Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

PM Narendra Modi Strong Message To Army On Pak Escalation1
పాక్‌ తూటాలకు... క్షిపణులతో బదులివ్వండి

న్యూఢిల్లీ: సీమాంతర ఉగ్రవాదం పట్ల భారత్‌ ప్రతిస్పందన ఇకపై సరికొత్త రీతిలో ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ తేల్చిచెప్పారు. ‘‘పాక్‌తూటాలకు కచ్చితంగా క్షిపణులతో సమాధానం చెప్పండి. అది చేపట్టే ఒక్కో దుశ్చర్యకూ కలలో కూడా ఊహించనంత బలంగా బదులివ్వండి’’ అని సైనిక దళాలను ఆదేశించాశారు. త్రివిధ దళాల అధినేతలతో ఆయన ఆదివారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్, చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్, విదేశాంగ కార్యదర్శి విక్రం మిస్రీ తదితరులు పాల్గొన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌పై విస్తృతంగా చర్చించారు. పాక్‌ దాడులను సహించడానికి ఏ మాత్రమూ వీల్లేదంటూ మోదీ స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లు రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదంపై, ముష్కరులపై ‘ఆపరేషన్‌ సిందూర్‌’ ఇంకా ముగియలేదని స్పష్టంచేశారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే చెల్లించాల్సిన మూల్యం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. కశ్మీర్‌ అంశంలో విదేశీ మధ్యవర్తిత్వాన్ని అంగీకరించేది లేదని పునరుద్ఘాటించారు. పాకిస్తాన్‌తో జరిగే ఏ చర్చలైనా సరే కేవలం పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీఓకే)ను, పాక్‌లో దాక్కున్న ఉగ్రవాదులను భారత్‌కు అప్పగించడంపైనే ఉంటాయని కేంద్రం తేల్చిచెప్పింది. చట్టవిరుద్ధంగా ఆక్రమించుకున్న పీఓకేను, ఉగ్రవాద మూకలను భారత్‌కు అప్పగించాల్సిందేనని, పాక్‌కు మరో గత్యంతరం లేదని స్పష్టం చేసింది. ‘‘ఆ దేశంతో చర్చలు వీటిపై మాత్రమే జరుగుతాయి. అది కూడా కేవలం డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మిలటరీ ఆపరేషన్స్‌ (డీజీఎంఓ) స్థాయిలో మాత్రమే కొనసాగుతాయి’’ అని కేంద్రం ఉద్ఘాటించింది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ సహా ఉగ్రవాదుల అప్పగింతపై తప్ప మరో అంశంపై చర్చించే ప్రసక్తే లేదని తెలిపింది. ఉగ్రవాదానికి పాక్‌ మద్దతు కొనసాగుతున్నంత కాలం సింధూ నది జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం తథ్యమని పేర్కొంది. విదేశాంగ మంత్రులు, లేదా జాతీయ భద్రతా సలహాదారుల స్థాయిలో చర్చలు జరగాలని పాక్‌ ప్రతిపాదిస్తుండగా అందుకు భారత్‌కు అంగీకరించడం లేదు.దాడి చేస్తే గట్టిగా ఎదురుదెబ్బజేడీ వాన్స్‌కు మోదీ స్పష్టీకరణ న్యూఢిల్లీ/వాషింగ్టన్‌: పాకిస్తాన్‌ ఒకవేళ భారత్‌పై మళ్లీ దాడికి దిగితే అంతకంటే గట్టిగానే ఎదురుదెబ్బ తీస్తామని అమెరికాకు మోదీ తేల్చిచెప్పారు. తమ ప్రతిస్పందన అత్యంత తీవ్రస్థాయిలో, దాయాదికి వినాశకరంగా ఉంటుందని స్పష్టంచేశారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ శనివారం మోదీతోఫోన్‌లో మాట్లాడారు. కాల్పుల విరమణ ఒప్పందం గురించి ప్రస్తావించారు. అనంతరం విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్, పాక్‌ ఆర్మీ చీఫ్‌ అసిం మునీర్‌తో కూడా వాన్స్‌ చర్చించారు. పాక్‌ కాల్పులు ఆపితేనే సంయమనం పాటిస్తామని అమెరికాకు భారత్‌ తేల్చిచెప్పినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. భారత్‌–పాక్‌ ఘర్షణల గురించి అమెరికా నిఘా వర్గాల నుంచి ఆందోళనకరమైన సమాచారం అందిన కారణంగానే మోదీ తో వాన్స్‌ మాట్లాడారని సమాచారం. సున్నితమైన అంశం కావడంతో బయటకు వెల్లడించలేదని మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఆర్మీ కమాండర్లకు పూర్తి స్వేచ్ఛ పాక్‌ దాడులను తిప్పికొట్టాలని ఆర్మీ చీఫ్‌ ఉపేంద్ర ద్వివేది ఆదేశం న్యూఢిల్లీ: సరిహద్దుల్లో పాకిస్తాన్‌ సైన్యం దాడులకు దిగితే గట్టిగా ప్రతిస్పందించాలని, తగిన రీతిలో బుద్ధి చెప్పాలని ఆర్మీ కమాండర్లకు సైన్యాధిపతి జనరల్‌ ఉపేంద్ర ద్వివేది ఆదేశాలు జారీ చేశారు. దాడులను తిప్పికొట్టే విషయంలో వారికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు అధికార వర్గాలు తెలియజేశాయి. సైనిక చర్యలు నిలిపివేస్తూ అంగీకారానికి వచ్చినట్లు భారత్, పాక్‌ శనివారం ప్రకటించడం తెలిసిందే. అయినప్పటికీ పాక్‌ సైన్యం కవి్వంపు చర్యలకు పాల్పడింది. శనివారం రాత్రి సరిహద్దుల్లో కాల్పులు జరపగా, భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. ఈ పరిణామాలపై ఆర్మీ చీఫ్‌ ఉపేంద్ర ద్వివేది సమీక్ష జరిపారు. మరోసారి పాక్‌ సైన్యం కాల్పులకు గట్టిగా ప్రతిస్పందించాలని ఆదేశించారు. ఈ విషయంలో ఆర్మీ కమాండర్లకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు ఆయన తేల్చిచెప్పారు.

AP Farmers reject land acquisition for Sports City: Andhra Prades2
మా బతుకులతో ‘ఆడుకోవద్దు’

భూమితో మాది విడదీయరాని అనుబంధం.. వ్యవసాయం తప్పితే మాకు వేరే వృత్తి తెలియదు.. తక్కువో ఎక్కువో ఉన్నదాంట్లోనే పంటలు పండించుకుంటున్నాం, గుట్టుగా బతుకుతున్నాం.. కన్నతల్లి లాంటి భూమిని మానుంచి లాక్కుని మా జీవితాలతో ఆటలాడొద్దు.. గతంలో భూ సమీకరణకు తీసుకున్న భూములకే ఇప్పటికీ దిక్కూమొక్కు లేదు.. ఇప్పుడు మా నుంచి తీసుకున్న భూమికి ఎప్పుడు న్యాయం చేస్తారు? కళ్లముందు ఉన్న భూమిని పోగొట్టుకుని.. ఎక్కడో ఇచ్చే భూమి మాకెందుకు? – స్పోర్ట్స్‌ సిటీ భూసమీకరణ గ్రామసభల్లో రైతులుసాక్షి ప్రతినిధి, విజయవాడ: రైతులు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నా, మా భూములు ఎందుకివ్వాలని నిలదీస్తున్నా, తమ జీవితాలతో ఆడుకోవద్దని వేడుకుంటున్నా, స్పోర్ట్స్‌ సిటీ పేరుతో భూ సమీకరణ ద్వారా భారీఎత్తున భూములను తీసుకునేందుకే ప్రభుత్వం సిద్ధమవుతోంది. అన్నదాతలు ససేమిరా అంటున్నా.. మాయమాటలతో మభ్యపెట్టి ముందుకు అడుగులు వేస్తోంది. ఇందులోభాగంగానే అధికారులు గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. వీటిలో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయినా సరే సర్కారు తన ధోరణిని మార్చుకోవడం లేదు.ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు, త్రిలోచనాపురం, కాచవరం, కేతనకొండ, జమీమాచవరంలో స్పోర్ట్స్‌ సిటీకి అవసరమైన భూములను ల్యాండ్‌ పూలింగ్‌ పద్ధతిలో తీసుకునేందుకు రెవెన్యూ అధికారులు గ్రామ సభలు ఏర్పాటు చేశారు. వాస్తవానికి స్పోర్ట్స్‌ సిటీకి తొలుత కృష్ణా నది లంక గ్రామాలు, లంక భూములను ప్రభుత్వ పెద్దలు ఎంచుకున్నారు. నెల రోజుల క్రితం కృష్ణా పరీవాహక ప్రాంతమైన చినలంక, పెదలంక, ఇబ్రహీంపట్నం, జూపూడిలో లంక భూములను మున్సిపల్‌ శాఖ మంత్రి పి.నారాయణ, ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ, పలువురు ఎమ్మెల్యేలు పరిశీలించారు. కానీ, ఈ భూములకు కృష్ణా వరద తాకిడి ఉంటుందనే కారణంతో తాజాగా మూలపాడు పరిధిలోని మెరక ప్రాంత భూములపై కన్నేశారు.అయితే, స్పోర్ట్స్‌ సిటీ, ఐకానిక్‌ బ్రిడ్జి పేరుతో విలువైన, జీవనాధారమైన భూములను తీసుకునేందుకు ప్రభుత్వం పన్నిన పన్నాగాన్ని రైతులు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. స్పోర్ట్స్‌ సిటీ పేరుతో వ్యాపారం చేసేందుకే తమ భూములను తీసుకుంటున్నారనే అభిప్రాయం రైతుల్లో నెలకొంది. దీంతో పంట పొలాలను ఇవ్వబోమని విజయవాడ ఆర్డీవో కావూరి చైతన్య ఎదుట తెగేసి చెప్పారు. వారు ఒప్పుకోకున్నా ఏదోరకంగా భూములు స్వా«దీనం చేసుకునే ఎత్తుగడల్లో ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. ఒప్పుకోకున్నా ఒప్పుకొన్నట్లు.. రైతుల అభిప్రాయ సేకరణకు రెవెన్యూ అధికారులు గురు, శుక్రవారాల్లో గ్రామ సభలు నిర్వహించారు. మూలపాడు సభలో కొందరు భూములు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు కూటమి నేతలు ప్రకటించారు. కానీ, వెంటనే 90 శాతం మంది రైతులు ల్యాండ్‌ పూలింగ్‌లో భూములు ఇవ్వబోమని తహసీల్దార్‌ వెంకటేశ్వర్లుకు తెగేసి చెప్పారు. అమరావతి రాజధానినే ఇప్పటివరకు అభివృద్ధి చేయలేదని ఇక తమ ప్రాంతాన్ని ఎప్పుడు అభివృద్ధి చేస్తారని సూటిగా ప్రశి్నంచారు. వ్యవసాయమే జీవనాధారంగా బతికే తాము పొలాలను ఎలా ఇస్తామని నిలదీశారు. భూమి మా చేతిలో ఉంటేనే బంగారంజమీమాచవరంలో సభకు హాజరైన రైతులు అందరూ ల్యాండ్‌ పూలింగ్‌లో భూములిచ్చేది లేదని తేల్చి చెప్పారు. కాచవరం, కేతనకొండ గ్రామ సభల్లో ఆర్డీవో కావూరి చైతన్య పాల్గొన్నారు. కాచవరంలో ఒకరిద్దరు భూస్వాములు మినహా మిగిలిన రైతులు ప్రభుత్వానికి పొలాలు ఇవ్వబోమని ప్రకటించారు. కేతనకొండలో రైతులు నిరసనగా చప్పట్లు కొడుతూ మరీ పొలాలు ఇచ్చేది లేదని వెల్లడించారు. ‘భూమి మా ఆధీనంలో ఉంటే పిల్లల చదువులు, వివాహాలు, కుటుంబ అవసరాలకు వాడుకుంటాం. ప్లాటు ఇవ్వడానికి మరో మూడు నాలుగేళ్లు పడుతుంది. అప్పటివరకు మా అవసరాలు ఎలా తీరతాయి’ అంటూ ఆర్డీవో చైతన్యను రైతులు సూటిగా ప్రశి్నంచారు.2,874 ఎకరాల సేకరణకు ఎత్తుగడ ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నం మండలం ఐదు గ్రామాల పరిధిలోని భూములను ల్యాండ్‌ పూలింగ్‌లో సేకరించేందుకు రెవెన్యూ అధికారులు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన గ్రామ సభల్లో స్పోర్ట్స్‌ సిటీ నిర్మాణానికి గ్రామాల్లో ఉన్న భూముల వివరాలను వెల్లడించారు. మూలపాడులో 313 ఎకరాలు, కాచవరంలో 590 ఎకరాలు, త్రిలోచనాపురంలో 1,390 ఎకరాలు, జమీమాచవరంలో 301 ఎకరాలు, కేతనకొండలో 280 ఎకరాలు చొప్పున మొత్తం 2,874 ఎకరాలను ల్యాండ్‌ పూలింగ్‌లో తీసుకోనున్నారు. వీటిలో ఎక్కువగా పట్టా భూములు ఉండగా, ఎన్‌ఎస్‌పీ కాలువ, ప్రభుత్వ అసైన్‌మెంట్, లంక భూములు కొన్ని ఉన్నాయి. చిన్న, సన్నకారు రైతుల పొట్టకొడతారా? చిన్న, సన్నకారు రైతుల భూములను ల్యాండ్‌ పూలింగ్‌లో తీసుకోవడం దుర్మార్గమైన చర్య. వారి పొట్టకొడతారా? పూలింగ్‌పై ప్రతి గ్రామంలో రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. రెవెన్యూ అధికారుల వద్ద వారి ఆవేదనను వెల్లడించారు. భూములే జీవనాధారం అని కూడా తేల్చిచెప్పారు. మెజార్టీ రైతుల అభిప్రాయం మేరకే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. –గరికపాటి శ్రీదేవి, జెడ్పీ వైస్‌ చైర్మన్, మూలపాడు 3 పంటలు పండే భూములు.. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ఇబ్రహీంపట్నంలో ఎకరా రూ.కోటి నుంచి రూ.2 కోట్ల ధర పలుకుతోంది. మా భూ­ముల్లో ఏడాదికి మూడు పంటలు పండుతాయి. వీటిని ప్రభుత్వానికి ఇచ్చేది లేదు. – ఎస్‌డీ జానీ, పీఏసీఎస్‌ మాజీ చైర్మన్, కేతనకొండ ఉన్నది 80 సెంట్లు.. అదీ తీసుకుంటారా? 80 సెంట్ల భూమిలో వ్యవసాయం చేస్తున్నా. కొంత భాగం పొలంలో గ్రాసం పెంచి పాడి పరిశ్రమను నిర్వహిస్తున్నా. కుటుంబాన్ని పోషించుకుంటున్నా. నాకు వ్యవసాయం తప్ప మరో పని తెలియదు. ఇప్పుడు ఉన్న పొలం తీసు­కుని ప్లాటు ఇస్తామంటే ఎలా? – ఆళ్ల శ్రీనివాసరావు, రైతు, త్రిలోచనాపురం

Rasi Phalalu: Daily Horoscope On 12-05-2025 In Telugu3
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. ఊహలు నిజమవుతాయి

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి: పౌర్ణమి రా.9.03 వరకు, తదుపరి బహుళ పాడ్యమి, నక్షత్రం: విశాఖ పూర్తి (24 గంటలు), వర్జ్యం: ప.11.40 నుండి 1.26 వరకు, దుర్ముహూర్తం: ప.12.21 నుండి 1.13 వరకు, తదుపరి ప.2.56 నుండి 3.48 వరకు అమృతఘడియలు: రా.10.16 నుండి 12.03 వరకు, మహ వైశాఖి, బుద్ధపూర్ణిమ; రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు, యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు, సూర్యోదయం: 5.33, సూర్యాస్తమయం: 6.18. మేషం...... సన్నిహితులు, మిత్రుల సాయం పొందుతారు. ఆస్తి విషయాలలో చికాకులు తొలగుతాయి. వాహన, కుటుంబసౌఖ్యం. వ్యాపారులకు అనుకూలం. ఉద్యోగులకు సమస్యల నుంచి విముక్తి.వృషభం... సన్నిహితులతో సఖ్యత. ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది. వాహనాలు, భూములు కొంటారు. ఆలయ దర్శనాలు. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు. ఉద్యోగులకు బాధ్యతలు తగ్గుతాయి.మిథునం.... ఆకస్మిక ప్రయాణాలు. సోదరులు, మిత్రులతో వివాదాలు. పనుల్లో ఆటంకాలు. అనారోగ్యం. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు కొద్దిపాటి చికాకులు.కర్కాటకం... ప్రయాణాల్లో మార్పులు. అనుకోని ధన వ్యయం. కొన్ని పనులు వాయిదా వేస్తారు. బంధువులతో స్వల్ప వివాదాలు. అనారోగ్యం. వ్యాపారులకు నిరాశ. ఉద్యోగులకు చిక్కులు.సింహం... ఉద్యోగయత్నాలలో విజయం. పరిచయాలు పెరుగుతాయి. అనుకున్నది సాధిస్తారు. దైవచింతన. ధనలాభం. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు ఒత్తిళ్లు తొలగుతాయి.కన్య... బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. వివాదాలకు దూరంగా ఉండండి. ఆలయాల దర్శనాలు. వ్యాపారులకు చిక్కులు. ఉద్యోగులకు ఒత్తిళ్లు.తుల..... చిన్ననాటి మిత్రులతో సఖ్యత. ఆస్తి విషయాలలో అగ్రిమెంట్లు. ధన,వస్తులాభాలు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు ఉన్నతస్థితి. వాహనయోగం.వృశ్చికం..... ఆరోగ్య, కుటుంబసమస్యలు. వ్యాపారులకు నిరుత్సాహం. చేపట్టిన పనులు ముందుకు సాగవు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపారులు నిదానంగా వ్యవహరించాలి. ఉద్యోగులకు సామాన్యస్థితి.ధనుస్సు... ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. విలువైన వస్తువులు కొంటారు. ఉద్యోగయత్నాలలో కదలికలు. వ్యాపారులు ముందడుగు. ఉద్యోగులకు అనుకూల మార్పులు. దైవచింతన.మకరం... ఆకస్మిక ధనలాభం. ఊహలు నిజమవుతాయి. మిత్రుల నుంచి శుభవర్తమానాలు. భూ వివాదాలు తీరతాయి. వ్యాపారులు ఉత్సాహంతో సాగుతారు. ఉద్యోగులకు మంచి గుర్తింపు.కుంభం.... కొత్తగా రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారులకు గందరగోళం. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి.మీనం... బంధువులు విమర్శలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య, కుటుంబసమస్యలు. దూరప్రయాణాలు. వ్యాపారులకు లాభాలు స్వల్పమే. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు.

Chandrababu coalition govt cheated in Aarogyasri Aasara Money to Poor4
‘ఆసరా’కు ఎసరు.. బాలింతలకు కొసరు

సాక్షి, అమరావతి: ‘ఆడబిడ్డ నిధి’ కింద 18 ఏళ్లు పైబడిన మహిళలకు ఏటా రూ.18 వేలు ఇస్తాం.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం.. బడికెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15 వేలు చొప్పున తల్లికి వందనం అందిస్తాం’.. అంటూ ఎన్నికలకు ముందు ఎన్నో సాధ్యంకాని హామీలను ఎడాపెడా ఇచ్చేసిన చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చాక వాటిలో ఒక్కటీ అమలుచేయకుండా మహిళలను దగా చేస్తున్నారు. తానిచ్చిన హామీలను అటకెక్కించడమే కాకుండా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో అమలుచేసిన సంక్షేమ పథకాలను సైతం నిర్దాక్షిణ్యంగా ఆపేశారు. ఆరోగ్యశ్రీ కింద బాలింతలకు అందే రూ.ఐదు వేల ఆసరా సాయానికీ మంగళం పాడేశారు. వైఎస్‌ జగన్‌ పాలనలో ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రసవానంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన 24 గంటల్లో డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ (డీబీటీ) విధానంలో బాలింతకు ఆసరా సాయాన్ని ఇచ్చేవారు. కానీ, గతేడాది టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చీ రాగానే ఈ సాయాన్ని పూర్తిగా అటకెక్కించింది. ఇలా ఆరోగ్యశ్రీ ఆసరాకు గండికొట్టి ఏకంగా రూ.5 వేలు చొప్పున బాలింతలకు నష్టం చేకూరుస్తూ.. కేవలం రూ.వందలు విలువచేసే సబ్బు, పౌడర్‌ డబ్బాలతో కూడిన బేబీ కిట్‌ ఇస్తామంటూ ప్రకటించింది.ఐదేళ్లలో 15 లక్షల మందికి అన్యాయం..రాష్ట్రంలో ఏటా ఆరోగ్యశ్రీ పథకం కింద మూడు లక్షలకు పైగా ప్రసవాలు నమోదవుతుంటాయి. ఆరోగ్య ఆసరా పథకం కింద ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన వెంటనే వీరందరికీ గత ప్రభుత్వంలో రూ.5 వేలు చొప్పున బ్యాంకులో జమచేసేవారు. ఈ సాయాన్ని చంద్రబాబు ప్రభుత్వం నిలిపేయడంతో ఏటా మూడు లక్షల చొప్పున లెక్కేసినా 2024–29 మధ్య ఐదేళ్లలో 15 లక్షల మంది మహిళలకు సాయం నిలిచిపోతుంది. అలాగే, ఒక్కొక్కరికి రూ.5 వేలు చొప్పున ఐదేళ్లలో కనిష్టంగా రూ.750 కోట్లను పేద, మధ్యతరగతి బాలింతలు నష్టపోతున్నారు. ఇక టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తోంది. మొదటి ఏడాదిలో రూ.5 వేలు చొప్పున ఇప్పటికే బాలింతలకు దాదాపు రూ.150 కోట్ల మేర కోల్పోయారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండి ఉంటే సక్రమంగా తమకు ఆసరా సాయం అంది ఉండేదని వీరు చెబుతున్నారు. ఇలా పెద్ద మొత్తంలో పేదింటి మహిళలకు నష్టం చేకూర్చి కేవలం రూ.వందలు విలువచేసే కిట్లు పంపిణీకి ప్రభుత్వం ప్రయత్నిస్తుండడంపై వారు దుమ్మెత్తి పోస్తున్నారు.కిట్‌ల కొనుగోలులోనూ లూటీ తంతు?ఇక ఆస్పత్రులకు మందుల సరఫరా.. అత్యవసర వైద్యసేవల కల్పన.. రోగనిర్ధారణ.. ఇలా వివిధ రకాల కాంట్రాక్టులను ఇప్పటికే ప్రభుత్వ పెద్దలు అవినీతిమయంగా మార్చేశారు. అయినవాళ్లు, పెద్ద మొత్తంలో కమీషన్లు ఇచ్చే సంస్థలకే కాంట్రాక్టు కట్టబెట్టడం ద్వారా పెద్ద మొత్తంలో ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు. ఇదే తంతు బేబీ కిట్‌ల కొనుగోలులోనూ చోటుచేసుకునే అవకాశాలున్నాయి. ఇప్పటికే బేబీ కిట్‌లు సరఫరా చేసే ఒకరిద్దరు కాంట్రాక్టర్లు ఓ అమాత్యుడిని కలిసినట్లు తెలిసింది. ఆ అమాత్యుడి సిఫార్సుతో వీరు వైద్యశాఖను సంప్రదించినట్లు సమాచారం.

India tri-service military operation against Pakistan5
పాక్‌ను చావుదెబ్బ కొట్టాం రాజధానిపైనే దాడి చేశాం 

న్యూఢిల్లీ: త్రివిధ బలగాలు నాలుగు రోజుల పాటు చేపట్టిన సంయుక్త ఆపరేషన్‌లో పాకిస్తాన్‌ కోలుకోలేని రీతిలో దెబ్బతిన్నట్టు భారత సైన్యం వెల్లడించింది. పాక్‌ సైన్యం అత్యంత తీవ్రస్థాయిలో నష్టాలు చవిచూసిందని తెలిపింది. ఇకముందు కూడా పాక్‌ ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. మర్చిపోలేని రీతిలో గుణపాఠం చెప్పడం ఖాయమని స్పష్టం చేసింది. ‘‘పాకిస్తాన్‌ విజ్ఞప్తి మేరకే కాల్పుల విరమణకు అంగీకారం కుదిరింది. కానీ గంటల్లోనే ఒప్పందాన్ని ఉల్లంఘించి పాక్‌ సైన్యం కాల్పులు, దాడులకు దిగింది. ఇదే పరిస్థితి కొనసాగితే మన ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుంది. మన బలగాలు అందుకు పూర్తిగా సంసిద్ధంగా ఉన్నాయి. క్షేత్రస్థాయి పరిస్థితిని బట్టి ఎప్పటికప్పుడు దీటుగా స్పందించేందుకు బలగాలకు సైన్యాధ్యక్షుడు పూర్తి అధికారాలిచ్చారు’’ అని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మిలిటరీ ఆపరేషన్స్‌(డీజీఎంఓ) లెఫ్టినెంట్‌ జనరల్‌ రాజీవ్‌ ఘాయ్‌ ప్రకటించారు. డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఎయిర్‌ ఆపరేషన్స్‌(డీజీఏఓ) ఎయిర్‌ మార్షల్‌ ఏకే భారతి, డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ నావల్‌ ఆపరేషన్స్‌(డీజీఎన్‌ఓ) వైస్‌ అడ్మిరల్‌ ఏఎన్‌ ప్రమోద్‌తో కలిసి ఆయన ఆదివారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. ఆపరేషన్‌ సిందూర్, తదనంతరం సరిహద్దు రాష్ట్రాలపై పాక్‌ దాడులు, మన సైనిక ప్రతిచర్య తదితరాల అంశాలను కూలంకషంగా వివరించారు. మొత్తం ఆపరేషన్‌లో ఐదుగురు భారత సైనికులు అమరులైనట్లు వెల్లడించారు. అమర జవాన్లకు, పాక్‌ మతిలేని దాడుల్లో దుర్మరణం పాలైన భారత పౌరులకు ఘనంగా నివాళులు అరి్పంచారు. సైనిక ఆపరేషన్ల గురించి త్రివిధ దళాల అత్యున్నతాధికారులు ఇలా సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించడం అత్యంత అరుదు కావడం విశేషం. ఆ ముష్కరులు హతం ‘‘పలు అత్యాధునిక పాక్‌ యుద్ధ విమానాలను నేలకూల్చాం. మనకున్న సమాచారం మేరకే 40 మందికి పైగా పాక్‌ సైనికులు మరణించారు. 100 మందికిపైగా ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో కరడుగట్టిన ఉగ్రవాదులు యూసుఫ్‌ అజార్, అబ్దుల్‌ మాలిక్‌ రవూఫ్, ముదాసిర్‌ అహ్మద్‌ తదితరులు ఉన్నారు. 1999లో ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానాన్ని హైజాక్‌ చేసినవారు, 2019లో పుల్వామా దాడికి పాల్పనవారు మరణించారు. పాక్, పీఓకేలో తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేశాం. అజ్మల్‌ కసబ్, డేవిడ్‌ హెడ్లీ ఉగ్రవాద శిక్షణ పొందిన కేంద్రాలు నేలమట్టమయ్యాయి. పాక్‌ రాజధాని ఇస్లామాబాద్‌కు కూతవేటు దూరంలోని అతి కీలకమైన చక్లాలా సహా ప్రధాన వైమానిక స్థావరాలన్నీ మన దాడుల్లో కోలుకోలేని విధంగా దెబ్బతిన్నాయి. లాహోర్‌ తదితర సైనిక స్థావరాల్లోని కీలక రాడార్‌ వ్యవస్థలు నేలమట్టమయ్యాయి. ఉగ్రవాదాన్ని సహించే ప్రసక్తే లేదు’’ అని డీజీఎంఓ రాజీవ్‌ ఘాయ్‌ వివరించారు. ఇకపై తమ భూభాగంలో ఏ ప్రాంతమూ సురక్షితం కాదని పాకిస్తాన్‌కు పూర్తిస్థాయిలో తెలిసొచ్చిందన్నారు. ‘‘మనం ఎంతో సంయమనం పాటించాం. కేవలం పాక్‌ ఉగ్రవాద స్థావరాలనే లక్ష్యంగా చేసుకొని కచ్చితత్వంతో కూడిన దాడులు చేశాం. సామాన్య ప్రజల నివాసాలకు ఎలాంటి నష్టం జరగకుండా జాగ్రత్తపడ్డాం. మన దేశ సార్వ¿ౌమత్వం ప్రాదేశిక సమగ్రతకు, పౌరుల భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లినా నిర్ణయాత్మకంగా ప్రతిస్పందిస్తాం’’ అని ఉద్ఘాటించారు. పాకిస్తాన్‌ డీజీఎంఓ శనివారం మధ్యాహ్నం తనతో మాట్లాడారని, దాడులు ఆపాలని కోరారని తెలిపారు. ఉగ్రవాద క్యాంపులు భస్మీపటలం పాక్‌ దాడుల్లో భారత్‌ కూడా యుద్ధ విమానాలు నష్టపోయిందా అని ప్రశ్నించగా, యుద్ధంలో కొన్ని నష్టాలు సహజమని ఎయిర్‌ మార్షల్‌ ఎ.కె.భారతి బదులిచ్చారు. అయితే, ‘‘లక్ష్యాలన్నీ సాధించాం. మన పైలెట్లంతా సురక్షితంగా తిరిగొచ్చారు’’ అని చెప్పారు. ‘‘పాక్‌ యుద్ధ విమానాలు మన భూభాగంలోకి ప్రవేశించకుండా తిప్పికొట్టాం. అయితే, కచ్చితంగా ఎన్ని యుద్ధ విమానాలు కూల్చేశామన్నది ఇప్పుడే బయటపెట్టలేం. పాకిస్తాన్‌ ఎయిర్‌బేస్‌లు, కమాండ్‌ సెంటర్లు, సైనిక మౌలిక సదుపాయాలు, గగనతల రక్షణ వ్యవస్థలను నాశనం చేశాం. పాక్‌ రాజధాని ఇస్లామాబాద్‌ దాకా చొచ్చుకెళ్లాం. అక్కడ వైమానిక స్థావరాన్ని నేలమట్టం చేశాం. ఉగ్రవాదుల క్యాంప్‌లను నామరూపాల్లేకుండా చేయాలన్న లక్ష్యం ఇప్పటికే సాధించాం. ఈ ఫలితాలు మొత్తం ప్రపంచానికి అనుభవంలోకి వస్తాయి’’ అని ఎ.కె.భారతి స్పష్టం చేశారు. పాక్‌ వైమానిక స్థావరాలకు జరిగిన నష్టాన్ని ఫొటోల సాయంతో వివరించారు.పాక్‌ హార్బర్లకు తీవ్ర నష్టం ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా సముద్రంతోపాటు భూఉపరితలంపై నిర్దేశిత లక్ష్యాలపై కచ్చితత్వంతో కూడిన దాడులు చేశామని వైస్‌ అడ్మిరల్‌ ఎ.ఎన్‌.ప్రమోద్‌ చెప్పారు. పాకిస్తాన్‌లో ప్రధానమైన కరాచీలోనూ దాడులు జరిగాయని తెలిపారు. ‘‘పహల్గాం ఉగ్రవాద దాడి అనంతరం మేము అప్రమత్తమయ్యాం. అరేబియా సముద్రంలో లైవ్‌–ఫైరింగ్‌ డ్రిల్స్, లాంచ్‌ టెస్టులు, కాంబాట్‌ ఆపరేషన్‌ డ్రిల్స్‌ నిర్వహించాం. పాకిస్తాన్‌ ముష్కరులకు గుణపాఠం నేర్పాలన్న లక్ష్యంతో మా కార్యాచరణ సిద్ధం చేసుకున్నాం. మన సైనిక దళాలు అరేబియా సముద్రంలో నిత్యం అప్రమత్తంగా ఉన్నాయి. ఎలాంటి విపత్కర పరిణామాలు ఎదురైనా ఢీకొట్టేందుకు సిద్ధమయ్యాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందగానే ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడ్డాం. పాకిస్తాన్‌ సైన్యం దాడులను గట్టిగా తిప్పికొట్టాం. పాక్‌ నావికాదళంపై మన నావికాదళం పైచేయి సాధించింది. పాక్‌ ఎత్తుగడలు గమనిస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాం. ఇండియన్‌ నేవీ దాడుల్లో పాక్‌ హార్బర్లకు తీవ్ర నష్టం వాటిల్లింది. పాక్‌ చర్యల పట్ల మన ప్రతిస్పందన దీటుగా, ప్రణాళికాబద్ధంగా సాగింది’’ అని ఎ.ఎన్‌.ప్రమోద్‌ స్పష్టం చేశారు.

Miss World Contestants for Nagarjunasagar this evening6
నేడు సాగర్‌.. రేపు చార్మినార్‌..

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ సుందరి పోటీల సందర్భంగా తలపెట్టిన కార్యక్రమాలను ముందు నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారమే నిర్వహించనున్నారు. భారత్‌–పాకిస్తాన్‌ మధ్య యుద్ధ వాతావరణం, పోటీదారుల భద్రత నేపథ్యంలో కొన్ని కార్యక్రమాల నిర్వహణపై నిర్వాహకులు తొలుత సందిగ్ధంలో పడ్డారు. ముఖ్యంగా చార్మినార్‌ వద్ద హెరిటేజ్‌ వాక్, అనంతరం పాత నగరంలోని చౌమొహల్లా ప్యాలెస్‌లో స్వాగత విందు కార్యక్రమాలు రద్దు చేసే అంశాన్ని పరిశీలించారు. కానీ ఇప్పుడు వాటిని యధావిధిగా నిర్వహించాలని నిర్ణయించారు. సరిహద్దులో ఉద్రిక్తతలు కొంత తగ్గిన నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఈ కార్యక్రమాలను యధావిధిగా నిర్వహించనున్నారు. స్వాగత విందులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు సినీ, క్రీడారంగ ప్రముఖులు పాల్గొనే అవకాశం ఉంది. ఇక సోమవారం సాయంత్రం పోటీదారులు, విదేశీ ప్రతినిధులు నాగార్జున సాగర్‌ సమీపంలోని బుద్ధవనం పర్యటనకు వెళ్లనున్నారు. బుద్ధ జయంతి సందర్భంగా అక్కడ జరిగే కార్యక్రమాన్ని వారు ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. అక్కడే రాత్రి విందు అనంతరం హైదరాబాద్‌కు బయలుదేరతారు. చార్మినార్‌ నుంచి లాడ్‌బజార్‌ వరకు నడక మంగళవారం సాయంత్రం పోటీదారులు చార్మినార్‌ నుంచి లాడ్‌బజార్‌ వరకు నడుస్తూ పరిసరాలను వీక్షిస్తారు. షాపింగ్‌ చేస్తారు. చార్మినార్‌ చరిత్రను తెలుసుకుంటారు. అనంతరం చౌమొహల్లా ప్యాలెస్‌లో జరిగే స్వాగత విందులో పాల్గొంటారు. ఈ సందర్భంగా సంప్రదాయ వాద్యకచేరీ కొనసాగుతుంది. విందులో ఇంటర్‌ కాంటినెంటల్, తెలంగాణ వంటకాలు విందులో తెలంగాణకు సంబంధించి హైదరాబాద్‌ ధమ్‌ కీ బిర్యానీ, ఖుర్బానీ కా మీఠా, బగారా బైంగన్, పత్తర్‌ కీ ఘోష్, పనీర్‌ టిక్కా, పులావ్, దహీ వడ, పానీపురి, బాదుషా, గులాబ్‌ జామూన్‌ లాంటి వంటకాలు రుచి చూపించనున్నారు. ధమ్‌ కీ బిర్యానీ ఎక్కువ మసాలా ఘాటు లేకుండా తయారు చేయాలని ఆదేశించారు. ఇక యూరప్, ఆఫ్రికా, ఆమెరికా, కరేబియన్, ఆసియా ఓషియానా ప్రాంతాల సుందరీమణులు సైతం ఉన్నందున వారి స్థానిక వంటకాలను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. పోటీల్లో పొల్గొనే సుందరీమణుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నగరంలోని నాలుగు ఫైవ్‌ స్టార్‌ హోటళ్లనుంచి మెనూ తెప్పించి పరిశీలించి, ఒక హోటల్‌కు ఆర్డర్‌ ఇచ్చారు. ఆసియా వంటకాలలో సుషీ (జపాన్‌), డిమ్‌సమ్‌ (చైనా), థాయ్‌ గ్రీన్‌ కర్రీ (థాయ్‌లాండ్‌) వంటివి, యూరోపియన్‌ వంటకాలైన ఇటాలియన్‌ పాస్తా, ఫ్రెంచ్‌ రాటటౌలీ, స్పానిష్‌ పాయెల్లా, అమెరికా ఖండానికి సంబంధించిన మెక్సికన్‌ టాకోస్, బ్రెజిలియన్‌ ఫెయిజోడా, అమెరికన్‌ బార్బెక్యూ రిబ్స్‌ లాంటివి, ఆఫ్రికాకు చెందిన ఇథియోపియన్‌ డోరో వాట్, మొరాకన్‌ టాగిన్, హమ్ముస్‌తో పాటు మెడిటరేనియన్‌ ఫలాఫెల్, క్వినోవా సలాడ్‌ లాంటి వాటిని వడ్డించే వీలుందని సమాచారం. మెనూను మిస్‌ వరల్డ్‌ లిమిటెడ్‌ ప్రతినిధులకు చూపి వారు అనుమతించినవే సిద్ధం చేస్తారని తెలుస్తోంది. మే 26న హైటెక్స్‌లో జరిగే గలా డిన్నర్‌ సందర్భంగా తెలంగాణ ఫుడ్‌ ఫెస్టివల్‌ కూడా ఉంటుందని చెబుతున్నారు.

IPL 2025 set to resume by May 167
16 లేదా 17 నుంచి ఐపీఎల్‌!

న్యూఢిల్లీ: ప్రతీ వేసవిలో మెరుపు క్రికెట్‌ వినోదాన్ని పంచే ఐపీఎల్‌కు ఈసారి ఉద్రిక్త పరిస్థితుల సెగ తగిలింది. భారత్, పాక్‌ల మధ్య డ్రోన్ల యుద్ధంతో లీగ్‌ను వారంపాటు వాయిదా వేశారు. ఇపుడు తాజా కాల్పుల విరమణ నేపథ్యంలో పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్న బీసీసీఐ ఐపీఎల్‌ పునఃప్రారంభానికి ఏర్పాట్లు చేస్తోంది. ఈ వారాంతంలోనే ఆటను తిరిగి ప్రారంభించాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ నెల 16 లేదంటే 17 నుంచి ఐపీఎల్‌ మళ్లీ మొదలవనుంది. ఫైనల్‌ వేదికను కోల్‌కతా నుంచి అహ్మదాబాద్‌కు మార్చే యోచనలో బీసీసీఐ ఉంది. ఈ మార్పునకు వర్ష సూచనే కారణమని తెలిసింది. ఆటగాళ్ల సంసిద్ధత, విదేశీ ఆటగాళ్లను వెంటనే రప్పించే ఏర్పాట్లను వెంటనే పూర్తిచేయాలని రేపటికల్లా ఫ్రాంచైజీలన్నీ రెడీగా ఉండాలని బీసీసీఐ సూచించింది. అన్నీ డబుల్‌ హెడర్‌లేనా? ఈ నెలాఖరుకల్లా ఐపీఎల్‌ను పూర్తిచేయాలని పట్టుదలతో ఉన్న లీగ్‌ పాలకమండలి మిగతా లీగ్‌ మ్యాచ్‌ల్ని డబుల్‌ హెడర్‌ (రోజూ రెండు మ్యాచ్‌ల చొప్పున)లుగా నిర్వహించే ప్రణాళికతో ఉంది. హైదరాబాద్‌లోనే ఆ రెండు ప్లే ఆఫ్స్‌ హైదరాబాద్‌ అభిమానులకు ఎలాంటి నిరాశలేకుండా ముందనుకున్న షెడ్యూల్‌ ప్రకారమే రెండు ‘ప్లేఆఫ్స్‌’ మ్యాచ్‌లు ఉప్పల్‌ స్టేడియంలోనే జరుగుతాయని ఐపీఎల్‌ వర్గాలు తెలిపాయి. తేదీలు మారినా... తొలి క్వాలిఫయర్, ఎలిమినేటర్‌ మ్యాచ్‌లు హైదరాబాద్‌లోనే నిర్వహిస్తారు. అయితే రెండో క్వాలిఫయర్‌ సహా ఫైనల్‌ పోరుకు వేదికైన కోల్‌కతాలోనే వాతావరణ సమస్యలు ఎదురవుతాయని తెలిసింది. ఈ నేపథ్యంలో విజేతను తేల్చే మ్యాచ్‌కు వర్షం అడ్డులేకుండా ఉండేలా అహ్మదాబాద్‌ను ఫైనల్‌ వేదికగా ఖరారు చేసే అవకాశముంది. మొత్తానికి సోమవారం షెడ్యూల్‌పై కసరత్తు పూర్తి చేస్తారని ఐపీఎల్‌ వర్గాలు తెలిపాయి.

Sakshi Guest Column On Sustainable development with peace8
శాంతితోనే స్థిరమైన అభివృద్ధి

ఇరుదేశాల మధ్య చెలరేగిన ఉద్రిక్తతలు కాల్పుల విరమణ ఒప్పందంతో కొంతలో కొంత చల్లబడినప్పటికీ, దక్షిణాసియా అభివృద్ధికి శాశ్వత శాంతి నెలకొనాల్సి ఉంది. దీనికి కావాల్సిన రాజకీయ నాయకత్వ కొరత ఉందన్నది కాదన లేని నిజం. పాకిస్తాన్, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే) నుండి ఉత్పన్నమయ్యే సీమాంతర ఉగ్రవాద దాడులపై తాను ఎలా స్పందిస్తాను అనే అంశాన్ని భారతదేశం సరికొత్తగా నిర్వచించింది. సింపుల్‌గా చెప్పాలంటే భారత్‌ తిరిగి దాడి చేస్తుంది. దీని ప్రకారమే భారత వైమానిక దళం పాకిస్తాన్‌లోని వివిధ లక్ష్యాలను గురి చూసి కొట్టి తన పనిని పూర్తి చేసింది. పహెల్‌గామ్‌లో జరిగిన దారుణమైన, విషాదకరమైన, మత తత్వ ఉగ్రవాద దాడులకు ప్రతిస్పందనగా, భారతదేశం పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలను మాత్రమే కాకుండా పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై కూడా దాడి చేసింది. పాకిస్తాన్‌పై ఒత్తిడి తేవడానికి అవసరమైన వరుస చర్యలను చేపట్టడం ద్వారా భారత్‌ ముందడుగువేసింది. దీనిపై రాజకీయ పరంగా దేశంలో విస్తృత స్థాయిలో ఐక్యత ఏర్పడింది.కొత్త యుగానికి నాంది పలకాలి!అయితే, భారతదేశమైనా, పాకిస్తాన్‌ అయినా తమను తాము తీవ్రంగా గాయపరచుకోకుండా పూర్తి స్థాయి సైనిక యుద్ధాన్ని చేపట్టలేవని, చేపట్టినా దాన్ని కొనసాగించలేవని అన్ని పక్షాలకూ స్పష్టంగా తెలిసిపోయి ఉండాలి. ఇరుదేశాల మధ్య యుద్ధంలో ఓడిపోయిన వారు వాస్తవానికి– భారత్, పాక్‌ ప్రజలే! ఒక పక్షాన్ని మరొక పక్షం అనుమానించిన ప్రతిసారీ ఈ రెండు దేశాలూ పరస్పర దాడులకు పాల్పడతాయనే అభిప్రాయం ఇప్పుడు స్థిరపడింది. తన భూభాగంలో జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌పై జరిగిన దాడిలో 25 మంది మరణించిన విషయాన్ని ప్రస్తావిస్తూ, పహెల్‌గామ్‌ ఉగ్రవాద దాడికి పాకిస్తాన్‌ కార ణాన్ని వివరించింది. అంతర్జాతీయ సమాజం ప్రతిస్పందనలను పరి శీలిస్తే కొన్ని దేశాలు మాత్రమే ఒక పక్షం కథనాన్ని నమ్మడానికి సిద్ధంగా ఉన్నాయి. సంఘటనలపై భారతీయ కథనానికి ఎక్కువ మంది మద్దతుదారులు ఉన్నప్పటికీ, పాకిస్తాన్‌ కూడా తనదైన మద్దతుదారులను కూడగట్టింది.రెండు దేశాల ముందు ఉన్న సవాలు, నిజానికి భారత ఉపఖండం అంతటా ఇప్పుడు ఉన్న సవాలు – గత శతాబ్దంలో ఉనికిలోకి వచ్చిన అనేక దేశాలు కూడా ప్రాంతీయ, దేశీయ శాంతికి, అభివృద్ధికి చెందిన కొత్త యుగానికి నాంది పలికే నాయకత్వాన్ని కనుగొనడమే! విచార కరంగా, దక్షిణాసియాలో అలాంటి రాజకీయ నాయకత్వ కొరత ఉంది. వలసవాదం నుండి విముక్తి పొందినప్పటి నుండి ఈ ప్రాంతం స్వీయ చరిత్ర, భౌగోళిక పరిస్థితులు, గత చరిత్రలతో అంతర్గత పోరాటాల కారణంగా వెనుకబడి ఉంది.పొరుగు సంబంధాలు కీలకందక్షిణాసియా విషాదం ఏమిటంటే, ఈ ప్రాంతంలోని పలు దేశాలలో చాలా మందికి తమ బండిని ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాలకు తీసుకెళ్లవచ్చుననీ, పొరుగువారితో సంబంధాలను మెరుగు పర్చుకోకుండానే అభివృద్ధిని కొనసాగించవచ్చుననీ నమ్మకం ఉంది. గత పావు శతాబ్దంలో భారతదేశపు విశ్వసనీయ ఆర్థిక పనితీరు, తన పొరుగువారితో ప్రబలంగా ఉన్న వివాదాలను పరిష్కరించకుండానే ఎదగడాన్ని భారత్‌ కొనసాగించగలదని చాలా మంది నమ్మేలా చేసింది. కొంతవరకు, అది సాధ్యమైంది. అయితే, భారతదేశం దీర్ఘకా లిక యుద్ధంలోకి లాగబడితే అది కూడా ఆర్థికంగా దెబ్బతింటుంది. చెలరేగిన ఘర్షణ వాతావరణపు దుమ్ము కాస్తా అణిగి, ‘యుద్ధం పొగమంచు’ నుండి బయటపడిన తర్వాత, రెండు దేశాలలోని రాజకీయ నాయకత్వం ప్రాంతీయ భద్రత అంటే ఏమిటో సుదీర్ఘంగా పరిశీలించాలి. స్థిరమైన ఆర్థిక అభివృద్ధి కోసం ప్రాంతీయ వాతావ రణాన్ని తప్పకుండా నిర్వచించాలి. భూభాగం గురించిన నిరంతర వివాదాల ద్వారా ఎవరి ప్రయోజనాలు నెరవేరుతాయి? ప్రతి దేశంలోనూ, ప్రాంతం అంతటా మతపరమైన ప్రాంతీయ విభజనల నుండి ఎవరు ప్రయోజనం పొందుతారు?సరిహద్దుకు ఇరువైపులా గొప్ప వ్యూహకర్తల జ్ఞానం ఉన్నప్పటికీ, నేడు ఏ పక్షమూ ప్రాంతీయ శాంతి, భద్రత కోసం కొత్త చట్రాన్ని నిర్వచించలేకపోయింది. ప్రధాన మంత్రి అటల్‌ బిహారీ వాజ్‌పేయి, ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ నాయకత్వంలో 2000–2007 కాలంలో చివరిసారిగా ఒక ప్రయత్నం జరిగింది. పాకిస్తాన్‌ అధ్య క్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ కొంతకాలం వారి చొరవతో ముందుకు సాగారు. కానీ ఆయన త్వరలోనే పదవీచ్యుతుడయ్యారు. అప్పటి నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన ప్రభుత్వం శాంతి భద్రతలకు సంబంధించి ‘మన్మోహన్‌ – ముషారఫ్‌’ ఫార్ములాను తిరస్కరించింది.ఈ రోజు ఆ ఫార్ములా గురించి ప్రస్తావిస్తే ఎగతాళి చేస్తున్నారు. అయినా సరే... దీనిని తప్పక ప్రస్తావించాలి. అమెరికా, చైనా, జర్మనీ తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి సిద్ధంగా ఉంది. జపాన్‌ను అధిగమించింది. స్వదేశంలో ఎదుర్కొంటున్న సవాళ్లు, భారత వృద్ధి ప్రక్రియలో లోపాలు ఉన్నప్పటికీ, భారతదేశం అభివృద్ధి చెందడం కొనసాగించడానికీ, ప్రపంచాన్ని అనుకూలమైన నిబంధనలతో నిమగ్నం చేయడానికీ తప్పక అవకాశం ఉంది.నియంత్రణ రేఖే సరిహద్దుభారతదేశం తన సొంత పొరుగు ప్రాంతాన్ని సురక్షితం చేసుకోకుండా అలా చేయగలదని భావించడం చాలా మంది సమకాలీన విశ్లేషకులు, వ్యూహకర్తల ఊహ మాత్రమే! భారత్‌ పొరుగు దేశాలు పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక భారతదేశానికి చెప్పడానికి ప్రయత్నిస్తున్నది ఏమిటంటే, వారు భారత్‌ నుండి ఎటువంటి ప్రయో జనాలనూ పొందకపోతే ఈ వృద్ధి వ్యయాలు పెరుగుతాయి. మోదీ ప్రభుత్వం పాటించిన గత దశాబ్దపు భారత విధానం ఏమిటంటే, కష్టాల్లో ఉన్న పొరుగువారిపై భారీ ఖర్చులను విధించడమే. ఇది స్వల్పకాలిక ప్రయోజనాలను అందించవచ్చు కానీ దాని పర్యవస నాలు భారత్‌ కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.మేము పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటామని భారత్‌ ప్రదర్శించే రాజకీయ ధైర్యం, కశ్మీర్‌ను స్వాధీనం చేసుకోవడం గురించిన పాకిస్తాన్‌ వాక్చాతుర్యానికి చెల్లిపోతుంది. కానీ రెండూ ఎప్పటికీ జరగవు! సిమ్లా ఒప్పందం, లాహోర్‌ డిక్లరేషన్, మన్మో హన్‌–ముషారఫ్‌ ఫార్ములా ముఖ్య ఉద్దేశ్యం అదే! అన్ని ప్రధాన శక్తులు – అమెరికా, రష్యా, చైనా – నియంత్రణ రేఖ వాస్తవానికి అంతర్జాతీయ సరిహద్దు అనే ఆలోచనను సమర్థించాయి. నేడు రెండు దేశాలలోని ప్రముఖులు అలాంటి పరిష్కారాన్ని తిరస్కరిస్తున్నారు. అయితే, క్షేత్రస్థాయిలో వాస్తవికత నుండి తప్పించుకునే అవకాశం లేదనీ, ఈ వాస్తవికత అందరికీ పెనుభారంగా మారవచ్చనీ ఇరువైపులా ఉన్న వాస్తవికవాదులకు తెలుసు.సంజయ బారు వ్యాసకర్త సెంటర్‌ ఫర్‌ ఎయిర్‌ పవర్‌ స్టడీస్‌ వ్యవస్థాపకుడు,భారత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మీడియా సలహాదారు

Sakshi Special Story about Buddha Purnima 20259
మానవాళికి మహాబోధకుడు

ఎల్లప్పుడూ రాగద్వేషాలతో, కామక్రోధాలతో, హింసతో, సతమతమవుతున్న మానవాళిని జాగృత పరచటానికి ఉద్భవించిన మహాపురుషుడు గౌతవుబుద్ధుడు. ఆయన అసలు పేరు సిద్ధార్థ గౌతవుుడు. కపిలవస్తును ఏలే శుద్ధోధన చక్రవర్తికి, ఆయన పట్టపురాణి వుహావూయాదేవికి ౖవైశాఖ శుద్ధపూర్ణివునాడు జన్మించాడు. అతడు పుట్టిన ఏడోరోజునే తల్లి వురణించడంతో పినతల్లి గౌతమి, తానే తల్లి అయి పెంచింది.కొడుకు పుట్టగానే తండ్రి శుద్ధోధనుడు జాతకం చూపించాడు. జాతకం ప్రకారం అతడు వుహాచక్రవర్తి కాని, వుహాప్రవక్త కాని అవ#తాడని పండితులు చెప్పారు. తన పుత్రుడు చక్రవర్తి కావాలని ఆశించిన తండ్రి, అతనికి కష్టాలు, బాధలు అంటే ఏమిటో తెలియకుండా పెంచాడు. అంతేకాదు, అతనికి పదహారవ ఏటనే అంతే ఈడుగల యశోధరతో వివాహం జరిపించాడు.కొంతకాలం గడిచిందిఒకనాడు నగర వ్యాహ్యాళికి రథంపై వెళ్లిన సిద్ధార్థునికి దారిలో నాలుగు దృశ్యాలు ఎదురయ్యాయి. అవి ఒక వుుసలివాడు, ఒక రోగి, ఒక శవం, ఒక శవుణుడు. అసలే ఆలోచనాపరుడైన అతని వునసులో ఇవి పెద్ద అలజడినే రేపాయి. వూనవ#లు ఎదుర్కొనే ఈ దుఃఖాన్ని ఎలాగైనా పరిష్కరించి తీరాలనుకున్నాడు. నాలుగో దృశ్యం సన్యాసి – అతనికి వూర్గాన్ని స్ఫురింపజేసింది. అప్పటికప్పుడే సన్యసించాలని, తపస్సు చేయాలని నిర్ణయం తీసుకున్నాడు.గౌతముడు బుద్ధుడయిన వేళ...అప్పుడాయన వయసు 29 సంవత్సరాలు. అప్పుడే ఆయనకు రాహులుడనే పుత్రుడు జన్మించాడు. ఆ రాత్రే అడవికి పయనవుయ్యాడు. ప్రపంచం అంతా మెుద్దు నిద్దరోతోంది. వూయనిద్రలో నుంచి సిద్ధార్థుడొక్కడే మేల్కొన్నాడు, ప్రపంచాన్ని నిద్ర లేపటానికి. అడవికి వెళ్లి ఆరు సంవత్సరాలు వూనవాళి దుఃఖం గురించి ఆలోచించాడు. చివరకు జ్ఞానోదయమైంది. అప్పటికాయన వయస్సు 35 సంవత్సరాలు.జననం మరణం ఒకే రోజుతనకు జ్ఞానోదయం అయిన తరవాత తాను కనుగొన్న ధర్మాన్ని రాజు, పేద, ఉన్నత, దళిత, కుల, వర్గ, వుతభేదాలను పట్టించుకోకుండా 45 సంవత్సరాల పాటు నిరంత రాయంగా బోధించాడు ఆయన జన్మించినది, జ్ఞానోదయం కలిగింది. నిర్వాణం చెందిందీ కూడా వైశాఖ పున్నమినాడే. అందుకే ఈ పున్నమిని బుద్ధపున్నమి అని అంటారు.ప్రపంచాన్ని మేల్కొలిపిన ఆ బోధలు ఏమిటి?ప్రపంచాన్ని పరివర్తన దిశగా నడిపేందుకు బుద్ధుడు నాలుగు సత్యాలను బోధించాడు. వీటిని ఆర్యసత్యాలంటారు. వీటిల్లో మెుదటిది... దుఃఖం. అంటే ఈ ప్రపంచంలో దుఃఖం ఉంది. రెండో సత్యం... దీనికి కారణం తృష్ణ. వుూడో సత్యం... దుఃఖాన్ని తొలగించే వీలుంది. నాలుగో సత్యం... దుఃఖాన్ని తొలగించే వూర్గం ఉంది. ఆ వూర్గమే ఆర్య అష్టాంగవూర్గం. ఈ నాలుగు సత్యాలను చెప్పడంలో బుద్ధుడు ఒక శాస్త్రీయ విధానాన్ని అనుసరించాడు. అదే కార్యకారణ సిద్ధాంతం. బుద్ధునికి వుుందే ఈ సిద్ధాంతం ఉన్నా దానికి ఒక శాస్త్రీయ ప్రాపదికను ఏర్పాటు చేసినది మాత్రం ఆయనే. బుద్ధుడు ప్రపంచానికి అందించిన ఆలోచనా విధానం పూర్తిగా శాస్త్రీయమైనది. హేతుబద్ధమైనది.దుఃఖం అంటే ఏమిటి? బుద్ధుడు ప్రపంచంలో దుఃఖం ఉందన్నాడు. ఆ దుఃఖ భావనను చాలావుంది అపార్థం చేసుకున్నారు. దుఃఖం అంటే వునం వూవుూలుగా శోకం, ఏడుపు, పెడబొబ్బలు అనుకుంటాం. శోకం దుఃఖంలో భాగమే అయినా, దుఃఖం అర్థం అది కాదు. ‘దుఃఖం’ అంటే తొలగించాల్సిన ఖాళీ. అంటే ప్రతి వునిషిలోనూ తొలగించవలసిన అసంతృప్తి ఉంటుంది. అసంతృప్తి లేని వూనవ#డు ఉండడు. ఇలా ఎప్పుడూ అసంతృప్తి ఉంటుంది. ఈ విధమైన ఆ ‘ఖాళీ’నే ఆధునికులు దురవస్థ అంటున్నారు. దీనిని పరిష్కరించటానికి తృష్ణను తొలగించాలన్నాడు. ఆ తృష్ణ పోవాలంటే ‘స్వార్థం’ లేకుండా ఉండాలి. స్వార్థం లేకుండా ఉండాలంటే ‘నేను’ అనే భావన ఉండకూడదు. ‘నేను’ లేకుండా ఉండాలంటే, ‘ఆత్మ’ లేకుండా ఉండాలి. అందుకే ఆయన ‘అనాత్మ’వాదాన్ని ప్రవేశపెట్టాడు. ఇది బుద్ధుడు మానవాళికి చేసిన వుహోపదేశం.మతాతీతమైన సత్యాలువూనవ#డు వూనవ#డుగా వునగలగాలంటే ఏం చేయాలో బోధించాడు బుద్ధుడు. వాటికే పంచశీలాలని పేరు. 1)ప్రాణం తీయకు 2) దొంగతనం చేయకు 3) అబద్ధాలాడకు 4) కావుంతో చరించకు 5) వుద్యం సేవించకు– వీటిని ఏ వుతం కూడా కాదనలేదు. ఈ సత్యాలు వుతాతీతాలు. సవూజం సజావ#గా, కందెన వేసిన బండిచక్రంలా సాఫీగా సాగాలంటే పంచశీలాలను పాటించడం ఎంతో అవసరం. బుద్ధుడు తాత్విక చింతనలోనూ, వునోవిజ్ఞానశాస్త్రంలోనూ, సవూజ సంక్షేవుంలోనూ, వుూలాలకు వెళ్లి, అంతకువుుందు ఎవరూ చూడని, ఆలోచించని ఎన్నో విషయాలను వూనవ కల్యాణం కోసం అందించిన మహనీయుడు. వునిషికే మహనీయుడిగా పట్టంకట్టిన ఆ మానవతావాది ప్రతిపాదించిన మార్గాన్ని అనుసరించడమే ఆయనకు అర్పించే అసలైన నివాళి. బుద్ధం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి – డి.వి.ఆర్‌. భాస్కర్‌

Road accident to Tirumala RTC bus at Chandragiri10
చంద్రగిరి వద్ద డివైడర్‌ను డీకొట్టిన బస్సు

చంద్రగిరి: తిరుపతి జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు కల్వర్టును ఢీకొట్టడంతో 35 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. వివరాలు.. తిరుపతి అలిపిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆదివారం రాత్రి తమిళనాడు­లోని వేలూరు నుంచి తిరుమలకు ప్రయాణికులతో బయలుదేరింది. అర్ధరాత్రి 12 గంటల సమయంలో చంద్రగిరి నియోజకవర్గం అగ­రాల నారాయణ కళాశాల వద్దకు వచ్చేసరికి బస్సు డ్రైవర్‌ నిద్రమత్తులోకి జారుకున్నాడు. దీంతో బస్సు అదుపుతప్పి కల్వ­ర్టును ఢీకొట్టింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను తిరుపతి రుయాకు తరలించారు. దాదాపు 35 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉంది. బస్సు డ్రైవర్‌ రాజారెడ్డి, కండక్టర్‌ లక్ష్మీనారాయణ, ప్రయాణికులు శ్రావణ్‌కుమార్, దీపారాణి, నితీశ్‌కుమార్, అక్షయ్‌కుమార్, తిరు­సడై, తేజస్విని, రామ్‌లక్ష్మి తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. మరికొందరిని చంద్రగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement