Top Stories
ప్రధాన వార్తలు

ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు విఫలం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని తొమ్మిది ఉపాధ్యాయ గుర్తింపు సంఘాల నేతలతో సోమవారం విద్యాశాఖ ఉన్నతాధికారులు నిర్వహించిన చర్చలు విఫలమయ్యాయి. ఈ మేరకు ఆయా సంఘాల ఐక్యవేదిక కూడా ప్రకటించింది. చర్చలు విఫలమైన నేపథ్యంలో.. ఈనెల 21న ఉమ్మడి జిల్లాల డీఈఓ కార్యాలయాల ముట్టడి యథాతథంగా కొనసాగుతుందని ఐక్యవేదిక నేతలు మీడియాకు వెల్లడించారు. నిజానికి.. విద్యారంగ సంస్కరణల పేరుతో ప్రభుత్వ విద్యారంగాన్ని సర్కారు బలహీనపరచడాన్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.దీంతో.. ఉపాధ్యాయుల సర్దుబాటు, పాఠశాలల రేషనలైజేషన్, ఉపాధ్యాయుల బదిలీ చట్టంలోని పలు అంశాలపై సోమవారం గుంటూరు జిల్లా ఆత్మకూరులోని విద్యాభవన్‌లో పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు ఉపాధ్యాయ సంఘాల నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ చర్చల్లో మొత్తం 19 డిమాండ్లను విద్యాశాఖ ముందుంచామని.. కొన్ని అంశాలపైనే సానుకూల స్పందన వచ్చిందని.. కీలక అంశమైన ఇంగ్లిష్‌కు సమాంతరంగా తెలుగు, ఇతర మైనర్ మీడియంలను కొనసాగించి స్టాఫ్ పాటర్న్‌ను కొనసాగించాలన్న డిమాండ్‌ను అంగీకరించలేదని నేతలు తెలిపారు. ఉన్నత పాఠశాలల్లో 1 : 35 నిష్పత్తిని అమలుచేయాలని.. 45 మంది విద్యార్థులు దాటాక రెండో సెక్షన్ ఏర్పాటుపైనా స్పష్టత రాలేదన్నారు.అలాగే.. మోడల్ ప్రాథమిక పాఠశాలల హెచ్ఎంలుగా స్కూల్ అసిస్టెంట్లను నియమించడం అశాస్త్రీయమైందని వారన్నారు. ఫౌండేషన్ స్కూళ్లల్లో 1 : 20 నిష్పత్తిలో ఉపాధ్యాయుల కేటాయింపునకు చర్చల్లో అంగీకరించారని, అయితే ఇది జీఓ–117లో ఉన్న అంశమేనన్నారు. ఇక స్టడీ లీవ్‌లో ఉండి రెండు నెలల్లో సర్వీసులో చేరే ఉపాధ్యాయుల పోస్టులను బదిలీల్లో ఖాళీగా చూపబోమని చెప్పడం.. కేవలం 1,400 మంది ఎస్జీటీలకు మాత్రమే పదోన్నతులిచ్చి హెచ్ఎంలుగా నియమిస్తామడంలో అర్థంలేదని నేతలు తెలిపారు. మరోవైపు.. ఉపాధ్యాయ బదిలీల చట్టం ఇప్పటికే రావడంతో అందులో మార్పులు సాధ్యంకాదని అధికారులు తేల్చిచెప్పడంతో ఉపాధ్యాయులు గతంలో ప్రకటించిన ఉద్యమ కార్యాచరణ ప్రకారం ఈనెల 21న డీఈఓ కార్యాలయల ముట్టడికి సిన్నద్ధమవుతున్నారు.మంత్రి జోక్యం చేసుకోవాలి..ఇదిలా ఉంటే.. ఉపాధ్యాయ బదిలీలు, పాఠశాలలు పునర్వ్యవస్థీకరణపై ఉపాధ్యాయ సంఘాలతో సోమవారం జరిగిన చర్చలు విఫలమైన నేపథ్యంలో సమస్యల పరిష్కారానికి విద్యాశాఖ మంత్రి లోకేశ్ జోక్యం చేసుకోవాలని ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీవీ ప్రసాద్, రాధాకృష్ణ కోరారు.

బాబు ప్రభుత్వ ‘చావు’ తెలివి
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం రెడ్‌బుక్ కుట్రలకు మరింతగా బరితెగిస్తోంది. ఎంతగా అంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సహజ మరణాలు, వృద్ధాప్య, అనారోగ్యసమస్యలతో మరణాలనూ వక్రీకరిస్తూ అక్రమ కేసుల నమోదుకు తెగబడుతోంది. 2022, మార్చిలో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో 16 మంది మరణించారు. కోవిడ్ అనంతర అనారోగ్య సమస్యలు, వృద్ధాప్య సమస్యలతో వారు మరణించారు.వీటిపై అప్పట్లోనే ఎల్లో మీడియా సహకారంతో అప్పటి ప్రతిపక్ష టీడీపీ రాద్ధాంతం చేసింది. కల్తీసారా తాగి మరణించారని దుష్ప్రచారం చేసింది. అప్పట్లోనే విచారణ చేపట్టిన అధికారులు ఆ 16 మంది అనారోగ్య, వృద్ధాప్య సమస్యలతోనే మరణించారని నిర్ధారించారు. కాగా ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వం ఆ మరణాలపై విచారణ పేరుతో కొత్త కుట్రకు తెరతీయడం గమనార్హం. ప్రభుత్వ పెద్దల కుట్రకు డీజీపీ వత్తాసు⇒ టాస్క్ ఫోర్స్ ఏర్పాటుమరో అక్రమ కేసుకు తెరతీయాలన్న టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దల కుట్రకు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా వత్తాసు పలికారు. మూడేళ్ల క్రితం నాటి సహజ మరణాలపై తాజాగా ఆయన సందేహం వ్యక్తం చేయడమే అందుకు నిదర్శనం. ఆ మరణాలపై విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల నివేదిక పంపారు. కల్తీ సారా వల్లే ఆ మరణాలు సంభవించాయని ఎఫ్ఎస్ఎల్ వెల్లడించిందని కూడా ఆయన ఏకపక్షంగా ఆ నివేదికలో పేర్కొనడం గమనార్హం. విచారణతో నిమిత్తం లేకుండా ఏకంగా డీజీపీనే ఏకపక్షంగా కల్తీ సారా అని చెప్పేయడం విడ్డూరంగా ఉంది.అంటే రాబోయే నివేదిక ఎలా రూపొందించాలన్నది కూడా ఆయన పోలీసు అధికారులకు పరోక్షంగా స్పష్టం చేశారు. ఇక తాము అనుకున్నట్టుగా డీజీపీ ద్వారా నివేదిక రాగానే ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఆ మరణాలపై దర్యాప్తునకు టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏలూరు ఎస్పీ కేపీఎస్ కిశోర్, ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కేవీఎన్ ప్రభుకుమార్, కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ఫోరెన్సిక్ విభాగం అధిపతి కె.ఉమామహేశ్వరరావుతో టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. 2022లో జంగారెడ్డిగూడెంలో 16మంది మృతిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని, అప్పటి అధికారులు చేపట్టిన విచారణలో లోపాలు ఉంటే గుర్తించాలని, తదుపరి తీసుకోవాల్సిన న్యాయ, పరిపాలన, సాంకేతికపరమైన చర్యలను సూచించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.వృద్ధాప్య, అనారోగ్య సమస్యలతోనే 16 మంది మృతి⇒ ఆనాడే అధికారుల దర్యాప్తులో వెల్లడిజంగారెడ్డిగూడెంలో 2022 మార్చిలో 16మంది మృతిపై అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వమే దర్యాప్తునకు ఆదేశించింది. అప్పటి పోలీసు, రెవెన్యూ, వైద్య అధికారులు సమగ్రంగా దర్యాప్తు చేశారు. ఆర్డీవో ప్రసన్నలక్ష్మి, డీఎంహెచ్‌వో బి. రవి నేతృత్వంలో రెవెన్యూ, వైద్య అధికారులు మరణించిన 16 మంది నివాసాలకు వెళ్లి విచారణ చేశారు. మృతుల బంధువుల వాంగ్మూలాలను నమోదు చేశారు.వారి కుటుంబ పరిస్థితులను అధ్యయనం చేశారు. వైద్య నివేదికలు పరిశీలించారు. అనారోగ్య, వృద్ధాప్య సమస్యలతోనే ఆ 16 మంది మరణించారని నిర్ధారించారు. వారిలో ముగ్గురికి మాత్రమే మద్యం వ్యసనం ఉందని కూడా తేల్చారు. వారు కూడా జంగారెడ్డిగూడెంలో వేర్వేరు ప్రాంతాలకు చెందినవారు. వారి మరణానికీ కేవలం మద్యంపానం ఒక్కటే కారణం కాదు. ఇతరత్రా ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. అనంతరం ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించారు. ఆ నివేదిక ప్రకారం ఆ 16 మంది మృతికి కారణాలు ఇవీ...నాటి ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ విచారణలోనూ అదే వెల్లడిఆయనే ప్రస్తుతం రాష్ట్ర ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్‌వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఈ మరణాలపై పోలీసు విచారణ కూడా నిర్వహించింది. అప్పటి ఏలూరు జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ ఆ విచారణ నిర్వహించారు. ఆయన జంగారెడ్డిగూడెంలో పర్యటించారు. అప్పటి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ హైమావతి, ఆర్డీవో ప్రసన్న లక్ష్మి, డీఎంహెచ్‌వో బి.రవి, డిప్యూటీ డీఎంహెచ్‌వో మురళీకృష్ణ, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(సెబ్) అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస చౌదరి, సూపరింటెండెంట్ బి.అరుణ కుమారి, డీఎస్పీ కేవీ సత్యనారాయణ తదితరులతో సమీక్షించారు.వృద్ధాప్య, అనారోగ్య సమస్యలతోనే ఆ 16 మంది మరణించారని నివేదించారు. అప్పుడు దర్యాప్తు నిర్వహించిన జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ ప్రస్తుతం రాష్ట్ర ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్‌గా ఉన్నారు కూడా. కానీ ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం వాస్తవాలను వక్రీకరించి అక్రమ కేసు నమోదుకు సిద్ధపడుతుండటం కేవలం రాజకీయ కక్ష సాధింపు కుట్రేనన్నది స్పష్టమవుతోంది.

ఈ రాశి వారికి వ్యాపార , ఉద్యోగాలలో నూతనోత్సాహం.
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి: బ.అష్టమి రా.12.22 వరకు, తదుపరి నవమి, నక్షత్రం: ధనిష్ఠ ప.3.36 వరకు, తదుపరి శతభిషం, వర్జ్యం: రా10.35 నుండి 12.08 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.04 నుండి 8.56 వరకు, తదుపరి రా.10.49 నుండి 11.33 వరకు, అమృత ఘడియలు: లేవు; రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు, యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు, సూర్యోదయం: 5.30, సూర్యాస్తమయం: 6.21. మేషం: ఆర్థికంగా బలం చేకూరుతుంది. నూతన వస్తులాభాలు. ప్రముఖులతో పరిచయాలు. సమాజసేవలో పాల్గొంటారు. కీలక నిర్ణయాలు. వ్యాపార , ఉద్యోగాలలో నూతనోత్సాహం.వృషభం: చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. కార్యజయం. ఆస్తి వివాదాలు తీరతాయి. అందర్నీ ఆకట్టుకుంటారు. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి.మిథునం: రుణయత్నాలు సాగిస్తారు. దూరప్రయాణాలు. కొన్ని ఒప్పందాలలో అవాంతరాలు. సోదరులతో కలహాలు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలు నత్తనడనక సాగుతాయి.కర్కాటకం: బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఎంత కష్టించినా ఫలితం శూన్యం. విద్యార్థులకు నిరాశ. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.సింహం: గత సంఘటనలు నెమరువేసుకుంటారు. ఆస్తి విషయంలో అగ్రిమెంట్లు. ఆప్తుల నుండి శుభవార్తలు. వాహనసౌఖ్యం. ముఖ్య నిర్ణయాలు. వృత్తి, వ్యాపారాలు మరింత సానుకూలం.కన్య: బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆస్తుల విషయంలో చిక్కులు తొలగుతాయి. సోదరులతో సఖ్యత. విందువినోదాలు పరిచయాలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.తుల: అంచనాలు తప్పుతాయి. పనులు ముందుకు సాగవు. ఆస్తివివాదాలు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాపరుస్తుంది. సోదరులు, మిత్రులతో విభేదాలు వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి.వృశ్చికం: రుణబాధలు తప్పవు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. బంధువులతో అకారణంగా తగాదాలు. శ్రమ తప్పదు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.ధనుస్సు: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. రుణాలు తీరుస్తారు. ప్రయాణాలు సాపీగా సాగుతాయి.కొత్త పనులు చేపడతారు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి ఉంటుంది.మకరం: వ్యవహారాలు నిదానిస్తాయి. శ్రమ మరింత పెరుగుతుంది. దూరప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. కుటుంబంలో సమస్యలు. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.కుంభం: పనుల్లో కొంత జాప్యం. ఆర్థిక లావాదేవీలు అంతంతగానే ఉంటాయి. కుటుంబంలో కొన్ని సమస్యలు. దూరప్రయాణాలు. ఆరోగ్యం సహకరించదు. వ్యాపార, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.మీనం: ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆత్మీయులతో మాటపట్టింపులు. కొత్త రుణయత్నాలు. మానసిక అశాంతి. కుటుంబంలో ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.

పాక్ చెప్పిందంతా అబద్ధం
ఇస్లామాబాద్: రెండు నెలల క్రితం పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును హైజాక్ చేసిన ఉదంతంలో ఆ దేశ ప్రభుత్వం, సైన్యం చెప్పినదంతా అబద్ధమని బలూచిస్తాన్ వేర్పాటువాదుల గ్రూప్ అయిన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) సోమవారం ప్రకటించింది. రైలు హైజాక్ ఘటనలో తమదే పైచేయి అని పేర్కొంటూ సాక్ష్యాధారాలతో సవివరంగా ఒక వీడియోను రూపొందించి తాజాగా విడుదలచేసింది. పాకిస్తాన్లో విస్తీర్ణంపరంగా అతిపెద్ద ప్రావిన్స్ అయినప్పటికీ అభివృద్ధిలో ఆమడదూరంలో నిలిచిపోయిన బలూచిస్తాన్ ప్రజలు ఏకమై తమ ప్రాంత స్వయంప్రతిపత్తే లక్ష్యంగా ఉద్యమిస్తున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఉద్యమంలో భాగంగా మార్చి 11వ తేదీన పెషావర్‌కు వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును వందలాది మంది బలూచ్ సాయుధులు రైలు పట్టాలను పేల్చేశాక హైజాక్ చేయడం తెల్సిందే. అయితే ఈ ఘటనలో బలూచ్ మిలిటెంట్లను హతమార్చి వందల మంది ప్రయాణికులను కాపాడామని పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యం ప్రకటించాయి. అయితే అదంతా అబద్ధమంటూ 36 నిమిషాల వీడియోను బలూచ్ ఆర్మీ మీడియా విభాగం హక్కాల్ ఒక వీడియోను బయటపెట్టింది. అందులో దాడికి ముందే సుశిక్షితులైన వందలాది మంది బీఎల్ఏ ఫైటర్లు షూటింగ్ ప్రాక్టీస్ చేయడం, రైలును హైజాక్ చేశాక ఏ బోగీ జనాలను ఎటువైపు తీసుకెళ్లాలి? ఎవరి బాధ్యతలు ఏమిటి? వంటి వాటితోపాటు బందీలకు ఎలాంటి హానీ తలపెట్టకుండా జాగ్రత్తగా రైలు నుంచి దూరంగా తీసుకెళ్లిన దృశ్యాలు ఆ వీడియోలో కనిపించాయి. బందీలను చిత్రహింసలకు గురిచేసి కొందరిని చంపేశామన్న పాక్ సైన్యం వాదనల్లో నిజంలేదని బీఎల్ఏ ఈ వీడియోతో నిరూపించింది. బందీల్లో 200 మంది పాక్ పోలీసులు, అధికారులు ఉన్నారు. వాళ్లను రెండు రోజులపాటు బంధించిన దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి. మహిళలు, వృద్ధులు, చిన్నారులను హింసించారన్న వాదనలో వాస్తవం లేదని ఆ వీడియో చూస్తే తెలుస్తోంది. అసలు దాడి చేయడానికి గల కారణాలు, ఆవశ్యకతను బీఎల్ఏ సీనియర్ నేత ఒకరు ఈ వీడియో మొదట్లోనే స్పష్టంచేశారు. ‘‘మా పోరాటం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా ఉద్యమం కీలకదశకు చేరుకుంటోంది. ఈ దశలో సంక్షిష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచి్చంది. మా యువ ఫైటర్లు ఇలాంటి కఠిన నిర్ణయాలను అమలుచేయాల్సి వచి్చంది. ఇలాంటి నిర్ణయాలుకాకుండా మరే ప్రత్యామ్నాయాలు లేవని మా వాళ్లకూ అర్థమైంది. తుపాకీని నిలువరించాలంటే తుపాకీని పట్టుకోవాల్సిందే. తుపాకీ పేలుడు శబ్దం కూడా కొంత దూరం వరకే వినిపిస్తుంది. తన తండ్రి కోసం తనయుడు ప్రాణత్యానికైనా సిద్ధమయితే అదే కొడుకు కోసం తండ్రి కూడా ఎంతకైనా తెగిస్తాడు’’అని ఆయన చెప్పాడు. హైజాక్ ప్రణాళిక రచన, అమలు, ముందుండి నడిపించి ఫిదాయీ ఫైటర్ యూనిట్ మజీద్ బ్రిగేడ్ వివరాలు, ఫొటోలు, సభ్యుల స్పందనలను వీడియోకు జతచేశారు. పాక్ సైన్యం ప్రతిదాడిచేసినా అత్యల్ప స్థాయిలో తమ వైపు ప్రాణనష్టం జరిగిందంటూ వీరమరణం పొందిన వాళ్లకు నివాళులు అరి్పంచిన దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. 30 గంటలపాటు సైనిక ఆపరేషన్ తర్వాత 33 మంది రెబల్స్‌ను మట్టుబెట్టామని పాక్ సైన్యం ఆనాడు ప్రకటించింది. బందీలను విడిపించే క్రమంలో 23 మంది జవాన్లు, ముగ్గురు రైల్వే ఉద్యోగులు, ఐదుగురు ప్రయాణికులు చనిపోయారని తెలిపింది. అయితే తాము మాత్రం బందీలుగా ఉన్న 214 మంది పాకిస్తాన్ పోలీసులందరినీ చంపేశామని రెబల్స్ ప్రకటించారు.

ప్రజాస్వామ్యానికి.. టీడీపీ పాతర
సాక్షి, అమరావతి/నెట్వర్క్: గ్రేటర్ విశాఖ డిప్యూటీ మేయర్ సహా వివిధ మున్సిపల్ చైర్పర్సన్లు, మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష, 20 పంచాయతీల్లో ఉప సర్పంచ్ పదవుల కోసం సోమవారం నిర్వహించిన ఎన్నికల్లో టీడీపీ నేతలు ప్రజాస్వామ్యానికి పాతర వేస్తూ.. అక్రమాల జాతర నడిపించారు. తిరువూరు మున్సిపల్ చైర్పర్సన్ పదవిని సంఖ్యాబలం లేకపోయినా తన ఖాతాలో వేసుకునేందుకు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వీధి రౌడీలా వ్యవహరించారు. ఎన్నిక వాయిదా వేయించాలనే కుట్రతో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. మహిళా కౌన్సిలర్లపై చెప్పులు, వాటర్ బాటిళ్లతో దాడికి తెగబడ్డారు. బారికేడ్లను ధ్వంసం చేశారు. దౌర్జన్యకాండను అడ్డుకోవాల్సిన పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించారు. చివరకు కోరం సరిపోలేదంటూ ఎన్నికల అధికారి, ఆర్డీఓ మాధురి మంగళవారానికి వాయిదా వేశారు. నరసరావుపేట, కారంపూడిలో దొడ్డిదారిన.. నరసరావుపేట మండల పరిషత్ ఉపాధ్యక్ష పదవి కోసం ఇప్పటికే రెండుసార్లు ఎన్నిక నిర్వహించగా కోరం లేక వాయిదా పడింది. మూడోసారి సోమవారం ఎన్నిక నిర్వహించారు. కనీసం నామినేషన్ వేయడానికి టీడీపీ తరఫున ఒక్క ఎంపీటీసీ కూడా లేకపోయినా ఆ పార్టీ ఎన్నికల బరిలో నిలిచింది. పోలీసుల వేధింపులు, అక్రమ కేసులకు నిరసనగా ప్రత్యేక సమావేశాన్ని వైఎస్సార్సీపీ బహిష్కరించింది.మూడోసారి నిర్వహిస్తున్న ఎన్నిక సమావేశం కావడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల అధికారి ప్రత్యేక అధికారాన్ని వినియోగించి.. సమావేశానికి ఎన్నికైన ముగ్గురు ఎంపీటీసీల్లో కొత్తపాలెం ఎంపీటీసీ వంపుగుడి సువార్తమ్మ మండల పరిషత్ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైనట్టు ప్రకటించారు. కాగా.. కారంపూడి మండల పరిషత్ ఉపాధ్యక్షురాలిగా టీడీపీ బలపరిచిన గాడిపర్తి రమాదేవి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించారు. ఇక్కడ 14 మంది ఎంపీటీసీలకు గాను ఆరుగురు మాత్రమే హాజరయ్యారు. వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను ఎంపీడీఓ కార్యాలయంలోకి వెళ్లనివ్వకుండా టీడీపీ నేతలు అడ్డుకుని దాడులు చేశారు. భయానక వాతావరణం సృష్టించి టీడీపీ ఈ పదవిని తన ఖాతాలో వేసుకుంది. ప్రలోభాలు, బెదిరింపులకు పాల్పడి.. శ్రీసత్యసాయి జిల్లా కదిరి మున్సిపల్ చైర్పర్సన్, గాండ్లపెంట ఎంపీపీ ఎన్నికల్లో టీడీపీ ప్రలోభాల రాజకీయం చేసింది. పదవులు, డబ్బు ఎరగా వేసి.. వినని వారిని కేసులతో భయపెట్టి తమ వైపు ఓటు వేయించుకుంది. గాండ్లపెంట మండలంలో టీడీపీకి కేవలం ఒక్క ఎంపీటీసీ మాత్రమే ఉండగా.. డబ్బులు ఎరవేసి ముగ్గురు ఎంపీటీసీలను తనవైపు తిప్పుకుంది. పార్టీ ఫిరాయించిన వ్యక్తికి ఎంపీపీ పదవి కట్టబెట్టింది. రామగిరి ఎంపీపీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మహిళా అభ్యర్థి లేకపోవడంతో మరోసారి వాయిదా పడింది. విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపాలిటీ కూటమి కుట్రలకు బలైంది. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను మాజీ మంత్రి సుజయకృష్ణ రంగారావు, ఎమ్మెల్యే బేబీ నాయన ప్రలోభాలకు గురిచేసి, భయపెట్టి టీడీపీ వైపు తిప్పుకున్నారు. సోమవారం జరిగిన మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికలో రాంబార్కి శరత్ ఎన్నికయ్యారు. గ్రేటర్ విశాఖలో జనసేనకు ఝలక్ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) డిప్యూటీ మేయర్ ఎన్నికలో జనసేన పారీ్టకి టీడీపీ కార్పొరేటర్లు ఝలక్ ఇచ్చారు. ఈ పదవి జనసేనకు ప్రకటించడంతో పలువురు టీడీపీ కార్పొరేటర్లు సమావేశానికి హాజరుకాకుండా షాకిచ్చారు. గత నెల 28న నిర్వహించిన మేయర్ ఎన్నికకు 74 మంది సభ్యులు హాజరుకాగా.. సోమవారం నిర్వహించిన డిప్యూటీ మేయర్ ఎన్నికకు కేవలం 54 మంది మాత్రమే హాజరయ్యారు. ఎన్నిక ప్రత్యేక సమావేశానికి 56 మంది సభ్యులు హాజరుకావాలి. కోరం లేకపోవడంతో ఎన్నికల అధికారి మయూర్ అశోక్ ఎన్నిక ప్రత్యేక సమావేశాన్ని మంగళవారానికి వాయిదా వేశారు. యలమంచిలి ఎంపీపీ వైఎస్సార్సీపీ కైవసం రెండు నెలలపాటు అధికార పార్టీ అక్రమ కేసులు, తీవ్రస్థాయి బెదిరింపులు, మానసిక వేధింపుల్ని తట్టుకుని వైఎస్సార్సీపీలోనే కొనసాగిన ఎంపీటీసీ ఇనుకొండ ధనలక్ష్మి పశి్చమ గోదావరి జిల్లా యలమంచిలి ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీడీపీకి బలం లేకపోయినప్పటికీ అత్తిలి ఎంపీపీ స్థానాన్ని, కైకలూరు వైస్ ఎంపీపీ స్థానాన్ని బెదిరింపులతో దక్కించుకుంది. అత్తిలిలో టీడీపీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ చిల్లర రాజకీయాలకు తెగబడ్డారు. ఆపార్టీ తీవ్రస్థాయి బెదిరింపులతో కొందరు వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను టీడీపీలో చేర్చుకుని అత్తిలి ఎంపీపీ స్థానాన్ని దక్కించుకున్నారు. ఆ స్థానాల్లోనూ వైఎస్సార్సీపీ జయకేతనం ప్రకాశం జిల్లా మార్కాపురం, త్రిపురాంతకం మండల ఉపాధ్యక్షుల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. మార్కాపురం వైస్ ఎంపీపీ–2గా కుందురు మల్లారెడ్డి, త్రిపురాంతకం వైస్ ఎంపీపీగా పాటిబండ్ల కృష్ణ ఎన్నికయ్యారు. అనంతపురం జిల్లా కంబదూరు మండల పరిషత్ ఉపాధ్యక్షుడిగా వైఎస్సార్సీపీకి చెందిన ఎనుముల సోమశేఖర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చిత్తూరు జిల్లా తవణంపల్లె రెండో వైస్ ఎంపీపీగా చెర్లోపల్లె వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అనసూయమ్మ ఎన్నికయ్యారు.

మళ్లీ ఐపీఓల సందడి!
న్యూఢిల్లీ: గత కొద్ది నెలలుగా కళతప్పిన ప్రైమరీ మార్కెట్లో మళ్లీ ఐపీఓల సందడి మొదలైంది. 2025లో అడపాదడపా వస్తున్న పబ్లిక్ ఇష్యూలు ఇకపై జోరందుకోనున్నాయి. ఈ నెలాఖరులోగా ఆరు కంపెనీలు స్టాక్ మార్కెట్ తలుపుతట్టనున్నాయి. మొత్తం మీద వచ్చే పది రోజుల్లో రూ.11,669 కోట్లు సమీకరించేందుకు రంగం సిద్ధమైంది. టెక్స్టైల్ కంపెనీ బొరానా వీవ్స్ నేడు (20న) ప్రారంభమై 22న ముగుస్తుంది. ఇక పుణేకు చెందిన ఆటోమొబైల్ విడిభాగాల తయారీ సంస్థ బెల్రైజ్ ఇండస్ట్రీస్ ఇష్యూ 21న ఆరంభమై 23న క్లోజవుతుంది. మిగిలిన నాలుగు కంపెనీలు వచ్చే వారంలో పబ్లిక్ ఆఫర్ చేపట్టనున్నాయి. లీలా ప్యాలెస్ హోటల్స్ అండ్ రిసార్ట్స్‌కు చెందిన స్లోస్ బెంగళూరు లిమిటెడ్, ఏజిస్ వోప్యాక్ టెరి్మనల్స్, అరిస్ఇన్ఫ్రా సొల్యూషన్స్, స్కోడా ట్యూబ్స్ ఈ జాబితాలో ఉన్నాయి. ఈ వారంలోనే ఈ నాలుగూ ప్రైస్ బ్యాండ్లను ప్రకటించనున్నాయి. ధరల శ్రేణి ఇలా... బొరానా వీవ్స్ రూ.144 కోట్ల సమీకరణ కోసం చేపడుతున్న పబ్లిక్ ఇష్యూకి రూ. 205–216 ధరల శ్రేణి (ప్రైస్ బ్యాండ్) ప్రకటించింది. బెల్రైజ్ ఇండస్ట్రీస్ ఈ ఇష్యూ ద్వారా రూ.2,150 కోట్లు సమీకరిస్తోంది. దీనికి ధరల శ్రేణి రూ. 85–90గా నిర్ణయించింది. స్లోస్ బెంగళూరు రూ.3,000 కోట్ల తాజా ఈక్విటీతో పాటు ఓఎఫ్ఎస్ ద్వారా రూ.2,000 కోట్ల ప్రమోటర్ షేర్లను కూడా విక్రయించనుంది. ఏజిస్ లాజిస్టిక్స్ అనుబంధ సంస్థ ఏజిస్ వోప్యాక్ టెర్మినల్స్ తాజా ఈక్విటీ షేర్ల జారీ ద్వారా రూ.3,500 కోట్లు సమీకరించనుంది. ఇక నిర్మాణ రంగ మెటీరియల్ సరఫరాదారు ఆరిస్ఇన్ఫ్రా సొల్యూషన్స్ రూ.600 కోట్లు, స్కోడా ట్యూబ్స్ రూ.275 కోట్లు సమీకరించే అవకాశం ఉంది.ఇప్పటిదాకా 10...: ప్రపంచ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకు తోడు ట్రంప్ టారిఫ్ వార్ దెబ్బకు ఈ ఏడాది మార్కెట్లో తీవ్ర అనిశ్చితి నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో మన సూచీలు ఆల్‌టైమ్ గరిష్టం నుంచి దాదాపు 17 శాతం మేర దిద్దుబాటుకు గురయ్యాయి. ఈ ప్రభావంతో కంపెనీలు ఐపీఓలకు ముఖం చాటేశాయి. 2024లో రికార్డు స్థాయిలో 91 పబ్లిక్ ఇష్యూల ద్వారా కంపెనీలు రూ.1,6 లక్షల కోట్లు సమీకరించగలిగాయి. రిటైల్ ఇన్వెస్టర్లు కూడా పొలోమంటూ వచి్చన ఇష్యూకల్లా సబ్స్క్రయిబ్ చేయడంతో ప్రైమరీ మార్కెట్ కళకళలాడింది. అయితే, 2025లో ఇప్పటిదాకా కేవలం 10 కంపెనీలు మాత్రమే ఐపీఓలకు వచ్చాయి. కాగా, టారిఫ్ యుద్ధానికి ట్రంప్ 90 రోజుల విరామం ప్రకటించడం.. ట్రేడ్ డీల్స్‌పై జోరుగా చర్చలు జరుగుతుండటంతో మార్కెట్లు మళ్లీ తాజా కనిష్టాల నుంచి బాగానే బౌన్స్ అయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ ఆల్‌టైమ్ గరిష్టానికి మరో 4 శాతం దూరంలోనే ఉన్నాయి. సెకండరీ మార్కెట్ దన్నుతో ఐపీఓలకు కంపెనీలు మళ్లీ ముందుకొస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా, సెబీ నుంచి దాదాపు 57 కంపెనీలకు ఐపీఓల కోసం దాదాపు లైన్ క్లియర్ కాగా.. మరో 74 కంపెనీల దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని యాక్సిస్ క్యాపిటల్ వెల్లడించింది. ఇందులో సోలార్/పునరుత్పాదక ఇంధనం నుంచి కో–వర్కింగ్ స్పేస్, ఫార్మా, హెల్త్‌కేర్, తయారీ, కెమికల్స్, రియల్టీ తదితర రంగాలకు చెందిన సంస్థలు ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి ఇష్యూగా నిలిచిన ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీ ఏథర్ ఎనర్జీ దాదాపు రూ.3,000 కోట్లు సమీకరించడం విదితమే. అయితే, పేలవంగా లిస్టయ్యి.. ఇప్పటికీ ఇష్యూ ధర (రూ.321) కంటే దిగువనే ఉండటం గమనార్హం.కోల్ ఇండియా సబ్సిడరీలు కూడా..ప్రభుత్వరంగ బొగ్గు దిగ్గజం కోల్ ఇండియాకు చెందిన రెండు అనుబంధ సంస్థలు.. భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ (బీసీసీఎల్), సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ (సీఎంపీడీఐ) ఐపీఓకు సన్నద్ధమవుతున్నాయి. ఈ రెండూ త్వరలోనే సెబీకి ముసాయిదా పత్రాలను దాఖలు చేయనున్నట్లు కోల్ ఇండియా డైరెక్టర్ దేబశిష్ నందా వెల్లడించారు. బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లను నియమించుకున్నామని, మార్కెట్ పరిస్థితులను బట్టి ఇష్యూ ఉంటుందని చెప్పారు. కోల్ ఇండియాకు 7 సబ్సిడరీలు ఉండగా. దేశీ బొగ్గు ఉత్పత్తిలో 80% వాటా దీని చేతిలోనే ఉంది.

సహ నిందితుల వాంగ్మూలం ఆధారమా?
సాక్షి, అమరావతి: మద్యం విధానంపై అక్రమ కేసులో కె.ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్ప ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టివేసే సమయంలో సహ నిందితుల నేరాంగీకార వాంగ్మూలాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోవడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. భారతీయ సాక్ష్యాల చట్టం 1872 సెక్షన్ 30 కింద తుది విచారణ (ట్రయల్) సందర్భంగా ఏ వాంగ్మూలాలను అయితే పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందో, వాటిని ముందస్తు బెయిల్, బెయిల్ మంజూరు సమయంలో కూడా పరిగణనలోకి తీసుకోవచ్చని హైకోర్టు చెప్పడాన్ని సుప్రీంకోర్టు ఆక్షేపించింది.హైకోర్టు అభిప్రాయంతో తాము ఎంతమాత్రం ఏకీభవించలేమని స్పష్టం చేసింది. సహ నిందితుల వాంగ్మూలాలను ముందస్తు బెయిల్, బెయిల్ మంజూరు సమయంలో పరిగణనలోకి తీసుకోవడానికే వీల్లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. సీఆర్పీసీ సెక్షన్ 161 కింద వాంగ్మూలం ఇచ్చింది సాక్షా? లేక నిందితుడా? లేక నిందితుడిగా మారే వ్యక్తా? అన్న విషయాన్ని బెయిల్, ముందస్తు బెయిల్ మంజూరు సమయంలో కోర్టు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కొన్ని సందర్భాల్లో 161 వాంగ్మూలం ఇచ్చిన వ్యక్తి నిందితుడు కాకపోవచ్చు.. ఆ తరువాత నిందితుడు కావొచ్చని పేర్కొంది. నేర విచారణ ప్రక్రియలో ఓ నిందితుడి వాంగ్మూలాన్ని సహ నిందితుడికి వ్యతిరేకంగా ఉపయోగించరాదన్నది ప్రాథమిక సూత్రమని తెలిపింది. రాజకీయ దురుద్దేశాలున్నట్లు పిటిషనర్లు ప్రాథమిక ఆధారాలు చూపారు.. ప్రభుత్వం న్యాయపరమైన పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.. మద్యం కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ కృష్ణమోహన్‌రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, వికాట్ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన న్యాయమూర్తులు జస్టిస్ జంషేడ్ బొర్జూర్ పారీ్థవాలా, జస్టిస్ మహాదేవన్‌ల ధర్మాసనం వాటిని కొట్టేసింది.దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నందున దాన్ని అడ్డుకోవడం సాధ్యం కాదంటూ పిటిషన్లు కొట్టేసింది. ఇదే సమయంలో మద్యం కేసు నమోదు వెనుక రాజకీయ దురుద్దేశాలున్నట్లు పిటిషనర్లు ప్రాథమిక ఆధారాలను చూపారని, ఇందుకు ప్రభుత్వం న్యాయపరమైన పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ తీర్పునకు సంబంధించిన కాపీ తాజాగా అందుబాటులోకి వచ్చింది. ఈ తీర్పులో ధర్మాసనం నిందితుల వాంగ్మూలాల గురించి పూర్తిస్థాయిలో చర్చించింది. కస్టడీలో పోలీసులకిచ్చిన వాంగ్మూలానికి ఆమోద యోగ్యత లేదు... ‘భారతీయ సాక్ష్యాల చట్టం సెక్షన్ 24 ప్రకారం సహ నిందితుడిపై మరో నిందితుడు ఇచ్చిన వాంగ్మూలాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు.. ఆ వాంగ్మూలాన్ని ఆ వ్యక్తికి వ్యతిరేకంగా స్పష్టమైన సాక్ష్యంగా రుజువు చేయాల్సి ఉంటుంది. ఈ వాంగ్మూలం భయపెట్టి, బెదిరించి, ప్రలోభపెట్టి తీసుకున్నదై ఉండకూడదు. పోలీసు అధికారికి ఇచ్చిన వాంగ్మూలాన్ని నిందితుడికి వ్యతిరేకంగా ఉపయోగించడానికి వీల్లేదు. పోలీసు అధికారికి ఇచ్చిన వాంగ్మూలం భారతీయ సాక్ష్యాల చట్టం సెక్షన్ 25 ప్రకారం పరిగణనలోకి తీసుకోవడానికి వీల్లేదు. ఈ అంశాలన్నింటినీ కూడా కేసు ట్రయల్ సందర్భంగా పరిశీలించాల్సి ఉంటుంది. నిందితులందరినీ ఉమ్మడిగా విచారించినప్పుడు (జాయింట్ ట్రయల్) మాత్రమే సహ నిందితుల వాంగ్మూలాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. వారిని ఒకే కేసులో, ఒకే కోర్టులో కలిపి విచారిస్తున్న సమయంలోనే వాంగ్మూలాలను పరిగణనలోకి తీసుకోవడం సాధ్యమవుతుంది.సెక్షన్ 30 కింద అభియోగాలు నమోదు కానప్పుడు, నిందితులను విచారణకు హాజరుపరచనప్పుడు భారతీయ సాక్ష్యాల చట్టం వర్తించదు. ఈ నేపథ్యంలో నిందితుల వాంగ్మూలాన్ని కోర్టులు పరిగణనలోకి తీసుకోజాలవు. ఒకవేళ సహ నిందితుల వాంగ్మూలాన్ని బెయిల్, ముందస్తు బెయిల్ పిటిషన్ల విచారణ సందర్భంగా పరిగణనలోకి తీసుకోవచ్చని అనుకున్నా కేవలం నేరాంగీకార వాంగ్మూలమే కాకుండా సహ నిందితుడిపై ఉన్న ఇతర స్వతంత్ర సాక్ష్యాలను కూడా కోర్టు తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి. సెక్షన్ 25 ప్రకారం కస్టడీలో పోలీసులకిచ్చిన వాంగ్మూలాలకు ఆమోద యోగ్యత లేనందున ఆ వాంగ్మూలాలను సహ నిందితులకు వ్యతిరేకంగా ఉపయోగించరాదు. సెక్షన్ 26 ప్రకారం మేజి్రస్టేట్ సమక్షంలో ఇచ్చిన వాంగ్మూలాన్ని మాత్రమే సహ నిందితులకు వ్యతిరేకంగా ఉపయోగించవచ్చు’ అని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. పోలీసు అధికారికి నిందితుడు ఇచ్చిన వాంగ్మూలాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరంలేదు‘నిందితుడి వాంగ్మూలం సహ నిందితుడిని ఇరికించేలా ఉంటే ఆ వాంగ్మూలాన్ని సీఆర్పీసీ సెక్షన్ 161 ప్రకారం పరిగణనలోకి తీసుకోవచ్చా అనే విషయంలో ఎలాంటి అయోమయానికి, గందరగోళానికి తావులేకుండా స్పష్టతనివ్వదలిచాం. ఎఫ్ఐఆర్లో పేరున్న వ్యక్తిని, నేరం చేసిన వ్యక్తిని పోలీసులు విచారించి సీఆర్పీసీ సెక్షన్ 161 కింద అతడి వాంగ్మూలాన్ని నమోదు చేయవచ్చు. అయితే అలా నమోదు చేసిన వాంగ్మూలానికి ఎంతమాత్రం ఆమోదయోగ్యత లేదు. ఇదే విషయాన్ని సాహిబ్ సింగ్‌తో పాటు పలు కేసుల్లో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది.2022లో ఇంద్రేష్ కుమార్ కేసులో సీఆర్పీసీ సెక్షన్ 161 కింద ఇచ్చిన వాంగ్మూలాన్ని సాక్ష్యంగా పరిగణనలోకి తీసుకోరాదని, అయితే బెయిల్ మంజూరు సందర్భంగా పరిగణనలోకి తీసుకోవచ్చునని సుప్రీంకోర్టు, చెప్పింది. ఈ కేసులో పూర్వాపరాల ఆధారంగా ఆ తీర్పునివ్వడం జరిగింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆ తీర్పు కేవలం సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలకే వర్తిస్తుంది గానీ నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలకు కాదు. ఆ తీర్పులో ఎక్కడా కూడా నిందితులు పోలీసులకిచ్చిన వాంగ్మూలాలను బెయిల్ మంజూరు సందర్భంగా పరిగణనలోకి తీసుకోవాలని చెప్పలేదు. సెక్షన్ 161 కింద ఓ సాక్షి ఇచ్చిన వాంగ్మూలానికి, ఓ నిందితుడు ఇచ్చిన వాంగ్మూలానికి చాలా తేడా ఉంది.పోలీసు అధికారికి నిందితుడు ఇచ్చిన వాంగ్మూలాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. దాన్ని విస్మరించవచ్చు. నిందితుడి వాంగ్మూలాన్ని సహ నిందితుడికి వ్యతిరేకంగా వాడకూడదన్న న్యాయ సూత్రానికి ఓ మినహాయింపు ఉంది. నిందితుడి వాంగ్మూలం నేరాన్ని రుజువు చేసేదే కాక, అది విశ్వసించేదిగా, ఆధార సహితంగా ఉన్నప్పుడు ఆ వాంగ్మూలాన్ని సహ నిందితుడికి వ్యతిరేకంగా వాడొచ్చు. అయితే నిందితుడి వాంగ్మూలమొక్కటే సరిపోదు. సహ నిందితుడి పాత్రను రుజువు చేసేందుకు ఇతర సాక్ష్యాలు కూడా కావాల్సి ఉంటుంది. ఆ సాక్ష్యాలు నిందితుడి వాంగ్మూలానికి మద్దతునిచ్చేవిగా ఉండాలి. అందువల్ల సహ నిందితుడికి వ్యతిరేకంగా ముఖ్యంగా పోలీసు అధికారి ముందు ఇచ్చిన వాంగ్మూలాలను న్యాయస్థానాలు చాలా జాగ్రత్తగా పరిశీలించాలి’ అని సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. నిందితుడి వాంగ్మూలం సహ నిందితుడిని ఇరికించేలా ఉంటే ఆ వాంగ్మూలాన్ని సీఆర్పీసీ సెక్షన్ 161 ప్రకారం పరిగణనలోకి తీసుకోవచ్చా? అనే విషయంలో ఎలాంటి అయోమయానికి, గందరగోళానికి తావులేకుండా స్పష్టతనివ్వదలిచాం. ఎఫ్ఐఆర్లో పేరున్న వ్యక్తిని, నేరం చేసిన వ్యక్తిని పోలీసులు విచారించి సీఆర్పీసీ సెక్షన్ 161 కింద అతడి వాంగ్మూలాన్ని నమోదు చేయవచ్చు. అయితే అలా నమోదు చేసిన వాంగ్మూలానికి ఎంతమాత్రం ఆమోదయోగ్యత లేదు. - సుప్రీంకోర్టుకేవలం సహ నిందితుని కన్ఫెషన్ స్టేట్మెంట్ను ఆధారంగా చేసుకుని ఒక వ్యక్తి బెయిల్‌పై నిర్ణయం తీసుకోరాదని తన జడ్జిమెంట్‌లో పలు పేరాల్లో అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అందులోని కొన్ని ...34. ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 30 ప్రకారం, ఒక వ్యక్తి తనకు వ్యతిరేకంగా అలాగే మరొకరిని కూడా దోషిగా సూచిస్తూ చేసిన అంగీకారాన్ని (కన్ఫెషన్), వారు ఇద్దరూ ఒకే సమయంలో ఒకే కేసులో సంయుక్తంగా విచారణకు లోనవుతున్నప్పుడు, ఆ కోర్టు ఆ అంగీకారాన్ని పరిశీలనలోకి తీసుకోవచ్చు. అయితే, ఈ అంగీకారాన్ని మాత్రమే ఆధారంగా చేసుకుని మరొకరిని శిక్షించకూడదు. దానిని మిగతా ఆధారాలతో కలిపి పరిశీలించాలి.39. ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 30పై హైకోర్టు తనదైన అర్థాన్ని కలిగి ఉంది. సెక్షన్ 30 కింద అంగీకరించదగినదిగా (కన్ఫెషన్) ఉన్న విషయం, ముందస్తు బెయిల్ లేదా సాధారణ బెయిల్ పిటిషన్ పరిశీలన సమయంలో కూడా పరిగణనలోకి తీసుకోవచ్చని హైకోర్టు అభిప్రాయపడింది. అయితే, హైకోర్టు వ్యక్తపరిచిన అభిప్రాయంతో మేము ఏకీభవించడం లేదు. మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్న అభిప్రాయం ఏమిటంటే– అటువంటి ఒప్పుకోలు ఏదైనా ఉన్నా, అది ముందస్తు బెయిల్ లేదా సాధారణ బెయిల్ ఇచ్చే దశలో పరిగణనలోకి తీసుకోరాదు. దీనికి ప్రధాన కారణాలు ఇవే:(1) ఒక సహ–ఆరోపితుడిపై ఒప్పుకోలు (కన్ఫెషన్) ఆధారంగా నిర్ణయం తీసుకోవాలంటే, ఆ ఒప్పుకోలు చేసిన వ్యక్తిపై ముందు నేరం నిరూపితమవ్వాలి. అది సెక్షన్ 24 వీగిపోకూడదు. లేదా సెక్షన్ 25 ప్రకారం చట్టవిరుద్ధంగా ఉండకూడదు. ఇది పూర్తిగా కోర్టు విచారణ సమయంలోనే తేలుతుంది. కేసు నిరూపణ కోసం విశ్వసనీయ, బలమైన సాక్ష్యాలు కోర్టులో ఉంచాల్సి ఉంటుంది, తద్వారా నేరం స్పష్టంగా నిరూపితం కావాలి. ‘దీపక్ భాయ్ జగదీష్ చంద్ర పటేల్ (వర్సెస్) స్టేట్ ఆఫ్ గుజరాత్ అండ్ అదర్స్ (2019) 16 ఎస్సీసీ 547’లో అత్యున్నత న్యాయస్థానం ఇదే విషయాన్ని చెప్పింది. పోలీసు అధికారుల ముందు ఇచ్చిన ఒప్పుకోలు, కోర్టులో సాక్ష్యంగా పరిగణనలోకి తీసుకోరాదు. సెక్షన్ 30 ప్రకారం పరిగణనలోకి తీసుకునే స్టేట్మెంట్ సరైనదై ఉండాలి, చట్టబద్ధమైనదై ఉండాలి. ఇది ఈ సెక్షన్ మూల లక్ష్యం.49. (10) ముందస్తు (యాంటిసిపేటరీ) లేదా సాధారణ (రెగ్యులర్) బెయిల్ విచారణకు సంబంధించి కోర్టు సీఆర్పీసీ 161 ప్రకారం పోలీసుల ముందు ఒక వ్యక్తి ఇచ్చిన ప్రకటనను పరిశీలించే ముందు, ఆ వ్యక్తి వాస్తవంగా సాక్షినా, నిందితుడా, లేక భవిష్యత్తులో నిందితుడిగా మారే అవకాశం ఉన్నవాడా అనే విషయాన్ని మొదట తప్పనిసరిగా నిర్ధారించుకోవాలి. ఎందుకంటే 161‑సెక్షన్ ప్రకటన‑ సమయంలో ఆ వ్యక్తి నిందితుడి జాబితాలో లేకపోయినా, దర్యాప్తు కొనసాగుతున్న క్రమంలో తర్వాత అతను నిందితుడిగా చేర్చబడే పరిస్థితులు ఏర్పడవచ్చు.ఈ నేపథ్యంలో, మొదట సాక్షిగా ఉన్న వ్యక్తి తర్వాత నిందితుడిగా మారవచ్చన్న భావాన్ని కోర్టులు ఎప్పుడూ దృష్టిలో ఉంచుకోవాలి. ఎఫ్ఐఆర్లో పేరు లేదని మాత్రమే కారణం చెప్పుకుని ఆ వ్యక్తి ప్రకటనపై ఆధారపడితే, అతన్ని నిందితుడిగా చేర్చే దశ వచ్చే వరకు ఆ ప్రకటనను నమ్ముకునే అసంబద్ధ పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే, రికార్డుల ప్రకారం ఆ వ్యక్తిని నిందితుడిగా చేర్చే అవకాశముందని స్పష్టమైన సంకేతాలు కనిపిస్తే, దర్యాప్తు ఏ విధంగానూ ప్రభావితం కాకుండా కోర్టులు ఏ విధమైన అభిప్రాయాన్ని ప్రకటించకుండా జాగ్రత్తగా ఉండాలని మేము హెచ్చరిస్తున్నాము.

లక్నోను ముంచిన సన్‌రైజర్స్
లక్నో: ఈ ఐపీఎల్ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆట ఇదివరకే ముగిసింది. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్‌పై గెలిచి వారి ‘ప్లే ఆఫ్స్’ ఆశల్ని కూడా ముంచింది. సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 6 వికెట్ల తేడాతో లక్నోపై జయభేరి మోగించింది. ముందుగా లక్నో నిరీ్ణత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ (39 బంతుల్లో 65; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), మార్క్రమ్ (38 బంతుల్లో 61; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), పూరన్ (26 బంతుల్లో 45; 6 ఫోర్లు, 1 సిక్స్) దంచేశారు. ఇషాన్ మలింగకు 2 వికెట్లు దక్కాయి. తర్వాత సన్‌రైజర్స్ 18.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అభిషేక్ శర్మ (20 బంతుల్లో 59; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు), క్లాసెన్ (28 బంతుల్లో 47; 4 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగారు. దిగ్వేశ్ రాఠి 2 వికెట్లు తీశాడు. సెంచరీ భాగస్వామ్యం మిచెల్ మార్ష్ దూకుడుతో లక్నో ఆట మొదలైంది. కమిన్స్ తొలి బంతికి 4, నాలుగో బంతికి 6 కొట్టాడు. ఇదే జోరుతో హర్ష్ దూబే రెండో ఓవర్లో మార్ష్ మరో సిక్స్ బాదాడు. మూడో ఓవర్లో బౌండరీతో మార్క్రమ్ టచ్‌లోకి వచ్చాడు. నాలుగో ఓవర్ తొలి బంతికే మార్క్రమ్ అవుటవ్వాల్సింది. క్రీజు వదిలి ఆడిన అతన్ని ఇషాన్ కిషన్ స్టంపౌట్ చేయలేకపోయాడు. ఇలా బతికిపోయిన మార్క్రమ్ 6, 4లతో రెచి్చపోయాడు. దీంతో ఆ ఓవర్లో 17 పరుగులు వచ్చాయి. మార్ష్ దంచే పనిలో ముందున్నాడు. హర్షల్, ఇషాన్ మలింగ ఓవర్లలో భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. దీంతో ఓపెనింగ్ జోడీ పవర్‌ప్లేలో 69 పరుగులు చేసింది. కాసేపటికే మార్ష్ 28 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. 9వ ఓవర్లో మార్క్రమ్కు మరోమారు లైఫ్ వచి్చంది. జీషాన్ బౌలింగ్‌లో ఇచ్చిన సులువైన క్యాచ్‌ను డీప్ ఎక్స్ట్రా కవర్లో అనికేత్ వదిలేశాడు. దీంతో అదే ఓవర్లో లక్నో 100 పరుగులు దాటింది. తర్వాత ఎట్టకేలకు మార్ష్ వికెట్ తీసిన హర్ష్ దూబే 115 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరదించాడు. లక్నో కెపె్టన్ రిషభ్ పంత్ (7) ఎక్కువసేపు నిలువలేదు. ఇషాన్ రిటర్న్ క్యాచ్‌తో పెవిలియన్ చేరాడు. రెండు లైఫ్‌లను సది్వనియోగం చేసుకున్న మార్క్రమ్ 28 బంతుల్లో ఫిఫ్టీని పూర్తి చేసుకున్నాడు. పూరన్ మధ్యలో పడిపోయిన రన్‌రేట్ పెంచేందుకు బ్యాట్ ఝుళిపించాడు. హర్షల్ 16వ ఓవర్లో సిక్స్ బాదిన మార్క్రమ్ అదే ఓవర్లో బౌల్డయ్యాడు. నితీశ్ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో భారీ సిక్సర్ బాదిన పూరన్‌తో పాటు శార్దుల్ (4)కూడా రనౌటయ్యారు. సమద్ (3)ను బౌల్డ్ చేయగా... ఆకాశ్ దీప్ (6) సిక్స్‌తో జట్టు స్కోరు 200 దాటింది. 20వ ఓవర్లో నితీశ్ 20 పరుగులిచ్చాడు. అభిషేక్ అదరహో రెండు ఓవర్లలో సన్‌రైజర్స్ స్కోరు 23/1. అప్పటికి అభిషేక్ ఒక పరుగే చేశాడు. ఆకాశ్‌దీప్ మూడో ఓవర్ నుంచి అతని విధ్వంసం మొదలైంది. 4, 6 బాదిన అభిషేక్ తర్వాతి రూర్కే ఓవర్లోనూ దీన్ని రిపీట్ చేశాడు. దీంతో 3.3 ఓవర్లోనే జట్టు స్కోరు 50కి చేరింది. అవేశ్ ఖాన్ బౌలింగ్‌కు దిగితే వరుస బౌండరీలతో జోరు కనబరచడంతో పవర్‌ప్లేలో హైదరాబాద్ 72/1 స్కోరు చేసింది. ఆ తర్వాత ఓవర్ వేసిన రవి బిష్ణోయ్‌కి అభిషేక్ చుక్కలు చూపించాడు. 6, 6, 6, 6లతో 26 పరుగులు రాబట్టాడు. మూడో సిక్స్ బాదేసరికే 18 బంతుల్లో అతని ఫిఫ్టీ పూర్తయ్యింది. మరుసటి ఓవర్లో అభిషేక్ జోరుకు దిగ్వేశ్ రాఠి బ్రేక్ వేశాడు. ఈ సందర్భంగా రాఠి, అభిషేక్ మాటామాట పెంచుకున్నారు. అంపైర్లు సముదాయించి పంపారు. 35 బంతుల్లోనే 82 పరుగుల ధనాధన్ రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత ఇషాన్ కిషన్ (28 బంతుల్లో 35; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), క్లాసెన్‌లు ధాటిని కొనసాగించడంతో సన్‌రైజర్స్ లక్ష్యంవైపు దూసుకెళ్లింది. కిషన్ అవుటయ్యాక ‘దంచే’పనిని క్లాసెన్, కమిందు మెండిస్ (21 బంతుల్లో 32 రిటైర్డ్‌హర్ట్; 3 ఫోర్లు) చక్కబెట్టారు. స్వల్ప వ్యవధిలో ఇద్దరు పెవిలియన్‌కు చేరినా... మిగతా లాంఛనాన్ని అనికేత్ (0 నాటౌట్), నితీశ్ రెడ్డి (0 నాటౌట్) పూర్తి చేశారు. స్కోరు వివరాలు లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: మార్ష్ (సి) మలింగ (బి) హర్ష్ 65; మార్క్రమ్ (బి) హర్షల్ 61; పంత్ (సి అండ్ బి) మలింగ 7; పూరన్ (రనౌట్) 45; బదోని (సి) నితీశ్ (బి) మలింగ 3; సమద్ (బి) నితీశ్ 3; శార్దుల్ (రనౌట్) 4; బిష్ణోయ్ (నాటౌట్) 0; ఆకాశ్‌దీప్ (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 205. వికెట్ల పతనం: 1–115, 2–124, 3–159, 4–169, 5–194, 6–199, 7–199. బౌలింగ్: కమిన్స్ 4–0–34–0, హర్ష్ దూబే 4–0–44–1, హర్షల్ పటేల్ 4–0–49–1, ఇషాన్ మలింగ 4–0–28–2, జీషాన్ అన్సారి 2–0–22–0, నితీశ్ 2–0–28–1. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అథర్వ తైడే (సి) దిగ్వేశ్ (బి) రూర్కే 13; అభిషేక్ (సి) శార్దుల్ (బి) దిగ్వేశ్ 59; కిషన్ (బి) దిగ్వేశ్ 35; క్లాసెన్ (సి) పంత్ (బి) శార్దుల్ 47; కమిందు (రిటైర్డ్‌హర్ట్) 32; అనికేత్ (నాటౌట్) 5; నితీశ్ రెడ్డి (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (18.2 ఓవర్లలో 4 వికెట్లకు) 206. వికెట్ల పతనం: 1–17, 2–99, 3–140, 4–195. బౌలింగ్: ఆకాశ్‌దీప్ 3–0–33–0, రూర్కే 2.2–0–31–1, దిగ్వేశ్ రాఠి 4–0–37–2, అవేశ్ ఖాన్ 3–0–25–0, రవి బిష్ణోయ్ 1–0–26–0, మార్క్రమ్ 1–0–14–0, శార్దుల్ 4–0–39–1.

ట్రంప్‌నెందుకు నిలువరించలేదు?
న్యూఢిల్లీ: భారత్, పాక్ పరస్పర సైనిక చర్యలు, తర్వాత నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు, తదనంతర పరిణామాలు, పూర్వాపరాలపై విదేశీ వ్యవహారాల స్థాయీ సంఘంలో సోమవారం జరిగిన చర్చ చివరకు విపక్ష, అధికార పక్షాల వాదనలతో వాడీవేడిగా ముగిసింది. కేంద్రం తరఫున విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ హాజరై సమగ్ర వివరాలను వెల్లడించగా విపక్ష కూటమి సభ్యులు ట్రంప్ జోక్యంపై ప్రధానంగా ప్రస్తావించి కేంద్ర నిర్లక్ష్య వైఖరిని తూర్పారబట్టారు. తన కారణంగానే కాల్పులు ఆగిపోయాయని, కాల్పుల విరమణ ఒప్పందం తెరమీదకొచి్చందని ట్రంప్ దాదాపు ఏడు సార్లు సొంత డబ్బా కొట్టుకున్నా ప్రధాని మోదీ ఎందుకు ఆయనను నిలువరించలేదని విపక్ష సభ్యులు నిలదీశారు. కాల్పుల విరమణ కోసం మధ్యవర్తిత్వం వహించాలని అమెరికాను కోరలేదని ప్రభుత్వ వైఖరిని మిస్రీ స్పష్టంచేశారు. అమెరికా అధ్యక్షుడే ఉద్దేశపూర్వకంగా సొంతంగా కలుగజేసుకునేందుకు ప్రయతి్నంచారని, జోక్యంపై ట్రంప్ కనీసం భారత్ నుంచి అనుమతి కూడా తీసుకోలేదని మిస్రీ చెప్పారు. ట్రంప్ ప్రకటనలను విపక్ష సభ్యులు ప్రస్తావించడం, మోదీ ప్రభుత్వానికి ట్రంప్‌కు ఎలాంటి సంబంధం లేదని మిస్రీ వాదించడంతో కొద్దిసేపు సమావేశంలో వాడీవేడి చర్చ జరిగిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. రికార్డ్ స్థాయిలో 24 మంది సభ్యులు పాల్గొన్న ఈ సమావేశం ఏకంగా మూడు గంటలపాటు సాగింది. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. తృణమూల్ కాంగ్రెస్ తరఫున అభిõÙక్ బెనర్జీ, కాంగ్రెస్ తరఫున రాజీవ్ శుక్లా, దీపేందర్ హూడా, ఎంఐఎం తరఫున అసదుద్దీన్ ఒవైసీ, బీజేపీ తరఫున అపరాజితా సారంగి, అరుణ్ గోవిల్‌లు పాల్గొన్నారు. ‘‘ కాల్పుల విరమణలో అమెరికా మధ్యవర్తిత్వం చేయలేదు. మధ్యవర్తిగా ఉండాలని కోరలేదు. కాల్పుల విరమణ కేవలం ద్వైపాక్షికమే. తొలుత ఉద్రిక్త పరిస్థితులున్నా తర్వాత సద్దుమణిగాయి. అవి దాదాపు అణుయుద్ధానికి దారి తీశాయన్న వాదనల్లో ఎలాంటి నిజంలేదు’’ అని మిస్రీ చెప్పారుఆయనే కావాలనే దూరారు ‘‘తాను మధ్యవర్తిత్వం చేయడం వల్లే అణుయుద్ధ మేఘాలు విడిపోయాయని, జమ్మూకశ్మీర్ సమస్యలను పరిష్కరిస్తానని పదేపదే ట్రంప్ చెబుతున్నా మోదీ సర్కార్ ఎందుకు ఆయనను నిలువరిస్తూ ప్రకటనలు చేయలేదు?’’ అని విపక్ష సభ్యులు ప్రశ్నించారు. ‘‘ఇంత జరుగుతున్నా అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) నుంచి పాక్ నిధునెలా సంపాదించింది?. భారత్ ఎందుకు నిధులను అడ్డుకోలేకపోయింది. ఆర్మీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వార్తలు వెల్లువెత్తుతుంటే ప్రభుత్వం ఎందుకు వెంటనే స్పందించలేకపోయింది?’’ అని విపక్ష సభ్యులు ప్రశ్నించారు. వీటికి మిస్రీ సమాధానమిచ్చారు. ‘‘జోక్యం మాటున ట్రంపే స్వయంగా భారత్, పాక్ మధ్యలో దూరిపోయారు. ట్రంప్ జోక్యం విషయంలో భారత ప్రమేయం లేదు. ఉద్దేశపూర్వకంగా జమ్మూకశ్మీర్ అంశాన్ని ఆయన ప్రస్తావించారు’’ అని మిస్రీ స్పష్టంచేశారు. చైనా తయారీ సైనిక ఉపకరణాలను పాకిస్తాన్ వినియోగించిందన్న విపక్షాల వాదనలను మిస్రీ తోసిపుచ్చారు. ‘‘వాళ్లు ఏ దేశానికి చెందిన ఆయుధాలు వాడారనేది ఇక్కడ ప్రధానం కాదు. మనం వాళ్లను ఎంత బలంగా దెబ్బకొట్టామనేదే ముఖ్యం’’ అని మిస్రీ అన్నారు. పరస్పర సైనిక చర్యల్లో మనం ఎన్ని యుద్ధవిమానాలను కోల్పోయామన్న విపక్షాల ప్రశ్నకు మిస్రీ సమాధానం ఇవ్వలేదు. ఇది జాతీయ భద్రతతో ముడిపడిన అంశమైనందున వివరాలు వెల్లడించట్లేదని పేర్కొన్నారు. మీపై దాడి చేయబోతున్నామని పాకిస్తాన్‌కు ముందే భారత్ అధికారికంగా తెలియజేసిందన్న వార్తలను మిస్రీ తోసిపుచ్చారు. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా కేవలం ఉగ్రస్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నామని, ఆర్మీ బేస్‌లు, జనావాసాలపై దాడులు చేయలేదని మాత్రమే, దాడుల తర్వాత పాక్‌కు తెలిపామని మిస్రీ స్పష్టంచేశారు. ఈ విషయంలో విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ చేసిన ప్రకటనను కొందరు వక్రీకరించారని మిస్రీ తెలిపారు. తుర్కియే మొదట్నుంచీ భారత్‌కు దూరంగానే ఉంటోందని గుర్తుచేశారు. అయితే దాడులను భారత్ ఆపేశాక ఆగ్రహంతో సామాజిక మాధ్యమాల్లో మిస్రీపై జరుగుతున్న ట్రోలింగ్‌ను స్థాయీ సంఘం సభ్యులంతా ఏకగ్రీవంగా ఖండించడం విశేషం.

ఇక నాకు ఇది కొత్త జన్మ: మంచు మనోజ్
‘‘నాకు నా హార్డ్‌వర్క్‌పై పూర్తి నమ్మకం ఉంది. ఈ బర్త్ డే (మే 20) నుంచి నాకు ఇది కొత్త జన్మ. నా బర్త్ డే స్టార్ట్ కాక ముందే నేను ఏదైతే స్టేజ్ (సినిమా వేదిక) మిస్సవుతున్నానో ఆ స్టేజ్‌కు తీసుకువచ్చాడు దేవుడు. అంతకంటే పెద్ద బర్త్ డే గిఫ్ట్ ఏదీ ఉండదు’’ అని మంచు మనోజ్ అన్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా నటించిన చిత్రం ‘భైరవం’. జయంతిలాల్ గడా సమర్పణలో విజయ్ కనకమేడల దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది. అలాగే నేడు (మంగళవారం) మంచు మనోజ్ బర్త్ డే. ఈ సందర్భంగా సోమవారం విలేకరుల సమావేశంలో మనోజ్ పంచుకున్న విశేషాలు.⇒ ఓ ఫ్యామిలీ ఫంక్షన్ లో తమ్ముడు శ్రీనివాస్ (బెల్లంకొండ సాయి) నన్ను కలవడం, ‘గరుడన్ ’ సినిమా తెలుగు రీమేక్ ‘భైరవం’ గురించి దర్శకుడు విజయ్‌తో మాట్లాడమని చెప్పడం, కథ నచ్చి, నేనీ సినిమాకు ఓకే చెప్పడం చకా చకా జరిగిపోయాయి. ∙ఈ చిత్రంలో నేను గజపతి వర్మ అనే క్యారెక్టర్ చేశాను. ‘భైరవం’ని డైరెక్టర్ విజయ్ బాగా తీశాడు. యాక్టర్స్‌గా నాకు, శ్రీనివాస్, నారా రోహిత్‌గారికి కొంత స్క్రీన్ గ్యాప్ వచ్చింది. అయినా మాతో రాధామోహన్ గారు మంచి మూవీ నిర్మించారు. ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీలో ఉండాల్సిన అవసరం ఉంది.⇒ నా జీవితంలో నాకు మా నాన్నే హీరో (ప్రముఖ నటుడు–నిర్మాత మోహన్ బాబు). నాన్నగారు కష్టపడి, పోరాడి ఇంత గొప్ప స్థాయికి వచ్చింది మనందరం చూశాం. ఆయన్ను చూస్తూ పెరిగాను. నాన్నగారిని స్ఫూర్తిగా తీసుకున్నాను. నమ్మినవాళ్లను బాగా చూసుకోవడం, వాళ్లతోనే ఉండటం, పదిమందికి హెల్ప్ చేయడం, స్కూల్‌ని బిల్డ్ చేయడం... ఇలా నాన్నగారు చాలా చేశారు. ఇక దాన్నుంచి (ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనల గురించి కావొచ్చు) నేను బయటకు రాలేకపోతున్నాను. విష్ణు అన్న నుంచి కొన్ని విషయాలు నేర్చుకున్నాను. అయితే ఏ సిట్యువేషన్ లోనైనా మాట్లాడి, ఆ పరిస్థితులను ఎలా సెట్ చేయవచ్చో విష్ణు అన్న దగ్గర్నుంచి నేర్చుకోవాలనుకుంటున్నాను. అలాగే సమస్యలను పరిష్కరించడానికి మాట్లాడాలంటే నేను సిద్ధంగా ఉన్నాను.⇒ నేను తిరుపతిలో చదువుకున్నాను. తను (భార్య మౌనిక) ఆళ్లగడ్డలో చదువుకున్నారు. ఈ సిటీ జీవితమే కాకుండా మాకు పల్లె జీవితం కూడా ఉంది. అక్కడి ప్రజల ప్రేమాభిమానాలు, ఆదరణ మాపై ఉన్నాయి. మా పిల్లలకు ఏదైనా ఇవ్వగలను అంటే అది ఇదే.⇒ నేను సమస్యల్లో ఉన్నప్పుడు ఇండస్ట్రీ నుంచి చాలామంది ఫోన్ చేశారు. కానీ నా ఇబ్బందుల్లో వారిని ఇన్ వాల్వ్ చేయాలనుకోలేదు. నా భార్య మౌనిక సపోర్ట్ సరిపోయింది. మనపై తప్పుడు ఆరోపణలు వచ్చినప్పుడు గమ్మునుండిపోతే, తప్పు చేసిన వ్యక్తులుగా మిగిలిపోతాం. భవిష్యత్‌లో మా పిల్లలు ‘నువ్వు చేయనప్పుడు ఎందుకు గమ్మునున్నావ్’ అంటే, ఓ బ్యాడ్ ఎగ్జాంపుల్‌గా ఉండకూడదనిపించింది. తప్పు చేయనప్పుడు ఎక్కడైనా మాట్లాడగలను.
దక్షిణ కోస్తా, సీమ మీదుగా ఉపరితల ద్రోణి
మొసలి కన్నీళ్లు వద్దు
లోకేశ్‌కి ప్రమోషన్!
ఫండ్స్ ఆస్తులు రూ.65.74 లక్షల కోట్లు
క్యూ4లో వృద్ధి రేటు @ 6.9 శాతం
బిట్‌కాయిన్‌పై స్పష్టమైన విధానం ఎందుకు లేదు?
సహ నిందితుల వాంగ్మూలం ఆధారమా?
సుప్రీం కోర్టులో వొడాఫోన్ పిటీషన్ డిస్మిస్
గజ రాజులకూ పేర్లుంటాయ్
ఎస్బీఐ లాభాలకు యోనో దన్ను
అనసూయ నూతన గృహప్రవేశం.. పూజా కార్యక్రమం (ఫోటోలు)
సీఎం గారూ.. యుద్ధంలో ఉన్నా.. రాలేకపోతన్న..
వైఎస్సార్సీపీదే విజయం.. మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక ఏకగ్రీవం
ఇండియా ఇంత బలహీనమైనదా?
అందుకే నా కొడుకుకు ఆయన పేరు పెట్టుకున్నా: అనసూయ పోస్ట్ వైరల్
సంక్రాంతికి రఫ్ఫాడించేద్దాం
గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన స్టార్ హీరో కూతురు
కోట్ల విలువైన విల్లా కొనుగోలు చేసిన బిగ్‌బాస్ రోహిణి.. ధర ఎంతంటే?
నైనై తుర్కియే..! కేవలం రెండు రోజుల్లోనే..
..ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదట వెళ్లండి!
హీరోయిన్‌తో కమల్ ముద్దు సీన్.. ఏజ్ గ్యాప్‌పై విమర్శలు
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
రేపటి నుంచే భూముల రీసర్వే.. రెవెన్యూ వర్గాల ఆందోళన
ఇండియన్ ఆర్మీ కీలక ప్రకటన
ఆర్థిక సంక్షోభం రాబోతోంది!.. రాబర్ట్ కియోసాకి హెచ్చరిక
బంగ్లా ప్లేయర్ విధ్వంసకర శతకం.. రికార్డులు బద్దలు
మనం దెబ్బతిన్న ప్రతీసారి శాంతి చర్చలనడం మనకు ఆనవాయితీ సార్!
ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్
ఈ రాశి వారికి వ్యాపారాలు.. ఉద్యోగాలలో మరింత అనుకూలం.
వారికి నా కంటే అందగాడు కనిపించలేదేమో!
దక్షిణ కోస్తా, సీమ మీదుగా ఉపరితల ద్రోణి
మొసలి కన్నీళ్లు వద్దు
లోకేశ్‌కి ప్రమోషన్!
ఫండ్స్ ఆస్తులు రూ.65.74 లక్షల కోట్లు
క్యూ4లో వృద్ధి రేటు @ 6.9 శాతం
బిట్‌కాయిన్‌పై స్పష్టమైన విధానం ఎందుకు లేదు?
సహ నిందితుల వాంగ్మూలం ఆధారమా?
సుప్రీం కోర్టులో వొడాఫోన్ పిటీషన్ డిస్మిస్
గజ రాజులకూ పేర్లుంటాయ్
ఎస్బీఐ లాభాలకు యోనో దన్ను
సీఎం గారూ.. యుద్ధంలో ఉన్నా.. రాలేకపోతన్న..
వైఎస్సార్సీపీదే విజయం.. మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక ఏకగ్రీవం
ఇండియా ఇంత బలహీనమైనదా?
అందుకే నా కొడుకుకు ఆయన పేరు పెట్టుకున్నా: అనసూయ పోస్ట్ వైరల్
సంక్రాంతికి రఫ్ఫాడించేద్దాం
గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన స్టార్ హీరో కూతురు
కోట్ల విలువైన విల్లా కొనుగోలు చేసిన బిగ్‌బాస్ రోహిణి.. ధర ఎంతంటే?
నైనై తుర్కియే..! కేవలం రెండు రోజుల్లోనే..
..ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదట వెళ్లండి!
హీరోయిన్‌తో కమల్ ముద్దు సీన్.. ఏజ్ గ్యాప్‌పై విమర్శలు
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
రేపటి నుంచే భూముల రీసర్వే.. రెవెన్యూ వర్గాల ఆందోళన
ఆర్థిక సంక్షోభం రాబోతోంది!.. రాబర్ట్ కియోసాకి హెచ్చరిక
ఇండియన్ ఆర్మీ కీలక ప్రకటన
బంగ్లా ప్లేయర్ విధ్వంసకర శతకం.. రికార్డులు బద్దలు
మనం దెబ్బతిన్న ప్రతీసారి శాంతి చర్చలనడం మనకు ఆనవాయితీ సార్!
ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్
ఈ రాశి వారికి వ్యాపారాలు.. ఉద్యోగాలలో మరింత అనుకూలం.
వారికి నా కంటే అందగాడు కనిపించలేదేమో!
పిల్లలను తీసుకుని ఇంటికి రా తల్లీ.. సరదాగా వెళ్లారు..
సినిమా

భారత్- పాక్ వార్.. రూ.50 లక్షల ఆఫర్ వదులుకున్న సింగర్!
విరాట్ కోహ్లీతో వివాదంతో వార్తల్లో నిలిచిన సింగర్ రాహుల్ వైద్య మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇటీవల కోహ్లీపై ప్రశంసలు కురిపించిన ఆయన.. ఇండియా- పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో దేశభక్తిని చాటుకున్నారు. టర్కీలో తాను ప్రదర్శన ఇవ్వడానికి నిరాకరించాడు. ఓ పెళ్లిలో ప్రదర్శన ఇచ్చేందుకు దాదాపు రూ.50 లక్షలు ఆఫర్ చేశారని వెల్లడించాడు. పాకిస్తాన్‌కు మద్దతుగా టర్కీ వ్యవహరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సింగర్ రాహుల్ తెలిపారు.రాహుల్ వైద్య మాట్లాడుతూ.."టర్కీలో నాకు వచ్చిన ఆఫర్‌కు రూ. 50 లక్షలు ఇస్తామన్నారు. కానీ డబ్బు కంటే.. నా దేశ ప్రయోజనాలను ముఖ్యమని వారికి చెప్పా. వారు నాకు ఇంకా ఎక్కువ ఇస్తామన్నారు. కానీ నేను వద్దన్నది డబ్బు గురించి కాదని మరోసారి స్పష్టం చేశా. ఎందుకంటే డబ్బు కంటే చాలా ముఖ్యమైన అంశం. ఇది ఒక వ్యక్తిగా కాదు.. నా దేశం గురించే ఈ నిర్ణయం. మన దేశానికి అండగా నిలబడాలన్నదే నా ఆశయం." అని పంచుకున్నారు. మన దేశానికి శత్రువుగా అంటూ మనల్ని అగౌరవపరిచే దేశాన్ని సందర్శించడంలో తనకు ఆసక్తి లేదని రాహుల్ పేర్కొన్నారు.ఇటీవల బాలీవుడ్ నటి రూపాలి గంగూలీ సైతం టర్కీని బహిష్కరించాలని పిలుపునిచ్చారు. సినీ ప్రముఖులు, మనదేశ ప్రయాణికులు టర్కీ బుకింగ్‌లను రద్దు చేసుకోవాలని కోరారు. ఈ మేరకు ఎక్స్ ద్వారా ఆమె విజ్ఞప్తి చేశారు. కాగా.. ఇప్పటికే టర్కీ విషయంలో భారత్ పలు ఆంక్షలు విధించింది. ఇకపై టర్కీలో భారతీయ సినిమాలు షూటింగ్‌లు ఉండవని స్పష్టం చేసింది. టర్కిష్ సంస్థలతో ఉన్న అన్ని ఒప్పందాలను రద్దు చేయాలని ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ ఆదేశించింది.

'ఛత్రపతి' రీమేక్ అందుకే ఫెయిలైంది: బెల్లంకొండ శ్రీనివాస్
తెలుగులో హీరోగా కెరీర్ మొదలుపెట్టిన బెల్లంకొండ శ్రీనివాస్.. మధ్యలో హిందీలో సినిమా చేశాడు. చాలా గ్యాప్ తీసుకుని మళ్లీ ఇక్కడ 'భైరవం' చిత్రం చేశాడు. మే 30న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్లలో పాల్గొన్న ఇతడు.. ఛత్రపతి హిందీ రీమేక్ ఫ్లాప్ కావడం గురించి మాట్లాడాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు)'హిందీలో సినిమాలు చేసిన తెలుగు హీరోలు పెద్దగా లేరు. ప్రస్తుతం రానా, రామ్ చరణ్ మాత్రమే చేశారు. చరణ్ చేసింది 'జంజీర్' రీమేక్. హిందీ మూవీని మళ్లీ హిందీలో చేయడం వల్ల ప్రేక్షకులు అలా తీసుకున్నారేమో తెలియదు. నేను చేస్తున్నది సౌత్ మూవీ కదా అనుకున్నాను. రాజమౌళి హిట్ సినిమా, ఎమోషన్స్ కి బాగా కనెక్ట్ అవుతారని అనుకున్నాం''పైగా సవతి తల్లి, బిడ్డల సెంటిమెంట్ లాంటివి హిందీలో పెద్దగా ఉండవని నిర్మాత భరోసా ఇచ్చారు. దీంతో వర్కౌట్ అవుతుందేమోనని అనుకున్నాం. కానీ ఛత్రపతి మూవీని రీమేక్ చేయకుండా ఉండాల్సింది. ఎందుకంటే అప్పటికే సౌత్ సినిమాల్ని హిందీ ప్రేక్షకులు బాగా చూసేశారు. ఆ మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా ఇది వర్కౌట్ అవుతుందా? అనే టెన్షన్ వల్ల పూర్తిగా దృష్టి పెట్టలేకపోయాను' అని బెల్లంకొండ శ్రీనివాస్ చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: 'డ్రాగన్' షూటింగ్ లో ప్రేమ.. ఇప్పుడు ఏకంగా పెళ్లి)

చాహల్‌తో డేటింగ్ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన ఆర్జే మహ్వశ్!
ఐపీఎల్ ప్రారంభం నుంచి ఆర్జే మహ్వశ్ పేరు తెగ వినిపిస్తోంది. దీనికి కారణం ఈ ముద్దుగుమ్మకు టీమిండియా క్రికెటర్ యుజ్వేందర్ చాహల్‌తో కనిపించడమే. వీరిద్దరు కలిసి దుబాయ్‌లో ఛాంపియన్ ట్రోఫీ మ్యాచ్ వీక్షిస్తున్న సమయంలో ఫోటోలు పెద్దఎత్తున వైరలయ్యాయి. ఆ తర్వాతే ఈ జంట డేటింగ్లో ఉన్నారంటూ రూమర్స్ మరింత ఎక్కువయ్యాయి. ఆ తర్వాత ఐపీఎల్ మ్యాచ్‌ల్లోనూ మహ్వశ్ సందడి చేయడంతో వీటికి మరింత బలం చేకూరింది. కానీ తమ రిలేషన్‌పై ఇప్పటివరకు ఎవరూ కూడా స్పందించలేదు.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆర్జే మహ్వశ్.. తనపై వస్తున్న రూమర్స్‌పై స్పందించింది. అవీ తనను ఎలా ప్రభావితం చేశాయో వివరించింది. కొంతమంది ట్రోల్స్ కారణంగా ఇలాంటివీ జరుగుతూ ఉంటాయని తెలిపింది. కానీ అందులో ఎలాంటి నిజం లేకపోవడంతోనే వాటిని అంగీకరించలేకపోయానని పేర్కొంది. ఈ వ్యక్తులు నాతో ఎందుకు ఇలా చేస్తున్నారు.. నిజం తెలియనప్పుడు నా జీవితం పట్ల ఎందుకు ఇంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారు? అని బాధపడ్డానని వెల్లడించింది. అందుకే సోషల్ మీడియాను వదిలేసి ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటున్నట్లు ఆర్జే మహ్వశ్ తన బాధను పంచుకుంది. కానీ నాపై వచ్చిన రూమర్స్, ట్రోల్స్ బాగా దెబ్బతీశాయని ఆవేదన వ్యక్తం చేసింది. మీరు చెప్పేవన్నీ కల్పితాలేనని.. మా మధ్య అలాంటిదేమీ లేదని ఆర్జే మహ్వశ్ ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది.కాగా.. ఆర్జే మహ్వశ్ ప్యార్ పైసా ప్రాఫిట్ అనే సిరీస్‌తో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ సిరీస్ అమెజాన్ మ్యాక్స్ ప్లేయర్లో ప్రసారం అవుతోంది. ఈ షో ప్రీమియర్ అయినప్పుడు చాహల్ ఈ సిరీస్‌పై పోస్ట్ పెట్టారు.

రకుల్ ప్రీత్ సొగసులు.. హెబ్బా ట్రెడీషనల్ వేర్
పక్కా ట్రెడిషనల్ గా తయారైన హెబ్బా పటేల్స్విమ్ సూట్ లో కనిపించిన నటి హంస నందినిఒంటికి అతుక్కుపోయిన డ్రస్సులో జాక్వెలిన్అందాలన్నీ చూపించేస్తున్న కేథరిన్ ట్రెసాపట్టుచీరలో మెరిసిపోతున్న పూజా హెగ్డేతెలుగమ్మాయి రమ్య అదిరిపోయే గ్లామర్గ్లామర్ గా కనిపించేందుకు కష్టపడుతున్న అన్షు View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Nikkii Galrani Pinisetty (@nikkigalrani) View this post on Instagram A post shared by Sai Ramya Pasupuleti (@ramyaapasupuleti) View this post on Instagram A post shared by Hamsa Nandini (@ihamsanandini) View this post on Instagram A post shared by Shaneem (@shaneemz) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Jacqueline Fernandez (@jacquelienefernandez) View this post on Instagram A post shared by Anshu (@actressanshuofficial) View this post on Instagram A post shared by Catherine Tresa Alexander (@catherinetresa) View this post on Instagram A post shared by Madonna B Sebastian (@madonnasebastianofficial)
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

చరిత్ర సృష్టించిన హర్షల్ పటేల్.. ఐపీఎల్లో హిస్టరీలోనే
టీమిండియా వెటరన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్ అరుదైన రికార్డు సాధించాడు. ఐపీఎల్లో అత్యంత వేగంగా ( బంతులు పరంగా) 150 వికెట్ల మైలు రాయిని అందుకున్న బౌలర్‌గా హర్షల్ నిలిచాడు. 2381 బంతుల్లో ఈ ఫీట్‌ను పటేల్ అందుకున్నాడు. ఐపీఎల్-2025లో భాగంగా ఏక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనతను పటేల్ నమోదు చేశాడు.ఇంతకుముందు ఈ రికార్డు శ్రీలంక పేస్ బౌలింగ్ దిగ్గజం లసిత్ మలింగ(2444 బంతులు) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో మలింగ రికార్డును హర్షల్ పటేల్ బ్రేక్ చేశాడు. ఓవరాల్‌గా మ్యాచ్‌లు పరంగా ఈ ఫీట్ సాధించిన జాబితాలో హర్షల్ పటేల్(117) రెండో స్దానంలో నిలిచాడు. తొలి స్ధానంలో మలింగ(105) కొనసాగుతున్నాడు.ఐపీఎల్లో బంతులు పరంగా అత్యంత వేగంగా 150 వికెట్లు తీసిన బౌలర్లు వీరే..2381- హర్షల్ పటేల్2444- లసిత్ మలింగ2543- చాహల్2656- డ్వైన్ బ్రావో2832- జస్ప్రీత్ బుమ్రామ్యాచ్ల పరంగా అత్యంత వేగంగా 150 వికెట్లు తీసిన బౌలర్లు వీరే..లసిత్ మలింగ- 105హర్షల్ పటేల్- 117యుజ్వేంద్ర చాహల్-118రషీద్ ఖాన్- 122జస్ప్రీత్ బుమ్రా- 124

IPL 2025: మళ్లీ అదే కథ.. తీరు మారని రిషబ్ పంత్
ఐపీఎల్-2025లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఆట తీరు ఏ మాత్రం మారలేదు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఏక్నా స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో పంత్ తీవ్ర నిరాశపరిచాడు. ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్‌కు వచ్చిన పంత్.. 6 బంతులు ఎదుర్కొని కేవలం 7 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.ఎస్ఆర్హెచ్ పేసర్ ఇషాన్ మలింగ బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి పంత్ పెవిలియన్‌కు చేరాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచిన పంత్.. తన ధరకు ఏ మాత్రం న్యాయం చేయలేకపోయాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన పంత్.. 12.27 సగటుతో కేవలం 135 పరుగులు మాత్రమే చేశాడు.ఈ క్రమంలో పంత్ చెత్త ఆట తీరును లక్నో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియాలో పంత్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. పంత్ నీవు ఇక మారవా అంటూ ఎక్స్‌లో పోస్టులు పెడుతున్నారు. ఈ మ్యాచ్‌లో పంత్ ఔటైన అనంతరం మ్యాచ్ వీక్షిస్తున్న లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా తీవ్ర ఆసంతృప్తి వ్యక్తం చేశాడు. కాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో రూ. 27 కోట్ల భారీ ధరకు లక్నో కొనుగోలు చేసింది.ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్నో బ్యాటర్లలో మిచెల్ మార్ష్(39 బంతుల్లో 6 ఫోర్లు 4 సిక్స్‌లతో 65), మార్క్రమ్(38 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 61) హాఫ్ సెంచరీలతో రాణించగా.. నికోలస్ పూరన్(26 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 45) మెరుపులు మెరిపించాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ఇషాన్ మలింగ రెండు వికెట్లు పడగొట్టగా.. దూబే, హర్షల్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి తలా వికెట్ సాధించారు.చదవండి: అతడొక అద్బుతం.. గిల్‌ను మించిపోయాడు: జడేజా

అతడొక అద్బుతం.. గిల్‌ను మించిపోయాడు: జడేజా
ఐపీఎల్-2025లో గుజరాత్ టైటాన్స్ యువ సంచలనం సాయి సుదర్శన్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సుదర్శన్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం 61 బంతుల్లో 12 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో అజేయంగా 108 పరుగులు చేశాడు.అతడి విధ్వంసర ఇన్నింగ్స్ ఫలితంగా 200 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ వికెట్ నష్టపోకుండా ఛేదించింది. అతడితో పాటు గుజరాత్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ కూడా 93 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ క్రమంలో సాయి సుదర్శన్‌పై భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజా ప్రశంసల వర్షం కురిపించాడు.సుదర్శన్ తన ప్రదర్శనలతో టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌ను మించిపోయాడని జడేజా కొనియాడాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో సుదర్శన్ 12 మ్యాచ్‌లు ఆడి 56.10 సగటుతో 617 పరుగులు సాధించాడు. ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ సాయిసుదర్శన్ వద్దే ఉంది."సాయి సుదర్శన్ అద్బుతమైన బ్యాటర్. అతడి బ్యాటింగ్ టెక్నిక్ చాలా బాగుంది. ఈ ఏడాది సీజన్లో సుదర్శన్ తన ప్రదర్శనలతో శుబ్‌మన్ గిల్‌ను మించిపోయాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఒక్క మ్యాచ్‌లోనే కాదు, అంతకుముందు మ్యాచ్‌లలో కూడా గిల్ కంటే మెరుగ్గా రాణించాడు.శుబ్మన్తో పోలిస్తే సుదర్శన్ ఎటువంటి రిస్క్ తీసుకోకుండా బ్యాటింగ్ చేస్తున్నాడు. నిన్నటి మ్యాచ్‌లో తొలుత గిల్ బంతిని టైమ్ చేయడానికి కాస్త కష్టపడ్డాడు. గిల్ బంతిని స్టాండ్స్‌కు తరలించేందుకు తన బలాన్ని మొత్తాన్ని ఉపయోగించాడు. కానీ సాయి విషయంలో మాత్రం అలా జరగలేదు. అతడు చాలా సులువుగా షాట్లు ఆడాడు" అని స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జడేజా పేర్కొన్నాడు.చదవండి: ఐపీఎల్-2025లో దారుణ ప్రదర్శన.. కేకేఆర్ హెడ్ కోచ్‌పై వేటు?

IPL 2025: లక్నోను చిత్తు చేసిన ఎస్ఆర్హెచ్..
IPL 2025 LSG vs DC Live Updates:లక్నోను చిత్తు చేసిన ఎస్ఆర్హెచ్..ఏక్నా స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ ఓటమి పాలైంది. దీంతో ఈ ఏడాది సీజన్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమించింది. 206 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 18.2 ఓవర్లలో చేధించింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో అభిషేక్ శర్మ(20 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 59) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. క్లాసెన్(47), ఇషాన్ కిషన్(35), మెండిస్(32) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. లక్నో బౌలర్లలో దిగ్వేష్ సింగ్ రెండు, విలియం ఓ రూర్క్, శార్ధూల్ ఠాకూర్ ఓ వికెట్ సాధించారు.16 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 179/316 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ 3 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ విజయానికి 24 బంతుల్లో 27 పరుగులు కావాలి.ఎస్ఆర్హెచ్ మూడో వికెట్ డౌన్ఇషాన్ కిషన్(35) రూపంలో సన్‌రైజర్స్ మూడో వికెట్ కోల్పోయింది. దిగ్వేష్ సింగ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు.ఎస్ఆర్హెచ్ రెండో వికెట్ డౌన్..అభిషేక్ శర్మ రూపంలో ఎస్ఆర్హెచ్ రెండో వికెట్ కోల్పోయింది. 59 పరుగులు చేసిన అభిషేక్ శర్మ.. దిగ్వేష్ సింగ్ రాఠీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 9 ఓవర్లకు సన్ రైజర్స్ స్కోర్: 117/2అభిషేక్ శర్మ ఫిప్టీలక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అభిషేక్ శర్మ దూకుడుగా ఆడుతున్నాడు. కేవలం 18 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. 6వ ఓవర్ వేసిన రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో అభిషేక్ వరుసగా నాలుగు సిక్స్‌లు బాదాడు. అభిషేక్ 59 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. 7 ఓవర్లు ముగిసే సరికి సన్‌రైజర్స్ వికెట్ నష్టానికి 98 పరుగులు చేసింది.దూకుడుగా ఆడుతున్న అభిషేక్, కిషన్..4 ఓవర్లు ముగిసే సరికి లక్నో సూపర్ జెయింట్స్ వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది. క్రీజులో అభిషేక్ శర్మ(23), ఇషాన్ కిషన్(11) ఉన్నారు.ఎస్ఆర్హెచ్ తొలి వికెట్ డౌన్..206 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ తొలి వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన ఆధర్వ తైడే.. విలియం ఓరూర్క్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 2 ఓవర్లకు సన్‌రైజర్స్ స్కోర్: 23/1చెలరేగిన లక్నో బ్యాటర్లు..ఐపీఎల్-2025లో ఏక్నా స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లు జూలు విధిల్చారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ చేసింది.లక్నో బ్యాటర్లలో మిచెల్ మార్ష్(39 బంతుల్లో 6 ఫోర్లు 4 సిక్స్‌లతో 65), మార్క్రమ్(38 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 61) హాఫ్ సెంచరీలతో రాణించగా.. నికోలస్ పూరన్(26 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 45) మెరుపులు మెరిపించాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ఇషాన్ మలింగ రెండు వికెట్లు పడగొట్టగా.. దూబే, హర్షల్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి తలా వికెట్ సాధించారు.లక్నో మూడో వికెట్ డౌన్..ఐడైన్ మార్క్రమ్ రూపంలో లక్నో మూడో వికెట్ కోల్పోయింది. 61 పరుగులు చేసిన మార్క్రమ్.. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 17 ఓవర్లు ముగిసే సరికి లక్నో.. 3 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది.15 ఓవర్లకు లక్నో స్కోర్: 146/215 ఓవర్లు ముగిసే సరికి లక్నో సూపర్ జెయింట్స్ రెండు వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. క్రీజులో మార్క్రమ్(53), నికోలస్ పూరన్(16) ఉన్నారు.లక్నో రెండో వికెట్ డౌన్..రిషబ్ పంత్ రూపంలో లక్నో సూపర్ జెయింట్స్ రెండో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన పంత్.. ఇషాన్ మలింగ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 12 ఓవర్లకు లక్నో రెండు వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. క్రీజులో ఐడైన్ మారక్రమ్(49), రిషబ్ పంత్(7) ఉన్నారు.లక్నో తొలి వికెట్ డౌన్.. మార్ష్ ఔట్మిచెల్ మార్ష్ రూపంలో లక్నో తొలి వికెట్ కోల్పోయింది. 65 పరుగులు చేసిన మార్ష్.. హర్ష్ దూబే బౌలింగ్‌లో ఔటయ్యాడు. 11 ఓవర్లు ముగిసే సరికి లక్నో వికెట్ నష్టానికి 118 పరుగులు చేసింది. క్రీజులో రిషబ్ పంత్(2), మార్క్రమ్(48) ఉన్నారు.6 ఓవర్లకు లక్నో స్కోర్: 69/06 ఓవర్లు ముగిసే సరికి లక్నో వికెట్ నష్టపోకుండా 69 పరుగులు చేసింది. క్రీజులో మార్క్రమ్(26), మార్ష్(41) ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న మార్ష్..టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ దూకుడుగా ఆడుతోంది. 2 ఓవర్లు ముగిసే సరికి లక్నో వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. క్రీజులో మార్ష్(18), మార్క్రమ్(1) ఉన్నారు.ఐపీఎల్-2025లో భాగంగా ఏక్నా స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ లక్నోకు చాలా కీలకం. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో పంత్ టీమ్ తప్పక గెలవాల్సిందే. మరోవైపు ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ఆరెంజ్ ఆర్మీ.. తమ ఆఖరి మ్యాచ్‌లలో గెలిచి పరువు నెలబెట్టుకోవాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌కు ఎస్ఆర్హెచ్ స్టార్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ కరోనా కారణంగా దూరమయ్యాడు.తుది జట్లులక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(కెప్టెన్), ఆయుష్ బదోని, అబ్దుల్ సమద్, ఆకాష్ దీప్, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్, దిగ్వేష్ సింగ్ రాఠీ, విలియం ఒరూర్కేసన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, కమిందు మెండిస్, పాట్ కమిన్స్(కెప్టెన్), హర్షల్ పటేల్, హర్ష్ దూబే, జీషన్ అన్సారీ, ఎషాన్ మలింగ
బిజినెస్

4 మెయిల్స్, 15 కాల్స్, 45 మెసేజస్: ఇంటర్వూ క్యాన్సిల్
సాధారణంగా ఒక ఉద్యోగానికి అప్లై చేసుకుంటే.. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లేదా ఆ కంపెనీకి చెందిన రిక్రూటర్ కాల్ చేయడం జరుగుతుంది. అయితే ఓ అభ్యర్థి.. తనకు పదేపదే కాల్స్ వస్తున్నాయని, ఏకంగా ఒక గ్లోబల్ కంపెనీ ఇంటర్వ్యూనే వద్దనుకున్నాడు. దీనికి సంబంధించిన పోస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.నేను ఇంటర్వ్యూ క్యాన్సిల్ చేసుకున్నాను అనే శీర్షికతో.. ఓ రెడ్డిట్ పోస్ట్ వైరల్ అవుతోంది. ఇందులో.. సోమవారం నుంచి బుధవారం మధ్య, రిక్రూటర్ నాలుగు ఈమెయిల్స్ పంపారు, 15 ఫోన్ కాల్స్ చేశారు. 45 టెక్స్ట్ మెసేజస్ చేశారు. కొన్ని మెసేజస్ రాత్రి 10 గంటల సమయంలో కూడా వచ్చాయి. అప్పటికే రిక్రూటర్‌తో మూడుసార్లు మాట్లాడాను, అవసరమైన మొత్తం సమాచారాన్ని ఈ మెయిల్ ద్వారా షేర్ చేశాను. నేను బిజీగా ఉన్నప్పుడు కూడా కాల్స్ వస్తూనే ఉన్నాయి. అయితే ఒకసారి నాకు వచ్చిన ఫోన్ నెంబరుకు తిరిగి కాల్ చేస్తే.. మరెవరో సమాధానం ఇచ్చారు. దీంతో నాకు వారి ప్రవర్తన అనుమానాస్పదంగా అనిపించింది.వాళ్ళ ప్రవర్తనతో ఇంటర్వ్యూ క్యాన్సిల్ చేసుకోవాలనిపించింది. ఆ తరువాత నేరుగా ఇంటర్వ్యూ చేసేవారికి ఈ మెయిల్ చేసాను. రిక్రూటర్‌ను బ్లాక్ చేయడానికి ముందు కూడా నాకు రెండు కాల్స్ వచ్చాయని ఆ ఉద్యోగార్థి (అభ్యర్థి) పేర్కొన్నారు. వల్ల ప్రవర్తన నన్ను అతిపెద్ద కంపెనీలలో ఒకదానికి పూర్తిగా దూరం చేసిందని పేర్కొన్నారు.ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో.. నెటిజన్లు కూడా తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. రిక్రూటర్ మోసగాడేమో అని ఒకరు సందేహపడగా.. వారు రిక్రూటర్‌గా కాకుండా టెలిమార్కెటర్గా ఉండి ఉంటే బాగుండేదని మరొకరు అన్నారు. ఇలా ఎవరికీ తోచిన విధంగా వారు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.ఇదీ చదవండి: ఆర్థిక సంక్షోభం రాబోతోంది!.. రాబర్ట్ కియోసాకి హెచ్చరిక

ఆర్థిక సంక్షోభం రాబోతోంది!.. రాబర్ట్ కియోసాకి హెచ్చరిక
అతిపెద్ద మార్కెట్ క్రాష్ జరుగుతుందని, బంగారం ధరలు భారీగా పెరుగుతాయని చెప్పిన 'రిచ్ డాడ్ పూర్ డాడ్' పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి.. ఇప్పుడు తాజాగా రాబోయే ప్రపంచ ఆర్థిక సంక్షోభం గురించి హెచ్చరికను జారీ చేశారు. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.1998లో వాల్ స్ట్రీట్ కలిసి హెడ్జ్ ఫండ్ LTCM: లాంగ్ టర్మ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ను బెయిల్ చేసింది. 2008లో సెంట్రల్ బ్యాంకులు వాల్ స్ట్రీట్‌ను బెయిల్ అవుట్ చేయడానికి కలిసి వచ్చాయి. 2025లో, చిరకాల స్నేహితుడు జిమ్ రికార్డ్స్, సెంట్రల్ బ్యాంకులను ఎవరు బెయిల్ అవుట్ చేయబోతున్నారని అడుగుతున్నాడు?, అని రాబర్ట్ కియోసాకి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.ప్రపంచం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంక్లిష్ట సంక్షోభానికి మాజీ అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ కారణమని ఆయన ఆరోపించారు. ప్రతి సంక్షోభం పెద్దదిగా మారుతుంది, ఎందుకంటే అవి సమస్యను ఎప్పటికీ పరిష్కరించవు. 971లో నిక్సన్ యూఎస్ డాలర్‌ను బంగారు ప్రమాణం నుంచి తొలగించినప్పుడు ప్రారంభమైన సమస్య.. 1.6 ట్రిలియన్ డాలర్ల స్టూడెంట్ లోన్ ద్వారా ప్రేరేపితమైంది.ఇదీ చదవండి: ప్రభుత్వ పథకంతో రోజుకు రూ. 10వేలు సంపాదించొచ్చా?: పీఐబీ క్లారిటీ..నేను (రాబర్ట్ కియోసాకి) 25 సంవత్సరాల క్రితం రిచ్ డాడ్ పూర్ డాడ్లో చెప్పినట్లుగా.. ''ధనవంతులు డబ్బు కోసం పని చేయరు'', ''పొదుపు చేసేవారు ఓడిపోతారు''. మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఉత్తమ మార్గం డబ్బును ఆదా చేయడం కాదు. రాబోయే సంక్షోభం నుంచి బయటపడటానికి ఉత్తమ మార్గం.. బంగారం, వెండి, బిట్కాయిన్లను ఆదా చేయడం మాత్రమే. ప్రత్యామ్నాయ మార్గాలు లేవని ఆయన స్పష్టం చేశారు.2012లో రిచ్ డాడ్స్ ప్రాఫసీలో నేను హెచ్చరించిన క్రాష్ ప్రారంభమైంది. దయచేసి జాగ్రత్తగా ఉండండి. బంగారం, వెండి, బిట్కాయిన్లను ఆదా చేయడం ద్వారా మిమ్మల్ని మీరు రాబోయే సంక్షోభం నుంచి కాపాడుకోండని రాబర్ట్ కియోసాకి తన సుదీర్ఘ ట్వీట్ ముగించారు.In 1998 Wall Street got together and bailed out a hedge fund LTCM: Long Term Capital Management.In 2008 the Cental Banks got together to bail out Wall Street.In 2025, long time friend, Jim Rickards is asking who is going to bail out the Central Banks?In other words each…— Robert Kiyosaki (@theRealKiyosaki) May 18, 2025

ప్రభుత్వ పథకంతో రోజుకు రూ. 10వేలు సంపాదించొచ్చా?: పీఐబీ క్లారిటీ..
ఇటీవల కాలంలో సైబర్ నేరాలతో పాటు.. తప్పుడు వార్తల ప్రచారం జోరుగా సాగుతోంది. కొన్ని రోజులకు ముందు ఐఆర్సీటీసీ టికెట్ బుకింగ్స్ సమయాల్లో మార్పు అంటూ ఒక న్యూస్ వైరల్ అయింది. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పౌరులు రోజుకు రూ. 10,000 వరకు సంపాదించడానికి వీలు కల్పించే ప్రాజెక్ట్‌ను ప్రారభించారనే వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.ప్రధాని నరేంద్ర మోడీ తన కొత్త ప్రాజెక్టును ఆవిష్కరించిన తర్వాత ఏటీఎంల వద్ద పొడవైన క్యూలు ఏర్పడతాయని, దీని ద్వారా ప్రజలు రోజుకు 10,000 రూపాయలు సంపాదించవచ్చని, వేలమంది భారతీయులు ఇప్పటికే మొదటి నెలలో రూ. 80,000 నుంచి రూ. 3,50,000 వరకు సంపాదించారని ఒక తప్పుడు వార్త సంచలనం సృష్టించింది.ఇదీ చదవండి: పీఎం ఆవాస్ యోజన గడువు పొడిగింపుదీనిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) స్పందిస్తూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పౌరులు రోజుకు రూ. 10,000 వరకు సంపాదించడానికి వీలు కల్పించే ప్రాజెక్ట్‌ను ప్రారభించారనే వార్తలో ఎటువంటి నిజం లేదని, ప్రజలు దీనిని నమ్మి మోసపోవద్దని హెచ్చరిస్తూ ట్వీట్ చేసింది.🕵️♂️ #Fraudulent_Website_AlertA #FAKE website is falsely claiming that Prime Minister Narendra Modi has launched a project allowing citizens to earn up to ₹10,000 per day.🔍 #PIBFactCheck📣 The Government of India has NOT made any such announcement.⚠️ Be cautious! Do NOT… pic.twitter.com/Bf1Q4BhQPb— PIB Fact Check (@PIBFactCheck) May 15, 2025

పీఎం ఆవాస్ యోజన గడువు పొడిగింపు
సొంతంగా ఇల్లు నిర్మించుకోవాలని అందరూ అనుకుంటారు. అయితే ఆర్ధిక ఇబ్బందుల కారణంగా.. ఇల్లు కట్టుకోవడం బహుశా అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అలాంటి వారికోసం కేంద్ర ప్రభుత్వం.. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన-అర్బన్ (PMAY-U) స్కీమ్ తీసుకొచ్చింది. ఈ పథకం గడువును పొడిగిస్తూ 'మినిస్ట్రీ ఆఫ్ హోసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్' (MoHUA) నిర్ణయం తీసుకుంది.జూన్ 25, 2015న ప్రారంభించిన ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అర్బన్ గడువును.. 2025 డిసెంబర్ 30, 2025 వరకు పొడిగించారు. దీనివల్ల మంజూరైన ఇళ్లను పూర్తి చేయడానికి ఎక్కువ సమయం లభిస్తుంది. లబ్ధిదారులు తమ గృహ ప్రయోజనాలను క్లెయిమ్ చేసుకోగలరు. 2022 మార్చి 31 నాటికి మంజూరైన ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడానికి ఈ గడువును పెంచడం జరిగింది.పీఎంఏవై-యూ 2.0ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-అర్బన్ 2.0 (PMAY-U 2.0) అనేది.. పట్టణ ప్రాంతాల్లో అర్హులైన ప్రజలు ఇళ్లను నిర్మించుకోవడానికి కేంద్ర సహాయం అందించే స్కీమ్. ఆర్థికంగా వెనుకబడినవారు, తక్కువ ఆదాయ మార్గాలు ఉన్నవారు, దేశంలో ఎక్కడా సొంత పక్కా ఇల్లు లేని కుటుంబాలు ఈ పథకానికి అర్హులు.ఇదీ చదవండి: అగ్ని ప్రమాదంలో నష్టపోయారా?: ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెస్ ఇదే..PMAY 2.0 పథకానికి అర్హతను ఎలా చెక్ చేసుకోవాలంటే..➤https://pmay-urban.gov.in/ బ్సైట్ ఓపెన్ చేసి.. హోమ్‌పేజీలో కనిపించే.. అప్లై ఫర్ PMAY-U 2.0పై క్లిక్ చేయండి.➤సూచనలను పూర్తిగా చదివిన తరువాత.. క్లిక్ టు ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి➤మీ అర్హతను తెలుసుకోవడానికి ఫారమ్ ఫిల్ చేయండి. ➤చివరగా ఆధార్ నెంబర్, పేరును ఎంటర్ చేసిన తరువాత.. ఓటీపీ ఎంటర్ చేసి అర్హతను చెక్ చేసుకోవచ్చు.
ఫ్యామిలీ

ఈ డ్రగ్‌తో జాగ్రత్త సుమీ! 2 గ్రాములు చాలు
ఈ మధ్య కాలంలో ఓ మహిళా వైద్యురాలు 53 గ్రాముల కొకైన్‌తో పట్టుబడి వార్తలకెక్కడంతో కొకైన్‌పై చర్చ మరోసారి బయలుదేరింది. కొకైన్ డోస్ 30 నుంచి 70 మిల్లీగ్రాములు తీసుకుంటే చాలు, రెండు లేదా మూడు నిమిషాల్లో మెదడులో స్వైరకల్పనలు మొదలై ఎక్కడికో వెళ్ళిపోతుంది. పోను పోనూ అలవాటు ముదిరితే 1 గ్రాము వరకు ఒకేసారి తీసుకోగలరు.అంతకుమించి 2 గ్రాముల వరకు ఒకేసారి తీసుకుంటే చావు-బ్రతుకుల మధ్య ఉన్నట్లే అంటున్నారు శాస్త్రవేత్తలు. ప్రతిరోజూ 5 గ్రాముల దాకా విడతలు, విడతలుగా తీసు కునే వారి శరీరంలో అనేక అవయవాలు దెబ్బతింటాయి. కిడ్నీలు, ప్రేవులు, ఊపిరితిత్తులు నాశనమవుతాయి. కేంద్ర నాడీమండల వ్యవస్థ పాడై మానసిక భ్రాంతులు కలగడం, వణుకు రావడం, ఊపిరి పీల్చడంలో ఇబ్బందులు... ఇలా ఎన్నో రుగ్మతలు వస్తాయి. సాధారణంగా కొకైన్‌ని ముక్కుతో పీల్చడం, ఇంజెక్ట్ చేసుకోవడం, సిగరెట్లలో పెట్టి కాల్చడం వంటి పద్ధతుల్లో తీసు కుంటారు. తీసుకున్న తర్వాత ఒక్కొక్కరికి రకరకాల తేడాలతో భ్రాంతులు కలుగుతాయి. కోకా ఆకులు నుంచి కొకైన్‌ని తయారు చేస్తారు. కొలంబియా, పెరూ, బొలీవియా వంటి దేశాల్లో ఈ కోకా పంట విరివిగా పండుతుంది. మొట్టమొదట స్థానికులు అజీర్ణానికి, చురుకుగా ఉండటానికి ఈ ఆకుల్ని మందుగా నమిలేవారు. అయితే జర్మన్ రసాయన శాస్త్రవేత్త అల్బర్ట్ నీమన్ ఒకసారి ఈ ఆకుల్ని నమలగా విచిత్ర అనుభూతి కలిగింది. దాంతో ఆయన కోకా ఆకుల్లో నుంచి రసాన్ని పిండి, దానికి కొన్ని రసాయనాలు కలిపి కొకైన్ అనే తెల్లటి పదార్థాన్ని 1860లో తయారు చేశాడు. ఆ విధంగా ఇప్పుడు మనం చూసే కొకైన్ పుట్టింది.ఒక కిలోగ్రామ్ కొకైన్ తయారు చేయాలంటే వెయ్యి కిలో గ్రాముల కోకా ఆకులు కావాలి. దానికి మరిన్ని రసాయనాలు కలుపుతారు. ప్రపంచంలోని మొత్తం కొకైన్‌లో 70 శాతం పైగా ఒక్క కొలంబియాలోనే తయారవుతుంది. ఆ తర్వాత స్థానం పెరూ, బొలీవియా దేశాలది. కేవలం ఈ కొకైన్ వల్లనే కొలంబియా దేశం వారానికి 400 మిలియన్ డాలర్లు ఆర్జిస్తోంది. ప్రస్తుతం ఈ కొకైన్ డ్రగ్ మాఫియా ప్రపంచంలోని చాలా దేశాలకు విస్తరించింది. – మూర్తి కేవీవీఎస్

అనంత్-రాధిక సండే షాపింగ్ : లవ్‌బర్డ్స్ వీడియో వైరల్
బాల్య ప్రేమికులు,గత ఏడాది జూలైలో వివాహం బంధంలోకి అడుగపెట్టిన లవ్‌బర్డ్స్ అనంత్ అంబానీ , రాధిక మర్చంట్ షాపింగ్‌లో సందడిగా కనిపించారు. జియో ప్లాజాలో భార్య రాధిక మర్చంట్ తో కలిసి అనంత్ అంబానీ ఆదివారం షాపింగ్ చేయడం సోషల్ మీడియాలో విశేషంగా నిలిచింది. అంబానీ అప్డేట్ పేజీ ఇన్‌స్టాలో షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.అనంత్ , రాధిక జియో వరల్డ్ ప్లాజా ప్రాంగణంలో షాపింగ్ చేశశారు. జియో వరల్డ్ ప్లాజాలోని భద్రతా సిబ్బంది వెంటరాగా ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని పెళ్లి అయ్యి దాదాపు ఏడాది కావస్తున్నా కొత్తజంటలా జియో షాపింగ్ మాల్లో సందడి చేశారు. అనంత్ కాల్లో బిజీగా ఉండగా, రాధిక చేయి పట్టుకుని ఉల్లాసంగా నడుస్తు, విలాసంగా కనిపించింది. అనంత్ నేవీ బ్లూ షర్ట్, త్రీ-ఫోర్త్స్ బ్లాక్ షార్ట్స్, బ్లాక్ సాక్స్, బ్లూ షూస్ ధరించాడు. ఇక అంబానీ చోటీ బహూ ఎప్పటిలాగానే తన సింపుల్ స్టైల్‌ను చాటుకుంది. రాధిక తెల్లటి స్లీవ్‌లెస్ క్రాప్ టాప్ ధరించి, గిరిజాలజుట్టును అలా వదిలేసి సైడ్ బ్యాగ్ వేసుకుని చాలా క్యాజువల్ స్టైల్లో కనిపించింది.అయితే జంట దేని కోసం షాపింగ్ చేశారో స్పష్టంగా తెలియదు. ఫ్యాన్స్‌కి మాత్రం అనంత్-రాధిక షాపింగ్ వీడియో తెగ నచ్చేసింది. View this post on Instagram A post shared by Ambani Family (@ambani_update)ఇదీ చదవండి: బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారా? ఈ తొమ్మిది మస్ట్..! దేశీయ కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ చిన్నకుమారుడు అనంత్ అంబానీ తన చిన్ని నాటి స్నేహితురాలు రాధిక మర్చంట్‌ను గత ఏడాది జైలూ12న పెళ్లాడాడు. ప్రపంచంలోనే కనీవినీ ఎరుగనిరీతిలో వివాహ వేడుకలు జరిగాయి. అంగరంగవైభవంగా జరిగిన ఈ వివాహానికి ఇండియాతో పాటు, ప్రపంచవ్యాప్తంగా అనేకమంది బిలియనీర్లు హాజరైన సంగతి తెలిసిందే.

ఆ ఫుడ్..నాట్ గుడ్..!
ఉరుకుల పరుగుల జీవనయానంలో ప్రజల జీవన శైలిలో అనేక మార్పులు వచ్చాయి. ఆహారపు అలవాట్లు కూడా చాలా వరకు మారిపోయాయి. సామాజిక స్థాయిలు మారాయి. నగరాలు, పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా కిట్టీ పార్టీ కల్చర్ వచ్చింది. బర్త్‌డేలు, మ్యారేజ్ డేలు, నిశ్చితార్థాలు, ఉద్యోగంలో ప్రమోషన్లు.. సందర్భం ఏదైనా స్నేహితులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులతో కలిసి హోటళ్లల్లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే ఆ ఆహారమే అనారోగ్యమని గుర్తించలేపోతున్నారు. మురికి కాలువ గట్ల మీద ఉండే చిన్నపాటి తినుబండారాల తోపుడుబండి నుంచి పెద్దపెద్ద భవనాల్లో ఉండే ఖరీదైన హోటళ్ల వరకు అన్ని వేళలా ఆహార ప్రియులతో కిటకిటలాడుతుంటాయి. శుభకార్యాల నుంచి అశుభకార్యాల వరకు అన్ని సందర్భాల్లోనూ వడ్డించే ఫుడ్ కోసం హోటల్స్‌కు ఆర్డర్లు ఇస్తున్నారు. ఇంటి భోజనం కంటే హోటళ్లు, దాబాలు, రెస్టారెంట్లు, బేకరీ ఫుడ్‌కు బాగా ప్రాధాన్యత పెరిగింది. అయితే ఇక్కడ తయారయ్యే ఆహారాలు, నిల్వ ఉన్న పదార్థాలు, పలు రసాయనాలతో చేసినవి కావడంతో ఆ వంటకాలు తిని పలువురు రోగాల బారిన పడుతున్నారు. క్యాన్సర్ రోగుల్లో 53 «శాతం మంది హోటల్స్ ఆహారంతోనే సమస్య తెచ్చుకుంటున్నారని పలు సర్వేలు వెల్లడించడం ప్రమాద తీవ్రతను తెలియజేస్తోంది. ఆహారాల్లో ప్రమాదకర రసాయనాలు హోటళ్లల్లో ఆహారాలు కలర్ ఫుల్, రుచికరంగా ఉండేందుకు ప్రమాదకర రసాయనాలు వినియోగిస్తుండడంతో అనేక రోగాలకు కారణమవుతున్నాయి. మెటానియల్ ఎల్లో వాడకం నిషేధించినప్పటికీ చాలా హోటళ్లలో వినియోగిస్తున్నారు. ఇది ఆరోగ్యంపై వెంటనే దుష్ప్రభావం చూపించదు. నెమ్మదిగా క్యాన్సర్‌కు కారకమవుతోంది. చిన్నారుల్లో నిద్రలేమి, నరాల సంబంధిత వ్యాధులకు దారితీస్తాయి. వంటకాల్లో రంగు కోసం వాడే నిషేధిత టార్ట్రాజిన్ చాలా ప్రమాదకరం. దీంతో మానసిక వ్యాధితోపాటు థైరాయిడ్, క్యాన్సర్, ఎలర్జీ, దద్దుర్లు, తామర, రక్తకణ జాలంలో హానికర కణ జాలల వృద్ధి చెందడం, డీఎన్ఏ నష్టపోవడం, నిద్రలేమి, నీరసం వస్తాయి. స్వీట్లు, బిస్కెట్లలో ఆరెంజ్ రంగు కోసం వాడే సన్‌సెటన్, పసుపు రంగు కోసం వాడే కాటారజ్, గ్రీన్ కలర్ కోసం వాడే బ్రిలియంట్ బ్లూ, టారా్ట్రాజీన్లు ప్రమాదకరమే. చాకెట్లలో వాడే రోడ్మన్–బీ కూడా ప్రాణాంతకమే. అయినా చాక్లెట్లు, చిన్న పిల్లలు తినే రంగుల ఆహార పదార్థాల్లో వీటిని వినియోగిస్తున్నారు. పార్టీ కల్చర్.. ప్రమాదకరం కొన్నేళ్ల క్రితం వరకు పల్లెల నుంచి పట్టణాలకు వెళ్లినా.. సమయానికి ఇంటికి రాలేని పరిస్థితుల్లో కొందరు హోటళ్లలో తినేవారు. కొందరైతే ఎంత సమయమైనా ఇంటికి వచ్చే భోజనం చేసేవారు. ఇప్పుడు కల్చర్ మారింది. సామాజిక నడతలో మార్పు వచ్చింది. నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ కల్చర్ వచ్చింది. నలుగురు స్నేహితులు కలిస్తేనే కాదు.. వీకెండ్ ఫ్యామిలీస్‌తో కలిసి లంచ్, డిన్నర్ బయటే చేస్తున్నారు. ఖరీదైన ఆహారం తింటున్నామనే భ్రమలో అనారోగ్యం బారిన పడుతున్నామని గ్రహించలేకపోతున్నారు. నిల్వ ఉంచిన ఆహారం, ప్రమాదకర రసాయనాలు కలిపిన ఆహారాలతో అప్పటికప్పుడు నష్టం లేకపోయినా దీర్ఘకాలంలో వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది.నిబంధనలు బేఖాతర్ జిల్లాలో చిన్నా, పెద్ద హోటల్స్, రెస్టారెంట్లు, దాబాలు, చాట్ బండార్లు, నూడిల్స్ షాపులు, అన్ని కలుపుకుని 5 వేలకు పైగా ఉంటాయి. ఒక్క నగరంలోనే 3 వందల వరకు హోటల్స్ ఉన్నాయి. వీటి ద్వారా ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతోంది. వాస్తవానికి హోటల్స్ యజమానులు ఆహార పరిరక్షణ, నాణ్యత ప్రమాణాల సంస్థ నుంచి లైసెన్స్ తీసుకోవాల్సి ఉంది. ఆ శాఖ నిబంధనల మేరకు ఆహారం తయారు చేయాలి. ఈ చట్టం 2006 నుంచి అమల్లో ఉంది. ఆ శాఖ పరిధిలో జిల్లా స్థాయి అధికారితోపాటు ఓ గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్, మరో ఇద్దరు ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. వీరు నెలకు 12 శాంపిల్స్ సేకరించాలి. శాంపిల్స్‌ను ప్రయోగశాలకు పంపి, పరిశీలన తర్వాత అవి ప్రమాణాల మేరకు లేకపోతే కేసులు నమోదు చేయాల్సి ఉంది. కల్తీని బట్టి క్రిమినల్ లేదా సివిల్ కేసులు నమోదు చేసి జరిమానాలు విధించే వీలుంది. కానీ ఇవి జరగడం లేదు. దీన్ని ఆసరాగా చేసుకుని తమ వద్దకు ఎవరూ రారన్న ధీమాతో వ్యాపారులు చెలరేగిపోతున్నారు. విచ్చలవిడిగా ఆహారాన్ని కల్తీ చేస్తున్నారు.నాసిరకం.. రంగుల మయం హోటళ్లల్లో తయారయ్యే ఆహార పదార్థాలు నాసిరకం.. రంగుల మయంగా ఉంటాయి. పశువుల ఎముకలను సేకరించి వాటిని బట్టీలో అత్యధిక ఉష్ణోగ్రతపై మరిగించి ద్రావణాన్ని తీస్తున్నారు. ఆ ద్రావణాన్ని సాధారణ నూనెల్లో కలిపి విక్రయిస్తున్నారు. దీని వల్ల జీర్ణకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. మిరప కాయల్లో ఎరుపు రంగు రావడానికి సూడాన్ రంగులు వాడుతుంటారు. పసుపులో మెటానిల్ ఎల్లో అనే పదార్థాన్ని కలుపుతారు. వీటిని వంటలో వినియోగిస్తే క్యాన్సర్ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఆహారాన్ని వండే సమయంలో వాడిన నూనెనే మళ్లీ మళ్లీ కాచి వినియోగిస్తున్నారు. దీని వల్ల క్యాన్సర్, అల్సర్లు వచ్చే ప్రమాద మున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. చికెన్, మటన్ బిర్యానీలు, తందూరిలో ఆకట్టుకునేందుకు ఎక్కువగా హానికరమైన రంగులను వాడుతున్నారు. అనారోగ్యానికి గురైన, ప్రమాదాల్లో చనిపోయిన గొర్రెలు, పొట్టేళ్లు, మేకలతోపాటు అనారోగ్యానికి గురైన వాటిని వధించి వినియోగదారులకు విక్రయిస్తున్నారు.చిన్న చిన్న హోటళ్లు, కర్రీస్ పాయింట్లలో వేడి వేడి కూరలు, పప్పు, సాంబారు వంటి ఆహార పదార్థాలు పల్చటి పాలిథిన్ కవర్లలో వేసి ఇస్తున్నారు. పదార్థాల వేడికి ప్లాస్టిక్ కరిగి వాటిని తినే వారికి అనారోగ్యాన్ని కలిగిస్తున్నాయి. ∙నిషేధిత క్యాట్ ఫిష్‌లను సైతం కొర్రమీనుగా విక్రయిస్తున్నారు. జిల్లాలో వీటిని చికెన్, మటన్ వ్యర్థాలతో గుంతల్లో పెంచుతున్నారు.అల్లం, వెల్లుల్లి పేస్టులను సైతం కల్తీ చేస్తున్నారు. వీటి ధర ఎక్కువగా ఉండడంతో అందులో ఆలుగడ్డ, ఉల్లిగడ్డ పేస్ట్‌ను కలుపుతున్నారు.నిత్యం తనిఖీలు చేస్తున్నాంహోటల్స్, ఐస్‌క్రీం పార్లర్లు, రెస్టారెంట్లు, పండ్ల దుకాణాలను నిత్యం తనిఖీలు చేస్తూనే ఉన్నాం. పలు హోటళ్లలో వంటల తయారీకి ఉపయోగిస్తున్న పదార్థాల్లో నాణ్యత లేకపోగా చాలా వరకు కాలం చెల్లినవి, ఉంటున్నాయి. 2024–25లో పలు హోటల్స్‌ను తనిఖీ చేసి 296 శ్యాంపిల్స్‌ను సేకరించగా 20 శాంపిల్స్‌లో నాణ్యత తక్కువగా ఉన్నట్లు, 18 శాంపిల్స్ ప్యాకెట్స్‌పై వివరాలు లేకుండా ఉన్నట్లు గుర్తించాం.– వెంకటేశ్వరరావు, జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ ఆఫీసర్ కల్తీ వల్ల ఆరోగ్య సమస్యలుకల్తీ ఆహారం తినడం వల్ల జీర్ణకోశ సమస్యలు తలెత్తుతాయి. అవసరమైన పదార్థాలు అందక శరీరం బలహీనమవుతుంది. పోషకాహారం తీసుకుంటున్నామని ప్రజలు భావిస్తున్నప్పటికీ, కల్తీ వల్ల జీవనక్రియలు నిలిచిపోయి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వీలైనంత వరకు బయట ఫుడ్‌కు స్వస్తి చెప్పి ఇంటి ఆహారాన్ని తీసుకోవడం శ్రేయస్కరం. ఆరోగ్యానికి ఎంతో మంచిది. – డాక్టర్ ఎంవీ రమణయ్య, రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాల(చదవండి: ప్లీజ్..నో సప్లిమెంట్స్..! )

మెరిసిన చేనేత.. మురిసిన భామలు
పోచంపల్లి ఇక్కత్ చీరలు, ఇక్కత్ వస్త్రాలు, విశ్వవ్యాప్తంగా తరలివచ్చిన సుందరాంగుల మనసు దోచుకున్నాయి. చేనేత కళాకారుల వస్త్ర డిజైన్లను చూసి వారు ముగ్ధులయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రపంచ సిల్క్ సిటీ భూదాన్ పోచంపల్లిలో.. ప్రపంచ సుందరీమణుల పోటీదారుల పర్యటనలో అడుగడుగునా చేనేత వస్త్ర కళా వైభవం కళ్లకు కట్టింది. చేనేత చీరలు, వస్త్రాలను చూసి విదేశీ వనితలు మురిసిపోయారు. ఈ సందర్భంగా కొన్ని వస్త్రాలను ధరించి ఇక్కత్ చీరల తయారీ ప్రక్రియ, డిజైన్ల వివరాలను వారు అడిగి తెలుసుకున్నారు. ఇక్కత్ చీరల నేతకు ప్రసిద్ధిగాంచిన పోచంపల్లి మరోసారి ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. తెలంగాణ పర్యాటక శాఖ.. చేనేతను మరింత ప్రచారంలోకి తీసుకురావడంలో విజయవంతమైంది.అందగత్తెలతో ప్రపంచం దృష్టికి..పోచంపల్లిలో అందాల భామల పర్యటనతో చేనేత, ఇక్కత్ వస్త్రాలు ప్రపంచానికి మరోసారి పరిచయమైనట్లయింది. తెలంగాణ పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో చేనేత కళాకారుల ప్రతిభకు గుర్తింపు దక్కేలా ప్రభుత్వం కృషి చేసింది. పోచంపల్లికి వచ్చిన 25 దేశాల మిస్ వరల్డ్ పోటీదారులు.. పోచంపల్లి చీరల తయారీ, డిజైన్, అద్దకం ఇక్కత్ వస్త్రాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఒక్కొక్క చీర తయారీకి కళాకారులు తీసుకునే శ్రమ, డిజైన్ల సృజనాత్మకత.. పోటీదారుల మనస్సును హత్తుకున్నాయి. చీరలపై భిన్న డిజైన్లను తిలకించిన అందగత్తెలు పరవశించిపోయారు. రంగు రంగుల డిజైన్లతో ఉన్న ఇక్కత్, డబుల్ ఇక్కత్ చీరలు, శాలువాలు, డ్రెస్ మెటీరియల్, కాటన్, పట్టు చీరలను చేతితో తడిమి మరీ చూశారు. పోచంపల్లి, వెంకటగిరి ,గొల్లభామ, నారాయణపేట చీరలు, వస్త్రాల ప్రదర్శన సుందరీమణులను ఆకట్టుకుంది.ర్యాంప్ వాక్‌తో మెరుగులు దిద్ది..అందగత్తెలకే అసూయ పుట్టేలా నిర్వహించిన ఫ్యాషన్ షో.. పోచంపల్లి సందర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రపంచ అందగత్తెలే అచ్చెరువొందేలా హైదరాబాద్, ఢిల్లీకి చెందిన భారతీయ మోడల్స్.. ఇక్కత్ చీరలు, వస్త్రాల ఫ్యాషన్ షో అద్భుతంగా సాగింది. సంప్రదాయం, ఆధునికత ఉట్టిపడేలా రూపొందించిన డిజైన్లు ధరించిన చేనేత, ఇక్కత్ వస్త్రాలతో యువతీ యువకులు ప్రపంచానికి ఆధునికత జోడించిన చేనేత దుస్తులను పరిచయం చేశారు. ర్యాంప్‌వాక్ అదుర్స్ర్యాంప్వాక్లో చేనేత డిజైన్లతో మోడల్స్ ధరించిన దుస్తులను..ప్రపంచ అందగత్తెలు కళ్లార్పకుండా చూ స్తూ చప్పట్లు, కేరింతలతో ప్రోత్సహించారు. ప్రపంచ సుందరీమణులు, స్థానిక మోడల్స్ ధరించిన చేనేత వస్త్రాలతో వేదిక చేనేతను విశ్వవ్యాప్తం చేసింది. 1956లో పోచంపల్లిలో పట్టు పరిశ్రమకు బీజం పోచంపల్లి టైఅండ్‌డై ఇక్కత్ చేనేత కళారంగం ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. 1956లో పోచంపల్లిలో పట్టు పరిశ్రమకు బీజం పడింది. మొదటిసారిగా పోచంపల్లికి చెందిన కర్నాటి అనంతరాములు, తడక పెద్దయాదగిరిలు నిలువు, పేక పద్ధతిలో సహజరంగులతో పట్టు చీరలను నేశారు. నాటి నుంచి ఎందరో చేనేత కళాకారులు ప్రయోగాలు చేస్తూ నూతన డిజైన్లు సృష్టిస్తూ చేనేత కళను విశ్వవ్యాప్తం చేస్తున్నారు. ప్రపంచాధినేతల ఆకట్టుకునేలా ఇక్కత్ వస్త్రాలుపోచంపల్లి ఇక్కత్ కళ ప్రపంచ వ్యాప్తమైంది. ఇటీవల భారత ప్రధాని నరేంద్రమోదీ ఫ్రాన్స్ పర్యటనలో ఫ్రాన్స్ అధ్యక్షుడి భార్య బ్రిగ్గేట్టే మెక్రాన్‌కు.. ఇక్కడి నేతన్నలు నేసిన ఇక్కత్ చీరను బహూకరించారు. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన ప్రపంచ పర్యాటక సంస్థ.. 2021లో పోచంపల్లికి ‘అంతర్జాతీయ బెస్ట్ టూరిజం విలేజ్ అవార్డు’ బహూకరించడంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. చేనేత కుటీర పరిశ్రమ ద్వారా సంప్రదాయ వృత్తి, వారసత్వ సంపదను కాపాడుకుంటూనే పలువురు ఉపా«ధి పొందుతున్నందుకు ఈ గుర్తింపు ఇచ్చారు. పోచంపల్లి వస్త్రాలు తప్పనిసరి.. దేశ, విదేశాల్లో జరిగే అంతర్జాతీయ సదస్సుల్లో అతిథులకు పోచంపల్లి శాలువాను కప్పడం సంప్రదాయంగా మారింది. ఇక్కత్ చేనేత వస్త్రాలను సిల్క్, కాటన్, సిల్క్ చీరలు, డ్రెస్ మెటీరియల్స్, బెడ్‌షీట్స్, రజయ్ (క్విల్స్), స్టోల్స్, స్కార్ప్, దుప్పట్టా, డోర్, టేబుల్ కర్టెన్లు, పిల్లో కవర్లు తదితర వెరైటీలు దేశ, విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఆఫ్రికా, యూరప్, అమెరికాలకు వెళ్తున్నాయి. ముస్లిం దేశాలలో మహిళలు ముఖానికి ధరించే స్కార్ఫ్‌కు మంచి డిమాండ్ ఉంది. ఇక అపెరల్ ఫ్యాబ్రిక్, హోమ్ ఫర్నిషింగ్, డ్రెస్ మెటీరియల్స్‌ను యూరప్ దేశాల ప్రజలు అమితంగా ఇష్టపడుతున్నారు.పేటెంట్ హక్కులతో ముందుకు..పోచంపల్లి వస్త్రాలకు మొట్టమొదటిసారిగా 2003లో కేంద్ర ప్రభుత్వం జియొగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ (పేటెంట్) సర్టిఫికెట్ జారీ చేసింది. ఇక్కత్ కళ దేశంలో మరెక్కడా లేదు. మారుతున్న కాలానుగుణంగా ఇక్కడి చేనేత కళాకారులు పోచంపల్లి ఇక్కత్ డిజైన్లలో గద్వాల, కంచి, ధర్మవరంతో పాటు కొత్త కొత్త డిజైన్లు వచ్చేలా వినూత్న ప్రయోగాలు చేస్తూ విజయం సాధిస్తున్నారు. కాగా పేటెంట్ హక్కులు పొందినప్పటికీ.. నకిలీ వస్త్రాల తయారీ చేనేత వస్త్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతోంది.ఇక్కత్ యూనివర్సల్ బ్రాండ్ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా పోచంపల్లి టై అండ్ డైలోనే ఇక్కత్ ఉంది. ఇక్కత్ అనేది ఒక యూనివర్సల్ బ్రాండ్. చేనేత చీరలు పూర్తిగా చేతితో మగ్గంపై ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్న సంప్రదాయ కళ. నూలు ఉడకబెట్టడం, రంగుల అద్దకం వంటి చేతి వృత్తి. ఎంతో మంది మహిళలు ఇక్కత్ చీరల పనితో జీవనోపాధి పొందుతున్నారు. పోచంపల్లి చీరల డిజైన్ కూడా ఒక ప్రత్యేకత సంతరించుకుంది. పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు ఎంతో గుర్తింపు పొందాయి. – ఎం.హనుమంతరావు, కలెక్టర్, యాదాద్రి భువనగిరి జిల్లాచేనేతకు ప్రభుత్వం చేయూత తెలంగాణలో జరుగుతున్న ప్రపంచ సుందరీమణుల పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన అందాల భామలు పోచంపల్లి చీరలు, వస్త్రాలకు ముగ్ధులయ్యారు. ప్రపంచ పటంలో పోచంపల్లి కళాకారులు రూపొందించిన వస్త్రం సంపద వెల కట్టలేనిది. సీఎం రేవంత్ అధ్వర్యంలోని ప్రభుత్వం చేనేతకు చేయూత నిస్తోంది. – కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే, భువనగిరి(చదవండి: మన శక్తిని నమ్ముకుందాం నటాషా న్యో న్యో జీ.. మిస్ యుగాండా! )
ఫొటోలు
అంతర్జాతీయం

లష్కరే టాప్ టెర్రరిస్ట్ సైఫుల్లా ఖలీద్ హతం
లష్కరే టాప్ టెర్రరిస్ట్ సైఫుల్లా ఖలీద్ హతమయ్యాడు పాకిస్థాన్‌లో ఖలీద్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. తన నివాసం నుంచి ఆదివారం మధ్యాహ్నం బయటకు వెళ్లిన ఖలీద్‌ను దాడి చేసి హతమార్చారు. లష్కరే కమాండర్లతో కలిసి ఖలీద్ పనిచేశాడు. 2006లో నాగపూర్ ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయంపై దాడి ఘటనలో ఖలీద్ సూత్రధారి.నాగపూర్, రాంపూర్, బెంగుళూరు దాడుల్లో ఖలీద్ హస్తం ఉంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఖలీద్‌కు పాకిస్థాన్ సర్కార్ భద్రత కల్పించింది. నేపాల్‌లో ఉంటూ లష్కరే కార్యకలాపాలు నిర్వహించిన ఖలీద్.. ఇటీవల సింధ్ ప్రావిన్స్‌లోని బాదిక్ జిల్లాకు మకాం మార్చాడు. ఇవాళ అక్కడే హతమయ్యాడు. 2001లో రాంపుర్లోని సీఆర్పీఎఫ్ శిబిరంపై, 2005లో బెంగళూరులోని ఐఐఎస్‌సీపై జరిగిన దాడుల్లోనూ ఖలీద్ హస్తం ఉంది.

మరోసారి గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు.. 100 మంది మృతి
జెరూసలేం: గాజాలోని పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ ఆర్మీ భీకర వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో గత 24 గంటల వ్యవధిలో మహిళలు, చిన్నారులు సహా 150 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని గాజా ఆరోగ్య విభాగం తెలిపింది. దాడుల్లో వందలాదిగా గాయపడ్డారని పేర్కొంది. గురువారం నుంచి కొనసాగుతున్న భీకర దాడుల్లో మొత్తం 250 మంది మృత్యువాతపడ్డారని ఆరోగ్య విభాగం వివరించింది.శనివారం అర్ధరాత్రి నిరాశ్రయులకు ఆశ్రయం కల్పిస్తున్న పలు నివాసాలు, శిబిరాలపై వైమానిక దాడులు జరపడంతో ఖాన్‌యూనిస్, ఉత్తర గాజా, జబాలియాలోని శరణార్థి శిబిరంలో మొత్తం 100 మంది మృతి చెందినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 100 మందిలో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది ప్రాణాలు కోల్పోగా.. ఏడుగురు చిన్నారులు మరణించినట్లు అధికారులు పేర్కొన్నారు.2023 అక్టోబర్ 7వ తేదీ నుంచి మొదలైన ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటి వరకు 53 వేల మందికి పైగా చనిపోయినట్లు ఆరోగ్య విభాగం వెల్లడించింది. వీరిలో అత్యధికులు మహిళలు, చిన్నారులేనని వివరించింది. క్షతగాత్రుల సంఖ్య లక్షల్లోనే ఉంటుందని పేర్కొంది. ఉత్తర, మధ్య గాజాలోని వారిని నివాసాలు, టెంట్లు విడిచిపెట్టి వెళ్లాలని హెచ్చరికలు చేస్తూ భీకర దాడులు కొనసాగిస్తున్న ఇజ్రాయెల్ ఆర్మీ కీలకమైన మరో ఆపరేషన్‌కు తెరతీసింది.లక్షిత ప్రాంతాలను స్వాధీనం చేసుకునే ఆపరేషన్ ‘గిడియన్ చారియట్స్’ను తమ సైన్యం పూర్తి సామర్థ్యంతో కొనసాగిస్తుందని రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ వెల్లడించారు. మరికొద్ది రోజుల్లోనే వేలాదిగా ఇజ్రాయెల్ బలగాలు గాజాలో ప్రవేశించి ఆపరేషన్ మొద లుపెట్టనున్నాయి. ఇజ్రాయెల్ మిలటరీ ఆపరేషన్ ప్రకటనతో హమాస్ కాస్తంత వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. ఎటువంటి ముందస్తు షరతులు లేకుండా అన్ని అంశాలపైనా చర్చలకు సిద్ధమని ప్రకటించింది. ఖతార్ రాజధాని దోహాలో ఇజ్రాయెల్‌తో చర్చలకు హాజరవుతామని తెలిపింది. అయితే, పాలస్తీనా ఖైదీల విడుదల, గాజా నుంచి ఇజ్రాయెల్ సైన్యం సంపూర్ణ ఉపసంహరణ తమ కీలక డిమాండ్లని స్పష్టం చేసింది.

పాకిస్తాన్‌కు ఊహించని షాక్.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన IMF
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్‌కు బిగ్ షాక్ తగిలింది. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత.. పాకిస్తాన్‌పై అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) ఫుల్ ఫోకస్ పెట్టింది. పాకిస్తాన్‌పై కొత్త ఆర్థికపరమైన షరతులను విధించింది. దీంతో, పాకిస్తాన్ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టు సమాచారం.వివరాల ప్రకారం.. పాకిస్తాన్‌పై మరో 11 కొత్త ఆర్థికపరమైన షరతులను ఐఎంఎఫ్ విధించింది. తాజాగా విధించిన షరతులతో ఐఎంఎఫ్ విధించిన షరతుల సంఖ్య 50కి చేరుకుంది. పాకిస్తాన్ రాబోయే ఆర్థిక సంవత్సరానికి రక్షణ బడ్జెట్‌ను రూ.2.414 ట్రిలియన్గా ప్రణాళిక వేస్తోంది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే రూ.252 బిలియన్లు అంటే 12% అధికం. ఈ నేపథ్యంలోనే ఐఎంఎఫ్ కొత్త షరతులు విధించినట్టు తెలుస్తోంది.కొత్త షరతులు ఇవే.. జూన్ 2025 లోగా ఐఎంఎఫ్ లక్ష్యాలకు అనుగుణంగా 2026 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను పార్లమెంటు ఆమోదించాలి. ఐఎంఎఫ్ సూచించిన గవర్నెన్స్ డయాగ్నొస్టిక్ అసెస్మెంట్ ఆధారంగా ప్రభుత్వ బలోపేతానికి చేపట్టే చర్యల ప్రణాళికను ప్రభుత్వం ప్రచురించాలి. అంతేకాకుండా 2027 తర్వాతి ఆర్థిక రంగం పరిపాలన, నియంత్రణ గురించి ప్రణాళిక రూపొందించాలి. ఇది 2028 నుండి సంస్థాగత మరియు నియంత్రణ వాతావరణాన్ని వివరిస్తుంది.🚨BREAKING: IMF imposes 11 new conditions on Pak, warns it against risks to bailout programme: Report#IndiaPakistanWar #IndiaPakistanTensions pic.twitter.com/CqBS9vF6eF— 8bit Market (@8bit_market) May 18, 2025అలాగే, జూన్ నెల లోపు నాలుగు రాష్ట్రాలు కొత్త వ్యవసాయ ఆదాయపు పన్ను చట్టాలను అమలు చేయాలి. దీని కోసం పన్ను ప్రక్రియ, రిజిస్ట్రేషన్, ప్రచార కార్యక్రమం ఇంకా వాటి అమలుకై ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. ఎనర్జీ రంగంలో కొత్త షరతులను తీసుకురావాలని తెలిపింది. ఇందులో భాగంగా.. ఫిబ్రవరి 15, 2026 నాటికి గ్యాస్ చార్జీలను సవరించాలని, ఇంకా మే నెలాఖరులోపు ఈ ఆర్డినెన్స్‌ను శాశ్వత చట్టంగా మార్చాలని తెలిపింది.ఇంకా ప్రస్తుతం ఉన్న రూ.3.21 యూనిట్ పరిమితిని జూన్ లోపు తొలగించాలని తెలిపింది. వీటితోపాటు, 2035 నాటికి ప్రత్యేక పార్కులకు ఇచ్చే రాయితీలను పూర్తిగా తొలగించాల్సిందిగా పాకిస్తాన్ సర్కార్‌ను ఐఎంఎఫ్ కోరింది. దీని కోసం ఈ ఏడాది చివర్లో నివేదిక సమర్పించాలని తెలిపింది. అలాగే జూలై చివరి నాటికి, వాణిజ్య ప్రయోజనాల కోసం ఐదు సంవత్సరాలలోపు వాడిన కార్ల దిగుమతికి అనుమతి చట్టసభకు సమర్పించాలని తెలిపింది. ఈ క్రమంలో ఐఎంఎఫ్ విధించిన కొత్త షరతులతో పాకిస్తాన్‌కు టెన్షన్ మొదలైనట్టు తెలుస్తోంది.

ఛీ ఛీ.. ఈమె టీచరేనా.. బాలుడి జీవితం సర్వనాశనం!
మాస్కో: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ వివాహిత టీచర్.. విద్యార్థితో అనుచితంగా ప్రవర్తించింది. 11 ఏళ్ల బాలుడితో హద్దులు దాటి ప్రవర్తించింది. సదరు బాలుడిని లైంగికంగా వేధింపులకు గురిచేసి.. తన శారీరక అవసరాలను తీర్చుకుంది. ఈ విషయం బాలుడి తల్లికి తెలియడంతో.. ఆమె వ్యవహారం బయటకు వచ్చింది. దీంతో, ఆమెకు తొమ్మిది సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఈ దారుణ రష్యాలో చోటుచేసుకుంది. ఈ మేరకు ది న్యూయార్క్ పోస్ట్ కథనం వెల్లడించింది.వివరాల ప్రకారం.. రష్యాలో ఉన్న సెయింట్ పీటర్స్బర్గ్ ఉత్తర శివారులోని పాఠశాలలో అన్నా ప్లాక్సుక్ (27) టీచర్లో పనిచేస్తున్నారు. అదే పాఠశాలలో చదువుతున్న విద్యార్థి(11)తో ఆమె అనుచితంగా ప్రవర్తించారు. ఆమె శారీరక అవసరాల కోసం అతడిలో లైంగిక వాంఛలకు ప్రేరేపించారు. క్లాస్‌రూమ్‌లో ఒంటరిగా ఉన్న సమయంలో తన శారీరాన్ని తాకే విధంగా ప్రవర్తించింది. అతడి పెదవులను సైతం ముద్దాడింది. అంతేకాకుండా సదరు విద్యార్థికి వాట్సాప్‌లో ఆమె నగ్న చిత్రాలను పంపించింది. మెసేజ్‌లు చేయడం, వీడియోలు పంపించడం చేసింది. దీంతో, బాలుడు.. ఆమె చేసే పనులను అడిక్ట్ అయిపోయాడు.ఒకానొక సమయంలో బాలుడు.. ఇంట్లో ఉండగా వింతగా ప్రవర్తించాడు. అనుమానం వచ్చిన అతడి తల్లి.. ఫోన్ చెక్ చేయడంతో టీచర్ బండారం బయటకు వచ్చింది. దీంతో, ఆమెను పేరెంట్స్ నిలదీశారు. పాఠశాల ప్రిన్సిపాల్‌కు టీచర్‌పై తల్లి ఫిర్యాదు చేసింది. అనంతరం, వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన కోర్టు టీచర్ ప్లాక్సుక్కు తొమ్మిది సంవత్సరాల జైలు శిక్ష విధించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత ఒక సంవత్సరం పాటు బోధించకుండా నిషేధం విధించింది.Shocking: Anna Plaksyuk, a 27-year-old married primary school teacher from Toksovo, Russia, sentenced to 9 years for sexually abusing an 11-year-old boy. The “dream teacher” sent naked selfies, exposed by the victim’s mother. Justice served! pic.twitter.com/SXv0WrZHxs— Make Europe Great Again - M.E.G.A (@ScaryEurope) May 16, 2025
జాతీయం

నాజిల్ సమస్యే!.. నాలుగో దశను కూల్చివేసిన ఇస్రో
పీఎస్ఎల్వీ.. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఇది నాలుగు అంచెల రాకెట్. ఈ రాకెట్లో తొలి, మూడో దశల్లో ఘన ఇంధనం వాడతారు. ఇక రెండు, నాలుగో దశల్లో ద్రవ ఇంధనం వినియోగిస్తారు. 101వ ఉపగ్రహం ‘రీశాట్-1బి’ని రోదసికి పంపేందుకు నేటి ‘శతాధిక’ ప్రయోగంతో కలిపి పీఎస్ఎల్వీతో ఇస్రో 63 ప్రయోగాలు నిర్వహించింది. వీటిలో ఈ రాకెట్ విఫలమైన సందర్భాలు మూడు. 2017 తర్వాత రాకెట్లో లోపం కనిపించడం ఇదే తొలిసారి. నిజానికి మూడో దశలో రాకెట్ ఫెయిల్ కావడం అరుదు. 114 సెకండ్లపాటు సాగే ఈ మూడో దశలో హెచ్టీపీబీ (హైడ్రాక్సిల్-టర్మినేటెడ్ పాలీబ్యూటడీన్) ఘన ఇంధన మోటార్ వాడతారు. ఈ ఇంధనం ఆదర్శ స్థితిలో 240 కిలో న్యూటన్ల చోదకశక్తి ఇస్తుంది. తాజా ప్రయోగ వైఫల్య కారణాలను నిగ్గుతేల్చేందుకు ఇస్రో నుంచి ఒకటి, ప్రభుత్వం నుంచి మరొకటి వంతున రెండు కమిటీలు రంగంలోకి దిగాయి. రాకెట్ వేగం, ఎత్తు, ఇంజిన్ల పనితీరు అంశాలపై అవి అధ్యయనం చేస్తాయి. మోటారులో ఇంధన ప్రవాహం సరిగా లేదా? నాజిల్ సమస్యలు తలెత్తాయా? మోటారు డిజైన్/తయారీపరమైన లోపాలున్నాయా? ఇలా పలు కోణాల్లో విశ్లేషణ కొనసాగనుంది. కచ్చితమైన కారణం ఇంకా తెలియనప్పటికీ... రాకెట్ మూడో దశలో మోటార్ కేస్ లోపలి చాంబర్ ప్రెజర్లో అకస్మాత్తుగా పీడనం తగ్గడానికి ఫ్లెక్స్ నాజిల్ నియంత్రణ వ్యవస్థలో తలెత్తిన లోపమే కారణమని ఇస్రో ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. రాకెట్ వేగం, చోదక దిశలను నిర్దేశించేది ఈ కీలక భాగమే. ‘కంబశ్చన్ చాంబర్’లో ఇంధనం దహనమై విపరీత పీడనంతో వేడి వాయువులు నాజిల్ గుండా వెలుపలికి తన్నుకొస్తేనే రాకెట్ ప్రయాణం ముందుకు (పైకి) సాగుతుంది. ఈ ‘చర్యకు ప్రతిచర్య’ అనే మౌలిక సూత్రం ఆధారంగానే రాకెట్ పనిచేస్తుంది. రబ్బరు లాంటి స్థితిస్థాపక గుణం (లేయర్డ్ ఎలాస్టోమెరిక్) గల పదార్థాల పొరలతో ఫ్లెక్సిబుల్ నాజిల్స్ తయారవుతాయి. హైడ్రాలిక్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చి తద్వారా వాల్వులను కదిలిస్తూ ద్రవ/వాయు ప్రవాహాలను నియంత్రించేందుకు సాధారణంగా హైడ్రాలిక్ యాక్చువేటర్లను వినియోగిస్తుంటారు. వీటి పనితీరు సంక్లిష్టంగా ఉంటుంది. అందుకే పీఎస్ఎల్వీ రాకెట్ మూడో దశ మోటారులో హైడ్రాలిక్ యాక్చువేటర్లు కాకుండా… పరిమిత కోణాల్లోనే అయినప్పటికీ అన్ని దిశల్లో కదులుతూ కచ్చితమైన చోదకశక్తిని అందించేందుకు ఫ్లెక్సిబుల్ బేరింగ్ గల ఫ్లెక్స్ నాజిల్స్ ఉపయోగిస్తున్నారు. ఈ వ్యవస్థలో ఉత్పన్నమైన సమస్య వల్లనే తాజా ప్రయోగం విఫలమైనట్టు అనుమానిస్తున్నారు. నాజిల్ యాక్చువేటర్లు, ఫ్లెక్సిబుల్ జాయింట్, కంట్రోల్ సిగ్నల్స్... వీటిలో ఏదో ఒక సమస్య ఏర్పడి చాంబర్ ప్రెజర్లో పీడనం తగ్గి, మరింత ఎత్తుకు ప్రయాణించడానికి చాలినంత చోదకశక్తి లభించక రాకెట్ గతి తప్పడం ఆరంభించింది. దాన్ని అలాగే వదిలేస్తే జనావాసాలపై కూలి ప్రాణ-ఆస్తి నష్టం సంభవించే అవకాశముంది. అందుకే భద్రతా నిబంధనల ప్రకారం ఇస్రో దాన్ని ‘మిడ్ ఎయిర్-అబార్ట్’ చేసింది. అంటే... రాకెట్లో పేలోడ్ (ఉపగ్రహం) ఉన్న చివరిదైన నాలుగో దశను వేరే దారి లేక ఇస్రో కూల్చివేయాల్సి వచ్చింది.-జమ్ముల శ్రీకాంత్..

వీడియో: కంటతడి పెట్టించిన రైతు కష్టం.. స్పందించిన కేంద్రమంత్రి
ముంబై: ఇటీవల కురుస్తున్న అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆరుగాలం కష్టించి పంట చేతికి వచ్చిన సమయంలో వర్షాలు కురుస్తుండటంతో పంటను కాపాడుకునేందుకు ఎంతో కష్టపడుతున్నారు. తాజాగా వర్షం నీటిలో కొట్టుకుపోతున్న పంటను కాపాడేందుకు ఓ రైతు పడిన కష్టం వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియోపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. ఈ క్రమంలో బాధితుడితో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు.వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన రైతు గౌరవ్ పన్వార్ తన వేరుశనగ పంటను అమ్ముకోవడానికి వాషిమ్ మార్కెట్‌కు తీసుకొచ్చాడు. ఈ సందర్భంగా భారీ వర్షం కురవడంతో పంట నీటిలో కొట్టుకొనిపోయింది. దీంతో రైతు గౌరవ్ భారీ వర్షంలో తడుస్తూనే కొట్టుకుపోతున్న వేరుశనగను కాపాడేందుకు శాయశక్తులా ప్రయత్నించాడు. కానీ, వరద నీటిలో పంట కొట్టుకొనిపోయింది. ఈ హృదయవిదారక వీడియో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దృష్టికి రావడంతో.. స్వయంగా ఆయనే బాధిత రైతుకు ఫోన్ చేసి మాట్లాడారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఈ సందర్భంగా మంత్రి శివరాజ్ సింగ్ వీడియోను ట్విట్టర్లో పోస్టు చేశారు. వీడియోలో మాట్లాడుతూ..‘ఈ విషయం నన్ను చాలా బాధించింది. నష్టపోయిన పంటకు పరిహారం చెల్లిస్తాం. మీరు, మీ కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడకుండా చూస్తాం. మహారాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలపై చాలా సున్నితంగా వ్యవహరిస్తోంది. దీనిపై సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి, జిల్లా కలెక్టర్‌తో మాట్లాడాను. అంతా మంచే జరుగుతుంది’ అని అన్నారు. ▶️ This video will touch your heart.➡️ Union Minister for Agriculture and Farmers' Welfare and Rural Development, Shivraj Singh Chouhan says - “Seeing Gaurav Panwar’s video shook my heart. I spoke to him and assured support. No farmer will be left unheard - we stand… pic.twitter.com/N96OAq3zNO— Saurabh Dandariyal (@DandariyalUk) May 18, 2025

ఏరో ఇంజినీర్ అనుమానాస్పద మృతి
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగాల్సిన విద్యావంతురాలి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. ధర్మస్థలం నివాసి అయిన ఏరోస్పేస్ ఇంజినీర్ పంజాబ్‌లో అనుమానాస్పద రీతిలో చనిపోయింది. ఆకాంక్ష (23) మృతురాలు. ధర్మస్థలంలోని బోళియార్ నివాసులైన సురేంద్ర, సింధూదేవి దంపతుల కుమార్తె ఆకాంక్ష, పంజాబ్‌లోని ఫగ్వాడాలో ఎల్పీయూ విద్యాసంస్థలో ఉన్నత విద్యను పూర్తి చేసి, 6 నెలల నుంచి ఢిల్లీలో ఏరోస్పేస్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తోంది. తరువాత జపాన్‌లో ఉద్యోగం సంపాదించుకున్న ఆకాంక్ష తాను చదివిన కాలేజీలో కొన్ని సర్టిఫికెట్లు పొందడానికి పంజాబ్‌కు వెళ్లింది. శనివారం మధ్యాహ్నం సర్టిఫికెట్లు తీసుకున్నట్టు తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది. జలంధర్ నగరంలో ఉన్నట్లు తెలిపింది. కొన్ని గంటల వ్యవధిలోనే ఓ భవనంలో 3వ అంతస్తు పడి దుర్మరణం చెందింది. స్థానిక పోలీసులు ఆ మేరకు కుటుంబీకులకు సమాచారం ఇవ్వడంతో శోకసంద్రంలో మునిగిపోయారు. వెంటనే తల్లిదండ్రులు పంజాబ్‌కు వెళ్లారు. ఏదో దారుణం జరిగిందని, ఇది ప్రమాదం కాదని తల్లిదండ్రులు వాపోయారు.

పాక్ కన్నా నరకం మేలు: జావెద్ అఖ్తర్
న్యూఢిల్లీ: దేశభక్తి, మతం అంశాలపై తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు వెల్లడించే సినీ రచయిత జావెద్ అఖ్తర్ (80) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్, నరకం ఈ రెండింట్లో ఎక్కడికెళతావని అడిగితే తాను నరకాన్నే ఎంచుకుంటానని చెప్పారు. శనివారం రాత్రి ముంబైలో శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ రాసిన పుస్తకం ‘హెవెన్ ఇన్ ది స్వాంప్’(చిత్తడి నేలలో స్వర్గం) ఆవిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. తనను నాస్తికుడని చెప్పుకునే జావెద్ అఖ్తర్ భారత్, పాకిస్తాన్ల నుంచి అతివాదులు నిత్యం తనపై దుర్భాషల వర్షం కురిపిస్తున్నారని వెల్లడించారు. వీరిలో ఎవరైనా నన్ను దూషించడం ఆపేస్తే, చాలా ఆందోళన చెందుతాను. ‘కాఫిర్ అని, నరకానికి వెళ్తావని ఒకరంటే, జిహాదీ, పాకిస్తాన్‌కు పొమ్మంటూ మరొకరు దూషిస్తారు. పాకిస్తాన్, నరకం ఈ రెండింట్లో ఎటు వెళ్లాలన్న ప్రశ్న వస్తే మాత్రం నేను నరకానికే వెళ్తానంటాను’అంటూ జావెద్ అఖ్తర్ చేసిన వ్యాఖ్యలకు ఆహూతుల కరతాళ ధ్వనులతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ‘పౌరులు ఏ రాజకీయ పార్టీకి చెందిన వారై ఉండరాదు. ఏ ఒక్క పార్టీకీ విధేయత చూపరాదు. అలాంటప్పుడు మాత్రమే పౌరులు ఏది తప్పో, ఏది రైటో చెప్పగలరు’ అని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఎన్ఆర్ఐ

తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ ఆధ్వర్యంలో మే డే సంబరాలు
తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో కార్మికుల దినోత్సవం (మే డే) సందర్భంగా సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ గారు సింగపూర్ లో పనిచేస్తున్న తెలంగాణ మరియు ఇతర కార్మికులకు అందరికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ మే డే సందర్భంగా సింగపూర్ లో మల్టీనేషనల్ కంపెనీ (Toa Corporation) లో పని చేస్తున్న అందరికీ దాదాపు 200 మంది కార్మికులకు పండ్లు, శీతల పానీయాలు అందజేసి ఆ కంపెనీకి అలాగే అందులో పని చేస్తున్న ప్రతి కార్మికుడికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన చెట్టిపల్లి మహేష్ తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ప్రతిఒక్కరికి సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల మరియు కోశాధికారి నంగునూరి వెంకట రమణ , సొసైటీ ఉపాధ్యక్షులు బసిక ప్రశాంత్ రెడ్డి, దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, జూలూరి సంతోష్ కుమార్ ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి, నడికట్ల భాస్కర్, శశిధర్ రెడ్డి, రవి కృష్ణ విజాపూర్,సంతోష్ వర్మ మాదారపు మరియు కార్యవర్గ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు పులిగిళ్ల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రావుల సుగుణాకర్ రెడ్డి ,చల్ల కృష్ణ మొదలగు వారు అందరికి శుభాకాంక్షలు తెలియజేసారు. మరిన్ని ఎన్ఆర్ఐ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

TANA: ‘ఆంధ్ర బాలానంద సంఘం’ ముచ్చట్లు విజయవంతం
డాలస్, టెక్సస్, అమెరికా: తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట ప్రతి నెల ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా “రేడియో అన్నయ్య, అక్కయ్య గార్ల స్మృతిలో – “85 వసంతాల ఆంధ్ర బాలానంద సంఘం ముచ్చట్లు” అనే అంశంపై జరిపిన 79 వ అంతర్జాల అంతర్జాతీయ దృశ్య సమావేశం పెద్దల ప్రసంగాలు, బాలానందం పిల్లల పాటలతో కోలాహలంగా జరిగింది.తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు పాల్గొన్న అతిథులందరికీ స్వాగతం పలుకుతూ, బాలలకోసం ఏర్పడిన ఒక సంస్థ 85 వసంతాలు జరుపుకోవడం వెనుక ఈ సంస్థ స్థాపకులైన రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్య గార్ల కృషి ఎంతైనా ఉందని అన్నారు.తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు, డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “పిల్లలకు పసిప్రాయంలోనే గేయాలు, రూపకాలు, ఆటలు, పాటలతో తెలుగు భాష, సాహిత్యంపట్ల ఆసక్తి కల్గించి, వారిలో క్రమశిక్షణ, మానసిక వికాసం, విజ్ఞానం, సృజనాత్మకత, నాయకత్వ ప్రతిభను కల్గించడంలో ఆకాశవాణిలో కొన్ని దశాబ్దాలపాటు వారం వారం ‘బాలానందం’ కార్యక్రమంతో పిల్లలకు పెద్దపీట వేసిన రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్య గార్ల కృషి అజరామరం అన్నారు. పిల్లలకు చిన్నవయస్సులోనే ఇలాంటి విషయాల పట్ల అవగాహన, ఆసక్తినికల్గించి సరైన దిశానిర్దేశం చెయ్యవలసిన బాధ్యత తల్లిదండ్రులదేనన్నారు. ప్రత్యేక అతిథులుగా పాల్గొన్న శారదా శ్రీనివాసన్ (రేడియో హీరోయిన్, సుప్రసిద్ధ ఆకాశవాణి కళాకారిణి), డా. మండలి బుద్ధప్రసాద్ (అవనిగడ్డ శాసనసభ్యులు, రేడియో అన్నయ్య, అక్కయ్యగార్లతో ప్రత్యక్ష పరిచయం ఉన్నవారు), పద్మభూషణ్ పురస్కార గ్రహీత డా. కె.ఐ. వరప్రసాదరెడ్డి (బాలానంద కార్యక్రమాలను ఆస్వాదించినవారు), డా. మోహన్ కందా, ఐ.ఎ.ఎస్ (ఆంధ్రప్రదేశ్ పూర్వ ప్రధాన కార్యదర్శి, బాలానంద సంఘ పూర్వసభ్యులు), జంధ్యాల కామేశ్వరి-పాప (రేడియో అన్నయ్య గారి మేనకోడలు, ఆంధ్ర బాలానంద సంఘం అధ్యక్షులు), కలగా కృష్ణమోహన్ (బాలానందం పూర్వ సభ్యులు, ఆంధ్ర బాలానంద సంఘం ఉపాధ్యక్షులు, ప్రముఖ గీత రచయిత, సంగీత దర్శకులు) బాలానందం కార్యక్రమంతోను, రేడియో అన్నయ్య, అక్కయ్య గార్లతో తమకున్న ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలతోపాటు ఎన్నో ఆసక్తికర విశేషాలను పంచుకుని వారికి ఘననివాళులర్పించారు. విశిష్టఅతిథులుగా - ఎన్.వి. అశోక్ (విశ్రాంత ఇంజనీర్, ‘బాలానందం’ పూర్వసభ్యులు), రావులపర్తి రాజేశ్వరి (విశ్రాంత బ్యాంకు అధికారి, ‘బాలానందం’ పూర్వ సభ్యురాలు),నండూరి సీతా సాయిరాం (విశ్రాంత ఉపాధ్యాయిని, ‘బాలానందం’ పూర్వ సభ్యురాలు),మాడభూషి బద్రినాథ్ (బాలానందం-నృత్య దర్శకులు), డా. ఆవుల హరిత (బాలానందం-కార్యవర్గ సభ్యురాలు), చినముత్తేవి కరుణ (బాలానందం-గాయకబృందం, శిక్షణా విభాగపు కార్యవర్గసభ్యురాలు), మాలెంపాటి నవ్య (ఐఐటి ఖర్గపూర్, ‘బాలానందం’ సంగీత, నృత్య కళాకారిణి), గోవిందు దేవరాజ (బాలానందం-గాయకబృందం, శిక్షణా విభాగపు కార్యవర్గసభ్యులు) పాల్గొని తమ స్వీయ అనుభవాలను, రేడియో అన్నయ్య, అక్కయ్య గార్లు ఎంతో దూరదృష్టితో స్థాపించిన ఆంధ్ర బాలానందం సంఘం తమ పిల్లల జీవితాలలో తీసుకువచ్చిన మార్పులను వివరించి వారిరువురికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అన్నారు. తానా ప్రపంచసాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ - ఒక సంస్థ ఎనిమిదన్నర దశాబ్దాలగా నిరాటంకంగా కొనసాగడం ఒక చరిత్ర అని, ఏ ఆశయంతో రేడియో అన్నయ్య, అక్కయ్య గార్లు ఈ బాలానందం స్థాపించారో, అదే స్ఫూర్తితో ఉత్సాహంగా ఆంధ్ర బాలానంద సంఘం నిర్వహిస్తున్న అధ్యక్షురాలు జంధ్యాల కామేశ్వరి (పాప) వారి కార్యవర్గ సభ్యులకు, ఈ నాటి కార్యక్రమంలో శ్రావ్యంగా పాటలు పాడి ఆనందపరిచిన 25 మందికి పైగా పిల్లలకు, పాల్గొన్న అతిథులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ 6 వ వార్షికోత్సవ వేడుకలు
స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ 6 వ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్ లర్ ఆచార్య వెలుదండ నిత్యానందరావు హాజరయ్యారు. సింగపూర్ లోని తెలుగు వారంతా అన్ని విధాలా సుసంపన్నులని ఈ విధంగా లలిత కళలను ప్రోత్సహించడం ఆనంద దాయకమన్నారు. చిన్నారులు పాడిన పాటలు ఎంతో బాగున్నాయి అని , ఇంత చక్కగా నేర్పిన గురువును నేర్చుకున్న వారి శిష్యులను వారి తల్లిదండ్రులను ప్రశంసించారు. సంగీతం, నాట్యం వంటి కళల ద్వారా మనలో మృదుత్వం కలుగుతుందని, నేటి యాంత్రిక జీవితంలో ఈ మాధ్యమం ఎంతో ముఖ్యం అని కాబట్టి కళల పైన ఉన్న ఆసక్తిని తమ తమ ఆర్థిక సంపాదన రధ చక్రాల కింద పడి నలిగి పోనివ్వవద్దని కోరారు.ఈ కార్యక్రమానికి STS వైస్ ప్రెసిడెంట్ జ్యోతీశ్వర్ , శ్రీ సాంస్కృతిక కలసారథి అధ్యక్షులు కవుటూరు రత్న కుమార్,TCSS అధ్యక్షులు గడప రమేష్, TAS (మనం తెలుగు ) అసోసియేషన్ అనిత రెడ్డి , కమల క్లబ్ మాజీ అధ్యక్షులు, సారీ కనెక్షన్ అడ్మిన్ పద్మజ నాయుడు , మగువ మనసు అడ్మిన్ వీర మాంగోస్ ఉష , సింగపూర్ తెలుగు టీవి రాధాకృష్ణ గణేశ్న , జయంతి రామ, భాగవత ప్రచార సమితి భాస్కర్ ఊలపల్లి, H& H శ్యామల , విష్ణు ప్రియ , సింగపూర్ తెలుగు వనితలు అడ్మిన్స్ క్రాంతి, దేదీప్య, జయ, ప్రత్యూష , అమ్ములు గ్రూపు నుండి అడ్మిన్ సునీత రామ్, , KCAS దివ్య ఇంకా పలువురు సింగపూర్ తెలుగు కమ్యూనిటీ వ్యవస్థాపకులు హాజరయి అందరూ కలిసి వైస్ ఛాన్స్‌లర్‌ను సన్మానించారు. స్వరలయ ఆర్ట్స్, సింగపూర్ వ్యవస్థాపక అధ్యక్షురాలు యడవల్లి శేషుకుమారి వారి శిష్యులు,స్నేహితులు కీర్తనలను ఆలపించారు. పద్మజ నాయుడు మాట్లాడుతూ శేషు గాన కోకిల అని పొగడగా ఆచార్య నిత్యానందరావు గారు కోకిల ఒక కాలంలో మాత్రమే పాడుతుందని కాని ఈమె 365 రోజులు గానం ఆలపిస్తారు అన్నారు. శ్యామల మాట్లాడుతూ వారి వెంకటేశ్వర గానామృతం కార్యక్రమానికి శేషు కుమారి 70 పాటలు 40 రాగాలలో స్వర పరిచి మూడున్నర గంటల సేపు పాడి అందరినీ అలరించిన వైభవం గుర్తు చేసి ఈ రోజుకి ఆ పాటలు తమ చెవులలో ప్రతి ధ్వనిస్తూ పరవసింప చేస్తాయని ప్రశంసించారు.పొట్టి శ్రీరాములు, తెలుగు విశ్వవిద్యాలయం సర్టిఫికేట్ కోర్సు మొదటి వత్సరం, రెండవ సంవత్సరం పరీక్షల్లో ఉత్తీర్ణత పొందిన స్వరలయ ఆర్ట్స్ విద్యార్థులకు వైస్ ఛాన్స్ లర్ బహుమతి ప్రధానం చేశారు. అతిథులకు మొమెంటోలను బహుకరించారు ఈ నెల ఆరవ తారీఖున స్వరలయ ఆర్ట్స్ వారు నిర్వహించిన త్యాగ రాజ ఆరాధన ఉత్సవాలలో పాల్గొని తమతో కలిసి పంచరత్నాలు పాడిన సౌభాగ్య లక్ష్మి తంగిరాల, షర్మిల చిత్రాడ, సౌమ్య ఆలూరు, శరజ అన్నదానం, రాధికా నడదూర్, ప్రియ లకు మొమెంటోలను బహుకరించారు. శివ కుమార్ మృదంగం పై వాయిద్య సహకారం అందించారు ఈ కార్యక్రమానికి శ్రీమతి చైతన్య వ్యాఖ్యాతగా వ్యవహరించారు. పలువురినీ లలిత కళారంగంలో ఉత్సాహ పరుస్తూ ముందుకు నడిచే ఇటువంటి కార్యక్రమానికి దాదాపుగా 200 మంది హాజరు కావటమే కాకుండా, సాంఘిక మాధ్యమాల ద్వారా కూడా వీక్షించి విశేషస్పందనలను తెలియజేయటం అభినందనీయం.

9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు ’’ విశేష సంచిక ఆవిష్కారం
ఖతార్ దేశ రాజధాని దోహా మహానగరంలో 2024 నవంబర్‌లో జరిగిన "9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు" యొక్క సభా విశేష సంచిక అంతర్జాల మాధ్యమంలో ఆదివారం ఆవిష్కరించారు. 'వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా' ,'ఆంధ్ర కళా వేదిక - ఖతార్' సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహింపబడి, మధ్య ప్రాచ్య దేశాలలోనే తొలి సాహితీ సదస్సుగా రికార్డును సృష్టించిన ఈ '9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులో పది దేశాల నుండి పాల్గొన్న వక్తలు, కవులు, రచయితలు ప్రసంగించిన అన్ని అంశాలను పొందుపరుస్తూ 380 పేజీలతో ఈ సభా విశేష సంచిక రూపొందించబడింది. ఈ ఉద్గ్రంధానికి సంపాదకులుగా రాధికా మంగిపూడి, విక్రమ్ సుఖవాసి, వంగూరి చిట్టెన్ రాజు, లక్ష్మి రాయవరపు, శాయి రాచకొండ వ్యవహరించారు.సదస్సు నిర్వాహకవర్గము, సంచిక సంపాదకులు, సదస్సులో వివిధ దేశాల నుండి పాల్గొన్న వక్తలు, రచయితలు అందరి సమక్షంలో ఈ పుస్తక ఆవిష్కరణ జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకించి అంతర్జాల మాధ్యమంలో ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. మరిన్నిNRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వ్యవస్థాపకులు డా. వంగూరి చిట్టెన్ రాజు, ఖతార్ ఆంధ్ర కళా వేదిక నుండి విక్రమ్ సుఖవాసి ప్రధాన నిర్వాహకులుగా, వారి అధ్యక్షతన, రాధిక మంగిపూడి సభానిర్వహణలో దాదాపు మూడు గంటల పాటు ఆదివారం సాయంత్రం నిర్వహింపబడిన ఈ కార్యక్రమంలో భారత్, ఖతార్, అమెరికా, సౌదీ అరేబియా, బహరైన్, యూఏఈ, సింగపూర్ తదితర దేశాలనుండి వక్తలు, తెలుగు సంస్థల ప్రతినిధులు, రచయితలు పాల్గొన్నారు.అమెరికా నుండి చెరుకూరి రమాదేవి, శాయి రాచకొండ, భారత్ నుండి డా. వంశీ రామరాజు, డా. అద్దంకి శ్రీనివాస్, డా. బులుసు అపర్ణ, ఆచార్య అయ్యగారి సీతారత్నం, ఆచార్య త్రివేణి వంగారి, కస్తూరి అలివేణి, డా. దేవులపల్లి పద్మజ తదితరులు, బహరైన్ నుండి మురళీకృష్ణ, సౌదీ అరేబియా నుండి కోనేరు ఉమామహేశ్వరరావు, చివుకుల పట్టాభిరామ శర్మ, సింగపూర్ నుండి కవుటూరు రత్నకుమార్, యూఏఈ నుండి షేక్ రఫీ, డా. తాడేపల్లి రామలక్ష్మి, ఖతార్ నుండి శ్రీసుధ, గోవర్ధన్ రెడ్డి, మనీష్, మాధవి లలిత, గౌరీ బొమ్మన తదితరులు ఆసక్తిగా పాల్గొని సదస్సు యొక్క జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.ఈ సభా విశేష సంచికలో నిర్వాహక సంస్థల పరిచయాలు, అధ్యక్షుల, సంచాలకుల ముందుమాటలు, సదస్సు ప్రకటనలు, వక్తలందరి ఫోటోలు, వ్యాసాలు, కథలు, కవితలతో పాటు, సదస్సు అనంతరం అందరూ అందించిన స్పందనలు కూడా జోడించడం, ఆనందంగా ఉందని, జీవితంలో ఒక మధుర జ్ఞాపకంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ సంచిక ఉందంటూ సంపాదకులను నిర్వాహకులను అభినందించారు.డా. వంగూరి చిట్టెన్ రాజు మాట్లాడుతూ "మధ్యప్రాచ్య దేశాలలో తెలుగు సాహిత్య అభిమానులందరికీ ఈ సదస్సు కొత్త స్ఫూర్తిని అందించిందని, సదస్సు ప్రభావం వలన ఎంతోమంది సాహిత్యంపై చక్కటి ఆసక్తి పెంచుకోవడం, కొత్త రచయితలు జనించడం.. ఆనందదాయకమని తెలియజేశారు. ఇటువంటి సదస్సులు మరిన్ని జరగాలని, కొత్త రచయితలు యువతరం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విక్రమ్ సుఖవాసి ఆంధ్ర కళావేదిక తరపున మరొకసారి అందరికీ తమ దేశానికి విచ్చేసి కార్యక్రమంలో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ తొలిసారి ప్రపంచ సదస్సుకు సంచాలకునిగా ఈ సంచికకు సహసంపాదకునిగా ఉండడం చాలా ఆనందంగా ఉందన్నారుఈ సంచికకు రూపకల్పన సహకారం అందించిన జేవి పబ్లికేషన్స్ అధినేత్రి జ్యోతి వలబోజు కూడా ఈ ఆవిష్కరణలో పాల్గొన్నారు. ఇతర మధ్యప్రాచ్య దేశాల సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ తమ దేశాలలో కూడా ఇటువంటి సాహిత్య సదస్సులు నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామని 10వ ప్రపంచ సదస్సు జరపడానికి అవకాశం ఇమ్మని కోరుతూ తమ ఉత్సాహాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమం వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా యూట్యూబ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారమైంది.
క్రైమ్

తమ్ముడి మృతితో ఆగిన అక్క పెళ్లి
ఆలూరు రూరల్(కర్నూలు): అందరూ వివాహ వేడుకల్లో ఆనందంగా ఉన్నారు. మరి కొద్ది గంటల్లో కల్యాణ తంతు నిర్వహించాల్సి ఉంది. ఇంతలోనే విషాదం. వధువు తమ్ముడు రోడ్డు ప్రమా దంలో దుర్మరణం చెందడంతో అక్క వివాహం నిలిచిపోయింది. శనివారం రాత్రి హుళేబీడు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆస్పరికి చెందిన ఆనంద్ (19) మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో అతని స్నేహితులు పూర్ణచంద్ర, తిమ్మప్ప తీవ్రంగా గాయపడ్డారు. ఆదోని ఆస్పత్రిలో పూర్ణచంద్ర, కర్నూలు ఆస్పత్రిలో తిమ్మప్ప చికిత్స పొందుతున్నారు. ఆస్పరికి చెందిన తిమ్మన్న, శుకుంతల కుమారుడు ఆనంద్.. కాగా అతని సోదరి వివాహం హొళగుంద మండలం వందవాగిలి గ్రామంలో ఆదివారం ఉదయం జరగాల్సి ఉంది. ఆనంద్, పూర్ణచంద్ర, తిమ్మప్ప గుంటూరులోని ఆర్‌వీఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నారు. పూర్ణచంద్ర స్వగ్రామం ప్రకాశం జిల్లా కంభం గ్రామం కాగా తిమ్మప్పది ఆస్పరి మండలం చిగిళి గ్రామం. శనివారం రాత్రి ఆనంద్ సోదరి వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు బైక్‌పై వెళ్తుండగా కారు ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఆనంద్ మృతితో అతని సోదరి పెళ్లి ఆగిపోయింది. అక్క పెళ్లికి వచ్చి తమ్ముడి అంత్యక్రియలు చేయాల్సి వచ్చిందని బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.ఎమ్మెల్యే పరామర్శ.. ఆనంద్ మృతి బాధాకరమని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి అన్నారు. ఆదివారం ఆయన ఆలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆనంద్ మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

మాటలకందని విషాదం
అమ్మా... అందరం కలిసి ఆడుకుంటామంటే సరే అన్నారు.. అదే పిల్లల చివరి మాట అని ఆ తల్లులకు తెలియదు.. అక్కడే మృత్యువు కాపుకాసి ఉందని గుర్తించలేకపోయారు.. మూడు గంటల పాటు పిల్లలు కనిపించకపోయే సరికి తల్లిడిల్లిపోయారు.. ఏమయ్యారో అంటూ ఊరంతా గాలించారు.. చివరకు కారులో ప్రాణవాయువు అందక విలవిల్లాడుతూ విగత జీవులుగా కనిపించిన పిల్లలను చూసి కుప్పకూలిపోయారు.విజయనగరం క్రైమ్: సమయం మధ్యాహ్నం 2 గంటలు.. గ్రామంలోని పెళ్లివేడుకలో పెద్దలు, ఆటపాటల్లో చిన్నారులు నిమగ్నమయ్యారు. ఆటలాడుతూ గ్రామ బీసీ కాలనీ నీళ్ల ట్యాంకు వద్ద ఉన్న కారులోకి నలుగురు చిన్నారులు వెళ్లారు. పొరపాటున డోర్లు వేయడంతో లాక్ అయ్యాయి. అంతే.. వారికి ప్రాణ వాయువు అందలేదు. కాపాడాలంటూ వారి ఆర్తనాదాలు బయటకు వినిపించలేదు. మూడుగంటల తర్వాత వెతుకుతూ వెళ్లిన పెద్దలకు కొనఊపిరితో కారులో కొట్టుమిట్టాడుతున్న చిన్నారులు కనిపించారు. డోర్లు బద్దలగొట్టి చిన్నారులను బయటకు తీసినా ఫలితం లేకపోయింది. చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కారు రూపంలో మృత్యువు కాటేసింది. ఈ ఘటనతో విజయనగరం సమీపంలోని ద్వారపూడిలో మృత్యుఘోష వినిపించింది. సర్వజన ఆస్పత్రి ప్రాంగణం శోకసంద్రంగా మారింది. మాటలకందని విషాదం అందరూ పదేళ్లలోపు పిల్లలే. కూలి పనులు చేసుకుంటూ తల్లిదండ్రులు వారిని అల్లారు ముద్దుగా సాకుతున్నారు. పిల్లలు ఆడుకుంటేంటే సంబర పడ్డారు. పెళ్లివేడుకలో బిజీ అయ్యారు. ఒకేసారి కారు రూపంలో కంది మణీశ్వరి (6), బూర్లె చారులత (7), పండి ఉదయ్ (7), బూర్లె జాస్రిత(8)ను మృత్యువు కాటేయడంతో కన్నీరుకార్చారు. విగతజీవులుగా మారిన చిన్నారులను పట్టుకుని బోరున విలపించారు. కడుపుకోత.. మృతిచెందిన చిన్నారుల్లో బూర్లె చారులత, జాస్రిత అక్కాచెల్లెళ్లు. వీరిద్దరూ ఒకే సారి మృతిచెందడంతో తల్లిదండ్రులు ఉమ, ఆనంద్‌లు విషాదంలో ముని గిపోయారు. దేవుడా.. కడుపుకోత మిగిల్చావా అంటూ విలపించారు. సర్వజన ఆస్పత్రి మార్చురీ వద్ద ఉన్న కుమార్తెల మృతదేహాలను చూసిన ఉమ ఓ దశలో సొమ్మసిల్లి పోయింది. ఉదయ్ తల్లిదండ్రులు బుచ్చిబాబు, భవానీ, మణీశ్వరి తల్లిదండ్రులు సురేష్ అరుణలు సైతం బిడ్డల మృతదేహాలను పట్టుకుని రోదించారు.ఇళ్ల మధ్యనే ఘటన... మృత్యువుకు కారణమైన కారు వీధిలో ఇళ్ల మధ్యనే ఉంది. దాని పక్కగుండానే అందరూ రాకపోకలు సాగించినా.. అందులో ఉన్న చిన్నారులను గుర్తించలేకపోయారు. వారి ఆర్తనాదాలను ఆలకించలేకపోయారు. కారు అద్దాలు నలుపువి కావడం కూడా దీనికి ఓ కారణంగా గ్రామస్తులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న రూరల్ ఎస్ఐ అశోక్ కుమార్, వన్‌టౌన్ ఎస్ఐ రామ్‌గణేష్‌లు హుటాహుటిన ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సర్వజన ఆస్పత్రికి వచ్చి మృతుల వివరాలు సేకరించారు.కారు ఎవరిది? బీసీ కాలనీ నీళ్ల ట్యాంకు వద్ద ఆగి ఉన్న కారు ఎవరిది..? అక్కడే ఎందుకు పార్క్ చేశారు? డోర్‌కు లాక్ ఎందుకు వేయలేదు అన్న అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ద్వారపూడిలో జరుగుతున్న పెళ్లి వేడుకకు సంబంధించి వైజాగ్ నుంచి ఆ కారు వచ్చినట్టు సమాచారం. కారు ఓనర్, డ్రైవర్ ఒక్కరేనని తెలిసింది. సంబంధిత వ్యక్తిని పోలీసులు ప్రశ్నిస్తున్నట్టు సమాచారం.

ఏరో ఇంజినీర్ అనుమానాస్పద మృతి
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగాల్సిన విద్యావంతురాలి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. ధర్మస్థలం నివాసి అయిన ఏరోస్పేస్ ఇంజినీర్ పంజాబ్‌లో అనుమానాస్పద రీతిలో చనిపోయింది. ఆకాంక్ష (23) మృతురాలు. ధర్మస్థలంలోని బోళియార్ నివాసులైన సురేంద్ర, సింధూదేవి దంపతుల కుమార్తె ఆకాంక్ష, పంజాబ్‌లోని ఫగ్వాడాలో ఎల్పీయూ విద్యాసంస్థలో ఉన్నత విద్యను పూర్తి చేసి, 6 నెలల నుంచి ఢిల్లీలో ఏరోస్పేస్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తోంది. తరువాత జపాన్‌లో ఉద్యోగం సంపాదించుకున్న ఆకాంక్ష తాను చదివిన కాలేజీలో కొన్ని సర్టిఫికెట్లు పొందడానికి పంజాబ్‌కు వెళ్లింది. శనివారం మధ్యాహ్నం సర్టిఫికెట్లు తీసుకున్నట్టు తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది. జలంధర్ నగరంలో ఉన్నట్లు తెలిపింది. కొన్ని గంటల వ్యవధిలోనే ఓ భవనంలో 3వ అంతస్తు పడి దుర్మరణం చెందింది. స్థానిక పోలీసులు ఆ మేరకు కుటుంబీకులకు సమాచారం ఇవ్వడంతో శోకసంద్రంలో మునిగిపోయారు. వెంటనే తల్లిదండ్రులు పంజాబ్‌కు వెళ్లారు. ఏదో దారుణం జరిగిందని, ఇది ప్రమాదం కాదని తల్లిదండ్రులు వాపోయారు.

ఉగ్రకుట్ర భగ్నం
సాక్షి,హైదరాబాద్/విజయనగరం/విజయనగరం క్రైమ్: తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్, ఏపీ పోలీసులు జాయింట్ ఆపరేషన్‌తో ఉగ్రకుట్రను భగ్నం చేశారు. సౌదీ అరేబియా కేంద్రంగా పనిచేస్తున్న పాకిస్తాన్ ప్రేరేపిత హ్యాండ్లర్ నెట్వర్క్ గుట్టురట్టు చేశారు. బాంబు పేలుళ్ల ప్రయోగాల కోసం పేలుడు పదార్థాలు సేకరిస్తున్న ఇద్దరిని వేర్వేరు చోట్ల అరెస్ట్ చేశారు. హైదరాబాద్ పోలీసుల సమాచారంతో తొలుత ఏపీలో విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్(29)ను పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత సిరాజ్ విచారణలో చెప్పిన సమాచారాన్ని ఏపీ పోలీసులు తెలంగాణ పోలీసులతో పంచుకున్నారు. దీంతో తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు (సీఐ సెల్) హైదరాబాద్ బోయగూడలో ఉంటున్న సయ్యద్ సమీర్(28)ను అరెస్ట్ చేశారు. అనంతరం సమీర్‌ను విజయనగరం తరలించారు. డమ్మీ బ్లాస్ట్‌లకు కుట్ర విజయనగరానికి చెందిన సిరాజ్.. సయ్యద్ సమీర్ కలిసి ‘అల్ హింద్ ఇత్తెహబుల్ మిసిలెన’ (ఏహెచ్‌ఐఎమ్) పేరుతో పలు కార్యకలాపాలు చేస్తున్నట్లు పోలీసులకు కీలక అధారాలు లభించాయి. సౌదీ అరేబియాలోని ఓహ్యాండ్లర్ నుంచి హైదరాబాద్, ఏపీలోని సానుభూతిపరులకు ఆదేశాలు వస్తున్నట్లు గుర్తించారు. పేలుళ్ల కోసం ప్రయోగాలు చేసేందుకు సంబంధిత కెమికల్స్ కొనుగోలు చేసి హైదరాబాద్‌లో డమ్మీ బ్లాస్ట్‌లు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ఆధారాలు సేకరించారు. ఇందుకోసం సిరాజ్ విజయనగరంలో పేలుడు పదార్థాలు కొనుగోలు చేసినట్లు సీఐ సెల్‌కు సమాచారం అందింది.దీంతో తెలంగాణ సీఐ సెల్ అధికారులు విజయనగరం పోలీసులను అప్రమత్తం చేశారు. సిరాజ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. అతని ఇంట్లో పేలుళ్లకు వినియోగించే అమ్మోనియా, సల్ఫర్, అల్యూమినియం పౌడర్‌ను స్వాదీనం చేసుకున్నారు. ఎవరికీ అనుమానం రాదనే ఉద్దేశంతోనే విజయనగరంలో పేలుడు పదార్థాల కొనుగోలుకు పూనుకున్నట్టు సమాచారం. వీరి వెనుక ఉన్న ఉగ్రవాద సంస్థల గురించి ఆరా తీస్తున్నారు. హైదరాబాద్‌లో చదువుకున్నప్పుడే... సిరాజ్ 2018 సంవత్సరంలో హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ విద్యనభ్యసిస్తున్న సమయంలో సమీర్‌తో పరిచయం ఏర్పడినట్టు నిఘా వర్గాల సమాచారం. వీరిద్దరూ ఐసిస్‌తో సంబంధాలు పెంచుకున్నట్టు తెలంగాణ ఇంటెలిజెన్స్ గుర్తించింది. తండ్రి, సోదరుడు పోలీస్ విభాగాల్లో వివిధ హోదాల్లో పనిచేస్తుండగా, సిరాజ్ మాత్రం ఉగ్రవాద భావజాలానికి ప్రేరేపితం కావడం పోలీసులను విస్మయపరుస్తోంది. వీరు రసాయనాలను ఎక్కడెక్కడ కొనుగోలుచేశారు, ఇంకా ఎక్కడ నిల్వ చేశారు, దీనితో ఎవరెవరికి సంబంధం ఉందన్న కోణంలో ఇంటెలిజెన్స్ అధికారులు విచారిస్తున్నట్లు విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాస్ తెలిపారు. నిందితులిద్దరినీ విజయనగరం కోర్టులో హాజరుపరిచి, రిమాండ్‌కు తరలించారు.