ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని రవీంద్రభారతి వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కడ్తల్‌కు చెందిన నాగరాజు అనే వ్యక్తి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.వెంటనే అప్రమత్తమైన పోలీసులు బాధిత వ్యక్తిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జై తెలంగాణ అని నినాదాలు చేసినట్టు, కేసీఆర్ తనకు న్యాయం చేయాలని అరిచినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన వ్యక్తి ప్రైవేట్ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. (నల్గొండలో ప్రేమికుల ఆత్మహత్య)
రవీంద్ర భారతి దగ్గర ఆత్మహత్యాయత్నం చేసిన నాగరాజుతోపాటు ఆయన భార్యతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఫోన్‌లో మాట్లాడారు. పూర్తి వైద్యం ప్రభుత్వం ద్వారానే అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈమేరకు ఉస్మానియా సూపరిండెంట్‌తో మాట్లాడిన మంత్రి.. అధునాతన వైద్యం అందించాలని, తనను బతికించడానికి అన్ని ప్రయత్నాలు చేయాలని కోరారు.
Reality of
— Danasari Anasuya (Seethakka) (@seethakkaMLA) September 10, 2020
New India &
New Telangana !!
lost his job in unplanned lockdown attempts suicide near by Telangana assembly premises, he is one from the 12.2 cores people who lost jobs in India in Covid-19 lockdown.
Do Govt care job loss people?
Or only you care about celebrates? pic.twitter.com/9A4xB1RiRW
Comments
Please login to add a commentAdd a comment