హైదరాబాద్: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏపీపీఎస్సీ గ్రూప్1 మెయిన్స్‌కు సంబంధించి కొన్ని పరీక్ష కేంద్రాల్లో మార్పులు చేస్తున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి వైవీఎస్‌టీ సాయి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
నల్గగొండ జిల్లా చౌటుప్పల్‌లోని అశోకా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (కోడ్ 80102), రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లోని వివేకానంద గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూట్స్ (80103), నాదర్‌గుల్‌లోని ఏఎల్‌ఆర్‌ఆర్ జూనియర్ కాలేజీ (80109), ఇబ్రహీంపట్నంలోని ఎంఆర్‌ఎం గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ (80110)లలో ఇప్పటివరకు పరీక్ష రాసిన అభ్యర్ధులు ఇకపై సాగర్‌రోడ్డులో ఇబ్రహీంపట్నం మండలం శేరిగూడ సమీపంలోని చింతపల్లిగుడ వద్దగల అరబిందో కాలేజీ ఆఫ్ మేనేజ్‌మెంట్ (కోడ్ 80106) లో తదుపరి పరీక్షలకు హాజరు కావలసి ఉంటుంది.
పటాన్‌చెరులోని ఆర్‌ఆర్‌ఎస్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (80104)లో పరీక్ష రాస్తున్న అభ్యర్ధులు పటాన్‌చెరు మండలం ఇంద్రశాం దగ్గరి ఆర్టీఓ ఆఫీసు సమీపంలోని టర్బోమెషినరీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సెన్సైస్ (కోడ్ 80101) పరీక్ష కేంద్రంలో తదుపరి పరీక్షలకు హాజరుకావలసి ఉంటుంది.