సాక్షి, హైదరాబాద్ : పుట్టుకతోనే వచ్చే వినికిడి లోపం ఉన్న చిన్నారులకు సంవత్సరంలోగానే గుర్తించి శస్త్రచికిత్స నిర్వహిస్తే వారు సాధారణ జీవితాన్ని గడపవచ్చని డాక్టర్ కేఆర్ మేఘనాథ్ తెలిపారు. దేశంలోనే మొదటి సారిగా 11 నెలల బాబుకు బైలాట్రల్ కన్‌స్ట్రక్ట్ సర్జరీని తమ ఆసుపత్రిలో విజయవంతంగా నిర్వహించగలిగినట్టు ఆయున తెలిపారు. బుధవారం హైదరాబాద్ వాసవి హాస్పిటల్‌లోని మా ఇఎన్‌టి ఆసుపత్రిలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యాంత్రిక తరంగాలను విద్యుత్ తరంగాలుగా మార్చే ఇన్‌ప్లాంట్స్‌ను అమర్చే శస్త్రచికిత్స ద్వారా వినికిడి లోపాన్ని తగ్గించవచ్చు అన్నారు.
ఈ శస్త్రచికిత్సను ఇప్పటివరకు 11సంవత్సరాల నుంచి మొదలుకొని 52 సంవత్సరాల వయస్సు వారికి కూడా నిర్వహించినట్లు తెలిపారు. గతంలో ఒక చెవికి మాత్రమే చేసేవారమని, అయితే ఇప్పుడు రెండు చెవులకు కూడా ఈ సర్జరీ నిర్వహిస్తున్నావుని అన్నారు. ఇలా రెండు చెవులకు శస్త్రచికిత్స ద్వారా మామూలు వ్యక్తుల్లో ఉన్నట్టే వినికిడి శక్తి వస్తుందన్నారు. ఒక్కసారి ఇన్‌ప్లాంట్స్ అమరిస్తే దాదాపు పదేళ్లకుపైగా ఎలాంటి వినికిడి సమస్యలు తలెత్తవన్నారు. ఏడాదిలోపు పిల్లలకు ఉచితంగా పరీక్ష చేస్తున్నావుని డాక్టర్ మేఘనాథ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కార్తీక్, సతీష్, చీఫ్ ఆర్డియాలజిస్ట్ రాజా తదితరులు పాల్గొన్నారు.
11 నెలల చిన్నారికి అరుదైన సర్జరీ
Published Thu, Sep 5 2013 2:25 AM | Last Updated on Fri, Sep 1 2017 10:26 PM
Advertisement