Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Indian army attacks Pakistan capital Islamabad1
పాక్‌ ప్రధాని ఇంటి సమీపంలో భారీ పేలుళ్లు.. నివాసం నుంచి షరీఫ్‌ తరలింపు

పాక్‌ ప్రధాని ఇంటి సమీపంలో భారత సైన్యం దాడితో భారీ పేలుళ్లు జరిగాయి. దాంతో ఇస్లామాబాద్‌లోని తన నివాసం నుంచి షెహబాజ్‌ షరీఫ్‌ను సురక్షిత ప్రాంతానికి తరలించారు.పాక్‌ రాజధాని ఇస్లామాబాద్‌పై భారత సైన్యం దాడి చేసింది. ఇస్లామాబాద్‌ టార్గెట్‌గా భారత్‌ డ్రోన్లు, మిస్సైల్‌లతో దాడికి దిగింది. పాక్‌ మిస్సైల్‌లను గాల్లోనే కూల్చి వేసిన భారత సైన్యం. జమ్మూలోని ఎయిర్‌పోర్టుపై 8 సూసైడ్‌ డ్రోన్లతో పాక్‌ దాడి చేయగా వాటిని సమర్ధవంతంగా తిప్పి కొట్టింది. జైసల్మేర్‌, అక్నూర్‌లో ఇద్దరు పాక్‌ పైలట్‌లను పట్టుకున్న భారత ఆర్మీ. మొత్తం 20కి పైగా పాక్‌ డ్రోన్లను కూల్చిన భారత సైన్యం. లాహోర్ , సియాల్ కోర్టులో కౌంటర్ ఎటాక్‌కు దిగిన భారత్ డ్రోన్లతో విరుచుకుపడింది.S-400, L-17 సిస్టమ్‌ను యాక్టివేట్‌ చేసిన భారత్‌. జమ్మూ ఎయిర్‌పోర్టు టార్గెట్‌గా పాక్‌ దాడులు. ఈ దాడులతో ఎలాంటి నష్టం జరగలేదని, పాక్‌ దాడులను సమర్ధవంతగా తిప్పికొట్టామని భారత ఆర్మీ తెలిపింది. దేశవ్యాప్తంగా అన్ని ఎయిర్‌పోర్టులను హై అలర్ట్‌ చేసిన భారత్‌ సైన్యం. వరుస డ్రోన్ దాడులతో పాక్‌ ఉక్కిరిబిక్కిరి అయింది. ఇదిలా ఉండగా అమెరికా, యూకే, యూఏఈలతో టచ్‌లో భారత్‌. రంగంలోకి SZU-23, శిక ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌. తాజా పరినామాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ సమావేశం అయ్యారు. త్రివిధ దళాధిపతులు, CDSతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్‌ సింగ్ భేటీ అయ్యారు. రంగంలోకి భారత నౌకాధళం రంగంలోకి దిగిన భారత నౌకాధళం పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీ సీ పోర్టుపై ప్రతీకార దాడి చేసింది. ఐఎన్‌ఎస్‌ విక్రాంత​ నుంచి మిస్సైల్స్‌, డ్రోన్లను ప్రయోగించింది. ఈ పోర్టులో ఏడు భారీ పేలుళ్లు, ఎగిసిపడుతున్న మంటలు. కరాచీ పోర్టులో మొత్తం 10 పాక్‌ కార్గో నౌకలను ద్వంసం చేసిన ఇండియన్ నేవీ. ఈ దాడుల్లో అనేక షిప్పులు ధ్వంసం అయ్యాయి. అరేబియా సముద్రంలో పాక్‌పై గురి పెట్టిన భారత నేవీ ఏకంగా 26 యుద్ధ నౌకలతో విరుచుకుపడుతూ పాక్‌ను వణికిస్తోంది.దేశంలో పలు ప్రాంతాల్లో రైళ్లు నిలిపివేతతాజా పరినామాలతో దేశంలో ఢిల్లీ నుంచి జమ్మూ,గుజరాత్‌, రాజస్థాన్‌ వెళ్లే రైళ్లన్నీ రద్దు చేశారు. ఢిల్లీలో హై అలర్ట్‌తాజా పరినామాలతో ఢిల్లీలోని ఇండియా గేట్‌ వద్ధ భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం. ప్రజలు బయటకు రావొద్దని ఆదేశించింది. భారీగా NSG కమాండర్ల మోహరింపు.మరోవైపు పాకిస్తాన్‌పై బలూచిస్తాన్‌ దాడిఓవైపు భారత సైన్యం, ఇండియన్ నేవీ జరుపుతున్న దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న పాక్‌కు మరోవైపు నుంచి బలూచిస్తాన్‌ దాడికి దిగింది. పాక్‌ చమురు క్షేత్రాలపనా బలూచిల దాడులు. ఇదిలా ఉండగా పాక్‌పై భారత్‌ దాడులను బలూచి రేడియో హైలెట్‌ చేస్తోంది.పాక్‌ రక్షణ వ్యవస్థల కూల్చివేతపాక్‌లోని 2 వైమానిక రక్షణ వ్యవస్థలను కూల్చేసిన భారత్‌. సర్గోదా, ఫైసలాబాద్‌లోని రక్షణ వ్యవస్థలను కూల్చినట్లు ప్రకటించిన భారత్‌. భారత్‌ దాడులతో దిక్కు తోచని పాక్‌ బలగాలు.

Pakistan Drone Attack On Jammu Airport2
జమ్మూపై పాక్‌ డ్రోన్లతో దాడి.. తిప్పికొట్టిన భారత్‌

జమ్మూ ఎయిర్‌పోర్ట్‌ టార్గెట్‌గా పాక్‌ డ్రోన్లతో దాడి చేసింది. ఎఫ్‌-16ను పాక్‌ ఆర్మీ ప్రయోగించింది. భారత్‌ బలగాలు ధీటుగా ఎదుర్కొన్నాయి. 10 పాక్‌ డ్రోన్లను భారత్‌ కూల్చివేసింది. సైరన్లతో ప్రజలను ఆర్మీ అప్రమత్తం చేసింది. సరిహద్దుకు 50 కిలోమీటర్ల దూరంలో రాకపోకలు బంద్‌ చేశారు. ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని సైన్యం హెచ్చరించింది. జమ్మూ నగరమంతా విద్యుత్‌ను నిలిపివేశారు. పాక్‌ దాడులను భారత్‌ సమర్థవంతంగా తిప్పికొట్టింది.జమ్మూ వ్యాప్తంగా సైరన్లు మోగుతున్నాయి. జమ్మూ కశ్మీర్‌లో ఇంటర్‌నెట్‌ సేవలు కూడా నిలిపివేశారు. సాంబ సెక్టార్‌లో పాక్‌ కాల్పులకు తెగబడింది. ఎస్‌-400 సిస్టమ్‌తో పాక్‌ మిస్సైళ్లను భారత్‌ ధ్వంసం చేసింది. సరిహద్దులు దాటి భారత్‌లోకి ప్రవేశించిన ఎఫ్‌-16, రెండు జేఎఫ్‌-17లను కూల్చివేసిన ఇండియన్‌ ఆర్మీ.. పాక్‌ను మరో చావు దెబ్బ కొట్టింది. మూడు ఫైటర్‌ జెట్లను భారత్‌ సైన్యం కూల్చివేసింది.జమ్మూ, సివిల్‌ ఎయిర్‌పోర్ట్‌, సాంబ, ఆర్‌ఎస్‌పుర, చానీ మహిత్‌, అర్నియా ప్రాంతాల్లో పాక్‌ డ్రోన్‌ దాడులకు పాల్పడింది. పఠాన్‌ కోట్‌ ఎయిర్‌బేస్‌పై ఎఫ్‌-16 దాడికి ప్రయత్నించింది. పాక్‌ దాడులతో ఎలాంటి నష్టం జరగలేదని భారత్‌ ఆర్మీ ప్రకటించింది. పాక్‌ దాడులను సమర్ధవంతంగా తిప్పికొట్టామని పేర్కొంది.కాగా, పాక్‌ గగనతల రక్షణ వ్యవస్థలపై భారత సైన్యం ఇవాళ విరుచుకుపడిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్‌ మిస్సైళ్లను భారత దళాలు కూల్చివేశాయి. యాంటి మిస్సైల్‌ సిస్టమ్‌ ద్వారా పాకిస్థాన్‌ మిస్సైళ్లను గాల్లోనే భారత్‌ పేల్చేసింది. ఎస్‌-400 మిస్సైళ్లను ఉపయోగించి పాక్‌కు భారత్‌ బుద్ధి చెప్పింది. గత రెండు రోజులుగా భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లతో దాడులకు పాకిస్థాన్‌ యత్నిస్తుండగా, వీటిని భారత రక్షణ వ్యవస్థలు సమర్థంగా అడ్డుకుంటున్నాయి.

Ministry Of Foreign Affairs And Ministry Of Defense Joint Press Meet3
పాక్‌ కుయుక్తులు.. భారత్‌ సీరియస్‌ వార్నింగ్‌

ఢిల్లీ: భారత్‌లోని పలు ప్రాంతాలను పాక్‌ టార్గెట్‌ చేసిందని.. ఉత్తర, పశ్చిమ, భారత్‌లోని 15 ప్రాంతాలపై దాడులకు ప్రయత్నించిందని కల్నల్ సోఫియా ఖురేషి తెలిపారు. ‘ఆపరేషన్‌ సిందూర్‌’లో పాకిస్థాన్‌ సైన్య స్థావరాలను లక్ష్యంగా చేసుకోలేదని.. ఉగ్రవాద శిబిరాలపై మాత్రమే దాడి చేశామని ఆమె స్పష్టం చేశారు. విదేశాంగశాఖ, రక్షణ శాఖ సంయుక్తంగా నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పాక్‌ దాడులను తిప్పికొట్టామని.. పాక్‌ మిస్సైళ్లను కూల్చేశామని వెల్లడించారు.నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ జరుపుతున్న విచక్షణారహిత కాల్పుల్లో ముగ్గురు మహిళలు, ఐదుగురు చిన్నారులు సహా 16 మంది మృతి చెందినట్లు ఆమె వెల్లడించారు. విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్త్రీ మాట్లాడుతూ.. జలంధర్‌, లూథియానా, ఆదంపూర్‌, భటిండా, చండీగఢ్‌, నాల్‌, ఫలోడి,భుజ్‌లో పాక్‌ సైన్యం దాడులు చేసిందని.. మేం చేసిన దాడులు ఎక్కడా రెచ్చగొట్టేలా లేవన్నారు.నియంత్రణ కచ్చితత్వంతో మేం కేవలం ఉగ్రవాద శిబిరాలపై మాత్రమే దాడి చేశాం. మిలటరీ స్థావరాలపై మేం దాడి చేయలేదు. పాక్‌ దాడుల్లో 16 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని ఆయన తెలిపారు. కుప్పారా, బారాముల్లా, పూంచ్‌, రాజౌరీ సెక్టార్లలో పాక్‌ సరిహద్దు వెంబడి కాల్పులు జరుపుతోంది. పాకిస్తాన్‌ తనకేమీ సంబంధం లేదంటూ చేతులు కడుక్కునే ప్రయత్నం చేస్తోందని విక్రమ్‌ మిస్త్రీ అన్నారు.‘‘పాకిస్థాన్‌ కవ్వింపు చర్యలకు దిగితే.. ఇంతకంటే ధీటుగా సమాధానం ఇస్తాం. 65 ఏళ్ల నుంచి భారత్‌ను పాక్ రెచ్చగొడుతున్నా సహనంగా ఉన్నాం. పాకిస్థాన్‌తో ఎలాంటి దౌత్యపరమైన చర్చలు జరపడం లేదు. ఐరాసతోనే పాకిస్థాన్‌ అబద్ధాలు చెప్పింది. పాక్‌లో ఉన్న టీఆర్‌ఎఫ్‌.. లష్కరే తొయిబాకు అనుబంధ సంస్థ. ఉగ్రవాదులతో తమకు సంబంధం లేదని పాక్‌ బుకాయిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉగ్రవాదులకు పాకిస్థాన్‌ కేంద్రం. మోస్ట్‌వాంటెడ్‌ ఉగ్రవాదులు పాక్‌లో రక్షణ పొందుతున్నారు.బిన్‌ లాడెన్‌కు కూడా పాకిస్థాన్‌ ఆశ్రయం కల్పించింది. పాకిస్థాన్‌ ప్రోత్సహించిన ఉగ్రవాదులే.. పఠాన్‌కోట్‌, ముంబైలో దాడులు చేశారు. ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాక్‌ అధికారులు హాజరయ్యారు. ఉగ్రవాదులకు అధికార లాంఛనాలతో పాక్‌ అంత్యక్రియలు చేసింది. ప్రార్థనా మందిరాలను టార్గెట్‌ చేశామని అబద్ధాలు చెప్తోంది. మేం ఎక్కడా ప్రార్థనా కేంద్రాలను టార్గెట్‌ చేయలేదు. పూంఛ్‌లో సిక్కు పౌరులపై పాక్‌ కాల్పులు జరిపింది. పాక్‌ కాల్పుల్లో ముగ్గురు సిక్కులు చనిపోయారు, పహల్గాం ఉగ్రదాడి వల్లే ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి. పల్గాహం ఉగ్రదాడికి నిన్న భారత్‌ సమాధానం చెప్పింది’’ అని విక్రమ్‌ మిస్త్రీ చెప్పారు.

Punjab Kings-Delhi Capitals Match Called Off In Dharamsala4
ధర్మశాలలో బ్లాక్ అవుట్..? పంజాబ్ కింగ్స్‌, ఢిల్లీ మ్యాచ్ ర‌ద్దు

ఐపీఎల్‌-2025లో భాగంగా ధ‌ర్మశాల వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్ మ‌ధ్య జ‌రుగుతున్న మ్యాచ్ ర‌ద్దు అయింది. భ‌ద్ర‌తా కార‌ణాల దృష్ట్యా మ్యాచ్‌ను నిర్వహకులు రద్దు చేశారు. భార‌త్‌-పాకిస్తాన్ మ‌ధ్య నెల‌కొన్న ఉద్రిక్త‌ల న‌డుమ స్ధానికంగా బ్లాక్ అవుట్ విధించిన‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే మ్యాచ్‌ను మధ్యలోనే ఆపేశారు. ఐపీఎల్ చైర్మెన్ అరుణ్ ధుమాల్ స్వ‌యంగా రంగంలోకి దిగి ప్రేక్ష‌కుల‌ను స్టేడియం నుంచి బ‌య‌ట‌కు పంపించారు. జమ్మూలో జారీ చేయబడిన రెడ్ అలర్ట్ ఆధారంగా ముందు జాగ్రత్త చర్యగా ఈ మ్యాచ్‌ను ర‌ద్దు చేసిన‌ట్లు ధుమాల్ పేర్కొన్నారు. వర్షం కార‌ణంగా గంట ఆల‌స్యంగా మొద‌లైన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. పంజాబ్ స్కోర్ 10.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 122 పరుగులు చేసింది. ప్రియాన్ష్ ఆర్య ఔటైన వెంట‌నే స్టేడియంలో ఫ్లడ్ లైట్స్ ఒక్క‌సారిగా ఆగిపోయాయి. దీంతో ఫ్లడ్ లైట్ల సమస్య తలెత్తడంతో మ్యాచ్ ఆగిపోయింద‌ని అంతా భావించారు. కానీ భ‌ద్ర‌తా కార‌ణాల దృష్ట్యా అధికారులు ఉద్డేశ్వ‌పూర్వ‌కంగానే ఫ్లడ్ లైట్స్ ఆపి, మ్యాచ్ రద్దు చేశారు. అయితే టెక్నికల్ ఫెయిల్యూర్ కారణంగానే మ్యాచ్‌ని రద్దు చేస్తున్నట్టుగా బీసీసీఐ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. మ్యాచ్ ర‌ద్దు కావ‌డంతో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ జట్లకు చెరో పాయింట్ లభించింది.#WATCH | Dharamshala: Sudhir, a cricket fan says, "The match has been called off because of security reasons. What do we have to be afraid of? We are in our country. If anyone, it should be Pakistan who should be afraid. Bharat Mata ki Jai." https://t.co/N3YDWolW07 pic.twitter.com/QjiNCQn9sZ— ANI (@ANI) May 8, 2025IPL Chairman requesting fans to leave the Dharamshala Stadium. pic.twitter.com/9rVqVfPa12— Bhagavad Gita 🪷 (@Geetashloks) May 8, 2025

Ysrcp Meeting: Ys Jagan Fires On Chandrababu5
‘మీ బాధలు చూశా.. ఇబ్బందిపెట్టిన వారి పేర్లు రాసుకోండి’

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు. రాజంపేట, మడకశిర, మున్సిపాలిటీలతో పాటు రామకుప్పం, రొద్దం మండలాల నేతలతో భేటీ అయిన ఆయన... ఇటీవల జరిగిన ఎంపీపీ ఉప ఎన్నికల్లో టీడీపీ అక్రమాలను ప్రస్తావించారు. పచ్చగూండాల దాడులను ఎదుర్కొన్నవారిని అభినందించారు.‘‘రాష్ట్రంలో కూటమి సర్కార్‌.. విలువలు, విశ్వసనీయత లేని రాజకీయాలు చేస్తోంది. ఈ పరిస్థితుల మధ్య తులసి మొక్కల్లా.. తెగువ చూపించి, విలువలతో కూడిన రాజకీయాలకు అర్ధం చెప్పి.. వాటిని చంద్రబాబుకు చూపారు.. నిలబడిన మీ అందరికీ హ్యాట్సాఫ్‌. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలి. కానీ వాటన్నింటినీ దిగజార్చారు చంద్రబాబు. ఈ పరిస్థితి చూడాల్సి వస్తుందని అనుకోలేదు’’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.స్థానిక సంస్థల్లో చంద్రబాబు అనైతిక చర్యలు:రామకుప్పంతో ఒక ఎంపీటీసీ చనిపోతే, ఉప ఎన్నిక జరిగింది. అక్కడ మొత్తం 16 మంది వైఎస్సార్‌సీపీకి చెందినవారే. అయినా అక్కడ చంద్రబాబు తమ పార్టీ అభ్యర్థిని పోటీకి పెట్టి, ఆరుగురిని లాక్కునే ప్రయత్నం చేయడంతో పాటు, మన పార్టీ ఎంపీటీలు ప్రయాణిస్తున్న వాహనాన్ని పోలీసుల ద్వారా అడ్డుకున్నారు. కోరం లేకపోయినా, కేవలం ఆరుగురు మాత్రమే అటువైపు వెళ్లినా, ఏకపక్షంగా డిక్లేర్‌ చేసుకున్నారు. రొద్దం మండలంలో మొత్తం 15 ఎంపీటీసీలు వైఎస్సార్‌సీపీకి చెందిన వారే. అక్కడ ఒకరు చనిపోతే ఉప ఎన్నిక జరిగింది. ఇక్కడా చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయం చేశాడు. చెడిపోయిన రాజకీయాలకు దిక్సూచిలా పని చేస్తూ.. మార్గం చూపాడు. పెనుకొండలో ఎంత ప్రలోభపెట్టినా ఒక్కరూ వెళ్లలేదు. మడకశిర ఎస్సీ నియోజకవర్గం. అక్కడా 15 మంది మన పార్టీ వారే. అక్కడా కౌన్సిలర్లను లాగాలని విశ్వప్రయత్నం చేశాడు. అంత కన్నా దిగజారిన నాయకుడు ఎవరూ ఉండరు. అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపాలిటీలో 29 వార్డుల్లో 24 మంది కౌన్సిలర్లు. కేవలం ముగ్గురు టీడీపీ. ఇంకొకరు ఇండిపెండెంట్‌. అయినా అక్కడా చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయం చేశారు.చంద్రబాబు సిగ్గు పడాలిఏ నాయకుడు అయినా ఆదర్శంగా ఉండాలి. మన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు విలువలు, విశ్వసనీయతతో పని చేస్తున్నారు. చంద్రబాబు సిగ్గుపడి తల దించుకునేలా మన వాళ్లు రాజకీయాల్లో ఉన్నారు. మనం మాట తప్పలేదు. విలువలు వదల్లేదు. మనం అధికారంలో ఉన్నప్పుడు కోవిడ్‌ వచ్చింది. రెండేళ్ల తర్వాత స్థానిక ఎన్నికలు జరిగాయి. కోవిడ్‌ వల్ల రాష్ట్రంలో ఎప్పుడూ చూడని పరిస్థితులు. ఆదాయాలు తగ్గాయి. ఖర్చులు పెరిగాయి. కానీ, ఏనాడూ సాకు చూపలేదు. ఎగొట్టే పని చేయలేదు. మాట తప్పలేదు. చిక్కటి చిరునవ్వుతో ఉన్నాం. మ్యానిఫెస్టోలో చెప్సిన ప్రతి మాటకు కట్టుబడ్డాం. పథకాలు అమలు చేశాం. బటన్‌ నొక్కాం. మాట తప్పకుండా పని చేశాం కాబట్టే, కోవిడ్‌లో అలా పని చేశాం కాబట్టే.. అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు గెలిచాంఅవకాశం ఉన్నా తాడిపత్రి వదులుకున్నాంనాడు కేవలం రెండు మున్సిపాలిటీల్లోనే టీడీపీకి మెజారిటీ వచ్చింది. తాడిపత్రి మున్సిపాలిటీలో మన పార్టీ వారు 16 మంది గెలిస్తే, టీడీపీ నుంచి 18 మంది గెలిస్తే.. ఎవరినీ లాక్కోవాలని చూడలేదు. అప్పుడు నేను మన ఎమ్మెల్యేను నేను హౌజ్‌ అరెస్టు చేశాను. దాంతో తాడిపత్రి మున్సిపాలిటీ ఛైర్మన్‌ పదవిని టీడీపీ గెల్చింది. మనం ఆనాడు అలా రాజకీయం చేస్తే, అదే మాజీ ఎమ్మెల్యేను ఇప్పుడు తాడిపత్రిలోకి అడుగు పెట్టనీయడం లేదు. ఆస్తులు విధ్వంసం చేస్తున్నారు.మీ బాధలు చూస్తున్నాను.. హామీ ఇస్తున్నా..ఇవన్నీ చూశాక, నేను ఒకటే చెబుతున్నాను. కేవలం వైఎస్సార్‌సీపీని ప్రేమించినందుకు, పార్టీని అభిమానించినందుకు కార్యకర్తలు పడుతున్న బాధను చూశాను. అందుకే జగన్‌ 2.0 లో కార్యకర్తలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తాను. వారికి పూర్తి న్యాయం చేస్తాను. మిమ్మల్ని, కార్యకర్తల్ని ఇబ్బంది పెడుతున్న పోలీసు అధికారుల పేర్లు రాసుకొండి. అధికారంలోకి వచ్చాక వారిని చట్టం ముందు నిలబెడదాం. ఈరోజు నువ్వు (చంద్రబాబు, పోలీసులు) చేస్తున్న దుర్మార్గం. వారు ఈరోజు ఏదైతే విత్తనం వేస్తున్నారో రేపు అదే పెరుగుతుంది. అందుకే ఈరోజు దౌర్జన్యాలు చేస్తున్న అధికారులు, పోలీసులు.. ఆరోజు ఎక్కడున్నా, రిటైర్‌ అయినా, సప్త సముద్రాల అవతల ఉన్నా వదిలిపెట్టం. అది మామూలుగా ఉండదు.చంద్రబాబు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడంటే..ఈ రోజు తప్పుడు కేసులు, తప్పుడు సాక్ష్యాలు. సంబంధం లేకున్నా కేసుల్లో ఇరికిస్తున్నారు. ఇలాంటి రాజకీయాలు గతంలో ఏనాడూ చూడలేదు. చంద్రబాబు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడంటే, ఆయన ప్రజల్లో చులకన అయ్యారు. హామీలు అమలు చేయడం లేదు. దీంతో ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. కాబట్టి, ఎవరూ ప్రశ్నించకూడదని, రాష్ట్రంలో భయానక పరిస్థితి సృష్టిస్తున్నాడు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా, ప్రజల్లో వ్యతిరేకత కనిపించినా, వెంటనే డైవర్షన్‌. ఒకరోజు తిరుపతి లడ్డూ అంటాడు. ఇంకోరోజు సినీ నటి కేసు.ఈ రోజు ప్రజలు అడిగే ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పలేడు. టీడీపీ వారు ఎక్కడికి వెళ్ళినా.. ఏం జరుగుతుంది?. నా రూ.15 వేలు ఏమయ్యాయని పిల్లలు, మా రూ.26 వేలు ఏమయ్యాయని రైతులు, అవ్వలు వారి రూ.48 వేలు, యువత తమ రూ.36 వేలు ఏమయ్యాయని అడుగుతారు. ఎన్నికల ముందు మాట ఇచ్చి, మోసం చేయడంతో సమాధానం చెప్పలేని దుస్థితి.అన్ని వ్యవస్థలు నాశనం చేసేశారు..ఈరోజు అన్ని వ్యవస్థలు నాశనం చేశారు. నాడు–నేడు లేదు. ఇంగ్లిష్‌ మీడియ లేదు. పిల్లలకు ట్యాబ్‌లు లేవు. గోరుముద్ద సక్రమంగా లేదు. గవర్నమెంటు బడులు రివర్స్‌లోకి వెళ్లాయి. పిల్లలు ఎదగాలంటే, ఆ కుటుంబం బాగు పడాలంటే, ఆ పిల్లవాడు బాగా చదవాలి. అందుకే ఫీజు చెల్లించాలి. మన ప్రభుత్వంలో ప్రతి మూడు నెలలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విద్యాదీవెన ఇచ్చాం. అందుకే ప్రతి మూడు నెలలకు రూ.700 కోట్లు, అలా ఏటా రూ.2800 కోట్లు, వసతి దీవెన కింద మరో రూ.1100 కోట్లు ఇవ్వాలి. ఇచ్చాం. కానీ, ఈ పెద్దమనిషి చంద్రబాబు గత ఏడాది రూ.3900 కోట్లకు బదులు రూ.700 కోట్లు మాత్రమే ఇచ్చాడు. ఈ ఏడాది ఏమీ ఇవ్వలేదు.దీంతో పిల్లలు చదువుకు దూరం అవుతున్నారు.ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు. మనం పక్కాగా అమలు చేశాం. ఇంకా ఆరోగ్య ఆసరా అమలు చేశాం. ఆరోగ్యశ్రీకి నెలకు రూ.300 కోట్లు కావాలి. రూపాయి ఇవ్వలేదు. ఆరోగ్య ఆసరా ఇవ్వడం లేదు. దీంతో పేదలు వైద్యం కోసం అప్పులు చేయాల్సి వస్తోంది. రైతులకు ఏ పంటకూ గిట్టుబాటు ధర రావడం లేదు. రైతు ఈరోజు దళారుల పాలయ్యాడు. టమోటా కిలో రూ.2 కూడా రావడం లేదు. ఆర్బీకేలు నీరు గారిపోయాయి. ఉచిత పంటల బీమా లేదు. మన ప్రభుత్వ హయాంలో ఎక్కడ ప్రకృతి వైపరీత్యం జరిగినా, ప్రభుత్వ యంత్రాంగం కనిపించేది. సీజన్‌ ముగిసేలోగా వారిని ఆదుకునే వాళ్లం. ఇంకా మనం పెట్టుబడి సాయంగా రూ.13,500 ఇస్తే, రూ.26 వేలు ఇస్తానన్న చంద్రబాబు, వారినీ మోసం చేశాడు.అవినీతి రాజ్యమేలుతోంది..విచ్చలవిడిగా ఎక్కడ చూసినా అవినీతి యథేచ్ఛగా రాజ్యమేలుతోంది. రైతులకు ఉచితంగా విద్యుత్‌ ఇవ్వడం కోసం యూనిట్‌ విద్యుత్‌ కొనుగోలు కోసం సెకీతో రూ.2.49కి ఒప్పందం చేసుకుంటే, ఈ రోజు రూ.4.60కి ఒప్పందం చేసుకున్నారు. రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ, ఊరూ పేరూ లేని ఉర్సా కంపెనీకి రూపాయికి రూ.3 వేల కోట్ల విలువైన భూమి. లులూ కంపెనీకి కూడా రూ.1500 కోట్ల విలువైన భూమి ఇచ్చారు. ఇక మద్యం. ఎక్కడ చూసినా అందుబాటు. ఊరూరా బెల్టుషాప్‌లు. ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. డోర్‌ డెలివరీ చేస్తున్నారు. ఉచిత ఇసుక పేరుకే. కానీ, ఎక్కువ ధరకు ఇస్తున్నారు. మనం వర్షాకాల సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని 80 లక్షల టన్నులు స్టాక్‌ పెడితే, ఈ ప్రభుత్వం వచ్చీ రాగానే ఎక్కడికక్కడ అమ్మేసుకున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఏ కంపెనీ నడపాలన్నా, ఎక్కడ ఏ మైనింగ్‌ చేయాలన్నా ఎమ్మెల్యేకు కప్పం కట్టాల్సిందే.బాండ్ల పేరుతో కొత్త అవినీతి:ఇంత పచ్చిగా అవినీతి చేస్తూ, దాన్ని గత మన ప్రభుత్వం మీదకు నెడుతూ, అదే పనిగా తప్పుడు ఆరోపణలు. విమర్శలు చేస్తున్నారు. ఇంకా వాటికి ఎల్లో మీడియా వంత పాడుతోంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 అదే పనిగా దుష్ప్రచారం చేస్తున్నాయి. కొత్తగా బాండ్ల పేరుతో అవినీతి. ఏపీ ఎండీసీలో కొత్తగా బాండ్లు జారీ చేస్తూ, అవినీతికి పాల్పడుతున్నారు. అలా కోరుకున్న వారికి గనులన్నీ ఇచ్చుకునే తంతు చేస్తున్నారు. ఇలాంటి అవినీతి వ్యవహారం ఇప్పటి వరకు చూడలేదు.మళ్లీ వచ్చేది మనమే:చూస్తుండగానే ఏడాది గడిచింది. కళ్లు మూసుకుని తెరిస్తే మూడేళ్లు గడుస్తాయి. మనం గట్టిగా నిలబడి మూడేళ్లు ఇలాగే పోరాడితే, ఆ తర్వాత వచ్చేది కచ్చితంగా మన ప్రభుత్వమే. ఇప్పుడు మిమ్మల్ని వేధిస్తున్న వారెవ్వరినీ వదిలిపెట్టబోము. మనం అధికారంలోకి వచ్చాక, వారిని చట్టం ముందు నిలబెడతాం.

Govt Orders Ott Platforms To Take Down All Pakistan Origin Content With Immediate Effect6
పాకిస్థాన్‌కు భారత్‌ మరో షాక్‌.. ఇకపై అవన్నీ బంద్‌

పాకిస్థాన్‌కు భారత్‌ వరుస షాక్‌లు ఇస్తోంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత దాయాది దేశం పాకిస్తాన్‌కు భారత్‌ చుక్కలు చూపిస్తోంది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపేసిన భారత్‌.. బాగ్‌లిహార్‌ ఆనకట్ట నుంచి కూడా పాక్‌కు నీటి సరఫరాను నిలిపివేసింది. ఇప్పటికే పాకిస్థాన్‌పై పలు ఆంక్షలు విధించగా.. ఆ దేశంపై డిజిటల్‌ యుద్ధం కూడా ప్రారంభించింది. పాకిస్థాన్‌ ఓటీటీ, వెబ్‌సీరీస్‌లు, సినిమా పాటలపై నిషేధం విధించింది. పాడ్‌కాస్ట్‌లు, మీడియా కంటెంట్‌పై కూడా నిషేధం విధించాలని నిర్ణయించింది. జాతీయ భద్రత దృష్ట్యా ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని భారత సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ వెల్లడించింది.పాక్‌ను అన్ని వైపుల నుంచి భారత్‌ దిగ్బంధిస్తోంది. ముప్పేట దాడి చేసేందుకు ఉన్న ఏ అవకాశాన్నీ విడిచి పెట్టడం లేదు. తాజాగా, వినోద రంగం విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్‌ వెబ్‌ సిరీస్‌లు, సినిమాలు, పాటలు, పాడ్‌కాస్ట్‌లు సహా మీడియా కంటెంట్‌ ఏదీ కూడా ఇక భారత్‌లో అందుబాటులో ఉండదు. సబ్‌స్క్రిప్షన్‌, సహా ఇతర మార్గాల ద్వారా కంటెంట్‌ పొందుతున్న వారికీ ఇందులో ఏ మినహాయింపు లేదు. ఓటీటీలు పాకిస్థాన్‌ కంటెంట్‌ను భారత్‌లో స్ట్రీమింగ్‌ చేయడానికి వీల్లేదు’ అని కేంద్రం స్పష్టం చేసింది.కాగా, దేశవ్యాప్తంగా 27 ఎయిర్ పోర్టులను మూసివేశారు. భద్రతా కారణాల దృష్ట్యా విమానాల రాకపోకలు రద్దు చేశారు. ఢిల్లీకి వచ్చే, వెళ్లే 90 విమానాలను రద్దు చేశారు. రద్దయిన విమానాల్లో ఐదు అంతర్జాతీయ విమాన సర్వీసులు ఉన్నాయి.

Man Earning Rs 66 Lakh A Year But He Worked Only One Week a Month7
నెలకు వారం రోజులే పని: ఏడాదికి రూ.66 లక్షల సంపాదన

నెల మొత్తం పనిచేసినా జీతాలు సరిగ్గా ఇవ్వని సంస్థలు చాలానే ఉన్నాయి. అయితే నెలకు కేవలం వారం రోజులు మాత్రమే పనిచేస్తూ.. ఓ వ్యక్తి ఏడాదికి 66 లక్షల రూపాయల కంటే ఎక్కువ సంపాదిస్తున్నట్లు వెల్లడించాడు. దీనికి సంబంధించిన సోషల్ మీడియా పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.నేను సంవత్సరానికి రూ. 66 లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తున్నాను. ఉద్యోగం విషయంలో చాలా ఖచ్చితంగా, సమర్థవంతంగా ఉంటాను. అయితే నెలకు వారం రోజులు మాత్రమే పనిచేస్తాను. మిగిలిన సమయం మొత్తం టీవీ షోలు చూడటం, పాడ్‌కాస్ట్‌లు వంటివి చూడటం వంటివి చూస్తానని రెడ్దిట్ యూజర్ పేర్కొన్నాడు.నేను ఉద్యోగంలో చేరినప్పుడు చాలా వెనుకబడి ఉండేవాడిని. ఆ తరువాతనే అన్నీ నేర్చుకున్నాను. పనిచేయడం వేగంగా నేర్చుకున్నాను. నేను నిమిషానికి 75 పదాలు టైప్ చేయగలిగాను. ఎటువంటి తప్పులు లేకుండా పనిచేయగలిగాను. నా పనికి సంబంధించి ఎవరూ కంప్లైంట్స్ చేయలేదు. నేను మా కంపెనీలో బెస్ట్ ఎంప్లాయిగా నిలిచాను. క్లయింట్‌లతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. నా పనిని నేనే పూర్తి చేస్తాను. అయితే వారం రోజులు మాత్రమే పనిచేస్తానని ఆ వ్యక్తి స్పష్టం చేసాడు.నేను కూడా ఒకప్పుడు చాలా చదివేవాడిని. ఒక సంవత్సరంలో 200 పుస్తకాలు చదివాను. నాకు ఇష్టమైన ప్రతి అంశంపై లోతుగా పరిశోధన చేసాను. మరి ఇప్పుడు.. నాకు బోర్ కొడుతోంది. ప్రతిదీ సరిగ్గా చేయడం మంచిదని నేను అనుకున్నాను. తక్కువ పనిలోనే ఎక్కువ సాధిస్తున్నాను. అయితే ఏదో ఒక విధంగా నేను కష్టపడుతున్నప్పుడు కంటే ఇప్పుడు అధ్వాన్నంగా ఉన్నాను. ఇది సరైనది కాదని చెప్పాడు.ఇదీ చదవండి: రైల్వే టికెట్‌తో రోజుకు రూ. 10వేలు, వారానికి రూ. 50వేలుఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవ్వడంతో.. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కొందరు మా పరిస్థితి కూడా ఇలాగే ఉందని అన్నారు. ఇంకొందరు పనిలో తీరిక లేకుండా పోతోందని నిరాశను వ్యక్తం చేశారు.

AP Police Over Action At Sakshi Editor Dhanunjaya Reddy8
పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు.. ‘సాక్షి’పై ఏపీ సర్కార్‌ కక్ష సాధింపు

సాక్షి, విజయవాడ: ఏపీలో పత్రికా స్వేచ్చకు సంకెళ్లు పడ్డాయి. కూటమి ప్రభుత్వంలో సాక్షిపై కక్షసాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే చంద్రబాబు ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై వార్తలు రాసినందుకు సాక్షి పత్రిక ఎడిటర్‌ ధనుంజయ రెడ్డిపై పోలీసులు వేధింపు చర్యలకు దిగారు. సోదాల పేరుతో ఏపీ పోలీసులు గురువారం ఉదయం.. సాక్షి ఎడిటర్‌ ధనుంజయ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. ఎలాంటి నోటీసులు లేకుండానే ధనుంజయ రెడ్డి ఇంటికి పోలీసులు చేరుకుని ఆయన కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురిచేశారు. ఇంట్లోకి వెళ్లిన పోలీసులు.. కాసేపటికే ఇంటి తలుపులు మూసివేసి గంటల తరబడి సోదాలు చేశారు. అయితే, గతంలోనూ ధనుంజయ రెడ్డిపై పోలీసులు కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నిస్తూ కథనాలు రాసిన పలువురు సాక్షి విలేకర్లపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు.ఏసీపీ ప్రవర్తన దుర్మార్గం: ధనుంజయ రెడ్డి అనంతరం, సాక్షి పత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డి మాట్లాడుతూ.. ఈరోజు ఉదయం 9:45కి పది మంది పోలీసులు ఇంటికి వచ్చారు. సోదాలకు సంబంధించి‌ నోటీసులు లేకుండా ఇంట్లోకి దూసుకొచ్చేశారు. ఏసీపీ మరింత దుర్మార్గంగా ప్రవర్తించారు. నోటీస్ కూడా ఇవ్వకుండా సోదాలు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఇలాంటి చర్యలు పత్రికా స్వేచ్ఛకి విఘాతం కలిగిస్తాయి. ప్రజల గొంతుకై ‘సాక్షి’ నిలుస్తుంది అని కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. ఇప్పటికే నాలుగు సార్లు కేసులు పెట్టారు. ప్రస్తుతం హైకోర్టు పరిధిలో కేసు ఉంది. సంబంధం లేదని వాళ్లే చెబుతారు. మళ్లీ వారే సోదాలు చేస్తారు. ప్రెస్ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాకి కూడా మేము ఫిర్యాదు ఇస్తాం. మానసిక స్థైర్యాన్ని దెబ్బ తీయడానికి ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యవాదులంతా ఈ పద్ధతిని ఖండించాలి’ అని అన్నారు. ఖండించిన పాత్రికేయులుఏపీలో ఎమ‌ర్జెన్సీ నాటి ప‌రిస్థితులు నెల‌కొన్నాయ‌ని పాత్రికేయులు మండిప‌డుతున్నారు. కూటమి ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను, ప్ర‌జా వ్య‌తిరేక చ‌ర్య‌ల‌ను ప్ర‌శ్నిస్తున్నందుకే సాక్షిపై చంద్ర‌బాబు స‌ర్కారు క‌క్ష సాధిస్తోంద‌ని ఆరోపిస్తున్నారు. కూట‌మి ప్ర‌భుత్వ క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌ను ప్ర‌జాసంఘాల‌తో పాటు ప్ర‌జ‌లు ముక్త కంఠంతో వ్య‌తిరేకిస్తున్నార‌ని తెలిపారు. ప్ర‌భుత్వంలో జ‌రుగుతున్న అక్ర‌మాల‌ను నిగ్గ‌దీసి అడుగుతున్నందుకు, క‌క్ష గ‌ట్టి ప్ర‌జల గొంతును నొక్కాల‌ని చేస్తున్న ప్ర‌య‌త్నంలో భాగంగానే కూట‌మి స‌ర్కారు ఇదంతా చేస్తోంద‌ని ఆరోపించారు. ప్ర‌జ‌ల‌కు జ‌రుగుతున్న అన్యాయాన్ని ప్ర‌శ్నిస్తూనే ఉంటామ‌ని, ఇచ్చిన హామీల‌ను నిల‌బెట్టుకునేలా ప్ర‌భుత్వంపై ఒత్తిడి కొన‌సాగిస్తామ‌న్నారు. సాక్షిపై కక్ష సాధింపు చ‌ర్య‌ల‌ను ప‌త్రికా స్వేచ్ఛ‌పై జ‌రిగిన దాడిగా పాత్రికేయులు పేర్కొన్నారు. ప్ర‌భుత్వం రాజ్యాంగ‌బ‌ద్దంగా న‌డుచుకోవాల‌ని కక్ష సాధింపు చ‌ర్య‌లు మానుకోవాల‌ని హిత‌వు ప‌లికారు.

Hit 3 Actor Prateik Babbar, Who is he?9
బిడ్డకు జన్మనిచ్చి మరణించిన ‍స్టార్‌ హీరోయిన్‌.. అతనే 'హిట్‌-3' విలన్‌

బాలీవుడ్ నటుడు ప్రతీక్ బాబర్‌ హిట్‌-3 సినిమాతో టాలీవుడ్‌లో బాగా పాపులర్‌ అయ్యాడు. హిందీలో ఆయన సుమారు 30కి పైగా సినిమాల్లో నటించారు. అయితే, హిట్‌-3లో విలన్‌గా ఆల్ఫా పాత్రలో మంచి గుర్తింపు పొందాడు. సికందర్‌, దర్భార్‌, భాగీ2 వంటి చిత్రాల్లో కూడా ప్రతీక్‌ మెప్పించాడు. అయితే, ప్రతీక్ బాబర్‌ ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌ కుమారుడు అని చాలామందికి తెలియదు. మహానటి అనే పేరుకు అసలైన ఐకాన్‌గా ఒకప్పుడు ఆమె పేరు పొందింది.పద్మశ్రీతో పాటు రెండు నేషనల్‌ అవార్డ్స్‌ఉత్తమ నటిగా రెండు జాతీయ అవార్డ్స్‌ అందుకున్న స్మితా పాటిల్ ఏకైక కుమారుడే ప్రతీక్‌ బాబర్‌.. 80కి పైగా సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన ఆమె కేవలం 31 ఏళ్ల వయస్సులోనే కన్నుమూసింది. స్టార్‌ హీరోయిన్‌ కాకముందే ఆమె డైరెక్టర్స్‌కు కండీషన్స్‌ పెట్టేది. అగ్లీ డ్రెస్సులు అంటే నో చెప్పేది. తన పాత్రకు ప్రాధాన్యం లేకపోతే ఎంత పెద్ద హీరో అయినా సరే.. డబ్బు ఎంత ఇచ్చినా సరే డోన్ట్ కేర్ అనేది. ఆమె చిత్రపరిశ్రమలో ఉన్నదే పదేళ్లు.. అయినా సరే భారీగా ఫ్యాన్స్‌ను సంపాదించుకుంది. ఇండియన్ సినిమా తెరపై మళ్లీ ఇలాంటి నటిని చూడలేమేమో అనేంతలా సినీ అభిమానులను మెప్పించింది. కేతన్ మెహతా 1987లో తీసిన "మిర్చ్ మసాలా" చిత్రంలో ఈమె నటనను ఫోర్బ్స్ పత్రిక "భారత సినిమాలలో 25 అత్యున్నత నట ప్రదర్శనల" జాబితాలో చేర్చింది. ఇదొక మచ్చుతునక మాత్రమేనని చెప్పవచ్చు.1955లో జన్మించిన ఆమె దశాబ్దకాలంలోనే 80కి పైగా సినిమాల్లో నటించింది. భారత ప్రభుత్వం ఈమెను 1985లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 2013లో ఆమె పేరుతో పోస్టల్‌ స్టాంప్‌ కూడా విడుదలైంది. సినీ నటుడు రాజ్ బబ్బర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న స్మితా పాటిల్‌ ప్రతీక్ బబ్బర్‌ను కన్న తరువాత రెండు వారాలకు చనిపోయింది. కాన్పు వల్ల కలిగిన అనారోగ్య సమస్యల కారణంగా 1986, డిసెంబర్ 13న మరణించింది. తల్లి మీద ప్రేమతో హిట్‌-3 నటుడు తన పేరును 'ప్రతీక్‌ స్మితా పాటిల్‌'గా మార్చుకున్నాడు.

KR Bhaskars Puranpoli Ghar Success waiter to Rs 3.6 Crore Profits10
వెయిటర్ టు కరోడ్‌పతి: కె.ఆర్. భాస్కర్ ఇన్‌స్పైరింగ్ జర్నీ

ఎపుడు ఎలా పనిచేశామన్నది కాదు. సక్సెస్‌ సాధించామా లేదా అన్నది ముఖ్యం. తమ అభిరుచికి, నైపుణ్యానికి కాస్త పట్టుదల, కృషి జోడిస్తే విజయం మనముందు సాగిలపడుతుంది. దీన్నే అక్షరాలా నిరూపించి చూపించారు కె.ఆర్. భాస్కర్. హోటల్‌లో వెయిటర్‌గా మొదలైన భాస్కర్‌ ప్రయాణం కోట్ల రూపాయల లాభాలను తెచ్చిపెడుతోంది. ఇంతకీ ఆయన సాధించిన విజయం ఏంటి? కేఆర్‌ భాస్కర్‌ స్ఫూర్తి దాయక స్టోరీ గురించి తెలుసుకుందాం.ఎక్కడైనా రుచి కరమైన టిఫిన్లు, ఆహారం లభిస్తోందంటే ఆహార ప్రియులకు పండగే. ఎంతదూరమైనా వెళ్లి దాని రుచిని ఆస్వాదించాల్సిందే. మళ్లీ మళ్లీ తిని ఆహా..! అనాల్సిందే. అంతేకాదు నలుగురికీ వారి ద్వారా జరిగే మౌత్‌ పబ్లిసిటీ విజయం తక్కువేమీకాదు. అంతటి మహిమ ఫుడ్‌ బిజినెస్‌కు ఉంటుంది. కేఆర్‌ భాస్కర్‌ తయారు చేసే బొబ్బట్ల (పూరన్‌ పోలి) వాసనకే ఆహార ప్రియులు పరవశులైపోతారు. ఆ సువాసన ముక్కు పుటాలకు తాకిన వారెవ్వరూ వాటి రుచి చూడకుండా వదిలిపెట్టరు.కర్ణాటక,మహారాష్ట్రలోని సందడిగా ఉండే వీధుల్లో 'భాస్కర్ పురాన్‌పోలి ఘర్' అలా వేలాది కస్టమర్లను ఆకర్షిస్తుంది. రెండు రాష్ట్రాలలో విస్తరించింది.ఇదీ చదవండి: 30 డేస్‌ ఛాలెంజ్‌ : ఇలా చేస్తే యవ్వనంగా, ఆరోగ్యంగా!భాస్కర్ కథ స్ఫూర్తి దాయకమైనది. కర్ణాటకలోని కుందాపూర్‌లో పేద రైతు కుటుంబంలో జన్మించిన ఆయన చిన్నప్పటి నుంచీ కష్టాలను ఎదుర్కొన్నారు. కానీ ఆయన ఎప్పుడూ తన కలలను వదులుకోలేదు! అవిశ్రాంత పట్టుదలకు ఓరిమికి నిదర్శనం ఆయన సక్సెస్‌ జర్నీ. కర్ణాటకలో పెరిగిన ఆయన చిన్న వయసులోనే ఉద్యోగ రంగంలోకి దిగారు. కేవలం 12 సంవత్సరాల వయసులోనే బెంగళూరులోని ఒక హోటల్‌లో టేబుల్స్ శుభ్రం చేయడం , పాత్రలు కడగడం వంటి పనులు చేసేవాడు. అలా దాదాపు ఐదేళ్లకు పైగా భాస్కర్ వెయిటర్‌గా పనిచేశాడు. ఆ అనుభవమే ఈ వ్యాపారంపై లోతైన అవగాహన కలిగింది. అలాతన జీవితాన్ని మలుపు తిప్పిన వైనాన్ని. షార్క్ ట్యాంక్ ఇండియా సీజన్ 2లో భాస్కర్ తన విజయగాథను పంచుకున్నారు.అంతకుముందు ఎనిమిదేళ్ల పాటు నృత్య బోధకుడిగా పనిచేశాడు. పాన్ షాప్ ఓపెన్‌ చేశాడు. కానీ పెద్దగా సక్సెస్‌కాలేదు. తన పాక నైపుణ్యంతో ఫుడ్‌బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. 23 ఏళ్ల వయసులో తన తల్లి సహకారంతో నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా, రుచికరమైన బొబ్బట్లను తయారు చేసి సైకిల్ మీద వీధుల్లో అమ్మడం ప్రారంభించాడు. ఆ చిన్న అడుగే కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యానికి బాటలు వేసింది. పురాన్‌పోలి తయారీలో అతని ప్రతిభకు, వాటి టేస్ట్‌కు అందరూ ఫిదా అయిపోయారు. 'పూరన్‌ పోలి ఘర్ ఆఫ్ భాస్కర్' త్వరలోనే నాణ్యత ,అభిరుచికి పర్యాయపదంగా మారింది. కట్‌ చేస్తే భాస్కర్ సంస్థ కర్ణాటకలోనే 17 అవుట్‌లెట్‌లు,10 కి పైగా ఫ్రాంచైజీలతో వ్యాపారం చేస్తున్నాడు. పెరుగుతున్న డిమాండ్‌ను ప్రతిబింబంగా ప్రతీ ఎనిమిది నెలలకో అవుట్‌లెట్‌ను ప్రారంభిస్తాడు. చాలా సాదా సీదాగా వీధి వెంచర్‌గా ప్రారంభమైన ఈ వ్యాపారం, ఇప్పుడు నెలవారీ ఆదాయాన్ని 18 కోట్లకు పైగా ర్జిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో 3.6 కోట్ల నికర లాభాన్ని సాధించడం విశేషం.. 'పురాన్‌పోలి ఘర్ ఆఫ్ భాస్కర్' విజయం భాస్కర్ పాక నైపుణ్యానికి మాత్రమే కాకుండా అతని వ్యాపార చతురతకు కూడా ఒక అద్భుతమైన ఉదాహరణ. రుచిలోనూ, నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా పట్టుదల ,అంకితభావంతో నిరంతరం అనేక కొత్త ఉత్పత్తులు, కొత్త రుచులతో ఇష్టమైన బ్రాండ్‌గా అవతరించింది. ఇదంతా కె.ఆర్. భాస్కర్ అచంచలమైన సంకల్పశక్తికి నిదర్శనం.చదవండి: Operation Sindoor : అంబానీ లెక్క అది...తొలి సంస్థగా రిలయన్స్‌!

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement