సమస్యలను పరిష్కరించాలని అంగన్‌వాడీ కార్యకర్తలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది.
విజయనగరం : సమస్యలను పరిష్కరించాలని అంగన్‌వాడీ కార్యకర్తలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. విజయనగరం జిల్లా కేంద్రంలో సోమవారం జరిగిన ఈ ఘటన వివరాల ప్రకారం... స్థానిక కలెక్టరేట్ ఎదుట అంగన్‌వాడీ కార్యకర్తలు సోమవారం ఉదయం ధర్నాకు దిగారు.
అనంతరం అధికారులు తమను పట్టించుకోవటం లేదంటూ అక్కడే రోడ్డుపై బైఠాయించారు. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు రంగప్రవేశం చేసి, 41 మంది అంగన్‌వాడీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని వన్ టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.