పూరి డాన్స్ ఫెస్టివల్ తరహాలో... | Puri Dance Festival Style dance celebrations in Hyderabad | Sakshi
Sakshi News home page

పూరి డాన్స్ ఫెస్టివల్ తరహాలో...

Published Mon, Dec 8 2014 12:52 AM | Last Updated on Sat, Sep 2 2017 5:47 PM

పూరి డాన్స్ ఫెస్టివల్ తరహాలో...

పూరి డాన్స్ ఫెస్టివల్ తరహాలో...

నిజామాబాద్ ఎంపీ కవిత
నాంపల్లి: పూరి డాన్స్ ఫెస్టివల్ తరహాలో హైదరాబాద్‌లో నృత్యోత్సవాలను వచ్చే ఏడాది నిర్వహిస్తామని నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. ఆదివారం రాత్రి రవీంద్ర భారతి వేదికపై లాస్యకల్ప సంస్థ ఆధ్వర్యంలో భారతీయ సంప్రదాయ నృత్యాలైన శ్రీయ, క్షీర సాగర మథనం నృత్య రూపకాలు ప్రదర్శించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కవిత మాట్లాడుతూ రాబోయే సంవత్సరంలో అద్భుతమైన కళారూపాలను తీసుకువస్తామని ప్రకటించారు.

అన్ని జిల్లాల నుంచి కళాకారులను తీసుకురావాలనే లక్ష్యంతో లాస్యకల్ప ఫౌండేషన్, తెలంగాణ జాగృతి, డెల్ఫిక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంస్థలతో కలిసి రవీంద్రభారతిలో ‘నుపుర రావమ్-2014’ కార్యక్రమానికి రూపకల్పన చేసి ప్రదర్శనలు ఇచ్చినట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా కళాకారులు ప్రదర్శించిన శ్రీయ, క్షీర సాగర మథనం నృత్యరూపాలను అత్యద్భుతంగా ప్రదర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement