
వైద్యరంగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి
మెదడులో స్వతహాగా ఉండే 'జీపీఎస్' వ్యవస్థను కనుగొన్న ముగ్గురికి 2014 సంవత్సరానికి గాను వైద్యరంగంలో నోబెల్ బహుమతిని ప్రకటించారు.
మెదడులో స్వతహాగా ఉండే 'జీపీఎస్' వ్యవస్థను కనుగొన్న ముగ్గురికి 2014 సంవత్సరానికి గాను వైద్యరంగంలో నోబెల్ బహుమతిని ప్రకటించారు. జాన్ ఓ కీఫె, మే బ్రిట్ మోజర్, ఎడ్వర్డ్ మోజర్ ఈ బహుమతిని పొందారు. వీళ్లలో చివరి ఇద్దరు భార్యాభర్తలు. నోబెల్ బహుమతి ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత దాన్ని గెలుచుకున్న 11వ మహిళగా మే బ్రిట్ మోజర్ నిలిచారు. బహుమతి మొత్తంలో సగం జాన్ ఓ కీఫెకు వెళ్తుంది. మిగిలిన మొత్తాన్ని భార్యాభర్తలు పంచుకోవాల్సి ఉంటుంది.
యూనివర్సిటీ కాలేజి లండన్లోని సైన్స్బరీ వెల్కమ్ సెంటర్లో న్యూరల్ సర్క్యూట్స్ అండ్ బిహేవియర్ సంస్థకు జాన్ ఓ కీఫె డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. 1939లో పుట్టిన ఆయనకు అమెరికా, బ్రిటన్ రెండు దేశాల పౌరసత్వం ఉంది.
మే బ్రిట్ మోజర్ నార్వే పౌరురాలు. ఆమె యూసీఎల్లో గతంలో పనిచేసినా, ప్రస్తుతం ట్రాన్డీమ్లోని సెంటర్ ఫర్ న్యూరల్ కంప్యూటేషన్ సంస్థకు డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఎడ్వర్డ్ మోజర్ కూడా నార్వే దేశస్థుడే. ఆయన తొలుత తన భార్యతో కలిసి యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బర్గ్లో పోస్ట్డాక్గా చేశారు. తర్వాత లండన్లోని జాన్ ఓ కీఫె ల్యాబ్లో విజిటింగ్ శాస్త్రవేత్తగా ఉన్నారు. 1996లో వారిద్దరూ నార్వే యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి మారిపోయారు. అక్కడే 1998 నుంచి ఎడ్వర్డ్ మోజర్ ప్రొఫెసర్గా ఉన్నారు. ప్రస్తుతం ఆయన ట్రాన్డీమ్లోని కావ్లి ఇన్స్టిట్యూట్ ఫర్ సిస్టమ్స్ న్యూరోసైన్స్లో డైరెక్టర్గా ఉన్నారు.
#nobelprize2014 #Medicine May‐Britt and Edvard Moser is the 5th married couple to be awarded a Nobel Prize.
— The Nobel Prize (@NobelPrize) October 6, 2014