Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YSRCP President YS Jaganmohan Reddy comments with Regional Coordinators1
ఈసారి అధికారం మనదే: వైఎస్‌ జగన్‌

రెడ్‌ బుక్‌ రాజ్యాంగం నడుస్తున్న పరిస్థితుల్లో మీరు కేడర్‌కు ఉత్సాహాన్నివ్వడానికి వెళ్తున్నారు. ఇలాంటి సమయంలో మీరు క్రియాశీలకంగా పని చేయాలి. వారానికి మూడు రోజులు మీ పార్లమెంటు నియోజకవర్గాల్లో తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే ఆ జిల్లా మీద మీకు పట్టు వస్తుంది. అప్పుడే మీరు చెప్పింది వింటారు. ఇది చాలా ముఖ్యం. మీ వల్ల పార్టీకి మంచి జరగాలి. పూర్తి స్థాయి రాజకీయ నాయకుల్లా పని చేయాలి. కేసులకు భయపడితే రాజకీయాలు చేయలేం. జైలుకు పంపుతారని భయపడకూడదు. కలియుగంలో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం చేయాలంటే ఈ రెండు విషయాల్లో వెనకాడకూడదు. అప్పుడే మనం రాజకీయాలు చేయగలుగుతాం. రాష్ట్రంలో విద్య, వ్యవసాయం, వైద్య రంగాలన్నీ పూర్తిగా నీరుగారి పోయాయి. ప్రతి పథకం కనపడకుండా పోతోంది. మరోవైపు అవినీతి విచ్చలవిడిగా జరుగుతోంది. ఈ స్థాయిలో అవినీతిని ఎప్పుడూ చూసి ఉండం. రూపాయికి ఇడ్లీ వస్తుందో రాదో కానీ.. ఈ ప్రభుత్వంలో మాత్రం రూపాయికే ఎకరం చొప్పున లూలూ గ్రూపు లాంటి వాళ్లకు రూ.1,500 కోట్ల నుంచి రూ.1,600 కోట్ల విలువైన భూములు వస్తాయి. మరొకరికి రూపాయికే ఎకరా చొప్పున రూ.3 వేల కోట్ల విలువైన భూములు కట్టబెడుతున్నారు. ఈ స్థాయిలో ఏమాత్రం భయం లేకుండా విచ్చలవిడిగా అవినీతి జరుగుతోంది. -వైఎస్‌ జగన్‌ సాక్షి, అమరావతి: మన ప్రభుత్వం ఇస్తున్న ప్రతి పథకాన్నీ ఆపేయడంతో పాటు చంద్రబాబు చెప్పింది చేయకపోవడం వల్ల ప్రజలు కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని వైఎస్సార్‌సీపీ(YSRCP) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) అన్నారు. ప్రజలు చంద్రబాబు తీరును గమనిస్తున్నారని, ఓటు అనే వారి ఆయుధంతో చంద్రబాబుకు తగిన శాస్తి తప్పదని చెప్పారు. సరైన సమయంలో ప్రజలు, దేవుడు మొట్టికాయలు వేస్తారని.. వచ్చే ఎన్నికల్లో అఖండ విజయంతో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం పార్లమెంటు నియోజకవర్గాల పార్టీ పరిశీల­కులు, రీజినల్‌ కో–ఆర్డినేటర్లతో వైఎస్‌ జగన్‌ సమావేశమ­య్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు.. జరుగుతున్న పరిణామాలపై చర్చించి, పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు. ‘మనల్ని అభి­మానించే వారిని కొడుతున్నారు.. ఇబ్బంది పెడుతున్నారు. నన్ను అభిమానించినందుకే కదా.. వీళ్లకు దెబ్బలు తగులుతు­న్నాయన్నది నన్ను బాధిస్తోంది. వారిని రక్షించుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది. వాళ్లకు ఏదైనా జరిగితే ముందు బాధపడేది నేనే. అందుకే జగన్‌ 2.0లో ఈ మాదిరిగా ఉండదని స్పష్టంగా చెబుతున్నా. మొదటి ప్రాధాన్యత ఉంటుంది’ అని స్పష్టం చేశారు. కార్యకర్తల్లో ఇప్పటికే మంచి చైతన్యం వచ్చిందని, కేడర్‌ ధైర్యంగా నిలబడిందని అభినందించారు. రాష్ట్ర వ్యాప్తంగా తాను ఎక్కడికి వెళ్లినా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, ప్రజలు తరలి వస్తున్నారని, రాష్ట్రంలో అరాచక పాలన పట్ల వివిధ రూపాల్లో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. రాజకీయాలతో సంబంధం లేని వారిని కూడా కక్షలకు గురి చేస్తుండటం పట్ల ప్రజల్లో తీవ్రమైన అగ్రహం ఉందని తెలిపారు. మన ప్రభుత్వ హయాంలో మన పథకాల ద్వారా పేదల నోట్లోకి నాలుగు వేళ్లూ వెళ్లేవని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదలు తింటున్న కంచాన్ని చంద్రబాబు లాగేశారని చెప్పారు. వారి కడుపు కొట్టారని మండిపడ్డారు. వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..కూటమి ప్రభుత్వం అనైతిక పనులు చంద్రబాబు రాజకీయాలను ఒక దారుణమైన స్థాయికి తీసుకెళ్లారు. రాజకీయాల్లో ఇలాంటి పరిస్థితులు రాకూడదని మన ప్రభుత్వ హయాంలో చాలా కష్టపడ్డాం. చాలా మంది నాయకులను మన పరిపాలనలో కట్టడి చేశాం. తాడిపత్రిలో మున్సిపల్‌ ఎన్నికలు జరిగినప్పుడు టీడీపీకి స్వల్ప ఆధిక్యత వచ్చింది. వైఎస్సార్‌సీపీకి 16 వార్డులు, టీడీపీకి 18 వార్డులు వచ్చాయి. కానీ అప్పటి వైఎస్సార్‌సీపీ తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఫలితాన్ని మన వైపు తిప్పుదామని యత్నించారు. కానీ, ఆ రోజు మన ప్రభుత్వంలో మన పార్టీ ఎమ్మెల్యేనే గృహ నిర్భంధం చేశాం. అదే ఇప్పుడు ఏడాది కాలంగా పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అడుగు పెట్టనీయడం లేదు. కార్యకర్తల ఆస్తులను విధ్వంసం చేస్తున్నారు. ఇప్పుడు పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. చంద్రబాబు రెడ్‌ బుక్‌ రాజ్యాంగం, కక్ష రాజకీ­యాలతో రాజకీయ వ్యవస్థ దారుణంగా తయారైంది. ఈ రోజు 99.99 శాతం గ్రామ స్థాయిలో కేడర్‌ కూడా నా దగ్గర నుంచి చంద్రబాబు తరహా రాజకీయాలు ఆశిస్తున్నారు. చంద్రబాబు­నాయుడు 12 నెలల రెడ్‌ బుక్‌ రాజ్యాంగం చూసిన తర్వాత ఎమ్మెల్యేలే కాదు, గ్రామ స్థాయి కార్యకర్తలు కూడా నా దగ్గర నుంచి అదే ఆశిస్తున్నారు. కేసులు పెట్టించుకునే పరిస్థితి లేకపోతే రాజకీయాలు చేసే పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో లేకుండా పోయింది.అవినీతి కంటికి కన్పిస్తోంది రైతులకు ఉచితంగా విద్యుత్‌ అందించడానికి మనం ‘సెకీ’ (సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా)తో యూనిట్‌ విద్యుత్‌ రూ.2.49కే కొనుగోలు చేశాం. రైతులకు ఉచితంగా పగటి పూటే తొమ్మిది గంటల పాటు, నాణ్యమైన విద్యుత్‌ను 30 ఏళ్ల పాటు అందుబాటులో ఉండేందుకు మనం గొప్ప అడుగులు వేస్తే.. ఇప్పుడు నిస్సిగ్గుగా ఇవాళ వీళ్లు యూనిట్‌ విద్యుత్‌ రూ.4.60కు కొనుగోలు చేస్తున్నారు. సెక్షన్‌–108 ప్రకారం రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీ ఈఆర్సీ) మీద ఒత్తిడి తెచ్చి అమలు చేయించుకున్నారు. మెడ మీద కత్తిపెట్టి వాళ్లతో పని చేయించుకున్నారు. అవినీతి కంటికి కనిపిస్తోంది. గ్రామాల్లో ఇసుక మాఫియా, మట్టి మాఫియా.. అన్నీ స్కాములే. పేకాట క్లబ్బులు దగ్గర నుంచి మొదలు పెడితే.. విచ్చలవిడిగా బెల్టు షాపులు.. ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు అమ్మకాలు చేస్తున్నారు. ఎమ్మెల్యేకు ముట్టజెప్పందే ఏ పనీ కావడం లేదు. పరిశ్రమ నడవాలన్నా, మైనింగ్‌ యాక్టివిటీ కొనసాగాలన్నా ఎమ్మెల్యే ఆశీస్సులు ఉండాల్సిందే. ఎమ్మెల్యేకు ఇంత, ముఖ్యమంత్రికి ఇంత అని దండుకుంటున్నారు. రెడ్‌ బుక్‌ రాజ్యాంగాన్ని నడుపుతున్నారు. ప్రజలు ఓటు వేసి ఐదేళ్లు పాటు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అందుకే ప్రజలు గత్యంతరం లేక చూస్తున్నారంతే. సమయం వచ్చినప్పుడు కచ్చితంగా తగిన తీర్పు ఇస్తారు.చరిత్ర పునరావృతం ఖాయం 2014లో ఇదే కూటమి అధికారంలో ఉంది. ఆ రోజు ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు చేయలేదు. చరిత్ర పునరావృతం అవుతుంది. అప్పుడు కూడా రైతులకు రుణమాఫీ అని కొద్దిగా చేసి ఎగనామం పెట్టాడు. పొదుపు సంఘాలకు రుణమాఫీ అన్నాడు. అది కూడా మోసంగా తయారైంది. ఇంటింటికీ రూ.2 వేలు నిరుద్యోగ భృతి అన్నాడు. అదీ మోసమైంది. ప్రతి ఒక్కరికీ మూడు సెంట్ల స్థలం అన్నాడు.. అదీ మోసంగా మిగిలింది. అదే సమయంలో మనం పాదయాత్ర చేసి ప్రజలకు భరోసా ఇచ్చాం. చివరకు ప్రజా వ్యతిరేకత కొట్టొచ్చినట్టు ఎన్నికల ఫలితాల్లో కనిపించింది. చంద్రబాబు ప్రజా వ్యతిరేకతను చీల్చడానికి తన భాగస్వామిని వేరేగా పోటీ చేయించాడు. అయినా చంద్రబాబు ఓటమిని అడ్డుకోలేకపో­యారు. ఇప్పుడు కూడా ప్రజలు చంద్రబాబు తీరును గమనిస్తున్నారు. సరైన సమయంలో మొట్టికాయలు వేస్తారు. ముఖ్యమైన వారికి కీలక బాధ్యతలు చాలా ముఖ్యమైన వ్యక్తులుగా భావించిన వారినే పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులుగా నియమించాం. పార్టీ నిర్మాణంలో ఎవరైతే క్రియాశీలకంగా ఉండగలుగుతారు.. ఎవరైతే పార్టీని నడపగలుగుతారు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైతే పార్టీకి బలంగా ఉపయోగపడతారు.. అని చాలా అధ్యయనం చేశాకే మీకు ఈ బాధ్యతలు అప్పగించాం. ఏం జరుగుతున్నా నాతోనే నేరుగా చెప్పగలిగే చనువు మీ అందరికీ ఉంది. పార్టీని పూర్తిగా బలోపేతం చేయడం మీద 11 నెలలుగా మనం ప్రధానంగా ధ్యాస పెట్టాం. జిల్లా స్థాయి నుంచి గ్రామంలో బూత్‌ కమిటీల నిర్మాణం వరకు ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. అందులో భాగంగానే జవసత్వాలు నింపి జిల్లా అధ్యక్షులుగా కొత్తవాళ్లను నియమించాం. జిల్లా కమిటీల నుంచి బూత్‌ కమిటీల వరకు అన్నీ పూర్తి చేసే బృహత్తర బాధ్యతను జిల్లా అధ్యక్షులకు అప్పగించాం. వాళ్లకు సరైన సపోర్ట్‌ మెకానిజమ్‌గా రీజినల్‌ కోఆర్డినేటర్లను తీసుకొచ్చాం. రీజియన్‌ను వారు కోఆర్డినేట్‌ చేస్తూ, జిల్లా అధ్యక్షులకు అవసరమైన సహకారం అందిస్తూ.. వాళ్లతో పని చేయిస్తారు. అప్పుడే పని సులభం అవుతుంది.రీజినల్‌ కో–ఆర్డినేటర్లతో సమన్వయం జిల్లాలో ఏదైనా నియోజకవర్గంలో ఏ కార్యక్రమం చేయాలన్నా.. రీజినల్‌ కో–ఆర్డినేటర్లతో పాటు, మీరు కూడా మరింత మమేకమై పని చేయాలి. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఆ పార్లమెంట్‌ నియోజకవర్గంతో సంబంధం లేని వ్యక్తిని, ఆ పార్లమెంటు నియోజకవర్గంతో భావోద్వేగం లేని వాళ్లను, అల్టిమేట్‌గా పార్టీ కోసం పనిచేసే వారిని నియమించాం. వీళ్లు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తకు ఉపయోగపడేలా పని చేస్తారు. వీళ్లను ఆయా రీజినల్‌ కో ఆర్డినేటర్లతో మ్యాపింగ్‌ చేస్తాం. పార్లమెంటరీ పరిశీలకులు జిల్లా అధ్యక్షులతో మమేకం అయి పని చేయాలి. పార్టీ కమిటీల నియామకాల్లో ఆయా జిల్లా అధ్యక్షులతో కలిసి పని చేయాలి. జిల్లా కమిటీల నుంచి, బూత్‌ కమిటీల వరకు జిల్లా అధ్యక్షులకు సహాయకారిగా ఉండాలి. ప్రజలకు మరింత చేరువగా.. ప్రతి నియోజకవర్గంలోని పార్టీ ఇన్‌ఛార్జి పనితీరును బేరీజు వేస్తారు. సరిగ్గా పని చేసేలా మోటివేట్‌ చేయాలి. వారిని ప్రోత్సహించాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి నియోజకవర్గ సమన్వయకర్త గెలవడం చాలా సులభం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థి ప్రజలకు అందుబాటులో ఉండేలా చేయాల్సిన బాధ్యత పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడిదే. నియోజకవర్గ అభ్యర్థికి ఎవరితోనైనా విభేదాలు ఉంటే, వాళ్ల మధ్య సమన్వయం చేయడంలో కూడా పరిశీలకులదే కీలక బాధ్యత. ఇదంతా జిల్లా అధ్యక్షులతో కలిసి చేయాలి. మీరు, జిల్లా అధ్యక్షులు కలిసి రీజనల్‌ కోఆర్డినేటర్లకు కాళ్లూ, చేతుల్లా పని చేస్తారు. వారు మీ ద్వారానే అన్ని పనులు చేయించుకుంటారు.గెలుపే మీ పనితీరుకు గీటురాయి మీ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో ఎంత మందిని మీరు గెలిపిస్తారనేది మీకు పరీక్ష. మీకు, జిల్లా అధ్యక్షులకు మీ మీ పనితీరు ఆధారంగానే మంచి పదవులు వస్తాయి. మీ మీద నేను ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా గెలిపించుకునే బాధ్యత తీసుకోవాలి. అలాగే రీజినల్‌ కోఆర్డినేటర్లు కూడా, వాళ్ల ప్రాంతాల్లో ఎంత మందిని గెలిపించుకుని వచ్చారన్న దానిపైనే వాళ్లకు పార్టీలో సముచిత స్థానం దక్కుతుంది. చంద్రబాబు ప్రభుత్వం ఏ రకంగా ఫెయిల్‌ అయిందో అందరికీ కనిపిస్తోంది. ఈ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ప్రజలకిచ్చిన అన్ని హామీలను అమలు చేసి, పారదర్శకంగా పథకాలిచ్చి, రూ.2.73 లక్షల కోట్లు బటన్‌ నొక్కి, ప్రతి ఇంటికీ పథకాలన్నీ చేర్చిన తర్వాత కూడా మన పరిస్థితే ఇలా ఉంటే, అన్ని రకాలుగా అబద్ధాలు చెప్పి మోసం చేసిన ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చు.మీరు పని చేయండి.. మీ బాధ్యత నాది మీరు పని చేయండి. మీ బాధ్యత నాది. మిమ్నల్ని సముచిత స్థానాల్లో కూర్చోబెట్టే బాధ్యత నాది. ప్రతి గ్రామంలో మన పార్టీ బలంగా ఉంది. దీన్ని మరింత ఆర్గనైజ్డ్‌గా తీసుకుని రావాలి. గ్రామ కమిటీ సభ్యుడిగానో, బూత్‌ కమిటీలోనో, మహిళా కమిటీ సభ్యురాలిగానో.. ఇలా ఏదో ఒక చోట ప్రతి కార్యకర్తను తీసుకుని రావాలి. అంతిమంగా మీ ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించుకుని వచ్చారా లేదా అన్నదే నా పరీక్ష. గ్రామ, బూత్, మండల కమిటీలు ఎప్పుడైతే క్రియాశీలకంగా పని చేయడం మొదలవుతుందో అప్పడే గెలుపు సాధ్యం. మోసం మనకు చేతకాదుమనం అధికారంలోకి వచ్చే నాటికి నీరు–చెట్టు కార్యక్రమానికి సంబంధించి రూ.2,300 కోట్లు చంద్రబాబు హయాంలో పెండింగ్‌లో పెట్టిన బిల్లులు మనం చెల్లించాం. మనం ఇచ్చిన హామీ మేరకు ప్రతి పథకం అమలు చేస్తూ బటన్‌ నొక్కి జమ చేశాం. విలువలు, విశ్వసనీయత, క్రెడిబులిటీ కోసం మనం తాపత్రయ పడ్డాం. ప్రజల కోసమే ఆలోచన చేశాం. కాబట్టి కేడర్‌కు అనుకున్న మేరకు ప్రాధాన్యత ఇవ్వలేకపోయాం. చంద్రబాబుకు అవేవీ లేవు. ఈ ప్రభుత్వం చేసిన దుర్మార్గాలు చూసిన తర్వాత మన కార్యకర్తలకు కచ్చితంగా ప్రాధాన్యత ఉంటుంది. తొలి ప్రాధాన్యత వారికే. అదే టైంలో చంద్రబాబు మాదిరిగా మనం అబద్ధాలు చెప్పలేం. మోసాలు చేయలేం. ఎప్పుడైనా సరే నిజాయితీగానే రాజకీయాలు చేస్తాను. త్వరితగతిన కమిటీల నిర్మాణంబూత్‌ కమిటీల నియామకం పూర్తయ్యే సరికి పార్టీ నిర్మాణంలో దాదాపుగా 18 లక్షల మంది ఉంటారు. వారికి ఇన్సూరెన్స్‌ కచ్చితంగా చేస్తాం. వారి ఆలనా పాలన చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పటికే పార్టీ నిర్మాణంలో 94 శాతం మండల అధ్యక్షుల నియామకం, 54 శాతం మండల కమిటీల నియామకాలు పూర్తి అయ్యాయి. అనుబంధ విభాగాలకు సంబంధించి 9 వేల మంది అధ్యక్షులను నియమించాం. మే ఆఖరులోగా మండల కమిటీలు పూర్తి చేయడమే లక్ష్యంగా పని చేయాలి. అప్పుడు మండల కమిటీలు.. గ్రామ స్థాయి కమిటీల నియామకాలను పర్యవేక్షిస్తాయి. జూలై ఆఖరు నాటికి మున్సిపాలిటీ, గ్రామ స్థాయి విలేజ్‌ కమిటీల నియామకాలు పూర్తి కావాలి. ప్రతి మున్సిపాలిటీలో డివిజన్‌ ప్రెసిడెంట్‌ నియామకాలు పూర్తి కావాలి. కార్పొరేటర్‌ ఉన్నా కూడా డివిజన్‌ ప్రెసిడెంట్‌ను నియమించాలి. ఆ తర్వాత ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్‌ నాటికి బూత్‌ కమిటీలు కూడా పూర్తి కావాలి. ప్రతి గ్రామంలో అత్యధికంగా సర్పంచ్‌లు మన వాళ్లే ఉన్నారు. తొలుత 18 లక్షల మంది క్రియాశీలక (యాక్టివ్‌) సభ్యులకు ప్రత్యేకంగా ఐడీ కార్డు, ప్రత్యేక ఇన్సూరెన్స్‌ వస్తాయి. ఆ తర్వాత సభ్యత్వ నమోదు చేస్తాం. అక్టోబర్‌ తర్వాత సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడతాం. తొలుత జిల్లా స్థాయిలో కమిటీలు, ఆ తర్వాత నియోజకవర్గ స్థాయి కమిటీల హెడ్‌లను నియమించాం. మండల స్థాయిలో అధ్యక్షుల నియామకం దాదాపు 94 శాతం పూర్తి అయింది. తొలుత నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయిలో వివిధ అనుబంధ విభాగాల కమిటీల అధ్యక్షులను నియమించాలి. మీరు వారానికి మూడు రోజులు వెళ్లి పరిశీలించగలిగితే అన్ని నియామకాలు పూర్తవుతాయి. వచ్చే ఏడాది బ్రహ్మాండంగా ప్లీనరీ నిర్వహిద్దాం.మన హయాంలో రైతులకు భరోసా⇒ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి గ్రామ సచివాలయంలో కనీస మద్దతు ధరలతో జాబితా పెట్టే వాళ్లం. మద్దతు ధర కోసం రూ.7,600 కోట్లు ఖర్చు చేసి రైతులకు మేలు చేశాం. మన హయాంలో కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) కన్నా తక్కువ ధర వస్తే అప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకునేది. ఆ పంటలు కొనుగోలు చేసేది. పొగాకు విషయంలో కూడా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం జోక్యం చేసుకునేది. ⇒ ప్రైవేటు కంపెనీలతో పోటీ పడి వేలంలో పాల్గొని, రైతులను ఆదుకున్నాం. ఆయిల్‌పామ్‌ రైతులనూ ఆదుకున్నాం. తెలంగాణతో సమాన స్థాయిలో ధర వచ్చేలా చూశాం. రూ.80 కోట్లు ఇచ్చాం. ఎలాంటి విపత్తులు వచ్చినా రైతులను ముందుగా ఆదుకునే వాళ్లం. ధాన్యానికి ఎమ్మెస్పీ ఇవ్వడమే కాదు.. అదనంగా గన్నీ బ్యాగ్స్, లేబర్‌ చార్జీలు, రవాణా ఖర్చు (జీఎల్టీ) కూడా ఇచ్చాం. ⇒ సీజన్‌ ముగిసేలోగా ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చే సంప్రదాయం మన దగ్గరే ప్రారంభమైంది. క్రమం తప్పకుండా ఇన్సూరెన్స్‌ ఇచ్చే వాళ్లం. వ్యవసాయ రంగంపై ఇంత ఫోకస్‌ పెట్టిన ప్రభుత్వం మనదైతే, ఏ ఫోకస్‌ పెట్టనిది కూటమి ప్రభుత్వం. క్రమం తప్పకుండా ఐదేళ్ల పాటు మనం రైతులకు పెట్టుబడి సహాయం అందించాం. విపత్తులు వస్తే తక్షణమే వెళ్లి ఆదుకున్నాం. ⇒ రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. కనీస మద్దతు ధర అందడం లేదు. రైతును పట్టించుకునే నాధుడే లేడు. ప్రజలకు సమస్యలొస్తే మీరు అక్కడికి వెళ్లాలి. ప్రజలకు అండగా ఉండాలి. ప్రజా సమస్యల పట్ల ఎంత ఎక్కువగా వారికి అండగా ఉంటే.. అంత గట్టిగా ప్రజల్లో బలపడే పరిస్థితి వస్తుంది. అలా జరగకుండా చేసేందుకే చంద్రబాబు వేధింపులకు దిగుతున్నాడు. అయినా ప్రజల కష్టాల్లో వారికి అండగా ఉండాలి’.

Pakistan Lahore Airport Strikes Video Viral2
పాకిస్తాన్‌ లాహోర్‌లో పేలుళ్లు.. పరుగు తీసిన ప్రజలు

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లోని లాహోర్‌లో పేలుడు ఘటన చోటుచేసుకుంది. లాహోర్‌లోని వాల్టన్ విమానాశ్రయం సమీపంలోని లాహోర్‌లోని గోపాల్ నగర్, నసీరాబాద్ ప్రాంతాలలో వరుసగా బాంబు పేలుడు ఘటన సంభవించింది. ఎయిర్‌పోర్టు వద్ద గురువారం ఉదయం ఒక్కసారిగా సైరన్లు మోగడంతో ఇళ్ల నుంచి పాక్‌ ప్రజలు బయటకు పరుగులు తీశారు.అయితే, డ్రోన్‌ కారణంగానే పేలుడు సంభవించినట్లు పాక్‌ పోలీసులు చెబుతున్నారు. 5-6 అడుగుల పొడవున్న డ్రోన్ పేలుడు సంభవించి ఉండవచ్చని పోలీసు వర్గాలు తెలిపాయి. డ్రోన్ వ్యవస్థను జామ్ చేయడం ద్వారా కూల్చివేసినట్లు చెప్పుకొచ్చారు. వరుస బాంబు పేలుడు ఘటనలతో పాకిస్తాన్‌లోని కరాచీ, ఇస్లామాబాద్‌ సహా పలు విమనాశ్రయాలను అధికారులు మూసివేశారు. ఇక, భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టిన మరుసటి రోజే పేలుళ్లు సంభవించడం గమనార్హం. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఈ బాంబు పేలుడుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.Panic in Lahore after blast near laWhore airport pic.twitter.com/zsQNyoE4hx— Team Jhaat Official (@TeamJhaant__) May 8, 2025 Utter chaos in Lahore after drone strike at Walton Road which leads to Lahore cantonment. People out on streets in panic. Asim Munir's Jihadist policies have invited war to Pakistan's streets. pic.twitter.com/1195BQxlhf— Divya Kumar Soti (@DivyaSoti) May 8, 2025Something hit Naval college besides #Askari 5. Sirens are #lahore One 1x Drone intercept in #Walton road.#IndiaPakistanWar#Pakistan#PakistanZindabadpic.twitter.com/XN8HkYsi4S— Muhammad Asif (Parody) (@MuhammadAsif26_) May 8, 2025

USA Donlad Trump Reaction On Operation Sindoor3
భారత్‌-పాక్‌ యుద్ధం.. బిగ్‌ ట్విస్ట్‌ ఇస్తూ ట్రంప్‌ వ్యాఖ్యలు

వాషింగ్టన్‌: ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్‌ మెరుపు దాడుల వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌, పాకిస్తాన్‌ ఒకరిపై మరొకరు దాడులు చేసుకోవడం ఆపేయాలని కోరారు. అలాగే, ఇరు దేశాలు సాయం కోరితే తాను అందుబాటులో ఉంటానని ట్రంప్‌ వెల్లడించారు.ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యం భారత్‌, పాకిస్తాన్‌ మధ్య మరోసారి ఉద్రిక్తకర వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పలువురు దేశాధినేతలు, రాయబారులు దాడుల ఘటనపై స్పందించారు. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని భారత్‌, పాక్‌లను కోరారు. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సైతం మరోసారి స్పందించారు.ఓవల్‌ ఆఫీస్‌లో ట్రంప్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘భారత్‌, పాక్‌ల మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. దాడులు చేయడం అవమానకరం. రెండు దేశాల గురించి నాకు చాలా తెలుసు. ఎప్పటి నుంచో వారి మధ్య వైరం ఉంది. అయితే, రెండు దేశాలతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని, వాటిని ఆపేయాలని కోరుకుంటున్నాను. వారు అనుకుంటే ఇప్పుడే ఇది చేయగలరు. రెండు దేశాలు కయ్యానికి కాలు దువ్వాయి. అమెరికాతో భారత్‌, పాక్‌కు మంచి సంబంధాల దృష్ట్యా వారికి సహాయం చేయాల్సి వస్తే నేను అందుబాటులో ఉంటాను. ఏ సహాయమైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను’ అంటూ వ్యాఖ్యలు చేశారు.U.S. President Donald Trump has condemned India's attack, calling it shamefulPakistan Zindabad!#Pakistan #PakistanismyRedLine #donaldjtrump #PakistanZindabad #IndiaPakistanWar pic.twitter.com/iDl8SwVeLH— Anmol Sheraz (@iamanmolsheraz) May 6, 2025 చైనాకు భారత్ వార్నింగ్మరోవైపు.. ఆపరేషన్ సిందూర్‌పై విషం గక్కే ప్రయత్నం చేసిన పొరుగు దేశం చైనా భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది. భారత్‌కు చెందిన మూడు విమానాలను పాక్ కూల్చేసిదంటూ చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ రాసిన కథనంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వాస్తవాలు తెలుసుకోకుండా ఇలాంటి కథనాలు రాయడం మానుకోవాలని హెచ్చరించింది.

When This IPL Gets Over: MS Dhoni Breaks Silence On His Future At IPL4
అతడికి థాంక్యూ.. అద్భుతంగా ఆడాడు.. ఈ ఐపీఎల్‌ ముగిసిన తర్వాతే..: ధోని

ఐపీఎల్‌-2025లో ఒక్క విజయం.. ఒకే ఒక్క విజయం కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసిన అభిమానులకు చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఊరట కలిగించింది. వరుస పరాజయాలు, పరాభవాల తర్వాత బుధవారం నాటి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (KKR)పై గెలిచింది. తద్వారా ఈ సీజన్‌లో ఎట్టకేలకు మూడో గెలుపు నమోదు చేసింది.ఈ నేపథ్యంలో కేకేఆర్‌పై విజయానంతరం సీఎస్‌కే కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఈ సీజన్‌లో మేము కొన్ని మ్యాచ్‌లో మాత్రమే గెలిచాం. ఇది మాకు మూడో విజయం. ఏదేమైనా గెలవడం సంతోషంగానే ఉంటుంది కదా!అయితే, ఈ ఏడాది మాకూ ఏదీ కలిసిరాలేదు. ఎక్కడ తప్పు జరిగిందో సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మా జట్టులో 25 మంది ఆటగాళ్లు ఉన్నారు. వాళ్ల సేవలను ఎలా ఉపయోగించుకోవాలన్న అంశంపైనే ప్రస్తుతం నా దృష్టి కేంద్రీకృతమై ఉంది.వచ్చే ఏడాదైనా సరైన సమాధానం లభిస్తుందని భావిస్తున్నాం. ఏ బ్యాటర్‌ను ఏ స్థానంలో పంపాలి.. ఎవరైతే పరిస్థితులకు తగ్గట్లు బౌలింగ్‌ చేస్తున్నారన్న అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది’’ అని ధోని పేర్కొన్నాడు.అదే విధంగా.. ‘‘ఈ మ్యాచ్‌లో గెలుపునకు బ్రెవిస్‌ కారణం. అందుకు అతడికి కృతజ్ఞతలు. అతడి వల్లే ఈరోజు నేను ఇక్కడ నిలబడగలిగాను. చక్కటి షాట్లతో బ్రెవిస్‌ అలరించాడు. అతడు బాదిన రెండు సిక్సర్ల వల్ల మాపై ఒత్తిడి తగ్గి విజయం దిశగా పయనం సాధ్యమైంది’’ అని ధోని సౌతాఫ్రికా యువ సంచలనం డెవాల్డ్‌ బ్రెవిస్‌ను ప్రశంసించాడు.ఇక తన ఐపీఎల్‌ భవితవ్యం గురించి ప్రస్తావన రాగా.. ‘‘నాకిప్పుడు 43 ఏళ్లు. ఇప్పటికి చాలా ఏళ్లుగా నేను క్రికెట్‌ ఆడుతూనే ఉన్నాను. అయితే, ఈ లీగ్‌లో నా చివరి సంవత్సరం ఏది అన్నది మాత్రం స్పష్టంగా చెప్పలేను.నిజానికి ఏడాదిలో కేవలం రెండు నెలలు మాత్రమే ఇక్కడ క్రికెట్‌ ఆడతాం. ఒక్కసారి ఐపీఎల్‌ ముగిసిపోతే మరో 6-8 నెలలు నాకు విశ్రాంతి దొరుకుతుంది. నా శరీరం ఎంత వరకు ఒత్తిడిని తట్టుకుందనే అంశం మీదే అంతా ఆధారపడి ఉంది. ఇప్పటికైతే రిటైర్మెంట్‌ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే, ఎక్కడికి వెళ్లినా ప్రేక్షకుల నుంచి లభించే ప్రేమ, ఆదరణ చూస్తుంటే సంతోషంగా ఉంది’’ అని ధోని పేర్కొన్నాడు.ఐపీఎల్‌-2025: కోల్‌కతా వర్సెస్‌ చెన్నై👉వేదిక: ఈడెన్‌ గార్డెన్స్‌, కోల్‌కతా👉టాస్‌: కోల్‌కతా.. తొలుత బ్యాటింగ్‌👉కోల్‌కతా స్కోరు: 179/6 (20)👉చెన్నై స్కోరు: 183/8 (19.4)👉ఫలితం: రెండు వికెట్ల తేడాతో కోల్‌కతాపై చెన్నై గెలుపు👉ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: నూర్‌ అహ్మద్‌ (చెన్నై స్పిన్నర్‌- 4/31).Last over maximums 🤝 MS Dhoni A never ending story 💛Updates ▶ https://t.co/ydH0hsBFgS #TATAIPL | #KKRvCSK | @msdhoni | @ChennaiIPL pic.twitter.com/fyQcVOIusT— IndianPremierLeague (@IPL) May 7, 2025

Samantha Shares Fun Video With Vennela Kirshre5
‘సింగిల్‌’కాల్‌లో అతనికి ‘శుభం’ చెప్పేశా: సమంత పోస్ట్‌ వైరల్‌

స్టార్‌ హీరోయిన్‌ సమంత(samantha) నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆమె తన సొంత బ్యానర్‌ ట్రాలాలా మూవీస్‌ పిక్చర్స్‌లో నిర్మించిన తొలి సినిమా ‘శుభం’(subham movie) మే 9న రిలీజ్‌ కాబోతుంది. ఈ చిత్రానికి ప్రవీణ్‌ కండ్రేగుల దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం సమంత ఫోకస్‌ అంతా ఈ సినిమాపైనే పెట్టింది. ఈ సినిమా ప్రమోషన్స్‌ని తన భుజాన వేసుకొని ముందుకు సాగుతోంది. వరుస ఇంటర్వ్యూలు, మీడియా సమావేశాలతో ఫుల్‌ బిజీ అయిపోయింది. అంతేకాదు ఈ సినిమా ప్రమోషన్స్‌కి తన స్నేహితులను కూడా వాడుకుంటుంది. తాజా వెన్నెల కిశోర్‌తో కలిసి ఓ ఫన్‌ వీడియో కూడా చేసింది. ఈ వీడియోలో సమంత ‘ నా శుభం మూవీ ప్రీమియర్స్‌కి రావట్లేదా’ అని అడుగుతుంది. వెన్నెల కిశోర్‌ ఏమో తన నటించిన ‘సింగిల్‌’(#single) మూవీ కూడా అదే రోజు(మే 9) రాబోతుందని చెప్పాలనుకుంటాడు. కానీ సమంత అతన్ని మాట్లాడనీయకుండా.. ‘నువ్వు, నీ ఫ్యామిలీ తప్పకుండా వస్తారు కదా? నేను నిర్మించిన ఫస్ట్‌ మూవీ ఇది తప్పుకుండా రావాలి’ అంటూ గబగబా మాట్లాడేస్తుంది. చివరికి నువ్వు కచ్చితంగా వస్తున్నావు అని కట్ చేసేస్తది. ఈ వీడియోని సమంత తన ఇన్‌స్టాలో షేర్‌ చేస్తూ.. సింగిల్ ఫోన్ కాల్‌లో వెన్నెల కిశోర్‌కి శుభం చెప్పేశా.. మే 9న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది’ అని రాసుకొచ్చింది. దీంతో ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl)

MP Priti Patel Comments On Operation Sindoor In UK Parliament6
భారత్‌కు దాడి చేసే హక్కు ఉంది.. బ్రిటన్‌ ఎంపీ ప్రీతి పటేల్‌ సపోర్ట్‌

లండన్‌: పాకిస్తాన్‌పై భారత్‌ తలపెట్టిన ఆపరేషన్‌ సిందూర్‌పై ప్రపంచ దేశాల నేతలు స్పందిస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు భారత్‌కు మద్దతు ప్రకటించారు. ఇక, తాజాగా భారత సంతతి, యూకే ఎంపీ ప్రీతి పటేల్‌.. బ్రిటన్‌ పార్లమెంట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆత్మరక్షణలో భాగంగా పాకిస్తాన్‌పై దాడి జరిపే హక్కు భారత్‌కు ఉందని తేల్చి చెప్పారు. ఈ విషయంలో భారత్‌కు మద్దతు ఉంటుందని చెప్పుకొచ్చారు.పాకిస్తాన్‌పై భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌పై బ్రిటన్‌ పార్లమెంట్‌లో తాజాగా భారత సంతతి ఎంపీ ప్రీతి పటేల్‌ ప్రస్తావించారు. ఈ సందర్భంగా ప్రీతి పటేల్‌.. భారత్‌తో కలిసి ఉగ్రవాదానికి వ్యతిరేక బ్రిటన్ పోరాడాల్సిన అవసరం ఉందనన్నారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థల వల్ల సరిహద్దు దాటి వస్తున్న ఉగ్రవాద ముప్పును బ్రిటన్ ప్రభుత్వం గుర్తించాలని కోరారు. పహల్గాం ఘటనలో ఉగ్రవాదులు 26 మంది అమాయక పర్యాటకులను దారుణంగా హతమార్చారని గుర్తు చేశారు. ముంబై, న్యూఢిల్లీ వంటి ఉగ్రవాద ప్రభావిత నగరాల జాబితాలో ఇప్పుడు పహల్గాం కూడా చేరిపోయింది.పహల్గాం దాడిని ఉగ్రవాద చర్యగా ప్రపంచ దేశాలు సైతం గుర్తించాయి. భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గాలని నేను కోరుకుంటున్నాను. దేశాల మధ్య సైనిక చర్య, యుద్ధ వాతావరణం, ఉద్రిక్తతలు ఏర్పడకూడదు. ఆత్మరక్షణలో భాగంగా తమను తాము రక్షించుకోవడానికి, ఉగ్రవాద క్యాంపులను నేలమట్టం చేయడానికి భారత్‌కు సహేతుక కారణాలు ఉన్నాయి. ఇది భారత్‌ హక్కు. పాకిస్తాన్ కేంద్రంగా ఉన్న ఉగ్రవాదుల ముప్పు భారత్‌కు మాత్రమే కాదని, అనేక దేశాలు ప్రభావితమవుతున్నాయి. ఒసామా బిన్ లాడెన్ వంటి వ్యక్తి పాకిస్తాన్‌లోనే దాక్కున్నాడు. ఇది అందరికీ తెలిసిన బహిరంగ విషయమేనని అన్నారు.Today in the House of Commons I reiterated my condolences for those impacted by the atrocity that took place in Pahalgam. We must stand with those affected by terrorism. The UK must work with our friends in India to tackle terrorist threats and engage with India, Pakistan and key… pic.twitter.com/8RXezaJHx0— Priti Patel MP (@pritipatel) May 7, 2025ఇక, బ్రిటన్- భారత్ నిఘా సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఉగ్రదాడి తర్వాత బ్రిటన్ ప్రభుత్వం భారత్‌కు ఏదైనా ప్రత్యేక భద్రతా సహాయం అందించిందా? ఉద్రిక్తతలు పెరగకుండా నిరోధించడానికి బ్రిటన్ ప్రత్యేక మద్దతును అందించగలదా?" అని ప్రీతి పటేల్ ప్రశ్నించారు. చివరగా.. భారత్‌పై ఉగ్రవాదులు జరిపిన దాడులు, సృష్టించిన హింసాత్మక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని బ్రిటన్ తన వంతు సహకారాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు.

India Major Airport Closures Disrupt Travel Across the Region7
27 ఎయిర్‌పోర్ట్‌లు, 430 విమానాలు నిలిపివేత

పాకిస్థాన్‌ ఉగ్రస్థావరాలపై ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో భారత్‌ దాడి చేసిన నేపథ్యంలో స్థానిక విమానాశ్రయాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. దేశంలోని ఉత్తర, పశ్చిమ, మధ్య ప్రాంతాల్లోని 27 విమానాశ్రయాలు మే 10 వరకు వాణిజ్య కార్యకలాపాలను నిలిపేస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో విమాన ప్రయాణాల్లో అంతరాయం ఏర్పడనుంది. ఈ చర్య ఫలితంగా భారతీయ విమానయాన సంస్థలకు చెందిన 430 ఎయిర్‌క్రాఫ్ట్‌లు రద్దు అయినట్లు తెలిసింది. ఇది దేశంలోని మొత్తం షెడ్యూల్డ్ విమానాల్లో 3%గా ఉంది. ఈ ప్రభావం ఒక్క ఇండియాకు మాత్రమే పరిమితం కాలేదు. పాకిస్థాన్‌లోని విమానయాన సంస్థలు కూడా 147 విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది. ఇది వారి రోజువారీ షెడ్యూల్‌లో 17%గా ఉంది.ఇదీ చదవండి: ఉగ్రదేశం మదం అణచిన ఫైటర్‌ జెట్‌లుదేశంలోని ప్రభావిత విమానాశ్రయాలు..శ్రీనగర్, జమ్మూ, లేహ్, చండీగఢ్, అమృత్‌సర్‌, లుధియానా, పాటియాలా, బటిండా, హల్వారా, పఠాన్‌కోట్‌, భుంతర్, సిమ్లా, గగ్గల్, ధర్మశాల, కిషన్‌గఢ్‌, జైసల్మేర్, జోద్‌పూర్‌, బికనీర్, ముంద్రా, జామ్‌నగర్‌, రాజ్‌కోట్‌, పోర్‌బందర్‌, కాండ్లా, గ్వాలియర్, హిండన్ సహా కీలక వ్యూహాత్మక విమానాశ్రయాలను మూనివేస్తున్నట్లు చెప్పారు. విమాన రాకపోకల్లో అంతరాయాలను తగ్గించడానికి సంస్థలు పని చేస్తున్నట్లు తెలిపాయి. విదేశీ విమానయాన సంస్థలు సున్నితమైన జోన్లలో కార్యకలాపాలను పూర్తిగా నిలిపేసి ముంబై, అహ్మదాబాద్ మీదుగా ప్రయాణించే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్నాయి. విమానయాన సంస్థలు షెడ్యూళ్లను సర్దుబాటు చేయడానికి, ప్రభావిత ప్రయాణీకులకు వసతి కల్పించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణీకుల ప్రయాణాల్లో ఆలస్యం అనివార్యం అవుతుంది.

 Hyderabad Teenager Samarth leads Thalassaemia awareness project Hb CARE.8
వయసు పదిహేనేళ్లు..సేవాదృక్పథం ఆకాశమంత..!

ఎర్ర రక్త కణాలలో ఉండే హిమోగ్లోబిన్‌ను శరీరం తగినంతగా ఉత్పత్తి చేయకపోతే వచ్చే వ్యాధే తలసేమియా.. రక్తంలోని ఆక్సిజన్‌ను శరీరంలోని అన్ని భాగాలకు తీసుకువెళ్లడంలో హిమోగ్లోబిన్‌ కీలక పాత్ర పోషిస్తుంది. తలసేమియా పుట్టుకతో వచ్చే దీర్ఘకాలిక వ్యాధి. దీనికి జీవిత కాలం పర్యవేక్షణ అవసరం. ఈ వ్యాధి సోకిన చిన్నారుల అవస్థలు వర్ణనాతీతం. వీరు రెండు నుంచి నాలుగు వారాలకు ఒకసారి రక్తం ఎక్కించుకోకపోతే ప్రాణాలు పోయే పరిస్థితి. ఇలాంటి చిన్నారుల దీనస్థితి చూసిన ఓ పసి హృదయం చలించింది. వారికి ఏదో విధంగా సేవ చేయాలనే తపన అతడిని వెంటాడింది. ఈ ప్రయత్నంలోనే భాగంగా హైదరాబాద్‌ నగరానికి చెందిన 15 ఏళ్ల సమర్థ్‌ లాంబా ’హెచ్‌బీ కేర్‌’ అనే సంస్థను ప్రారంభించి స్ఫూర్తిగా నిలిచాడు. తన వయస్సుకి మించి సామాజిక బాధ్యతను గుర్తించి, తలసేమియా వ్యాధిపై అవగాహన కల్పిస్తూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. నేడు ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా కథనం.. సాధారణంగా 15 ఏళ్ల వయసులో చిన్నారులు చదువు, ఆటలు వంటి వాటిలోనే బిజీగా ఉంటారు. అయితే.. సమర్థ్‌ చిన్నతనంలోనే తలసేమియా బాధితుల జీవితాలు, వారి కష్టాలను తెలుసుకున్నాడు. వారి కోసం ఏదైనా చేయాలన్న తపనతో హెచ్‌బీ కేర్‌ అనే సంస్థను స్థాపించి, ఈ వ్యాధిపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే కాకుండా, రక్తదానం, ముందస్తు పరీక్షల అవసరాన్ని వివరించడంలో కూడా తనదైన పాత్ర పోషిస్తున్నాడు. సేవల కోసం విరాళాల సేకరణ 2023లో ప్రారంభించిన హెచ్‌బీ కేర్‌ సంస్థ ద్వారా సమర్థ్‌ ఇప్పటి వరకు రూ.7.5 లక్షల నిధులను సమీకరించాడు. ప్రజల నుంచి విరాళాల ద్వారా రూ.2.5 లక్షలు, సీఎస్‌ఆర్‌ ఫండ్‌లో భాగంగా కొన్ని కంపెనీల నుంచి మరో రూ.5 లక్షలు వచ్చాయి. తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం స్పందించాలని సోషల్‌ మీడియా వేదికగా 7 వేల మందికి పైగా సందేశాన్ని చేరవేశాడు. వారధిగా ‘బ్లడ్‌ బ్రిడ్జ్‌’ యాప్‌ నగరంలో ఐదు రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి, వందలాది మందిని చైతన్యవంతులుగా మార్చాడు. భద్రుక కాలేజ్, ఎమ్‌జీఐటీ, కేబీఆర్‌ పార్క్‌ వంటి ప్రదేశాల్లో నిర్వహించిన క్యాంపులకు స్పందన లభించింది. తొలి క్యాంప్‌లోనే 40 మందిని రక్తదాతలుగా మార్చాడు. ‘బ్లడ్‌ బ్రిడ్జ్‌’ వంటి యాప్‌ ఆధారిత సేవలపై అవగాహన కల్పించి, సాంకేతిక పరిజ్ఞానాన్ని సేవా కార్యకలాపాల్లో వినియోగిస్తున్నాడు. సమర్థ్‌ సేవలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి. అమెరికాలోని యూసీ బెర్కిలీ విశ్వవిద్యాలయంలోని సుటార్డియా సెంటర్‌ వద్ద ప్రదర్శించే అవకాశం పొందాడు. ఇతర నగరాలకు విస్తరించాలి భవిష్యత్తులో కంప్యూటర్‌ సైన్స్, సోషల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ రంగాల్లో ప్రయాణం చేయాలనుంది. హెచ్‌బీ కేర్‌ను ఇతర నగరాలకు విస్తరించాలనే ప్రణాళికలు ఉన్నాయి. అవగాహనతో ముందస్తు పరీక్షలు నిర్వహిస్తే తలసేమియా వంటి వ్యాధులను పూర్తిగా నియంత్రించవచ్చు. దీనిపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రతి యువకుడు వలంటీర్‌గా మారాలి. ప్రతి రక్తదాన శిబిరం ఒక జీవితాన్ని కాపాడుతుంది. – సమర్థ్‌ లాంబా (చదవండి:

Pakistan ministers bizarre reply when asked for proof of downing IAF jets9
అది భారత సోషల్‌ మీడియా.. పాక్‌ మంత్రి వింత సమాధానం

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ (Operation Sindoor) విజయవంతమైంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోన్న పాకిస్తాన్‌ భూభాగంలోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై భారత దళాలు మెరుపు దాడులు చేశాయి. ఇందుకు తామూ సమర్థవంతంగా ప్రతిఘటించామంటూ పాకిస్తాన్‌ ప్రకటించుకుంది. రాఫెల్స్ సహా ఐదు భారత యుద్ధ విమానాలను తమ బలగాలు కూల్చివేశాయంటూ సోషల్‌ మీడియాలో ఫేక్‌ ప్రచారం చేసింది. అయితే దీనిపై పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్పందించారు.భారత యుద్ధ విమానాలను పాకిస్తాన్‌ బలగాలు కూల్చివేశాయంటూ సోషల్‌ మీడియాలో చేసిన ఫేక్‌ ప్రచారాన్ని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కప్పిపుచ్చే ప్రయత్నం చేశాడు. పాకిస్తాన్ తన వాదనను నిరూపించడానికి ఏదైనా ఆధారాలు ఉన్నాయా అని సీఎన్ఎన్ ఇంటర్వ్యూలో విలేకరి అడిగ్గా ఆసిఫ్ వింత సమాధానం ఇచ్చాడు. ‘అదంతా ఇండియన్ సోషల్ మీడియాలోనే తప్ప మన సోషల్ మీడియాలో కాదు. జెట్ విమానాల శిథిలాలు వారి వైపు పడ్డాయి. ఇదంతా భారత మీడియాలోనే ఉంది' అని వింతగా బదులిచ్చారు.భారత్‌ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు ప్రతిగా తామూ రెండు రాఫెల్ జెట్‌లు, ఒక సు-30తో సహా మూడు భారత వైమానిక దళ (IAF) యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు పాకిస్తాన్ పేర్కొంది. అయితే, ఈ వాదనలను భారత్‌ నిర్ద్వంద్వంగా ఖండించింది. కార్యకలాపాల సమయంలో ఐఏఎఫ్‌ విమానాలు ఏవీ కోల్పోలేదని పేర్కొంది. ఇదంతా ఫేక్‌ ప్రచారమని తెలిపింది.పాకిస్తాన్‌ చేస్తున్నది ఫేక్‌ ప్రచారమని భారత ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ నివేదించింది. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా బహవల్ పూర్ సమీపంలో భారత రాఫెల్ జెట్ ను పాకిస్థాన్ కూల్చివేసిందంటూ సోషల్‌ మీడియా షేర్‌ చేసిన ఫొటో 2021లో జరిగిన ప్రమాదానికి సంబంధించినదని తెలిపింది.

Landmine blast in Mulugu district Telangana10
మందుపాతర పేలి ముగ్గురు పోలీసులు మృతి?

ములుగు, సాక్షి: తెలంగాణలోని ములుగు జిల్లా వాజేడులో మందుపాతర పేలుడు సంభవించింది. మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు మృతిచెందగా పలువురికి గాయాలు అయినట్లు సమాచారం. అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం పోలీసులు కూంబింగ్‌ చేస్తుండగా మందుపాతర పేలినట్లు తెలిసింది. అయితే ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులు ధ్రువీకరించలేదు.ఆపరేషన్‌ కర్రెగుట్ట పేరుతో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులోని అటవీ ప్రాంతాన్ని పోలీసులు, కేంద్ర బలగాలు జల్లెడపడుతూ తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌-తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో బుధవారం జరిగిన ఎదురుకాల్పుల్లో 22 మంది మావోయిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం రోజువారీ కూంబింగ్‌ కోసం వెళ్లిన సమయంలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలడంతో ముగ్గురు పోలీసులు మృతి చెందినట్లు సమాచారం.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement