నేడు 1999 గ్రూప్‌–2 మెరిట్‌ జాబితా | 1992 group-2 posts merit list will release | Sakshi
Sakshi News home page

నేడు 1999 గ్రూప్‌– 2 మెరిట్‌ జాబితా

Published Fri, Dec 23 2016 8:56 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

నేడు 1999 గ్రూప్‌–2 మెరిట్‌ జాబితా - Sakshi

నేడు 1999 గ్రూప్‌–2 మెరిట్‌ జాబితా

హైదరాబాద్‌: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 1999 గ్రూప్‌– 2 పోస్టులకు సంబంధించి తాజా మెరిట్‌ జాబితాను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) శుక్రవారం విడుదల చేయనుంది. ఈ పోస్టులకు సంబంధించి మెరిట్‌ జాబితాను ఒకటికి పదిసార్లు సరిచూసుకొని తప్పులు లేకుండా ఖరారు చేసిన కమిషన్‌ అధికారులు గురువారమే విడుదల చేయాలని భావించారు.

ఏపీపీఎస్సీ కమిషన్‌ ఆమోదముద్ర కూడా తీసుకున్నాకనే విడుదల చేయాలని జాబితా వెల్లడిని శుక్రవారానికి వాయిదా వేశారు. జాబితాను శుక్రవారం కమిషన్‌ ముందు పెట్టి ఆ తరువాత విడుదల చేస్తామని ఏపీపీఎస్సీ వర్గాలు వెల్లడించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement