Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

India Pakistan Conflict: Pak Air Defence System At Lahore Has Been Destroyed1
పాకిస్థాన్‌ దాడులను తిప్పికొట్టిన భారత్‌

పాకిస్థాన్‌ దాడులను భారత్‌ తిప్పికొట్టింది. పాక్‌ గగనతల రక్షణ వ్యవస్థలపై భారత సైన్యం విరుచుకుపడింది. పాకిస్థాన్‌ మిస్సైళ్లను భారత దళాలు కూల్చివేశాయి. యాంటి మిస్సైల్‌ సిస్టమ్‌ ద్వారా పాకిస్థాన్‌ మిస్సైళ్లను గాల్లోనే భారత్‌ పేల్చేసింది. ఎస్‌-400 మిస్సైళ్లను ఉపయోగించి పాక్‌కు భారత్‌ బుద్ధి చెప్పింది. గత రెండు రోజులుగా భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లతో దాడులకు పాకిస్థాన్‌ యత్నిస్తుండగా, వీటిని భారత రక్షణ వ్యవస్థలు సమర్థంగా అడ్డుకుంటున్నాయి.ఈ క్రమంలోనే లాహోర్‌లోని ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ ధ్వంసమైనట్లు తెలిసిందని భారత రక్షణశాఖ వెల్లడిచింది. లోహోర్‌లోని ఎయిర్‌ డిఫెన్స్ సిస్టమ్‌ను భారత్‌ దెబ్బతీసింది. చైనాకు చెందిన హెచ్‌క్యూ-9 రక్షణ వ్యవస్థలను పాకిస్థాన్‌ ఉపయోగిస్తోంది. ఉత్తర, పశ్చిమ తీరంలో పలు మిలటరీ స్థావరాలను పాక్‌ టార్గెట్‌ చేసింది.అవంతిపుర, శ్రీనగర్‌, జమ్ము, పఠాన్‌కోట్‌, అమృత్‌సర్‌, కపుర్తలా, జలంధర్‌ ,లూధియానా, అదంపుర్‌, బఠిండా, ఛండీగఢ్‌, పలోడి, ఉత్తర లాల్‌, భుజ్‌లపై డ్రోన్లు, మిసైళ్లతో మిలటరీ స్థావరాలను పాక్‌ టార్గెట్‌ చేసింది. దీంతో పెద్ద ఎత్తున పాక్‌ మిస్సైళ్లను భారత్‌ కూల్చేసింది. ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ సుదర్శన చక్రను భారత్‌ ఉపయోగించింది. పాకిస్తాన్ ఏ ప్రాంతాలను టార్గెట్ చేసిందో. అదే ప్రాంతాల్లో పాక్‌కు భారత్‌ గట్టి బుద్ధి చెప్పింది.రావల్సిండి స్టేడియంపై భారత్‌ డ్రోన్‌ దాడి ఆపరేషన్‌ సిందూర్‌ కొనసాగుతోంది. రావల్సిండి స్టేడియంపై భారత్‌ డ్రోన్‌ దాడి చేసింది. పాకిస్థాన్‌ లీగ్‌ మ్యాచ్‌కు ముందే భారత దళాలు దాడి చేయగా.. రావల్సిండి విడిచి వెళ్లిపోవాలని క్రికెటర్లను పాక్‌ ఆదేశించింది. Pakistan Air defence System in Lahore destroyed completely #IndiaPakistanWar #OperationSindoor #LahoreBlast pic.twitter.com/jLe6GIed4m— War Room Insights (@AppWarRoom) May 8, 2025

US Issues Alert For Lahore: Asks Its Citizens To Leave Or Seek Shelter2
లాహోర్‌ను వీడండి.. తమ పౌరులకు అమెరికా హెచ్చరిక

పాక్‌ ఉన్న తమ పౌరులు వెంటనే వెనక్కి వచ్చేయాలని అమెరికా హెచ్చరికలు జారీ చేసింది. భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా అప్రమత్తమైంది. ఈ మేరకు పాక్‌లోని తమ పౌరులు, దౌత్యవేత్తలను అప్రమత్తం చేసింది. వెంటనే లాహోర్‌ను వీడి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఈ మేరకు లాహోర్‌లోని యూఎస్‌ ఎంబసీ సూచనలు జారీ చేసింది. లాహోర్‌లో విమానాశ్రయం మూసివేయడంతో దౌత్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అమెరికా సూచించింది.కాగా, మరిన్ని సైనిక దాడులకు సిద్ధంగా ఉన్నామని భారత రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ స్పష్టం చేశారు. పీవోకేలో ఉగ్ర వాదులను వేటాడుతున్నామని ఆయన తెలిపారు. పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థలే లక్ష్యంగా భారత్‌ ప్రతీకార దాడులు చేస్తోంది. లాహోర్‌లోని ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ను ధ్వంసమైనట్లు తెలుస్తోందని భారత్‌ ఇప్పటికే వెల్లడించింది. పాకిస్థాన్‌ మిస్సైళ్లను భారత దళాలు కూల్చివేశాయి.యాంటి మిస్సైల్‌ సిస్టమ్‌ ద్వారా పాకిస్థాన్‌ మిస్సైళ్లను గాల్లోనే భారత్‌ పేల్చేసింది. ఎస్‌-400 మిస్సైళ్లను ఉపయోగించి పాక్‌కు భారత్‌ బుద్ధి చెప్పింది. గత రెండు రోజులుగా భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లతో దాడులకు పాకిస్థాన్‌ యత్నిస్తుండగా, వీటిని భారత రక్షణ వ్యవస్థలు సమర్థంగా అడ్డుకుంటున్నాయి. ఈ క్రమంలోనే లాహోర్‌లోని ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ ధ్వంసమైనట్లు తెలిసిందని భారత రక్షణశాఖ వెల్లడిచింది.

Ysrcp Meeting: Ys Jagan Fires On Chandrababu3
‘మీ బాధలు చూశా.. ఇబ్బందిపెట్టిన వారి పేర్లు రాసుకోండి’

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు. రాజంపేట, మడకశిర, మున్సిపాలిటీలతో పాటు రామకుప్పం, రొద్దం మండలాల నేతలతో భేటీ అయిన ఆయన... ఇటీవల జరిగిన ఎంపీపీ ఉప ఎన్నికల్లో టీడీపీ అక్రమాలను ప్రస్తావించారు. పచ్చగూండాల దాడులను ఎదుర్కొన్నవారిని అభినందించారు.‘‘రాష్ట్రంలో కూటమి సర్కార్‌.. విలువలు, విశ్వసనీయత లేని రాజకీయాలు చేస్తోంది. ఈ పరిస్థితుల మధ్య తులసి మొక్కల్లా.. తెగువ చూపించి, విలువలతో కూడిన రాజకీయాలకు అర్ధం చెప్పి.. వాటిని చంద్రబాబుకు చూపారు.. నిలబడిన మీ అందరికీ హ్యాట్సాఫ్‌. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలి. కానీ వాటన్నింటినీ దిగజార్చారు చంద్రబాబు. ఈ పరిస్థితి చూడాల్సి వస్తుందని అనుకోలేదు’’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.స్థానిక సంస్థల్లో చంద్రబాబు అనైతిక చర్యలు:రామకుప్పంతో ఒక ఎంపీటీసీ చనిపోతే, ఉప ఎన్నిక జరిగింది. అక్కడ మొత్తం 16 మంది వైఎస్సార్‌సీపీకి చెందినవారే. అయినా అక్కడ చంద్రబాబు తమ పార్టీ అభ్యర్థిని పోటీకి పెట్టి, ఆరుగురిని లాక్కునే ప్రయత్నం చేయడంతో పాటు, మన పార్టీ ఎంపీటీలు ప్రయాణిస్తున్న వాహనాన్ని పోలీసుల ద్వారా అడ్డుకున్నారు. కోరం లేకపోయినా, కేవలం ఆరుగురు మాత్రమే అటువైపు వెళ్లినా, ఏకపక్షంగా డిక్లేర్‌ చేసుకున్నారు. రొద్దం మండలంలో మొత్తం 15 ఎంపీటీసీలు వైఎస్సార్‌సీపీకి చెందిన వారే. అక్కడ ఒకరు చనిపోతే ఉప ఎన్నిక జరిగింది. ఇక్కడా చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయం చేశాడు. చెడిపోయిన రాజకీయాలకు దిక్సూచిలా పని చేస్తూ.. మార్గం చూపాడు. పెనుకొండలో ఎంత ప్రలోభపెట్టినా ఒక్కరూ వెళ్లలేదు. మడకశిర ఎస్సీ నియోజకవర్గం. అక్కడా 15 మంది మన పార్టీ వారే. అక్కడా కౌన్సిలర్లను లాగాలని విశ్వప్రయత్నం చేశాడు. అంత కన్నా దిగజారిన నాయకుడు ఎవరూ ఉండరు. అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపాలిటీలో 29 వార్డుల్లో 24 మంది కౌన్సిలర్లు. కేవలం ముగ్గురు టీడీపీ. ఇంకొకరు ఇండిపెండెంట్‌. అయినా అక్కడా చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయం చేశారు.చంద్రబాబు సిగ్గు పడాలిఏ నాయకుడు అయినా ఆదర్శంగా ఉండాలి. మన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు విలువలు, విశ్వసనీయతతో పని చేస్తున్నారు. చంద్రబాబు సిగ్గుపడి తల దించుకునేలా మన వాళ్లు రాజకీయాల్లో ఉన్నారు. మనం మాట తప్పలేదు. విలువలు వదల్లేదు. మనం అధికారంలో ఉన్నప్పుడు కోవిడ్‌ వచ్చింది. రెండేళ్ల తర్వాత స్థానిక ఎన్నికలు జరిగాయి. కోవిడ్‌ వల్ల రాష్ట్రంలో ఎప్పుడూ చూడని పరిస్థితులు. ఆదాయాలు తగ్గాయి. ఖర్చులు పెరిగాయి. కానీ, ఏనాడూ సాకు చూపలేదు. ఎగొట్టే పని చేయలేదు. మాట తప్పలేదు. చిక్కటి చిరునవ్వుతో ఉన్నాం. మ్యానిఫెస్టోలో చెప్సిన ప్రతి మాటకు కట్టుబడ్డాం. పథకాలు అమలు చేశాం. బటన్‌ నొక్కాం. మాట తప్పకుండా పని చేశాం కాబట్టే, కోవిడ్‌లో అలా పని చేశాం కాబట్టే.. అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు గెలిచాంఅవకాశం ఉన్నా తాడిపత్రి వదులుకున్నాంనాడు కేవలం రెండు మున్సిపాలిటీల్లోనే టీడీపీకి మెజారిటీ వచ్చింది. తాడిపత్రి మున్సిపాలిటీలో మన పార్టీ వారు 16 మంది గెలిస్తే, టీడీపీ నుంచి 18 మంది గెలిస్తే.. ఎవరినీ లాక్కోవాలని చూడలేదు. అప్పుడు నేను మన ఎమ్మెల్యేను నేను హౌజ్‌ అరెస్టు చేశాను. దాంతో తాడిపత్రి మున్సిపాలిటీ ఛైర్మన్‌ పదవిని టీడీపీ గెల్చింది. మనం ఆనాడు అలా రాజకీయం చేస్తే, అదే మాజీ ఎమ్మెల్యేను ఇప్పుడు తాడిపత్రిలోకి అడుగు పెట్టనీయడం లేదు. ఆస్తులు విధ్వంసం చేస్తున్నారు.మీ బాధలు చూస్తున్నాను.. హామీ ఇస్తున్నా..ఇవన్నీ చూశాక, నేను ఒకటే చెబుతున్నాను. కేవలం వైఎస్సార్‌సీపీని ప్రేమించినందుకు, పార్టీని అభిమానించినందుకు కార్యకర్తలు పడుతున్న బాధను చూశాను. అందుకే జగన్‌ 2.0 లో కార్యకర్తలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తాను. వారికి పూర్తి న్యాయం చేస్తాను. మిమ్మల్ని, కార్యకర్తల్ని ఇబ్బంది పెడుతున్న పోలీసు అధికారుల పేర్లు రాసుకొండి. అధికారంలోకి వచ్చాక వారిని చట్టం ముందు నిలబెడదాం. ఈరోజు నువ్వు (చంద్రబాబు, పోలీసులు) చేస్తున్న దుర్మార్గం. వారు ఈరోజు ఏదైతే విత్తనం వేస్తున్నారో రేపు అదే పెరుగుతుంది. అందుకే ఈరోజు దౌర్జన్యాలు చేస్తున్న అధికారులు, పోలీసులు.. ఆరోజు ఎక్కడున్నా, రిటైర్‌ అయినా, సప్త సముద్రాల అవతల ఉన్నా వదిలిపెట్టం. అది మామూలుగా ఉండదు.చంద్రబాబు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడంటే..ఈ రోజు తప్పుడు కేసులు, తప్పుడు సాక్ష్యాలు. సంబంధం లేకున్నా కేసుల్లో ఇరికిస్తున్నారు. ఇలాంటి రాజకీయాలు గతంలో ఏనాడూ చూడలేదు. చంద్రబాబు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడంటే, ఆయన ప్రజల్లో చులకన అయ్యారు. హామీలు అమలు చేయడం లేదు. దీంతో ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. కాబట్టి, ఎవరూ ప్రశ్నించకూడదని, రాష్ట్రంలో భయానక పరిస్థితి సృష్టిస్తున్నాడు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా, ప్రజల్లో వ్యతిరేకత కనిపించినా, వెంటనే డైవర్షన్‌. ఒకరోజు తిరుపతి లడ్డూ అంటాడు. ఇంకోరోజు సినీ నటి కేసు.ఈ రోజు ప్రజలు అడిగే ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పలేడు. టీడీపీ వారు ఎక్కడికి వెళ్ళినా.. ఏం జరుగుతుంది?. నా రూ.15 వేలు ఏమయ్యాయని పిల్లలు, మా రూ.26 వేలు ఏమయ్యాయని రైతులు, అవ్వలు వారి రూ.48 వేలు, యువత తమ రూ.36 వేలు ఏమయ్యాయని అడుగుతారు. ఎన్నికల ముందు మాట ఇచ్చి, మోసం చేయడంతో సమాధానం చెప్పలేని దుస్థితి.అన్ని వ్యవస్థలు నాశనం చేసేశారు..ఈరోజు అన్ని వ్యవస్థలు నాశనం చేశారు. నాడు–నేడు లేదు. ఇంగ్లిష్‌ మీడియ లేదు. పిల్లలకు ట్యాబ్‌లు లేవు. గోరుముద్ద సక్రమంగా లేదు. గవర్నమెంటు బడులు రివర్స్‌లోకి వెళ్లాయి. పిల్లలు ఎదగాలంటే, ఆ కుటుంబం బాగు పడాలంటే, ఆ పిల్లవాడు బాగా చదవాలి. అందుకే ఫీజు చెల్లించాలి. మన ప్రభుత్వంలో ప్రతి మూడు నెలలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విద్యాదీవెన ఇచ్చాం. అందుకే ప్రతి మూడు నెలలకు రూ.700 కోట్లు, అలా ఏటా రూ.2800 కోట్లు, వసతి దీవెన కింద మరో రూ.1100 కోట్లు ఇవ్వాలి. ఇచ్చాం. కానీ, ఈ పెద్దమనిషి చంద్రబాబు గత ఏడాది రూ.3900 కోట్లకు బదులు రూ.700 కోట్లు మాత్రమే ఇచ్చాడు. ఈ ఏడాది ఏమీ ఇవ్వలేదు.దీంతో పిల్లలు చదువుకు దూరం అవుతున్నారు.ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు. మనం పక్కాగా అమలు చేశాం. ఇంకా ఆరోగ్య ఆసరా అమలు చేశాం. ఆరోగ్యశ్రీకి నెలకు రూ.300 కోట్లు కావాలి. రూపాయి ఇవ్వలేదు. ఆరోగ్య ఆసరా ఇవ్వడం లేదు. దీంతో పేదలు వైద్యం కోసం అప్పులు చేయాల్సి వస్తోంది. రైతులకు ఏ పంటకూ గిట్టుబాటు ధర రావడం లేదు. రైతు ఈరోజు దళారుల పాలయ్యాడు. టమోటా కిలో రూ.2 కూడా రావడం లేదు. ఆర్బీకేలు నీరు గారిపోయాయి. ఉచిత పంటల బీమా లేదు. మన ప్రభుత్వ హయాంలో ఎక్కడ ప్రకృతి వైపరీత్యం జరిగినా, ప్రభుత్వ యంత్రాంగం కనిపించేది. సీజన్‌ ముగిసేలోగా వారిని ఆదుకునే వాళ్లం. ఇంకా మనం పెట్టుబడి సాయంగా రూ.13,500 ఇస్తే, రూ.26 వేలు ఇస్తానన్న చంద్రబాబు, వారినీ మోసం చేశాడు.అవినీతి రాజ్యమేలుతోంది..విచ్చలవిడిగా ఎక్కడ చూసినా అవినీతి యథేచ్ఛగా రాజ్యమేలుతోంది. రైతులకు ఉచితంగా విద్యుత్‌ ఇవ్వడం కోసం యూనిట్‌ విద్యుత్‌ కొనుగోలు కోసం సెకీతో రూ.2.49కి ఒప్పందం చేసుకుంటే, ఈ రోజు రూ.4.60కి ఒప్పందం చేసుకున్నారు. రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ, ఊరూ పేరూ లేని ఉర్సా కంపెనీకి రూపాయికి రూ.3 వేల కోట్ల విలువైన భూమి. లులూ కంపెనీకి కూడా రూ.1500 కోట్ల విలువైన భూమి ఇచ్చారు. ఇక మద్యం. ఎక్కడ చూసినా అందుబాటు. ఊరూరా బెల్టుషాప్‌లు. ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. డోర్‌ డెలివరీ చేస్తున్నారు. ఉచిత ఇసుక పేరుకే. కానీ, ఎక్కువ ధరకు ఇస్తున్నారు. మనం వర్షాకాల సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని 80 లక్షల టన్నులు స్టాక్‌ పెడితే, ఈ ప్రభుత్వం వచ్చీ రాగానే ఎక్కడికక్కడ అమ్మేసుకున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఏ కంపెనీ నడపాలన్నా, ఎక్కడ ఏ మైనింగ్‌ చేయాలన్నా ఎమ్మెల్యేకు కప్పం కట్టాల్సిందే.బాండ్ల పేరుతో కొత్త అవినీతి:ఇంత పచ్చిగా అవినీతి చేస్తూ, దాన్ని గత మన ప్రభుత్వం మీదకు నెడుతూ, అదే పనిగా తప్పుడు ఆరోపణలు. విమర్శలు చేస్తున్నారు. ఇంకా వాటికి ఎల్లో మీడియా వంత పాడుతోంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 అదే పనిగా దుష్ప్రచారం చేస్తున్నాయి. కొత్తగా బాండ్ల పేరుతో అవినీతి. ఏపీ ఎండీసీలో కొత్తగా బాండ్లు జారీ చేస్తూ, అవినీతికి పాల్పడుతున్నారు. అలా కోరుకున్న వారికి గనులన్నీ ఇచ్చుకునే తంతు చేస్తున్నారు. ఇలాంటి అవినీతి వ్యవహారం ఇప్పటి వరకు చూడలేదు.మళ్లీ వచ్చేది మనమే:చూస్తుండగానే ఏడాది గడిచింది. కళ్లు మూసుకుని తెరిస్తే మూడేళ్లు గడుస్తాయి. మనం గట్టిగా నిలబడి మూడేళ్లు ఇలాగే పోరాడితే, ఆ తర్వాత వచ్చేది కచ్చితంగా మన ప్రభుత్వమే. ఇప్పుడు మిమ్మల్ని వేధిస్తున్న వారెవ్వరినీ వదిలిపెట్టబోము. మనం అధికారంలోకి వచ్చాక, వారిని చట్టం ముందు నిలబెడతాం.

AP Police Over Action At Sakshi Editor Dhanunjaya Reddy4
పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు.. ‘సాక్షి’పై ఏపీ సర్కార్‌ కక్ష సాధింపు

సాక్షి, విజయవాడ: ఏపీలో పత్రికా స్వేచ్చకు సంకెళ్లు పడ్డాయి. కూటమి ప్రభుత్వంలో సాక్షిపై కక్షసాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే చంద్రబాబు ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై వార్తలు రాసినందుకు సాక్షి పత్రిక ఎడిటర్‌ ధనుంజయ రెడ్డిపై పోలీసులు వేధింపు చర్యలకు దిగారు. సోదాల పేరుతో ఏపీ పోలీసులు గురువారం ఉదయం.. సాక్షి ఎడిటర్‌ ధనుంజయ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. ఎలాంటి నోటీసులు లేకుండానే ధనుంజయ రెడ్డి ఇంటికి పోలీసులు చేరుకుని ఆయన కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురిచేశారు. ఇంట్లోకి వెళ్లిన పోలీసులు.. కాసేపటికే ఇంటి తలుపులు మూసివేసి గంటల తరబడి సోదాలు చేశారు. అయితే, గతంలోనూ ధనుంజయ రెడ్డిపై పోలీసులు కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నిస్తూ కథనాలు రాసిన పలువురు సాక్షి విలేకర్లపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు.ఏసీపీ ప్రవర్తన దుర్మార్గం: ధనుంజయ రెడ్డి అనంతరం, సాక్షి పత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డి మాట్లాడుతూ.. ఈరోజు ఉదయం 9:45కి పది మంది పోలీసులు ఇంటికి వచ్చారు. సోదాలకు సంబంధించి‌ నోటీసులు లేకుండా ఇంట్లోకి దూసుకొచ్చేశారు. ఏసీపీ మరింత దుర్మార్గంగా ప్రవర్తించారు. నోటీస్ కూడా ఇవ్వకుండా సోదాలు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఇలాంటి చర్యలు పత్రికా స్వేచ్ఛకి విఘాతం కలిగిస్తాయి. ప్రజల గొంతుకై ‘సాక్షి’ నిలుస్తుంది అని కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. ఇప్పటికే నాలుగు సార్లు కేసులు పెట్టారు. ప్రస్తుతం హైకోర్టు పరిధిలో కేసు ఉంది. సంబంధం లేదని వాళ్లే చెబుతారు. మళ్లీ వారే సోదాలు చేస్తారు. ప్రెస్ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాకి కూడా మేము ఫిర్యాదు ఇస్తాం. మానసిక స్థైర్యాన్ని దెబ్బ తీయడానికి ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యవాదులంతా ఈ పద్ధతిని ఖండించాలి’ అని అన్నారు. ఖండించిన పాత్రికేయులుఏపీలో ఎమ‌ర్జెన్సీ నాటి ప‌రిస్థితులు నెల‌కొన్నాయ‌ని పాత్రికేయులు మండిప‌డుతున్నారు. కూటమి ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను, ప్ర‌జా వ్య‌తిరేక చ‌ర్య‌ల‌ను ప్ర‌శ్నిస్తున్నందుకే సాక్షిపై చంద్ర‌బాబు స‌ర్కారు క‌క్ష సాధిస్తోంద‌ని ఆరోపిస్తున్నారు. కూట‌మి ప్ర‌భుత్వ క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌ను ప్ర‌జాసంఘాల‌తో పాటు ప్ర‌జ‌లు ముక్త కంఠంతో వ్య‌తిరేకిస్తున్నార‌ని తెలిపారు. ప్ర‌భుత్వంలో జ‌రుగుతున్న అక్ర‌మాల‌ను నిగ్గ‌దీసి అడుగుతున్నందుకు, క‌క్ష గ‌ట్టి ప్ర‌జల గొంతును నొక్కాల‌ని చేస్తున్న ప్ర‌య‌త్నంలో భాగంగానే కూట‌మి స‌ర్కారు ఇదంతా చేస్తోంద‌ని ఆరోపించారు. ప్ర‌జ‌ల‌కు జ‌రుగుతున్న అన్యాయాన్ని ప్ర‌శ్నిస్తూనే ఉంటామ‌ని, ఇచ్చిన హామీల‌ను నిల‌బెట్టుకునేలా ప్ర‌భుత్వంపై ఒత్తిడి కొన‌సాగిస్తామ‌న్నారు. సాక్షిపై కక్ష సాధింపు చ‌ర్య‌ల‌ను ప‌త్రికా స్వేచ్ఛ‌పై జ‌రిగిన దాడిగా పాత్రికేయులు పేర్కొన్నారు. ప్ర‌భుత్వం రాజ్యాంగ‌బ‌ద్దంగా న‌డుచుకోవాల‌ని కక్ష సాధింపు చ‌ర్య‌లు మానుకోవాల‌ని హిత‌వు ప‌లికారు.

Rawalpindi Stadium Damaged in Drone Attack Ahead PSL Match: Report5
పీసీబీకి మరో దెబ్బ!.. రావల్పిండి స్టేడియంపై డ్రోన్‌ దాడి?.. PSLపై నీలినీడలు!

పహల్గామ్‌ ఉగ్రదాడికి బదులిచ్చేందుకు భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor) కొనసాగుతోంది. మంగళవారం అర్ధరాత్రి తర్వాత భారత సైన్యం ఉ‍గ్రవాద స్థావరాలే లక్ష్యంగా మెరుపు దాడులు చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో పాకిస్తాన్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలు ధ్వంసమయ్యాయి.ఇందుకు బదులుగా పాకిస్తాన్‌ సరిహద్దుల వెంట కాల్పులకు తెగబడటంతో పాటు.. మిసైళ్లతో దాడికి దిగింది. ఇందుకు భారత సైన్యం ధీటుగా బదులిస్తోంది. యాంటీ మిసైల్‌ స్టిసమ్‌తో గాల్లోనే పాక్‌ క్షిపణులను పేల్చివేసింది. ఇందులో భాగంగా లాహోర్‌, రావల్పిండిలోని పాక్‌ సైనిక స్థావరాలపై దాడులు చేస్తున్నట్లు సమాచారం.రావల్పిండి క్రికెట్‌ స్టేడియం సమీపంలోఈ క్రమంలో రావల్పిండి క్రికెట్‌ స్టేడియం సమీపంలో భారత్‌ డ్రోన్‌ అటాక్‌ జరిగినట్లు తెలుస్తోంది. మైదానానికి దగ్గర్లోనే దాడి జరిగినట్లు సమాచారం. కాగా ఇక్కడే గురువారం రాత్రి పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (PSL) మ్యాచ్‌ జరగాల్సి ఉంది. బాబర్‌ ఆజం (Babar Azam) కెప్టెన్సీలోని పెషావర్‌ జల్మీ- డేవిడ్‌ వార్నర్‌ సారథ్యంలోని కరాచీ కింగ్స్‌ మధ్య మ్యాచ్‌ నిర్వహించేందుకు పాక్‌ క్రికెట్‌ బోర్డు షెడ్యూల్‌ ఖరారు చేసింది.అయితే, స్టేడియానికి దగ్గర్లోనే డ్రోన్‌ దాడి జరగడంతో అప్రమత్తమైన పాక్‌ బోర్డు.. క్రికెటర్లు రావల్పిండి విడిచి వెళ్లిపోవాలని ఆదేశించినట్లు వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్‌కు చెందిన ఓ జర్నలిస్టు సోషల్‌ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.డ్రోన్‌ దాడి నేపథ్యంలో అత్యవసరంగా సమావేశమైన పీసీబీ అధికారులు పీఎస్‌ఎల్‌ కొనసాగింపు , వేదికల మార్పు తదితర అంశాల గరించి చర్చినట్లు తెలుస్తోంది. కాగా న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా, జింబాబ్వే తదితర దేశాలకు చెందిన పలువురు క్రికెటర్లు ప్రస్తుతం పాక్‌లోనే ఉన్నారు. కరాచీలోమరోవైపు.. భారత్‌- పాక్‌ పరస్పర దాడుల నేపథ్యంలో తమ పౌరులను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అమెరికా చెప్పడం పరిస్థితుల తీవ్రతకు అద్దం పడుతోంది.ఇలాంటి సమయంలో పాక్‌ టీ20 లీగ్‌ కొనసాగకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు.. రావల్పిండిలో ఈరోజు జరగాల్సిన మ్యాచ్‌ను కరాచీకి తరలించారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కాగా ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 నిర్వహణ హక్కులు దక్కించుకు న్న పాక్‌.. ఇటీవలే భారీగా డబ్బు ఖర్చు పెట్టి స్టేడియాలను పునరుద్ధరించింది.చదవండి: Operation Sindoor: సానియా మీర్జా పోస్ట్‌ వైరల్‌

Win Rs 10,000 Daily Rs 50,000 Weekly Mumbai Railway Turns Train Tickets into Lottery for Better Compliance6
రైల్వే టికెట్‌తో రోజుకు రూ. 10వేలు, వారానికి రూ. 50వేలు

టికెట్ లేకుండా ట్రైన్లలో ప్రయాణించేవారి సంఖ్య చాలానే ఉంది. దీనిని నివారించడానికి ఇండియన్ రైల్వే ఓ విన్నూత చర్యకు శ్రీకారం చుట్టింది. ప్రతి రోజూ సుమారు 24 మిలియన్ల మంది ప్రయానికులకు సేవలందిస్తున్న ముంబై డివిజన్.. ఎఫ్‌సీబీ ఇండియా యాడ్ ఏజన్సీతో జతకట్టి.. 'లక్కీ యాత్ర' అనే ప్రచారం ప్రారంభించింది.ఇండియన్ రైల్వే.. ప్రారంభించిన ఈ లక్కీ యాత్ర ప్రచారంలో భాగంగా ప్రతి రోజూ ఒక ప్రయాణికునికి రూ. 10వేలు, వారానికి ఒక ప్రయాణికునికి రూ. 50వేలు ఫ్రైజ్ మనీ అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ టికెట్ కొనుగోలు చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ కార్యక్రమం ప్రారభించడం జరిగింది. ఇది వచ్చే వారం నుంచి ప్రారంభమై ఎనిమిది వారాలు పాటు అమలులో ఉంటుందని తెలుస్తోంది.టికెట్ లేకుండా ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య ఎక్కువ కావడం వల్ల.. ఇండియన్ రైల్వే ప్రతి ఏటా కోట్ల రూపాయలను కోల్పోతోంది. అయితే ఇప్పుడు ప్రైజ్ మనీ అనే ప్రచారం ప్రారభించడంతో.. ప్రైజ్ కోసమైనా కొందరు ట్రైన్ టికెట్ కొనుగోలు చేస్తారు. ప్రైజ్ మనీ కేవలం ట్రైన్ టికెట్ తీసుకునే వారికి మాత్రమే కాకుండా.. సీజన్ పాస్‌లు తీసుకున్నవారికి కూడా లభిస్తుంది.ప్రతిరోజు.. సబర్బన్ స్టేషన్‌లో టికెట్ ఎగ్జామినర్ ఒక ప్రయాణికుడిని ఎంపిక చేస్తారు. అతడు చెల్లుబాటు అయ్యే రోజువారీ టికెట్ లేదా సీజన్ పాస్‌ను కలిగి ఉన్నట్లయితే.. రూ. 10,000 నగదు బహుమతిని అక్కడికక్కడే ఇవ్వడం జరుగుతుంది. ఇలాగే వారానికి ఒకరిని ఎంపిక చేసి రూ. 50000 ప్రైజ్ మనీ అందిస్తారు.ఇదీ చదవండి: ఇండియన్ రైల్వే డిజిటల్ క్లాక్ డిజైన్ పోటీ: రూ.5 లక్షల ప్రైజ్సెంట్రల్ రైల్వే ప్రస్తుతం ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్‌ల సమయంలో రోజుకు 4,000 నుంచి 5,000 మంది టికెట్ లేని ప్రయాణికులను పట్టుకుంటుంది. టికెట్ లేకుండా ప్రయాణించే ప్రయాణికుల సంఖ్యను తగ్గించడానికి.. 'లక్కీ యాత్ర' అనే ప్రచారం ప్రారంభమైంది. దీని ద్వారా ఎక్కివమందిని టికెట్స్ కొనేలా చేయొచ్చని అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ ప్రచారం ప్రస్తుతం ముంబైలో మాత్రమే అమలులో ఉన్నట్లు తెలుస్తోంది.

KR Bhaskars Puranpoli Ghar Success waiter to Rs 3.6 Crore Profits7
వెయిటర్ టు కరోడ్‌పతి: కె.ఆర్. భాస్కర్ ఇన్‌స్పైరింగ్ జర్నీ

ఎపుడు ఎలా పనిచేశామన్నది కాదు. సక్సెస్‌ సాధించామా లేదా అన్నది ముఖ్యం. తమ అభిరుచికి, నైపుణ్యానికి కాస్త పట్టుదల, కృషి జోడిస్తే విజయం మనముందు సాగిలపడుతుంది. దీన్నే అక్షరాలా నిరూపించి చూపించారు కె.ఆర్. భాస్కర్. హోటల్‌లో వెయిటర్‌గా మొదలైన భాస్కర్‌ ప్రయాణం కోట్ల రూపాయల లాభాలను తెచ్చిపెడుతోంది. ఇంతకీ ఆయన సాధించిన విజయం ఏంటి? కేఆర్‌ భాస్కర్‌ స్ఫూర్తి దాయక స్టోరీ గురించి తెలుసుకుందాం.ఎక్కడైనా రుచి కరమైన టిఫిన్లు, ఆహారం లభిస్తోందంటే ఆహార ప్రియులకు పండగే. ఎంతదూరమైనా వెళ్లి దాని రుచిని ఆస్వాదించాల్సిందే. మళ్లీ మళ్లీ తిని ఆహా..! అనాల్సిందే. అంతేకాదు నలుగురికీ వారి ద్వారా జరిగే మౌత్‌ పబ్లిసిటీ విజయం తక్కువేమీకాదు. అంతటి మహిమ ఫుడ్‌ బిజినెస్‌కు ఉంటుంది. కేఆర్‌ భాస్కర్‌ తయారు చేసే బొబ్బట్ల (పూరన్‌ పోలి) వాసనకే ఆహార ప్రియులు పరవశులైపోతారు. ఆ సువాసన ముక్కు పుటాలకు తాకిన వారెవ్వరూ వాటి రుచి చూడకుండా వదిలిపెట్టరు.కర్ణాటక,మహారాష్ట్రలోని సందడిగా ఉండే వీధుల్లో 'భాస్కర్ పురాన్‌పోలి ఘర్' అలా వేలాది కస్టమర్లను ఆకర్షిస్తుంది. రెండు రాష్ట్రాలలో విస్తరించింది.ఇదీ చదవండి: 30 డేస్‌ ఛాలెంజ్‌ : ఇలా చేస్తే యవ్వనంగా, ఆరోగ్యంగా!భాస్కర్ కథ స్ఫూర్తి దాయకమైనది. కర్ణాటకలోని కుందాపూర్‌లో పేద రైతు కుటుంబంలో జన్మించిన ఆయన చిన్నప్పటి నుంచీ కష్టాలను ఎదుర్కొన్నారు. కానీ ఆయన ఎప్పుడూ తన కలలను వదులుకోలేదు! అవిశ్రాంత పట్టుదలకు ఓరిమికి నిదర్శనం ఆయన సక్సెస్‌ జర్నీ. కర్ణాటకలో పెరిగిన ఆయన చిన్న వయసులోనే ఉద్యోగ రంగంలోకి దిగారు. కేవలం 12 సంవత్సరాల వయసులోనే బెంగళూరులోని ఒక హోటల్‌లో టేబుల్స్ శుభ్రం చేయడం , పాత్రలు కడగడం వంటి పనులు చేసేవాడు. అలా దాదాపు ఐదేళ్లకు పైగా భాస్కర్ వెయిటర్‌గా పనిచేశాడు. ఆ అనుభవమే ఈ వ్యాపారంపై లోతైన అవగాహన కలిగింది. అలాతన జీవితాన్ని మలుపు తిప్పిన వైనాన్ని. షార్క్ ట్యాంక్ ఇండియా సీజన్ 2లో భాస్కర్ తన విజయగాథను పంచుకున్నారు.అంతకుముందు ఎనిమిదేళ్ల పాటు నృత్య బోధకుడిగా పనిచేశాడు. పాన్ షాప్ ఓపెన్‌ చేశాడు. కానీ పెద్దగా సక్సెస్‌కాలేదు. తన పాక నైపుణ్యంతో ఫుడ్‌బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. 23 ఏళ్ల వయసులో తన తల్లి సహకారంతో నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా, రుచికరమైన బొబ్బట్లను తయారు చేసి సైకిల్ మీద వీధుల్లో అమ్మడం ప్రారంభించాడు. ఆ చిన్న అడుగే కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యానికి బాటలు వేసింది. పురాన్‌పోలి తయారీలో అతని ప్రతిభకు, వాటి టేస్ట్‌కు అందరూ ఫిదా అయిపోయారు. 'పూరన్‌ పోలి ఘర్ ఆఫ్ భాస్కర్' త్వరలోనే నాణ్యత ,అభిరుచికి పర్యాయపదంగా మారింది. కట్‌ చేస్తే భాస్కర్ సంస్థ కర్ణాటకలోనే 17 అవుట్‌లెట్‌లు,10 కి పైగా ఫ్రాంచైజీలతో వ్యాపారం చేస్తున్నాడు. పెరుగుతున్న డిమాండ్‌ను ప్రతిబింబంగా ప్రతీ ఎనిమిది నెలలకో అవుట్‌లెట్‌ను ప్రారంభిస్తాడు. చాలా సాదా సీదాగా వీధి వెంచర్‌గా ప్రారంభమైన ఈ వ్యాపారం, ఇప్పుడు నెలవారీ ఆదాయాన్ని 18 కోట్లకు పైగా ర్జిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో 3.6 కోట్ల నికర లాభాన్ని సాధించడం విశేషం.. 'పురాన్‌పోలి ఘర్ ఆఫ్ భాస్కర్' విజయం భాస్కర్ పాక నైపుణ్యానికి మాత్రమే కాకుండా అతని వ్యాపార చతురతకు కూడా ఒక అద్భుతమైన ఉదాహరణ. రుచిలోనూ, నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా పట్టుదల ,అంకితభావంతో నిరంతరం అనేక కొత్త ఉత్పత్తులు, కొత్త రుచులతో ఇష్టమైన బ్రాండ్‌గా అవతరించింది. ఇదంతా కె.ఆర్. భాస్కర్ అచంచలమైన సంకల్పశక్తికి నిదర్శనం.చదవండి: Operation Sindoor : అంబానీ లెక్క అది...తొలి సంస్థగా రిలయన్స్‌!

Kommineni Srinivasa Rao Comments On Revanth Reddy8
చంద్రబాబు బాటలో​నే రేవంత్‌.. ఇదేం రాజకీయం!

ఆర్థిక పరిస్థితులపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రేవంత్‌ వ్యాఖ్యల్లో వాస్తవమున్నప్పటికీ ఆయన కూడా తన రాజకీయ గురువు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి బాటే పట్టారేమో అనిపిస్తుంది. ఎన్నికల ముందు ఆకాశం మీ చేతుల్లోకి తెచ్చేస్తానన్న రీతిలో హామీలివ్వడం.. తీరా అధికారం చేపట్టిన తరువాత ఖజానా చూస్తే హామీల అమలుపై భయమేస్తోందని సన్నాయి నొక్కులు నొక్కడంలో చంద్రబాబు ఆరితేరిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు రేవంత్‌ కూడా అదే మాదిరిగా.. అప్పులు కూడా పుట్టడం లేదని చెబుతున్నట్లు అనిపిస్తోంది.నిజానికి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఇంత బహిరంగంగా మాట్లాడడం సరికాకపోవచ్చు. వాస్తవాలు చెబుతున్న కారణంగా అంతా సర్దుకు పోతారని ఆయన భావన కావచ్చు. కాని దీనివల్ల రాష్ట్రం పరపతి దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకూ ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా మాట్లాడి ఉండకపోవచ్చు. తెలుగు రాష్ట్రాలకు అప్పులు నిజంగానే పుట్టడం లేదా అంటే ఆంధ్రప్రదేశ్‌లో పదకుండు నెలల్లోనే రూ.1.5లక్షల కోట్ల అప్పు చేస్తే, తెలంగాణలో రూ.1.58 లక్షల కోట్ల అప్పు చేశారు. అదనంగా అప్పులకు వెళితే ఇస్తున్నట్లు లేరు. దేనికైనా పరిమితులు ఉంటాయి. తోచినట్లు వాగ్దానాలు చేసి,అధికారంలోకి వచ్చాక ఇప్పుడు అప్పులు పుట్టడం లేదని, బ్యాంకులు తమను దొంగల్లా చూస్తున్నాయని అంటే ప్రజలు ఏమని అనుకుంటారు? తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులకు అప్పాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదని, తీరు చూస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోతారేమో అన్నట్లుగా పరిస్థితి దేశం ముందట ఉందని రేవంత్ అన్నారు.ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు. దీనికంతటికి గత ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యుడని రేవంత్ చెప్పవచ్చు. కాని అది పరిష్కారం కాదు. సరైన జవాబు కాదు. ఎందుకంటే ఎన్నికలకు ముందే రాష్ట్ర అప్పులపై రేవంత్ కాని, ఇతర కాంగ్రెస్ నేతలు కాని అనేక విమర్శలు చేశారు. అయినా అధికారం రాబట్టుకోవడం కోసం ఎన్ని అసాధ్యమైన హామీలు ఇచ్చారో గుర్తులేదా? ఆరు గ్యారంటీలకు ఎంత ఖర్చు అవుతుందో తెలియకుండానే వాగ్దానం చేశారా? అలా చేస్తే అది బాధ్యతారాహిత్యం కాదా? అదేమంటే రేవంత్ ఇచ్చిన సమాధానం చూడండి. ప్రతి సంవత్సరం మూడు లక్షల కోట్ల బడ్జెట్ పెడుతున్నారు. మూడు లక్షల కోట్ల ఆదాయం వస్తుంది కాబట్టి ఇదెంత సంసారం. చక్కదిద్దవచ్చని అనుకున్నానని ఆయన చెప్పారు. తీరా చూస్తే మూడు లక్షల కోట్ల ఆదాయం లేదు.. రెండు లక్షల కోట్లే ఆదాయం, అప్పు ఎనిమిది లక్షల కోట్లు ఉంది అని ఆయన వివరిస్తున్నారు.సరిగ్గా చంద్రబాబు కూడా ఏపీలో ఇలాగే మాట్లాడారు. తనకు ఎన్నికల ముందు అన్నీ ఇవ్వవచ్చని అనుకున్నానని, కాని లోపలికి వెళ్లి చూస్తే ఏమీ లేదని, ఖజానా ఖాళీగా కనబడస్తా ఉందని చంద్రబాబు చెప్పారు. ఎన్నికలకు ముందు రూ.14 లక్షల కోట్ల అప్పు ఉందని ప్రచారం చేసిన చంద్రబాబు తీరా బడ్జెట్‌లో రూ. ఆరున్నర లక్షల కోట్లే ఉందని అంగీకరించారు. అయినా హామీలు అమలు చేయకుండా ఎగ్గొట్టడానికి ఈ కబుర్లు చెబుతున్నారన్న సంగతి ఏపీ ప్రజలకు అర్థమైంది. అదే ధోరణిలో రేవంత్ కూడా ఎన్నికలకు ముందు వంద రోజులలో అన్ని హామీలు చేసి చూపిస్తామని, రైతులకు రూ.రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని, ఎవరైనా అప్పు చేయకపోతే బ్యాంకులకు వెళ్లి అప్పు తీసుకోండని చెప్పారా? లేదా? అది బాధ్యతారాహిత్యం కాదా? ఇప్పుడేమో తాను 18 గంటలు కష్టపడుతున్నానని, ఒక్క రోజైనా, ఒక్క గంట సెలవైనా తీసుకోలేదని సానుభూతి కోసం మాట్లాడుతున్నారు. నిజానికి ఏ సీఎం అయినా 18 గంటలు పనిచేస్తున్నానని చెబితే ఆ ప్రభుత్వం పద్దతిగా లేదని అర్థం.ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరి బాధ్యతలు వారికి ఉంటాయి. మిగిలినవారిని పని చేయనివ్వకుండా తానే పని చేస్తున్నానని చెప్పుకోవడానికి ఇలాంటి మాటలు పనికి వస్తాయి తప్ప జనానికి ఏమి ఉపయోగం? ఇది కూడా చంద్రబాబు తరహా మాటే.ఆయన కూడా తాను ఎంతలా కష్టపడుతున్నది పదే, పదే జనానికి చెబుతుంటారు. రేవంత్ కొత్తగా సీఎం అయి ఉండవచ్చు.ఆయన కొన్ని వాగ్దానాలు అమలు చేయడానికి ప్రయత్నం చేయకపోలేదు. అయినా అన్నిటిని అమలు చేయడం కష్టం కనుక ఈ కొత్తరాగం ఎత్తుకున్నారు. అప్పులు, వాయిదాలకే రూ.7500 కోట్లు అవుతున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వంటివారు రేవంత్‌కు మద్దతుగా మాట్లాడుతున్నా, అవి అంత కన్విన్సింగా కనిపించవు. ఏ ప్రభుత్వం ఉన్నా, రుణాలు చెల్లించవలసిందే కదా! ఒక్కసారి గతానికి వెళితే చంద్రబాబు నాయడు 1996 లోక్ సభ ఎన్నికలకు ముందు టీడీపీ అత్యధిక లోక్ సభ స్థానాలు గెలిస్తేనే కిలో రెండు రూపాయల బియ్యం, మద్య నిషేధం, మొదలైనవి కొనసాగుతాయని ప్రచారం చేశారు.ఎన్నికలు అయ్యాక మాత్రం రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేదని, మార్పులు చేయాలని, బియ్యం రేట్లు పెంచాలని, మద్య నిషేధం ఎత్తివేయాలంటూ ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో ఒక తంతు సాగించారు. ప్రతి ఎన్నికకు ముందు ఇదే తతంగం ఆయన సాగిస్తుంటారు. 2014లో రైతుల రుణమాఫీ పూర్తిగా చేస్తానని, బ్యాంకులలో తనఖాలో ఉన్న రైతుల భార్యల బంగారం కూడా విడిపిస్తానని చెప్పారు. అధికారంలోకి వచ్చాక ఆయన ఏదో అరకొర చేసి చేతులెత్తేశారు. 2024లో కూడా సూపర్ సిక్స్ అంటూ మరోసారి జనాన్ని మభ్య పెట్టడానికి వెనుకాడలేదు. ఈ రకంగా గురు, శిష్యులైన తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్దరూ ఒకే బాటలో పయనించడం విశేషం.ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి రేవంత్ చేసిన వ్యాఖ్యలు కూడా అంత సహేతుకంగా అనిపించవు. తమ డిమాండ్లు నెరవేర్చాలన్న ఉద్యోగ సంఘాలను ఉద్దేశించి ఎవరిపై మీ సమరం అంటూ ఆగ్రహం వ్యక్తం చేయడం వల్ల ఏమి ప్రయోజనం? తెలంగాణ రాష్ట్రం దివాళా తీయడానికి ఉద్యోగులు బాధ్యులు అవుతారా? లేక పాలన చేస్తున్న నేతలా?‘‘నన్ను కోసినా రూపాయి రాదు..ప్రభుత్వం అంటే నేను ఒక్కడినే కాదు..ప్రజా ప్రతినిధులు,, ప్రభుత్వ ఉద్యోగులు అంతా కలిస్తేనే ప్రభుత్వం’’ అంటూ సూత్రాలు చెబితే ఏమి లాభం. రేవంత్ ఒక్కసారి కాంగ్రెస్ మానిఫెస్టోని తిరిగి చదువుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్ని రకాల హామీలు ఇచ్చింది మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్‌ చదివి వినిపించారు. వాటన్నిటిని ఏ బాధ్యతతో చేశారు? ఇప్పుడు వాటిని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు అడిగితే ‘‘ఎవరిపై మీ సమరం?’’ అంటే వారేమి జవాబు ఇస్తారు! ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని, తదితర వాగ్దానాలు చేశారా? లేదా? రేవంత్ తాను అన్ని నిజాలే చెప్పినట్లు అనుకోవచ్చు.కాని అది చెప్పిన తీరు బాగోలేదు. ఉద్యోగ సంఘాలను పిలిపించుకుని అంతరంగికంగా చర్చలు జరిపి వారికి నచ్చ చెప్పి ఉండవచ్చు. ఫలానా సమయానికి తాను హామీలు అమలు చేయగలుగుతామని చెప్పి ఉండవచ్చు. అలా కాకుండా ఇంత బహిరంగంగా వేరే కార్యక్రమంలో ఉద్యోగులను బెదిరించే రీతిలో మాట్లాడడం వల్ల ఆయనకే నష్టం. రేవంత్ తీరువల్ల రాష్ట్ర పరువు పోయిందని బీఆర్‌ఎస్‌, బీజేపీలు తీవ్ర అభ్యంతరం చెబుతున్నాయి. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఇతర బీజేపీ నేతలు ముఖ్యమంత్రి పై మండిపడ్డారు. ఒక్క మాటలో చెప్పాలంటే రేవంత్ తాను నిజాలే మాట్లాడుతున్నానులే అనుకుని సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లుగా అనిపిస్తుంది. ఈ సీఎంకు చేతకావడం లేదని ప్రజలు అనుకునే పరిస్థితి వస్తుంది. కాంగ్రెస్‌లో కూడా దీనిపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతాయి.కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదులు వెళతాయి. కుల గణన ద్వారా తెలంగాణ దేశానికి రోల్ మోడల్ అయిందని ప్రచారం చేసుకున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ దివాళా తీసిందని చెప్పడం ద్వారా దేశానికి ఏమి సంకేతం ఇచ్చినట్లయింది? అసలే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలలో రేటింగ్ తగ్గుతోందని అనుకుంటున్న తరుణంలో రేవంత్ రెడ్డే దానిని మరింత తగ్గించుకున్నట్లుగా ఉంది. ఎన్నికలకు ముందు పొలిటికల్ సైన్స్, ఎన్నికల తర్వాత ఎకనామిక్స్ చెబితే జనం నమ్ముతారా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

T20 Mumbai League 2025 Auction: Atharva Ankolekar Is The Most Expensive Player9
ఐపీఎల్‌ ఆడుతుండగానే మరో జాక్‌పాట్‌ కొట్టిన సీఎస్‌కే చిచ్చరపిడుగు

సీఎస్‌కే చిచ్చరపిడుగు ఆయుశ్‌ మాత్రే ఐపీఎల్‌ 2025 ఆడుతుండగానే మరో జాక్‌ పాట్‌ కొట్టాడు. నిన్న (మే 7) జరిగిన ముంబై టీ20 లీగ్‌ వేలంలో మాత్రేకు భారీ ధర దక్కింది. మాత్రేను ట్రయంప్‌ నైట్స్ ముంబై నార్త్ ఈస్ట్ ఫ్రాంచైజీ రూ. 14.75 లక్షలకు సొంతం చేసుకుంది. ఈ వేలంలో మాత్రే నాలుగో ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. వేలంలో అత్యధిక మొత్తం అథర్వ అంకోలేకర్‌కు దక్కింది. అంకోలేకర్‌ను ఈగల్‌ థానే స్ట్రయికర్స్‌ ఫ్రాంచైజీ రూ. 16.25 లక్షల ధరకు సొంతం​ చేసుకుంది. అంకోలేకర్‌ తర్వాత అత్యధిక బిడ్డింగ్‌ ముషీర్‌ ఖాన్‌, సాయిరాజ్‌ పాటిల్‌కు దక్కింది. ముషీర్‌ను ఏఆర్‌సీఎస్‌ అంధేరి.. సాయిరాజ్‌ను ఈగల్‌ థానే స్ట్రయికర్స్‌ రూ. 15 లక్షలకు దక్కించుకున్నాయి.వీరి తర్వాత వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా కేకేఆర​ ప్లేయర్‌ అంగ్‌క్రిష్‌ రఘువంశీ నిలిచాడు. రఘువంశీని ముంబై ఫాల్కన్స్‌ రూ. 14 లక్షలకు దక్కించుకుంది. షమ్స్‌ ములానీకి 14 లక్షలు, సూర్యాంశ్‌ షేడ్గేకు రూ. 13.75 లక్షలు లభించాయి.కాగా, ముంబై టీ20 లీగ్‌ ఆరేళ్ల విరామం తర్వాత మళ్లీ ఈ ఏడాది ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. ఈ ఎనిమిది జట్లు నిన్న జరిగిన వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. ఒక్కో జట్లు గరిష్ఠంగా 18 మంది ఆటగాళ్లు ఉన్నారు. ప్రతి జట్టు ఓ ఐకాన్‌ ఆటగాడిని ఎంపిక చేసుకుంది. ఐకాన్‌ ఆటగాడికి రూ. 20 లక్షలు లభిస్తాయి. సూర్యకుమార్‌ యాదవ్‌ (ముంబై నార్త్‌ ఈస్ట్‌), అజింక్య రహానే (బాంద్రా బ్లాస్టర్స్‌), పృథ్వీ షా (ముంబై పాంథర్స్‌), శ్రేయస్‌ అయ్యర్‌ (ముంబై ఫాల్కన్స్‌),శివమ్‌ దూబే (అంధేరి), శార్దూల్‌ ఠాకూర్‌ (థానే స్ట్రయికర్స్‌), సర్ఫరాజ్‌ ఖాన్‌ (ముంబై సబర్బ్స్‌), తుషార్‌ దేశ్‌పాండే (మరాఠ రాయల్స్‌) ఐకాన్‌ ప్లేయర్స్‌గా ఎంపికయ్యారు. ఈ లీగ్‌ మే 26 నుంచి జూన్‌ 8 వరకు ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగనుంది.జట్ల వివరాలు..ట్రయంఫ్ నైట్స్ ముంబై నార్త్ ఈస్ట్ ఐకాన్ ప్లేయర్: సూర్యకుమార్ యాదవ్ (20 లక్షలు) ప్లేయర్స్: సిధాంత్ ఆధత్రావ్ (7.75 లక్షలు), ఆయుష్ మాత్రే (14.75 లక్షలు), సూర్యాంశ్ షెడ్గే (13.75 లక్షలు), పరీక్షిత్ వల్సంకర్ (7.25 లక్షలు), జే జైన్‌ (4 లక్షలు), హృషికేశ్‌ గోరే (3.40 లక్షలు), ఆకాష్ పవార్ (3 లక్షలు), శ్రేయాస్ గురవ్ (3 లక్షలు), భరత్ సుదమ్ పాటిల్ (2 లక్షలు), మకరంద్ పాటిల్ (2 లక్షలు)బాంద్రా బ్లాస్టర్స్ ఐకాన్ ప్లేయర్: అజింక్యా రహానే (20 లక్షలు) ప్లేయర్లు: సువేద్ పార్కర్ (8.50 లక్షలు), ఆకాశ్ ఆనంద్ (8.25 లక్షలు), రాయ్‌స్టన్‌ డయాస్‌ (7 లక్షలు), కర్ష్‌ కొఠారి (5 లక్షలు), తుషార్ సింగ్ (3 లక్షలు), అథర్వ పూజారి (3 లక్షలు), ఓం కేష్‌కామత్ (3.20 లక్షలు), ధనిత్ రౌత్ (4.60 లక్షలు), నమన్ పుష్పక్ (3 లక్షలు), పార్థ్ అంకోలేకర్ (3 లక్షలు), అతిఫ్ హబీబ్ అత్తర్వాలా (6.25 లక్షలు), ద్రుమిల్ మత్కర్ (7.25 లక్షలు), మహ్మద్ అదీబ్ వాసియుల్ ఉస్మాని (2.70 లక్షలు)నార్త్ ముంబై పాంథర్స్ ఐకాన్ ప్లేయర్: పృథ్వీ షా (20 లక్షలు)ప్లేయర్స్: తనుశ్‌ కోటియన్‌ (10 లక్షలు), మోహిత్ అవస్తీ (10.50 లక్షలు), ఖిజార్ దఫేదార్ (5.50 లక్షలు), దివ్యాంష్ సక్సేనా (5.25 లక్షలు), అభిజ్ఞాన్ కుందు (5 లక్షలు), ఆయుష్ వర్తక్ (6.25 లక్షలు), సౌరభ్ సింగ్ (3 లక్షలు), హర్షల్ జాదవ్ (5 లక్షలు), ప్రిన్స్ దేవాంగ్ షైక్ (2 లక్షలు), షాలిక్ జౌక్‌ల్ (2 లక్షలు), అలీమ్ (3.40 లక్షలు), ముజామిల్ కద్రి (2 లక్షలు)SoBo ముంబై ఫాల్కన్స్ ఐకాన్ ప్లేయర్: శ్రేయాస్ అయ్యర్ (20 లక్షలు) ప్లేయర్స్: అంగ్క్రిష్ రఘువంశీ (14 లక్షలు), వినాయక్ భోయిర్ (5.75 లక్షలు), సిద్ధార్థ్ రౌత్ (7 లక్షలు), హర్ష్ అఘవ్ (5.25 లక్షలు), కుష్ కరియా (3 లక్షలు), నిఖిల్ గిరి (3 లక్షలు), ప్రేమ్ దేవ్కర్ (3 లక్షలు), ఆకాశ్ పార్కర్ (11.25 లక్షలు), అమోల్ టార్పురే (3 లక్షలు), ఇషాన్ ముల్చందని (3.40 లక్షలు), మయూరేశ్‌ తండేల్‌ (2 లక్షలు)ARCS అంధేరీ ఐకాన్ ప్లేయర్: శివమ్ దూబే (20 లక్షలు) ప్లేయర్లు: ప్రసాద్ పవార్ (13 లక్షలు), ముషీర్ ఖాన్ (15 లక్షలు), హిమాన్షు సింగ్ (5.50 లక్షలు), అఖిల్ హెర్వాద్కర్ (6.50 లక్షలు), సిద్దిద్ తివారీ (3 లక్షలు), ప్రవార్జా (3 లక్షలు), రజారీ 3 లక్షలు (3 లక్షలు), సాక్షం ఝా (3.60 లక్షలు), ప్రసూన్ సింగ్ (3 లక్షలు), ఐశ్వరీ సర్వే (2 లక్షలు), అజయ్ మిశ్రా (2 లక్షలు), బద్రే ఆలం (2.50 లక్షలు), మొయిన్ ఖాన్ (2 లక్షలు), మోనిల్ సోనీ (2.20 లక్షలు)ఈగిల్ థానే స్ట్రైకర్స్ ఐకాన్ ప్లేయర్: శార్దూల్ ఠాకూర్ (20 లక్షలు) ప్లేయర్లు: శశాంక్ అత్తార్డే (6.50 లక్షలు), సాయిరాజ్ పాటిల్ (15 లక్షలు), అథర్వ అంకోలేకర్ (16.25 లక్షలు), హర్ష్ తన్నా (16.25 లక్షలు), హర్ష్ తన్నా (7.7 లక్షలు), రవీంద్ర కుమార్ యాదవ్ (3.80 లక్షలు), ఆర్యన్ చౌహాన్ (3 లక్షలు), హర్ష్ సలుంఖే (3 లక్షలు), నూతన్ గోయెల్ (3.20 లక్షలు), ఆర్యరాజ్ నికమ్ (2.10 లక్షలు), అమర్త్య రాజే (2 లక్షలు), కౌశిక్ చిఖాలికర్ (2 లక్షలు)ఆకాశ్ టైగర్స్ ముంబయి సబర్బ్స్ ఐకాన్‌ ప్లేయర్: సర్ఫరాజ్ ఖాన్ (20 లక్షలు)ప్లేయర్లు: హార్దిక్‌ తామోర్‌ (8.50 లక్షలు), జే బిస్తా (12 లక్షలు), షమ్స్ ములానీ (14 లక్షలు), సిల్వెస్టర్ డిసౌజా (5 లక్షలు), అయాజ్ అహ్మద్ అఫ్జల్ అహ్మద్ ఖ్ (5.25 లక్షలు), సిద్ధార్థ్ అక్రే (4.60 లక్షలు), అర్జున్ డాని (4.20 లక్షలు), మహమ్మద్ యాసీన్ సౌదాగర్ (3 లక్షలు), జైద్ పాటంకర్ (3.60 లక్షలు), కరణ్ షా (2 లక్షలు), కృతిక్ శంకరప్ప హనగవాడి (2 లక్షలు)ముంబై సౌత్ సెంట్రల్ మరాఠా రాయల్స్ ఐకాన్‌ ప్లేయర్‌: తుషార్‌ దేశ్‌పాండే (20 లక్షలు)ప్లేయర్లు: సిద్దేశ్‌ లాడ్ (10.25 లక్షలు), సచిన్ యాదవ్ (7 లక్షలు), ఆదిత్య ధుమాల్ (7.25 లక్షలు), ఖాన్ అవైస్ నౌషాద్ (4.20 లక్షలు), సాహిల్ జాదవ్ (3 లక్షలు), నమన్ ఝవార్ (3 లక్షలు), మాక్స్‌వెల్ స్వామినాథన్ (4.60 లక్షలు), వరుణ్ రావ్ (3 లక్షలు), రోహన్ ఘాగ్ (3 లక్షలు), అజయ్‌ సింగ్‌ జానూ (2.20 లక్షలు), చిన్మయ్‌ సుతార్‌ (5 లక్షలు), ఇర్ఫాన్‌ ఉమెయిర్‌ (9.25 లక్షలు), పరాగ్ ఖానాపుర్కార్‌ (6 లక్షలు)

Box Office War Between Rajinikanth Coolie And Jr NTR War 210
రజనీ,నాగార్జున... ఎన్టీయార్‌ , హృతిక్‌ ‘వార్‌’ తప్పదా?

భారీ తారాగణం, సాంకేతిక నిపుణులు, భారీబడ్జెట్‌తో రూపొందే సినిమాలు ఎప్పుడూ ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉంటాయి. అలాంటి సినిమాలు రెండు ఒకే సమయంలో విడుదలయే పరిస్థితి ఏర్పడితే అది మరింత ఉత్కంఠ కలిగించేదే. ఒకప్పుడు బాలీవుడ్‌ సినిమాలకూ, దక్షిణాది సినిమాలకు నడుమ ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే సౌత్‌ సినిమాలు పాన్‌ ఇండియా మూవీస్‌గా జాతీయస్థాయిలో సత్తా చాటడం మొదలుపెట్టాయో... అప్పటి నుంచి వీటి మధ్య పోటీ కూడా సినీ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ప్రస్తుతం ఓ బాలీవుడ్‌ సినిమాతో మరో దక్షిణాది సినిమా విడుదల తేదీల మధ్య అలాంటి ఉత్కంఠే నెలకొంది.తమిళ టాప్‌ డైరెక్టర్‌ లోకేష్‌ కనకరాజ్‌ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌తో కూలీ(Coolie) పేరుతో ఓ మాస్‌ ఎంటర్‌టైనర్‌ ను రెడీ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ దాదాపుగా చివరి దశకు వచ్చింది ఈ సినిమాలో నాగార్జున, ఉపేంద్రలు కూడా నటిస్తూండడంతో, ఇది మల్టీ స్టారర్‌ హోదా తెచ్చుకుంది. ఈ భారీ పాన్‌ ఇండియా మూవీ ఆగస్ట్‌ 14న విడుదల చేస్తారని అంచనాలు ఉన్నాయి. నిజానికి కూలీ సినిమా సమ్మర్‌లో రిలీజ్‌ అనుకున్నారు కానీ అది తర్వాత ఆగస్ట్‌కు మారింది. లోకేష్‌ గత సినిమాల కంటే ఈ సినిమాకు ఎక్కువ కేర్‌ తీసుకుంటున్నాడని అందుకే ఈ ఆలస్యం అంటున్నారు.మరోవైపు బాలీవుడ్‌ టాప్‌ హీరో హృతిక్‌ రోషన్, టాలీవుడ్‌ అగ్రనటుడు జూ.ఎన్టీఆర్‌ల సెన్సేషనల్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ చిత్రం వార్‌ 2(War 2) కూడా అదే సమయంలో రిలీజ్‌ అవనుంది. దీనితో కూలీ అనుకున్న టైమ్‌ కి వస్తాడా రాడా అనే సందేహాలు రజనీకాంత్‌ అభిమానుల్లో మొదలయ్యాయి. అన్ని హంగులతో వార్‌ 2 భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. ప్రతిష్టాత్మక సంస్థ యష్‌ రాజ్‌ ఫిలింస్‌ రూపొందిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్, హృతిక్‌ రోషన్‌ జోడీ కట్టడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయ్‌. మేకర్స్‌ ఈ సినిమా విడుదల తేదీ ఆగస్టు 14గా ఇప్పటికే ప్రకటించేశారు. అనుకోని అవాంతరం ఏర్పడితే తప్ప అది మారే అవకాశం కనిపించడం లేదు, సో అదేన రోజు కూలీ వస్తే నేరుగా క్లాష్‌ తప్పదు. రెండు సినిమాల జోనర్‌ వేరువేరు..అయినప్పటికీ... ఒకవేళ కూలీ నిజంగానే ఆగస్ట్‌ 14న వస్తే, బాక్సాఫీస్‌ వద్ద సీనియర్స్‌ వర్సెస్‌ జూనియర్స్‌ యుద్ధం జరుగుతుందని అనొచ్చు. ఒకవైపు రజినీకాంత్, నాగార్జున, ఉపేంద్ర వంటి సీనియర్‌ హీరోలు మరోవైపు ఎన్టీఆర్, హృతిక్‌ల వంటి ఆ తర్వాతి తరం హీరోల మధ్య ఈ పోటీ ఫ్యాన్స్‌ కు సినీ పండితులకు ఖచ్చితంగా సెంట్రాఫ్‌ టాపిక్స్‌ అవుతుంది అంతేకాదు, పాన్‌ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునేలా రెండు సినిమాలు ఒకేసారి విడుదల అయ్యి కలెక్షన్ల వేట మొదలుపెడితే అది కొత్త రికార్డ్స్‌ క్రియేట్‌ చేసే అవకాశాలూ లేకపోలేదు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement