Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Kommineni Srinivasa Rao Comments on Yellow Media 1
బోల్తా కొట్టిన ఎల్లోపిట్ట!

ఎల్లో మీడియా శోకాలు పెడుతోంది. అరచి గీపెట్టి మరీ రోదిస్తోంది. దాని బాధల్లా ఒకటే.. చంద్రబాబు హయాంలో ప్రభుత్వ ఆదాయం బాగానే ఉన్నా సాక్షి మీడియా దాన్ని తక్కువగా చేసి రాసిందీ అని! జగన్‌ ప్రభుత్వంలో కంటే ఆదాయం ఇప్పుడు ఎక్కువే ఉంటే ఆ మాట నేరుగా చంద్రబాబే ఢంకా బజాయించి మరీ చెప్పుకునేవాడు. ఆయన ఆ పని చేయలేదు కానీ.. ఆయన తరఫున ఆంధ్రజ్యోతి యజమాని రాధాకృష్ణ మాత్రం తెగ బాధపడిపోతున్నారు. ఆయనగారి పత్రికలో ఈ మధ్యే ‘సంపదపై శోకాలు’ అంటూ ‘జగన్ పత్రిక రోత రాతలు’ అన్న శీర్షికతో ఒక కథనం ప్రచురితమైంది.పచ్చి అబద్ధాలతో నిండిన ఇలాంటి కథనాలు నిత్యం వండి వారుస్తున్నందుకే.. వైసీపీ నేతలు.. సామాన్యులు చాలా మంది ఈ పత్రికను చంద్రజ్యోతిగాను, బూతు పత్రికగాను విమర్శిస్తుంటారు.రాధాకృష్ణ కాని, ఆయన సంపాదక బృందం కాని ఒకే ఒక్క ప్రశ్నకు సమాధానం చెబితే అందరం ఆయన కథనాలు సరైనవేనని ఒప్పేసుకుందాం. ఆ ప్రశ్న ఏమిటంటే... ఎన్నికలకు ముందు చంద్రబాబు చెప్పిందేమి? ఆ తరువాత ఏడాది కాలంలో ఆయన చేసిందేమిటి? ‘‘అప్పులు చేయబోను’’, ‘‘సంపద సృష్టి నాకు తెలుసు’’, ‘‘సూపర్‌ సిక్స్‌తోపాటు ఎన్నికల హామీలన్నీ అమలు చేసి చూపిస్తా’’ అని ఎన్నికల ముందుకు ఒకటికి పదిసార్లు హామీ ఇచ్చిన ఆ పెద్దమనిషి అధికారంలోకి వచ్చిన తరువాత.. ‘‘గల్లా పెట్టె ఖాళీగా కనబడుస్తా ఉంది’’, ‘‘అప్పులు పుట్టడం లేదు’’ ‘‘సంపద సృష్టించే మార్గముంటే చెవిలో చెప్పండి’’. ‘‘అప్పులు చేసి సంక్షేమానికి ఖర్చు చేయలేను’’ అని ప్లేటు ఫిరాయించిన విషయం తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయాలే. రాధాకృష్ణ భాషలో వీటిని శోకాలు అంటారా? లేదా? ఆయన రాసినట్లే చంద్రబాబు హయాంలో ఆదాయం ఎక్కువ ఉందని కాసేపు అనుకుందాం. అలాంటప్పుడు చంద్రబాబు ఖజానా ఖాళీగా కనబడుతోంది అని ఎందుకు అన్నట్టు? పైగా.. అప్పుల కోసం ఏకంగా ఖజానానే తనఖా పెట్టి చరిత్ర సృష్టించడం ఎందుకు? అప్పులు పుట్టడం లేదన్న బాబు మాట కూడా నిజమే అయితే ఏడాది కాలంలో రూ.1.5 లక్షల కోట్ల రుణం చేసిన రికార్డు మాటేమిటి? జగన్‌ హయాంలో ఆదాయం తక్కువగా ఉందనుకున్నా.. సంక్షేమ పథకాలన్నీ ఐదేళ్లూ చక్కగా అమలు చేశారు కదా? దానికి సమాధానం ఏమిటి? ఓడరేవులు, మెడికల్‌ కాలేజీలు, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్‌ క్లినిక్స్‌, పాఠశాలల్లో ‘నాడు-నేడు’’ ఇలా బోలెడంత అభివృద్ధినికి ప్రజల కళ్లముందే నిలిపారు కదా? అయినా సరే.. జగన్‌ ఎప్పుడు బీద అరుపులు అరవలేదే? ఒకపక్క చంద్రబాబేమో ఖజానా ఖాళీ అంటారు.. ఇంకోపక్క రాధాకృష్ణ ఆదాయం భేష్‌ అంటారు. ఏది నిజం? ఈ ప్రశ్నకు సమాధానం కాగ్‌ లెక్కల్లో వెతుకుదాం.. జగన్‌ పాలన చివరి ఏడాది రాష్ట్ర రెవెన్యూ రాబడులు మొత్తం సుమారు రూ.1.74 లక్షల కోట్లు. ఆ తరువాత చంద్రబాబు (Chandrababu) పాలనలో తొలి ఏడాది (2024-2025) రూ.1.68 లక్షల కోట్లు! అయితే... ఆంధ్రజ్యోతి 2014-15కు సంబంధించిన రెవెన్యూ లోటు మొత్తాన్ని కేంద్రం 2023-24లో ఇవ్వడం వల్ల జగన్‌ హయాంలోని ఆదాయం ఎక్కువగా కనిపిస్తోందని అంటోంది. ఇదే నిజం అనుకుందాం. అప్పుడు కూడా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను సమర్థంగా రాబట్టడంలో జగన్‌ ప్రభుత్వం విజయం సాధించినట్లే అవుతుంది కదా? ఐదేళ్లు కేంద్రంలో భాగస్వామిగా ఉన్నా పది వేల కోట్ల రూపాయల మొత్తం కూడా కేంద్రం నుంచి రాబట్టుకోలేని అసహాయ స్థితిలో చంద్రబాబు ఉన్నట్లు రాధాకృష్ణ ఒప్పుకున్నట్లేనా? జగన్‌ ప్రభుత్వం 12వ ఆర్థిక సంఘం నిధులను కూడా రాబట్టుకుందని ఆంధ్రజ్యోతి చెబుతోంది. ఇది కూడా జగన్ గొప్పదనమే అవుతుంది కదా! ఈ స్థాయిలో కేంద్రం నుంచి చంద్రబాబు నిధులు ఎందుకు తెచ్చుకోలేకపోతున్నారు? ఈ రెండింటినీ మినహాయిస్తే జగన్ హయాం చివరి ఏడాది వచ్చిన రాబడి రూ.1.61 లక్షల కోట్లేనని, చంద్రబాబు తన తొలి ఏడాదిలో ఆదాయం రూ.1.68 లక్షల కోట్లు అని ఈ పత్రిక తెలిపింది.అలాంటప్పుడు చంద్రబాబు పదే, పదే ఎందుకు డబ్బులు లేవని వాపోతున్నారు? రూ.1.5 లక్షల కోట్ల అప్పు ఎందుకు చేశారు? ఈ మొత్తాన్ని ఎందుకోసం ఖర్చు చేశారు? జగన్ టైమ్ నాటికన్నా పదివేల కోట్లు ఎక్కువగా పన్ను ఆదాయం చంద్రబాబు ప్రభుత్వం పొందిందని ఎల్లో మీడియా చెబుతోంది. ఇదే నిజమైతే బాబు బీద అరుపుల మతలబు ఏమిటి? జీఎస్టీ వసూళ్లు రూ.2850 కోట్లు, ఎక్సైజ్ ఆదాయం రూ.3900 కోట్లు, కేంద్ర పన్నుల వాట రూ.ఐదు వేల కోట్ల మేర ఎక్కువ వచ్చిందని ఈ పత్రిక రాసింది. ఇంత భారీ ఎత్తున ఆదాయం వచ్చినా ఎందుకు ఒక్క స్కీమ్ అమలు చేయడం లేదు?జగన్‌ ప్రభుత్వం చివరి సంవత్సరంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా రూ.9542 కోట్లు వచ్చినట్లు కాగ్‌ లెక్కలు చెబుతున్నాయి. చంద్రబాబు పాలనలో తొలి ఏడాది ఈ మొత్తం రూ.8837 కోట్లే! దీని అర్థం బాబు హయాంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం తగ్గినట్లే కదా? అమ్మకం పన్ను, పన్నేతర ఆదాయం మొదలైన వాటి పరిస్థితి కూడా ఇలాగే ఉందని కాగ్ గణాంకాలు చెబుతున్నాయి. జగన్‌ హయాంతో పోలిస్తే ఇప్పుడు రెవెన్యూ, ద్రవ్య లోటులు రెండూ సుమారు రూ.20 వేల కోట్లు ఎక్కువన్నది కూడా వాస్తవమే కదా? రాధాకృష్ణ ఏదో మసిపూసి మారేడుకాయ చేద్దామని ప్రయత్నించి సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లుగా ఉంది. ఆయన రాసింది వాస్తవమైతే చంద్రబాబు అబద్దాలు చెబుతున్నట్లు అవుతుంది. పైగా ఆదాయం బాగున్నా.. రూ.1.5 లక్షల కోట్లు అప్పు తెచ్చినా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలేవీ అమలు చేయకుండా ప్రజలను మోసం చేసినట్టు అవుతుంది. ఖజానా ఖాళీ అన్న చంద్రబాబు మాటలు నిజమైతే ఈ జాకీ పత్రిక రాసింది అవాస్తవమని అంగీకరించవలసి ఉంటుంది. ఏతావాతా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ శోకాలకు చంద్రబాబు సర్కారే బద్నాం అయ్యింది. కూటమి ప్రభుత్వానికి భజన చేద్దామని అనుకుని ఇలాంటి పిచ్చి రాతలు రాసి చంద్రబాబునే డిఫెన్స్ లో నెట్టేసినట్లయింది. ఆ విషయం అర్థమైందా?- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

YSRCP Win Municipal And MPP Seats In AP2
వైఎస్సార్‌సీపీదే విజయం.. మున్సిపల్ చైర్‌పర్సన్‌ ఎన్నిక ఏకగ్రీవం

సాక్షి, కర్నూలు: కర్నూలులో కూటమి కుట్రలను పటాపంచలు చేశారు వైఎస్సార్‌సీపీ నేతలు. ఆదోని మున్సిపల్ చైర్ పర్సన్ పీఠాన్ని వైఎస్సార్‌సీపీ నిలబెట్టుకుంది. ఆదోని మున్సిపల్ చైర్ పర్సన్‌గా సీహెచ్ లోకేశ్వరి ఏకగ్రీవంగా ఎన్నిక‍య్యారు.వివరాల ప్రకారం.. ఆదోని మున్సిపల్ చైర్ పర్సన్‌ ఎన్నికలో కూటమి కుట్రలు ఫలించలేదు. ఈ క్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్‌గా వైఎస్సార్‌సీపీ సీహెచ్ లోకేశ్వరి ఏకగ్రీవంగా ఎన్నిక‍య్యారు. కూటమి నేతల ప్రలోభాలకు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు తలొగ్గలేదు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌పై నమ్మకంతో కౌన్సిలర్లు లోకేశ్వరికి అండగా నిలిచారు. దీంతో, ఎన్నికల అధికారి సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్.. లోకేశ్వరి ఏకగీవ్రంగా ఎన్నికైనట్టు ప్రకటించారు. పశ్చిమగోదావరి జిల్లా..మరోవైపు.. పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి ఎంపీపీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది. ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకుంది. మండల పరిషత్ అధ్యక్షురాలుగా ఇనుకొండ ధనలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంత్రి రామానాయుడు ఇలాకలో నాటకీయ పరిణామాల మధ్య ఎంపీపీ స్థానాన్ని వైఎస్సార్‌సీపీ దక్కించుకుంది. కూటమి నేతల కుట్రలకు, ప్రలోభాలకు వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలు లొంగలేదు. వైఎస్సార్‌సీపీకి చెందిన 12 మంది ఎంపీటీసీ సభ్యులతో పూర్తి మెజార్టీతో ఏకగ్రీవంగా ధనలక్ష్మి ఎన్నికయ్యారు.శ్రీ సత్యసాయి జిల్లా..రామగిరి ఎంపీపీ ఎన్నికలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. రామగిరి ఎంపీపీ స్థానం మహిళకు రిజర్వ్ కావడంతో టీడీపీకి మహిళా ఎంపీటీసీల మద్దతు దొరకలేదు. రామగిరిలో మొత్తం 10 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. వైఎస్సార్‌సీపీకి-8, టీడీపీకి-1 స్థానాలు ఉన్నాయి. ఒక్క స్థానం ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రలోభాలతో ఇద్దరు వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలను టీడీపీ పార్టీలో చేర్చుకుంది. మరోవైపు.. టీడీపీలో చేరడం ఇష్టంలేక పేరూర్‌ ఎంపీటీసీ భారతి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈరోజు జరిగిన రామగిరి ఎంపీపీ ఉప ఎన్నిక జరగ్గా.. ముగ్గురు పురుష ఎంపీటీసీలు హాజరయ్యారు. మహిళా ఎంపీటీసీల నుంచి నామినేషన్ రాకపోవడంతో రామగిరి ఎంపీపీ ఎన్నిక నిరవధికంగా వాయిదా పడింది. రామగిరి ఎంపీపీ ఎన్నికలను వైఎస్సార్‌సీపీ బహిష్కరించింది. టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రలోభాలకు మహిళా ఎంపీటీసీలు లొంగలేదు.

Hyderabad Gulzar House Incident Sensational Details3
పాతబస్తీ ప్రమాదంపై విస్తుపోయే విషయాలు.. అక్రమ కనెక్షన్‌ కారణమా?

సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలోని గుల్జార్‌హౌస్‌ అగ్నిప్రమాదం వెనుక సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. అగ్నిప్రమాదం వెనక అక్రమ కరెంట్‌ కనెక్షన్‌ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ అక్రమ కరెంట్‌పై పోలీసులు, ఫైర్‌ సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు.వివరాల ‍ప్రకారం.. గుల్జార్‌హౌస్‌ అగ్నిప్రమాదం కారణంగా 17 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. కుటుంబానికి చెందిన 17 మంది మృత్యువాత పడ్డారు. ఈ దుర్ఘటన నగరాన్ని ఉలికిపాటుకు గురిచేసింది. ఈ నేపథ్యంలో ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అక్రమ కరెంట్‌ కనెక్షన్‌ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు, ఫైర్‌ సిబ్బంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.నగల దుకాణం మూసేయగానే హైటెన్షన్ వైర్‌ నుంచి.. కొక్కేల ద్వారా స్థానికులు కరెంట్‌ కనెక్షన్‌ తీసుకున్నారు. ఈ అక్రమ కరెంట్‌తో బాధిత కుటుంబం కరెంట్‌ మీటర్‌పై లోడ్‌ పడింది. ఆ కరెంట్‌ లోడ్‌తో బాధిత కుటుంబం మీటర్‌ బాక్స్‌లో మంటలు చెలరేగాయి. మీటర్‌ బాక్స్‌ పక్కన ఉన్న ఉడెన్‌ షోకేజ్‌కు మంటలు అంటుకున్నాయి. ఉడెన్‌ షోకేజ్‌ నుంచి ఏసీ కంప్రెషర్‌ను మంటలు తాకాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్రమ కరెంట్‌పై పోలీసులు, ఫైర్‌ సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా. గుల్జార్‌హౌజ్‌ అగ్ని ప్రమాదంలో 17 మంది చనిపోవడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం. మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులు, నలుగురు మహిళలు, ఐదుగురు పురుషులున్నారు. అపస్మారకస్థితికి చేరిన నలుగురు ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స అనంతరం కోలుకున్నారు. ఈ పెనువిషాదం గురించి తెలిసిన వెంటనే రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్రమోదీ, గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ, సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, తదితరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలతో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, డీజీపీ జితేందర్‌ తదితరులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు, కేంద్రం రూ.2 లక్షల చొప్పున మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించాయి. ప్రమాదానికి షార్ట్‌సర్క్యూట్‌ కారణమని అగ్నిమాపక శాఖ అధికారులు ప్రకటించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ముఖ్యమంత్రి ఆదేశించారు.

Kolikapudi Srinivasa Rao Over Acton AT Tiruvuru4
తిరువూరులో ఉద్రిక్తత.. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా

తిరువూరులో ఎన్నిక అప్‌డేట్‌.. 👉కూటమి కుట్రలతో తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా. 👉వైఎ‍స్సార్‌సీపీ కౌన్సిలర్లను కిడ్నాప్‌ చేసిన కూటమి నేతలు. పోలీసులు సమక్షంలోనే వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లపై టీడీపీ మూకల దాడులు. ఎన్నిక జరగకుండా కూటమి నేతల వ్యూహం. అల్లర్లు సృష్టించిన పచ్చ నేతలు👉తిరువూరులో టీడీపీ నేతలు అరాచకం సృష్టించారు. ఎన్నిక జరగకుండా టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి హల్‌చల్‌ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఎన్నికలకు హాజరుకాకుండా దాడికి యత్నం చేశారు. టీడీపీ కార్యకర్తలు పోలీసుల సమక్షంలోనే రెచ్చిపోయి దాడులకు తెగబడ్డారు. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లపై చెప్పులు విసిరి, బాటిళ్లు విసురుతూ టీడీపీ కార్యకర్తలు కవ్వింపు చర్యలకు దిగారు. 👉తిరువూరులో పోలీసులు, టీడీపీ దౌర్జన్యానికి నిరసనగా వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు రోడ్డుపై భైఠాయించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నినాదాలు చేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.👉టీడీపీ కార్యకర్తల దౌర్జన్యాన్ని చోద్యం చూస్తూ పోలీసులు అక్కడే నిలబడ్డారు. ఎన్నికలు జరగకుండా టీడీపీ నేతల వ్యూహానికి పోలీసులు సహకరిస్తున్నారు. రౌడీయిజం చేస్తున్న టీడీపీ కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టలేదు. బలం లేకపోయినా రౌడీయిజంతో గెలవడానికి టీడీపీ అల్లర్లు. తిరువూరులో టీడీపీ ఉద్రిక్తత సృష్టిస్తోంది.👉తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వేళ టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఓవరాక్షన్‌కు దిగారు. ఎమ్మెల్యే, టీడీపీ శ్రేణులు బారికేడ్లు తోసుకుని, పోలీసులను నెట్టుకుంటూ మున్సిపల్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లారు. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలు, పార్టీ శ్రేణులతో వాగ్వాదానికి దిగారు.👉తిరువూరులో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ హల్‌చల్‌ చేశారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వేళ వైఎస్సార్‌సీపీ నేతలను మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్లకుండా టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. ఇదే సమయంలో బారికేడ్లు తోసుకుని, పోలీసులను నెట్టుకుంటూ కొలికపూడి, టీడీపీ నేతలు మున్సిపల్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లారు. పోలీసులు వారిని అడ్డుకున్నప్పటికీ వారినే బెదిరిస్తూ లోపలికి దూసుకెళ్లారు. దీంతో, వాగ్వాదం జరిగింది.👉మరోవైపు.. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లకు మద్దతుగా పార్టీ నేతలు దేవినేని అవినాష్, మొండితోక అరుణ్ కుమార్, నల్లగట్ల స్వామిదాస్, షేక్ ఆసిఫ్ తిరువూరు చేరుకున్నారు. ఇదిలా ఉండగా.. నేడు.. తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. ఎన్నికల కోసం బలం లేకపోయినా గెలవాలని కూటమి కుట్రలు చేస్తో​ంది. మరోవైపు.. తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వేళ వైఎస్సార్‌సీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. తిరువూరు వెళ్లొద్దంటూ వైఎస్సార్‌సీపీ నేతలపై పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు.

Coincidence, RCB Qualified For Playoffs On May 18th In 2024 And 2025 Seasons5
IPL 2025: ప్లే ఆఫ్స్‌కు చేరిన ఆర్సీబీ.. యాదృచ్ఛికంగా..!

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు చేరింది. నిన్న (మే 18) రాత్రి ఢిల్లీపై గుజరాత్‌ విజయం సాధించడంతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ ఖరారైంది. ఢిల్లీపై గెలుపుతో గుజరాత్‌తో పాటు ఆర్సీబీ, పంజాబ్‌ ఒకేసారి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాయి. నాలుగో బెర్త్‌ కోసం ఢిల్లీ, ముంబై, లక్నో పోటీ పడనున్నాయి. ఇవాళ (మే 19) సన్‌రైజర్స్‌తో జరిగే మ్యాచ్‌లో లక్నో ఓడితే ఆ జట్టు కూడా ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. అప్పుడు ఢిల్లీ, ముంబై మాత్రమే రేసులో ఉంటాయి. అంతకుముందు సీఎస్‌కే, రాజస్థాన్‌, సన్‌రైజర్స్‌, కేకేఆర్‌ వరుసగా ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించాయి.పదోసారిఈ సీజన్‌లో 12 మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ 8 విజయాలు సాధించి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. 18 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించడం ఇది పదోసారి. ఆ జట్టు 2009, 2010, 2011, 2015, 2016, 2020, 2021, 2022, 2024, 2025 సీజన్లలో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది.యాదృచ్ఛికంగుజరాత్‌ ఢిల్లీపై గెలవడంతో అధికారికంగా ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ ఖరారు చేసుకున్న ఆర్సీబీ.. యాదృచ్ఛికంగా గత సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించిన రోజునే (మే 18) ఈ సీజన్‌లోనూ ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంది. మ్యాచ్‌ ఆడకుండా, గెలవకుండా ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ ఖరారు కావడంపై ఆర్సీబీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్లే ఆఫ్స్‌కు ముందు మరో రెండు మ్యాచ్‌లు ఆడనున్న ఆర్సీబీ.. ఆ రెండూ గెలిచి మొదటి రెండు స్థానాల్లో ఏదో ఒక స్థానంలో లీగ్‌ దశను ముగించాలని భావిస్తుంది. తదుపరి మ్యాచ్‌ల్లో ఆర్సీబీ.. సన్‌రైజర్స్‌ (మే 23), లక్నోతో (మే 27) తలపడాల్సి ఉంది.కాగా, ఈ సీజన్‌లో ఆర్సీబీ డ్రీమ్‌ రన్‌ను కొనసాగిస్తుంది. హేమాహేమీ జట్లకు షాకిస్తూ తొలి టైటిల్‌ దిశగా దూసుకుపోతుంది. ఈ సీజన్‌లో ఆర్సీబీ సాధించిన విజయాలు రికార్డుల్లోకెక్కాయి. 17 ఏళ్ల తర్వాత సీఎస్‌కేను వారి సొంత మైదానంలో ఓడించిన ఆ జట్టు.. పదేళ్ల తర్వాత ముంబై ఇండియన్స్‌ను వారి సొంత ఇలాకాలో (వాంఖడే) మట్టికరిపించింది. ఇదే సీజన్‌లో కేకేఆర్‌ను కూడా వారి సొంత మైదానంలో (ఈడెన్‌ గార్డెన్స్‌) ఓడించిన ఆర్సీబీ.. ఐపీఎల్‌ చరిత్రలో సీఎస్‌కేను, ముంబై ఇండియన్స్‌ను, కేకేఆర్‌ను వారి సొంత మైదానాల్లో ఓడించిన రెండో జట్టుగా (ఒకే సీజన్‌లో) రికార్డుల్లోకెక్కింది.ఇదిలా ఉంటే, నిన్న రాత్రి ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ.. కేఎల్‌ రాహుల్‌ (65 బంతుల్లో 112 నాటౌట్‌; 14 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ సెంచరీతో కదంతొక్కడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో డుప్లెసిస్‌ 5, అభిషేక్‌ పోరెల్‌ 30, అక్షర్‌ పటేల్‌ 25, ట్రిస్టన్‌ స్టబ్స్‌ 21 (నాటౌట్‌) పరుగులు చేశారు. గుజరాత్‌ బౌలర్లలో అర్షద్ ఖాన్‌, ప్రసిధ్‌కృష్ణ, సాయికిషోర్‌ తలా ఒక వికెట్‌ తీశారు. అనంతరం ఓపెనర్లు సాయి సుదర్శన్‌ (61 బంతుల్లో 108 నాటౌట్‌; 12 ఫోర్లు, 4 సిక్స్‌లు), శుబ్‌మన్‌ గిల్‌ (53 బంతుల్లో 93 నాటౌట్‌; 3 ఫోర్లు, 7 సిక్స్‌లు) చెలరేగిపోవడంతో గుజరాత్‌ 19 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 205 పరుగులు చేసి విజయతీరాలకు చేరింది.

know about SwaRail app developed by CRIS under Indian Railways6
యాప్‌ ఒక్కటే.. సేవలు బోలెడు!

భారతీయ రైల్వే ప్రయాణికుల సౌకర్యం కోసం ఇప్పటికే చాలానే యాప్‌లు అందుబాటులోకి తీసుకొచ్చింది. వాటిలో దేని ప్రత్యేకత దానిదే. అయినప్పటికీ రైల్వేశాఖ మరో కొత్త యాప్‌ను ప్రవేశపెట్టింది. సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (సీఆర్ఐఎస్) అభివృద్ధి చేసిన ‘స్వరైల్ యాప్’ ఆన్‌లైన్‌ రైల్వే సేవలను క్రమబద్ధీకరించడానికి ఆల్-ఇన్-వన్ రైల్వే సర్వీసులకు వేదికగా నిలుస్తుందని తెలిపింది. ఇది బహుళ రైల్వే సేవలను ఒకే యాప్‌లో ఏకీకృతం చేస్తుందని పేర్కొంది. స్వరైల్‌ యాప్‌లో అందిస్తున్న కొన్ని ఫీచర్ల గురించి తెలుసుకుందాం.టికెట్ బుకింగ్: ప్లాట్‌ఫామ్‌ టికెట్లతో సహా రిజర్వ్డ్‌, అన్‌రిజర్వ్డ్ టికెట్లను నేరుగా యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.పీఎన్ఆర్, ట్రైన్ స్టేటస్ ట్రాకింగ్: రైలు షెడ్యూళ్లు, ఆలస్యం, ప్లాట్‌ఫామ్‌ నంబర్లకు సంబంధించి రియల్ టైమ్ అప్‌డేట్లను పొందవచ్చు.రైళ్లలో ఫుడ్ ఆర్డర్లు: రైళ్లలో ఆన్‌లైన్‌లోనే భోజనాన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. నేరుగా మీ సీటు వద్దకే భోజనం డెలివరీ చేస్తారు.రైల్ మదద్ (కంప్లైంట్ మేనేజ్‌మెంట్‌): రైలు ప్రయాణంలో మీ సమస్యలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. చేసిన ఫిర్యాదు, దాని పరిష్కారాన్ని రియల్ టైమ్‌లో ట్రాక్ చేయవచ్చు.ఇదీ చదవండి: అతిపెద్ద సోలార్ ప్రాజెక్టుకు రిలయన్స్ ఏర్పాట్లుపార్సిల్‌, ఫ్రైట్ ఎంక్వైరీ: సరుకు రవాణాను నిర్వహించవచ్చు. పార్సిళ్లను ట్రాక్ చేయడం, సరుకు రవాణా ఖర్చులను లెక్కించడం.కోచ్ పొజిషన్ ఫైండర్: రైలు ఎక్కే సమయంలో కచ్చితంగా ఏ పొజిషన్‌లో మీరు ఎక్కబోయే కోచ్‌ నిలుస్తుందో తెలుసుకోవచ్చు.రీఫండ్ అభ్యర్థనలు: రద్దు అయిన, మిస్ అయిన ప్రయాణాల కోసం మీ చెల్లింపులపై సులభంగా రీఫండ్‌లను పొందేందుకు అభ్యర్థనలు పెట్టుకోవచ్చు.ఇతర భాషలు: ఈ యాప్‌ హిందీ, ఇంగ్లీష్‌తోపాటు ఇతర భాషల్లోనూ అందుబాటులో ఉంటుంది.ఆర్-వాలెట్ ఇంటిగ్రేషన్: టికెట్లు, భోజనం, ఇతర సేవల కోసం సురక్షితమైన, నగదు రహిత చెల్లింపుల కోసం ఆర్-వాలెట్ ఉపయోగించవచ్చు.

