పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణిని ఆదివారం ఆస్పత్రికి తీసుకెళుతుండగా 108 అంబులెన్సులో ప్రసవించింది.
‘108’ అంబులెన్స్‌లో గర్భిణి ప్రసవం
Sep 9 2013 2:13 AM | Updated on Sep 1 2017 10:33 PM
నిజాంసాగర్, న్యూస్‌లైన్: పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణిని ఆదివారం ఆస్పత్రికి తీసుకెళుతుండగా 108 అంబులెన్సులో ప్రసవించింది. పిట్లం మండలం వడ్లం గ్రామానికి చెందిన గర్భిణి అనితకు పురిటినొప్పులు రావడంతో స్థాని కులు 108కు సమాచారం అందించారు. గ్రామానికి చేరుకున్న అంబులె న్సు సిబ్బంది ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో నొప్పులు అధికమయ్యాయి. వాహనాన్ని పక్కనే నిలిపివేసిన ఈఎన్‌టీ ప్రభాకర్, పైలట్ జావెద్ ఆమెకు వైద్య చికిత్సలు అందించగా ప్రసవించింది. తల్లీబిడ్డలు క్షేమంగా ఉండటంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
Advertisement
Advertisement