నంద్యాలటౌన్: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్), ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ (త్రిపుల్ ఐటీ)ల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ మెయిన్స్‌లో నంద్యాల పట్టణానికి చెందిన విద్యార్థి చెల్లిమల్ల మహేష్‌కుమార్ 28వ ర్యాంక్ సాధించారు. దీంతో బుధవారం కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకున్నారు.
స్థానిక బాలాజీ కాంప్లెక్స్‌లో నివాసం ఉంటున్న సర్జకల్, మెడికల్ వ్యాపారి మోహన్‌రావు, లక్ష్మిదేవి దంపతులకు కుమారుడు మహేష్‌కుమార్ 7వ తరగతి వరకు కేశవరెడ్డి పబ్లిక్ స్కూల్, పదో తరగతి వరకు విజయవాడలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్‌లో చదివి టెన్త్‌లో 9.8 జీపీఏ సాధించారు. శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్ ఎంపీసీ గ్రూప్‌లో 988 మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది నిర్వహించిన ఎంసెట్‌లో(ఇంజనీరింగ్ విభాగం) 38వ ర్యాంక్ పొందాడు. ఐఐటీ చదవాలనే లక్ష్యంతో కష్టపడి చదివి జేఈఈ మెయిన్స్‌లో 28వ ర్యాంక్ సొంతం చేసుకున్నాడు. దీంతో గౌహతిలో మహేష్‌కు సీటు లభించింది. నవ్యాంధ్రప్రదేశ్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీని పెట్టి, మరికొందరికి ఉపాధి కల్పించడమే లక్ష్యమని మహేష్ సాక్షితో పేర్కొన్నారు.
జేఈఈ మెయిన్స్‌లో మహేష్‌కుమార్‌కు 28వ ర్యాంక్
Published Thu, Jul 10 2014 2:04 AM | Last Updated on Sat, Sep 2 2017 10:03 AM
Advertisement
Advertisement