుతుంది. ఉదా: Kr36, Ba56 3. పరమాణు సంఖ్య 82 కంటే ఎక్కువగా ఉన్న మూలకాల పరమాణు కేంద్రకాల్లో కూలుంబ్ వికర్షణ బలాలు గరిష్ఠంగా ఉంటాయి. ఆకర్షణ బలాలు కనిష్ఠంగా ఉంటాయి. ఇలాంటి పరమాణు కేంద్రకాల్లో అస్థిరత్వం కనిష్ఠ స్థాయిలో ఉండి, అవి స్థిరత్వం పొందడానికి వాటంతట అవేa, b,జ కిరణాలను విడుదల చేస్తాయి. ఈ ధర్మాన్ని ‘సహజ రేడియో ధార్మికత’ అంటారు. ఉదా: యురేనియం, థోరియం 4. సహజ రేడియో ధార్మిక పదార్థం నుంచి ఒకసారి ్చ, ఛ, జ కిరణాల్లో ఏదో ఒకటే విడుదలవుతుంది. ఒకేసారి ఏ రెండు కణాలు బయటకు విడుదల కావు. 5. సహజ రేడియో ధార్మిక పదార్థం నుంచి వెలువడే కిరణాలను బెకరల్ కిరణాలు అని కూడా అంటారు. 6. సహజ రేడియో ధార్మికత ధర్మం ఆయా పదార్థాల స్వభావంపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఉష్ణోగ్రత, పీడనంపై ఆధారపడి ఉండదు. aకణం: ఈ కణంలో రెండు ప్రోటాన్లు, రెండు న్యూట్రాన్లు ఉంటాయి. కాబట్టి ఇది రెండు యూనిట్ల ధనావేశం, నాలుగు యూనిట్ల ద్రవ్యరాశితో హీలియం (2He4)పరమాణువు కేంద్రకాన్ని పోలి ఉంటుంది. ఒక రేడియో ధార్మిక పదార్థం నుంచి ్చ కణం విడుదలైనప్పుడు దాని పరమాణు సంఖ్య రెండు ప్రమాణాలు, పరమాణు ద్రవ్యరాశి నాలుగు ప్రమాణాలు తగ్గిపోయి, అది వేరొక మూలకంగా మారుతుంది. 92U235 2He4 90U231 (Thorium) (a కణం) ఛకణం: పరమాణు కేంద్రకంలోని ఒక న్యూట్రాన్ విచ్ఛిన్నం చెంది ఒక ప్రోటాన్, ఒక ఎలక్ట్రాన్‌గా విడిపోతుంది. భారయుత ప్రోటాన్ పరమాణు కేంద్రకంలో మిగిలిపోగా, తేలికైన ఎలక్ట్రాన్ పరమాణు కేంద్రకం నుంచి బయటకు విడుదలవుతుంది. ఈ ఎలక్ట్రాన్‌ను ఛకిరణం అంటారు. ఛకిరణం విడుదలైనప్పుడు ఆ పదార్థం పరమాణు సంఖ్య +1 పెరుగుతుంది. పరమాణు ద్రవ్యరాశిలో ఎలాంటి మార్పు ఉండదు. ఉదా: 92U235 - 92P++1430n1 93U235- (92+1) P++1420n1 జకిరణాలు: వీటికి ఎలాంటి ఆవేశం, ద్రవ్యరాశి ఉండవు. జ కిరణం శక్తిని మోసుకెళ్లే విద్యుదయస్కాంత తరంగం మాత్రమే. అందువల్ల జకిరణాలు విడుదలైనప్పుడు పరమాణు కేంద్రకంలోని శక్తి కొంతమేరకు తగ్గుతుంది. అంతేగానీ ఆ పదార్థం పరమాణు సంఖ్య, ద్రవ్యరాశిలో ఎలాంటి మార్పు ఉండదు. 1. విద్యుత్ క్షేత్రం, అయస్కాంత క్షేత్రం ద్వారా రేడియో ధార్మిక కిరణాలు ప్రయాణిస్తున్నప్పుడు ధనావేశం ఉన్న ్చకిరణాలు రుణావేశిత పలకవైపు, రుణావేశం ఉన్న ఛకిరణాలు ధనావేశిత పలకవైపు వంగి ప్రయాణిస్తాయి. కానీ, ఎలాంటి ఆవేశం లేని జ కిరణాలు రుజుమార్గంలో వెళతాయి. 2. ఒక పదార్థంలోకి రేడియోధార్మిక కిరణాలు చొచ్చుకు వెళ్లే సామర్థ్యాన్ని కిందివిధంగా తెలుపవచ్చు.g > b > a 3. రేడియో ధార్మిక కిరణాల ఉనికిని తెలుసుకోవడానికి ఉపయోగించే సాధనాలు: 1.Geigger - Muller Counter 2. Scintillation Counter 3. Cloud Chamber 4. Bubble Chamber రేడియో ధార్మికత ప్రమాణాలు: 1. Curie = 3.7 ´ 1010 విఘటనాలు/సె 1 Millicurie = (1/1000)´3.7´ 1010 = 3.7 ´ 107 విఘటనాలు/సె 2. Ruther ford = 106వి/సె 3. 1 Becqural = 1 వి/సె అర్ధజీవితకాలం: ఒక రేడియో ధార్మిక పదార్థం తనలో నుంచి రేడియో ధార్మిక కిరణాలను విడుదల చేస్తూ, దాని అసలు ద్రవ్యరాశిలో సగం ద్రవ్యరాశిని మార్పు చెందించేందుకు కావాల్సిన కాలాన్ని అర్ధ జీవితకాలం అంటారు. ఈ విలువ ఆయా పదార్థాల స్వభావంపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. ప్రతి రేడియో ధార్మిక పదార్థం తనలో నుంచి రేడియో ధార్మిక కిరణాలను విడుదల చేస్తూ సీసం ఆకృతిని పొందుతుంది. ఈ దశలో స్థిరత్వం పొంది, రేడియో ధార్మికత ఆగిపోతుంది. అందువల్ల సీసం అర్ధజీవితకాలాన్ని అనంతంగా తీసుకుంటారు. కృత్రిమ రేడియో ధార్మికత: ఒక స్థిరమైన పరమాణు కేంద్రకాన్ని భారయుత కణాలతో ఢీకొట్టించినప్పుడు అది రేడియో ధార్మికతను ప్రదర్శిస్తుంది. దీన్ని కృత్రిమ రేడియో ధార్మికత అంటారు. ఈ ధర్మాన్ని మేడం క్యూరీ, ఫ్రెడరిక్ జూలియట్ క్యూరీ కనుగొన్నారు. ఉదా: Plutonium, Neptunium, Ameri- cium, Lawrencium, Fermium, Curium, Einsteinium, Strontium. యురేనియం, థోరియం, ఫ్లూటోనియంను అణు ఇంధనాలుగా ఉపయోగిస్తారు. ఫ్లూటోనియాన్ని అత్యుత్తమ అణు ఇంధనంగా పరిగణిస్తారు. ఐన్‌స్టీన్ చేసిన పరిశోధనల్లో ముఖ్యమైనవి: 1. {దవ్యరాశి శక్తి - తుల్యత నియమం E = mc2, m= వస్తువు ద్రవ్యరాశి c= కాంతివేగం, ఉ= శక్తి 2. సాపేక్ష సిద్ధాంతం 3. కాంతి విద్యుత్ ఫలితం: ఈ సమీకరణాన్ని ప్రతిపాదించినందుకు ఐన్‌స్టీన్‌కు 1921లో నోబెల్ బహుమతి లభించింది. కేంద్రక విచ్ఛిత్తి: పరమాణు సంఖ్య 82 కంటే ఎక్కువగా ఉన్న పరమాణు కేంద్రకాలను ఒక భారయుత న్యూట్రాన్తో ఢీకొట్టించినప్పుడు అవి విచ్ఛిన్నం చెంది, దాదాపు సరిసమానమైన రెండు కొత్త పరమాణు కేంద్రకాలుగా విడిపోతాయి. వాటి నుంచి కొన్ని న్యూట్రాన్లు, అత్యధిక అణుశక్తి విడుదలవుతుంది. దీన్ని ‘కేంద్రక విచ్ఛిత్తి’ అంటారు. దీన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు ఒట్టోమ్, స్ట్రాస్‌మన్. ఉదా: ఒక యురేనియం కణాన్ని తటస్థ ఆవేశం ఉన్న న్యూట్రాన్లతో ఢీకొట్టించినప్పుడు అది విచ్ఛిన్నం చెంది క్రిప్టాన్, బేరియంలుగా విడిపోయి, 3 న్యూట్రాన్లు, 200 ఎంఈవీల అణు శక్తిని విడుదల చేస్తుంది. ె సాధారణంగా యురేనియం, థోరియం, ఫ్లూటోనియం కేంద్రక విచ్ఛిత్తికి లోనవుతాయి. కాబట్టి, ఈ పదార్థాలను అణు ఇంధనాలుగా ఉపయోగిస్తారు. ె యురేనియం పిచ్‌బ్లెండ్ రూపంలో, థోరి యం మోనోజైట్ రూపంలో లభిస్తాయి. ఫ్లూటోనియం మానవుడు తయారు చేసిన కృత్రిమ రేడియో ధార్మిక పదార్థం. గొలుసు చర్య: విచ్ఛిత్తి శిల పదార్థంలో కేంద్రక విచ్ఛిత్తి దానంతట అదే అన్ని కణాలకు విస్తరించడాన్ని గొలుసుచర్య లేదా శృంఖల చర్య అంటారు. గొలుసు చర్య రేటు అనేది రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. 1. అణుఇంధన స్వభావం 2. గొలుసు చర్యలో పాల్గొంటున్న న్యూట్రాన్ల వేగం. గొలుసు చర్యలో వెలువడే న్యూట్రాన్ల సగటు సంఖ్య 2.5గా ఉంటుంది. గొలుసు చర్య పూర్త వడానికి పట్టే సమయం 10-8 సెకండ్లు మాత్రమే. దీన్ని ఒక జ్చిజ్ఛు అంటారు. 1-Shake = 10&8 sec కాలాన్ని కొలవడానికి ఉపయోగించే అతి చిన్న ప్రమాణం - Shake.కాలాన్ని కొలవడానికి ఉపయోగించే అతి పెద్ద ప్రమాణం -Cosmic year. 1 -Cosmic year = 250 Million Years. సూర్యుడు ఒకసారి విశ్వం చుట్టూ తిరిగి రావడానికి కావాల్సిన సమయాన్ని కాస్మిక్ సంవత్సరం అంటారు. గొలుసు చర్యను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి: అనియంత్రిత గొలుసు చర్య: గొలుసు చర్యలో పాల్గొంటున్న న్యూట్రాన్ల వేగాన్ని ఏ దశలోనూ అదుపు చేయలేకపోతే అది నిరంతరంగా కొనసాగుతుంది. దీన్ని అనియంత్రిత గొలుసు చర్య అంటారు. ఉదా: అణుబాంబులు అణుబాంబు కేంద్రక విచ్ఛిత్తి సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. ఈ అణుబాంబు నుంచి అనియంత్రిత గొలుసు చర్య పద్ధతిలో అణుశక్తి విడుదలవుతుంది. నియంత్రిత గొలుసు చర్య: గొలుసు చర్యలో పాల్గొంటున్న న్యూట్రాన్ల వేగాన్ని అదుపు చేస్తే, గొలుసు చర్య అదుపులోకి వస్తుంది. దీన్ని నియంత్రిత గొలుసు చర్య అంటారు. ఈ పద్ధతిలో వెలువడిన అణుశక్తిని మానవాళి ప్రయోజనం కోసం ఉపయోగించుకోవచ్చు. ఉదా: అణు రియాక్టర్ న్యూక్లియర్ రియాక్టర్: ఇది కేంద్రక విచ్ఛిత్తి సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. దీంట్లో నియంత్రిత గొలుసు చర్య పద్ధతిలో అణుశక్తి విడుదలవుతుంది. మొదటిసారిగా అణు రియాక్టర్‌ను 1942 డిసెంబరులో అమెరికాలోని చికాగోలో ఫెర్మీ అనే శాస్త్రవేత్త నిర్మించారు. ఇతడిని ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్ అంటారు. రియాక్టర్లో ఉండే భాగాలు: 1. అణు ఇంధనాలు: యురేనియం, థోరి యం, ఫ్లూటోనియం మొదలైనవి. వీటిని చిన్న కడ్డీలుగా రూపొందించి అణు రియాక్టర్లో వివిధ వరుసలలో పేర్చుతారు. 2. మితకారులు: అణు రియాక్టర్లో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించి, గొలుసు చర్యను అదుపు చేసేందుకు మితకారులను వాడతారు. ఉదా: భారజలం (D2O), గ్రాఫైట్, దృఢ ప్లాస్టిక్ పదార్థాలు. భారజలాన్ని ్ఖట్చడ కనుగొన్నాడు. హైడ్రోజన్ ఐసోటోపు అయిన డ్యుటేరియాన్ని ఉపయోగించి దీన్ని ఉత్పత్తి చేస్తారు. అందువల్ల భారజలాన్ని డ్యుటేరియం ఆక్సైడ్ (D2O) అంటారు. 3. నియంత్రకాలు: అణు రియాక్టర్లో న్యూట్రాన్లను శోషించుకొని, గొలుసు చర్యను పూర్తిగా ఆపేసేందుకు నియంత్రకాలను ఉపయోగిస్తారు. ఉదా: కాడ్మియం, బోరాన్, స్టీల్ కడ్డీలు. 4. కూలెంట్: అణు రియాక్టర్లో స్టీల్ పైపులను అమర్చి, వాటి ద్వారా చల్లని నీటిని, భారజలాన్ని ప్రవహింపజేస్తారు. ఇవి రియాక్టర్‌లోని ఉష్ణాన్ని శోషించుకొని వేడెక్కి బయటకి వెళతాయి. 5. {పత్యేకమైన పైకప్పు: అణు రియాక్టర్లో గొలుసు చర్య జరుగుతున్నప్పుడు హానికర రేడియో ధార్మిక కిరణాలు వెలువడి పరిసరాల్లోని జీవావరణం, వాతావరణం, జలావరణం లాంటి వాటికి తీవ్రమైన హాని కలిగిస్తాయి. అందువల్ల ఈ కిరణాలు బయటకు వెళ్లకుండా రియాక్టర్‌పై ప్రత్యేకమైన పైకప్పును అల్యూమినియం, సీసం, కాంక్రీట్ల మిశ్రమాన్ని ఉపయోగించి నిర్మిస్తారు. ఈ రేడియోధార్మిక కిరణాలు పైకప్పును తాకి పరావర్తనం చెంది తిరిగి వెనుకకు వస్తాయి. అణు రియాక్టర్ సామర్థ్యాన్ని బట్టి పైకప్పు మందం ఏడు ఫీట్ల నుంచి 10 మీటర్లుగా ఉంటుంది. కేంద్రక సంలీనం: రెండు తేలికైన పరమాణు కేంద్రకాలు కలిసి ఏక కేంద్రంగా మారినప్పుడు వాటిలో నుంచి అధిక శక్తి విడుదలవుతుంది. దీన్ని కేంద్రక సంలీనం అంటారు. ఉదా: రెండు ప్రోటాన్లు కేంద్రక సంలీనంలో పాల్గొని డ్యుటేరియంగా మారినప్పుడు సుమారు 26.8 మిలియన్ ్ఛగ శక్తి విడుదలవుతుంది. 1H1+1H1 ®1H2 + 26.8 meV ¯ ¯ ¯ ¯ {పోటాన్ ప్రోటాన్ డ్యుటేరియం అణుశక్తి సాధారణ గది ఉష్ణోగ్రత, పీడనాల వద్ద ప్రోటాన్లు వికర్షించుకొని ఒకదాని నుంచి మరొకటి దూరంగా వెళ్లడం వల్ల కేంద్రక సంలీనం జరుగదు. కానీ, సుమారు 20 మిలియన్ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత, అత్యధిక పీడనం వద్ద ప్రోటాన్లు తమ మధ్య ఉండే వికర్షణ బలాన్ని అధిగమించి కేంద్రక సంలీనంలో పాల్గొంటాయి. ఇది అత్యధిక ఉష్ణోగ్రత, పీడనాల వద్ద జరగడం వల్ల దీన్ని ఉష్ణకేంద్రక చర్య అంటారు. సూర్యుడు, నక్షత్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రత, పీడనాల వద్ద ప్రోటాన్లు కేంద్రక సంలీనంలో పాల్గొనడం వల్ల కాంతిశక్తి విడుదలవుతోంది. -
నార్వే మాజీ ప్రధానికి ఆసియా ‘నోబెల్’
తైపీ: ఆసియా నోబెల్ బహుమతిగా పేర్కొనే తాంగ్ ప్రైజ్‌కు నార్వే మాజీ ప్రధాని గ్రో హార్లేమ్ బ్రంట్‌ల్యాండ్ ఎంపికయ్యారు. సంతులిత అభివృద్ధి అమలు, నాయకత్వం, నవకల్పనలకుగాను ఆమెను దీనికి ఎంపిక చేసినట్లు అవార్డుల ఎంపిక కమిటీ చైర్మన్, నోబెల్ బహుమతి గ్రహీత యువాన్ లీ బుధవారం తెలిపారు. పారితోషికంలో నోబెల్ కంటే విలువైన తాంగ్ తొలి బహుమతిని బ్రంట్‌ల్యాండ్‌కు ప్రకటించారు. ఆమెకు రూ.10 కోట్లు అందజేస్తారు. -
'ఎగ్జిట్ పోల్స్ నిర్వాహకులకు నోబెల్ బహుమతి ఇవ్వాలి'
న్యూఢిల్లీ: తాజా లోకసభ ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పదని వెల్లడిస్తున్న ఎగ్జిట్ పోల్స్ నిర్వాహకులపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. కాంగ్రెస్ పార్టీని తక్కువ చేసి చూపుతున్న ఎగ్జిట్ పోల్స్ నిర్వాహకులకు నోబెల్ బహుమతి ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ అన్నారు. తక్కువ శాంపిల్స్ ను తీసుకుని భారత రాజకీయ వ్యవస్థపై ఓపినియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్న వారు నోబెల్ బహుమతికి అర్హులని సింఘ్వీ అన్నారు. ఓ బిలియన్ లేదా పది బిలియన్ల ఓటర్లున్న దేశంలో 10, 20, 50, లేదా 90 వేలు, లక్ష శాంపిల్స్ తో ప్రజల మనోభావాల్ని, హృదయాలను లెక్కిస్తున్న వారికి ఈ బహుమతి ఇవ్వవచ్చని అనుకుంటున్నానని సింఘ్వీ అన్నారు. గత చరిత్ర, అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోకుండా.. అదే తరహా శాంపిల్స్ తో ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్న నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 2004, 2009 సాధారణ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ తప్పని రుజువైన అంశాన్ని సింఘ్వీ మీడియా దృష్టికి తీసుకువచ్చారు. ఎన్నికల ప్రచారంలో బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్రమోడీ దిగజారి విమర్శలు చేశారని ఓ ప్రశ్నకు సింఘ్వీ సమాధానమిచ్చారు. -
ఇంకా సమయం పడుతుంది!
సాక్షి, హైదరాబాద్: భారత్‌లో మెరుగైన శాస్త్ర పరిశోధనలు జరుగుతున్నప్పటికీ భారతీయ శాస్త్రవేత్తలకు నోబెల్ అవార్డు దక్కాలంటే మరింత సమయం పడుతుందని 2009లో ఈ అవార్డు సాధించిన ప్రవాస భారత శాస్త్రవేత్త వెంకటరామన్ రామకృష్ణన్ అభిప్రాయపడ్డారు. దేశంలోని కొన్ని సంస్థల్లో ఉన్నతస్థాయి పరిశోధనలు జరుగుతున్నాయని, కానీ ప్రాంతీయ స్థాయిలోని విశ్వవిద్యాలయాల్లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందని అన్నారు. సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘నోబెల్ అవార్డు అకస్మాత్తుగా వచ్చిపడేది కాదు. అంతర్జాతీయ స్థాయి పరిశోధనలు చేయడంతోపాటు ఆ స్థాయి సంస్థల్లో భాగస్వాములు కావాలి. తద్వారా పరిశోధనలు చేసే క్రమంలో ఎదురయ్యే ఇబ్బందులను పరిష్కరించుకోవడం సులువవుతుంది’’ అని వివరించారు. యాంటీబయోటిక్స్‌పై అంతర్జాతీయ కృషి... ఏటికేడాదీ పెరిగిపోతున్న యాంటిబయాటిక్స్ నిరోధకతను అధిగమించాలంటే అంతర్జాతీయ స్థాయి ప్రయత్నం జరగాలని వెంకటరామన్ రామకృష్ణన్ అభిప్రాయపడ్డారు. వైద్యులు, లేదా తగిన శిక్షణ పొందిన ఆరోగ్య కార్యకర్తల ప్రిస్క్రిప్షన్ ద్వారా మాత్రమే యాంటీబయాటిక్స్ అందేలా చూడాలన్నారు. ‘‘చాలామంది యాంటీబయాటిక్స్ విచ్చలవిడిగా వాడుతూంటారు. వ్యాధి లక్షణాలు తగ్గాయనుకుంటే వెంటనే మందులు వాడటం నిలిపివేస్తారు. ఇవి రెండూ తప్పే. తగిన మందులు వాడటంతోపాటు, పూర్తిగా వాడటం ద్వారా నిరోధకత సమస్యను అధిగమించవచ్చు’’ అని తెలిపారు. భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రభుత్వాలు ప్రజలందరికీ మెరుగైన, చౌకైన వైద్యం అందించేందుకు ప్రయత్నించాలని, అప్పుడే సామాన్యుడు సైతం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ద్వారా మాత్రమే మందులు కొనుగోలు చేసే వీలేర్పడుతుందన్నారు. బ్రిటన్‌లోని జాతీయ ఆరోగ్య సేవల సంస్థ దేశ ప్రజలందరికీ ఉచితంగా వైద్యం అందిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. భారత్‌లో ఒకప్పుడు ఇలాంటి ప్రజారోగ్య వ్యవస్థలు మెరుగ్గా పనిచేసేవని ఇప్పటి పరిస్థితి దురదృష్టకరమని అన్నారు. కొత్త యాంటీబయాటిక్స్‌ను తయారు చేసేందుకు ప్రైవేట్ కంపెనీలు ఉత్సాహం చూపడంలేదని, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలే ఈ పరిశోధనలకు వనరులు సమకూర్చాలని సూచించారు. అంత కుముందు వెంకటరామన్ ఐఐసీటీ ఆడిటోరియంలో ‘‘యాంటీబయాటిక్స్.. కణంలోని ప్రొటీన్ ఫ్యాక్టరీ’ అన్న అంశంపై ప్రసంగించారు. యాంటీబయాటిక్స్ మందుల పుట్టుక నేపథ్యం.. కణాల్లో ప్రొటీన్లను తయారు చేసే రైబోజోమ్‌లపై ఈ మందులు ఎలాంటి ప్రభావం చూపుతాయన్న అంశాలను ఆయన వివరించారు. కార్యక్రమంలో సీసీఎంబీ డెరైక్టర్ డాక్టర్ మోహన్‌రావు, మాజీ డెరైక్టర్లు పుష్పా ఎం. భార్గవ, ఐఐసీటీ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. -
పురస్కారం: సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్
నోబెల్ ఇండియా : ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ పురస్కారం అందుకున్న ప్రముఖ భారతీయులలో సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ ఒకరు. ఈయన చంద్రశేఖర్ వెంకటరామన్ (సి.వి.రామన్) అంతటి ప్రతిభాశాలి. వీరికి 1983లో భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి దక్కింది. ఈ బహుమతిని ఆయన భౌతిక శాస్త్రాధ్యయనంలో తన తొలి గురువైన విలియమ్ ఎ.ఫౌలర్‌తో పంచుకున్నారు. సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్... సర్ సి.వి.రామన్ సోదరుని కుమారుడు. సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ అవిభక్త భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రంలో లాహోర్ పట్టణంలో (ప్రస్తుత పాకిస్తాన్) 1910, అక్టోబర్ 19వ తేదీన జన్మించారు. ఈయన తండ్రి సుబ్రహ్మణ్య అయ్యర్, తల్లి సీతాలక్ష్మి. సుబ్రహ్మణ్య అయ్యర్ ఆగ్నేయ రైల్వే ఉద్యోగి. ఆయన ఉప-ఆడిటర్ జనరల్ అధికారిగా లాహోర్‌లో పనిచేస్తున్న రోజుల్లో చంద్రశేఖర్ జన్మించారు. చంద్రశేఖర్ చిన్నతనంలో తల్లి దగ్గరే చదువుకున్నారు. ఆయన చదువుకోసం 1922లో కుటుంబం చెన్నైకి మారింది. విద్యాభ్యాసం: చంద్రశేఖర్ చెన్నైలోని హిందూ హైస్కూల్లో చేరారు. తరువాత ఆయన చెన్నై ప్రెసిడెన్సీ కళాశాలలో భౌతికశాస్త్రంలో బీఎస్సీ ఆనర్స్ పట్టా పొందారు. చంద్రశేఖర్ బీఎస్సీ చదివే రోజుల్లో ఆర్నాల్డ్ సోమర్ఫెల్ట్ అనే శాస్త్రజ్ఞుడి ఉపన్యాసానికి ఉత్తేజితుడయ్యాడు. ప్రభుత్వ స్కాలర్‌షిప్‌తో 1930లో ఇంగ్లండు వెళ్లి కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం ట్రినిటీ కాలేజీలో ప్రొఫెసర్ ఫౌలర్ వద్ద రీసెర్చి ప్రారంభించారు. చంద్రశేఖర్‌కు అంతరిక్ష భౌతిక విజ్ఞాన శాస్త్రం అంటే చాలా మక్కువ. ఇంగ్లండుకు బయలుదేరటానికి ముందే విశ్వాంతరాళంలో తారలు ఏర్పడే విధానం, తారలలో జరిగే పరిణామాలు, తారల స్థిరత్వం అనే అంశాలపై పరిశోధనలు జరిపి శాస్త్రజ్ఞులలో గుర్తింపు పొందారు. ట్రినిటీ కళాశాలలో చేసిన పరిశోధనలకు గాను, ఆయనకు 1933వ సంవత్సరంలో అంతరిక్ష శాస్త్రంలో డాక్టరేట్ ప్రదానం చేశారు. ఒక పక్క ట్రినిటీ కళాశాలలో ఉన్నత విద్యనభ్యసిస్తూనే, జర్మనీ దేశంలో గొట్టింగెన్లోని బ్రౌన్ పరిశోధనాలయంలో, కోపెన్ హాగెన్లోని భౌతిక విజ్ఞాన శాస్త్ర సిద్ధాంత సంస్థలోనూ పరిశోధనలు చేశారు. పరమాణు నిర్మాణంపై అద్భుతమైన పరిశోధనలు చేసి పేరుపొందిన నీల్స్‌భోర్ శాస్త్రజ్ఞుడిని స్వయంగా కలుసుకున్నారు. ఆ తరువాతి సంవత్సరంలో ఆయన జీవితంలో మార్పులు వచ్చాయి. వివాహం! సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ 1936, సెప్టెంబర్‌లో లలితా దొరైస్వామిని వివాహమాడారు. లలిత ప్రెసిడెన్సీ కళాశాలలో చంద్రశేఖర్‌కు జూనియర్. అదే సంవత్సరంలో ఆయన అంతరిక్ష శాస్త్రంలో తాను ప్రతిపాదించిన (బ్లాక్ హోల్స్) కృష్ణబిల సిద్ధాంతాన్ని వ్యతిరేకించిన కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఆర్థర్ ఎడింగ్టన్తో విభేదించి, అమెరికాకు వలస వెళ్లారు. అమెరికాలో ఇల్లినాయిస్ రాష్ట్రంలోని చికాగో యూనివర్సిటీలో భౌతిక, విజ్ఞాన శాస్త్రం అంతరిక్ష శాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా (1937లో) చేరారు. పదవీవిరమణ చేసే వరకు అదే విశ్వవిద్యాలయంలో కొనసాగారు. 1985లో పదవీ విరమణ అనంతరం, ఎమరిటస్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఈ సుదీర్ఘమైన కాలంలో అంతరిక్ష భౌతిక విజ్ఞాన శాస్త్ర రంగంలో అనేక ఫలవంతమైన పరిశోధనలు చేసి, 1983లో భౌతిక విజ్ఞాన శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని అందుకున్నారు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో తాను చేరిన తొలి రోజుల్లో ప్రతిపాదించిన చిన్న నక్షత్రాల ద్రవ్యరాశికి గరిష్ట పరిమితి నిర్ణయం ‘చంద్రశేఖర్ పరిమితి’ అనే సిద్ధాంత వ్యాసానికి నోబెల్ పురస్కారాన్ని అందుకున్నారు. ఈయన ఈ పురస్కారాన్ని తన గురువైన డాక్టర్ ఎ.ఫౌలర్‌తో పంచుకున్నారు. అంతరిక్ష భౌతిక విజ్ఞాన శాస్త్రంలో ప్రొఫెసర్ చంద్రశేఖర్ జరిపిన ఫలవంతమైన పరిశోధనలెన్నో ఉన్నా ఆయన తొలి ఆవిష్కరణకే నోబెల్ పురస్కారం అందుకోవటం విశేషం. అంతరిక్షంలో ఏ నక్షత్రానికైనా ద్రవ్యరాశి చంద్రశేఖర్ అవధిలోనే ఉంటుంది. ఉదాహరణకు ‘వైట్ డ్వార్ఫ్’గా పిలవబడే చిన్న నక్షత్రం యొక్క గరిష్ట ద్రవ్యరాశి పరిమితిని చంద్రశేఖర్ క్వాంటమ్ సిద్ధాంతాల ఆధారంగా గణించి, 2.864ఁ 1030 కిలోగ్రాములుగా నిర్ధారించారు. ఈ ద్రవ్యరాశి విలువను దాటితే, ‘న్యూట్రాన్ నక్షత్రాలు’ ఏర్పడతాయని, అవే కృష్ణబిలాలుగా ఏర్పడతాయని, వాటిలోంచి విభిన్నమైన శకల శేషాలు ఆవిర్భావం చెందుతాయని చంద్రశేఖర్ ప్రతిపాదించారు. ఆయనకు రాయల్ సొసైటీ ఫెలోగా 1944లో ‘ఎఫ్.ఆర్.ఎస్’ గుర్తింపు ఇవ్వటం జరిగింది. 1968వ సంవత్సరంలో భారత ప్రభుత్వం చంద్రశేఖర్‌ను ‘పద్మ విభూషణ్’తో సత్కరించింది. సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ 1966లో అమెరికా పౌరసత్వం అందుకున్నారు. ఆయనకు అమెరికా శాశ్వత పౌరసత్వాన్ని ఇచ్చింది. చంద్రశేఖర్ అమెరికా ప్రభుత్వం చేపట్టిన అనేక నాసా పరిశోధనలలో సేవలందించారు. అద్భుత ఆవిష్కరణలను చేశారు. ఆయన సేవలకు గాను నాసావారు ఒక పరిశోధన ప్రయోగశాలకు సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ పేరుపెట్టారు. అంతరిక్ష శాస్త్రంలో ఆయన ఎనిమిదికి పైగా గ్రంథాలను ప్రచురించారు. ఇంతటి అద్వితీయ ప్రతిభాశాలి సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ 1995వ సంవత్సరం ఆగస్టు 21వ తేదీన చికాగోలో గుండె జబ్బుతో మరణించారు. ఆయన పరిశోధనలు మానవాళికి ఎంతో విజ్ఞానాన్నందిస్తాయి. సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ పరిశోధనలు...బిరుదులు... పురస్కారాలు! 1929-39: అంతరిక్ష నిర్మాణం, చంద్రశేఖర్ పరిమితి, అంతరిక్ష గతిశాస్త్ర పరిశోధనలు. 1939-43: న్యూట్రాన్ రేడియేటివ్ ట్రాన్స్ఫర్, రుణాత్మక హైడ్రోజన్ (హైడ్రైవ్ అయాన్)ల క్వాంటమ్ సిద్ధాంతం. 1943-50: హైడ్రో డైనమిక్, హైడ్రో మ్యాగ్నటిక్ స్థిరత్వం. 1950-69: ఎలిప్స్ ఆకృతిగల నిర్మాణాల సమతాస్థితి, స్థిరత్వాలు. 1971-83: కృష్ణబిలాల భౌతిక విజ్ఞాన గణిత సిద్ధాంతం 1980: గురుత్వాకర్షణ తరంగాల పరస్పర తాడనాల సిద్ధాంతం. పదవులు, ఆవిష్కరణలు: 1952-71: అంతరిక్ష భౌతిక విజ్ఞాన శాస్త్ర జర్నల్. 1995 న్యూటన్ సిద్ధాంత సూత్రాల ప్రచురణ. 1983: నోబెల్ పురస్కారం (భౌతిక శాస్త్రంలో). 1968: పద్మ విభూషణ్ పురస్కారం. 1984: కోప్లే మెడల్ 1966: అమెరికా జాతీయ విజ్ఞానశాస్త్ర మెడల్. - డా॥రెబ్బాప్రెగడ రామాంజనేయులు విశ్రాంత రసాయనాచార్యులు -
నోబెల్ ఇండియా: సర్ సి.వి.రామన్ విజ్ఞాన కాంతిపుంజం
పురస్కారం: నోబెల్ పురస్కారం అందుకున్న భారతీయులలో రెండవ వారు సర్ చంద్రశేఖర వేంకట రామన్. సి.వి.రామన్ భౌతిక శాస్త్రంలో ‘కాంతి విక్షేపణము - రామన్ ఫలితం’ అనే అంశంపై విస్తృతంగా పరిశోధించారు. ఆ పరిశోధనలకు గాను 1930వ సంవత్సరపు నోబెల్ బహుమతిని అందుకున్నారు. భౌతిక విజ్ఞాన శాస్త్రంలో కాంతి (లైట్), శబ్దం (సౌండ్) విభాగాలలో వేంకట రామన్ ఎన్నో విజయవంతమైన ఆవిష్కరణలు చేశారు. ఆయా రంగాలలో 400కు పైగా పరిశోధన పత్రాలు, ఎనిమిది గ్రంథాలను ప్రచురించారు. రామన్ బాల్యం: చంద్రశేఖర వేంకట రామన్ తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లాలో తిరువనైకోవిల్ గ్రామంలో 1888వ సంవత్సరం నవంబర్ ఏడవ తేదీన జన్మించారు. రామన్ తండ్రి ఆర్. చంద్రశేఖర అయ్యర్ కళాశాల అధ్యాపకులు. గణిత, భౌతిక శాస్త్రాలు బోధించేవారు. తల్లి పార్వతి అమ్మాళ్ గృహిణి. ఈ దంపతుల రెండవ సంతానమే వేంకట రామన్. ఈయన చిన్నతనంలో చంద్రశేఖర అయ్యర్‌కు విశాఖపట్నం ఎ.వి.ఎన్. కళాశాలలో భౌతిక శాస్త్రాధ్యాపకునిగా ఉద్యోగం వచ్చింది. దాంతో ఆ కుటుంబం విశాఖపట్నానికి మారింది. వేంకట రామన్... విశాఖలోని సెయింట్ ఎలాషియస్ ఆంగ్లో ఇండియన్ పాఠశాలలో విద్యను అభ్యసించారు. ఆయన 12 సంవత్సరాలకే మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణుడైన ప్రతిభాశాలి. ఆ రోజుల్లో ఇలాంటి మేధావులకు ప్రభుత్వ ప్రోత్సాహం బాగా ఉండేది. సర్కారు ఖర్చుతో ఉన్నత విద్యాభ్యాసానికి ఇంగ్లండు పంపేవారు. సి.వి.రామన్‌కు ఆ అవకాశం వచ్చినప్పటికీ ఆరోగ్యకారణాల వల్ల వైద్యుల ఆమోదం లభించలేదు. ఆ కారణంగా ఆయన ఇంగ్లండ్‌కు వెళ్లలేకపోయారు. కాలేజీ చదువులకు మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో చేరారు. రామన్ 1904లో బంగారు పతకంతో బీఏ పట్టా అందుకున్నారు. 1907లో భౌతిక శాస్త్రంలో ఎమ్మెస్సీ పట్టా సాధించారు. కాంతి విక్షేపణ, వివర్తనలపై రాసిన థీసిస్ 1906లో ప్రచురితమైంది. రామన్ ఉద్యోగ జీవితం: రామన్‌కు అసిస్టెంట్ అకౌంటెంట్‌గా కలకత్తాలో పోస్టింగ్ వచ్చింది. సర్కారు ఉద్యోగం చేస్తూనే రామన్ ఐఏసీఎస్ (ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్)లో చేరి భౌతిక శాస్త్రంలో ప్రయోగాలు చేశారు. ఏడాది తిరిగేసరికి (1917లో) కలకత్తా విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్ర ప్రొఫెసర్‌గా చేరారు. రామన్ 1921వ సంవత్సరంలో కలకత్తా విశ్వవిద్యాలయం తరఫున ఇంగ్లండులోని ఆక్స్‌ఫర్డ్‌కు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఆయన సముద్ర యానం చేశారు. ఆ ప్రయాణంలో ఓడ పైనుండి సముద్రాన్ని వీక్షించిన రామన్ మదిలో ఎన్నో సందేహాలు మొలకెత్తాయి. సముద్ర జలాలు ఆకుపచ్చ - నీలి రంగుతో ఎందుకు కనిపిస్తాయి? అనే సందేహం ప్రధానమైనది. కలకత్తాకు చేరగానే కాంతి వివర్తనం, విక్షేపాలపై ప్రయోగాలు ప్రారంభించారు. ఈ ప్రయోగాల ఫలితంగా రామన్ విజ్ఞాన శాస్త్ర ప్రపంచంలోనే అత్యంత ప్రభావం కలిగిన ‘రామన్ ఫలితాన్ని’ కనుగొన్నారు. తన బలం... తెలిసిన క్షణం! రామన్‌కు తన పరిశోధనల విలువ తెలిసేలా, రామన్ ఫలితం గురించి ప్రపంచంలోని భౌతిక శాస్త్రజ్ఞులకు తెలిసేలా చేసిన సంఘటన క్రాంప్టన్కు నోబెల్ బహుమతి రావడమే. 1927లో కాంప్టన్‌కు నోబెల్ బహుమతి తెచ్చిన ప్రయోగంలో ‘ఎక్స్’ కిరణాలను పారదర్శకమైన యానకం గుండా పంపితే, కొన్ని కిరణాల తరంగ దైర్ఘ్యాలలో మార్పులు కలుగుతాయనీ, దీనినే కాంప్టన్ ఫలితం అంటారని కాంప్టన్ ప్రచురించాడు. వెంటనే రామన్ ఏకవర్ణ కాంతి తరంగాలతో (మెర్క్యూరీ ల్యాంప్ ఉపయోగించి) రామన్ ఫలితాన్ని, తరంగ దైర్ఘ్యంలో తగ్గుదల ఉన్న కాంతి కిరణాలను (వీటినే రామన్ లైన్స్ అంటారు) బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో జరిగిన శాస్త్రవేత్తల సెమినార్లో విజయవంతంగా ప్రయోగం చేసి ప్రదర్శించారు. ఫలితంగా డాక్టర్ చంద్రశేఖర వేంకట రామన్‌కు 1930వ సంవత్సరపు నోబెల్ బహుమతి ప్రకటించారు. నోబెల్ పురస్కారం లభించిన తర్వాత కూడా రామన్ శబ్ద తరంగాలపై పరిశోధనలను కొనసాగించారు. భారతీయ సంగీత వాద్యాలైన వయొలిన్, మృదంగం మొదలైన వాద్యాలలో శబ్ద తరంగాలు ఏ విధంగా శృతి పేయమైన శబ్దాలను ఉత్పాదిస్తాయో కనుగొని ఆ పరిశోధనలను ప్రచురించారు. భౌతిక, విజ్ఞాన శాస్త్రంలో రామన్ ప్రతిభకు తార్కాణంగా ప్రపంచంలోని ఎన్నో విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లు లభించాయి. భారత ప్రభుత్వం సి.వి.రామన్ ప్రతిభ, భారతదేశానికి పేరు తెచ్చిన ఆవిష్కరణలకు గుర్తింపుగా ఆయనను 1954లో ‘భారతరత్న’ బిరుదుతో సత్కరించింది. వైవాహిక జీవితం: రామన్ 1906లో అమ్మాళ్‌ను వివాహమాడారు. వీరికి చంద్రశేఖర్, రాధాకృష్ణన్ అనే ఇద్దరు కుమారులు. సి.వి.రామన్ తన జీవితమంతా భౌతిక శాస్త్ర పరిశోధనలకే అంకితమై, అంతిమ క్షణాల వరకూ భౌతికశాస్త్ర విషయాలతోనే గడిపారు. రామన్ ఎఫెక్ట్ అనువర్తనాలతో వెయ్యికి పైగా పరిశోధన వ్యాసాలు ప్రచురితమయ్యాయి. రామన్ వ్యక్తిత్వం! రామన్‌కు ‘భారతరత్న’ పురస్కారం లభించినప్పుడు, ఆ పురస్కారం అందుకోవటానికి ఢిల్లీకి రమ్మని స్వయంగా అప్పటి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ నుంచి ఆహ్వానం వచ్చింది. అందుకు రామన్ రాసిన జవాబే ఆయన వ్యక్తిత్వానికి ఒక నిదర్శనం. ‘‘మీరు నాపై చూపిన ఆదర సత్కారాలకు కృతజ్ఞుణ్ని. ప్రస్తుతం నేను నా విద్యార్థి ఒకరి పీహెచ్డీ పరిశోధన వ్యాసం పరిశీలనలో తుది దశలో ఉన్నాను. నా విద్యార్థి భవిష్యత్తు దృష్ట్యా ‘థీసిస్’ పని వాయిదా వేయలేను, క్షంతవ్యుడను’. ఈ ఉత్తరం సర్ రామన్‌కు తన కర్తవ్య ధర్మం పట్ల గల శ్రద్ధను తెలియపరుస్తుంది. 