మంజీర, మహేశ్ కుమార్
‘‘సస్పెన్స్, ప్రేమ అంశాలను మేళవిస్తూ నిర్మించిన ‘అలా జరిగింది’ చిత్రం పాటలు బాగున్నాయి. ‘అలా మొదలైంది’ సినిమాలాగే ఈ చిత్రం కూడా మంచి విజయం సాధించాలి. ఇలాంటి చిన్న సినిమాలు హిట్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది’’ అని నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ చాంబర్ కార్యదర్శి సాయివెంకట్ అన్నారు. మహేశ్ కుమార్, మంజీర జంటగా వెల్లంకి దుర్గా ప్రసాద్ దర్శకత్వంలో ఎన్.రవికుమార్‌రెడ్డి నిర్మించిన చిత్రం ‘అలా జరిగింది’.
ఈ చిత్రం టీజర్‌ని సాయివెంకట్ రిలీజ్ చేయగా, పాటలను చిత్ర ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎన్. అనసూయాదేవి రిలీజ్ చేశారు. దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘ప్రేమ, సస్పెన్స్, సెంటిమెంట్, యాక్షన్, ట్విస్ట్‌లతో ఆసక్తిగా సాగుతుంది. సాయం చేయబోయిన హీరో ఒక ఆరోపణకు గురవుతాడు. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు అతను ఏం చేశాడన్నదే కథ. ఈ నెల 22న సినిమా రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘మా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు రవికుమార్ రెడ్డి, అనసూయాదేవి.
Comments
Please login to add a commentAdd a comment