1999 గ్రూపు–2 తుది ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శనివారం వెల్ల డించింది.
సుప్రీంకోర్టు తీర్పుననుసరించి 16 ఏళ్ల తర్వాత ఏపీపీఎస్సీ ఇటీవల మరో జాబితా రూపొందించినా దానిపైనా వివాదాలు కొనసాగాయి. చివరకు శాఖల వారీగా స్పష్టమైన ఖాళీల జాబితాను తెప్పించుకున్న ఏపీపీఎస్సీ శనివారం మరోసారి తుది అర్హుల జాబితాను విడుదల చేసింది. గతంలో వెలువడిన ఫలితాల ఆధారంగా ఉద్యోగాలు పొందిన జాబితాలో వివిధ కారణాల రీత్యా ఖాళీ అయిన మేర 70 మంది వరకు ఈ జాబితా ద్వారా కొత్తగా ఉద్యోగాలు పొందేందుకు అర్హులుగా తేలినట్టు ఏపీపీఎస్సీ వర్గాలు పేర్కొన్నాయి.