1943లో భారతీయ విజ్ఞాన సంస్థ (ఐఐఛి)లో రిటైర్ అయిన వెంటనే బెంగళూరులో రామన్ పరిశోధనా సంస్థను స్థాపించారు. ఆ సంస్థలోనే 1970, నవంబర్ 21వ తేదీన అంతిమ శ్వాస తీసుకున్నారు. డా॥రెబ్బాప్రెగడ రామాంజనేయులు విశ్రాంత రసాయనాచార్యులు రామన్ ఎఫెక్ట్ మెర్క్యూరీ ల్యాంప్ నుండి ఏకవర్ణ కాంతి తరంగాలను ఒక పారదర్శక యానకం గుండా ప్రసరింపజేస్తే, యానక ధర్మాలపై ఆధారపడి ఆ కాంతిలో కొంత భాగం వివర్తనం చెంది, తక్కువ తరంగ ధైర్ఘ్యం గల కాంతిగా బహిర్గతమౌతుంది. సముద్ర జలంపై ఇదే ప్రక్రియతో నీలి రంగు కాంతి బహిర్గతమవుతుంది. దీనినే ‘రామన్ ఫలితం’ (రామన్ ఎఫెక్ట్) అంటారు. రామన్ ఫలితాన్ని ఉపయోగించి, యానక పదార్థం యొక్క నిర్మాణాన్ని విశ్లేషించవచ్చు. ఈ విధంగా ఎన్నో పదార్థాల స్ఫటిక నిర్మాణాలను అవగతం చేసుకోవటానికి రామన్ ఫలితం ఉపయోగపడింది. రామన్ ఫలితాన్ని మొట్టమొదటిసారిగా ఫిబ్రవరి 28, 1928వ తేదీన సి.వి.రామన్, కె.ఎస్.క్రిష్ణన్‌ల రీసెర్చి ఫలితంగా ప్రచురించారు. రామన్‌కు లభించిన గౌరవ పురస్కారాలు 1924 - రాయల్ సొసైటీ ఫెలోషిప్ ఊఖ 1929 - బ్రిటిష్ మహారాణి నుండి నైట్‌హుడ్, సర్ 1930 - నోబెల్ పురస్కారం 1941 - ఫ్రాంక్లిన్ పతకం 1954 - భారతరత్న 1957 - లెనిన్ శాంతి బహుమతి 1917 - ఐఅఇ గౌరవ కార్యదర్శి 1933 - 48 భారతీయ విజ్ఞాన సంస్థ ఐఐఛి బెంగళూరులో ప్రొఫెసర్, 1948లో ఐఐఛిడెరైక్టర్ రామన్ రాసిన గ్రంథాలలో కొన్ని 1. కాంతి వివర్తనము (scattering of light) 2. అకాస్టిక్ (Acoustic) నాద తరంగ శాస్త్రం 3. ఆప్టికా (Optica) దృగ్గోచర కాంతి శాస్త్రం 4. ఖనిజములు, వజ్రముల కాంతి ధర్మాలు 5. స్ఫటికముల భౌతిక విజ్ఞానం 6. పుష్పాల రంగుల - అవగాహన 7. వీణ, వయొలిన్, తబల, మృదంగం మొదలైన సంగీత వాద్యాలలో శబ్ద తరంగాలు. పత్రికలు ఇండియన్ జర్నల్ ఆఫ్ ఫిజిక్స్ స్థాపన, సంపాదకత్వం ఇండియన్ అకాడెమీ ఆఫ్ సైన్స్ అండ్ జర్నల్ ఆఫ్ ద ఇండియన్ అకాడెమీ ఆఫ్ సెన్సైస్ కరెంట్ సైన్స్ జర్నల్ ఫిబ్రవరి 28వ తేదీన రామన్ ఫలితం ఆవిష్కరణకు గుర్తుగా జాతీయ విజ్ఞాన శాస్త్ర దినం (నేషనల్ సైన్స్ డే) జరుపుకుంటారు. తన లక్ష్యాన్ని, ధ్యేయాన్ని గుర్తించి వాటి సాధన కోసం శ్రద్ధగా పనిచేసిన ప్రతిభాశాలి సర్ చంద్రశేఖర వేంకట రామన్. -
నోబెల్ ఇండియా పురస్కారం: రవీంద్రనాథ్ ఠాగూర్ అధినాయక కవి
ఆంగ్లేతర సాహిత్య రచనలతో అత్యంత ప్రతిష్ఠాకరమైన నోబెల్ పురస్కారాన్ని అందుకున్న ప్రతిభాశాలి విశ్వకవి రవీంద్రనాథ ఠాగూర్. ఈయన రచించిన ‘గీతాంజలి’ తదితర బెంగాలీ రచనలు సమాజాన్ని ఉత్తేజరపరిచాయి. భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటాయి. ఠాగూర్ రచనలు సర్వ మానవ సౌభ్రాతృత్వ భావనకు ప్రాణం పోశాయి. వీటిని రవీంద్రుడే స్వయంగా ఆంగ్లానువాదం చేయడం మరో విశేషం. ఈ అనువాదాల ద్వారా నోబెల్ కమిటీ ఈ రచనల సారాంశాన్ని గ్రహించింది. అతడిని 1913లో నోబెల్ బహుమానానికి అర్హుడిగా ప్రకటించింది. రవీంద్రనాథ్ ఠాగూర్ కోల్‌కతా మహానగరంలోని బ్రాహ్మణ జమిందారీ కుటుంబంలో జన్మించారు. ఈయన తండ్రి దేవేంద్రనాథ ఠాగూరు, తల్లి శారదాదేవి. ఈ దంపతుల 13వ సంతానం రవీంద్రుడు. ఇతడే కడపటివాడు. ‘ఠాగూర్’ అంటే ‘గౌరవప్రదమైన అయ్యా’ అని అర్థం. రవీంద్రుని తల్లి శారదాదేవి అతడి చిన్నతనంలోనే మరణించారు. దాంతో ఆయన నౌకర్ల చేతిలో పెరిగాడు. రవీంద్రుడి జ్యేష్ట సోదరుడైన ద్విజేంద్రనాథ ఠాగూరు సమాజంలో గౌరవం పొందిన కవి, తత్వవేత్త. మరొక సోదరుడు సత్యేంద్రనాథ్ బ్రిటిష్ ప్రభుత్వం నుండి ఐసీఎస్ పదవి పొందిన తొలి భారతీయ అధికారి. మరొక సోదరుడు జ్యోతీంద్రనాథ నాటక ప్రయోక్త, సంగీతకారుడు. అందువల్ల జోరాశాంకో జమీందారీ బంగళా ఎప్పుడూ నాటకాలతో, పాశ్చాత్య, బెంగాలీ సంగీత సభలతో, సాహిత్య గోష్ఠులతో కళకళలాడుతూ ఉండేది. రవీంద్రుని సోదరి స్వర్ణకుమారి రచయిత్రి. రవీంద్రుడు ఏ పాఠశాలకు పోకుండానే ఇంటివద్దే విద్యాభ్యాసం చేశాడు. 8 సంవత్సరాల వయసులోనే రవీంద్రుడు పద్యాలు రాయటం ప్రారంభించాడు. ఆయన రాసిన మొట్టమొదటి పద్య సంపుటి ‘భాను సింహ’, అయితే దానిని బెంగాలీ పండితులు ఆమోదించలేదు. శాంతినికేతన్‌కు పయనం! రవీంద్రునికి 11 సంవత్సరాల వయసులో ఉపనయనం జరిగింది. ఆ తరువాత రవీంద్రుడు తన సోదరులతో కలిసి తండ్రి స్థాపించిన శాంతినికేతన్ ఎస్టేట్‌కు వెళ్లాడు. ఆ సమయంలోనే ఆయన హిమాలయాలలోని డల్హౌసీ, పర్వత ప్రాంతాలను దర్శించాడు. ఆ ప్రాంతాలు, శాంతినికేతన్, రవీంద్రుని మనస్సును ఆకట్టుకున్నాయి. రవీంద్రుడు సోదరులతో అక్కడే కొన్ని నెలల పాటు గడిపాడు. ఆ సమయంలోనే ఎందరో ప్రసిద్ధ వ్యక్తుల జీవిత చరిత్రలు, ఆయన తండ్రి జీవిత చరిత్ర, బెంజమిన్ ఫ్రాంక్లిన్ (రచయిత) జీవిత చరిత్ర, ఎడ్వర్ట్ గిబ్బన్ రాసిన రోమన్ సామ్రాజ్య తిరోగతి, పతనం, కాళిదాసు కవిత్వం మొదలైన రచనలను ఆకళింపు చేసుకున్నారు. తాను స్వయంగా రాయడం ప్రారంభించారు. న్యాయశాస్త్రం చదివించాలని! రవీంద్రుడిని బారిస్టర్‌ని చేయాలనేది తండ్రి దేవేంద్రనాథ్ కోరిక. 1878 సంవత్సరంలో రవీంద్రుణ్ని ఇంగ్లండుకి పంపించారు. ఇంగ్లండులో న్యాయ శాస్త్ర కళాశాలలో చేరినప్పటికీ ఆయన బారిష్టర్ కాలేదు. ఆ చదువు మధ్యలోనే మాని, షేక్స్పియర్ రచనలు ‘రెలిజియో మెడిసి’, ‘కొరియొలోనస్’, ‘ఆంటోనీ క్లియోపాత్రా’ మొదలైనవన్నీ ఆకళింపు చేసుకున్నారు. చక్కని ఆంగ్ల భాషలో మాట్లాడటం, రాయటం నేర్చుకున్నారు. ఐరిష్, స్కాటిష్ జానపద గేయాలను నేర్చుకుని, 1880లో స్వదేశం చేరుకున్నారు. బ్రహ్మ సమాజ సిద్ధాంతాలను యూరప్ దేశాల సంస్కృతులతో మేళవించి, రెండింటిలోని మంచిని తాను నమ్మిన సిద్ధాంతాలకు అన్వయించాడు. వివాహం! రవీంద్రుని వివాహం 1883వ సంవత్సరంలో భవతారిణి శాఖకు చెందిన మృణాళినీదేవితో జరిగింది. ఈ దంపతులకు ఐదుగురు సంతానం. 1890లో జమీ వ్యవహారాల బాధ్యత ఆయన మీద పడింది. ‘షి లై ద హా’ అనే అతిపెద్ద జమీందారీ ఎస్టేట్ (ఈ ప్రాంతం ప్రస్తుత బంగ్లాదేశ్‌లో ఉంది) నిర్వహణలోని లోపాలను సవరించారాయన. వ్యవసాయ భూములను రైతులకు స్వాధీనం చేసి, వారి నుంచి నామ మాత్రపు శిస్తులు వసూలు చేసేవారు. జమీందారీ వ్యవహారాలు చూసుకుంటూనే రచనా వ్యాసంగాన్ని కొనసాగించారు. 1901లో రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్‌కు మకాం మార్చుకున్నారు. శాంతినికేతన్లో ఉన్నప్పుడు రవీంద్రుని పిల్లలిద్దరు, ఆయన భార్య మృణాళిని మరణించారు. దానితో రవీంద్రుడు విరాగిగా మారిపోయారు. 1905వ సంవత్సరంలో రవీంద్రుని తండ్రి దేవేంద్రనాథ్ మరణించడంతో రవీంద్రునికి జమీందారీ జీవితంపై ఆసక్తి నశించింది. రచనావ్యాసంగంలో మునిగిపోయి, ఆందులోనే సాంత్వన పొందారు. రచనలపై నెలకు వచ్చే రెండు వేల రూపాయల రాయల్టీతో సామన్యమైన జీవితం గడపటం ప్రారంభించాడు. ఠాగూర్ తన రచనలలో చాలా వాటికి స్వయంగా ఆంగ్లానువాదాలు చేశారు. నోబెల్ బహుమతి అందుకున్న తర్వాత బ్రిటన్ మహారాణి ఠాగూర్‌కు ‘నైట్’ బిరుదు ప్రదానం చేశారు. అయితే రవీంద్రుని దేశభక్తి ఆ బిరుదుని త్యజించేలా చేసింది. జలియన్ వాలాబాగ్ దుర్ఘటనలో బ్రిటిష్ సైన్యం భారతీయులను హతమార్చిన సంఘటన ఆయనను తీవ్రంగా కలచివేసింది. అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన బిరుదును తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. విశ్వకవి పై జాతిపిత ప్రభావం! మహాత్మాగాంధీతో పరిచయం ఏర్పడిన తర్వాత రవీంద్రుడు తనదైన శైలిలో స్వాతంత్య్ర పోరాటం ప్రారంభించారు. కుల వివక్షను తొలగించటానికి బెంగాల్లో శ్రీకారం చుట్టి, దక్షిణాదిన గురువాయూరు దేవాలయంలో దళితులకు ప్రవేశం కల్పించి, అంటరానితనాన్ని నిర్మూలించటానికి ఎన్నో మార్గాలు సూచించారు. పల్లెల పునర్ నిర్మాణం కోసం వ్యవసాయ ఆర్థిక శాస్త్రవేత్త ఎల్మ్‌హర్‌స్ట్‌తో కలిసి బెంగాల్లో ‘శ్రీ నికేతన్ సంక్షేమ సంస్థ’ను స్థాపించి, పల్లె ప్రజలలో మనోవికాసం తేవటానికి కృషి చేశారు. 1930 దశాబ్దంలో కుల నిర్మూలన ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. దానికి సంబంధించిన ఎన్నో నవలలు, నాటకాలు రాశారు. భారతీయ ఔన్నత్యాన్ని చాటుతూ... రవీంద్రనాథ్ ఠాగూర్ అనేక దేశాలు సందర్శించి ‘విశ్వంలోని మానవులంతా ఒక్కటే’ అనే సందేశాన్ని అందించారు. తాను నమ్మిన బ్రహ్మ సమాజ సిద్ధాంతాల ద్వారా మతాలకు అతీతమైన పరబ్రహ్మమొక్కటే అందరికీ దైవం అని ప్రచారం చేసి ‘విశ్వకవి’, ‘గురుదేవ్’ బిరుదులను శాశ్వతం చేసుకున్నారు. ప్రపంచ పర్యటనలో 35కు పైగా దేశాలలో భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని చాటిచెప్పారు. విశ్వకవి రవీంద్రుడి జీవితం ఒక విజ్ఞాన సర్వస్వం. ఎవరు ఏ దృష్టితో శోధించినా దానికి సంబంధించిన విషయం, వివరణ లభించక మానదు. జనగణమన... అధినాయక..! గీతాంజలి, గోరా, ఘరే బైరే మొదలైన రచనలన్నీ సహజత్వం ఉట్టిపడుతూ సామాన్యులకు అర్థమయ్యేటట్లు వాడుకభాషలో, సరళమైన శబ్దాలతో ఉంటాయి. దేశభక్తిని, విశ్వమానవ సౌభ్రాతృత్వం చాటేటట్లు రాసిన రెండు గీతాలను భారతదేశం (జనగణమన), బంగ్లాదేశ్ (అమార సోనార్ బంగ్ల) జాతీయగీతాలుగా ఎంపిక చేసుకున్నాయి. ఠాగూర్ గీత రచయిత మాత్రమే కాదు... నాటక రచయిత, నాటక కర్త, వక్త, వ్యాఖ్యాత కూడ. రవీంద్రుని రచనలు: గీతాలు: మానసి (1890); సోనార్ తరి (1890); గీతాంజలి (1910); గీతిమాల్య (1914); తోటమాలి (1913) (వీటిని స్వయంగా ఆంగ్లంలోకి స్వేచ్ఛానువాదం చేశారు). నాటకాలు, కథలు: రాజా (1910); డాక్ ఘర్ (1912); అచలాయతన్ (1912) ; ముక్తధార (1922); రక్తక రవి (1926) ‘గోరా’(1910); ఘరే బైరే (1916); యోగా యోగాలు (1929) ; బికారిణి (1929) , నృత్యరూపకాలు: పాత్రపుత్( 1936), శేషసప్తక్ (1935), శ్యామ (1939), చండాలిక (1939) రవీంద్రుడు ఆరోగ్యం క్షీణించిన తర్వాత ‘చార్ అధ్యాయ్ (1934), విశ్వ పరిచయ్ (1937), తీన్‌సంగి, గల్పశిల్ప (1941)’ మొదలైన రచనలు చేశారు. 1941లో రవీంద్రుడు చనిపోయే ముందురోజు అప్పటి ఎలక్షన్ కమిషనర్ అయిన ఏకే సేన్ అనే మిత్రుణ్ని పిలిచి, తన తుది సందేశాన్ని చెప్పారు. ‘నా జన్మ మధ్యలోనే అంతరిస్తోంది. ఈ సమయంలో నా స్నేహితుల వెచ్చని స్పర్శ, ఈ పుడమితల్లి శాశ్వత ప్రేమ, మానవులందరి ఆశీస్సులను నాతో తీసుకుని వెళ్తున్నాను. నేను ఈ ప్రపంచానికి ఇవ్వవలసినదంతా ఇచ్చాను. ఈ రోజు నేను ఖాళీ సంచితో ఉన్నాను. మీరంతా కొంత ప్రేమ, క్షమాపణలు ఇస్తే ఈ ప్రపంచం లేని చోటకి శాశ్వతానందంతో వెళ్తాను’ అని రాయించారు ఠాగూర్. ప్రపంచ ప్రజలందరినీ ఉత్తేజపరిచే సందేశాన్నిచ్చిన విశ్వకవి 1941వ సంవత్సరం ఆగస్టు 7వ తేదీన శరీర త్యాగం చేశారు. - డా॥రెబ్బాప్రెగడ రామాంజనేయులు విశ్రాంత రసాయనాచార్యులు -
విజ్ఞాన మూర్తికి విశాఖ స్ఫూర్తి
=ఏవీఎన్ కళాశాలలో విద్యాభ్యాసం =ఏయూతో విడదీయరాని బంధం =పరిశోధనకు ఇక్కడే పునాది అనంతమైన నీలాకాశం.. అదే రంగులో అలరించే అందాల సాగరం.. ఇవి సాధారణంగా ప్రకృతి ప్రేమికులను పరవశింపజేసే దృశ్యాలు.. కానీ సి.వి.రామన్ పులకరింతతోనే ఆగిపోలేదు. భౌతిక శాస్త్రంలో సరికొత్త ఆవిష్కరణ కోసం పలవరించాడు. పరితపించాడు. ఆకాశం, సముద్రం.. రెండూ నీలం రంగునే ప్రతిఫలించడంపై పరిశోధించాడు. ‘రామన్ ఎఫెక్ట్’ను ప్రపంచానికి అందించి, నోబెల్ బహుమతి సాధించాడు. ఆ విఖ్యాత శాస్త్రవేత్త విశాఖలోనే చివురు తొడిగి.. మహావృక్షంగా ఎదిగాడన్న వాస్తవం మనందరికీ గర్వకారణం. ఏయూ క్యాంపస్, న్యూస్‌లైన్ : కాంతి కిరణాలపై పరిశోధన చేసి ప్రపంచ వైజ్ఞానిక రంగంలో భారతదేశపు కీర్తిని ఇనుమడింపజేశారు చంద్రశేఖర్ వెంకటరామన్ (సి.వి.రామన్). భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన మొదటి భారతీయుడు ఆయన. చిన్నతనం నుంచి తన చుట్టూ పరిసరాలను పరిశీలిస్తూ ప్రశ్నించే తత్వం అలవరచుకొని, ప్రపంచం గర్వించదగ్గ శాస్త్రవేత్తగా ఎదిగారు. విజ్ఞాన శాస్త్రం చిగురుతొడుగుకుంటున్న రోజుల్లోనే మహావృక్షంగా అవతరించారు. ఆయన ప్రాథమిక విద్య మిసెస్ ఏవీఎన్ కళాశాలలో జరిగింది. ఇక్కడే ఉన్నతంగా ఎదగడానికి బలమైన పునాది పడిందనడంలో సందేహం లేదు. బాల్యంలో అందించే క్రమబద్ధమైన, ఆలోచనాత్మకమైన విద్యా విధానం వ్యక్తిని ఎంతటి ఉన్నత స్థానానికైనా తీసుకువెళ్తుందనడానికి ఆయన జీవితం ఉదాహరణ. విద్యాభ్యాసం అంతా ఇక్కడే: 1888 నవంబర్ 7న తమిళనాడులోని తిరుచ్చిరాపల్లిలో జన్మించిన రామన్ చిన్నతనమంతా విశాఖలోనే సాగింది. ఆయన తండ్రి చంద్రశేఖర్ అయ్యర్ మిసెస్ ఏ.వి.ఎన్.కళాశాలలో భౌతిక, గణిత శాస్త్రాలను బోధించేవారు. రామన్ కూడా ఇదే కళాశాలలో విద్యాభ్యాసం చేశారు. చిన్నతనం నుంచి తెలివైన విద్యార్థిగా పేరుతెచ్చుకున్న రామన్ తన పదకొండవ ఏట మెట్రిక్యులేషన్, పదమూడోఏట ఇప్పుడు ఇంటర్‌కు సమానమైన ఎఫ్ఏను పూర్తిచేశారు. తరగతిలో టాపర్‌గా నిలిచారు. తరువాత మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో ఉన్నత విద్య అభ్యసించారు. కళాశాలను మరువలేదు: తాను చదువుకున్న కళాశాలలను సి.వి.రామన్ మరువలేదు. విశాఖను వీడి వెళ్లిన తరువాత అనేక ఉన్నత స్థానాలను అధిరోహిం చినప్పటికీ తన కళాశాలతో అనుబంధాన్ని కొనసాగించారు. 1930లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని అందుకున్న తరువాత 1938 నవంబర్ 11న విశా ఖ వచ్చారు. ఏవీఎన్ కళాశాలను సందర్శించి అక్కడ ఆయన చేసిన సంతకం నేటికీ పదిలంగా ఉంది. జ్ఞాపకాలు పదిలం : రామన్ తండ్రి కళాశాలకు బహూకరించిన చెక్క అల్మారా, రామన్ అందించిన పలు పుస్తకాలు నేటికీ ఏవీఎన్ కళాశాలలో ఉన్నాయి. రామన్లాగే ఇవి తమ సంపదగా భావించి కళాశాల యాజమాన్యం వాటిని కాపాడుతోంది. ఆ మహానుభావుడు ప్రయోగాలు చేసిన లేబొరేటరీ నేటికీ ఉంది. ప్రస్తుత విద్యార్థులు సైతం ఇదే ప్రయోగశాలలో భౌతిక శాస్త్ర ప్రయోగాలు చేస్తుండటం విశేషం. రామన్ జ్ఞాపకంగా భౌతిక శాస్త్ర ప్రయోగశాలను నేటికీ ఎటువంటి మార్పులు చేయకుండా వారసత్వ సంపదగా సంరక్షిస్తూ వస్తున్నారు. ఏయూతో అనుబంధం ఆంధ్రవిశ్వవిద్యాలయంతో సి.వి.రామన్‌కు ఎంతో అనుబంధం ఉంది. ఈయన వర్సిటీకి గౌరవ ఆచార్యుడిగా పనిచేశారు. పలు సందర్భాలలో ఆయన ఏయూను సందర్శించి పలు ప్రసంగాలు, బోధన జరిపారు. సి.వి.రామన్ శిష్యుడు ఆచార్య సూరిభగవతం ఏయూ భౌతక శాస్త్ర విభాగాన్ని ప్రారంభించి, తొలి విభాగాధిపతిగా నిలిచారు. ఈయనకు నిరంతరం సూచనలు ఇస్తూ వర్సిటీలో భౌతిక శాస్త్ర విభాగాన్ని దేశంలోని ప్రముఖ విభాగాల్లో ఒకటిగా తీర్చిదిద్దడంలో రామన్ కృషి ఉంది. అందుకే ఆయన స్మృతి చిహ్నంగా భౌతిక శాస్త్ర విభాగంలో రామన్ విగ్రహం ఏర్పాటు చేశారు. రామన్ ప్రయోగశాల చూస్తారా..? సర్ సి.వి.రామన్ జయంతిని పురస్కరించుకుని గురువారం మిసెస్ ఏవీఎన్ కళాశాలలో రామన్ జయంతి సభ నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా పలు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందిస్తాం. రామన్‌కు సంబంధించిన విశేషాలను చిన్నారులకు తెలియజేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాం. పాఠశాల విద్యార్థులకు గురువారం రామన్ పనిచేసిన ప్రయోగశాలను సందర్శించే అవకాశం కల్పిస్తున్నాం. తద్వారా విద్యార్థుల్లో స్ఫూర్తి నింపడానికి వీలవుతుంది. కార్యక్రమంలో భాగంగా డీఆర్డీఏ హైదరాబాద్ డెరైక్టర్ డాక్టర్ బి.రామకృష్ణారావు కళాశాలను సందర్శించనున్నారు. -డాక్టర్ టి.ఎల్.రాంబాబు, భౌతిక, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్‌సైన్స్ విభాగాధిపతి, మిసెస్ ఏవీఎన్ కళాశాల -
పరిశోధనలపై పెట్టుబడులు పెరగాలి: ప్రణబ్ ముఖర్జీ
పాట్నా: ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త సి.వి. రామన్ ప్రపంచ అత్యున్నత పురస్కారమైన నోబెల్ బహుమతి అందుకొని 80 ఏళ్లకుపైగా గడిచినా దేశంలో మరెవరూ ఆ పతకాన్ని అందుకోలేకపోవడంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ విచారం వ్యక్తం చేశారు. దేశం మళ్లీ నోబెల్ అందుకోవాలంటే పరిశోధన, సృజనాత్మక సాంకేతిక రంగాల్లో పెట్టుబడులు గణనీయంగా పెరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఐఐటీ పాట్నా స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన విద్యార్థులను ఉద్దేశించి ఉపన్యసించారు. హర్గోవింద్ ఖురానా, చంద్రశేఖర్, అమర్త్యసేన్ లాంటి భారతీయులు నోబెల్ అందుకున్నా.. వారు స్థానిక సంస్థల్లో పరిశోధనలు చేయలేదని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా టాప్ 200 యూనివర్సిటీల్లో భారత్‌కు చోటు దక్కకపోవడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీహార్ చరిత్రలో నలంద, విక్రమశిల, తక్షశిల లాంటి విశ్వవిద్యాలయాలు ప్రపంచానికి విద్యనందించాయని, అలాంటి శోభను మళ్లీ తీసుకురాలేమా అంటూ ప్రశ్నించారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యలో వినియోగించుకుంటే ప్రస్తుత పరిస్థితి నుంచి గట్టెక్కవచ్చని ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో బీహార్ రాష్ట్ర గవర్నర్ డీవై పాటిల్, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పాల్గొన్నారు. స్నాతకోత్సవంలో గౌన్లు ధరించే సంస్కృతికి స్వస్తి చెప్పేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నితీశ్ కుమార్ రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. -
ముగ్గురు అమెరికన్లకు ఆర్థిక నోబెల్
ఆస్తుల ధరల విశ్లేషణకు గుర్తింపు స్టాక్‌హోం: ఆస్తుల ధరలను అనుభవపూర్వకంగా విశ్లేషించే విధానాన్ని ఆవిష్కరించిన ముగ్గురు అమెరికా ఆర్థిక శాస్త్రవేత్తలకు ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి దక్కింది. షేర్లు, బాండ్లు వంటి ధరలు రాబోయే కాలంలో ఎలా ఉంటాయో అంచనా వేసే పద్ధతిని కనిపెట్టిన ఈజెన్ ఫామా, లార్స్ పీటర్స్ హాన్సన్, రాబర్ట్ షిల్లర్లను 2013 ఏడాది గాను ఈ పురస్కారానికి ఎంపిక చేశామని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సెన్సైస్ సోమవారం వెల్లడించింది. ఫామా, హాన్సన్‌లు షికాగో వర్సిటీలో, షిల్లర్ యేల్ వర్సిటీలో పనిచేస్తున్నారు. షేర్లు, బాండ్ల ధరల ధోరణి రాబోయే కాలంలో ఎలా ఉంటుందో స్వానుభవ విశ్లేషణ ద్వారా అంచనా వేయొచ్చని వీరు ప్రతిపాదించారు. షేర్లు, నగదు, బ్యాంకు డిపాజిట్లు.. ఇలా ఏ రూపంలో డబ్బును పొదుపు చేయాలనేది వ్యక్తులు వేసే కష్ట నష్టాల అంచనాపై ఆధారపడి ఉంటుందని వీరు పేర్కొన్నారు. కాగా, షట్‌డౌన్ సమస్యతో అమెరికా అప్పులు చెల్లించలేక చేతులెత్తేస్తుందని తాననుకోవడం లేదని షిల్లర్ చెప్పారు. -
ఆర్ధికశాస్త్రంలో ముగ్గురు అమెరికన్లకు నోబెల్
స్టాక్‌హోమ్: ఆర్ధికశాస్త్రంలో నోబెల్ బహుమతి ముగ్గురు అమెరికన్లను వరించింది. అమెరికా ఆర్థికవేత్తలు యూజీన్ ఫామా, లార్స్ పీటర్ హన్సెన్, రాబర్ట్ షిల్లర్‌కు 2013గానూ నోబెల్ పురస్కారం దక్కింది. అనుభావిక విశ్లేషణతో ఆస్తుల ధరల మదింపులో విశేష ప్రతిభ చూపినందుకు వారిని ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్టు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సోమవారం ప్రకటించింది. 1968 నుంచి ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి ఇస్తున్నారు. గతేడాది కూడా ఇద్దరు అమెరికన్లు ఆర్థిక శాస్త్రంలో నోబెల్ దక్కించుకోవడం విశేషం. 2011లోనూ ఇద్దరు అమెరికన్లు ఆర్థిక శాస్త్రంలో నోబెల్ సాధించారు. -
పురస్కారం: ఆల్ఫ్రెడ్ నోబెల్ శాంతికాముకుడు
ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైనది ‘నోబెల్’ పురస్కారం. విజ్ఞానశాస్త్రం, కళలు, వైద్యరంగం, సాహిత్యం, ప్రపంచ శాంతి వంటి రంగాలలో నిష్ణాతులైనవారికిచ్చే గుర్తింపు ఇది. ఈ పురస్కారాన్ని మానవాళికి అత్యంత ప్రయోజనకరమైన ఆవిష్కరణలు చేసిన వారికి ఇస్తారు. ఏటా నామినేషన్లు అక్టోబరులో మొదలవుతాయి. నోబెల్ పురస్కారం ఆవిష్కర్త, వ్యవస్థాపకుడు ఆల్ఫ్రెడ్ (లార్డ్) బెర్నార్డ్ నోబెల్. ఇతడు స్వీడన్ దేశానికి చెందిన రసాయన శాస్త్రజ్ఞుడు. నోబెల్... రసాయన శాస్త్రంలో, ప్రధానంగా విస్ఫోటకాల (ఎక్స్‌ప్లోజివ్స్) రంగంలో అనేక ఆవిష్కరణలు, పేటెంట్ల ద్వారా విశేషంగా ధనం ఆర్జించాడు. ఆ ధనాన్ని ఒకచోట మూలధనంగా ఉంచి, ‘నోబెల్ ఫౌండేషన్’ అనే సంస్థ ద్వారా ఆ మూల ధనంపై వచ్చే వార్షిక వడ్డీని నోబెల్ పురస్కారాల రూపంలో ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఏటా ఈ పురస్కారాలను వివిధ రంగాలలో నిష్ణాతులైన మేధావులకు అందజేయవలసిందిగా వీలునామా రాసి గతించాడు. ఆల్ఫ్రెడ్ నోబెల్... తాను జీవితకాలమంతా సంపాదించిన ధనాన్ని తృణప్రాయంగా పరిత్యజించటం వెనుక బలమైన కారణమే ఉంది. దానిని తెలుసుకుంటే మానవాళికంతటికీ కనువిప్పు కలుగుతుంది. అందువల్ల ఆల్ఫ్రెడ్ నోబెల్ జీవితగాధను చదివి తీరవలసిందే! ఆల్ఫ్రెడ్ నోబెల్ బాల్యం నోబెల్ శాస్త్రజ్ఞుడి పూర్తి పేరు ఆల్ఫ్రెడ్ బెర్నాడ్ నోబెల్ (తర్వాతి కాలంలో ఈయనకు ‘లార్డ్’ అనే బిరుదు వచ్చింది). ఇతడు స్వీడన్ దేశంలోని స్టాక్‌హోమ్ పట్టణంలో 1833వ సంవత్సరం అక్టోబర్ 21వ తేదీన జన్మించాడు. ఇతని తండ్రి ఇమ్మాన్యుయేల్ నోబెల్, తల్లి కెరోలీనా ఆండ్రీ. ఇమ్మాన్యుయేల్ ఇంజనీరు, రసాయన శాస్త్రజ్ఞుడు. పేలుడు పదార్థాలు తయారుచేసే కంపెనీకి అధిపతి. ఎనిమిది మంది సంతానంలో ఆల్ఫ్రెడ్ నోబెల్ నాల్గవవాడు. ఇమ్మాన్యుయేల్ పేలుడు పదార్థాలు తయారుచేసి విక్రయిస్తూ ఉండటంతో, ఆల్ఫ్రెడ్ నోబెల్ కూడా అదే రంగం మీద ఆసక్తి పెంచుకున్నాడు. పేలుడు పదార్థాల తయారీలోనే స్థిరపడ్డాడు. ప్రస్తుతం మనదేశంలో అందరి నోళ్లలోనూ నానుతున్న ‘బోఫోర్స్’ కంపెనీ కూడా ఆల్ఫ్రెడ్నోబెల్ స్థాపించినదే. ఇమ్మాన్యుయేల్ స్థాపించిన కంపెనీకి నష్టాలు వాటిల్లి దివాలా తీయటంతో అతడు స్టాక్‌హోమ్ నగరం విడిచి రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ చేరి, అక్కడ వ్యాపారం కొనసాగించాడు. రష్యాకు నీటిలో పేలే విస్ఫోటకాలను సరఫరా చేశాడు. క్రిమియన్ యుద్ధం ముగియగానే ఆ కంపెనీ మళ్లీ దివాలా తీసింది. ఆ తర్వాత కొన్నాళ్లకు అతడు కంపెనీని తిరిగి స్వీడన్‌కు మార్చాడు. ఆల్ఫ్రెడ్ చిన్నతనం నుంచి రసాయన శాస్త్రం అంటే ఇష్టపడేవాడు. ఆ శాస్త్రంతో పాటు ఇంగ్లిష్, ఫ్రెంచ్, జర్మన్, రష్యన్ భాషల్లో ప్రావీణ్యం సంపాదించాడు. ప్రాథమిక విద్య తర్వాత ఆల్ఫ్రెడ్ పారిస్‌లో హైస్కూల్ విద్యనభ్యసించాడు. 18 ఏళ్ల వయసులో ఉన్నత విద్యకోసం అమెరికా చేరుకున్నాడు. అక్కడ జాన్ ఎరిక్సన్ అనే రసాయన శాస్త్రవేత్త దగ్గర రసాయన శాస్త్రంలో ఉన్నత విద్యనభ్యసించి పరిశోధనలు చేపట్టాడు. అమెరికాలో ‘గ్యాస్మీటర్’ను కనిపెట్టి పేటెంట్ సంపాదించాడు. అదే అతడి మొదటి పేటెంట్. ఇదే తరుణంలో ఇమ్మాన్యుయేల్ కంపెనీ మళ్లీ నష్టాల బాట పట్టడంతో ఆల్ఫ్రెడ్ స్వదేశానికి వచ్చి, సోదరులతో కలిసి తండ్రి కంపెనీని లాభాల బాటలో పెట్టే బాధ్యత తీసుకున్నాడు. కొత్త పేలుడు పదార్థాలను కనుగొనటంలో నిమగ్నమయ్యాడు. అలా తయారైనదే డైనమైట్. డైనమైట్ తర్వాత... ‘నోబెల్’కు ముందు..! డైనమైట్ను కనుక్కున్న తర్వాత, దానిని క్షేమకరంగా ఉపయోగించే పద్ధతుల మీద సోదరులతో కలిసి అనేక ప్రయోగాలు చేశాడు ఆల్ఫ్రెడ్ నోబెల్. ఈ ప్రక్రియలో నోబెల్ ప్రయోగశాలలో 1888 సంవత్సరంలో భారీ విస్ఫోటనం సంభవించింది. ఆ ప్రమాదంలో ఆల్ఫ్రెడ్ నోబెల్ తప్పించుకున్నాడు కానీ అతని సోదరుడు ‘లుడ్విగ్ నోబెల్’ మరణించాడు. అయితే ఈ వార్తను ప్రచురించే క్రమంలో పొరపాటు దొర్లింది. పారిస్ నుంచి వెలువడే ఒక ఫ్రెంచి పత్రిక ఈ వార్తను ‘మృత్యు వ్యాపారి, నరహంతకుడు నోబెల్ అస్తమయం’ అని పెద్ద అక్షరాలతో ప్రకటించింది. ఆ వార్త చూసిన ఆల్ఫ్రెడ్ హతాశుడయ్యాడు. తాను నైట్రో గ్లిజరిన్‌ను క్షేమకరమైన విధానంలో విస్ఫోటనకు ఉపయోగించేలా చేద్దామనుకుంటే, ఆ ప్రయత్నం ఇంతటి అపవాదు తెచ్చిందా అని తీవ్రంగా బాధపడ్డాడు. ఆ విచారం నుంచి బయటపడకపోగా జీవితంపై విరక్తిని పెంచుకున్నాడు. మానవాళికి ప్రయోజనం చేకూరే పని ఏదైనా చేయాలని ఆశించాడు. దాని ఫలితమే నోబెల్ ఫౌండేషన్. డైనమైట్ కథ ‘డైనమైట్’ను ఆల్ఫ్రెడ్ నోబెల్ 1867లో కనుగొన్నాడు. డైనమైట్లోని ముఖ్యమైన పేలుడు పదార్థం నైట్రో గ్లిజరిన్. ఇందులోని పేలుడు స్వభావాన్ని మొదట కనుగొన్నది ఆస్కారియో సొబ్రీరో. నైట్రో గ్లిజరిన్‌ను క్షేమకరంగా ఉపయోగించటానికి దానిని కీసెల్ ఘుర్ అనే తేలికగా ఉండే బూడిద వంటి మట్టి కలిపి ప్రయోగించాడు నోబెల్. దానికి ‘డైనమైట్’ పేరుతో పేటెంట్ హక్కులు పొందాడు. ఇలాంటి ప్రయోగాల ద్వారా అతడు 16,87,337 బ్రిటిష్ పౌండ్ల ధనం (సుమారు 472 మిలియన్ల అమెరికన్ డాలర్లు) ఆర్జించాడు. ఆల్ఫ్రెడ్ నోబెల్ గురించి మరికొన్ని... నోబెల్ వివాహం చేసుకోలేదు. ఆయన మరణించేనాటికి 90 కంపెనీలకు వ్యవస్థాపక భాగస్వామి, 355 పేటెంట్లకు హక్కుదారుడు. బోఫోర్స్ కంపెనీని మొదట్లో ఇనుము కర్మాగారంగా ప్రారంభించి, తర్వాత ఆయుధాల ఫ్యాక్టరీగా మార్చాడు. ఇప్పటికీ ఆ కంపెనీ ఆయుధాలు, విమానాలను ఉత్పత్తి చేస్తూనే ఉంది. ‘నోబెల్ బహుమతి’ దిశగా అతడిని ప్రభావితం చేసిన వ్యక్తి ఆయన కార్యదర్శి ‘బెర్తా’. ఆమె రచయిత్రి కూడ. ఒక్కో నోబెల్ పురస్కారం విలువ సుమారు 3 లక్షల 50 వేల అమెరికన్ డాలర్లు (సుమారు 1 కోటి 75 లక్షల రూపాయలు). ఈ బహుమతిని స్టాక్‌హోమ్‌లో అందజేస్తారు. ఆల్ఫ్రెడ్ నోబెల్, 1896వ సంవత్సరంలో నోబెల్ ఫౌండేషన్ సంస్థను స్థాపించి, తాను సంపాదించిన ధనంలో 95 శాతం నగదును నోబెల్ పురస్కారాల కోసం వినియోగించడానికి వీలుగా బ్యాంకులో కుదువబెట్టాడు. ఆ ధనం మానవాళికి ఉపయోగపడే విధంగా ఒక నియమావళిని రూపొందించాడు. ఇందుకు అతడికి సాకారం కాని కల కూడా తోడైంది. నోబెల్‌కి చిన్నతనం నుంచి శరీరారోగ్యం బాగుండేది కాదు. దాంతో తాను వైద్యుడై శరీర ధర్మశాస్త్రం (ఫిజియాలజీ) అభ్యసించాలనే ఆశయం నెరవేరలేదు. అందుకే ఆ రంగంలో కృషి చేసిన వారికి బహుమతి ఇవ్వడం ద్వారా ఆ ఆశను నెరవేర్చుకున్నాడు. నోబెల్ ఫౌండేషన్ ద్వారా... భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవ రసాయన శాస్త్రం, జీవ శాస్త్రం, జన్యు శాస్త్రం, అంతరిక్ష శాస్త్రం వంటి విజ్ఞాన శాస్త్ర విభాగాలు, కంప్యూటర్, ఎలక్ట్రికల్ వంటి ఇంజనీరింగ్ విభాగాలు, చరిత్ర, అర్థశాస్త్రం, సాహిత్యం వంటి ఆర్ట్స్ విభాగాలు, సామాజిక ఆవిష్కరణలు, ప్రపంచ శాంతి మొదలైన విభాగాలలో సేవలందించిన వారికి మొత్తం ఆరు కేటగిరీలలో నోబెల్ బహుమతులు ఇస్తున్నారు. ప్రశాంతంగా జీవించడానికి... నోబెల్ ఫౌండేషన్ రూపకల్పన తర్వాత ఆల్ఫ్రెడ్ నోబెల్ తన చివరి రోజులను అజ్ఞాతంగా గడపటానికి నిశ్చయించుకొని ఇటలీలోని ‘శాన్ రిమో’ అనే ఊరికి వెళ్లాడు. అక్కడ ప్రశాంతంగా జీవనం సాగిస్తున్న ఆల్ఫ్రెడ్ నోబెల్... సెరిబ్రల్ హెమరేజ్ (మెదడులో రక్తనాళాలు చిట్లడం)కి గురై 1896వ సంవత్సరం డిసెంబర్ 10వ తేదీన కన్నుమూశాడు. ఆయన సంస్మరణార్థం ఏటా ఇదేరోజున నోబెల్ బహుమతుల ప్రదానం జరుగుతుంది. ఇదీ క్లుప్తంగా ఆల్ఫ్రెడ్ నోబెల్ జీవితం. అతడి జీవితంలో ఆసక్తి కలిగించే మరికొన్ని విశేషాలు కూడా ఉన్నాయి. ఆల్ఫ్రెడ్ నోబెల్ మంచి సాహిత్యాభిమాని, రచయిత. రసాయన శాస్త్ర ప్రయోగాలతో తలమునకలై ఉన్నప్పటికీ, కొంత సమయాన్ని సాహిత్య పఠనం, రచనా వ్యాసంగానికి కేటాయించేవాడు. ప్రముఖ సాహితీకారుల రచనలు చదవటంతోపాటు వాటిపై పద్య రూపంలో వ్యాఖ్యలు రాసేవాడు. ఆల్ఫ్రెడ్ నోబెల్ రచనలలో 1895లో రాసిన ‘ద పేటెంట్ బ్యాసిల్లస్’, 1896లో ‘నెమిసిస్’ పేరుతో రాసిన విషాదాంత రూపకం ముఖ్యమైనవి. ఇప్పటి వరకు నోబెల్ అందుకున్న ప్రముఖులలో మనదేశానికి చెందినవాళ్లు 13 మంది. వీరిలో తొమ్మిదిమంది భారతపౌరులు, నలుగురు భారత సంతతికి చెందిన వారు. వారి గురించిన సమగ్రసమాచారంతో కూడిన కథనాలను ప్రతి వారం ఇదే శీర్షికలో తెలుసుకుందాం. - డా॥రెబ్బాప్రెగడ రామాంజనేయులు విశ్రాంత రసాయనాచార్యుడు -
అ‘శాంతి’ నోబెల్!
వివాదాలు ఎన్ని చుట్టుముట్టినా, ఆరోపణలు ఎన్నివచ్చినా ఏటా ప్రకటించే నోబెల్ పురస్కారాలపై ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఆసక్తి ఉంటుంది. భిన్న రంగాల్లో నోబెల్ కమిటీ ఎవరిని ఎంచుకుంటుందన్న అంశంపై చర్చలు సాగుతాయి. ఎంపికైనవారు ఆయా రంగాల్లో చేసిన కృషిపై విశ్లేషణలుంటాయి. మిగిలిన పురస్కారాల మాటెలా ఉన్నా నోబెల్ శాంతి బహుమతి విషయంలో తరచుగా వివాదాలు రేకెత్తుతుంటాయి. ఈసారి పాకిస్థాన్‌లోని స్వాత్ లోయలో తాలిబన్ల చేతుల్లో తీవ్రంగా గాయపడి మృత్యువు చేరువదాకా వెళ్లిన మలాల యూసఫ్జాయ్కి శాంతి బహుమతి వస్తుందని అందరూ అంచనావేశారు. ఇంకా సంక్షుభిత సిరియా విషయంలో అమెరికాకు నచ్చజెప్పి, యుద్ధ మేఘాలను నివారించిన రష్యా అధ్యక్షుడు పుతిన్... ఘర్షణలతో అట్టుడికే ఆఫ్రికా దేశం కాంగోలో శాంతి కోసం తీవ్రంగా పోరాడిన వైద్యుడు డెనిస్ ముక్వెజ్... గ్వాటెమాలాలో శక్తిమంతమైన మాఫియా నేతలతో న్యాయస్థానాల్లో పోరాడిన ఆ దేశ అటార్నీ జనరల్ క్లాడియా పాజ్ వంటి మరో 259మంది పేర్లు నోబెల్ శాంతి పురస్కారం పరిశీలనకు వచ్చాయి. కొందరైతే అమెరికా యుద్ధ నేరాలను ప్రపంచానికి వెల్లడించిన ఆ దేశ సైనికుడు బ్రాడ్లీ మానింగ్ పేరును ప్రతిపాదించారు. అయితే, అంచనాలన్నిటినీ తలకిందులుచేస్తూ ఈసారి నోబెల్ కమిటీ... రసాయన ఆయుధాల నిర్మూలనకు హేగ్ కేంద్రంగా కృషి చేస్తున్న రసాయన ఆయుధాల నిషేధ సంస్థ (ఓపీసీడబ్ల్యు)ను ప్రపంచ శాంతి బహుమతికి ఎంపికచేసింది. ఈ సంస్థ సిరియాలో రసాయన ఆయుధ నిల్వల నిర్మూలనకు సంబంధించిన పనుల్లో ఇప్పుడు చురుగ్గా పాల్గొంటున్నది. పదహారేళ్ల మలాలకు నోబెల్ వస్తుందని నమ్మినవారున్నా ఆమెకు ఎందుకు రావాలని ప్రశ్నించినవారూ లేకపోలేదు. ఆడపిల్లలు చదువుకోరాదన్న ఉగ్రవాదుల హుకుంను ఆమె ధిక్కరించడం, వారి ధోరణులను వ్యతిరేకిస్తూ మీడియాకు లేఖలు రాయడం, చివరకు వారి దాడిలో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లి కోలుకున్నా తన సంకల్పాన్ని విడనాడకపోవడం...ఇవన్నీ సాహసోపేతమైనవే. తుపాకుల భాష తప్ప మరేమీ రాని వారితో మాట్లాడటానికి, వారిని ప్రశ్నించడానికి ప్రయత్నించడం సాధారణ విషయం కాదు. అదే సమయంలో ఆమె ఉగ్రవాదుల గురించి మాట్లాడినంతగా ఆ ప్రాంతంలో నిత్యమూ ద్రోన్ దాడులతో అమాయకులను హతమారుస్తున్న పశ్చిమ దేశాల దుడుకుదనాన్ని నిలదీయలేద న్న విమర్శలున్నాయి. మలాల వయసురీత్యా చూస్తే ఆమెపై ఇంత పెద్ద బాధ్యతను పెట్టడం కూడా సరికాదు. తననూ, తనలాంటి బాలికలనూ చదువుకు దూరంచేయడాన్ని ప్రశ్నించే చైతన్యం ఉండటమే గొప్ప విషయం. ఆ చైతన్యం వేలాది మంది బాలికలకు స్ఫూర్తినిస్తుంది. మలాల సంగతి అటుంచి, ఈసారి రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను నోబెల్ శాంతి బహుమతి వరిస్తుందని అంచనా వేసినవారున్నారు. అంతర్యుద్ధంలో చిక్కి శిథిలమైన సిరియాపై దురాక్రమణకు అమెరికా, ఇతర పశ్చిమదేశాలూ ప్రయత్నిస్తుండగా పుతిన్ చివరి నిమిషంలో అడ్డుపడ్డారు. ఆయన కృషి కారణంగానే రసాయన ఆయుధ నిల్వలను రష్యాకు అప్పగించడానికి గత నెలలో సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ అంగీకరించారు. ఆగస్టులో సిరియా రాజధాని డమాస్కస్‌లో రసాయన ఆయుధ ప్రయోగం కారణంగా వందలమంది మరణించాక అమెరికా సిరియాపై కాలు దువ్వింది. అంతటి సంక్షోభాన్ని నివారించ గలిగిన పుతిన్‌కు శాంతి బహుమతి వస్తుందని అనుకోవడంలో వింతేమీ లేదు. 2009లో అమెరికా అధ్యక్షుడు ఒబామాకు నోబెల్ శాంతి బహుమతి ప్రకటించేసరికి శాంతికోసం ఆయన చేసిన ప్రత్యేక కృషి ఏమీ లేదు. అణ్వస్త్రాలను సమకూర్చుకునే ప్రయత్నంలో ఉన్నదన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇరాన్‌తో ముఖాముఖి మాట్లాడటానికి తాను సిద్ధమని మాత్రమే అప్పటికాయన ప్రకటించివున్నారు. ఆ పనిని ఆయన ఇంకా ప్రారంభించలేదు. నిజానికి అలా ప్రయత్నించేంత సమయం ఆయనకు లభించలేదు. అప్పటికి ఆయన అమెరికా అధ్యక్ష పీఠం అధిష్టించి తొమ్మిది నెలలే అయింది. అయినా సరే...ఒబామాకు ఆ బహుమతిని కట్టబెట్టడానికి నోబెల్ కమిటీ ఎక్కడలేని ఉత్సాహాన్నీ ప్రదర్శించింది. అలా చూస్తే ఇప్పుడు కయ్యానికి కాలుదువ్విన ఒబామాను వారించడంలో విజయం సాధించిన పుతిన్ ఆ బహుమతికి అన్నివిధాలా అర్హుడు. నిరుడు నోబెల్ శాంతి బహుమతికి ఎంపికైన యూరొపియన్ యూనియన్‌ది మరో కథ. ఆ సంస్థ యూరోప్‌లో శాంతికి, ప్రజాస్వామ్యానికి, మానవహక్కులకు ఎనలేని కృషి జరిపిందని నోబెల్ కమిటీ తెగ పొగిడింది. కానీ, అంతకు పదేళ్లక్రితం అమెరికాతో కలిసి యూరోప్ దేశాలు ఇరాక్‌పై దాడిచేసి వల్లకాడుగా మార్చడాన్ని మర్చిపోయింది. కనీసం ఏడాదిన్నరక్రితం ఆ కూటమి లిబియాపై సాగించిన దుండగమైనా గుర్తుకురాలేదు. ఎక్కడేమి చేసినా యూరోప్‌ను ప్రశాంతంగా ఉంచితే చాలన్నమాట! ఇప్పుడు నోబెల్ శాంతి బహుమతి లభించిన ఓపీసీడబ్ల్యు సంస్థ రసాయన ఆయుధాల నిర్మూలన కోసం పదహారేళ్లనుంచి కృషిచేస్తోంది. అందుకోసమని 86 దేశాల్లో 5,000కు పైగా తనిఖీలు నిర్వహించింది. దాదాపు 55,000 టన్నుల రసాయన ఆయుధాలను నిర్మూలించడంలో కీలకపాత్ర పోషించింది. కానీ, అగ్ర రాజ్యాలైన అమెరికా, రష్యాల వద్దనున్న రసాయన ఆయుధ నిల్వలను పూర్తిగా నిర్మూలించేలా చేయడంలో సఫలం కాలేకపోయింది. ఈ రెండు దేశాలూ తుది గడువును ఎప్పటికప్పుడు పొడిగించుకుంటూనే ఉన్నాయి. ఇప్పటికీ అమెరికా వద్ద సుమారు 3,000 టన్నుల రసాయన ఆయుధాలున్నాయని అంచనా. ఇది సిరియా వద్ద ఉన్నాయని భావిస్తున్న నిల్వలతో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ. నోబెల్ శాంతికి అనర్హులైనవారు ఈ సంస్థతో పోలిస్తే ఎందులో తీసికట్టో నోబెల్ కమిటీయే చెప్పాలి. మొత్తానికి వివాదాలకూ, అపోహలకూ అతీతంగా వ్యవహరించడం తనకింకా చేతకాలేదని కమిటీ ఈసారి కూడా నిరూపించుకుంది. -
ఎలైస్ మన్రోకు ఈ ఏడాది సాహిత్యంలో నోబెల్ బహుమతి
-
ఎలైస్ మన్రోకు సాహిత్యంలో నోబెల్
కెనడా చెహోవ్‌గా గుర్తింపు పొందిన రచయిత్రి సాహిత్యంలో నోబెల్ పొందిన 13వ మహిళ... ఈ బహుమతి పొందిన తొలి కెనడా మహిళగా ఘనత స్టాక్‌హోమ్: ప్రముఖ కెనడా రచయిత్రి ఎలైస్ మన్రో (82) సాహిత్యంలో నోబెల్ బహుమతికి ఎంపికయ్యారు. స్వీడిష్ అకాడమీ మన్రోను ఈ బహుమతికి ఎంపిక చేసినట్లు గురువారం ప్రకటించింది. కథా రచయిత్రిగా ప్రఖ్యాతి పొందిన ఎలైస్ మన్రోను స్వీడిష్ అకాడమీ సమకాలీన కథానికా నిష్ణాతురాలిగా అభివర్ణించింది. కథా రచనలో ఆమె కనపరచిన మానసిక వాస్తవికత, స్పష్టత సాటి లేనివంటూ శ్లాఘించింది. ఎలైస్ మన్రోను కొందరు విమర్శకులు కెనడియన్ చెహోవ్‌గా అభివర్ణిస్తారు. చిన్న చిన్న పట్టణాల్లోని సామాజిక వాతావరణాన్ని, మానవ సంబంధాలను, నైతిక సంఘర్షణలను తన కథల్లో చిత్రించిన ఎలైస్ మన్రో సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన వారిలో 13వ మహిళ కావడంతో పాటు మొట్టమొదటి కెనడా మహిళ కావడం విశేషం. స్టాక్‌హోంలో డిసెంబర్ 10న జరగనున్న కార్యక్రమంలో ఆమె ఈ బహుమతి కింద 8 మిలియన్ల స్వీడిష్ క్రోనర్లు (రూ.7.64 కోట్లు) అందుకోనున్నారు. ఇదిలా ఉండగా, తనకు నోబెల్ బహుమతిని ప్రకటించడంపై ఎలైస్ మన్రో హర్షం వ్యక్తం చేశారు. నోబెల్ బహుమతి కోసం తన పేరు పరిశీలనలో ఉన్న విషయం తనకు తెలుసునని, అయితే, తనకు బహుమతి లభిస్తుందని ఊహించలేదని ఆమె అన్నారు. కథల కాణాచి కెనడా రచయిత్రి ఎలైస్ మన్రోను కథల కాణాచిగా చెప్పుకోవచ్చు. కథా వస్తువు కంటే కథ చెప్పే తీరుకే ప్రాధాన్యమిచ్చే శైలితో ఆమె అనతి కాలంలోనే సాహిత్య రంగంలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకోగలిగారు. ఓంటారియోలోని వింగ్‌హామ్ ప్రాంతంలో 1931 జూలై 10న ఎలైస్ జన్మించారు. ఆమె తండ్రి రాబర్ట్ ఎరిక్ లెయిడ్‌లా ఒక రైతు. తల్లి ఏన్ క్లార్క్ లెయిడ్‌లా ఉపాధ్యాయురాలు. వెస్టర్న్ ఓంటారియో వర్సిటీలో ఇంగ్లీష్ ప్రధానాంశంగా చదువుకుంటున్న కాలంలోనే 1950లో ‘ది డెమైన్షన్స్ ఆఫ్ ఏ షాడో’ పేరిట తొలి కథ రాశారు. వర్సిటీలో చదువుకుంటూనే వెయిట్రెస్‌గా, లైబ్రరీ క్లర్క్‌గా పనిచేశారు. పొగాకు తోటల్లోనూ పొగాకు కోసే పని చేశారు. వర్సిటీని విడిచిపెట్టాక 1951లో జేమ్స్ మన్రోను పెళ్లాడారు. తర్వాత 1963లో మన్రో దంపతులు విక్టోరియాకు తరలిపోయారు. అక్కడే ‘మన్రో బుక్స్’ ప్రచురణ సంస్థను ప్రారంభించారు. జేమ్స్ నుంచి 1972లో విడిపోయాక, భౌగోళిక శాస్త్రవేత్త గెరాల్డ్ ఫ్రెమ్లిన్ను 1976లో పెళ్లాడారు. ‘డాన్స్ ఆఫ్ ది హ్యాపీ షేడ్స్’ పేరిట 1968లో వెలువరించిన తొలి కథా సంపుటి ఎలైస్ మన్రోకు అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చి పెట్టింది. ఈ పుస్తకానికి కెనడా గవర్నర్ జనరల్ అవార్డు లభించింది. ఆమెకు 2009లో మాన్ బుకర్ బహుమతి కూడా లభించింది. ‘ది న్యూయార్కర్’, ‘ది అట్లాంటిక్ మంత్లీ’, ‘గ్రాండ్ స్ట్రీట్’, ‘ది పారిస్ రివ్యూ’ వంటి పత్రికలు ఆమె రచనలను విరివిగా ప్రచురించాయి. 1980, 90లలో ఎలైస్ దాదాపు ప్రతి నాలుగేళ్లకు ఒక కథా సంపుటి చొప్పున వెలువరించారు. ఇవన్నీ ఆమెకు పలు అవార్డులు తెచ్చిపెట్టాయి. -
దైవకణ శోధకులకు నోబెల్
బ్రిటన్, బెల్జియం భౌతిక శాస్త్రవేత్తలకు అవార్డు స్టాక్‌హోం: విశ్వంలో అన్ని రకాల పదార్థాలకూ ద్రవ్యరాశిని సమకూరుస్తోందని భావిస్తున్న దైవకణం (హిగ్స్ బోసాన్)పై కీలక పరిశోధనలు చేసినందుకుగాను ఈ ఏడాది ఇద్దరు శాస్త్రవేత్తలను భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి వరించింది. బ్రిటన్‌కు చెందిన పీటర్ హిగ్స్(84), బెల్జియం శాస్త్రవేత్త ఫ్రాంకోయిస్ ఎంగ్లెర్ట్(80) ఈ ఏడాది భౌతికశాస్త్రంలో నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారని మంగళవారం నోబెల్ జ్యూరీ ప్రకటించింది. దైవకణం ఉనికి గురించి సుమారు ఆరు దశాబ్దాలుగా సిద్ధాంతాలు, అంచనాలు ఉన్నప్పటికీ.. అది నిజంగా ఉనికిలో ఉన్నట్లు గతేడాదే లార్జ్ హ్యాడ్రన్ కొల్లాయిడర్ ప్రయోగం ద్వారా ‘సెర్న్’ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ నేపథ్యంలో ఈ పరిశోధనకే ఈసారి భౌతికశాస్త్ర నోబెల్ వస్తుందన్న విశ్లేషకుల అంచనాలు నిజమయ్యాయి. ‘దైవకణాలు లేనిదే విశ్వంలో అణువులు, మనం కూడా లేం. విశ్వమంతా శూన్యంగా కనిపిస్తున్నప్పటికీ అందులో ఒక అదృశ్య క్షేత్రం ఆవరించి ఉంది. ఆ క్షేత్రంలో హిగ్స్బోసాన్లు ఉన్నందువల్లే అన్ని పదార్థాలకూ ద్రవ్యరాశి సమకూరుతోంది. ఈ దైవకణాల ఉనికిని కనుగొనే దిశగా వీరు చేసిన పరిశోధనలు కీలకంగా తోడ్పడ్డాయి’ అని నోబెల్ జ్యూరీ తన ప్రకటనలో పేర్కొంది. అత్యున్నతమైన ఈ అవార్డు తనకు దక్కడం పట్ల హిగ్స్ ఆనందం వ్యక్తంచేశారు. దైవకణ పరిశోధనకు ఈ అవార్డు దక్కడం వల్ల విశ్వానికి సంబంధించిన ప్రామాణిక అంశాలపై అవగాహన పెరుగుతుందన్నారు. మరో శాస్త్రవేత్త ఎంగ్లెర్ట్ కూడా నోబెల్ దక్కడంపై హర్షం వ్యక్తంచేశారు. వీరికి డిసెంబర్ 10న స్టాక్‌హోంలో బహుమతి ప్రదానం చేస్తారు. అవార్డు కింద ఇద్దరూ 8 మిలియన్ స్వీడిష్ క్రోనార్ల నగదు(రూ.7.73 కోట్లు)ను పంచుకోనున్నారు. పీటర్‌హిగ్స్ ఎడిన్‌బరో యూనివర్సిటీలో, ఎంగ్లెర్ట్ యూనివర్సైట్ లిబర్ డీ బ్రక్సెల్స్‌లో గౌరవ ప్రొఫెసర్లుగా ఉన్నారు. విశ్వంలో కణా లు ద్రవ్యరాశిని ఎలా పొందుతున్నాయన్న దానిపై వీరితోసహా ఆరుగురు శాస్త్రవేత్తలు 1964లో సిద్ధాంతం ప్రతిపాదించారు. హిగ్స్ బోసాన్ అంటే...: లియోన్ లాడర్మ్యాన్ అనే భౌతికశాస్త్రవేత్త 1993లో ‘ది గాడ్ పార్టికల్.. ఇఫ్ ది యూనివర్స్ ఈజ్ ద ఆన్సర్ వాటీజ్ ద క్వశ్చన్’ అనే పుస్తకంలో హిగ్స్ బోసాన్ పదాన్ని తొలిసారిగా ఉపయోగించారు. ఇందులో హిగ్స్ అంటే విశ్వంలో అదృశ్యంగా ఉన్న క్షేత్రం కాగా, బోసాన్ అంటే అన్ని ప్రాథమిక కణాలకు ద్రవ్యరాశిని ఇచ్చే కణం. వీటిలో పీటర్ హిగ్స్ పేరు మీద హిగ్స్, కణభౌతిక శాస్త్రంలో కీలక ఆవిష్కరణలు చేసిన భారతీయ శాస్త్రవేత్త సత్యేంద్రనాథ్ బోస్ జ్ఞాపకార్థం బోసాన్ అనే పదాలను తీసుకున్నారు. -
వైద్యశాస్త్రంలో ముగ్గురికి నోబెల్
స్టాక్‌హోమ్: వైద్యశాస్త్రంలో చేసిన కృషికిగాను అమెరికా, జర్మనీలకు చెందిన ముగ్గురు శాస్త్రవేత్తలు ఉమ్మడిగా ఈ ఏటి నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు. శరీర కణాల్లో అంతర్గతంగా, కణాల మధ్య రవాణా వ్యవస్థపై పరిశోధన చేసిన.. అమెరికాకు చెందిన జేమ్స్ రోత్మాన్, రాండీ షెక్మాన్తో పాటు జర్మనీ సంతతి శాస్త్రవేత్త థామస్ స్యూదోఫ్‌లను నోబెల్‌కు ఎంపిక చేసినట్లు నోబెల్ జ్యూరీ ప్రకటించింది. ఈ బహుమతి కింద దాదాపు ఎనిమిది కోట్ల రూపాయలను ముగ్గురు శాస్త్రవేత్తలు ఉమ్మడిగా అందుకోనున్నారు. డిసెంబర్ 10న స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో జరిగే కార్యక్రమంలో వారికి పురస్కారాలను అందజేస్తారు. కాగా, గతేడాది కణాల్లో ప్రోగ్రామింగ్‌పై పరిశోధన చేసిన జపాన్‌కు చెందిన షిన్యా యమనక, బ్రిటన్‌కు చెందిన జాన్ గుర్డోన్ సంయుక్తంగా వైద్యశాస్త్ర నోబెల్‌ను అందుకున్నారు. ఏమిటి వారి పరిశోధన.. సాధారణంగా శరీరంలో కణాలు సజీవంగా ఉండాలంటే వాటికి నిత్యం పోషకాలు అందుతూ ఉండాలి. దానితోపాటు వివిధ గ్రంధులు, నాడీవ్యవస్థ సహా వివిధ అవయవాల్లోని కణాలు.. ఆ అవయవానికి సంబంధించిన కొన్ని ప్రత్యేక ఉమ్మడి విధులను నిర్వర్తిస్తుంటాయి. అందుకోసం వాటి మధ్య రసాయన మాలిక్యూల్ల రూపంలో సమాచార మార్పిడి జరుగుతుంది. అంతేగాకుండా కణాల్లో ఉత్పత్తయిన ఇన్సూలిన్ వంటి హార్మోన్ల మాలిక్యూల్లు కూడా రవాణా అయి ఒకే చోటికి చేరి ఒకేసారి విడుదలవుతాయి. అయితే, ఈ రసాయన మాలిక్యూల్లు వివిధ కణాల మధ్య బుడగల రూపంలో రవాణా అవుతాయని.. అన్ని ఒకే స్థితిలో, ఒకే సమయంలో, కణంలోని నిర్ణీత ప్రాంతానికి ఎలా చేరుతాయనేదానిని రోత్మాన్, షెక్మాన్, స్యూదోఫ్ గుర్తించారు. దీనిద్వారా అవయవాల పనితీరులో, హార్మోన్ల విడుదల, రోగ నిరోధక వ్యవస్థలో లోపాలు.. నాడీ సంబంధిత, మధుమేహం వంటి వ్యాధులకు కారణాలను గుర్తించవచ్చు. తద్వారా ప్రభావవంతమైన చికిత్సలను రూపొందించవచ్చు. ఈ పరిశోధన వైద్యశాస్త్రంలో ఎన్నో గొప్ప ఆవిష్కరణలకు నాంది పలకవచ్చని భావిస్తున్నారు. -
‘నోబెల్’ కవి హీనీ ఇకలేరు
డబ్లిన్: సుప్రసిద్ధ ఐరిష్ కవి, నాటక రచయిత, ‘నోబెల్’ గ్రహీత సీమస్ హీనీ (74) శుక్రవారం డబ్లిన్‌లో కన్నుమూశారు. కొద్దికాలంగా అస్వస్థతతో బాధపడుతున్న ఆయన డబ్లిన్‌లోని బ్లాక్‌రాక్ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతుండగా ఆస్పత్రిలోనే తుదిశ్వాస విడిచారు. ఐరిష్ కవుల్లో డబ్ల్యూబీ యీట్స్ తర్వాత అంతటి ప్రాచుర్యం పొందిన హీనీకి 1995లో సాహిత్యంలో నోబెల్ బహుమతి లభించింది. 1939 ఏప్రిల్ 13న జన్మించిన హీనీ, 1960 నుంచి రచనలు ప్రారంభించారు. ‘పదకొండు కవితలు’ పేరిట తన తొలి కవితా సంపుటి విడుదల చేశారు. 1966లో విడుదల చేసిన ‘డెత్ ఆఫ్ ఏ నేచురలిస్ట్’ ఆయనకు ఇంగ్లీష్ సాహిత్యంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చింది. ‘డోర్ ఇన్టు ది డార్క్’, ‘స్టేషన్స్’, ‘ఫీల్డ్‌వర్క్’, ‘స్టేషన్ ఐలాండ్’, ది హా లాంటెర్న్’, ‘సీయింగ్ థింగ్స్’, ‘ది స్పిరిట్ లెవెల్’, ‘ఎలక్ట్రిక్ లైట్’, ‘డిస్ట్రిక్ట్ అండ్ సర్కిల్’, ‘హ్యూమన్ చెయిన్’ వంటి కవితా సంపుటాలు, ‘ది క్యూర్ ఎట్ ట్రాయ్’, ‘ది బరియల్ ఆఫ్ థేబ్స్’ వంటి నాటకాలు, అనువాద రచనలు హీనీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చాయి. ఆక్స్ఫర్డ్, హార్వర్డ్, కాలిఫోర్నియా వర్సిటీల్లో కొంతకాలం అధ్యాపకునిగా పనిచేశారు. -
‘నోబెల్’ కవి హీనీ ఇకలేరు
డబ్లిన్: సుప్రసిద్ధ ఐరిష్ కవి, నాటక రచయిత, ‘నోబెల్’ గ్రహీత సీమస్ హీనీ (74) శుక్రవారం డబ్లిన్‌లో కన్నుమూశారు. కొద్దికాలంగా అస్వస్థతతో బాధపడుతున్న ఆయన డబ్లిన్‌లోని బ్లాక్‌రాక్ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతుండగా ఆస్పత్రిలోనే తుదిశ్వాస విడిచారు. ఐరిష్ కవుల్లో డబ్ల్యూబీ యీట్స్ తర్వాత అంతటి ప్రాచుర్యం పొందిన హీనీకి 1995లో సాహిత్యంలో నోబెల్ బహుమతి లభించింది. 1939 ఏప్రిల్ 13న జన్మించిన హీనీ, 1960 నుంచి రచనలు ప్రారంభించారు. ‘పదకొండు కవితలు’ పేరిట తన తొలి కవితా సంపుటి విడుదల చేశారు. 1966లో విడుదల చేసిన ‘డెత్ ఆఫ్ ఏ నేచురలిస్ట్’ ఆయనకు ఇంగ్లీష్ సాహిత్యంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చింది. ‘డోర్ ఇన్టు ది డార్క్’, ‘స్టేషన్స్’, ‘ఫీల్డ్‌వర్క్’, ‘స్టేషన్ ఐలాండ్’, ది హా లాంటెర్న్’, ‘సీయింగ్ థింగ్స్’, ‘ది స్పిరిట్ లెవెల్’, ‘ఎలక్ట్రిక్ లైట్’, ‘డిస్ట్రిక్ట్ అండ్ సర్కిల్’, ‘హ్యూమన్ చెయిన్’ వంటి కవితా సంపుటాలు, ‘ది క్యూర్ ఎట్ ట్రాయ్’, ‘ది బరియల్ ఆఫ్ థేబ్స్’ వంటి నాటకాలు, అనువాద రచనలు హీనీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చాయి. ఆక్స్ఫర్డ్, హార్వర్డ్, కాలిఫోర్నియా వర్సిటీల్లో కొంతకాలం అధ్యాపకునిగా పనిచేశారు. -
‘నోబెల్’ కవి హీనీ ఇకలేరు
డబ్లిన్: సుప్రసిద్ధ ఐరిష్ కవి, నాటక రచయిత, ‘నోబెల్’ గ్రహీత సీమస్ హీనీ (74) శుక్రవారం డబ్లిన్‌లో కన్నుమూశారు. కొద్దికాలంగా అస్వస్థతతో బాధపడుతున్న ఆయన డబ్లిన్‌లోని బ్లాక్‌రాక్ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతుండగా ఆస్పత్రిలోనే తుదిశ్వాస విడిచారు. ఐరిష్ కవుల్లో డబ్ల్యూబీ యీట్స్ తర్వాత అంతటి ప్రాచుర్యం పొందిన హీనీకి 1995లో సాహిత్యంలో నోబెల్ బహుమతి లభించింది. 1939 ఏప్రిల్ 13న జన్మించిన హీనీ, 1960 నుంచి రచనలు ప్రారంభించారు. ‘పదకొండు కవితలు’ పేరిట తన తొలి కవితా సంపుటి విడుదల చేశారు. 1966లో విడుదల చేసిన ‘డెత్ ఆఫ్ ఏ నేచురలిస్ట్’ ఆయనకు ఇంగ్లీష్ సాహిత్యంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చింది. ‘డోర్ ఇన్టు ది డార్క్’, ‘స్టేషన్స్’, ‘ఫీల్డ్‌వర్క్’, ‘స్టేషన్ ఐలాండ్’, ది హా లాంటెర్న్’, ‘సీయింగ్ థింగ్స్’, ‘ది స్పిరిట్ లెవెల్’, ‘ఎలక్ట్రిక్ లైట్’, ‘డిస్ట్రిక్ట్ అండ్ సర్కిల్’, ‘హ్యూమన్ చెయిన్’ వంటి కవితా సంపుటాలు, ‘ది క్యూర్ ఎట్ ట్రాయ్’, ‘ది బరియల్ ఆఫ్ థేబ్స్’ వంటి నాటకాలు, అనువాద రచనలు హీనీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చాయి. ఆక్స్ఫర్డ్, హార్వర్డ్, కాలిఫోర్నియా వర్సిటీల్లో కొంతకాలం అధ్యాపకునిగా పనిచేశారు.