The Diplomat Who Fell In Love With A Pakistani And Turned Into A Spy7
దౌత్యవేత్త తలరాతనే మార్చేసిన ప్రేమ మైకం..! కట్‌చేస్తే..

ఎలా పుడుతుందో లేదా చిగురిస్తుందో తెలియని ఈ ప్రేమ..జీవితాలనే తలకిందులు చేస్తుంది. అంతా సవ్యంగా ఉంటే కథా సుఖంతమవుతుంది. అయితే ఇది వలుపు వల లేదా ట్రాప్‌ అన్నది పసిగట్టగలిగితే సేఫ్‌గా ఉండొచ్చు. కానీ అసలు చిక్కు అంత అక్కడే ఉంటుంది. బహుశా దానికున్న శక్తి వల్లనో.. ఏమో..! ..ఎంతటి అత్యున్నత హోదాలో ఉన్న వ్యక్తినైనా దభాలున పడగొట్టేస్తుంది. తానేం చేస్తున్నది మర్చిపోయేలా దిగజార్చేస్తుంది. అచ్చం అలానే ఓ మహిళ గౌరవప్రదమైన హోదాలో ఉండి..కేవలం రెండక్షరాల ప్రేమ మాయలో పడి అపఖ్యాతీ పాలైంది. దేశ ప్రతిష్టనే దిగజార్చే పనులకు పూనుకుని కళంకితగా మిగిలింది. ఇటీవల అరెస్టు అయినా జ్యోతి మల్హోత్రా యూట్యూబర్‌ కథతో నాటి దౌత్యవేత్త మాధురి గుప్తా కథ నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. ఇంతకి ఎవరామె..? ఎలా పట్టుబడిందంటే..ఇటీవల జ్యోతి రాణిగా పిలిచే జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేసిన ఆరోపణలపై అరెస్టు అయ్యిన సంగతి తెలిసిందే. ఆమె తోపాటు మొత్తం ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె అరెస్టుతో భారత నిఘా వ్యవస్థ అప్రమత్తమైంది. ఇలా ఎలా మన దాయాది దేశానికి గూఢచారులుగా మారుతున్నారని విచారణ చేస్తుంటే..ప్రేమ, డబ్బు తదితరాలే కారణాలుగా వెల్లడవుతున్నాయి. ఇదొక హనీట్రాప్‌ మాదిరిగా జరుగుతున్నట్లు దర్యాప్తులో తేలింది. అచ్చం అలానే నాటి భారతీయ దౌత్యవేత్త అపఖ్యాతీ పాలై దోషిగా నిలబడిన ఘటన కళ్లముందు మెదులుతోంది. యావత్‌ దేశం తలదించుకునేలా దుశ్చర్యకు పాల్పడింది. అత్యున్నత హోదాలో ఉండి..అన్నేళ్లు అనుభవం అంతలా ఎలా దిగజారిపోయిందన్న అనుమానాలు లేవనెత్తాయి. ఇంతకీ ఎవరామె అంటే..ఆమె కథ ఓ బాలీవుడ్‌ సినిమాని తలపించేలా ఉంటుంది. ఇస్లామాబాద్‌లో దౌత్యవేత్తగా పనిచేస్తున్న మాధురి గుప్తా పాకిస్తానీ వ్యక్తిని ప్రేమలో పడి.. ఆ దేశం కోసం గుఢచారిగా మారిపోయింది. ఉర్దూలో నిష్ణాతురాలైన ఆమె సూఫీ కవిత్వంలో అతడికి పడిపోయినట్లు తెలుస్తోంది. 2010లో ముంబై దాడుల అనంతరం 18 నెలలు తర్వాత భారతదేశ ఇంటెలిజెన్స్ బ్యూరో (IB)లో గుసగుసలు వినిపించాయి. ఇస్లామాబాద్‌లో దౌత్యవేత్తగా పనిచేస్తున్న మాధురి పాక్‌కి గుఢాచారిగా పనిచేస్తుందంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో క్లోక్-అండ్-డాగర్ నిఘా ఆపరేషన్ చేపట్టి నిజనిజాలు వెలికితీసింది. ఆ ఆపరేషన్‌లోనే..విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా దౌత్యవేత్తగా పనిచేసిన ఆమె పాక్‌ అపరిచిత యువకుడితో ప్రేమలో పడటంతోనే..అమె అపార అనుభవం మంటగలిసిపోయిందని తేలింది. అస్సలు ఆమె అలా చేస్తుందని నమ్మబుద్ది కానీ విధంగా జాగ్రత్తపడిందని అన్నారు నిఘా అధికారుల. ఇక్కడ మాధురి గుప్తా పాకిస్తాన్‌లోని భారత హైకమిషన్‌ ప్రెస్ అండ్‌ ఐటీ విభాగంలో సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఆమె అక్కడ పాక్‌ ఇంటర్-సర్వీస్ ఇంటెలిజెన్స్ (ISI) కోసం గూఢచర్యం చేయడం ప్రారంభించిందని తేలింది. అదీగాక ఆమెకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA)లో మంచి పలుకుబడి, గౌరవం ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే ఆమెను ఇస్లామాబాద్‌లో దౌత్యవేత్తగా పనిచేసేలా బాధ్యతలు కట్టబెట్టినట్లు తెలుస్తోంది. అక్కడ ఆమె 30 ఏళ్ల జంషెడ్ అలియాస్ జిమ్‌ను కలిసింది. కొద్దికాలంలోనే అతడి ప్రేమలో పడింది. చెప్పాలంటే ఆమె హనీట్రాప్‌లో చిక్కుకుందని చెప్పారు అధికారులు. దేశ రహస్యాలను తెలుసుకోవడం కోసం ఆమెను వాడుకునేందుకు ఇలా ప్రేమ వలపును విసిరాడు జిమ్‌. అతడిపై ఉన్న గుడ్డిప్రేమతో ఆమె మన దేశ నిఘా కార్యకలాపాలను, రహస్య సమాచారాన్ని చేరవేయడం ప్రారభించిందని తెలిపారు. ఆమె మెయిల్‌ అకౌట్‌ స్వాధీనం చేసుకున్నప్పుడు ఈ విషయం బయటపడింది. ఆ ఈమెయిల్‌లో వారి మధ్య జరిగిన చాటింగ్‌ సంభాషణ బట్టి వారి మధ్య సాన్నిహిత్యం కాస్తా.. వివాహేతర బంధంగా మారిందని తేలింది. దీంతో నిఘా అధికారులు.. సార్క్ శిఖరాగ్ర సమావేశం నెపంతో ఆమెను ఏప్రిల్ 2010లో ఢిల్లీకి పిలిపించారు. అక్కడే భారత ఇంటిలిజెన్సీ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. అక్కడ ఆమె చేసిన నేరాలన్నింటిని అంగీకరించడం తోపాటు..ఇంత సమయం పట్టిందా నన్ను అదుపులోకి తీసుకోవడానికి అని అధికారులే అవాక్కయ్యేలా సమాధానమిచ్చింది మాధురి గుప్తా. ఆమెను అరెస్టు చేసి కోర్టుమందు హాజరుపరిచారు.అక్కడ ఆమె కేసు సంత్సరాల తరబడి కొనసాగింది. చివరికి వాదోపవాదనల అనంతరం మే 2018లో తీర్పు వెలువరించింది కోర్టు. ఆమె నేరపూరిత కుట్ర, గూఢచర్యం కేసులో దోషిగా నిర్థారిస్తున్నట్లు కోర్టు పేర్కొంది. అలాగే ఒకప్పుడూ గౌరవనీయమైన హోదాలో ఉండి దేశ ప్రతిష్టను దెబ్బతీసిలా పనులకు పూనుకోవడమే గాక మన దేశ భద్రతకు ముప్పుగా మారిందని పేర్కొంటూ శిక్ష విధించింది. ఇలా చేయడానికి రీజన్‌.. కేవలం ఒంటరితనం, వృత్తిపరమైన సంఘటర్షణ లేదా వ్యవస్థపై ఉన్న కోపంతోనో ఇలా చేసి ఉండొచ్చనేది నిపుణులు అంచనా. కానీ ఈ స్టోరీలో దౌత్యవేత్తగా అత్యున్నత హోదాలో ఉన్న ఆమె పార అనుభవం, తెలివితేటలు 'ప్రేమ' అనే రెండు అక్షరాల ముందు ఎందుకు పనికిరాకుండా పోయిందా అనేది మింగుడుపడని అంశంగా కనిపించింది అధికారులకి.(చదవండి: మెరిసిన చేనేత..మురిసిన భామలు)

