
సాక్షి, హైదరాబాద్: బతుకమ్మ సంబురాల సందర్భంగా బతుకమ్మ ఆడియో, వీడియో పాటను రవీంద్రభారతిలోని తన కార్యాలయంలో ఎక్సైజ్, సాంస్కృతిక, పర్యాటక శాఖమంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రముఖ కవి, కథ రచయిత విజయ భాస్కర్, రేఖ బోయపల్లి తదితరులు పాల్గొన్నారు.