ఏలూరు సిటీ, న్యూస్‌లైన్ : ఫీజు వాపసు (ఫీజు రీరుుం బర్స్‌మెంట్) పథకాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. రకరకాల సాకు లు, సాంకేతిక కారణాలతో ఈ పథ కాన్ని అటకెక్కించే ప్రయత్నాలు సాగుతున్నారుు. ఈ ఏడాది పాత (రెన్యువల్) విద్యార్థులతోపాటు కొత్త (ఫ్రెషర్స్) విద్యార్థులతో కలిపితే జిల్లాలో మొత్తం 1లక్షా 17వేల 109 మందికి ఫీజు రీరుుంబర్స్‌మెంట్ పథకం వర్తింప చేయాల్సి ఉంది. వీరిలో ఒక్కరికి కూడా ప్రభుత్వం నుంచి ఫీజు వాపసు కాలేదు.
ఈ పథకం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలంటూ ఏటా రకరకాల నిబంధనలు విధిస్తూ వస్తున్న ప్రభుత్వం ఈసారి బ్రహ్మాస్త్రం ప్రయోగిం చింది. ఆధార్ కార్డు, బయోమెట్రిక్ ఆన్‌లైన్ వెరిఫికేషన్ తప్పనిసరి చేయడంతో విద్యార్థులెవరూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోలేని దుస్థితి ఏర్పడింది. రెన్యువల్ కేటగిరీలో ఎస్సీ విద్యార్థులు 28వేల, బీసీలు 52 వేల, ఈబీసీలు 22 వేల మంది విద్యార్థులు ఉన్నారు. కొత్త నిబంధనల కారణంగా వీరెవరికీ ఫీజు వాపసు పథకం అక్కరకు రావడం లేదు.
బయోమెట్రిక్‌తో తంటాలు
ఫీజులు చెల్లిస్తారని ఆశగా ఎదురుచూస్తున్న ఎస్సీ, బీసీ, ఈబీసీ విద్యార్థులకు బయోమెట్రిక్ ఆన్‌లైన్ వెరిఫికేషన్ విధానం ఇబ్బందులకు గురి చేస్తోంది. ప్రస్తుత విద్యా సంవత్సరం ముగింపు దశకు చేరుకుంటున్నా నేటికీ ఫీజులకు సంబంధించి దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ ప్రారంభం కాలేదు. పరిశీలనలో కొత్త విధానం అమలు చేయాలనే ఉత్తర్వులు జారీ కావటంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థి ఎన్‌రోల్‌మెంట్ ఆన్‌లైన్ నంబర్‌ను పీఓఎస్ మెషిన్‌లో ఫీడ్ చేయాల్సి ఉంది. ఏవైనా తప్పులు దొర్లితే ఇబ్బందులు తప్పవని అధికారులు చెబుతున్నారు. ఆన్‌లైన్ దరఖాస్తులు చేసేందుకు ఆధార్ యూఐడీ నంబర్ అవసరం ఉండటంతో ఈ ఏడాది దరఖాస్తుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఆధార్ నమోదు చేయించుకున్న వారి కి ఈఐడీ(ఎన్‌రోల్‌మెంట్ ఐడెంటిటీ) నంబర్ ఉంటే సరిపోదని, యూనిక్ ఐడెంటిటీ నంబర్ కావాలని చెప్పటం తో ఆధార్‌కార్డులు లేక విద్యార్థులు దరఖాస్తులు చేయలేకపోతున్నారు. ఈ విద్యా సంవత్సరంలో సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించి ఎస్సీ విద్యార్థులు 4,282మంది, బీసీ విద్యార్థులు 8వేల మంది, ఈబీసీ విద్యార్థులు 2,828మంది మాత్రమే ఎన్‌రోల్ చేయించుకోగలిగారు. వీరితోపాటు రెన్యువల్ విద్యార్థుల్లో ఎస్సీలు 16,595మంది, బీసీ విద్యార్థులు 29 వేలమంది, ఈబీసీ విద్యార్థులు 13,990మందికి దరఖాస్తుల తనిఖీలో సమస్యలు తప్పని దుస్థితి నెలకొంది.
గగ్గోలు పెడుతున్న
యూజమాన్యాలు
ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం బయోమెట్రిక్ ఆన్‌లైన్ వెరిఫికేషన్‌కు అవసరమైన పీఓఎస్ మెషిన్లను ప్రతి కళాశాల కొనుగోలు చేయూల్సి ఉంది. రూ.29 వేలు వెచ్చించి మెషిన్ కొనుగోలు చేసేందుకు యూజమాన్యాలు ముందుకు రావడం లేదు. ఈ పరిస్థితి పేద విద్యార్థుల పాలిట ఆశనిపాతంగా మారింది. జిల్లాలోని 550 కాలేజీల్లో ఈ మెషిన్లు ఏర్పాటు చేయూలంటే సుమారు రూ.1.59 కోట్లు ఖర్చవుతుందని అంచనా. వీటిని ఏర్పాటు చేస్తేగానీ బయోమెట్రిక్ విధానంలో వెరిఫికేషన్ పూర్తిచేసే అవకాశాలు లేవు. ఈ మెషిన్ల వినియోగంలో అవగాహన లేకుంటే విద్యార్థులకే నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.
‘ఫీజు’కు బూజు
Published Sat, Dec 14 2013 4:51 AM | Last Updated on Wed, Sep 5 2018 9:00 PM
Advertisement
Advertisement