Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Abdul Basit: India Likely to Strike Pakistan After Russia Victory Celebrations1
భారత్‌ మాపై దాడి చేసేది అప్పుడే.. పాక్‌ మాజీ దౌత్వవేత్త సంచలన ట్వీట్‌!

ఇస్లామాబాద్‌: 1971లలో నాటి భారత్‌-పాకిస్తాన్‌ యుద్ధ సమయంలో భారత్‌ మాక్‌ డ్రిల్స్‌ నిర్వహించింది. 1971 తర్వాత ఇలాంటి డ్రిల్స్‌ బుధవారం జరగనుంది. ఈ తరుణంలో పాకిస్తాన్‌ మాజీ దౌత్వవేత్త (హైకమిషనర్‌) అబ్దుల్‌ బాసిత్‌ సంచలన ట్వీట్‌ చేశారు. రష్యా విక్టరీ డే తర్వాత భారత్‌.. పాకిస్తాన్‌పై దాడి చేసే అవకాశం ఉందని ట్వీట్‌లో పేర్కొన్నారు. వచ్చే వారం,11,12వ తేదీలలో దాడి చేయొచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు. India will likely carry out its limited misadventure against Pakistan after Victory Celebrations in Russia. Perhaps on 10-11 May.— Abdul Basit (@abasitpak1) May 6, 2025మరోవైపు, పాక్‌పై దాడి చేసేందుకు భారత్‌ సర్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు ముహూర్తం దాదాపుగా ఖరారైంది. సరిహద్దులకు ఆవలివైపు నుంచి ఉగ్ర దాడులను పనిగట్టుకుని ఎగదోస్తున్న దాయాదికి బుద్ధి చెప్పేందుకు రంగం సిద్ధమైంది. ఈ వారాంతంలోపు ఎప్పుడైనా పాక్‌పై భారీ స్థాయి ‘ఆపరేషన్‌’ జరగవచ్చని కేంద్ర ప్రభుత్వ అత్యున్నత వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో మోదీ సర్కార్‌ సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. యుద్ధ సన్నద్ధతను సరిచూసుకునేందుకు బుధవారం పలురకాల మాక్‌ డ్రిల్స్‌ నిర్వహించాల్సిందిగా రాష్ట్రాలను ఆదేశించింది.1971 తర్వాత ఇలాంటి డ్రిల్స్‌ జరగనుండటం ఇదే తొలిసారి కావడం విశేషం! అప్పుడు కూడా పాక్‌తో యుద్ధం నేపథ్యంలోనే ఈ చర్యలు తీసుకున్నారు. డ్రిల్స్‌లో భాగంగా వాయుదాడుల సైరన్లు మోగించి అప్రమత్తం చేస్తారు. ప్రజలను ఉన్నపళంగా ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించడం వంటి చర్యలు చేపడతారు. ఈ విషయమై ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రణాళికలను తక్షణం అప్‌డేట్‌ చేసుకోవాలని కేంద్ర హోం శాఖ పేర్కొంది.ఈ మేరకు రాష్ట్రాలకు అడ్వైజరీ జారీ చేసింది. డ్రిల్స్‌లో భాగంగా సమర్థమైన పౌర రక్షణ చర్యలు చేపట్టడంలో ప్రజలకు, ముఖ్యంగా యువతకు శిక్షణ ఇవ్వనున్నారు. పహల్గాం ఉగ్ర దాడుల వంటివి జరిగితే దీటుగా ఎదుర్కోవడం ఎలాగో నేర్పిస్తారు. స్వీయరక్షణ చర్యలతో పాటు విద్యుత్‌ సరఫరా బ్లాకౌట్‌ వంటివి జరిగితే తక్షణం ఎలా స్పందించాలో, కీలక మౌలిక వనరుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో వివరిస్తారు.

Technologies Used in Modern Warfare2
సాంకేతికతతో యుద్ధానికి సై

సాంకేతిక పరిజ్ఞానం అన్ని రంగాల్లో వేగంగా విస్తరిస్తోంది. అందుకు యుద్ధ భూమి ఏమీ అతీతం కాదు. శత్రువులపై యుద్ధం సాధించేందుకు, స్పష్టమైన ఫలితాల కోసం టెక్నాలజీ వాడుతున్నారు. ఇందులో భాగంగా మానవరహిత ఆయుధాలు, సైబర్‌ వార్ఫేర్‌, డ్రోన్లు, రోబోటిక్స్‌, అన్‌ మ్యాన్డ్‌ అడ్వాన్స్‌డ్‌ వెపన్స్‌.. వంటి చాలా పరికరాల్లో సాంకేతికతను వినియోగిస్తున్నారు. కృత్రిమమేధ వాడకం పెరుగుతున్న ఈ రోజుల్లో రణరంగంలో టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగిస్తున్నారో తెలుసుకుందాం.ఏఐ, మెషిన్ లెర్నింగ్యుద్ధ సమయాల్లో నిర్ణయాలు తీసుకోవడం, ప్రక్రియలను ఆటోమేట్ చేయడం, ఇంటెలిజెన్స్ విశ్లేషణను మెరుగుపరిచేందుకు కృత్రిమ మేధ సాయం తీసుకుంటున్నారు. యుద్ధరంగంలో ఇది విప్లవాత్మక మార్పులు తెస్తోంది. శత్రువుల కదలికలను అంచనా వేయడానికి లేదా వ్యూహాత్మక లక్ష్యాలను గుర్తించడానికి ఏఐ విస్తారమైన డేటాసెట్లను ప్రాసెస్ చేస్తుంది. అటానమస్‌ విధానం ద్వారా డ్రోన్లు, వాహనాలకు ఏఐ సామర్థ్యాలు జోడిస్తున్నారు. ఇది మానవ ప్రమేయం లేకుండా రియల్ టైమ్ డెసిషన్ మేకింగ్‌కు వీలు కల్పిస్తుంది. సైబర్ బెదిరింపులను గుర్తించి సమర్థంగా కట్టడి చేసేందుకు మెషిన్ లెర్నింగ్ తోడ్పడుతుంది. కీలకమైన మౌలిక సదుపాయాలను రక్షిస్తుంది.మానవ రహిత వ్యవస్థలు (డ్రోన్లు, రోబోటిక్స్)యుద్ధంలో మానవరహిత వ్యవస్థలు అనివార్యంగా పెరుగుతున్నాయి. ఇది సైనికులు ప్రాణాలు కోల్పోవడాన్ని తగ్గిస్తుంది. ఇందులో డ్రోన్లు కీలకంగా మారుతున్నాయి. ఏరియల్ డ్రోన్లను నిఘా, దాడుల్లో కచ్చితత్వం కోసం ఉపయోగిస్తున్నారు. అమెరికా ఆర్మీకి చెందిన స్మాల్ అన్‌మ్యాన్డ్‌ గ్రౌండ్ వెహికల్ (ఎస్‌యూజీవీ) వంటి రోబోలు బాంబుల తొలగింపును నిర్వహిస్తున్నాయి. మానవరహిత అండర్ వాటర్ వెహికల్స్ (యూయూవీ) మైన్ డిటెక్షన్, సబ్ మెరైన్ ట్రాకింగ్ పనులు చేస్తున్నాయి.సైబర్ వార్‌ఫేర్‌ టెక్నాలజీయుద్ధ సమయంలో కమ్యూనికేషన్లు, ఆర్థిక వ్యవస్థలు, ఇతర రక్షణ వ్యవస్థలకు అంతరాయం కలిగించేలా సైబర్‌ దాడులు నిర్వహించే అవకాశం ఉంది. వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు సైబర్ వార్‌పేర్‌ డిజిటల్ మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నారు. ఇందులో భాగంగా మాల్వేర్, హ్యాకింగ్ టూల్స్ ద్వారా ప్రభుత్వ ప్రాయోజిత వెబ్‌సైట్‌ల్లోని సమాచారం శత్రు దేశాల్లోని నెట్‌వర్క్‌లోకి వెళ్లకుండా అధునాతన సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. దాంతోపాటు ఏఐ ఆధారిత సైబర్ సెక్యూరిటీ ద్వారా మిలిటరీ నెట్‌వర్క్‌లను రక్షిస్తున్నారు.అధునాతన ఆయుధాలుఆధునిక ఆయుధాల ద్వారా ప్రమాద పరిధి పెరుగుతుంది. రష్యాకు చెందిన కింజాల్ అనే హైపర్ సోనిక్ ఆయుధాలు లేదా చైనాకు చెందిన డీఎఫ్-జెడ్ ఎఫ్ వంటి క్షిపణులు సంప్రదాయ రక్షణ వ్యవస్థల నుంచి వెంటనే తప్పించుకుంటాయి. లేజర్లు, మైక్రోవేవ్ వ్యవస్థలు డ్రోన్లు లేదా క్షిపణులను కచ్చితత్వంతో నిలిపివేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. జీపీఎస్ గైడెడ్ బాంబులు నిర్దిష్ట లక్ష్యాన్ని చేదిస్తాయి.ఇదీ చదవండి: భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో టాప్‌ బ్రాండ్‌ ఇదే..శాటిలైట్ అండ్ స్పేస్ టెక్నాలజీస్సైనిక కార్యకలాపాలకు అంతరిక్షం కీలకమైన డొమైన్‌గా మారింది. నిఘా ఉపగ్రహాలతో రియల్ టైమ్ ఇమేజ్‌లు, ప్రత్యేకంగా సిగ్నలింగ్‌ సదుపాయాలను పొందుతున్నారు. దళాల కదలికల కోసం జీపీఎస్, నావిగేషన్‌ను వాడుతున్నారు. కమ్యూనికేషన్లకు అంతరాయం కలిగించే శత్రు ఉపగ్రహాలను నిలిపివేయడానికి లేదా నాశనం చేయడానికి యాంటీ శాటిలైట్ వెపన్స్ రూపొందిస్తున్నారు.

Kommineni Srinivasa Rao Analysis On Andhra Pradesh Treasury3
తాకట్టులో ఆంధ్రప్రదేశ్‌ ఖజానా!

ఇది విన్నారా? ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఖజానానే తాకట్టు పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అది కూడా రూ.9500 కోట్ల అప్పు కోసం! ఏడాది కూడా నిండని కూటమి పాలనలో ఇప్పటికే రికార్డు స్థాయిలో రూ.1.47 లక్షల కోట్ల అప్పులయ్యాయి. ఇవి చాలవన్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం అదనంగా ఖజానాను తాకట్టు పెట్టి రుణాలు పొందే ప్రయత్నం చేస్తోంది. గనుల మాదిరిగానే ట్రెజరీని కూడా తాకట్టు పెడుతున్నట్టుగా ఒప్పందం ఉండటం.. రుణ వాయిదాలు సకాలంలో చెల్లించలేకపోతే రిజర్వు బ్యాంక్‌లోని రాష్ట్ర ప్రభుత్వ ఖాతా నుంచి నేరుగా వసూలు చేసుకోవచ్చట. ఈ వార్త విన్నప్పుడు తొలుత అది నిజమై ఉండదులే అనుకున్నాం. కాని వైసీపీ సీనియర్ నేత, ఆర్ధిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి స్వయానా ఈ విషయం చెప్పడంతో అదెలా సాధ్యమని అనిపించింది. ఖజానా తాకట్టు గురించి బుగ్గన విపులంగా వివరించినా.. కూటమి ప్రభుత్వం దానికి వివరణ కూడా ఇవ్వలేదు. వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని కూడా ఈ అంశాన్ని ప్రజల దృష్టికి తీసుకువెళ్లారు. ఇప్పుడు ట్రెజరీ ఖాతాకు సంబంధించిన ప్రభుత్వ ఆదేశాలు కూడా వెలుగులోకి వచ్చాయి. గతంలో ప్రభుత్వానికి అప్పులు అవసరం అయినప్పుడు మరీ బ్యాంకులు కోరితే ప్రభుత్వ కార్యాలయాలను తనఖా పెట్టడం జరిగేది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటివి జరిగితే విపక్ష తెలుగుదేశం, జనసేన, బీజేపీలు పెద్ద ఎత్తున రచ్చ చేశాయి. తెలుగుదేశం మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతిలు జరగరానిది ఏదో జరిగిపోతోందని ప్రజలను భయపెట్టే యత్నం చేసేవి. వీటి ప్రభావం సహజంగానే ప్రజలపై ఎంతో కొంత ఉంటుంది. ఆ రకంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్నికల రాజకీయాల కోసం ఎన్ని చేయాలో అన్నీ చేశారు. అబద్దపు ప్రచారం చేశారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షురాలుగా ఉన్న పురందేశ్వరి తన వంతు దుష్ప్రచారం చేశారు. జగన్ సర్కార్ నిత్యం అప్పు చేస్తోందని, రాష్ట్రాన్ని ఆర్థికంగా విధ్వంసం చేస్తోందని, శ్రీలంక అయిపోతుందని ఇలా ఏది పడితే అది మాట్లాడి జగన్ ప్రభుత్వంపై ప్రజలలో సందేహాలు వచ్చేలా వ్యవహరించారు. తాము అధికారంలోకి వస్తే అప్పులు తేబోమని, ఉన్న అప్పులు తీర్చుతామని, చంద్రబాబుకు సంపద సృష్టించడం తెలుసని ఊదరగొట్టేవారు. దీనితోపాటు తాము అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్, మరో వంద ఎన్నికల హామీలు అంటూ ప్రచారం చేసి బాండ్లు కూడా ఇచ్చి వచ్చారు. ఎలాగైతే అధికారం సాధించారు. ఇప్పుడేమో అప్పు చేయడమే సంపద అని అన్నట్లుగా మాట్లాడుతున్నారు. పోనీ దానిపై క్లారిటీతో మాట్లాడుతున్నారా అంటే అదీ లేదు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలని తనకూ ఆశగా ఉందని, కాని ఖజానా ఖాళీగా ఉందని, అప్పులు కూడా పుట్టడం లేదని చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు అంటున్నారు. కానీ ఏడాది కాక ముందే రూ.లక్షన్నర కోట్లు ఎలా అప్పు చేశారని ఆయనను ఎవరూ అడగరు. ప్రశ్నించే పరిస్థితి లేకుండా రెడ్ బుక్ అంటూ భయపెడుతున్నారు. పవన్‌ కళ్యాణ్‌ ఇలాంటివి పట్టించుకోవడం మానేసి చాలాకాలమైంది. కాని జనానికి వీరు చేస్తున్న మాయ అర్ధం అవుతోంది. అప్పుల మీద చంద్రబాబు గతంలో ఏమి చెప్పింది..ఇప్పుడు ఏమి చేస్తున్నది బెరీజు వేసుకుంటున్నారు. గతంలో జగన్ ప్రభుత్వ టైమ్‌లో రూ.వెయ్యి కోట్లు అప్పు తీసుకున్నా, దానిని మొదటి పేజీలో ప్రచురించి, అప్పులు తప్ప ఏపీలో ఇంకేమీ జరగడం లేదన్నట్లుగా ఎల్లో మీడియా ప్రచారం చేసింది. చంద్రబాబు తన సభలలో జగన్ ప్రభుత్వం అప్పులు చేస్తూ నాశనం చేస్తోందని, ఒకసారి పది లక్షల అప్పు చేశారని, మరరో సారి 13 లక్షల కోట్లుఅని, ఇంకోసారి ఏకంగా 14 లక్షల కోట్లు అని దుర్మార్గంగా పబ్లిసిటీ చేశారు.ఒక్క జగనే అంత భారీగా అప్పు చేశారా అన్న అనుమానం కలిగించారు. అంతే తప్ప, రాష్ట్రం విడిపోయినప్పుడు ఎంత అప్పు ఉంది. 2014 టర్మ్‌లో చంద్రబాబు ప్రభుత్వం ఎంత అప్పు చేసింది? ఆ తర్వాత జగన్ టైమ్ లో ఎంత అప్పు అయింది విడమరిచి చెప్పకుండా, మొత్తం అప్పంతా జగన్ ఖాతాలో వేసేశేవారు. అదే చంద్రబాబు గొప్పదనం. ఎంతటి అబద్దాన్ని అయినా నమ్మించేలా మాట్లాడగల సత్తా కలిగిన నేత అని ఆయన ప్రత్యర్ధులు చెబుతుంటారు. ఈ అప్పులపై ఆయన చేసిన దుష్ప్రచారం దానిని నిర్ధారిస్తుంది. విశేషం ఏమిటంటే జగన్ టైమ్‌లో రెండేళ్ల కరోనా ఉన్నా రూ.3.30 లక్షల కోట్ల అప్పు మాత్రమే చేశారని వెల్లడైంది. ఆ వివరాలు టీడీపీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్టే తెలిపింది. కాని కేశవ్ కార్పొరేషన్ల ద్వారా జగన్ ప్రభుత్వం అప్పు చేయడాన్ని ఆక్షేపించారు. సీన్ కట్ చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయా కార్పొరేషన్ల ద్వారా వేల కోట్లు అప్పులు చేస్తున్నారు. ప్రభుత్వపరంగా నేరుగా చేసిన అప్పులే లక్ష కోట్లు ఉంటే మరో రూ.ఏభై వేల కోట్లు అమరావతి పేరుతో తీసుకుంటున్నారు. అందులో ఇప్పటికే రూ.31 వేల కోట్లకు ఒప్పందం అయ్యారు. కేంద్ర ఆర్థిక సంఘం కేపీలో పర్యటించినప్పుడు అమరావతికి రూ.77 వేల కోట్లు అవసరమన్నారు. అమరావతిలో చేపడుతున్నామని రూ.లక్ష కోట్ల విలువైన పనులు మంత్రి నారాయణ చెప్పారు. ఒక్క రూపాయి వ్యయం ప్రభుత్వపరంగా చెయనవసరం లేదని చెప్పిన చంద్రబాబు చేస్తున్న నిర్వాకం ఇదన్నమాట. ఈ క్రమంలో తాజాగా ఏపీ ఖనిజాభివృద్ది సంస్థ ద్వారా రూ. తొమ్మిది వేల కోట్లు అప్పు తీసుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి నిజంగానే పరపతి పోయిందేమో తెలియదు కాని, బాండ్ల రూపంలో ఆ అప్పు ఇచ్చినవారికి నమ్మకం కలిగించడానికి రాష్ట్రంలో ఉన్న సుమారు రూ.1.91 లక్షల కోట్ల విలువైన ఖనిజ నిక్షేపాలన్నిటిని ఖనిజాభివృద్ధి సంస్థకు బదలాయించి, వాటిని చూపించి ఈ అప్పు తీసుకున్నారు. అయినా బాండ్లు కొన్నవారికి ఇంకా అపనమ్మకంగానే ఉన్నట్లు ఉంది. అందుకే ఒకవేళ ఖనిజాభివృద్ది సంస్థ ఖాతాలో రుణ వాయిదాల ఆరునెలల మొత్తం డిపాజిట్ లేకపోతే, ఆ ప్రైవేటు సంస్థలు, లేదా వ్యక్తులు ప్రభుత్వానికి రిజర్వు బ్యాంక్‌లో ఉండే ఖాతా నుంచి నేరుగా తమ రుణ వాయిదాను రాబట్టుకోవచ్చని చెబుతూ జీవోనే ఇచ్చేశారు. ఇది ఒకరకంగా దుస్సాహసమే. ప్రజల పట్ల బాధ్యతలేని పద్దతే అని అనాలి. చంద్రబాబు సర్కార్ విడుదల చేసిన జీవో లోని అంశాలను పేర్ని నాని ఏప్రిల్ 24న చదివి వినిపించారు. నేరుగా ఏపీ అకౌంట్‌ నుంచి డైరెక్ట్ డెబిట్ మ్యాండేట్ మెకానిజం ద్వారా అవకాశం ఇవ్వడం రాజ్యాంగ విరుద్దమని నాని అన్నారు. అది వాస్తవమైనా, ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం ఉన్న ఊహాలోకంలో వారిని ప్రశ్నించేవారు లేరు. వైసీపీ వారు ప్రశ్నించినా పట్టించుకున్న నాథుడు లేడు. విశేషం ఏమిటంటే ఇప్పటివరకు చేసిన అమరావతికి కాకుండా చేసిన లక్ష కోట్ల అప్పు ఏమి చేసింది కూడా ప్రభుత్వం వివరించలేదు.జగన్ ప్రభుత్వంపై ఉన్నవి, లేనివి కలిపి శ్వేతపత్రాలు అంటూ పిచ్చి పత్రాలు విడుదల చేసిన సర్కార్, జీఎస్డీపీలో దేశంలోనే నెంబర్ 2 అంటూ కాకి లెక్కలు చెప్పిన సర్కార్ , ధైర్యంగా ఈ లక్ష కోట్లు ఏ రకంగా వ్యయం చేసింది ఎందుకు చెప్పలేకపోతున్నారు? సూపర్ సిక్స్ హామీల అమలుకు ఈ మొత్తంలో ఎంత వ్యయం చేశారో చెబుతారా? బడ్జెట్‌లో చిల్లర ఖర్చుల కోసం దాదాపు రూ.8 వేల కోట్ల రూపాయలు కేటాయించి మరో రికార్డును కూడా ఈ ప్రభుత్వం సృష్టించింది. మరో వైపు గత ప్రభుత్వ టైమ్‌లో వచ్చిన ఆదాయం కంటే ఈ ప్రభుత్వం వచ్చాక సుమారు రూ.13 వేల కోట్లు తగ్గిందని నిపుణులు లెక్కలు చూపుతున్నారు. ఇలాంటి వాటిపై సోషల్ మీడియాలో పలువురు విశ్లేషకులు ప్రశ్నిస్తున్నా జవాబు చెప్పడం లేదు.అందువల్లే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటివారు పిట్టల దొర కబుర్లు చెబుతూ, ఆకాశంలో మేడలు కడుతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. సంపద సృష్టించడం సంగతి దేవుడెరుగు. ఏపీని ఈ రకంగా అప్పుల పాలు చేయకుండా ఉంటే చాలు దేవుడా అని జనం అనుకునే పరిస్థితి ఏర్పడింది. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

Nearly Fell Off My Chair: Shane Watson Stunned By DC Strategy Vs SRH4
మతిపోయిందా?.. ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణయం తప్పు: షేన్‌ వాట్సన్‌

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ (SRH vs DC) అనుసరించిన వ్యూహాలను ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ షేన్‌ వాట్సన్‌ విమర్శించాడు.ప్లే ఆఫ్స్‌ చేరాలంటే కీలకమైన మ్యాచ్‌లోనూ ఓపెనింగ్‌ జోడీని మార్చడం తనను విస్మయానికి గురిచేసిందన్నాడు. ఢిల్లీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని బుద్ధిలేని చర్యగా అభివర్ణించాడు.ఐపీఎల్‌-2025 (IPL 2025)లో ఢిల్లీ తరఫున జేక్‌ ఫ్రేజర్‌ మెగర్క్‌, అభిషేక్‌ పోరెల్‌, ఫాఫ్‌ డుప్లెసిస్‌, కేఎల్‌ రాహుల్‌ వేర్వేరు మ్యాచ్‌లలో ఓపెనర్లుగా వచ్చారు. తాజాగా సోమవారం సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా డుప్లెసిస్‌తో కలిసి కరుణ్‌ నాయర్‌ (Karun Nair) ఢిల్లీ ఇన్నింగ్స్‌ ఆరంభించాడు.బంతి పడటంతోనే క్యాపిటల్స్‌కు కష్టాలుఅయితే, బంతి పడటంతోనే క్యాపిటల్స్‌కు కష్టాలు మొదలయ్యాయి. మొదటి బంతికే కరుణ్‌ నాయర్‌ (0) డకౌట్‌ అయ్యాడు. కాసేపటికే డుప్లెసిస్‌ (3), అభిషేక్‌ పొరెల్‌ (8)లు కూడా వికెట్లను పారేసుకున్నారు. దీంతో క్యాపిటల్స్‌ 15 పరుగులకే 3 వికెట్లను కోల్పోయింది. ఈ మూడు వికెట్లూ రైజర్స్‌ కెప్టెన్‌ కమిన్స్‌ ఖాతాలోనే పడ్డాయి. క్యాచ్‌లన్నీ కీపర్‌ ఇషాన్‌ కిషన్‌ చేతికే అందాయి.ఇక ఢిల్లీ ఈ షాక్‌ నుంచి తేరుకోకముందే హర్షల్‌ పటేల్‌ మరోదెబ్బ తీశాడు. కెప్టెన్‌ అక్షర్‌ పటేల్‌ (6)ను అవుట్‌ చేశాడు. ఆఫ్‌ స్టంప్‌ మీదుగా వేసిన స్లో డెలివరీని షాట్‌ ఆడే ప్రయత్నం చేయగా అదికాస్తా కమిన్స్‌ చేతికి చిక్కింది. దీంతో పవర్‌ ప్లేలో ఢిల్లీ నాలుగో వికెట్‌ను కోల్పోయింది. అప్పటికి క్యాపిటల్స్‌ స్కోరు 26/4. ఆ తర్వాత కూడా క్యాపిటల్స్‌ పరిస్థితిలో ఏమార్పు లేదు. ఇక ఢిల్లీ అండదండా కేఎల్‌ రాహులే అనుకునేలోపే ఈ స్టార్‌ మురిపెం కూడా అంతలోనే ముగిసింది.జయదేవ్‌ ఉనాద్కట్‌ తెలివైన బంతితో ఈ విలువైన వికెట్‌ తీసి ఢిల్లీని కోలుకోకుండా చేశాడు. ఆఫ్‌ స్టంప్‌ ఆవల దూసుకొచ్చిన బంతి రాహుల్‌ (10) బ్యాట్‌ను తాకుతూ ఇషాన్‌ కిషన్‌ చేతుల్లోకి వెళ్లింది. అప్పటివరకు పెవిలియన్‌ చేరిన ఐదుగురిలో అతనొక్కడిదే రెండంకెల స్కోరు కాగా... కనీసం మూడు పదుల స్కోరైన కాకముందే (29 పరుగులకే 5) ఢిల్లీ సగం వికెట్లను కోల్పోయింది. వికెట్ల జోరులో మెరుపుల్లేని మ్యాచ్‌లో ఎట్టకేలకు పదో ఓవర్లో ఒక సిక్స్‌ నమోదైంది. స్పిన్నర్‌ జిషాన్‌ బౌలింగ్‌లో విప్రాజ్‌ నిగమ్‌ భారీ సిక్సర్‌ బాదాడు. సగం ఓవర్లు ముగిశాక గానీ 11వ ఓవర్లో జట్టు స్కోరు కష్టంగా 50 పరుగులకు చేరింది. అశుతోశ్‌ వచ్చాకే... స్టబ్స్, విప్రాజ్‌ కుదురుకునే అవకాశాన్ని కూడా సన్‌రైజర్స్‌ ఫీల్డర్లు ఇవ్వలేదు. కొద్దిసేపటికే విప్రాజ్‌ (17 బంతుల్లో 18; 1 ఫోర్, 1 సిక్స్‌) రనౌట్‌ కాగా... అశుతోష్‌ రాకతో స్కోరులో కాస్త వేగం పెరిగింది. అవతలి ఎండ్‌లో ఉన్నది హిట్టర్‌ స్టబ్సే అయినా జోరు పెంచింది మాత్రం అశుతోష్‌ మొదట్లో సింగిల్స్‌తో పరుగు... పరుగు పేర్చిన ఈ జోడీ తర్వాత ధాటిని ఆడింది. జీషాన్‌ 15వ ఓవర్లో అశుతోష్‌ రెండు భారీ సిక్సర్లతో అలరించాడు. తర్వాత హర్షల్‌ 17వ ఓవర్లో రెండు బౌండరీలు బాదాడు. స్టబ్స్‌ కూడా ఫోర్లతో వేగం అందుకోగా, డెత్‌ ఓవర్లో మరో సిక్స్‌ కొట్టిన అశుతోష్‌ ఆఖరి ఓవర్లో నిష్క్రమించాడు. ఇద్దరు కలిసి ఏడో ఓవర్‌కు 66 పరుగులు జోడించారు. ఈ జోడీ ఆడటం వల్లే ఢిల్లీ ఆలౌట్‌ నుంచి తప్పించుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 133 పరుగులు చేయగలిగింది.ఢిల్లీ క్యాపిటల్స్‌ది తప్పుడు నిర్ణయంఈ నేపథ్యంలో కామెంటేటర్‌ షేన్‌ వాట్సన్‌ మాట్లాడుతూ.. ‘‘ఎప్పటికప్పుడు ఏ కారణం లేకుండా.. నచ్చినట్లుగా ఓపెనింగ్‌ జోడీని మార్చడం సరికాదు. నిజంగా ఢిల్లీ వ్యూహం చూసి నేను ఆశ్చర్యపోయా.కరుణ్‌ నాయర్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌తో కలిసి ఓపెనింగ్‌కు రావడం చూసి నాకు మతిపోయినంత పనైంది. ఇదొక చెత్త నిర్ణయం. ఢిల్లీ శిబిరం ఏం ఆలోచించి ఇలా చేసిందో గానీ.. ఇదైతే తప్పుడు నిర్ణయం.ఇలా చేయడం వల్ల జట్టులో ఎవరి పాత్ర ఏమిటన్నది ఆటగాళ్లకే తెలియకుండా పోతుంది. ఇలాంటి చర్యల వల్ల వాళ్లు కూడా అభద్రతాభావంలో కూరుకుపోతారు’’ అని స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో తన అభిప్రాయంం పంచుకున్నాడు.ఇదిలా ఉంటే.. ఢిల్లీ ఇన్నింగ్స్‌ ముగిసిన తర్వాత ఎడతెరిపిలేని వర్షం వల్ల మ్యాచ్‌ రద్దై పో​యింది. దీంతో ఢిల్లీకి అదృష్టం కలిసి రాగా.. సన్‌రైజర్స్‌ ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. మ్యాచ్‌ రద్దు కావడం వల్ల ఇరుజట్లకు చెరో పాయింట్‌ రాగా.. ఢిల్లీ ప్లే ఆఫ్స్‌ ఆశలు సజీవమయ్యాయి.చదవండి: SRH Vs DC: ‘హే.. వెళ్లు.. వెళ్లు.. నువ్వు అవుట్‌’!.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌Wickets ✅Catch ✅Captaincy ✅Pat Cummins is producing a perfect performance for #SRH in an important clash against #DC 🔥Updates ▶ https://t.co/1MkIwk4VNE#TATAIPL | #SRHvDC | @SunRisers | @patcummins30 pic.twitter.com/SbACH0yVcJ— IndianPremierLeague (@IPL) May 5, 2025

Supreme Court Discloses Judicial Appointments and Asset Declarations5
సుప్రీంకోర్టు జడ్జీల ఆస్తుల వివరాలు ఎలా చూడొచ్చంటే?

ఢిల్లీ: సుప్రీంకోర్టు (supreme court) కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు జడ్జీల ఆస్తుల వివరాల్ని పబ్లిక్‌ డొమైన్‌లో అందుబాటులోకి తెచ్చింది.ఏప్రిల్‌ 1వ తేదీన సుప్రీంకోర్టు న్యాయమూర్తులంతా కలిసి ఫుల్‌ కోర్టు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో న్యాయమూర్తులందరూ వారి ఆస్తుల వివరాల్ని బహిర్గతం చేసేందుకు అంగీకరించారు. ఈ మేరకు అత్యున్నత న్యాయ స్థానానికి చెందిన 33 మంది జడ్జీలలో 21మంది జడ్జీల ఆస్తుల వివరాలను సుప్రీంకోర్టు అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.ఈ ఆస్తుల్లో రియల్‌ ఎస్టేట్‌,మూవబూల్‌ ప్రాపర్టీలు ,గోల్డ్‌,పెట్టుబడుల వివరాలు ఉన్నాయి. జడ్జీలతో పాటు వారి సతీమణులకు చెందిన ఆస్తులతో పాటు, ఉమ్మడి కుటుంబమైతే వారి ఆస్తుల వివరాల్ని సైతం ఉన్నాయి. ఆస్తుల వివరాల్ని జడ్జీలతో పాటు ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు కొలీజియం సైతం వారి ఆస్తుల వివరాల్ని అందిస్తున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది.నవంబర్ 2022 మే 2025 మధ్య జరిగిన నియామకాల గురించి ప్రజల్లో న్యాయవ్యవస్థపై విశ్వాసం, పారదర్శకతను పెంచేందుకు అత్యున్నత న్యాయస్థానం ఈ వివరాల్ని తన వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించింది. ఆస్తుల వివరాలే కాదు సుప్రీంకోర్టు, హైకోర్టులలో నియామకాలు, హైకోర్టు కొలీజియంకు కేటాయించిన పాత్రలతో సహా, రాష్ట్ర ప్రభుత్వాలు హైకోర్టు జడ్జీల నియామకపు ప్రతిపాదనలు వంటి ఇతర వివరాలు సైతం అందుబాటులోకి వచ్చాయి. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్‌ వర్మ ఇంట్లో నోట్ల కట్టలుకాగా,ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా (Delhi HC Judge) యశ్వంత్‌వర్మ అధికారిక నివాసంలో భారీఎత్తున కాలిన నోట్ల కట్టలు బయటపడడం సంచలనంగా మారింది. న్యాయమూర్తి అధికారిక నివాసంలో అగ్నిప్రమాదం జరగడంతో.. ఆర్పేందుకు వెళ్లిన సిబ్బందికి అనుకోకుండా అక్కడ భారీగా నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి. ఇది వివాదాస్పదం కావడంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సుప్రీంకోర్టు జడ్జీల ఆస్తుల వివరాలు.. ఎలా చూడొచ్చంటే?గూగుల్‌లో సుప్రీంకోర్టు ఆఫ్‌ ఇండియా అని టైప్‌ చేయండి. అనంతరం మీకు సుప్రీంకోర్టు అధికారిక వెబ్‌ సైట్‌ లింక్‌ కనిపిస్తుంది. ఆ లింక్‌ క్లిక్‌ చేస్తే సుప్రీంకోర్టు అధికారిక వెబ్‌సైట్‌ ఇంటర్‌ ఫేస్‌ కనిపిస్తుంది. ఇంటర్‌ ఫేస్‌ టాప్‌ బార్‌లో మీకు హోం,అబౌట్‌ అజ్‌,జడ్జస్‌ ఇలా కేటగిరీలు కనిపిస్తాయి. వాటిల్లో జడ్జస్‌ కేటగిరి మీద ట్యాప్‌ చేస్తే అసెట్స్‌ ఆఫ్‌ జడ్జస్‌ అనే సబ్‌ కేటగిరీలు కనిపిస్తాయి. ఆ ఆప్షన్‌ మీద క్లిక్‌ చేస్తే సుప్రీంకోర్టు జడ్జీల పేర్లు పక్కన వ్యూ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. దాని మీద క్లిక్‌ చేస్తే ఆస్తుల వివరాలు ఓపెన్‌ అవుతాయి.

Srivalli Sailaja from Malkajgiri was appointed as a judge at the age of 246
Success Story: జస్ట్‌ 24 ఏళ్లకే న్యాయమూర్తిగా..!

చిన్న వయసు నుంచే సామాజిక సేవ చేయాలనే తపన, న్యాయవాది కావాలన్న తన తండ్రి ఆశయాన్ని గమనించారు.. లా పూర్తి చేసినా న్యాయవాదిగా స్థిరపడాలన్న తండ్రి లక్ష్యం నెరవేరలేదు.. అందుకే తండ్రి కలను పట్టుదలతో తాను సాధించారు.. న్యాయవాది కాదు.. ఏకంగా న్యాయమూర్తిగానే ఎంపికయ్యారు.. మొదటి ప్రయత్నంలోనే.. ఉన్నత స్థానాన్ని అధిరోహించారు.. స్ఫూర్తిమంతమైన ఆమె ప్రయాణం ఆమె మాటల్లోనే.. తెలంగాణ రాష్ట్రం మల్కాజిగిరికి చెందిన శ్రీవల్లి శైలజ 2024లో నిర్వహించిన జ్యుడీషియరీ పరీక్షలో జనరల్‌ కేటగిరిలో జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపికయ్యారు. 24 ఏళ్ల వయసులో చదువు పూర్తయిన అనతి కాలంలోనే న్యాయమూర్తిగా ఎంపిక కావడం పట్ల ఇంటా బయటా ప్రశంసల జల్లు కురుస్తోంది. విద్యావంతుల కుటుంబంలో పుట్టిన తాను చిన్ననాటి నుంచే సామాజిక సేవ చేయాలన్న తండ్రి ఆశయంతో పెరిగారు. న్యాయశాస్త్ర పట్టభద్రుడు అయినా న్యాయమూర్తి కాలేకపోయారు. దీంతో తండ్రి ఆశయాన్నే తన ఆశయంగా చేసుకుని లక్ష్యం చేరుకున్నారు శ్రీవల్లి. ఇంటర్‌ అవగానే ఎంసెట్, లా ప్రవేశపరీక్షలు రెండూ రాశారు. రెంటిలోనూ మంచి ర్యాంకులు సాధించారు. తండ్రి ప్రోత్సాహంతో జ్యుడీషియరీ మెయిన్స్‌ వైపు అడుగులువేశారు. ప్రభుత్వాధికారుల కుటుంబం నుంచి.. అమ్మ నాన్న ఇద్దరూ ఉన్నత విద్యావంతులు, ప్రభుత్వాధికారులు. నాన్న రమేష్‌ నరసింహం హైదరాబాద్‌లో సీజీఎస్‌టీ సూపరింటెండెంట్‌. తల్లి లక్ష్మీసురేఖ దక్షిణమధ్య రైల్వే సికింద్రాబాద్‌ డివిజన్‌లో అసిస్టెంట్‌ ఆఫీసర్‌. ఓయూలో ఎల్‌ఎల్‌బీ, నల్సార్‌ యూనివర్శిటీలో ఎల్‌ఎల్‌ఎం పూర్తిచేశారు. అనంతరం జ్యుడీషియరీ మెయిన్స్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జూనియర్‌ సివిల్‌ జడ్జి వరకూ ఎదిగారు. శ్రీవల్లి సోదరి సహితం నల్సార్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లాలో ఐపీఎం (మూడో సంవత్సరం) చదువుతున్నారు. నాన్న కల నెరవేరింది.. జ్యుడీషియరీ మెయిన్స్‌ తరువాత ఏప్రిల్‌ నెల్లో ఇంటర్వ్యూ జరిగింది. ఫలితాలు కొద్ది రోజుల క్రితమే వచ్చాయి. చిన్న వయసులోనే జూనియర్‌ సివిల్‌ జడ్జి వంటి ఉన్నత ఉద్యోగం లభించడం సంతోషించదగ్గ విషయం. నాన్న కల నెరవేరింది. నా శ్రమకు తగ్గ ఫలితం దక్కింది. సామాజిక న్యాయం కోసం కృషి చేయగలనన్న నమ్మకం కలిగింది. జ్యుడీషియరీలో అత్యున్నత స్థానం వరకూ వెళ్లేందుకు సాధన చేస్తా. – శ్రీవల్లి శైలజ, జూనియర్‌ సివిల్‌ జడ్జి (చదవండి: 'షాడో తోలు బొమ్మలాట'ను సజీవంగా నిలిపింది..! రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..)

Simhachalam Temple Tragedy: Devotees Angry With Chandrababu7
సింహాచలం ఘటన: బాబూ.. ఇదేం వక్రబుద్ధి.. భక్తుల ఆగ్రహం

సాక్షి, విశాఖపట్నం: సింహాచలం ప్రమాద బాధితులకు పరిహారంలోనూ సీఎం చంద్రబాబు తన వక్ర బుద్ధిని చాటుకున్నారు. బాధితులకు పరిహారం సింహాచలం దేవస్థానం నుంచి చెల్లించారను. చనిపోయిన ఒక్కొక్కరికి 25 లక్షలు, గాయపడిన వారికి మూడు లక్షల పరిహారం అందించగా, మొత్తంగా కోటి 78 లక్షల రూపాయలు దేవస్థానం నుంచి చెల్లింపు చేశారు. ప్రభుత్వ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.దేవాలయ అభివృద్ధికి వినియోగించాల్సిన నిధులను బాధితులకు ఇవ్వడంపై భక్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిహార విషయంలో ప్రభుత్వానికి బాధ్యత లేదా అంటూ భక్తులు మండిపడుతున్నారు. ప్రభుత్వ ఖజానా నుంచి ఇవ్వాల్సిన పరిహారాన్ని సింహాచలం దేవస్థానం నుంచి ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, సింహాచలం ఘటనపై తూతూ మంత్రంగా చర్యలు చేపట్టారు. చివరికి సింహాచలం ప్రమాదంపై ఉద్యోగులే బలయ్యారు. కూటమి ప్రజా ప్రతినిధులందరూ సేఫ్‌గా బయటపడ్డారు.ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు, కూటమి ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోని ప్రభుత్వం.. ఈవో సహా మరో ఆరుగురు ఇంజనీరింగ్ సిబ్బందిపై వేటు వేయడానికి నిర్ణియించింది. ఇంజనీరింగ్ సిబ్బందిలో కాంట్రాక్ట్ ఉద్యోగిపైన చర్యలకు సిద్ధమైంది. కాంట్రాక్టర్‌పై క్రిమినల్ చర్యలు కోవడానికి కూటమి సర్కార్‌ సిద్ధమైంది. కూటమి నాయకులను తప్పించి అధికారులను బలి పశువుల చేశారనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టే కమిటీ నివేదిక ఇచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Pakistan Bitter Experience At The UNO Meeting8
యూఎన్‌వో కీలక భేటీలో పాకిస్థాన్‌కు భంగపాటు

యూఎన్‌వో సమావేశంలో పాకిస్థాన్‌కు భంగపాటు ఎదురైంది. పహల్గాం ఉగ్రదాడిని యూఎన్‌వో తీవ్రంగా ఖండించింది. పాకిస్థాన్‌ చెప్పిన పలు అంశాలను సభ్య దేశాలు తిరస్కరించాయి. లష్కరే తోయిబా ప్రమేయంపై పాక్‌ను యూఎన్‌వో ఆరాతీసింది. ప్రత్యేకంగా ఒక మతం వారినే కాల్చి చంపడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పాకిస్థాన్‌ క్షిపణి పరీక్షలపై యూఎన్‌వో ఆందోళన వ్యక్తం చేసిందిపహల్గాం ఉగ్రదాడి ప్రస్తావన లేకుండా భారత్‌ చర్యలపైనే ఫోకస్‌ పెట్టిన పాక్‌.. సింధూ నది జలాల ఒప్పందాన్ని నిలిపివేయడాన్ని భద్రతా మండలిలో ప్రస్తావించింది. భారత్‌, పాకిస్థాన్‌ సంయమనం పాటించాలని యూఎన్‌ సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ అన్నారు. భద్రతామండలిలో భారత్‌పై తప్పుడు ఆరోపణలు చేసిన పాకిస్తాన్‌.. భారత్‌ చర్యలను తప్పు బట్టే ప్రయత్నం చేసింది. ఎలాంటి తీర్మానం లేకుండానే భద్రతా మండలి రహస్య సమావేశం ముగిసింది.భారత్, పాక్‌ నడుమ ఉద్రిక్తతలు కొన్నేళ్లలో ఎన్నడూ లేనంతగా పెరిగిపోయాయని ఐక్యరాజ్యసమితి ఆందోళన వెలిబుచ్చింది. వాటి కట్టడికి చర్యలు తీసుకోవాల్సిందిగా ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ ఇరు దేశాలకూ సూచించారు. అందుకు దన్నుగా నిలిచేందుకు ఐరాస సిద్ధమని తెలిపారు. సమస్యలకు యుద్ధం పరిష్కారం కాదని హితవు పలికారు.సాయుధ ఘర్షణ మొదలైతే పరిస్థితి అదుపు తప్పుతుందని ఆందోళన వెలిబుచ్చారు. ‘‘పహల్గాం ఉగ్ర దాడి అనంతరం భారత్‌లో పెల్లుబుకుతున్న జనాగ్రహాన్ని, ఆక్రోశాన్ని అర్థం చేసుకోగలను. ఆ పాశవిక దాడిని మరోసారి ఖండిస్తున్నా. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఇలా పౌరులను లక్ష్యం చేసుకోవడం దారుణం. దీనికి పాల్పడ్డవారికి చట్టపరంగా కఠిన శిక్షపడాల్సిందే’’ అన్నారు.

Chandrababu TDP coalition Govt liquor scam9
కుంభకోణం కనికట్టు.. బాబే మద్యం సామ్రాట్టు

సాక్షి, అమరావతి: సూపర్‌ సిక్స్‌ సహా ఎన్నికల హామీల అమలుపై చేతులెత్తేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల దృష్టిని మళ్లించేందుకు తన ట్రేడ్‌మార్కు డైవర్షన్‌ కుట్రకు మరింత పదును పెడుతుండగా... అందుకు ఎల్లో మీడియా కోరస్‌ పాడుతూ కుట్ర కథను రక్తి కట్టించేందుకు యతి్నస్తోంది. వైఎస్సార్‌సీపీ హయాంలో పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసు కుట్రకు మరింత పదును పెడుతున్న పరిణామాలే ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. రిమాండ్‌ రిపోర్టులో అభూత కల్పనలు చేరుస్తూ.. కస్టడీలో చెప్పని అంశాలను చెప్పినట్లుగా చిత్రీకరిస్తూ ఎల్లోమీడియా ద్వారా దు్రష్పచారానికి తెగబడుతున్నారు. అసలు జరగని స్కామ్‌లో కుట్రపూరితంగా ఇరికించేందుకు పన్నాగాలు పన్నుతున్నారు. అధికారంలోకి వచి్చనప్పటి నుంచి దీన్ని వైఎస్సార్‌ సీపీకి ఆపాదించేందుకు శతవిధాలా ప్రయతి్నస్తున్న టీడీపీ కూటమి సర్కారు కక్షగట్టి బెదిరిస్తూ అరెస్టులు చేస్తూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తోంది. ఈ అక్రమ కేసు దర్యాప్తును మొదట సీఐడీకి అప్పగించిన చంద్రబాబు సర్కారు.. మూడు నెలలు విచారణ అనంతరం సీఐడీ చేతులెత్తేయడంతో సిట్‌ ఏర్పాటుతో కొత్త పన్నాగానికి తెరతీసింది. బెవరేజస్‌ కార్పొరేషన్‌ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, పూర్వ ఉద్యోగులు సత్య ప్రసాద్, అనూషను వెంటాడి వేధించి అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించింది. సిట్‌ వేధింపులపై డిస్టిలరీల ప్రతినిధులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో వారిని ఇంటి వద్దే విచారించాలని న్యాయస్థానం ఆదేశించింది. రిమాండ్‌ రిపోర్టుల పేరుతో అభూత కల్పనలు సృష్టించడం, కస్టడీలో చెప్పని విషయా­లను చెప్పినట్లుగా ఎల్లో మీడియాకు లీకులివ్వడం సిట్‌ బరితెగింపునకు పరాకాష్ట. ఏది నిజం ?ఓవైపు కొత్త డిస్టిలరీలకు పచ్చజెండా ఊపి.. తమవారికే దుకాణాలు కట్టబెట్టి.. బెల్టు షాపులకు గేట్లెత్తి.. ఇలా మద్యంలో అన్నివిధాల అడ్డగోలు దోపిడీ దందాకు దన్నుగా నిలుస్తూ.. మరోవైపు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మద్యం విధానంలో భారీగా అక్రమాలు జరిగాయంటూ వీరంగం వేస్తోంది టీడీపీ కూటమి ప్రభుత్వం. దీనికోసం వీర విధేయ అధికారులతో సిట్‌ వేసి అక్రమ అరెస్టులకు పాల్పడుతోంది. రిమాండ్‌ రిపోర్టుల పేరుతో కట్టు కథలు అల్లుతోంది.మద్యం దందాకు మార్గాలుగా ఉన్న ప్రైవేటు మద్యం దుకాణాలు, పర్మిట్‌ రూమ్‌లను రద్దు చేసింది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం. బెల్ట్‌ దుకాణాలు తొలగించింది కూడా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే. కొత్తగా ఒక్క డిస్టిలరీకి, మద్యం బ్రాండ్‌లకు అనుమతినివ్వని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా అంటే అది వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఒక్కరే. మద్యం అమ్మకాలను తగ్గించి దశలవారీ మద్యం నియంత్రణ విధానాన్నిసమర్థంగా అమలు చేసింది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే. మరి మద్యం అమ్మకాలు తగ్గిస్తే కమీషన్లు ఎందుకు ఇస్తారు... ఇవ్వరు కదా అన్నది ఎవర్ని అడిగినా ఠక్కున చెప్పే సమాధానమే. కానీ, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై అక్రమ కేసు నమోదు చేయడం కచ్చితంగా చంద్రబాబు ప్రభుత్వ రెడ్‌బుక్‌ కుట్రేనన్నది సుస్పష్టం. అందుకే పాలుకు పాలు నీళ్లకు నీళ్లుగా ప్రజలు వాస్తవాలు తెలుసుకునేందుకు వైఎస్సార్‌సీపీ, టీడీపీ ప్రభుత్వ మద్యం విధానాలపై సహేతుక విశ్లేషణ ఇదీ...కుంభకోణం కాదు ఇదీ అసలు కోణం ఎవరి పాలనలో ఏం జరిగిందో నిగ్గు తేల్చేదే ఈ కథనంసిండికేటు కడితే స్కామా? ప్రభుత్వమే దుకాణాలు నడిపితే స్కామా?2014–19 మధ్యన, ప్రస్తుతం చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో ప్రైవేటు మద్యం దుకాణాల సిండికేట్‌ నెలకొంది. తమ పార్టీ నేతలకే దుకాణాల లైసెన్సులు కేటాయించారు. మద్యంలో లంచాలు తీసుకోవాలి అని అనుకుంటేనే ప్రైవేటు దుకాణాలు కేటాయిస్తారు. ఇక అప్పుడూ ఇప్పుడూ భారీగా అమ్మకాల టార్గెట్‌ ఉండనే ఉంది. 2014–19 మధ్యన చంద్రబాబు ప్రివిలేజ్‌ ఫీజును తగ్గించారు. ఈ సమయంలో ప్రభుత్వ హయాంలో 4,380 ప్రైవేటు దుకాణాలు, వీటికి అనుబంధంగా అనధికారిక బార్లుగా 4,380 పర్మిట్‌ రూమ్‌లు ఉండేవి. నాడు 43 వేల బెల్ట్‌ దుకాణాలు కూడా నడిచాయి. గత ఏడాది టీడీపీ కూటమి ప్రభుత్వం రాగానే ప్రైవేటు మద్యం సిండికేట్‌ను మళ్లీ తెరపైకి తెచ్చింది. టీడీపీ కూటమి నేతలకే 3,394 దుకాణాలను కేటాయించింది. 55 వేల నుంచి 60 వేల బెల్ట్‌ దుకాణాల ద్వారా మద్యం ఏరులై పారిస్తోంది. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రైవేటు మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేసింది. పూర్తిగా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే 2,934 దుకాణాల ద్వారా అమ్మకాలు సాగించింది. నిర్దిష్ట వేళలతో అమ్మకాలను కూడా కట్టడి చేసింది. పర్మిట్‌ రూమ్‌లను రద్దు చేసింది. బెల్టు షాపులు అనే మాటే లేకుండా చేసి దోపిడీకి పూర్తిగా అడ్డుకట్ట వేసింది.రూ.120ది నాసిరకమా? రూ.99 నాసిరకమావైఎస్సార్‌సీపీ ప్రభుత్వలో క్వార్టర్‌ బాటిల్‌కు రూ.120 కనీస ధరగా ఉంటేనే నాసిరకం మద్యం అని టీడీపీ దుష్ప్రచారం చేసింది. అందుకోసం చెన్నైకు చెందిన ఓ ల్యాబ్‌ పేరుతో తప్పుడు నివేదికను ప్రచారంలోకి తెచ్చింది. కానీ, అలాంటి నివేదికను తాము ఇవ్వలేదని ఆ ల్యాబ్‌ ఖండించింది. ఇక ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వంలో రూ.99కే క్వార్టర్‌ బాటిల్‌ విక్రయిస్తున్నారు.క్వార్టర్‌ రూ.99కే వచ్చేది నాసిరకం మద్యమా? రూ.120కి అమ్మేది నాసిరకం మద్యమా??వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో దుకాణాలు నడిపితే స్కాం అంటున్నారు..? మరి నాడు, నేడు రాష్ట్రమంతా టీడీపీ నాయకులు సిండికేటు కట్టి దుకాణాలు నడిపిస్తున్నారు. టీడీపీ నేతలకు దుకాణాలు, బెల్టుషాపులు, పర్మిట్‌ రూమ్‌ల తలుపులు బార్లా తెరిచిన చంద్రబాబు పాలనలో స్కాంలకు అవకాశం ఉందా? ఇవేవీ లేని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కుంభకోణానికి ఆస్కారం ఉందా?అమ్మకాలు తగ్గిస్తే కమీషన్లు వస్తాయా? పెరిగితే వస్తాయా??మద్యం అమ్మకాలు ఎంతగా పెరిగితే అంతగా కమీషన్లు వస్తాయి. అదే టీడీపీ విధానంగానూ మారింది. అందుకనే 2014–19లో చంద్రబాబు ప్రభుత్వం మద్యం విక్రయాలను విపరీతంగా ప్రోత్సహించింది. 2019 తర్వాత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మద్యం అమ్మకాలను తగ్గించింది. దశలవారీ మద్య నియంత్రణ విధానాన్ని సమర్థంగా అమలు చేసింది. ధరలను షాక్‌ కొట్టేలా పెంచి మద్యపానాన్ని నిరుత్సాహపరిచింది.మరి ఎవరి హయాంలో స్కాంలకు అవకాశం ఉంటుంది. లావాదేవీలు పెరిగి.. డబ్బు చేతులు మారే చంద్రబాబు ప్రభుత్వంలోనే కదా?పాపాల పుట్టలు డిస్టిలరీలు పుట్టింది ఎవరి పాలనలో...?మద్యం విధానంలో అవినీతి, దోపిడీ అంతా డిస్టిలరీల మసుగులోనే సాగుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 20 డిస్టిలరీలు ఉన్నాయి. వాటిలో 14 డిస్టిలరీలకు చంద్రబాబు ప్రభుత్వమే గతంలో అనుమతినిచ్చింది. మిగిలిన 6 డిస్టిలరీలకు అంతకుముందున్న ప్రభుత్వాలు అనుమతి­చ్చాయి. ఇక టీడీపీ నేతలు అయ్యన్నపాత్రుడు, యనమల రామకృష్ణుడు, పుట్టా సుధాకర్‌ యాదవ్, ఎస్పీవై రెడ్డి, దివంగత డీకే ఆదికేశవులు కుటుంబాలకే డిస్టిలరీలు కేటాయించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో కొత్తగా ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వనే లేదు.కాగా, డిస్టిలరీ­లకు మద్యం తయారీ కోసం లైసెన్సులు జారీ చేసి.. బేవరేజెస్‌ కార్పొరేషన్‌ మద్యం కొనుగోళ్లు ఎంప్యానెల్‌ జాబితాలో 14 డిస్టిలరీలను చేర్చింది చంద్రబాబు ప్రభుత్వమే.డిస్టిలరీలన్నీ టీడీపీ నేతలవే అయితే అవినీతికి పాల్పడిందీ వారే అవుతారు కదా..? మరి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోని మద్యం విధానంపై నమోదు చేసింది అక్రమ కేసే కదా??బెల్టు షాపులు లేకుండా చేస్తే స్కాం ఎలా?అసలు డిస్టిలరీలు ఎప్పుడు కమీషన్లు ఇస్తాయన్నది కీలకం. మద్యం అమ్మకాలు పెరిగినకొద్దీ డిస్టిలరీలకు లాభాలు పెరుగుతాయి. కాబట్టి విక్రయాలు పెంచితే ప్రభుత్వ పెద్దలకు కమీషన్లు ఇస్తాయి. మరి ఏ ప్రభుత్వంలో మద్యం అమ్మకాలు పెరిగాయన్నది పరిశీలించాలి. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2014–19లో మద్యం అమ్మకాలు భారీగా సాగగా... అనంతరం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో 2019–24లో అమ్మకాలు గణనీయంగా తగ్గాయని ఎక్సైజ్‌ శాఖ రికార్డులే స్పష్టం చేస్తున్నాయి.అంటే డిస్టిలరీల నుంచి కమీషన్లు ఇచ్చింది టీడీపీ ప్రభుత్వ పెద్దలకే అన్నది సుస్పష్టం.ఊరూపేరు లేని 200 బ్రాండ్లను ప్రవేశపెట్టింది ఎవరు?మద్యం కుంభకోణంలో వినిపిస్తున్న మరో మాట ఊరూపేరూ లేని బ్రాండ్లు. అసలు ఇలాంటి బ్రాండ్లను ప్రవేశపెట్టడమే దోపిడీకి కారణమైతే ఆ అవినీతి పాపం కచ్చితంగా చంద్రబాబుదే. ఎందుకంటే 2014–19 మధ్యన రాష్ట్రంలో ఎన్నడూ వినిపించని దాదాపు 200 బ్రాండ్లను తెచ్చారు చంద్రబాబు. అందులో కొన్నిటి పేర్లు... ప్రెసిడెంట్‌ మెడల్, గవర్నర్‌ రిజర్వ్, పవర్‌ స్టార్, లెజెండ్, లెఫైర్‌ నెపోలిన్, ఓక్టోన్‌ బారెల్‌ ఏజ్డ్, సెవెన్త్‌ హెవెన్‌ బ్లూ, హైవోల్టేజ్, వోల్టేజ్‌ గోల్డ్, ఎస్‌ఎన్‌జీ 10000, బ్రిటీష్‌ అంపైర్‌ సూపర్‌ స్ట్రాంగ్‌ ప్రీమియం బీర్, బ్రిటీష్‌ ఎంపైర్‌ అల్ట్రా, రాయల్‌ ప్యాలస్, న్యూ కింగ్, సైన్‌ అవుట్, బీరా 91, టీఐ మ్యాన్షన్‌ హౌస్, టీఐ కొరియర్‌ నెపోలియన్‌.తమవారికి దోచించి ఎవరు?2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో కేవలం నాలుగు డిస్టిలరీల నుంచే ఏకంగా 53.21 శాతం మద్యం కొన్నారు. సి–టెల్‌ అనే సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టి మరీ దందా సాగించారు. ఆ విషయా­న్ని ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం నియమించిన సిట్‌ నివేదికే వెల్లడించింది కూడా. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మాత్రం కేవలం కొన్ని డిస్టిలరీలకే ప్రయోజనం కలిగించలేదు. లోపభూ యిష్టమైన సి–టెల్‌సాఫ్ట్‌వేర్‌ను తొలగించింది. సగటున ప్రతి డిస్టిలరీకీ 5 శాతం నుంచి 10% ఆర్డర్లు వచ్చేలా పారదర్శకంగా వ్యవహరించింది.సగంపైగా మద్యం కొనుగోలు జరిగిన చంద్రబాబు జమానాలో అవినీతి ఉంటుందా..? అందరికీ ఆర్డర్లు వచ్చేలా చేసిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అవినీతి చోటుచేసుకుంటుందా??‘ప్రివిలేజ్‌’గా సిండికేట్‌తో ఖజానాకు గండి కొట్టింది ఎవరు?మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్‌ ఫీజు ప్రభుత్వానికి ఆదాయ వనరు. ఆ ఫీజును గుట్టుచప్పుడు కాకుండా రద్దు చేస్తే ఖజానాకు గండి పడుతుంది. సీఎం హోదాలో నోట్‌ ఫైళ్లపై సంతకాల సాక్షిగా ఆ నిర్వాకం చంద్రబాబుదే. మంత్రివర్గాన్ని బురిడీ కొట్టిస్తూ 2015లో రెండు చీకటి జీవోలతో ప్రివిలేజ్‌ పన్నును రద్దు చేశారు చంద్రబాబు. తద్వారా టీడీపీ సిండికేట్‌ ఆధ్వర్యంలోని మద్యం దుకాణాలు, బార్ల యజమానులకు అడ్డగోలుగా ప్రయోజనం కలిగించారు. ఇలా నాలుగేళ్లలోనే రూ.5 వేల కోట్లు కొల్లగొట్టారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇలాంటి ఒక్క చీకటి జీవోను కూడా జారీ చేయనేలేదు.ఈ లెక్కన ప్రభుత్వ ఖజానాకు చిల్లు పెట్టింది ఎవరు? తమవారికి అడ్డగోలుగా దోచిపెట్టింది ఎవరు? ఎవరిపై కేసు నమోదు చేయాలి??నాడు... కుంభకోణం బహిర్గతంనేడు.. లేని కుంభకోణం ఉన్నట్టు చూపే కుతంత్రం2014–19లో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే చంద్రబాబు తన బినామీలు, సన్నిహితుల మద్యం కంపెనీల ముసుగులో కుంభకోణానికి తెగించారు. డిస్టిలరీలు, మద్యం దుకాణాలు, పర్మిట్‌ రూమ్‌లు, బార్లు, బెల్ట్‌ దుకాణాలు, ప్రివిలేజ్‌ ఫీజు మాఫీ.. ఇలా అన్నీ అందులో భాగమే. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు స్వయంగా సంతకాలు చేసి మరీ కుంభకోణానికి పాల్పడ్డారు. ‘కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌’(కాగ్‌) ఆధ్వర్యంలో స్వతంత్రంగా విధులు నిర్వర్తించే ప్రిన్సిపల్‌ అకౌంటెంట్‌ జనరల్‌ కూడా దీనిని స్పష్టం చేసింది. 2023లో కేసు నమోదు చేసిన సీఐడీ పూర్తి ఆధారాలతో అవినీతి నిగ్గు తేల్చి చంద్రబాబు ముఠాపై ఐపీసీ సెక్షన్లు: 166, 167, 409, 120(బి) రెడ్‌ విత్‌ 34, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు: 13(1),(డి), రెడ్‌ విత్‌ 13(2) కింద సీఐడీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అసలు మద్యం విధానంలో ఎలాంటి అవకతవకలు జరగనే లేదు. కొత్త డిస్టిలరీలకు అనుమతి ఇవ్వలేదు. ప్రైవేటు మద్యం దుకాణాలను తొలగించారు. పర్మిట్‌ రూమ్‌లను రద్దు చేశారు. బెల్ట్‌ దుకాణాలు తొలగించారు. ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటు చేసి దుకాణాల సంఖ్యను తగ్గించారు. ఇలా అవినీతికి కారణమయ్యే అన్ని మూలాలను సమూలంగా రూపుమాపారు. అయినా సరే చంద్రబాబు ప్రభుత్వం ప్రస్తుతం అక్రమ కేసు నమోదు చేయడం కేవలం రెడ్‌బుక్‌ కుట్రే .చట్టాన్ని సిట్‌ ఉల్లంఘిస్తోంది!?డిస్టిలరీల నుంచి కమీషన్లు వసూలు చేశారు అంటూ చంద్రబాబు ప్రభుత్వం దుష్ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కుట్రలు పన్నుతోంది. ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం ఎంతగా వేధిస్తున్నా డిస్టిలరీల ప్రతినిధులు అబద్ధపు వాంగ్మూలాలు ఇవ్వకపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. కొందరిని సిట్‌ అధికారులు కిడ్నాప్‌ చేసి మరీ తప్పుడు వాంగ్మూలాలు ఇవ్వాలని పోలీసు శైలిలో హింసించారు. దానిపై డిస్టిలరీల యజమానులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో సిట్‌ కుట్ర బయటపడింది. రెడ్‌బుక్‌ కక్ష సాధింపుతోనే చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసుతో వేధిస్తోందన్నది స్పష్టమైంది.విచారణ పేరుతో సిట్‌ అధికారులు తమను వేధిస్తున్నారంటూ, బలవంతంగా విజయవాడ తీసుకొచ్చి ఇబ్బంది పెడుతున్నారని, వయో వృద్ధులమైన తాము శారీరకంగా తీవ్ర అవస్థలు పడుతున్నామని డిస్టలరీల ప్రతినిధులు హైకోర్టులో మొర పెట్టుకున్నారు. వీరి పిటిషన్లపై సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం.. సిట్‌ అధికారులకు స్పష్టమైన విధివిధానాలను నిర్దేశించింది. డిస్టిలరీల ప్రతినిధులకు నోటీసులు ఇచ్చిన అనంతరం వారి నివాసాలలోనే విచారించాలని ఆదేశించింది.నిజంగా స్కాం జరిగితే బెదిరింపులు ఎందుకు?బెవరేజస్‌ కార్పొరేషన్‌ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, పూర్వ ఉద్యోగి సత్యప్రసాద్, అనూష తదితరులను సిట్‌ రోజుల తరబడి వేధించి, బాధించి అబద్ధపు వాంగ్మూలాలు ఇప్పించింది. డిస్టిలరీల ప్రతినిధులను బెంబేలెత్తించి లొంగదీసుకుంది. ఇక కేసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి పేరుతో సిట్‌ అధికారులే వాంగ్మూలం రాసేసుకున్నారు. దానిపై సంతకం చేసేందుకు ఆయన నిరాకరించడం సిట్‌ కుట్రను బట్టబయలు చేసింది. ఇతర నిందితులు, సాక్షులు చెప్పని విషయాలను కూడా చెప్పినట్టు సిట్‌ అబద్దపు వాంగ్మూలాలు నమోదు చేస్తోంది.అసలు జరగని మద్యం కుంభకోణంలో.. పొలిటికల్‌ బాస్‌ల ఆదేశాలకు అనుగుణంగా సిట్‌ పనిచేస్తోందా? నిజంగానే స్కాం జరిగితే ఈ వేధింపులు ఎందుకు? అంటే కేసులో బలం లేదు కాబట్టే టీడీపీ అనుకూల మీడియా ద్వారా దుష్ప్రచార కుట్రలకు పాల్పడుతోంది.ఏది స్కాం..? ఎందుకిస్తారు లంచాలు?⇒ మద్యం అమ్మకాలు కోట్ల కేసుల కొద్దీ పెరిగింది టీడీపీ హయాంలోనే..! –మరి మద్యాన్ని ఎక్కువగా అమ్మించినందుకు వారికే కదా లంచాలు రావాల్సింది? వైఎస్సార్‌సీపీ పాలనలో మద్యం అమ్మకాలు పడిపోయాయి (పట్టిక చూడండి). మరి విక్రయాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా?⇒ టీడీపీ గత ప్రభుత్వంలో, ప్రస్తుతం కూడా మద్యం అమ్మకాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోనే ఉన్నాయి. ..అవి కూడా టీడీపీవారికి సంబంధించినవే. బెల్టు షాపులూ ఊరూరా వెలిశాయి.⇒ మరి..ప్రైవేటుగా మద్యం విక్రయిస్తే స్కాంకు అవకాశం ఉంటుందా..? లేక నేరుగా ప్రభుత్వం ద్వారా మాత్రమే అమ్మితే స్కాం జరుగుతుందా?⇒ తెల్లవారుతూనే తూగేలా చేస్తూ.. అర్ధరాత్రి దాకా ఎక్కువ సమయం అమ్మకాలు సాగించేలా చూస్తే లంచాలు ఇస్తారా?⇒ విక్రయ వేళలను కుదించేసి, అమ్మకాలను పరిమితం చేస్తే లంచాలు ఇస్తారా?⇒ ఇబ్బడిముబ్బడిగా మద్యం దుకాణాలను పెంచితే లంచాలకు అవకాశం ఉంటుందా? వాటికి తోడు పర్మిట్‌ రూమ్‌లు, బెల్టు షాప్‌లు పెడితే లంచాలు ఇస్తారా..? మరి దుకాణాలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా?.. బెల్టు షాపు­లు తీసేసి పర్మిట్‌ రూమ్స్‌ను రద్దు చేస్తే లంచాలు ఇస్తారా?⇒ ఎంపిక చేసుకున్న 4–5 డిస్టిలరీలకు మాత్రమే ఆర్డర్లలో 53 శాతం వరకు ఇస్తే లంచాలు ఇస్తారా? మద్యంపై తక్కువ ట్సాక్స్‌తో ఎక్కువ అమ్మకాలు చేసేలా మేలు చేస్తే లంచాలు వస్తాయా?⇒ మరి..అన్ని డిస్టిలరీలకు సమానంగా ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా?⇒ 2014–19లో చంద్రబాబు నిర్ణయించిన బేసిక్‌ రేట్లను పెంచి డిస్టిలరీల నుంచి కొనుగోళ్లు చేస్తే లంచాలు వస్తాయా? ట్యాక్స్‌లు పెంచి తద్వారా అమ్మకాలు తగ్గితే లంచాలు వస్తాయా?⇒ ఇప్పుడున్న డిస్టిలరీలలో అధిక శాతం అనుమతులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్నవారికి లంచాలు వస్తాయా? ⇒ లేక ఏ ఒక్క డిస్టిలరీకీ అనుమతి ఇవ్వని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఉన్నవారికి లంచాలు ఇస్తారా..?మద్యం వ్యవహారంలో ఎక్కడైనా అక్రమం ఎలా జరుగుతుంది?..ఎడాపెడా డిస్టిలరీలకు అనుమతులిచ్చే విధానపరమైన లోపాలతోనే! ..అమ్మకాల్లో ఎప్పుడైనా అవకతవకలకు ఎలా ఆస్కారం ఏర్పడుతుంది?..తమవారికే షాపులు దక్కేలా ప్రభుత్వాలు అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటేనే!అందులోనూ నిలువు దోపిడీ ఎలా చోటుచేసుకుంటుంది?...ఊరూరా బెల్టు షాపులతో ప్రజలను మత్తులో ఊగేలా చేస్తేనే!ఎవరైనా అధర్మంగా జేబులు నింపుకొనేందుకు ఎలా వీలు కలుగుతుంది?...సాక్షాత్తు ముఖ్య స్థానాల్లో ఉన్నవారే అవినీతికి తెగిస్తేనే!మరి ఇవన్నీ జరిగింది ఎవరి హయాంలో..? చంద్రబాబు ప్రభుత్వంలోనా.. వైఎస్సార్‌సీపీ హయాంలోనా?

Nayanthara Demands Huge Remunaration for Tollywood Movie10
చిరంజీవితో సినిమా.. భారీగా డిమాండ్ చేస్తోన్న స్టార్ హీరోయిన్!

సినీ పరిశ్రమలో ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్న హీరోయిన్లే ఎక్కువ. కానీ ఈ రోజుల్లో దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఎంట్రీ ఇచ్చి ఎండింగే లేదంటున్న హీరోయిన్లు ఉండడం విశేషమే. అలాంటి అతి తక్కువ మంది కథానాయికల్లో నయనతార ఒకరు. వరుసగా విజయాలతో దూసుకుపోతున్న హీరోయిన్‌కు ఒకటి రెండు ఫ్లాప్‌లు ఎదురైతే కేరీర్‌ తలకిందులవుతుంది. అలాంటిది నయనతార మంచి విజయాన్ని చూసి చాలా కాలమే అయింది.ఆ మధ్య ఈమె నటించిన ఉమెన్‌ సెంట్రిక్‌ కథా చిత్రం అన్నపూరిణి నిరాశ పరిచింది. ఇటీవల కథానాయకిగా నటించిన టెస్ట్‌ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదలై ప్రేక్షకులను అలరించలేక పోయింది. మరో పక్క పెళ్లి, భర్త, ఇద్దరు కవల పిల్లలు అంటూ సంసార జీవితం. అయినా అవకాశాలు మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం చేతిలో నాలుగైదు చిత్రాలు ఉన్నాయి. అయితే ఈమె తొలి సారిగా బాలీవుడ్‌లో షారుఖ్‌ఖాన్‌తో జంటగా నటించిన జవాన్‌ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. అంతే కాకుండా ఆ చిత్రానికి రూ.12 కోట్లు వరకూ పారితోషికం తీసుకున్నట్లు సమాచారం.అయితే తమిళ చిత్రాలకు అంత మొత్తంలో పారితోషికం తీసుకుంటున్నారా అంటే సందేహమే. అలాంటిది తాజాగా ఈ అమ్మడు తన పారితోషికాన్ని ఏకంగా రూ.18 కోట్లు డిమాండ్‌ చేస్తున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. తెలుగులో చిరంజీవికి జంటగా ఒక భారీ చిత్రంలో నటించే అవకాశం వచ్చిందని.. అందులో నటించడానికి నయనతార రూ.18 కోట్లు పారితోషికం డిమాండ్‌ చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై ఆ చిత్ర నిర్మాతల వర్గం ఆమెతో చర్చలు జరుపుతున్నట్లు టాక్‌. ఇదే కనుక నిజం అయితే దక్షిణాదిలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా నయనతార పేరు నిలిచిపోతుంది. ఇకపోతే ఈమె ఇంతకు ముందు చిరంజీవితో సైరా, గాడ్‌ ఫాదర్‌ చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement