ఎర్రగుంట్ల,న్యూస్‌లైన్ : రాయలసీమ ధర్మల్ పవర్ ప్రాజెక్టు (ఆర్టీపీపీ)లోని 4,5 యూనిట్లు సర్వీసులోకి వచ్చినట్లు సీఈ కుమార్‌బాబు శుక్రవారం తెలిపారు. సమైక్యాంధ్ర కోసం చేస్తున్న సమ్మెను తాత్కాలికంగా విరమించిన ఉద్యోగులు, ఇంజనీర్లు విధులకు హాజరై యూనిట్లను సర్వీసులోకి తెచ్చే ప్రయత్నాలు చేశారన్నారు. దీంతో శుక్రవారం 4,5 యూనిట్లు సర్వీసులోకి రాగా రెండవ యూనిట్‌ను కూడా లైటప్ చేశామన్నారు.
ఏ క్షణంలోనైనా రెండవ యూనిట్‌కూడా సర్వీసులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. మిగిలిన 1,3 యూనిట్లలో మరమ్మతులు జరుగుతున్నాయని, శనివారం సాయంత్రానికి ఈ యూనిట్లు కూడా సర్వీసులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం డిమాండ్ లేని కారణంగా 4,5 యూనిట్లలో పూర్తి సామర్థ్యం మేరకు విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం లేదన్నారు. ఒక్కొక్క యూనిట్‌లో 210 మెగావాట్ల ఉత్పత్తికిగాను 150 మెగావాట్ల విద్యుత్‌ను మాత్రమే ఉత్పత్తి చేస్తున్నామన్నారు.
4,5 యూనిట్లు పునరుద్ధరణ
Published Sat, Oct 12 2013 2:01 AM | Last Updated on Fri, Sep 1 2017 11:34 PM
Advertisement