Master Bharath Mother Passed Away8
నటుడు మాస్టర్ భరత్ ఇంట్లో విషాదం

తెలుగులో ఎన్నో సినిమాల్లో బాలనటుడిగా చేసి గుర్తింపు తెచ్చుకున్న మాస్టర్ భరత్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఇతడి తల్లి కమలహాసిని.. ఆదివారం రాత్రి చెన్నైలో మరణించారు. ఈ క్రమంలో తోటి నటీనటులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. చెన్నైలోని భరత్ ఇంటికి బంధుమిత్రులు, సినీ ప్రముఖులు వచ్చి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్) దర్శకుడు శ్రీనువైట్ల తీసిన వెంకీ, రెడీ, ఢీ, కింగ్ సినిమాలతో పాటు బిందాస్, మిస్టర్ ఫెర్ఫెక్ట్ తదితర 80 తెలుగు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు. పెద్దవాడు అయిన తర్వాత అల్లు శిరీష్ 'ఏబీసీడీ' మూవీతో నటుడిగా మారాడు. చివరగా గతేడాది రిలీజైన గోపీచంద్ విశ్వం సినిమాలో సహాయ పాత్రలో కనిపించాడు. ప్రస్తుతం ఒకటి రెండు సినిమాలు చేస్తున్నాడు.నటుడిగా తెలుగు, తమిళ, కన్నడలో పలు చిత్రాలు చేసిన మాస్టర్ భరత్.. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతోనూ బాధపడుతున్నాడు. ఇలాంటి సమయంలో తల్లిని కోల్పోవడంతో చాలా బాధపడుతున్నాడు. ఆమె మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. ఈ విషాద ఘటనతో మాస్టర్ భరత్ అభిమానులు కూడా శోకసంద్రంలో మునిగారు.(ఇదీ చదవండి: అందుకే నా కొడుకుకు ఆయన పేరు పెట్టుకున్నా: అనసూయ)

Hydra Demolish Construction In Miyapur9
మియాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు.. 70 ప్లాట్ల యజమానులు..

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా మియాపూర్‌లో హైడ్రా (Hydra) కూల్చివేతలు చేపట్టింది. హెచ్‌ఎండీఏ లేఅవుట్‌లోని అక్రమ నిర్మాణాలను అధికారులు తొలగించారు. పోలీసులు బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగాయి.వివరాల ప్రకారం.. మియాపూర్‌లోని హైదర్‌నగర్‌లో సోమవారం ఉదయం నుంచి హైడ్రా (Hydra) కూల్చివేతలు చేపట్టింది. తప్పుడు పత్రాలతో తమ భూమి కబ్జా చేశారని ఇటీవల 70 మంది ప్లాట్ల యజమానులు ఫిర్యాదు చేశారు. దీంతో, రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. హెచ్‌ఎండీఏ లేఅవుట్‌లోని అక్రమ నిర్మాణాలను అధికారులు తొలగించారు. హైకోర్టు ఆదేశాలతోనే అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నట్టు హైడ్రా అధికారులు తెలిపారు. ఇక, కబ్జాదారుల నుంచి భూములు విడిపించడంపై ప్లాట్ల యజమానులు హర్షం వ్యక్తం చేశారు.

Hyderabad Gulzar House Incident Related Details10
పిల్లలను తీసుకుని ఇంటికి రా తల్లీ.. సరదాగా వెళ్లారు..

రాజేంద్రనగర్‌/మణికొండ/బంజారాహిల్స్‌: ఆదివారం ఉదయం గుల్జార్‌హౌస్‌ అగ్నిప్రమాదంలో మృతిచెందిన 17 మందిలో 10 మృతదేహాలకు ఆదివారం సాయంత్రం ఒకేసారి అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబ పెద్ద ప్రహ్లాద్‌ మోదీ, ఆయన భార్య మున్నీ, కుమారుడు పంకజ్, కోడలు వర్ష, తమ్ముడు రాజేందర్‌ మోదీ, మరదలు సుమిత్ర, తమ్ముని కుమారుడు అభిషేక్, మనుమలు, మనమరాళ్లు అనుయాన్, ఇదిక, ఐరాజ్‌ల మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం అనంతరం పురానాపూల్‌లోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, ఈ ప్రమాదంలో బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.3లో నివసించే ఏడేళ్ల బాలిక హర్షాలి గుప్తా కన్నుమూశారు. ఆమె శరీరం పూర్తిగా కాలిపోవటంతో కుటుంబ సభ్యులు అస్తికలకు ఆదివారం మధ్యాహ్నం పంజాగుట్ట స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.పుట్టింటికి వెళ్లి మృత్యువాతసనత్‌నగర్‌: వేసవి సెలవులు కదా..? పిల్లలను తీసుకుని ఇంటికి రా.. తల్లీ! అని ఆ తండ్రి ఆశగా అడగడంతో కొడుకును తీసుకుని తన పుట్టిల్లు అయిన గుల్జార్‌హౌస్‌కు వెళ్లింది. అదృష్టవశాత్తూ తండ్రి పిలుపు మేరకు కొడుకు ముందు రోజు రాత్రే వెళ్లిపోగా, తల్లి అగ్ని ప్రమాదంలో మృత్యువాత పడింది. దీంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. వస్త్ర వ్యాపారి వినోద్‌కుమార్‌ అగర్వాల్‌ తన భార్య రజనీ అగర్వాల్‌ (45), కొడుకు కుషాల్‌ అగర్వాల్, కుమార్తె తనూలతో కలిసి సనత్‌నగర్‌లో ఉంటున్నాడు. కుమార్తె ముంబైలో ఎంబీఏ చదువుతుండగా, కుమారుడు కుషాల్‌ ఇంటర్మీడియెట్‌ చదువుతున్నాడు. ఈ క్రమంలో కుమారుడు కుషాల్‌ను తీసుకుని రజని గుల్జార్‌ హౌస్‌కు వెళ్లింది. అయితే కుషాల్‌ ముందు రోజు రాత్రి ఇంటికి వచ్చేశాడు. అక్కడే ఉన్న రజని మాత్రం ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించింది.సరదాగా వెళ్లారు.. శవాలై వచ్చారురహమత్‌నగర్‌: బంధువులతో సరదాగా గడపాలని వెళ్లారు. శవాలుగా తిరిగొచ్చారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మృత్యువాత పడటం ఎర్రగడ్డ డివిజన్‌ రాజీవ్‌నగర్‌ బస్తీ వాసులను కలచి వేసింది. గుల్జార్‌ హౌస్‌ ఆగ్ని ప్రమాదంలో రాజీవ్‌నగర్‌కు చెందిన తల్లి, కొడుకు, కుమార్తె మృతి చెందారు. ఆటో మొబైల్స్‌ వ్యాపారం చేసే రాజేష్‌ జైన్‌ రాజీవ్‌నగర్‌లో ఉంటున్నారు. ఆయనకు భార్య శీతల్‌ (35), ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కాగా శనివారం ఉదయం శీతల్‌ తన తండ్రి ఇంటికి పిల్లల్ని తీసుకుని వెళ్లింది. అయితే పెద్ద కుమార్తె రాశి తాను చదువుకోవాలంటూ శనివారం సాయంత్రమే రాజీవ్‌నగర్‌ లోని తమ నివాసానికి తిరిగి వచ్చింది. అక్కడే ఉండిపోయిన శీతల్, అరుషి, రిషబ్‌ మాత్రం ప్రమాదంలో చనిపోయారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement