Mahesh Kumar
-
రిజర్వ్డ్ కేటగిరీలకు నష్టం జరగదు
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 పరీక్షల విషయంలో నిరుద్యోగులు ఆందోళన చెందాల్సిన పనిలేదని.. రిజర్వ్డ్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు నష్టం జరుగుతుందన్న వాదన పచ్చి అబద్ధమని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి.మహేశ్‌కుమార్‌గౌడ్ పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా తాను భరోసా ఇస్తున్నానని, మెయిన్స్‌కు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో ఎలాంటి నష్టం జరగలేదని, భవిష్యత్తులో కూడా ఎలాంటి నష్టం జరగదని చెప్పారు. ఆదివారం గాం«దీభవన్‌లో ఎంపీ అనిల్‌కుమార్‌యాదవ్, ఇతర నేతలతో కలసి మహేశ్‌గౌడ్ మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాలు గ్రూప్–1 మెయిన్స్ విషయంలో నిరుద్యోగులను రెచ్చగొడుతూ.. లేనిపోని అనుమానాలు, అపోహలు సృష్టిస్తున్నాయని ఆరోపించారు. అపోహలు వద్దు ‘పీసీసీ అధ్యక్షుడిగా, బీసీ వర్గాలకు చెందిన వ్యక్తిగా గ్రూప్–1 అభ్యర్థులందరికీ భరోసా ఇస్తున్నా. మెయిన్స్‌కు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో రిజర్వ్డ్ కేటగిరీల అభ్యర్థులకు అన్యాయం జరగదు. ఇది పార్టీ, ప్రభుత్వ పక్షాన మేమిస్తున్న భరోసా. అన్ రిజర్వ్డ్ మెరిట్ జాబితాలోకి వచ్చిన అభ్యర్థులను మళ్లీ రిజర్వ్డ్ కేటగిరీలో లెక్కించరు. మెరిట్ జాబితాలో ఎంపికైన రిజర్వ్డ్ అభ్యర్థులు ఓపెన్ కేటగిరీలోనే కొనసాగుతారు. రిజర్వ్డ్ పోస్టుల్లో తక్కువ పడితేనే ఇతర అభ్యర్థులను తీసుకుంటారు. అందుకే సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. అసలు నష్టమే జరగదు. అర్థం చేసుకోవాలి’అని మహేశ్‌గౌడ్ వివరించారు. విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నాయి గాం«దీభవన్ సేకరించిన సమాచారం ప్రకారం.. మొత్తం అభ్యర్థుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన అభ్యర్థులే 75 శాతం ఉంటారని మహేశ్‌గౌడ్ చెప్పారు. కానీ బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కై పరీక్షల విషయంలో లేనిపోని అనుమానాలు సృష్టిస్తున్నాయని, విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్.. పదేళ్లలో ఎన్ని గ్రూప్–1 ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. పదేళ్లలో 70 వేల ఉద్యోగాలు భర్తీ చేసిన బీఆర్ఎస్ది చిత్తశుద్ధా? పది నెలల్లో 50వేల ఉద్యోగాలిచ్చిన కాంగ్రెస్‌ది చిత్తశుద్ధా అన్నది నిరుద్యోగులు ఆలోచించాలన్నారు. ఇంటర్ ఫలితాలను కూడా సక్రమంగా ఇవ్వలేని బీఆర్ఎస్ తమకు బుదు్ధలు చెప్పాల్సిన పనిలేదని వ్యాఖ్యానించారు. దేశంలో ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన బీజేపీ.. ఎన్ని ఉద్యోగాలిచ్చిందో బండి సంజయ్ చెప్పాలని, ఏ ముఖం పెట్టుకుని బీజేపీ నేతలు ధర్నాలు చేస్తున్నారో చెప్పాలని విమర్శించారు. -
సమన్వయంతో పనిచేయండి
సాక్షి, న్యూఢిల్లీ: పార్టీ బలోపేతం చేసేందుకు క్షేత్రస్థాయిలోని కార్యకర్త మొదలుకొని సీనియర్ నాయకుల వరకు అందరినీ కలుపుకొని సమన్వయంతో పనిచేయాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌కు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సూచించారు. ఇటీవల టీపీసీసీ అధ్యక్షుడిగా నియామకం జరిగిన తర్వాత తొలిసారిగా ఢిల్లీ వచ్చిన మహేశ్ కుమార్ గురువారం ఖర్గేను కుటుంబసమేతంగా కలిశారు. ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో పార్టీలో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రణాళికలపై ఖర్గే దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు సవాల్ ఖర్గేతో భేటీ అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో ప్రస్తుతం వచ్చిన స్థానాలకంటే ఎక్కువ సాధించి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో రాహుల్ గాం«దీని ప్రధాని చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. ప్రజలు నమ్మకంతో తమకు అధికారాన్ని ఇచ్చారని.. అందరం సమన్వయంతో పనిచేస్తున్నామన్నారు.అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక పార్టీ కొత్త కార్యవర్గంపై అధిష్టానంతో చర్చలు జరుపుతానని, కొత్త కమిటీలు ఏర్పాటయ్యేంతవరకు పాత కమిటీలు కొనసాగుతాయని తెలిపారు. కమిటీల్లో అన్ని సామాజిక వర్గాలకు సముచిత ప్రాధాన్యత ఉంటుందన్నారు. పీసీసీ కమిటీల్లో 50 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయిస్తామని... స్థానిక సంస్థల ఎన్నికలు తమకు ఒక సవాల్ అని మహేశ్ గౌడ్ తెలిపారు. అంతేగాక, రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ గురించి ముఖ్యమంత్రి, ఏఐసీసీ పెద్దలు మాట్లాడారని... త్వరలో వారే నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. కేసీఆర్, కేటీఆర్ ఎక్కడ? రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చే ప్రసక్తే లేదని... ఒకవేళ వచ్చినా ఆ స్థానాలు కాంగ్రెస్ ఖాతాలోనే చేరతాయని మహేశ్ గౌడ్ వ్యాఖ్యానించారు. పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు సమయం ఇచ్చి0దని... మరికొంతమంది పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. వర్షాలతో ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే కేసీఆర్, కేటీఆర్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. కేటీఆర్ సవాళ్లను పట్టించుకునే స్థితిలో లేరని, ప్రజలు బీఆర్ఎస్కు ప్రతిపక్ష పాత్ర ఇస్తే దాన్ని కూడా సమర్థవంతంగా నిర్వహించే స్థితిలో లేరని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకత్వంపై నమ్మకం లేకనే ఆ పార్టీ నేతలు కాంగ్రెస్‌లో చేరుతున్నారని చెప్పారు. అంతేగాక ఉప ఎన్నికలు రాబోవని... ఒకవేళ ఉప ఎన్నికలు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని... కాంగ్రెస్ అభ్యర్థులే గెలుస్తారని మహేశ్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. కాగా అరికెపూడి గాంధీ సాంకేతికంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినందునే ఆయనకు పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చారని తెలిపారు. హైడ్రా కూల్చివేతల్లో ఇల్లు కోల్పోతున్న పేదలకు సీఎం రేవంత్‌రెడ్డి న్యాయం చేస్తారని మహేశ్ గౌడ్ చెప్పారు. -
నేడు గాందీభవన్‌లో ఆవిర్భావ దినోత్సవాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం గాందీభవన్‌లో ఉదయం 8.30 గంటలకు జాతీయ జెండా ఆవిష్కరణ నిర్వహించనున్నట్టు ఎమ్మెల్సీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిండెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ నా యకులు, మంత్రులు, ఎమ్మెల్సీలు ఎమ్మెల్యే లు, పార్టీ నేతలు పాల్గొంటారని వెల్లడించారు. దశాబ్ది ఉత్సవాల శకటం ప్రారంభం తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల శకటాన్ని శనివారం గాందీభవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్, మెట్టుసాయి పాల్గొన్నారు. -
మరింత మంచి పాలన
సాక్షి, హైదరబాద్: క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలు మంగళవారం గాం«దీభవన్‌లో ఘనంగా జరిగాయి. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు, వర్కింగ్ ప్రెసిసెంట్ జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పండితుడు శ్రీనివాసమూర్తి పంచాంగ పఠనం చేశారు. ప్రజాభీష్టం మేరకు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో అద్భుతంగా పాలన సాగిస్తుందన్నారు. వంద రోజుల్లోనే ప్రజలకు ఇచ్చిన ప్రధాన హామీలు అమలు చేసి, ప్రజాదరణ పొందారని, రాబోయే రోజుల్లో మరింత అద్భుతంగా పాలన సాగుతుందని జోష్యం చెప్పారు. ఈ సందర్భంగా మహేష్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ ఈ క్రోది నామ సంవత్సరంలో కోపం తగ్గించుకొని కాంగ్రెస్ కార్యకర్తలు పాజిటివ్ దృక్పథంతో ముందుకు వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, కాంగ్రెస్ నాయకులు కుమార్‌రావ్, నిరంజన్, చల్లా నర్సింహారెడ్డి, మెట్టు సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర వైద్య మండలి ఎన్నికలు షురూ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలందరి ఆరోగ్యానికి సంబంధించి అనేక కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం ఉన్న తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి (టీఎస్ఎమ్సీ) ఎన్నికలను 17 ఏళ్ల తర్వాత తొలిసారిగా నిర్వహించనున్నారు. ఉస్మానియా మెడికల్ కాలేజీ వేదికగా ఆదివారం ఈ ఎన్నికల మేనిఫెస్టోను హెచ్ఆర్డీఏ విడుదల చేసింది. అర్హత లేకుండా వైద్యం చేస్తున్న వారిని ప్రత్యేక కమిటీలు వేసి అరకడతామని ఈ మేనిఫెస్టోలో పేర్కొన్నారు. నూతన భవనం నిర్మించి, తెలంగాణ వైద్యులకు గౌరవం లభించేలా చూస్తామని, వైద్య విద్య ఫీజు నియంత్రణ దిశగా ప్రయత్నాలు చేస్తామని ప్రకటించారు. 48,405మంది డాక్టర్లకు ఓట్లు ప్రస్తుతం 48,405 మంది తెలంగాణ డాక్టర్లు ఈ ఎన్నికల్లో ఓటు వేసే అర్హత కలిగి ఉన్నారు. ఈ ఎన్నికల్లో 13 మంది వైద్యులు వైద్య మండలికి ఎన్నిక కానుండగా, ఇందుకోసం వందకు పైగా అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అభ్యర్థులంతా తమ విధివిధానాలతో సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసుకుంటున్నారు. కొందరు స్వతంత్ర అభ్యర్థులుగా నిలబడగా, మరికొందరు ప్యానల్‌గా ఏర్పడి పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికలు పోస్టల్ బాలెట్ ద్వారా జరగనున్నాయి. వచ్చే నెల నుంచి బ్యాలెట్ పేపర్ల పంపిణీ జరగనుండగా, వాటి లెక్క డిసెంబర్ 1న మొదలుకానుంది. కాగా మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో డా.మహేష్‌కుమార్, డా. ప్రతిభాలక్ష్మీ, డా. కుసుమరాజు రవికుమార్, డా.కిరణ్‌కుమార్ తోటావర్ తదితరులు పాల్గొన్నారు. -
నాన్నకు ప్రేమతో.. కేంద్ర సర్వీసు నుంచి రాష్ట్ర సర్వీసుకు..
సాక్షి, అమరావతి: ఆ తండ్రి కుమారుడిని వేలు పట్టుకుని నడిపించారు. అంతగా అక్షరాలు తెలియని ఆయన తన బిడ్డ ఆర్డీఓ కావాలని, పది మందికీ సేవ చేయాలని ఆకాంక్షించారు. ఆ విష యాన్ని కుమారుడితో పాటు బంధువులు, ఊరి ప్రజలతో పదేపదే చెప్పేవారు. కొన్నాళ్లకు ఆ కుమారుడు తన తండ్రి కోసం చేస్తున్న ఉద్యోగాన్ని కాదని ఆర్డీఓ ఉద్యోగంలో చేరాడు. నాన్న కలను నెరవేర్చాడు. ఆ కుమారుడే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సేనాపతి ఢిల్లీరావు. ఆదివారం ఫాదర్స్ డే సందర్భంగా తన కోసం తండ్రి తపించిన తీరును, ఆయన కల నెరవేర్చిన వైనాన్ని కలెక్టర్ ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ‘మా స్వస్థలం శ్రీకాకుళం జిల్లా పిడిమందస. మాది పేద కుటుంబం మాది. అమ్మానాన్న అంతగా చదువుకోలేదు. ఇంటికి నేనే పెద్ద కొడుకుని. నాన్న త్రినాథ్ పనులపై బయటకు వెళ్లి రాత్రికి ఇంటికి వచ్చే వరకు అంతా వేచి ఉండి, వచ్చాకే భోజనం చేసేవాళ్లం. ఎప్పుడైనా ఆయన రావడం ఆలస్య మైతే నేను నిద్రపోయేవాడిని. నాన్న వచ్చాక నన్ను నిద్రలేపి తన చేత్తో ఓ ముద్ద తినిపించి తిరిగి నిద్రపుచ్చేవారు. నన్ను బాగా చదివించి ఆర్డీఓను చేయాలన్నది నాన్న కల. విశాఖ సింహాచలం ఏపీ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకునే నన్ను తనే రైల్లో తీసుకెళ్లేవారు. చదవండి: (నాన్నా... నను కన్నందుకు కృతజ్ఞతా వందనాలు) అలా తీసుకెళ్లేటప్పుడు నువ్వు బాగా చదువుకుని ఆర్డీఓ కావాలి నాన్నా.. అనేవారు. మా ఊరి వాళ్లతోనూ, బంధుగణంతోనూ అదే చెబుతుండేవారు. మా వాడు తహసీల్దారుకన్నా పెద్ద ఆఫీసర్ ఆర్డీఓ అవుతాడనేవారు. దురదృష్టవశాత్తూ నా ఇంటర్ అయ్యాక ఆయన చనిపోయారు. నేను చదువు పూర్తి చేసుకుని 2003లో కేంద్ర సర్వీసుకు చెందిన అగ్రికల్చర్ రీసెర్చి సర్వీసు ఇనిస్టిట్యూట్‌లో సైంటిస్ట్ ఉద్యోగంలో చేరాను. నాన్న కోసం కేంద్ర సర్వీసును వదిలి 2007లో రాష్ట్ర సర్వీసులకొచ్చాను. 2008 మార్చిలో విజయనగరం జిల్లా ఆర్డీఓగా చేరి నాన్న కల నెరవేర్చాను. ఆ రోజు నా ఆనందానికి అవధుల్లేవు. ఆ తర్వాత గుంటూరు ఆర్డీఓగా, రాష్ట్రంలో పలు చోట్ల ఇతర హోదాల్లోనూ పనిచేశాను. ఇప్పుడు కలెక్టర్‌గా ఉన్నాను. నాన్న కోరుకున్నట్టుగా ఆర్డీఓ అయ్యాను. ఆర్డీఓకు మించి కలెక్టర్ స్థాయిలో ఉన్న నన్ను చూస్తే నాన్న ఎంత మురిసిపోయేవారో. కానీ విధి ఆయన్ను మా నుంచి దూరం చేసింది. ఆ బాధ నన్ను వెంటాడుతూనే ఉంది. నాన్న ఆశీస్సులతోనే నేను ఆర్డీఓగా, కలెక్టర్‌గా ఎదిగానని భావిస్తున్నాను. మహేష్‌కుమార్ రావిరాల, జాయింట్ కలెక్టర్, కృష్ణాజిల్లా నాన్న కోరిక నెరవేర్చా మా నాన్న రావిరాల నరసయ్య రెవెన్యూ శాఖలో నల్గొండ పట్టణంలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగపర్వం ప్రారంభించారు. నాకు, మా అన్నయ్యకు చదువులో చిన్ననాటి నుంచి మార్గం చూపేవారు. మా వెన్నంటి ఉండి మా అన్నదమ్ములను ఎంబీబీఎస్ వరకు చదివించారు. మా నాన్నలో ఉన్న చిన్ననాటి కోరిక తీరకపోవటం, చిన్న వయసులోనే ఆయన తండ్రి చనిపోవటంతో నన్ను సివిల్స్ వైపు నడిపించి ఐఏఎస్ అధికారి అయ్యేలా నా వెన్నంటి ఉండి నడిపించారు. 2016లో నేను ఐఏఎస్‌కు ఎంపికైనప్పుడు నా కోరికను నీలో చూసుకుంటున్నానని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఆ సమయంలో మా కుటుంబం అంతా అంతులేని ఆనందం పొందాం. మమ్మల్ని ఈ స్థాయికి తీసుకువచ్చిన మా నాన్నకు ఫాదర్స్‌డే శుభాకాంక్షలు. – మహేష్‌కుమార్ రావిరాల, జాయింట్ కలెక్టర్, కృష్ణాజిల్లా -
ఈటల అవినీతిలో టీఆర్ఎస్కు భాగస్వామ్యం
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్‌లో టీఆర్ఎస్, బీజేపీలు విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నాయని, మాజీమంత్రి ఈటల రాజేందర్ అవినీతిలో టీఆర్ఎస్కు కూడా భాగస్వామ్యం ఉందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ ఆరోపించారు. దేశంలో ఇంత ఖరీదైన ఎన్నికలు ఎప్పుడూ చూడలేదని, భవిష్యత్తులో కూడా చూడబోమని అన్నారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిన ఈటల ఇప్పుడు బీజేపీ నుంచి పోటీ చేయడం విడ్డూరమని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, దళితులకు ఇచ్చిన హామీలను కేసీఆర్ గాలికొదిలేశారని ధ్వజమెత్తారు. పెట్రోల్, డీజిల్ ధరలు రోజూ పెంచుతున్నందుకు బీజేపీకి ఓటేయాలా? అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ దేశాన్ని కార్పొరేట్ల చేతిలో పెడుతున్నారని, దేశంలో ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ అమ్మేస్తున్నారని మహేశ్ ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్ విద్యార్థి, నిరుద్యోగులకు బ్రాండ్ అంబాసిడర్ అని.. విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన పోరాడిన వ్యక్తిని గెలిపించాలని కోరారు. -
జియో అమరావతి మారథాన్‌కు విశేష స్పందన
సాక్షి, అమరావతి: జియో అమరావతి మారథాన్‌కు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. మూడు విభాగాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో యువతీయువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అమరావతిలోని మంతెన సత్యనారాయణ ఆశ్రమం వద్ద మొదలైన ఈ మారథాన్‌లో సుమారు 5000 మంది ఔత్సాహికులు పాల్గొన్నారు. ఏపీ రాజధానిలో జియో అమరావతి మారథాన్ నిర్వహించడం ఇది నాలుగోసారి. 5కే, 10కే, 21కే కేటగిరిల్లో పోటీలు నిర్వహించారు. 21కే రన్‌ను తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, ఐఏఎస్ అధికారి క్రాంతిలాల్ దండే, ఐపీఎస్ అధికారి చంద్రశేఖర్‌లు జెండా ఊపి మారథాన్‌ను ప్రారంభించారు.10కే రన్‌ను మంత్రి నక్కా ఆనంద్ బాబు, స్పోర్ట్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యం జెండా ఊపి ప్రారంభించారు. 5కే రన్‌ను జియో ఏపీ సీఈవో మహేష్ కుమార్ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మహేష్ కుమార్ మాట్లాడుతూ.. జియో అమరావతి మారథాన్ రన్లో తాము భాగస్వాములు కావడం ఆనందంగా ఉందన్నారు. అమరావతి నగరం అభివృద్ధి కోసం నిర్వహించే రన్లో నగరవాసులతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని పేర్కొన్నారు. రాజధాని అమరావతిలో మరింతగా డిజిటల్ సేవలను విస్తరించాలనే ఉద్దేశ్యంతో మారథాన్‌లో భాగస్వాములమైనట్లు ఆయన తెలిపారు. -
సాయం చేయబోతే...
‘‘సస్పెన్స్, ప్రేమ అంశాలను మేళవిస్తూ నిర్మించిన ‘అలా జరిగింది’ చిత్రం పాటలు బాగున్నాయి. ‘అలా మొదలైంది’ సినిమాలాగే ఈ చిత్రం కూడా మంచి విజయం సాధించాలి. ఇలాంటి చిన్న సినిమాలు హిట్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది’’ అని నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ చాంబర్ కార్యదర్శి సాయివెంకట్ అన్నారు. మహేశ్ కుమార్, మంజీర జంటగా వెల్లంకి దుర్గా ప్రసాద్ దర్శకత్వంలో ఎన్.రవికుమార్‌రెడ్డి నిర్మించిన చిత్రం ‘అలా జరిగింది’. ఈ చిత్రం టీజర్‌ని సాయివెంకట్ రిలీజ్ చేయగా, పాటలను చిత్ర ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎన్. అనసూయాదేవి రిలీజ్ చేశారు. దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘ప్రేమ, సస్పెన్స్, సెంటిమెంట్, యాక్షన్, ట్విస్ట్‌లతో ఆసక్తిగా సాగుతుంది. సాయం చేయబోయిన హీరో ఒక ఆరోపణకు గురవుతాడు. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు అతను ఏం చేశాడన్నదే కథ. ఈ నెల 22న సినిమా రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘మా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు రవికుమార్ రెడ్డి, అనసూయాదేవి. -
బాక్సింగ్ శిక్షణకు మేటి
చదువు అంతంత మాత్రమే... పేదరికం అతన్ని చదువుల తల్లికి దూరం చేసింది. అదే సమయంలో జీవితంలో నిలదొక్కుకునేందుకు పడిన తపన... యుద్ధ క్రీడల్లో నిష్ణాతుడిగా మార్చింది. కరాటేతో మొదలైన ప్రస్థానం వివిధ క్రీడలతో కొనసాగుతూ... బాక్సింగ్ వరకు చేరుకుంది. తన అనుభవాలను పది మందికి పంచుతూ వారిలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు శ్రమిస్తున్నాడు. ఈ సుధీర్ఘ ప్రస్థానంలో ఎదురైన ఆటుపోట్లకు వెరవకుండా జిల్లాలో బాక్సింగ్ క్రీడాభివద్ధిలో తనవంతు పాత్ర పోషిస్తున్నాడు. పాలకులు, అధికారులు గుర్తించని అభివన ద్రోణాచార్యుడిగా మిగిలిన అతనే మహేష్ కుమార్ ఉరఫ్ మహేష్. బాక్సింగ్‌లాంటి యుద్ధ కళను అభ్యసించడం సామాన్యులకు అందని ద్రాక్షే. ఖర్చుతో కూడుకున్న ఈ క్రీడను అభ్యసించేందుకు చాలా మంది వెనుకడుగు వేస్తుంటారు. అంతేకాక ప్రత్యర్థి ముష్టిఘాతాలను తట్టుకోలేకపోతే భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుండడంతో బాక్సింగ్ క్రీడ అంటే చాలా మంది భయపడుతుంటారు. ఇలాంటి తరుణంలో సాధారణ యుద్ధ విద్యలకంటే వ్యక్తిగత ఆత్మరక్షణకు బాక్సింగ్ చాలా ఉపయోగపడుతుందనే విషయాన్ని మహేష్ గుర్తించాడు. అప్పటి వరకు కరాటేకే పరిమితమైన అతను బాక్సింగ్ నేర్చుకునేందుకు ఈ క్రీడలో ద్రోణాచార్య అవార్డు పొందిన విశాఖపట్నంలోని వెంకటేశ్వరరావు వద్దకు చేరుకున్నాడు. అక్కడే ఈ క్రీడను అభ్యసించాడు. ఉచిత శిక్షణతో.. విశాఖ పట్నం నుంచి తిరిగి వచ్చిన మహేష్... 2009 నుంచి వివిధ పాఠశాలల విద్యార్థులకు బాక్సింగ్ నేర్పిస్తూ వచ్చాడు. బాక్సింగ్ పట్ల చాలామందిలో ఉన్న అపోహలను తొలగిస్తూ క్రీడాభివద్ధికి కషి చేస్తూ వచ్చాడు. ప్రధానంగా బాలికల ఆత్మరక్షణలో బాక్సింగ్ ఎంత బాగా ఉపయోపడుతుందో తెలుసుకున్న చాలా మంది అమ్మాయిలు ప్రత్యేకంగా మహేష్ వద్ద శిక్షణ పొందుతున్నారు. తన వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికీ అతను ఉచితంగానే ఈ క్రీడను నేర్పిస్తూ వస్తున్నారు. చదువు లేకపోవడం... ఆర్థికంగా ఉన్నత స్థానంలో లేకపోవడంతో జిల్లా స్థాయి అధికారుల దష్టిని మహేష్ ఆకర్షించలేకపోతున్నాడు. అయితే అతని కషిని గుర్తిస్తూ జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ కార్యదర్శిగా గుర్తింపును రాష్ట్ర బాక్సింగ్ అసోసియేషన్ ఇచ్చింది. వందకు పైగా పతకాలు జిల్లాలో బాక్సింగ్ క్రీడ నేర్పించడం మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు వందకు పైగా పతకాలను మహేష్ శిష్యులు సాధించారు. పైకా, ఏపీ స్కూల్ గేమ్స్‌తో పాటు అసోసియేషన్ క్రీడా పోటీలకు సైతం జిల్లా నుంచి చాలా మంది క్రీడాకారులు వెళ్తున్నారు. 2011లో జిల్లాలో బాక్సింగ్ క్రీడాభివద్ధి కోసం అప్పటి డీఎస్డీవో లక్ష్మినారాయణరెడ్డి కిట్లను సమకూర్చారు. 2015లో ఆర్డీటీ సహకారంతో రాస్ట్ర స్థాయి సబ్ జూనియర్ ఛాపింయన్ షిప్ పోటీలను నిర్వహించారు. అదే ఏడాది జిల్లా క్రీడాకారులకు బాక్సింగ్ కిట్లను ఆర్డీటీ సంస్థ అందజేసి ప్రోత్సహించింది. ప్రభుత్వ ప్రోత్సహం ఉంటే ఈ క్రీడను మరింత అభివద్ధి చేస్తామంటూ ఈ సందర్భంగా మహేష్ పేర్కొంటున్నారు. -
కాంగ్రెస్ నేతల సమీక్ష రసాభాస
హైదరాబాద్:గాంధీభవన్ లో ఆదివారం జరిగిన తెలంగాణ కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం రసాభాసగా మారింది. జిల్లాల వారీగా డీసీసీ అధ్యక్షులు, ఎన్నికల్లో పోటీ చేసిన నేతలతో టీపీసీసీ చీఫ్, ఏఐసీసీ కార్యదర్శి కుంతియాలు సమావేశమైయ్యారు. ఈ క్రమంలోనే నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతల సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేత డి.శ్రీనివాస్, మహేష్ కుమార్ ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తాను పోటీ చేసిన నిజామాబాద్ అర్బన్ సెగ్మెంట్ లో జోక్యం చేసుకుంటారని డీఎస్ ను మహేశ్ ప్రశ్నించాడు. దీంతో ఇరువురు నేతలకు కుంతియా, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు సర్ది చెప్పి పరిస్థితిని చక్కదిద్దారు. -
జేఈఈ మెయిన్స్‌లో మహేష్‌కుమార్‌కు 28వ ర్యాంక్
నంద్యాలటౌన్: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్), ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (త్రిపుల్ ఐటీ)ల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ మెయిన్స్‌లో నంద్యాల పట్టణానికి చెందిన విద్యార్థి చెల్లిమల్ల మహేష్‌కుమార్ 28వ ర్యాంక్ సాధించారు. దీంతో బుధవారం కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకున్నారు. స్థానిక బాలాజీ కాంప్లెక్స్‌లో నివాసం ఉంటున్న సర్జకల్, మెడికల్ వ్యాపారి మోహన్‌రావు, లక్ష్మిదేవి దంపతులకు కుమారుడు మహేష్‌కుమార్ 7వ తరగతి వరకు కేశవరెడ్డి పబ్లిక్ స్కూల్, పదో తరగతి వరకు విజయవాడలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో చదివి టెన్త్‌లో 9.8 జీపీఏ సాధించారు. శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్ ఎంపీసీ గ్రూప్‌లో 988 మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది నిర్వహించిన ఎంసెట్‌లో(ఇంజనీరింగ్ విభాగం) 38వ ర్యాంక్ పొందాడు. ఐఐటీ చదవాలనే లక్ష్యంతో కష్టపడి చదివి జేఈఈ మెయిన్స్‌లో 28వ ర్యాంక్ సొంతం చేసుకున్నాడు. దీంతో గౌహతిలో మహేష్‌కు సీటు లభించింది. నవ్యాంధ్రప్రదేశ్‌లో సాఫ్ట్వేర్ కంపెనీని పెట్టి, మరికొందరికి ఉపాధి కల్పించడమే లక్ష్యమని మహేష్ సాక్షితో పేర్కొన్నారు.