
- తెలంగాణ సాహిత్య అకాడమీ ‘నవలా స్రవంతి’లో భాగంగా జూలై 12న సాయంత్రం 6 గంటలకు రవీంద్ర భారతి కాన్ఫరెన్స్ హాలులో బి.ఎన్.శాస్త్రి చారిత్రక నవల ‘వాకాటక మహాదేవి’పై శ్రీరామోజు హరగోపాల్ ప్రసంగిస్తారు.
- తెలంగాణ చైతన్య సాహితి ఆవిర్భావ సభ జూలై 13న సాయంత్రం 4 గంటలకు రవీంద్ర భారతి సమావేశ మందిరంలో జరగనుంది. మూడు వీచికలుగా జరిగే ఈ సభకు ముఖ్య అతిథి: దేశపతి శ్రీనివాస్. వక్తలు: పి.వేణుగోపాల స్వామి, సుంకిరెడ్డి నారాయణరెడ్డి. కవి సమ్మేళనం ఉంటుంది.
- బొంత లచ్చారెడ్డి కావ్య కుసుమాలు, బాలబోధ, సులభ వ్యాకరణాల ఆవిష్కరణ జూలై 14న ఉదయం 11 గంటలకు ఆదిలాబాద్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరగనుంది. నిర్వహణ: పాలపిట్ట బుక్స్
- కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కార గ్రహీత బెలగం భీమేశ్వరరావు అభినందనసభ జూలై 14న సాయంత్రం 6 గంటలకు విజయనగరంలోని గురజాడ గృహంలో జరగనుంది. నిర్వహణ: సహజ.
- చంద్రశేఖర్ ఇండ్ల కథల సంపుటి రంగుల చీకటి పరిచయ సభ జూలై 14న ఉదయం పదింటికి ఒంగోలులోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరగనుంది.
- తెలుగు సొసైటీ ఆఫ్ అమెరికా (తెల్సా) 21వ వార్షికోత్సవ సందర్భంగా కథ, నాటక పోటీ నిర్వహిస్తోంది. కథల మూడు బహుమతులు రూ.30 వేలు, 20 వేలు, 15 వేలు. నాటకాల రెండు బహుమతులు రూ.40 వేలు, 25 వేలు. రచనలను డిజిటల్ రూపంలో జూలై 31లోగా పంపాలి. మెయిల్: telsa.competitions @gmail.com. telsaworld.org
- జాగృతి వార పత్రిక వాకాటి పాండురంగారావు స్మారక కథల పోటీ నిర్వహిస్తోంది. 1500 పదాల లోపు రాసిన కథలను ఆగస్టు 18 లోపు పంపాలి. మూడు బహుమతులు వరుసగా 12 వేలు, 7 వేలు, 5 వేలు. పత్రిక చిరునామాకు పోస్టులోగానీ jagriticometition@ gmail.comగానీ పంపొచ్చు. వివరాలకు: 9959997204
Comments
Please login to add a commentAdd a comment