Ravindra Bharathi
-
నా సంకల్పమేదీ విఫలం కాలేదు
సాక్షి, హైదరాబాద్: తమ ప్రభుత్వ ఆలోచనల్లో స్పష్టత ఉందని. సంకల్ప బలం ఉంటే దేవుడు కూడా సహకరిస్తాడన్న సానుకూల దృక్ఫథంతో ముందుకు సాగుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. తన జీవితంలో సంకల్పించిన లక్ష్యం ఏదీ ఇప్పటివరకు విఫలం కాలేదన్నారు. తెలంగాణ రైజింగ్ 2050 లక్ష్యంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి దేశానికే ఆదర్శంగా నిలబెట్టాలన్న సంకల్పం కూడా విజయవంతమవుతుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. ఆదివారం ఉదయం రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ, పర్యాటక సాంస్కృతిక శాఖలు సంయుక్తంగా రవీంద్రభారతిలో విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీఎం మాట్లాడారు. పెట్టుబడుల నగరంగా ఫ్యూచర్ సిటీ ‘తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలబెట్టేందుకు మా ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తుంది. తెలంగాణ రైజింగ్ నినాదాన్ని నిజం చేస్తూ దేశంలో తెలంగాణ ఓ వెలుగు వెలిగేలా చేసేందుకు చర్యలు తీసుకుంటుంది. మూసీ ప్రక్షాళన, రీజినల్ రింగు రోడ్డు, ఫ్యూచర్ సిటీ.. లాంటి కీలక నిర్ణయాలతో హైదరాబాద్ ప్రపంచ నగరాలతో పోటీ పడేలా మారుస్తాం. మన ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీ ఆ ఆలోచనకు నమూనాగా నిలవబోతుంది. ఇది జనావాస యోగ్యానికే పరిమితమయ్యే నగరం కాదు. ఉద్యోగ, ఉపాధి కల్పన సంక్షేమ పథకాల అమలుకు నిధులు కావాలంటే ఆ నగరానికి పెట్టుబడులు భారీగా రావాల్సి ఉంది. ఆ పెట్టుబడులతో రాష్ట్ర ఆదాయం పెరగాల్సి ఉంది. అందుకే ఆ నగరం జనావాసాలకే పరిమితం కాకుండా ఓ పెట్టుబడుల నగరంగా రూపు దిద్దుకుంటుంది..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. అలాంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తాం..‘అభివృద్ధి పథకాలకు సంబంధించి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు ప్రజల నుంచి నూరు శాతం మద్దతు వస్తుందని మా ప్రభుత్వం అనుకోవటం లేదు. దేవుళ్ల ఆరాధన విషయంలోనే భిన్నాభిప్రాయాలుండే సమాజం నుంచి.. ప్రభుత్వ నిర్ణయాలకు పూర్తి ఆమోదం ఆశించలేం. కానీ మెజారిటీ ప్రజల సంక్షేమం కోసం మేం తీసుకునే చర్యలు అడ్డుకుంటే ఆగిపోతాయని అనుకునేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ప్రజల నుంచి మాకు సూచనలొస్తున్నాయి. కాబట్టి వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తాం..’ అని రేవంత్ అన్నారు. ఉగాది పచ్చడి లాగానే భట్టి బడ్జెట్ ‘ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇటీవల ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ కూడా షడ్రుచుల ఉగాది పచ్చడి లాగానే ఉంది. తీపి ఉంది, పులుపు ఉంది, కారం ఉంది. కాస్తోకూస్తో ఉప్పు కూడా ఉంది. కొన్ని అంశాల్లో స్వేచ్ఛగా నిధులిచ్చారు. కొన్నింటి విషయంలో తప్పనిసరి నియంత్రణ పాటించారు. ఉద్యోగ ఉపాధి, పరిశ్రమలు, వ్యవసాయం, విద్య వైద్యం తదితరాలకు మెరుగ్గా నిధులిచ్చారు. బడ్జెట్ కేటాయింపులు అమలు కావాలంటే, రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి. అది జరగాలంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు స్థిరంగా ఉండాలి. అసాంఘిక శక్తుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పేదలు సన్న బియ్యం కోరుకుంటున్నారు..నేను, భట్టి జోడెద్దుల్లా రాష్ట్రాన్ని పురోగమన పథంలోకి తీసుకెళ్లేందుకు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాం. గతంలో పండుగ పూట మాత్రమే తెల్లన్నం చూసే భాగ్యం పేదలది. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి రూ.1.90కే, తర్వాత ఎన్టీఆర్ రూ.2కే కిలోబియ్యం ఇచ్చి కొంత మార్పు తెచ్చారు. సోనియాగాంధీ ఆధ్వర్యంలో ఆహారభద్రత చట్టం వచ్చాక ఇప్పుడు పేదలు శ్రీమంతుల తరహాలో సన్న బియ్యం తినాలని కోరుకుంటున్నారు. వారికోసం హుజూర్‌నగర్‌లో సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వంతో పాటు గవర్నర్, ఎన్నికల వ్యవస్థ, న్యాయవ్యవస్థ, పార్టీలు, ప్రజా సంఘాలతో సత్సంబంధాలు కొనసాగిస్తాం. ఎక్కడైనా లోపాలుంటే సరిదిద్దుకుంటూ ముందుకు సాగుతాం. రాష్ట్ర ప్రజలందరికీ విశ్వావసు ఉగాది శుభాకాంక్షలు..’ అని సీఎం అన్నారు. ప్రపంచంతో పోటీ పడేలా రాష్ట్రాభివృద్ధి: భట్టిఅన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతోనే కాదు, ప్రపంచంతో పోటీ పడేలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, ఎంపీలు మల్లు రవి, అనిల్‌కుమార్‌యాదవ్, ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, శంకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. ఇలావుండగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వా మి దేవస్థానం నూతనంగా రూపొందించిన శ్రీ విశ్వావసు నామ సంవత్సర పంచాంగాన్ని సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. యాదగిరి క్షేత్ర ముఖ్య అర్చకులు మంగళగిరి నర్సింహమూర్తిని ఉగాది పురస్కారం, అవార్డుతో సన్మానించారు. -
ఫ్యూచర్ సిటీ దేశానికి ఆదర్శం: రేవంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఉగాది వేడుకలను నిర్వహించారు. ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొన్నారు. అనంతరం అర్చకులు భద్రాచలం రాములవారి కల్యాణానికి రావాలని ఆహ్వానిస్తూ కల్యాణ పత్రికను సీఎంకు అందజేశారు.ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..‘రాష్ట్రం సంక్షేమం దిశగా దూసుకెళ్తోంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటాం. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నాం. ప్రపంచస్థాయిలో హైదరాబాద్‌కు గుర్తింపు ఉండాలి. మూసీ ప్రక్షాళన, రీజనల్ రింగ్ రోడ్డు, ఫ్యూచర్ సిటీ ఇందులో భాగమే. శాంతి భద్రతలు అదుపులోకి ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. నేను, భట్టి విక్రమార్క జోడెద్దుల్లా రాష్ట్రం కోసం శ్రమిస్తున్నాం. దేశ ప్రజలకు తెలంగాణ ఆదర్శంగా ఉండాలి. దేశంలో కొత్త నగరాల నిర్మాణం జరగాలి. ఫ్యూచర్ సిటీని నిర్మించి దేశానికి ఆదర్శంగా నిలుస్తాం. పెట్టుబడుల నగరంగా ఫ్యూచర్ సిటీ రూపకల్పన జరుగుతుంది. అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతున్నాం’ అని తెలిపారు.భట్టి ప్రవేశపెట్టిన బడ్జెట్ ఈ ఉగాది పచ్చడిలా షడ్రుచుల సమ్మిళితం. వ్యవసాయ అభివృద్ధికి, పేదలకు విద్య అందిచేందుకు బడ్జెట్లో ప్రాధాన్యం ఇచ్చాం. విద్య, వైద్య, ఉద్యోగ, ఉపాధి, సంక్షేమం అన్నింటికీ బడ్జెట్ లో నిధులు కేటాయించాం. దేశంలోనే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ను తీసుకొచ్చి పేదలకు ఆకలి దూరం చేసేందుకు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పుడు పేదలకు సన్నబియ్యం అందించే పథకానికి ఉగాది రోజున శ్రీకారం చుడుతున్నాం.దేశంలోనే అత్యధికంగా వరి ఉత్పత్తి చేసిన రాష్ట్రాల్లో తెలంగాణ ముందు భాగంలో నిలిచింది. రైతులు పండించిన సన్న ధాన్యాన్ని పేదలకు అందించబోతున్నాం. ఆదాయం పెంచాలి.. పేదలకు పెంచాలన్నది మా ప్రభుత్వ విధానం. ఇది రాజకీయాలు చేసే సందర్భం కాదు.. ఇది అభివృద్ధి చేసే సందర్భం. మా ఆలోచనలో, సంకల్పంలో స్పష్టత ఉంది. తెలంగాణ రైజింగ్-2050 ప్రణాళికతో దేశానికే తెలంగాణను ఆదర్శంగా నిలబెడతాం’ అని చెప్పుకొచ్చారు. అంతకుముందు.. ఉగాది వేడుకల్లో భాగంగా రవీంద్రభారతిలో పండితులు బాచంపల్లి సంతోష్‌కుమార్ శాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం ఈ ఏడాది పరుగులు పెడుతుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ ఏడాది ప్రజలు మెచ్చే విధంగా పాలన చేస్తారు. తెలంగాణలో వర్షాలకు ఇబ్బంది లేదు. శాంతి భద్రతల విషయంలో నిరంతరం పోలీసులు పనిచేస్తారు’ అని చెప్పుకొచ్చారు. -
అదంతా దుష్ప్రచారం.. నా మీద ప్రజలకు కోపమా?
సాక్షి,హైదరాబాద్: నా మీద వ్యతిరేకత వచ్చిందని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. అభివృద్ది చేసినందుకే నాపై ప్రజలు కోపంగా ఉన్నారా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం గురువారం హైదరాబాద్ రవీంద్రభారతిలో కొలువుల పండగ కార్యక్రమం నిర్వహించింది. పంచాయితీరాజ్, గ్రామీణభివృద్ధి శాఖలో కార్యుణ నియామకాల్ని చేపట్టింది. ఎంపికైన 922 మందికి కారుణ్య నియామక పత్రాలు అందించింది.ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. గత పాలకులు పదేళ్లుగా ఈ నియామకాలు చేపట్టలేదు. కానీ తమ ప్రభుత్వం కారుణ్య నియామకాల్ని చేపట్టింది. నామీద వ్యతిరేకత వచ్చిందని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రజలు నాపై కోపంగా ఎందుకు ఉంటారు? మహిళలకు ఉచిత బస్సు కల్పించినందుకా? నాపై కోపం..? ఉద్యోగాలు ఇచ్చినందుకా నాపై కోపం? రుణమాఫీ చేసినందుకా నాపై కోపం? 59వేల మంది ఉద్యోగాలు ఇచ్చినందుకా? నాపై కోపం అని ప్రశ్నించారు. అనంతరం, తెలిపారు. అనంతరం,బిల్డ్ నౌ పోర్టల్‌ను ఆవిష్కరించారు. -
రవీంద్ర భారతిలో విల్లా మేరీ డిగ్రీ మహిళా కళాశాల ఐకానిక్ నాటకాలు
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ భాషా మరియు సాంస్కృతిక శాఖ సహకారంతో విల్లా మేరీ డిగ్రీ మహిళా కళాశాల, ఫిబ్రవరి 26, 2025న రెండు ఐకానిక్ నాటకాలు, మాక్బెత్ మరియు పిగ్మాలియన్లను విజయవంతంగా ప్రదర్శించింది. డాక్టర్ రామ్ హోళ్లగుండి రూపకల్పన చేసి దర్శకత్వం వహించిన ఈ నాటకాలను సాయంత్రం 6:30 గంటల నుండి హైదరాబాద్‌లోని లక్డికాపుల్‌లోని రవీంద్ర భారతిలో ప్రదర్శించారు.ఈ సాయంత్రం విల్లా మేరీ ఎడ్యుకేషన్ సొసైటీ వ్యవస్థాపకురాలు, డైరెక్టర్ మరియు కరస్పాండెంట్ డాక్టర్ ఫిలోమినా; కార్యదర్శి శ్రీమతి చిన్నమ్మ; జాయింట్ సెక్రటరీ శ్రీ శ్రీనివాస్ రావు; మరియు విల్లా మేరీ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ ప్రిన్సిపాల్ శ్రీమతి రేవతి దేవి మాథుర్ ప్రముఖులు పాల్గొన్నారు. వారి ఉనికి ఈ సాంస్కృతిక కార్యక్రమం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేసింది, ఇది కళాశాల తన విద్యార్థుల సృజనాత్మక వ్యక్తీకరణకు వేదికను అందించాలనే నిబద్ధతను తెలియజేసింది. -
జనవరి 27న రవీంద్రభారతిలోఎఫ్–టామ్ ‘వారధి’
సాక్షి, ముంబై: హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో జనవరి 27న ‘వారధి’కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్స్ ఆఫ్ మహారాష్ట్ర (ఎఫ్–టామ్) అధ్యక్షుడు గంజి జగన్‌బాబు తెలిపారు. మూడు రాష్ట్రాల వ్యాపారాలను ఒకే వేదికపైకి తీసుకురావడమే ఈ కార్యక్రమం లక్ష్యమని ఇందులో భాగంగా తెలంగాణ–ఆంధ్రప్రదేశ్–మహారాష్ట్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (టీఏఎంసీసీఐ) సంస్థ ప్రారంభోత్సవం, లోగోఆవిష్కరణతోపాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, అవార్డుల ప్రదానం జరగనుందని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, నటుడు సాయికుమార్ ముఖ్యఅతిధులుగా హాజరుకానున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రల ప్రజలందరూ విచ్చేయాలని జగన్‌బాబు కోరారు. చదవండి : Birthright citizenship : ట్రంప్ ఆర్డర్‌ను తోసిపుచ్చిన కోర్టు, ఎన్ఆర్ఐలకు భారీ ఊరటసంక్రాంతికి వస్తున్నాం ‘అప్పడాలు’ కాదు... సోషల్ మీడియాను షేక్ చేస్తున్నవీడియో! -
‘పురుషసూక్తం': పురుషాధిపత్యాన్ని కాపాడటానికి మహిళలే..
‘పురుషసూక్తం’.. ‘టిట్ ఫర్ టాట్.. కన్వర్జేషన్స్ బిట్వీన్ ఎ బ్రా అండ్ ఎ బ్రీఫ్’.. రెండు నాటకాలు. ఇవి పురుష భావజాలంపై నటి ఝాన్సీ రూపొందించిన సంవాదాలు. ఆలోచనావీచికలు... మార్పుకై నివేదనలు. ఝాన్సీ తన టీమ్‌తో రవీంద్రభారతిలో జనవరి 12న ప్రదర్శించనున్న సందర్భంగా...‘తెలంగాణ థియేటర్ రీసెర్చ్ కౌన్సెల్ వాళ్లు 2019లో విమెన్స్ డేకి ‘విమెన్ డైరెక్టర్స్ ఫెస్టివల్’ను కండక్ట్ చేస్తూ నన్ను కూడా అడిగారు ఒక నాటకం ఇస్తాం.. డైరెక్ట్ చేయమని. వాళ్లిచ్చిన నాటకం కంటే నేను నా ఐడియాలజీని నాటకంగా ప్రెజెంట్ చేస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. దాన్నొక చాలెంజ్‌గా తీసుకున్నాను. నేను చదివిన, చూసిన, నేర్చుకున్న, ఏర్పర్చుకున్న దృక్పథాన్ని పేపర్ మీద పెట్టాను. అదే నా ఫస్ట్ ప్లే.. ‘పురుషసూక్తం.’ జెండర్ కళ్లద్దాలతో మాస్క్యులినిటీని మనమెలా చూస్తున్నాం, దాన్నెలా పెంచి పోషిస్తున్నాం, దీనివల్ల పురుషుడు తాను మనిషినన్న విషయాన్ని మరచిపోయి, అనవసరపు బరువు బాధ్యతలను ఎలా మోస్తున్నాడు, ఆ పురుషాధిపత్యాన్ని కాపాడటానికి మహిళ ఎలా కోటగోడగా మారిందనే అంశాల మీద సీరియస్ చర్చే ఆ నాటకం’ అన్నారు ఝాన్సీ.రవీంద్రభారతిలో తన రెండు నాటకాలను ప్రదర్శించడానికి ఒకవైపు రిహార్సల్స్ చేస్తూ మరోవైపు సాక్షి ప్రతినిధితో మాట్లాడారు. ‘పురుషసూక్తం నాటకానికి 18 రోజు ల్లోనే స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నాను. డైరెక్ట్ చేయడమే కాక నటించాను కూడా. అంత సీరియస్ నాటకాన్ని రెండు పాత్రలతో ఎంతవరకు మెప్పించగలను అనుకున్నా! కానీ ఆశ్చర్యం.. కె. విశ్వనాథ్ లాంటి వారి మహామహుల ప్రశంసలు అందాయి. అది నాటక రచయితగా, దర్శకురాలిగా నా ప్రయాణాన్ని ఖరారు చేసుకునేలా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. థియేటరే నా మీడియమనీ అర్థమైంది’ అన్నారామె.టిట్ ఫర్ టాట్.. కన్వర్జేషన్స్ బిట్వీన్ ఎ బ్రా అండ్ బ్రీఫ్ ‘కిందటేడు (2024) అక్టోబర్ 4న వరల్డ్ బ్రెస్ట్ క్యాన్సర్ డే సందర్భంగా స్త్రీల ఆరోగ్యం, పురుషుల బాధ్యత లాంటి విషయాలెన్నో చర్చకు వచ్చి.. అసలిలాంటి వాటి మీద మనమెందుకు అవసరమైనంతగా మాట్లాడట్లేదు, ఏదో ఒకటి చేయాలి అనిపించి ‘టిట్ ఫర్ టాట్.. ’ మొదలుపెట్టాను’ అన్నారు ఝాన్సీ. ఇది ‘పురుషసూక్తం’ తర్వాత ఆమె రాసి నటించి దర్శకత్వం వహించనున్న రెండోనాటకం.‘రెండు రోజులకే ఏం రాయాలో తెలిసింది గాని మొదట సగం స్క్రిప్టే రాయగలిగాను. దానికే ఇంకొన్ని ఆలోచనలు జోడించి ఇంట్లో పిల్లలనే చేర్చి, క్లోజ్ సర్కిల్ ముందు వేసి చూపించాను. అలా వర్క్ చేసుకుంటూ నాటకం రాసుకుంటూ వచ్చాను. పార్ట్స్ పార్ట్స్‌గా రాస్తూ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి ప్రదర్శించి ఫ్రెండ్స్‌కు చూపించాను. అందరికీ నచ్చింది. మెయిన్ షో ఎప్పుడని అడగడం మొదలుపెట్టారు. ‘టిట్ ఫర్ టాట్ ఎ కన్వర్జేషన్ బిట్వీన్ బ్రా అండ్ బ్రీఫ్’కి కూడా మూలం పురుషాధిపత్య విషతుల్య భావజాలమే. కాకపోతే అప్రోచ్ వేరు. ఇదొక సోషల్ సెటైర్. దీనికి టార్గెట్ ఆడియన్స్ 16 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వాళ్లు. వాళ్లకు అర్థమయ్యే భాషలో చెప్పాలి. అందుకే హ్యూమర్‌ని, వ్యంగ్యాన్ని ఎంచుకున్నాను. సీరియస్‌ను పండించడం తేలికే. వ్యంగ్యం చాలా కష్టం. భాష కూడా జెన్ జీ జార్గాన్స్‌తో ఉంటుంది. వాళ్ల తాలూకు మీమ్స్ ఉంటాయి. పురుషసూక్తం.. మగవాడు మీదేసుకున్న బాధ్యతల బరువు మీద ఫోకస్ చేసింది. ఇదేమో ఆ బాధ్యతలను ఇంకా వేసుకోని వాళ్లకు వేసుకోవాల్సిన అవసరం లేదని చెబుతుంది’ అన్నారామె.డిబేట్.. ‘రవీంద్రభారతి ప్రదర్శనలో ఈ రెండూ నాటకాలు మరింత మార్పు చేర్పులతో వస్తున్నాయి. పురుషసూక్తంలో కోరస్ యాడ్ అవుతోంది. ‘టిట్ ఫర్ టాట్.. ’ లో ట్రాన్స్ ఉమన్, ట్రాన్స్ మన్ ఇలా అన్ని వర్గాల వాళ్లు నటిస్తున్నారు. ప్రతివాళ్లు వాళ్ల వాళ్ల శరీర ధర్మాలను రిప్రెజెంట్ చేస్తూ తమ సహజమైన పాత్రలనే పోషిస్తున్నారు. అంటే ప్రకృతిలో ఇంత వైవిధ్యం ఉంటుంది.. దాన్ని మనం గౌరవించాలి.. వాళ్ల వల్నరబులిటీని అర్థం చేసుకోవాలని తెలిపే ప్రయత్నం చేస్తున్నాం.. ప్రేక్షకులకే కాదు.. అందులో నటించిన నటీనటులకు కూడా! ఇందులో మా అమ్మాయి ధన్య పరిచయం అవుతోంది. నాటకాల ప్రదర్శన తర్వాత ఓపెన్ డిబేట్ ఉంటుంది’ అన్నారామె.రంగయాత్ర.. సామాజిక చైతన్యాన్ని తీసుకురావడంలో నాటకానిదే ప్రధాన పాత్ర మొదటి నుంచీ! ఆ బాధ్యతను కొనసాగించాలనుకుంటున్నాం.. ‘రంగయాత్ర.. థియేటర్ ఫర్ సోషల్ డిబేట్’ పేరుతో! అందులో భాగంగానే రవీంద్రభారతిలో ప్రదర్శన తర్వాత తెలుగు రాష్ట్రాల్లోని కాలేజెస్‌కి వెళ్లి అక్కడ ఈ నాటకాలను ప్రదర్శించబోతున్నాం స్ట్రీట్ ప్లే తరహాలో. ప్రదర్శన తర్వాత విద్యార్థులతో డిబేట్ పెడతాం. జెండర్ మీద అవగాహన కల్పించే ప్రయత్నమే ఇదంతా!’ అంటూ ముగించారామె.– సరస్వతి రమకొత్త ఆలోచనను రేకెత్తిస్తుంది ‘పురుషసూక్తం నన్ను థియేటర్ ఆర్టిస్ట్‌ని చేసింది. ఈ నాటకాన్ని మగవాడిని అర్థంచేసుకునే ప్రయత్నంగా చెప్పొచ్చు. ఆ దిశగా .. పురుషాధిపత్య భావజాలంతో కండిషనింగ్ అయి ఉన్న మొత్తం సమాజాన్నే ఆత్మవిమర్శకు గురిచేస్తుంది ఇది. ఒక్కమాటలో చెప్పాలంటే కొత్త ఆలోచనను రేకెత్తిస్తుంది! రిహార్సల్స్‌లో ఎన్నిసార్లు నన్ను నేను తరచి చూసుకున్నానో! ఇది నాకొక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్!’– వంశీ చాగంటి, హ్యాపీడేస్ ఫేమ్ -
దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి
గన్‌ఫౌండ్రి (హైదరాబాద్): చిన్న లోపాన్ని చూసుకొని మానసికంగా కుంగిపోవద్దని ఆత్మవిశ్వాసంతో అడుగులు వేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మంగళవారం రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. త్వరలోనే దివ్యాంగులకు పెన్షన్ పెంచడంతో పాటు వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దివ్యాంగులకు రూ.300 పెన్షన్ ఇస్తోందని అది రూ.3 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. గత 11 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్‌ను ఒక్క రూపాయి కూడా పెంచకపోవడం దారుణమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ బుచి్చనేని వీరయ్య మాట్లాడుతూ, రాబోయే రెండు నెలల్లో 40 శాతం వైకల్యానికి ఉచితంగా సహాయ ఉపకరణాలు పంచుతున్నట్లు ప్రకటించారు. అనంతరం వివిధ రంగాలలో అద్భుత విజయాలు సాధించిన దివ్యాంగులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పలువురు దివ్యాంగులు చేసిన నృత్య ప్రదర్శనలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. కాళ్లులేని దివ్యాంగులకు మంత్రి సీతక్క స్వయంగా కృత్రిమ కాళ్లను తొడిగారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రాంచంద్రన్, డైరెక్టర్ శైలజ, జీఎం.ప్రభంజన్‌రావులతో పాటు వివిధ వికలాంగుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
రవీంద్రభారతిలో ఘనంగా బతుకమ్మ, పేరిణి నృత్యం (ఫోటోలు)
-
హైదరాబాద్ : రవీంద్రభారతిలో అటుకుల బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)
-
29న శివశంకరికి ‘సినారే’ పురస్కారం!
గన్‌ఫౌండ్రీ: జ్ఞాన్‌పీఠ్ పురస్కార గ్రహిత పద్మభూషణ్ డాక్టర్ సి.నారాయణరెడ్డి 93వ జయంతిని పురస్కరించుకుని ప్రముఖ తమిళ రచయిత్రి శివశంకరికి ఈ నెల 29న విశ్వంభర సినారే జాతీయ సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు.ఈ విషయాన్ని సుశీల నారాయణరెడ్డి ట్రస్టు ప్రధాన కార్యదర్శి జె.చెన్నయ్య ఒక ప్రకటనలో తెలిపారు. రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, శాంతా బయోటిక్ ఎండి డాక్టర్ కేఐ వరప్రసాద్‌రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. డాక్టర్ సి.నారాయణరెడ్డి రచించిన పుస్తకావిష్కరణ, నృత్య ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు.ఇవి చదవండి: పదునైన రచయిత పసునూరి.. -
రవీంద్రభారతిలో ఆకట్టుకున్న కాకతీయం నృత్య రూపకం (ఫొటోలు)
-
నాట్యవిలాసం..
రవీంద్ర భారతిలో అద్భుత నాట్య ప్రదర్శన ఆహూతులను ఆకట్టుకున్న నృత్య రీతులు ప్రదర్శన ఎప్పటికీ మర్చిపోలేం: ఇంద్రాణీ సుగుమార్ ప్రేక్షకుల స్పందన చూసి ఆశ్చర్యపోయాం మలేసియా నాట్యబృందంతో ‘సాక్షి’ ప్రత్యేక సంభాషణ సాక్షి, సిటీబ్యూరో/గన్‌ఫౌండ్రీ: నెమలి నాట్యం ఎంత అందంగా ఉంటుందో.. వాళ్లు నృత్యం చేస్తే అంతకన్నా అద్భుతంగా ఉంటుంది. ఆ నెమలి సైతం అబ్బురపడేలా వారి ప్రదర్శన ఉంటుంది. అమ్మవారి వేషం వేసుకుంటే అమ్మవారే పూనినట్టు అనిపిస్తుంది. రాక్షస సంహార ఘట్టం ప్రదర్శన చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. ఎవరైనా సరే చేతులెత్తి నమస్కరించాల్సిందే. సాక్షాత్తూ అమ్మవారే భువి నుంచి దివికి దిగి వచ్చారా అన్నట్టు అనిపిస్తుంది. ఇటీవల మలేసియా నుంచి హైదరాబాద్ వచ్చి పలు నృత్య రూపకాలను రవీంద్రభారతిలో ప్రదర్శించిన నాట్య బృందాన్ని ‘సాక్షి’పలకరించింది. ఇక్కడ వారి అనుభవాల గురించి అడిగి తెలుసుకుంది. కళ్లు చెమర్చాయి... రవీంద్ర భారతిలో మలేసియా సంప్రదాయ నృత్యమైన నెమలి నృత్యం, కళింగ అమ్మాళ్ నృత్య రూపకాలను ప్రదర్శించామని బృందానికి ప్రాతినిధ్యం వహించిన డాక్టర్ ఇంద్రాణీ సుగుమార్ వివరించారు. మొత్తం పది మంది బృందంతో ఇచి్చన అమ్మాళ్ నృత్య ప్రదర్శనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచి్చందని తెలిపారు. రాక్షస సంహారం అనంతరం ప్రేక్షకులు కొట్టిన చప్పట్లు ఎప్పుడూ మర్చిపోలేనని చెప్పారు. అనేక దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చామని, ఇలాంటి స్పందన ఎక్కడా చూడలేదని, ఇక్కడివారి ప్రేమాభిమానాలకు మంత్ర ముగ్ధులమయ్యామని చెప్పారు. ఇక లైటింగ్, సౌండ్‌సిస్టమ్‌తో ప్రదర్శన చేస్తుంటే రోమాలు నిక్కబొడిచాయని, అంత అద్భుతంగా స్టేజీని అలంకరించారని చెప్పారు. ప్రదర్శన అనంతరం అమ్మవారి వేషధారణలో ఉన్న తమకు కొందరు నమస్కరించారని గుర్తు చేసుకున్నారు. ఆడవాళ్లకు చాలా సురక్షితమైన ప్రాంతం మహిళలకు హైదరాబాద్ ఎంతో సురక్షిత ప్రాంతంగా అనిపించిందని చెప్పారు. నిర్వాహకులు తమను ఎంతో బాగా చూసుకున్నారన్నారు. ఇక్కడి ఆతిథ్యం ఎంతో బాగుందని వివరించారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించారని పేర్కొన్నారు. తొలిసారి హైదరాబాద్‌లో నృత్య ప్రదర్శన ఇచ్చామని, మరోసారి అవకాశం వస్తే ప్రదర్శన చేయాలని ఉందని చెప్పారు. హైదరాబాద్ బిర్యానీ బాగుంది.. చార్మినార్‌ను సందర్శించామని, ఇక, హైదరాబాద్ బిర్యానీ ఎంతో రుచికరంగా ఉందని, అక్కడికి వెళ్లాక చాలా మిస్ అవుతామన్నారు. ఇరానీ చాయ్ కూడా టేస్టీగా ఉందని చెప్పారు. ఇక్కడికి రావడం అదృష్టంగా భావిస్తున్నామని వివరించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర భాష, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ఎంతో మర్యాదగా మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నారని తెలిపారు.దేశవిదేశాల్లో ప్రదర్శనలు.. ఏపీలోని వైజాగ్‌తో పాటు తమిళనాడులోని చిదంబరం దేవాలయం, పుదుచ్చేరిలో ప్రదర్శనలు ఇచ్చామని, చిదంబరంలో 2019లో తాము ప్రదర్శించిన చిదంబరేశ నాట్య కలైమణి ప్రదర్శన గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కిందని చెప్పుకొచ్చారు. దక్షిణాఫ్రికాలోని పలు ప్రాంతాల్లో ‘కల్చరల్ ఎక్సే్చంజ్ ప్రోగ్రామ్’ కింద అనేక ప్రదర్శనలు ఇచ్చామని తెలిపారు. మలేసియా, సింగపూర్, థాయ్‌లాండ్, మారిషస్‌లోని అనేక ప్రాంతాల్లో నృత్య ప్రదర్శన చేస్తుంటామని చెప్పారు. ముఖ్యంగా నవరాత్రుల సందర్భంగా తాము ప్రదర్శనలు ఇస్తుంటామని తెలిపారు. మలేసియాలోని కౌలాలంపూర్ వద్ద ఇంద్రాణీ డ్యాన్స్ అకాడమీ నెలకొల్పి, ఆసక్తి ఉన్న వారికి నృత్యం నేరి్పస్తానని తెలిపారు. భరత నాట్యంలో తాను నిష్ణాతురాలినని, అయితే భరత నాట్యంతో పాటు ఒడిస్సీ కూడా విద్యార్థులకు నేరి్పస్తానని వివరించారు. -
రవీంద్రభారతిలో కూచిపూడి నృత్య ప్రదర్శన,రామ్, కృతిశెట్టి సందడి (ఫొటోలు)
-
'ఆటా' గ్రాండ్ ఫినాలే.. రాజేంద్రప్రసాద్‌కు ప్రత్యేక ఆహ్వానం
'ఆటా' గ్రాండ్ ఫినాలే కార్యక్రమానికి నటకిరీటి రాజేంద్రప్రసాద్‌ను ఆటా ప్రతినిధులు ఆహ్వానించారు. ఈనెల 30న రవీంద్రభారతిలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా ఆటా వేడుకల చైర్, ఎలెక్ట్ ప్రెసిడెంట్ జయంత్ చల్లా ఆధ్వర్యంలో ఆటా ప్రతినిధులు రాజేంద్రప్రసాద్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆయన ఇంట్లో సరదాగా కాసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో ఆటా వేడుకల కో చైర్ వేణు సంకినేని, ఆటా సెక్రెటరీ రామకృష్ణారెడ్డి అల, ఆటా కోశాధికారి సతీష్ రెడ్డి 18వ ఆటా కాన్ఫరెన్స్ నేషనల్ కో ఆర్డినేటర్ సాయి సుధిని, ఆటా జాయింట్ ట్రెజరర్ రవీందర్ గూడూరు, మీడియా కో ఆర్డినేటర్ ఈశ్వర్ బండా, ఆటా బోర్డు ఆఫ్ ట్రస్టీస్ కాశీ కొత్త, ఆటా ఇండియా కో ఆర్డినేటర్ అమృత్ ముళ్ళపూడి తదితరులు పాల్గొన్నారు. -
చిరస్మరణీయుడు కాళోజీ
గన్‌ఫౌండ్రీ(హైదరాబాద్): ప్రముఖ ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు ఉద్యమమే ఊపిరిగా జీవించిన మహనీయుడని పలువురు ప్రముఖులు కొనియాడారు. శనివారం ఇక్కడి రవీంద్రభారతిలో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కాళోజీ 109వ జయంతి ఉత్సవాలు, తెలంగాణ భాషా దినోత్సవాలను ఘనంగా నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎౖMð్సజ్, సాంస్కృతిక శాఖల మంత్రి వి.శ్రీని వాస్‌గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్ప డిన తర్వాత ఈ ప్రాంత మహనీయుల జయంతి, వర్థంతి వేడుకలను బీఆర్ఎస్ ప్రభుత్వం అధికా రికంగా నిర్వహిస్తోందని తెలిపారు. సాహిత్య రంగానికి కాళోజీ చేసిన సేవలను కొనియాడారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కాళోజీ స్వాతంత్య్ర సమరయోధుడిగా, ప్రజా కవిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేశారని కొనియాడారు. కొంతమంది మరణించినా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని, అందులో కాళోజీ ఒకరని పేర్కొన్నారు. అనంతరం ప్రముఖ కవి జయరాజ్ కు కాళోజీ స్మారక పురస్కారం ప్రదానం చేశారు. రూ.1,00,116 రూపాయల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ ముదిరాజ్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీని వాస్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమ ణాచారి, కార్పొరేషన్ల చైర్మన్లు జూలూరు గౌరీశంకర్, ఆయాచితం శ్రీధర్, గెల్లు శ్రీనివాస్‌యాదవ్, దీపికారెడ్డి, ఎం.శ్రీదేవి, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, పలువురు కవులు, సాహితీవేత్తలు పాల్గొన్నారు. -
కన్నుల పండుగగా 'చండాలిక' డ్యాన్స్
క్రాంతి కూచిపూడి నాట్యాలయ ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక శాఖ సౌజన్యంతో మహా కవి, కళా ప్రపూర్ణ, పద్మ భూషణ్ డాక్టర్ బోయి భీమన్న 'చండాలిక' డాన్స్ బ్యాలే సోమవారం రాత్రి రవీంద్ర భారతిలో కన్నుల పండుగగా జరిగింది. తెలంగాణ సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డాక్టర్ మామిడి హరికృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సెలర్ ప్రొఫెసర్ కిషన్ రావు ప్రత్యేక అతిధిగా హాజరయ్యారు. 'చండాలిక' పాత్రలో కూచిపూడి నృత్యకారిణి క్రాంతి నారాయణ్ నటించగా ఆనంద గా వీ.ఆర్ విక్రమ్ కుమార్ (విక్రమ్ గౌడ్), మాలీ గా కిరణ్మయి బోనాల, భటులుగా వినోద్, ప్రశాంత్, దీమాన్స్గా డింపుల్ ప్రియా, జాహ్నవి, రీతూ, తులసి నటించారు. డాక్టర్ బోయి భీమన్న రచించిన 'చండాలిక' డాన్స్ బ్యాలేకు ఫణి నారాయణ సంగీతాన్ని అందించగా క్రాంతి నారాయణ్ డాన్స్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారు ఈ కార్యక్రమంలో గౌరవ అతిధులుగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ భట్టు రమేష్, ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి డాక్టర్ జి. పద్మజా రెడ్డి, డాక్టర్ వనజా రెడ్డి, భీమన్న సాహితి నిధి ట్రస్ట్ చైర్మన్ హైమవతి భీమన్న తదితరులు పాల్గొన్నారు. (చదవండి: 'సృష్టి' ప్రపంచ రికార్డు) -
రవీంద్రభారతిలో ఘనంగా మహిళాసంక్షేమ సంబరాలు (ఫొటోలు)
-
సహజ నటి జయసుధకు ఎన్టీఆర్ పురస్కారం
సహజ నటి జయసుధ ప్రేక్షకలు మదిలో చెరగని ముద్ర వేసుకున్నారని కేంద్ర మంత్రి టి సుబ్బారామిరెడ్డి అన్నారు. ఆదివారం రవీంద్రభారతిలో వంశీ ఇంటర్నేషనల్ సంస్థ ఆధ్వర్యంలో స్వర్గీయ ఎన్టీఆర్ శతజయంతిని పురస్కరించుకుని సినీ నటి జయసుధకు ఎన్టీఆర్ జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. అంతకుముందు ఆకునూరి శారద నిర్వహణలో సినీ సంగీత విభావరి ఆహుతులను ఆకట్టుకుంది. ఆ కార్యక్రమంలో ఏపీ మాజీ డిప్యూటీ స్పికర్ మండలి ఉద్ద ప్రసాద్, సినీ దర్శకుడు ఎ కొదండరామిరెడ్డి, బి గోపాల్, రేలంగి నర్సింహారావు, వైవీఎస్ చౌదరి, వంశఅఈ సంస్థల వ్యవస్థాపకులు వంశీరాజు తదితరులు పాల్గొన్నారు. -
రవీంద్రభారతి : దర్శకుడు త్రివిక్రమ్ సతీమణి సౌజన్య నృత్యరూపకం (ఫొటోలు)
-
రవీంద్ర భారతి : నమామి గంగే.. ఉత్సాహం ఉప్పొంగే (ఫొటోలు)
-
నేటి నుంచి తెలుగు భాషా అమృతోత్సవాలు
సాక్షి, హైదరాబాద్: తెలుగు భాష, సాహితీ, సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం నుంచి ఈ నెల 29 వరకు తెలుగు భాషా అమృతోత్సవాలను జరుపతలపెట్టినట్లు సంస్థ వ్యవస్థాపక చైర్మన్ కంచర్ల సుబ్బానాయుడు తెలిపారు. రవీంద్రభారతిలో మంగళవారం టంగుటూరి ప్రకాశం పంతులు జయంత్యుత్సవాలతో ఇవి ప్రారంభమవుతాయని, తొలిరోజు జరగనున్న కార్యక్రమాలకు సమన్వయకర్తలుగా లక్ష్మీ పెండ్యాల, పేరి,, ఖాదర్ బాషా, అమరనేని సుకన్య, ఇమ్మడి రాంబాబు, వడ్డేపల్లి విజయలక్ష్మి వ్యవహరిస్తారని వివరించారు. వారం పాటు ప్రతీ రోజూ సాహితీ సదస్సులు, సాహితీ ప్రక్రియలు, కవి సమ్మేళనాలు, కవులకు గౌరవ పురస్కారాలు, పుస్తకావిష్కరణలు, పుస్తక ప్రదర్శనలు ఉంటాయన్నారు. (చదవండి: బంగారు కాదు బార్ల తెలంగాణ: షర్మిల) -
రవీంద్రభారతిలో ఘనంగా ఫొటో ఎగ్జిబిషన్ (ఫొటోలు)
-
రవీంద్ర భారతిలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలు
-
గొప్ప సాహితీవేత్త సురవరం ప్రతాపరెడ్డి
గన్‌ఫౌండ్రీ/కవాడిగూడ(హైదరాబాద్): సురవరం ప్రతాపరెడ్డి బహుముఖ ప్రజ్ఞాశాలి, గొప్ప సాహితీవేత్త అని మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో శనివారం రవీంద్రభారతిలో సురవరం ప్రతాపరెడ్డి 126వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రులు మాట్లాడుతూ.. కుల, మత పిచ్చితో దేశాన్ని సర్వ నాశనం చేస్తున్నటువంటి వారికి సురవరం జీవితం ఓ సమాధానమన్నారు. ఆయన లాంటి వ్యక్తిత్వమున్న నాయకులు దేశానికి ఎంతో అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, సురవరం ప్రతాప్‌రెడ్డి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కాగా, సురవరం ప్రతాప్‌రెడ్డి పురస్కారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పలువురికి అందజేసింది. పద్మభూషణ్ కె.ఐ.వరప్రసాదరెడ్డి, రచయిత ఈమణి శివనాగిరెడ్డి, డాక్టర్ సింకిరెడ్డి నారాయణరెడ్డి, ఆర్.శేషశాస్త్రి, జె.చెన్నయ్యకు రూ.లక్ష చెక్కుతో పాటు స్మారక పురస్కారాలను ప్రదానం చేసింది. ప్రజల పక్షాన నిలిచిన సురవరం నిరంతరం ప్రజల పక్షాన నిలిచిన గొప్ప మహనీయుడు, తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి అని మం త్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్ కొనియాడారు. శనివారం సురవరం జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై ఆయన విగ్రహానికి మంత్రులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. -
కార్మికులకు త్వరలో కొత్త పథకం
గన్‌ఫౌండ్రీ: కార్మికులను ధనవంతులుగా చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఆదివారం రవీంద్రభారతిలో నిర్వహించిన మేడే వేడుకల్లో ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో కార్మికుల సంక్షేమం కోసం పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతుబంధు, దళితబంధు తరహాలో కార్మికుల కోసం త్వరలో ఓ కొత్త పథకం తీసుకువస్తామన్నారు. తాను సైకిల్ మీద పాల వ్యాపారం ప్రారంభించానని, నిరంతరం కçష్టపడితేనే జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకుంటామని అన్నా రు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ మాట్లాడుతూ.. దేశ సంపద సృష్టిలో కార్మికుల పాత్ర ఎనలేనిదన్నారు. మేడే సందర్భంగా మం త్రి మల్లారెడ్డి కార్మికుడి వేషధారణలో వచ్చి అందరినీ ఆకట్టుకున్నారు. అనంత రం మైహోం గ్రూప్, ఎన్ఎస్ఎన్ కృష్ణవేణి షుగర్స్, సాగర్ సిమెంట్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ, ఎల్ అండ్ టీ వంటి పలు కంపెనీలకు ఉత్తమ యాజమాన్యం అవార్డులు, 40 మంది కార్మిక విభాగం ప్రతినిధులకు శ్రమశక్తి పురస్కారాలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కె.చందర్, రాష్ట్ర పాఠశాల మౌలిక వసతుల కల్పన చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, కార్మికశాఖ ముఖ్య కార్యదర్శి రాణీ కుముదిని, కమిషనర్ అహ్మద్ నదీమ్ పాల్గొన్నారు. పప్పు పహిల్వాన్ రాహుల్ పప్పు పహిల్వాన్‌గా పేరున్న రాహుల్‌గాంధీ వరంగల్‌కు వచ్చి ఏం ఒరగబెడతారని మంత్రి మల్లారెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ దివాలా తీసిందని, అందుకే రాహుల్‌ను తీసుకొస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆదివారం ఇక్కడి తెలంగాణ భవన్లో టీఆర్ఎస్కేవీ నిర్వహించిన మే డే వేడుకల్లో మల్లారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేశారని అన్నారు. అనంతరం ఉత్తమ సేవలందించిన కార్మికులకు శ్రామిక్ అవార్డులు అందజేశారు. -
‘బడుగుల కోసం పోరాడిన మహానుభావుడు పూలే’
గన్‌ఫౌండ్రీ: విద్యను ఆయుధంగా మార్చుకోవాలని సూచించిన గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిబా పూలే అని పలువురు ప్రముఖులు కొనియాడారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పూలే 196వ జయంతి వేడుకలను సోమవారం రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల జీవితాల్లో సమూల మార్పుల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావుడు జ్యోతిబా పూలే అని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పూలే సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తున్నారని తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ పార్లమెంట్లో బీసీ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బీసీ జనగణనను నిర్వహించాలని డిమాండ్ చేశారు. పలు పోటీపరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం ఈనెల 16న ఆన్లైన్ వేదికగా పరీక్షను నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం వెల్లడించారు. కార్యక్రమంలో బీసీ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి భట్టు మల్లయ్య, బీసీ కమిషన్ సభ్యుడు ఉపేంద్రచారి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, పూలే జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్లు ఆనంద్‌కుమార్ గౌడ్, నీల వెంకటేశ్, రాజేందర్, బడేసాబ్ పాల్గొన్నారు. -
కార్పొరేట్ సంస్థలు సామాజిక సేవలో భాగస్వాములు కావాలి: రాజేంద్రప్రసాద్
ధనం సంపాదించటమే ముఖ్యం కాదు, ఆర్జించిన సంపద లో కొంత వితరణ కోసం వెచ్చించాలని ప్రముఖ సినీ నటుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ప్రముఖ సామాజిక సేవాసంస్థ సుచిరిండియా ఫౌండేషన్ నిర్వహించిన 29వ సర్ సివి రామన్ టాలెంట్ సెర్చ్ పరీక్షలో విజయం సాధించిన వారికి రవీంద్ర భారతీలో అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజేంద్రప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. కార్పొరేట్ సంస్థలు సామాజిక సేవ లో భాగ స్వాములు కావాలని కోరారు. పిల్లలు ఆట పాటలతో చదువుని ఇష్టంగా నేర్చుకోవాలన్నారు. విద్యార్థులను జాతి నిర్మాతలుగా దీర్చి దిద్దాల్చిన గురుతర బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సినీనటుడు డాక్టర్ రాజేంద్రప్రసాద్, డాక్టర్ జేవీఆర్ సాగర్, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు , రీజినల్ పాస్ పోర్ట్ ఆఫీసర్ దాసరి బాలయ్య, సూచిరిండియా ఫౌండేషన్ నిర్వహకులు లయన్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. సామాజిక సేవాసంస్థ సుచిరిండియా ఫౌండేషన్ 29వ సర్ సివి రామన్ టాలెంట్ సెర్చ్ పరీక్షను జాతీయ, రాష్ట్ర స్థాయిలో వివిధ పాఠశాలల్లో నిర్వహించింది. 1000 పాఠశాలల నుంచి పదివేల మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.దేశ వ్యాప్తంగా, తెలుగు రాష్ట్రాల పరిధిలో నిర్వహించన 29వ జాతీయ స్థాయి సైన్స్ టాలెంట్ సెర్చ్ పరీక్షల్లో 16 మందికి గోల్డ్ మెడల్స్, 48 మంది కి నేషనల్ ర్యాంక్స్ & రాష్ట్రా స్థాయి మెడల్స్, 300 మందికి జిల్లా స్థాయి ర్యాంక్స్ , 10 మందికి గురుబ్రహ్మ ఛత్రాలయా అవార్డ్స్ పొందరాని నిర్వాహకులు తెలిపారు. -
ఫ్రెంచి–తెలుగు నిఘంటువు ఎంతో అవసరం: ప్రొ. డానియెల్
సాక్షి, హైదరాబాద్: వందల ఏళ్లుగా భాష, సంస్కృతులతో అనుబంధం కలిగి ఉన్న ఫ్రెంచ్–తెలుగు మహా నిఘంటువు అవసరం ఎంతో ఉందని ఫ్రెంచి రచయిత, తెలుగు అధ్యయనవేత్త ప్రొఫెసర్ డానియెల్ నెజాక్స్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్‌తో రవీంద్రభారతిలో గురువారం సమావేశమైన డానియెల్, నిఘంటువు ప్రచురణకు సహకరించవలసిందిగా కోరారు. మూడున్నర దశాబ్దాలకు పైగా తెలుగు భాషతో, ప్రజలతో అనుబంధం ఉన్న తాను పారిస్‌లో తెలుగుపై ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని భావిస్తున్నట్లు చెప్పారు. అందుకు తెలంగాణ ప్రభుత్వ సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ సందర్భంగా జూలూరు మాట్లాడుతూ.. ఫ్రెంచి–తెలుగు మహా నిఘంటువు ప్రచురణకు తెలంగాణ సాహిత్య అకాడమీ సిద్ధంగా ఉందని, ఈ గ్రంథానికి అన్ని విధాలుగా సహకరిస్తామని తెలిపారు. పారిస్‌లో తెలుగు భాష, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన సంతోషదాయకమని, ముఖ్యమంత్రి కేసీఆర్, క్రీడా సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌లతో మాట్లాడిన తరువాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తెలుగు–ఫ్రెంచి మహా నిఘంటువు కోసం డానియల్ చేస్తున్న కృషిని జూలూరు అభినందించారు. -
తెలుగు ఔన్నత్యాన్ని అందరూ కాపాడాలి
సాక్షి, హైదరాబాద్: తెలుగు భాష సంస్కృతీ ఔన్నత్యాలను తెలుగువారంతా కాపాడుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. ప్రస్తుతం తెలుగు భాషా సంస్కృతులను దిగజార్చేలా చోటుచేసుకుంటున్న పరిణామాలను చూస్తూంటే తెలుగువాడిగా ఎంతో ఆవేదనకు గురవుతున్నట్లు చెప్పారు. అమర గాయకుడు ఘంటసాల వేంకటేశ్వరరావు శత జయంతి సందర్భంగా సంగమం ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన వేడుకలకు జస్టిస్ ఎన్వీ రమణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వాలు మద్దతు ఇవ్వట్లేదు... ఘంటసాల వంటి మహానుభావులు తెలుగుభాషా సంస్కృతులను ఉన్నత శిఖరాలకు చేర్చారని, తెలుగు భాష ప్రతిష్టను పెంచారని జస్టిస్ ఎన్వీ రమణ కొనియాడారు. కానీ ప్రస్తుత పరిణామాలు బాధ కలిగిస్తున్నాయన్నారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని దిగజార్చుకోవడం సరికాదన్నారు. జీవన పోరాటంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం పరభాషలు నేర్చుకోవడం తప్పనిసరిగా మారినప్పటికీ అందుకోసం మన భాషను తక్కువ చేయొద్దని హితవు పలికారు. ప్రభుత్వాలు సైతం తెలుగు భాషాభివృద్ధికి మద్దతు ఇవ్వడం లేదని, ఆంగ్లం నేర్చుకొంటేనే భవిష్యత్తు బాగుంటుందనే అపోహను సృష్టిస్తున్నాయన్నారు. ఈ ధోరణి ఏమాత్రం సరైంది కాదన్నారు. ఇప్పటి నటులకు తెలుగు సరిగ్గా రావట్లేదు.. ఒకప్పుడు సినిమాలు చూసి తెలుగు ఉచ్ఛారణను నేర్చుకున్నామని, తెలుగు భాషకు సినిమాలు పట్టం కట్టాయని జస్టిస్ ఎన్వీ రమణ గుర్తుచేసుకున్నారు. కానీ ఇప్పటి తెలుగు సినీనటులు, గాయనీగాయకులకు తెలుగు సరిగ్గా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారంతా బాధ్యతగా తెలుగు నేర్చుకోవాలని సూచించారు. సినీరంగమే తెలుగు వైభవాన్ని, గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలని కోరారు. సామాజిక స్పృహగల సినిమాలు మాత్రమే చర్చనీయాంశమవుతాయని, అలాంటి మంచి సినిమాలు తీయాలంటే భాష, సాహిత్య, సంస్కృతులపై ఎంతో పట్టు ఉండాలన్నారు. గానకోకిలకు ఘన సన్మానం... ఈ సందర్భంగా గానకోకిల పి.సుశీలను ఘంటసాల శతజయంతి ప్రత్యేక పురస్కారంతో జస్టిస్ ఎన్వీ రమణ ఘనంగా సత్కరించారు. ఆమెకు రూ. లక్ష నగదు, నూతన వస్త్రాలు, శాలువాను ప్రదానం చేశారు. ఘంటసాలతో కలసి వేలాది పాటలు పాడిన తాను ఆయన శతజయంతి సందర్భంగా పురస్కారాన్ని అందుకోవడం ఎంతో సంతోషంగా ఉందని సుశీల చెప్పారు. ఈ సందర్భంగా ఆహూతుల కోరిక మేరకు ఆమె కొన్ని పాటలు పాడి అలరించారు. ఏపీలోనూ నిర్వహిస్తాం... ఘంటసాల శతజయంతి ఉత్సవాలకు ఏడాదిపాటు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ అన్ని విధాలుగా సహకరిస్తుందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. ఏపీలోనూ ఘంటసాల శతజయంతి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు చోడవరం ఎమ్మెల్యే ధర్మేంద్ర తెలిపారు. కార్యక్రమానికి ఏపీ మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈ వేడుకలో సీనియర్ నటి కృష్ణవేణితోపాటు నటులు మురళీమోహన్, ఆర్. నారాయణమూర్తి, మంజుభార్గవి, దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, వివేకానంద ఆసుపత్రి ఎండీ డాక్టర్ వి. గీత, సంగమం ఫౌండేషన్ వ్యవస్థాపకులు సంజయ్ కిషోర్, శాంతా బయోటెక్ అధినేత వరప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వేడుకల ప్రారంభంలో జయశ్రీ, శశికళల సారథ్యంలో 100 మంది చిన్నారులు ఘంటసాల పాటలు ఆలపించి ఆహూతులను మంత్రముగ్ధులను చేశారు. -
దివ్యాంగులకు ప్రభుత్వం పూర్తి భరోసా
గన్‌ఫౌండ్రీ: రాష్ట్రప్రభుత్వం దివ్యాంగులకు పూర్తి భరోసా ఇస్తుందని సాంఘిక సంక్షేమ శాఖమంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం రవీంద్రభారతిలో వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొప్పుల మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా అత్యధిక పెన్షన్లను దివ్యాంగులకు అందజేస్తున్నట్లు చెప్పారు. అలాగే పలు సంక్షేమ పథకాలు, క్రీడారంగం, పలు విభాగాల్లో దివ్యాంగులకు ప్రత్యేక కోటా ఏర్పాటు చేశామని వివరించారు. రాష్ట్రంలో 5 లక్షలకు పైగా వికలాంగులకు రూ.18 కోట్లతో ఏటా పెన్షన్లను అందిస్తున్నట్లు తెలిపారు. స్త్రీ, శిశు సంక్షేమశాఖ, వికలాంగుల సంక్షేమ శాఖను వేరు చేయాలనే ప్రతిపాదనను మంత్రిమండలికి సిఫారసు చేస్తానని కొప్పుల హామీ ఇచ్చారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ వికలాంగులకు అన్నివిధాలుగా అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మల్లారెడ్డి, వికలాంగుల సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్య దేవరాజ్ పాల్గొన్నారు. -
బతుకమ్మ పాటను ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్
సాక్షి, హైదరాబాద్: బతుకమ్మ సంబురాల సందర్భంగా బతుకమ్మ ఆడియో, వీడియో పాటను రవీంద్రభారతిలోని తన కార్యాలయంలో ఎక్సైజ్, సాంస్కృతిక, పర్యాటక శాఖమంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రముఖ కవి, కథ రచయిత విజయ భాస్కర్, రేఖ బోయపల్లి తదితరులు పాల్గొన్నారు. -
ఇటు హరితహారం... అటు హననమా?
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు చెట్లను పెంచాలంటూ రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్య క్రమం చేపడుతుండగా.. మరోవైపు రవీంద్రభారతి ఆవరణలో రెండు భారీ వృక్షాలను కొట్టేయడానికి ప్రయత్నించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రోడ్డుకు సమీపంలో లేకపోగా.. ట్రాఫిక్‌కు ఎటువంటి అంతరాయం లేకుండా కళాభారతి భవనం వెనుక ఉన్న ఈ వృక్షాలను ఎందుకు తొలగించాలని చూస్తున్నారని ప్రశ్నించింది. ఆ రెండు వృక్షాలను కొట్టివేయడాన్ని వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు, జస్టిస్ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రెండు భారీ వృక్షాలను కొట్టేసేందుకు ప్రయత్నిస్తున్నారని, కొట్టేయకుండా చూడాలంటూ తాము వినతిపత్రం ఇచ్చినా స్పందన లేదంటూ అదే ప్రాంత నివాసి, సామాజిక కార్యకర్త డబ్ల్యూ.శివకుమార్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం విచారించింది. కళాభారతి భవనం పశ్చిమ భాగంలో దాదాపు 40 ఏళ్ల వయసున్న 50 ఫీట్లకుపైగా ఎత్తున్న రావిచెట్టు, మలబార్ వేప వృక్షాలు ఉన్నాయని, ఈనెల 18న వీటి కొమ్మలను కొట్టేస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది వడ్డేపల్లి రచన తెలిపారు. ఈ మేరకు పిటిషనర్ అక్కడ సిబ్బందిని ఆరా తీయగా ఈ రెండు చెట్లను కొట్టేస్తున్నట్లు తెలిపారన్నారు. ‘ఈ వృక్షాలు ప్రజల ప్రాణాలకుగానీ, భవనాలకు గానీ నష్టం కల్గించే పరిస్థితి లేదు. భవనాల మధ్య ఉండటంతో భారీ గాలి వీచినా కూలిపోయే పరిస్థితి లేదు. భారీ వృక్షాల కొమ్మలను కొట్టివేయాలంటే జీహెచ్ఎంసీ అనుమతి తీసుకోవాలి. వృక్షాలను పూర్తిగా తొలగించాలంటే అటవీశాఖ అనుమతి తప్పనిసరి. ఎటువంటి అనుమతి లేకుండా వృక్షాలను తొలగిస్తున్నారు. వృక్షాలను తొలగించకుండా ఆదేశించండి’అని న్యాయవాది విజ్ఞప్తి చేశారు. -
ఉద్యమకారులకు స్ఫూర్తి.. కాళోజీ
గన్‌ఫౌండ్రీ: తెలంగాణ ఉద్యమకారులకు గొప్ప స్ఫూర్తిని ఇచ్చిన ప్రజా కవి కాళోజీని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. గురువారం రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రజాకవి కాళోజి నారాయణరావు 107వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ, కాళోజీ జయంతిని అధికారికంగా జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ కవులు, కళాకారులను ఎంతో ప్రోత్సహిస్తున్నారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాఠ్య పుస్తకాలలో కాళోజీ జీవిత చరిత్రను పొందుపరిచామని, కాళోజి పేరుమీద విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ కవి డాక్టర్ పెన్నా శివరామకృష్ణకు కాళోజీ పురస్కారాన్ని అందజేశారు. కార్యక్రమంలో శాసనసభ్యులు రసమయి బాలకృష్ణ, శాసన మండలి సభ్యులు గోరటి వెంకన్న, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి, గ్రంధాలయ సంస్థ చైర్మన్ అయాచితం శ్రీధర్, సాంస్కృతిక శాఖ కార్యదర్శి కేఎస్ శ్రీనివాసరాజు, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణతో పాటు కవులు, కళాకారులు పాల్గొన్నారు. -
పెట్రోల్ పోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
ఖైరతాబాద్/అఫ్జల్‌గంజ్: తెలంగాణ వచ్చాక తమకు అన్యాయం జరిగిందంటూ ఓ వ్యక్తి జై తెలంగాణ.. జై కేసీఆర్ అని నినాదాలు చేస్తూ రవీంద్రభారతి రోడ్డులో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఓ పక్క అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా అసెంబ్లీకి కూతవేటు దూరంలోని రవీంద్రభారతి సమీపంలో ఒంటికి మంటలు అంటుకొని అరుపులతో రోడ్డుమీదకు వచ్చిన వ్యక్తిని చూసిన వాహనదారులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే నాగులు అనే ఆ వ్యక్తి ఒంటిపై మంటల్ని ఆర్పారు. ఆ వెంటనే అతడిని పోలీసులు ఆటోలో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం 63 శాతం కాలిన గాయాలతో అతను చికిత్స పొందుతున్నాడని తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా కడ్తాల్‌కు చెందిన బైకెలి నాగులు (55) చిన్నప్పటి నుంచి తెలంగాణ కోసం ఎక్కడ సభలు, సమావేశాలు జరిగినా పాల్గొనడమే కాకుండా ఉద్యమంలో కూడా చురుగ్గా పాలుపంచుకున్నాడు. చాలా కాలం కిందటే హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డాడు. నాగులు కూతురు స్నేహలత, కుమారుడు రాకేష్‌కుమార్ ఇద్దరూ డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్నారు. ప్రస్తుతం వీరు ఈసీఐఎల్ పరిధిలోని బండ్లగూడ, రాజీవ్ గృహకల్పలో నివాసముంటున్నారు. నాగులు బంజారాహిల్స్ రోడ్‌నం–2లోని ఎంవీ టవర్స్‌లో వాచ్‌మన్‌గా పనిచేస్తూ వారానికి ఒకసారి ఇంటికి వచ్చి వెళ్ళేవాడు. కాగా, అతను గురువారం ఉదయం ఓ బాటిల్లో పెట్రోల్ పోయించుకొని రవీంద్రభారతి వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. లాక్డౌన్ వల్ల ఆర్థిక ఇబ్బందులు పెరిగాయని, తన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకున్నా.. అది ఇవ్వలేకపోతున్నానని, ప్రభుత్వమే తన కుటుంబాన్ని, పిల్లల్ని ఆదుకోవాలని నాగులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెలిపాడు. ఇదిలా ఉండగా నాగులు ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతానికి నిలకడగా ఉందని ఉస్మానియా ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ నాగప్రసాద్ తెలిపారు. అతడి శరీరం దాదాపు 62 శాతం కాలిపోయిందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలి.. తెలంగాణ వస్తే అందరి బతుకులు మారుతాయని, తెలంగాణ కోసం తన ప్రాణం కూడా ఇస్తానని అనేవాడని నాగులు భార్య స్వరూప తెలిపింది. పోలీసులు ఫోన్ చేసి మీ భర్త ఉస్మానియాలో గాలిన గాయాలతో ఉన్నాడని చెప్పగానే తట్టుకోలేక పోయానని స్వరూప ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వం చొరవ తీసుకుని తన భర్తకు మంచి చికిత్స అందించాలని కోరింది. తన భర్త తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనేవాడని, అయితే ప్రత్యేక రాష్ట్రం వచ్చినా తమకు న్యాయం జరగడం లేదని తరచూ బాధ పడేవాడని, తమ కుటుంబ పెద్దదిక్కు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని ఆమె విజ్ఞప్తి చేసింది. మంత్రి ఈటల వాకబు.. అసెంబ్లీ సమీపంలో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడనే విషయం తెలిసిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ విచారం వ్యక్తం చేశారని, నాగులుకు మెరుగైన చికిత్స అందించాలని తనకు సూచించారని ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ తెలిపారు. -
రవీంద్ర భారతి వద్ద కలకలం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని రవీంద్రభారతి వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కడ్తల్‌కు చెందిన నాగరాజు అనే వ్యక్తి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.వెంటనే అప్రమత్తమైన పోలీసులు బాధిత వ్యక్తిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జై తెలంగాణ అని నినాదాలు చేసినట్టు, కేసీఆర్ తనకు న్యాయం చేయాలని అరిచినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన వ్యక్తి ప్రైవేట్ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. (నల్గొండలో ప్రేమికుల ఆత్మహత్య) రవీంద్ర భారతి దగ్గర ఆత్మహత్యాయత్నం చేసిన నాగరాజుతోపాటు ఆయన భార్యతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఫోన్లో మాట్లాడారు. పూర్తి వైద్యం ప్రభుత్వం ద్వారానే అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈమేరకు ఉస్మానియా సూపరిండెంట్‌తో మాట్లాడిన మంత్రి.. అధునాతన వైద్యం అందించాలని, తనను బతికించడానికి అన్ని ప్రయత్నాలు చేయాలని కోరారు. Reality of New India & New Telangana !! lost his job in unplanned lockdown attempts suicide near by Telangana assembly premises, he is one from the 12.2 cores people who lost jobs in India in Covid-19 lockdown. Do Govt care job loss people? Or only you care about celebrates? pic.twitter.com/9A4xB1RiRW — Danasari Anasuya (Seethakka) (@seethakkaMLA) September 10, 2020 -
అద్భుతంగా సప్తగిరి వైభవం
-
అందరికీ ఆరాధ్యుడు సేవాలాల్ మహారాజ్
గన్‌ఫౌండ్రీ: సేవాలాల్ మహారాజ్ కేవలం గిరిజనుల ఆరాధ్య దైవం మాత్రమే కాదని, అందరికీ ఆరాధ్యుడేనని రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గిరిజన సంక్షేమ సంఘం, సేవా ఫౌండేషన్ల ఆధ్వర్యంలో శుక్రవారం రవీంద్రభారతిలో శ్రీసంత్ సేవాలాల్ మహారాజ్ 281వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ... గిరిజనుల అభివృద్ధికి, సంస్కృతి, సాంప్రదాయాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు అధికారికంగా తెలంగాణ రాష్ట్రంలో తప్ప దేశంలో ఇంకెక్కడా జరపడం లేదంటే ఇది మన రాష్ట్ర గొప్పతనమన్నారు. గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. తెలంగాణలో అన్ని కులాలు, మతాలు, సమానంగా గౌరవిస్తూ సాంప్రదాయాలు, ఆచారాలను కాపాడుతున్నారని తెలిపారు. బంజారా భవన్, కొమురం భీమ్ భవన్లను నిర్మిస్తున్నట్లు, త్వరలోనే వాటిని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రులు ఈటల రాజేందర్, శ్రీనివాస్‌గౌడ్, రాష్ట్ర సమాచార హక్కుల కమిషనర్ శంకర్ నాయక్, పార్లమెంటు సభ్యులు బీబీపాటిల్, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీ సీతారామ్‌నాయక్, తెలంగాణ రాష్ట్ర గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌లతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
తెలంగాణ పోలీసులకు పతకాలు
-
విశిష్ట సేవలందించిన పోలీసులకు పతకాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ పోలీసు శాఖకు మంచి పేరు వచ్చిందని హోంమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. రాష్ట్రంలో పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ నడుస్తోందన్నారు. తెలంగాణ స్టేట్ పోలీస్ ఆధ్వర్యంలో సర్వీస్ మెడల్స్ డెకరేషన్ పురస్కార కార్యక్రమం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి మహమూద్ అలీ విధుల్లో విశిష్ట సేవలందించిన పోలీసులకు పతకాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు పోలీస్ శాఖపై నమ్మకం పెరిగిందన్నారు. గత ఆరేళ్ల నుంచి తెలంగాణలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగుండటంతో పెట్టుబడులు తరలి వస్తున్నాయన్నారు. పోలీస్ శాఖకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కువ నిధులు కేటాయించారని తెలిపారు. పోలీసు అధికారులకు హోంమంత్రి అవార్డులు అందజేయడం శుభపరిణామంగా పేర్కొన్నారు. డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. విధుల్లో ప్రావీణ్యం చూపించిన పోలీసు అధికారులకు మెడల్స్ అందించడం గర్వకారణమన్నారు. రాత్రనక, పగలనక, ప్రాణాలు కూడా లెక్క చేయకుండా డ్యూటీ చేసిన పోలీసు అధికారులకు పతకాలు అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం కష్టపడి రాష్ట్ర పోలీసు వ్యవస్థకు మంచి పేరు తెచ్చారని పోలీసులను ప్రశంసించారు. పోలీసుల సేవకు వారి కుటుంబాలు అందించే ప్రోత్సాహమే కీలకమన్నారు. 400 మందికి పైగా పోలీసు అధికారులకు ఒకేసారి అవార్డులు ఇవ్వడం రికార్డ్‌గా మిగిలిపోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ గ్యాలంటరీ అవార్డులు, పీఎం సర్వీస్ మెడల్స్, ఉత్తమ సేవా పతకాలు, మహోన్నత సేవా పతకాలు, రాష్ట్ర శౌర్య పతకం, రాష్ట్ర సర్వోన్నత పోలీసు పతకంతో పాటు పలు మెడల్స్‌ను పోలీసులు అందుకున్నారు. మొత్తంగా 418 మంది పోలీసు అధికారులకు పతకాలు బహుకరించారు. -
ముగిసిన ఆటా వేడుకలు
గన్‌ఫౌండ్రీ: అమెరికాలో స్థిరపడి పుట్టిన ప్రాంతానికి సేవ చేయాలనే సంకల్పంతో అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక, సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పలువురు వక్తలు అన్నారు. ఈ నెల 11న ప్రారంభమైన ఆటా వేడుకలు ఆదివారం రవీంద్రభారతిలో ముగిశాయి. హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేయాలని ఆకాంక్షించారు. లక్ష మైళ్ల దూరంలో ఉన్నప్పటికీ భారతీయ సంస్కృతి సం ప్రదాయాలను మరిచిపోకుండా తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఎప్పుడో నిర్మించిన పాఠశాలల పునరుద్ధరణకోసం ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు–నేడు కార్యక్రమంలో ఎన్ఆర్ఐలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ ఒకప్పుడు భారతీయ సమాజాన్ని చూసి అక్కడి సమాజం సంస్కృతి సంప్రదాయాలను నేర్చుకుందని, కానీ ప్రస్తుత మన సమాజం సంస్కృతి సంప్రదాయాలను మర్చిపోయిందన్నారు. అమెరికాలో స్థిరపడినప్పటికీ భారతదేశానికి వచ్చి సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా కార్యక్రమాలను నిర్వహించి ఇక్కడ ఉన్న వారికి స్ఫూర్తినిస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ సినీనటుడు కృష్ణంరాజుకు జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. నీరజ్ సంపతి (వ్యాపారం, క్రీడలు), శ్రీ కళాకృష్ణ, అశ్వినీరాథోడ్ (కళలు), రాహుల్ సిప్లిగంజ్, కొమండూరి రామాచారి (సంగీతం), సౌదామిని ప్రొద్దుటూరి (మహిళా సాధికారత), కృష్ణమనేని పాపారావు (సామాజిక సేవా) రంగాల వారికి పురస్కారాలను అందజేశారు. కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర శాసన సభ్యులు రసమయి బాలకిషన్, బొల్లం మల్లయ్య యాదవ్, ఆటా ప్రతినిధులు అనిల్ బోదిరెడ్డి, పరమేశ్ భీమ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
విపంచి.. వినోదం పంచి
-
దత్తాత్రేయ అందరి మనిషి
గన్‌ఫౌండ్రి : హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అందరి మనిషి అని పలువురు వక్తలు కొనియాడారు. ఇటీవల హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ గా ప్రమాణస్వీకారం చేసిన బండారు దత్తాత్రేయకు శుక్రవారం రవీంద్రభారతిలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పౌర సన్మాన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ దత్తాత్రేయ మాట్లాడుతూ.. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించేలా తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ..బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేసిన వ్యక్తి దత్తాత్రేయ అని కొనియాడారు. బీసీలు ఎదుర్కొంటున్న అసమానతలను దూరం చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని సూచించారు. టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ..గవర్నర్ పదవికి దత్తాత్రేయ వన్నె తేవాలని, భవిష్యత్‌లో మరిన్ని పదవులు స్వీకరించాలని ఆకాంక్షించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ..అందరినీ కలుపుకుపోయే గొప్ప గుణం ఉన్న వ్యక్తి దత్తన్న అని ప్రశంసించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయను బీసీ సంఘాల ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీటీ డీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, సినీనటుడు సుమన్, జస్టిస్ చంద్రకుమార్ , విశ్రాంత ఐఏఎస్ అధికారి వినోద్‌కుమార్ అగర్వాల్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ, పలు బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
శశిరేఖాపరిణయం
-
రారండోయ్
తెలంగాణ సాహిత్య అకాడమీ ‘నవలా స్రవంతి’లో భాగంగా జూలై 12న సాయంత్రం 6 గంటలకు రవీంద్ర భారతి కాన్ఫరెన్స్ హాలులో బి.ఎన్.శాస్త్రి చారిత్రక నవల ‘వాకాటక మహాదేవి’పై శ్రీరామోజు హరగోపాల్ ప్రసంగిస్తారు. తెలంగాణ చైతన్య సాహితి ఆవిర్భావ సభ జూలై 13న సాయంత్రం 4 గంటలకు రవీంద్ర భారతి సమావేశ మందిరంలో జరగనుంది. మూడు వీచికలుగా జరిగే ఈ సభకు ముఖ్య అతిథి: దేశపతి శ్రీనివాస్. వక్తలు: పి.వేణుగోపాల స్వామి, సుంకిరెడ్డి నారాయణరెడ్డి. కవి సమ్మేళనం ఉంటుంది. బొంత లచ్చారెడ్డి కావ్య కుసుమాలు, బాలబోధ, సులభ వ్యాకరణాల ఆవిష్కరణ జూలై 14న ఉదయం 11 గంటలకు ఆదిలాబాద్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరగనుంది. నిర్వహణ: పాలపిట్ట బుక్స్ కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కార గ్రహీత బెలగం భీమేశ్వరరావు అభినందనసభ జూలై 14న సాయంత్రం 6 గంటలకు విజయనగరంలోని గురజాడ గృహంలో జరగనుంది. నిర్వహణ: సహజ. చంద్రశేఖర్ ఇండ్ల కథల సంపుటి రంగుల చీకటి పరిచయ సభ జూలై 14న ఉదయం పదింటికి ఒంగోలులోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరగనుంది. తెలుగు సొసైటీ ఆఫ్ అమెరికా (తెల్సా) 21వ వార్షికోత్సవ సందర్భంగా కథ, నాటక పోటీ నిర్వహిస్తోంది. కథల మూడు బహుమతులు రూ.30 వేలు, 20 వేలు, 15 వేలు. నాటకాల రెండు బహుమతులు రూ.40 వేలు, 25 వేలు. రచనలను డిజిటల్ రూపంలో జూలై 31లోగా పంపాలి. మెయిల్: telsa.competitions @gmail.com. telsaworld.org జాగృతి వార పత్రిక వాకాటి పాండురంగారావు స్మారక కథల పోటీ నిర్వహిస్తోంది. 1500 పదాల లోపు రాసిన కథలను ఆగస్టు 18 లోపు పంపాలి. మూడు బహుమతులు వరుసగా 12 వేలు, 7 వేలు, 5 వేలు. పత్రిక చిరునామాకు పోస్టులోగానీ jagriticometition@ gmail.comగానీ పంపొచ్చు. వివరాలకు: 9959997204 -
నృత్య సోయగం
-
అద్భుతం..పేరిణీ నృత్యం
-
రవీంద్రభారతిలో ‘ట్రైబల్ ఆర్ట్ ఫెస్టివల్’
-
నాటక వైభవం
-
మనోహరం.. మంత్రముగ్ధం
-
పాఠ్యాంశంగా ఈశ్వరీబాయి చరిత్ర
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గడ్డపై జన్మించిన ధీరవనిత ఈశ్వరీబాయి జీవితచరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చి, మరింతగా సమాజానికి చెప్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం ఇక్కడ భాషా సాంస్కృతిక శాఖ, ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ఆమె వర్ధంతిసభను ఘనంగా నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ 94 ఏళ్ల తర్వాత కూడా ఈశ్వరీబాయి గురించి మనం మాట్లాడుకొంటున్నామంటే ఆమె ఆ రోజుల్లో సమాజం కోసం ఎంతగా పనిచేసి ఉంటారో ఇట్టే అర్థం చేసు కోవచ్చని అన్నారు. పేద కుటుంబం, దళితవర్గంలో జన్మించిన మహిళ అయి కూడా సమాజం బాగుకు ధైర్యంగా ముందుకు సాగడం గొప్ప విషయమని కొనియాడారు. అధికార పార్టీకి చెందిన మంత్రిని ఓడించి అసెంబ్లీలో అడుగు పెట్టిన ధీరవనిత అని అన్నారు. మంత్రి పదవి ఇస్తామన్నా తృణప్రాయంగా తిరస్కరించిందని తెలిపారు. అంబేద్కర్ భావజాలం పుణికిపుచ్చుకుందని, కుల, మత విశ్వాసాలు బలంగా ఉన్న ఆ రోజుల్లోనే మనుషులంతా ఒక్కటే అని చాటి చెప్పిందన్నారు. 1969 జరిగిన తెలంగాణ ఉద్యమంలోనూ ఈశ్వరీబాయి కీలకపాత్ర పోషించిందని తెలిపారు. 90 ఏళ్ల క్రితమే ఎదిగి, ఎన్నికల్లో కొట్లాడి, ఎన్నో సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొని సాంఘిక సంస్కరణలకు కారణభూతురాలు అయిందని తెలిపారు. ఉమ్మడి పాలకులు తొక్కిపెట్టారు తెలంగాణగడ్డపై పుట్టిన ఎంతోమంది మహనీయులచరిత్రను ఉమ్మడి పాలకులు తొక్కిపెట్టారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. కేసీఆర్ తెలంగాణ సాధించి సీఎం పదవి చేపట్టిన తర్వాత అధికారికంగానే ఈశ్వరీబాయి జయంతి, వర్ధంతిని జరుపుకొం టున్నామన్నారు. ఇప్పుడు తపాలా శాఖ కూడా ఈశ్వరీబాయి పేరుతో ప్రత్యేక పోస్టల్ కవర్ తీసుకురావటం అభినందనీయమన్నారు. ఈశ్వరీబాయి చరిత్రను అందరూ చదువుకుని ఆమె స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. ఆమె ఆదర్శప్రాయమైన జీవితం అందరికీ ఆదర్శవంతం కావాలన్నారు. సభకు అధ్యక్షత వహించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి మాట్లాడుతూ సామాన్య కుటుంబంలో పుట్టిన వీరనారి ఈశ్వరీబాయి అని కొనియాడారు. ఆమె తెలంగాణ పోరాటయోధురాలు, ధీర వనితన్నారు. వంద ఏళ్ల తర్వాత కూడా జనం హృదయాల్లో నిలిచిన వనిత అని చెప్పా రు. మాజీమంత్రి గీతారెడ్డి మాట్లాడుతూ 28 ఏళ్ల క్రితం భౌతికంగా వదిలి వెళ్లినా ఇప్పటికీ అందరి హృదయాల్లో ఈశ్వరీ బాయి ఉండి పోయారన్నారు. బాగా చదువుకొని డాక్టర్ కావాలని, రాజకీయాల్లోకి మాత్రం రావద్దని చెప్పేవారన్నారు. పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడుతూ స్వశక్తితో పైకి వచ్చిన ఓ గొప్ప మహిళ ఈశ్వరీబాయి అని అన్నారు. అనంతరం ఈశ్వరీబాయిపై రూపొందిన లఘుచిత్రాన్ని ప్రదర్శించారు. కార్యక్రమంలో భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, డాక్టర్ నందన్, డాక్టర్ రామచంద్రారెడ్డిలు పాల్గొన్నారు. -
శంకర్ బొమ్మలు అద్భుతం.. చూసిరండి..
సాక్షి, హైదరాబాద్: సాక్షి దినపత్రిక కార్టూనిస్టు పామర్తి శంకర్ వేసిన క్యారికేచర్లు, కార్టూన్లు అద్భుతంగా ఉన్నాయని.. రవీంద్రభారతిలో ‘ది ఇంక్డ్ ఇమేజ్’ పేరిట ఏర్పాటు చేసిన ఆయన ప్రదర్శనను ప్రారంభించడం తనకెంతో ఆనందంగా ఉందని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె. తారకరామారావు అన్నారు. ఈ మేరకు ట్విట్టర్లో ఆయన ట్వీట్ చేశారు. దీంతోపాటు కార్టూన్ల ప్రదర్శనకు సంబంధించిన చిత్రాలను అందులో ఉంచారు. దీంతోపాటు కొన్ని క్యారికేచర్లను షేర్ చేస్తూ.. ‘ఇవి శంకర్ వేసిన అద్భుతమైన చిత్రాల్లో కొన్ని మాత్రమే.. రవీంద్ర భారతిలో జరుగుతున్న ఆయన ప్రదర్శనను తప్పక తిలకించండి’ అని నెటిజన్లను కోరారు. ఈ ప్రదర్శన ఈ నెల 18 వరకూ కొనసాగనుంది. Some more superb works from the gallery of Sri Shankar Pamarthy Please visit the gallery at Ravindra Bharathi pic.twitter.com/2HbG74mBPb — KTR (@KTRTRS) February 10, 2019 -
కార్టూనిస్ట్ పామర్తి శంకర్ కార్టూన్స్ ప్రదర్శన
-
శంకర్ కార్టూన్స్‌లో తెలంగాణ ఆకాంక్ష కనిపించేది
-
నేడు కార్టూనిస్ట్ శంకర్ చిత్రాల ప్రదర్శన
సాక్షి, హైదరాబాద్: రాజకీయ వ్యంగ్య చిత్రాల్లో తనదైన ముద్ర వేసిన ప్రముఖ ఆర్టిస్ట్, ‘సాక్షి’కార్టూనిస్ట్ శంకర్ కార్టూన్ చిత్రాల ప్రదర్శన శనివారం రవీంద్రభారతి ఐసీసీఆర్ ఆర్ట్ గ్యాలరీలో సాయంత్రం 6 గంటలకు జరగనుంది. ఇండియా ఫైన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ‘ది ఇంక్డ్ ఇమేజ్’పేరుతో నిర్వహించే ఈ 20 ఏళ్ల రాజకీయ చిత్రాల ప్రదర్శన ప్రారంభోత్సవానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. కార్యక్రమంలో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ప్రముఖ చిత్రకారులు తోట వైకుంఠం, సూర్యప్రకాశ్, ప్రజా కవి గోరటి వెంకన్న, పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, డైరెక్టర్ మామిడి హరికృష్ణ, తదితరులు పాల్గొంటారు. -
‘పరాశక్తి అమ్మోరు డ్యాన్స్ డ్రామా’
-
రారండోయ్
ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ కవితా సంపుటి ‘జీవితం ఒక ఉద్యమం’ ఆంగ్లానువాదం ‘లైఫ్ ఈజ్ ఎ మూవ్మెంట్’ ఆవిష్కరణ జనవరి 29న మధ్యాహ్నం 3 గంటలకు తెలుగు విశ్వవిద్యాలయం సమావేశ మందిరంలో జరగనుంది. అనువాదం: స్వాతి శ్రీపాద. సంపాదకుడు: చింతపట్ల సుదర్శన్. ఆవిష్కర్త: నందిని సిధారెడ్డి. నిర్వహణ: తెలుగు విశ్వవిద్యాలయం భాషాభివృద్ధి పీఠం. ‘విప్లవ కవి వరవరరావు కవిత్వంతో ఒక రోజు’ కార్యక్రమం ఫిబ్రవరి 3న ఉదయం 10 నుంచి సాయంత్రం 6:30 వరకు మహబూబ్‌నగర్‌లోని రోజ్‌గార్డెన్ ఫంక్షన్ హాల్(తెలంగాణ చౌరస్తా – బోయపల్లి గేట్ దారిలో)లో జరగనుంది. మూడు సెషన్లుగా జరిగే ఈ కార్యక్రమానికి ప్రారంభోపన్యాసం: జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి. తొలి సెషన్లో జి.హరగోపాల్, కె.శివారెడ్డి, ఖాదర్, దర్భశయనం శ్రీనివాసాచార్య, పాణి పాల్గొంటారు. నిర్వహణ: పాలమూరు అధ్యయన వేదిక. తంగిరాల సోని కవితాసంపుటి ‘బ్లాక్ వాయిస్’ ఆవిష్కరణ ఫిబ్రవరి 3న సాయంత్రం 5 గంటలకు విజయవాడ, గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో జరగనుంది. ప్రచురణ: సామాజిక పరివర్తన కేంద్రం. ‘మొదటి పేజీ కథలు’ సంపుటానికిగానూ ఎ.ఎన్.జగన్నాథశర్మకు ‘లక్ష రూపాయల’ నగదుతో ‘లక్ష్షీ్మనారాయణ జైనీ జాతీయ సాహితీ పురస్కార (2019)’ ప్రదానం జనవరి 29న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి సమావేశ మందిరంలో జరగనుంది. ముఖ్య అతిథి: నందిని సిధారెడ్డి. నిర్వహణ: జైనీ ఇంటర్నేషనల్ ఫౌండేషన్. జాగృతి వారపత్రిక ఓ కార్టూన్ల పోటీ నిర్వహిస్తోంది. చక్కటి హాస్యం ఉండాలి. బ్లాక్ అండ్ వైట్‌లో ఒకరు ఎన్నైనా పంపవచ్చు. మూడు బహుమతులు వరుసగా రూ.5 వేలు, 3 వేలు, 2 వేలు. 500 చొప్పున పది ప్రోత్సాహక బహుమతులు ఉంటా యి. ఫిబ్రవరి 28లోగా పంపాలి. ఫోన్: 9959997204 -
ఎన్టీఆర్ కారణజన్ముడు
-
ఘనంగా నిత్యాన్వేషణం పుస్తకావిష్కరణ..
సాక్షి, హైదరాబాద్: ఆచార్య వెలుదండ నిత్యానందరావు రచించిన ‘నిత్యాన్వేషణం’ (సాహిత్య దీర్ఘవ్యాస సమాహారం) గ్రంథ ఆవిష్కరణ సభ ఘనంగా జరిగింది. రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం సాయంత్రం డాక్టర్ కేవీ రమణ సభాధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో ‘నిత్యాన్వేషణం’ గ్రంథాన్ని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి ఆవిష్కరించారు. భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ‘మూసీ’ సాహిత్య ధ్వార ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి డాక్టర్ మామిడి హరికృష్ణ, ఆచార్య డీ రవీందర్, ఆచార్య డీ సూర్యా ధనుంజయ్ విశిష్ట ఆతిథులుగా హాజరయ్యారు. విశ్రాంత ప్రధానోపాధ్యాయులు లక్కరాజు రవీందర్ కృతిని స్వీకరించారు. వక్తలు మాట్లాడుతూ నిత్యాన్వేషణ సాగిస్తూ తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసేలా అద్భుతమైన సాహిత్య వ్యాసాలను నిత్యానందరావు వెలువరించారని, ఆయన నిరంతర సాహిత్య కృషికి, పరిశీలనా, అనుశీలనా దృష్టికి ‘నిత్యాన్వేషణం’ గ్రంథం నిదర్శనమని కొనియాడారు. -
బాలోత్సవం
-
నాన్నకు ‘నాట్య’ నివాళి
తన తండ్రిపై ఉన్న ప్రేమను నాట్యం ద్వారాచూపించారామె. ఇటీవల మరణించిన న్యాయవాది వీఎల్ఎన్ గోపాలకృష్ణమూర్తి స్మృత్యర్థం ఆయన కూతురు సింధూర కూచిపూడి నాట్యంతో శుక్రవారం రాత్రి రవీంద్రభారతిలో నివాళులు అర్పించారు. సాక్షి, సిటీబ్యూరో: లాస్యప్రియ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం రవీంద్రభారతిలో నిర్వహించిన సింధూరమూర్తి నాట్య ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. తన తండ్రి, హైకోర్టు సీనియర్ అడ్వొకేట్ వీఎల్ఎన్ గోపాలకృష్ణ మూర్తి ఇటీవల మరణించగా, ఆయనకు నివాళులు అర్పిస్తూ సింధూర ఈ ప్రదర్శన ఇచ్చింది. సింధూర దివంగత డాక్టర్ ఉమారామారావు శిష్యురాలు. కార్యక్రమంలో డాక్టర్ ఎం.జగన్నాథరావు, లాస్యప్రియ డైరెక్టర్ డాక్టర్ జ్వాలా శ్రీకళ తదితరులు పాల్గొన్నారు. -
రారండోయ్
తెలంగాణ సాహిత్య అకాడమి నెలనెలా ‘కావ్య పరిమళం’లో భాగంగా నవంబర్ 9న సా.6 గం. కు పల్లా దుర్గయ్య ‘గంగిరెద్దు’ కావ్యంపై డాక్టర్ జి.బాలశ్రీనివాసమూర్తి ప్రసంగిస్తారు. వేదిక: రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్. అధ్యక్షత: నందిని సిధారెడ్డి. దేవిప్రియ ‘బహుముఖ’(కవిత్వం, పత్రికారచన, వ్యక్తిత్వ విశ్లేషణల సమాహారం) ఆవిష్కరణ నవంబర్ 10న సాయంత్రం 6 గంటలకు సమాగమం హాల్, రెండో అంతస్తు, ది ప్లాజా, పర్యాటక భవన్, బేగంపేట, హైదరాబాద్‌లో జరగనుంది. ఆవిష్కర్త: ప్రకాశ్ రాజ్. ఇ–బుక్ ఆవిష్కర్త: పల్లా రాజేశ్వరరెడ్డి. అధ్యక్షత: కె.రామచంద్రమూర్తి. నిర్వహణ: సాహితీ మిత్రులు. పి.సత్యవతి ఇంగ్లిష్ పుస్తకం ‘హేర్ ఐ యామ్’, అనువదించిన పుస్తకం ‘పలు రామాయణాలు’ ప్రచురణ అయిన సందర్భంగా ‘మీట్ టుగెదర్’ నవంబర్ 11న ఉదయం 10:30కు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనుంది. సీతా సుధాకర్ ‘పూనాలో పూచిన నానీలు’ ఆవిష్కరణ నవంబర్ 11న ఉదయం 10:30కు కొరటాల మీటింగ్ హాల్, బ్రాడీపేట, గుంటూరులో జరగనుంది. ఆవిష్కర్త: ఎన్.గోపి. నిర్వహణ: ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం. ‘ఈ సంవత్సరం నుండి ఒక్కో సంవత్సరం వరుసగా కథ, కవిత, నవల, సాహిత్య వ్యక్తిత్వం అంశాలపై విశేష ప్రతిభ కనబర్చిన సాహిత్యవేత్తలకు’ ఇవ్వదలచిన రామా చంద్రమౌళి సాహిత్య పురస్కారాన్ని కథా ప్రక్రియకుగానూ ఎ.ఎన్.జగన్నాథశర్మకు నవంబర్ 25న వరంగల్‌లో ప్రదానం చేయనున్నారు. ముఖ్య అతిథులు: కె.శివారెడ్డి, తనికెళ్ల భరణి. కామిశెట్టి జాతీయ పురస్కారం–2018కి గానూ 2015, 16, 17ల్లో ముద్రించబడిన సాహిత్య వ్యాస సంపుటాలను ఆహ్వానించగా, వచ్చిన వాటిలోంచి డాక్టర్ ఎస్.రఘు ‘సమన్వయ’ ఎంపికైనట్టు కామిశెట్టి సాహిత్య వేదిక (భద్రాచలం) అధ్యక్షులు తెలియజేస్తున్నారు. విజేతకు ఈ నెలలో జరిగే కార్యక్రమంలో రూ.10,116 ప్రదానం చేస్తారు. -
నాటకరంగ వ్యాప్తికి కృషి
సాక్షి, సిటీబ్యూరో: ‘తెలంగాణలో నాటక రంగం మరింత బలపడాలని మా తండ్రి ఖదీర్ అలీ బేగ్ ఎప్పుడూ తలంచేవారు. అందుకోసం 14ఏళ్లుగా ఖదీర్ అలీ బేగ్ థియేటర్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నాం. ప్రతిఏటా థియేటర్ ఫెస్టివల్‌తో ఆయన్ని గుర్తు చేస్తున్నాం. యాంత్రిక జీవనంతో ఒత్తిడికి గురవుతున్న సిటీజనులకు ఓ మంచి వినోదం అందించాలని ఖదీర్ అలీ బేగ్ తపించేవారు. ఆయన ఆశయాలను కొనసాగించాలని కష్టాలు ఎదురైనా ఫెస్ట్ నిర్వహిస్తున్నామ’ని థియేటర్ ఫెస్టివల్ నిర్వాహకులు, ప్రముఖ నాటక దర్శకుడు మహ్మద్ అలీ బేగ్ ‘సాక్షి’తో చెప్పారు. 2005లో ఏర్పాటు... ‘మా త్రండి హైదరాబాద్ నుంచి ప్రముఖ థియేటర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు పొందారు. 1970లో న్యూ థియేటర్ ఆఫ్ హైదరాబాద్ ‘ఎన్‌టీహెచ్ స్థాపించారు. సఖరం బైండర్, అధే అడోహోరే, ఖమోష్ అడాలాత్ జారి హై, కెహ్రాన్ కే రాజాన్స్ తదితర నాటకాల్లో నటించారు. ఆనాడు ఆయన వేసిన సెట్లు అందర్నీ ఆకట్టుకునేవి. 2005లో ఖదీర్ అలీ బేగ్ థియేటర్ ఫెస్టివల్ ఫౌండేషన్‌ను స్థాపించి ఎన్నో థియేటర్ ఫెస్టివల్స్ నిర్వహించాం. మరెన్నో చారిటీ కార్యక్రమాలు ఏర్పాటు చేశామ’ని మహ్మద్ అలీ బేగ్ చెప్పారు. 150 మంది కళాకారులతో... ఈ థియేటర్ ఫెస్టివల్ రవీంద్రభారతిలో గురువారం ప్రారంభమైంది. ఈ నెల 4వరకు కొనసాగుతుంది. ఇందులో దాదాపు 150 మంది కళాకారులు పాల్గొంటున్నారు. అస్మిత థియేటర్ గ్రూప్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన తారా హిందీ నాటకం ఆకట్టుకుంది. 2న డ్రీమ్జ్ సెహర్, 3న ‘ల’మెంట్ (దిలవర్), 4న హౌ ఐ మెట్ యువర్ ఫాదర్ నాటకాలను ప్రదర్శించనున్నారు. ఈ నాటకాల్లో ఒగ్గు డోలు, చిందు యక్షగానం కూడా ప్రదర్శిస్తున్నట్లు చెప్పారు. -
‘విశ్వ’ వేడుక
-
పూల సంబరం
-
మహోన్నత వ్యక్తి.. కాళోజీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజా కవి కాళోజీ నారాయణ రావు 104వ జయంతి ఉత్సవాలు హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఆదివారం ఘనంగా జరిగాయి. రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత అంపశయ్య నవీన్‌కు కాళోజీ నారాయణ రావు సాహితీ పురస్కారాన్ని ప్రదానం చేశారు. 2018వ సంవత్సరానికి గానూ ఆయన ఈ పురస్కారాన్ని తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, స్పీకర్ మధుసూదనాచారి చేతుల మీదుగా అందుకున్నారు. కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ.. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తి కాళోజీ అని, జీవితాంతం పేదవాడి పక్షాన నిలిచిన ప్రజాకవి అని కొనియాడారు. జీవన సారాంశాన్ని రెండు మాటల్లో చెప్పిన మహోన్నత వ్యక్తి కాళోజీ అన్నారు. ప్రభుత్వ పురస్కారాలు పొందగానే కొందరిలో మార్పు వస్తుందని.. పద్మవిభూషణ్ వంటి ప్రఖ్యాత పురస్కారం పొందినప్పటికీ కాళోజీలో ఎలాంటి మార్పు రాలేదని పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. కాళోజీ జన్మదినాన్ని తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు తెలంగాణ కవులను విస్మరించాయని విమర్శించారు. కాళోజీ కవితలు వాస్తవానికి దగ్గరగా ఉంటాయని కొనియాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాళోజీ మార్గదర్శిగా నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు. కాళోజీ సాహిత్య పురస్కార ప్రదానం అనంతరం అంపశయ్య నవీన్ మాట్లాడారు. కాళోజీ నారాయణరావు, ఆయన సోదరుడు రామేశ్వరరావుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వరంగల్‌లో మిత్రమండలి స్థాపించిన కాళోజీ సోదరులు ఎంతో సాహితీ సేవ చేశారన్నారు. కాళోజీది మహోన్నత వ్యక్తిత్వమని కొనియాడారు. గాంధీజీ గురించి ప్రముఖ శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ చెప్పిన ‘ఇలాంటి వ్యక్తి ఒకరు రక్తమాంసాలతో ఈ భూమి మీద నడియాడారంటే భవిష్యత్ తరాలు విశ్వసించవు’ అన్న వ్యాఖ్యలు.. కాళోజీకి సరిగ్గా సరిపోతాయన్నారు. తన తొలి నవల అంపశయ్య రాతప్రతిని చదివి కాళోజీ తనను అభినందించిన విషయాన్ని నవీన్ గుర్తు చేసుకున్నారు. కాళోజీ పురస్కారం లభించాలన్న తన కల నెరవేరడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, తెలంగాణ రాష్ట్ర శాట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి, సంగీత నాటక అకాడమీ అ«ధ్యక్షుడు శివకుమార్, రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, ప్రముఖ కవి దేవులపల్లి ప్రభాకర్లతో పాటు పలువురు కాళోజీ అభిమానులు పాల్గొన్నారు. -
జుగల్..జిగేల్
-
జానపదం.. మంత్రముగ్ధం
-
కేరళ రిలీఫ్ క్యాంప్.. హైదరాబాదీల ఔదార్యం!
సాక్షి, హైదరాబాద్ : భారీ వరదలతో అతలాకుతలమవుతున్న కేరళకు మేమున్నామంటూ హైదరాబాద్‌లో స్థిరపడ్డ మళయాళీలు ఆపన్నహస్తం అందిస్తున్నారు. తమ సోదరులకు తోచిన సాయం అందించేందుకు హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఓ రిలీఫ్ క్యాంప్‌ను ఏర్పాటుచేశారు. ఈ క్యాంప్‌కు భారీ స్పందన వస్తోంది. మలయాళీలతోపాటు, హైదరాబాదీలూ విపత్తులో చిక్కుకున్న కేరళపై ఔదార్యం చాటారు. పెద్ద ఎత్తున తరలివచ్చి తమవంతు విరాళాలతోపాటు సహాయక సామాగ్రిని అందజేశారు. రవీంద్రభారతీలో ఏర్పాటుచేసిన ఈ క్యాంప్‌నకు భారీ స్పందన వచ్చిందని, హైదరాబాద్‌లోని మలయాళీలతోపాటు రాష్ట్ర ప్రజలు పెద్దసంఖ్యలో ముందుకువచ్చి కేరళకు తమవంతు సహాయాన్ని అందజేస్తున్నారని భాషా, సంస్కృతికశాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తెలిపారు. -
హైదరాబాద్‌లో కేరళ రిలీఫ్ క్యాంప్
-
తండ్రి సింగర్.. తనయ డ్రమ్మర్
సాక్షి, సిటీబ్యూరో: నగరానికి చెందిన ఓ ఐఏఎస్ అధికారి గాయకుడిగానూ తనదైన మార్కు చూపనున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బుధవారం రవీంద్రభారతిలో ‘వందేమాతరం’ పేరుతో నిర్వహించనున్న ప్రత్యేక ప్రదర్శనలో ఆయన పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన కుమార్తె సైతం డ్రమ్మర్‌గా అరంగేట్రం చేస్తుండడం విశేషం. లక్డీకాపూల్‌లోని సెంట్రల్‌కోర్టు హోటల్లో మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో నిర్వాహకులు ఈ మేరకు వెల్లడించారు. ఈ సందర్భంగా చంపాలాల్ మాట్లాడుతూ...‘నాకు పాటలంటే ఇష్టం. అప్పుడప్పుడు పబ్లిక్ ఫంక్షన్లలో పాడేవాడిని. అనంతరం తెలంగాణ వీరుడు కొమురం భీమ్ మీద ఒక పాట రాసి, పాడి విడుదల చేశాను. అయితే ఒక పూర్తిస్థాయి కార్యక్రమంతో గాయకుడిగా పరిచయమవడం మాత్రం ఇదే తొలిసారి. నా ఉద్యోగ బాధ్యతలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఈ అభిరుచిని ఆస్వాదిస్తున్నాన’ని చెప్పారు. ఆయన కుమార్తె సోనిక మాట్లాడుతూ... ‘డ్రమ్స్ అంటే ఇష్టం. ముంబై ఐఐటీలో చదువుతుండగా డ్రమ్మర్‌గా మారాను. ఎలాంటి శిక్షణ పొందకున్నా, ఇంటర్నెట్ సహాయంతో సాధన చేశాను. ప్రస్తుతం ఒక రాక్‌బ్యాండ్‌లో సభ్యురాలిని. నాన్నతో కలిసి నగరంలో తొలి ప్రదర్శన ఇస్తున్నందుకు ఆనందంగా ఉందని’ అన్నారు. ఫ్లూటిస్ట్ నాగరాజు తళ్లూరి, నేపథ్య గాయని మణినాగరాజ్ ఇందులో పాల్గొననున్నారు. -
నాట్య విలాసం...
-
నయనానందం
-
హనుమాన్ ఇన్ లంక
-
మా గొంతు ఇక్కడా వినరా!
సాక్షి, సిటీబ్యూరో: ప్రపంచ తెలుగు మహాసభలకు విచ్చేసిన కవయిత్రుల ఆవేదన ఇది. కవి సమ్మేళనం ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో అని నిర్వహకులు చెప్పారు. అక్కడికి వెళ్తే ‘ఇది మగవాళ్లకు మాత్రమే’నన్నారు అక్కడివారు. ‘మరి మాకు వేదిక ఎక్కడ’ అంటే రవీంద్రభారతికి వెళ్లమన్నారు. అక్కడ ‘బాల కవి సమ్మేళనం జరుగుతోంది, మరొక వేదిక మీద అష్టావధానం, మా ఏర్పాట్లలో మీకు వేదిక లేదు’ అన్నారు. ఇది తెలుగు మహాసభల మూడవ రోజు ఆదివారం నాటి పరిస్థితి. మహబూబ్‌నగర్ నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ పుష్పలత, తెలుగు ఉపాధ్యాయిని జీవనజ్యోతి, అంబుజ, మరో ముగ్గురు రచయిత్రులకు ఎదురైన చేదు అనుభవం ఇది. ‘ప్రియదర్శిని ఆడిటోరియం నుంచి రవీంద్రభారతికి వస్తే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఉన్న వాళ్లకే అవకాశమన్నారు. అలాగే రిజిస్ట్రేషన్ చేసుకుంటామంటే నిన్నటితోనే ముగిసిందంటున్నారు. ఇక్కడ పడిగాపులు కాస్తూ నిర్వహకులను అడగ్గా అడగ్గా ‘రేపు రెండు గంటల సమయమిస్తాం, ఆ టైమ్‌లోనే ఎంతమంది రచయిత్రులు ఉంటే అందరూ మీ పద్యాలను చదువుకోవచ్చు’ అంటున్నారు. రెండు వందల మంది రచయిత్రులం ఉన్నాం. రెండు గంటల టైమంటే ఒక్కొక్కరికి ఒక్క నిమిషం కూడా ఇవ్వరా? మేము అర నిమిషంలో ముగించాలా? మగవాళ్లకైతే ఏకంగా నాలుగు రోజులు.. రోజుకు ఏడు గంటలా..! మహిళలమని ఇంత వివక్షా! అయినా పద్యానికి, పద్యం రాసిన వాళ్లను కూడా మగ, ఆడ అని వర్గీకరిస్తారా? ప్రపంచ తెలుగు మహాసభలు మగవాళ్లకేనా?’ అని ఆవేశంగా ప్రశ్నిస్తున్నారు జీవనజ్యోతి. ఆమె మాటల్లో ఆవేశం వెనుక ఉన్న ఆవేదనలో అర్థముంది. ఆమెది ఆగ్రహం ధర్మాగ్రహమే. సభల నిర్వాహకులూ మీరేమంటారు..! -
ప్రేమ్‌నగర్
-
మెట్రో నగరాల తెలుగు ప్రముఖులనూ ఆహ్వానిస్తాం
సాక్షి, హైదరాబాద్: దేశంలోని పెద్ద నగరాల్లో ఉన్న తెలుగువారిని ప్రపంచ తెలుగు మహాసభలకు ఆహ్వానించేందుకు ఈనెల 4, 5 తేదీల్లో కోర్‌కమిటీ సభ్యులు ఢిల్లీ, చెన్నై, బెంగళూరు నగరాల్లో పర్యటిస్తారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రమణాచారి తెలిపారు. అక్కడి తెలుగు ప్రముఖులకు ఆహ్వానపత్రాలు అందించి ఆన్లైన్లో వారుపేర్లు నమోదు చేసుకునేలా చూస్తారని వెల్లడించారు. బుధవారం ఆయన రాష్ట్ర అధి కార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకరరావు, సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి, గ్రంథాలయ పరిషత్ అధ్యక్షుడు అయాచితం శ్రీధర్, సీఎం కార్యాలయ ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ ఉప కులపతి ఎస్వీ సత్యనారాయణ, పర్యాటక, సాంస్కృతిక శాఖల కార్యదర్శి బి.వెంక టేశం, సాంస్కృతిక శాఖ సంచాలకుడు హరికృష్ణతో కలసి సచివాలయంలో ప్రపంచ తెలుగు మహాసభల పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ, ఈ మహాసభలను విజయవంతం చేసేందుకు సాహితీ సంస్థలు, సాహితీ ప్రముఖులతో ఇప్పటికే సమావేశాలు నిర్వహించి సహకారా న్ని కోరామన్నారు. రవీంద్రభారతి ప్రాంగణం లో ప్రత్యేకంగా కార్యాలయాన్ని సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. -
కనకతార
-
అస్సామీ నాటకం.. అదుర్స్
-
సాహిత్య మేధోమథన కేంద్రంగా రవీంద్రభారతి
-
సాహిత్య మేధోమథన కేంద్రంగా రవీంద్రభారతి
► కళాభవన్‌ను ఆధునాతన సౌకర్యాలతో తీర్చిదిద్దాలి: కేసీఆర్ ► రవీంద్రభారతిలోనే సాహిత్య అకాడమీ కార్యాలయం ► రవీంద్రభారతి ప్రాంగణంలో కలియతిరిగిన ముఖ్యమంత్రి సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగర నడిబొ డ్డున ఉన్న రవీంద్రభారతిని సాహితీ–సాంస్కృ తిక మేధోమథన కేంద్రంగా తీర్చిదిద్దాలని, ఇక్కడ నిరంతర ప్రక్రియలు కొనసాగాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూచించారు. కళాభవన్‌కు ఆధునాతన సౌకర్యాలతో హంగులు అద్దాలన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యాలయాన్ని కూడా రవీంద్రభారతిలోని కళాభవన్లోనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సాహిత్య అకాడమీ, సాంస్కృతిక శాఖ సమన్వయంతో పని చేయాలన్నారు. సీఎం కేసీఆర్ శనివారం మధ్యాహ్నం రవీంద్రభారతి ప్రాంగణమంతా కలియ తిరిగారు. సాంస్కృతిక శాఖ కార్యాలయం నిర్వహిస్తున్న బ్లాకును, పరిసర పాంత్రాలను పరిశీలించారు. రవీంద్రభారతిని మరింత గొప్పగా వినియోగిం చేందుకు చేపట్టవలసిన చర్యలపై ముఖ్యమంత్రి అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రవీంద్రభారతిలో పచ్చిక బయళ్లు, పార్కింగ్ స్థలాలను విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. రవీంద్రభారతి నైరుతీ భాగంలో ఎత్తు పెంచాలని, ఆ భాగంలోని దారిని మూసేయాలని సాంస్కృతిక శాఖ అధికారులకు సీఎం సూచించారు. పెయింటింగ్ ప్రదర్శన తిలకించిన సీఎం ముఖ్యమంత్రి కేసీఆర్.. తాను వస్తున్నట్లు ఒక రోజు ముందే చెప్పి రవీంద్రభారతికి వచ్చారు. సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి చాం బర్ను ఆయన సందర్శించారు. అదే భవన్లో ఉన్న భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ కార్యాల యాన్ని కూడా పరిశీలించారు. ఐసీసీఆర్ ఆర్ట్ గ్యాలరీలో ఉన్న బాతిక్ పెయింటింగ్ ప్రదర్శనను తిలకించిన ముఖ్యమంత్రి.. తెలంగాణ సంస్కృ తికి సంబంధించిన పెయింటింగ్‌ను చూసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహాసభలకు తగిన ఏర్పాట్లు చేయాలి సాహిత్య అకాడమీకి చెందిన ప్రక్రియ అంతా రవీంద్రభారతిలోనే ఉంటుందని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలుగు భాషాభివృద్ధికి సాహిత్య అకాడమీ కృషి చేయాల్సి ఉంటుంద న్నారు. అక్టోబర్‌లో నిర్వహించే ప్రపంచ తెలుగు మహాసభలకు తగిన ఏర్పాట్లు చేయాలని, దానికి సంబంధించిన కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. తెలుగు భాషను కాపాడేందుకు, తెలుగు భాష ఔన్నత్యాన్ని పరిరక్షించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి సాహిత్య అకాడమీ సూచనలు చేయాలన్నారు. సీఎం వెంట హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, సీఎస్ ఎస్పీ సింగ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదిర్శ బుర్రా వెంకటేశం, టీఎస్‌టీడీసీ ఎండీ క్రిస్టీనా జెడ్ ఛోంగ్తూ, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
కలర్ఫుల్గా మిస్సెస్ సిల్క్ ఫ్యాషన్ షో
-
నృత్య తరంగం
-
హైదరాబాద్ హెరిటేజ్‌పై బ్రిటిషర్ల డాక్యుమెంటరీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సంస్కృతి, చరిత్ర, హెరిటేజ్లపై డాక్యుమెంటరీ తీయటానికి బ్రిటిషర్లు నగరానికి చేరుకున్నారు. గురువారమిక్కడ రవీంద్రభారతి లోని భాషా సాంస్కృతిక కార్యాలయంలో సాంస్కృతిక శాఖ డెరైక్టర్ మామిడి హరికృష్ణను కలిశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, కళారూపాల గురించి అడిగి తెలుసుకొన్నారు. హరికృష్ణను కలిసిన వారిలో యూకేకు చెందిన స్టేఫ్ని ఫైఫ్, కై ్లమ్ తుల్లో, రెష్మా సైరాలు ఉన్నారు. -
'వాయిస్ ఆఫ్ ఇమేజస్'ఆర్ట్ ఎగ్జిబిషన్
-
పర్యాటకులను ఆకర్షించాలి
సాక్షి, హైదరాబాద్: ఇంటికి చుట్టాలు రాకుంటే ఎంత దరిద్రమో రాష్ట్రానికి పర్యాటకులు రాకపోయినా అదే పరిస్థితి అని శాసనమండలి చైర్మన్ కె. స్వామిగౌడ్ పేర్కొన్నారు. అందువల్ల పర్యాటకులను ఆకర్షించాలని పర్యాటకశాఖకు సూచించారు. మంగళవారం ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో పర్యాటకశాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్వామిగౌడ్ మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు బయటి ప్రాంత విశేషాలు, వాటి గొప్పతనం గురించి పర్యాటకశాఖ తెలియజేసి, రాష్ట్రానికి అతిథులు వచ్చేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 500 కోట్లతో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తోం దని, వాటిని ప్రజలంతా సద్వినియోగం చే సుకోవాలని సూచించారు. గతంలో తాను అనారోగ్యానికి గురైనప్పుడు ఆస్పత్రిలో ఎన్ని రోజులు చికిత్స తీసుకున్నా రోగం తగ్గలేదని... గండిపేట చెరువుకు తరచూ విహారానికి వెళ్లగా రోగం నయమైందన్నారు. రాష్ట్రంలోని చారిత్రక ప్రాంతాలు ఉమ్మడి ఏపీలో మరుగునపడ్డాయని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ ఆవేదన వ్యక్తంచేశారు. భువనగిరి కోట, రామప్ప గుడి వంటి ఎన్నో పర్యాటక ప్రదేశాలు రాష్ట్రంలో ఉన్నాయని...పాఠశాల విద్యార్థులు సబ్సిడీపై వాటిని తిలకించేలా చేస్తామన్నారు. పర్యాటకానికి 500 కోట్లు: పేర్వారం మానవాళిని ఒకే వేదికపై నిలబెట్టేందుకు పర్యాటకం ఎంతో దోహదం చేస్తుందని పర్యాటక అభివృద్ధి మండలి చైర్మన్ పేర్వారం రాములు పేర్కొన్నారు. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగానికి కేవలం రూ. 130 కోట్ల మేర బడ్జెట్ కేటాయింపులు ఉండగా తెలంగాణ వచ్చాక ఈ రంగంపై సీఎం కే సీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపారని, పర్యాటక రంగానికి కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు రూ. 500 కోట్ల బడ్జెట్ కేటాయించాయని తెలిపారు. టూరిజం ఫిల్మ్స్, మ్యూజియం ఆన్ విల్స్, గ్లాస్ నెగిటివ్స్తోపాటు ‘ట్రావెల్.. బీ సేఫ్’ మొబైల్ యాప్‌ని ఆవిష్కరించారు. అలాగే హెరిటేజ్ ఆఫ్ హైదరాబాద్ ఫ్రమ్ చిల్డ్రన్.. ఫర్ చిల్డ్రన్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ టూరిజం ఎక్సలెన్సీ అవార్డులను స్వామిగౌడ్, చందూలాల్ ప్రదానం చేశారు. కార్యక్రమంలో పర్యాటక కార్యదర్శి బుర్రా వెంకటేశం, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి, రాష్ట్ర పర్యాటక, యువజన, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బి. వెంకటేశం, టీఎస్‌టీడీసీ ఎండీ క్రిస్టినా జడ్ చోంగ్తూ, పర్యాటకశాఖ డెరైక్టర్ సునీతా ఎం భగవత్, సాంస్కృతికశాఖ డెరైక్టర్ మామిడి హరికృష్ణ, విశాలాక్షి పాల్గొన్నారు. బెస్ట్ ట్రావెల్ ఏజెంట్‌గా సదరన్ ట్రావెల్స్ రాష్ట్ర స్థాయిలో బెస్ట్ ట్రావెల్ ఏజెంట్‌గా ప్రముఖ సంస్థ ‘సదరన్ ట్రావెల్స్’ ఈ ఏడాదికిగాను టూరిజం ఎక్సలెన్సీ అవార్డును అందుకుంది. శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, మంత్రి చందూలాల్ ఈ అవార్డును అందజేశారు. అలాగే తాజ్ ఫలక్‌నుమా (హైదరాబాద్) ఫైవ్‌స్టార్ స్థాయిలో, హోటల్ దస్పల్లా (హైదరాబాద్) ఫోర్ స్టార్ స్థాయిలో, అలంకృత రిసార్ట్స్ (రంగారెడ్డి జిల్లా)తోపాటు ఫోర్ స్టార్ స్థాయిలో, ప్రత్యేక విభాగంలో అవార్డును గెలుచుకుంది. హోటల్-లాడ్జి త్రీస్టార్ స్థాయిలో శ్రీవేంకటేశ్వర లాడ్జి (హైదరాబాద్), మినర్వా గ్రాండ్ (సికింద్రాబాద్)కు, బెస్ట్ టూరిజం డెస్టినేషన్ ఇన్ హైదరాబాద్ కింద రామోజీ ఫిల్మ్‌సిటీకి అవార్డులు లభించాయి. రామోజీ ఫిల్మ్‌సిటీ తరఫున సంస్థ ప్రతినిధి రాజేంద్ర ప్రసాద్ అవార్డు అందుకున్నారు. వివిధ అవార్డులు బెస్ట్ టూరిజం డెస్టినేషన్ అదర్ దాన్ హైదరాబాద్ కింద హరిత ఎకో టూరిజం రిసార్ట్స్ (కడెం), బెస్ట్ హరిత హోటల్‌గా హరిత కాకతీయ హోటల్ (వరంగల్), బెస్ట్ టూరిజం గైడ్‌గా జె.భాస్కర్‌రెడ్డి, బెస్ట్ టూరిజం ఫిల్మ్ కింద వెల్కమ్ టు తెలంగాణ తరఫున డి.సత్యనారాయణ, డిస్కవరీ ఆఫ్ తెలంగాణ కింద పి. చందర్ బడవత్, అతిథి దేవోభవ కింద అపోలో క్రేడిల్ ఆస్పత్రి(హైదరాబాద్)కి అవార్డు లభించింది. ఆ సంస్థ ప్రతినిధి డా.సునీల్ అవార్డును అందుకున్నారు. బెస్ట్ రెస్టారెంట్ కింద కారంపూడి (హైదరాబాద్), బెస్ట్ రెస్టారెంట్ అదర్ దాన్ హైదరాబాద్ కింద హోటల్ శ్వేత (కరీంనగర్) అవార్డులు పొందాయి. బెస్ట్ ఫొటోగ్రాఫర్స్ అవార్డులను బి.పూర్ణచందర్ (కల్చర్), వి.శరత్ (హెరిటే జ్ విభాగంలో), ప్రిన్స్ (నేచర్ విభాగంలో) అందుకున్నారు. -
ఇది హృదయావిష్కరణ
సాక్షి, సిటీబ్యూరో: ‘ఎవ్వరో ఈ బిడ్డలూ... నింగిలో నెలవంకలూ’ అనే పాటతో జయరాజు తన హృదయాన్ని ఆవిష్కరించారని గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ అన్నారు. కవి, గాయకుడు జయరాజు రాసిన ‘వసంతగీతం’, ‘జ్ఞాపకాలు’ పుస్తకాలను గురువారం రవీంద్రభారతిలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అశోక్ తేజ మాట్లాడుతూ సూర్యచంద్రులు కలిస్తే జయరాజేనని కొనియాడారు. సినీ నటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ జయరాజు సింగరేణి నల్లబంగారమని ప్రస్తుతించారు. ప్రభుత్వ మాజీ కార్యదర్శి కాకి మాధవరావు మాట్లాడుతూ చివరి వరకు ఎర్ర జెండాను మోసిన నిజమైన విప్లవకారుడు జయరాజని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో వేణు మాధవ్, విమలక్క, పోటు రంగారావు, మోహన్, రాయల రమ, రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఆలోచింపజేసే మత్స్య గంధి
సాక్షి, సిటీబ్యూరో: అభినయ నేషనల్ థియేటర్ ఫెస్టివల్ –2016 ఆధ్వర్యంలో నిర్వహించిన 11వ జాతీయ బహుభాషా నాటకోత్సవాలు ఆలరించాయి. మంగళవారం రవీంద్రభారతి ఇందుకు వేదికైంది. ఈ సందర్భంగా ప్రదర్శించిన మత్స్య గంధి కన్నడ నాటకం రక్తికట్టించింది. నాటకానికి కేఎస్డీఎల్ చందు దర్శకత్వం వహించారు. మత్స్య గంధి రంజిత సూర్య వంశీ, పరాచరానిగా హరేష్ తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు. సభ ప్రారంభంలో చిన్నారి మధుమిత కూచిపూడి నృత్యం అలరించింది. -
చేనేత వేడుకలు
సాక్షి,నాంపల్లి: జాతీయ చేనేత దినోత్సవం వేడుకలు రవీంద్రభారతి ప్రధాన వేదికపై ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. -
పోలీసు నిఘాలో రవీంద్రభారతి
హైదరాబాద్ : జాతీయ కళావేదిక రవీంద్రభారతి భద్రత ఇక పూర్తిగా పోలీసు నిఘాలోకి వెళ్లనుంది. శనివారం రవీంద్రభారతిలో చోటుచేసుకున్న చోరీని భాషా సాంస్కృతిక శాఖ సీరియస్‌గా తీసుకుంది. రవీంద్రభారతిలో జరుగుతున్న దొంగతనాలపై ఆ శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ మధ్య మండలం డీసీపీ కమలాసన్‌రెడ్డితో చర్చించారు. ఈ సందర్భంగా అక్కడి 32 సీసీ కెమెరాలను పోలీసు కంట్రోల్ రూంకి అనుసంధానించేందుకు డీసీపీ అంగీకరించారు. అంతేకాకుండా ఇకపై ప్రతిరోజూ రాత్రి 7 నుంచి 9 గంటల వరకు పోలీసు పెట్రోల్ క్యాంప్‌ను ఒకటి రవీంద్రభారతిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. -
ఒకే రోజు కోటి మొక్కలు: జోగు రామన్న
గత ఏడాది 40 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకుంటే వాతావరణం అనుకూలించక వీలు కాలేదు. ఈ ఏడాది వాతావరణంబాగా అనుకూలిస్తున్నందున, సీఎం నిర్ణయించిన తేదీన ‘ఒకేరోజు కోటి మొక్కలు’ నాటేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆటవీ మంత్రి జోగు రామన్న తెలిపారు. శుక్రవారం రవీంద్రభారతిలో తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారుల సమీక్షా సమావేశం, తెలంగాణకు హరితహారంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...గతంలో 100 చెట్లు నాటితే నిర్వహణ కోసం చెట్టుకు రూ.5 ఇచ్చేవారమన్నారు. ఇప్పుడు 50 చెట్టు నాటితేనే చెట్టుకు రూ. 5 ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మొక్కలు ప్రాణవాయువును వదులుతాయన్నారు. మానవులకే కాదు, జంతువులకు మొక్కల అవశ్యకత ఎక్కువేనని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో కూడా కళాకారులకు ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. ఒక్క సీఎం కేసీఆర్‌కే ఇది సాధ్యమైయ్యేలా చేశారన్నారు. దీన్ని 28 రాష్ట్రా ప్రభుత్వాలు అమలు చేయాలని ఆలోచిస్తున్నాయని చెప్పారు. -
'ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆలోచించుకోవాలి'
హైదరాబాద్ : ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే భవిష్యత్తు ఉండదన్న ఆలోచన ప్రజల్లో బలంగా ఉంది.. దానిపై ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఆలోచించాల్సి అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ అన్నారు. మంగళవారం రవీంద్రభారతిలో నిర్వహించిన వందేమాతరం ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల అభిప్రాయం మార్చేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు విశ్వ ప్రయత్నం చేయాలని సూచించారు. తాను రాజస్థాన్‌లోని ఏడారి ప్రాంతం అయినా నాగోల్ జిల్లా పుట్టి అక్కడే ప్రభుత్వ పాఠశాలలో చదవి సివిల్ సర్వెంట్ అయ్యానని చెప్పారు. అప్పట్లో 95 శాతం మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునేవారుండగా.. ఇప్పుడు 5 శాతం మంది మాత్రమే చదువుకుంటున్నారని చెప్పారు. దీనిపై ఉపాధ్యాయులు ఆలోచించాలి.. తల్లిదండ్రుల ధోరణిలో మార్పు రావాల్సి ఉందని చెప్పారు. విశిష్ట అతిథి, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్ తీసివేసి సెలక్ట్ చేసే విధానం రావాల్సి ఉందన్నారు. ప్రభుత్వ బడిని ప్రజల బడిగా మార్చాలని తెలిపారు. చదువు చెప్పటం ఒక ప్యాషన్ కావాలని చెప్పారు. పోరాడి సాధించిన ఈ తెలంగాణ ప్రభుత్వమైనా పాఠశాలను తనిఖీ చేసే విధానానికి స్వస్తి చెప్పి, టీచర్లను నమ్మేందుకు ప్రయత్నించాలన్నారు. విద్య విద్యార్థికి అందించటమే ఉపాధ్యాయుని బాధ్యతన్నారు. ఫలితాలపై ఉపాధ్యాయుడిని ప్రభుత్వం ప్రశ్నించకూడదని తెలిపారు. -
నేత్రపర్వం.. నృత్యరూపకం..
-
తెలంగాణ భాషా దినోత్సవంగా కాళోజీ జయంతి
-
నేడు దాశరథీకృష్ణమాచార్య జయంతి
-
అలరించిన బ్యాలె..
-
సంబురాల వేళ..
-
తెలంగాణ 'సినిమా'పై సమావేశం
హైదరాబాద్ సిటీ: తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రవీంద్రభారతిలో తెలంగాణ సినిమా "నిన్న నేడు రేపు" అనే సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రెస్ అకాడమి చైర్మన్ అల్లం నారాయణ పాల్గొన్నారు. పలువురు మేధావులు, రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ సినిమా తీరుతెన్నులపై చర్చించారు. -
డ్యాన్స్ మ్యాజిక్
-
వానలకు దేవుడిపైనే భారం
ఈ ఏడాది గ్రహస్థితి వల్ల వర్షాలు అంతంతమాత్రమే పంటలు తగ్గి కరువు ఛాయలు ఏర్పడే అవకాశం ధార్మిక కార్యక్రమాలతో ఉపశమనం.. తెల్ల ధాన్యాలకు అనుకూల వాతావరణం పారిశ్రామిక, విద్యుత్ రంగాల్లో పురోగతి.. చెరువుల పునరుద్ధరణతో సత్ఫలితాలు దేవాదాయ శాఖ పంచాంగ శ్రవణంలో చంద్రశేఖర సిద్ధాంతి వెల్లడి సాక్షి, హైదరాబాద్: మన్మథనామ సంవత్సరంలో వానలు అంతంతమాత్రంగానే ఉంటాయని, దీనివల్ల పంటల దిగుబడులు తగ్గి కరువు ఛాయలు ఏర్పడతాయని ప్రముఖ పంచాంగకర్త యాయవరం చంద్రశేఖర సిద్ధాంతి పేర్కొన్నారు. దేవుడిపై భారం మోపి ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తే వరుణుడు కొంతమేర కరుణించే అవకాశం ఉంటుందని పంచాంగ శ్రవణంలో పేర్కొన్నారు. రాష్ట్ర భాషా, సాంస్కృతిక, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతి సదనంలో నిర్వహించిన ఉగాది వేడుకలో భాగంగా ఆయన పంచాంగ శ్రవణం నిర్వహించారు. మన్మథనామ సంవత్సరంలో రాశి ఫలితాలు, పరిస్థితులు ఎలా ఉండబోతాయో వివరించారు. ఈ సంవత్సరం గ్రహస్థితిలో రాజు స్థానంలో శని ఉన్నందున వర్షాలు అంతంత మాత్రంగానే ఉంటాయని పేర్కొన్నారు. జూన్ 22 నుంచి జూలై 19 వరకు సాధారణ వర్షాలు, జూలై 20 నుంచి ఆగస్టు 30 వరకు పెద్ద వానలు, సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 10 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. మేఘాధిపతిగా చంద్రుడు ఉండటంతో విపరీతమైన గాలుల వల్ల మేఘాలు తేలిపోయి వానలకు ఇబ్బంది ఏర్పడుతుందని, ఆ గాలులు చివరకు పంటలను కూడా నాశనం చేస్తాయని చెప్పారు. వర్షాల కోసం వరుణ, రుద్రయాగాలు, రుద్రాభిషేకాలు నిర్వహించాల్సి ఉంటుందని ప్రభుత్వానికి సూచించారు. ఈ ఏడాది ఆహార ధాన్యాలకు కొరత ఏర్పడుతుందని, పసుపు, వేరుశనగ ధరలు పెరుగుతాయని పేర్కొన్నారు. తెల్లని ధాన్యాలు, పొట్టు ధాన్యాల ఉత్పత్తి ఎక్కువగా ఉంటుందని, వాటి ధరలు తగ్గుతాయని చెప్పారు. మంత్రి స్థానంలో కుజుడు ఉన్నందున హక్కుల కోసం పోరాడాల్సి వస్తుందని, సేనాధిపతిగా కూడా కుజుడే ఉన్నందున వాటిని సాధించుకునేందుకు పోరాడే శక్తి లభిస్తుందని తెలిపారు. పారిశ్రామికంగా రాష్ర్టం చాలా పురోగతి సాధించేందుకు సానుకూల పరిస్థితులు ఏర్పడతాయని, విద్యుత్ సమస్యలను అధిగమించే అవకాశాలు చాలా మెరుగవుతాయని, చెరువుల అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు సత్ఫలితాలనిస్తాయని వివరించారు. హైకోర్టు విభజనతోపాటు దీర్ఘకాలం పెండింగులో ఉన్న కేసుల పరిష్కారం జరుగుతుందని చెప్పారు. ప్రభుత్వం తీసుకునే నిర్మాణాత్మక చర్యల వల్ల ప్రజలకు ఊరట లభిస్తుందన్నారు. నేరాలు పెచ్చుమీరే ప్రమాదం ఉన్నందున సర్కారు దీనిపై దృష్టి సారించాల్సి ఉంటుందని, పర్యాటక, రవాణా రంగాల విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని సూచించారు. ఆదాయ-వ్యయాలు సమంగా ఉంటాయని, ఆదాయం 93గా ఉంటే వ్యయం కూడా అంతే ఉందన్నారు. కాగా వైద్య, చలనచిత్ర రంగాల్లో దేశానికి కీర్తి లభిస్తుందని పేర్కొన్నారు. అమెరికాలో ఆర్థికమాంద్యం తలెత్తుతుందని కూడా చంద్రశేఖర సిద్ధాంతి తెలిపారు. ప్రముఖులకు సన్మానం సాహిత్యం, సంగీతం, నృత్యం, నాటకం, చిత్రకళ, శిల్పకళ, పేరిణి నృ త్యం, జానపద సంగీతం, జానపద కళారూప ప్రదర్శన, హరికథ, బుర్రకథ, ఒగ్గుకథ, మిమిక్రీ, టీవీ, సినిమా రంగం, జానపద చిత్రకళ, హస్తకళ తదితర రంగాలకు చెందిన 31 మంది ప్రముఖులను జ్ఞాపికలు, పోచంపల్లి పట్టు శాలువాలతో సీఎం కేసీఆర్ సత్కరించారు. రాష్ర్టంలోని దేవాలయాలకు చెందిన 34 మంది వేదపండితులు, అర్చకులను సన్మానించారు. ఈ సందర్భంగా నల్లా విజయ్ అనే నిపుణుడు అరటినారతో నేసిన శాలువాను సీఎంకు బహూకరించారు. భద్రాచల దేవాలయం పక్షాన శ్రీరామనవమి వేడుకల ఆహ్వాన పత్రికను ఆలయ వేదాచార్యులు కేసీఆర్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఉప ముఖ్యమంత్రి మహమూద్‌అలీ, మండలి చైర్మన్ స్వామిగౌడ్, శాసనసభ స్పీకర్ మధుసూధనాచారి, మంత్రులు ఈటెల, ఇంద్రకరణ్‌రెడ్డి, నాయిని, పోచారం, తలసాని ప్రభుత్వ సలహాదారు రమణాచారి, అధికారులు పాల్గొన్నారు. -
రవీంద్రభారతిలో ఘనంగా ఉగాది వేడుకలు
-
మే ఐ కమిన్ సార్!
పొలిమేరలో నిలిచిన పండుగని ‘టుబి ఆర్ నాట్ టుబి’ అనే విచికిత్స వేధిస్తూ ఉంటుంది. ఎటూ పాలుపోక చివరకు ‘‘అయామ్ మన్మథ, మే ఐ కమిన్ సార్!’’ అంటూ వినయంగా జనావళిని అడుగుతుంది. ప్రతిసారీ ఉగాదికి కవులు అగ్నిపరీక్ష పెడుతుంటారు. ఒకరేమో ‘‘రా! రా! ఉగాదీ! నీ కోసం ఇళ్లలికాం! ముగ్గులు పెట్టాం! మా మామిడి తోర ణాలు కట్టింది. మా వేప నీకై విరగబూసింది!’’ అంటూ గొంతెత్తి రెండేసి మూడేసి సార్లు పిలుస్తారు. మరొకరు ‘‘రావద్దు ఉగాదీ! రావద్దు! ఏముందని వస్తావ్? వేప చెట్లు నరికేశాం! మామిడి మారాకు తొడగనే లేదు! నీకై పాటలు పాడే కోయిలలు ప్రెస్మీట్లో బిజీగా ఉన్నా యి! తుమ్మెదలు దారి తప్పి బ్రాందీ షాపుకి వెళ్లాయి! రావద్దు ఉగాదీ!’’ అంటూ ఇక్కడి సంగతులని కవిత్వీ కరిస్తూ హెచ్చరిస్తారు. పొలిమేరలో నిలిచిన పండుగని ‘టుబి ఆర్ నాట్ టుబి’ అనే విచికిత్స వేధిస్తూ ఉం టుంది. ఎటూ పాలుపోక చివరకు ‘‘అయామ్ మన్మథ, మే ఐ కమిన్ సార్!’’ అంటూ వినయంగా జనావళిని అడుగుతుంది. అట్టి అతిథి మన్మథ యావత్ తెలుగు జాతికి సర్వ సుఖ శాంతి సౌభాగ్యాలనిచ్చి కాపాడుగాక! ఈ నవ తొలి ఉగాది గోల్కొండ ఖిల్లాలో జరగను న్నదా? ఉర్దూ, తెలుగు భాషా కోయిలలు కోటలో అక్షర దీపాలు వెలిగించనున్నవా? మనదీ చాంద్రమానమే, వారిదీ చంద్రహారమే. అయినప్పుడిక కుడిఎడమల తేడాలేల? పండుగపూట హృదయాన్ని విప్పి, పొరల్ని వేదిక మీద ఆరేశారా లేదా అన్నది ముఖ్యం. తెలం గాణకి కావలసినన్ని కవితా గోష్టి సెంటర్లున్నాయి. ఖిల్లా నించి జిల్లా జిల్లాలో జరపవచ్చు. రవీంద్రభారతిలో అడుగు పెట్టొద్దనుకుంటే పేరు మార్చిన రంగా వ్యవ సాయ విశ్వవిద్యాలయంలో పచ్చందనాల నేపథ్యంలో సమ్మేళనం సాగించవచ్చు. కావాలనుకుంటే దైవసన్నిధి యాదాద్రి ఉండనే ఉంది. క్షేత్ర మహత్తు వల్ల ప్రతి కవీ ఒక న రసింహమై విజృంభిస్తే కొంచెం ఇబ్బంది. శాం తింప చేయడానికి కనీసం ఒక్క ప్రహ్లాదుడైనా దొరకడం కష్టం. ఇక అవశేష ఆంధ్రప్రదేశ్ పరిస్థితి దయనీయంగా ఉంది. ఉగాది వద్దామంటే చిరునామా కూడా లేదు. ఈ-మెయిల్ లేదు. సెల్ నంబరు ఉందిగాని, సిగ్నల్స్ సరిగ్గా లేవు. ఎక్కడికని వస్తుంది పాపం! తెచ్చిన కాను కలు ఎక్కడ దింపి వెళుతుంది? ఇటీవల వసంత కోయి ళ్లకి చెట్లు దొరక్క కరెంటు స్తంభాల మీద కూచుని కూస్తు న్నాయి. లైటు వెలిగితే వసంతకాలం కాబోలని భ్రమ పడుతున్నాయి. ఎందుకంత ఆలోచన? అసలీసారికి నూజివీడు మామిడితోటలోకి కవులను రప్పిస్తే ప్రతి కవీ వంద కోయిళ్ల పెట్టున ధ్వనిస్తారు. ఆ తర్వాత ఆ తోట లకి గొప్ప ధర పలుకుతుంది. నాగార్జున విశ్వవిద్యాల యం పేరు చెబితేనే ముఖ్యమంత్రికి దడుపు జ్వరం వస్తోంది. పోనీ పంచాంగ శ్రవణం రాయలసీమలో పెట్టుకుని, ప్రసాదం పంపిణీ విశాఖలో పెడితే అన్ని ప్రాంతాలకూ న్యాయం చేసినట్టు అవుతుంది. చూసు కోండి బాబూ, ఆదాయ వ్యయాలూ, అవమానాలూ రాజ్యపూజ్యాలు. ‘‘ఈసారి చంద్రన్న కానుకలు లేవా?’’ అన్నారెవరో. ‘‘లేవు... ఓల్డ్ స్టాక్స్ అన్నీ సంక్రాంతికి చెల్లి పోయాయి. పోగుపడితే వినాయక చవితికి...’’ అన్నా రింకొకరెవరో. మాకుగాదులు లేవు, మాకుషస్సులు లేవంటూ కొందరి ఆందోళన. పిక మహాసభ అంటే పిలవని కవుల మహాసభ అని కూడా అర్థం. జానెడు మైకు కోసం వాళ్లు తహతహలాడతారు. ప్రతి సమకాలీన సమస్య మీదా నిజాయితీగా స్పందించే ఒకే ఒక్క కులం కవికులం. చెరువుల పూడికలు ఒక ఉద్యమంగా నడుస్తుంటే- ‘‘అవి చెరువులు కావు, కొందరి మెదళ్లు. దశాబ్దాలుగా పేరుకుపోయిన మట్టిని మశానాన్ని తోడేస్తోంది మిషన్ కాకతీయ’’ అంటూ దిగి, తిరిగి తిరిగి ఎక్కడో తేలాడు ప్రాంతీయ కవి. ‘‘... వచ్చే ఉగాది నాటికి రాష్ట్రంలో కోటి డెబ్బయ్ ఆరు లక్షల నాలుగు వేల నలభై రెండు వేపచెట్లని అదనంగా పెంచుతాం. ప్రపంచంలోనే అతి పెద్ద వేప హబ్ వేస్తాం. గిరాకీ లేని కవులకు పింఛన్ పథకం కూడా ఆలోచనలో ఉంది. నే చెప్పిన మాట మర్చిపోవద్దు. ఇది మన్మథ నామ సంవత్సరం. మన కోసమే వచ్చింది. తమ్ముళ్లూ, ఆల్ ది బెస్ట్! (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
10 ఏళ్ల చిన్నారి.. 7 వరల్డ్ రికార్డులు
సిటీబ్యూరో : రవీంద్ర భారతిలో సాయంత్రం 7 గంటలు. అయిదో తరగతి చదువుతున్న పదేళ్ల పరిణీత స్టేజీపై గంతలు కట్టుకొని ఏదో చదువుతోంది. ఆమె తల్లిదండ్రులు టెన్షన్‌తో కన్నార్పకుండా చూస్తున్నారు. ప్రేక్షకులూ కంగారుగా వీక్షిస్తున్నారు. ఆ అమ్మాయి 60 సెకన్లలో 101 ఫ్లాష్కార్డులపై ఉన్న అక్షరాలు చదివింది. సభంతా చప్పట్లతో మారుమోగింది... ఎందుకనుకుంటున్నారా? ప్రణీత ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు వరల్డ్ రికార్డులు సృష్టించింది. శుక్రవారం బాల సాహిత్య పరిషత్, ఇంపాక్ట్ మైండ్ యాక్టివేషన్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కళ్లకు గంతలు కట్టుకొని కేవలం మనసుతో అక్షరాలను గుర్తుపట్టిన పరిణీత లిమ్కా బుక్, యూనిక్ వరల్డ్, వండర్ వరల్డ్ స్టేట్ బుక్, స్టార్ బుక్, లిటిల్ బుక్, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డులోకెక్కింది. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా హైదరాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ హాజరయ్యారు. ప్రముఖ మిమిక్రీ సింగర్ ఎల్. వెంకటేశ్వర్లు తన పాటలతో ప్రేక్షకులను ఉత్సాహపరిచారు. సంతోషంగా ఉంది.. నేను వరల్డ్ రికార్డు సాధించడం ఎంతో సంతోషంగా ఉంది. నా తల్లిదండ్రులు గాదె పవణ్కుమార్, గాదె లలిత నన్ను ప్రోత్సహించి ఇలా రికార్డులు సాధించేలా తయారు చేశారు. వారితో పాటు నాకు బ్లైండ్ ఫోల్డెడ్ బ్రిలియన్స్లో శిక్షణ ఇచ్చిన డాక్టర్ బి. సాయికిరణ్, హితేశ్ గారికి ధన్యవాదాలు. - గాదె పరిణీత -
హరి లీలామృతం
చేతిలో చిడతలు, పట్టు ధోవతి, మెడలో హారం, కాలికి గజ్జెలవంటి వేషధారణతోసాగే సంగీతం, నృత్యం, నట కళారూపాల మేలు కలయిక హరికథాగానం. ఆధ్యాత్మిక కోణంలో సమాజంలోని కుళ్లు ఎత్తి చూపిస్తూ జనరంజకంగా కొనసాగే ప్రవాహం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి. రమణాచారి 63వ జన్మదినం సందర్భంగా రవీంద్రభారతిలో పది రోజులుగా జరుగుతున్న హరికథా మహోత్సవాలు ఆహూతులను అలరిస్తున్నాయి. హరిలీలలు చెప్పే విధానమే హరికథ. దీన్ని చెప్పేవారు భాగవతారిణి, భాగవతార్ లేదా హరిదాసు. ఒకరే మూడు గంటలపాటు అన్ని పాత్రల్లోనూ జీవించి, రసవత్తరంగా నటిస్తారు. నోటితో వాచకం, పాటలు పాడుతూ, ముఖంలో సాత్వికం ఒలికిస్తూనే, క ళ్లతో నృత్యం, చేతులతో ఆంగికం ప్రదర్శిస్తారు. ఆకర్షణీయమైన ఆహార్యంతో ఏకకాలంలో ఇలా అభినయించటం ఒక్క హరికథకే చెల్లు. అంతసేపు కూర్చొని వినే ప్రేక్షకులకు విసుగు పుట్టకుండా మధ్యమధ్య హాస్యరసాన్ని పోషిస్తూ లాలింపుతోపాటు శక్తిని అందజేసేది హరికథ. విశేష ఆకర్షణ... సుగ్రీవ విజయం, గజేంద్రమోక్షం, పద్మవ్యూహం, అన్నమయ్య, పార్వతీ కల్యాణం, బాసర సరస్వతీ క్షేత్ర మహిమ, శ్రీకృష్ణ రాయబారం, శ్రీత్యాగయ్య, నర్తనశాల, దక్ష యజ్ఞం, ఉత్తర గోగ్రహణం, శ్రీకృష్ణ మహిమ, శ్రీ తులసి జలంధర హరికథా గానాలు... రవీంద్రభారతి ప్రాంగణంలోని ఘంటసాల వేదికపై మహాద్భుతంగా సాగాయి. హరికథ విని పరవశించిన ప్రేక్షకులు... అక్కడికక్కడే కళాకారులకు తమకు తోచిన సాయమందించారు. కపిలేశ్వరపురంలో... సంప్రదాయం జమీందారు, మాజీ కేంద్రమంత్రి సత్యనారాయణ తూర్పుగోదావరి జిల్లాలో హరికథ పాఠశాల ఏర్పాటు చేశారు. దీంతో ఎంతోమంది హరికథ కళాకారులకు ఉపాధి లభించింది. మన సంప్రదాయంలో భాగంగా భాసిల్లుతున్న హరికథలు మరింత విస్తృతం అవ్వాలి. ప్రభుత్వం ఆ దిశగా మరింత దృష్టి సారించాల్సి ఉంది. అయితే... ‘రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో డాక్టర్ కేవీ రమణాచారి పుట్టినరోజు ఫిబ్రవరి 8వ తేదీన హరికథాగానం జరిగేలా చూస్తాం. హరిదాసుల కష్టాలను మా కష్టాలుగా భావించి పరిష్కరిస్తాం’ అని శాసనమండలి చైర్మన్ కె.స్వామిగౌడ్ చెప్పారు. ఈ తరానికి అందాలి... దేశం సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ ఆనాడు ఊరూర హరికథలు చెప్పించేవారు. కానీ నేటి తరానికి ఇవి అందడం లేదు. వారికి దీని విశిష్టత తెలియజెప్పాలని ఎవరూ భావించడం లేదు. రెండు తెలుగు ప్రభుత్వాలు దీని గురించి ఆలోచించాలి. అన్నమయ్య ప్రాజెక్ట్ లాంటి ప్రాజెక్ట్‌లు తీసుకురావాలి. అప్పుడే హరికథ నిలబడుతుంది. విదేశాల్లో సైతం హరికథను ఆదరిస్తున్నారు. నేను అమెరికాలో కూడా హరికథాగానం చేశాను. - వేదవ్యాస శ్రీరామభట్టార్, భాగవతార్, వరంగల్ స్కూల్స్ ఏర్పాటు చేయాలి... ఇంటిల్లిపాది కూర్చొని విని ఆనందించే కళ హరికథ. కపిలేశ్వరపురంలోలాగా హరికథల కోసం స్కూల్స్ ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం చొరవ తీసుకొని హైదరాబాద్ తెలుగు వర్సిటీలో ఉన్న హరికథ కోర్సును పరిపుష్ఠం చేయాలి. అప్పుడే ఈ కథ బతుకుతుంది. మహిళలు ఇటువైపు వచ్చేందుకు ఆసక్తి చూపుతారు. - మొగిలిచర్ల నాగమణి, భాగవతారిణి, తెనాలి అవే దిక్కయ్యాయి... మా పెద్దలు హరికథలు చెబుతూనే బతికారు. పిల్లల చిన్న వయస్సులోనే నా భర్త చనిపోయారు. భుక్తి కోసం హరికథలు చెప్పటం ప్రారంభించాను. పిల్లలందరిని చదివించాను. అన్నమాచార్య ప్రాజెక్ట్ ద్వారా నెలకు ఐదారు ప్రోగ్రామ్స్ నిర్వహిస్తా. ఏ దిక్కులేని మాకు హరికథలే దిక్కయ్యాయి. - టి.లక్ష్మీమహేష్, భాగవతారిణి, కర్నూల్ ఆదరణ ఉంది... ఉపాధే కష్టం నిరంతరం హరినామస్మరణ ఉండే ఊరు, ఇళ్లు అష్టైశ్వర్యాలతో పరిఢవిల్లుతాయి. అలాంటి హరికథలకు ఆదరణ ఉన్నా ఉపాధి కష్టం అయింది. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అన్నమాచార్య ప్రాజెక్ట్ నుంచి తెలంగాణ హరిదాసులను తొలగించారు. దీనివల్ల మాకు ఇల్లు గడవడం కష్టమవుతోంది. తిరుపతి అన్నమయ్య ప్రాజెక్ట్ లాగా తెలంగాణ ప్రభుత్వం కూడా హరిదాసుల కోసం ఓ ప్రాజెక్ట్ ప్రారంభించాలి. - హెచ్ఎం సుధాకర్, భాగవతార్, మహబూబ్‌నగర్ చేసింది తక్కువ... సాత్విక, వాచిక, అంగీకాభినయాలకు ఆలవాలం హరికథలు. టీటీడీలో పనిచేసేటప్పుడు తెలుగునాట హరికథలు కొనసాగించటానికి మమ్మురంగా ప్రయత్నించా. ఎండోమెంట్స్ కమిషనర్‌గా ఉన్నప్పుడు శనివారాలు వైష్ణవ, సోమవారాలు శైవ ఆలయాల్లో హరికథల ఏర్పాటుకు కృషి చేశా. దీనికి పూర్వ వైభవం తెచ్చేందుకు చేయాల్సిందింకా ఉంది. కళాకారులకు ఉపాధి, కళ విశ్వవ్యాప్తం చేయాలనే సంకల్పంతో ఈ నెల 9 నుంచి ఈ మహోత్సవాలకు శ్రీకారం చుట్టాం. దీంతో చాలా మందికి ఉపాధి లభిస్తుంది. హైస్కూల్ స్థాయిలోనే హరికథలు నిర్వహిస్తే పిల్లలకు మన సంస్కృతిని అలవాటు చేసినవారమవుతాం. - డాక్టర్ కేవీ రమణాచారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు - కోన సుధాకర్‌రెడ్డి -
ఆంధ్రబాలానంద సంఘం వజ్రోత్సవం
-
‘అనిబిసెంట్’ విద్యార్థినుల హంగామా
-
అక్రమాలను ఉపేక్షించం: ఈటెల
గృహ నిర్మాణ ఉద్యోగులు నిబద్ధతతో పనిచేయాలి కేసీఆర్‌లో కాఠిన్యమే కాదు.. కారుణ్యమూ ఉంది సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పథకాల అమలులో అక్రమాలు జరిగితే ఉపేక్షించేది లేదని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ హెచ్చరించారు. పేదలకు గూడు కల్పించే కీలక బాధ్యత ఉన్న గృహ నిర్మాణ శాఖ ఉద్యోగులు నిబద్ధతతో పని చేయాలని సూచించారు. గృహ నిర్మాణ శాఖ ఉద్యోగుల జేఏసీ కొత్త సంవత్సర డైరీ, కేలండర్‌ను ఆదివారం రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులతో కలసి ఆవిష్కరించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై సీఐడీ విచారణతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారని ఉద్యోగ సంఘ నేతలు మంత్రుల దృష్టికి తెచ్చారు. దీనికి స్పందించిన ఈటెల పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేశారు. తప్పులను ప్రభుత్వాలపై నెడితే కుదరదని, ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమనే విషయాన్ని మరవద్దని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం కక్షపూరితంగా ఉండదని, కేసీఆర్ వద్ద కాఠిన్యమే కాదు కారుణ్యం కూడా ఉందని గుర్తించాలన్నారు. గృహ నిర్మాణశాఖ ఉద్యోగుల పింఛన్, ఇళ్ల స్థలాల కేటాయింపును సీఎం దృష్టికి తీసుకెళ్తానని, ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, వేతనాల పెం పును పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. సీఐడీ విచారణలో పక్కాగా వివరాలు వెలుగుచూడకపోవచ్చని మంత్రి తుమ్మల అన్నారు. గత ప్రభుత్వాల తప్పుడు నిర్ణయాల వల్ల ఉద్యోగులు ఇబ్బంది పడే పరిస్థితి తలెత్తిందని టీఎన్జీవోస్ అధ్యక్షులు దేవీప్రసాద్ అన్నారు. -
ఒకేసారి రెండు రికార్డులు
తొమ్మిదేళ్ల చిన్నారి ప్రతిభ ఆర్మూర్: తొమ్మిదేళ్ల చిరుప్రాయంలోనే ఓ చిన్నారి ఒకేసారి రెండు రికార్డులను సొంతం చేసుకొంది. అద్భుతమైన నృత్య ప్రదర్శనతో ‘తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’, ‘తెలంగాణ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో చోటు సంపాదించింది. నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండల కేంద్రానికి చెందిన నట్ట లక్ష్మణ్, లక్ష్మి దంపతులు ఆర్మూర్ మండలం మామిడిపల్లిలో నివాసం ఉంటున్నారు. వీరి పెద్ద కూతురు వినూత్న హర్ష ఇటీవల హైదరాబాద్ రవీంద్రభారతిలో నాట్య మయూరి ఆర్ట్స్, నాట్యం కూచిపూడి అకాడమీ నిర్వహించిన కార్యక్రమంలో నృత్య ప్రదర్శన ఇచ్చింది. దేశభక్తి గీతాలపై చక్కని హావభావాలతో ఆకట్టుకుంది. దీంతో నిర్వాహకులు వినూత్న హర్షను ‘తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’, ‘తెలంగాణ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’కు ఎంపిక చేశారు. ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. వీటితోపాటు 2014 ఉత్తమ నృత్య ప్రదర్శకురాలిగా మరో అవార్డును చిన్నారి సొంతం చేసుకుంది. -
నాడిది రెండో ఊటీ
ఆమె సిరిసిరి మువ్వల సరిసరి అడుగులు నెమలికి నడ కలు నేర్పిస్తాయి. గమకాల నాదవినోదానికి తన నాట్యవిలాసంతో గమనం జత చేసింది. కూచిపూడికి కాణాచిగా వెలుగొందుతున్న నర్తకి శోభానాయుడు. ఖండాంతరాల్లో వెల్లువెత్తిన ఆ నాట్య తరంగాలు.. హైదరాబాద్ రవీంద్రభారతిలో ఉత్తుంగ గంగా తరంగాల్లా ఉప్పొంగుతాయని చెబుతారామె. సిటీకి తరలి వచ్చాక ఆ అపూర్వ అభినయం నర్తనశాలగా మారి మరెందరినో కూచిపూడి కొమ్మలుగా తీర్చిదిద్దుతోంది. 33 ఏళ్ల కిందట భాగ్యనగరంలో అడుగిడిన ఆ అందెలు.. తాళం తప్పని అప్పటి పట్నం పోకడను ఇప్పటికీ గొప్పగా చెబుతుంటాయి. అద్వితీయ బంధంగా మారిన హైదరాబాద్ తనకు రెండో ఊటీగా తోచేదని చెబుతున్న శోభానాయుడు సిటీతో తనకున్న అనుబంధాన్ని ‘సిటీప్లస్’తో పంచుకున్నారు. ..:: హనుమా ఆ రోజులు ఇప్పటికీ గుర్తున్నాయి. మద్రాసు నుంచి హైదరాబాద్‌కు రైల్లో వచ్చేవాళ్లం. ఎప్పుడు వస్తుందా అని కిటికీ దగ్గర కూర్చుని ఎదురు చూస్తుండేవాళ్లం. నగరం సమీపిస్తుంటే... చల్లని గాలులు వీస్తూ... చినుకులు పడుతూ... పచ్చని చెట్లు కనిపిస్తుంటే... ఆహా... అసలా ఫీలింగే వేరు. మేం ‘సెకండ్ ఊటీ’ అనేవాళ్లం. అంతటి ఆహ్లాదం... చల్లదనం. ఇప్పుడు ఆ హాయి పోయి, వాహనాలు, అపార్ట్మెంట్లు పెరిగి, చెట్లు తగ్గిపోయి కాలుష్యం విరజిమ్ముతోంది. అంతకముందు చాలాసార్లే వచ్చివెళ్లినా... మద్రాసును వదిలి పూర్తిగా నగరానికి మారింది మాత్రం 1981లో. అప్పట్లో ఇక్కడ నాట్య అకాడమీ నెలకొల్పాలనేది నాటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి ఆకాంక్ష. ఆయన కోరిక... మా గురువుగారి ప్రోద్బలంతో పాటు... ఆంధ్రుల ఆడపడుచును కనుక... మన ఇంట పుట్టిన కూచిపూడిని అందరికీ పంచాలని హైదరాబాద్ వచ్చా. అప్పుడప్పుడే మద్రాస్‌లో పేరు తెచ్చుకుంటున్నా. అంతవరకు ఒక బాధ్యతారహిత జీవితం గడిపా. ఇక్కడకు వచ్చాక బాధ్యత పెరిగింది. అకాడమీ స్థాపించి నడిపించడమంటే... ఎంత కష్టమో అర్థమైంది. బెత్తం పట్టుకుని పాఠాలు నేర్పడం... పాలనా వ్యవహారాలు చూసుకోవడం... అష్టావధానంలా అనిపించేది. తొలుత ఇన్స్టిట్యూట్ హిమాయత్‌నగర్ టీటీడీ కల్యాణ మండపం ఎదురుగా అద్దె ఇంట్లో ఉండేది. అక్కడి నుంచి నారాయణగూడ వెంకటేష్ థియేటర్ ఎదురుకు మారాం. ప్రస్తుతం దోమల్‌గూడలో ఉన్నది పర్మినెంట్ బిల్డింగ్. కేంద్ర ప్రభుత్వ నిధులతో సమకూర్చుకున్నాం. అది దేవాలయం... హైదరాబాద్ వస్తున్నామంటే కళ్లలో మెదిలేది రవీంద్రభారతే. మాకది లండన్ క్వీన్సా నగరంలా. అందులో నాట్యమాడుతుంటే... సాక్షాత్తూ ఆ రవీంద్రుడి ముందు ఆడుతున్నట్టే అనుభూతి. నాకది దేవాలయం. అలాగే మా అకాడమీ, త్యాగరాయ గానసభ... నగరంలో బాగా ఇష్టమైన ప్రాంతాలివే. ఇక చిన్నప్పుడు ఇక్కడకు వచ్చినప్పుడల్లా సాలార్జంగ్ మ్యూజియంకు వెళ్లేవాళ్లం. పబ్లిక్ గార్డెన్లో షూటింగ్‌లు బాగా జరిగేవి. నాడు వాటర్ ట్యాంకర్లంటే తెలీదు. మారనిదల్లా... నాంపల్లి ఎగ్జిబిషన్. అప్పటిలానే కొనసాగుతోంది. క్లాసికల్ డ్యాన్స్, సంగీతం కోసమే సభలుండేవి. మాలాంటి వారికి అవే ప్రోత్సాహం. నేడవి కనిపించడం లేదు. ప్రభుత్వం తరపు నుంచి కళాకారులకు నామమాత్రపు ప్రోత్సాహం, సహకారం కూడా అందడం లేదు. ఎమ్మెల్యే పెసరట్టు... అప్పట్లో అసెంబ్లీ పక్కన ఓ హోటల్లో ఎమ్మెల్యే పెసరట్టు బాగా ఫేమస్. ఇప్పుడు దాని ప్లేస్‌లో చిరంజీవి దోశలొచ్చేశాయి (చమత్కారం). ఇక డబుల్ డక్కర్ బస్సు ఎక్కి కూర్చుని... ట్యాంక్‌బండ్ మీద నుంచి వెళుతూ... హుస్సేన్‌సాగర్ అందాలను చూస్తుంటే... అబ్బో... అద్భుతం. చార్మినార్ ఎక్కి చూడటమంటే మాలాంటి వారందరికీ పెద్ద కోరిక. కోఠి, అబిడ్స్, చార్మినార్... నాడు షాపింగ్ ప్లేసెస్ ఇవే. ఇప్పుడు ఏ ప్రాంతానికా ప్రాంతం పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌తో బడా సెంటర్లుగా మారిపోయాయి. ఫ్లైఓవర్లంటే తెలీదు. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడే. తగ్గుతున్న విలువలు ఐటీ, వెడల్పాటి రోడ్లు, ఫ్లైఓవర్లు, బడా భవంతులు... ఒక్కోసారి భాగ్యనగరమా లేదంటే అమెరికాలో ఉన్నామా అన్న ఫీలింగ్ కలుగుతోంది. మార్పు కొంత వరకు బానే ఉంది. కానీ బిజీ లైఫ్, వెస్ట్రన్ కల్చర్ మోజులో మమతలు, మమకారాలు పోయి, బాంధవ్యాలు తెగిపోతున్నాయి. చిన్న వయసులో చైల్డ్‌కేర్ సెంటర్లు, విద్యార్థి దశలో హాస్టళ్లు, ఉద్యోగ వేటలో విదేశాలు, వయసుకో చోట మకాం. ఫలితం, దూరాలు పెరిగి, విలువలు తగ్గి, కుటుంబ వ్యవస్థ పతనమైపోతోంది. ఏ వివాహ బంధానికైతే మన దేశం పేరో... ఆ బంధాలు నేడు కార్పొరేట్ కల్చర్‌లో మునిగితేలుతున్న సిటీలో మాయమవుతున్నాయి. మా బంధం అపురూపం... మాది రాజమండ్రి. సంప్రదాయ కుటుంబం. నాన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇంజనీరు. మా ఇంటా వంటా డ్యాన్స్ లేదు. నాకేమో అదంటే ప్రాణం. చెన్నైలో ఉండగా సినిమా ఆఫర్లు వచ్చినా... నాట్యం కోసమే వాటిని వదులుకున్నా. అక్కినేని నాగేశ్వరరావు చాలాసార్లు అనేవారు... ‘నేను ఓ మంచి హీరోయిన్ను మిస్సయ్యా’ అని. ఇక నాకు నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్. మా మధ్య బంధం విలువలతో పెనవేసుకున్నది. చంద్రిక (సెయింట్‌ఆన్స్‌లో కౌన్సెలర్), శారదా శ్రీనివాసన్ (మాజీ రేడియో అనౌన్సర్), జానకి, సత్యశ్రీ (గృహిణులు), మేము రెగ్యులర్‌గా మీటవుతుంటాం. కార్తీకమాసం వనభోజనాలు, కీసర, బాసర వంటి టెంపుల్ టూర్స్, లేదంటే మాలో ఒకరి ఇంట్లో మీటవుతాం. ఒక్కోరు ఒక్కో కూర తెచ్చి సరదాల విందుతో జ్ఞాపకాలు నెమరేసుకొంటాం. వేణువై వచ్చారు.. వెదురులోకి ఒదిగిన కుదురులేని గాలి.. హుస్సేన్‌సాగర్ అలల తరంగాలను తాకుతూ గానకేళిగా పల్లవించింది. వేణువై వచ్చిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు.. ట్యాంక్‌బండ్ పరిసరాల్లో మలయమారుతాల్లా ప్రతిధ్వనించారు. ట్రిబ్యూట్ టు పండిట్ హరిప్రసాద్ చౌరాసియా పేరిట ట్యాంక్‌బండ్ మెయిన్ రోడ్‌లోని సెయిలింగ్ అనెక్స్‌లో ఆదివారం జరిగిన సుస్మిత, దేవప్రియ చటర్జీ సిస్టర్స్ వేణుగానం ఆహూతులను మంత్రముగ్ధులను చేసింది. -
పూరి డాన్స్ ఫెస్టివల్ తరహాలో...
నిజామాబాద్ ఎంపీ కవిత నాంపల్లి: పూరి డాన్స్ ఫెస్టివల్ తరహాలో హైదరాబాద్‌లో నృత్యోత్సవాలను వచ్చే ఏడాది నిర్వహిస్తామని నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. ఆదివారం రాత్రి రవీంద్ర భారతి వేదికపై లాస్యకల్ప సంస్థ ఆధ్వర్యంలో భారతీయ సంప్రదాయ నృత్యాలైన శ్రీయ, క్షీర సాగర మథనం నృత్య రూపకాలు ప్రదర్శించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కవిత మాట్లాడుతూ రాబోయే సంవత్సరంలో అద్భుతమైన కళారూపాలను తీసుకువస్తామని ప్రకటించారు. అన్ని జిల్లాల నుంచి కళాకారులను తీసుకురావాలనే లక్ష్యంతో లాస్యకల్ప ఫౌండేషన్, తెలంగాణ జాగృతి, డెల్ఫిక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంస్థలతో కలిసి రవీంద్రభారతిలో ‘నుపుర రావమ్-2014’ కార్యక్రమానికి రూపకల్పన చేసి ప్రదర్శనలు ఇచ్చినట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా కళాకారులు ప్రదర్శించిన శ్రీయ, క్షీర సాగర మథనం నృత్యరూపాలను అత్యద్భుతంగా ప్రదర్శించారు. -
'ద గ్లోబల్ ఎడ్జ్ స్కూల్ వార్షికోత్సవం '
-
అలుపెరగని సేవకులకు సత్కారం
-
సృజనకు పట్టం
రెక్కలు తొడిగిన ఊహలకు ఆ చిట్టి కుంచెలు అద్భుతమైన రూపాన్నిచ్చాయి. అబ్బురపరిచే కళను రంగులతో కలగలిపి కాన్వాస్‌పై ఒలకబోసి అదరహో అనిపించారు. కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సోమవారం రవీంద్రభారతిలో జరిగిన రాష్ట్రస్థాయి పెయింటింగ్ పోటీలు చిన్నారుల ప్రతిభకు తార్కాణంగా నిలిచాయి. 50 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీలో హైదరాబాద్ చిన్నారులే మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. కోన సుధాకర్ రెడ్డి ఫుల్ హ్యాపీ గతంలో జరిగిన పోటీల్లో ప్రోత్సాహక బహుమతి వచ్చింది. ఈసారి ఫస్ట్ ప్రైజ్ రావడం ఆనందంగా ఉంది. తల్లిదండ్రులు, టీచర్ల ప్రోత్సాహంతోనే ఈ విజయం సాధించాను. భవిష్యత్తులో మంచి ఆర్టిస్ట్ అవుతాను. నీటికి ఉన్న ప్రాధాన్యాన్ని వివరిస్తూ పెయింటింగ్ వేశాను. - కె.దివిజ, ఏడో తరగతి,డీఏవీ పబ్లిక్ స్కూల్, కూకట్పల్లి మొదటిసారైనా.. ఇలాంటి పోటీలో నేను పాల్గొనడం ఇదే తొలిసారి. సెకండ్ ప్లేస్‌లో నిలవడం ఎంతో ఆనందాన్నిచ్చింది. ఈ ఆనందాన్ని ఫ్యామిలీ, టీచర్లు, స్నేహితులతో పంచుకుంటా. చిన్నపిల్లలు-నీటి సంర క్షణ కాన్సెప్ట్‌ను కాన్వాస్‌పై చూపాను. - జి.అమృత లక్ష్మి, ఎనిమిదో తరగతి,కేంద్రియ విద్యాలయం, బేగంపేట్. ఇదే స్ఫూర్తితో.. రాష్ట్రస్థాయిలో జరిగిన పోటీలో నాకు ప్రైజ్ రావడం ఆనందంగా ఉంది.లక్ష్మణుడి ప్రాణాలను కాపాడటానికి ఆంజనేయుడు సంజీవని పర్వతం తెచ్చిన ఘట్టాన్ని.. ప్రస్తుత పరిస్థితులకు అన్వయిస్తూ చిత్రం గీశాను. ఇలాంటి పోటీలు చిన్నారుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి. - ఇ.శ్వేత, తృతీయ బహుమతి విజేత, ఎనిమిదో తరగతి, ఆటమిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్- 1, ఈసీఐఎల్ -
అంతరంగ్-2014
-
కళ్లు చెదిరే కత్తుల క్రీడ
ఖాదర్ అలీబేగ్ తొమ్మిదవ థియేటర్ వార్షికోత్సవాల్లో భాగంగా ఆదివారం రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. తొలుతా విచిత్ర విన్యాసాలపై అవగాహన కల్పించారు. స్పెయిన్‌కు చెందిన ముర్రే మొలీస్ ‘ద కిడ్స్ గాట్ చరిష్మా ’పేరుతో ప్రదర్శించిన కత్తి విన్యాసాలు చూపురులను అబ్బురపరచాయి. -
ప్రజానాట్య మండలి తెలంగాణ రాష్ట్ర కమిటీ ఎన్నిక
హైదరాబాద్: ప్రజానాట్య మండలి తెలంగాణ రాష్ట్ర కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. బుధవారం హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన సమావేశంలో అధ్యక్షుడిగా ఎన్.మారన్న, ఉపాధ్యక్షులుగా జగ్గరాజు, దేవేంద్ర, ప్రధానకార్యదర్శిగా టి.నర్సింహ, సహాయ కార్యదర్శులుగా సాంబరాజు, జోజి, సైదులు, కోశాధికారి కట్ట నర్సింహ, కార్యవర్గ సభ్యులుగా తిరుపతి, రాంబాబు, రవి, సిర్పలింగం, నాగభూషణం, దుర్గేష్, విజయలక్ష్మి, నరేంద్ర, శారద, జానీ, నర్సింహారెడ్డి, రామాచారి, సైదులు, కళ్యాణ్, రామచందర్, కుమార్, రవి, కుమార్, సదానంద్, వెంకన్న, అనిత, బండి సత్తెన్న తదితరులు ఎన్నికయ్యారు. -
బంగారు మనసివ్వు ఉయ్యాలో..
-
కలలుగన్న తెలంగాణ రావాలి
* అప్పుడే కాళోజీ వంటి వారికి నిజమైన నివాళి * రవీంద్రభారతిలో కాళోజీ శతజయంతి వేడుకల్లో కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ ప్రాంత పురోగతికి ప్రణాళిక రచన జరగాలి. రాష్ర్ట సమగ్రాభివృద్ధికి కొత్త చట్టాలు రావాలి. ఇంకా ఆంధ్రప్రదేశ్ యావ ఎందుకు? కాళోజీ, దాశరథి, జయశంకర్లాంటివారు కలలుగన్న తెలంగాణ సాక్షాత్కారం కావాల్సి ఉంది. అలాంటి తెలంగాణను సృష్టించడమే వారికి మనమిచ్చే నిజమైన నివాళి. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం అదే దిశలో వాస్తవ దృక్పథంతో ముందుకు సాగుతోంది. ప్రజల కు ఏం కావాలో చెప్పిన మాటలను సిన్సియర్‌గా చేసి చూపిస్తానని ప్రామిస్ చేస్తున్నాను’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రవీంద్రభారతిలో మంగళవారం రాత్రి జరిగిన కాళోజీ శత జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లో ఏం జరిగిందంటూ కొందరు కురచ మనస్తత్వం ఉన్నవారు ప్రశ్నిస్తున్నారని, కానీ ధైర్యంగా సాహసోపేత నిర్ణయాలతో ప్రభుత్వం సాగుతోందని అన్నారు. మేధావులతో త్వరలో ఓ ప్రజాసంఘాన్ని ఏర్పాటు చేస్తామని, దాని ఆధ్వర్యంలోనే పాలన సాగుతుందని ప్రకటించారు. ‘‘రోడ్డని పలికేవాడికి సడకంటే ఏవగింపు.. ఆఫీసని అఘోరిస్తూ కచ్చీరంటే కటువు. సీరియలంటే తెలుగు.. సిల్సిలా అంటే ఉరుదు. టీ అంటే తేట తెనుగు.. చా అంటే తుర్కము. బర్రె అంటే నవ్వులాట.. గేదంటేనే పాలు. రెండున్నర జిల్లాలదే దండి భాష తెలుగు... తక్కినోళ్ల నోళ్ల యాస త్రొక్కి నొక్కి పెట్టు తీర్పు. వహ్వారే! సమగ్రాంధ్రవాదుల ఔదార్యమ్ము..’’ అంటూ కాళోజీ మాటలను కేసీఆర్ ఈ సందర్భంగా వినిపించారు. అనంతరం ప్రముఖ కళాకారుడు అంబాజీ రూపొందించిన కాళోజీ చిత్రపటాన్ని, జీహెచ్ఎంసీలో ఉప కమిషనర్‌గా పనిచేస్తున్న యాదగిరిరావు రాసిన కాళోజీ సమగ్ర సాహిత్య పరిశోధన గ్రంథాన్ని సీఎం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, శాసనసభ స్పీకర్ మధుసూధనచారి, కాళోజీ ఫౌండేషన్ అధ్యక్షులు నాగిళ్ల రామశాస్త్రి, రచయిత అంపశయ్య నవీన్, కవి దేశపతి శ్రీనివాస్, ప్రభుత్వసలహాదారులు రమణాచారి, గోయల్, రామ్‌లక్ష్మణ్, కాళోజీ కుమారుడు రవికుమార్, కోడలు వాణి తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. * రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ‘తెలుగు’ అంటూ మళ్లీ బయలు దేరిన్రు. జొచ్చేటప్పుడు చాలా తియ్యగ మాట్లాడతరు.. జొచ్చినాక మీది తెలుగే కాదంటరు. ఇప్పుడు మళ్లీ తెలుగువాళ్లమన్న పేరుతో అదే జరుగుతుంది. వాళ్లెన్నిజేయాలో అన్ని జేసిన్రు.. ఇంకా మానలేదు. కొట్లాడుకుంటు కూడా ఎట్ల బతకాల్నో తెలంగాణ వాళ్లకు తెలుసు.. మీరే దెబ్బదింటరు. గెలిచి నిలవడం తెలంగాణ రక్తంలోనే ఉంది. * నేను తెలంగాణ తల్లి అంటే బిత్తిరిబిత్తిరైన్రు. అది నేను చెప్పిన మాట కాదు. అప్పట్లోనే దాశరథిలాంటి వాళ్లు చెప్పిందే. చెన్నై రాజధాని సమయంలో వాళ్లు ఆంధ్రమాత అన్నరు. చివరకు ఆ ఆంధ్రమాతను, తెలంగాణ త ల్లిని ముంచి తెలుగుతల్లిని పుట్టిచ్చిన్రు. కాళోజీ ఆవహించాడో ఏమోగాని నేను కోపంతో ఎవని తెలుగుతల్లి అంటే నా మీదకు ఇంతెత్తు లేచిన్రు. * తెలంగాణ యాస అంటే మోటుగా ఉంటుందనే భావన కొందరిలో ఉంది. ఈ యాసను ఘనంగా చాటాలనే సోయి వారిలో రావాల్సి ఉంది. కాళోజీ కలలుగన్న తెలంగాణే కాదు, తెలంగాణ యాస కూడా వర్ధిల్లాలి. కాళోజీ సెటైర్ వేసేవారేమో... ఇటీవల సమగ్ర సర్వే చేసినప్పుడు నగరంలో అదనంగా నాలుగు లక్షల కుటుంబాలు ఇళు ్లకట్టుకుని ఉన్న సంగతి తేలిందని, జీహెచ్ఎంసీ కమిషనర్‌కు ఈ విషయమే తెలియదని పేర్కొన్నారు. కాళోజీ బతికి ఉంటే దీనిపై పెద్ద సెటైర్ వేసేవారేమోనని కేసీఆర్ చమత్కరించారు. ఉన్నదే చెబుదాం.. మాయ మాటలొద్దు! పరిపాలన విషయంలో ప్రజలకు వాస్తవాలే చెబుదామని, మంత్రులు దీన్నే పాటించాలని కేసీఆర్ హితవు పలికారు. గత ప్రభుత్వాలు ఏవో మాటలు చెప్పి ప్రజలను మోసం చేశాయన్నారు. ‘మా ఉప ముఖ్యమంత్రి రాజయ్య నేను వంద రోజుల్లో అద్భుతాలు చేసిన అని అన్నరు. నేను ఏం జేయలే.. అసలు పనే మొదలుకాలే. దసర నుంచి పని మొదలైతదని నేను మొదటే చెప్పిన. ఇంత గడబిడ ఎందుకు? డంబాచారం చెప్పడం, గోల్మాల్ దిప్పడం నాకు రాదు. మంత్రులు ఎవరు కూడా ఇలా చేయవద్దని చెప్పిన. చెబితే మీరే దెబ్బతింటరని చెప్పిన. రాజయ్య గారు వినకుండా ఇక్కడ హెల్త్వర్సిటీ పెడ్తమని వచ్చినప్పడుల్లా అంటున్నరు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలె. సాధ్యమైతదా? చెయ్యగలిగిందే చెప్పా లె. కాళోజీ అదే చెప్పిండు. అడ్డం పొడుగు మాట్లాడి లేని మాటలు పడుడెందుకు. గత ప్రభుత్వాలన్నీ అదే పని జేసినయ్. ప్రజలను మోసపుచ్చే, మాయామశ్చీంద్ర మాటలు ఎందుకు’ అని కేసీఆర్ అన్నారు. కేశవరావు శాసన మండలి సభ్యుడిగా ఉన్నప్పుడు తాను వర్సిటీలో ఎం.ఏ (పొలిటికల్ సైన్స్) చేసేవాడినని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో కేకే ప్రసంగాలను అసెంబ్లీ గ్యాలరీలో కూర్చుని వినేవాడినని చెప్పారు. అప్పుడు కేకే... దేశంలో బంగళాల భారతదేశం, గుడిసెల భారతదేశం రెండూ ఉన్నాయని వ్యాఖ్యానిస్తే ఆంధ్ర మీడియా కార్టూన్లు వేసి పెద్ద రాద్ధాంతం చేశాయని కేసీఆర్ వివరించారు. -
'తెలంగాణను తెలంగాణ కళ్లతో చూడాలి'
హైదరాబాద్: కాళోజీ అరుదైన వ్యక్తి అని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. బాష కోసం ప్రాణమిచ్చే మహానుభావుడు కాళోజీ అని పేర్కొన్నారు. కాళోజీ ఓ ప్రాంతానికి చెందిన వాడు కాదన్నారు. ఆయన పేరు మీద రవీంద్రభారతిని మించిన ఆడిటోరియం వరంగల్ లో కడతామని తెలిపారు. కాళోజీ కళాక్షేత్రం కోసం వరంగల్ నడిబొడ్డున మూడున్నర ఎకరాలు కేటాయించినట్టు చెప్పారు. దీనికోసం ఇప్పటికే రూ.12 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. రవీంద్రభారతిలో మంగళవారం రాత్రి జరిగిన కాళోజీ శతజయంతి సమాపనోత్సవంలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాళోజీ కలగన్న తెలంగాణ కోసం ధైర్యసాహసాలతో ముందుకు పోతామన్నారు. తమ ప్రభుత్వంపై అప్పుడే విమర్శలు చేయడాన్ని కేసీఆర్ తప్పుబట్టారు. గత్తరబిత్తర చేయాలని కొందరు చూస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణను తెలంగాణ కళ్లతో చూడాలన్నారు. ఇంటింటి సర్వే చేసినా తప్పుబట్టారన్నారు. ఎంతో మంది ఉన్నారో తెలుసుకునేందుకు సర్వే చేస్తే తప్పా అని ప్రశ్నించారు. బంగారు తెలంగాణ సాధించే వరకు విశ్రమించబోమని స్పష్టం చేశారు. -
షహర్ కీ జిందగీ.. ఏక్ పహేలీ!
షహర్ కీ జిందగీ ఏక్ పహేలీ ! ఎప్పుడు నవ్విస్తుందో.. ఇంకెప్పుడు కవ్విస్తుందో.. మరెప్పుడు ఏడ్పిస్తుందో తెలియదు! అన్నిటినీ అందుబాటులో ఉంచి.. ఉట్టి కొట్టే ఆటాడిస్తుంటుంది ! అందుకే చేతికందేవెన్నో చెయ్యిజారేవీ అన్నే! హైదరాబాద్‌లో జీవితమంటే పజిల్లాంటిదే మరి!! రవీంద్రభారతిలో నేడు ‘కవితాక్షరసుమార్చనమ్-వనితాసమ్మేళనం’ జరగనుంది. ఈ సందర్భంగా అందులో పాల్గొననున్న కవయిత్రులు లక్కరాజు నిర్మల, డాక్టర్ మంగళగిరి ప్రమీలాదేవి, శైలజామిత్ర, గిరిజారాణిలను ‘సిటీప్లస్ ’పలకరించింది. సిటీ అందాల వర్ణనతో మొదలైన ఈ మహిళామణుల కవితా ప్రస్థానం.. మానవసంబంధాలు, రోడ్లు, ట్రాఫిక్ మీదుగా సాగి హైదరాబాద్ సౌకర్యాల దగ్గర ఆగిపోయింది. ‘హైదరాబాద్ అందాల రాణి.. గోల్కొండకోట ఆమె కిరీటమైతే.. చార్మినార్ చూడామణి.. మూసీ (ఆనాటి స్వచ్ఛమైనది) వాలుజడ.. పచ్చిక మైదానాలు కంఠాభరణాలు.. హుస్సేన్‌సాగర్ (నాటి మంచినీటి సరస్సు) మెరిసే వడ్డాణం.. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ ఆ సుందరి కాళ్లపట్టీలు.. ఇన్ని అందాల కలబోత అయిన నా భాగ్యనగరం బంగారుకాంత..’ అంటూ రాగం అందుకున్నారు డాక్టర్ మంగళగిరి ప్రమీలాదేవి. ‘ఈ అందాల వెనుక అసలైన జీవితమూ ఉంది సుమా.. అది కనిపించనివ్వకుండా ఈ నగరం ఈ మధ్య హైటెక్ అట్టవేసుకుంది. ఊపిరాడని బూరుగు దూదిపై చలికాచుకుంటోందా డాంబికం. ఆ అట్ట తొలగి చూద్దుమా.. కదిలించే కథలు.. వ్యథలు’ అని సత్యాన్ని చెప్పే ప్రయత్నం చేసింది శైలజామిత్ర. జెట్ స్పీడ్ జవ్వనులు నగరంలో మహిళా పాత్ర.. అమోఘమంటూ ‘ఇంట్లో, ఆఫీసుల్లో.. బాధ్యతల్లో.. జెట్ స్పీడ్‌తో వెళ్లిపోతుంది. మల్టీటాస్క్కి స్టాండర్డ్ నిర్వచనాన్నిస్తోంది’ అని లక్కరాజు నిర్మల నేటి మహిళా రూపాన్ని వర్ణించారు. ‘ఇందులో స్త్రీ గొప్పదనం ఉంది.. అలా బతకడం నేర్పిస్తున్న సిటీ విశేషణమూ ఉంది. నగర జీవనంలో మగాడే సంపాదిస్తే గడవని పరిస్థితి.. అందుకే ఆమె విల్లుపట్టక తప్పట్లేదు. ఈ జీవనపోరులో విజయానికి ఈ నగరం రకరకాల అవకాశాలను చూపిస్తోంద’ని గిరిజారాణి వివరించారు. ‘వంట తప్ప ఇంకోటి తెలియని వనితలకూ సిటీ బతుకుదెరువు చూపిస్తోంది. అమృతంలాంటి చేతివంటతో ధనభాగ్యాన్నిఅందుకుంటోంది.. శుచి శుభ్రమైన కర్రీపాయింట్లతో రుచికరమైన పదార్థాలు వడ్డిస్తూ.. మెరిట్పాయింట్లు కొట్టేస్తోంది’ అని ముక్తాయింపునిచ్చారు డాక్టర్ మంగళగిరి ప్రమీలాదేవి. గతుకుల ప్రయాణం.. చెడులో మంచిని చూసుకోవడం.. విషాదంలో ఆనందాన్ని వెతుక్కోవడం.. నగరవాసులకే తెలిసిన విద్యేమో. ఇక్కడి పరిస్థితులు ఆ సర్దుబాటును నేర్పుతాయంటారు ఈ మహిళామణులు. నల్లతాచులా మెరిసే నున్నటి రోడ్లు .. హైదరాబాదీలను ఊరించే కల. అతుకులగతుకుల సిటీ దారులు.. ఎందరి డాక్టర్లకు కాసులు పండించాయో.. ఎందరు ఎముకల వైద్యులను నిపుణులుగా మార్చాయో..! ఎంతమంది తల్లులకు పురిటి ఖర్చులు మిగిల్చాయో..! అందుకే ‘నగరంరోడ్లు తల్లిలాంటివి.. ఆమెకు పురుడు పోస్తున్నాయి’ అని వ్యంగ్యంగా సెలవిచ్చారు శైలజామిత్ర. ‘సిటీల సిత్రాలు సూడవోయి గతుకుల రోడ్లమీద సిటుక్కున కూలవడితి’అని చెప్పి నవ్వించారు నిర్మల. ‘రోడ్డుపై స్పీడుబ్రేకర్లు.. నీకొచ్చే కష్టాలు! ఆగి సాగమని చెప్తాయ్!’ అంటూ కొనసాగించారామె. ‘ఇదేం హైదరాబాదో అర్థంకాదు.. రాత్రి పనిజేయాల.. పగలు నిద్రపోవాల’ అని సాఫ్ట్వేర్ మీద సెటైర్లు వేశారు. అనుబంధాల వేదిక.. అనుబంధాలు.. ‘నాణానికి అటూఇటూ లాంటివి. పక్కన ఎవరున్నారో పట్టించుకోకుండా మూసిన తలుపుల వెనుకే జీవితాలను వెళ్లదీసే తత్వం ఎంత ఉందో.. చిన్న కష్టమొచ్చినా పెద్దమనసుతో చెంతచేర్చుకునే ఆత్మీయతా అంతే ఉంది. ఇలాంటి ఆప్యాయతకు మల్కాజిగిరిలో ఉంటున్న మా ఫ్లాట్లే ఉదాహరణ’ అని ప్రమీలాదేవి అంటే ‘అసలేమీ పట్టించుకోనితనానికి గాంధీనగర్‌లోని మా వాడ నిదర్శనం’ అని మరోకోణాన్ని ముందుంచింది శైలజామిత్ర. ‘ఎక్కడైనా రెండూ ఉంటాయి. హిందూముస్లిం ఐక్యతకే ఐకాన్ అయిన హైదరాబాద్‌లో అనుబంధాలకు కొదువలేదు. కాస్మొపాలిటన్ కల్చర్‌కి నిదర్శనం సిటీయేనని.. మన దగ్గర జరిగే వినాయకచవితి, రంజాన్, క్రిస్మస్, ఓనం వంటి పండుగలు రుజువు చేయట్లేదా! వీటన్నింటినీ హైదరాబాద్ సెలబ్రేట్ చేసుకుంటది ఆనందంగా. ఇంతకు మించిన ఆప్యాయత, ఐక్యతలు ఎక్కడుంటాయి’ అని ముగించింది లక్కరాజు నిర్మల. ఆమె మాటను మిగిలినవాళ్లూ అంగీకరించారు. ..:: సరస్వతి రమ -
డ్రీమ్స్ అండ్ డ్రామాస్
అభినయ నేషనల్.. థియేటర్ ఫెస్టివల్..2014 వేదిక.. రవీంద్రభారతి పార్టిసిపెంట్స్: రూపాంత్ర (బెంగళూరు) పూర్భరంగ (అసోం) నమతుళువెర్ కళాసంఘటనె (మంగుళూరు) బనియన్ రిపర్టరీ థియేటర్ (మణిపురి) కళల కాణాచి హైదరాబాద్‌లో రంగస్థలానికి సంబంధించి ఘన చరిత్రే ఉంది. మోడర్న్ డేస్‌లో ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ప్రభావంతో నాటకం అవుటాఫ్ ఫోకస్‌గా మిగిలిపోయింది. అలాంటి డ్రామాను బతికించడానికి ఇలాంటి ఫెస్టివల్స్ ఆక్సిజన్‌గా పనికొస్తున్నాయి. ఈ నాటక పండుగకు వచ్చిన కొందరు కళాకారులు చెబుతున్న విషయాలు... పరిశీలన.. విశ్లేషణ అభినయ థియేటర్ నిర్వహిస్తున్న ఈ ఫెస్టివల్‌కి ఎవ్రీ ఇయర్ నా గ్రూప్‌తో వస్తున్నా. మాది బెంగుళూర్ బేస్డ్ గ్రూప్. అమెచ్యూర్ ఆర్టిస్ట్స్ ట్రూప్‌లో పాతికేళ్ల అనుభవం ఉంది. హైదరాబాద్ ఆడియున్స్ మంచి సెన్స్ ఉన్నవారు. కన్నడను బాగా ఆదరిస్తారు. నాటకాన్ని పరిశీలన, విశ్లేషణాత్మక దృష్టితో చూస్తారు. అరుుతే ఇక్కడ నాటకానికి ఆదరణ కాస్త తక్కువే. సినిమా ప్రభావం ఎక్కువ. కానీ ముంబై, ఢిల్లీ, కోల్కత్తా లాంటి సిటీస్‌తో పోల్చుకుంటే హైదరాబాద్ బెస్ట్ సిటీ. మంచి ఆతిథ్యం లభిస్తుందిక్కడ. - కేఎస్డీఎల్ చంద్రు, ‘చక్రరత్న’ నాటకం డెరైక్టర్ (రూపాంత్ర గ్రూప్) మెయిన్‌స్ట్రీమ్.. కమర్షియల్ ఈ ఫెస్టివల్ కోసం హైదరాబాద్ రావడం ఇది నాలుగోసారి. హైదరాబాద్‌తో అంతకుముందు నుంచే సంబంధం ఉంది. ఇక్కడి జనపదంతో కలిసి పనిచేశాను. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో థియేటర్ మీద జరిగిన వర్క్షాప్స్కీ అటెండ్ అయ్యా. బ్యూటిఫుల్ సిటీ. నాటకం.. మనిషిలో సోషల్ రెస్పాన్స్‌బిలిటీని పెంచుతుంది. ఇదో పవర్ఫుల్ మీడియం. అలాంటి థియేటర్.. హైదరాబాద్‌లో అంత యాక్టివ్‌గా లేదు. అసోంలో థియేటర్ వెరీ రిచ్. మెయిన్‌స్ట్రీమ్ అండ్ కమర్షియల్‌గా. - గుణకర్దేవ్ గోస్వామి, ‘మృగయా’ డెరైక్టర్ (పూర్భరంగ గ్రూప్) సినిమాకు రెండొందలు.. నాటకానికి ముప్పై నాకు హైదరాబాద్, తెలుగు థియేటర్‌తో మంచి రిలేషన్స్ ఉన్నాయి. తెలుగులో పాపులర్ అయిన బ్రహ్మరథ, మినిస్టర్ లాంటి నాటకాలను మణిపురిలో పబ్లిష్ చేశాం. నిజానికి తెలుగులో మంచి నాటకాలున్నాయి. ఆదరణే లేదు. మరాఠీ, బెంగాలీ, కన్నడతో పోల్చుకుంటే ఇక్కడ థియేటర్ మూవ్మెంట్ చాలా వీక్. కమర్షియల్ థియేటర్ అసలు కనిపించదు. సినిమాకు రెండువందల రూపాయల టికెట్ పెట్టయినా వెళ్తారు కానీ... నాటకానికి ముప్పై రూపాయల కూడా వెచ్చించరు. అలాగని ఇక్కడి ప్రేక్షకులకు థియేటర్ సెన్స్ లేదని కాదు. చూసే ఆ కొద్దిమందైనా అన్ని భాషల నాటకాలనూ ఆదరిస్తారు. ఆ అభిరుచే ఇంకా ఇక్కడ థియేటర్ బతికేలా చేస్తోంది. - ఎం.సి.తోయిబా, ‘అప్రెస్డ్ పీపుల్’ నాటకం డెరైక్టర్ (బనియన్ రిపర్టరీ థియేటర్) పదకొండో తారీఖున మొదలైన ఈ నాటకోత్సం పధ్నాలుగో తారీఖున ముగియనున్నది. కన్నడ, అస్సామి, తుళు, మణిపురి భాషలకు చెందిన నాటకాల ప్రదర్శనజరుగుతోంది. అభినయ థియేటర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సాగుతున్న ఈ ఉత్సవంలో తెలుగు నాటక ప్రదర్శన కూడా ఉంటే బాగుండేదని పలువురు నాటకాభిమానుల అభిప్రాయం! - శరాది -
అభినయ ఫెస్ట్
నాటి రాజుల కాలం నుంచి నేటి అధునాతన తరం అధికార కాంక్షవల్ల జరిగిన అనర్థాలను కళ్ల వుుందు ఆవిష్కరించింది ‘చక్రరత్న’ నాటకం. రవీంద్రభారతిలో సోమవారం ప్రారంభమైన ‘అభినయు నేషనల్ థియేటర్ ఫెస్టివల్’లో ప్రదదర్శించిన ఈ కన్నడ నాటకం విశేషంగా ఆకట్టుకుంది. బెంగళూరు ‘రూపాంతర’ ఆధ్వర్యంలో కేవై నారాయుణస్వామి రచించిన ఈ నాటకాన్ని అద్భుతమైన కాస్ట్యూమ్స్, హావభావాలతో జనరంజకంగా వులిచారు. కేఎస్డీఎల్ చంద్ర దర్శకత్వం వహించారు. ఏపీ మంత్రి పల్లె రఘునాథ్, అధికార భాషా సంఘం మాజీ సభ్యులు టి.గౌరీశంకర్ పాల్గొన్నారు. ఈ నెల 14 వరకు ఫెస్టివల్ కొనసాగుతుంది. -
ప్రతిభకు పురస్కారం..
‘జ్ఞానసరస్వతి’ సేవలు ప్రశంసనీయం రవీంద్రభారతిలో శనివారం జ్ఞానసరస్వతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. 121 మంది విద్యార్థినీ, విద్యార్థులు, ఐదుగురు హెచ్ఎంలు పురస్కారాలు అందుకున్నారు. సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థినీ విద్యార్థుల మంచి భవిష్యత్తు కోసం జ్ఞానసరస్వతీ ఫౌండేషన్ చేస్తున్న సేవలు ప్రశంసనీయం అని ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి తెలిపారు. శనివారం రవీంద్రభారతిలో జ్ఞానసరస్వతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అన్ని వైపుల నుంచి వికాసం ఉంటుందన్నారు. సమాజానికి, దేశానికి ఉపయోగపడే పౌరులుగా విద్యార్థులు ఎదగాలని చెప్పారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అవకాశాలు కల్పిస్తే ఎవరెస్ట్ ఎక్కిన పూర్ణ, ఆనంద్లాగా రాణిస్తారన్నారు. విద్యార్థుల్లో అన్ని సామర్థ్యాలు పెంపొందించేందుకు జ్ఞానసరస్వతీ ఫౌండేషన్ చేసే కృషి విలువకట్టలేనిదని తెలిపారు. హంపీ విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ విద్యారణ్యభారతి స్వామిజీ మాట్లాడుతూ భారతీయుల్లో ఆధ్యాత్మికత మెండు అని తెలిపారు. ఆంగ్లేయుడు మెకాలే ఆంగ్లవిద్యను దేశంలో ప్రవేశపెట్టి మన సంస్కృతిని నాశనం చేశారన్నారు. సమాజానికి ఉపయోగపడే విద్యను అందరూ అభ్యసించాలని తెలిపారు. జిల్లా విద్యాధికారి సోమిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి నిజాయితీతో చదవాలన్నారు. జిల్లా ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల భవిష్యత్తు కోసం జ్ఞానసరస్వతీ ఫౌండేషన్ వివిధ రకాల కార్యక్రమాలు చేస్తూ వారి ఉన్నతి కృషి చేస్తుందని చెప్పారు. జిల్లా జాయింట్ కలెక్టర్ చంపాలాల్ మాట్లాడుతూ జ్ఞానసరస్వతీ ఫౌండేషన్వారు ప్రతి సంవత్సరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను పొత్సహించేందుకు వివిధ రకాల కార్యక్రమాలు చేస్తూ, ప్రతిభా పురస్కారాలు అందజేయటం హర్షణీయమన్నారు. ఈ సందర్భంగా పదవ తరగతి ప్రతిభ చూపిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు 121 మంది విద్యార్థినీ-విద్యార్థులకు, జిల్లాలోని ఐదు మంది హెచ్ఎంలకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఆరవ తరగతి విద్యార్థినీ శ్రీహిత పాడిన వందేమాతర గీతం ఆకట్టుకుంది. సంధ్య, వైష్ణవీ, శారద, ఓంకార్‌ల నృత్యప్రదర్శలు ఆలరించాయి. కార్యక్రమంలో జిల్లా ఆర్వీఎం ప్రోగ్రాం ఆఫీసర్ కిషన్‌రావు, ప్రముఖ వ్యక్తిత్వ వికాసనిపుణులు ఆకెళ్ల రాఘవేంద్ర, యోగా గురువు శశిధర్, డిప్యూటీ ఈవో హరిచందర్, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘మార్పులు అందిపుచ్చుకోవాలి’
హైదరాబాద్: కంప్యూటర్ రంగంలో వచ్చే సరికొత్త మార్పులను అందిపుచ్చుకోవాల్సిన అవసరం నేటి యువతపై ఎంతైనా ఉందని ఏపీ పోలీసు అకాడమీ డెరైక్టర్ డాక్టర్ ఎం.మాల కొండయ్య తెలిపారు. జెట్‌కింగ్ అమీర్‌పేట్, దిల్సుఖ్నగర్ బ్రాంచ్‌ల పదవ వార్షికోత్సవం రవీంద్రభారతిలో ఆదివారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న మాలకొండయ్య మాట్లాడుతూ, టెక్నాలజీ నేడు ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైందన్నారు. జెట్‌కింగ్ వారు యువతకు కంప్యూటర్ రంగంలో శిక్షణ ఇవ్వటం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా జెట్‌కింగ్ సంస్థలో శిక్షణ తీసుకున్న అంధ విద్యార్థి నరసింహులు కంప్యూటర్లోని వివిధ భాగాలను వేరు చేసి, తిరిగి కలిపిన దృశ్యం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. పలువురు అతడిని అభినందించారు. చివర్లో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. -
అదరగొట్టిన ‘డ్యాన్స్’...
-
ఐడియల్ మహిళా డిగ్రీ కళాశాల వార్షికోత్సవం
-
రంగస్థల మకుటం!
కన్యాశుల్కం... గడియారం కంటే వేగంగా పరుగులు తీయాలంటున్న తరం ఇది. కాలాన్ని రోజులు, గంటలుగా లెక్కించడం మానేసి నిమిషాలు, సెకన్లుగా కొలవడం మొదలైంది. మూడు గంటల నిడివి ఉండే సినిమా రెండున్నర గంటలకు కుదించుకుపోయి దాదాపు నలభై ఏళ్లయింది. ఈ తరం యువత అయితే అరగంట నిడివితో సినిమా తీసేసి యూ ట్యూబ్‌లో పెట్టేస్తోంది. ఈ నేపథ్యంలో ఎనిమిది గంటల నిడివితో నాటకాన్ని ప్రదర్శించాలను కోవడమే ఓ సాహసం. అశేషాదరణ పొందిన ఆ సాహసం వెనుక ఉన్న హోమ్‌వర్క్ ఆరు నెలల అకుంఠిత దీక్ష! నియమనిబద్ధతలతో కూడిన గౌరవం!! ఫిబ్రవరి రెండవ తేదీ... హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి. కన్యాశుల్కం నాటకం ప్రదర్శితమవుతోంది. హాలు నిండిపోయింది. వరండాలలో సీసీ టీవీలు ఏర్పాటు చేసి మరీ నాటక ప్రదర్శన చేశారు. ప్రేక్షకుల ముఖాల్లో ఆనందం. 42 మంది నటులు, పాతికమంది సాంకేతిక నిపుణులకు తమ శ్రమకు తగిన ఫలితం దక్కిన అనుభూతి కలుగుతోంది. నాటక దర్శకులు శొంఠినేని కిశోర్ మాటల్లో నాటకం మీద ఆయనకున్న ఇష్టం కనిపిస్తోంది. ఆర్టిసిలో సీనియర్ అసిస్టెంట్‌గా రిటైర్ అయిన కిశోర్‌కి నాటకరంగంతో మూడున్నర దశాబ్దాల అనుబంధం. ఈ తరానికి ఒక గ్రంథం! గురజాడ 1892లో రాసిన కన్యాశుల్కం నాటకాన్ని యథాతథంగా ప్రదర్శించాలనే ఆలోచనకు బీజం 2011లో పడింది అంటారాయన. ‘‘గురజాడ వారి 149వ జయంతి సందర్భంగా మూడున్నర గంటల నాటకాన్ని ప్రదర్శించాలనే ఉద్దేశంతో నాటకాన్ని ఎడిట్ చేసివ్వమని నన్ను అడిగారు ఆ నిర్వహకులు. ఆ స్క్రిప్టుని మూడు నెలల పాటు అధ్యయనం చేశాను. దీనిని యథాతథంగా ప్రదర్శించినప్పుడే ఈ నాటకానికి న్యాయం జరుగుతుంది. ఇందులో ఈ తరం తెలుసుకోవాల్సిన విషయాలెన్నో ఉన్నాయనిపించింది. ఆ సంగతి విజయనగరం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రకటించాను. పాత్రధారుల ఎంపిక! నటులకు నాటకం మీద ఆసక్తితోపాటు ఎనిమిది గంటల సేపు స్టేజి మీద నిలబడగలిగిన, డైలాగ్ చెప్పగలిగిన శక్తి కూడా ఉండాలి. పాత్రధారుల ఎంపికకు నెలరోజులు పట్టింది. ఏడు అంకాలను ఏకనిడివిన రిహార్సల్స్ చేస్తూ పోతే టైమ్ సరిపోదు. కాబట్టి ఏకకాలంలో నాలుగైదు చోట్ల రిహార్సల్స్ చేసేవాళ్లం. అలా ఆరునెలల శ్రమ తర్వాత తొలి ప్రదర్శన ఇచ్చాం’’ అన్నారు కిశోర్. అలనాటి నేపథ్యం కోసం... నూట ఇరవై ఏళ్ల కిందటి దుస్తులు, చెప్పులు, వస్తువులు... ఇలా ప్రతి ఒక్కటీ కీలకమే. ‘‘అగ్గిపెట్టెలు తయారు చేయడం, కరెన్సీ సేకరించడం, దర్జీ దగ్గర కూర్చుని దుస్తులు డిజైన్ చేయించడం, చెప్పులు... ఇలా ప్రతిదీ తయారు చేసుకున్నాం. స్కూళ్లలో, కొందరి ఇళ్లలో ఉన్న ఆ కాలం కుర్చీలు, మేజాలు సేకరించాం. పందిరిమంచం చాలా కష్టమైంది. ఒకరి ఇంట్లో ఉందని తెలిసి వారిని అడిగితే వెంటనే ఇచ్చారు. కానీ మాకు మంచం ఇచ్చి వాళ్లు కింద పడుకుంటున్నారని తెలిసి వాళ్లకు కొత్త మంచం కొనిచ్చాం. వీటి సేకరణ ఇలా ఉంటే నాటక ప్రదర్శన జరిగే చోటుకి ఈ వస్తువులను తరలించడం పెద్ద పని. వీటి రవాణాకే ఇరవై వేలు ఖర్చయింది. నాటకంలోని 39 సీన్లకు 20 కర్టెన్లను తయారు చేసుకున్నాం. రవీంద్రభారతిలో ప్రదర్శనకు ఖర్చు మూడు లక్షలు. శ్రద్ధగా చేశాం, అంతటి ఆదరణ లభించింది’’ అంటారు కిశోర్. నాటకానికి ఆదరణ లేదనే అపవాదును కొట్టిపారేస్తూ... ‘‘సినిమా, టీవీ, నాటకరంగం... మూడూ మూడు కోణాలు. దేని ఆదరణ దానికి ఉంటుంది. అయితే నాటకాన్ని ప్రకటించిన సమయానికి మొదలు పెట్టకపోతే ప్రేక్షకులు విసుగుచెందుతారు’’ అంటారాయన. తొలి ప్రదర్శన విశాఖలో... గురజాడ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా 2012 సెప్టెంబరులో విశాఖపట్నంలో ఇచ్చిన ప్రదర్శన మొదటిది. ‘‘ఆ ప్రదర్శన చూసిన వాళ్లకంటే కూర్చోవడానికి స్థలం లేక వెనక్కి వెళ్లిన వాళ్లే ఎక్కువ. అలాగే విశాఖ స్టీల్‌ప్లాంట్, ఎన్ఎస్టిఎల్, విజయవాడ, విజయనగరం ప్రదర్శనలకు కూడా మంచి ఆదరణ లభించింది. ఇక హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన ప్రదర్శన వర్ణించనలవి కాదు. గురజాడ గారి మీద అభిమానంతో ఈ నాటక ప్రదర్శనకు తోడ్పాటునందిస్తున్న వెలుగు రామినాయుడు, చలసాని ప్రసాద్‌లు కూడా ఆనందించిన క్షణం అది’’ అన్నారు కిశోర్ సంతృప్తిగా. మన సినీనటుల్లో ఎక్కువ మంది నాటకరంగం నుంచి వచ్చినవారే. ఈ తరం నటులు కూడా థియేటర్ ఆర్ట్స్ కోర్సు చేసి వెండితెరకు పరిచయమవుతున్నారు. నసీరుద్దీన్ షా, మనోజ్ బాజ్‌పేయి, అనుపమ్‌ఖేర్ వంటి బాలీవుడ్ నటులు రంగస్థలం మీద నటించి మురిసిపోతున్నారు. త్వరలో ఈ ట్రెండ్ మన దగ్గరా రావచ్చు. మనకు కన్యాశుల్కమే కాదు, రాగరాగిణి, రసరంజని... ఇలా ఆణిముత్యాల్లాంటి ఎన్నో నాటకాలు ఉన్నాయి. ఆ నాటకాలను కూడా ఈ తరానికి పరిచయం చేసేందుకు కృషి జరిగితే బావుంటుంది. - వాకా మంజులారెడ్డి ప్రణాళిక ఉంటే... ఎనిమిది గంటల కన్యాశుల్కం నాటకాన్ని మధ్యాహ్నం రెండుకు మొదలు పెట్టి మధ్యలో రెండు విరామాలతో రాత్రి పదింటికి పూర్తి చేసేవాళ్లం. ఉపాహారం అందుబాటులో ఉంచేవాళ్లం. ప్రేక్షకులు ఇంటి దగ్గర భోజనం చేసి వస్తారు, రాత్రి భోజనానికి ఇంటికి వెళ్తారు. నాటకం వేయడానికి సమయపాలన, స్క్రిప్టు ఎంపిక, వేదిక ఎంపిక, ప్రదర్శన సమయాలు ముఖ్యం. అప్పుడు ఈ వందేళ్లే కాదు, మరో వందేళ్లయినా నాటకాన్ని జనరంజకంగా ప్రదర్శించవచ్చు. - శొంఠినేని కిశోర్ కన్యాశుల్కం నాటక దర్శకులు -
భరతనాట్యం.. దేశానికి వరం
సాక్షి, సిటీబ్యూరో: భరతనాట్యం దేశానికి వరమని హైకోర్టు జస్టిస్ నూతి రామ్మోహనరావు తెలిపారు. మంగళవారం రవీంద్రభారతిలో అభినేత్రి ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన ‘ప్రణామ్’ కార్యక్రమంలోని ఆయన పాల్గొని ప్రసంగించారు. పాశ్చాత్య పెనుగానులు వీస్తున్న తరుణంలో భారతీయ విలువలు ఎక్కడ కొట్టుకపోతాయేనని భయం భయంగా ఉండేదని.. తొమ్మిది మంది చిన్నారుల నృత్యం చూసిన తర్వాత కొంత ధైర్యం వచ్చిందన్నారు. మంజులా శ్రీనివాస్ శిష్యగణం చేసిన దశావతారాల ప్రదర్శన మహాద్భుతంగా సాగిందన్నారు. పిల్లలు చేసిన శ్రీకృష్ణాభినయం తనను ఎక్కడికో తీసుకెళ్లిందన్నారు. అనంతరం నృత్యగురువు మంజులా శ్రీనివాస్‌ను జస్టిస్ నూతి రామ్మోహనరావు సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. ప్రమోద్ కుమార్ రెడ్డి, సుందరి, నర్సింగరావు, మాధవి, రాధారాణి, సాయిశ్రీ, భవాని, అరుణజ్యోతి , శృతి తదితరులు గురువు మంజులాశ్రీనివాస్ను ఘనంగా సత్కరించారు. అంతకుముందు తొమ్మిది మంది కళాకారులు ప్రమోద్ కుమార్ రెడ్డి సారధ్యంలో గురువందనమ్లో భాగంగా చేసిన చంద్రచోడ, థిల్లానా, మహాలక్ష్మి అష్టకంపై చేసిన నృత్యరూపకాలు ఆకట్టుకున్నాయి. గాయని శ్వేతా ప్రసాద్, గాయకుడు శ్రీనివాస్‌లను జస్టిస్ నూతి రామ్మోహనరావు అభినందించారు. ఈ కార్యక్రమంలో నృత్యకారిణి చిత్ర, నృత్యకారుడు ప్రమోద్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘నాటా’ సేవా డేస్
-
నన్ను పెళ్లికూతురిని చేసింది సావిత్రే
హైదరాబాద్: తనను పెళ్లి కూతురిగా అలంకరించింది మహానటి సావిత్రి అక్కేనని ప్రముఖ సినీనటి జమున గుర్తు చేసుకున్నారు. సావిత్రి పేరుతో ఏర్పాటు చేసిన అవార్డును అందుకునే మొదటి అర్హత తనకే ఉందన్నారు. శ్రుతిలయ ఆర్ట్స్ అకాడమి ఆధ్వర్యంలో గురువారం రాత్రి రవీద్రభారతిలో ప్రజానటి జమునను ‘మహానటి సావిత్రి ఆత్మీయ పురస్కారం’తో సత్కరించారు. ఈ సందర్భంగా జమున మాట్లాడుతూ.. జీవితం మన చేతుల్లో లేదని, ఎలా కలుస్తామో.. ఎలా విడిపోతామో తెలియదన్నారు. సావిత్రి సమస్యల వలయంలోకి చిక్కుకోవటం బాధాకరమన్నారు. ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు మాట్లాడుతూ.. రవీంద్రభారతి అద్దె పెంపుపై కళా సంస్థల నిర్వాహకులు కలిసివస్తే సీఎంతో మాట్లాడించి తగ్గించే ప్రయత్నం చేస్తానన్నారు. రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ పి.విజయబాబు మాట్లాడుతూ అభినయానికి నిదర్శనం సావిత్రి, జమునలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సమాజ్‌వాది పార్టీ మహిళా అధ్యక్షురాలు జి.నాగలక్ష్మికి ‘సేవా శిరోమణి పురస్కారం’ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆమని పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో శృతిలయ చైర్మన్ ఆర్.ఎన్.సింగ్, వ్యవస్థాపక కార్యదర్శి ఆమని తదితరులు పాల్గొన్నారు. -
పేదల స్థిరత్వానికే భూపంపిణీ: కిరణ్‌కుమార్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: పేదలకు స్థిరత్వం, గుర్తింపు కల్పించేందుకే సేద్యయోగ్యమైన భూమిని పంచాలని భూపంపిణీ కార్యక్రమం చేపట్టామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. రాజధాని నగరంలోని రవీంద్రభారతిలో శుక్రవారం మధ్యాహ్నం ఏడో విడత భూ పంపిణీ కార్యక్రమ ప్రారంభోత్సవంలో ఆయన ప్రసంగించారు. గోదావరి, కృష్టా నదుల నుంచి సముద్రంపాలవుతున్న నీటిని ప్రాజెక్టుల ద్వారా సద్వినియోగం చేసుకుంటే రాష్ట్రంలో ఎకరా కూడా బీడుకాబోదని సీఎం అన్నారు. జలయజ్ఞం కింద ఇప్పటి వరకూ చేసింది సగమేనని, చేయాల్సింది ఇంకా సగం మిగిలే ఉందని ఆయన తెలిపారు. ‘ఇప్పటికీ మన రాష్ట్రంలో 65 నుంచి 70 శాతం మంది ప్రజలు వ్యవసాయరంగంమీదే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ప్రతి ఏటా గోదావరి నుంచి 5 వేల టీఎంసీలు, కృష్ణా నుంచి 500 టీఎంసీల నీరు వృథాగా సముద్రం పాలవుతోంది. ఒక టీఎంసీ నీరు పదివేల ఎకరాల సాగుకు సరిపోతుంది. వృథా అవుతున్న నీటిని సద్వినియోగం చేసుకోవాల్సి ఉంద’న్నారు. దీంతో వ్యవసాయంతోపాటు దాని అనుబంధ రంగాలైన పౌల్ట్రీ, పాడిపరిశ్రమల వంటి వాటితో రైతులకు లాభం కలుగుతుందన్నారు. అసైన్డ్ భూములకూ బ్యాంకు రుణాలు... ప్రభుత్వం నుంచి పొందిన అసైన్డ్ భూములకు (డీకేటీ పట్టాలకు) కూడా బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోం దని, ఈ వారంలో జరిగే రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) సమావేశంలో దీనిపై సీఎం మార్గనిర్దేశం చేస్తారని రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. ఈ నెలాఖరులోగా 1.25 లక్షల ఎకరాల భూమిని 80 వేల మందికి పంపిణీ చేస్తామని, తర్వాత వ్యవసాయ యోగ్యమైన భూమి ప్రభుత్వం వద్ద ఉండదని, ఇదే చివరి విడత భూ పంపిణీ అవుతుందని మంత్రి పేర్కొన్నారు. మంత్రులు ముఖేశ్ గౌడ్, ప్రసాద్ కుమార్, శాసనసభ్యులు కె.లక్ష్మారెడ్డి, సుధాకర్, ఎమ్మెల్సీ రంగారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్, నల్లగొండ జిల్లాలకు చెందిన కొందరికి భూమిపట్టాలతోపాటు పట్టాదారుపాసుపుస్తకాలు, టైటిల్‌డీడ్స్ అందజేశారు. సర్కారు భూమి వెబ్సైట్ ప్రారంభం వివిధ రకాల ప్రభుత్వ భూముల వివరాలు తెలియజేసే ‘సర్కార్ భూమి’ వెబ్‌సైట్‌ను సీఎం ప్రారంభించారు. కొత్తగా నిర్మించిన రాష్ట్ర భూ పరిపాలన విభాగం ప్రధాన కమిషనర్ కార్యాలయ భవనాన్ని కూడా ఆయన ప్రారంభించారు. తర్వాత సీఎం ఈ వెబ్సైట్ ద్వారా భూముల సమాచారం ఎలా పొందవచ్చో అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీఎంచే నేడు పులిచింతల ప్రారంభం విజయవాడ: కృష్ణాడెల్టా రైతుల చిరకాలవాంఛ అయి న పులిచింతల ప్రాజెక్టును శనివారం సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి జాతికి అంకితం చేస్తారని మంత్రి పార్థసారథి విజయవాడలో చెప్పారు. సీఎం ఉదయం గుంటూరు జిల్లా పులిచింతల వద్ద పైలాన్‌ను ఆవిష్కరిస్తారని, మధ్యాహ్నం విజయవాడలో బహిరంగసభలో పాల్గొంటారని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు కె.ఎల్.రావు ప్రాజెక్టుగా పేరుపెట్టినట్లు చెప్పారు. -
భూ పంపిణీపై గందరగోళం!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం చిట్టచివరిదిగా పేర్కొంటున్న ఏడో విడత భూ పంపిణీపై గందరగోళం నెలకొంది. శుక్రవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో భూ పంపిణీని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభిస్తారని, ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి సహా పలువురు మంత్రులు పాల్గొంటారని సీఎం కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. భూమిలేని పేదలకు పంపిణీ కోసం 1.30 లక్షల ఎకరాలను గుర్తించినట్లు రెవెన్యూ శాఖ వర్గాలు కూడా ప్రకటించాయి. కానీ జిల్లాల్లో అలాంటి పరిస్థితి కన్పించడం లేదు. ఇప్పటివరకు అనేక నియోజకవర్గాల్లో అసైన్మెంట్ కమిటీ సమావేశాలు జరగలేదు. అంటే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తికానట్లే. కృష్ణా జిల్లాలో 16 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా ఒక్క నియోజకవర్గంలో కూడా ఏడో విడత భూ పంపిణీకి సంబంధించి కమిటీ సమావేశాలు జరగలేదు. చిత్తూరు జిల్లాలో 5,400 ఎకరాల భూమిని పేదలకు పంపిణీ కోసం గుర్తించినా ఒక్క నియోజకవర్గంలోనూ కమిటీ సమావేశం జరగకపోవడం గమనార్హం. మెదక్ జిల్లాలోని సగం నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి. కరీంనగర్ జిల్లాలో ఒక్క జగిత్యాలలోనే అసైన్మెంట్ కమిటీ సమావేశం జరిగింది. వైఎస్సార్ జిల్లాలోనూ సగం నియోజకవర్గాల్లో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తికాలేదు. మరోవైపు ఏడో విడత భూ పంపిణీకి సంబంధించి ఇప్పటివరకు తమకు షెడ్యూలే రాలేదని జిల్లా కలెక్టర్లు అంటున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సీఎం చేతుల మీదుగా భూ పంపిణీ లాంఛనంగా మాత్రమే ప్రారంభం కానుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా, భూ పంపిణీపై ప్రభుత్వం గోప్యంగా వ్యవహరిస్తోంది. సీఎం చేతుల మీదుగా శుక్రవారం డి.ఫారం పట్టాలు తీసుకోనున్న లబ్ధిదారుల జాబితాను అధికారులు రహస్యంగా ఉంచారు. మెదక్ జిల్లా నుంచి 30 మందిని ఎంపిక చేసిన అధికారులు వారి పేర్లు వెల్లడించలేదు. రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో భూ పంపిణీ కార్యక్రమ వేదిక వద్ద ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకే ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిసింది. -
హ్యూమరం: రాజకీయ నాటకం
రవీంద్రభారతిలో రాజకీయ నాటకోత్సవాలు. కిరణ్‌కుమార్‌రెడ్డిని, చంద్రబాబుని ముఖ్య అతిథులుగా పిలిచారు.చంద్రబాబు మైక్ తీసుకున్నాడు: ‘‘మొహానికి రంగేస్తే నాటకం. రంగు లేకుంటే రాజకీయం. నాటకం లేకుండా రాజకీయం లేదు. రాజకీయం లేకుండా నాటకం ఉండొచ్చు. ప్రేక్షకులున్నా లేకపోయినా నాటకం ఆగకూడదు. ఎవరి నటనకు వాళ్లే చప్పట్లు కొట్టుకుని, అవార్డులు ప్రకటించుకుంటే పాలిటిక్స్‌లో పైకొస్తాం. వెనుకటికి రోజుకో నాటకం ఆడేవాళ్లం. ఇప్పుడు గంటకో నాటకం ఆడితేనే ప్రజలకు వినోదం. రాజకీయాలు, నాటకాలు కలిసిపోయిన తరువాత జనం అసలు నాటకాలను చూడటం మానేశారు. కానీ రాజకీయం బతికున్నంతకాలం నాటకం బతికుంటుందని, ఆ విధంగా ముందుకు పోవాలని కోరుకుంటున్నాను’’ అని ముగించాడు. కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ, ‘‘నాటకాల్లో చంద్రబాబు సీనియర్. ఆయన మా తండ్రిగారి హయాం నుంచి నాటకాలు ఆడుతున్నారు. అందువల్ల గత రెండేళ్ల నుంచి ఆయనతో శిక్షణ పొంది, రకరకాల నాటకాలతో జనాల్ని చల్లబరుస్తున్నాను. నా డెరైక్షన్ మేరకు ఆయన డైలాగులు చెబుతున్నాడు. ఆయన దర్శకత్వంలో నేను యాక్షన్ చేస్తున్నాను. ప్రభుత్వం పడిపోకుండా ప్రతిపక్ష నేత కాపాడటమే అన్నిటికంటే గొప్ప డ్రామా’’ అన్నాడు. హఠాత్తుగా చిరంజీవి రంగప్రవేశం చేసి, ‘‘నన్ను పిలవకుండా నాటకోత్సవాలు జరపడం అన్యాయం. వాళ్లిద్దరికీ ఏది నాటకమో ఏది రాజకీయమో తెలుసు. నాకు తెలియదు. అందుకే రంగు పూసుకుని రాజకీయాల్లోకి వచ్చేసరికి రంగు పడింది. తెరపై నటిస్తే చప్పట్లు కొట్టిన జనం, రాజకీయాల్లో నటిస్తే తెర ఎందుకు దించారో తెలియదు’’ అన్నాడు. నిర్వాహకులు వచ్చి, ‘‘జనాన్ని మరిచిపోయి టూరిజానికి అలవాటు పడిన కేంద్రమంత్రి చిరంజీవి అర్జెంట్‌గా టూర్ వెళ్లాల్సి ఉన్నందువల్ల, మొదట ఏకపాత్రాభినయం చేస్తారు’’ అని ప్రకటించారు. చిరంజీవి స్టేజీమీదకొచ్చి అయిదు నిమిషాల పాటు పెదాలు కదిలించాడు. ‘సౌండ్’ అని జనం అరిచినా పట్టించుకోలేదు. ‘‘సౌండ్లు, రీసౌండ్లు ఆయనెప్పుడో మరిచిపోయి సెలైంట్‌గా మారిపోయారు. ఏం మాట్లాడితే జనంతో ఏం ప్రమాదమోనని మూకాభినయం చేసి వెళ్లిపోయారు’’ అని నిర్వాహకులు వివరణిచ్చారు. తరువాత కృష్ణుడి వేషంలో చంద్రబాబు, అర్జునుడి వేషంలో కిరణ్‌కుమార్‌రెడ్డి వచ్చారు. రావడం రావడమే ‘ఇచ్చోటనే...’ అని పద్యం ఎత్తుకున్నాడు చంద్రబాబు. ‘‘సార్! మీరు వేసింది కృష్ణుడి వేషం. పాడుతున్నది హరిశ్చంద్ర పద్యం’’ అని నిర్వాహకులు సరిచేయడానికి ప్రయత్నించారు. ‘‘వేషానికి తగిన పద్యం, సందర్భానికి తగినట్టు సంభాషణలు చెప్పడం నా డిక్షనరీలోనే లేదు’’ అన్నాడు బాబు. వెంటనే కిరణ్‌కుమార్‌రెడ్డి ‘ధారుణి రాజ్యసంపద’ అని ఢిల్లీకి తొడగొట్టి పద్యం పాడాడు. నిర్వాహకులొచ్చి, ‘‘వాళ్లు రోజుకో రకం నాటకం ఆడ్డం వల్ల పాత్రలు, పద్యాలు మరిచిపోయారు. ఈసారి ఎన్నికల్లో సినిమా చూపించి వాళ్ల నాటకాన్ని బంద్ చేయండి’’ అని విన్నవించుకున్నారు. - జి.ఆర్.మహర్షి మహర్షిజం అనంతపురం సామెత: నక్కను నమ్మిన సింహం, సింహాన్ని నమ్మిన జింక రెండూ ఒకటే! పల్నాడు సామెత: సింహాన్ని భయపెట్టాలంటే ముందు తోడేలుని చంపాలి. తెలుగు తమ్ముని ఆవేదన: కోళ్లబుట్టలో చేయి పెడుతున్నాననుకుని మా చంద్రబాబు తేళ్లబుట్టలో చేయిపెట్టాడు. దురదృష్టం: పులి ఎదురైనప్పుడు బుల్లెట్ల కోసం వెతుక్కోవడం! నెల్లూరు సామెత: ఆరు నూరయ్యే వరకు నోరు మూసుకోకూడదు. చిత్తూరు సామెత: మేకను నరకడానికి ముందు మెడ నిమరాలి! -
పరిపూర్ణ వ్యక్తి పద్మశ్రీ పుట్టపర్తి నారాయణచార్యులు
సాక్షి, హైదరాబాద్: పద్మశ్రీ డాక్టర్ పుట్టపర్తి నారాయణాచార్యులు పరిపూర్ణమైన వ్యక్తిత్వంగల మహనీయుడని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ అన్నారు. గురువారం రాత్రి రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సాహితీ మూర్తిత్రయ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు డాక్టర్ పుట్టపర్తి నారాయణచార్యులు శతజయంతి మహోత్సవ వేడుకలు జరిగాయి. రవీంధ్రభారతీ ప్రధాన వేదికపై ఈ వేడుకల్లో డాక్టర్ పుట్టపర్తి నారాయణాచార్యులు పురస్కారాన్ని ప్రముఖ అవధాని డాక్టర్ మేడసాని మోహన్‌కు బహూకరించారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎల్లూరి శివారెడి ్డ అధ్యక్షతన జరిగిన వేడుక లకు జస్టిస్ బి.చంద్రకుమార్ ముఖ్యఅతిధిగా హాజరై ప్రసంగించారు. డాక్టర్ పుట్టపర్తి నారాయణచార్యులు గొప్ప కవి, పండితుడు, సాత్వికుడే కాకుండా చాలా గొప్ప ఆధ్యాత్మికవేత్త అని కీర్తించారు. ఎల్లూరి శివారెడ్డి మాట్లాడుతూ భౌగోళికంగా రాష్ట్రం రెండుగా విడిపోయినా.. సాహితీ పరంగా కలిసే వుంటాయని పేర్కొన్నారు. పుట్టపర్తి నారాయణాచార్యులు రచించిన పద్య, గేయ కావ్యాల్లోని రచనలను క్రోడీకరించిన వెయ్యి పేజీల సంపుటాన్ని ముద్రిస్తామని రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ రాళ్లబండి కవితాప్రసాద్ చెప్పారు. నారాయణాచార్యుల కాంస్య విగ్రహాన్ని కడప నగరంలో ప్రతిష్టిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో చారిత్రక నవలాచక్రవర్తి ఆచార్య ముదిగొండ శివప్రసాద్, అక్కినేని నాటక కళాపరిషత్ అధ్యక్షుడు సారిపల్లి కొండలరావు, పుట్టపర్తి కుమార్తె డాక్టర్ నాగపద్మిని, సాహితీవేత్త ఓలేటి పార్వతీశం తదితరులు పాల్గొన్నారు. అంతుకుముందు డాక్టర్ అనుపమ కైలాష్ ప్రదర్శించిన శివతాండవం కూచిపూడి నృత్యరూపకం అందరినీ ఆకట్టుకుంది. -
సమ్మోహనం..
ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్(ఐసీసీఆర్), సూత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ద కొర్జో థియేటర్ సహకారంతో గురువారం నిర్వహించిన నృత్య సమ్మేళం ప్రేక్షకులను కట్టిపడేసింది. రవీంద్ర భారతి వేదికపై సాగిన ఈ కార్యక్రమానికి రామిల్ ఇబ్రహీం దర్శకత్వం వహించగా, కల్పనా రఘురామన్ కొరియోగ్రఫీ అందించారు. -
సాంస్కృతిక శాఖపై దండెత్తిన ఒగ్గు కళాకారులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సాంస్కృతిక శాఖ కార్యాలయంపైకి ఒగ్గు కళాకారులు దండెత్తారు. దీంతో సోమవారం రవీంద్రభారతి ప్రాంగణంలోని రాష్ట్ర సాంస్కృతిక శాఖ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాష్ట్రంలోని ఓ ప్రాంతానికి చెందిన ఒగ్గు కథ కళాకారులకు అక్టోబర్ 7, 8 తేదీల్లో వర్క్‌షాపును ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర సాంస్కృతిక శాఖ అధికారులు సమాచారం ఇచ్చారు. ఆ మేరకు వారు రవీంద్రభారతికి వచ్చేందుకు రవాణా ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే 5వ తేదీన వర్క్‌షాపు రద్దు చేస్తున్నట్లు సమాచారం అందించారు. అప్పటికే రవాణాకి కొంత మొత్తం వెచ్చించిన 132 మంది కళాకారులు సోమవారం ఉదయం 11.30కి రవీంద్రభారతికి చేరుకున్నారు. ఒగ్గు కథ, గొరవయ్యలు, తప్పెటగుళ్ళు కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.సత్యనారాయణ, నాగరాజు ఆధ్వర్యంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు కార్యాలయం ఎదుట బ్యాండ్, డోల్, నపీరాలు వాయిస్తూ ధర్నాకు దిగి గంటపాటు ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు అక్కడి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. అనంతరం రాష్ట్ర సాంస్కృతిక శాఖ డెరైక్టర్ ఆర్.కవితాప్రసాద్ మాట్లాడుతూ నవంబర్ చివరిలో ఒగ్గు కళాకారుల వర్క్‌షాపు నిర్వహించనున్నామన్నారు. -
అవధానం: కవిసింహుని కాఫీ దండకం!
పటాన్‌చెర్వు వాసి ‘కొలచెల్మ’ తొలి అవధాని! మహాకవి కాళిదాసు సాహిత్యాన్ని వివరిస్తూ వ్యాఖ్యానం రాసిన వ్యక్తి కొలచెల్మ మల్లినాథసూరి. ఆయన పరిచయం లేకపోతే బహుశా తెలుగు వారికి కాళిదాసు తెలిసి ఉండేవారు కాదు. నేటికీ ఆయన వ్యాఖ్యానమే కాళిదాసు సాహిత్యానికి ప్రామాణికం. వీరి తాతగారు కూడా మల్లినాథసూరే (క్రీ.శ.1295-1323)! ఆయన రుద్రమదేవికి పూర్వుడు కాకతీయ ప్రతాపరుద్రుని ఆస్థాన కవి. కాకతి ప్రతాపరుద్రుడు కొలిచెల్మకు కనకాభిషేకం చేసిన వైనాన్ని ఒక శ్లోకం తెలియజేస్తుంది. కొలచెల్మాన్వయాబ్దీందు మల్లినాథో మహాశయా శతావధాన విఖ్యాతో వీరరుద్రాభివర్షితం ఈ శ్లోకం తెలుగువారి శతావధానాలకు సంబంధించిన తొలి ఆధారం. ‘కొలిచెల్మ’ వారు మెదక్‌జిల్లా పఠాన్‌చెర్వు ప్రాంతం వారని అందరూ అంగీకరిస్తోన్న అంశం. తాపీకి కవిసింహుడి కాఫీ దండకం! ప్రబంధయుగం తర్వాత ఆధునిక యుగంలో ప్రత్యర్థి కావ్యం రచించిన కవి, పోకూరి కాశీపతి (1892-1974) మాత్రమే! ఆస్వాదించగల శక్తిని బట్టి ఆయన విరచిత ‘సారంగధరీయం’లో పార్వతీకల్యాణం-తారా శశాంకం-సారంగధరీయం పాఠకులను అలరిస్తాయి. ‘సారంగధరీయా’న్ని 1939లో అంకితంగా తీసుకున్న గద్వాల సంస్థానాధీశులు సీతారామ భూపతిరావు కాశీపత్యావధానులకు గండపెండేరం తొడిగారు. గజారోహణం చేయించారు. ‘కవిసింహం’ బిరుదునిచ్చి గద్వాల సంస్థాన ఆస్థాన కవిగా గౌరవించుకున్నారు. పోకూరి నివసించే గుంటూరు జిల్లాలోని మాచర్లకు మహబూబ్‌నగర్ జిల్లాలోని గద్వాల నుంచి సంస్థాన మర్యాదలతో పల్లకీ వచ్చేది. ‘కవిసింహం’ 1920 ప్రాంతంలో చెన్నపట్టణం (చెనై్న)లో అష్టావధానం చేశారు. అందులో ఒక పృచ్ఛకులైన తాపీ ధర్మారావుగారు కాఫీపై దండకం చెప్పమన్నారు. పోకూరి వారు ఆశువుగా చమత్కారాలతో చెప్పిన దండకం దిగువ పరిశీలించండి. ‘తెలుగు భాషా సాంస్కృతిక వికాస సంవత్సరం-2013’ సందర్భంగా రాష్ట్ర సాంస్కృతిక శాఖ నూరురోజుల సాంస్కృతికోత్సవాలను నిర్వహిస్తోంది. రవీంద్రభారతిలో అవధాన సప్తాహంతో ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. వేదికకు ‘కొలచెల్మ మల్లినాథుడు’ పేరు పెట్టారు. ఏమిటి విశేషం? ఈ ప్రశ్నకు సమాధానంగా తెలుగువారి అవధాన పరంపరకు సంబంధించిన ఆసక్తికర విషయాలను వివరించారు స్వయంగా అవధాని, అవధానంపై పరిశోధన చేసిన రాష్ట్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి డా రాళ్లబండి కవితాప్రసాద్. శ్రీమన్మహాదేవి... లోకేశ్వరీ! కాళికా సన్నిభాకారిణీ లోక సంచారిణీ అంబ కాఫీ జగన్మోహినీ తొల్లి శ్రీకృష్ణుడాస్వర్గమున్ జేరి పూతంబ పారిజాతంబున్ తెచ్చియున్ నాతికిన్ ప్రీతిగానిచ్చుకాలంబు నందు ఆ సుమంబునందునం గల్గు బీజంబు ఉర్వీస్థలిన్ రాలియున్ లోక బేధంబుజే కాఫి భూజంబుగా పుట్టియున్ కొమ్మలన్ రెమ్మలన్ బూవులన్ తావులన్ జక్కనౌపిందెలన్ జిక్కినౌ కాయలన్ చొక్కమౌ బండ్ల భాసిల్ల దద్బీజజాలంబు ఐర్లండు నింగ్లండు హాలెండు పోలెండు రష్యా జపాన్ జర్మనీ గ్రీకు దేశంబులన్ నాటి పెన్ మాకులై ఇండియాన్ తోటలై విత్తనాలిచ్చుచున్నావటంచున్ మదించోడిన్ బాపురే తీపిలో నీరమున్ క్షీరమున్ చక్కెరన్ మించుటన్ గాదె నీ బీజ చూర్ణంబు ఆ మూటిలో జేర్చి సేవించుటన్ నీదు బీజంబునన్ బెంచులో మాడ్చి చూర్ణంబు గావించినన్ తీపి పోదాయె నీ మాధురీ శక్తి నీ యింపు నీ సొంపు నీ పెంపు వర్ణింప నేనెంతవాడన్ ధనాకర్షిణీ ప్రాణసంరక్షిణీ ధాత్రినెవ్వారలేన్ వేకువన్ లేచియున్ నిత్యకృత్యంబులన్ దీర్చి మున్ముందుగా నిన్ని పానంబు గావింపకున్నన్ ద్విజుల్ వేదమంత్రంబులున్ పల్కగాలేరు ప్రాంచత్కవుల్ పద్యంబుల్ హృద్యమౌరీతి నిర్మింపగా లేరు శిల్పులు శౌరి దాసుల్ గళంబునెత్తియున్ బాడి నృత్యంబులన్ చేయగా లేరు శిల్పుల్ మనస్ఫూర్తిగా సుత్తి చేపట్టగా లేరు వైశ్యోత్తముల్ కొట్ల తాళంబులన్ తీయగాలేరు డ్రైవర్లు స్టీరింగులన్ పట్టగా లేరు టీచర్లు పాఠంబులన్ చెప్పగాలేరు డాక్టర్లునింజక్షనుల్ జేయగాలేరు ప్లీడర్లు నోరెత్తి వాదింపగాలేరు జడ్జీలు ఏ స్వల్పమౌ తీర్పులన్ జెప్పగాలేరు దిట్టంబుగా బ్రాలసుల్ కూట సాక్ష్యంబులన్ చెప్పగాలేరు వారంగనల్ కోడెగాండ్రన్ వెసన్ కేళిలో నోలలాడింపగాలేరు ముప్పూటలన్ నిన్నొగిన్ గ్రోలకున్నన్ శిరోభారమైనాల్క ఎండున్-మనంబెంతో చాంచల్యమున్ నిత్యమున్ వేకువన్ దర్శనంబిచ్చి నిన్ బాగుగా త్రాగు సౌభాగ్యమున్ గూర్చి రక్షింపవే సారెకున్ గొల్చెదన్ విశ్వకర్మాస్వయంబంధునన్ సత్కవీంద్రుడనన్ చెల్లు పోకూరి కాశీపతి స్వాంతరాజీవసంవాసినీ నీకికన్ మంగళంబౌ మహాకాఫీ దేవీ నమస్తే నమస్తే నమస్తే నమః - పున్నా కృష్ణమూర్తి -
రజత సింహాసనంపై అక్కినేనికి సత్కారం
హైదరాబాద్,న్యూస్‌లైన్: దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, పద్మవిభూషణ్ అక్కినేని నాగేశ్వరరావును రజత సింహాసనంపై కూర్చోబెట్టి యాక్టర్లు, డాక్టర్లు కలసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం రవీంద్రభారతి ప్రధాన వేదికపై శనివారం రాత్రి జరిగింది. రాజ సప్తస్వరం, టి.సుబ్బిరామిరెడ్డి లలితకళా పరిషత్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో అక్కినేని 90వ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. డాక్టర్లు, యాక్టర్లు పుష్పగుచ్ఛాలు, శాలువలతో అక్కినేని సత్కరించారు. అయితే, ఈ కార్యక్రమంలో పాల్గొన్న సినీనటి లకిష్మ మాత్రం తన వద్ద పుష్పగుచ్ఛాలు లేవంటూ, ‘ఐ లవ్యూ అక్కినేని’ అంటూ ఆలింగనం చేసుకోవడం కొసమెరుపు. సినీనటులు మోహన్‌బాబు, బ్రహ్మానందం, మురళీమోహన్, చంద్రమోహన్, కోట శ్రీనివాసరావు తదితరులతో పాటు పలువురు డాక్టర్లు, యాక్టర్లు పాల్గొన్నారు. -
సర్వాయి పాపన్న స్ఫూర్తితో ఉద్యమిద్దాం
సాక్షి, హైదరాబాద్ : కల్లుగీత వృత్తిని రక్షించుకుంటూ పొటీ ప్రపంచంలో నిలదొక్కుకునేందుకు ఐక్యత చాటుదామని టీ-ఎంపీల ఫోరం కన్వీనర్ పొన్నం ప్రభాకర్‌గౌడ్ అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తితో జాతి బాగు కోసం కలిసి ఉద్యమిద్దామన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో గౌడ్విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పాపన్న 363వ జయంతిని పురస్కరించుకొని గౌడ్ మహనీయుల జయంత్యుత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ కల్లుగీత వృత్తి ద్వారా ఆర్థికంగా ఎదుగుతూ పోటీ ప్రపంచంలో రాజకీయంగా ఉనికిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీగౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు తర్వాత కులాన్ని ఎలా రక్షించుకోవాలా? అనే ఆలోచన చేస్తున్నామని తెలిపారు. సభలో చేసే తీర్మానాల అమలుకు అందరం కలిసి పనిచేద్దామన్నారు. నటుడు సుమన్ మాట్లాడుతూ గొప్ప చరిత్ర కలిగిన నాయకుడు సర్దార్ పాపన్న అని కొనియాడారు. సమస్యలపై కలిసి పోరాడేందుకు ఇదే సరైన సమయమన్నారు. గీత కార్మికులకు బీమా పాలసీ ఒకటి తీసుకురావాలన్నారు. విద్యే ఆస్తి అనీ దీన్ని గౌడ కులస్తులెవరూ మరువకూడదని కోరారు. ఐఏఎస్ అధికారి అనిత మాట్లాడుతూ ఐక్యంగా ముందుకు సాగితే గౌడ్లు కూడా అగ్రకులాలకు సమానంగా ఎదుగుతారన్నారు. ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్యగౌడ్ మాట్లాడుతూ తెలంగాణ పునర్నిర్మాణంలో కల్లుకు నిర్ణీత రేటు నిర్ణయిద్దామని-డెయిరీని కూడా ఏర్పాటు చేసుకుందామన్నారు. టీడీపీ నేత వీరేందర్‌గౌడ్ మాట్లాడుతూ ఏదైనా పోరాడి సాధించుకోమని సర్ధార్ పాపన్న ఆనాడే చెప్పారన్నారు. టీడీపీ నేత అరవింద్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ సరికొత్త సామాజిక తెలంగాణను నిర్మించుకుందామన్నారు. అనంతరం కటింగ్ డౌ ట్రీ రూల్ నెంబర్ 27,(1968) జీఓ అమలు ఎక్సైజ్‌శాఖతో కావటంలేదనీ, దాన్ని ఫారెస్ట్, పోలీసు శాఖలకు మార్పు చేయించాలని, పాపన్న జయంత్యుత్సవాలను ప్రభుత్వమే జరపాలని, ట్యాంక్‌బండ్‌పై ఆయన విగ్రహం ఏర్పాటు చేసి, చరిత్రను పాఠ్యపుస్తకాల్లో పొందుపరచాలని తీర్మానించారు. పాపన్న పేరుతో ఉన్న క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. సభ నిర్వాహకులు రామారావుగౌడ్, పి.లక్ష్మణ్‌గౌడ్, డాక్టర్ ఎం.ఎస్.గౌడ్, డాక్టర్ బూర నర్సయ్యగౌడ్, దత్తాద్రిగౌడ్ పాల్గొన్నారు. -
అమ్మను మించిన అదితి
ఈ తల్లీ కూతుళ్లను చూశారా.. వీరెవరో కాదు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు భార్య శైలజా అయ్యర్, వాళ్ల కుమార్తె అదితి. ఐఏఎస్ అధికారిణి, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ ఎండీ అయిన శైలజా అయ్యర్ స్వతహాగా నృత్య కళాకారిణి. తన కుమార్తెను కూడా తనలాగే నృత్యంలో తీర్చిదిద్దారామె. శనివారం అదితి హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో నృత్య ప్రదర్శన ఇచ్చింది. అప్పటి చిత్రాల మాలిక ఇది. ఫొటోలు: , సాక్షి ఫొటోగ్రఫర్ - వీరాంజనేయులు